
కాకినాడ: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Sessions)ల్లో భాగంగా కవరేజ్ కు వెళ్లిన సాక్షి టీవీతో పాటు కొన్ని ఇతర మీడియా చానెళ్లను అడ్డుకోవడంపై ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నించే మీడియా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘నోటీసులు ఇవ్వకుండా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయ్యడం లేదు.
ఆయన కుమారుడు లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్(YS Jagan) కు ప్రతిపక్ష హోదా ఇవ్వనంటారు. కూటమీలో భాగస్వాములైన పార్టీకి పబ్లిక్ ఎకౌంట్స్ ఛైర్మన్ పదవి ఇస్తారు. చంద్రబాబుకు అనుకూల ఎల్లో మీడియా ఉన్నప్పుడు..ప్రశ్నించే మీడియా అంటే ఎందుకు భయం?, ఎంతకాలం మీడియా గొంతు నొక్కుతారు. చేతకాని అసమర్ధ ప్రభుత్వం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.
‘సాక్షి’తో సహా నాలుగ చానెళ్లపై ఆంక్షలు
విజయవాడ: ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో నూ ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలను కవరేజ్ అంశానికి సంబంధించి ‘సాక్షి’తో సహా నాలుగు చానెళ్లపై ఆంక్షలు విధించింది. దేశంలో ఏ అసెంబ్లీ చరిత్రలో లేని మీడియాపై నిషేధ ఆజ్ఞలు అములు చేస్తోంది చంద్రబాబు సర్కారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మీడియాపై ఆంక్షలు విధించింది. కూటమి కుట్రలు బయటపడతాయని ‘సాక్షి’తో పాటు నాలుగు చానెళ్లను నిషేధించింది. అసెంబ్లీలో జరుగుతున్నది ప్రజలకు చూపించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కుట్రలు తెరలేపింది.