Assembly budget session
-
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మార్చి19 వరకు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Day-1 లైవ్ అప్డేట్స్అసెంబ్లీ రేపటికి వాయిదాగవర్నర్ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో బీఏసీ సమావేశం జరగనుంది. 15 రోజులు అసెంబ్లీ నిర్వహించాలని బీఏసీ నిర్ణయంమార్చి 19 వరకు అసెంబ్లీ సమావేశాలు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే: బొత్సఅసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యీ బొత్స సత్యనారాయణ కామెంట్స్..ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ముక్తకంఠంతో నినదించాం.సభలో రెండే పక్షాలు.. ఒకటి ప్రతిపక్షం, రెండోది అధికారపక్షం.రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.ప్రజల గొంతుక వినిపించే బాధ్యత ప్రతిపక్షానిదే.ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుంది. రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.కేంద్రంతో మాట్లాడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం అని మాత్రమే చెబుతున్నారు.మరి ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి.కూటమి గ్యారెంటీ అంటేనే మోసం.అందుకే ప్రజల కష్టాలు చెప్పేందుకే మేము ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం.రైతుల కష్టాలు, సమస్యలపై పోరాడితే మాపై కేసులు పెడుతున్నారు.రైతుల బాధలపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్య లేదు.తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవు.ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూశాకే మా తదుపరి చర్య ఉంటుంది.ప్రజల సమస్యల కోసం ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం. ప్రభుత్వ చొక్కా పట్టుకుంటాం.మిర్చీకి వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. రైతుల సమస్యలకు ఎన్నికల కోడ్ అడ్డొస్తుందిమ్యూజికల్ నైట్ లకు ఎన్నికల కోడ్ వర్తించదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా?: చంద్రశేఖర్అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే చంద్రశేఖర్ కామెంట్స్..కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ప్రతిపక్షం ఇవ్వకపోవడం అంటే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లే.అధికార మదంతో ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్న చేస్తున్నారు.అధికార పక్షానికి సమాధానం చెప్పే సత్తా లేదా?.మీరు చేసే దోపిడీని బయటపెడతామాని భయమా?.మా 11 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేదా?.ప్రజస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా?దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మీడియాపై నిషేధం విధించారు.41 ఓటింగ్ ఇచ్చారు ప్రజలు.. అంటే ప్రతిపక్షం అంటే ఇదేగా..6 శాతం ఓట్లు వచ్చిన వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి పక్కన పెట్టుకున్నారు..ప్రజా పద్దుల కమిటీ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికార పార్టీ వల్లే అనుమభవిస్తున్నారు..కూటమి నిరంకుశత్వంగా వ్యహరిస్తోందిప్రధాన ఛానల్స్ పై ఆంక్షలు పెట్టడమేంటిప్రతిపక్ష గొంతు నొక్కడం కోసమే ఇలా చేస్తున్నారునోటీసులు కూడా ఇవ్వకుండా నాలుగు ఛానల్స్ బహిష్కరించిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా?.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్..దేశ చరిత్రలో ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఉంటుందా?.ఎందుకు ఏపీలోనే ప్రతిపక్షాన్ని గుర్తించడం లేదు.కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తామనే కూటమికి భయం పట్టుకుంది.ఆ భయంతో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదాఏపీలో ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదునిరుద్యోగులు...రైతులు.. మహిళలు.. చిన్నపిల్లలను అందరినీ మోసం చేశారు15 వేల కోట్లు విద్యుత్ ధరలు పెంచారునిత్యావసర ధరలు 60% పెంచారుప్రజల తరపున ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదుతొమ్మిది నెలల్లో లక్ష కోట్లకు పైగా అప్పులు చేశారుచంద్రబాబుకి కూడా అప్పు రత్న అవార్డు ఇస్తావా పవన్ సమాధానం చెప్పాలిపథకాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారువైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేహోదా ఇచ్చే వరకూ పోరాడుతాంప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి: పెద్దిరెడ్డివైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.అబద్ధాలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.కూటమి ప్రభుత్వానికి, తాలిబన్ల పాలనకు తేడా లేదు. ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్ఏపీ అసెంబ్లీ నుంచి వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ నేతలు బహిష్కరించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై వైఎస్సార్సీపీ నేతల నిరసనఅసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసిన నేతలు👉ప్రారంభమైన గవర్నర్ ప్రసంగంఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంప్రసంగం చదువుతున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: వైఎస్సార్సీపీ సభ్యులుఅసెంబ్లీలో వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనఅసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి.ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని నిరసన👉 ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం👉 ఏపీ అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ జగన్‌కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంఅసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ప్రధాన ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌ను గట్టిగా నిలదీయాలని వైఎస్సార్సీపీ నిర్ణయంప్రజా సమస్యలపై చర్చించేందుకు సమయం ఇవ్వాలని కోరనున్న జగన్ఆ సమయాన్ని హక్కుగా ఇవ్వాలని డిమాండ్👉కాసేపట్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ అనంతరం సభ వాయిదా పడనుంది. 👉అసెంబ్లీకి చేరుకున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీని తాకిన రెడ్‌బుడ్ రాజ్యాంగందేశం ఎన్నడూ, ఎక్కడా, ఏ అసెంబ్లీలోనూ లేని విధంగా మీడియా కవరేజీపై ఆంక్షలు.అసెంబ్లీ సమావేశాలకు నాలుగు టీవీ చానెల్స్‌పై ఆంక్షలు విధింపు.సాక్షితో పాటుగా మరో మూడు టీవీ చానెళ్లకు అనుమతి నిరాకరించారు.ఎలాంటి నోటీసులు లేకుండా టీవీ చానెళ్లపై ఆంక్షలు 👉 ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.👉25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది.👉ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
24 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్(Legislative Assembly budget) సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆరోజు ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేరుతో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోజు వీలుకాని పక్షంలో వచ్చే నెల 3వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి.మూడు వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఈ నెల 22, 23 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. వీటి ప్రారంభానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సోమవారం ఢిల్లీ వెళ్లారు. శిక్షణా తరగతులకు వచ్చేందుకు ఓం బిర్లా అంగీకరించినట్లు వారు తెలిపారు. ముగింపు కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆహ్వానించినట్లు చెప్పారు. -
AP: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా
AP Assembly Budget Session Day 3 Update అసెంబ్లీ సమావేశాలు శుక్రవారానికి వాయిదా పడింది.అసెంబ్లీ మీడియా పాయింట్వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుబడ్జెట్పై చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారుపవర్ సెక్టార్ పై చర్చ జరగకుండా చేశారుఅనేక మీటింగ్ లలో కరెంట్ ఛార్జీలు పెంచనని చంద్రబాబు చెప్పారుఒక్క రూపాయి ఛార్జీ పెంచనని చెప్పి ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారుతమ మోసాన్ని ప్రజలకు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారులోకేష్ సందర్భం లేని చర్చను తెరపైకి తెచ్చారుబడ్జెట్ పై వరుదు కళ్యాణి మాట్లాడుతుంటే మా తల్లిని అవమానించారంటూ లోకేష్ చర్చను తప్పుదారి పట్టించారుగతంలో ఎప్పుడూ లేని పరిస్థితులను సభలో చూస్తున్నాం.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణిప్రజల పక్షాన మాట్లాడకుండా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.అరకొర బడ్జెట్ పెట్టి...నిధులు కేటాయించారు.ఈ బడ్జెట్‌తో తమ తలరాతలు మారిపోతాయని ప్రజలు ఆశపడ్డారు.దీపం పథకం కోసం కేటాయింపులు ఎంతమంది ఇస్తారనేది మేం ప్రశ్నించాం.రాష్ట్రంలో 2.7 కోట్ల మంది మహిళలున్నారు.ఒక్కొక్కరికి ఏడాదికి 18 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కలేవి.హోంమంత్రి గారు ఈనాడు పేపర్ చూసి చెప్పడం కాదు.దమ్ముంటే మీరు కేటాయించిన 3200 కోట్ల లెక్క చూపించండి.టీచర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు.ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలి.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయల్సభలో బడ్జెట్‌పై చర్చకు అడుగడుగా అడ్డుపడ్డారు.కావాలనే సభను పక్కదారి పట్టించారు.మా నాయకుడు సభ నుంచి పారిపోలేదు.మాకు ప్రజాబలం ఉంది కాబట్టి మేం ప్రతిపక్ష హోదా ఉందని కోరాం.ప్రతిపక్ష నేతగా గుర్తించకుండా... సభలో మైకు ఇవ్వకుండా అవమానించడం పద్దతేనా?చంద్రబాబు సభకు ఎందుకు రాలేదంటే లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి.ప్రతిపక్ష గొంతును నొక్కాలని చూస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది.ఎమ్మెల్సీ,వంకా రవీంద్రనాథ్నేను తొలిసారి బడ్జెట్ చర్చలో పాల్గొన్నాసభ చాలా హుందాగా సాగుతుందని భావించాప్రతిపక్ష పార్టీ సభ్యులను అధికారపార్టీ సభ్యులు మాట్లాడకుంటా చేశారుచర్చ జరగకుండా గతంలో ఎప్పుడో జరిగిన అంశాలు లేవనెత్తి నానా గొడవ చేశారురేపైనా ప్రతిపక్ష పార్టీకి అడ్డుకోకుండా అధికారపార్టీ సభ్యులు సంయమనం పాటించాలిసభ సజావుగా సాగేలా సహకరించాలి.మండలి రేపటికి వాయిదామండలిలో బడ్జెట్ లో వైస్సార్సీపీ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక టీడీపీ సభ్యుల ఎదురుదాడి..సంబంధం లేని అంశాల్ని ప్రస్తావన చేస్తూ సభలో గందరగోళం..అడుగడుగునా వరుదు కల్యాణి ని సభలో మాట్లాడకుండా అడ్డుకున్న టీడీపీ సభ్యులు..వైస్సార్సీపీ ఎమ్మెల్సీ ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గతంలో తమ తల్లిని తిట్టారంటూ లోకేష్ గగ్గోలుసభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదంటూ సూచించిన బొత్స..గందరగోళం నడుమ సభను రేపటికి వాయిదా వేసిన చైర్మన్ శాసన మండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ మంత్రులుబడ్జెట్పై వరుదు కల్యాణి ప్రసంగంవరుదు కల్యాణి మాట్లాడుతుండగా అడ్డు తగిలిన మహిళా మంత్రులుఅనిత, సవితలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిన బొత్స, ఇతర ఎమ్మెల్సీలు బాబు సర్కార్‌ను ప్రశ్నించిన YSRC ఎమ్మెల్సీలుమండలిలో బడ్జెట్ పై చర్చలో పాల్గొన్న వైస్సార్సీపీ MLC లు..2014 నుండి 2019 వరకు ప్రభుత్వంలో మూడు పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించారుఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు?ఇప్పుడు సంపద సృష్టిస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్నారు..తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇస్తే 12 వేల కోట్లు కావాలి..అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకు 20వేల కింద ఇస్తే 10716 కోట్లు కావాలిమహిళలకు 18 వేల చెప్పునిస్తే 32400 కోట్లు కావాలిఎన్నికల ముందు చెప్పిన దానికి బడ్జెట్లో చూపించిన దానికి పొంతన లేదు..కుంభ రవిబాబు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసింది..సూపర్ సిక్స్ కి 74,287 కోట్లు కావాలి..ఎన్నికల ముందు కొట్టిన డప్పు.. బడ్జెట్లో మొగ లేదు..మేనిఫెస్టో కి బడ్జెట్ కి మధ్య తేడా చూస్తే మైండ్ బ్లాంక్ అయింది..ప్రజాగలం ప్రజా గరాళమైందిబాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఎన్నికల గారడీ అయింది..వరుదు కళ్యాణి, ఏపీ శాసనసభ డిప్యూటి స్పీకర్ ఎన్నికఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుఎన్నికైనట్టు ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ముగిసిన ప్రశ్నోత్తరాలు స్వల్ప వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన మండలిశాసన మండలి వాయిదావైఎస్సార్సీపీ నిరసనలతో దద్దరిల్లిన శాసన మండలిసోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌పై చర్చకు YSRCP పట్టుఅరగంటపాటు నినాదాలతో హెరెత్తిన మండలిఅయినా చర్చకు మండలి చైర్మన్ నిరాకరణపొడియం చుట్టు ముట్టి సేవ్ డెమోక్రసీ.. వీ వాంట్ జస్టిస్ నినాదాలు చేసిన YSRCP ఎమ్మెల్సీలుఈ ఆందోళనలతో శాసన మండలిని వాయిదా వేసిన చైర్మన్ వీ వాంట్ జస్టిస్.. మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలుమండలి చైర్మన్ పోడియంను చుట్టుముట్టిన YSRCP ఎమ్మెల్సీలువీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలుఎమ్మెల్సీలు నిరసన మధ్యలోనే మాట్లాడిన ఇతర పార్టీల సభ్యులుమండలిలో వైఎస్సార్సీపీ నిరసనప్రారంభమైన శాసన మండలిసోషల్ మీడియా అరెస్టు లపై వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానండీఎస్సీ పై పీడీఎఫ్ వాయిదా తీర్మానంరెండు వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలుమూడో రోజు మొదలైన ప్రశ్నోత్తరాలు అనంతరం బడ్జెట్ పై చర్చ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంశాసన మండలిలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంసోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమకేసుల బనాయింపు పై సభలో చర్చించాలని కోరుతూ తీర్మానంశాసన మండలి చైర్మన్ కు వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు డిప్యూటీ స్పీకర్ ఎంపిక నేడు!మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణంరాజు నామినేషన్ ఎన్నిక లాంఛనంగా ప్రకటించనున్న శాసన సభ స్పీకర్ అయ్యన పాత్రుడు... నేడు అసెంబ్లీ లో 5 బిల్లులుఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - 2024...ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రసిటీ సిటీ డ్యూటీ బిల్లు - 2024.ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ బిల్లు - 2024..ఆంధ్ర ప్రదేశ్ ఆయుర్వేదిక్ మరియు హోమియోపతి మెడికల్ ప్రాక్టిషనర్స్ బిల్లు - 2024..ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు - 2024.నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు పాలసీలను సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రులు...ఆంధ్రప్రదేశ్ MSME డవలప్మెంట్ పాలసీ 2024 - 29. పై సభలో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి కొoడపల్లి శ్రీనివాస్..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డవలప్మెంట్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసేసింగ్ పాలసీ 2024 - 29..ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ ప్రయివేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 2024 - 29.. పై సభ లో స్టేట్మెంట్ ఇవ్వనున్న మంత్రి టి జీ భరత్.... -
అసెంబ్లీ సమావేశాల్లోనూ డైవర్షన్ రాజకీయాలేనా?!
గుంటూరు, సాక్షి: ఏపీలో నేటి(నవంబర్ 11) నుంచి జరగనున్న అసెంబ్లీ ఫుల్ బడ్జెట్ సమావేశాలను వైఎస్సార్సీపీ బహిష్కరించింది. ఏకపక్షంగా సభను నిర్వహించుకుంటున్న కూటమి ప్రభుత్వం.. తమకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకపోవడంపై నిరసనగానే ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీకి 40% ఓటు షేర్ వచ్చింది. శాసనసభలో అధికార కూటమి, వైఎస్సార్సీపీ మాత్రమే ఉంది. అయినా కూడా ప్రతిపక్షంగా గుర్తించి స్పీకర్ మైకు ఇవ్వడం లేదు. గత సమావేశాల్లోనూ ఇది జరిగింది. అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్లడం ఎందుకు? అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అన్నారు. అంతేకాదు.. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు మీడియా ద్వారా ప్రశ్నలు సంధించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులే తనకు స్పీకర్ లంటూ ఆయన వ్యాఖ్యానించారు కూడా.రెండుసార్లు ఓటాన్!ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగుస్తుండటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది.గత సమావేశాల్లో జరిగింది అదేగా..సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించే లక్ష్యంతో కనిపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. బడ్జెట్ సమావేశాల వంకతో డైవర్షన్ రాజకీయాన్ని కొనసాగించాలనుకుంటోంది. గత సమావేశాల్లోనూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు, ఆరోపణలతో కాలయాపన చేసింది. శ్వేత పత్రాల పేరుతో హడావిడి చేసింది. ఇక ఇప్పుడు బడ్జెట్లోనూ కోతలు, కీలక హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే డ్రామాను ప్రదర్శించే అవకాశం లేకపోలేదని అంచనా. బడ్జెట్ ఇలా.. నేటి ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎం చాంబర్లో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. శాసన సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అదే సమయానికి శాసన మండలిలో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తి అయిన అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను చదువుతారు. బడ్జెట్ అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి.ఇదీ చదవండి: ఏపీలోనూ ‘కోటా’ తరహా ఘటనలు!! -
తెలంగాణ అసెంబ్లీ.. మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ ఎమోషనల్ కామెంట్స్
Updates..తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా.👉స్కిల్ యూనివర్సిటీపై చర్చ..సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్..నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు.అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?.వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నాను.సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దు.వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉంది.సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారు.వాళ్లను సొంత అక్కల్లాగే భావించాను.ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లింది.మరో అక్క కోసం ప్రచారానికి వెళ్లే నాపై కేసులు నమోదయ్యాయి.దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారు.దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు.సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను ఎత్తుకొని బయటకు తీసుకువచ్చి అరెస్ట్ చేసిన పోలీసులుసీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.కేటీఆర్ కామెంట్స్..సీఎం మొండి వైఖరీ అహంకార వైఖరీ మార్చుకోవాలి.వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సీఎం ఛాంబర్ ముందు నిలబడి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలుసబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మి.మహిళ ఎమ్మెల్యేలను లిఫ్టింగ్ చేస్తున్న మహిళ పోలీసులు.వెహికల్ సిద్దంగా ఉంచిన పోలీసులు.కాసేపట్లో సబిత ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీ, సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్.తెలంగాణ భవన్‌కు తరలించనున్న పోలీసులు. సీఎం రేవంత్ కామెంట్స్..ఐటీ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.ఏ దేశానికైనా సాంకేతిక నిపుణులు కావాలి.హైదరాబాద్‌లో ఐటీ రంగానికి రాజీవ్‌గాంధీ పునాదులు వేశారు.రాజీవ్ హయాంలోనే మాదాపూర్‌లో ఐటీ సంస్థలు ప్రారంభమయ్యాయి.దేశ, విదేశాల్లో యువత ఐటీ రంగంలో సత్తా చాటుతున్నారు.అత్యున్నత సంస్థల్లో తెలుగువారు ఉండటం గర్వకారణం.స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఎంతో గొప్ప ఆలోచన.గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశాయి.అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీనే.గాంధీజీ స్పూర్తితోనే స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం.విద్యకు పెద్దపీట వేస్తున్నాం.గ్రామీణ ప్రాంతాల్లో యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నాం. 👉అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ.👉 అసెంబ్లీ వద్ద గందరగోళం.. అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ లోపలికి వచ్చే ప్రాంతంలో మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైటాయింపు.సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 👉సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానిస్తామంటున్న నేతలు..👉హరీష్ రావు కామెంట్స్.. ప్రతిపక్షం తరుపున ఎవరు మాట్లాడాలనేది మేము నిర్ణయించి చెప్తాం.అందుకు అనుగుణంగా సభలో మీరు అవకాశం ఇవ్వాలి.కానీ మీరు కొత్త సంప్రదాయం నెలకొల్పుతున్నారు.ఇది కౌరవ సభ లాగా నడుస్తుంది.అంతిమంగా పాండవులే గెలుస్తారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్తారు.నిన్న, ఈరోజు సభ జరిగిన తీరు మా హృదయాలను కలిచి వేసింది.ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలపై సీఎం మాటలు బాధరకం 👉సభలో కొనసాగుతున్న గందరగోళం.ఉదయం నుంచి సభలో కింద కూర్చొని నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం.: సీఎం రేవంత్ఇది ప్రధానమైన అంశం.ఇంత పెద్ద అంశం మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉండి మాట్లాడాలి.లేదంటే వారి వారసులు ఎవరు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు: సీఎం రేవంత్. 👉కేటీఆర్ కామెంట్స్..ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాంమొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.మా పార్టీ అధినేత కేసీఆర్ సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు 👉సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కామెంట్స్..రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పరిపాలించిన బీఆర్ఎస్ సభ్యులు సభలో కింద కూర్చోవడం బాధాకరంసీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రా రెడ్డికి అక్క, తమ్ముళ్ల అనుబంధం ఉందిసమస్యను స్పీకర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటే మంచిదిసభ్యుడిగా నేను సూచన చేస్తున్నమహిళలను గౌరవించే వ్యక్తులలో మొదటి వ్యక్తిని నేనుఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాంఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.ఎమ్మెల్యే సబితకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్.బీఆర్ఎస్ ఆందోళన వర్గీకరణకు వ్యతిరేకంలా ఉంది: కడియం శ్రీహరిప్రతీ ఒక్కరూ తీర్పును గౌరవించాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం.మీ పద్దతి సరిగా లేదు. 👉సీఎం రేవంత్ కామెంట్స్..సుప్రీంకోర్టు తీర్పుపై సభలో స్పందించిన సీఎం రేవంత్ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై ముందుకెళ్తాం.తెలంగాణలో వర్గీకరణను అమలు చేస్తాం.ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుపరుస్తాం. 👉అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్..ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది.వారికి మైక్ ఇవ్వండి.వాళ్ళు ఆందోళన, నినాదాలు చేస్తుంటే అసెంబ్లీ కొనసాగడం ప్రజాస్వామ్య విధానం కాదు.వాళ్లకు మైక్ ఇవ్వండి.. లేదా సస్పెండ్ చేయండి 👉మంత్రి శ్రీధర్ బాబు సీరియస్సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు.పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?.నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు..కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు.స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు.యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా.👉 బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..స్కిల్ యూనివర్శిటి బిల్లును స్వాగతిస్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలిస్కిల్ యూనివర్సిటీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలికాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా SC, ST లకు 12 లక్షలు, BCలకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. 👉సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. 👉 బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం 👉స్పీకర్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.👉మా ఆవేదనను అర్దం చేసుకున్నారు స్పీకర్.👉మేము నల్ల బ్యాడ్జీలు ధరించాం.👉మీరు నల్ల డ్రెస్సు వేసుకొని వచ్చారంటూ సభలో మాట్లాడిన హరీష్ రావు👉సభలో బీఆర్ఎస్ నేతల నినాదాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ 👉బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ హెచ్చరిక.👉అన్ పార్లమెంటరీ పద్దతిలో వ్యవహరిస్తే మైక్ ఇవ్వను..👉ఇష్టారీతిన వ్యవహరిస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్బీఆర్ఎస్ సభ్యులకు రాజకీయాలు తప్ప.. సభ నడవాలని లేదు.నిరుద్యోగుల గురించి ఏనాడూ కేటీఆర్ ఆలోచించలేదు.ప్రభుత్వ ఉధ్యోగాలే కాదు.. ప్రైవేటు రంగంలో స్థిరపడేందుకు స్కిల్ యూనివర్సిటీ.కేసీఆర్ మహిళా వ్యతిరేకినిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే.. ఇలాంటి రాజకీయాలు మానుకోండి. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. 👉ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉సభలో బీఆర్ఎస్ నేతల నినాదాలు.👉బీఆర్ఎస్ నేతలపై స్పీకర్ ఆగ్రహం.👉సభా నాయకుడి రాగానే ఆందోళన చేయడం సరికాదన్న స్పీకర్ 👉స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు.👉రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీని ప్రారంభించామన్న శ్రీధర్ బాబు. 👉సభ ముందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు.👉నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ వాయిదా తీర్మానంనిన్న శాసనసభలో సీఎం రేవంత్.. బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు.గౌరవ సభ్యులు, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి.ఈ అంశంపై చర్చకి వాయిదా తీర్మానంబీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కామెంట్స్..మా వాళ్ళని ఉదయం 5 గంటల నుంచి అరెస్టులు చేస్తున్నారు.ఇదేనా మీరు తెచ్చిన ప్రజాపాలన.ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటే మేము ఎందుకు ఆపుతాం.వారిలాగా సంస్కారం లేని వాళ్లం కాదు.మాకు ఎలాగూ అసెంబ్లీలో మైక్ ఇవ్వరు మాట్లాడటానికి.ఇక్కడ కూడా మాట్లడినివ్వరా?.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా?.ప్రజలకు సంక్షేమం చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా?.సభను తప్పుదారి పట్టించే విధంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించారు.వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని సబితకు తెలియదా?.రాష్ట్ర మహిళలను అగౌరపరిచినట్లుగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తోంది.ప్రతీ మహిళలను ఇందిరమ్మలా కాంగ్రెస్ చూస్తుంది.గతంలో కేసీఆర్‌ను విమర్శించిన విషయాన్ని సబిత మర్చిపోయారా?.మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. కాసేపట్లో ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.నల్లబ్యాడ్జీలతో నిరసన చెబుతూ లాబీ నుంచి అసెంబ్లీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలుబీఆర్ఎస్ వాయిదా తీర్మానంబుధవారం శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ మహిళ శాసన సభ్యుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలుగౌరవ సభ్యుల, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వున్నాయని చర్చకి వాయిదా తీర్మానం ఈరోజు సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగా, నేటి సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఏడో వార్షిక రిపోర్టు సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను టేబుల్ చేయనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండో వార్షిక నివేదికను టేబుల్ చేయనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.ఈరోజు మూడు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.1. తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లు.2. తెలంగాణ లా డిపార్ట్మెంట్ (ఛేంజ్ ఆఫ్ ఆక్రోనేమ్స్)బిల్లు.3. తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2 -
అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సబిత కన్నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కామెంట్స్ నేపథ్యంలో ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్‌లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్‌లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.సబితను సొంత అక్కగానే భావించాను.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.అసెంబ్లీలో సబిత భావోద్వేగం.నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.పార్టీ మార్పులపై చర్చ జరగాలి.రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి నేనే ఆహ్వానించాను.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్‌ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లారు.ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.మల్కాజ్‌గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందారు.రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ నేతల నిరసన..స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్‌కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదుఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు. -
రేవంత్ Vs కేటీఆర్: ‘సీఎం ఏం చదివారో నాకు తెలియదు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందన్నారు రేవంత్.. ఆయనకు వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానమిస్తూ నేను కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ప్రజల మధ్యలో ఉన్నాను అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్..చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాకేటీఆర్కి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్లకు పోలిక ఉందికేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్కేటీఆర్కి ఓపిక, సహనం ఉండాలికేటీఆర్కు అనుకోకుండా పదవి వచ్చిందిసూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారుపది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం.బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా?దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు.ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.హుస్సేన్‌సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్ న్యూయార్క్ చేస్తామన్నారు.గతంలో కేసీఆర్ చెప్పినట్టు మేము చెప్పలేదు.ఎంఎంటీస్ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్ రెచ్చగొడుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.సిరాజ్, నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 జాబ్ ఇవ్వాలని నిర్ణయించాం.నిఖత్ జరీన్‌కు ఉద్యోగం ఇస్తానని జాబ్ ఇవ్వలేదు.నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుమహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.ఆజామాబాద్‌లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది. కేటీఆర్ కౌంటర్..పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్‌పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.హైదరాబాద్, గుంటూరులో చదువుకున్నా.విదేశాల్లో కూడా చదివాను.ఉద్యోగం కూడా చేశానుఅమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.ఆయన చదువు గురించి నాకు తెలియదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.రాష్ట్రంలో పొలిటికల్ దాడులు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.దావోస్‌కు వెళ్తున్న సీఎం రేవంత్‌కు అభినందనలు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.బోగస్ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.అదానీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే రేవంత్ వెల్కమ్ చెబుతున్నారు. రేవంత్ కౌంటర్..నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని. -
వైఎస్సార్సీపీ వాకౌట్.. అసెంబ్లీ రేపటికి వాయిదా
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ గళం విప్పింది. ఆ పార్టీ చట్ట సభ్యుల నినాదాల మధ్యే సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. నల్లకండువాలతో సభకు వచ్చిన సభ్యులు.. గవర్నర్ ప్రసంగ సమయంలోనూ ‘హత్యా రాజకీయాలు నశించాలి.. సేవ్ డెమోక్రసీ’ నినాదాలు చేశారు. అయినా గవర్నర్ ప్రసంగం కొనసాగడంతో.. నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగం ముగియడంతో సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించనున్నారు. పోలీసుల ఓవరాక్షన్అంతకు ముందు.. లా అండ్ ఆర్డర్ ఘోర వైఫల్యంపై అసెంబ్లీకి జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ నినాదాలు చేస్తూ ప్లకార్డులతో లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు.. ప్లకార్డుల్ని లాక్కునే యత్నం చేశారు. ఈ క్రమంలో అవి చినిగిపోవడంతో.. జగన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులు వైఖరి అత్యంత దారుణంగా ఉంది’’ అని అన్నారాయన. దీంతో చేసేది లేక పోలీసులు కండువాలతోనే సభ్యుల్ని లోపలికి అనుమతించారు. -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు వెళ్లనున్న బీజేపీ
-
ఐదు బిల్లులు.. ఒక తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక తీర్మానంతో పాటు ఐదు బిల్లులను శాసనసభ ఆమోదించింది. వాల్మీకి బోయలను, కాయస్త లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. మున్సిపల్, పంచాయతీరాజ్, జయశంకర్ యూనివర్సిటీ సవరణ బిల్లులు, రెండు ద్రవ్య వినిమయ బిల్లులు కలుపుకొని మొత్తం ఐదు బిల్లులను ఆమోదించింది. అసెంబ్లీ చివరి రోజు ఆదివారం ప్రశ్నోత్తరాల తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పత్రాలను మంత్రి జగదీశ్‌రెడ్డి సభకు సమర్పించారు. రాష్ట్రంలో ఫీజుల రీయింబర్స్‌మెంటుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు. బిల్లులను ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
Telangana: గవర్నర్‌కు సాదర స్వాగతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు శుక్రవారం సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం 11.55 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. తర్వాత 12.05 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. తర్వాత శాసనసభ హాల్ వరకు గవర్నర్‌ను సీఎం, స్పీకర్, చైర్మన్ స్వయంగా తోడ్కొని వచ్చారు. జాతీయ గీతాలాపన అనంతరం 12.12 గంటలకు ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం.. 12.44 గంటల వరకు 32 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమయంలో మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిశాక గవర్నర్ సభ్యుల స్థానాల వద్దకు వచ్చి అభివాదం చేశారు. అనంతరం గవర్నర్‌కు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద సీఎం, మండలి చైర్మన్, స్పీకర్ తదితరులు వీడ్కోలు పలికారు. యధాతథంగా.. ప్రభుత్వం, గవర్నర్ మధ్య కొంతకాలంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని ప్రజాకవి కాళోజీ కవితా పంక్తులతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ‘కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులతో ముసిరిన భవితవ్యం ఎంతో..’అని స్వాతంత్య్ర సమరయోధుడు, కవి దాశరథి కృష్ణమాచార్య పంక్తులతో ముగింపునకు వచ్చారు. చివరిలో ‘జయ జయహే తెలంగాణ.. జై తెలంగాణ.. జై హింద్’ నినాదాలతో ముగించారు. ప్రసంగంలో వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ, ‘తెలంగాణ మోడల్’కు పెద్దపీట వేశారు. మొత్తంగా ప్రభుత్వం నుంచి అందిన ప్రసంగ పాఠాన్ని చదివి ఎక్కడా వివాదానికి తావులేకుండా ముగించారు. ఎక్కడా విమర్శలు లేకుండా.. గవర్నర్ ప్రసంగ పాఠంలో ఎక్కడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శ లేకపోవడం గమనార్హం. గవర్నర్ ప్రసంగాన్ని రాజకీయ విమర్శలకు వేదికలా కాకుండా కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపించింది. ప్రసంగంలో అనేక మార్లు గవర్నర్ ‘మై గవర్నమెంట్ (నా ప్రభుత్వం)’అనే పదాన్ని వాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాల ఫలితాలను వివరించారు. ఇటీవల ప్రభుత్వ పనితీరుపై రాజ్‌భవన్ వేదికగా విమర్శలు సంధించిన గవర్నర్ నోట ప్రభుత్వ పనితీరును సానుకూలంగా ఆవిష్కరించే రీతిలో ప్రసంగ పాఠం సాగడం గమనార్హం. సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే గవర్నర్ అసెంబ్లీలో అడుగు పెట్టారు. -
గవర్నర్‌ను ఎందుకు అసెంబ్లీకి ఆహ్వానించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను అసెంబ్లీకి ఎందుకు ఆహ్వానించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదని నిలదీశారు. బడ్జెట్ అనుమతికి ఇంకా సమయం ఉందన్నారు. కావాలనే గవర్నర్ అనుమతివ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాగా ఫిబ్రవరి 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌పై ధ్వజమెత్తారు. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపని చరిత్ర గతంలో లేదని అన్నారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. -
నేటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్..
సాక్షి, హైదరాబాద్: దాదాపు 30 రోజులు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను కేవలం ఆరు రోజుల్లోనే ముగించడంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020-21 ఏడాదికి సంబంధించిన 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భారీ బడ్జెట్‌ను కేవలం ఆరు రోజులకు మాత్రమే చర్చలను పరిమితం చేసి.. పాస్ చేయించుకుని వెళ్లిన వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం.. శాసనసభా సమావేశాలు ముగిసిన అనంతరం గన్ పార్క్‌లో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దాదాపు 30 రోజులు జరపవలసిన బడ్జెట్ సమావేశాలను ఆరు రోజులకే పరిమితం చేయడంపై ఆయన మండిపడ్డారు. భారీ బడ్జెట్ పైనా సుదీర్ఘంగా చర్చలు జరిపి.. పాస్ చేసుకోవాల్సి ఉండగా, కేవలం ఆరు రోజుల్లోనే సమావేశాలు పూర్తి చేయడంపై భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆరు రోజుల్లో కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని భట్టి విమర్శించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచనలను అధికార పక్షం ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. బడ్జెట్‌ను అధికార పక్షం పాస్ చేయించుకున్న వైనం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. కేసీఆర్ పాలన నియంతృత్వ పాలనలా ఉంది తప్ప ప్రజాస్వామ్య పాలనలా లేదన్నారు, శాసనసభా సమావేశాలు కేవలం అలంకార ప్రాయంగా మారిపోయాయి తప్ప... అర్థవంతమైన చర్చలు జరగడం లేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ రంగం, నీటిపారుదల, క్రుష్ణానదిమీద ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చామని భట్టి చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను రీ డిజైన్ పేరుతో టెండర్లలో అక్రమాలకు పాల్పడి.. భారీ అవినీతికి పాల్పడినట్లు భట్టి ఆరోపించారు. ఇది రాష్ట్రం మీద అదనపు ఆర్థిక భారంలా మారిందని బట్టి అన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ ప్రజల సమక్షంలో పెట్టడంతో పాటు చట్టసభలలో పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు. డీపీఆర్‌లను చట్టసభల్లో ఇవ్వకపోవడంతో ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు అనుమానాలున్నాయన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవడం లేదన్నారు. అప్పులను ప్రభుత్వం విపరీతంగా చేస్తోందన్నారు. ఈ ఏడాది రూ. 48 వేల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ అప్పులు ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా.. చిరవకు రాష్ట్రాన్ని డెడ్ ట్రాప్ లోకి నెట్టేస్తున్నారన్నారు. 2023 నాటికల్లా అప్పులు ఐదున్నర నుంచి 6 లక్షల కోట్ల రూపాయాలకు రాష్ట్ర అప్పులు చేరుకుంటాయని వివరించారు. రాష్ట్రాన్ని కుదవపెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన నిధులను వినియోగించకుండా.. వాటిని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ కార్యదర్శుల అంశాలపై కాంగ్రెస్ శాసనసభా పక్షం.. సభలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నేరుగా సమాధానం ఇవ్వలేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
Telangana: నేటి నుంచి బడి బంద్..
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ప్రకటించింది. మిగతా సెమిస్టర్ల వారికి ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. అయితే సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కూడా తమ పరిధిలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్మీడియట్లో వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ప్రాక్టికల్స్ వాయిదా పడే పరిస్థితి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు పెరిగితే.. ప్రాక్టికల్స్‌కు బదులుగా ఇంటర్నల్ అసెస్మెంట్తో మార్కులు వేసే పరిస్థితి ఉండొ చ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు. పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు సమాధానం చెప్తున్న సమయంలో అత్యవసర ప్రకటన ఉం దంటూ స్పీకర్ పోచారం వెల్లడించారు. ఆ వెంటనే సబితారెడ్డి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘దేశంలో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపి స్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. దానివల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తులు వచ్చా యి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (24 మార్చి) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య కళాశాలలు మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్లైన్ శిక్షణ తరగతులు కొనసాగుతాయి..’’ అని సబితారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 50 రోజులు కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో విద్యా సంస్థలను మూసివేసింది. చాలా వరకు పరీక్షలను కూడా రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్ చేసింది. తర్వాత జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా వాయిదా పడింది. చివరికి విద్యార్థులు నష్టపోతున్నారనే ఆలోచనతో.. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/ డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించింది. చాలా వరకు కార్పొరేట్, పెద్ద ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ విద్యా బోధన చేపట్టగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను (టీశాట్, దూరదర్శన్ పాఠాలు, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు) పాఠాలను ప్రారంభించారు. సాధారణ స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు అమలుచేసిన డిజిటల్ పాఠాలనే విద్యార్థులకు సూచించాయి. ఇలా ఐదు నెలలు కొనసాగాయి.కరోనా నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇవ్వడం, సాధారణ జనజీవనం మొదలుకావడం, ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒత్తిడి తేవడంతో.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలు స్కూళ్లు, కాలేజీలు తెరిచాయి. తర్వాత అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి కూడా ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలని ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తర్వాత నిర్ణయం విద్యాసంస్థల మూసివేతపై అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన కూడా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బంద్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే గతంలో ఆన్లైన్ విద్యా బోధన నిర్వహించినపుడు ప్రభుత్వ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు రొటేషన్ పద్ధతితో 50 శాతం చొప్పున హాజరయ్యారు. ఇప్పుడు వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి ఇంటర్, అదే నెల 17వ తేదీ నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని.. టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా పరీక్షలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. -
వరుసగా 3 నెలలు రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు
సాక్షి, హైదరాబాద్: రేషన్ కార్డు విషయంలో కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఆంక్షలు పెట్టినట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెల్ల రేషన్ కార్డుల జారీపై మంత్రి మాట్లాడారు. ఈ మేరకు ఆహార భద్రతా కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. 23 లక్షల 46 వేలకు మాత్రమే అర్హులని కేంద్రం చెప్పిందన్నారు. 1 కోటి 91 లక్షల లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్టంలో 1 కోటి 73 లక్షల లబ్దిదారులు ఉన్నారని, తెలంగాణలో ఉన్న జనాభాలో 80 శాతం మందికి రేషన్ కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2019లో 3 లక్షల 59 వేల కాత్త కార్డులు ఇచ్చామన్నారు. మెదక్‌లో 7 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, కరోనా వల్ల గత ఏడాది రేషన్ కార్డుల పంపిణి ఆలస్యం అయ్యిందన్నారు. సిద్దిపేటలో 10 వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా 7వేల కార్డుల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. నిజమైన ఆర్హులకు అవి ఇస్తామన్నారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో 44 వేల కొత్త కార్డులు ఇచ్చామన్నారు. ఇంకా 97 వేల కొత్త కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కరోనా వల్ల కొత్త కార్డులు ఇవ్వలేకపోయామని, పెండింగ్ దరఖాస్తులు అన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఆయన చెప్పారు. అంతేగాక మూడు నెలలు వరుసగా బియ్యం తీసుకొకపోతే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగులా స్పష్టం చేశారు. చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు: చెల్లని పట్టభద్రులు..! కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్‌చుప్! -
తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పుందంటే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లు కాగా... మొత్తం అప్పులు రూ.2.86 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.2.45 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41 వేల కోట్లు పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.81,395 అప్పు ఉన్నట్లు. గత ఏడాది తలసరి అప్పు రూ.65,480 కాగామరో రూ.16 వేలు పెరిగింది. రూ.2.44 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్ ద్వారానే సేకరిస్తోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ రుణాల చిట్టా రూ.2.44 లక్షల కోట్లకు (వచ్చే ఏడాది ప్రతిపాదనలతో కలిపి) చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,852 కోట్లు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో రూ.19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్టు బడ్జెట్ గణాంకాలు చెపుతున్నాయి. గత ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021–22 ముగిసేనాటికి ఇది రూ.2.86 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఆరేళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాలా లక్షా యాభై ఏడు వేల కోట్ల రూపాయలన్న మాట. చదవండి: మందు బాబులపైనే సర్కారు ఆశలు..! -
మందు బాబులపైనే తెలంగాణ సర్కారు ఆశలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు మద్యం అమ్మకాల ఆదాయంపై ఆశలు పెట్టుకున్నట్టుగా బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ప్రతిపాదించిన రూ.16 వేల కోట్లకు అదనంగా రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.17వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీగా సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది. 2020–21లో కరోనాతో నెలన్నర రోజులు మద్యం అమ్మకాలు నిలిచిపోయినా రూ.16 వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వచ్చింది. వచ్చే ఏడాది మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయనే అంచనాతో అదనపు ఆదాయాన్ని లెక్క కట్టింది. కేంద్రం ఏమిస్తుందో.. మిగతా పన్ను ఆదాయాలను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటాపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆశలు తగ్గినట్టు కనిపిస్తున్నా యి. 2020–21లో రూ.16,726 కోట్లు పన్నుల్లో వాటాగా వస్తాయని అంచనా వేసుకోగా.. కేవలం రూ.11,731 కోట్లే్ల అందాయి. దీంతో గతేడాది కంటే తక్కువగా పన్నుల్లో వాటా కింద రూ.13,990 కోట్లను మాత్రమే అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.2,726 కోట్లు తగ్గించుకుంది. మొత్తం పన్ను ఆదాయం పెంపు అన్ని రకాల పన్ను ఆదాయం కింద 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్లో రూ.7,600 కోట్లు ఎక్కువగానే వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2020–21లో పన్నులద్వారా రూ.85,300 కోట్లు సమకూరుతాయని భావించినా.. రూ.76,195 కోట్లే వచ్చాయి. అంచనా కంటే రూ.9వేల కోట్ల వరకు తగ్గాయి. ఈ సవరించిన ఆదాయంతో పోలిస్తే.. రూ.16వేల కోట్లు అదనంగా రూ.92,910 కోట్లు ఈసారి పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయం కూడా.. జీఎస్టీ, అమ్మకపు పన్నుల రాబడులు కూడా పెరుగుతాయనే అంచనాతో సర్కారు ప్రతిపాదనలు చేసింది. 2020–21లో జీఎస్టీతో పాటు అమ్మకపు పన్ను కింద రూ.48,895 కోట్లురాగా.. ఈసారి రూ.57,500 కోట్లకు పెంచింది. పన్నేతర ఆదాయమూ భారీగానే.. పన్నేతర ఆదాయంలోనూ భారీ వృద్ధిని ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈసారి ఏకంగా రూ.30వేల కోట్లను పన్నేతర ఆదాయం కింద ప్రతిపాదించింది. 2020–21లో రూ. 30,600 కోట్లు పన్నేతర రాబడుల రూపంలో వస్తాయని అనుకున్నా.. కేవలం రూ.19,305 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే కరోనా నుంచి కోలుకున్నామనే అంచనాతో ఈసారి కూడా రూ.30,557 కోట్లు పన్నేతర ఆదాయం కింద చూపెట్టడం గమనార్హం. వామ్మో.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంగా ప్రభుత్వ అంచనాలు భారీగా ఉన్నాయి. 2021–22లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏకంగా రూ.38,669.46 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 2020–21 సంవత్సరానికి గాను ఈ పద్దు కింద రూ.10,525 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ఆ మేరకు నిధులిచ్చింది. ఈసారి అంచనాలు మూడు రెట్లు పెంచడం విశేషం. 2019–20లో కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చింది రూ.11,598 కోట్లే. 2021–22లో రెవెన్యూ రాబడులపై అంచనాలు (రూ.కోట్లలో) పన్ను రకం 2021–22 కేంద్ర పన్నుల్లో వాటా 13,990.13 రాష్ట్ర పన్నుల ఆదాయం 92,910 ల్యాండ్ రెవెన్యూ 6.31 అమ్మకపు, వాణిజ్య పన్నులు 57,500 రాష్ట్ర ఎక్సైజ్ 17,000 ఇతర పన్నులు 18,403.69 పన్నేతర ఆదాయం 30,557.35 గ్రాంట్ ఇన్ ఎయిడ్ 38,669.46 మొత్తం 1,76,126.94 చదవండి: తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట -
పోలీసు శాఖకురూ.6,465 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖకు గతేడాది కంటే నిర్వహణ వ్యయం పెరిగింది. పెరిగిన ధరలు, ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన వేతనాలతో ఈసారి హోంశాఖ బడ్జెట్లో పెరుగుదల నమోదైంది. గతేడాది రూ.5,852 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఏకంగా రూ.6,465 కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే దాదాపు రూ.586 కోట్లు పెరగడం గమనార్హం. గతేడాది దాదాపు 11 వేల మంది కానిస్టేబుళ్లు, 1,200 వరకు ఎస్సైలు, 11 మంది ఐపీఎస్‌లు కొత్తగా డిపార్ట్మెంటులో చేరారు. ఈసారి మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులు, దాదాపు 4 వేల మంది స్టేట్ స్పెషల్ పోలీసులు విధుల్లో చేరనున్నారు. దీనికి తోడు త్వరలో దాదాపు 20 వేల మంది పోలీసు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో దాదాపు 19 వేలకు పైగా కానిస్టేబుల్ పోలీసులు కాగా, దాదాపు 450 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ ఈసారి భర్తీ చేస్తామని ఇటీవల సీఎం, హోంమంత్రి వేర్వేరు సందర్భాల్లో తెలిపారు. ఈ పోస్టులు తప్పకుండా భర్తీ చేస్తామని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంత్రులు పునరుద్ఘాటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మూడు ప్రధాన కమిషనరేట్లయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కలిపి రూ.266.47 కోట్ల ప్రగతి పద్దు కేటాయించారు. రాష్ట్రంలో భద్రత కోసం ఇప్పటికే 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం కోసం రూ.125 కోట్లు కేటాయించింది. రీజినల్ రింగురోడ్డుకు రూ.750 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్డుకు 30 కి.మీ. ఆవల 334 కి.మీ. నిడివితో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించారు. ఈ రింగురోడ్డుకు సంబంధించి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తొలి భాగానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇక రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.800 కోట్లు ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మెరుగుపరుస్తారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయ భవనాలు, హైదరాబాద్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్ర భవనానికి రూ.725 కోట్లు ప్రతిపాదించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్మించనున్న ఎయిర్‌స్ట్రిప్‌ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా రోడ్లు భవనాల శాఖకు రూ.8,788 కోట్లను ప్రతిపాదించింది. పర్యాటకానికి రూ.726 కోట్లు గత బడ్జెట్లో పర్యాటకశాఖను పట్టించుకోని ప్రభుత్వం ఈసారి రూ.726 కోట్లు ఇచ్చింది. ఇందులో కాళేశ్వరం ఆధారంగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్ ఉంది. హెరిటేజ్ తెలంగాణకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇక అర్చకుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి రూ.720 కోట్లు ఇచ్చారు. -
వెనకబడిన తరగతులకు వెయ్యిన్నర కోట్లు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది. కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం.. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం.. 2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది. -
నీటి పారుదలకు భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా.. ఈసారి సర్కారు అధికంగా ఇచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని పారించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్లో నిధులను పెంచింది. శాఖకు మొత్తంగా రూ. 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉండటంతో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాదికన్నా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు రూ. 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాలే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో... ఈసారి బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు రూ. 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ. 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపుల్లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు రూ.8 వేల కోట్ల మేర కోరారు. అయినా రూ. 918 కోట్లే్ల కేటాయించారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు కోరినా రూ. 960 కోట్లు, సీతారామకు రూ.689 కోట్లు, డిండికి రూ.545 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం రూ. వెయ్యి కోట్లు కోరగా రూ. 50 కోట్లు కేటాయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ. 400కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్‌కు కోతపడింది. ఈ ఏడాది రూ. 1,196 కోట్లే సర్దారు. మళ్లీ రుణాలే.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం ఒక టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతోనే కనీసం రూ. 15 వేల కోట్ల మేర ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను గట్టెక్కించేలా ప్రణాళికలు వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతలలో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం లక్ష ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100 శాతం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనుల పూర్తికి కనీసం రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రూ. 17 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 20 వేల కోట్లకుపైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి. ‘కాళేశ్వరం’ నిర్వహణకే రూ. 7 వేల కోట్లు... బడ్జెట్లో నిర్వహణ పద్దుకు కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.10,506.58 కోట్లకు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్దు కింద రూ. 5,219 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో రూ. 76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ. 44 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 32 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. చీఫ్ ఇంజనీర్ డివిజన్లవారీగా ప్రగతి పద్దు కింద కేటాయింపులు (రూ. కోట్లలో) విజన్ కేటాయింపు రామగుండం 100 గజ్వేల్ 930 కరీంనగర్ 100 ఆదిలాబాద్ 255 నిజామాబాద్ 54 వరంగల్ 85 సంగారెడ్డి 20 నల్లగొండ 959.89 మహబూబ్‌నగర్ 25 ఖమ్మం 5 మంచిర్యాల 100 కామారెడ్డి 100 జగిత్యాల 50 ములుగు 50 సూర్యాపేట 40.30 వనపర్తి 312 నాగర్ కర్నూల్ 1,035 కొత్తగూడెం 700 హైదరాబాద్ – ప్రధాన ప్రాజెక్టుల కింది కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో) ప్రాజెక్టు కేటాయింపు కాళేశ్వరం 918 పాలమూరు–రంగారెడ్డి 960 సీతారామ 689.48 డిండి 545.42 ఎస్ఎల్బీసీ 331.41 కల్వకుర్తి 75 నెట్టెంపాడు 192.75 భీమా 57 దేవాదుల 49.90 ఎల్లంపల్లి 99.88 లోయర్ పెన్‌గంగ 199.50 మిషన్ కాకతీయ 750 -
బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అప్పు.. దానిపై పేరుకుపోయిన వడ్డీ.. సొంతానికి వాడుకోవటంతో పేరుకుపోయిన కార్మికుల భవిష్య నిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం నిధులు, చమురు బిల్లులు, జీతాల భారం.. ఇలా ఎటుచూసినా సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం గతేడాది కంటే మెరుగ్గా బడ్జెట్లో నిధులు ప్రతిపాదించి ఊరటనిచ్చింది. తాజా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వెరసి రూ. 3 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సహకార పరపతి సంఘం పాలకమండలి ఆర్టీసీపై హైకోర్టులో కేసు దాఖలు చేసింది. బకాయిలు చెల్లించకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని పీఎఫ్ యంత్రాంగం షోకాజ్ నోటీసులు పంపింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాటి బకాయిలు కొంత మేర తీర్చేందుకు ఆర్టీసీకి నిధులు అందనున్నాయి. కావాల్సింది రూ.5 వేల కోట్లు... కార్మికుల భవిష్య నిధి చెల్లించకపోతుండటంతో రూ. 1,200 కోట్లు పేరుకుపోయాయి. కార్మికులు పొదుపు చేసుకున్న సహకార పరపతి సంఘం బకాయిలు రూ. 850 కోట్లకు చేరుకున్నాయి. మరో రూ. 3 వేల కోట్లు బ్యాంకు అప్పులున్నాయి. వెరసి ఆర్టీసీకి రూ. 5 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో ఇచ్చే నిధులు కాక రూ. 2,500 కోట్లు కావాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం రూ. 3 వేల కోట్లే కేటాయించింది. గత కొన్ని నెలలకు ఆర్టీసీ తన ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఆ మొత్తం నెలకు రూ. 120 కోట్లు అవుతుంది. అదే స్థూల వేతనం చెల్లించాలంటే ప్రతినెలా రూ.185 కోట్లు కావాలి. ఇప్పుడు నిధులు అందుబాటులో ఉంటే స్థూల వేతనం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఉన్నపళంగా వెయ్యి కొత్త బస్సులు కొనాల్సి ఉంది. వాటికి కొన్ని నిధులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ. 1,500 కోట్లు పూచీకత్తు రుణానికి బడ్జెట్లో రూ.1,500 కేటాయిస్తూ మరో రూ. 1,500 కోట్ల బడ్జెటేతర నిధులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ రెండో మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే పూచీకత్తుకు సంబంధించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే అలా తీసుకునే మొత్తం తిరిగి ప్రభుత్వమే చెల్లించేలా ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఓ రకంగా గ్రాంటుగా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నారు. త్వరలో సీఎంతో భేటీ: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా రూ.3 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించటం ఎంతో శుభపరిణామమని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని, ఇందుకోసం ముఖ్యమంత్రితో భేటీ అయి చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లు ప్రతిపాదించటం పట్ల అన్ని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
వైద్యారోగ్యం రూ. 6,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది రూ.6,185.97 కో ట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 6,295 కోట్లు కే టాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఆరో గ్య మిషన్ పథకాలకు మాత్రం అధిక నిధులు కేటాయించింది. ఔషధాల కొనుగోలుకు మాత్రం గతంతో పోలిస్తే ఈ ఏడాది నిధులు తగ్గించింది. ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు ఇలా.. గతేడాది మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణంగా రూ. 720.12 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గతేడాది మాదిరిగానే రూ. 211.86 కోట్లు, పెన్షన్‌దారుల ఆరోగ్య పథకానికి రూ. 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి రూ. 45.88 కోట్లు కలిపి మొత్తం కేటాయింపులు రూ. 410.35 కోట్లు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని బీపీఎల్ కుటుంబాలు నిమ్స్‌లో చికిత్స పొందితే వారికి సాయం చేసేందుకు రూ. కోటి కేటాయింపు. ళీఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో ఈసారి రూ.1,213 కోట్లు కేటాయింపులు. నిమ్స్‌లో వేతనాల పెంపును అమలు చేయడంలో భాగంగా ఈసారి రూ. 213. 85 కోట్లు (గతేడాది రూ. 113.85 కోట్లు) కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ పరికరాల కొనుగోలుకు రూ. 13.54 కోట్లు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, భద్రత కార్మికులకు రూ. 48.15 కోట్లు కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల బలోపేతం చేసేందుకు రూ. కోటి. ళీవైద్య విద్యలో సర్జికల్ వస్తువుల కోసం రూ.3 కోట్లు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది కోసం రూ. 40 కోట్లు. ళీ ఔషధాల కొనుగోలుకు రూ. 254 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 262.41 కోట్లు 108 అత్యవసర వాహన సేవలు కోసం రూ. 52.94 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 49 కోట్లు. 104 మొబైల్ వాహన సేవల కోసం రూ. 36.82 కోట్లు. ళీ కేసీఆర్ కిట్ అమ్మఒడి కోసం రూ. 330 కోట్లు. 102 అమ్మ ఒడి పథకానికి రూ. 15 కోట్లు. రాష్ట్ర వాటాలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 182 కోట్లు. ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలకు రూ.105.65 కోట్లు.ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి గతేడాది మాదిరిగానే రూ. 20 కోట్లతోపాటు నూతన భవన నిర్మాణం కోసం మరో 3 కోట్లు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రూ. 10 లక్షలు. నిమ్స్‌కు రూ. 3.67 కోట్లు.. ళీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ సేవలకు రూ. 48.15 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 1.60 కోట్లు బోధనాసుపత్రుల ఏర్పాటు కోసం రూ. 36.68 కోట్లు ళీమెడికల్ కాలేజీల అభివృద్ధికి రూ. 120.50 కోట్లు బోధనాసుపత్రుల నిర్వహణ సేవల సమగ్రాభివృద్ధి కోసం రూ. 40 కోట్లు ళీపార్థివ దేహాలను తరలించే ఉచిత వాహన సర్వీసులకు రూ. 5 కోట్లు కోవిడ్ నిర్వహణ కోసం ఆర్థిక సాయం రూ. 92 కోట్లు.. అందుకే విద్య, వైద్యంలో వెనుకబాటు ఆర్థిక నిపుణులు, పరిశోధకురాలు ఎన్.శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు ఉండేవి. పంచవర్ష ప్రణాళికలు ఒకటి నుంచి ఐదు వరకు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిల్లోనూ అవే విధా నాలు అమలయ్యాయి. పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు కూడా అవే ప్రాధాన్యతలను కొనసాగించాయి. ఆర్థికాభివృద్ధి జరిగితే దాని ఫలాలు అందరికీ అంది సామాజిక అభివృద్ధి దానంతటే అదే జరుగుతుందనేది ఆనా టి అభిప్రాయం. అయితే ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ, దాని ఫలాలు అందరికీ అందలేదు. సామాజిక అభివృద్ధి జరగలేదు. ఆరో పంచవర్ష ప్రణా ళికలో సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. దీంతో ప్రణాళికల ఓరియెంటేషన్ మారిపోయింది. రాష్ట్రాల్లోనూ దానినే అనుసరించారు. దీనిని అన్వయించుకునే క్రమంలో సోషల్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ప్రధానం కాగా, కేంద్రం తో సహా రాష్ట్రాలు కూడా వీటిపై దృష్టి పెట్టకుండా ప్రజాకర్షక, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపాయి. దీంతో విద్య, వైద్యం వెనుకబడ్డాయి. ఈ రెండూ అభివృద్ధి చెంది ఉంటే సమాజం తన కాళ్లపై తాను నిలబడేది. అయితే అలా జరగలేదు. ఈ విధంగా రెండు కీలక సందర్భాల్లో జరిగిన పొరపాట్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. -
చదివింపులు రూ.13,564 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే బడ్జెట్లో ఈసారి విద్యా రంగానికి కేటాయింపులు పెరిగాయి. గతేడాది పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలకు మొత్తంగా రూ.12,138 కోట్లు కేటాయించగా ఈసారి ఆయా శాఖలకు రూ. 13,564.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే రూ. 1,426.65 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. అందులో పాఠశాల విద్యలోనే 90 శాతం కేటాయింపులను పెంచింది. గతేడాది పాఠశాల విద్యాశాఖకు రూ. 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 11,693.08 కోట్లు కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 1,287.77 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో సగానికిపైగా బడ్జెట్‌ను నిర్వహణ పద్దు కింద అదనంగా కేటాయించగా అవి వేతనాలు, నిర్వహణ వ్యయం కిందే ఖర్చు కానున్నాయి. ఇక ప్రగతి పద్దు కింద కేటాయించిన మిగతా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిం చనుంది. గతేడాది ఉన్నత విద్యకు 1,462.02 కోట్లు, సాంకేతిక విద్యకు 270.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యకు రూ. 1,592.77 కోట్లు, సాంకేతిక విద్యకు 278.81 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈసారి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దును రెట్టింపు చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు నిధులను ఎక్కువ మొత్తంలో కేటాయించింది. ‘రూసా’అమలు కోసం గతేడాది రూ. 14.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 75.71 కోట్లను కేటాయించింది. అలాగే సంస్కృత అకాడమీ కోసం రూ.15 లక్షలు కేటాయించింది. ఇటు యూనివర్సిటీల్లో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి ఈసారి రూ. 10 కోట్లు కేటాయించింది. పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు కలిగిన తెలుగు యూనివర్సిటీకి మాత్రమే రూ. 3 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఇతర యూనివర్సిటీలకు కేటాయింపులేవీ చేయలేదు. పెంపుదల ఇలా.. పాఠశాల విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 1,277.77 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ.731.35 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.556.42 కోట్లు అదనంగా కేటాయించింది. ఉన్నత విద్యలో గతేడాది కంటే ఈ సారి రూ. 130.75 కోట్లు అదనంగా ఇచ్చింది. అం దులో నిర్వహణ పద్దు కింద రూ. 39.94 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 89.81 కోట్లు అదనంగా కేటాయించింది. సాంకేతిక విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 8.58 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ. 55 లక్షలు, ప్రగతి పద్దు కింద రూ. 8.02 కోట్లు అ దనంగా కేటాయించింది. కాగా, విద్యాశాఖకు ఈసారి బ డ్జెట్ కేటాయింపులు పెరిగినా రాష్ట్ర మొత్తం బడ్జెట్లో చూస్తే విద్యారంగం వాటా తగ్గింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్ర బడ్జెట్ క్రమంగా పెరుగుతున్నా విద్యా రంగానికి కేటాయింపుల శాతం ఆ మేరకు పెరగట్లేదు.. వర్సిటీలకు రూ. 627 కోట్లు.. విద్యాశాఖకు గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి మాత్రం కేటాయింపులు లేకుండాపోయాయి. యూనివర్సిటీల నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి ప్రభుత్వం నిధులను పెంచినా అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. యూనివర్సిటీలకు గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 627.31 కేటాయించింది. మరోవైపు కరీంనగర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ.5.59 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.76 కోట్లు కేటాయించింది. అలాగే సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ. 5.1 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.25 కోట్లు కేటాయించింది. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ. 84.71 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 87.25 కోట్లను కేటాయించింది. -
దళిత అభివృద్ధికి దండిగా..
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈసారి భారీగా ఖర్చు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (సబ్‌ప్లాన్) కింద రూ.33,611.06 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్)కి రూ.21,306.84 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) కింద రూ.12,304.22 కోట్లు చూపించింది. 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.7,304.81 కోట్లు అదనంగా ఖర్చు చేయనున్నారు. పథకాల పరుగులు... గతేడాది కోవిడ్–19 వ్యాప్తి వల్ల నెలకొన్న పరిస్థితులతో పలు సంక్షేమ పథకాలు డీలా పడ్డాయి. ప్రస్తుతం ఈ పరిస్థితులను అధిగమిస్తున్నప్పటికీ కొన్ని పథకాల్లో అవాంతరాలు వచ్చాయి. ఈసారి భారీ కేటాయింపులు జరపడంతో సంక్షేమ పథకాల అమలు వేగం పుంజుకోనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే ఆర్థిక చేయూత పథకాలు పరుగులు పెట్టనున్నాయి. అదేవిధంగా ఇదివరకు పెండింగ్‌లో ఉన్న కార్యక్రమాలు సైతం పరిష్కారం కానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి మొత్తాన్ని సంబం ధిత సంక్షేమ శాఖలు.. ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఖర్చు చేయా ల్సి ఉంటుంది. ఈసారి భారీగా కేటాయింపులు జరపడంతో ఆయా శాఖలు తలపెట్టిన కార్యక్రమాలన్నీ -
‘కోవిడ్’ ఖర్చు 5,268కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం మొత్తం కోవిడ్‌తో అతలాకుతలమైందని, ఆదాయాలు తగ్గిపోయినప్పటికీ, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడానికి భారీగా వ్యయం చేసినట్లు శాసనసభకు సమర్పించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,177 కోట్లు వ్యయం చేయగా, ఆçహార భద్రతా కార్డులున్న వారికి ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున రెండు దఫాలు మొత్తం రూ. 2,628 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే రేషన్ కోసం రూ. 1,103 కోట్లు, వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి వీలుగా రూ.124 కోట్లు, కోవిడ్ వారియర్స్‌గా ఉన్న వైద్య, మునిసిపల్, పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.182 కోట్లు, పోలీసులకు రూ.54 కోట్లు సాయం అందించినట్లు వివరించింది. ఏప్రిల్‌లో 87.7 శాతం ఆదాయం నష్టం.. కోవిడ్ ప్రభావం 2020 మార్చిలో ప్రారంభం అయితే.. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో 87.7 శాతం మేరకు నష్టపోయినట్లు నివేదికలో పేర్కొంది. మే నెలలో 50.8 శాతం నష్టం జరిగింది. గత ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయం సాధారణ స్థితికి వచ్చిందని, ఆ సమయంలో రూ. 36,806 కోట్ల మేరకు సొంత ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా వ్యాట్, ఎస్జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ నష్టపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. మౌలిక సదుపాయాలకు మస్తు నిధులు సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో అదనపు నిధులను కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్ర వాటాను భారీగా పెంచింది. రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక పథకం కింద తరగతి గదులు, భవన నిర్మాణాలు, టాయిలెట్లు కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పాఠశాల విద్యలో గతేడాదితో పోల్చితే ఈసారి రూ. 533.7 కోట్లు అదనంగా కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గతేడాది రూ. 1,239.46 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 1,773.16 కోట్లను కేటాయించింది. సమగ్ర శిక్షా అభియాన్‌కు గతేడాది 623.48 కోట్లను కేటాయించగా ఈసారి రూ.526.52 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక జూనియర్, డిగ్రీ కాలేజీల్లో భవనాలు, అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 23 కోట్లకు పైగా నిధులను కేటాయిం చింది. మధ్యాహ్న భోజన పథకానికి గతేడాది లాగే నిధులను కేటాయించింది. విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురు కులాలు, పాఠ్య పుస్తకాల ముద్రణా లయానికి కేటాయింపులను పెంచింది. డిగ్రీ కాలేజీల భవనాలకు గతేడాది రూ.5 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.10.91 కోట్లు కేటా యించింది. సాంకేతిక విద్యాశాఖలో ఎస్సీ హాస్టళ్ల కోసం రూ.3.23 కోట్లు కేటాయించింది. ఆర్ఐడీఎఫ్ కింద భవన నిర్మాణాలకు రూ.4.78 కోట్లు కేటాయించింది. -
పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో సింహభాగం రూ.2,500 కోట్లు పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలే ఉండటం గమనార్హం. గతేడాది 2020–21 వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపులు రూ.1,079 కోట్ల మేర పెరి గాయి. కాగా ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో జీతభత్యాలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ తదితరాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.330.96 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు పేరిట పరిశ్రమల విభాగంతో పాటు ఇతర అనుబంధ శాఖలకు రూ.1,616.31 కోట్లు, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ కింద సుమారు మరో రూ.1,130 కోట్లు కేటాయించారు. విద్యుత్, ఎస్జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంప్ డ్యూటీ, భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ తదితరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,800 కోట్ల మేర రాయితీలు, ప్రోత్సాహ కాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ప్రస్తుత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించడంతో పారిశ్రామికవేత్తలకు మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఊరట దక్కనుంది. ప్రతిష్టాత్మక పార్కుల ప్రస్తావన లేదు.. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌లో భాగంగా 14 ప్రధాన రంగాల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) జహీరాబాద్, హైదరాబాద్ ఫార్మాసిటీ, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కు కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించింది. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పర్యాయాలు లేఖలు రాసింది. అయితే ప్రస్తుత రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిమ్జ్‌లో భూసేకరణకు రూ.2 కోట్లు కేటాయించగా, ఇతర పారిశ్రామిక పార్కుల ప్రస్తావన కనిపించలేదు. నిర్వహణ పద్దు, రాయితీలు పోగా పారిశ్రామిక రంగానికి చేసిన కేటాయింపుల్లో అనుబంధ శాఖలైన చేనేత, మౌలిక వసతులు, పెట్టుబడులు, చక్కెర, గనులు, భూగర్భ వనరుల శాఖకు నామమాత్రంగా నిధులు దక్కాయి. ప్రస్తుత బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూ.338 కోట్లు ప్రతిపాదించగా ఇందులో నేత కార్మికులకు ఆర్థిక సాయం కోసం రూ.141.42 కోట్లు, చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రూ.226.76 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ.360 కోట్లు.. ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు విషయంలో దేశ సగటు 8.09 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు 17.93 శాతంగా ఉంది. ఐటీ, స్టార్టప్‌లకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని కొంపల్లి, కొల్లూరు, శంషాబాద్, ఉప్పల్, పోచారం తదితర కొత్త ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరిస్తోంది. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగానికి కొత్త ప్రాంతాలకు విస్తరించ డంతో పాటు ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.360 కోట్లను ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. పారిశ్రామిక రంగానికి కేటాయింపుల స్వరూపమిదీ.. కేటగిరీ కేటాయింపు(రూ.కోట్లలో) గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలు 1,379.40 భారీ, మధ్య తరహా పరిశ్రమలు 70.90 స్టేట్ సెక్టార్స్కీమ్స్ 12.06 మౌలిక వసతులు, పెట్టుబడులు 29.55 చక్కెర శాఖ 1.62 గనులు, భూగర్భ వనరులు 122.76 ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 501.58 ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 628.30 నిర్వహణ పద్దు 330.96 మొత్తం 3,077 -
పల్లెకు పట్టం..రూ.29,271 కోట్ల కేటాయింపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సింహభాగం కేటాయించారు. ఈ శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఇతర సంక్షేమ పథకాలు, కేటాయింపులు, తదితరాలు కలుపుకొని మొత్తం రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం. బడ్జెట్లో పీఆర్, ఆర్డీ శాఖకు భారీగా నిధుల కేటాయింపుతో పల్లె ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి చేపట్టిన చర్యల్లో భాగంగా గ్రామీణ వికాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్న సర్కార్.. అదే ఒరవడిని కొనసాగించేలా బడ్జెట్‌ను ప్రతిపాదించింది. పల్లెప్రగతి కింద గ్రామ పంచాయతీలకు ఇప్పటివరకు రూ.5,761 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి పీఆర్, ఆర్డీ శాఖకు రూ.23,005.35 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది (2019–20)తో పోలిస్తే ఇది రూ.7,880.46 కోట్లు అధికం. ఇక 2021–22 బడ్జెట్లో భాగంగా ప్రగతి పద్దు కింద పంచాయతీరాజ్‌కు రూ.5,433.99 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.10,154 కోట్లు, నిర్వహణ పద్దు కింద పీఆర్‌కు రూ.6,898.08 కోట్లు, ఆర్డీకి రూ.67.13 కోట్లు ప్రతిపాదించారు. 39,36,521 మందికి ‘ఆసరా’ 2021–22 బడ్జెట్లో ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 2019–20లో కేంద్రం ఒక్కొక్కరికి రూ.200 చొప్పున 6,66,105 కోట్ల మందికి రూ.105 కోట్ల మేర సహాయం అందజేసింది. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.1,816 రాష్ట్ర ప్రభుత్వం జతచేసి, రూ.2,016 పింఛను అందిస్తున్న విషయం తెలిసిందే. వీరే కాకుండా 31,31,660 అసహాయులకు నెలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున పూర్తి మొత్తాన్ని రాష్ట్రమే భరిస్తూ ఆసరా పింఛన్లను అందిస్తోంది. 2019–20 ఆడిట్ నివేదిక ప్రకారం పింఛన్ల పంపిణీలో కేంద్ర వాటా 1.20 శాతం మాత్రమే కాగా మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అసహాయులకు జీవన భద్రత కల్పనకు వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు. ‘పరిషత్’లకు రూ.500 కోట్లు.. బడ్జెట్లో తొలిసారిగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో జెడ్పీలకు రూ.252 కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248 కోట్లు ప్రతీ ఏడాది అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. దీనికి అవసరమైన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేసి ప్రకటించనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి రూ.699 కోట్ల మేర కోత విధించింది. ఈ నేపథ్యంలో గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా నిధులు అందించడంతో పాటు నిరాటంకంగా అభివృద్ధి కొనసాగేందుకు తొలిసారిగా బడ్జెట్‌ను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో మరణించిన వారికి సగౌరవంగా అంతిమ సంస్కారాలు చేసేందుకు వీలుగా ఇప్పటికే పలు పల్లెల్లో వైకుంఠధామాల నిర్మాణాలు మొదలయ్యాయి. 2021–22 బడ్జెట్లో వైకుంఠధామాల నిర్మాణాల కోసం రూ.200 కోట్లు ప్రతిపాదించారు. వడ్డీలేని రుణాలకు రూ.3 వేల కోట్లు.. బడ్జెట్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం రూ.3 వేల కోట్ల మేర భారీ మొత్తాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అంది స్తున్న సహకారంతో ఈ çస్వయం సహాయక సంఘాలు వృద్ధి చెందడంతోపాటు, వారిలో పొదుపు చైతన్యం సైతం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో 4,29,262 స్వయం సహాయక సంఘాలుండగా, వాటిలో 46,65,443 మంది సభ్యులున్నారు. వీరంతా పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు పొంది, క్రమం తప్పకుండా తిరిగి చెల్లింపులు చేస్తుండటంతో వారి పరపతి గణనీయంగా పెరిగింది. 2020–21లో మహిళా సంఘాల సభ్యులకు రూ.9,803 కోట్ల రుణాలు వడ్డీలు లేకుండా అందించగా, రుణాల రికవరీ రేటు 97.25 శాతంగా నిలుస్తోంది. త్వరితంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది. -
సాగుకు యంత్ర సాయం
దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది.నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికీ నిజం.ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదనిఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం. – హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ. 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం విశేషం. ఒకవైపు కూలీల కొరత ఉండటం, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడంలో కేంద్రం ఆసక్తి చూపించకపోవడంతో తెలంగాణ సర్కారు యాంత్రీకరణకు మొగ్గు చూపింది. భారీ కేటాయింపులతో రైతులను యాంత్రీకరణ బాటపట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.951 కోట్లు ఖర్చు చేసి 14,644 ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించింది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఈసారి రూ. 25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుబీమా పథకాలకే ఎక్కువగా నిధులు కేటాయించింది. అవి పోగా మిగిలిన వాటికి రూ.2,276 కోట్లు కేటాయిం పులు చేసింది. ఇక వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ‘రైతు బంధు’పథకానికి తాజా బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు పెట్టగా... రూ.14,736 కోట్లు అవసరమయ్యాయి. కేటాయిం పుల కంటే రూ. 736 కోట్లు అధికంగా విడుదల చేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నిధులు పెంచింది. గత బడ్జెట్ కేటాయిం పుల్లో రెండు సీజన్లలో 59.25 లక్షల మంది రైతులకు సొమ్ము వారి ఖాతాల్లో వేసింది. ఈసారి సాగు, పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా రూ. 14,800 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్లో రూ. 5,225 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు కేటాయించినా... రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ.1,210 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రైతు బీమాకు రూ. 1,200 కోట్లు రైతు బీమా పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందించడానికి బీమా కల్పించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,141.4 కోట్లు మంజూరు చేసి 32.73 లక్షల మందికి బీమా కల్పించారు. ఈ ఏడాది కొంత పెంచారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 3,400 చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లిస్తుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న రైతులు... ఈ బీమాకు అర్హులు. 2018 నుంచి ఇప్పటివరకు రైతు బీమా పథకం ద్వారా 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు పరిహారం అందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు బడ్జెట్లో రూ.122 కోట్లు కేటాయించింది. గతంలో కేవలం మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్లు నడిచేవి. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిధుల కేటాయింపు చేయడం గమనార్హం. కూరగాయలు, మాంసం, చేపలు... అన్ని ఒకేచోట వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో మరిన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు నిధుల కేటాయింపు చేసింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఆయిల్ పామ్సాగుకు ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ రైతు బంధు, రైతు బీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం. అందుకే కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారు. 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 30 వేల సబ్సిడీని రైతులకు ఇచ్చేందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధి రేటుకు వ్యవ‘సాయం’ ప్రాథమిక రంగమైన.. వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరు వల్ల గతేడాది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయి కన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ) 20.9 శాతం వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో ఈ రంగాల జీఎస్వీ వృద్ధి 3 శాతమే. ద్వితీయ రంగమైన.. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు మైనస్ 5.6 శాతం, తృతీయ రంగంలో సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్ 4.9 శాతానికి పతనమాయ్యయి. అయితే, జాతీయ స్థాయితో పోలిస్తే కొంత మేర మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలో పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.2 శాతానికి, సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.1 శాతానికి పతనమైంది. -
టీషర్ట్ వేసుకొచ్చినందుకు అసెంబ్లీ నుండి గెంటేశారు..
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్ చూడసమా జీన్స్, టీషర్ట్ ధరించి రావడంతో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాజేంద్ర త్రివేది అతన్ని అసెంబ్లీ నుండి బయటకు పంపించేశారు. గుజరాత్‌లోని సోమనాథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన విమల్ చూడసమా.. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వచ్చారు. స్పీకర్ రాజేంద్ర త్రివేది ఎమ్మెల్యే డ్రస్ చేసుకున్న విధానంపై అభ్యంతరం చెప్పడంతో సభలో రగడ మొదలైంది. టీషర్ట్ ధరించి అసెంబ్లీకి రావొద్దనే చట్టాలేమైనా ఉన్నాయా..? ఉంటే అవి సభ ముందుకు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే పట్టుబట్టడంతో స్పీకర్ ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. తక్షణమే ఈ చర్య అమల్లోకి రావాలని స్పీకర్ ఆదేశించడంతో సదరు ఎమ్మెల్యేను సభ నుంచి బయటకు పంపించేశారు. కాగా, సభలో సభ్యులు సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ రాజేంద్ర త్రివేది బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. అయితే, స్పీకర్ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీషర్ట్, జీన్స్ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కలుగజేసుకుని ఎమ్మెల్యే సభ గౌరవాన్ని కాపాడేలా దుస్తులు ధరించి రావడం మంచిదని హితవు పలికారు. -
అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం
-
కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
ప్రజల ఆశలు నెరవేర్చేలా.. సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. ప్రస్తుతం ఈ నష్టం రూ.లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. కరోనా తర్వాతి పరిస్థితులలో రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్లో నిధుల కేటాయింపులు ఎక్కువగానే ఉండే అవ కాశం ఉందని తెలిపారు. బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ 2021–22 రూపకల్పనపై శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పద్దుల్లో పొందుపర్చాల్సిన శాఖల వారీ బడ్జెట్ అంచనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ఆయా అం శాలపై చర్చించిన అనంతరం.. బడ్జెట్ కేటాయిం పుల విధివిధానాలను ఖరారు చేశారు. ఆదివారం నుంచి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తమ శాఖ అధికారులతో కలిసి.. ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, పురపాలక, విద్యా, నీటిపారుదల తదితర శాఖల బడ్జెట్ అంచనాల తయారీపై రోజువారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని శాఖలతో బడ్జెట్ రూపకల్పన కసరత్తు ముగిసిన తర్వాత.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. ఈ నెల మధ్యలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగింపు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గొర్రెల పెంపకం కార్యక్రమం అమలు కొనసాగుతుందన్నారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్లకుర్మల కుటుంబాలు ఆదాయాన్ని మంచి ఆర్జిస్తున్నందున.. ఇప్పటికే పంపిణీ చేసిన 3.70 లక్షల యూనిట్లకు కొనసాగింపుగా.. మరో 3 లక్షల యూనిట్ల పంపిణీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని సీఎం గుర్తు చేశారు. దేశంలోనే అధికంగా గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఇక చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతోందని, మంచి ఫలితాలు వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని ప్రకటించారు. సీ సమీక్ష్లలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
-
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ప్రోరోగ్ ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్ చేస్తే ఆర్డినెన్స్ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక) ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదు.. తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు) చదవండి: ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు -
పోలవరంపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదు
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టుపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. శుక్రవారం శాసనసభలో టీడీపీ సభ్యులు ప్రవర్తనపైన ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పోలవరంపై చర్చ జరగకూడదని టీడీపీ భావిస్తోందన్నారు. టీడీపీ సభ్యులు సభలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు. శాసనసభను పోలవరం పేరుతో టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని సీఎం శాసనసభలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరంలో టీడీపీ ఇష్టానుసారం అవినీతి చేసిందని ధ్వజమెత్తారు. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే.. గత టీడీపీ ప్రభుత్వం స్వార్ధం కోసం వారి చేతుల్లోకి తీసుకుందని ఆరోపించారు. పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదని అన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసిందని.. 15 రోజులో ఆ కమిటీ నివేదిక ఇవ్వనుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరంలో రివర్స్ టెండరింగ్ చేపట్టనున్నారని పేర్కొన్నారు. పోలవరంకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. -
‘బాబు స్వార్ధం కోసం సభను వాడుకుంటున్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనసభను తన స్వార్ధం కోసం వాడుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన స్కామ్‌లన్నీ త్వరలోనే బయటకు వస్తాయని.. వాటన్నింటిని ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. పోలవరంపై సభలో టీడీపీ రాద్ధాంతం చేయడంపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పోలవరంపై టీడీపీ సభ్యులు ఎందుకంత రాద్ధాంతం చేస్తారు?. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత మూడు రోజులుగా నీటిపారుదల శాఖ మంతి వివరణ ఇస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. ఇటివలే నేను పోలవరం ప్రాజెక్టును సందర్శించాను. గత ప్రభుత్వం కారణంగానే పోలవరం పనులకు అంతరాయం ఏర్పడింది. తొలుత స్పిల్ వేల పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌పై శ్రద్ధ పెట్టారు. దానిని కూడా మొత్తం పూర్తి చేయలేదు. కాఫర్ డ్యామ్ వల్ల గోదావరి వెడల్పు 70 శాతం తగ్గిపోయింది. మిగిలిన కొద్ది భాగం నుంచే వరద నీరు వెళ్లాల్సిన పరిస్థితి. జూన్ నుంచి అక్టోబర్ వరకు వరదలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోను నవంబర్ 1 నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి. 2021 వరకు పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలనేదే మా లక్ష్యం. పోలవరంపై తొలిసారిగా రివర్స్ టెండరిగ్ వెళ్తున్నాం. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో టీడీపీ ప్రభుత్వం తమకు నచ్చినవారికి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టింది. పోలవరంపై గత ప్రభుత్వ హయంలో దారుణమైన స్కామ్‌లు జరిగాయి. ఏ పనులు కాకుండానే నవయుగ కంపెనీకి రూ. 724 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారు. నిపుణల నివేదిక ఆధారంగా ఎంత ఆదా అవుతుందో లెక్కలు తెలుతున్నాయి. ఈ మేరకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామ’ని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పోలవరం ప్రారంభిస్తాం.. శుక్రవారం ఉదయం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే.. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలవరంపై సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు మంత్రి అనిల్‌కుమార్ సమాధానం చెప్పారు. టీడీపీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవం ప్రాజెక్టు కోసం చేసిందేమీ లేదని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. టీడీపీ ఖర్చు చేసిన దాని కన్నా ఎక్కువ నిధులు ఖర్చు పెట్టి పోలవరం పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. పోలవరంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష చేశారని గుర్తుచేశారు. నిర్వాసిత కుటుంబాలకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని వ్యాఖ్యానించారు. పోలవరం ముంపు బాధితుల గురించి టీడీపీ ఏపీ ఆలోచించలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును తాము ఆపేశామనడం సరికాదని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై మంత్రి సమాధానం చెప్పినప్పటికీ.. టీడీపీ సభ సజావుగా సాగకుండా చేసేందుకు యత్నించారు. సభకు ఇబ్బంది కలిగించేలా నినాదాలు చేయడం ప్రారంభించారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు.. సభలో టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. ప్రాపర్ ఫార్మాట్లో వస్తే పోలవరంపై తాము చర్చిస్తామని స్పష్టం చేశారు. అయిన కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేయడం సరికాదన్నారు. -
ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గురువారం ఉదయం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులకు, చట్టసవరణ ముసాయిదాకు ఆమోదం తెలిపింది. వాటిలో భాగంగా.. కౌలు రైతుల కోసం రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. యాజమాని హక్కులకు భంగం కలగకుండా.. 11 నెలల పాటు రైతులు సాగు ఒప్పందం కుదుర్చుకునేలా బిల్లు తీసుకువచ్చింది. మద్య నిషేదం దిశగా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. ఇకపై మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అలాగే అక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 417 కోట్ల భారం పడనుంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం విక్రుతమాల గ్రామంలో ఏపీఐఐసీకి 149 ఎకరాలు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల జీతాల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటుకు కేబినెట్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గడువు ముగిసిన స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల నియమాకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ గృహావసరాలకు 200 యూనిట్ల విద్యుత్‌ను అందించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. -
‘5 కోట్ల పనిని 137 కోట్లకు పెంచారు’
సాక్షి, అమరావతి : ఒక్క గేటు ప్రారంభ యాడ్ కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 2.30 కోట్లు ఖర్చు చేశారని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆ గేటు పూర్తి కాకముందు ప్రారంభానికే చంద్రబాబు ప్రజాధనాన్ని దుబారా చేశారని మండిపడ్డారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అవకతవకలను పలువురు సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయంలో ప్రాజెక్టుల అంచనాలను ఇష్టరాజ్యంగా పెంచేశారు. గాలేరు నగరి ప్రాజెక్టు ప్యాకేజి 29లో రూ. 171 కోట్లు పని అయితే రూ. 166 కోట్ల పని జరిగింది. మిగిలింది కేవలం రూ.5 కోట్ల పని మాత్రమే. కానీ ఆ ఐదు కోట్ల రూపాయల పనిని రూ. 137 కోట్లకు పెంచారు. ప్రాజెక్టులకు భారీ ఎత్తున రేట్లు పెంచిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు హయంలో నీటిపారుదల శాఖలో భారీ అవినీతి జరిగింది. ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి, అక్రమాలు చోటుచేసుకోకుండా.. దేశ చరిత్రలో రివర్స్ టెండరింగ్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. దీని ప్రకారం జ్యూడిషియల్ అనుమతి తర్వాతే టెండర్ వస్తుంది. గత ప్రభుత్వానికి శిలాఫలకాలు తప్ప.. ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న ధ్యాస లేకుండా పోయింది. మేజర్ ప్రాజెక్టులపై కమిటీలు వేస్తున్నామ’ని తెలిపారు. అంతకుముందు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురంలో రూ. 150 కోట్ల పనులను గత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో రూ. 6 కోట్లు అధికంగా చెల్లించారని అన్నారు. ప్రాజెక్టుల నిధుల కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అక్రమాలపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల అంచనాలు ఇష్టరాజ్యంగా పెంచేశారని మండిపడ్డారు. నిబంధనలకు విర్ధుంగా కాంట్రాక్టులను తమకు అనుకూలంగా ఉన్నవారికే కట్టబెట్టారన్నారు. గత ప్రభుత్వం హయంలో ప్రాజెక్టులో రూ. 60వేల కోట్ల దోపిడి జరిగిందని ఆరోపింది. ఈ దోచుకున్న సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో 23.49 లక్షల నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు. చంద్రబాబు హయంలో రాష్ట్రం అప్పులమయంగా మారిందని తెలిపారు. పునరావాస కేంద్రాల పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ దుర్వినియోగమైంద’ని విమర్శించారు. -
సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం
సాక్షి, అమరావతి : సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దేవదాయ శాఖ భూములపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి వెల్లంపల్లి సమాధానమిచ్చారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి కేబినెట్లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి అడ్వొకేట్ జనరల్‌తో సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సదావర్తి భూముల్లో అక్రమాలకు సబంధించి పలు అంశాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గత ప్రభుత్వం తమిళనాడులోని చిన్న పేపర్లో ప్రకటన ఇస్తే.. గుంటూరులోని చంద్రబాబు బినామీలు వెళ్లి ఆ వేలంలో పాల్గొన్నారు. వేలంలో ఎకరం భూమి ధరను రూ. 50 లక్షలు నిర్ణయిస్తే.. చంద్రబాబు బినామీలు రూ. 22లక్షలకే వేలం పాడారు. ఆ తర్వాత సదావర్తి భూముల వేలం అధికారి తమను బతిమిలాడితే.. మరో రూ. 5లక్షలు అధిక ధరకు పాడినట్టు మినిట్స్‌లో రాసుకున్నారు. దేవదాయ శాఖ అధికారి భ్రమరాంబ ఎకరం భూమి ధర రూ. 6 కోట్లు ఉంటుందని ఆర్టీఐ యాక్ట్ ద్వారా తెలిపారు. దీంతో సదావర్తి భూముల అక్రమాలపై న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించాను. అయితే కోర్టుకెళ్లిన నాపై ఐటీ దాడులు చేయిస్తామంటూ అప్పటి మంత్రి నారా లోకేశ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే సదావర్తి భూములపై విజిలెన్స్ దర్యాప్తు చేయించాల’ని ఆర్కే కోరారు. దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీనియర్ అధికారి ద్వారా దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. సదావర్తి భూములకు టైటిల్ డీడ్ లేదని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టైటిట్ డీడ్ లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరొకరికి అంటగట్టొచ్చా అని ప్రశ్నించారు. -
గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గందరగోళం సృష్టించేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. ప్రశ్నోత్తరాల సమయంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆటో డ్రైవర్ల సంబంధించి సమాధానం చెప్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన పేర్ని నాని.. టీడీపీ సభ్యులు సభామర్యాదలు పాటించాలని హితవు పలికారు. టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సభలో హుందాగా వ్యవహరించాలన్నారు. అచ్చెన్నాయుడు సభా సంప్రాదాయాలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అచ్చెన్నాయడు బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని.. స్పీకర్‌పై అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయం వృథా చేయవద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం హితవు పలికారు. సభాస్థానానికి నిబంధనలు పెట్టడం సరికాదని స్పీకర్ పేర్కొన్నారు. అయితే స్పీకర్ వారించినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. టీడీపీ సభ్యుల వైఖరిని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం మంచి చేస్తామంటే టీడీపీ ఓర్వలేకపోతుందని మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సమర్ధించడం లేదు : చంద్రబాబు ఈ వ్యవహారం ముగిసిన తర్వాత కొద్దిసేపటికే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయడు మరోసారి సభలో గందగోళం సృష్టించేందుకు యత్నించాడు. ‘మీరు రాసిస్తే నేను చదువుతానంటూ’ అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారా అని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడును స్పీకర్ సూటిగా ప్రశ్నించారు. అయితే వాటిని తాను సమర్ధించడం లేదని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా సభలో సబ్జెక్ట్ పరంగా వెళ్లాలని స్పీకర్ సూచించారు. లేకపోతే పయ్యావులు రాజీనామా చేస్తారా? : చెవిరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ స్థానాన్ని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబుకు స్పీకర్‌ను ప్రశ్నించే హక్కు ఉంటుందా అని ప్రశ్నించారు. ఏదైనా ఉంటే సభా నాయకుడిని అడిగితే బాగుంటుందని సూచించారు. అనంతరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను గమనించాలని స్పీకర్‌ను కోరారు. గత సభలో టీడీపీ సభ్యులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. అంతేకాకుండా తమ సభ్యులను కారణం లేకుండా సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. గతంలో సభ ఆర్డర్లో లేనప్పుడు కూడా స్పీకర్ సభను నడిపారని అన్నారు. అప్పుడు సభ నడపలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా.. లేదంటే టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. -
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలను దగ్గర నుంచి చూశారని చెప్పారు. ఆటోడ్రైవర్ల కష్టాలను చూసి వారికి ఏడాదికి రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినట్టు తెలిపారు. ఆ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 10వేలు ఇస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు తాగునీటి సరాఫరాకు సంబంధించిన సమస్యలను పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. నెల్లూరు రూరల్‌లో మంచినీటి సమస్య గురించి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రస్తావించారు. తీరప్రాంతంలో మంచినీటి సమస్య తీర్చాలని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు విజ్ఞప్తి చేశారు. వాటిపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారు. పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలుకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీటి సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
12 సర్కిల్ స్టేషన్లను ప్రారంభించాల్సి ఉంది
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రాష్ట్రంలో కొత్త సర్కిల్ స్టేషన్ల అవశ్యకతపై ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకువచ్చారు. శిథిలావస్థలో ఉన్న స్టేషన్లను పునర్నించాలని పలువురు సభ్యులు కోరారు. తమ నియోజకవర్గాల్లో శిథిలావస్థకు చేరిన స్టేషన్ల పరిస్థితిని సభ దృష్టికి తెచ్చారు. నియోజవర్గానికి ఒక సర్కిల్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్ స్టేషన్లు నిర్మించడం జరిగింది. వాటిని ప్రారంభించడమే మిగిలింది. ఐదు స్టేషన్లు నిర్మాణం పూర్తి కావడానికి దగ్గర్లో ఉన్నాయి. 12 సర్కిల్స్ స్టేషన్ల ప్రపోజల్స్ ఉన్నాయి. పలువురు సభ్యులు చెప్పిన ప్రపోజల్స్ తెప్పించుకుని పరిశీలిస్తాం. ఇప్పటికే పలు నగరాల్లో సర్కిల్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుంద’ని తెలిపారు. -
కచ్చదీవుల రచ్చ
► సభలో వాగ్వాదం ► పిచ్చుకల పరిరక్షణపై చర్చ సాక్షి, చెన్నై: కచ్చదీవుల ధారాదత్తం అంశం మళ్లీ అసెంబ్లీ ముందుకు వచ్చింది. ఆ దీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తాము చర్యలు తీసుకున్నామని అధికార, ప్రతిపక్ష సభ్యులు వా గ్యుద్ధానికి దిగారు. అంతరిస్తున్న పిచ్చుకల పరిరక్షణకు పరిశీలన జరిపేందుకు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ హామీ ఇచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఓ తీర్మానం తీసుకొచ్చి చర్చకు పట్టుబట్టారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ అనుమతి ఇచ్చారు. తమిళ జాలర్ల మీద సాగుతున్న దాడులు, గత వారం జరిగిన కాల్పులను గుర్తు చేశారు. వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని వివరిస్తూ కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని స్టాలిన్ నిలదీశారు. దీంతో ఆర్థిక, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ జోక్యం చేసుకుని, ఆ దీవుల్ని ధారాదత్తం చేసిందెవరోనన్నది జగమెరిగిన సత్యం అని ఎదురు దాడికి దిగడంతో సభలో కాసేపు గందగరోళం నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో బుజ్జగించడం స్పీకర్‌కు తలకు మించిన భారంగా మారింది. స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కచ్చదీవులను ధారాదత్తం చేస్తున్న సమయంలో తమ అధ్యక్షుడు, అప్పటి సీఎం కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించిన విషయాలను ఆధారాలతో సహా సభ ముందు ఉంచారు. కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా డీఎంకే అధికారంలోకి వచ్చినప్పుడల్లా తీసుకున్న చర్యలను ఆధారాలతో వివరించారు. ఇవన్నీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు సాగిన ఆధారాలేనంటూ మంత్రితోపాటుగా అన్నాడీఎంకే సభ్యులు విమర్శలు ఎక్కుపెట్టడంతో మళ్లీ సభలో గందరగోళం తప్పలేదు. చివరకు స్పీకర్ ఇరువర్గాల్ని బుజ్జగింప చేసి, కాసేపు స్టాలిన్ కు తదుపరి మంత్రికి మాట్లాడే అవకాశం కల్పించారు. జాలర్ల సంక్షేమం, కచ్చదీవుల స్వాధీనం లక్ష్యంగా తామంటే, తామే చర్యలు తీసుకున్నామన్నట్టు ఈ ప్రసంగాలు సాగాయి. తదుపరి ఇటీవల కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలియజేస్తూ తీర్మానం తీసుకొచ్చి సభను మంగళవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు తంగం తెన్నరసు ఓ ప్రశ్నను సంధించగా, అందరూ ఆహ్వానించారు. సోమవారం పిచ్చుకల దినోత్సవం అని గుర్తు చేస్తూ, అంతరించి పోతున్న వాటిని పరిరక్షించేందుకు ఏదేని కార్యాచరణ సిద్ధం చేస్తారా? అని ఆయన సంధించిన ప్రశ్నకు తొలుత అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సమాధానం ఇవ్వలేదు. మళ్లీ అదే ప్రశ్నను సంధించగా, పరిశీలిస్తామని, తప్పకుండా చర్యలు తీసుకుందామని హామీ ఇచ్చారు. అలాగే పళ్లికరణైలో పక్షుల శరణాలయం విస్తరణకు తగ్గ ప్రశ్నకు మంత్రి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల్ని ఎత్తి చూపుతూ స్టాలిన్ సంధించిన ప్రశ్నకు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ స్పందిస్తూ, పరిశీలించి, త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
బడ్జెట్లో ప్రాధాన్యం దక్కేనా..
వ్యవసాయ అనుబంధ ప్రాజెక్టుల మంజూరుపై ఆశలు ‘ప్రధాన ఆస్పత్రి’ ప్రకటనపై ఉత్కంఠ నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వరంగల్ రూరల్ : రాష్ట్ర బడ్జెట్లో వరంగల్ రూరల్ జిల్లా ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. వ్యవసాయపరంగా కీలకంగా ఉండడంతో 93.01శాతం గ్రామీణ జనాభా కలిగి ఉన్న జిల్లాలో వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టులు, టెక్స్టైల్ పార్కులు, కూరగాయల మార్కెట్ ఏర్పాటుపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నందున బడ్జెట్ ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న అంశంపై చర్చ సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధిలో కీలకంగా నిలవనున్న ప్రాజెక్టులే కాకుండా ఇతర అంశాలపై కీలకమైన ప్రకటనలు వెలువడుతాయని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం దక్కేనా.. జిల్లాలోని 15మండలాలు పూర్తి గ్రామీణ ప్రాంతాలే. ఇందులో 1,72,463 హెక్టార్లు స్థూల వ్యవసాయ విస్తీర్ణంగా ఉంది. వరి విస్తీర్ణం భారీగా ఉండడమే కాకుండా మిర్చి, పత్తి, పసుపు, మక్కజొన్న తదితర పంటలు కూడా గణనీయమైన స్థాయిలోనే పండుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలో ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ కోసం టీఎస్ఐఐసీకి 1,053 ఎకరాలు అప్పగించారు. అదేవిధంగా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ వద్ద కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు నిర్ణయించారు. అలాగే, పరకాలలో ఆగ్రోస్ సెంటర్ మంజూరైంది. దీంతో పాటు ఇక్కడ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇందుకోసం ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో 90ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది. అదేవిధంగా నర్సంపేట వద్ద ఫుడ్‌పార్క్ ఏర్పాటు కోసం సీఎం సూచనల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ మేరకు ఆయా ప్రాజెక్టులకు సంబంధించి అవసరమైన నిధులను ప్రస్తుత బడ్జెట్లో కేటాయిస్తారని జిల్లా ప్రజలు, రైతులు ఆశిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి ఎక్కడో? కొత్తగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాకు జిల్లా కేంద్రం లేకపోవడంతో పాటు ప్రత్యేకంగా జిల్లా ఆస్పత్రి కూడా లేకుండా పోయింది. దీంతో ఇక్కడ జిల్లా ఆస్పత్రి తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి డిమాండ్లు కూడా వెలువడుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాలైన వర్ధన్నపేట, నర్సంపేట, పరకాలల్లోని ఏదో ఓ ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా ప్రకటించి.. అందుకు అవసరమయ్యే నిర్మాణాలు, పరికరాల కోసం తాజా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలో 66.54శాతం అక్షరాస్యత ఉండగా, జిల్లాలో 61.26శాతం మాత్రమే ఉంది. ఫలితం అక్షరాస్యత పెంపునకు పాఠశాలల బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు నూతన విద్యాసంస్థల మంజూరు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ప్రాచీన కట్టడాలు, పర్యాటకం... జిల్లాలో ప్రాచీన కట్టడాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి. కాకతీయులు ఏలిన ప్రాంతం కావడంతో జిల్లాలో అనే చోట్ల ప్రాచీన కట్టడాలు కనిపిస్తాయి. ఆత్మకూరు మండలంలోని కటాక్షపూర్ కోటగుళ్లు, చంద్రగిరి గుట్టలు అభివృద్ధి చేస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశముంటుంది. అదేవిధంగా ఖానాపురం మండలంలోని ప్రతిష్టాత్మక పాకాల సరస్సును లక్నవరం తరహాలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బడ్జెట్లో నిధుల కేటాయింపులపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. -
నేడు సీఎల్పీ భేటీ
అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాల అమలుకు పట్టుబట్టాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం సీఎల్పీ భేటీ కానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా బుధవారమే హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, బుధవారం రాత్రి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, ఉత్తమ్.. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని కలిసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాగా బుధవారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో అటెండర్లు, స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న మహిళలను సత్కరించారు. -
హాట్.. హాట్..!
వెలగపూడిలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు హాట్‌హాట్‌గా సాగాయి. రాష్ట్రంలో మూడేళ్లుగా నెలకొన్న సమస్యలపై వైఎస్సార్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నలతో అధికార పార్టీ నేతలకు కాక పుట్టించారు. బీ.కాంలో ఫిజిక్స్.. రాష్ట్ర వృద్ధి రేటు గురించి ప్రభుత్వ లెక్కలపై వైఎస్ జగన్ వేసిన సెటైర్లు నవ్వులు పూయించాయి. అసెంబ్లీ లోపల ఆయన ప్రశ్నలతో సమావేశాలు వాడీవేడిగా సాగగా... బయట భానుడిభగభగలతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడిలో ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం రెండవరోజుకు చేరుకున్నాయి. ఈ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఇద్దరు, ముగ్గురు మినహా దాదాపు అందరూ హాజరయ్యారు. తొలిసారిగా వెలగపూడిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనం రెండవ రోజు తగ్గారు. అయినా అసెంబ్లీలో ఏం జరుగుతుందోననే విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. జగన్ ప్రసంగంపై విస్తృత చర్చ ఎస్సీ, ఎస్టీ, బీసీల సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై ప్రశ్నల వర్షం కురింపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోవడంపై మండిపడ్డారు. అదే విధంగా రాష్ట్రంలో వృద్ధి రేటు గురించి ప్రభుత్వ తప్పుడు లెక్కలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ ప్రసంగిస్తుండగా పదేపదే మైక్ కట్ చేయడంతో జనం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అధికారపార్టీ నేతలు కొందరు పనిగట్టుకుని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడారు. ఈ సమావేశానికి టీడీపీ నేతలు అనుకూల మీడియా, పత్రికా విలేకరులను మాత్రమే పిలిచి గొప్పలు చెప్పుకోవడం కనిపించింది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌పై ‘బీ.కాంలో ఫిజిక్స్ చదివిన వారికి ఆ లెక్కలు అర్థం కావులే అధ్యక్షా..’ అని అసెంబ్లీలో వైఎస్ జగన్ వేసిన సెటైర్ లోపల, విజయవాడ, గుంటూరు నగరాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. పోలీసుల హడావుడి... బందోబస్తు పేరుతో పోలీసులు హడావుడి చేశారు. అసెంబ్లీ కార్యదర్శి సంతకంతో ఇచ్చిన పాసులు చూపించినప్పటికీ లోపలికి పంపలేదు. గుర్తింపు కార్డును కూడా చూపించాలంటూ పట్టుబట్టారు. ఇలా అసెంబ్లీ ముందు ఏర్పాటు చేసిన ఐదు అంచల భద్రతను దాటుకుంటూ వెళ్లే సరికి జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి మరోవైపు ఎండ తీవ్రతకు అసెంబ్లీ బయట ఉన్న పోలీసులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమయానికి మంచినీరు అందకపోవడం, నీడ కోసం అధికారులు, జనం పరుగులు తీశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మంచినీరు లేకపోవడంతో బయట నుంచి కొందరు బాటిల్స్ తీసుకెళ్లి ఇవ్వడం కనిపించింది. మొత్తంగా రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు లోపల, వెలుపల వాడివేడిగా సాగటం గమనార్హం. -
మార్చి 6 నుంచి అసెంబ్లీ
13న బడ్జెట్ ప్రవేశపెడతాం ⇒ బాలికలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక పథకం ⇒ శాఖాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో మార్చి 6వ తేదీన ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. 13వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెడతారని తెలిపారు. తొలుత మార్చి 3వ తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించి 8వ తేదీన బడ్జెట్ ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గా లకు మార్చి 9న ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒకరోజు ముందు బడ్జెట్ ప్రవేశపెట్టడంపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల తేదీల్లో మార్పులు చేశారు. మంగళ వారం వెలగపూడి సచివాలయంలో ముఖ్య కార్యదర్శు లు, కార్యదర్శులు, విభాగాధిపతులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ గతంలో శాసనసభకు, ప్రభుత్వ కార్యాలయా లకు మధ్య దూరం ఉండేదని, వెలగపూడిలో ఆ సమస్య లేదని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఈ బడ్జెట్లో ఏదైనా కొత్త పథకం ప్రకటించడానికి కసరత్తు జరుగుతోందని తెలిపారు. అలాగే యువతకు ఏంచేయాలనే అంశాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు బాబు వార్నింగ్ ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు.. అందరి చరిత్రా నా దగ్గర ఉందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులతో మాట్లా డారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి వ్యవహారౖ శెలిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన బహిరంగంగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ప్రశ్నిస్తూ అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు వైఖరిపై కూడా చంద్రబాబు అసంతృప్తిం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
మార్చి 8న రాష్ట్ర బడ్జెట్
3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 18 పనిదినాలకే పరిమితం ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంలో ప్రభుత్వం సాక్షి, అమరావతి: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోజున ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. మార్చి 8వ తేదీన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలను కేవలం 18 పనిదినాలకే పరిమితం చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రారంభమై మార్చి నెలాఖరు వరకు జరుగుతాయి. అయితే ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించడానికి, చర్చించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వకూడదనే ఆలోచనతోనే ప్రభుత్వం వీలైనన్ని తక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోందని అధికార పార్టీకి చెందిన నేతలే పేర్కొంటున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాల్సిందేనని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే అంశంపై పలు ఆందోళనలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో విశాఖ బీచ్‌లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునివ్వడమే కాకుండా ఆయనే స్వయంగా ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖపట్టణం వస్తే విమానాశ్రయంలోనే పోలీసుల చేత ప్రభుత్వ పెద్దలు నిర్భంధించిన సంగతి తెలిసిందే. -
వలసలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
పార్టీ నేతలకు చంద్రబాబు సూచన సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సహచర నేతలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీసి నైతికంగా బలహీన పరిచేందుకు ప్రతిరోజూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే లా ప్రణాళికలు రూపొందించటంతోపాటు చివరి వరకూ గోప్యంగా ఉంచాలని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30 నుంచి 40 మందికి వివిధ కారణాలతో టికెట్లు ఇవ్వలేమని, నియోజకవర్గాల పెంపు వల్ల మరో 50 సీట్లు అదనంగా వస్తాయని, ఇన్ని స్థానాలకు చివరి నిమిషంలో అభ్యర్థులు దొరకటం కష్టం కాబట్టి ప్రతిపక్షం నుంచి సాధ్యమైనంత ఎక్కువమందిని చేర్చుకునే పనిలో నేతలు నిమగ్నం కావాలని హితోపదేశం చేశారు. టీడీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం బుధవారం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయం లో జరిగింది. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీ ప్రశ్నించినా ఎదురుదాడి చేయాల్సిందిగా చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో పెద్దసంఖ్యలో ఫిరాయింపులు జరిగినపుడు స్పందించని పార్టీలు ఇపుడు తప్పుపట్టటమేంటని ప్రశ్నించటం ద్వారా గట్టిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించినవారు రాజీనామా చేయాలని, వారి రాజీనామాల్ని ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవద్దన్నారు. ఎనిమిదో అద్భుతంలా అమరావతి సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఎనిమిదో అద్భుతంలా రాజధాని అమరావతిని నిర్మిస్తామని, ఇందుకు తగ్గట్టుగా నిర్మాణ శైలి ఉండాలని అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధానిని పరిపాలన కేంద్రంగానే పరిమితం చేయకుండా ఆర్థిక కార్యకలాపాలకు వేదిక చేస్తామన్నారు. తద్వారా అమరావతిని అందరూ నివసించేలా ప్రజారాజధానిగా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. అంతర్జాతీయ నిర్మాణరంగ నిపుణులు, వాస్తుశిల్పులతో పరిపాలన-నివాస సముదాయ భవనాల నిర్మాణ డిజైన్లపై సీఎం బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సృజనాత్మకతను రంగరించి.. తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరారు. డిజైన్ల పోటీ..: సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్,ప్రజాప్రతినిధులు, మంత్రుల నివాస సముదాయాల్ని 900 ఎకరాల్లో నిర్మిం చేందుకు డిజైన్ల పోటీ నిర్వహిస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ పోటీలో పాల్గొంటున్న సంస్థలకు లక్షా 50 వేల డాలర్లను ముందుగా చెల్లిస్తున్నట్లు తెలిపారు. మార్చి 22, 23, 24 తేదీల్లో ఈ సంస్థలు డిజైన్లు సమర్పిస్తాయని, వాటిలో ఒకదానిని క్రిస్టోఫర్ బెనింజర్ చైర్మన్‌గా గల ఆరుగురు సభ్యుల అంతర్జాతీయ కమిటీ మార్చి 25న ఎంపిక చేస్తుందని చెప్పారు. కాగా, జపాన్‌కు చెందిన జైకా ప్రతినిధి బృందం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలసింది. రెండురోజులుగా ప్రతిపాదిత విజయవాడ మెట్రో ప్రాజెక్టు కారిడార్లను పరిశీలిస్తున్న బృందం ఆయనతో సమావేశమై రుణం గురించి చర్చించింది. మరోవైపు రహదారుల స్థితిగతులను సమగ్ర విధానంతో సర్వే చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన సాంకేతిక వాహనాన్ని బాబు విజయవాడలో ప్రారంభించారు. -
2న కేబినెట్ భేటీ
♦ కేసీఆర్ ఆధ్వర్యంలో మూడు నెలల తరువాత మంత్రివర్గ సమావేశం ♦ బడ్జెట్ సమావేశాలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, సంక్షేమంపై ♦ రెండు విడతలుగా చర్చ ♦ మధ్యాహ్నం అధికారులకు ముఖ్యమంత్రి విందు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. దాదాపు మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవడంతో పాటు త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జనవరి 2వ తేదీ నాటికి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతోంది. అదే రోజున సుదీర్ఘ చర్చలకు వీలుగా రెండు విడతలుగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భోజన విరామంలో మారియట్ హోటల్లో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. వరంగల్ ఉప ఎన్నికలు, అయుత చండీయాగం విజయవంతం కావడంతో ఈ విందు ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చె బుతున్నాయి. మరోవైపు ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎ న్నికల ఫలితాలు సైతం బుధవారం వెలువడనున్నాయి. దీంతో కొత్త ఏడాదిలో జరిగే తొలి కేబినెట్ సమావేశం అందర్నీ ఆకర్షిస్తోంది. ‘జీహెచ్ఎంసీ’ వరాలకు ఆమోదం! జనవరి చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సూచనప్రాయంగా పలు వరాలు కురిపించిం ది. విద్యుత్, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేస్తామని నగర పరిధిలోని మంత్రులకు సీఎం హామీ ఇచ్చారు. ‘ఎమ్మెల్సీ’ ఎన్నికల కోడ్ కారణంగా అధికారికంగా నిర్ణయం వెలువడలేదు. ఆ బకాయిల రద్దుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎనిమిది లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా రూ.2 వేలలోపు ఉన్న ఆస్తిపన్నును రద్దు చేయడం లేదా నామమాత్రపు పన్నుగా మార్చడానికి అనుమతించే అవకాశముంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించి మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించి, ఎన్నికల వ్యూహాన్ని నిర్దేశించనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక, మిషన్ కాకతీయపై చర్చించనున్నారు. 3న టీఆర్ఎస్ఎల్పీ భేటీ... కేబినెట్ భేటీ తర్వాత జనవరి 3న మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం జరుగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్లమెంటు సభ్యులను ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. 5న కేటీపీఎస్ స్టేజ్-2 ప్రారంభం వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీఎస్) స్టేజ్-2 కింద నెలకొల్పిన 600 మెగావాట్ల యూనిట్‌ను సీఎం కేసీఆర్ వచ్చే నెల 5వ తేదీ న ఉదయం 11 గంటలకు ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం వరంగల్ కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్షిస్తారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణం, మిషన్ భగీరథ, వరంగల్ నగరాభివృద్ధి, కాకతీయ కాలువల మరమ్మతులు, సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై చర్చిస్తారు. అయితే అంతకంటే ముందు రోజే 4వ తేదీన హైదరాబాద్-వరంగల్ రహదారి విస్తరణ పనులకు కేంద్ర మంత్రి గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏటూరునాగారం వద్ద నిర్మించిన భారీ వంతెనకు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమాలకు సైతం సీఎం హాజరుకానున్నారు. 7వ తేదీన మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రాధా మోహన్‌సింగ్ తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. వంద మంది భోజనం చేసే వసతి లేదా? రాష్ట్ర సచివాలయంలో కనీసం వంద మంది భోజనం చేసేందుకు వసతి లేకపోవడంపై సీఎం కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న రాష్ట్ర మంత్రివర్గ భేటీ నిర్వహించే అంశంపై సీఎం మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. కేబినెట్ భేటీ ఆరేడు గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహిద్దామని కేసీఆర్ చెప్పారు. దీనికి అధికారులు సమ్మతిస్తూనే.. మధ్యాహ్నం భోజనం (వర్కింగ్ లంచ్) ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఈ భోజనం ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై ఆసక్తికర చర్చ జరిగింది. సచివాలయంలో ‘సి’ బ్లాక్‌లోని మూడో అంతస్తులో కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తారు. నాలుగో అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. కేబినెట్ భేటీకి హాజరయ్యే మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులంతా కలసి సుమారు వంద మంది వరకు ఉంటారు. దీంతో ఇంత మందికి ఒకే చోట భోజనం వడ్డించేందుకు సచివాలయంలో అనువైన ప్రదేశం ఎక్కడ ఉందని సీఎం ఆరా తీయగా... అంత మందికి సరిపడే స్థలం సచివాలయంలో ఎక్కడా లేదని అధికారులు తేల్చారు. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... చివరకు ఓ పరిష్కారాన్ని ఆలోచించారు. మంత్రులు ఎవరి భోజనం వారు తెచ్చుకోవాలని... అధికారులకు మాత్రం కేబినెట్ భేటీ విరామ సమయంలో సమీపంలోని మారియట్ హోటల్లో లంచ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
అసెంబ్లీకి కసరత్తు
సమీక్షల్లో మంత్రులు బిజీ 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం సమావేశం కోసం గవర్నర్‌కు విజయకాంత్ వినతి సాక్షి, చెన్నై : మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో సీఎంగా పన్నీరు సెల్వం ఉన్నారు. బడ్జెట్ దాఖలుతో సభను వాయిదా వేశారు. అయితే, శాఖల వారీగా నిధుల కేటాయింపులపై చర్చే జరగలేదు. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ వ్యవహారాలపై దృష్టి సారించే పనిలో జయలలిత నిమగ్నం అయ్యారు. ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం అసెంబ్లీని సమావేశ పరచలేదు. అదే సమయంలో తాజాగా రాష్ట్రంలో ఓ వైపు టాస్మాక్ మద్యానికి వ్యతిరేకంగా నిరసనలు బయలుదేరి ఉండడం, ఎన్ఎల్సీ కార్మికులు సమ్మెబాట పట్టి ఉండడం, సమాచార కమిషనర్లు నియామకం వివాదానికి దారి తీసి ఉండడం తదితర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ సమయంలో అసెంబ్లీని తక్షణం సమావేశ పరచాలన్న డిమాండ్‌ను ప్రతి పక్షాలు తెర మీదకు తెచ్చాయి. బడ్జెట్ కేటాయింపులపై చర్చలు సాగని దృష్ట్యా, సభను సమావేశ పరిచి అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సమీక్షల్లో మంత్రుల బిజీ: గత వారం మౌళి వాక్కం భవనం కుప్పకూలిన కేసు విచారణకు రాగా, అసెంబ్లీలో నివేదిక దాఖలు చేయడం జరుగుతుందని, ఈనెలలోనే అసెంబ్లీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో శాఖల వారీగా మంత్రులు సమీక్ష సమావేశాల్లో బిజీ అయ్యారు. గత రెండు రోజులుగా మంత్రులు తమ తమ చాంబర్లలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, బడ్జెట్ కేటాయింపులు, ఇప్పటి వరకు వెచ్చించిన నగదు, చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహిస్తూ ప్రతి పక్షాలు సంధించే ప్రశ్నల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో అసెంబ్లీని ఈనెల 21వ తేదీన సమావేశ పరిచే అవకాశం ఉందని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. తదుపరి అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలోనన్నది నిర్ణయించి, బడ్జెట్ కేటాయింపులపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓ వైపు అసెంబ్లీని సమావేశ పరిచే రీతిలో ప్రభుత్వం కసరత్తుల్లో మునిగి ఉంటే, మరోవైపు తక్షణం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు తమరైనా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ప్రతి పక్ష నేత విజయకాంత్ విన్నవించి ఉన్నారు. గవర్నర్‌ను కలుసుకుని వినతి పత్రం సమర్పించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆయనకు వివరించారు. 2 విక్రమ్, సూర్య, కార్తీలతో మల్టీస్టారర్ చిత్రం విక్రమ్, సూర్య, కార్తీ నటించే భారీ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఇది ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. వివరాల్లోకెళితే హాలీవుడ్లో వారియర్స్ పేరుతో తెరకెక్కి వసూళ్ల వర్షం కురిపించిన చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో పునర్నిర్మిస్తున్నారు. అక్షయకుమార్, సిద్ధార్ధ్ మల్హోత్రా, జాకీష్రాఫ్ ప్రదాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళంలో విక్రమ్, సూర్య, కార్తీలను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇక తెలుగులో ప్రభాస్,రామ్‌చరణ్, రాణాలను నటింప జేయడానికి చర్చలు సాగుతున్నట్లు సమాచారం.అత్యంత భారీ బడ్జెట్లో రూపిందనున్న ఈ చిత్రానికి శంకర్ లాంటి స్టార్ దర్శకుడిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది.ఇద్దరు సహోదరులు ఒక బాక్సింగ్ శిక్షకుడి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ క్రేజీ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంచెం రోజులు ఆగాల్సిందే. -
తొలిరోజే వాకౌట్
స్పీకర్ వ్యాఖ్యలపై డీఎంకే నిరసన నల్ల చొక్కాలతో బైఠాయించిన డీఎండీకే ఎమ్మెల్యేలు సాక్షి, చెన్నై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజే వాకౌట్ల పర్వానికి డీఎంకే శ్రీకారం చుట్టింది. తమను లోనికి అనుమతించక పోవడంతో ప్రవేశ ద్వారం వద్ద నల్లచొక్కాలతో డీఎండీకే ఎమ్మెల్యేలు బైఠాయించారు. వీరి నిరసనకు డీఎంకే మద్దతు ప్రకటించింది. బడ్జెట్ దాఖలు వేళ ప్రతిపక్ష నేత విజయకాంత్ యథాప్రకారం డుమ్మా కొట్టారు. పన్నీరు దాఖలు చేసిన బడ్జెట్ ‘జీరో’ అంటూ ప్రతి పక్షాలు విమర్శించే పనిలో పడ్డాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు బుధవారం ఉదయం సభ ఆరంభం కాగానే, స్పీకర్ ధనపాల్ తమిళ గ్రంథం తిరుక్కురల్‌ను చ దివి వినిపించారు. అనంతరం బడ్జెట్ దాఖలు చేయాలంటూ సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు సూచించారు. ఈ సమయంలో డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని బడ్జెట్‌పై ఏదో ఒక అంశాన్ని ప్రస్తావించే యత్నం చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరిస్తూ కూర్చోండంటూ హెచ్చరించడంతో డీఎంకే సభ్యులు అందరూ తాము బడ్జెట్‌ను బహిష్కరిస్తున్నామని ప్రకటించి వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, బినామి ప్రభుత్వం దాఖలు చేసిన బడ్జెట్‌ను బహిష్కరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో, అవినీతి ఊబిలో కూరుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చే సూచనను కూడా వినే స్థితిలో స్పీకర్ లేకపోవడం శోచనీయమని విమర్శించారు. నల్ల చొక్కాలతో డీఎండీకే : గత అసెంబ్లీ సమావేశాల్లో డీఎండీకే సభ్యుల్ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఉదయం ఆ పార్టీ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు. అయితే, వారికి అనుమతి లేని దృష్ట్యా, ప్రవేశ మార్గంలో బైఠాయించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా, రాష్ర్ట ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపుతూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలతో హోరెత్తించారు. ఆ పార్టీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో ప్రవేశ ద్వారం వద్ద బైఠాయించిన డీఎండీకే సభ్యుల నినాదాలతో ఆ పరిసరాలు దద్దరిల్లాయి. అదే సమయంలో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చిన డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ నేరుగా డీఎండీకే సభ్యుల వద్దకు వెళ్లి తన మద్దతు తెలియజేశారు. సస్పెన్షన్ ఎత్తి వేత లక్ష్యంగా అసెంబ్లీలో గళం విప్పుతామని, సంపూర్ణ మద్దతు సభలో ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చంద్రకుమార్ మాట్లాడుతూ, తమ సస్పెన్షన్ ఎత్తి వేసే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తాము వ్యవహరిస్తుంటే, అందుకు భిన్నంగా స్పీకర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీరో బడ్జెట్: సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం దాఖలు చేసిన బడ్జెట్ ‘జీరో’ అని ప్రతిపక్షాలు విమర్శించాయి. డీఎంకే కోశాధికారి స్టాలిన్ పేర్కొంటూ, పసలేని బడ్జెట్ అని, బినామీ పాలన అన్నది ఈ బడ్జెట్లో స్పష్టం అవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ సభ్యురాలు విజయ ధరణి పేర్కొంటూ, సీఎం పన్నీరు సెల్వం ప్రకటన చూస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకు పోయిన విషయం స్పష్టం అవుతోందన్నారు. ప్రజాపయోగకరంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం శోచనీయమని విమర్శించారు. పుదియ తమిళగం నేత, ఎమ్మెల్యే కృష్ణ స్వామి పేర్కొంటూ, బడ్జెట్ సున్నా..! అని ముందుకు సాగారు. ఎస్ఎంకే నేత, ఎమ్మెల్యే శరత్‌కుమార్ పేర్కొంటూ, ప్రజల మీద కొత్తగా ఎలాంటి పన్నుల మోత లేని దృష్ట్యా, అభినందనీయమని ముగించారు. -
రైతు ‘ప్యాకేజీ’ తరువాతే సభ
⇒ ప్రభుత్వానికి స్పష్టం చేసిన విపక్షాలు ⇒ రైతన్నలకు న్యాయం చేయాలని డిమాండ్ ⇒ మూడోరోజూ సభలో రభస సాక్షి, ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మూడో రోజు కూడా రైతుల ప్యాకేజీ అంశం దుమారం లేపింది. రైతులకు న్యాయం చేసేంత వరకు సభను సాగనివ్వబోమని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘మర్ జవాన్’, ‘మర్ కిసాన్’ అనే ధోరణితో ముందుకు వెళ్తుందని ఘాటుగా ఎన్సీపీ ఆరోపించింది. ‘నరేంద్ర మోదీ విదర్భలోని రైతులతో ‘చాయి పే చర్చ’ కార్యక్రమం జరిపారు. కాని ఆయన చర్చలో పాల్గొన్న గ్రామంలోని రైతే ఆత్మహత్యకు పాల్పడ్డాడు’ అని పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేవలం మీడియాలో ప్రచారం కోసం రైతుల ఇంట్లో పడుకోవడం లాంటి స్టంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రైతుల సమస్యలపై చర్చలు జరిపేందుకు కూడా సుముఖత తెలపడం లేదని ఎన్సీపీ గ్రూప్ లీడర్ జయంత్ పాటిల్ పేర్కొన్నారు. ప్రతి హెక్టార్‌కు రూ. 25 వేల చొప్పున వెంటనే ప్యాకేజీ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే ప్రసంగం అనంతరం ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. సమావేశాలు ముగిసేలోపు ప్యాకేజి ప్రకటిస్తాం: ఏక్నాథ్ ఖడ్సే సమావేశాలు ముగిసేలోపు రైతులకు మద్దతు ప్యాకేజీ ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే తెలిపారు. రైతులకు ఊహించి నంత మద్దతు అందించలేకపోయామని అంగీకరించారు. ‘అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల వివరాల సేకరణ ప్రారంభించాం. అయితే ఇంకా పూర్తికాలేదు. ఇప్పుడే పూర్తిస్థాయి ప్యాకేజీ ప్రకటించడం సాధ్యంకాదు. రైతన్నలకు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రాన్ని కోరాం. ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కేంద్ర సాయంపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు రూ. 2 వేల కోట్ల ఆర్థికసాయం ఇప్పటికే అందించాం. సుమారు 78 శాతం రైతులకు సాయం అందింది. మిగిలిన రైతులకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించగానే అందజేస్తాం’ అని ఖడ్సే చెప్పారు. వివరాల సేకరణ పూర్తికానిదే రైతులకు ప్యాకేజీ అందించలేమని మంత్రి చెప్పగానే ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి. ‘ప్యాకేజీ’ ప్రకటించేంతవరకు సభను సాగనివ్వం: ధనంజయ్ ముండే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెంటనే రైతులకు మద్దతు ప్యాకేజీ ప్రకటించాలని, లేదంటే సభను సాగనివ్వబోమని శాసనసభ ప్రతిపక్ష నాయకుడు ధనంజయ్ ముండే ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా రైతులు కరవు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ విషయంపై ప్రభుత్వం కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముందుకు రావడం లేదు’ అని ఆరోపించారు. ‘రాష్ట్రంలోని 353 తాలూకాల్లో 284 చోట్ల లోటు వర్షపాతం నమోదైంది. 23,811 గ్రామాల్లో కరవు పరిస్థితి నెలకొంది. కరవు ప్రాంతాల్లోని రైతులకు ఇంత వరకు ఆర్థిక సాయం అందలేదు. ప్రతి రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 100 రోజుల పాలనలో 300కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని ముండే విమర్శించారు. -
మార్చిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు?
హైదరాబాద్: మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. హైదరాబాద్ లో శనివారం ఆయన మాట్లాడుతూ..16 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. చిట్ ఫండ్ మోసాల నియంత్రణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురావాలని యనమల తెలిపారు. -
అసెంబ్లీలో తురుపుముక్కలు
అధికారపక్షానికి అండగా హరీశ్ సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఆద్యంతం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందనుకున్న ప్రతిసారి సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు అధికారపక్షానికి అండగా నిలిచారు. అసెంబ్లీలో అది ప్రశ్నోత్తరాల కార్యక్రమమైనా, సావధాన తీర్మానంపై చర్చ అయినా ప్రభుత్వ పక్షాన హరీశ్ తనదైన శైలిలో విపక్షాలకు సమాధానమిచ్చారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న వారెందరు అన్నదానిపై వాదనలు జరుగుతున్నప్పుడు ఎంత మంది అమరులైనా ప్రభుత్వం గుర్తిస్తుందని, వారిని ఆదుకుంటుందని, విపక్ష సభ్యులు సమాచారం ఇచ్చినా తీసుకుంటామని సర్దిచెప్పారు. అసైన్డ్ భూములకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అనర్గళంగా ప్రశ్నలు అడుగుతుంటే పీసీసీ అధ్యక్షుడు పొన్నాల అసైన్డ్ భూమి వ్యవహారాన్ని ప్రస్తావించి వారిని ఆత్మరక్షణలో పడవేశారు. అక్బర్ అదుర్స్.. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చెప్పిన రాజు, గాయకుడి కథ సభను ఆకట్టుకుంది. బడ్జెట్ సమావేశాల్లో పలు అంశాలమీద ఆయన కచ్చితమైన సమాచారంతో ప్రభుత్వాన్ని నిలదీయడంపై ప్రశంసలు వచ్చాయి. ఆయన మాట్లాడిన పలు సందర్భాల్లో సభ్యులు కార్యకలాపాలను ఆసక్తిగా గమనించారు. వక్ఫ్ భూములకు సంబంధించి సర్వే నంబర్లు ఉటంకిస్తూ ఆయన ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టారు. జూబ్లీహిల్స్ సహకార గృహ నిర్మాణ సంఘంలో అక్రమాలను ప్రస్తావించారు. తద్వారా వక్ఫ్ భూముల ఆక్రమణ, సహకార గృహ నిర్మాణ సంఘాల్లో అక్రమాలపై రెండు సభాసంఘాలు వేయడానికి దోహదపడ్డారు. ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడే అక్బరుద్దీన్ అవకాశం దొరికినప్పుడల్లా ఆయా అంశాలపై స్పష్టమైన అవగాహనతో మాట్లాడారు. ‘భట్టి’ది గట్టి వాదనే! ప్రభుత్వంపై ఈగ వాలనీయవద్దన్న రీతిలో కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుంటే, ఆ పార్టీ శాసనసభా పక్షం కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క పద్దులపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును, ప్రభుత్వాన్ని ఏకకాలంలో అంశాల వారీ గా నిలదీసిన తీరు సభ్యులను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి నిర్ణయాలు కొన్ని నియంతృత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి సభలో ఉండగానే ఆయన తప్పులను వరుసపెట్టి ప్రస్తావిం చారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తే తరచూ లేచి గొడవ చేసే టీఆర్ఎస్ సభ్యులు, భట్టి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా విన్నారు. చురకలు.. చప్పట్లు..! బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి చురకలు వేసిన తీరుకు ప్రశంసలు వచ్చాయి. రాష్ట్రంలో కోట్లాది కుటుం బాలను ఒక్క రోజున సర్వే చేసిన ప్రభుత్వం 1200 మంది అమరవీరుల వ్యవహారాన్ని ఆరు మాసాలైనా తేల్చలేకపోతోందని ఎద్దేవా చేస్తూ..అమరుల కుటుంబాల విషయంలో జాప్యం మంచిది కాదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దారుణంగా ఉన్నాయంటూ వాటిని విశదీకరించి చెప్పారు. -
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, హన్మకొండ : ‘జూరాల-పాకాల’కు అడుగు పడేనా..‘దేవాదుల’ వేగిరమయ్యేనా... ‘కంతనపల్లి’కి నిధులు వచ్చేనా..ఇండస్ట్రియల్ కారిడార్‌కు స్థానం దక్కేనా....ఇలా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై జిల్లావాసులు గంపెడాశతో ఉన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ‘తొలి’ అడుగుతో దశ తిరిగేనా అని కోటి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతిలోని మంత్రదండం జిల్లాకు నిధుల వరద పారించేనా అని ముందస్తుగా లెక్కలు వేస్తున్నారు. జిల్లా ప్రజల్లో భారీ అంచనాలు ఉండడంతో జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, ముత్తిరెడ్డి యూదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, ఆరూరి రమేశ్ బడ్జెట్ సమావేశాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ నియోజకవర్గాలకు ఏ మేరకు నిధులు వస్తాయోనని అంచనాల్లో మునిగారు. ఇప్పటికే మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు వివిధ స్థాయిల్లో చేపట్టాల్సిన పనులు, నిధుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. వీటితోపాటు జూరాల-పాకాల, వాటర్‌గ్రిడ్, గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటి ఆధారంగా జిల్లాకు పలు పథకాలు, నిధులను బడ్జెట్ సమావేశాల వేదికగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది. సాగునీటికి పెద్దపీట తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు దివరకే స్పష్టం చేసింది. జిల్లాలో 5,61,229 ఎకరాల బీడు భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పదేళ్ల కిందట ప్రారంభించినా... పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు పూర్తి కాలేదు. మూడు దశల్లో రూ. 9,427 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా... గడువు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో నిర్మాణ వ్యయం అదనంగా రూ. 1976 కోట్లు పెరిగింది. మొదటి దశ పనులు పూర్తి కాగా, రెండో, మూడో దశ పనులు ఏళ్లు గడిచినా.. కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత బహుళార్ధక ప్రాజెక్టుగా ఐదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన కంతనపల్లి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. కంతనపల్లికి సంబంధించిన డిటైల్డ్ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను 2014 ఆగస్టులో ప్రభుత్వానికి పంపించారు. మొత్తం 131 గేట్లతో అతి పెద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్లాన్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టు పనులు వేగం చేసేలా ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించేందుకు ఆస్కారం ఉంది. కంతనపల్లి పూర్తయితే దేవాదుల ప్రాజెకు ్టద్వారా ఎక్కువ రోజుల నీటిని వాడుకునే అవకాశం ఏర్పడుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో జిల్లా ఉన్నప్పటికీ ఒక్క చుక్క వాటా కూడా వరంగల్ జిల్లాకు రావడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జూరాల-పాకాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వచ్చే మూడేళ్లలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేస్తే... ఏకంగా 3.60 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించే వీలుంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల నుంచి కృష్ణానది నీళ్లను మహబూబ్‌నగర్, నల్లగొండ మీదుగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల వరకు తీసుకొస్తారు. ఈ మూడు ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. గ్రేటర్ చిక్కులు తీరేనా... హైదరాబాద్-వరంగల్ మధ్య ఇండిస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి పరచడం ప్రభుత్వ ప్రాధాన్య అంశాల్లో ఒకటిగా ఉంది. దీనికనుగుణంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధి, కార్యక్రమాల విస్తరణ, పెండింగ్‌లో ఉన్న వ్యాగన్ పరిశ్రమకు భూమి కేటాయింపు, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి విస్తరణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ నగర పాలక సంస్థను గ్రేటర్‌గా మార్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ గ్రేటర్ ప్రకటన వెలువడే ఉంది. అదేవిధంగా... నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు. చెరువుల అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునురుద్ధరణ, తాగునీటి పథకాలకు (వాటర్‌గ్రిడ్) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాలో మొత్తం 1400 చెరువులు ఉన్నాయి. వీటిలో మొదటిదశ కింద 250 చెరువులను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. వీటికి దాదాపు రూ.500 కోట్ల వ్యయం అవుతుంద ంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటర్‌గ్రిడ్‌లో భాగంగా జిల్లాలో సుమారు రూ 5,700 కోట్ల వ్యయంతో ఐదు గ్రిడ్లు ఏర్పాటు చేసి... జిల్లాలో అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మొదటి దశకు సంబంధించిన నిధులు ఈ బడ్జెట్లో మంజూరయ్యే అవకాశం ఉంది. -
30న అసెంబ్లీకి సెలవు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల అభ్యర్థన మేరకు 30న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు విరామం ఇచ్చారు. మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వినతిని స్పీకర్ అనుమతిస్తూ పాలక, ప్రతిపక్షాల ఆమోదంతో 30న శనివారం సభా వ్యవహారాలు ఉండవని ప్రకటించారు. దీంతో సభకు శుక్ర. శని, ఆదివారాలు.. వరుసగా మూడు రోజులు సెలవు వచ్చినట్టయింది. -
స్పీకర్‌పై ‘అవిశ్వాసా’నికీ వెనుకాడం
ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ అధికారపక్షానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడి హితవు ► ప్రజల వాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు ► ఇలాగే కొనసాగితే సభాపతిపై అవిశ్వాసం పెట్టేందుకూ సిద్ధం ► ఇద్దరు ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలి ► మరో సభ్యుడిపై హక్కుల నోటీసునూ ఉపసంహరించాలి ► నా ప్రసంగానికి 106 నిమిషాలు అంతరాయం కలిగించారు హైదరాబాద్: శాసనసభలో ప్రజావాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్న తీరు ఇలాగే కొనసాగితే సభాపతిపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కూడా తాము వెనుకాడబోమని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు జరిగి ఉండవేమోనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికీ వెనుకడుగువేయబోమన్నారు. మంగళవారం శాసనసభ వాయి దాపడిన తర్వాత అసెంబ్లీ కమిటీ హాలులో సహచర ఎమ్మెల్యేలతో కలసి జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే వరకూ పరిస్థితిని రానివ్వకూడదన్నారు. సభ నుంచి సస్పెండ్ చేసిన తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని కోరారు. మరో సభ్యునిపై ప్రతిపాదించిన సభా హక్కుల నోటీసును కూడా వెనక్కి తీసుకోవాలన్నారు. మాట్లాడుతోంటే మైక్ కట్ చేస్తున్నారు... ప్రతిపక్ష నాయకుడు ఒక అంశంపై తాను నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేయాలనుకుంటున్నానని, మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా సభాపతి మైక్ ఇవ్వని పరిస్థితి ఉం దని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా సభలో నుంచి వెళ్లిపోండి అనే తీరు బహుశా ఎపుడూ లేదేమోనన్నారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని.. బడ్జెట్‌పై తన ప్రసంగం పూర్తికాక ముందే మైక్‌ను కట్ చేశారని ఆయన చెప్పారు. ‘‘సోమవారం నేను 11.08 గంటలకు ప్రసంగం మొదలు పెట్టాను. ప్రజల సమస్యల మీద, బడ్జెట్లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల మీద మాట్లాడాను. చంద్రబాబు, అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల ఆధారంగా వారు వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపైనే మాట్లాడాను. ఒక్కదానిపై కూడా నేను డీవియేట్ కాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించలేదు. పూర్తిగా సబ్జెక్ట్ మీదే మాట్లాడాను. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో వాటికి ఎన్ని కేటాయింపులు చేసిందనే అంశాలు తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. కానీ నా ప్రసంగానికి 17 సార్లు అంతరాయం కలిగించారు. అధికారపక్ష సభ్యు లు అడ్డుతగిలి గంటా ఆరు నిమిషాలపాటు అం తరాయం కలిగించారు. మా పార్టీ నేతలు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీవీలో చూసి స్పష్టంగా అంతరాయాలు ఎన్నిసార్లు, ఎపుడెపుడు జరిగాయని సమయంతో సహా నమోదు చేశారు. 11.08గంటలకు నేను ప్రసంగం ప్రారం భిస్తే ఈ అంతరాయాలు కలుపుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు మైక్‌ను కట్ చేశారు. ఈ రెండున్నర గంటల సమయంలో అంతరాయా లు కలిగిస్తూనేపోయారు. రెండు మూడు నిమిషాలు మాట్లాడితే చాలు మైక్ కట్ చేయడం.. అధికారపక్షానికి అవకాశం ఇవ్వడం, మరో నా లుగు నిమిషాలు మాట్లాడాక మళ్లీ మైక్ కట్.. మరో పది నిమిషాలు మాట్లాడిన తరువాత మళ్లీ మైక్ కట్.. బహుశా ఇంతటి అన్యాయమైన పరి స్థితులు ఎవరికీ ఎదురై ఉండవేమో!’’ అని జగన్ ఆశ్యర్యం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారమే చేస్తున్నారా? జగన్ ఈసందర్భంగా అసెంబ్లీ రూల్స్ బుక్‌లోని పలు నిబంధనలను మీడియా ప్రతినిధులకు చదివి వినిపించారు. ‘‘151వ నిబంధనలోని 3వ సబ్ సెక్షన్లో బడ్జెట్‌కు సంబంధించి ఆరు రోజు లపాటు సాధారణ చర్చ జరగాలని కచ్చితంగా నిర్దేశించారు. అలాగే వివిధ డిమాండ్లపై చర్చ, ఆమోదానికి ఎనిమిది రోజుల సమయం కేటాయించాలని ఉంది. ఇవి కచ్చితంగా అనివార్యం గా పాటించి తీరాల్సిన నిబంధనలు. అలా జరగాల్సిన సాధారణ చర్చను కేవలం నాలుగు రో జులకు కుదించారు. శాసనసభలో ఉన్నది రెండే రెండు పక్షాలు.. ప్రతిపక్షంలో ఉన్నది మా పార్టీ ఒక్కటే అయినా గంటన్నర సమయమే ఇస్తారని చెప్తున్నారు. బడ్జెట్‌పై సాధారణ చర్చలో నేను మాట్లాడటానికి మరో 20 నిమిషాల సమయం కావాలని అడిగితే.. అదీ ఇవ్వలేదు.. నాకు ఇవ్వకపోగా అధికారపక్షానికి మైక్ ఇచ్చి మాట్లాడమనడం ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని వివరించారు. విపక్షం గొంతు నొక్కితే ప్రజలు హర్షించరు శాసనసభలో ఉన్నది అధికార, ప్రతిపక్షాలేనని.. ప్రతిపక్షమన్నది ప్రజల గొంతు కనుక వాళ్ల గొంతు ప్రజలు వినాలనుకుంటారని.. ప్రతిపక్షం గొంతు వినపడేలా అవకాశం కల్పించడం స్పీకర్ ధర్మమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షం గొం తు పూర్తిగా నొక్కేయాలి, వినపడకూడదనే ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు హర్షించరని అన్నారు. వాస్తవానికి నిజమైన ప్రతిపక్షం తాము కాదని, ప్రజలే నిజమైన ప్రతి పక్షమని అందుకే ప్రజల తరఫున తాము మాట్లాడేటపుడు గొంతును వినడానికి అధికారపక్షానికి ఓపిక ఉండాలని, ఆ ప్ర కారం అందరూ మార్పు తెచ్చుకోవాలని జగన్ విజ్ఞప్తిచేశారు. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌ను ఉపసంహరించడంతో పాటుగా తమ గొంతు వి నే ఓపిక తెచ్చుకుని సభ నడిపితే మంచిదన్నారు. ఆత్మస్తుతి-పరనింద తప్ప ఇంకేమీ ఉండదు సభలో ప్రతిపక్షం గొంతు నొక్కితే ‘ఆత్మస్తుతి-పరనింద’ తప్ప ఇంకేమీ మిగలదని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘సభ ఉండేది మీ గురించి మీరు డబ్బా కొట్టుకోవడానికి.. వైఎస్‌ను విమర్శించడానికే అనుకుంటే ఇంకేమీ మిగలదు’’ అని అధికారపక్షానికి హితవుపలికారు. తమవైపు నుంచి చర్చ బాగా జరగాలనే ఉద్దేశంతోనే పలు అంశాలపై నిరసన తెలుపుతూ సభలో కూర్చుంటున్నామని, మైక్ కట్ చేసినా బాధను దిగమింగుకుని తమవైపు నుంచి నాలుగడుగులు ముందుకేసి సహకరిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి ఎవరో అర్థం కావట్లేదు.. శాసనసభ జరుగుతున్న తీరును జగన్ తీవ్రం గా తప్పుబట్టారు. ‘‘అధికారపక్షం వారికి మైక్ ఇస్తూ చంద్రబాబును గొప్పగా పొగిడించుకోవడం, దివంగత రాజశేఖరరెడ్డిని తిట్టించడం మాత్రమే జరుగుతోంది. అసలు ముఖ్యమంత్రి వైఎస్సా లేక చంద్రబాబునాయుడా? అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. వైఎస్ చనిపోయి కూడా ఐదేళ్లు దాటింది. అయినా ఇంకా ఆయననే తిట్టడం ఎంత దారుణం? మా పార్టీ సభ్యులు టీడీపీ విధానాలపై విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే చాలు.. వెంటనే మైక్ కట్ చేస్తున్నారు.. టీవీల్లో ప్రసారాలను గమనించే వారికి ఇది స్పష్టంగా కనబడుతోంది. టీవీ ఫోకస్ కూడా ఎక్కువగా అధికారపక్ష సభ్యుల మీదనే ఉంటోంది. మా వాళ్లు (వైఎస్సార్ సీపీ సభ్యులు) బాగా మాట్లాడుతుంటే టీవీల్లో చూపించరు. అదే టీడీపీ వాళ్లు మమ్మల్ని తిట్టేది అదే పనిగా చూపిస్తారు. అందుకు కారణమేమంటే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని చూపించే హక్కులు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వాళ్లకు ఇచ్చారు. ఇక టీవీల్లో కూడా వాళ్లు చూపించాలనుకున్నదే చూపిస్తున్నారు. చెప్పాలనుకున్నదే చెప్తున్నారు. ప్రతి పక్షం గొంతు అనేది ఎక్కడా వినిపించకూడదు, కనిపించకూడదు అన్నట్లు చేస్తోంటే ఇక ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా?’’ అ ని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులు ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇవ్వాల్సిన మంత్రులు మాట్లాడుతున్నప్పుడు అదే పని గా వై.ఎస్.రాజశేఖరరెడ్డిని నిందించడం అం దరూ గమనిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. అవి కూడా తప్పుడు తిట్లేనని, వారు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. తాము మళ్లీ వాటిపై వివరణలు అడుగుదామంటే మైక్ ఇవ్వరని చెప్పా రు. అన్యాయం జరుగుతోందని తాము నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా టీవీల్లో కనిపించదన్నారు. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యా న్ని ఖూనీ చేస్తూ శాసనసభను నడుపుతున్నారంటే నిజంగా రాష్ట్రం మొత్తం సిగ్గుతో తలొం చుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. సత్సంప్రదాయాలను నెలకొల్పుదాం... ‘‘శాసనసభలో ఇలాంటి దుస్సంప్రదాయాలను నెలకొల్పవద్దు.. అధికారంలో ఇవాళ మీరుండొచ్చు... రేప్పొద్దున మేము రావొచ్చు. ఇలాంటి సంస్కృతి పునరావృతమైతే భవిష్యత్ తరాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మా పార్టీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.. మరో సభ్యునిపై సభాహక్కుల తీర్మానాన్ని ఇచ్చారు.. అసలు వీరెందుకు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు? అలా నిరసనలు తెలపకుండా వారిని పిలిచి మాట్లా డి సమయం కేటాయించాలన్న ఆలోచన ఎందుకు చేయరు?’’ అని జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీకు న్న బలం మేరకు సభా కార్యక్రమాల సమయంలో 40 శాతం తమ పార్టీకి కేటాయిం చాలనీ, అంత సమయం ఇస్తున్నారా అన్న ది ఒక్కసారి ప్రశ్నించుకోవాలని సూచిం చారు. అసెంబ్లీ నడిపే తీరు కూడా దిగజారిపోయింద ని ఆందోళన వ్యక్తంచేశారు. ఇచ్చిన సమయంపైనా అబద్ధం చెప్తున్నారు తమ పార్టీకి గంటన్నర సమయం కేటాయి స్తూ బీఏసీలో చెప్పినప్పుడు జ్యోతుల నెహ్రూ, అమర్నాథ్రెడ్డి అంగీకరించారన డం అబద్ధమేనని జగన్ స్పష్టంచేశారు. ‘మీరు చెప్తున్నది తప్పు సార్’ అంటూ సభలోనే స్పీకర్‌తో అమర్నాథ్రెడ్డి చెప్పారని, జ్యోతుల నెహ్రూ తనకు మైక్ ఇవ్వకపోయి నా గట్టిగా అరుస్తూ ‘అబద్ధం’ అని చెప్పార ని, స్పీకర్ స్వయంగా ఒకసారి తనకు 2.30 గంటలు కేటాయించినట్లు, మరోసారి 1.30 గంటలు కేటాయించినట్లు చెప్పారని గుర్తుచేశారు. తన ప్రసంగానికి 21 నిమిషా లే అంతరాయం కలిగించారని స్పీకర్ చెప్ప డం సరికాదన్నారు. ‘‘అందరూ టీవీలు చూశారు కదా అంతరాయం కలిగించింది అంతేనా? ఏమిటీ అన్యాయం? నా ప్రసంగాన్ని 52 నిమిషాల సేపు అడ్డుకున్నారని జాబితాను స్పీకర్‌కూ ఇచ్చాం. ఆ తర్వాత కూడా ఇంకా అంతరాయాలు జరిగాయి. నేను మాట్లాడుతున్నప్పుడు 1.06 గంటల పాటు అడ్డుకున్నారు.. ఇంతకంటే దారుణమేమైనా ఉందా?’’ అని ప్రశ్నించారు. -
సెప్టెంబర్ తొలివారంలో అసెంబ్లీ
హైదరాబాద్: వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించారు. స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు ముఖ్య అధికారులతో కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల తేదీలు, రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఏకకాలంలో జరిగే అవకాశమున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు. సెప్టెంబర్ 3వ తేదీన సమావేశాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆరోజువీలు కాకుంటే 5న ప్రారంభించాలన్న అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్ర తొలి బడ్జెట్‌ను 10వ తేదీన ప్రవేశపెట్టాలని సూత్రప్రాయంగా అనుకున్నారు. కనీసం 21 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ఒక రోజు, ధన్యవాద తీర్మానంపై చర్చకు మూడు రోజులు, ఆ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ఒక రోజు కేటాయిస్తారు. 8 రోజులపాటు వివిధ పద్దులపై చర్చ జరుగనుంది. మరో 6 రోజులపాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. ద్రవ్య వినిమయ బిల్లు, సీఎం సమాధానాన్ని మిగిలిన మూడు రోజుల్లో పూర్తిచేయనున్నారు. దీనిపై శాసనసభా వ్యవహారాల కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. కాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు దాదాపు ఒకే సమయంలో జరగనున్న నేపథ్యంలో ఇద్దరు స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు మంగళవారం భేటీ కానున్నారు. -
12 నుంచి తెలంగాణ బడ్జెట్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ కోసం కసరత్తును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. ఆర్థిక మంత్రి వివిధ శాఖల మంత్రులు, ఆ శాఖల ముఖ్యకార్యదర్శులతో పదిరోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు ఇచ్చే ప్రతిపాదనలను అధ్యయనం చేయనున్నట్లు ఈటెల వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యతలు, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌కు రూపకల్పన చేస్తామన్నారు. మొదటి ఆరునెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ముందుగానే ఉమ్మడి సభలో ఆమోదించినందున అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు అవసరమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆర్థిక శాఖ రూపకల్పన చేస్తుందని తెలిపారు. ఇదిలాఉండగా, ఆగస్టు చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.