
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం మొత్తం కోవిడ్‌తో అతలాకుతలమైందని, ఆదాయాలు తగ్గిపోయినప్పటికీ, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడానికి భారీగా వ్యయం చేసినట్లు శాసనసభకు సమర్పించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,177 కోట్లు వ్యయం చేయగా, ఆçహార భద్రతా కార్డులున్న వారికి ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున రెండు దఫాలు మొత్తం రూ. 2,628 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే రేషన్ కోసం రూ. 1,103 కోట్లు, వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి వీలుగా రూ.124 కోట్లు, కోవిడ్ వారియర్స్‌గా ఉన్న వైద్య, మునిసిపల్, పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.182 కోట్లు, పోలీసులకు రూ.54 కోట్లు సాయం అందించినట్లు వివరించింది.
ఏప్రిల్‌లో 87.7 శాతం ఆదాయం నష్టం..
కోవిడ్ ప్రభావం 2020 మార్చిలో ప్రారంభం అయితే.. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో 87.7 శాతం మేరకు నష్టపోయినట్లు నివేదికలో పేర్కొంది. మే నెలలో 50.8 శాతం నష్టం జరిగింది. గత ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయం సాధారణ స్థితికి వచ్చిందని, ఆ సమయంలో రూ. 36,806 కోట్ల మేరకు సొంత ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా వ్యాట్, ఎస్‌జీఎస్‌టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ నష్టపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
మౌలిక సదుపాయాలకు మస్తు నిధులు
సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్‌లో అదనపు నిధులను కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్ర వాటాను భారీగా పెంచింది. రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక పథకం కింద తరగతి గదులు, భవన నిర్మాణాలు, టాయిలెట్లు కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పాఠశాల విద్యలో గతేడాదితో పోల్చితే ఈసారి రూ. 533.7 కోట్లు అదనంగా కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గతేడాది రూ. 1,239.46 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 1,773.16 కోట్లను కేటాయించింది. సమగ్ర శిక్షా అభియాన్‌కు గతేడాది 623.48 కోట్లను కేటాయించగా ఈసారి రూ.526.52 కోట్లు అదనంగా కేటాయించింది.
ఇక జూనియర్, డిగ్రీ కాలేజీల్లో భవనాలు, అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 23 కోట్లకు పైగా నిధులను కేటాయిం చింది. మధ్యాహ్న భోజన పథకానికి గతేడాది లాగే నిధులను కేటాయించింది. విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురు కులాలు, పాఠ్య పుస్తకాల ముద్రణా లయానికి కేటాయింపులను పెంచింది. డిగ్రీ కాలేజీల భవనాలకు గతేడాది రూ.5 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.10.91 కోట్లు కేటా యించింది. సాంకేతిక విద్యాశాఖలో ఎస్సీ హాస్టళ్ల కోసం రూ.3.23 కోట్లు కేటాయించింది. ఆర్‌ఐడీఎఫ్ కింద భవన నిర్మాణాలకు రూ.4.78 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment