AP Budget
-
ఏపీ బడ్జెట్ పై సింగర్ దేవి శ్రీ అదిరిపోయే సాంగ్..
-
మాయలేళ్లూ... మరీచికలు !
-
బడ్జెట్ ప్రసంగమా.. లేక.. బాబు, లోకేష్ భజన
-
బడ్జెట్ పై ఏపీ ప్రజల రియాక్షన్.. సూపర్ మోసం
-
బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు, లోకేష్ పొగడ్తలకే సరిపోయింది
-
AP: ఉద్యోగులకు ఉత్తచెయ్యి
సాక్షి, అమరావతి: పేద, సామాన్య ప్రజానీకాన్ని రెండు బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లను కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ.. అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి ప్రస్తావనే చేయకుండా మొండి చేయి చూపింది. వారికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన చెప్పాయి. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు కావస్తున్నా ఐఆర్‌కు దిక్కు లేకుండా పోయిందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్ గురించి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చూస్తుంటే మోసపోయినట్లు అర్థం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి కేబినెట్ సమావేశంలోనే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. బకాయిలు, డీఏల మాటేంటి? ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ, అధికారంలోకి వచ్చి పది నెలలైనా ఆ ఊసే ఎత్తడం లేదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పది నెలలైనా చెల్లించక పోవడంతో బకాయిలు మరో రూ.3 వేల కోట్లు పెరిగి మొత్తంగా రూ.26 వేల కోట్లకు చేరాయని చెబుతున్నారు. మొదటి బడ్జెట్లో అసలు ఉద్యోగుల గురించి ప్రస్తావించలేదని, ఇప్పుడు రెండో బడ్జెట్లో కూడా ఉద్యోగుల అంశాలను ప్రస్తావించక పోవడం చూస్తుంటే కూటమి సర్కారుపై నమ్మకం సడలి పోతోందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. డీఏల గురించి కూడా సీఎం, డిప్యూటీ సీఎం మాట్లాడటం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. గత ఏడాది జనవరి, జూలై డీఏలు పెండింగ్‌లో పెట్టిందని, ఈ బడ్జెట్లోనైనా ఐఆర్‌తో పాటు వాటిని చెల్లిస్తారని ఆశించామని.. అయితే తమ ఆశలపై కూటమి సర్కారు నీళ్లు చల్లిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. సీపీఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు దాని గురించి ఆలోచనే చేయక పోవడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నట్లు బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్నారని, ఇది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని ఉద్యోగులు పేర్కొంటున్నారు. పీఆర్సీ ఆశలపై నీళ్లుఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్‌పై కూడా పునః పరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పది నెలలైనా పీఆర్సీ గురించి అసలు మాట్లాడకపోగా, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా, అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురైయ్యారని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి, కూటమి ప్రభుత్వం మాట తప్పిందని.. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారెంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. రూ.26 వేల కోట్ల బకాయిలు, రెండు డీఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, వీటి గురించి అటు కూటమి నేతలు, ఇటు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’
విశాఖ: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో నవ్వాలో జాలి పడాలో తెలియని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో వైఎస్ జగన్ మరో 10 మెట్లు పైకి ఎక్కారన్నారు కురసాల. బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు లోకేష్ పొగడ్తలకే సరిపోయిందని, బడ్జెట్ ను మసి పూసి మారేడు కాయ చేశారన్నారు.బడ్జెట్ గురించి ఎల్లో మీడియాలో రాసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదని ధ్వజమెత్తారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారు. వైఎస్ జగన్ కరోనా సమయంలో అప్పు చేస్తే రాష్ట్రం దివాలా అని వార్తల రాశారు. చంద్రబాబు లక్ష 20 వేల కోట్లు అప్పు చేస్తే గొప్పగా రాస్తున్నారు’ అని మండిపడ్డారు. పోసాని అరెస్టు ద్వారా కొత్త సంస్కృతికి తెర తీశారు. ఆరోగ్యం బాగో లేకపోయినా జైల్లో పెట్టారు. అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ పై, వైఎస్సార్ సీపీ నేతలపై దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే సాంస్కృతిని కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వం ఈ సంస్కృతిని కొనసాగించదా? అని కురసాల కన్నబాబు హెచ్చరించారు. -
ఏపీ బడ్జెట్ పై కేఏ పాల్ అదిరిపోయే సెటైర్లు
-
ఏపీ బడ్జెట్.. ఓన్లీ కోతల బడ్జెట్: బీవీ రాఘవులు
-
అబద్ధాల కుప్పగా ఏపీ బడ్జెట్: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అబద్ధాల కుప్పగా, చంద్రబాబు మోసాలకు ప్రతిరూపంగా ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు కేటాయింపులకు పొంతన లేకుండా బడ్జెట్ రూపొందించారని, ఇదంతా సూపర్ సిక్స్ పథకాల అమల్లో ప్రజలను మోసం చేయడంలో భాగమే అని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటాయించడం చూశాక వాటిని కూడా సక్రమంగా అమలు చేయరన్నది స్పష్టమవుతోందని రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన మార్గాని భరత్ చెప్పారు.మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..:ఎవరు కౌటిల్యుడు? ఎవరు చంద్రగుప్తుడు?:అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా పయ్యావుల కేశవ్ తనను తాను కౌటిల్యుడిగా, చంద్రబాబును చంద్రగుప్త మౌర్యుడిగా పోల్చాడు. సామాన్యుడి సంక్షేమమే తన సంక్షేమంగా భావించి ప్రజలకు మేలు చేసిన చంద్రగుప్త మౌర్యుడితో చంద్రబాబును పోల్చడం విడ్డూరంగా ఉంది. సూపర్ సిక్స్ హామీలకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కేటాయించకుండా గొప్పలు చెప్పుకోవడం కన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా?. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దాదాపు రూ.1.40 లక్షల కోట్ల అప్పు చేసింది. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో భారతదేశంలో అప్పు తీసుకునే శక్తి లేని రాష్ట్రంగా ఏపీ తయారైందని ఆర్థిక మంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో ఆదాయం కింద రూ.2.17 లక్షల కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇందులో రూ. 1.04 లక్షల కోట్లు అప్పు కింద సమీకరిస్తున్నామని వారే చెప్పారు.మాటలకు చేతలకు పొంతన లేదు:అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా తీసుకెళ్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం రెవెన్యూ వ్యయం కింద రూ.2.51 లక్షల కోట్లు కేటాయించి, మూలధన వ్యయం కింద కేవలం రూ.40 వేల కోట్లు కేటాయించింది. అంటే వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని అర్థమవుతుంది. 1995లో ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ప్రభుత్వం జీతాలివ్వలేని స్థితిలో ఉందని చెప్పి, అంతకు ముందు పాలించిన ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. వాస్తవానికి ఆ రోజుల్లో మిగులు బడ్జెట్ ఉంటే ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాకే రాష్ట్రం అప్పులపాలైంది. సీనియర్ నాయకుడు అయి ఉండి కూడా బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ తన మంత్రి పదవి కాపాడుకోవడానికి నారా లోకేష్‌ను, సీఎం చంద్రబాబును పొగిడే దుస్థితికి దిగజారిపోయారు.పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారు:పెయిడ్ ఆర్టిస్టును అడ్డం పెట్టి చంద్రబాబు ప్రభుత్వం సజ్జన్ జిందాల్‌ను వేధించి ఏపీ నుంచి తరిమేస్తే ఆయన కంపెనీ జేఎస్‌డబ్ల్యూ మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఇలాంటోళ్లు జగన్ పారిశ్రామికవేత్తలను తరిమేశాడని తప్పుడు ప్రచారం చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు దావోస్‌లో లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటే.. రాష్ట్ర యువతకు ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలిస్తామన్న తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఉత్త చేతులతో తిరిగొచ్చారు. ఉద్యోగాలివ్వలేని పక్షంలో నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు, ఆ పథకానికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించకుండా 20 లక్షల మంది నిరుద్యోగ యువతను నిలువునా మోసగించాడు.పథకాలన్నీ నిర్వీర్యం:ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మార్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ట్రస్టు మోడల్ నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌కి మార్చేసి పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మార్చేశారు. గతేడాది బడ్జెట్లో సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని అమలు చేయకపోగా, ఈ ఏడాది బడ్జెట్లో కూడా ఫ్రీ బస్, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోగా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు అరకొర నిధులు కేటయించి అమలు చేయడంపైనా ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన బీసీలకు పింఛన్ ఇస్తామని మాట తప్పారు. అందుకే చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టడమేనని, ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని మార్గాని భరత్ గుర్తు చేశారు. -
ఏపీ బడ్జెట్ తో మరోసారి చంద్రబాబు మోసం: పుష్పశ్రీవాణి
-
కోతల బడ్జెట్ ఇది.. మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి: బీవీ రాఘవులు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ బడ్జెట్.. కోతల బడ్జెట్ అంటూ ఎద్దేవా చేశారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. బడ్జెట్లో సమగ్రత లేదు అంటూ వ్యాఖ్యానించారు.సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది కోతల బడ్జెట్ మాత్రమే. ఆదాయాన్ని పెంచుకునే అంకెలు అన్నీ మోసపూరితమైనవి. సొంత పన్నులు 15వేల కోట్లు పెరుగుతాయని చెప్పారు. ఎలా పెరుగుతాయి చెప్పాలి. రెవెన్యూ ఎస్టిమేషన్, ఖర్చుల ఎస్టిమేషన్ కోత పడబోతుంది. ఎర్ర చందనం అమ్మకం ద్వారా తీసుకొస్తారా? లేక మద్యం తాగించి వసూళ్లు చేస్తారా?. బడ్జెట్లో సమగ్రతే లేదు. అభివృద్ధి, సంక్షేమం ఊసే లేని బడ్జెట్ ఇది. కేంద్రం వాటాపై ఒక మాట కూడా మాట్లాడలేదు.ప్రభుత్వం ప్రారంభంలోనే సూపర్ సిక్స్ల్లో మూడు సిక్స్‌లు ఎగిరిపోయాయి. మిగిలినవి కూడా సంఖ్యల తగ్గిస్తారు. మహిళలు, నిరుద్యోగులకు మొండి చేయి చూపారు. వర్గీకరణ చేసిన తర్వాత డీఎస్సీ ఇస్తామని ఉద్యోగాలు ఎగ్గొట్టె ప్రయత్నం చేస్తోంది. వ్యవసాయశాఖ అంకెలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. ఇరిగేషన్‌పై ఖర్చు తగ్గించారు. 54 మండలాలు ఇప్పటికే కరువు మండలుగా ప్రకటించారు. తక్కువ ఖర్చుతో పూర్తి చేసే ప్రాజెక్టులు పూర్తి చేయాలి. మూలధనం వ్యయం 40వేల కోట్లు.. రెవెన్యూ వ్యయం లక్ష కోట్లుగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. -
అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ లో కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పింది
-
అంకెల గారడీ తప్పితే అమలులో శూన్యం.. బడ్జెట్ పై గురుమూర్తి రియాక్షన్
-
బడ్జెట్ పై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
-
సూపర్ సిక్స్ గోవిందా.! బడ్జెట్ పేరుతో బడా మోసం
-
బడ్జెట్ ప్రసంగం కాదు.. లోకేష్‌ను పొగిడే కార్యక్రమం: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు సర్కార్‌కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్‌ను విమర్శించడం.. నారా లోకేష్‌ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ నెరవేర్చారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారు. బడ్జెట్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ జపం చేసింది. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచింది. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారు.హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ.. అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశ పడ్డారు. బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశే మిగిలింది. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని ప్రజలు భావించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల్లో కోత పెట్టారు. తల్లికివందనం పథకానికి రూ.13,113 కోట్లు అవసరమైతే రూ.9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి అసలు నిధులే కేటాయించలేదు. వైఎస్ జగన్ విలువ ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. బడ్జెట్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కేటాయించలేదు. నిరుద్యోగులకు ఏడాదికి 7000 కోట్లు ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన మహిళకు 27000 కోట్లు ఇవ్వాలి. హామీలు దసరా, దీపావళికి అమలు చేస్తామన్నారు.. వాయిదా వేశారు. సంక్రాంతికి వస్తామన్నారు, సినిమా వచ్చింది కానీ చంద్రబాబు రాలేదు. తొలి సంతకం డీఎస్సీకి దిక్కుమొక్కు లేదు. షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డుక్కె పరిస్థితి ఏర్పడింది. కూటమి పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదు?. సంపద సృష్టి అనేది అమరావతి కోసమేనా?. మెట్రో రైలు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేసే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు. -
పేపర్ విజనరీ Budget గాయాలు
-
ఇదేనా స్పీడ్?
సాక్షి, అమరావతి: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టిసారించాం.. ఇక నుంచి ఏ ఏడాది పారిశ్రామిక రాయితీలు ఆ ఏడాదే విడుదల చేస్తాం. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించడం కోసం ఒక ఎస్క్రో ఖాతా తెరిచి అందులో ప్రోత్సాహక నిధులు వేస్తాం’.. అని సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక పాలసీల విడుదల సందర్భంగా ఘనంగా ప్రకటించుకున్నారు. కానీ, ఈ మాటలు ఆరి్థకమంత్రి పయ్యావుల కేశవ్ విన్నట్లు, చూసినట్లు లేరు. ఎందుకంటే.. సీఎం చెప్పిన మాటలకు, బడ్జెట్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు చేసిన కేటాయింపులకు ఎక్కడా పొంతనలేదు. 2025–26 బడ్జెట్లో స్పీడ్ ఆఫ్ బిజినెస్‌లో భాగంగా ప్రోత్సాహకాల కోసం ఎటువంటి కార్పస్ ఫండ్‌ను ఏర్పాటుచేయలేదు. పైగా.. చెల్లించాల్సిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు రూ.11,000 కోట్లు ఉన్నాయని స్వయంగా బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆరి్థకమంత్రి దానికి అనుగుణంగా కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద మొక్కుబడిగా రూ.1,000 కోట్లు మాత్రమే కేటాయించడంపై పారిశ్రామికవేత్తలు రగిలిపోతున్నారు. గత బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోత.. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పరిశ్రమల రంగానికి బడ్జెట్లో రూ.2,270.78 కోట్లు కేటాయిస్తే సవరించిన అంచనాల్లో ఈ మొత్తాన్ని రూ.822.81 కోట్లకు తగ్గించేశారంటే పారిశ్రామిక రంగంపై కూటమి సర్కారుకున్న ప్రాధాన్యత స్పష్టమైంది. అలాగే, వచ్చే ఆర్థిక సంవత్సరానికీ రూ.2,418.57 కోట్లు కేటాయించారు.పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.1,000.24 కోట్లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సహకానికి రూ.200 కోట్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.200 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్‌కు రూ.75 కోట్లు, ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.3,000 కోట్లు కేటాయించారు. కడప స్టీల్ ప్లాంట్‌కు గత బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించగా ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చే సంవత్సరానికి రూ.25 కోట్లు కేటాయించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల వద్ద స్థల సేకరణపై దృష్టి.. ఇదిలా ఉంటే.. మచిలీపట్నం పోర్టు వద్ద 10,070 ఎకరాల సేకరణకు రూ.150 కోట్లు, భావనపాడు (మూలపేట) పోర్టు వద్ద 6,410 ఎకరాలు సేకరించడానికి రూ.100 కోట్లు, రామాయపట్నం పోర్టు వద్ద 506 ఎకరాల సేకరణకు రూ.100 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అలాగే.. » భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద 40 ఎకరాల భూసేకరణతో పాటు రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి రూ.190 కోట్లు కేటాయించారు. » అదే విధంగా కుప్పం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 444 ఎకరాలు, దగదర్తి ఎయిర్‌పోర్టు వద్ద 418 ఎకరాల సేకరణకు రూ.30 కోట్లు కేటాయించారు. » విజయవాడ ఎయిర్‌పోర్టుకు రూ.29.88 కోట్లు, కర్నూలు ఎయిర్‌పోర్టు నిర్వహణకు రూ.15.29 కోట్లు, వీజీఎఫ్ కింద విమాన సర్వీసులు నిర్వహించడానికి రూ.30 కోట్లు కేటాయించారు. » ఇక విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా ఏడీబీ నిధులతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు నామమాత్రపు కేటాయింపులు చేశారు. » ఐటీ రంగానికి రూ.533.72 కోట్లు, నైపుణ్య శిక్షణకు రూ.462.68 కోట్లు కేటాయించారు. -
పల్లెను చిదిమేశారు!
సాక్షి, అమరావతి : పల్లెలు కళ తప్పుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కళావిహీనంగా తయారవుతున్నాయి. బడ్జెట్లో పల్లెల ప్రగతి కోసం పైసా కూడా కేటాయించక పోవడం పట్ల గ్రామీణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతికి బాటలు పడ్డాయి. 2 వేల జనాభా కలిగిన ప్రతి గ్రామంలో ఓ సచివాలయం, ఆ పక్కనే రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రం, పల్లెవాసుల ఆరోగ్య పరిరక్షణ కోసం విలేజ్ క్లినిక్, పిల్లల చదువుల కోసం డిజిటల్ లైబ్రరీ.. నాడు–నేడు ద్వారా ఆధునిక సౌకర్యాలతో రంగు రంగుల స్కూళ్లు.. ఇలా గ్రామ స్వరూపాన్నే మార్చేశారు. ప్రతి గ్రామంలో కోట్ల రూపాయల ఆస్తులు ఏర్పాటు చేశారు. ఈ విధంగా రూ.4,750 కోట్లతో 10,893 సచివాలయ భవనాలు మంజూరు చేయగా, 9,585 సచివాలయాల భవన నిర్మాణాలు చేపట్టి, 6,879 సచివాలయాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.575 కోట్లతో 3,589 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపట్టారు. నాడు–నేడు పథకం కింద గ్రామాల్లో ఉండే పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టి.. తొలి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 స్కూల్స్‌ను అభివృద్ధి చేశారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలు, 447 జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.1,726 కోట్లతో 8,299 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టి, 3,104 భవనాల నిర్మాణం పూర్తి చేశారు. రూ.2,446 కోట్లతో 10,216 ఆర్బీకేల నిర్మాణం చేపట్టగా, దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చు చేసి 5,333 ఆర్బీకే భవనాలు పూర్తి చేసి అప్పగించారు. రూ.281 కోట్లతో 1,589 బల్క్ చిల్లింగ్ సెంటర్లు నిర్మించారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన భవనాలన్నీ దాదాపు 70–80 శాతం పూర్తయ్యాయి.కొద్దిపాటి నిధులు కేటాయిస్తే వీటి నిర్మాణం పూర్తవుతుంది. అలాంటిది బడ్జెట్లో వీటి ప్రస్తావన మాట మాత్రంగా కూడా లేకపోవడం విచారకరం. గతేడాది బడ్జెట్లో పైసా కేటాయించలేదు. కనీసం ఈ ఏడాదైనా నిధుల కేటాయింపులుంటాయని భావించారు. వీటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే దురాలోచనతోనే ఇలా నిర్లక్ష్యం చేశారని ప్రజలు మండి పడుతున్నారు. -
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పైరవీలు, పక్షపాతానికి తావులేకుండా ఐదేళ్ల పాటు లబ్దిదారుల ఇళ్ల వద్దనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలందుకున్న వలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది. గత ఏడాది ఎన్నికల ముందు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, వారి గౌరవ వేతనం రెట్టింపు చేస్తామని ఊరూవాడా హోరెత్తించిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను చిదిమేశారు. తాజాగా.. ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ నిధులు కేటాయించకపోవడంతో 2.66 లక్షల మంది వలంటీర్ల కుటుంబాలు రోడ్డునపడినట్లయింది. నిరుద్యోగ యువతకు పెద్దఎత్తున ఉపాధి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వరకు విజయవంతంగా కొనసాగిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేద నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఉపాధి పొందారు. అప్పట్లో 20–25 ఏళ్ల మధ్య వయస్సు వారు 27 శాతం మంది, 26–30 ఏళ్ల మధ్య వారు 36 శాతం, 31–35 ఏళ్ల మధ్య వారు 28 శాతం కలిపి మొత్తం 91 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ‘వలంటీర్’గా ఉపాధి పొందారు. మరోవైపు.. వలంటీర్లుగా అప్పటి ప్రభుత్వం నియమించిన వారిలో 49 శాతం మంది బీసీలు, 27 శాతం మంది ఎస్సీలు, ఏడు శాతం మంది ఎస్టీలున్నారు. అలాగే, మొత్తం మీద 1,25,781 మంది మహిళలు ఉపాధి పొందారు. తొమ్మిది నెలలుగా ఆందోళన చేస్తున్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు గత ఏడాది ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఊదరగొట్టారు. అయితే, జూన్‌లో అధికారంలోకి వచ్చాక ఆ నెల నుంచి వలంటీర్ల వేతనాలను ప్రభుత్వం నిలిపివేసింది. అంతేకాక.. అప్పటివరకూ అన్ని రకాల విధులు నిర్వహించిన వీరిని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో వలంటీర్లు చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తునే ఉన్నారు. అయినా, ఈ సర్కారుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాంతెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా మీకు (వలంటీర్లకు) హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది పండుగరోజున తీపి కబురు మీ అందరికీ ఇస్తాం. రూ.ఐదువేలు కాదు.. రాబోయే రోజుల్లో పదివేల రూపాయల పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. 2024 ఉగాది పండుగ రోజున పార్టీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు -
నమ్మించి నయ వంచన!
సాక్షి, అమరావతి : ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టుగానే అన్నదాతలకు మొండి చేయి చూపింది. ‘ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుంటున్నారు. రైతులకు జగన్ కేవలం రూ.7,500 చొప్పునే ఇస్తున్నారు. మిగతా ఆరు వేలు కేంద్రమే ఇస్తోంది. అదే మాకు అధికారం ఇస్తే తొలి ఏడాది నుంచే ప్రతి రైతుకు మేమే రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం’ అంటూ ప్రజాగళంలో చంద్రబాబు గొప్పగా ప్రకటించారు. తీరా ఆచరణకు వచ్చేసరికి అన్నదాతలకు పంగనామాలు పెడుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ.. వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయించింది కేవలం నాలుగు శాతం మాత్రమే కావడం గమనార్హం. రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేవలం రూ.12,401 కోట్లు కేటాయించడం పట్ల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన తొలి ఏడాది బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి మొక్కుబడిగా రూ.1,000 కోట్లు కేటాయించారు. ఓ వైపు వైపరీత్యాలు, మరోవైపు మార్కెట్లో ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎంతో కొంత ఊరటనిస్తుందని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ పగ్గాలు చేపట్టి తొమ్మిది నెలలు గడిచినా తొలి ఏడాదికి సంబంధించి పైసా పెట్టుబడి సాయం విదిల్చ లేదు. వాస్తవానికి రాష్ట్రంలో రైతు భరోసా లబి్ధదారులు 53,58,368 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జమ చేయాలంటే బడ్జెట్లో రూ.10,717 కోట్లు కేటాయించాలి. కానీ కేటాయించింది కేవలం రూ.6,300 కోట్లే. ఈ మొత్తం రూ 20 వేల చొప్పున అర్హులైన రైతులకు చెల్లిస్తే కేవలం 31.50 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. అంటే వాస్తవ లబ్ధిదారుల్లో 22.08 లక్షల మందికి పెట్టుబడి సాయం అందదు. మరో పక్క కౌలు రైతులకు తామే పూర్తిగా పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పెట్టుబడి సాయంలో ఇలా రూ.4,417 కోట్ల మేర కోత పెట్టడం పట్ల రైతాంగం నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఆర్ఎస్కేలు, అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు కేటాయింపులు నిల్ ఆర్బీకే, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల నిర్వహణకు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఆర్బీకేలను కుదించాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అగ్రి ల్యాబ్‌లను పీ–4 పద్దతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నామని ఇటీవలే ప్రకటించింది. అందువల్లే వీటి నిర్వహణకు కేటాయింపులు జరపలేదనే వాదన విని్పస్తోంది. ధరల స్థిరీకరణ నిధికి వైఎస్ జగన్ హయాంలో రూ.3 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం రూ.300 కోట్లు విదిల్చింది. విపత్తుల బారిన పడి పంటలు నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి కింద గత జగన్ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో పైసా కూడా కేటాయించ లేదు. విత్తన రాయితీ పథకానికి గతేడాది రూ.268 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది పెంచకపోగా రూ.240 కోట్లకు కుదించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాడి రైతులకు పశువుల మేత కోసం బంజరు భూముల కేటాయింపు కోసం నిధులు, గోపాల మిత్రల పునర్నియామకం ఊసే లేదు. రాయితీపై సోలార్ పంపు సెట్ల ఏర్పాటుకు కూడా నిధులు కేటాయించలేదు. రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న హామీ ప్రస్తావన లేదు. పట్టు పరిశ్రమకు 2023–24 బడ్జెట్‌తో పోల్చితే భారీగా కోత పెట్టింది. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, స్వచ్ఛంద బీమా నమోదు పథకం తీసుకొచ్చారు. ఈ పథకానికి రూ.1,023 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా కోసం ఏటా రూ.1,700 కోట్లు కేటాయించారు. అలాగే వడ్డీ లేని పంట రుణాల కోసం వైఎస్ జగన్ సర్కారు హయాంలో ఏటా రూ.500 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని సగానికి సగం తగ్గించింది. కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించడం వల్ల ఖరీఫ్ 2024–25 లో 69.51 లక్షల ఎకరాలకు బీమా కవరేజ్ పొందగా, స్వచ్ఛంద బీమా నమోదు పథకాన్ని అమలు చేయడంతో రబీ 2024–25 సీజన్లో కేవలం 7.65 లక్షల మంది రైతులు 9.93 లక్షల ఎకరాలకు మాత్రమే కవరేజ్ పొందగలిగారు. గడిచిన రబీ సీజన్‌తో పోల్చుకుంటే మూడో వంతు రైతులకు కూడా రక్షణ లేకుండా పోయింది. పాత లబ్దిదారులకే వేట నిషేధ భృతిగద్దెనెక్కగానే వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారునికి రూ.20 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. 2024–25 సీజన్‌కు 1,30,128 మంది అర్హత పొందగా, వారికి రూ.260.26 కోట్లు జమ చేయాల్సి ఉంది. కాని ఏడాది గడిచినా పైసా విదల్చలేదు. అనర్హులున్నారంటూ రీ సర్వే పేరిట అర్హులను తొలగించి, తమ పార్టీ సానుభూతిపరులను చేర్చి 1,22,968 మంది అర్హత పొందినట్టుగా లెక్క తేల్చారు. వారికి రూ.245.94 కోట్లు జమ చేయాలని ప్రతిపాదనలు పంపారు. అదే విషయాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2025–26 సీజన్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు నిషేధ భృతి కోసం కేటాయింపులు జరపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్వా, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అర్హత కలిగిన 68,134 ఆక్వా కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ విస్తరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఆ మేరకు కేటాయింపులు జరపలేదు. ఎప్పటిలోగా అమలు చేస్తామన్న స్పష్టతా ఇవ్వలేదు. మరో వైపు ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్స్, సబ్సిడీపై ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు, కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం వంటి హామీలపై పైసా కేటాయింపు జరపక పోవడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. మత్స్య యూనివర్సిటీకి మొండి చేయి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంతో పాటు వైఎస్సార్ ఉద్యాన, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు అరకొరగానే కేటాయింపులు జరిపారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీకీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సమీపంలో 400 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనాతో భవన నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.100 కోట్లతో పరిపాలన భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణా కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వర్సిటీకి గతేడాది పైసా ఖర్చు చేయలేదు. ఈ ఏడాది పైసా కేటాయింపులు జరపలేదు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ జెట్టీల నిర్మాణానికి సైతం పైసా కేటాయించలేదు. దీంతో వీటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. -
పర్యాటకంలో దోచుకో.. పంచుకో!
సాక్షి, అమరావతి : దేశ పర్యాటక రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలపుతానన్న సీఎం చంద్రబాబు మాటలు ఒట్టి కోతలని తేలిపోయింది. 2025–26 బడ్జెట్లో ఏపీ పర్యాటక అభివృద్ధి కంటే తాత్కాలిక ఈవెంట్ల నిర్వహణకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టమైంది. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖకు మొత్తంగా రూ.460 కోట్లు కేటాయించారు. ఇందులో పర్యాటక శాఖలో తమ అనుయాయుల కంపెనీలకు ఈవెంట్, ఫంక్షన్ కాంట్రాక్టులు దక్కేలా చేసి, వారికి లబ్ధి చేకూర్చేలా ఏపీ టూరిజం అథారిటీకి రూ.171 కోట్లు కేటాయించగా.. అందులో రూ.150 కోట్లు ఒక్క ఈవెంట్ల నిర్వహణకే ఇవ్వడం గమనార్హం. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)ను నిర్లక్ష్యం చేసింది. సంస్థ స్వయం సమృద్ధి సాధించడం ద్వారా సింహ భాగం ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులను ఏపీటీడీసీ ఆదాయం నుంచే భరించేది. ప్రభుత్వం నుంచి ఏటా సుమారు రూ.2.50 కోట్ల వరకు కేటాయింపులుండేవి. కానీ, ఈ బడ్జెట్లో వాటిని రూ.64 లక్షలకు కుదించేసింది. తద్వారా ఏపీటీడీసీపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఏపీటీడీసీలో అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు జీతాల కింద నెలకు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుంది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.50–60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించే మొత్తం సుమారు ఐదారు నెలల వరకు రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వీలుగా ఉండేది. ఇప్పుడు నిధులు తగ్గడంతో ఏపీటీడీసీపై ఆర్థిక భారం పెరగనుంది. ఇక 40 కొత్త పర్యాటక ప్రాజెక్టుల కోసమని రూ.50 కోట్లు కేటాయించారు. అంటే ఒక్కో ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.కోటికి మించి కేటాయించలేని దుస్థితి. ఇలా పర్యాటక శాఖ, భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్, శిల్పారామం సొసైటీకి కలిపి రూ.230 కోట్లు కేటాయింపులు చేసింది. క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ, కల్చరల్ కమిషన్‌కు కలిపి మరో రూ.230 కోట్ల వరకు కేటాయింపులు ప్రతిపాదించింది. -
58 లక్షల మందికి గ్యాస్ కోత!
సాక్షి, అమరావతి: పేదింటి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామన్న టీడీపీ కూటమి పార్టీల ఎన్నికల హామీ క్రమంగా మసకబారుతోంది. ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసింది. ఫలితంగా.. దశాబ్దాల తరబడి రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉండి కూడా అర్హులైన కుటుంబాలకు పథకం వర్తింపు మిథ్యగానే మిగిలిపోతోంది.2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ పథకానికి నామమాత్రపు నిధులను కేటాయించడమే ఇందుకు కారణం. కేవలం 90.1 లక్షల కుటుంబాలకు మాత్రమే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించింది. లబ్దిదారుల సంఖ్యలో భారీ కోత.. తెల్లరేషన్ కార్డున్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఏపీలోని 1,48,43,671 కార్డుదారులకు గ్యాస్ రాయితీ అందాల్సి ఉంది. ఇందుకోసం రూ.4వేల కోట్లు కావాలి. కానీ, బడ్జెట్లో మాత్రం 90.1 లక్షల మందికి మాత్రమే రాయితీ ఇస్తామని చెప్పి లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత పెట్టింది. ఇలా దాదాపు 58 లక్షల మందికి పైగా అర్హులను నిలువునా బాబు సర్కారు మోసంచేసింది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చేందుకు వీలుగా గత బడ్జెట్లో రూ.895 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన కోటి మంది లబ్దిదారులకు గ్యాస్ రాయితీ దక్కాలి. కానీ, 93 లక్షల మందికి మాత్రమే రాయితీ వర్తించినట్లు.. వీరికి రూ.686 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఈనెల 25న సాక్షాత్తూ సీఎం చంద్రబాబే అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుత గ్యాస్ ధరల ప్రకారం ఒక్కో సిలిండర్‌కు రూ.850 చొప్పున రాయితీ విడుదల చేస్తే సుమారు రూ.790 కోట్లు ఖర్చవుతుంది. కానీ, చంద్రబాబు చెప్పినదానిని బట్టి చూస్తే రూ.100 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. పైగా.. వాస్తవ కేటాయింపులు రూ.895 కోట్లు అయితే చెల్లించింది మాత్రం రూ.686 కోట్లే కావడంతో ఉచిత సిలిండర్లకు భారీ కోత విధించినట్లు స్పష్టమవుతోంది.ఏటా ఇవ్వాల్సింది రూ.4,000 కోట్లుబడ్జెట్లో కేటాయించింది రూ.2,601 కోట్లు తేదీ: మే 28, 2023వేదిక: రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు సభ ‘‘ఏవమ్మా దీపం ఇచ్చాను నేను. నా ఆడబిడ్డల కష్టాలను చూసి ఆలోచించా.. సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మీ ఖర్చులు పెరిగాయి.అందుకే మళ్లీ దీపం వెలిగిస్తా. ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను’– చంద్రబాబు -
ఉచిత బస్‌కు రెడ్ సిగ్నల్
మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంనేనే మా ఆడబిడ్డలను.. వంట ఇంటికి పరిమితం అయితే డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేసి ఆఫీసులకు పంపించా. అవన్నీ గుర్తుపెట్టుకుని మళ్లీ ఆలోచిస్తున్నా. మా ఆడబిడ్డలు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. టీవీల్లో చూసే మా ఆడబిడ్డలూ.. మీరు కూడా చప్పట్లు కొట్టండి. అభినందించండి. ఆశీర్వదించండి. ఇదీ తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చే వరం. –2023 మే 28న మహానాడులో చంద్రబాబుసాక్షి, అమరావతి: తాను బురిడీ బాబునని సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజల్ని బురిడీ కొట్టించడంలో తన ట్రేడ్ మార్క్ మోసాన్ని 20025–26 వార్షిక బడ్జెట్ సాక్షిగా మళ్లీ ప్రదర్శించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి రెడ్ సిగ్నల్ చూపించారు. ఈ పథకం గురించి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ప్రజా రవాణా విభాగం(ఆర్టీసీ)కి అరకొర కేటాయింపులతో సరిపెట్టి... ఈ ఏడాది కూడా మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేసేది లేదని తేల్చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు డబ్బా కొట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విషయాన్ని విస్మరించారు. కర్ణాటక, తెలంగాణలలో ఉచిత బస్ పథకం అమలు తీరుపై అధ్యయనం అంటూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారు. గత ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. అనంతరం దసరాకు వాయిదా వేశారు. ఆ తర్వాత 2025 జనవరి 1 నుంచి అన్నారు... కాదు కాదు... ఈ ఏడాది ఉగాది నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఖాయమన్నారు. తీరా బడ్జెట్లో అసలు ఆ పథకం ప్రస్తావనే లేదు. 2025–26 వార్షిక బడ్జెట్లో ఆర్టీసీకి కేవలం రూ.4,309.85 కోట్లు కేటాయించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాలకే ఏడాదికి రూ.3,600కోట్లు వెచ్చించాలి. మిగిలిన రూ.700 కోట్లు ఆర్టీసీ సాధారణ నిర్వహణ వ్యయానికే సరిపోవు. ఇక మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం అమలు లేనట్టే. చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలంటే ఏడాదికి రూ.3,182 కోట్లు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదించారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే కొత్తగా 2,045 బస్సులు కొనుగోలు చేయడంతోపాటు 11,479మంది అదనపు ఉద్యోగులను నియమించాలని స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకం కోసం రూపాయి కేటాయించలేదు. ఇక కొత్త బస్సుల కొనుగోలు గురించి పట్టించుకోలేదు. తీవ్రంగా నష్టపోతున్న మహిళలు » ఉచిత బస్ ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు.» రాష్ట్రంలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. వారిలో మహిళలు 50 శాతం... అంటే 20 లక్షల మంది ఉంటారని అంచనా.మహిళల టికెట్ల ద్వారా నెలకు రూ.265కోట్లు రాబడి వస్తోంది. » ఉచిత బస్ పథకాన్ని అమలు చేయకపోవడంతో రాష్ట్రంలో మహిళా ప్రయాణికులు నెలకు రూ.265కోట్లు చొప్పున నష్టపోతున్నారు. ఈ విధంగా ఇప్పటివరకు టీడీపీ కూటమి వల్ల గత 9 నెలల్లో మహిళలు రూ.2,385 కోట్లు నష్టపోయారు. » 2025–26 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకాన్ని అమలు చేసే ఉద్దేశం లేదని బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మహిళలు వచ్చే 2025–26 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.3,182 కోట్లు నష్టపోవడం ఖాయమని తేటతెల్లమైంది. చంద్రబాబు మార్కు మోసం అంటే ఇదీ. -
వందనమా.. వంచనా!
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తాం. నీకు పదిహేను వేలు... నీకు పదిహేను వేలు.. నీకు కూడా పదిహేను వేలు ఇస్తాం.’ అని టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళ్లి చెప్పారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 87.42 లక్షల మంది పిల్లలకు రూ.15వేలు ఇచ్చేందుకు ఒక ఏడాదికి రూ.13,113 కోట్లు కావాలి. ‘తల్లికి వందనం కింద ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న పిల్లలు అందరికీ రూ.15వేలు చొప్పున ఇస్తాం.’ అని బాబు గ్యారెంటీ పేరిట మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ లెక్కన చూసినా యూడైస్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మందికి రూ.15వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు కావాలి.‘తల్లికి వందనం పథకాన్ని 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నాం.’ అని 2025ృ26 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి చెప్పారు. అంటే.. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15వేలు ఇస్తామన్న హామీ నుంచి ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుంది అనే వరకు తీసుకొచ్చారు. గత పరిణామాలు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి మాటలు చూస్తే ‘తల్లికి వందనం’ అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి: ‘తల్లికి వందనం’ పథకంపై కూటమి ప్రభుత్వం మరోసారి అంకెల గారడీ చేసింది. ఈ పథకం కింద ఎంతమందికి సాయం అందిస్తారనేది చెప్పకుండా బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించి కనికట్టు చేసేందుకు ప్రయత్నించింది. కొత్తగా ‘ప్రతి విద్యార్థి తల్లికి’ సాయం అంటూ చంద్రబాబు మార్క్ మోసానికి తెరతీసింది. ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. ‘సూపర్ సిక్స్’ హామీలకు వచ్చేసరికి ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రూ.15వేలు ఇస్తామని పేర్కొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ 2024–25లో తల్లికి వందనం పథకానికి రూ.5,387 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ, పైసా ఇవ్వలేదు. ఒక్క విద్యార్థికి సాయం అందించలేదు. శుక్రవారం ప్రవేశపెట్టిన 2025–26 బడ్జెట్లో ఈ పథకానికి రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అందించిన యూడైస్ ప్లస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 87.42 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇవ్వాలంటే రూ.13,113 కోట్లు అవసరం. కేటాయించింది రూ.9,407 కోట్లే. అంటే మొత్తం విద్యార్థుల్లో 24.70 లక్షల మందికి కోత పెట్టక తప్పదు. అందుకే ‘ప్రతి విద్యార్థి తల్లికి’ ఈ పథకం వర్తిస్తుందని కొత్త పల్లవి అందుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖకు తగ్గిన కేటాయింపులు రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్లో పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు (9.86 శాతం) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదే 2024–25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లతో ప్రతిపాదనలు చేయగా, ఇందులో పాఠశాల విద్యకు రూ.29,909.31 (10.15శాతం) కోట్లు కేటాయించారు. అయితే, చేసిన ఖర్చు మాత్రం రూ.28,560.64 కోట్లే. ఈ మొత్తం వేతనాలు, అలవెన్సులకే సరిపోయింది. ప్రస్తుత బడ్జెట్లో రూ.31,805 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించినా, ఆ మొత్తం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులకే సరిపోతాయి. అలాగే, 2024–25 బడ్జెట్లో ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రకటనకే పరిమితమైంది. తాజా బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని కూటమి సర్కారు రెండోసారి ఎంతో గొప్పగా చెప్పుకోవడం గమనార్హం. ‘నాడు–నేడు’ ప్రశ్నార్థకం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘మన బడి నాడు–నేడు’ పథకం రెండో విడతలో రూ.8వేల కోట్ల బడ్జెట్‌తో 23 వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే రూ.4 వేల కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తికావాలంటే మరో రూ.4 వేల కోట్లు అవసరం.కూటమి ప్రభుత్వం ఈ పథకానికి ‘మన బడి–మన భవిష్యత్తు’గా పేరు మార్చి 2024–25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. అలాగే, 2025–26 బడ్జెట్లోనూ రూ.1,000 కోట్లు కేటాయింపునకు ప్రతిపాదించారు. దీంతో మన బడి–మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. -
‘పొదుపు’ మహిళలకు ‘సున్న’మే
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నిర్వీర్యం చేసే దిశగానే అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ ప్రకారం.. ఈ పథకం అమలుకు ఏటా రూ.నాలుగైదు వేల కోట్ల వరకు నిధులు కావాల్సి ఉంటే.. శుక్రవారం నాటి బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించి వారి ఆశలు, ఆకాంక్షలపై నీళ్లు జల్లింది. నిజానికి.. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన ‘పొదుపు’ మహిళలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు అమలైన సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం రాగానే బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు కోటి మందికి పైగా ‘పొదుపు’ మహిళలు తాము 2023 ఏప్రిల్ – 2024 మార్చి మధ్య ఏడాదిపాటు ప్రతినెలా అసలుతో కలిపి చెల్లించిన వడ్డీ డబ్బులను ‘సున్నా వడ్డీ’ పథకం కింద ప్రభుత్వం తిరిగి ఎప్పుడు చెల్లిస్తుందా అని వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. నిజానికి.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగిన ఐదేళ్ల కాలంలో ఏప్రిల్ నెలలోనే చెల్లించే విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, 2023–24 ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 2024 మార్చి మధ్యలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం.. ఎన్నికల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటుకావడం జరిగిపోయింది. ఇప్పుడు మరో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్నా ప్రస్తుత సర్కారు సున్నావడ్డీ పథకం ఊసే ఎత్తడంలేదు. మరోవైపు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ సకాలంలో రుణ వాయిదాలను చెల్లించిన మహిళలకు ఈ ఏడాది మార్చి ఆఖరు తర్వాత సున్నా వడ్డీ పథకం కింద మరో రూ.నాలుగైదు వేల కోట్లు వారికి చెల్లించాల్సి ఉంది. కానీ, శుక్రవారం నాటి బడ్జెట్లో కేవలం రూ.100 కోట్లే కేటాయించడం చూస్తుంటే ‘పొదుపు’ మహిళలకు చంద్రబాబు సర్కారు ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. 2014–19 మధ్య కూడా ఇంతే..ఇక రాష్ట్ర విభజనకు ముందు నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని 2014–19లో కూడా నాటి సీఎం చంద్రబాబు పూర్తిగా నీరుగార్చారు. అప్పట్లో ఐదేళ్లకుగాను కేవలం రెండేళ్ల నాలుగు నెలల కాలానికి సంబంధించిన సున్నావడ్డీ డబ్బులను మాత్రమే చెల్లించారు. 2016 ఆగస్టు తర్వాత కాలానికి మొండిచెయ్యి చూపించారు. -
విద్యుత్ వెలుగులు లేవు!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. ఓటాన్ బడ్జెట్లోనే ఇంధన శాఖకు అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్లోనూ మొండి చేయి చూపించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇంధన రంగానికి, రాయితీలు, సబ్సిడీల కోసం బడ్జెట్లో కేవలం రూ.13,600 కోట్లే కేటాయించింది. కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా ఇవ్వలేకపోయింది. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్లకు పైగా నష్టాల్లో ఉందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ అప్పులను తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా సాయంగా ప్రకటించలేదు. పైగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిoదని.. అందుకే ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అనవసర అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల వల్లే.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయనే వాస్తవాన్ని మంత్రి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లను ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ఇప్పటివరకూ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో, ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మంత్రి చెప్పలేకపోయారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇంధన రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలకు బడ్జెట్లో అస్సలు స్థానమే లభించలేదు. రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ అమలు గురించి ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వచ్చే సబ్సిడీలతోనే సోలార్ రూఫ్ టాప్, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతోంది. -
మౌలిక సదుపాయాలు ‘కల్పనే’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వ డొల్లతనం 2025–26 బడ్జెట్ సాక్షిగా నిరూపితమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు అమృత్ 2.0, స్వచ్ఛ భారత్.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను మాత్రమే మౌలిక వసతుల కల్పనకు కేటాయించింది. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అమరావతి అంటూ సీఎం చంద్రబాబు నుంచి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వరకు చెబుతున్న మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నది మరోసారి బహిర్గతమైంది. రూ.6 వేల కోట్ల విదేశీ రుణంతో అమరావతిని అభివృద్ధి చేస్తామని బడ్జెట్లో పేర్కొనడమే అందుకు నిదర్శనం.భూసమీకరణ కింద రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించేందుకు రూ.297.87 కోట్లు కేటాయించింది. » విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. విజయవాడకు కేవలం రూ.115.11 కోట్లు కేటాయించింది. » నెల్లూరు కార్పొరేషన్, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ), ఏపీ టిడ్కో (ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) రుణాలు చెల్లించేందుకు రూ.1,945 కోట్లు కేటాయించడం గమనార్హం. » పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు ప్రస్తుత బడెŠజ్‌ట్‌లో ప్రభుత్వం రూ.13,862.29 కోట్లు కేటాయించింది. ఇందులో అమరావతి అభివృద్ధికి తెచ్చే విదేశీ రుణం రూ.6 వేల కోట్లు.. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.2,233.41 కోట్లు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చింది రూ.5,628.88 కోట్లే అన్నది స్పష్టమవుతోంది. ఇందులో అధిక శాతం ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణకే వ్యయం చేయాల్సి ఉంటుంది. అమరావతి సహా పట్టణాలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన (కేపిటల్ వ్యయం) కోసం రూ.7049.54 కోట్లు ఖర్చు చేస్తుండడం గమనార్హం. రుణాలతోనే రాజధాని నిర్మాణం అమరావతి నిర్మాణానికి కావాల్సిన నిధులను తానే సమకూర్చుకుంటుందని.. అందుకే అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటల్ అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి తెచ్చిన రుణాల చెల్లింపునకు ఈ బడ్జెట్లో రూ.836 కోట్లు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు కింద ఇచ్చేందుకు రూ.297.82 కోట్లు కేటాయించారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్ల విదేశీ రుణాన్ని కేటాయించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే రాజధానికే రూ.7,133.82 కోట్లు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులే దిక్కయ్యాయి. అమృత్ 2.0 కింద కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర వాటా జత చేసి రూ.751.72 కోట్లతో మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల, వరద కాలువలు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. స్వచ్ఛభారత్ కింద వచ్చే 1031.25 కోట్లతో నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని బడ్జెట్లో పేర్కొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ.450.44 కోట్లు వస్తాయని అంచనా వేసిన ప్రభుత్వం.. వాటిని మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించింది. నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా వివిధ అభివృద్ధి పనులు చేపట్టినందుకు తెచ్చిన రుణాన్ని చెల్లించేందుకు రూ.150.87 కోట్లు, ఏపీ టిడ్కో రుణాలు చెల్లింపునకు రూ.1109 కోట్లు కేటాయించింది. -
ప్రాజెక్టుల నిర్మాణం.. ‘సాగు’దీతే
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని పండుగ చేసే.. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బడ్జెట్ సాక్షిగా మరోసారి బట్టబయలైంది. ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో చేపడతామని చెప్పిన సీఎం చంద్రబాబు.. కనీసం వాటినైనా గడువులోగా పూర్తి చేయడానికి సరిపడా నిధులను బడ్జెట్లో ఇవ్వకపోవడం గమనార్హం. 2025–26 బడ్జెట్లో జలవనరుల శాఖకు రూ.18,019.66 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.17,142.06 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.877.60 కోట్లు) కేటాయించారు. ఇందులో రూ.15,576 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులకు (కేపిటల్ వ్యయం) ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన రూ.5,756.82 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. కాగా, 2024–25 బడ్జెట్లో ప్రాజెక్టులకు రూ.16,705.32 కోట్లు (భారీ నీటి పారుదలకు రూ.15,483.35 కోట్లు, చిన్న నీటి పారుదలకు రూ.1,221.97 కోట్లు) కేటాయించారు. అయితే, సవరించిన బడ్జెట్లో రూ.5,906.76 కోట్లు కోత పెట్టి రూ.10,798.56 కోట్లు కేటాయించినట్లు ప్రస్తుత బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే.. గత బడ్జెట్ నిధుల్లో 35.36 శాతం కోత విధించినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి చూస్తే.. ప్రస్తుతం కేటాయించిన నిధులను కూడా ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం అనుమానమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ప్రణాళికా రాహిత్యానికి పరాకాష్ట..» ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం.. తొలి దశలో పోలవరం, హంద్రీ–నీవా, వెలిగొండ, చింతలపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం, గోదా వరి–పెన్నా తొలి దశను చేపడతామంది. చింతలపూడి ఎత్తిపోతల, గోదావరి–పెన్నా తొలి దశను 2026, జూన్ నాటికి, పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌కు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇందులో గత ప్రభుత్వమే పోలవరాన్ని కొలిక్కితెచ్చింది. వెలిగొండ తొలి దశ, హంద్రీ–నీవా, వంశధార స్టేజ్–2 ఫేజ్–2, వంశధార–నాగావళి అనుసంధానం దాదాపుగా పూర్తి చేసింది.» రూ.1,400 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తే.. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్‌కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒకటో టన్నెల్ ద్వారా కృష్ణా జలాలను గత సెప్టెంబరు–అక్టోబరు నాటికే తరలించే అవకాశం ఉండేది. ఈ ప్రాజెక్టు పనులకు గత బడ్జెట్లో 393.49 కోట్లను కేటాయించిన సర్కార్.. అందులో కోత వేసి రూ.300.52 కోట్లతో సరిపెట్టింది. కనీసం ఆ నిధులను కూడా ఖర్చు చేయలేదు. తాజాగా 309.13 కోట్లు కేటాయించింది. తొలి దశ పూర్తి కావాలంటే రూ.1,458 కోట్లు, రెండో దశకు రూ.2,180 కోట్లు అవసరం. దీన్నిబట్టి చూస్తే ఆ ప్రాజెక్టు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం లేదు.» ఒడిశాతో వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. గొట్టా బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి వంశధార స్టేజ్–2లో అంతర్భాగమైన హిర మండలం రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోసేలా వంశధార ఎత్తిపోతలను గత ప్రభుత్వం చేపట్టింది. ఇది పూర్తయితే వంశధార ఆయకట్టు రైతులకు పూర్తి ఫలాలను అందించవచ్చు. వంశధార–నాగావళి అనుసంధానం పనులను దాదాపు పూర్తి చేసింది. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులను సకాలంలో విడుదల చేసి ఖర్చు చేస్తే.. జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉంది.» చింతలపూడి ఎత్తిపోతల పూర్తికి రూ.2043.38 కోట్లు అవసరం. 2026 జూన్ నాటికి నీళ్లందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గత బడ్జెట్లో ఈ ఎత్తిపోతలకు రూ.150 కోట్లు చూపినా చివరకు రూ.3.08 కోట్లతో సరిపెట్టారు. ఇప్పుడు కేవలం రూ.30 కోట్లు కేటాయించింది. ఆ ఎత్తిపోతల ఎలా పూర్తవుతుందన్నది సర్కారుకే తెలియాలి.» 2026 జూన్ టార్గెట్‌గా పెట్టుకున్న గోదావరి–పెన్నా అనుసంధానం తొలి దశ పూర్తి కావాలంటే రూ.5,372.31 కోట్లు అవసరం. గత బడ్జెట్లో పైసా కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం రూ.200 కోట్లు కేటాయించింది. వీటితో ఎలా పూర్తవుతుందన్నది ప్రభుత్వమే చెప్పాలి.» హంద్రీ–నీవా సుజల స్రవంతిలో డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి 2026 జూన్‌కు నీళ్లందిస్తామని గొప్పలు చెప్పింది. కానీ.. హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 6,300 క్యూసెక్కులకు పెంచుతూ గత ప్రభుత్వం చేపట్టిన పనులను.. 3,850 క్యూసెక్కులకు కుదించింది. రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూర్ బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నా వెనక్కుతగ్గకుండా పూర్తి చేసేందుకే మొగ్గుచూపింది. డిస్ట్రిబ్యూటరీల పనులకు నిధులు కేటాయించని నేపథ్యంలో ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమే.» ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టిన ప్రాజెక్టులకే నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మిగతావాటికి కేటాయింపు, విడుదల ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.» కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందించడానికి వీలుగా కాలువల మరమ్మతులు, డ్రెయిన్లలో పూడికతీత పనులకు అవసరమైన మేరకు నిధులు ఇవ్వకపోవడం గమనార్హం.» పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసేలా కాకుండా.. 41.15 మీటర్ల ఎత్తు వరకే 119.40 టీఎంసీలు నిల్వ చేసేలా 2026 జూన్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.12,157 కోట్లు ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు కేంద్రం గత, ప్రస్తుత బడ్జెట్లలో నిధులిచ్చింది. కానీ.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తే పూర్తి ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యం కేవలం 1.98 లక్షల ఎకరాలకే నీళ్లందించే అవకాశం ఉంటుంది. -
భృతి.. భ్రాంతి
నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వారిని దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాల సృష్టి.. నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టే చంద్రబాబు.. పీఠం ఎక్కిన తర్వాత హామీల తెప్ప తగలేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భృతి అమలు చేస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.కానీ, చంద్రబాబు అండ్ కో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2024–25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో తీవ్ర జాప్యం చేశారు. తాజా బడ్జెట్లోనూ నిరుద్యోగుల ఊసే విస్మరించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కూటమి పాలనలో రెండేళ్లలో నిరుద్యోగులు రూ.1,15,200కోట్లు భృతిని నష్టపోతున్నారు. – సాక్షి, అమరావతి ఒక్క నోటిఫికేషన్ లేదు.. రాష్ట్రంలో నిరుద్యోగులు చంద్రబాబు ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత మెయిన్స్ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్రూప్–1 మెయిన్స్‌ను ఈ ఏడాది మేకి వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులు కలిపి ఇస్తామని చెప్పి రద్దు చేశారు. మళ్లీ ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు దిక్కులేదు. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క నోటిఫికేషన్‌ను సరిగ్గా చేపట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం నిరుద్యోగులకు కనీసం ఆర్థిక సాయం కింద నెలకు రూ.3 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అవుట్ సోర్సింగ్, డైలీ వేజస్ వర్కర్ల ఉద్యోగాలను తొలగిస్తోంది. ఇది చంద్రబాబుకు కొత్తేమీ కాదు..చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమీ కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ చెప్పారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, దీనికి ఈ–కెవైసీ లింక్ పెట్టారు. తుదకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చుకున్నారు.ఏటా నిరుద్యోగులకు ఇవ్వాల్సింది రూ.57,600 కోట్లుబడ్జెట్లో కేటాయించింది 0 -
‘ఫీజు’లో కోత.. విద్యార్థులకు వాత!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మరోసారి రుజువైంది. నూతన విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు. ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్–ఎంటీఎఫ్)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఆర్టీఎఫ్) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.1,960 కోట్లు మాత్రమే కనిపిస్తోంది. ఇక హాస్టల్ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్– ఎంటీఎఫ్)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివిధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ల కేటాయింపులను చూపిస్తుండటం గమనార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్‌లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.పెండింగ్ బకాయిలఊసే లేదుగత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి. కూటమి ప్రభుత్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ఏటా విద్యార్థులకుఇవ్వాల్సింది రూ.2,800 కోట్లుబడ్జెట్లో కేటాయించింది రూ.1,960 కోట్లు -
పదిలక్షల పింఛన్ల కోత!
పేదవాడి పింఛనుపై కూటమి సర్కారు కత్తికట్టింది. ఇప్పటికే కోత కత్తెర పట్టుకుని తిరుగుతున్న ప్రభుత్వం.. బడ్జెట్లో దానికి మరింత పదును పెట్టింది..! చంద్రబాబు సర్కారు కేటాయింపుల ప్రకారం చూస్తే.. ఇది స్పష్టంగా తేలిపోతోంది. లక్ష రెండు లక్షలు కాదు.. ప్రతిపాదిత గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్ పెట్టే ప్రమాదం నెలకుంది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు. వీరికి వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున పంపిణీ చేయాలి. అంటే ఏడాదికి రూ.32,634 కోట్లు. కానీ, బడ్జెట్లో పింఛన్లకు రూ.27,518 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5,116 కోట్లు తక్కువ కావడం గమనార్హం. – సాక్షి, అమరావతిఇప్పటికే కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్8 నెలల క్రితం వరకు.. ఐదేళ్లు హాయిగా గుండెల మీద చేయి వేసుకొని మరీ ప్రతి నెల ఠంఛనుగా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు? ఎలా? తమ పింఛనుకు ఎసరు పెడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నిరుడు జూన్‌లో కూటమి సర్కారు కొలువుదీరాక పింఛన్ల కోతకు సిద్ధపడింది. ఇందుకుతగ్గట్లు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం సాగిస్తోంది. ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్నవారు కూడా అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్ పేరుతో రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తోంది. 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలింపజేస్తోంది.50 ఏళ్లకే పింఛన్ అంటూ నమ్మించి..ప్రస్తుతం కనీసం 60 ఏళ్లున్న దాటినవారికే పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు.. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయలేదు. ఇంకోవైపు.. ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఇస్తున్న పింఛన్లే ఫిబ్రవరి 1 నాటికి ఏకంగా 1,89,957 తగ్గాయి.గత ఏడాది మే నెలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛను విడుదల చేయగా, కూటమి సర్కారులో ఫిబ్రవరి 1న 63,53,907 మందికే ఇచ్చింది. మరోవైపు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుంచే రాష్ట్రంలో పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ మేరకు ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. -
పన్ను పోటు!
సాక్షి, అమరావతి: భారీగా మార్కెట్ అప్పులు, కేంద్రం నుంచి రుణాలతో ప్రజలపై పెనుభారం మోపడమే లక్ష్యంగా 2025–26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం శాసనసభకు సమర్పించారు. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించకపోగా భారీగా అప్పులు, పన్నులు, పన్నేతర వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ప్రజారుణం కింద ఏకంగా రూ.1.03 లక్షల కోట్లు అప్పులు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. పన్నుల ఆదాయం రూపంలో వచ్చే ఆర్థిక ఏడాది అదనంగా రూ.15 వేల కోట్లు వస్తాయని, పన్నేతర ఆదాయం ద్వారా అదనంగా రూ.12 వేల కోట్లు ఆదాయం వస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. 2024–25 రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.94,966 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో సొంత పన్నుల ఆదాయం రూ.1,09,006 కోట్లుగా అంచనా వేశారు. పన్నేతర ఆదాయం 2024–25లో రూ.7,018 కోట్లుగా సవరించిన అంచనాల్లో పేర్కొనగా 2025–26లో ఏకంగా రూ.19,119 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే పన్నులు, పన్నేతర రూపంలో ప్రజల జేబులను ఖాళీ చేయడమే లక్ష్యంగా బడ్జెట్ అంచనాలున్నట్లు వెల్లడవుతోంది.రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం కింద రూ.81,956.50 కోట్ల అప్పులు, కేంద్రం నుంచి రూ.21,700 కోట్ల అప్పు చేయనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేశారు. అంటే మొత్తం ప్రజా రుణం కింద 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,03,656.50 కోట్లు అప్పు చేయనున్నట్లు పేర్కొన్నారు. సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు బడ్జెట్లో ఆ ఊసే లేకుండా చేశారు.ప్రభుత్వ రంగంలో పోర్టులు, వైద్య కళాశాలల నిర్మాణం గురించి అసలు ప్రస్తావనే చేయలేదు. పైగా భారీ ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు బడా సంస్థలకు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కోసం బడ్జెట్లో ఏకంగా రూ.2000 కోట్లు కేటాయించడం గమనార్హం. మొత్తం మీద పన్నుల రూపంలో ఇటు భారీ ఆదాయం, అటు భారీ అప్పులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.3.22 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2.51 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.40,635 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 1.82 శాతమని వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా ఉంటుందని, ఇది జీఎస్డీపీలో 4.38 శాతమని చెప్పారు. మద్యం ద్వారా 2025–26లో రూ.27,097 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.13,150 కోట్లు ఆదాయం రానుందని అంచనా వేశారు. -
కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువగా కనిపిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ ఇన్నాళ్లూ సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందన్నారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే.. » బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం అంటూ మరో పది సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటై పది నెలలు అవుతోంది. ఇకనైనా ప్రజలకు ఎన్నికల హామీల అమలు గురించి చెప్పాల్సిన అవసరం లేదా? » సూపర్ సిక్స్ హామీలపై ప్రతి ఇంటికి తిరిగి పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు. 2019–24 వరకు నాటి సీఎం వైఎస్ జగన్ క్యాలెండర్ ప్రకారం మేనిఫేస్టోలో చెప్పినది ప్రతీదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హామీలను అమలు చేస్తుందని ఆశతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. గతంలో అనేకసార్లు చంద్రబాబు వల్ల మోసపోయినా కూడా తిరిగి వారు చెప్పిన ఆకర్షణీయమైన హామీలతో మోసపోయి కూటమికి అధికారం అప్పగించారు. సూపర్ సిక్స్ హామీల అమలేదీ?సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 లక్షల కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ సృష్టిస్తున్న సంపదను ఎందుకు కేటాయించడం లేదు? 2014–19 లో స్థూల ఉత్పత్తి 13.5 పెరిగితే, 2019–24 లో 10.3 పెరిగిందని పోలిక చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హాయంలో కోవిడ్ తో మొత్తం ఎకానమీ దెబ్బతిన్న సమయాన్ని కూడా పోలుస్తారా?అప్పులపై తప్పుడు లెక్కలు» అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు రూ.3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్లకు, ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజెంటేషన్‌లో వెల్లడించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు?» కార్పొరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు అన్ని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ చెప్పిన దాని ప్రకారం రూ.1,54,797 కోట్లు అని స్పష్టంగా ఉంది. అంటే కాగ్ చెప్పినది సరైనదా? లేక మీరు చెబుతున్న లెక్కలు సరైనవా? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అంశాలపై ఏది చెప్పినా ప్రతి దానికీ ఆధారాన్ని చూపించేవారు, కానీ కూటమి మాత్రం తమ లెక్కలకు ఎక్కడా ఆధారాలను చూపించడం లేదు. సివిల్ సప్లయిస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేకపోవడం వల్ల, పేమెంట్ చేయడానికి సివిల్ సప్లయిస్ అప్పులు చేసింది. అంటే ఈ రూ.36,000 కోట్లు కూడా కాగ్ చెప్పిన రూ. 1,54,797 కోట్ల అప్పుల్లో కలిసే ఉంది. కానీ దానిని కూటమి ప్రభుత్వం విడిగా చూపి ఎక్కువ అప్పులు ఉన్నట్లుగా చిత్రీకరించింది. డిస్కం అప్పుల గురించి రూ.34,267 కోట్లు ఉన్నట్లు చూపించారు. సడ్సీటీ కింద రైతులకు, ఎస్సీ, ఎస్టీ లకు గృహ వినియోగ సబ్సిడీని ప్రభుత్వం డిస్కంలకు కట్టకపోవడం వల్ల డిస్కంలు అప్పులు చేశాయి. ఇవి కూడా కాగ్ చెప్పిన మొత్తంలో కలిసే ఉన్నాయి. దానిని కూడా విడిగా చూపి ఎక్కువ అప్పులు చేశామని ప్రచారం చేశారు. » అలాగే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన వాటిల్లో అప్ లోడ్ అయినవి 86,000 కోట్లు వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం అప్పులు చూస్తే 7,83,773 కోట్లుగా లెక్క తేలుతున్నాయి. వీటిల్లో 3,90,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైయస్ఆర్ సీపీ పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. మా హయాంలో జరిగిన అప్పు రూ.3,33,513 కోట్లు మాత్రమే. కానీ కూటమి పార్టీలు మాపై తప్పుడు ప్రచారం చేశాయి. శ్రీలంక, కాంబోడియా అంటూ దుష్ప్రచారం చేశాయి.సంపద సృష్టించడమంటే వృద్ధి రేటు తగ్గడమా?» సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైఎస్సార్సీపీకి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటీ? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది. 2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైఎస్సార్సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి? » నీతి అయోగ్ ప్రకారం 2015–19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020–23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచడం వల్ల రాబడి పెరగకపోగా ఒకదశలో నిలిచిపోతుంది. ఫిబ్రవరి 1, 2025 నాటికి 16,997 గ్రామాలు, 9వేల వార్డుల్లో మార్కెట్ విలువను పెంచాలని ప్రతిపాదించారు. కూటమి పాలనలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఆదాయం పడిపోవడంతో దానిని పెంచుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారుతాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1,470 నుంచి 1,500 ఉంది. ఎంఎస్పీ రూ. 2,300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు. పత్తి క్వింటా గత ఏడాది మా హయాంలో రూ.10 వేలు ఉంటే, ఇప్పుడు రూ.5000కి అమ్మతున్నారు. మినుములు గత ఏడాది రూ.10 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6 వేలు, కంది క్వింటాలు గత ఏడాది రూ.9–10వేలు అమ్మితే ఈ ఏడాది రూ.5500 లకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద ఎక్కడా రైతులను ఆదుకోవడం లేదు. రూ.6300 కోట్లు అన్నదాతా సుఖీభవ కోసం బడ్జెట్ లో రాశారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుకునే అని మాట మార్చారు. దీని ప్రకారం చూసినా 45 లక్షల మంది రైతులకే అందుతుంది. మొత్తం 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇరవై వేలు రాష్ట్రప్రభుత్వమే ఇస్తే కనీసం 30 లక్షల మందికి కూడా ఈ కేటాయింపులు సరిపోవు. గత ఏడాదికే 55 లక్షల మంది రైతులు రైతుభరోసాను అందుకున్నారు. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.6300 కోట్లు అని చూపిస్తే, అగ్రికల్చర్ బడ్జెట్ లో వ్యవసాయ మంత్రి అన్నదాత సుఖీభవకు రూ.9400 కోట్లు చూపించారు. ఇందులో ఏది సరైనదో, ఎందుకు వ్యత్యాసం చూపించారో తెలియదు. పథకాల కేటాయింపుల్లోనూ చిత్తశుద్ధి లేదు» సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3 వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు. 2025–26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? » తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్‌లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 కోట్లు మాత్రమే. దీనిప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది. అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు. కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్లో చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా? -
హామీలు రద్దు.. మోసాల పద్దు!
సాక్షి, అమరావతి: ‘‘బాబు ష్యూరిటీ అంటే... చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ!’’ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ... లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్ సిక్స్‌కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్‌ను సమర్పించింది. సూపర్ సిక్స్ సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు.. ఇలా అన్ని వర్గాలను దగా చేసింది. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి ఆ ఊసే లేకుండా చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడంతో ఏడాదిగా యువత నెలకు రూ.3 వేల చొప్పున నష్టపోతోంది. 1.60 కోట్ల మందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల ఆర్థిక సాయాన్ని మరోసారి ఎగ్గొట్టడంతో మహిళలు ఏడాదికి సుమారు రూ.28,800 కోట్లు కోల్పోతున్నారు! ఇక ‘తల్లికి వందనం’ అంటూనే బడ్జెట్లో రూ.3 వేల కోట్లకుపైగా కోత పెట్టారు! అన్నదాతా సుఖీభవ అమలుకు కావాల్సింది రూ.10,717 కోట్లైతే బడ్జెట్లో ఇచ్చింది కేవలం రూ.6,300 కోట్లే! ఈ లెక్కన 22 లక్షల మందికిపైగా రైతులు రూ.4,417 కోట్ల పెట్టుబడి సాయానికి దూరం కానున్నారు. గతేడాది మొండి చెయ్యి చూపడంతో రైతన్నలు ఇప్పటికే రూ.పది వేల కోట్లకుపైగా నష్టపోయారు. ఇక ఇప్పటికే దాదాపు రెండు లక్షల పెన్షన్లను తగ్గించగా తాజా బడ్జెట్ కేటాయింపుల్లో రూ.5 వేల కోట్లకుపైగా కోత విధించటాన్ని బట్టి మరిన్ని పింఛన్లను ఎగరగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. వెరసి.. ప్రణాళిక – ఆలోచనల సమ్మిళతంగా ఉండాల్సిన రాష్ట్ర బడ్జెట్.. అంతులేని మోసాలు.. గాడి తప్పిన అంకెల సమాహారంగా మిగిలిపోయింది. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా వ్యవసాయ బడ్జెట్‌ను శాసనసభలో మంత్రులు అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి పి.నారాయణ ప్రవేశపెట్టారు.అంకెల్లో ఆడంబరంగా..అప్పులతో ముంచెత్తుతూ.. అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్ పరిమాణం రూ.3.22 లక్షల కోట్లు! కానీ ఇంత భారీ బడ్జెట్లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4.57 లక్షల కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు. ఆకారం పెంచినా.. నేల విడిచి సాము చేసినా.. ఈ బడ్జెట్ చంద్రబాబు సర్కారు మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది! ఎన్నికల హామీల సంగతి అటుంచితే.. సీఎం చంద్రబాబు రోజూ జబ్బలు చరుచుకునే ‘సంపద సృష్టి’ ఆనవాళ్లు బూతద్దంతో గాలించినా బడ్జెట్లో కానరాలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో విలువైన సంపద సృష్టిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన పోర్టులు, కొత్త మెడికల్ కాలేజీల గురించి ఈ బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు. ఇచ్చాపురం నుంచి హిందూపురం దాకా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ ఇంటి ముంగిటికే గత ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక వ్యవస్థలు, సంక్షేమ పథకాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేయడంతో ఇవాళ పల్లెలు కళ తప్పి కనిపిస్తున్నాయి. వలంటీర్ల వేతనాలు రూ.ఐదు వేలు కాదు.. ఏకంగా రూ.పది వేలకు పెంచుతామంటూ నమ్మబలికి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేశారు!హామీలు గాలికి..సూపర్ సిక్స్‌లో తొలి హామీగా పేర్కొన్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి గురించి బడ్జెట్లో అసలు ప్రస్తావనే లేకుండా చేశారు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా కేటాయించలేదు. మహిళల ఉచిత బస్సు ఊసే లేదు. అన్నదాతా సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు కోతలు విధించి అరకొర కేటాయింపులను చూపించినా ఎప్పటి నుంచి అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. కాగితాల్లో కేటాయింపులు చేయడం.. అమలు చేయకపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే! గత బడ్జెట్లోనూ అన్నదాతా సుఖీభవకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు చేసినట్లు చూపించి చివరకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం తెలిసిందే. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇచ్చేందుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పకుండా తప్పించుకునే యత్నం చేశారు.పేదల ఇళ్లకు పాతర..పేదల ఇళ్ల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం పాతరేసింది. వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో ఏకంగా రూ.6,866 కోట్లు కేటాయించి వ్యయం చేయగా.. కూటమి సర్కారు 2024–25 పేదల రూ.4,012 కోట్లు కేటాయించి కేవలం రూ.1,611 కోట్లే వ్యయం చేసినట్లు సవరించిన అంచనాల్లో పేర్కొంది. ఇక 2025–26లో పేదల ఇళ్ల నిర్మాణాలకు రూ.6,317 కోట్లు ప్రతిపాదించింది. -
‘మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దం’
తాడేపల్లి : ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కాకాని గోవర్థన్ ధ్వజమెత్తారు. గతం మోసం, వర్తమానం మోసం.. భవిష్యత్ కూడా మోసమేనని చంద్రబాబు మళ్లీ రుజువు చేశారని కాకాని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన.. ‘రైతులను మోసం చేసిన దగా బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర రైతులకు బ్లాక్ డే . బాబు ష్యూరిటీకి నో గ్యారెంటీ అని రైతులు చర్చించుకుంటున్నారు. చట్టసభల సాక్షిగా తన నిజాయితీ నిరూపించుకోలేకపోయారు. జగన్‌ని దూషిస్తూ, చంద్రబాబును కీర్తిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చేలా కనపడలేదు. లోకేష్ కు భజన చేయటమే ఆర్థికమంత్రి పనిగా పెట్టుకున్నారు. మోసం, వంచనకు ఈ బడ్జెట్ నిలువుటద్దంగా మారింది. అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని దండగ చేశాడు అనే పేరును మళ్ళీ గుర్తు చేశారు. చంద్రబాబు రెండు నాలుకలతో కాదు రెండు వందల నాలుకలతో అబద్దాలు చెప్పారు. రైతులకు రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి ఇస్తానని మాట మార్చారు. ధరల స్థిరీకరణ నిధి కింద కేవలం రూ.300 కోట్లు ఇస్తానంటున్నారు. ఆ అరకొర నిధులు అసలు ఏ మూలకు వస్తాయి? , చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతు అన్యాయానికి గురవుతారు. జగన్ మిర్చి యార్డుకు వెళ్తే తప్ప దానిపై చంద్రబాబు స్పందించలేదు. ఇంతకంటే సిగ్గుచేటు, దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఆ వ్యవస్థ లేకుండా అసలు రైతులకు ఎలా మేలు చేస్తారు? , స్మార్ట్ అగ్రికల్చరల్ అంటూ కొత్తకొత్త పదాలు వాడటం తప్ప ఇంకేమీ లేదు. వ్యవసాయ మంత్రి బరువుకు తగ్గట్టుగానైనా రైతుల కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తారనుకున్నాం. జగన్ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే చంద్రబాబు కేవలం రూ. 3 వందల కోట్లే కేటాయించారు. జగన్ ఉచితంగా బోర్లు వేయించారు. ఉచిత విద్యుత్ ని ఎగ్గొట్టటానికే సోలార్ విద్యుత్ ని తెరమీదకు తెచ్చారు. అంకెల గారడీ, అభూత కల్పనల బడ్జెట్ ఇది. ఇది రైతులను ముంచే ప్రభుత్వం అని తేలి పోయింది. ఎక్కడా మిషన్, మీనింగ్ లేదు, మాయాజాలం మాత్రమే ఉంది. ప్రాజెక్టులకు కూడా ఆశాజనకంగా నిధుల కేటాయింపు జరగలేదు’ అని కాకాని స్పష్టం చేశారు. -
పవన్‌ని ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన కేఏ పాల్
-
Buggana: బడ్జెట్ కోసమా..? లేక గత ప్రభుత్వం కోసం అసెంబ్లీ పెట్టారా..?
-
Botsa Satyanarayana: ఏపీ బడ్జెట్లో సూపర్ సిక్స్ డకౌట్
-
భారీగా అప్పుల అంచనాతో ఏపీ బడ్జెట్
-
‘కూటమి’ వంచన.. బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ రియాక్షన్
సాక్షి, అమరావతి: బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగింది. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్‌ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు. షూరిటీ కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.‘‘అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్‌పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబుచంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణిఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మహాశక్తికి కేటాయింపులే లేవు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలి.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారు. రైతుల్ని మోసం చేశారు. కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారు..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్‌ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్‌ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్‌పై పెడితే బాగుండేది. బడ్జెట్‌పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తాంబడ్జెట్పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్ జగన్ ఐఆర్ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్‌పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్ మండిపడ్డారు. -
బడ్జెట్‌తో చంద్రబాబు దగా ఇలా..
సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.దీపం పథకానికి భారీగా కోత దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు టోకరాడ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్లో చూపించలేకపోయింది.అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతేఅన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్‌ఉచిత బస్సు హామీకి బడ్జెట్లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు.. -
రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వంపబ్లిక్ డెట్ 79,227 కోట్లు అంచనా గా చూపించిన ప్రభుత్వంరెవెన్యూ వ్యయం 2,51, 162 కోట్లుపెట్టుబడి వ్యయం 40,636 కోట్లు అంచనాతో బడ్జెట్‘తల్లికి వందనం’కి నిధులు కోతబడ్జెట్ లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం కి కేటాయింపు12 వేల కోట్లకు పైగా తల్లికి వందనం కి అవసరంగత ఏడాది ‘తల్లికి వందనం’ పథకానికి నిధులు కేటాయించి ఎగనామం పెట్టిన ప్రభుత్వందీపం పథకానికి భారీగా కోతకోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదింపుబడ్జెట్ లో 4 వేల కోట్లకు గాను 2601 కోట్లు మాత్రమే కేటాయింపుఅన్నదాత సుఖీభవకు భారీ కోతఅన్నదాత సుఖీభవ కి కేవలం 6300 కోట్లు కేటాయింపురైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ10 వేల 400 కోట్లకు 6300 కోట్లే కేటాయింపు👉 మంత్రి పయ్యావుల బడ్జెట్ ప్రసంగంరూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్వ్యవసాయ రంగానికి రూ.48 వేల కోట్లుబీసీ క్షేమానికి రూ.23, 260 కోట్లుపాఠశాల విద్యకు 31, 806 కోట్లుఎస్సీల సంక్షేమానికి రూ. 20,281 కోట్లువైద్య ఆరోగ్య శాఖకు రూ. 19,265 కోట్లుపంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 18,848 కోట్లుపురపాలక శాఖకు రూ. 13,862 కోట్లు కేటాయింపుసాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లుజలవనరుల శాఖకు రూ.18,020 కోట్లుఇంధన శాఖకు రూ.13,600 కోట్లుపౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు రాష్ట్ర పునర్మిర్మాణం సవాలుతో కూడుకుంది1995నాటి పరిస్థితులే నేడు నెలకొన్నాయికూటమి అధికారంలోకి వచ్చాక 74 పథకాలను ప్రారంభించాంరాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందిఅప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలింది 2025-26కుగానూ రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ అంచనామూలధన వ్యయం రూ.40, 635 కోట్లుమూలధన వ్యయం అంచనా రూ.40, 635 కోట్లురెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుద్రవ్యలోటు రూ.79,926 కోట్లురెవెన్యూ వ్యయం అంచనా రూ.2,51,162 కోట్లు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర 👉రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ 2025-26👉కూటమి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి తొలి బడ్జెట్👉శాసనసభలో ఏపీ బడ్జెట్ 2025 ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉 ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ బడ్జెట్ 2025కు కేబినెట్ ఆమోదం👉అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్లో మంత్రివర్గం సమావేశం👉 హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రులు👉 సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. బడ్జెట్.. ఎక్కడ.. ఎవరు?👉10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్👉శాసనసభలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు👉 శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 👉శాసన మండలిలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు.వాట్ ఎబౌట్ సూపర్ సిక్స్?👉ఈ బడ్జెట్ లోనేనా సూపర్ సిక్స్ కి నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత..👉ఇప్పటివరకు సూపర్ సిక్స్ ని అమలు చేయని కూటమి ప్రభుత్వం👉తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు👉మొదటి ఏడాది సూపర్ సిక్స్ కి మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.కేటాయింపులైతే చేసేద్దాం!👉కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 👉ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. 👉 కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 👉2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు. రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు. -
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేతరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిటీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్‌ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది. దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీరాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. – ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్విపక్షం వాకౌట్చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు. -
బడ్జెట్ లో ఏపీకి ఊరట దక్కనుందా?
-
AP Assembly: వాడీవేడిగా మండలి సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఊహించినట్లుగానే.. ఏకపక్షంగా సాగుతోంది. హామీలను ఎగవేసే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. -
సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు… హామీలు ఎగ్గొట్టే ప్రయత్నాలు
-
చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు
-
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారు
-
కొడాలి నానిపై కేసు.. వైఎస్ జగన్ రియాక్షన్
-
జీతాల కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కెతున్నారు
-
నాతో పాటు నా తల్లి, చెల్లి మీద అసభ్యకర పోస్టులు పెట్టించారు
-
RGV పోలీస్ కేసుపై జగన్ రియాక్షన్
-
గ్రామీణ రోడ్లపై టోల్ వసూలు చేయడం సంపద సృష్టి అవుతుందా?
-
బాబు హయాంలో కన్నా.. YSRCP హయాంలో తలసరి ఆదాయం పెరిగింది
-
మేనిఫెస్టో పేరుతో మాయా పుస్తకం: వైఎస్ జగన్
-
బాబు అబద్ధాలు.. అప్పులపై లెక్క తేల్చేసిన వైఎస్ జగన్
-
చంద్రబాబు పాలనపై ఓ కథ చెప్పి కళ్ళు తెరిపించిన జగన్
-
బాబు పాలనలో ఏపీ జీడీపీ 18వ స్థానం మన పాలనలో 15వ స్థానం..
-
YSRCP హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 13.57 శాతం
-
ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన జగన్
-
YSRCP హయాంలో అప్పు లను భారీగా తగ్గించాం
-
బాబు పెండింగ్ పెట్టిన ప్రతి బిల్లు మేమే కట్టాం...
-
YS Jagan: చంద్రబాబు హామీలు అమలు చేయలేక బొంకుతున్నారు
-
ఏపీ అసెంబ్లీలో తప్పుడు లెక్కలు.. అనవసర ప్రసంగాలు!
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తప్పుడు లెక్కలతో, అసత్య ఆరోపణలతో, అనవసరమైన ప్రసంగాలతో ఎనిమిదో రోజుకి చేరింది. ఓవైపు వైఎస్సార్సీపీ బహిష్కరణతో శాసనసభ ఏకపక్షంగా నడుస్తుండగా.. శాసనమండలిలోనైనా కనీసం వైఎస్సార్సీపీ అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు పొంతన లేని వివరణలతో నెట్టుకొస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా.. ఇవాళ.. అప్పులపై కూటమి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైఎస్సార్సీపీ మండిపడింది. శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయగా.. దానికి తీవ్ర అభ్యంతరం తెలిపింది. అటు శాసనసభలోనూ చంద్రబాబు సైతం వ్యక్తిగత గొప్పలతో సభలో కాలయాపన చేశారు.ఏపీ అప్పులపై మండలిలో కూటమి ప్రభుత్వం, వైఎస్సార్సీపీ మధ్య వాగ్వాదం జరిగింది. ఏపీ అప్పులు 6.46 లక్షల కోట్లు అని ప్రకటించారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 2024 జూన్ నాటికి 4,91,734 కోట్లు బడ్జెట్ అప్పులు ఉన్నాయని, కార్పొరేషన్ ల ద్వారా 1,54,797 కోట్లు అప్పులయ్యాయని అన్నారాయన. అదే టైంలో.. గత ప్రభుత్వం 9 లక్షల 74 వేల కోట్లు చేసిందంటూ తీవ్ర ఆరోపణలకు దిగారు. ఆ వెంటనే..ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ‘‘ ప్రశ్నోత్తరాల సమయం అంటే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. కానీ, మంత్రి సభలో ఆవు కథ చెప్తున్నారు. అప్పుల పై అన్ని పార్టీల తో కమిటీ వెయ్యండి. అప్పుడు.. ఎన్ని అప్పులు ఉన్నాయో తెలుస్తాం. అంతే కానీ ఈ ఆరోపణలు సమంజసం కాదు. వాస్తవాలు చెబితే అభ్యంతరం లేదు. మంత్రి కేశవ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారు. మంత్రులు ఏం చెప్తే అది చెవిలో పువ్వులు పెట్టుకుని వినాలా?’’ బొత్స మండిపడ్డారు.నేను బుడమేరు బాధితుడ్నే: ఎమ్మెల్సీ రుహుళ్లశాసన మండలి బుడమేరు వరదల పై మండలి లో చర్చ జరిగింది. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ.. బుడమేరు కి 4 సార్లు వరద వస్తే 3 సార్లు చంద్రబాబు హయాంలో నే వచ్చింది. బుడమేరు ఆధునికీకరణ కోసం 2014 నుండి 2019 వరకు ఏమైనా ఖర్చు చేశారా?. బుడమేరు వరదల పై కేంద్ర బృందాలు ఎంత నష్టం గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం చేసింది, ఎంత ఖర్చు చేశారు..?ఆపరేషన్ బుడమేరు నెల రోజుల్లో ప్రారంభిస్తాం అన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పాలి?. నష్టపరిహారం సక్రమంగా చేస్తే బాధితులు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ రాహుళ్ల ప్రసంగిస్తూ.. నేను కూడా వరద బాధితుడిని. వరద వచ్చేముందు ప్రజలు కనీసం ప్రజలను అప్రమత్తం చెయ్యలేదు. అధికారులు ఏం చేస్తున్నారు. సింగ్ నగర్ ప్రజలను ముంచేశారు. మజీద్ వెళ్లి వచ్చే లోపే మా ప్రాంత ప్రజలంతా ముంపుకి గురయ్యారు అని అన్నారు.అయితే బుడమేరు పరిధిలో ఆంధ్ర జ్యోతి రాధ కృష్ణ పవర్ ప్లాంట్ ఉందని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగాల లెక్క ఏది?శాసన మండలి.. ప్రభుత్వ ఉద్యోగ ల భర్తీ పై మండలి లో చర్చ జరిగింది. రాష్ట్రంలో మొత్తం శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో చెప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. ‘‘గత ప్రభుత్వం లో లక్ష 34 వేల సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాం.2014 నుండి 2019 మధ్య లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలి’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్రంలో అన్ని శాఖల ఖాళీల పై.మదింపు చేస్తున్నాం. ఇంకా ఖాళీల వివరాలు రావాల్సి ఉందన్నారు. వైఎస్సార్సీపీ వాకౌట్శాసన మండలి ట్రూ అప్ చార్జీల భారంపై వాడీవేడీ చర్చ జరిగింది. రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం వేయం అన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామన్నారు. ట్రూ అప్ చార్జీలు ఎందుకు పెంచుతున్నారు? అని ఎమ్మెల్సీ రవిబాబు ప్రశ్నించారు. దానికి మంత్రి మంత్రి గొట్టిపాటి రవి సమాధానమిస్తూ.. ఈఆర్సీ ఆమోదించిన మేరకు ట్రూ అప్ చార్జీలు పెంచుతున్నామని చెప్పారు. అయితే..ప్రజలకు చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారు. ఈఆర్సీలో అఫిడవిట్ వెయ్యొచ్చు కదా అని ప్రశ్నించిన బొత్స.. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. ప్రజల పై విద్యుత్ చార్జీలు మోపినందుకు నిరసనగా వైఎస్సార్సీపీ మండలి నుంచి వాకౌట్ చేసింది.హామీలపై సమీక్షలు జరుపుతున్నాం: చంద్రబాబుగత ప్రభుత్వం అప్పులు.. ఈ ప్రభుత్వానికి సవాల్‌గా మారాయని శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘ఇచ్చిన హామీలపై అనునిత్యం సమీక్షలు జరుపుతున్నాం. ఏదీ రాత్రికి రాత్రే సాధ్యం కాదు’’ అని అన్నారాయన. అలాగే.. అధికారం తనకేం కొత్త కాదని.. సీఎం పదవి అంతకంటే కొత్త కాదని చెబుతూ.. నాలుగోసారి సీఎం కావడం అరుదైన అనుభవమని చెప్పారు. గత ప్రభుత్వమే రోడ్లకు గుంతలు పెట్టి వెళ్లిపోయిందని, దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. పోలవరం గేమ్ ఛేంజర్ అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడబోమన్నారు. బాబు పాలనపై సంతృప్తి: పవన్విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు. ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంతకు ముందు.. ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది. చంద్రబాబు 150 రోజుల పాలన సంతృప్తిగా ఉంది. చంద్రబాబు పాలనపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. -
‘పాలన చేతకాదా చంద్రబాబూ?’.. మీడియా ముందు నిలదీయనున్న వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: నిత్య అబద్ధాలు.. పాలనలోనూ గారడీ చేస్తున్న కూటమి సర్కార్‌ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ నిలదీయనున్నారు. కాసేపట్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ద్వారా మాట్లాడనున్నారుఏపీలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచక పాలన మొదలుపెట్టింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. ఒకవైపు వైఎస్సార్సీపీపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తూనే.. మరోవైపు కీలక హామీల విషయంలో ప్రజలను మోసం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐదు నెలలు గడిచినప్పటికీ ఎన్నికల హామీల్లోని ఏ ఒక్క పథకం అమలు చేయకపోగా.. జగన్ పాలనలో సమర్థవంతంగా సాగిన వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ పోతోంది.రైతులు, విద్యార్థులు, ఆడపడుచులు.. ఇలా అన్నివర్గాలు బాబు సర్కార్ చేతిలో మోసపోతున్నారు. జగన్ హయాంలోని సంక్షేమ లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గిస్తూ వస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. గత వైఎస్సార్సీపీ పాలనపై అడ్డగోలుగా ఆరోపణలు గుప్పిస్తూ కాలం వెల్లదీసే ప్రయత్నం చేస్తోంది. వీటన్నింటిని తోడు.. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ కూటమి ప్రభుత్వ కుట్రల పర్వం కొనసాగుతోంది.కనీసం అసెంబ్లీలో అయినా గళం వినిపించే అవకాశం లేకపోవడంతో మీడియా చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్నారు వైఎస్ జగన్. గత సమావేశంలో బడ్జెట్ లెక్కలను తీసి మరీ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడి.. చంద్రబాబు సర్కార్‌కు పలు ప్రశ్నాస్త్రాలు సంధించే అవకాశం ఉంది. 🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address an important press conference tomorrow.📍Central Office, Tadepalli 🕒3:00 PM#StayTuned ❗ pic.twitter.com/OifvvJLAP5— YSR Congress Party (@YSRCParty) November 19, 2024 ఇదీ చదవండి: బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామంఇదీ చదవండి: అభివృద్ధిపైనా అబద్ధాలే -
AP Assembly : అసెంబ్లీలో కూటమి సర్కార్ సెల్ఫ్ గోల్
గత జగన్ ప్రభుత్వంపై చేసినవన్నీ అసత్య ప్రచారాలన్నీ.. కూటమి ప్రభుత్వ ప్రకటనలతోనే తేటతెల్లమైపోతోంది. మరోవైపు చర్చకు వైఎస్సార్సీ ఎమ్మెల్సీలకు సహకరించకుండా.. -
అసెంబ్లీ సాక్షిగా అప్పులపై అసత్యాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అప్పులపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అవాస్తవాలు చెప్పారని మాజీ ఆర్థికమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. అసెంబ్లీలో రికార్డు అవుతుందని, నిజాలే చెప్పాలని తెలిసి కూడా వారిద్దరూ బాధ్యతారహితంగా మాట్లాడారన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్, కాగ్ పత్రాల్లో అసలు అప్పులెంతో తేలిందన్నారు. వాటి ప్రకారం అప్పులు రూ.6.46 లక్షల కోట్లేనని బాబు ప్రభుత్వం కూడా ఇదే చెప్పిందని బుగ్గన సాక్ష్యాధారాలతో ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.అలాగే, పయ్యావుల చెప్పింది నిజమా? లేక సీఎం చంద్రబాబు చెప్పింది నిజమా లేదా టీడీపీ మాజీ ఆర్థికమంత్రి యనమల చెప్పింది నిజమా.. అనేది ఒకసారి ముగ్గురు ఒకచోట కూర్చుని ఒక అంకెకు వస్తే మంచిదని బుగ్గన ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లంటూ అవాస్తవాలు చెప్పారని బుగ్గన తెలిపారు. ఇంకా తవ్వతే ఎంత వస్తుందోనని ఆయనన్నారని, తవ్వడానికి 6 నెలలు సరిపోలేదా.. ఇదేమైనా గండికోట రహస్యమా.. అని ప్రశి్నంచారు. ‘స్కాములన్నీ మీరే చేశారు. తండ్రీ కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకుంటున్నారు.. బడ్జెట్లో సూపర్–6, సూపర్–7 పథకాలకు కేటాయింపులు ఎక్కడ..’ అని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. స్కీములన్నింటికీ రికార్డులున్నాయివైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ఆదాయం తగ్గిందని, తలసరి ఆదాయం తగ్గిందని, మూలధన వ్యయం సున్నా అని, స్కీములన్నీ స్కాములేనంటూ చంద్రబాబు బాధ్యతలేకుండా అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు గుంజీలు ఎవరు తీయాలో సీఎం ఆలోచించుకోవాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్కీములన్నీ డీబీటీ ద్వారానే అమలుచేసింది. వీటన్నింటికీ రికార్డులున్నాయి. మరి స్కాములెక్కడుంటాయి? అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం లైసెన్సులు, ఇసుక టెండర్లలో యథేచ్ఛగా దోపిడీ సాగించారు. తండ్రి కొడుకులు నీకింత.. నాకింత.. అని పంచుకున్నారు. మైనింగ్ కాంట్రాక్టులు కూడా దోపిడీయే. ఏ స్కాములో చూసినా మీరే కనిపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ బకాయిలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించిందిగత టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.42,188 కోట్లు బకాయిలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. విద్యుత్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాల కోసం అప్పులు తీసుకుంటాయి. వాటితో ప్రభుత్వానికి సంబంధం ఎలా ఉంటుంది? వాటినీ పరిగణనలోకి తీసుకున్నా బాబు హయాం కన్నా మేమే తక్కువ అప్పులుచేశాం. బాబు అప్పుల పెరుగుదల 22.63 శాతమైతే మాది 13.57 శాతమేఇక గత టీడీపీ ప్రభుత్వంలో వార్షిక సగటు అప్పుల పెరుగుదల 22.63 శాతం కాగా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అది 13.57 శాతమే. దీన్నిబట్టి చూస్తే ఎవరెక్కువ అప్పులు చేశారో తెలుస్తుంది? అలాగే, గత టీడీపీ ప్రభుత్వం పరిమితికి మించి రూ.16,400 కోట్లు అప్పులుచేసింది. ఈ అప్పును వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రం మినహాయించింది. మరోవైపు.. మూలధన వ్యయం సున్నా అని బాబు, సింగిల్ డిజిట్ అని యనమల చెప్పారు.. కానీ, మొన్నటి బడ్జెట్ డాక్యుమెంట్‌లోనే మూలధన వ్యయం రూ.23,330 కోట్లుగా చూపెట్టారు. ఇది సున్నా, సింగిల్ డిజిట్ ఎలా అవుతుందో చెప్పాలి. ‘విద్యుత్’పై ఆరోపణల్లోనూ నిజంలేదువిద్యుత్ సంస్థలకు రూ.1.29 లక్షల కోట్లు నష్టంచేసినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణల్లోనూ నిజంలేదు. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్ సంస్థల నష్టాలు రూ.6,625 కోట్లు ఉండగా చంద్రబాబు హయాంలో అవి రూ.28,715 కోట్లకు పెరిగాయి. అదే వైఎస్సార్సీపీ హయాంలో 2022–23 నాటికి అవి రూ.29,110 కోట్లే. రూ.395 కోట్లే పెరిగింది.ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి నేతలు... ఇప్పుడు 6 నెలల్లోనే రూ.6,072 కోట్లు విద్యుత్ చార్జీల భారం మోపారు. మరో రూ.12,000 కోట్లు భారం మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. తలసరి ఆదాయం 2018–19 నాటికి రూ.1,54,031లతో దేశంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే.. 2022–23 నాటికి రూ.2,19,881లతో 15వ స్థానానికి చేరింది. యనమల ఆరోపణలు విచిత్రం.. విడ్డూరంఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల అయితే.. అప్పులపై చాలా అన్యాయంగా అవాస్తవాలు చెప్పారు. నిజానికి గ్యారెంటీ అప్పులు రూ.1.54 లక్షల కోట్లే. ఇక వేస్ అండ్ మీన్స్, ఓవర్‌డ్రాఫ్ట్ అనేది అన్ని ప్రభుత్వాలు చేసేవే. వాటిని అవసరమైన రోజులు తీసుకోవడం ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి తీర్చేయడం జరుగుతుంది. ఇలా తీర్చేసిన అప్పులను కూడా యనమల అప్పులుగా పేర్కొనడం.. విడ్డూరంగాను, విచిత్రంగాను ఉంది. అలాగే, ఆర్థిక విధ్వంసం, అరాచకం జరిగిందని ఆర్థికమంత్రి కేశవ్ అన్నారుగానీ, ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో చూపించలేకపోయారు? చిక్కీలపై బకాయి పెట్టామన్నారు. మరి వాళ్లు కోడిగుడ్లపై బకాయి పెట్టలేదా? రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం సహజం. ఆదాయం తగ్గలేదు, పెరిగిందిఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. 1999–2004 మధ్య బాబు పెంచిన ఆదాయం 12.4 శాతమైతే.. 2004–2009 మధ్య వైఎస్సార్ 21.6 శాతం పెంచారు. తిరిగి 2014–19 మధ్య బాబు ఆరు శాతం పెంచితే 2019–2024 మధ్య జగన్ 16% పెంచారు. సూపర్ సిక్స్‌లో పావు దీపం తప్ప మిగతా ఏవీ అమలుచేయలేదు. ఎన్నికల ముందు అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉండగా అవాస్తవాలు చెబుతూ తప్పులుచేస్తే ప్రజలు గమనిస్తారు. ప్రతీసారి మోసపోవడానికి ప్రజలు అమాయకులు కారు. ఈ వయస్సులో అసెంబ్లీలో అవాస్తవాలు చెప్పడం చంద్రబాబుకు తగదు. -
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
AP Assembly Session: పేద ప్రజల కలలు నీరు కార్చిన కూటమి సర్కార్
సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై శాసనమండలిలో వైఎస్సార్సీ ఎమ్మెల్సీలు నిలదీశారు. లెక్కలతో సహా అన్ని శాఖలపై.. -
వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను సమర్పించిన రూ. 2.94 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ప్రజల్లో నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఈ బడ్జెట్ లాంఛన ప్రాయంగా మాత్రమే కనిపిస్తోంది. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ‘సూపర్ సిక్స్’తో సహా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేదు. యువత నైపుణ్యాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి రంగాలపై గుర్తించదగిన శ్రద్ధను కనబరచలేదు. స్థిరమైన ఉపాధిని పెంపొందించడానికి ఎంఎస్ఎంఈ లకు అదనపు మద్దతు ఇవ్వాలి. అదెక్కడా బడ్జెట్లో కని పించడంలేదు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించే బదులు, స్పష్టమైన ఫలితా లను సాధించడానికి రాష్ట్రం ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలి. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కూటమి సర్కారు మోకాలడ్డుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, మెయింటెనెన్స్ ఛార్జీల కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. ఫలితంగా సుమారు 12 లక్షల ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలకు చెందిన విద్యార్థుల కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపుల్లో కోత స్పష్టంగా కనిపిస్తోంది. ‘సూపర్ సిక్స్’ ఎన్నికల హామీలను పునరావృతం చేయడం మినహా ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. రూ. 43,402 కోట్లతో అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్‌దీ అదే దారి. మొత్తంగా, ఆదివాసీలు, దళితులు, మహిళలు, మైనారిటీల సంక్షేమానికి నామమాత్రంగానే ప్రభుత్వం నిధులు విదిల్చింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో సరిపెట్టారు. మిగతా హామీల అమ లుపై నిర్దిష్టత లేదు. 20 లక్షల మంది యువతకు ఉపాధి అవ కాశాలు, రూ. 3,000 నిరుద్యోగ భృతిని దాటవేశారు. 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి... ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీ, జీఓ నెంబరు 3 పునరుద్ధరణ గురించి నోరు మెదపలేదు. ప్రతి రైతుకూ ఏటా రూ. 20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న ‘అన్నదాత సుఖీ భవ’కు 10 వేల 716 కోట్లు అవసరం కాగా 1000 కోట్లే కేటాయించారు. దాదాపు 25 లక్షలుగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడం కనీస ధర్మం. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధా న్యత అని చెప్పినా, నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు.ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండాల్సిన మహిళలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడంపై చూపే ఆత్రం పథకాల అమలులో కానరావడం లేదు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున అంది స్తామన్న ‘మహాశక్తి’ జాడే లేదు. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థికి రూ. 15 వేలు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 84 లక్షల మంది విద్యార్థుల తల్లులకు చెల్లించేందుకు రూ. 12,600 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా, విదిల్చింది రూ. 5,387 కోట్లే! బాలబాలికలకు, బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్క ర్లకు, హెల్పర్లకు పెండింగ్‌లో ఉన్న వేతన పెంపు గురించి ఎక్కడా ప్రస్తావించ లేదు. కార్మికులు, స్కీమ్ వర్కర్ల వేతన పెంపు, సామా జిక భద్రత ఊసే లేదు. మాటిచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా వేల కోట్ల రూపాయల అప్పు భారం మోపుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల నుంచి కేంద్రం ఇప్పిస్తా మన్న రూ. 15 వేల కోట్లు గ్రాంటో, రుణమో తేల్చలేదు. మొత్తంగా చూసినప్పుడు బడ్జెట్ కేటాయింపులను బట్టి ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలను గాలికి వదిలేసినట్లు స్పష్టమవుతోంది.– డా‘‘ ముచ్చుకోట సురేష్ బాబుమొబైల్: 99899 88912 -
బడ్జెట్లో సూపర్ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు. .బడ్జెట్లో వాటిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను బాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు.. @ncbn గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!నువ్వు చేసింది మోసం కాదా?యువతని మోసం చేశారుమహిళలను మోసం చేశారురైతులను మోసం చేశారుఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళ…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 14, 2024 -
బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రశ్నలు.. పదేపదే అడ్డుకున్న టీడీపీ మంత్రులు
సాక్షి, అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీగా మారింది. మండలిలో బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడికి దిగారు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ సభలో గందరగోళం సృష్టించారు. బడ్జెట్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నలు కురిపించారు. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. రూ. 5,387 కోట్లు ఇస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.అయితే వరుదు కల్యాణి ప్రసంగిస్తుండగా హోంమంత్రి అనిత అడ్డుతగిలారు. వరుదు కల్యాణి మాట్లాడుతుండగా మంత్రులు అనిత, సవిత, బాల వీరంజనేయులు ఆటంకం కలిగించారు. ఎమ్మెల్సీ కల్యాణిని సభలో మాట్లాడకుండా అడుగడుగునా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు.మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు మాట్లాడుతుండగా మంత్రులే అభ్యంతరం తెలపడం ఏంటని ఆగ్రహించించారు.వైస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలు పెట్టగా.. సంబంధం లేని సబ్జెక్ట్‌ను ఎందుకు తీసుకొచ్చారని బొత్స ప్రశ్నించారు. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ ఆయన సూచించారు. దీంతో గందరగోళం నడుమ సభను చైర్మన్ రేపటికి(శుక్రవారం) వాయిదా వేశారు. -
AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా
AP Assembly Budget Session Day 3 Update అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడింది.అసెంబ్లీ మీడియా పాయింట్వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారుపవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారుఅనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారుఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారుతమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారులోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారుబడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారుగతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.అరకొర బడ్జెట్ పెట్టి...నిధులు కేటాయించారు.ఈ బడ్జెట్‌తో తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారు.దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమంది ఇస్తారనేది మేం ప్రశ్నించాం.రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారు.ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కలేవి.హోంమంత్రి గారు ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదు.దమ్ముంటే మీరు కేటాయించిన 3200 కోట్ల లెక్క చూపించండి.టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయల్సభలో బడ్జెట్‌పై చర్చకు అడుగడుగా అడ్డుపడ్డారు.కావాలనే సభను పక్కదారి పట్టించారు.మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు.మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేం ప్రతిపక్ష హోదా ఉందని కోరాం.ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా... సభలో మైకు ఇవ్వకుండా అవమానించడం పద్దతేనా?చంద్రబాబు సభకు ఎందుకు రాలేదంటే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.ఎమ్మెల్సీ,వంకా రవీంద్రనాథ్నేను తొలిసారి బడ్జెట్ చర్చలో పాల్గొన్నాసభ చాలా హుందాగా సాగుతుందని భావించాప్రతిపక్ష పార్టీ సభ్యులను అధికారపార్టీ సభ్యులు మాట్లాడకుంటా చేశారుచర్చ జరగకుండా గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు లేవనెత్తి నానా గొడవ చేశారురేపైనా ప్రతిపక్ష పార్టీకి అడ్డుకోకుండా అధికారపార్టీ సభ్యులు సంయమనం పాటించాలిసభ సజావుగా సాగేలా సహకరించాలి.మండలి రేపటికి వాయిదామండలిలో బడ్జెట్ లో వైస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడి..సంబంధం లేని అంశాల్ని ప్రస్తావన చేస్తూ సభలో గందరగోళం..అడుగడుగునా వరుదు కల్యాణి ని సభలో మాట్లాడకుండా అడ్డుకున్న టీడీపీ సభ్యులు..వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలుసభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ సూచించిన బొత్స..గందరగోళం నడుమ సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ మంత్రులుబడ్జెట్పై వరుదు కల్యాణి ప్రసంగంవరుదు కల్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మహిళా మంత్రులుఅనిత, సవితలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స, ఇతర ఎమ్మెల్సీలు బాబు సర్కార్‌ను ప్రశ్నించిన YSRC ఎమ్మెల్సీలుమండలిలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న వైస్సార్సీపీ MLC లు..2014 నుండి 2019 వరకు ప్రభుత్వంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించారుఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?ఇప్పుడు సంపద సృష్టిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు..తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే 12 వేల కోట్లు కావాలి..అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 20వేల కింద ఇస్తే 10716 కోట్లు కావాలిమహిళలకు 18 వేల చెప్పునిస్తే 32400 కోట్లు కావాలిఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదు..కుంభ రవిబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది..సూపర్ సిక్స్ కి 74,287 కోట్లు కావాలి..ఎన్నికల ముందు కొట్టిన డప్పు.. బడ్జెట్లో మొగ లేదు..మేనిఫెస్టో కి బడ్జెట్ కి మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అయింది..ప్రజాగలం ప్రజా గరాళమైందిబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల గారడీ అయింది..వరుదు కళ్యాణి, ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్ ఎన్నికఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు స్వల్ప వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిశాసన మండలి వాయిదావైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన శాసన మండలిసోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై చర్చకు YSRCP పట్టుఅరగంటపాటు నినాదాలతో హెరెత్తిన మండలిఅయినా చర్చకు మండలి చైర్మన్ నిరాకరణపొడియం చుట్టు ముట్టి సేవ్ డెమోక్రసీ.. వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేసిన YSRCP ఎమ్మెల్సీలుఈ ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేసిన చైర్మన్ వీ వాంట్ జస్టిస్.. మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన YSRCP ఎమ్మెల్సీలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలుఎమ్మెల్సీలు నిరసన మధ్యలోనే మాట్లాడిన ఇతర పార్టీల సభ్యులుమండలిలో వైఎస్సార్సీపీ నిరసనప్రారంభమైన శాసన మండలిసోషల్ మీడియా అరెస్టు లపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండీఎస్సీ పై పీడీఎఫ్ వాయిదా తీర్మానంరెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుమూడో రోజు మొదలైన ప్రశ్నోత్తరాలు అనంతరం బడ్జెట్ పై చర్చ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంసోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసుల బనాయింపు పై సభలో చర్చించాలని కోరుతూ తీర్మానంశాసన మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ స్పీకర్ ఎంపిక నేడు!మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు నామినేషన్ ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న శాసన సభ స్పీకర్ అయ్యన పాత్రుడు... నేడు అసెంబ్లీ లో 5 బిల్లులుఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024...ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ సిటీ డ్యూటీ బిల్లు - 2024.ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024..ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు - 2024..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024.నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రులు...ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 - 29. పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి కొoడపల్లి శ్రీనివాస్..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. పై సభ లో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టి జీ భరత్.... -
బూచిగా అప్పుల భూతం.. సూపర్ సిక్స్‌కు ఎగనామం: వైఎస్ జగన్
‘ఎన్నికల వేళ నువ్వు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి? ఇదిగో నీ సూపర్ సిక్స్.. వాటిని అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్ రూ.74 వేల కోట్లు. కానీ బడ్జెట్లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా?’ అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడతా. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టు పెడతారు. ఇదే పోస్టును సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకూ పిలుపునిస్తున్నా. ఎంత మందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలు పెడితే.. అది నాతోనే ప్రారంభించండి.– సీఎం చంద్రబాబుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సవాల్సాక్షి, అమరావతి: ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు ఇస్తున్నప్పుడే వాటిని అమలు చేయలేనని తెలిసినా, మోసం చేయడమే తన నైజంగా పెట్టుకున్న చంద్రబాబు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర అప్పులు రూ.11 లక్షల కోట్లు.. రూ.12.50 లక్షల కోట్లు.. రూ.14 లక్షల కోట్లు అంటూ చేసిన దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలైందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దాన్నే ఎల్లో మీడియాతో రాయించి.. ఆ తర్వాత దత్తపుత్రుడు, బీజేపీలోని టీడీపీ నాయకురాలు, తన వదినమ్మ, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో పదే పదే మాట్లాడించి దుష్ప్రచారం చేసిన ఆర్గనైజ్డ్ క్రిమినల్ (వ్యవస్థీకృత నేరగాడు) చంద్రబాబు అని ధ్వజమెత్తారు. రాష్ట్రం శ్రీలంకలా దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో అంటూ ఒక పద్ధతి ప్రకారం దుష్ఫ్రచారం చేశారని గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులపై చంద్రబాబు చేసిన దుష్ఫ్రచారాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరుకుందంటూ సీఎం చంద్రబాబు లీకులు ఇచ్చారని.. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చిత్రీకరిస్తూ సూపర్ సిక్స్, ఇతర హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేశారని దుయ్యబట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లంటూ గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని గుర్తు చేశారు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లేనని తేలిందని ఎత్తి చూపారు. తద్వారా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలా చేస్తారన్నది బట్టయలైందని చెప్పారు. రాష్ట్ర అప్పులపై తాను చెప్పిందంతా అబద్ధమని తేలుతుందని.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కేటాయింపులపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ఇన్నాళ్లూ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకాఏమన్నారంటే..ఎనిమిది నెలలయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడమా? ⇒ ఈ బడ్జెట్ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. నిజంగా ఎవరైనా ఎన్నికలైన వెంటనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేసి, వాటి అమలుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారు. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 8 నెలలు గడిచాక.. కేవలం మరో నాలుగు నెలలు సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ను చూస్తే ఆశ్చర్యమేస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు, అబద్ధాలు అన్నీ బయటకొస్తాయని ఇలా చేశారు. ⇒ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు కేటాయింపులు జరపకపోతే మా సూపర్ సిక్స్ ఏమైంది.. సూపర్ సెవెన్ ఏమైందని ప్రజలు నిలదీస్తారని తెలుసు కాబట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు. దీనికి రకరకాల కారణాలు చెబుతూ వచ్చారు. పరిమితికి మించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని.. రాష్ట్రాన్ని శ్రీలంక చేసిందని.. ప్రజలను మభ్యపెట్టే విధంగా అబద్ధాలు ప్రచారం చేశారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెబుతూ.. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే.. ఆయన ఏ స్థాయి డ్రామా ఆర్టిస్ట్ అన్నది స్పష్టమవుతోంది. బడ్జెట్ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలే ఇందుకు సాక్ష్యం.చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు ఆధారాలు ఇవిగో..05–04–2022: ‘రాష్ట్రం మరో శ్రీలంకగా తయారవుతుంది’ చంద్రబాబు స్టేట్మెంట్. ‘ఈనాడు’లో బ్యానర్ కథనం 13–04–22: ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో?’ అని చంద్రబాబు మరో స్టేట్మెంట్ 19–04–22: చంద్రబాబు చెప్పిన అబద్ధాలను పట్టుకుని ‘మేలుకోకుంటే మనకు శ్రీలంక గతే’ అంటూ ఈనాడు కథనం 17–05–22: ‘శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం’లోనే ఉందంటూ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ 21–07–22 : ’శ్రీలంక కంటే రాష్ట్రానికి 4 రెట్లు అప్పు’ అని అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్టేట్మెంట్17–02–23 : ‘అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు అప్పు రత్న’ అని పేరు పెట్టాలంటూ దత్తపుత్రుడు మరో ట్వీట్ 25–10–23 : ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు’ అని చంద్రబాబు వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు స్వయంగా చూసినట్లు, ఆమెకు తెలిసినట్లు స్టేట్మెంట్⇒ వీటిని బట్టి కొత్త పాత్రధారులు, వారి ఎల్లో మీడియా, ఇతర పార్టీల్లోని టీడీపీ నాయకులతో కలిసి ఒక పద్ధతి ప్రకారం అప్పులపై గోబెల్స్ ప్రచారం చేశారని స్పష్టమవుతోంది. అప్పులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమా«ధానాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని రివర్స్ ప్రచారం. ఢిల్లీకి పోవడం.. రకరకాల ఏజెన్సీలకు లేఖలు రాయడం ఎందుకు? ‘వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రాకూడదు.. కేంద్ర ప్రభుత్వం సహకరించకూడదు.. ఇక్కడ ఏమెమో జరిగిపోతోందన్న భయం సృష్టించాలి’ అని పద్దతి ప్రకారం ఇవన్నీ చేసుకుంటూ పోయారు.⇒ ఎన్నికలు సమీపించే సరికి అబద్ధాలు ముమ్మరం చేశారు. 2023 ఏప్రిల్ 7వ తేదీన ‘రాష్ట్ర అప్పు రూ.12.50 లక్షల కోట్లు’ అని ఎన్నికలకు నెల ముందు చంద్రబాబు వదినమ్మ స్టేట్మెంట్. ఇందుకు వత్తాసుగా అదే నెల 21న ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకానమిస్ట్ అని బిళ్ల తగిలించి.. ‘రాష్ట్ర రుణాలు రూ.14 లక్షలు కోట్లు’ అని చెప్పించారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లు వరుసగా ఇదే పాట అందుకున్నారు. ఒక పద్దతి ప్రకారం అబద్ధాల ప్రచారం జరిగింది.మాకు రూ.42,183.80 కోట్ల బకాయిల బహుమతి⇒ చంద్రబాబు పోతూ పోతూ రూ.42,183.80 కోట్ల బకాయిలు మాకు గిఫ్ట్‌గా ఇచ్చి పోయాడు. అవన్నీ మేము కట్టాం. ఉపాధి హామీ బకాయిలు రూ.2,340 కోట్లు, ఉద్యోగులకు రెండు డీఏలు బకాయి పెట్టాడు. ఆరోగ్యశ్రీ రూ.640 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూ.2,800 కోట్లు, రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.380 కోట్లు, పంటల బీమా బకాయిలు రూ.500 కోట్లు, చివరికి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండే ఆయాలకు, కోడిగుడ్లకు కూడా బకాయిలు పెట్టాడు.⇒ ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఏ ప్రభుత్వ హయాంలోనైనా కొన్ని బకాయిలు మామూలే. ఏటా ఈ బకాయిలు క్లియర్ అవుతూనే ఉంటాయి. దీన్నేదో చంద్రబాబు వక్రీకరించి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఎగరగొట్టాలనే దూరపు ఆలోచనతో కొత్త కథను బిల్డప్ చేస్తున్నాడు. సూపర్ సిక్స్ సహా ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాలకు రెక్కలు కట్టాడు. ఇలా చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్‌లో ఎవరెవరు భాగస్వాములై ఉన్నారో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాను. రాజకీయ లబ్ధి కోసమే అప్పులపై దుష్ఫ్రచారం⇒ ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా అప్పులు చేయడం బడ్జెట్లో భాగం. ఇది సర్వసాధారణంగా జరిగే కార్యక్రమం. ప్రతి రాష్ట్రానికి, ప్రతి ప్రభుత్వానికి ఎంత పర్సంటేజ్‌లో అప్పులు చేయాలో ఎఫ్ఆర్బీఎం నిర్దేశిస్తుంది. ఏ ప్రభుత్వమైనా జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతంలోపే అప్పులు తీసుకుంటుంది. అంతకు మించి తీసుకునే అవకాశం ఉండదని అందరికీ తెలుసు.⇒ చంద్రబాబు, ఆయన కూటమి, ముఠా సభ్యులు మాత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై ఏ విధంగా ప్రచారం చేశారో అందరికీ తెలిసిందే. ఏ బ్యాంకు అయినా ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. కార్పొరేషన్ల ద్వారా కూడా ఇష్టమొచ్చినట్టు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు సుందర ముఖారవిందం చూసో, జగన్ ముఖారవిందం చూసో ఏ బ్యాంకులు అప్పులు ఇవ్వవు. ఇవన్నీ వాస్తవాలు. కేవలం వారు రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలా చేశారని స్పష్టమైంది.అధికారంలోకి వచ్చాక కూడా విష ప్రచారమే⇒ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం మానలేదు. అదే విష ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 10వ తేదీన ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తూ ‘రాష్ట్రం మొత్తం అప్పులు రూ.14 లక్షల కోట్లు’ అని లీకులిస్తాడు. ఈనాడులో రాస్తారు.. ఈటీవీలో చూపిస్తారు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేందుకు చంద్రబాబుకు కారణాలు కావాలి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’కు కేటాయింపులు చేయకపోతే ప్రజలు నిలదీస్తారని తెలుసు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన దుష్ప్రచారం కొనసాగించారు.⇒ ఒక పద్దతి ప్రకారం సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను తెరమరుగు చేసే కార్యక్రమం. హామీలిచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు. అయినా ప్రజలను మోసం చేయాలి. మోసం చేసే సమయంలోనైనా కనీసం నిజాయితీతో మిమ్మల్ని మోసం చేస్తున్నాం అని చెప్పడానికి మళ్లీ జగన్ కావాలి. అందుకోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.బడ్జెట్ సాక్షిగా దుష్ఫ్రచారం బట్టబయలు⇒ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్టానికి ఎంత అప్పులు ఉన్నాయో చూపించాలి. అది తప్పనిసరి. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఎవరి హయాంలో ఎంత అప్పులున్నాయో స్పష్టంగా వాళ్లే పేర్కొన్నారు. 14, 16 పేజీలను గమనిస్తే.. 2018–19 నాటికి.. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పులు రూ.2,57,509 కోట్లు. వీటికి ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే మరో రూ.55వేల కోట్లు. అంటే చంద్రబాబు దిగిపోయే నాటికి (2018–19) రూ.3.13 లక్షల కోట్ల అప్పులున్నాయి. ⇒ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.3.13 లక్షల కోట్లు ఉన్న అప్పులు, మా ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4.91,774 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో వివిధ కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు.. రెండు కలిపితే రూ.6.46 లక్షల కోట్లు. ఈ వివరాలను వాళ్లే స్పష్టం చేశారు. అలాంటప్పుడు వాళ్లు ప్రచారం చేసినట్టుగా ఎక్కడ రూ.10 లక్షల కోట్లు, ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, ఎక్కడ రూ.12.50 లక్షల కోట్లు, ఎక్కడ రూ.14 లక్షలు కోట్లు అప్పులు? ఇవన్నీ దుష్ప్రచారాలే కదా?అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి?⇒ ఎవరెవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు (డెట్ కాంపౌండ్ గ్రోత్ రేటు) ఎంతుందో ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.1.32 లక్షల కోట్ల అప్పులు ఉంటే.. ఆయన దిగిపోయేసరికి రూ.3.13 లక్షల కోట్లు అప్పులుగా ఉన్నాయి. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 19.54 శాతం. అదే మా హయాంలో అప్పు రూ.3.13 లక్షల కోట్ల నుంచి రూ.6.46 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 15.61 శాతం. అంటే.. చంద్రబాబు కంటే 4 శాతం తక్కువగా అప్పులు చేశాం.⇒ ఇక ప్రభుత్వ రంగ సంస్థల నాన్ గ్యారంటీ అప్పులు చూసినా.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి రూ.8,638 కోట్లు ఉన్న నాన్ గ్యారంటీ అప్పులు.. ఆయన దిగిపోయే నాటికి రూ.77,228 కోట్లకు చేరాయి. పవర్ సెక్టార్, డిస్కమ్‌లకు చేసిన అప్పులు ఏకంగా 54.98 శాతం పెరిగాయి. మేము డిస్కమ్‌లు కాపాడేందుకు, పబ్లిక్ సెక్టార్, నాన్ గ్యారంటీడ్ లయబులిటీస్ అయినా సరే దాన్ని తగ్గించే కార్యక్రమం చేశాం. రూ.77,228 కోట్ల నుంచి రూ.75,386 కోట్లకు తగ్గించాం. అంటే మా హయాంలో రుణం పెరగకపోగా – 0.48 శాతం తగ్గించాం. ⇒ ప్రభుత్వ అప్పు, గ్యారంటీ అప్పు,. నాన్ గ్యారంటీ అప్పులు అన్ని కలిపి చూస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి అంటే 2014 నాటికి రూ.1.40 లక్షల కోట్లు ఉంటే.. ఆయన దిగేపోయే సరికి రూ.3.90 లక్షల కోట్లు చేరాయి. అంటే అప్పుల వార్షిక వృద్ధిరేటు 22.63 శాతం ఉంటే.. మా హయాంలో రూ 3.90 లక్షల కోట్లు రూ.7.21 లక్షల కోట్లు అయ్యింది. 13.57 శాతంగా అప్పుల వార్షిక వృద్ధి రేటు నమోదైంది. అది కూడా రెండేళ్లు కోవిడ్ దుర్భర పరిస్థితుల్లో. నిజంగా ఏదైనా అవార్డు ఇవ్వాలంటే మా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పుల రత్న బిరుదు చంద్రబాబుకు ఇవ్వాలి. -
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్నివిధాలా కుదేలయింది
-
ఏపీ పవర్ బిల్లులపై జగన్ రియాక్షన్
-
ఇకనైనా డబ్బా కొట్టుకోవడం ఆపండి: YS Jagan
-
ఆర్థిక క్రమశిక్షణ పాటించింది..?