‘కూటమి’ వంచన.. బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌ | Botsa Satyanarayana Reaction To Chandrababu Govt Budget | Sakshi
Sakshi News home page

‘కూటమి’ వంచన.. బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ రియాక్షన్‌

Published Fri, Feb 28 2025 12:50 PM | Last Updated on Fri, Feb 28 2025 3:13 PM

Botsa Satyanarayana Reaction To Chandrababu Govt Budget

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత,  మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని ధ్వజమెత్తారు. కూటమి నేతలు హామీలను విస్మరించారు. అన్ని వర్గాల ప్రజలను  మోసం చేశారు’’ అని బొత్స నిలదీశారు.

‘‘గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదు. రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆత్మ స్తుతి, పరనిందాగానే బడ్జెట్ సాగింది. గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్‌ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు. షూరిటీ  కాదు.. ప్రజల మోసం అనాలి. మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు. 50 లక్షల మందికి గత ప్రభుత్వంలో రైతుభరోసా ఇచ్చాం’’ అని బొత్స పేర్కొన్నారు.

‘‘అన్నదాత సుఖీభవ ఇస్తే రూ.12 వేల కోట్లు కావాలి. మహిళలు, నిరుద్యోగుల ఊసే లేదు. ఉచిత బస్సు మాట లేదు.. ఉలుకు పలుకే లేదు. రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత ప్రభుత్వంలో 3వేల కోట్లు మార్కేట్ ఇంటర్వెన్షన్ కోసం పెడితే.. ఇప్పుడు సున్నా తీసేసి 300 కోట్లు పెట్టారు. మిర్చి రైతుల సమస్య పై పోరాటం చేస్తే జగన్‌పై కేసు పెట్టారు. ఒక్కో కిలో, ఒక్క క్వింటా, ఒక్క బస్తా అయినా కొన్నారా?. ఎంతసేపు పొగుడుకోవడం తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. బడ్జెట్ పై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడతా. ప్రజలనిమాటలతో గారడి చేసి మోసం చేసే బడ్జెట్ ఇది.’’ అంటూ బొత్స ధ్వజమెత్తారు.

Botsa Satyanarayana: ఏపీ బడ్జెట్‌లో సూపర్ సిక్స్ డకౌట్

అంకెలే తప్ప అభివృద్ధి కానరాలేదు: ఎమ్మెల్సీ రవిబాబు
చంద్రబాబు, లోకేష్ ని పొగిదేందుకే సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీని పూర్తిగా మరిచారు. నిరుద్యోగులకు 3వేల హామీ బడ్జెట్‌లో లేదు. ఉత్పాదకరంగంపై కేటాయింపులు లేకుండా సంపద సృష్టి అంటే కేవలం మోసం చేయడమే.

బడ్జెట్ పేరుతో మోసం: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
ఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. మహాశక్తికి కేటాయింపులే లేవు. నిరుద్యోగులను రూపాయి కూడా కేటాయింపు చేయకుండా నిట్టనిలువునా ముంచారు. 12 వేల కోట్లు తల్లికి వందనంకి కావాలి.. కానీ కేటాయింపులు అరకొరగా కేటాయించారు. రైతుల్ని మోసం చేశారు. కోటి 55 లక్షల మంది దీపం పథకానికి అర్హులైతే.. 95లక్షల కి కుదించారు..4వేల కోట్లు అవసరం ఐయితే రెండున్నర వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గత ప్రభుత్వాన్ని  తిట్టడం, లోకేష్‌ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్‌ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్‌పై పెడితే బాగుండేది. బడ్జెట్‌పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తాం

బడ్జెట్‌పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం: ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి
ఆడబిడ్డ నిధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. వైఎస్‌ జగన్‌ ఐఆర్‌ ప్రకటించడంతో ఉద్యోగులను హ్యాపీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్న ఒక్క ఐఆర్‌ కూడా ప్రకటించలేదు. మెగా డీఎస్సీ అన్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. 5 లక్షల మంది కోచింగ్స్ తీసుకొంటున్నారు. నిరుద్యోగ భృతి గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఫీజు రియంబర్స్‌మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బడ్జెట్‌పై జరిగే చర్చల్లో పోరాటం చేస్తాం.. వీసీలు 17 మందిని బలవంతంగా రాజీనామాలు చేయించారు. అన్ని ఆధారాలు బయట పెడతాం.. ఉన్నత విద్య మండలిలో తప్పులపై ఎంక్వయిరీ చేయిస్తాం.

అంకెల గారడీ మాత్రమే: ఎమ్మెల్సీ  బొమ్మి ఇజ్రాయెల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారడీ మాత్రమేనని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో పేదలకు ఒరిగేదేమీ లేదు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు అవి ఏం చేశారో చెప్పాలి. తల్లికి వందనం లో కోత పెట్టారు. చేనేతలను ఆదుకునే ఒక్క పథకం లేదు. గృహ నిర్మాణ కేటాయింపులు లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం మోసం చేసింది. గట్టిగా అడిగితే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కేసులు పెడుతున్నారు’’ అని బొమ్మి ఇజ్రాయెల్‌ మండిపడ్డారు.

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement