సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ ముగిసింది. కూటమి నేతల కనుసన్నల్లోనే మొత్తం తతంగం జరిగింది. లాటరీలోనూ సిండికేట్లదే హవా కొనసాగింది. ఈ క్రమంలో భారీ దోపిడీకి టీడీపీ నేతలు డీల్ సెట్ చేశారు. మద్యం ఆదాయంలో కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేశారు. లాటరీ ద్వారా లైసెన్స్ దక్కితే ఇవ్వాల్సిన కమీషన్‌ను కూడా ముందే ఫిక్స్ చేసేశారు. మొత్తం 3,396 మద్యం షాపులను దక్కించుకునేందుకు కుట్రకు ప్లాన్ చేశారు.
లైసెన్స్ దక్కకపోతే గొడవలు, దాడులకు వ్యూహం పన్నినట్లు సమాచారం. లాటరీ నిర్వహించే ప్రతీ చోట మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే తిష్ట వేశారు. సిండ్‌కేట్‌లో లేకుంటే ఎలా వ్యాపారం చేస్తారో చూస్తామంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు.
అనంతపురం జిల్లాలో మద్యం టెండర్లలో బీజేపీ నేతల హవా సాగుతోంది. ధర్మవరంలో ఐదు మద్యం షాపులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ దక్కించుకున్నారు. మంత్రి సత్యకుమార్ సన్నిహితుడిగా ఉన్న సందిరెడ్డి శ్రీనివాస్‌కు ఐదు మద్యం షాపులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ అధికారుల లాటరీపై మద్యం వ్యాపారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సర్కారు వారి కమీషన్ 30%
ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని ప్రభాకర్ అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పగా, చింతమనేని అనుచరులు దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చలసాని గార్డెన్‌లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment