ఇద్దరిని బలిగొన్న అతివేగం | Two Friends Lives End In Road Accident At Nellore, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న అతివేగం

Published Wed, Apr 30 2025 9:04 AM | Last Updated on Wed, Apr 30 2025 11:27 AM

Two Ends Life In Road Accident

అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్‌

బిట్రగుంట(నెల్లూరు): అతి వేగం ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన కొడవలూరు మండలం నార్తురాజుపాళెం సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద హైవేపై సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బోగోలు పంచాయతీ బేతనీయపేటకు చెందిన షేక్‌ మన్సూర్‌బాషా (26), విశ్వనాథరావుపేట రామస్వామిపాళెంకు చెందిన బత్తుల ప్రవీణ్‌కుమార్‌ (26) చిన్ననాటి నుంచి స్నేహితులు. మన్సూర్‌కు వివాహమై రెండేళ్ల కుమారుడు ఉండగా, ప్రవీణ్‌కుమార్‌ అ వివాహితుడు. మన్సూర్‌ బిట్రగుంటలోనే వాహనాలకు నేమ్‌ బోర్డులు, స్టిక్కర్లు వేసే షాపు నిర్వహిస్తున్నాడు. 

ప్రవీణ్‌కుమార్‌ గౌరవరం టోల్‌ప్లాజా వద్ద పని చేస్తున్నాడు. స్నేహితులిద్దరూ పనిమీద సోమవారం నెల్లూరు వెళ్లారు. రాత్రి సుమారు 11.30 గంటల తర్వాత బైక్‌పై ఇంటికి బయలు దేరారు. బాగా ఆలస్యం కావడంతో త్వరగా ఇంటికి చేరుకొందామని బైక్‌ను వేగంగా నడుపుకొంటూ వచ్చారు. 12 గంటల ప్రాంతంలో నార్తురాజుపాళెం ఆంజనేయస్వామి గుడి వద్ద ఆగి ఉన్న లారీని అదే వేగంతో వెనుక వైపు ఢీకొన్నారు. 

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న స్నేహితులు మన్సూర్, ప్రవీణ్‌కుమార్‌ అక్కడకక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్సై గంధం ప్రసాద్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement