మండలిలో లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స | YSRCP MLC Botsa Satyanarayana Political Counter To Nara Lokesh | Sakshi
Sakshi News home page

మండలిలో లోకేష్‌ను ఏకిపారేసిన బొత్స

Published Tue, Mar 4 2025 1:37 PM | Last Updated on Tue, Mar 4 2025 3:08 PM

YSRCP MLC Botsa Satyanarayana Political Counter To Nara Lokesh

సాక్షి, అమరావతి: ఏపీ శాసనమండలిలో మంత్రి నారా లోకేష్‌కు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చుక్కలు చూపించారు. ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై సభలో చర్చ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలతో సహా ప్రశ్నించడంతో మంత్రి లోకేష్‌ సైలెంట్‌ అయ్యారు. 

శాసనమండలి వేదికగా ఏపీలో 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై నేడు సభలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించిన ఆధారాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమర్పించారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ..‘వీసీల రాజీనామాలపై ప్రభుత్వం తప్పు లేకపోతే విచారణ జరిపించండి. 17 మంది వీసాలతో బలవంతంగా రాజీనామా చేయించారు. వీసీలను గవర్నర్‌ నియమిస్తే ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు.

మరోవైపు.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ..‘మూకుమ్మడిగా నాలుగు రోజుల్లో 17 మంది ఎందుకు రాజీనామా చేశారు. ఒకే సారి అంత మంది రాజీనామా చేస్తే ఎందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదు. వీసీల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ సభ్యులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి నారా లోకేష్‌ ఎదురుదాడికి దిగారు. దీంతో, మండలి చైర్మన్‌ సభకు కొద్దిసేపు విరామం ప్రకటించారు.

ప్రభుత్వం తప్పు లేకుంటే విచారణ చేయాలి : బొత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement