narayana
-
రాజధాని నిర్మాణానికి కొత్తగా టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను రద్దు చేసి త్వరలో కొత్తగా టెండర్లను పిలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సీఎం అధ్యక్షతన 39వ సీఆర్డీఏ సమావేశం అనంతరం ఆయన వివరాలను మీడియాకు వివరించారు. అమరావతి అభివృద్ధి పనుల కోసం 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి, రూ.38 వేల కోట్ల పనులను ప్రారంభించినట్టు తెలిపారు. వీటిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాలు, రహదారులు, హైకోర్టు జడ్జిలు, మంత్రులు, అధికారుల వసతి గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఈ పనులను కొనసాగించేందుకు శ్రద్ధ చూపలేదన్నారు. పాత టెండర్ల సమస్యలను పరిష్కరించి నూతన టెండర్లకు విధి విధానాల రూపకల్పనకు ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 23 పాయింట్లతో గతనెలలో నివేదిక ఇవ్వగా, ఈ సమావేశంలో దానిని ఆమోదించినట్టు చెప్పారు. దాని ప్రకారం హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణానికి జనవరిలోగా, మిగతా పనులకు వచ్చేనెల 31 లోపు టెండర్లు పిలుస్తామని, మూడేళ్లలో వీటిని పూర్తి చేస్తామని వివరించారు. వరద నివారణ పనులుఅమరావతికి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుక ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, అయితే నిబంధనల మేరకు వరద నివారణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా అమరావతిలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరద నివారణ పనులను ఆమోదించామన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌ను విస్తరిస్తామని చెప్పారు. నీరుకొండ వద్ద 0.04 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.01 టీఎంసీలు, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల స్టోరేజి సామర్ధ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తామన్నారు. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కుల పంపింగ్ స్టేషన్ నిర్మిస్తామని చెప్పారు. గతంలో నిర్ణయించిన ప్రకారం ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం త్వరలో చేపడతామని చెప్పారు. -
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన మంత్రి నారాయణ!
విజయవాడ, సాక్షి: హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి నారాయణ ఏకీభవించారు.హోంమంత్రిగా అనిత విఫలమైందన్న పవన్ వ్యాఖ్యలను పరోక్షంగా మంత్రి నారాయణ సమర్థించారు. ఇతర శాఖల్లో తప్పులు జరిగినప్పుడు సీఎం, డీప్యూటీ సీఎం స్పందిస్తారని అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కూడా అదే చేశారని తెలిపారు. ‘‘పవన్ ఏం కామెంట్ చేశారు. ఏం చేయలేదు. సిరియస్‌గా తీసుకుని పనిచేయమన్నారు. డిప్యూటి సీఎంగా అక్కడ జరిగిన దానిని బేస్ చేసుకుని మాట్లాడారు. దానికి తగ్గట్లుగా హోం మినిస్టర్ చర్యలు తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ..సీఎం, డిప్యూటీ సీఎం వేరే డిపార్టుమెంట్ సరిగ్గా పనిచేయకుంటే కామెంట్స్ చేస్తారు. లీగల్‌గా పోలీసులు చేయడానికి కొన్ని అడ్డంకులు ఉండోచ్చు. దాని వల్ల ఒకోసారి అలస్యం కావచ్చు. ఆయన చెప్పిన దాని ప్రకారం స్పీడ్‌గా చేయడానికి అవకాశం ఉంటుంది. సీఎం అన్ని కో ఆర్డినేట్ చేస్తారు’’అని అన్నారు. -
పోలవరం ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్యా సదృశ్యమే: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: పోలవరం ఎత్తు తగ్గించడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎత్తు తగ్గించి నిర్మించడానికి ఇంత ధనం అవసరం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నారాయణ ప్రశ్నించారు.పోలవరం 41 మీటర్లకు తగ్గితే బ్యారేజిగా మాత్రమే పనికివస్తుందని నారాయణ అన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు రావు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పోలవరం ఇక ఉత్త బ్యారేజే -
అడ్డంగా దోచేస్తోన్న అనుచరులు
-
అడుసు తొక్కనేల.. చంద్రబాబు లిక్కర్ పాలసీపై సీపీఐ నారాయణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు.అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు. మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్‌కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.ఇదీ చదవండి: అవే బ్రాండ్లు... అవే రేట్లు -
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే మద్యం లైసెన్సులు అంటే ఇక టెండర్లు ఎందుకు
-
నేను డబ్బులిస్తా..టెండర్లు వెయ్యండి ప్రజలకు ఫుల్లుగా తాగించండి
-
రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
సనాతన ధర్మం గురించి పవన్ కు తెలుసా?
-
మంత్రి నారాయణ్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
మీరిద్దరూ దోస్తులే కదా?
-
బ్యారేజ్‌లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్‌లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్‌ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్‌ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంపదని దాటేసిన పార్ట్ నర్...
-
హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నాం: సీపీఐ నారాయణ
సాక్షి హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. ఆదివారం ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువులో కాలేజీలు నిర్మించారని వారి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.చెరువులు, నాలాలు కబ్జాకు గురైతే గ్రామాలు మునిగిపోతాయని నారాయణ అన్నారు. ఆరంభ శూరత్వంగా మిగిలిపోకూడదు.. ఎక్కడ కబ్జా జరిగినా ఖాళీ చేయించాలన్నారు. కబ్జాలు పాల్పడిన వారి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు జరపాలన్నారు. ఎంఐఎం నేతలవి కూడా తొలగించాలన్న నారాయణ.. మేం మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. -
సహచరుల లైంగిక వేధింపులకు డెంటల్ విద్యార్థి బలవన్మరణం
తాడిపత్రి రూరల్: నెల్లూరులోని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చెందిన డెంటల్ కళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విద్యార్థి ప్రదీప్ కుమార్(19) సోమవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. వైద్య విద్యార్థుల లైంగిక వేధింపులు భరించలేక కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరుకు చెందిన నారాయణ ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వచ్చారు. పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లి కాలనీలో నివాసం ఉంటూ రింగ్‌లు తయారుచేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. నారాయణకు అఖిల్‌కుమార్, ప్రదీప్‌కుమార్ కుమారులు. పెద్ద కుమారుడు «అఖిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు ప్రదీప్‌కుమార్ నెల్లూరులోని నారాయణ డెంటల్ కళాశాలలో బీడీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రదీప్‌కుమార్ కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పెద్ద కుమారుడు అఖిల్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు ప్రమీల, నారాయణ నిర్ఘాంతపోయారు. వెంటనే స్నేహితులతో కలిసి వాహనంలో నెల్లూరు బయలుదేరి వెళ్లారు. స్వస్థలం నెల్లూరు కావడంతో అక్కడే మంగళవారం ప్రదీప్‌కుమార్ అంత్యక్రియలు పూర్తిచేశారు.లైంగిక వేధింపులు భరించలేకే నా తమ్ముడు ఆత్మహత్యవైద్య విద్య చదువుతున్న రాహుల్ అనే విద్యారి్థతోపాటు మరో ఇద్దరు కలిసి గత ఏడాది సెపె్టంబర్ నుంచి లైంగికంగా వేధిస్తున్నారని, వారి ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని నా తమ్ముడు ప్రదీప్‌కుమార్ సోమవారం అర్ధరాత్రి నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపాడు. వెంటనే తాడిపత్రిలోని తల్లిదండ్రులకు, నెల్లూరులోని కళాశాలకు ఫోన్ చేశా. అప్పటికే కళాశాల భవనంపై నుంచి దూకి చనిపోయాడు. – మృతుడి అన్న అఖిల్‌కుమార్ -
నారాయణ, చైతన్య సహా కోచింగ్ సెంటర్లను నిషేధించండి
-
చంద్రబాబు సీరియస్.. ఆ ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్
-
బాబు భూ దోపిడీ ఖజానా!
సాక్షి, అమరావతి: ‘‘ఏ’’ అంటే.. అమరావతి అని వక్కాణిస్తున్న సీఎం చంద్రబాబు.. రాజధాని ముసుగులో తన అవినీతి, అరాచకాలకు కేంద్రంగా చేసుకున్నారు! బరితెగించి తాను పాల్పడిన అవినీతికి అక్షయపాత్రలా మార్చారు! నాటి తెల్ల దొరలే తెల్లబోయేలా వ్యవహరించారు! బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద దోపిడీని మరిపిస్తూ టీడీపీ పెద్దలు సాగించిన భూ దోపిడీకి నిలువెత్తు సాక్ష్యం అమరావతి... బడుగులు, పేదలకు స్థానం లేకుండా చంద్రబాబు సృష్టించుకున్న నయా జమిందారీ వ్యవస్థకు నిదర్శనం అమరావతి! పచ్చ రాబందులు గుప్పిట పట్టిన రూ.లక్షల కోట్ల విలువైన భూ ఖజానా అమరావతి! దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీకి మౌనసాక్షి అమరావతి!! ఈ భూ బాగోతాలు, తన నిర్వాకాలను కప్పిపుచ్చి మభ్యపెట్టేందుకే తాజాగా అమరావతిపై శ్వేతపత్రం అంటూ మరో డ్రామాకు చంద్రబాబు తెర తీశారు.మోయలేని భారం మోపుతూ...రాజధానిగా అమరావతి ఎంపిక చేసిన ప్రాంతం ఇటు విజయవాడ కాదు.. అటు గుంటూరూ కాదు. మూడు పంటలు పండే సారవంతమైన పంట పొలాల్లో నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతుందని చంద్రబాబు అండ్ కో కట్టిన లెక్కలే చెబుతున్నాయి. ఒక్క ఎకరాలో కనీస మౌలిక వసతుల కల్పనకు (బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) రూ.2 కోట్లు వ్యయం అవుతుందని, మొత్తం రాజధాని ప్రాంతం అభివృద్ధి చేయడానికి రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చువుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. ఏటా ఆ వ్యయం పెరగడమే కానీ తగ్గదు. విభజన అనంతరం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీగా నిధులు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చేసిన హెచ్చరికలను చంద్రబాబు పట్టించుకోలేదు. తాజాగా భారీగా నిధులు అవసరమంటూనే.. వివరాలు సేకరిస్తామని చెబుతున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన మూడు వారాల్లోనే రూ.7 వేల కోట్లు అప్పు చేసిన టీడీపీ ప్రభుత్వం.. సంపదను ఎలా సృష్టించి రాజధాని నిర్మాణం చేస్తుందనే ప్రశ్నకు జవాబు లేదు.భూములు లాక్కుని గాలి మేడలు..!అమరావతి వేదికగా చంద్రబాబు సాగించిన భూ దందాను అప్పట్లోనే నిపుణుల నుంచి సామాన్యుల వరకూ అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని శివరామకృష్ణన్ కమిటీ స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను నాశనం చేయవద్దని పర్యావరణవేత్తలు అభ్యంతరం చెప్పారు. జీవనాధారమైన తమ భూములను కొల్లగొట్టవద్దని బడుగు, బలహీనవర్గాలు, పేద రైతులు వేడుకున్నారు. వారి విన్నపాలను బేఖాతర్ చేస్తూ చంద్రబాబు భారీ భూదోపిడీకి తెరతీశారు. అసైన్డ్ భూములను బినామీల ద్వారా హస్తగతం చేసుకుని పరిహారం ప్రకటించుకున్నారు. 2014–19 మధ్య రాజధాని పేరిట అమరావతి ముసుగులో చంద్రబాబు బృందం చేయని దురాగతం లేదు. అదిగో రాజధాని.. అల్లదిగో అమరావతి..! అంటూ అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతకుముందు పక్కా పన్నాగంతో రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ పలు ప్రాంతాల పేర్లను తెరపైకి తెచ్చి సామాన్యులను బురిడీ కొట్టించారు. మరోవైపు ముందస్తుగా తాము భూముల కొనుగోలు చేసిన అమరావతిలో బినామీ మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని.. ఆకాశ హరŠామ్యల నగరం అంటూ గాలిలో మేడలు కట్టి రైతుల కాళ్ల కిందున్న భూమిని కాజేశారు.పచ్చ దండు దురాక్రమణ..దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద భూ దోపిడీకి చంద్రబాబు బరి తెగించారు. రాజధాని ప్రచారంతో మాయాజాలం... భూసమీకరణ ముసుగులో దోపిడీ... అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, లంక భూముల స్వాహా... ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి మలుపులు... అస్మదీయులకు యథేచ్ఛగా భూ పందేరాలు... ఇలా ఒకటేమిటి ఎన్ని రకాలుగా భూదోపిడీకి పాల్పడవచ్చో అన్ని విద్యలూ ప్రయోగించారు. అమరావతిపై చంద్రబాబు ‘పచ్చ దండు’ దండయ్రాత చేసి రూ.లక్షల కోట్ల విలువైన భూముల దురాక్రమణకు పాల్పడింది. చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై వాలిపోయారు. చంద్రబాబు, లోకేశ్‌తోపాటు నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగుంట మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు.. ఇలా పచ్చ దండు అంతా అమరావతిలో భూములను కొల్లగొట్టింది. అన్యాయంగా, ఏకపక్షంగా విభజనకు గురై కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఆదిలోనే హంసపాదులా అభివృద్ధికి గండి కొట్టారు. తాత్కాలిక రాజధాని భవనాల పేరుతో కనికట్టు చేశారు.మభ్యపుచ్చే యత్నాలు..నాడు ఐదేళ్లలో భూముల దోపిడీకి పాల్పడటం మినహా టీడీపీ పెద్దలు రాజధాని కట్టిందీ లేదు.. అభివృద్ధి చేసిందీ లేదు. చంద్రబాబు బృందం సాగించిన భూ దోపిడీ ఇప్పటికే సీఐడీ దర్యాప్తులో పూర్తి ఆధారాలతోసహా బట్టబయలైంది. సీఐడీ న్యాయస్థానాల్లో చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. ఇక న్యాయ విచారణ ప్రక్రియ కొనసాగితే చంద్రబాబుకు యావజ్జీవ ఖైదు ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రాగానే చంద్రబాబు సరికొత్త కుట్రలకు పన్నాగం పన్నుతున్నారు. అమరావతిలో తన భూ బాగోతాన్ని కప్పిపుచ్చేందుకు శ్వేతపత్రం పేరుతో డ్రామాకు తెరతీశారు. రాజధాని నిర్మాణానికి తాను ఏం చేస్తానో చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసంతో ఊదరగొట్టారు. రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. కానీ అమరావతి పేరిట చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన దోపిడీ దాచేస్తే దాగేది కాదు. ఇప్పటికే పూర్తి ఆధారాలతో సహా చార్జిషీట్ల రూపంలో నిక్షిప్తమైందన్నది నిఖార్సైన నిజం. -
చంద్రబాబు, నితీష్‌పై బీజేపీకి అపనమ్మకమే: సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్ చేశారు.కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్‌ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
వయనాడ్ బరిలో ప్రియాంక.. పోటీ సరికాదన్న సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పోటీ చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వయనాడ్ నుంచి ప్రియాంక పోటీ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేశారు.కాగా, నారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రియాంక గాంధీని వయనాడ్‌లో పోటీకి దింపడం సరికాదు. కేరళ స్థానిక నాయకులకే వయనాడ్ సీటు వదిలిపెట్టాలి. అలాగే, ఏపీలో కూల్చావేతలకు మేము పూర్తిగా వ్యతిరేకం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. ప్రభుత్వం చట్టపరంగానే వ్యవహరించాలి’ అని కామెంట్స్ చేశారు.ఇక, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వయనాడ్, రాయబరేలీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో వయనాడ్ నుంచి రాహుల్ తప్పుకోవడంతో ఉప ఎన్నికల కోసం ప్రియాంక గాంధీని బరిలో దింపారు. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగా ఉన్న విషయం తెలిసిందే. -
చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు: నారాయణ
-
ఈవీఎంలపై అనేక అనుమానాలు.. పేపర్ బ్యాలెట్ బెటర్: సీపీఐ నారాయణ
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వెలువడి ప్రభుత్వాలు సైతం ఏర్పాటయ్యాయి. అయితే, ఎన్నికల్లో ఈవీఎంల పాత్రపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని పలువురు చెబుతున్న నేపథ్యంలో ఇక మీదట ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లనే వినియోగించాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. దీనికి సంబంధింది కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈవీఎంల వాడకంపై సీపీఐ నారాయణ స్పందించారు. తాజాగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘122 దేశాల్లో ఈవీఎంలు వినియోగించడం లేదు. చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఈవీఎంలపై అనుమానాలున్నాయి. మన దేశంలో మాత్రం అనుమానాలను, ఆరోపణలను పట్టించుకోవడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకూడదు. పేపర్ బ్యాలెట్స్ ద్వారానే ఎన్నికలను జరపాలి’ అని డిమాండ్ చేశారు. This is the time for discussion on EVM said CPI Narayana @cpimspeak @narayanacpi #cpitelangana #cpm #draja pic.twitter.com/k49ZLIimBb— Laxminarayana Masade (@lnmasade) June 17, 2024 -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
శాపంగా నారాయణ గారడీలు
‘నెల్లూరును స్మార్ట్ సిటీగా మారుస్తున్నాం..నగర సుందరీకరణే నా ధ్యేయం.. భూగర్భ డ్రైనేజీతో మెరుగైన పారిశుధ్యాన్ని అందిస్తాం’అంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రిగావ్యవహరించిన నారాయణ తన ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను ఆ రోజుల్లో ఊదరగొట్టారు. ఇవన్నీ జరగకపోగా.. తనలోపభూయిష్ట విధానాలతో నెల్లూరు నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టారు. హడ్కో ద్వారా రుణాలను తీసుకొచ్చి.. పనులను చేయకుండానే నిధులను దిగమింగారు. ఈ పరిణామాలతో ఆ అప్పులపై కార్పొరేషన్ ఏటా రూ.55 కోట్ల వడ్డీని కడుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత టీడీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన నారాయణ పాపాలు నగర వాసులను నేటికీ వెంటాడుతున్నాయి. వీటన్నింటినీ విస్మరించి తాజాగా జరగనున్న ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ ఆయన అవాస్తవాలను ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ‘నారాయణ అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే నారాయణ’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. 9.95 శాతం వడ్డీకి అప్పు నగరపాలక సంస్థలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా కోసం రూ.1136 కోట్ల రుణానికి హడ్కోను ఆశ్రయించారు. ఇందులో తాగునీటి సరఫరా కోసం రూ.556 కోట్లు, భూగర్భ డ్రైనేజీకి రూ.580 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే హడ్కో రూ.830 కోట్లను 9.95 శాతం వడ్డీకి 2016లో మంజూరు చేసింది. అయితే నామమాత్రపు పనులతో 2018 వరకు కాలం వెళ్లదీశారు. గత ఎన్నికలకు ముందు హడావుడిగా.. గత ఎన్నికలకు కొన్ని నెలల ముందు రెండు ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలకు టెండర్లను ఖరారు చేశారు. అప్పటికే నగరంలో ఒకట్రెండు వీధుల్లో మినహా మిగిలిన అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. భూగర్భ డ్రైనేజీ పేరుతో రోడ్లను తవ్వి.. అసంపూర్తిగా పనులు చేసి వదిలేశారు. ధ్వంసమైన రోడ్లపై నడిచేందుకు సైతం వీల్లేని పరిస్థితి ఏర్పడింది. భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లను అన్ని వీధుల్లో వేస్తేనే గానీ సిమెంట్ రోడ్ల నిర్మాణానికి వీలుంటుంది. ఈ తరుణంలో గుంతలమయమైన రోడ్లతో ప్రజలు నరకాన్ని చవిచూశారు. డివిజన్ ఇన్‌చార్జీలకు సబ్ కాంట్రాక్ట్‌లు..! సిమెంట్ రోడ్ల పనులను తమకే కేటాయించాలంటూ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్ల టీడీపీ ఇన్చార్జీలు నారాయణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు కన్స్ట్రక్షన్ కంపెనీలతో మాట్లాడి నిర్మాణాల పనులు వారికి అప్పగించారు. ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనగా, నాణ్యత ప్రమాణాలను పాటించకుండా ఎత్తుపల్లాలుగా.. అత్యంత నాసిరకంగా రోడ్లను నిర్మించారు. కొన్ని వీధుల్లోని రోడ్లు వారానికే కుంగిపోయాయంటే నాణ్యత ఎలా ఉంతో అర్థం చేసుకోవచ్చు. గుంతలమయంగా.. వర్షమొస్తే చెరువులను తలపిస్తూ.. పైప్లైన్ల లీకేజీలు.. ఇలా రోడ్లు దుర్భరంగా మారాయి. చిన్నపాటి లీకేజీని సైతం సరిదిద్దేందుకు రోడ్లను ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఉండేది. అసంపూర్తిగా ఉన్నా.. బిల్లుల మంజూరు హడావుడిగా చేసిన పనులకు బిల్లులను మాత్రం పూర్తిగా తీసుకున్నారు. పనులు అసంపూర్తిగా ఉన్నాయని.. బిల్లులను మంజూరు చేయలేమని ఇంజినీరింగ్ అధికారులు చెప్పినా, నారాయణ మౌఖిక ఆదేశాలతో వీటికి ఇవ్వక తప్పలేదు. కొన్ని బిల్లులను అధికారులు క్లియర్ చేయకపోవడంతో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. స్వచ్ఛ నీరు.. కాలువల పాలు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో పైపులను ఇళ్ల వద్ద ఏర్పాటు చేసి ఓపెన్‌గా వదిలేశారు. ఈ పైపుల ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిని ఏర్పాటు చేసి.. వినియోగాన్ని లెక్క కట్టేందుకు మీటర్లను బిగిస్తామని చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆ ఓపెన్ పైపుల ద్వారా విడుదలయ్యే నీరు కాలువల పాలైంది. మరికొన్ని చోట్ల పైపులు చోరీకి గురయ్యాయి. నగరంలో అసంపూర్తిగా ఉన్న భూగర్భ డ్రైనేజీ, స్వచ్ఛమైన తాగునీటి పనులను పూర్తి చేయాలంటే మరో రూ.240 కోట్లు అవసరమవుతాయని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వడ్డీ భారం ఇలా.. హడ్కో నుంచి తెచ్చిన రుణానికి 9.95 శాతం వడ్డీని ఏటా చెల్లించాలి. అసలు కింద రూ.80 కోట్లు.. వడ్డీగా రూ.55 కోట్లు.. ఇలా ఏడాదికి రూ.135 కోట్లను నగరపాలక సంస్థ చెల్లించాల్సి వస్తోంది. ఆరేళ్లుగా రూ.810 కోట్లను కార్పొరేషన్ చెల్లించింది. ఈ లెక్కన ఇంకా దాదాపు రూ.400 కోట్లను అసలు, వడ్డీ కింద జమ చేయాల్సి ఉంది. ఇలా నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి నారాయణ లాగారు.