రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా | Minister Narayana Audio With TDP Leader On Liquor Tenders, Watch Video Inside | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా

Published Wed, Oct 9 2024 8:06 AM | Last Updated on Wed, Oct 9 2024 10:39 AM

Minister Narayana Audio With TDP Leader On Liquor Tenders

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబె­ట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తు­న్నారు. బయటి వ్యక్తు­లకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బు­లు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావి­స్తు­న్నారు.  ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షా­పు­లు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధర­ఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరి­స్తున్నా. నెల్లూరులో రౌడీ­యి­జం ఒప్పుకోను. దుకా­ణాల వద్దకు వచ్చి ఏ డిపా­ర్ట్‌మెంట్‌ వాళ్లు అడిగినా ఒప్పు­కోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖా­స్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అను­కుంటు­న్నాను’ అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement