liquor tenders
-
లిక్కర్ షాపుల లక్కీ డ్రా.. భారీ దోపిడీకి ’కూటమి’ పక్కా డీల్
సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. కూటమి నేతల కనుసన్నల్లోనే మొత్తం తతంగం జరిగింది. లాటరీలోనూ సిండికేట్లదే హవా కొనసాగింది. ఈ క్రమంలో భారీ దోపిడీకి టీడీపీ నేతలు డీల్ సెట్ చేశారు. మద్యం ఆదాయంలో కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. లాటరీ ద్వారా లైసెన్స్ దక్కితే ఇవ్వాల్సిన కమీషన్‌ను కూడా ముందే ఫిక్స్ చేసేశారు. మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకునేందుకు కుట్రకు ప్లాన్ చేశారు.లైసెన్స్ దక్కకపోతే గొడవలు, దాడులకు వ్యూహం పన్నినట్లు సమాచారం. లాటరీ నిర్వహించే ప్రతీ చోట మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే తిష్ట వేశారు. సిండ్‌కేట్‌లో లేకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. అనంతపురం జిల్లాలో మద్యం టెండర్లలో బీజేపీ నేతల హవా సాగుతోంది. ధర్మవరంలో ఐదు మద్యం షాపులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు. మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా ఉన్న సందిరెడ్డి శ్రీనివాస్‌కు ఐదు మద్యం షాపులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారుల లాటరీపై మద్యం వ్యాపారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: సర్కారు వారి కమీషన్ 30%ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని ప్రభాకర్ అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా, చింతమనేని అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చలసాని గార్డెన్లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ జరిగింది. -
మద్యం టెండర్లలో రాజకీయ బెదిరింపులు
-
టీడీపీ లిక్కర్ మాఫియా దెబ్బకు ప్రభుత్వానికి 2000 కోట్లు నష్టం
-
రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించా
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
టీడీపీ కూటమి 'వార్నింగ్‌లు.. వాటాలు'!
సాక్షి, అమరావతి: ‘‘మద్యం దుకాణం లైసెన్స్ దక్కించుకోవడం కాదు కదా.. కనీసం లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా సరే అంతు చూస్తాం...!’’ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న బెదిరింపుల పర్వం ఇదీ...!! అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంత ‘మర్యాదగా’ చెప్పిన తరువాత మద్యం దుకాణం లైసెన్స్‌కు దరఖాస్తు చేసేందుకు ఇతరులు సాహసిస్తారా..? టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి రాచబాట పరుస్తూ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కేటాయింపునకు రంగం సిద్ధమవుతోంది. అదే సమయంలో అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మభ్యపుచ్చేందుకు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. తమ సిండికేట్ ద్వారానే భారీగా దరఖాస్తులు చేయిస్తూ బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య నేత కనుసన్నల్లో పక్కా పన్నాగంతో మద్యం దోపిడీకి వేసిన స్కెచ్ ఇలా ఉంది..రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు టీడీపీ ఎమ్మెల్యేల హెచ్చరికలతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలని ఆలోచించేందుకు సైతం సామాన్య వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. మరొక్క రోజు మాత్రమే గడువు ఉండగా మద్యం సిండికేట్ సోమవారం రాత్రికి రాత్రే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించింది. దీంతో మంగళవారం సాయంత్రానికి దరఖాస్తుల సంఖ్యను 39,259కు చేర్చారు. ⇒ ఇప్పటికీ కూడా రాష్ట్రంలో 56 మద్యం దుకాణాలకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం. దీన్నిబట్టి టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారో స్పష్టమవుతోంది. ఆ దుకాణాలకు చివరి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బంధువులే దరఖాస్తు చేసి ఏకపక్షంగా దక్కించుకుంటారన్నది సుస్పష్టం. ⇒ ఇక 116 మద్యం దుకాణాలకు కేవలం ఒక్కో దరఖాస్తు మాత్రమే వచ్చాయి. టీడీపీ కూటమి ఎమ్మెల్యేల బెదిరింపుల ప్రభావం ఇదీ! ఇక ఆ మద్యం దుకాణాలన్నీ కూడా టీడీపీ సిండికేట్ పరమైనట్లే!⇒ 254 మద్యం దుకాణాలకు రెండేసి చొప్పున మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఆ రెండు కూడా టీడీపీ సిండికేట్‌కు చెందినవే. ఆ దుకాణాలను సైతం టీడీపీ సిండికేట్ గుప్పిట పట్టినట్టే. èలాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియతో నిమిత్తం లేకుండా 426మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్ హస్తగతం చేసుకుందన్న విషయం స్పష్టమవుతోంది. ఇందులో తిరుపతి, కృష్ణా, కాకినాడ జిల్లాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ⇒ తమను కాదని ఎవరైనా దరఖాస్తు చేసి దుకాణం దక్కించుకున్నా తన సహకారం లేకుండా వ్యాపారం చేయలేరని పత్తికొండలో అధికార పార్టీ ముఖ్యనేత హెచ్చరిస్తున్నారు. లాటరీలో దుకాణం దక్కించుకున్న వారు తనకు 30 శాతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని ఆదోని మాజీ ఎమ్మెల్యే తన అనుచరులతో ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఆలూరులో టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి పర్యవేక్షిస్తున్నారు. కర్నూలులో ఓ మాజీ మంత్రి సోదరుడి కనుసన్నల్లో పాత సిండికేట్ నేతలంతా కలసి దరఖాస్తులు వేయిస్తున్నారు.రూ.2 కోట్లు పెట్టి 100 దరఖాస్తులు వేయించాసాక్షి, టాస్క్‌ఫోర్స్ : తెలుగు తమ్ముళ్లకు మద్యం షాపులు కట్టబెట్టేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బయటి వ్యక్తులకు షాపులు దక్కకుండా బెదిరింపులకూ దిగుతున్నారు. మంత్రి పొంగూరు నారాయణ తన సొంత డబ్బులు రూ.2 కోట్లు ఖర్చుచేసి 100 దరఖాస్తులు వేయించినట్లు చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన మంగళవారం పార్టీ కార్యకర్తలతో గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ‘నగరంలో కొందరు నన్ను బ్రాందీ షాపులు కావాలని అడిగారు. 5, 10%అయినా ఇప్పించండని అడిగారు. వారు ధరఖాస్తులకు అంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి నేనే ఆ ఖర్చు భరిస్తున్నా. నెల్లూరులో రౌడీయిజం ఒప్పుకోను. దుకాణాల వద్దకు వచ్చి ఏ డిపార్ట్మెంట్ వాళ్లు అడిగినా ఒప్పుకోను. రూ.2 కోట్లు సొంత డబ్బు ఖర్చుపెట్టి 100 దరఖాస్తులు వేయిస్తున్నా. వాటిలో 4 నుంచి 5 షాపులు రావచ్చని అనుకుంటున్నాను. ఒక షాపునకు రూ.80 లక్షలు ఖర్చవుతుంది. 5 లేక 6 మంది కలిసి డబ్బులు రెడీ చేసుకుని సిండికేట్‌గా ఉండండి. బ్రాందీ షాపుల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత డివిజన్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలకు ఇస్తున్నాను. వారు కూడా ముందుకు రాకపోతే డివిజన్ ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్లకు అవకాశమిస్తా’ అంటూ మంత్రి చెప్పినట్లుగా ఈ ఆడియోలో ఉంది. ఆ ఆడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బురిడీ కొట్టించేందుకే సిండికేట్‌తో భారీగా దరఖాస్తులురాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ ఆగడాలు, బెదిరింపులపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇతరులు దరఖాస్తులు చేయకుండా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారో దరఖాస్తుల సంఖ్యే వెల్లడించింది. తొలి ఆరు రోజుల్లో 3,396 దుకాణాలకు కేవలం 8,274 దరఖాస్తులు మాత్రమే రావడం దీనికి నిదర్శనం. దీంతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు ‘ముఖ్య’నేత మరో ఎత్తుగడ వేశారు. తమ సిండికేట్ సభ్యుల ద్వారా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేయించారు. అందులో భాగంగా సోమవారం రాత్రి తరువాతే తమ వారితో ఏకంగా 16 వేల దరఖాస్తులు దాఖలు చేయించారు. తద్వారా భారీగా దరఖాస్తులు వచ్చినట్లు కనికట్టు చేసేందుకు యత్నించారు. వీటిలో 90 శాతం దరఖాస్తులు టీడీపీ కూటమి సిండికేట్‌కు చెందినవే అన్నది అసలు లోగుట్టు. మద్యం దుకాణాలన్నీ ఏకపక్షంగా హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం వేసినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 30 శాతం వాటా ఇవ్వాల్సిందే..⇒ శ్రీసత్యసాయి జిల్లావ్యాప్తంగా 8 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 87 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. పుట్టపర్తి, హిందూపురం, కదిరి నియోజకవర్గాల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా బెదిరించి అడ్డుకుంటున్నారు. మడకశిర, పెనుకొండలో ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా కట్టడి చేస్తూ సిండికేట్ చివరి రోజు దరఖాస్తులు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ⇒ వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అధికార కూటమి నేతలే దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు ఇందులో తలదూరిస్తే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు.⇒ అన్నమయ్య జిల్లాలో పీలేరు సహా అన్ని చోట్లా అధికార పార్టీ నేతల హడావుడే కనిపిస్తోంది. ⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి, కందుకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో సిండికేట్ మినహా ఇతరులు దరఖాస్తు చేయవద్దని స్థానిక ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లిలో షాపు దక్కించుకున్న వారు తమకు 20 శాతం వాటాతో పాటు మద్యం దుకాణం పక్కన కూల్‌డ్రింక్స్ షాపు తాము సూచించిన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఆదేశించినట్లు తెలుస్తోంది.రూ. 30 లక్షలు కప్పం కట్టాలి⇒ పల్నాడు జిల్లాలో 129 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే దక్కేలా అధికార పార్టీ ప్రజాప్రతిని«దులు పావులు కదుపుతున్నారు. ప్రతి దుకాణానికి రూ.20–30 లక్షలు కప్పం కట్టాలంటూ హుకుం జారీచేస్తున్నారు. తమని కాదని దుకాణాలు దక్కించుకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే కుమారులు నియోజకవర్గంలో సిండికేట్ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ప్రతి దుకాణానికి నలుగురిని కేటాయించి వారే టెండర్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మద్యం టెండర్ దక్కించుకున్న పాటదారుడు 25 శాతం వాటా పోను మిగిలిన 75 శాతం వాటాను తాను సూచించిన వారికి ఇవ్వాలని జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే హుకుం జారీ చేయడంతో ఇతరులు ముందుకు రావడం లేదు. షాపు దక్కించుకున్న వారు తనకు రూ.30 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడితేనే టెండర్లు వేయాలని కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే తన అనుచరులతో వర్తమానం పంపుతున్నారు.⇒ ప్రకాశం జిల్లాలో మద్యం దుకాణాలన్నింటినీ చేజిక్కించుకునేలా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు చక్రం తిప్పుతున్నారు. తమ అనుచరులు మినహా మరెవరూ దరఖాస్తు చేసుకోకుండా హుకుం జారీ చేశారు. గిద్దలూరు, మార్కాపురంలో ఎమ్మెల్యేల సోదరులు కథ నడిపిస్తున్నారు. ⇒ గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు పరిధిలో షాపు దక్కించుకున్నవారు 50 శాతం వాటా తమవారికి ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించినట్లు తెలుస్తోంది. తమవారు మినహా బయటి వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఊరుకునేది లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరిస్తున్నట్లు సమాచారం.⇒ కృష్ణా జిల్లాలో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని యనమలకుదురు, ఈడ్పుగల్లు, తాడిగడపలో షాపులకు ఇతరులు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరులు ఫోన్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. గన్నవరంతో పాటు ఇతర మండలాల్లో షాపులకు తమ అనుచరులే దరఖాస్తు చేస్తారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తేల్చి చెబుతున్నారు. మచిలీపట్నం పరిధిలో చిన్నాపురం, మంగినపూడి, సుల్తానగరంలో షాపులకు టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు పోటీపడుతున్నారు. పెడనలో షాపులు దక్కించుకున్న నిర్వాహకులు స్థానిక ఎమ్మెల్యేకి పావలా వాటా ఇవ్వాలని, తాము చెప్పిన చోటే ఏర్పాటు చేయాలని కూటమి నాయకులు హెచ్చరిస్తున్నారు.⇒ ఎన్టీఆర్ జిల్లాలో లిక్కర్ మాఫియాగా పేరు పొందిన యలమంచిలి శ్రీనివాసరావు, గన్నే వెంకట నారాయణ భారీగా షాపులు దక్కించుకునేలా చక్రం తిప్పుతున్నారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి నేత ఆలూరి చిన్న గొల్లపూడిలో 30 షాపులకు టెండర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. కంచికచర్ల నందిగామలో దేవినేని ఉమా అనుచరులు గోవర్థన్, గోగినేని అమరనాథ్ టెండర్లు వేస్తున్నారు. తమ పరిధిలో ఐదు షాపులకు ఎవరూ టెండర్లు వేయవద్దని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. మైలవరంలో మద్యం షాపుల కోసం ఎమ్మెల్యే బావమరిది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ⇒ బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు సిండికేట్‌గా మారి ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారు. చీరాల, బాపట్ల, రేపల్లె తదితర చోట్ల మద్యం దుకాణాల కోసం పట్టుబడుతుండగా వేమూరు, పర్చూరు నియోజకవర్గాల్లో 20 శాతం వాటా డిమాండ్ చేస్తున్నారు.అంతా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే..⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో 175 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. షాపుల కేటాయింపుల్లో గందరగోళం నెలకొంది. భీమవరం రూరల్‌లో 8, కాళ్ల మండలంలో 9 షాపులు కేటాయించగా ఉండి, వీరవాసరం మండలాలకు 4 చొప్పున మాత్రమే కేటాయించారు. ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యుల కనుసన్నల్లో సిండికేట్ వ్యవహారాలు నడుస్తున్నాయి. 50 నుంచి 75 శాతం వరకు పెట్టుబడిలోని పర్సంటేజీలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఇతరులకు షాపులు మంజూరైనా పోలీస్ కేసులు తప్పవని బెదిరింపులకు దిగుతున్నారు. పట్టణాల్లో లైసెన్సు ఫీజు రూ.65 లక్షల వరకు ఉండగా రూ.50 లక్షల లోపే ఉండటంతో రూరల్ ఏరియాల్లో షాపులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. షాపులు దక్కించుకుని పట్టణానికి సమీపంలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ⇒ కాకినాడ జిల్లాలో గతంలో టీడీపీ హయాంలో చక్రం తిప్పిన లిక్కర్ సిండికేట్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి సోదరుడు, రామచంద్రపురం జనసేన సీటు ఆశించిన నాయకుడు కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చక్రం తిప్పుతున్నారు. తుని, ప్రత్తిపాడు, కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే టెండర్లు నిర్వహిస్తున్నారు. తుని నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ నేత అనుచరులు.. దరఖాస్తులు వేయవద్దని ప్రత్యర్థి పార్టీ నేతలకు ఫోన్లు చేస్తున్నారు. ఇదే పరిస్థితి పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లోనూ నెలకొంది.⇒ విశాఖ జిల్లాలో ఒక్కో వైన్ షాప్ కోసం ఇద్దరు ముగ్గురు మాత్రమే పోటీ పడుతుండడం సిండికేట్ దందాకు నిదర్శనంగా నిలుస్తోంది. 2019కి ముందు వరకు జనప్రియ ప్రసాద్ (చౌదరి), పుష్కరిణి గణేష్(కాపు)తో పాటు గాజువాక ప్రాంతానికి చెందిన మరొకరు వైన్‌షాపుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సహకారంతో ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నట్లు సమాచారం.⇒ అనకాపల్లి జిల్లాలో గిరాకీ ఉండే నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, సబ్బవరం, అచ్యుతాపురం, మాడుగుల, నక్కపల్లి, అడ్డరోడ్డుతోపాటు హైవే అనుకుని ఉన్న దుకాణాలను కూటమి నేతలు దక్కించుకునేందుకు సిండికేట్‌గా మారారు. చోడవరంలో స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత, మద్యం వ్యాపారి గూనూరు మళ్లునాయుడుకు సంబంధించినవారే ఎక్కువగా దరఖాస్తు చేసినట్లు సమాచారం. హోంమంత్రి వంగలపూడి అనిత అనుచరులు, కూటమి నాయకులు 121 మంది జిల్లావ్యాప్తంగా డిమాండ్ ఉన్న దుకాణాలకు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. యలమంచిలిలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుడు సతీష్‌కుమార్ అనుచరులు సిండికేట్‌గా ఏర్పడి దరఖాస్తు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ నేత పీలా గోవింద్ అనుచరుల సిండికేట్ మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకుంది. -
తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగుతోంది. లక్కీ డ్రా జరుగుతున్న సెంటర్లో మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా జరిగిన మద్యం షాపు దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రా ఆధారంగా వారికీ షాపులు కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం దుకాణాలకు కొనసాగుతున్న లక్కీ డ్రా అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. ఇక ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీగా వాహనాల ప్రవాహం ఉంటుందని ముందే అనుమానించిన ట్రాఫిక్ శాఖ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లక్కీ డ్రా సమయంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీగా అభండారట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోకి దరఖాస్తుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు? -
ఎక్సైజ్‌కు రూ.34 కోట్ల ఆదాయం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ప్రతి రెండేళ్లకు నిర్వహించే మద్యం దుకాణాల టెండర్లతో ఈసారి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వం దరఖాస్తు ఫీజు పెంచినా మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ఆసక్తి చూపారు. దీంతో 1072 దరఖాస్తుల ద్వారా రూ. 2 లక్షల చొప్పున రూ. 21 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 83 మద్యం దుకాణాదారులు మొదటి కిస్తు చెల్లించడం ద్వారా రూ. 13 కోట్ల 18లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎక్సైజ్ శాఖకు రూ. 34 కోట్ల 62 లక్షల 75 వేల ఆదాయం వచ్చింది. నవంబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం దుకాణాల్లో నిబంధనలు పాటించాలని, లేకుంటే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 83 మద్యం దుకాణాల లైసెన్సు ప్రక్రియను పూర్తి చేశారు. గుడివిల్ పేరిట వల మద్యం దుకాణాలు దక్కని కొంతమంది వ్యాపారులు లక్కీడ్రాలో షాపులు దక్కిన వారికి గుడ్‌విల్ పేరుతో వల వేస్తున్నారు. నూతనంగా మద్యం దుకాణాలను లక్కీ డ్రాద్వారా దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్ ఇస్తామని మద్యం దుకాణాలను మాకే అప్పగించాలని అడుగుతున్నారు. ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్నగరంతో పాటు డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలపై ఇప్పటికే వ్యాపారులు కన్నేశారు. నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా మద్యం వ్యాపారం ప్రారంభించాలంటే బడా వ్యాపారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్తగా దుకాణాలు దక్కిన వారు సైతం సిండికేట్లకు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీజుకు ఇస్తే లైసెన్సు రద్దు మద్యం దుకాణాలు దక్కిన వారు ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అలా కాకుండా మద్యం దుకాణాలు ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇస్తే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతున్నారు. 24న 8 మద్యం దుకాణాలకు డ్రా నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా నిలిచిపోయిన 8 దుకాణాలకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్లో లక్కీ డ్రా ఉంటుందన్నారు. నిజామాబాద్ నగరంలోని 18, 19 షాపులు, బోధన్‌లో 32, 41, 42, ఆర్మూర్‌లో 60, 61, 62 దుకాణాలకు 05 కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా నిలిపివేశారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో తక్కువ దరఖాస్తులు వచ్చినా లక్కీడ్రా నిర్వహించారు. కానీ ఈ సారి గెజిట్‌లో నిబంధన లేకున్నా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని పలువురు మద్యం దుకాణా దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలో నూతన ఎౖక్సైజ్ పాలసీ నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు కానుంది. 91 మద్యం దుకాణాల్లో 83 మద్యం దుకాణాలకు లైసెన్సు ప్రక్రియ పూర్తి చేశాం. ఇప్పటికే సుమారుగా రూ. 34 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. మరో 8 దుకాణాలకు సైతం దరఖాస్తులు తీసుకుంటున్నాం. 24న లక్కీ డ్రా ఉంటుంది. మద్యం దుకాణాదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇచ్చినా, నిబంధనలు పాటించకున్నా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
టెండర్లకు మిగిలింది ఒక్క రోజే..
సాక్షి, మెదక్ : మద్యం షాపుల దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. సోమవారం వరకు నత్తనడకన సాగింది. అయితే.. మంగళవారం ఒక్కరోజే 79 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు బుధవారం ఆశావహులు పోటెత్తే అవకాశం ఉండటంతో మెదక్‌లోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయంలో దీనికనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2017- 19లో జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు రూ.40 లక్షలు, రూ.45 లక్షల శ్లాబ్ పరిధిలోకి వచ్చేవి. ప్రస్తుతం రూ.50 లక్షలు, రూ.55 లక్షల పరిధిలో ఉన్నాయి. గత పర్యాయంలో జిల్లాలో 37 మద్యం షాపులకు 301 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దానికి దరఖాస్తు ఫీజు రూ.లక్ష కాగా.. సర్కారుకు సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆదాయం రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఈ సారి దరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదేవిధంగా చిన్నశంకరంపేటలో ఒక మద్యం షాపును అదనంగా కేటాయింది. ఈ లెక్కన జిల్లాలో 38 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మంగళవారం వరకు మొత్తం 156 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి ఇప్పటివరకు సుమారు రూ.3.12 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తు గడువు ముగిసే ఒక్క రోజుకు ముందే గత ఏడాది టార్గెట్‌ను చేరినట్లయింది. పునరావృతం మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి గత, ప్రస్తుత పర్యాయాలు గడువు ఏడు రోజులుగా నిర్ధారించారు. 2017 – 19లో తొలి ఐదు రోజుల్లో కేవలం 17 వచ్చాయి. ఆరో రోజు 59, చివరి రోజు భారీగా 225 మంది దరఖాస్తు చేశారు. 2019 – 21కి సంబంధించి సైతం ఇదే పునరావృతమవుతోంది. ఐదో రోజు వరకు 77 దరఖాస్తులు రాగా.. ఆరో రోజు మంగళవారం అయినప్పటికీ నిర్దేశిత సమయం ముగిసే వరకు 79 వచ్చాయి. ఈ లెక్కన చివరి రోజున 240కి మించి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 18న లాటరీ దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 18న కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో షాపునకు రెండు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తప్పనిసరి. ఒకటే వచ్చిన పక్షంలో సదరు దరఖాస్తుదారుడికి షాపును కేటాయించనున్నారు. -
9 నుంచి ‘మద్యం’ దరఖాస్తులు
సాక్షి, జనగామ: ప్రభుత్వం నూతన మద్యం పాలసీని అమలులోకి తీసుకురాగా ఈ నెల తొమ్మిదో తేదీన గెజిట్ విడుదల చేసి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుడుతుందని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్.మహిపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 41 మద్యం షాపులతో పాటు మరో దుకాణం రఘునాథపల్లికి షిఫ్టింగ్ చేయనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మునిసిపల్ మినహా ఆయా మండలాల పరిధిలోని నేషనల్ హైవేలకు 221 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలన్నారు. దేవాలయం, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. నాలుగు స్లాబులు సిస్టంకు బదులుగా ప్రభుత్వం ఈ సారి ఆరు స్లాబుల విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిందన్నారు. ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రెండేళ్లకు లైసెన్స్ ఫీజు రూ. కోటి (రెండు దుకాణాలు), 5001 నుంచి 50 వేల వరకు రూ.1.10 కోట్లు (25 దుకాణాలు), 50 వేల నుంచి లక్ష వరకు రూ.1.20 కోట్లు (12), లక్షా ఒక్కటి నుంచి 5 లక్షల వరకు రూ.1.30 కోట్లు (జనగామలో లేవు), 5 లక్షల ఒక్కటి నుంచి 20 లక్షల వరకు రూ.1.70కోట్లు (02), 20 లక్షల పైన రూ.2.20కోట్లకు (జనగామలో లేవు) సంబంధించి ఆరు స్లాబులను ప్రకటించారన్నారు. మద్యం దుకాణాలను సొంతం చేసుకున్న వ్యాపారులు రెండేళ్ల కాలంలో ఎనిమిది వాయిదా పద్ధతుల్లో చెల్లించాలన్నారు. 18న డ్రా తీయనున్న కలెక్టర్ ఈ నెల 18వ తేదీన తేదీన సిద్దిపేట రోడ్డు షామీర్పేట శివారులోని బాలాజీ కన్వెన్షన్ హాలులో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి సమక్షంలో డ్రా తీయనున్నట్లు చెప్పారు. మద్యం దుకాణం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్ ఫీజు రూ. రెండు లక్షలకు సంబంధించి డీడీ లేక చలాన్ ఇస్తే సరిపోతుందన్నారు. ఈ సారి రూ.ఐదు లక్షల ఈఎండీ మినహాయించినట్లు చెప్పారు. బ్యాంకు గ్యారెంటీ 67 శాతం నుంచి 50 శాతానికి ప్రభుత్వం తగ్గించిందన్నారు. క్లస్టర్లుగా విభజన మద్యం దుకాణాల దారులకు కొంతమేర ఊరటకలిగించే విధంగా ఈ సారి కొత్తగా మునిసిపాలిటీ, జిల్లా కేంద్రాల్లో క్లస్టర్లుగా విభజించినట్లు తెలిపారు. షాపు ఏర్పాటు కోసం మూడు నుంచి నాలుగు వార్డులను కలిపి దుకాణం(100 మీటర్ల దూరంలో గుడి, బడి) మినహాయించి ఎక్కడైనా వ్యాపారం చేసుకునేలా వెసలుబాటు కల్పించామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో 1, 2, 3, 10 (1వ క్లస్టర్), 5, 7, 8 (2వ క్లస్టర్), 17, 18, 21, 22 (3వ క్లస్టర్), 23, 24, 25, 26 (4వ క్లస్టర్)గా విభజించినట్లు చెప్పారు. మరో కొత్త షాపు జిల్లాలో ప్రస్తుతం 41 మద్యం దుకాణాలు ఉండగా.. ఒకటి పెరగనుంది. రాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న వైన్స్ షాపును రఘునాథపల్లికి షిప్టింగ్ చేసినట్లు చెప్పారు. రెండేళ్ల క్రితం జిల్లాలో 1280 దరఖాస్తులు రాగా, ఈ సారి ఈఎండీ మినహాయించడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. ఆయన వెంట జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎక్సైజ్ సీఐలు నాగేశ్వర్రావు, బ్రహ్మానందరెడ్డి, ముకుందరెడ్డి, ఎస్సై సుధీర్ ఉన్నారు. -
మద్యం సిండికేట్లకు ఏపీ ప్రభుత్వం దాసోహం