
సాక్షి, అమరావతి: భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్‌ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది.
ఎన్నికల హామీలను గాలికి వదిలేసి..
ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది.
తల్లికి వందనం పథకం నిధులకు కోత విధించింది. బడ్జెట్‌లో 8,276 కోట్లు మాత్రమే తల్లికి వందనం పథకానికి కేటాయించింది. 12 వేల కోట్ల కుపైగా తల్లికి వందనం పథకానికి అవసరం. గత ఏడాది తల్లికి వందనంకి నిధులు కేటాయించిన ప్రభుత్వం.. ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.
దీపం పథకానికి భారీగా కోత
దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్ధిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్‌లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది.
డ్వాక్రా మహిళలకు టోకరా
డ్వాక్రా మహిళలకు బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్‌లో చూపించలేకపోయింది.

అన్నదాత సుఖీభవకు కేటాయించింది ఇంతే
అన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే కేటాయించింది. రైతుకు 20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం. 10 వేల 400 కోట్లకు 6,300 కోట్లే కేటాయింపులు చేసింది.
ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్
ఉచిత బస్సు హామీకి బడ్జెట్‌లో తుస్సు మనిపించింది ఉచిత బస్సు పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. నిరుద్యోగులను నిండా ముంచేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రస్తావేనే లేకుండా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగులకు 3 వేలు నిరుద్యోగ భృతికి ప్రభుత్వం ఎగనామం పెట్టింది.
ఇదీ చదవండి: బూతులు తిడుతూ నీతులు..
Comments
Please login to add a commentAdd a comment