
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025.. Day 2 Live Updates
శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ వర్సెస్ టీడీపీ
👉గవర్నర్ ప్రసంగంపై చర్చలో వాదోపవాదనలు
👉ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు ప్రయత్నించిన మంత్రులు
👉ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రసంగాన్ని అడ్డుకున్న మంత్రి నారా లోకేష్
👉నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదన్న మంత్రి నారా లోకేష్
👉గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారన్న వరుదు కళ్యాణి
👉తాము ఇంగ్లీష్ స్పీచ్ లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం
👉మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్షనేత బొత్స అభ్యంతరం
👉మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం
👉ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం
👉ఎన్ డీఏ మా మీద ఆధారపడి ఉందని ఎవరు చెప్పారు
👉కేంద్రానికి మేం బేషరతుగా మద్దతు ఇచ్చాం
👉కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి
👉వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మళ్లీ అభ్యంతరం తెలిపిన మంత్రి నారా లోకేష్
👉మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం
👉మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదన్న మంత్రి లోకేష్
👉మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం
👉కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?
👉మా మీద ఆధారపడలేదని చెప్తారా..?
👉రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు...అదే మా సభ్యురాలు చెప్తున్నది
👉2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?
👉గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉంది: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
👉చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు
👉కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు
👉తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి
👉సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?
👉ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?
👉అమ్మ ఒడి, రైతు భరోశా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?
👉15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు
👉60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు
👉4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి
👉గతం వై ఎస్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు
👉తొలి సంతకం పెట్టిన మెగా డిఎస్సీని కూడా పూర్తి చేయలేదు
👉జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు
👉టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు
ఏపీ శాసన మండలి:
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ప్రసంగానికి అడ్డు తగిలిన మంత్రులు
👉4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు
👉రైతులకు ప్రభుత్వం ఇంతవరకు పెట్టుబడి సాయం అందించకపోగా ఏదో చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.
👉సూపర్ సిక్స్ వాగ్దానాలతో గెలిచి అధికారంలోకి వచ్చారు.
👉రైతులను మోసం చేశారు
👉యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు
👉మొదటి ఏడాదిలో ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు
👉గవర్నర్ ప్రస్తావనలో నిరుద్యోగ భృతి అంశం లేదు
👉హామీలు అమలు చేసే ఆలోచనలో లేరు
👉సాఫ్ట్‌వేర్ పితామహులం అని చెప్పే వీరు గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని విమర్శిస్తున్నారు..
👉ఏఐ ఉద్యోగాలు రావాలంటే తెలుగు మీడియంలో చదివితే వస్తాయా?
👉వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తెలుగును అవమానిస్తున్నారంటూ అడ్డుపడిన హోం మంత్రి అనిత
👉ఎమ్మెల్సీ మాధవరావు తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్
👉తిరిగి మంత్రి అనితకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ మాధవరావు
👉తాను తెలుగు మీడియంలో చదువుకున్నాను
👉ఇంగ్లీష్ మీడియం వల్ల ఉపయోగాలు చెబుతున్నానన్న మాధవరావు
👉ఎమ్మెల్సీ మాధవరావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మంత్రి బాల వీరాంజనేయస్వామి డిమాండ్
👉తాము తెలుగును కించ పరచలేదు.. గత ప్రభుత్వంలో ఇంగ్లీషు మీడియానికి ప్రాధాన్యత కల్పించాం..
👉ఈ ప్రభుత్వ విధానం ఏంటని ప్రశ్నించామన్న ఎమ్మెల్సీ మాధవరావు
👉పెన్షన్ నాలుగు వేలకు పెంచారు.. ఇచ్చే సంఖ్యలో కోత విధించారు
👉ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు.. ఈ ఏడాది ఒక్క సిలెండర్ తో సరిపెట్టారు
👉స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలను గత ప్రభుత్వం కాపాడింది
👉మెట్ట ప్రాంత రైతుల కోసం గత ప్రభుత్వ హయాంలో కొత్త పరిశ్రమలు తెచ్చాం
👉అప్పటి టీడీపీ ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు ఎన్ఓసీ కూడా లేకుండా ప్రారంభం చేశారు.
అసెంబ్లీలో కొనసాగుతున్న ‘సాక్షి టీవీ’పై ఆంక్షలు
👉‘సాక్షి టీవీ’ సహా నాలుగు ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం
👉రాష్ట చరిత్రలో 4 ఛానళ్లపై నిషేధం విధించడం ఇదే ప్రథమం
👉ప్రభుత్వ వైఖరీని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు
ప్రారంభమైన శాసన మండలి సమావేశాలు
👉వైఎస్సార్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్
👉గవర్నర్ ప్రసంగంపై ప్రారంభమైన చర్చ
👉ప్యానెల్ వైస్ చైర్మన్ లుగా పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, నిజాం భాషా, రమేష్ యాదవ్.
మరికాసేపట్లోప్రారంభం కానున్న అసెంబ్లీ
👉కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు
వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం
డశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
👉సూపర్ సిక్స్ పథకాల అమలుపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం
👉ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ సమావేశాలకు దూరంగా ఉన్నYSRCP ఎమ్మెల్యేలు
👉 ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వంతో పోరాడాలని MLA, MLCలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
అసెంబ్లీలో కొనసాగుతున్న సాక్షి టీవీపై ఆంక్షలు
👉నేడు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
👉ఉభయ సభల్లో నేడు గవర్నర్ ప్రసంగం కి ధన్యవాదాలు తీర్మానం పై చర్చ
👉సాక్షి టీవీ సహా 4 టివి చానెళ్లు జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ
👉దేశంలో ఏ రాష్ట్ర అసెంబ్లీలో లేని ఆంక్షలు విధించిన ప్రభుత్వం
👉రాష్ట్ర చరిత్రలో 4 టివి ఛానెళ్ల పై నిషేధం విధించడం ఇదే ప్రధమం
👉ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్ట్ సంఘాలు
అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌తోనూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పించారు. ఇప్పటికే కరెంటు ఛార్జీల పేరుతో చంద్రబాబు.. ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం వేశారు. కానీ అసలు కరెంటు చార్జీలే పెంచలేదంటూ గవర్నరుతో అబద్దాలు పలికించారు. ఇటీవలే లిక్కర్ బాటిల్ పై రూ.10-20ల పెంచిన కూటమి ప్రభుత్వం.. అసలు లిక్కర్ రేట్లను పెంచలేదంటూ అసెంబ్లీలో గవర్నరుతో చంద్రబాబు అబద్దాలు వల్లెవేయించారు. సూపర్ సిక్స్ సహా 143 హామీల అమలు ఎప్పటినుంచో గవర్నర్‌తో చెప్పించని ప్రభుత్వం.. 2047 నాటికి పేదలందరినీ కోటీశ్వరులని చేయిస్తానంటూ చెప్పించింది. అసెంబ్లీ సాక్షిగా గవర్నరుతో అబద్దాలు చెప్పించటంపై ప్రజాస్వామ్యవాదులు విస్తుపోతున్నారు.
మార్చి 21 వరకు అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మంగళవారం నుంచి 16 రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, జనసేన, బీజేపీ తరఫున మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో మార్చి 21 వరకు సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, 26, 27 తేదీలు సెలవులిచ్చి, తిరిగి 28న సభ నిర్వహిస్తారు. ఆ రోజు మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన రోజును వర్కింగ్ డేగా పరిగణించడం లేదని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment