AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా | AP Assembly Budget Session 2024 Day 3 Live Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా

Published Thu, Nov 14 2024 9:29 AM | Last Updated on Thu, Nov 14 2024 6:40 PM

AP Assembly Budget Session 2024 Day 3 Live Updates

AP Assembly Budget Session Day 3 Update

 అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడింది.

అసెంబ్లీ మీడియా పాయింట్

వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

  • బడ్జెట్‌పై  చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు
  • పవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారు
  • అనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారు
  • ఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు
  • తమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు
  • లోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారు
  • బడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారు
  • గతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం.

వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

  • ప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.
  • అరకొర బడ్జెట్ పెట్టి...నిధులు కేటాయించారు.
  • ఈ బడ్జెట్‌తో  తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారు.
  • దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమంది ఇస్తారనేది మేం ప్రశ్నించాం.
  • రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారు.
  • ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కలేవి.
  • హోంమంత్రి గారు ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదు.
  • దమ్ముంటే మీరు కేటాయించిన 3200 కోట్ల లెక్క చూపించండి.
  • టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.
  • ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి.

వైఎస్సార్‌సీపీ  ఎమ్మెల్సీ ఇజ్రాయల్

  • సభలో బడ్జెట్‌పై  చర్చకు అడుగడుగా అడ్డుపడ్డారు.
  • కావాలనే సభను పక్కదారి పట్టించారు.
  • మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు.
  • మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేం ప్రతిపక్ష హోదా ఉందని కోరాం.
  • ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా... సభలో మైకు ఇవ్వకుండా అవమానించడం పద్దతేనా?
  • చంద్రబాబు సభకు ఎందుకు రాలేదంటే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.
  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.
  • ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.

ఎమ్మెల్సీ,వంకా రవీంద్రనాథ్‌

  • నేను తొలిసారి బడ్జెట్ చర్చలో పాల్గొన్నా
  • సభ చాలా హుందాగా సాగుతుందని భావించా
  • ప్రతిపక్ష పార్టీ సభ్యులను అధికారపార్టీ సభ్యులు మాట్లాడకుంటా చేశారు
  • చర్చ జరగకుండా గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు లేవనెత్తి నానా గొడవ చేశారు
  • రేపైనా ప్రతిపక్ష పార్టీకి అడ్డుకోకుండా అధికారపార్టీ సభ్యులు సంయమనం పాటించాలి
  • సభ సజావుగా సాగేలా సహకరించాలి.

    మండలి రేపటికి వాయిదా
  • మండలిలో బడ్జెట్ లో  వైస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడి..
  • సంబంధం లేని అంశాల్ని ప్రస్తావన చేస్తూ సభలో గందరగోళం..
  • అడుగడుగునా వరుదు కల్యాణి ని సభలో మాట్లాడకుండా అడ్డుకున్న టీడీపీ సభ్యులు..
  • వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ల  ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్‌ గగ్గోలు
  • సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ సూచించిన బొత్స..
  • గందరగోళం నడుమ సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్
     

శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వర్సెస్‌ మంత్రులు

  • బడ్జెట్‌పై వరుదు కల్యాణి ప్రసంగం
  • వరుదు కల్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మహిళా మంత్రులు
  • అనిత, సవితలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం 
  • చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స, ఇతర ఎమ్మెల్సీలు

 

బాబు సర్కార్‌ను ప్రశ్నించిన YSRC ఎమ్మెల్సీలు

  • మండలిలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న వైస్సార్సీపీ MLC లు..
  • 2014 నుండి 2019 వరకు  ప్రభుత్వంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్స్‌  నిర్వహించారు
  • ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?
  • ఇప్పుడు సంపద సృష్టిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు..
  • తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే 12 వేల కోట్లు కావాలి..
  • అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 20వేల కింద ఇస్తే 10716 కోట్లు కావాలి
  • మహిళలకు 18 వేల చెప్పునిస్తే 32400 కోట్లు కావాలి
  • ఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదు..
    కుంభ రవిబాబు

 

  • కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది..
  • సూపర్ సిక్స్ కి 74,287 కోట్లు కావాలి..
  • ఎన్నికల ముందు కొట్టిన డప్పు.. బడ్జెట్లో మొగ లేదు..
  • మేనిఫెస్టో కి బడ్జెట్ కి మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అయింది..
  • ప్రజాగలం ప్రజా గరాళమైంది
  • బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల గారడీ అయింది..
    వరుదు కళ్యాణి,

 

ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్‌ ఎన్నిక

  • ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా  ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు
  • ఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
     
  • అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు
     
  • స్వల్ప వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన  మండలి


శాసన మండలి వాయిదా

  • వైఎస్సార్‌సీపీ నిరసనలతో దద్దరిల్లిన శాసన మండలి
  • సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై చర్చకు YSRCP పట్టు
  • అరగంటపాటు నినాదాలతో  హెరెత్తిన మండలి
  • అయినా చర్చకు మండలి చైర్మన్‌ నిరాకరణ
  • పొడియం చుట్టు ముట్టి సేవ్‌ డెమోక్రసీ.. వీ వాంట్‌ జస్టిస్‌ నినాదాలు చేసిన  YSRCP ఎమ్మెల్సీలు
  • ఈ ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేసిన చైర్మన్‌

 

వీ వాంట్‌ జస్టిస్‌.. మండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

  • మండలి చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టిన YSRCP ఎమ్మెల్సీలు
  • వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు 
  • సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు
  • ఎమ్మెల్సీలు నిరసన మధ్యలోనే మాట్లాడిన ఇతర పార్టీల సభ్యులు

మండలిలో వైఎస్సార్‌సీపీ నిరసన

  • ప్రారంభమైన శాసన మండలి
  • సోషల్ మీడియా అరెస్టు లపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం
  • డీఎస్సీ పై పీడీఎఫ్ వాయిదా తీర్మానం
  • రెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్
  • పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ

 

 

 

ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు  

  • ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు
  • మూడో రోజు మొదలైన ప్రశ్నోత్తరాలు 
  • అనంతరం బడ్జెట్ పై చర్చ

 

  • మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

  • సోషల్ మీడియా  కార్యకర్తలపై అక్రమకేసుల బనాయింపు పై సభలో చర్చించాలని కోరుతూ తీర్మానం
  • శాసన మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు

 

డిప్యూటీ స్పీకర్‌ ఎంపిక నేడు!

  • మధ్యాహ్నం  12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.
  • డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు నామినేషన్‌ 
  • ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న శాసన సభ స్పీకర్ అయ్యన పాత్రుడు...

 

నేడు అసెంబ్లీ లో 5 బిల్లులు

  • ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024...
  • ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ సిటీ డ్యూటీ బిల్లు - 2024.
  • ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024..
  • ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు  - 2024..
  • ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024.
  • నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న  మంత్రులు...
  • ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 - 29. పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి 
    కొoడపల్లి శ్రీనివాస్..
  • ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ పాలసీ 2024 - 29..
  • ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 - 29..
  • ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. పై సభ లో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టి జీ భరత్....

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement