ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా | AP Assembly Budget Session 2025 March 4th Updates | Sakshi
Sakshi News home page

ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా

Published Tue, Mar 4 2025 9:55 AM | Last Updated on Tue, Mar 4 2025 1:56 PM

AP Assembly Budget Session 2025 March 4th Updates

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ 2025 అప్‌డేట్స్‌.. సమావేశాల్లో భాగంగా కూటమి హామీల ఎగవేతను, అరాచక పాలనను, గత ప్రభుత్వంపై చేస్తున్న విషప్రచారాన్ని శాసన మండలిలో ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది వైఎస్సార్‌సీపీ 

👉 శాసన మండలి రేపటికి వాయిదా

వీసీల బలవంతపు రాజీనామాలపై చర్చ..

  • వీసీల బలవంతపు రాజీనామాలపై ఆధారాలు ఇ‍స్తే విచారణ చేస్తామని గతంలో మంత్రి లోకేష్ ప్రకటన
  • సభకు ఆధారాలను అందజేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
  • 17 మంది యూనివర్శిటీల వీసీల బలవంతపు రాజీనామాలపై విచారణ జరిపించాలని డిమాండ్

చేనేతపై చర్చ..

  • చేనేత రంగానికి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలని కోరిన వైఎ‍స్సార్‌సీపీ ఎమ్మెల్సీలు
  • సమాధానం దాటవేస్తూ వైఎస్సార్‌సీపీపై మంత్రి సవిత విమర్శలు
  • బొత్స సత్యనారాయణను మాట్లాడకుండా అడుగడుగునా అడ్డుపడిన టీడీపీ సభ్యులు
  • వైఎస్‌ జగన్‌ నేతన్న ద్రోహి అంటూ తీవ్ర విమర్శ చేసిన మంత్రి సవిత

మంత్రి సవిత వ్యాఖ్యలపై బొత్స ఫైర్

  • శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కామెంట్స్‌
  • గత 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతలను మోసం చేసింది
  • నేతతన్నలకు రుణమాఫీ చేస్తామని చేయలేదు
  • చేనేతల సమస్యలపై అధ్యయనం చేస్తామని చేయలేదు.
  • 1000 కోట్లతో ప్రత్యేక నిధి ఇస్తామని ఇవ్వలేదు.
  • వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం పథకానికి 969 కోట్లు ఇచ్చాం.
  • మేము తప్పు మాట్లాడితే మాపై చర్యలు తీసుకోవచ్చు.
  • మా సభ్యులు అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పటం లేదు
  • చేనేతల వ్యవహారంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం.

దిశ యాప్‌ను కొనసాగిస్తారా లేదా?

  • ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్‌..
  • రాజకీయాలకు అతీతంగా మహిళలకు రక్షణ కల్పించాలి
  • పనిచేసే చోట మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారు
  • దిశ యాప్ ఉంటే ఎంతో ఉపయోగపడేది
  • దిశ యాప్‌ను కొనసాగిస్తారా లేదా?
  • దిశ యాప్ స్థానంలో మరొక యాప్ తీసుకొస్తారా లేదా సమాధానం చెప్పాలి.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కామెంట్స్‌.. 

  • విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రశ్నోత్తరాలు
  • ఛార్జీలు పెంచబోమని చెప్పి యూనిట్ పై 2 రూపాయలు భారం వేశారు
  • సర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు భారం వేశారు
  • గత టీడీపీ ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది
  • 2014 నుంచి 19 వరకూ 13 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే
  • 2019 నుంచి 24 వరకూ 47 వేల కోట్ల రూపాయల సబ్సిడీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భరించింది
  • రేట్లు పెంచకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరించాలి
  • ఉన్నదానిని తగ్గిస్తామని మాటిచ్చారు
  • ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి.


ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ కామెంట్స్‌..

  • విద్యుత్ చార్జీలు పెంచమని టీడీపీ రకరకాలుగా ప్రచారాలు చేసింది
  • ట్రూ అప్ తో పాటు సర్దుబాటు ఛార్జీలు.. టైమ్ ఆఫ్ ది డే ఛార్జ్ పేరుతో వసూలు చేస్తున్నారు
  • మీరిచ్చిన మాటేంటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి
  • టారిఫ్, సర్ధుబాటు, ట్రూ అప్ ఛార్జీలు పెంచుతున్నారా.. ఇది మాటతప్పడం కాదా?

 

YSRCP ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు 

  • ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రారంభం

మండలి లో వైస్సార్‌ర్సీపీ వాయిదా తీర్మానం

  • నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై చర్చించాలని శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చిన YSRCP ఎమ్మెల్సీ లు
  • ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్‌ కేలండర్‌ హామీ ఇచ్చిన కూటమి
  • 9 నెలలు కావస్తున్నా ఒక్క నోటిఫికేషన్‌ పూర్తి కాని వైనం
  • మెగా డీస్సీపైనా జాప్యం

 

ఏది విధ్వంసం.. ఎవరిది విధ్వంసం?

  • అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు
  • ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు సూపర్‌ సిక్స్‌ హామీలు 
  • అధికారంలోకి వచ్చాక ఎప్పటిలాగే చెత్తబుట్టకు చేరిన మేనిఫెస్టో 
  • పైగా గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం  
  • ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? 
  • ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? 
  • కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32­వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? 
  • నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా?
  • ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?
  • ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 
  • 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. 
  • ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్‌లో కోత­లు పెట్టిన చంద్రబాబు  చేసేది విధ్వంసమా? 
  • ఎవరిది విధ్వంసం? ఎవ­రు విధ్వంసకారుడు? 
  • ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు.
  • జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం

:::కూటమి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులు

ఇదీ చదవండి: సీఎం పదవిలో ఉన్నవాళ్లెవరైనా అలా మాట్లాడతారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement