budget sessions
-
19న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం 19వ తేదీన (బుధవారం) ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెట్టనుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బుధవారం స్పీకర్ చాంబర్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది.ఇందులో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. సుమారు గంట పాటు సాగిన ఈ భేటీలో.. తాము ప్రతిపాదించిన అంశాలను సభా వ్యవహారాల్లో చేర్చాలని బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ కోరింది. మరోవైపు బీఏసీ సమావేశంలో ఖరారు కావాల్సిన ఎజెండాను ముందుగానే బయటికి లీక్ చేశారంటూ హరీశ్‌రావు వాట్సాప్ సందేశాలను చూపించారు. చివరికి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలను పొడిగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. విడివిడిగా మూడు రోజుల విరామంతో.. బీఏసీ నిర్ణయం ప్రకారం.. గురువారం (13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 14న హోలీ పండుగ సందర్భంగా విరామం ప్రకటించి, 15న చర్చను కొనసాగిస్తారు. 16న ఆదివారం విరామం. 17న ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరుగుతుంది. అదే రోజున బీసీ రిజర్వేషన్లు, 18న ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాలపై చర్చ జరిగే అవకాశముంది. 19న రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెడతారు. సభ్యులు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు 20న విరామం ప్రకటించారు. తిరిగి 21 నుంచి 26వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులపై చర్చ జరుగుతుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించిన తర్వాత సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. శాసనసభ తరహాలోనే శాసనమండలి సమావేశాల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయగా.. అందులో ఈ నెల 22 నుంచి 26 వరకు విరామం ప్రకటించారు. -
రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు గ్రాంట్లు, డిమాండ్లకు అమో దం, మణిపూర్ బడ్జెట్ ఆమోదం, అత్యంత కీలకమైన వక్ఫ్ (సవరణ) ను ఆమోదంపై ఈ సమావేశాల్లో కేంద్రం దృష్టి సారించనుంది. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే నివేదిక అందజేసింది. దాన్ని వీలైనంత త్వరగా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ ఆమోదం కోరుతూ కేంద్రం హోం మంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మణిపూర్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడతారు. వాడీవేడిగా... రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడీగా సాగే అవకాశాలున్నాయి. వక్ఫ్ బిల్లుతో పాటు మణిపూర్ హింసాకాండ, లోక్‌సభ నియోజకవర్గాల పుర్వివభజన, అమెరికా సుంకాల పెంపు తదితరాలపై మోదీ సర్కారును గట్టిగా నిలదీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమకు చేటు చేస్తుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. 1971 నాటి జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన జరగాలని తమిళనాడు సీఎం స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. దీన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని డీఎంకే ఎంపీలను ఆయన ఆదివారం ఆదేశించారు. జనాభా ప్రాతిపదికన పుర్వివభజనను, తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడాన్ని పార్లమెంటులో గట్టిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండు తీర్మానాలను ఆమోదించారు. పుర్వివభజనకు వ్యతిరేకంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒడిశా, పశి్చమబెంగాల్, పంజాబ్ పార్టీల మద్దతు కూడగట్టాలని డీఎంకే నిర్ణయించింది. ఇక నకిలీ ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్)లపై కేంద్రాన్ని నిలదీయాలని టీఎంసీ నిర్ణయించింది. దీనిపై కలిసి రావాలని కాంగ్రెస్, డీఎంకే, శివసేన (ఉద్ధవ్)లను కోరింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని కాంగ్రెస్ కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. దీనిపై పార్లమెంట్‌లోనూ గళ మెత్తాలని పార్టీ నిర్ణయించింది. -
Payyavula Keshav: ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు బడ్జెట్
-
మూడో పర్యాయం.. మూడింతల వేగం
న్యూఢిల్లీ: దేశ అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అసాధారణ వేగంతో పనిచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్ఘాటించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు, యువత, మహిళలు, రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కీలక నిర్ణయాలు, విధానాలను అమల్లోకి తీసుకొచ్చిందని చెప్పారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో వేగంగా మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా అంకితభావంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా లోక్‌సభ చాంబర్లో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. 60 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ ప్రగతి ప్రయాణంలో అమృతకాలం నడుస్తోందని, ఇప్పటిదాకా సాధించిన అపూర్వమైన విజయాలతో ప్రభుత్వం దేశానికి నూతన శక్తిని ఇచ్చిందని తెలిపారు. మహా కుంభమేళాలో మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో భక్తులు మరణించడం పట్ల రాష్ట్రపతి సంతాపం ప్రకటించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులరి్పంచారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనతలను వివరించారు. ద్రౌపదీ ముర్ము ప్రసంగం ఆమె మాటల్లోనే... అప్పుడే అభివృద్ధికి సార్థకత శ్రీహరికోటలోని షార్ నుంచి ఇస్రో వంద రాకెట్ ప్రయోగాలు పూర్తిచేయడం ప్రశంసనీయం. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న గగన్‌యాన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లే రోజు ఇక ఎంతోదూరంలో లేదు. కోవిడ్–19 మహమ్మారి, ఇతర దేశాల్లో యుద్ధాలు, తద్వారా అంతర్జాతీయంగా అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోంది. మన బలాన్ని ఆర్థిక వ్యవస్థ చాటి చెబుతోంది. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఒకే దేశం.. ఒకే పన్ను అనే విధానంతో జీఎస్టీని తీసుకొచ్చింది. దీనితో అన్ని రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతున్నాయి. అభివృద్ధి ఫలాలు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి సైతం అందాలి. అప్పుడే ఈ అభివృద్ధికి ఓ సార్థకత ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చింది. సౌభాగ్య యోజన కింద 80 కోట్ల మందికి రేషన్ సరుకులు అందజేస్తోంది. స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి జల జీవన్ మిషన్‌ను అమలు చేస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో తాము గౌరవంగా జీవించగలమన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తే.. పేదరికాన్ని జయించగలమన్న ధీమా వారిలో పెరుగుతుంది. ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. వారంతా ఒక నూతన మధ్యతరగతి వర్గంగా మారారు. దేశ పురోభివృద్ధికి వారు ఒక చోదకశక్తి. డిజిటల్ విప్లవంలో ముందంజ భారతదేశ సామాజిక, ఆర్థిక, జాతీయ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, డీప్ ఫేక్ వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలి. భౌతికమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూనే సామాజిక మౌలిక సదుపాయాల విప్లవంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత పదేళ్లలో ప్రగతిలో కొత్త అధ్యాయం లిఖించింది. డిజిటల్ విప్లవంలో మనం ముందంజలో ఉన్నాం. డిజిటల్ టెక్నాలజీ రంగంలో ఇండియా అతిపెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా అవతరించింది. మన దేశంలో ప్రజలకు 5జీ సరీ్వసులు అందుతున్నాయి. ఇక మన డిజిటల్ చెల్లింపులు ప్రపంచ దేశాలను అబ్బురపరుస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో 50 శాతానికి పైగా రియల్–టైమ్ డిజిటల్ లావాదేవీలు మనదేశంలోనే జరుగుతున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి డిజిటల్ టెక్నాలజీని ప్రభుత్వం ఒక సాధనంగా వాడుకుంటోంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ‘మహిళల సారథ్యంలో ప్రగతి’ అనేది ప్రభుత్వ విధానం. మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తోంది. 91 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఆయా సంఘాలకు రూ.9 లక్షల కోట్లు అందజేసింది. వారు ఆర్థిక స్వాతంత్య్రం గణనీయంగా పెంచుకుంటున్నారు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యంతో నారీశక్తి వందన్ అధినియంను ప్రభుత్వం తీసుకొచ్చింది. రైల్వే నెట్వర్క్ ద్వారా కన్యాకుమారితో కశీ్మర్ అనుసంధానమైంది. ఉధంపూర్–బారాముల్లా–శ్రీనగర్ రైలు ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశవ్యాప్తంగా 71 వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రధాన నగరాల సమీపంలో 100కుపైగా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రూ.28,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని కేంద్రం సంకల్పించింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2023–14లో దేశంలో రికార్డు స్థాయిలో 322 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు రూ.41,000 కోట్లు అందజేసింది. పంటలకు కనీస మద్దతు ధరలను పెంచింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద మెట్రో రైలు వ్యవస్థ మన దేశంలోనే ఉంది. ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. రూ.8,000 కోట్లతో అదనంగా 52,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నూతన పరిపాలనా విధానానికి సంస్కరణ, పనితీరు, మార్పు అనేవి పర్యాయ పదాలుగా మారాయి’’ అని రాష్ట్రపతి ముర్ము స్పష్టంచేశారు. జమిలి ఎన్నికలపై ముందడుగు‘‘బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అహరి్నశలూ కృషి చేస్తోంది. పేద కుటుంబాలకు ఇళ్లు ఇవ్వబోతోంది. గ్రామీణులకు ప్రాపర్టీ కార్డులు అందజేసింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. 70 ఏళ్లు దాటినవారిలో 6 కోట్ల మందికి ఆరోగ్య బీమా పథకం వర్తింపజేస్తోంది. కీలకమైన జమిలి ఎన్నికలతోపాటు వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రభు త్వం ముందడుగు వేసింది. అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ మాత్రం ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థిరత్వంలో ఒక మూలస్తంభంగా నిలిచింది. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. భారతదేశ బలాలు, విధానాలు, ఉద్దేశాల పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసం కనబరుస్తున్నాయి. క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థతోపాటు జీ20లో ఇండియాదే కీలకపాత్ర. సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకంఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధికి సానుకూల వాతావరణం ఏర్పడింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసు. తాము ఒంటరిమన్న భావనను వారిలో తొలగించడానికి కృషి చేస్తోంది. ఈశాన్యంలో శాంతి సాధన కోసం పదికిపైగా ఒప్పందాలు కుదిరాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సమతుల్య అభివృద్ధి అత్యంత కీలకం. దేశమంతటా అన్ని ప్రాంతాలూ సమానంగా పురోగతి సాధించాలన్నదే కేంద్రం ఉద్దేశం. అండమాన్, నికోబార్ దీవులు, లక్షదీవుల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రారంభించింది. అందరికీ నాణ్యమైన వైద్య సేవలుసమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు తక్కువ రుసుముతో నాణ్యమైన వైద్య సేవలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వ చర్యలతో ఆరోగ్య సంరక్షణ ఖర్చులు క్రమంగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా 1.75 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాబోయే ఐదేళ్లలో మెడికల్ కాలేజీల్లో కొత్తగా 75 వేల సీట్లు రాబోతున్నాయి. జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక విద్యా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గత పదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల సంఖ్య భారీగా పెరిగింది. వాటిలో నాణ్యత కూడా మెరుగుపడింది.మధ్య తరగతికి సొంత గూడుప్రభుత్వ పథకాలతో దళితులు, గిరిజనులు, బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో వారు భాగస్వాములవుతున్నారు. సొంత గూడు కలిగి ఉండాలన్నది మధ్య తరగతి ప్రజల కల. దాన్ని నిజం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గృహరుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేస్తోంది. రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలకు తావులేకుండా ‘రెరా’ వంటి చట్టాలు తీసుకొచ్చింది. ‘అందరికీ ఇళ్లు’ అనేది ప్రభుత్వ లక్ష్యం. -
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
ఏపీ బడ్జెట్‌పై జగన్ రియాక్షన్
-
పార్లమెంట్లో వయనాడ్ విలయంపై కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటన
updates:ప్రతినేత, ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభలో మాట్లాడారు.ఈరోజు తెల్లవారుజామున, వయనాడ్ కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 70 మందికి పైగా మరణించారు. ముండక్కై గ్రామం ఊడ్చిపెట్టుకుపోయింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. మరణించిన వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచండి.రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా సహాయాన్ని అందించండి. బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. పశ్చిమ కనుమల్లో గత కొన్నిఏళ్లుగా కొండచరియలు విరిగిపడటం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.వయనాడ్ విలయంపై పార్లమెంట్లో కేంద్రమంత్రి జేపీ నడ్డ ప్రకటనప్రధాని మోదీ కేరళ సీఎం విజయన్ మాట్లాడారు. కేంద్ర అండగా ఉంటుందని భోరోసా ఇచ్చారు.కేంద్రం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ రంగంలోకి దిగాయిఘటానాస్థలంలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాం.#WATCH | Wayanad landslide: In Rajya Sabha, Union Minister JP Nadda says, "Discussions began here and all the Members expressed their concern over the massive tragedy that has occurred there. I would like to say this is a tragedy of not just Kerala alone, but the entire nation is… pic.twitter.com/xgDNA73S9R— ANI (@ANI) July 30, 2024 Live: Parliament Session: Congress gives Adjournment Motion notice in Lok Sabha on Wayanad landslidesLIVE @ANI | https://t.co/n7jkluCMdz#ParliamentSession #WayanadLandslide #Congress pic.twitter.com/H5m6K2ly28— ANI Digital (@ani_digital) July 30, 2024 వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డ విపత్తుపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది జనగణన ఆలస్యంపై చర్చ జరపాలని లోక్‌భలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. జన గణన ఆలస్యం వల్ల మహిళా రిజర్వేషన్ అమలు ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ నోటీసులో పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.సరిహద్దు పరిస్థితి, చైనాతో భారీ వాణిజ్య లోటుపై చర్చ జరగాలని కోరారు.Congress MP Manish Tewari gives Adjournment Motion notice in Lok Sabha, 'to have a discussion on the border situation and the huge trade deficit with China'. pic.twitter.com/Hh08uiwp8Y— ANI (@ANI) July 30, 2024 ఇవాళ లోక్ సభలో బడ్జెట్‌పై చర్చకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సమాధానం ఇవ్వనున్నారు. -
Parliament: కోచింగ్ వ్యాపారంగా మారిపోయింది: రాజ్యసభ చైర్మన్
Updatesరావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా విషాదకరం.ఒక తెలివైన అభ్యర్థి సివిల్స్ సాధించి దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వస్తారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు చాలా కలలు కంటారు. కానీ, ఇలాంటి ఘటనలు వారి హృదాయాన్ని ముక్కలు చేస్తాయి. నష్టపరిహాం ఇచ్చే విషయమే అయినా.. ఎంత నష్టం పరిహారం ఇచ్చినా అభ్యర్థులు కోల్పోయిన జీవితానికి తిరిగి ఇవ్వలేం. ఇటవంటి ఘటనలు జరగకుండా పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. భవనం కోడ్లు, అగ్నిమాపక భద్రత, వరద భద్రత వంటి విషయాల్లో ప్రాథమిక నిబంధనల ఉల్లంఘిస్తున్నారు.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, Congress MP Shashi Tharoor says, "It's a shocking situation and I have to say that when you have a brilliant student all the dreams of serving the nation through the UPSC exam have been shattered and the hopes… pic.twitter.com/gAv9wTJGsu— ANI (@ANI) July 29, 2024 రావూస్ సివిల్స్ సెంటర్ ప్రమాదంపై ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో మాట్లాడారు. ఈ ఘటన జరగటం చాలా బాధాకరం. ఈ ఘటనకు ప్లాన్, ఎన్ఓసీ ఇచ్చిన అధికారులే బాధ్యత వహించాలి. దీనంతటికీ అసలు ఎవరు బాధ్యత వహిస్తారు. అధికారులుపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం ఒకే అక్రమం భవనం కాదు. యూపీలో అక్రమ భవనాలను బుల్డోజర్తో కూల్చటం చూస్తున్నాం. అయితే ఈ ప్రభుత్వం ఢిల్లీలో బుల్డోజర్తో చర్యలు చేపడుతుందా? లేదా?అని ప్రశ్నించారు.#WATCH | Old Rajinder Nagar incident | "It's a painful incident. It's the responsibility of the officers to plan and provide NOCs, the question is who all are responsible and what actions are being taken against them. It's not just a single case of illegal building, we are seeing… pic.twitter.com/JH7gXphzGg— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ భానుశ్రీ స్వరాజ్ మాట్లాడారు. సివిల్స్ ప్రివేర్ అవుదామని ఢిల్లీకి వచ్చిన అభ్యర్థుల మృతికి ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆమ్ ఆద్మీ పార్టీ పాలన యంత్రాంగం నిర్లక్ష్యంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. వరదల విషయంలో రాజేంద్ర నగర్ ప్రాంత ప్రజలు ఎన్నొసార్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆయన చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనపై హోం మంత్రిత్వ శాఖ ఓ కమిటి ఏర్పాటు చేసిన దర్యాప్తు చేయలని కోరుతున్నా.#WATCH | Speaking about the Old Rajinder Nagar incident, in Lok Sabha, BJP MP Bansuri Swaraj says, "...Those students were in Delhi for the preparation of IAS examinations, but sadly I have to say that due to criminal negligence of Delhi govt, those students have lost their… pic.twitter.com/2alk7SPBDH— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. నాకు రూల్ 267 కింద నోటీసులు అందాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల విషాద మరణంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.‘‘కోచింగ్ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయి. ఎప్పుడు న్యూస్ పేపర్ చదువుదామని తెరిచినా రెండు పేజీలు ఈ సంస్థల ప్రకటనలే ఉంటాయి. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నాం. దీనిపై అన్ని పక్షాలతో కలిపి ఇన్‌ఛాంబర్ మీటింగ్ ఏర్పాటుచేయాలి’’ అని ధన్‌ఖడ్ అన్నారు. #WATCH | Delhi's Old Rajinder Nagar incident | Rajya Sabha to have a discussion on the death of 3 UPSC aspirants. Vice President and Rajya Sabha Chairman Jagdeep Dhankhar says, "I have received notices under Rule 267...They have demanded a discussion on the tragic death of UPSC… pic.twitter.com/MyEezLrlKh— ANI (@ANI) July 29, 2024రాజ్యసభలో శివసేన(యూబీటీ) పార్టీ ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నట్లు పేర్కొన్నారు.Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi gives Suspension of Business notice under Rule 267 in Rajya Sabha, over alleged rampant corruption in infrastructure projects in Maharashtra. pic.twitter.com/VS3wL6XRXO— ANI (@ANI) July 29, 2024 ఢిల్లీ రావూస్ ఘటనపై దద్దరిల్లనున్న పార్లమెంట్కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ అమర్ సింగ్ లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని, సభలో వివరణ ఇవ్వాలని కోరారాయన. Congress MP Dr Amar Singh moves Adjournment Motion in Lok Sabha 'demanding accountability for death of IAS aspirants in Delhi’s coaching centre' pic.twitter.com/4k1cdh4nB9— ANI (@ANI) July 29, 2024 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో జమ్ము కశ్మీర్ అప్రోప్రియేషన్ (నం 3) బిల్లును ఇవాళ ప్రవేశపెట్టనున్నారుNirmala Sitharaman to move J-K Appropriation (No 3) Bill in Lok Sabha; Budget discussion to continue in Parliament todayRead @ANI Story | https://t.co/WKrumWYWrp#BudgetSession #NirmalaSitharaman #LokSabha pic.twitter.com/zDkjVNcTpA— ANI Digital (@ani_digital) July 29, 2024 కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైనాతో సరిహద్దు పరిస్థితి, భారీ వాణిజ్య లోటుపై చర్చను డిమాండ్ చేశారు.#ParliamentMonsoonSession | Congress MP Manish Tewari gives adjournment motion notice in Lok Sabha, demands discussion on "the border situation and huge trade deficit with China." pic.twitter.com/G7VJolxgx0— ANI (@ANI) July 29, 2024 నేడు లోక్‌సభ, రాజ్యసభ బడ్జెట్‌పై చర్చ కొనసాగనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చలో ఇవాళ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. జూలై 22న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. -
తెలంగాణ బడ్జెట్ ముఖ్యాంశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు. ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. బడ్జెట్ కేటాయింపులు ఇలా..సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లుఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.సంక్షేమానికి రూ.40వేల కోట్లు.రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.ఐటీ శాఖకు రూ.774 కోట్లు.హార్టీకల్చర్కు రూ.737 కోట్లు.పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.గృహజ్యోతికి రూ.2418 కోట్లు.500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.ట్రిపుల్ ఆర్ఆర్ఆర్కు రూ.1525 కోట్లు.ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లుట్రాన్స్కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.ఓఆర్ఆర్కు రూ.200 కోట్లు.ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.హోంశాఖకు రూ.9564 కోట్లు.పంచాయతీరాజ్ శాఖకు రూ.29,816 కోట్లు.బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.మెట్రోవాటర్ వర్క్స్ కోసం రూ.3385 కోట్లు.కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.మొత్తం హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.విద్యుత్ శాఖకు రూ.16,410 కోట్లు.రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం. మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు. బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది. వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కొత్త ఉద్యోగాలు..గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు. దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు. జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి. రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.రైతులకు మేలు..ఆయిల్ పామ్ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం. ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది. అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.ఇందిరమ్మ ఇళ్లు..త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం. ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.డ్వాక్రా మహిళలకు జీవిత బీమాస్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్ మిల్లర్స్ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.తలసరి ఆదాయం ఇలా..తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. హైదరాబాద్‌పై స్పెషల్ ఫోకస్..ఓఆర్ఆర్ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్ పరిధిలో జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్ జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు. టౌన్‌షిప్‌లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. వారికి వేల్ఫేర్ బోర్డులు..ఈ సంవత్సరం రంజాన్ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్, యాదవ్, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు. -
Live: బడ్జెట్ సమావేశాలు 2024
-
Parliament Budget Session 2024: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, ఢిల్లీ: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయ సభలను ఉద్ధేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. ఉదయం 11:30కు అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత లోక్‌సభకు చివరి సమావేశాలు కావడంతో సహృద్భావ వాతావరణంలో భేటీలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. కీలక బిల్లులు అన్నింటికి గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులను ఆమోదానికి కేంద్రం తీసుకురానుంది. ఈ బిల్లులు అన్నీ ఇప్పటికే ఉభయసభల్లో ప్రవేశ పెట్టినందున ఆమోదం తెలిపేందుకు చర్చకు తీసుకురానున్నట్లు తెలిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అఖిలపక్ష భేటీ అయ్యింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. ఇదీ చదవండి: రూపాలు మార్చిన రూపాయి పుట్టుక తెలుసా.. -
కర్ణాటక అసెంబ్లీలోకి చొరబడ్డ ఆగంతకుడు.. ఎందుకొచ్చాడంటే..
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ నడుస్తుండగా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 70 ఏళ్ల సామాన్య వృద్ధుడు నేరుగా అసెంబ్లీలోకి చొరబడి ఏకంగా ఎమ్మెల్యే సీటులోనే కూర్చున్నాడు. సభలోని ఓ ఎమ్మెల్యే అతడిని అనుమానించి భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో వారు ఆ పెద్దమనిషిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని సామాన్యుడు అసెంబ్లీలోకి చొరబడటంతో అక్కడి భద్రతా వ్యవస్థపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాల నిమిత్తం చట్టాలను తయారు చేసే చట్టసభలను దేవాలయాలుగా పరిగణిస్తూ ఉంటాం. ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు మాత్రమే అందులో అడుగుపెట్టే అర్హత ఉంటుంది. అటువంటి చోటుకి సామాన్యులు వెళ్లడమంటే మాటలు కాదు. అలాంటిది అక్కడి భద్రతా వలయాన్ని చేధించుకుని అసెంబ్లీ లోపలికి చొరబడటమే కాకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నాడు ఓ ఆగంతకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొలకాల్మోర్ నియోజకవర్గంలోని చిత్రదుర్గ జిల్లాకు చెందిన 70 ఏళ్ల తిప్పేరుద్రప్ప అలియాస్ కరియప్ప మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అసెంబ్లీకి వచ్చి అక్కడి సెక్యూరిటీ వారికి తనని తాను ఒక ఎమ్మెల్యేగా పరిచయం చేసుకుని లోపలికి ఎంటరయ్యాడన్నారు. అసెంబ్లీ లోపల దేవదుర్గ జేడీఎస్ ఎమ్మెల్యే కరియమ్మ సీటులో కూర్చుని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రకటిస్తుండగా 15 నిముషాల పాటు బడ్జెట్ సమావేశాలను తిలకించాడని, పక్కన ఉన్న మరో జేడీఎస్ ఎమ్మెల్యేకి అతడిపై అనుమానం రావడంతో అక్కడి సెక్యూరిటీకి ఫిర్యాదు చేయగా వారు అతడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారని, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనాలన్న ఆసక్తితోనే అతడు అసెంబ్లీలోకి చొరబడినట్లు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: మెట్రోలో యువతుల పోల్ డ్యాన్సింగ్.. వీడియో వైరల్.. -
నాలుగో రోజూ ప్రతిష్టంభన
న్యూఢిల్లీ: లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, అదానీ గ్రూప్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తున్నాయి. తమ డిమాండ్ల నుంచి అధికార, విపక్షాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. విదేశీ గడ్డపై భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ ఎంపీలు, అదానీ అంశంపై విచారణ కోసం జేపీసీ ఏర్పాటు చేయాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వరుసగా నాలుగో రోజు గురువారం సైతం స్తంభించాయి. . రాహుల్ గాంధీ రాక లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభం కాగానే యథావిధిగా అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. పరస్పరం వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి ప్రవేశించారు. దీంతో కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. లోక్‌సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభలోకి ప్రవేశించారు. ‘లండన్’ వ్యాఖ్యల తర్వాత ఆయన సభకు రావడం ఇదే మొదటిసారి. అధికార బీజేపీ, విపక్ష ఎంపీలు నినాదాలు ఆపలేదు. దంతో స్పీకర్ సభను మరుటి రోజుకు వాయిదా వేశారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల నినాదాలు, అరుపులతో రాజ్యసభ స్తంభించింది. క్షమాపణ చెప్పాలి: మంత్రులు భారత ప్రజాస్వామ్యంపై బ్రిటన్‌లో చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేశారు. అంతకంటే ముందు ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలన్నారు. గతంలో ఎంతోమంది సీనియర్ నాయకులు పార్లమెంట్లో క్షమాపణ చెప్పారని వారు గుర్తుచేశారు. అదానీపై చర్చను ఎగ్టొట్టడానికే: ఖర్గే అదానీపై, పరిపాలనలో వైఫల్యాలపై పార్లమెంట్లో చర్చ జరగకుండా చూడాలన్నదే నరేంద్ర మోదీ ప్రభుత్వ కుతంత్రమని ఖర్గే ధ్వజమెత్తారు. అందుకే పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డు తగులుతోందని ఆరోపించారు. ఆయన గురువారం పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాము బుధవారం పార్లమెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం దాకా శాంతియుతంగా ప్రదర్శన చేపడితే దుర్మార్గంగా అడ్డుకున్నారని ఆక్షేపించారు. ముందు వరుసలో మహిళా కానిస్టేబుళ్లను ఉంచారని అన్నారు. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో గురువారం విపక్ష నేతలు సమావేశమమయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించుకున్నారు. కలిసికట్టుగా ఉంటూ, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేడీయూ, జేఎంఎం, ఎండీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వీసీకే, ఐయూఎంఎల్ తదితర పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉండగా, అదానీ అంశంపై చర్చించాలని, ఈ వ్యవహాంరపై విచారణకు జేపీసీ ఏర్పాటు చేయాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. -
ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్ అబ్దుల్ నజీర్
Time: 12:19 PM ఈ నెల 16న బడ్జెట్.. బీఏసీ నిర్ణయం.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. Time: 11:18 AM ►రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం ►ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ ►ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు ►జడ్పీ ఛైర్మన్ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ►137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ►15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ►ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్ ►వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది. ►స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు ►గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది ►మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది ►పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. Time: 11:01 AM గవర్నర్ ప్రసంగం.. ♦వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు ♦పీహెచ్సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు ♦వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు ♦ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక ♦వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ ♦2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు ♦మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ♦నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం ♦81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ ♦జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు ♦వైఎస్సార్ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం Time: 10:51 AM ♦విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్ ♦విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ ♦జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు ♦2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు ♦1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్ ♦జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి ♦జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు ♦ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ Time: 10:42 AM గవర్నర్ ప్రసంగం.. ♦రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ♦కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం ♦కడపలో డా.వైఎస్సార్ ఆర్కిటైక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ ♦అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం ♦44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం Time: 10:15 AM ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. ►అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. ►కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు. ►వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం. ►11.43 శాతం గ్రోత్ రేటును సాధించాం. ►ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది. ►మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు. Time: 10:00 AM ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ►గవర్నర్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్ ►అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ Time: 9:47 AM అసెంబ్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ►కాసేపట్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ►స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ►కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. ►కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ►ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. -
రెండో విడత పార్లమెంటు సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్థిక బిల్లుకు ఎలాగైనా ఆమోదం పొందాలని అధికార బీజేపీ, అదానీ వ్యవహారం, రాజకీయ ప్రత్యర్థు్టలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం వంటివి ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయి. వ్యూహరచన చేయడానికి ప్రతిపక్ష పార్టీలు సోమవారం ఉదయం సమావేశం కానున్నాయి. అదానీ–హిండెన్‌బర్గ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌ను తాము కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకుడు కె. సురేశ్ చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల కేసు, లాండ్ ఫర్ జాబ్స్ కేసుల్లో సీబీఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీ నాయకులపైకి ప్రయోగిస్తోందన్న అంశం కూడా ఈ సారి సమావేశాల్లో హాట్ టాపిక్ కానుంది. మార్చి 13న మొదలు కానున్న పార్లమెంటు సమావేశాలు ఏప్రిల్ 6 వరకు కొనసాగుతాయి. సహకరించండి: ఉపరాష్ట్రపతి సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని వివిధ పార్టీల నేతలకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తన నివాసంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సభ నిర్వహణపై విపక్ష నేతల నుంచి సూచనలు, సలహాలను కోరారు. సమావేశానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, విజయ సాయిరెడ్డి (వైఎస్సార్సీపీ), జైరాం రమేశ్ (కాంగ్రెస్) రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), కె.రవీంద్రకుమార్ (టీడీపీ), కేశవరావు (బీఆర్ఎస్)లతోపాటు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమ తమ డిమాండ్లను ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ధన్‌ఖఢ్ ప్యానెల్ వైస్ ఛైర్మన్లతో భేటీ అయ్యారు. ప్యానెల్ వైస్ ఛైర్మన్లు విజయసాయిరెడ్డి, భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సుసరేంద్ర సింగ్ నగార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రతి అంశంపైనా చర్చకు ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాన్ని బాధ్యునిగా చేసేందుకు నిర్మాణాత్మకపాత్ర పోషిస్తాయని అన్నారు. -
ఐదు బిల్లులు.. ఒక తీర్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక తీర్మానంతో పాటు ఐదు బిల్లులను శాసనసభ ఆమోదించింది. వాల్మీకి బోయలను, కాయస్త లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. మున్సిపల్, పంచాయతీరాజ్, జయశంకర్ యూనివర్సిటీ సవరణ బిల్లులు, రెండు ద్రవ్య వినిమయ బిల్లులు కలుపుకొని మొత్తం ఐదు బిల్లులను ఆమోదించింది. అసెంబ్లీ చివరి రోజు ఆదివారం ప్రశ్నోత్తరాల తర్వాత తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పత్రాలను మంత్రి జగదీశ్‌రెడ్డి సభకు సమర్పించారు. రాష్ట్రంలో ఫీజుల రీయింబర్స్‌మెంటుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లులపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, భట్టి విక్రమార్క, గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్, ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ రెండు గంటల పాటు సమాధానం ఇచ్చారు. బిల్లులను ఆమోదించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. -
జెండాలో ఆ రంగును తీసేస్తారా?: మోదీపై నిప్పులు చెరిగిన ఒవైసీ
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో బుధవారం కూడా అదానీకి సంబంధించిన హిండెన్‌బర్గ్ నివేదికపై రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. కాగా, ఉభయ సభల్లో కేంద్ర మంత్రులు కౌంటర్‌కు దిగారు. కాంగ్రెస్ నేతలు హిండెన్‌బర్గ్ విషయం ప్రస్తావించగా.. బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ బోఫోర్స్ అంశాన్ని లేవనెత్తారు. అటు రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పీయూష్ గోయల్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఖర్గే ఆరోపణలకు కేంద్ర మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దేశ భద్రత విషయంలో రాజీలేదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే మాట్లాడుతూ.. నేను నిజం మాట్లాడితే అది దేశ వ్యతిరేకమా? నేను దేశ వ్యతిరేకిని కాదు. ఇక్కడ అందరికంటే నాకు దేశభక్తి ఎక్కువ. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నేను దేశ వ్యతిరేకిని అని చెబుతున్నారు అంటూ మండిపడ్డారు. If I speak the truth, is it anti-national? I'm not anti-national. I'm more patriotic than anyone here. I'm a 'bhoomi-putra'...You're looting the country& telling me that I'm anti-national: LoP Rajya Sabha Mallikarjun Kharge during debate on Motion of Thanks on President's address pic.twitter.com/RnasKTzYl5 — ANI (@ANI) February 8, 2023 అటు బడ్జెట్ కేటాయింపులపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాల సందర్భంగా సభలో ఒవైసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో ముస్లింల గురించి ఒక్క మాట కూడా లేదు. మైనార్టీల పథకాలకు బడ్జెట్లో నిధులు తగ్గించారు. ఆకుపచ్చ రంగు అంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకంత అసహనం?. జాతీయ జెండాలో ఆకుపచ్చరంగును తీసేస్తారా?. మీ నారీశక్తి నినాదం బిల్కిస్ బానో విషయంలో ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. -
తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. బడ్జెట్‌పై చర్చ
అప్డేట్స్ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 3 వేలు మెస్ చార్జీలు ఇవ్వలేమా? ►తెలంగాణ వ్యాప్తంగా యూనివర్శిటిలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం మూడు వేల మెస్ బిల్లు ఇవ్వలేమా అని ఎమ్మెల్యే, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మూడు వేలు విద్యార్థుల మెస్ చార్జీల కింద ఇవ్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. ►బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భారీగా ఉందని, అయితే ఈ బడ్జెట్లో తనకు పలు సందేహాలు ఉన్నాయన్నారు. ఆదాయ అంచనాలు వాస్తవ దూరంగా ఉన్నాయని భట్టి పేర్కొన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయ లెక్కలను పరిశీలిస్తే, గతేడాది కన్న ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు ఎక్కువగా చూపించామన్నారు. ►ఈ రోజు సెషన్స్‌లో భాగంగా అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసెంబ్లీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా కంటి వెలుగు టెస్టులను స్పీకర్ పోచారంతో పాటు చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరు చేయించుకున్నారు. ►బుధవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. -
తెలంగాణ బడ్జెట్ రూ. 2,90, 396 కోట్లు.. అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా
Updates.. 12:18PM తెలంగాణ అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు ►కేంద్ర పన్నుల వాటా రూ. 21, 471 కోట్లు ►ట్యాక్స్ మరియు ఖర్చుల పన్నుల ద్వారా ఆదాయం రూ. 650 కోట్లు ►పన్నేతర ఆదాయం రూ. 22,801 కోట్లు ►కేంద్ర నిధులు రూ. 41, 259. 17 కోట్లు ►వాహన పన్ను ద్వారా ఆదాయం రూ. 7,512 కోట్లు ►ఎలక్టిసిటీ పన్నుల ద్వారా ఆదాయం రూ. 750 కోట్లు ►రియల్ ఎస్టేట్ పన్నుల ద్వారా రాబడి రూ. 175 కోట్లు ►ఇతర పన్నుల సుంకాల ద్వారా ఆదాయం రూ. 44.20 కోట్లు ►స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్న్ ద్వారా ఆదాయం రూ. 18, 500 కోట్లు ►ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఆదాయం రూ. 12.5 కోట్లు ►ఎక్సైజ్‌శాఖ ద్వారా ఆదాయం రూ. 19 వేల 884.90 కోట్లు ►అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం రూ. 39.500 కోట్లు ►కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు. ►కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ 200 కోట్లు ►డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 1200 కోట్లు ►ఉన్నత విద్యాశాఖకు రూ. 3,001 కోట్లు ►టీఎస్ ఆర్టీసీకి రూ. 1500 కోట్లు ►రవాణాశాఖకు రూ. 1,644 కోట్లు ►మున్సిపల్ శాఖకు రూ. 11వేల 372 కోట్లు ►రోడ్లు, భవనాల శాఖకు రూ. 2 వేల కోట్లు ►హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు రూ. 500 కోట్లు ►పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు ►షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 36వేల 750 కోట్లు ►ఐ అండ్ పీఆర్ కోసం రూ. వెయ్యి కోట్లు ►హోంశాఖకు రూ. 9వేల 500 కోట్లు ►మహిళా వర్సిటీకి రూ. 100 కోట్లు ►మూసీ అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు ►రవాణాశాఖకు రూ. 1,644 కోట్లు ►గిరిజన సంక్షేమానికి రూ. 3,965 కోట్లు ►పరిశ్రమలకు రూ. 4,037 కోట్లు ►గ్రామాల్లో రోడ్ల కోసం రూ. 2 వేల కోట్లు ►హరితహారానికి రూ. 14 వేల 71 కోట్లు ►మైనారిటీ సంక్షేమానికి రూ. 2 వేల 200 కోట్లు ►విద్యారంగానికి రూ.19వేల 093 కోట్లు ►ఇరిగేషన్ రంగానికి రూ. 26వేల 885 కోట్లు ►షెడ్యూల్ తెగలకు రూ.15, 233 కోట్లు ►బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు ►దళితబంధుకు రూ. 17 వేల 700 కోట్లు ►ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు ►రైతు వేదికలకు రూ. 26 835 కోట్లు ►నీటి పారుదల రంగానికి రూ. 26, 831 కోట్లు ►విద్యుత్ రంగానికి రూ.12, 727 కోట్లు ►ప్రజాపంపిణీ రంగానికి రూ. 3117 కోట్లు ►రైతుబంధు పథకానికి రూ.1575కోట్లు ► రైతుబీమా పథకానికి రూ. 1589కోట్లు ►పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకానికి రూ. 4834 కోట్లు ►ఆయిల్ ఫామ్ సాగు - 1000 కోట్లు. ►సొంత జాగ ఉన్న వాళ్ల కోసం - 7890కోట్లు. ►యునివర్సిటీ ల అభివృద్ధి - 500 కోట్లు. ►పరిశ్రమల ఉత్పత్తి ప్రోత్సాహకాలు - 2937.20 కోట్లు. ►పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీ -316.39 కోట్లు. ►ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు పావలా వడ్డీ రుణం - 266.20 కోట్లు ►కొత్త ఉద్యోగ నియామకాల కోసం -1000కోట్లు ►ఆరోగ్యశ్రీకి రూ.1463 కోట్లు ►ఆర్థికశాఖకు రూ. 49, 749 కోట్లు ►రెవెన్యూ శాఖకు 3,560 కోట్లు ►జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కార్సస్ ఫండ్ ►మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ. 1000 కోట్లు ►సమాచార, ప్రసారశాఖకు రూ. 1,000 కోట్లు ►న్యాయ శాఖకు రూ.1,665 కోట్లు ►డబుల బెడ్ రూమ్ ఇళ్ల పథకానికి రూ. 12,000 కోట్లు ►ప్రణాళిక విభాగానికి రూ. 11, 495 కోట్లు ►ఐటీ, కమ్యూనికేషన్ల శాఖకు రూ. 366 కోట్లు ►2023-24 తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేల 175 ►రెవెన్యూ వ్యయం రూ. 2,11, 685 కోట్లు ►మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు ►తెలంగాణ బడ్జెట్ రూ. 2,90, 396 కోట్లు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కేంద్ర ప్రభుత్వం మండిపడ్డ హరీశ్‌రావు ►తెలంగాణకు కేంద్ర సహకరించడం లేదని ఆగ్రహం ►రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అడగడుగునా ఆటంకాలు ►కేంద్ర సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర నిధులకు కోత పెడుతోంది ► ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి. కేసీఆర్‌కు పాదాభివందనం చేసిన ఇద్దరు మంత్రులు. ► అసెంబ్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్. ► ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అసెంబ్లీ వద్ద మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కోసం ఉత్తర తెలంగాణ హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే కేసీఆర్ ప్రకటనలు, తీర్మానాలతో కాలం వెల్లదీస్తున్నారు. దేశంలో కేసీఆర్ అసమర్ధపు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడు దొంగలు. శ్రీరాంసాగర్ నీటిని మహారాష్ట్రకు తరలించాలని చూస్తే సహించేది లేదు. 09:30AM ► అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌ను కలిసిన మంత్రి హరీశ్ ►అసెంబ్లీకి చేరుకున్న హరీశ్‌రావు 08:30AM ► జూబీహిల్స్ టీటీడీ ఆలయానికి మంత్రి హరీశ్‌రావు. ►బడ్జెట్ కాపీలతో ఆలయానికి వెళ్లిన హరీశ్ ► శ్రీవారి ఆలయం నుంచి నేరుగా హరీశ్ రావు అసెంబ్లీకి వెళ్లనున్నారు. ► సోమవారం ఉదయం మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుంది. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా అభివృద్ధి సాధిస్తున్నాము. తెలంగాణ బడ్జెట్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ పెట్టే అవకాశాలున్నాయి. దాదాపు 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. సాగు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనమండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. -
Telangana: నా సర్కారు అగ్రగామి
సాక్షి, హైదరాబాద్: ‘‘సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాలుగా నా ప్రభుత్వం ప్రగతిపథంలో వేగంగా పయనిస్తోంది. ఎనిమిదిన్నరేళ్ల వయసున్న తెలంగాణ సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే రీతిలో అద్భుత ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తోంది. అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా.. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా రూపుదాల్చింది’’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఆమె ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన ప్రసంగ పాఠం మేరకు వివరాలను వెల్లడించారు. 2014–15లో తెలంగాణ ఆవిర్భావం నాటి పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. గవర్నర్ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి గతం కన్నా రెట్టింపైంది. రాష్ట్ర ఆదాయం 2014–15లో రూ.62వేల కోట్లు ఉండగా.. 2021–22 నాటికి రూ.లక్షా 84వేల కోట్లకు పెరిగింది. నాడు తలసరి ఆదాయం రూ.1,24,104 ఉండగా.. 2022–23 నాటికి రూ.3,17,115కి పెరిగింది. గతంలో దండుగ అంటూ అందరూ ఈసడించిన వ్యవసాయాన్ని నా ప్రభుత్వం పండుగలా మార్చింది. 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలతోపాటు యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో కొత్త ఆయకట్టు అభివృద్ధి చెంది రైతుల్లో భరోసా పెరిగింది. సాగునీటి సౌకర్యం 20లక్షల ఎకరాల నుంచి 73.33లక్షల ఎకరాలకు పెరిగింది. రైతుబంధు కింద 65 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్లను పంట పెట్టుబడి సాయంగా అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతులకు రూ.5లక్షల జీవిత బీమాను కూడా అందిస్తోంది. తీరిన కరెంట్, తాగునీటి కష్టాలు రాష్ట్రంలో కరెంట్, తాగునీటి కష్టాలు తీరాయి. ప్రభుత్వ కృషితో తెలంగాణ స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి నేడు 18,453 మెగావాట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగం 1,356 యూనిట్ల నుంచి 2021–22 నాటికి 2,126 యూనిట్లకు చేరింది. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని 100శాతం గృహాలకు రక్షిత తాగునీరు సరఫరా జరుగుతోంది. మానవీయ ప్రభుత్వం నా ప్రభుత్వం మానవీయ ప్రభుత్వం. పేదలు, అసహాయులకు ఆసరా అందించే ప్రభుత్వం. ఇచి్చన హామీ మేరకు వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించింది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కారి్మకులు, బోధకాలు బాధితులు, డయాలసిస్ రోగులు తదితర అసహాయులైన పేదలకు జీవన భద్రత కోసం ఆసరా పెన్షన్లను అందిస్తోంది. దళితబంధు.. ఎస్టీల కోటా పెంపు దళితజాతి స్వావలంబన కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దేశ చరిత్రలోనే తొలిసారిగా దళిత కుటుంబాల ఉపాధి కల్పన కోసం రూ.10లక్షల చొప్పున ఉచిత గ్రాంట్ అందజేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎస్టీల జనాభా 10శాతానికి పెరిగింది. వారికి ఇచి్చన మాట ప్రకారం ఎస్టీ రిజర్వేషన్లను 10శాతానికి పెంచింది. బీసీలు, మైనారిటీలు, బ్రాహ్మణుల సంక్షేమం.. ప్రభుత్వం గొల్లకుర్మలకు రూ.11 వేల కోట్లతో 7.3లక్షల యూనిట్ల గొర్రెలను పంపిణీ చేసింది. ఉచితంగా చేపలను జలాశయాల్లో పెంచి వాటిని పట్టుకునే హక్కును స్థానిక మత్స్యకారులకే కల్పించింది. బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను అప్పగించడం ద్వారా చేనేత, పవర్లూమ్ కార్మికులకు చేతినిండా కలి్పస్తోంది. నేతన్నలకు రూ.5లక్షల జీవిత బీమా, చేనేత మిత్ర కింద నూలు, రసాయనాల కొనుగోళ్లపై 50శాతం సబ్సిడీ అందిస్తోంది. గౌడ సోదరులకు వైన్‌షాపుల్లో 15శాతం రిజర్వేషన్లు, రూ.5 లక్షల ప్రమాద బీమా అమలు చేస్తోంది. రజకులు, నాయీ బ్రాహ్మణుల లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలను 19 నుంచి 310కి పెంచింది. 203 మైనారిటీల గురుకుల స్కూళ్లను ఏర్పాటు చేసి వాటిని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఉపాధి కల్పన, విదేశీ విద్యకు ఆర్థిక సాయం వంటి పథకాలను అమలు చేస్తోంది. జర్నలిస్టులు, న్యాయవాదుల కోసం చెరో రూ.100 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. మహిళలకు భరోసా, భద్రత రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 100శాతం అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించడాన్ని నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తోంది. ఆశ వర్కర్ల పారితోషికాన్ని రూ.2 వేల నుంచి రూ.9,750కు పెంచింది. సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. పేదింటి ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం కల్యాణలక్షి్మ/ షాదీ ముబారక్ పథకాల కింద రూ.లక్షా 116 ఆర్థిక సాయంగా అందిస్తోంది. ఈ పథకాలతో ఇప్పటివరకు 12,00,469 మందికి లబ్ధి కలిగింది. ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమాంతరంగా హోంగార్డులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులతో మైత్రీ భావంతో వ్యవహరిస్తోంది. దేశంలోనే అత్యధిక వేతనాలను తెలంగాణ ఉద్యోగులకు అందిస్తోంది. భారీగా ఉద్యోగాల భర్తీ ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే భయంతో ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇంత కష్టకాలంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం కొలువుల జాతర కొనసాగిస్తోంది. 2014 జూన్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా 1,41,735 ఉద్యోగాలను భర్తీ చేయగా.. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మరో 80,039 ఉద్యోగాలకు ఒకేసారి భర్తీ ప్రక్రియ చేపడుతోంది. మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు జరపడం తెలంగాణ చరిత్రలో అపురూపమైన ఘట్టం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణ ప్రక్రియ కొనసాగుతోంది. విద్యా రంగంలో వికాసం పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధనతో పాటు తగిన ఆహారం, వసతి ఏర్పాటు చేయాలనే ఉదాత్తమైన లక్ష్యంతో ప్రభుత్వం వెయ్యికి పైగా గురుకులాలను స్థాపించింది. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాల కోసం మనఊరు–మనబడి/మన బస్తీ–మన బడి ప్రణాళికలను అమలు చేస్తోంది. రూ.7,259 కోట్లతో 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తోంది. ప్రజారోగ్యంలో దేశంలో మూడో స్థానం దేశంలో అత్యున్నత వైద్యసేవలు అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో మౌలిక సదుపాయాలు కలి్పంచింది. హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. నిమ్స్‌లో 2వేల పడకలను అదనంగా ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌లో రూ.1,100 కోట్లతో 2వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల రేటు 30శాతం నుంచి 61 శాతానికి పెరిగింది. మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 నుంచి 43కు తగ్గాయి. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు 39 నుంచి 21కి తగ్గింది. పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి టీఎస్–ఐపాస్ విధానం కింద పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రూ.3 లక్షల 31వేల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించింది. ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140 శాతం వృద్ధి నమోదు చేసింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నాం తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం వైభవంగా పునరి్నరి్మంచింది. నూతనంగా నిర్మించిన సచివాలయ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టింది. అంబేడ్కర్ మహాశయుడి ఔన్నత్యం ప్రతిఫలించేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించబోతోంది..’’ అని గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణను అగాధం నుంచి ఆదర్శవంత పరిస్థితికి చేర్చే ప్రయత్నంలో నా ప్రభుత్వం అనేక సవాళ్లు, అవరోధాలను దీటుగా ఎదుర్కొంది. అస్పష్టతలను ఛేదించింది. ప్రజల ఆశీస్సులు, ముఖ్యమంత్రి పాలనా దక్షత, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావంతోనే అపూర్వ విజయాలను సాధించింది. రాష్ట్ర అభివృద్ధి మోడల్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో నా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. -
బడ్జెట్ సమావేశాలు: ఈసారి 20 అంశాలతో నిలదీసేందుకు కాంగ్రెస్ సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో 20 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం జరిగే చర్చలో భాగంగా ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రైతులకు రుణమాఫీ అమలుతోపాటు ఉద్యోగులకు సంబంధించిన 317 జీవో, ప్రభుత్వాసుపత్రుల్లో బాలింతల మరణాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, ధరణి పోర్టల్ కారణంగా రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను లేవనెత్తాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పార్టీ పక్షాన 20 అంశాలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ ఇవ్వకుండా చులకన చేస్తున్నారని ఈ సందర్భంగా భట్టి ప్రస్తావించినట్టు సమాచారం. దీనిపై అధికారులకు తగిన ఆదేశాలివ్వాలని స్పీకర్‌ను కోరినట్టు సీఎల్పీ వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ నిర్ణయించిన 20 అంశాలివే: ►317 జీవో రద్దు రైతు రుణమాఫీ.. బ్యాంకురుణాలు, పంటలకు మద్దతు ధర ►రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు ►మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మరణాలు ►రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, డ్రగ్స్ దందా, కిడ్నాప్‌లు ►ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల్లోని అవకతవకలు, ఫీజు రీయింబర్స్మెంట్ ►గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నుల తగ్గింపు u పోడు భూములపై గిరిజనులకు హక్కులు u సర్పంచ్ల సమస్యలు, గ్రామపంచాయతీల నిధుల దారి మళ్లింపు ►కృష్ణా, గోదావరి నదుల్లో నీటి వాటా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులు u విపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ విషయంలో ప్రొటోకాల్ పాటించకపోవడం u రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు, ఇతర రాష్ట్రాల కేడర్ అధికారులు తెలంగాణలో పనిచేయడం u డబుల్ బెడ్రూం ఇళ్లు u గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ ►పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు u రాష్ట్ర అప్పులు u కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దు, పాత పింఛన్ అమలు, పీఆర్సీ ప్రకటన u బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ►వైన్‌షాపులు, బెల్టుషాప్‌లు, బార్లు, పబ్బులతో సమస్యలు u ధరణి కారణంగా రైతుల ఆత్మహత్యలు -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. ఈనెల 6వ తేదీన బడ్జెట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అప్డేట్స్ 03:30PM తెలంగాణ అసెంబ్లీలో బీఏసీ సమావేశం ముగిసింది. ఈనెల 6న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 1:35PM ముగిసిన బీఏసీ సమావేశం రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఈనెల 6వ తేదీన బడ్జెట్. 8వ తేదీన బడ్జెట్‌పై చర్చ 12:45PM ముగిసిన గవర్నర్ తమిళసై ప్రసంగం ►కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ తమిళసై హరితహారం ద్వారా 7.7 శాతం పచ్చదనం పెంచాం పరిశ్రమలు ఐటీ ద్వారా 3.31 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు 20 జిల్లాల్లో డయాగ్నెస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశాం వరంగల్‌లో రూ. 1100 కోట్లతో 2 వేల బెడ్స్ సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్ర వ్యాప్తంగా 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం తెలంగాణలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశాం ఆశావర్కర్లకు రూ. 9,750 పారితోషికం 203 మైనారిటీ గురుకల పాఠశాలలు ఏర్పాటు ఇప్పటివరకూ 12.5 లక్షల మందికి షాదీ ముబారక్ ఇప్పటివరకూ 12 లక్షల మందికి కల్యాణలక్ష్మి 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేశాం ఉద్యోగాల్లో స్థానికత కోసం కొత్త చట్టం తెచ్చాం గత ఎనిమిదేళ్లలో 2,21, 774 ఉద్యోగాలను భర్తీ చేశాం రూ. 7,289 కోట్లతో మన ఊరు-మన బడి కింద స్కూళ్ల అభివృద్ధి మన ఊరు-మన బడి ద్వారా మూడు దశల్లో పాఠశాలల్లో మౌలిక వసతులు న్యాయవాదుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి జర్నలిస్టుల కోసం రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి బతుకమ్మ ఫెస్టివల్ చీరల ద్వారా చేనేతలకు ఉపాధి నేతన్నలకు రూ. 5లక్షల బీమా పథకం సివిల్ పోలీస్ ఉద్యోగాల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ రాష్ట్ర జీఎస్డీపీలో 18.2 శాతం వ్యవసాయరంగం నుంచే సమకూరుతున్నది తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది దళితబంధు విప్లవాత్మకమైన పథకం ప్రతి దళితుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తున్నాం పేదలకు చేయూతగా ఆసరా పథకం.. ఆసరా పథకం లబ్ధిదారుల వయస్సు 57కు తగ్గించాం ఎస్టీల రిజర్వేషన్‌ను 10 శాతానికి పెంచాం 11వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ మాంసం ఉత్పిత్తిలో తెలంగాణ దేశంలోనే 5వ స్థానంలో ఉంది సంక్షేమ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుంది తెలంగాణ గ్రామాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించాం కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తి చేశాం రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఇప్పటివరకూ రూ.65 వేల కోట్లు రైతులకు అందించాం తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి ప్రభుత్వ కృషి వల్ల 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం నీటి కోసం గతంలో గొడవలు జరిగాయి.. ఇప్పుడు 24 గంటల పాటు నీటి సరఫరా అందిస్తున్నాం ► తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం సమక్షంలో జనగణమన ఆలాపనతో సమావేశాలు లాంఛనంగా మొదలయ్యాయి. సీఎం కేసీఆర్ దగ్గరుండి గవర్నర్‌కు హాల్లోకి స్వాగతం పలికారు. తెలంగాణ 2023-2024 వార్షిక బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో.. శాసనసభ హాల్లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ►గవర్నర్ చదవాల్సిన ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. ►శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ చాంబర్లలో వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలు (బీఏసీలు) సమావేశమవుతాయి. ఇందులోనే అసెంబ్లీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుంది? ఎజెండా ఏమిటనేది ఖరారవుతుంది. ► శుక్రవారం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడే సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 14 వరకు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Telangana: గవర్నర్ సూచనలకు సర్కారు ఓకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ 2023–24 వార్షిక బడ్జెట్ సమావేశాలు శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజున శాసనసభ హాల్లో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. ప్రసంగ పాఠం బుధవారం రాత్రి ప్రభుత్వం నుంచి రాజ్‌భవన్‌కు చేరింది. దాన్ని పరిశీలించిన గవర్నర్.. కొన్ని అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు కోరడంతో పాటు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం కూడా గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని, ప్రసంగ పాఠంలో పలు మార్పులు చేసి తుదిరూపు ఇచ్చినట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి నమూనాను ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇటీవల కేరళ, తమిళనాడు శాసనసభల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు చేసిన ప్రసంగాలు వివాదాస్పదం కావడంతో శుక్రవారం తమిళిసై ప్రసంగం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. కేంద్రం తీరును ఎండగట్టేలా.. ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విధానాలు, పాలన తీరును ఎండగట్టేందుకు విపక్ష కాంగ్రెస్, బీజేపీ అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, విపక్షాలను ధీటుగా ఎదు ర్కొనేందుకు ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. రాష్టాన్ని ఆర్థికంగా దిగ్బంధిస్తూ కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు గత ఏడాది డిసెంబర్లోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే డిసెంబర్లో సమావేశాలు వీలు కాలేదు. దీంతో ప్రస్తుత సమావేశాలను సది్వనియోగం చేసుకోవాలని, కేంద్రంవైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి రిక్తహస్తం చూపడంపై ఇప్పటికే మంత్రి హరీశ్ సహా బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జె ట్‌పై చర్చకు సమాధానం, ఇతర పద్దులపై చర్చ సందర్భంగా కేంద్ర విధానాలను కేసీఆర్ ఎండగడతారని బీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా..: మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలు ముఖ్యంగా.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, 24 గంటల విద్యుత్, రుణమాఫీ వంటి అంశాలను ఎత్తి చూప డం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విప క్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఏడాది సెపె్టంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాలు స్వల్ప వ్యవధిలో ముగిసినందున ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఎక్కువ రోజులు కొనసాగించాలని కాంగ్రెస్, బీజేపీ కోరే అవకాశముంది. గత రెండు అసెంబ్లీ సమావేశాల్లోనూ బీజేపీ సభ్యులపై బహిష్కరణ వేటు పడిన నేపథ్యంలో, ప్రస్తుత సమావేశాల్లో ఆ పార్టీ అనుసరించే వ్యూహంపై ఆసక్తి నెలకొంది. భారీ సభల నేపథ్యంలోనే..: ఈ నెల 11న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, 13న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. అమిత్‌షా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. కాగా 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. మరోవైపు ఈ నెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట నామకరణం చేసిన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 17న పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్‌తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొననున్నారు. సభలకు పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే.. సమావేశాలు ఈ నెల 14లోగానే ముగిసే అవకాశముందని అంటున్నారు. ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ చేరికల సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ నాందేడ్ వెళతారు. 14 వరకు సమావేశాలు! శుక్రవారం మధ్యాహ్నం శాసనసభ స్పీకర్, శాసన మండలి చైర్మన్ చాంబర్లలో వేర్వేరుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలు (బీఏసీలు) సమావేశమవుతాయి. ఇందులోనే అసెంబ్లీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగుతుంది? ఎజెండా ఏమిటనేది ఖరారవుతుంది. శుక్రవారం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా పడే సభ శనివారం ఉదయం 10.30కు తిరిగి ప్రారంభం అవుతుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చర్చించి ఆమోదించిన తర్వాత ఆదివారం సమావేశానికి విరామంగా ప్రకటిస్తారు. ఈ నెల 6న ఉదయం శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్, మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ నెల 14 వరకు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ శాసనసభా పక్షం వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Budget Session 2023: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్డేట్స్ ► ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ► ఈ బడ్జెట్ సమావేశాల్లో చైనాతో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సరిహద్దు వివాదాల సమస్యలను లేవనెత్తుతాం.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన నాయకుడిని (రాహుల్‌గాంధీ) అభినందించడానికి బదులు, వారు (కేంద్రం) తిట్టడమే పనిగా పెట్టుకున్నారు: కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ► ఈ ఏడాది జీ20 సదస్సు అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. G20లోని అన్ని సభ్య దేశాలతో పాటు, ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం ఇప్పుడు మన దేశం ముందున్న లక్ష్యం: పార్లమెంటులో రాష్ట్రపతి ముర్ము ► మహిళా సాధికారతకు ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకారాలు అందిస్తోంది. ఇప్పుడున్న ధైర్యవంతమైన, నిర్ణయాత్మకమైన ప్రభుత్వం. అందుకే తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు నమ్మకం పెరిగింది: రాష్ట్రపతి ముర్ము ► రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ప్రసంగంతో పార్లమెంట్ సెషన్స్‌ను ప్రారంభించారు. ప్రపంచమంతా మన బడ్జెట్ కోసం చూస్తోంది: ప్రధాని మోదీ ► గతంలో కొత్తగా ఎవరైనా ఎంపీ ఎన్నికైతే.. మంచి వాతావరణంలో వాళ్లను మాట్లాడేందుకు అనుమతించి.. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఇప్పుడు రాష్ట్రపతి అలా ప్రసంగించబోతున్నారు. ఇది గిరిజనులకు ఎంతో గర్వకారణమైన రోజు అని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే.. మన ఆర్థిక మంత్రి కూడా మహిళే ఉన్నారని, ఈ సారి బడ్జెట్‌కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని ప్రధాని తెలిపారు. ప్రతీ పౌరుడిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపకల్పన జరిగిందన్న ప్రధాని.. అంచనాలను అందుకునే యత్నిస్తామని తెలిపారు. ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి అందుకు కారణమని ఆయన అన్నారు. ► బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు. -
TS: 3 నుంచి సమావేశాలు.. రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 3వ తేదీన (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. తొలుత ఉభయసభల్లో.. ఇటీవలికాలంలో మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటిస్తారు. తర్వాత మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023–24ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసన మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమర్పిస్తారు. 4, 5 తేదీల్లో సమావేశాలకు విరామం ఇచ్చి.. 6వ తేదీ నుంచి బడ్జెట్‌పై చర్చ కొనసాగించనున్నారు. అయితే ఉభయసభల నిర్వహణకు సంబంధించి ఫిబ్రవరి 3న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)ల సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు. ఎనిమిదో సమావేశంలో.. నాలుగో విడత.. ప్రస్తుత శాసనసభ, మండలి సమావేశాలను తాజా ప్రభుత్వంలో ఎనిమిదో పర్యాయంలో నాలుగో విడతగా పరిగణించనున్నారు. 2018లో తెలంగాణలో రెండో ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో ఇప్పటివరకు ఎనిమిది పర్యాయాలు అసెంబ్లీ, మండలి సమావేశాలు జరిగాయి (ఎప్పుడైనా అసెంబ్లీ/మండలి సమావేశాలను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) చేస్తే ఆ పర్యాయం ముగిసినట్టు లెక్క. ప్రోరోగ్ చేయకుంటే ఇంకా ఆ పర్యాయం కొనసాగుతున్నట్టుగానే పరిగణిస్తారు). 2021 సెపె్టంబర్లో ఎనిమిదో పర్యాయం సమావేశాలు మొదలయ్యాయి. వాటిని ప్రోరోగ్ చేయకుండానే.. తర్వాత మరో రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించారు. అంటే ఎనిమిదో పర్యాయంలో మూడు విడతలు అయ్యాయి. వచ్చేనెల 3న మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు నాలుగో విడత కానున్నాయి. డిసెంబర్లో నిర్వహిస్తామన్నా.. చివరిగా గత ఏడాది సెపె్టంబర్లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత డిసెంబర్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, కేంద్ర వివక్షను వివరించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ జరగలేదు. అధికారిక, బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కేసీఆర్ బిజీగా ఉండటంతో ప్రత్యేక సమావేశాలు చేపట్టలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ ప్రసంగం ఈసారీ లేనట్టే! ఇంతకుముందు జరిగిన శాసనసభ, మండలి సమావేశాలను ప్రొరోగ్ చేయని నేపథ్యంలో.. ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ గవర్నర్ తమిళిసై ప్రసంగించే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో గవర్నర్‌కు సాగుతున్న విభేదాలే దీనికి కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభమయ్యాయి. ఇక 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 40 ఆర్డినెన్సులు జారీ చేయగా.. అందులో అత్యధికంగా 2016లో 11 ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. అయితే 2021 నుంచి గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్డినెన్సులు ఇవ్వలేదు. వాటికి ఆమోదం రాకపోవచ్చనే ఉద్దేశమే దీనికి కారణం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 7 బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపినా.. అందులో ఆరు బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపైనా సస్పెన్స్ నెలకొంది. రూ.3 లక్షల కోట్లతో బడ్జెట్? రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు తుదిరూపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. 2023–24 బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలపై ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ లోతుగా సమీక్షించి.. పలు సవరణలు, మార్పుచేర్పులు సూచించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2023–24 బడ్జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్ల కంటే 13 నుంచి 15 శాతం అధికంగా ఉండనుంది. అంటే రూ. 2.95 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌ను ప్రాథమికంగా ఆమోదించేందుకు ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. -
నెలాఖరుకు పార్లమెంట్ నూతన భవనం సిద్ధం
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ఈ జనవరి చివరి నాటికి సిద్ధమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలను కొత్త భవనంలోనే జరిపేదీ లేనిదీ త్వరలోనే కేంద్రం నిర్ణయించే అవవకాశాలున్నాయని తెలిపాయి. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టాలో భాగమే పార్లమెంట్ కొత్త భవనం. రాష్ట్రపతి భవన్– ఇండియా గేట్ మధ్యలోని మూడు కిలోమీటర్ల పొడవైన రాజ్‌పథ్ నవీకరణ, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, ప్రధాని కొత్త కార్యాలయం, నివాసం, ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టింది. -
ఆంధ్రప్రదేశ్‌లో పాలన జగన్మోహనం అయింది..
-
ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి కన్నబాబు
AP Minister Kannababu introduced Agriculture Budget 2022: ఏపీ వార్షిక బడ్జెట్ 2022-23లో భాగంగా వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు శాసనసభలో ప్రవేశపెట్టారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న మంత్రి కన్నబాబు.. రాయితీలతో పాటు నాణ్యత అందించే విషయంలో ఎక్కడా తగ్గకుండా ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం కోసం వార్షిక బడ్జెట్లో రూ. 11,387.69 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్ యార్డుల్లో నాడు-నేడు, మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి 614.23 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే సహకార శాఖకు రూ. 248.45 కోట్లు, ఆహార శుద్ధి విభాగానికి 146.41 కోట్లు, ఉద్యానశాఖకు 554 కోట్లు, పట్టు పరిశ్రమకు 98.99 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆచార్య ఎంజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 421.15 కోట్లు, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 59.91 కోట్లు, వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి 122.50 కోట్లు కేటాయించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. పశు సంవర్ధక శాఖకు 1027.82 కోట్లు, మత్స్య శాఖ అభివృద్ధి కోసం రూ. 337.23 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం రూ. 5000 కోట్లు. వైఎస్సార్ జలకళకు 50 కోట్ల కేటాయింపులతో పాటు నీటి పారుదల రంగానికి 11450.94 కోట్ల ప్రతిపాదన ఉంచింది ఏపీ ప్రభుత్వం. -
తెలంగాణ బడ్జెట్ రూ. 2.50 లక్షల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.2.50 లక్షల కోట్లకు అటూ ఇటుగా బడ్జెట్ ప్రతిపాదనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది (2021–22)కి రూ.2.30 లక్ష కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందుంచిన ప్రభుత్వం.. ఈసారి మరో 9–10 శాతం అదనంగా బడ్జెట్ ప్రతిపాదించే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి బడ్జెట్‌కు రూప కల్పన చేశారని, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందనే చర్చ జరుగుతోంది. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను కూడా దీటుగా ఎదుర్కొనేలా వైద్య రంగంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈసారి ప్రతిపాదనలు ఉండబోతున్నాయి. దీంతో పాటు మన ఊరు–మన బడి, డిజిటల్ క్లాస్రూంలు తదితర పథకాల కోసం విద్యా రంగ బడ్జెట్ కూడా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలకు సరిపడా అంచనాలను రూపొందించినట్టు సమాచారం. సంక్షేమ పథకాల్లో ప్రధానంగా.. ప్రతిష్టాత్మక దళితబంధుకు ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం ఖచ్చి తంగా రూ.15–20 వేల కోట్లు ప్రతిపాదించనుంది. దీంతో పాటు బీసీ, ఎంబీసీలకు కూడా ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి, ఇందుకు తగిన బడ్జెట్‌ను కేటాయించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీలేని రుణాలు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలను యథాతథంగా కొనసాగించనున్నారు. సాగునీటి రంగానికి తగ్గనున్న నిధులు! ఈసారి సాగునీటి రంగానికి నిధులు తగ్గుతాయనే చర్చ జరుగుతోంది. గత ఏడాది రూ.11,693 కోట్లు ప్రతిపాదించగా.. ఈసారి రూ.10 వేల కోట్ల వరకే పరిమితం కావచ్చని తెలుస్తోంది. కృష్ణానదిపై పూర్తయ్యే దశలో ఉన్న ప్రాజెక్టులకు సరిపడా కేటాయింపులు చూపెడతారని, సంగమేశ్వర ప్రాజెక్టుకు రుణ సమీకరణ కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను ప్రతిపాదించనున్నారని సమాచారం. సొంత ఆదాయంపైనే ధీమా ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఆర్థికశాఖ అధికారులు ప్రధానంగా సొంత పన్నుల ఆదాయంపైనే ఆధారపడి కసరత్తు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, పన్నుల్లో వాటాపై పెద్దగా ఆశలు పెట్టుకోకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి ఏకంగా రూ.38 వేల కోట్లకు పైగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుందని ఆశించినా, రూ.10 వేల కోట్లు కూడా రాలేదు. దీంతో ఈ ఒక్క పద్దులోనే భారీ అంచనా లోటు కనిపిస్తోంది. దీంతో పాటు పన్నుల్లో వాటాను కూడా కేంద్రం ఈసారి పెంచలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల ప్రతిపాదనలను తగ్గించి చూపెట్టనున్నారు. అదే సమయంలో గత రెండేళ్లతో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నుల ఆదాయం భారీగా పెరగడంతో వచ్చే ఏడాది కూడా భారీగానే పన్నుల ఆదాయం ఉంటుందనే అంచనాతో బడ్జెట్‌ను రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.20 వేల కోట్ల వరకు పన్ను ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ముఖ్యంగా ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. రెండుసార్లు భూముల ప్రభుత్వ విలువల సవరణ, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపుదలతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏడాదికి రూ.18 వేల కోట్లకు చేరింది. ఎక్సైజ్ శాఖ ద్వారా గత ఏడాది రూ.16 వేల కోట్లను ప్రతిపాదించారు. ఈసారి దాన్ని స్వల్పంగా పెంచి.. మొత్తం మీద ఈరెండు శాఖల ద్వారానే రూ.35 వేల కోట్ల వరకు ఆదాయాన్ని ప్రతిపాదించనున్నారు. అలాగే పన్నేతర ఆదాయం కూడా ఈసారి భారీగా చూపెట్టనున్నట్టు సమాచారం. సభ ఆమోదం కోసం సవరణల బడ్జెట్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.30 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించగా, సవరణల బడ్జెట్‌కు వచ్చేసరికి అది రూ.2.10 లక్షల కోట్లకు తగ్గిందని తెలుస్తోంది. ఈ మేరకు సవరణల బడ్జెట్‌ను కూడా సభ ఆమోదం కోసం ప్రతిపాదించనున్నారు. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో ఈసారి ప్రజాకర్షక బడ్జెట్ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితుల్లో సోమవారం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సభ ఆమోదం కోసం ఉంచే పద్దు ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, కొత్త పథకాలు ఏముంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేడు అసెంబ్లీలో బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ 2022–23 ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు హరీశ్‌రావు సోమవారం ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయల్దేరి ఫిల్మ్‌నగర్‌లోని వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేయనున్నారు. కాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలను సాకుగా చూపి.. సంప్రదాయం ప్రకారం జరగాల్సిన గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 7వ తేదీ నుంచి మొదలవుతున్న సమావేశాలు కొత్త సెషన్ కాదని, అంతకుముందు సెషన్‌కు కొనసాగింపేనని పేర్కొందని వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేశారు. ఐదు నెలల తర్వాత సభ సమావేశమవుతోందని.. సాధారణంగా అయితే ఇంత సుదీర్ఘ విరామం తర్వాత సభను కొత్త సెషన్‌తో ప్రారంభిస్తారని తమిళిసై తెలిపారు. అయినా మునుపటి సెషన్‌ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని.. సాంకేతిక కారణాలను చూపి గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిందని విమర్శించారు. ‘‘వాస్తవానికి గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ కార్యాలయం తయారు చేయదు. అది ప్రభుత్వం రాసి ఇచ్చే ప్రకటనే. గతేడాది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, విజయాలతోపాటు తదుపరి ఏడాదికి సంబంధించిన విధాన సూచికల ప్రగతి నివేదికే (ప్రోగ్రెస్ రిపోర్టు) గవర్నర్ ప్రసంగం. ప్రసంగంలో పేర్కొన్న అంశాలపై, ప్రభుత్వ పాలనపై సభలో అర్థవంతమైన చర్చ జరగడానికి గవర్నర్ ప్రసంగం అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసి ప్రజాస్వామ్య సూత్రాలను పటిష్టం చేయడానికి సభ్యులకు కీలక సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల గతేడాది ప్రభుత్వ పనితీరుపై చర్చించే అవకాశాన్ని సభ్యులు కోల్పోతున్నారు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రజాస్వామ్య ఆదర్శాలను పెంపొందించడం వరకే గవర్నర్ పాత్ర పరిమితమని పేర్కొన్నారు. అధికారం ఉన్నా జాప్యం చేయలేదు బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిందని.. ఆ సమయంలో గవర్నర్ ప్రసంగంతోనే సభ ప్రారంభమవుతుందని తెలిపిందని గవర్నర్ తమిళిసై వెల్లడించారు. దీనిపై వివరణ కోరగా.. అనుకోకుండా జరిగిన తప్పిదం వల్ల అలా వచ్చిందంటూ ప్రభుత్వం నోట్ పంపడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ‘‘రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా, సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ.. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేశాను. ఈ విషయంలో కావాల్సినంత సమయం తీసుకునే స్వేచ్ఛ నాకు ఉన్నా.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలు ఉన్నా.. నా తొలి ప్రాధాన్యత రాష్ట్ర ప్రజల సంక్షేమమే కాబట్టి.. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు..’’అని తమిళిసై స్పష్టం చేశారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు శుభం జరగాలని ఆకాంక్షించారు. -
Andhra Pradesh: ఈ నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అదే రోజున శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాల మేరకు శాసనసభ, శాసన మండలి సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు బుధవారం జారీ చేశారు. ఈ నెల 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. శాసనసభలో 2022–23 బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ నెల 11న ప్రవేశపెట్టనున్నారు. -
మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
-
మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: మార్చి 7నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. 8న గౌతమ్‌రెడ్డి మృతిపై సభ సంతాపం తెలపనుంది. మార్చి 11న బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చదవండి: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యం: సీఎం జగన్ -
8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. ప్రధాని మోదీ మాట్లాడిన పలు అంశాలు ఇవే... రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు. తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు. అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదు. కలిసి చర్చిస్తే విభజన ప్రక్రియ సాఫీగా జరిగేది ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్ పార్టీనే కారణం. మైక్‌లు కట్‌చేసి పెప్పర్ స్ప్రే కొట్టారు. హడావుడిగా చర్చలేకుండానే విభజన బిల్లును ఆమోదిచారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేశారు ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయి విభజన చట్టంపై ఎలాంటి చర్చ జరపలేదు ఏపీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ రాష్ట్రానికి అన్యాయం చేసింది ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయింది తెలంగాణ ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్‌ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్‌ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్‌దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్‌దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్‌జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
సమర్థంగా ప్రతిపక్ష పాత్ర
సాక్షి, అమరావతి : బడ్జెట్ సమావేశాలను టీడీపీ బాయికాట్ చేసినా తాము పాల్గొని ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు, బడ్జెట్‌పై సోము వీర్రాజు వీడియో సందేశాన్ని పార్టీ శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్న తీరుపై సీఎం సమీక్ష నిర్వహించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో పేర్కొన్న కేటాయింపులతో పాటు గవర్నర్ ప్రసంగంలో చోటు కల్పించిన అంశాలపై తాము శాసన మండలిలో తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు. కరోనా కట్టడితో పాటు రోగులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాకు తక్షణమే రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, పోర్టులపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని సోము వీర్రాజు విమర్శించారు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదు : ఎమ్మెల్సీ మాధవ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచన లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. సంపూర్ణ మద్య నిషేధం అన్న జగన్.. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. కోవిడ్ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వ్యాక్సిన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. -
ముగిసిన బడ్జెట్ పార్లమెంట్
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నాయకులు ఎన్నికల ప్రచారం కోసం సమయం అవసరమని విజ్ఞప్తి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 13 రోజుల ముందే సమావేశాలను ముగించారు. జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు జరగాల్సి ఉండగా, ముందే, గురువారం, మార్చి 25వ తేదీన నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. లోక్‌సభ సమావేశాలు సజావుగా సాగడంపై స్పీకర్ ఓం బిర్లా ఒక ట్వీట్లో హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ముఖ్యమైన పలు బిల్లులు సభ ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో మొత్తం 20 బిల్లులను ప్రవేశపెట్టగా.. 18 బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం, రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఈ విడతలో ఢిల్లీలో ఎల్జీకి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లు, బీమా సవరణ బిల్లు తదితర కీలక బిల్లులు సభ ఆమోదం పొందాయి. మొత్తంగా ఈ సమావేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత 114%గా ఉంది. 14 గంటల 42 నిమిషాల పాటు జరిగిన బడ్జెట్‌పై చర్చలో 146 మంది సభ్యులు పాల్గొన్నారు. కరోనా ముప్పు కారణంగా, మొదట రాజ్యసభ సమావేశాలను ఉదయం, లోక్‌సభ సమావేశాలను సాయంత్రం నిర్వహించారు. కానీ, మార్చి 9వ తేదీ నుంచి ఉభయ సభలు కూడా ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై, బడ్జెట్‌పై రాజ్యసభలో లోతైన, నాణ్యమైన చర్చ జరిగిందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో కోవిడ్ నిబంధనలను సభ్యులంతా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో మొత్తంగా 90% ఉత్పాదకతతో రాజ్యసభ 104 గంటల 23 నిమిషాల పాటు జరిగిందన్నారు. -
పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేసింది. ఈ సమావేశాల్లో భాగంగా బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లుకు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో లోక్‌సభలో 18 బిల్లులు, రాజ్యసభలో 19 బిల్లులు ఆమోదం పొందాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ సమావేశాల సమయాన్ని కుదించారు. ఏప్రిల్ 8వరకు జరగాల్సి ఉన్న పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. రెండు నెలలపాటు కొనసాగిన ఈ సమావేశాలు జనవరి29న ప్రారంభమయ్యాయి. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువులు ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఖరారైన శరద్ పవార్ బెంగాల్ పర్యటన -
తెలంగాణలో ప్రతి ఒక్కరి మీద ఎంత అప్పుందంటే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పద్దు పెరిగిపోతోంది. ద్రవ్య నియంత్రణ, నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) పరిమితులకు లోబడే ప్రభుత్వం ప్రతి యేటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్‌ను మించిపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ రూ.2.30 లక్షల కోట్లు కాగా... మొత్తం అప్పులు రూ.2.86 లక్షల కోట్లకు చేరాయి. 2020–21 ఏడాదికి గాను సవరించిన అంచనాల ప్రకారం అప్పులు రూ.2.45 లక్షల కోట్లు కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇది మరో 41 వేల కోట్లు పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.81,395 అప్పు ఉన్నట్లు. గత ఏడాది తలసరి అప్పు రూ.65,480 కాగామరో రూ.16 వేలు పెరిగింది. రూ.2.44 లక్షల కోట్లు బహిరంగ మార్కెట్లోనే.. రాష్ట్ర ప్రభుత్వం రుణాలను ఎక్కువగా బహిరంగ మార్కెట్ ద్వారానే సేకరిస్తోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ రుణాల చిట్టా రూ.2.44 లక్షల కోట్లకు (వచ్చే ఏడాది ప్రతిపాదనలతో కలిపి) చేరింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 7,852 కోట్లు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14,860 కోట్లు, బాండ్ల రూపంలో రూ.19,552 కోట్లు రుణాల రూపంలో సమీకరణ చేసినట్టు బడ్జెట్ గణాంకాలు చెపుతున్నాయి. గత ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1.29 లక్షల కోట్ల అప్పు ఉంటే 2021–22 ముగిసేనాటికి ఇది రూ.2.86 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ఆరేళ్లలో రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారం అక్షరాలా లక్షా యాభై ఏడు వేల కోట్ల రూపాయలన్న మాట. చదవండి: మందు బాబులపైనే సర్కారు ఆశలు..! -
మందు బాబులపైనే తెలంగాణ సర్కారు ఆశలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సర్కారు మద్యం అమ్మకాల ఆదాయంపై ఆశలు పెట్టుకున్నట్టుగా బడ్జెట్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ప్రతిపాదించిన రూ.16 వేల కోట్లకు అదనంగా రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.17వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీగా సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది. 2020–21లో కరోనాతో నెలన్నర రోజులు మద్యం అమ్మకాలు నిలిచిపోయినా రూ.16 వేల కోట్లు ఎక్సైజ్ డ్యూటీ వచ్చింది. వచ్చే ఏడాది మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయనే అంచనాతో అదనపు ఆదాయాన్ని లెక్క కట్టింది. కేంద్రం ఏమిస్తుందో.. మిగతా పన్ను ఆదాయాలను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటాపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆశలు తగ్గినట్టు కనిపిస్తున్నా యి. 2020–21లో రూ.16,726 కోట్లు పన్నుల్లో వాటాగా వస్తాయని అంచనా వేసుకోగా.. కేవలం రూ.11,731 కోట్లే్ల అందాయి. దీంతో గతేడాది కంటే తక్కువగా పన్నుల్లో వాటా కింద రూ.13,990 కోట్లను మాత్రమే అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.2,726 కోట్లు తగ్గించుకుంది. మొత్తం పన్ను ఆదాయం పెంపు అన్ని రకాల పన్ను ఆదాయం కింద 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్లో రూ.7,600 కోట్లు ఎక్కువగానే వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2020–21లో పన్నులద్వారా రూ.85,300 కోట్లు సమకూరుతాయని భావించినా.. రూ.76,195 కోట్లే వచ్చాయి. అంచనా కంటే రూ.9వేల కోట్ల వరకు తగ్గాయి. ఈ సవరించిన ఆదాయంతో పోలిస్తే.. రూ.16వేల కోట్లు అదనంగా రూ.92,910 కోట్లు ఈసారి పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ ఆదాయం కూడా.. జీఎస్టీ, అమ్మకపు పన్నుల రాబడులు కూడా పెరుగుతాయనే అంచనాతో సర్కారు ప్రతిపాదనలు చేసింది. 2020–21లో జీఎస్టీతో పాటు అమ్మకపు పన్ను కింద రూ.48,895 కోట్లురాగా.. ఈసారి రూ.57,500 కోట్లకు పెంచింది. పన్నేతర ఆదాయమూ భారీగానే.. పన్నేతర ఆదాయంలోనూ భారీ వృద్ధిని ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈసారి ఏకంగా రూ.30వేల కోట్లను పన్నేతర ఆదాయం కింద ప్రతిపాదించింది. 2020–21లో రూ. 30,600 కోట్లు పన్నేతర రాబడుల రూపంలో వస్తాయని అనుకున్నా.. కేవలం రూ.19,305 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే కరోనా నుంచి కోలుకున్నామనే అంచనాతో ఈసారి కూడా రూ.30,557 కోట్లు పన్నేతర ఆదాయం కింద చూపెట్టడం గమనార్హం. వామ్మో.. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంగా ప్రభుత్వ అంచనాలు భారీగా ఉన్నాయి. 2021–22లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏకంగా రూ.38,669.46 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 2020–21 సంవత్సరానికి గాను ఈ పద్దు కింద రూ.10,525 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ఆ మేరకు నిధులిచ్చింది. ఈసారి అంచనాలు మూడు రెట్లు పెంచడం విశేషం. 2019–20లో కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చింది రూ.11,598 కోట్లే. 2021–22లో రెవెన్యూ రాబడులపై అంచనాలు (రూ.కోట్లలో) పన్ను రకం 2021–22 కేంద్ర పన్నుల్లో వాటా 13,990.13 రాష్ట్ర పన్నుల ఆదాయం 92,910 ల్యాండ్ రెవెన్యూ 6.31 అమ్మకపు, వాణిజ్య పన్నులు 57,500 రాష్ట్ర ఎక్సైజ్ 17,000 ఇతర పన్నులు 18,403.69 పన్నేతర ఆదాయం 30,557.35 గ్రాంట్ ఇన్ ఎయిడ్ 38,669.46 మొత్తం 1,76,126.94 చదవండి: తెలంగాణ బడ్జెట్: ‘గ్రేటర్’కు సర్కారు వారి పాట -
పోలీసు శాఖకురూ.6,465 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖకు గతేడాది కంటే నిర్వహణ వ్యయం పెరిగింది. పెరిగిన ధరలు, ఉద్యోగుల సంఖ్య, వారికి చెల్లించాల్సిన వేతనాలతో ఈసారి హోంశాఖ బడ్జెట్లో పెరుగుదల నమోదైంది. గతేడాది రూ.5,852 కోట్లుగా ఉన్న బడ్జెట్ ఈసారి ఏకంగా రూ.6,465 కోట్లకు చేరింది. అంటే గతేడాది కంటే దాదాపు రూ.586 కోట్లు పెరగడం గమనార్హం. గతేడాది దాదాపు 11 వేల మంది కానిస్టేబుళ్లు, 1,200 వరకు ఎస్సైలు, 11 మంది ఐపీఎస్‌లు కొత్తగా డిపార్ట్మెంటులో చేరారు. ఈసారి మరో ఐదుగురు ఐపీఎస్ అధికారులు, దాదాపు 4 వేల మంది స్టేట్ స్పెషల్ పోలీసులు విధుల్లో చేరనున్నారు. దీనికి తోడు త్వరలో దాదాపు 20 వేల మంది పోలీసు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో దాదాపు 19 వేలకు పైగా కానిస్టేబుల్ పోలీసులు కాగా, దాదాపు 450 వరకు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులున్నాయి. వీటన్నింటినీ ఈసారి భర్తీ చేస్తామని ఇటీవల సీఎం, హోంమంత్రి వేర్వేరు సందర్భాల్లో తెలిపారు. ఈ పోస్టులు తప్పకుండా భర్తీ చేస్తామని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మంత్రులు పునరుద్ఘాటించడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కానీ, ఈ విషయాన్ని బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. మూడు ప్రధాన కమిషనరేట్లయిన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు కలిపి రూ.266.47 కోట్ల ప్రగతి పద్దు కేటాయించారు. రాష్ట్రంలో భద్రత కోసం ఇప్పటికే 6.65 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం కోసం రూ.125 కోట్లు కేటాయించింది. రీజినల్ రింగురోడ్డుకు రూ.750 కోట్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగురోడ్డుకు 30 కి.మీ. ఆవల 334 కి.మీ. నిడివితో ప్రతిపాదించిన రీజినల్ రింగురోడ్డుకు బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించారు. ఈ రింగురోడ్డుకు సంబంధించి సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తొలి భాగానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఆ రోడ్డు నిర్మాణానికి కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ఇక రాష్ట్ర రహదారుల మరమ్మతులకు రూ.800 కోట్లు ఇచ్చారు. ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మెరుగుపరుస్తారు. జిల్లా కలెక్టర్, పోలీసు కార్యాలయ భవనాలు, హైదరాబాద్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్ర భవనానికి రూ.725 కోట్లు ప్రతిపాదించారు. ద్వితీయశ్రేణి నగరాల్లో నిర్మించనున్న ఎయిర్‌స్ట్రిప్‌ల కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా రోడ్లు భవనాల శాఖకు రూ.8,788 కోట్లను ప్రతిపాదించింది. పర్యాటకానికి రూ.726 కోట్లు గత బడ్జెట్లో పర్యాటకశాఖను పట్టించుకోని ప్రభుత్వం ఈసారి రూ.726 కోట్లు ఇచ్చింది. ఇందులో కాళేశ్వరం ఆధారంగా అభివృద్ధి చేసే టూరిజం సర్క్యూట్ ఉంది. హెరిటేజ్ తెలంగాణకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇక అర్చకుల సంక్షేమం, ఆలయాల అభివృద్ధికి రూ.720 కోట్లు ఇచ్చారు. -
వెనకబడిన తరగతులకు వెయ్యిన్నర కోట్లు పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది. కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం.. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం. కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం.. 2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది. -
నీటి పారుదలకు భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే సాగునీటి శాఖకు మళ్లీ నిధుల వరద పారింది. ద్రవ్యలోటు కారణంగా గతేడాది బడ్జెట్ కేటాయింపులు తగ్గగా.. ఈసారి సర్కారు అధికంగా ఇచ్చింది. ప్రధాన ప్రాజెక్టులను పూర్తిచేసి ఆయకట్టు లక్ష్యాలకు అనుగుణంగా నీటిని పారించాలన్న నిర్ణయానికి అనుగుణంగానే బడ్జెట్లో నిధులను పెంచింది. శాఖకు మొత్తంగా రూ. 16,931 కోట్లు కేటాయించగా అందులో ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉండటంతో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు పెరిగాయి. గతేడాదికన్నా ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపులు రూ. 5,878 కోట్ల మేర పెరిగినప్పటికీ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల, సీతమ్మ సాగర్, వరద కాల్వ వంటి ప్రాజెక్టుల పూర్తికి మళ్లీ వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకొనే రుణాలే కీలకం కానున్నాయి. ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో... ఈసారి బడ్జెట్లో భారీ ప్రాజెక్టులకు రూ. 15,651.20 కోట్లు కేటాయించగా మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులకు రూ. 1,221 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. అయితే పలు ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో కేటాయింపుల్లేవు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు కాకుండా మార్జిన్ మనీ కింద చెల్లించేందుకు రూ.8 వేల కోట్ల మేర కోరారు. అయినా రూ. 918 కోట్లే్ల కేటాయించారు. ఇక పాలమూరు–రంగారెడ్డికి సైతం బడ్జెట్ నుంచి రూ.6 వేల కోట్లు కోరినా రూ. 960 కోట్లు, సీతారామకు రూ.689 కోట్లు, డిండికి రూ.545 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి సైతం రూ. వెయ్యి కోట్లు కోరగా రూ. 50 కోట్లు కేటాయించారు. అన్నింటికన్నా ముఖ్యంగా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ. 1,500 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా రూ. 400కోట్ల మేర కేటాయింపులు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తయి చెక్‌డ్యామ్‌ల నిర్మాణమే చేపడుతుండటంతో మైనర్ ఇరిగేషన్‌కు కోతపడింది. ఈ ఏడాది రూ. 1,196 కోట్లే సర్దారు. మళ్లీ రుణాలే.. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో ప్రాజెక్టుల పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్, జూలై నాటికే కాళేశ్వరంలోని మల్లన్నసాగర్ సహా గంధమల, బస్వాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనికితోడు పాలమూరు–రంగారెడ్డిలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉద్దండాపూర్ వరకు కనీసం ఒక టీఎంసీ నీటిని తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలతోనే కనీసం రూ. 15 వేల కోట్ల మేర ఖర్చు చేసి ఈ రెండు ప్రాజెక్టులను గట్టెక్కించేలా ప్రణాళికలు వేశారు. ఇక సీతారామ ఎత్తిపోతలలో సత్తుపల్లి ట్రంక్ కింద కనీసం లక్ష ఎకరాలు పారించాలని గతంలోనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. దేవాదులను ఈ సీజన్లో 100 శాతం పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనుల పూర్తికి కనీసం రూ. 12 వేల కోట్ల నుంచి రూ. 15 వేల కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. ఈ మేర ఖర్చు కోసం ప్రభుత్వం మళ్లీ రుణాలపైనే ఆధారపడాల్సి రానుంది. సీతారామ, దేవాదుల, తుపాకులగూడెం, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి మరో కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా రూ. 17 వేల కోట్ల రుణాలు తీసుకునేందుకు అనుమతించారు. మిగిలిన నిధులతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 20 వేల కోట్లకుపైగా రుణాలతోనే ప్రాజెక్టులను గట్టెక్కించే అవకాశాలున్నాయి. ‘కాళేశ్వరం’ నిర్వహణకే రూ. 7 వేల కోట్లు... బడ్జెట్లో నిర్వహణ పద్దుకు కేటాయింపులు భారీగా పెంచారు. గతేడాది తొలిసారిగా సాగునీటి శాఖకు నిర్వహణ పద్దు కింద రూ. 7,446.97 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.10,506.58 కోట్లకు పెంచారు. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల తిరిగి చెల్లింపులకు నిర్వహణ పద్దు కింద రూ. 5,219 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 7 వేల కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ద్వారా రూ. 91 వేల కోట్ల మేర రుణాలు తీసుకునేందుకు ఒప్పందాలు జరగ్గా అందులో రూ. 76 వేల కోట్లు మంజూరు చేశారు. ఈ మొత్తంలోంచే రూ. 44 వేల కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 32 వేల కోట్లు లభ్యతగా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కార్పొరేషన్ రుణాల ద్వారా రూ. 7 వేల కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. చీఫ్ ఇంజనీర్ డివిజన్లవారీగా ప్రగతి పద్దు కింద కేటాయింపులు (రూ. కోట్లలో) విజన్ కేటాయింపు రామగుండం 100 గజ్వేల్ 930 కరీంనగర్ 100 ఆదిలాబాద్ 255 నిజామాబాద్ 54 వరంగల్ 85 సంగారెడ్డి 20 నల్లగొండ 959.89 మహబూబ్‌నగర్ 25 ఖమ్మం 5 మంచిర్యాల 100 కామారెడ్డి 100 జగిత్యాల 50 ములుగు 50 సూర్యాపేట 40.30 వనపర్తి 312 నాగర్ కర్నూల్ 1,035 కొత్తగూడెం 700 హైదరాబాద్ – ప్రధాన ప్రాజెక్టుల కింది కేటాయింపులు ఇలా (రూ. కోట్లలో) ప్రాజెక్టు కేటాయింపు కాళేశ్వరం 918 పాలమూరు–రంగారెడ్డి 960 సీతారామ 689.48 డిండి 545.42 ఎస్ఎల్బీసీ 331.41 కల్వకుర్తి 75 నెట్టెంపాడు 192.75 భీమా 57 దేవాదుల 49.90 ఎల్లంపల్లి 99.88 లోయర్ పెన్‌గంగ 199.50 మిషన్ కాకతీయ 750 -
బడ్జెట్లో ఆర్టీసీకి రూ.3,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు అప్పు.. దానిపై పేరుకుపోయిన వడ్డీ.. సొంతానికి వాడుకోవటంతో పేరుకుపోయిన కార్మికుల భవిష్య నిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం నిధులు, చమురు బిల్లులు, జీతాల భారం.. ఇలా ఎటుచూసినా సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం గతేడాది కంటే మెరుగ్గా బడ్జెట్లో నిధులు ప్రతిపాదించి ఊరటనిచ్చింది. తాజా బడ్జెట్లో ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వెరసి రూ. 3 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సహకార పరపతి సంఘం పాలకమండలి ఆర్టీసీపై హైకోర్టులో కేసు దాఖలు చేసింది. బకాయిలు చెల్లించకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని పీఎఫ్ యంత్రాంగం షోకాజ్ నోటీసులు పంపింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాటి బకాయిలు కొంత మేర తీర్చేందుకు ఆర్టీసీకి నిధులు అందనున్నాయి. కావాల్సింది రూ.5 వేల కోట్లు... కార్మికుల భవిష్య నిధి చెల్లించకపోతుండటంతో రూ. 1,200 కోట్లు పేరుకుపోయాయి. కార్మికులు పొదుపు చేసుకున్న సహకార పరపతి సంఘం బకాయిలు రూ. 850 కోట్లకు చేరుకున్నాయి. మరో రూ. 3 వేల కోట్లు బ్యాంకు అప్పులున్నాయి. వెరసి ఆర్టీసీకి రూ. 5 వేల కోట్లు కావాలి. బడ్జెట్లో ఇచ్చే నిధులు కాక రూ. 2,500 కోట్లు కావాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం రూ. 3 వేల కోట్లే కేటాయించింది. గత కొన్ని నెలలకు ఆర్టీసీ తన ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఆ మొత్తం నెలకు రూ. 120 కోట్లు అవుతుంది. అదే స్థూల వేతనం చెల్లించాలంటే ప్రతినెలా రూ.185 కోట్లు కావాలి. ఇప్పుడు నిధులు అందుబాటులో ఉంటే స్థూల వేతనం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఉన్నపళంగా వెయ్యి కొత్త బస్సులు కొనాల్సి ఉంది. వాటికి కొన్ని నిధులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. రూ. 1,500 కోట్లు పూచీకత్తు రుణానికి బడ్జెట్లో రూ.1,500 కేటాయిస్తూ మరో రూ. 1,500 కోట్ల బడ్జెటేతర నిధులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ రెండో మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే పూచీకత్తుకు సంబంధించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే అలా తీసుకునే మొత్తం తిరిగి ప్రభుత్వమే చెల్లించేలా ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఓ రకంగా గ్రాంటుగా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నారు. త్వరలో సీఎంతో భేటీ: మంత్రి పువ్వాడ ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా రూ.3 వేల కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించటం ఎంతో శుభపరిణామమని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని, ఇందుకోసం ముఖ్యమంత్రితో భేటీ అయి చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లు ప్రతిపాదించటం పట్ల అన్ని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
వైద్యారోగ్యం రూ. 6,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది రూ.6,185.97 కో ట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 6,295 కోట్లు కే టాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఆరో గ్య మిషన్ పథకాలకు మాత్రం అధిక నిధులు కేటాయించింది. ఔషధాల కొనుగోలుకు మాత్రం గతంతో పోలిస్తే ఈ ఏడాది నిధులు తగ్గించింది. ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు ఇలా.. గతేడాది మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణంగా రూ. 720.12 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గతేడాది మాదిరిగానే రూ. 211.86 కోట్లు, పెన్షన్‌దారుల ఆరోగ్య పథకానికి రూ. 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి రూ. 45.88 కోట్లు కలిపి మొత్తం కేటాయింపులు రూ. 410.35 కోట్లు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని బీపీఎల్ కుటుంబాలు నిమ్స్‌లో చికిత్స పొందితే వారికి సాయం చేసేందుకు రూ. కోటి కేటాయింపు. ళీఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో ఈసారి రూ.1,213 కోట్లు కేటాయింపులు. నిమ్స్‌లో వేతనాల పెంపును అమలు చేయడంలో భాగంగా ఈసారి రూ. 213. 85 కోట్లు (గతేడాది రూ. 113.85 కోట్లు) కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ పరికరాల కొనుగోలుకు రూ. 13.54 కోట్లు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, భద్రత కార్మికులకు రూ. 48.15 కోట్లు కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల బలోపేతం చేసేందుకు రూ. కోటి. ళీవైద్య విద్యలో సర్జికల్ వస్తువుల కోసం రూ.3 కోట్లు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది కోసం రూ. 40 కోట్లు. ళీ ఔషధాల కొనుగోలుకు రూ. 254 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 262.41 కోట్లు 108 అత్యవసర వాహన సేవలు కోసం రూ. 52.94 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 49 కోట్లు. 104 మొబైల్ వాహన సేవల కోసం రూ. 36.82 కోట్లు. ళీ కేసీఆర్ కిట్ అమ్మఒడి కోసం రూ. 330 కోట్లు. 102 అమ్మ ఒడి పథకానికి రూ. 15 కోట్లు. రాష్ట్ర వాటాలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 182 కోట్లు. ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలకు రూ.105.65 కోట్లు.ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి గతేడాది మాదిరిగానే రూ. 20 కోట్లతోపాటు నూతన భవన నిర్మాణం కోసం మరో 3 కోట్లు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రూ. 10 లక్షలు. నిమ్స్‌కు రూ. 3.67 కోట్లు.. ళీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ సేవలకు రూ. 48.15 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 1.60 కోట్లు బోధనాసుపత్రుల ఏర్పాటు కోసం రూ. 36.68 కోట్లు ళీమెడికల్ కాలేజీల అభివృద్ధికి రూ. 120.50 కోట్లు బోధనాసుపత్రుల నిర్వహణ సేవల సమగ్రాభివృద్ధి కోసం రూ. 40 కోట్లు ళీపార్థివ దేహాలను తరలించే ఉచిత వాహన సర్వీసులకు రూ. 5 కోట్లు కోవిడ్ నిర్వహణ కోసం ఆర్థిక సాయం రూ. 92 కోట్లు.. అందుకే విద్య, వైద్యంలో వెనుకబాటు ఆర్థిక నిపుణులు, పరిశోధకురాలు ఎన్.శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు ఉండేవి. పంచవర్ష ప్రణాళికలు ఒకటి నుంచి ఐదు వరకు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిల్లోనూ అవే విధా నాలు అమలయ్యాయి. పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు కూడా అవే ప్రాధాన్యతలను కొనసాగించాయి. ఆర్థికాభివృద్ధి జరిగితే దాని ఫలాలు అందరికీ అంది సామాజిక అభివృద్ధి దానంతటే అదే జరుగుతుందనేది ఆనా టి అభిప్రాయం. అయితే ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ, దాని ఫలాలు అందరికీ అందలేదు. సామాజిక అభివృద్ధి జరగలేదు. ఆరో పంచవర్ష ప్రణా ళికలో సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. దీంతో ప్రణాళికల ఓరియెంటేషన్ మారిపోయింది. రాష్ట్రాల్లోనూ దానినే అనుసరించారు. దీనిని అన్వయించుకునే క్రమంలో సోషల్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ప్రధానం కాగా, కేంద్రం తో సహా రాష్ట్రాలు కూడా వీటిపై దృష్టి పెట్టకుండా ప్రజాకర్షక, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపాయి. దీంతో విద్య, వైద్యం వెనుకబడ్డాయి. ఈ రెండూ అభివృద్ధి చెంది ఉంటే సమాజం తన కాళ్లపై తాను నిలబడేది. అయితే అలా జరగలేదు. ఈ విధంగా రెండు కీలక సందర్భాల్లో జరిగిన పొరపాట్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. -
చదివింపులు రూ.13,564 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గతేడాదితో పోలిస్తే బడ్జెట్లో ఈసారి విద్యా రంగానికి కేటాయింపులు పెరిగాయి. గతేడాది పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలకు మొత్తంగా రూ.12,138 కోట్లు కేటాయించగా ఈసారి ఆయా శాఖలకు రూ. 13,564.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే రూ. 1,426.65 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. అందులో పాఠశాల విద్యలోనే 90 శాతం కేటాయింపులను పెంచింది. గతేడాది పాఠశాల విద్యాశాఖకు రూ. 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 11,693.08 కోట్లు కేటాయించింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 1,287.77 కోట్లు అదనంగా కేటాయించింది. ఇందులో సగానికిపైగా బడ్జెట్‌ను నిర్వహణ పద్దు కింద అదనంగా కేటాయించగా అవి వేతనాలు, నిర్వహణ వ్యయం కిందే ఖర్చు కానున్నాయి. ఇక ప్రగతి పద్దు కింద కేటాయించిన మిగతా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిం చనుంది. గతేడాది ఉన్నత విద్యకు 1,462.02 కోట్లు, సాంకేతిక విద్యకు 270.23 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యకు రూ. 1,592.77 కోట్లు, సాంకేతిక విద్యకు 278.81 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈసారి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి పద్దును రెట్టింపు చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు నిధులను ఎక్కువ మొత్తంలో కేటాయించింది. ‘రూసా’అమలు కోసం గతేడాది రూ. 14.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 75.71 కోట్లను కేటాయించింది. అలాగే సంస్కృత అకాడమీ కోసం రూ.15 లక్షలు కేటాయించింది. ఇటు యూనివర్సిటీల్లో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి ఈసారి రూ. 10 కోట్లు కేటాయించింది. పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాలు కలిగిన తెలుగు యూనివర్సిటీకి మాత్రమే రూ. 3 కోట్లు ప్రగతి పద్దు కింద కేటాయించింది. ఇతర యూనివర్సిటీలకు కేటాయింపులేవీ చేయలేదు. పెంపుదల ఇలా.. పాఠశాల విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 1,277.77 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ.731.35 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.556.42 కోట్లు అదనంగా కేటాయించింది. ఉన్నత విద్యలో గతేడాది కంటే ఈ సారి రూ. 130.75 కోట్లు అదనంగా ఇచ్చింది. అం దులో నిర్వహణ పద్దు కింద రూ. 39.94 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 89.81 కోట్లు అదనంగా కేటాయించింది. సాంకేతిక విద్యలో గతేడాది కంటే ఇప్పుడు రూ. 8.58 కోట్లు అదనంగా ఇచ్చింది. అందులో నిర్వహణ పద్దు కింద రూ. 55 లక్షలు, ప్రగతి పద్దు కింద రూ. 8.02 కోట్లు అ దనంగా కేటాయించింది. కాగా, విద్యాశాఖకు ఈసారి బ డ్జెట్ కేటాయింపులు పెరిగినా రాష్ట్ర మొత్తం బడ్జెట్లో చూస్తే విద్యారంగం వాటా తగ్గింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి రాష్ట్ర బడ్జెట్ క్రమంగా పెరుగుతున్నా విద్యా రంగానికి కేటాయింపుల శాతం ఆ మేరకు పెరగట్లేదు.. వర్సిటీలకు రూ. 627 కోట్లు.. విద్యాశాఖకు గతేడాది కంటే ఈసారి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెరిగినా యూనివర్సిటీల అభివృద్ధికి మాత్రం కేటాయింపులు లేకుండాపోయాయి. యూనివర్సిటీల నిర్వహణ పద్దులో గతేడాది కంటే ఈసారి ప్రభుత్వం నిధులను పెంచినా అవి వర్సిటీల్లో యూజీసీ సవరించిన వేతనాల చెల్లింపునకే సరిపోనున్నాయి. యూనివర్సిటీలకు గతేడాది రూ. 606.73 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 627.31 కేటాయించింది. మరోవైపు కరీంనగర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ.5.59 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.76 కోట్లు కేటాయించింది. అలాగే సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ. 5.1 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 5.25 కోట్లు కేటాయించింది. మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి గతేడాది రూ. 84.71 కోట్లు కేటాయించగా, ఈసారి రూ. 87.25 కోట్లను కేటాయించింది. -
‘కోవిడ్’ ఖర్చు 5,268కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్‌ను ఎదుర్కోవడానికి రూ. 5,268 కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశం మొత్తం కోవిడ్‌తో అతలాకుతలమైందని, ఆదాయాలు తగ్గిపోయినప్పటికీ, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడానికి భారీగా వ్యయం చేసినట్లు శాసనసభకు సమర్పించిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికలో పేర్కొంది. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,177 కోట్లు వ్యయం చేయగా, ఆçహార భద్రతా కార్డులున్న వారికి ఒక్కో కుటుంబానికి రూ. 1,500 చొప్పున రెండు దఫాలు మొత్తం రూ. 2,628 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించింది. అలాగే రేషన్ కోసం రూ. 1,103 కోట్లు, వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లడానికి వీలుగా రూ.124 కోట్లు, కోవిడ్ వారియర్స్‌గా ఉన్న వైద్య, మునిసిపల్, పంచాయతీల పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.182 కోట్లు, పోలీసులకు రూ.54 కోట్లు సాయం అందించినట్లు వివరించింది. ఏప్రిల్‌లో 87.7 శాతం ఆదాయం నష్టం.. కోవిడ్ ప్రభావం 2020 మార్చిలో ప్రారంభం అయితే.. ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో 87.7 శాతం మేరకు నష్టపోయినట్లు నివేదికలో పేర్కొంది. మే నెలలో 50.8 శాతం నష్టం జరిగింది. గత ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఆదాయం సాధారణ స్థితికి వచ్చిందని, ఆ సమయంలో రూ. 36,806 కోట్ల మేరకు సొంత ఆదాయం సమకూర్చుకున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా వ్యాట్, ఎస్జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ నష్టపోయినట్లు ఆ నివేదిక వెల్లడించింది. మౌలిక సదుపాయాలకు మస్తు నిధులు సాక్షి, హైదరాబాద్: విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో అదనపు నిధులను కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్ర వాటాను భారీగా పెంచింది. రూ. 4 వేల కోట్లతో ప్రత్యేక పథకం కింద తరగతి గదులు, భవన నిర్మాణాలు, టాయిలెట్లు కల్పిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. పాఠశాల విద్యలో గతేడాదితో పోల్చితే ఈసారి రూ. 533.7 కోట్లు అదనంగా కేటాయించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు గతేడాది రూ. 1,239.46 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 1,773.16 కోట్లను కేటాయించింది. సమగ్ర శిక్షా అభియాన్‌కు గతేడాది 623.48 కోట్లను కేటాయించగా ఈసారి రూ.526.52 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక జూనియర్, డిగ్రీ కాలేజీల్లో భవనాలు, అదనపు తరగతుల నిర్మాణానికి రూ. 23 కోట్లకు పైగా నిధులను కేటాయిం చింది. మధ్యాహ్న భోజన పథకానికి గతేడాది లాగే నిధులను కేటాయించింది. విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురు కులాలు, పాఠ్య పుస్తకాల ముద్రణా లయానికి కేటాయింపులను పెంచింది. డిగ్రీ కాలేజీల భవనాలకు గతేడాది రూ.5 కోట్లు కేటాయిం చగా, ఈసారి రూ.10.91 కోట్లు కేటా యించింది. సాంకేతిక విద్యాశాఖలో ఎస్సీ హాస్టళ్ల కోసం రూ.3.23 కోట్లు కేటాయించింది. ఆర్ఐడీఎఫ్ కింద భవన నిర్మాణాలకు రూ.4.78 కోట్లు కేటాయించింది. -
పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో సింహభాగం రూ.2,500 కోట్లు పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలే ఉండటం గమనార్హం. గతేడాది 2020–21 వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపులు రూ.1,079 కోట్ల మేర పెరి గాయి. కాగా ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో జీతభత్యాలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ తదితరాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.330.96 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు పేరిట పరిశ్రమల విభాగంతో పాటు ఇతర అనుబంధ శాఖలకు రూ.1,616.31 కోట్లు, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ కింద సుమారు మరో రూ.1,130 కోట్లు కేటాయించారు. విద్యుత్, ఎస్జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంప్ డ్యూటీ, భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ తదితరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,800 కోట్ల మేర రాయితీలు, ప్రోత్సాహ కాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ప్రస్తుత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించడంతో పారిశ్రామికవేత్తలకు మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఊరట దక్కనుంది. ప్రతిష్టాత్మక పార్కుల ప్రస్తావన లేదు.. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌లో భాగంగా 14 ప్రధాన రంగాల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) జహీరాబాద్, హైదరాబాద్ ఫార్మాసిటీ, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కు కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించింది. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పర్యాయాలు లేఖలు రాసింది. అయితే ప్రస్తుత రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిమ్జ్‌లో భూసేకరణకు రూ.2 కోట్లు కేటాయించగా, ఇతర పారిశ్రామిక పార్కుల ప్రస్తావన కనిపించలేదు. నిర్వహణ పద్దు, రాయితీలు పోగా పారిశ్రామిక రంగానికి చేసిన కేటాయింపుల్లో అనుబంధ శాఖలైన చేనేత, మౌలిక వసతులు, పెట్టుబడులు, చక్కెర, గనులు, భూగర్భ వనరుల శాఖకు నామమాత్రంగా నిధులు దక్కాయి. ప్రస్తుత బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూ.338 కోట్లు ప్రతిపాదించగా ఇందులో నేత కార్మికులకు ఆర్థిక సాయం కోసం రూ.141.42 కోట్లు, చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రూ.226.76 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ.360 కోట్లు.. ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు విషయంలో దేశ సగటు 8.09 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు 17.93 శాతంగా ఉంది. ఐటీ, స్టార్టప్‌లకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని కొంపల్లి, కొల్లూరు, శంషాబాద్, ఉప్పల్, పోచారం తదితర కొత్త ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరిస్తోంది. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగానికి కొత్త ప్రాంతాలకు విస్తరించ డంతో పాటు ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.360 కోట్లను ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. పారిశ్రామిక రంగానికి కేటాయింపుల స్వరూపమిదీ.. కేటగిరీ కేటాయింపు(రూ.కోట్లలో) గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలు 1,379.40 భారీ, మధ్య తరహా పరిశ్రమలు 70.90 స్టేట్ సెక్టార్స్కీమ్స్ 12.06 మౌలిక వసతులు, పెట్టుబడులు 29.55 చక్కెర శాఖ 1.62 గనులు, భూగర్భ వనరులు 122.76 ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 501.58 ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 628.30 నిర్వహణ పద్దు 330.96 మొత్తం 3,077 -
సాగుకు యంత్ర సాయం
దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది.నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికీ నిజం.ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదనిఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్షపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం. – హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు ప్రత్యేకంగా దృష్టిసారించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా రూ. 1,500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం విశేషం. ఒకవైపు కూలీల కొరత ఉండటం, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయడంలో కేంద్రం ఆసక్తి చూపించకపోవడంతో తెలంగాణ సర్కారు యాంత్రీకరణకు మొగ్గు చూపింది. భారీ కేటాయింపులతో రైతులను యాంత్రీకరణ బాటపట్టించేందుకు రంగం సిద్ధం చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.951 కోట్లు ఖర్చు చేసి 14,644 ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను సబ్సిడీపై రైతులకు అందించింది. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ఈసారి రూ. 25 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. రైతు బంధు, రుణమాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుబీమా పథకాలకే ఎక్కువగా నిధులు కేటాయించింది. అవి పోగా మిగిలిన వాటికి రూ.2,276 కోట్లు కేటాయిం పులు చేసింది. ఇక వ్యవసాయ భూములు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందేలా ‘రైతు బంధు’పథకానికి తాజా బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో రైతు బంధు పథకానికి రూ.14 వేల కోట్లు పెట్టగా... రూ.14,736 కోట్లు అవసరమయ్యాయి. కేటాయిం పుల కంటే రూ. 736 కోట్లు అధికంగా విడుదల చేయాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి నిధులు పెంచింది. గత బడ్జెట్ కేటాయిం పుల్లో రెండు సీజన్లలో 59.25 లక్షల మంది రైతులకు సొమ్ము వారి ఖాతాల్లో వేసింది. ఈసారి సాగు, పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా రూ. 14,800 కోట్లు కేటాయించారు. ఇక రైతు రుణాల మాఫీ కోసం ఈ బడ్జెట్లో రూ. 5,225 కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో రుణమాఫీ కోసం రూ.6,225 కోట్లు కేటాయించినా... రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేసేందుకు రూ.1,210 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రైతు బీమాకు రూ. 1,200 కోట్లు రైతు బీమా పథకానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే రూ. 5 లక్షల పరిహారం అందించడానికి బీమా కల్పించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.1,141.4 కోట్లు మంజూరు చేసి 32.73 లక్షల మందికి బీమా కల్పించారు. ఈ ఏడాది కొంత పెంచారు. ప్రతి రైతుకు ప్రీమియంగా రూ. 3,400 చొప్పున ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లిస్తుంది. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న రైతులు... ఈ బీమాకు అర్హులు. 2018 నుంచి ఇప్పటివరకు రైతు బీమా పథకం ద్వారా 46,564 రైతు కుటుంబాలకు రూ.2,328 కోట్లు పరిహారం అందించింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు బడ్జెట్లో రూ.122 కోట్లు కేటాయించింది. గతంలో కేవలం మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్లు నడిచేవి. కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు నిధుల కేటాయింపు చేయడం గమనార్హం. కూరగాయలు, మాంసం, చేపలు... అన్ని ఒకేచోట వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల కోసం రూ. 500 కోట్లు కేటాయించింది. గజ్వేల్‌లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సక్సెస్ కావడంతో రాష్ట్రంలో మరిన్ని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు నిధుల కేటాయింపు చేసింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రకటించారు. ఆయిల్ పామ్సాగుకు ఎకరాకు రూ.30 వేల సబ్సిడీ రైతు బంధు, రైతు బీమా పథకాలు కొనసాగిస్తూనే వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 1,500 కోట్లు కేటాయించడం హర్షణీయం. కూలీల కొరత నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ అత్యవసరం. అందుకే కేసీఆర్ ప్రత్యేకంగా ప్రతిపాదింపజేశారు. 8.14 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ విస్తరణ కోసం రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ. 30 వేల సబ్సిడీని రైతులకు ఇచ్చేందుకు బడ్జెట్లో నిధుల కేటాయింపు జరిగింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధి రేటుకు వ్యవ‘సాయం’ ప్రాథమిక రంగమైన.. వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరు వల్ల గతేడాది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జాతీయ స్థాయి కన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ) 20.9 శాతం వృద్ధి సాధించింది. జాతీయ స్థాయిలో ఈ రంగాల జీఎస్వీ వృద్ధి 3 శాతమే. ద్వితీయ రంగమైన.. పారిశ్రామిక రంగ వృద్ధి రేటు మైనస్ 5.6 శాతం, తృతీయ రంగంలో సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్ 4.9 శాతానికి పతనమాయ్యయి. అయితే, జాతీయ స్థాయితో పోలిస్తే కొంత మేర మెరుగైన స్థితిలో ఉన్నాయి. దేశంలో పరిశ్రమల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.2 శాతానికి, సేవల రంగంలో వృద్ధి రేటు మైనస్ 8.1 శాతానికి పతనమైంది. -
కవితను పరిచయం చేసిన మండలి చైర్మన్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను గురువారం శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. 84 పేజీల బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని దాదాపు గంటన్నరలో చదివారు. బడ్జెట్ ప్రసంగం ముగిశాక, స్థానిక సంస్థల నుంచి ఎన్నికై తొలిసారి మండలి సమావేశాలకు హాజరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను.. చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభ్యులకు పరిచయం చేశారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి వేములను, ఎమ్మెల్సీ కవితను పలువురు సభ్యులు అభినందించారు. -
96 నిమిషాల ‘సుదీర్ఘ’ బడ్జెట్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 2021–22 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గురువారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. 96 నిమిషాల పాటు ఆర్థికమంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం కావడం గమనార్హం. ఆర్థికమంత్రి హోదాలో హరీశ్‌రావు వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించారు. హరీశ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఆయన చేతుల మీదుగా బడ్జెట్ ప్రతులను స్వీకరించారు. గురువారం ఉదయం 11.30కు శాసనసభ ప్రారంభం కాగా పది నిమిషాల ముందే హరీశ్‌రావు సమావేశ మందిరంలోకి చేరుకోగా.. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలిపారు. సభ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు సమావేశ మందిరంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వద్దకు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లి అభివాదం చేశారు. బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో పలు శాఖలు, పథకాలకు సంబంధించిన కేటాయింపులపై అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఏటా రూ.5 కోట్లు ఇస్తామని పేర్కొనడంతో సభ్యులు పెద్ద ఎత్తున బల్లలు చరుస్తూ హర్షం వెలిబుచ్చారు. బడ్జెట్ ప్రసంగం కాపీని తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో సభ్యులకు అందజేయగా, బడ్జెట్ పూర్తి వివరాలను తొలిసారిగా పెన్‌డ్రైవ్‌ల ద్వారా అందజేయడంతో పాటు సభ్యులకు ఐపాడ్లు అందజేశారు. చైర్మన్, స్పీకర్‌కు బడ్జెట్ ప్రతులు రాష్ట్ర బడ్జెట్ 2021–22 ప్రతులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉదయం అందజేశారు. శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ సమర్పణకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన మంత్రి వేముల తనకు రెండో పర్యాయం అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఆశీర్వాదం తీసుకున్నారు. వేములకు సహచర మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. సీఎంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల భేటీ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ జిల్లా, మండల పరిషత్‌లకు రూ.500 కోట్లు కేటాయించడంపై స్థానిక సంస్థల కోటా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థలకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ఇటీవల ఈ ఎమ్మెల్సీలు సమావేశమైన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నారదాసు లక్ష్మణ్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పురాణం సతీష్‌కుమార్, బాలసాని లక్ష్మినారాయణ, దామోదర్‌రెడ్డి ఉన్నారు. -
సాగు, సంక్షేమం.. అంకెలు అదుర్స్
సాక్షి, హైదరాబాద్: వ్యవ‘సాయం’ పెరిగింది.. సంక్షేమం మరింత ముందుకెళ్లింది.. సాగు నిధులకు ఢోకా లేదు.. ప్రస్తుతం అమలవుతున్న పథకాల్లో ఎక్కడా కోతల్లేవు.. పన్ను మోతల్లేవు.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి భారీ గా కేటాయింపులు.. ఒక్క మాటలో చెప్పాలంటే... రైతు, పల్లె, పట్నం ప్రగతికి బాటలు వేస్తూ, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ముందుకు తెచ్చింది. కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టినా.. నిలకడగా ఉన్న వృద్ధిరేటు, పెరుగుతున్న తలసరి ఆదాయాలే ధీమాగా.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురువారం 2021–22 ఏడాది బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,30,825.96 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను ప్రతిపాదించారు. రైతుబంధుకు నిధుల పెంపు, రుణమాఫీకి కేటాయింపులు, రైతు బీమా అమలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా కేటాయింపులు చేశారు. హైదరాబాద్‌తోపాటు యావత్ తెలంగాణకే మణిహారమైన రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ కోసం రూ.750 కోట్లు ఇస్తామని పేర్కొన్నారు. వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యమిస్తూనే.. సీఎం దళిత సాధికారత పేరుతో దళితుల అభివృద్ధి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు పెంచడంతోపాటు ఎంపీపీలు, జెడ్పీలకు ప్రత్యేక నిధుల కింద రూ.500 కోట్లు కేటాయించారు. గిరిజనుల సాగు భూములకు త్రీఫేజ్ విద్యుత్, గొల్లకు ర్మలకు గొర్రెల పంపి ణీకి ప్రాధాన్యమిచ్చా రు. ఈ బడ్జెట్ గత బడ్జెట్ రూ.1.82 లక్షల కోట్లతో పోలిస్తే 25% అధికం కావడం విశేషం. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రి హరీశ్‌రావు.చిత్రంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, వేముల తదితరులు అన్ని శాఖలకూ పెంపు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు నిధులు పెంచింది. వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు కేటాయించింది. అన్ని స్థాయిల్లో విద్యకు గత బడ్జెట్ కంటే రూ.1,400 కోట్లు అదనంగా.. రూ.13,500 కోట్లను ఇచ్చింది. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ శాఖలకు గత బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించగా.. ఈసారి ఒక్క పంచాయతీరాజ్ శాఖకే రూ.29,271 కోట్లు ప్రతిపాదించారు. పురపాలక శాఖకు మరో రూ.15 వేల కోట్లు చూపారు. సాగునీటి రంగానికి ఎప్పటిలాగే ప్రాధాన్యమిస్తూ ఈసారి రూ.16,391 వేల కోట్లకుపైగా కేటాయించారు. ఎస్సీఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కింద గత బడ్జెట్ కంటే రూ.ఏడు వేల కోట్లు ఎక్కువగా ప్రతిపాదించారు. రీజనల్ రింగు రోడ్డు భూసేకరణకు రూ.750 కోట్లు, మెట్రో రైలుకు రూ.1,000 కోట్లు, హైదరాబాద్ తాగునీటి పథకాలకు రూ.2,381 కోట్లు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు రూ.250, రూ.150 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. సంక్షేమానికి ప్రాధాన్యం సబ్సిడీ, సంక్షేమ పథకాల అమలుకు తగినన్ని నిధులిచ్చారు. విద్యుత్ శాఖకు గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు ఎక్కువగా.. రూ.11,040 కోట్లు, పౌర సరఫరాలకు రూ.2,363 కోట్లు కేటాయించారు. బీసీ, మహిళా, మైనార్టీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యమిస్తూ రూ.8వేల కోట్ల వరకు ప్రతిపాదించారు. రోడ్లు భవనాల శాఖకు కూడా రూ.8వేల కోట్లకుపైగా ఇచ్చారు. రాష్ట్రంలో భూముల సర్వేకు అనుగుణంగా సమగ్ర సర్వే పేరుతో ఈసారి రూ.400 కోట్లు చూపెట్టడం గమనార్హం. ఆర్టీసీకి బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయిస్తూనే.. మరో రూ.1,500 కోట్ల మేర రుణాలకు పూచీకత్తు ఇచ్చేలా ప్రతిపాదనలు చేశారు. ఎప్పటిలాగే ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాల అమలు కోసం రూ.14,500 కోట్ల మేర కేటాయించారు. మొత్తమ్మీద సంక్షేమమే పరమావధిగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర సర్కారు 2021–22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలు చేసిందనే చర్చ జరుగుతోంది. పన్నుల రాబడిపై ధీమా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే.. సొంత పన్ను రాబడులపై ధీమాగా ఉన్నట్టు కనిపిస్తోంది. కరోనా మహమ్మరి కొట్టిన దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నా.. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని బడ్జెట్ ప్రతిపాదనలు చెబుతున్నాయి. ఈసారి పన్ను రాబడుల కింద రూ.92,910 కోట్లను చూపెట్టగా.. పన్నేతర ఆదాయం కింద రూ.30,557 కోట్లు వస్తుందని అంచనా వేశారు. కేంద్ర పన్నుల్లో వాటా గతం కంటే తక్కువగా రూ.13,990 కోట్లు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్దును గతం కంటే భారీగా పెంచుతూ రూ.38,669 కోట్లు చూపెట్టారు. ఆదాయ వనరుల వివరాల్లోకి వస్తే జీఎస్టీ, అమ్మకపు పన్ను కలిపి రూ.57,500 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.17 వేల కోట్లు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్లు వస్తాయని అంచనా వేశారు. వీటితోపాటు ఈసారి కూడా రుణాల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఆధారపడనుంది. బహిరంగ మార్కెట్ నుంచి రుణాల ద్వారా రూ.47,500 కోట్లు సేకరించాలని నిర్ణయించింది. మొత్తంగా ఈసారి రెవెన్యూ రాబడుల కింద రూ.1.76 లక్షల కోట్లకుపైగా వస్తాయని అంచనా వేసింది. ఇక రెవెన్యూ ఖర్చు కూడా రూ.1.69 లక్షల కోట్లకుపైగా ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. రెవెన్యూ మిగులు రూ.6,743 కోట్లుగా చూపెట్టగా.. ద్రవ్యలోటు రూ.45,509 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. వచ్చిందంతా ఖర్చయింది! కరోనా మహమ్మరి తెచ్చిన ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడిన 2020–21 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం సభ ముందుంచింది. గత బడ్జెట్లో మొత్తం రూ.1.82 లక్షల కోట్లు ప్రతిపాదించగా.. రూ.1.66 లక్షల కోట్ల మేర సమకూరిందని వెల్లడించింది. ఇందులో దాదాపు అంతా ఖర్చయిందని తెలిపింది. ఇక గత బడ్జెట్లో రెవెన్యూ మిగులు లేకపోగా.. ద్రవ్యలోటు రూ.42,399 కోట్లుగా పేర్కొంది. విద్య.. గతేడాది పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖలకు మొత్తంగా రూ. 12,138 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 13,564.66 కోట్లను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. ఇది గతేడాదితో పోలిస్తే రూ. 1,426.65 కోట్ల మేర అదనం. గతేడాది పాఠశాల విద్యాశాఖకు రూ. 10,405.31 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 11,693.08 కోట్లు కేటాయించింది. వైద్యం.. వెద్య, ఆరోగ్య శాఖకు గతేడాది రూ. 6,185.97 కోట్లు ఇవ్వగా.. ఈ సారి రూ. 6,295 కోట్లు కేటాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం.. ‘ఆరోగ్య మిషన్’కు అధిక నిధులు కేటాయించింది. సాగు నీరు.. సాగునీటి శాఖకు రూ. 16,931 కోట్లు కేటాయించగా.. ప్రగతి పద్దు కింద రూ. 6,424.28 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ. 10,506.58 కోట్లు కేటాయించారు. గతేడాదికన్నా ఈసారి రూ. 5,878 కోట్ల మేర పెరిగాయి. గ్రామీణాభివృద్ధి.. రాష్ట్ర బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రగతి, నిర్వహణ పద్దులు, ఇతర కేటాయిం పులు, తదితరాలు కలుపుకొని రూ.29,271 కోట్లు ప్రతిపాదించడం విశేషం. ఇది గతేడాదితో పోల్చితే రూ.6,266 కోట్ల మేర అధికం. పట్టణాభివృద్ధి.. పురపాలక శాఖకు 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021–22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. నిర్వహణ పద్దు కింద రూ.3,978.01 కోట్లు.. ప్రగతిపద్దు రూ.10,134.23 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.33,611.06 కోట్లు కేటాయింపు. ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ.21,306.84 కోట్లు. ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.12,304.22 కోట్లు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.7,304.81 కోట్లు అదనం. ‘బీసీ’ శాఖకు రూ.5,522.09 కోట్లు. గత బడ్జెట్లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. ఆర్టీసీ.. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ.1500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. పరిశ్రమలు.. పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు. రాయితీలు, ప్రోత్సాహకాలకే రూ.2,500 కోట్లు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.1,130 కోట్లు. చేనేత కార్మికుల సంక్షేమానికి రూ.338 కోట్లు. ఐటీ రంగానికి రూ.360 కోట్లు ప్రతిపాదన. ► ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ పల్లెలు తట్టుకుని నిలబడ్డాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపు ఫలితం. కొన్నేళ్లుగా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు కల్పించిన వాణిజ్య సేవలు, సమాచార, సాంకేతిక, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం. కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉంది. గత ప్రభుత్వాలు దండగ అని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకుని అభివృద్ధి సాధించింది. ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యలతోనే ఇది సాధ్యమైంది. – ఆర్థిక మంత్రి హరీశ్ ► చెక్కు చెదరని వ్యవ‘సాయం’కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైనా.. రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర సామాజిక–ఆర్థిక స్వరూపం నివేదిక వెల్లడించింది. 2020–21లో జీఎస్డీపీ వృద్ధి రేటు –1.26%కి తగ్గింది. అయితే దేశ జీడీపీ వృద్ధి రేటు మైనస్ 8%కి పడిపోయింది. దేశంతో పోలిస్తే రాష్ట్ర వృద్ధి రేటు మెరుగైన స్థానంలో ఉంది. వ్యవసాయ రంగం వృద్ధి మాత్రం చెక్కుచెదరలేదు. ఈ మూడూ చాలా కీలకం.. ► కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ భూముల అమ్మకాలు, రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి జరగని భూముల మార్కెట్ విలువల సవరణను అమల్లోకి తేవడం ద్వారా దాదాపు రూ.16,500 కోట్లు సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ► గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద కేంద్రం నుంచి గతం కంటే రూ.28 వేల కోట్లు అదనంగా వస్తాయని ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ► సొంత పన్ను ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందని సర్కారు అంచనా వేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా రూ.76,195.65 కోట్లతో పోలిస్తే.. సుమారు రూ.16.5 వేల కోట్లు అదనంగా పన్నుల రాబడి ఉంటుందని పేర్కొంది. -
తొలి రోజే రచ్చ.. షర్టు విప్పేసిన ఎమ్మెల్యే..
సాక్షి, బెంగళూరు: బడ్జెట్ సమావేశాలు రచ్చతోనే ప్రారంభమయ్యాయి. అధికార– ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విధానసభలో ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చించాలని సభాపతి విశ్వేశ్వరహెగడే కాగేరి సూచించారు దీనిపై కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరికీ చెప్పకుండా చర్చకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు. చర్చిస్తే తప్పేముందని బీజేపీ సభ్యులు వాదించారు. ఇరువర్గాల అరుపులతో గందరగోళం నెలకొంది. గందరగోళం తగదు: సీఎం.. సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించబోరన్నారు. మొదటిరోజే గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదు, సభలో ఆందోళన చేయడం సరికాదని సూచించారు. షర్టు విప్పేసిన ఎమ్మెల్యే.. భద్రావతి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమేశ్ సభాపతి పోడియం ముందుకు వచ్చి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించారని ఆయనను సభాపతి సస్పెండ్ చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సంగమేశ్‌కు షర్టు వేశారు. ఈ ఘటనతో 10 నిమిషాల పాటు స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీ సభ మొదలుకాగా మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్ –స్పీకర్ కాగేరి మధ్య సభాపతి ప్రత్యేక అధికారాలపై తీవ్ర చర్చ సాగింది. ఇక సెక్స్‌స్కాండల్‌లో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్ జార్కిహొళి సభకు గైర్హాజరయ్యారు. ఆయన సోదర ఎమ్మెల్యేలూ ముఖం చాటేశారు. ఒక ఎన్నికతో మేలు: స్పీకర్ దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని సభాపతి పేర్కొన్నారు. వేర్వేరుగా ఎన్నికల వల్ల సిబ్బందిపై ఎంతో భారం పడుతుంది, రాష్ట్రంలో పాలన కూడా కుంటుపడుతుందన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ ఎజెండా, మాకు వద్దని కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. చదవండి: రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ? శశికళ నిష్క్రమణ వెనుక.. -
గడ్డు పరిస్థితుల్లో యడ్డి సర్కార్: అసెంబ్లీలో అగ్నిపరీక్ష
సాక్షి, బెంగళూరు: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాల ధరలు, వీటికి తోడు రమేశ్ జార్కిహొళి శృంగార బాగోతం మధ్య సీఎం యడియూరప్పకు అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు జార్కిహొళి సీడీ వివాదంపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంది. ఏడాదిన్నర కిందట కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంలో కీలకపాత్ర పోషించిన రమేశ్ జార్కిహొళి అంశంపై ఎక్కువ చర్చలు జరిగే అవకాశముందని అంచనా. అలాగే ఇటీవల సంభవించిన శివమొగ్గ, చిక్కబళ్లాపుర పేలుళ్లపై కూడా ప్రశ్నించనున్నాయి. ఉభయ సభలూ చర్చకు బదులు రచ్చలతో దద్దరిల్లినా ఆశ్చర్యం లేదని అంచనాలు నెలకొన్నాయి. 8వ తేదీన బడ్జెట్ సమర్పణ.. నేడు మొదలయ్యే బడ్జెట్ సమావేశాలు సుమారు 19 రోజుల (మార్చి 31 వరకు) పాటు జరుగుతాయి. మొదటి రెండురోజులు ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఒకే దేశం– ఒకే ఎన్నికలు’ అంశంపై చర్చిస్తారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తున్న తొలి రాష్ట్రం కర్ణాటక కావడం గమనార్హం. ఇక 8వ తేదీన సోమవారం సీఎం యడియూరప్ప రాష్ట్ర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఈ సమావేశాల్లో కర్ణాటక పౌరసభ బిల్లు–2021, సొసైటీల రిజిస్ట్రేషన్ బిల్లు వంటి బిల్లులపై చర్చ జరగనుంది. సందర్శకులకు అనుమతిస్తారు. గ్యాలరీలో భౌతిక దూరం పాటిస్తూ ప్రజలు, విద్యార్థులు సమావేశాలను వీక్షింవచ్చు. చదవండి: కన్నడ నేతల రాసలీలలు.. ప్రతిసారీ రాజీనామాలు చిన్నమ్మ సంచలన నిర్ణయం -
ఫిబ్రవరి 1 న 2021 కేంద్ర బడ్జెట్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దు చేసిన కేంద్రం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) మంగళవారం సిఫారసు చేసింది. బడ్జెట్ సెషనల్లో తొలి దశ సమావేశాలు జనవరి 29 నుండి ఫిబ్రవరి 15 వరకు జరపాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల మేరకు ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ 2021 ను సమర్పించనున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ మలి దశ సమావేశాలు జరుగుతాయి. అలాగే బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు జనవరి 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. కోవిడ్-19 మహమ్మారి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తరువాత ఎన్డీఏ సర్కార్‌కు ఇది తొలిబ బడ్జెట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సన్నాహకాల్లో తలమునకలై ఉన్నారు. ఇందులో భాగంగా పరిశ్రమల పెద్దలతో భేటీ అయ్యారు. అలాగే బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ 'హల్వా వేడుక', బడ్జెట్ పేపర్పత్రాలను ముద్రించే ప్రక్రియ ఉంటుంది. దీంతోపాటు ప్రధాన ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో రూందించిన ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు విడుదల చేయడం లాంటి కీలక అంశాలు. కాగా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత 40 రోజులుగా రైతుల నిరసనలు, కోవిడ్-19 వ్యాక్సినేషన్ లాంటి అంశాలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చర్చకు రానున్నాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో శీతాకాల సమావేశాలను నిర్వహించకుండా, డైరెక్టుగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నామని కేంద్రం ప్రకటించడంపై ప్రతిపక్షాలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. -
ఏకకాలంలో శీతాకాల, బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈసారి ఒకేసారి జరిపే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్–19 కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెండింటిని వేర్వేరుగా కాకుండా ఒకే విడతలో నిర్వహించాలని కేంద్రం యోచిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, దీనిపై ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని పేర్కొన్నాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఏటా నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయి. బడ్జెట్ సెషన్స్ కూడా జనవరి చివరి వారంలో మొదలవుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఏడాదికి మూడు పర్యాయాలు పార్లమెంట్ సమావేశాలు జరపడం సంప్రదాయమే తప్ప, తప్పనిసరి కాదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య తెలిపారు. రెండు సమావేశాల మధ్య గడువు ఆరు నెలలు మించరాదని మాత్రమే రాజ్యాంగం చెబుతోందన్నారు. శీతాకాల, బడ్జెట్ సమావేశాలను కలిపి నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలు కూడా కోవిడ్ మహమ్మారి కారణంగా ముందుగానే ముగియడం తెలిసిందే. అదేవిధంగా, కోవిడ్ సమయంలో మునుపెన్నడూ లేని విధంగా చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలతో వర్షాకాల సమావేశాలు జరిగాయి. కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ పలువురు సభ్యులు, సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో సెప్టె్టంబర్ 14వ తేదీన మొదలైన ఈ సమావేశాలను ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కంటే 8 రోజులు ముందుగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలి : కన్నబాబు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మండలి వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రులపై దాడికి దిగారని తెలిపారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినట్టు వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ సభలో ఫొటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారని చెప్పారు. (చదవండి : మంత్రి వెల్లంపల్లిపై టీడీపీ ఎమ్మెల్సీల దాడి) ప్రజాసంక్షేమం, ప్రజా ప్రయోజనం జరగనివ్వమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెప్తున్నారని తెలిపారు. డిప్యూటీ చైర్మన్ తీరు ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని నాలుగు గంటలుగా కోరిన పట్టించుకోలేదని చెప్పారు. బీజేపీ, పీడీఎఫ్, ఇతర సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన పరిగణలోకి తీసుకోరా అని ప్రశ్నించారు. లోకేశ్ సభలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని.. ఇది సభను చులకన చేయడమేనని విమర్శించారు. లోకేశ్ సభ్యుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. లోకేష్ తీరుపై సభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేసిన టీడీపీ సభ్యులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మండలి నిరవధిక వాయిదా వెనక యనమల ప్లాన్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి సాక్షిగా మంత్రిపై దాడి
సాక్షి, అమరావతి: శాసన మండలిలో తెలుగుదేశం సభ్యులు బుధవారం గందరగోళం సృష్టించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై దాడికి తెగబడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై చేయి చేసుకుని అమర్యాదగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(2020-21) సమావేశాల్లో భాగంగా రెండో రోజు శాసనమండలి సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వివిధ బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో టీడీపీ నేతలు హడావుడి చేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ నిబంధనలకు విరుద్ధంగా మండలిలో సభ్యుల ఫొటోలు తీస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. (చదవండి : ‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’) ఈ క్రమంలో లోకేష్ చర్యపై అభ్యంతరం వ్యక్తం చేసిన డిప్యూటీ చైర్మన్.. ఫొటోలు తీయొద్దని ఆదేశించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన మంత్రులు.. లోకేష్ తీరు సరికాదంటూ మండిపడ్డారు. ఇంతలో మంత్రుల దగ్గరికి చేరుకున్న టీడీపీ సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడికి తెగబడ్డారు. మంతెన సత్యనారాయణరాజు, బీద రవిచంద్ర.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ని కాళ్లతో తన్ని, చేయి చేసుకుని ఆయనను అవమానించారు. ఇదిలా ఉండగా.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. -
‘ఇలాంటి వాటిని సీఎం జగన్ సహించరు’
సాక్షి, అమరావతి : నేతల్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లాలని శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వివాదాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివేదిక తెప్పించుకున్నారన్నారు. శాసన మండలి వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు నేతలు చేసుకుంటున్న విమర్శలపై పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇలాంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహించరని స్పష్టం చేశారు. పార్టీ నేతలు క్రమశిక్షణ ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మారెడ్డి హెచ్చరించారు. (శాసన మండలిలో టీడీపీ హడావుడి) ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని, హద్దు మీరితే ఎలాంటి చర్యలకైన వెనకాడమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పినట్లు వెల్లడించారు. నాయకులు ఒకరిపై మరొకరు సవాల్ విసురుకోవడం మానుకోవాలని హితవు పలికారు. నరసాపురంలో జరిగిన సంఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. తప్పెవరిది అనే దానిపై అధిష్టానం నివేదిక తెప్పించుకుంటుందని, పార్టీ అనుమతి లేనిదే ఎవరూ మీడియా సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నేతలకు ఇబ్బంది ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యేలు ఎంపీలకే కాదు అందరికి ఇదే వర్తిస్తుందని తెలిపారు. సీఎం జగన్ సమయం ఇవ్వడం లేదనేది అవాస్తవమని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు. (ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) ఎంపీ వ్యవహారం అందరూ చూశారు: ప్రసాదరాజు ఎమ్మెల్యేలను పందులు గుంపుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు పోల్చడం సరికాదని నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో పార్టీకి నష్టం జరిగేలా ప్రవర్తించారని, ఇబ్బంది ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీ వ్యవహారాన్ని అందరూ చూశారని, ధైర్యం ఉంటే ఆయనే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ లేకపోతే రఘురామ కృష్ణంరాజు గడ్డి పరకతో సమానమన్నారు. (‘ఎంతమందికి చికిత్స అయినా ప్రభుత్వం సిద్ధం’) -
‘పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు’
సాక్షి, అమరావతి: యనమల రామకృష్ణుడు తన తెలివితేటలతో సభను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం సభ నడపమని వేడుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి నిరవధిక వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రూల్ 90 ప్రకారం ఏదైనా అంశంపై చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగానే నోటీసు ఇవ్వాలి. ఛైర్మన్, సభా నాయకుడితో మాట్లాడి పరిగణలోకి తీసుకోవాలి. ఇవేమీ పట్టించుకోకుండా ఛైర్మన్ రూల్ 90ని పరిగణలోకి తీసుకున్నారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేం. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలన్న ఆలోచనతోనే టీడీపీ వ్యవహరించింది. ఉన్నత లక్ష్యాల కోసం ఏర్పడ్డ పెద్దల సభను అప్రతిష్టపాలు చేశారు. టీడీపీకి రాజకీయమే ప్రాధాన్యత. రాష్ట్ర ప్రజల బాగోగులు అవసరం లేదు. ఆర్ధిక మంత్రి చేతులు జోడించి వేడుకున్నా పట్టించుకోలేదు. 33వేల ఎకరాల్లో వ్యాపారం చేసుకోవడం కోసమే ప్రభుత్వ బిల్లులను అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులు కుట్రతోనే సభకు వచ్చారు’అని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మంత్రిపై దాడి చేశారు: కన్నబాబు టీడీపీ ఎమ్మెల్సీలు మంత్రిపై దాడికి దిగారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే సరికాదని చెప్పినందుకు మంత్రి వెల్లంపల్లిపై దాడి చేశారని అన్నారు. శాసన మండలి చరిత్రలో ఇదొక దురుద్దినం మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. సభలో లోకేష్ ఫోటోలు తీస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిపై దాడి చేసిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాయిదా వేయడం శోచనీయం శాసనమండలి చైర్మన్ నిర్ణయాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. మండలి నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కీలక బిల్లులు ఆమోదించకుండానే సభను వాయిదా వేయడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదానికి అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ చెప్పినట్టుగా సభ జరగాలని చూశారని ఆరోపించారు. సభను విచ్ఛిన్నం చేయడానికి టీడీపీ ప్రయత్నించిందన్నారు. గత సెషన్లో మాదిరిగానే చైర్మన్ వ్యవహరించారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. మండలిలో టీడీపీ హడావుడి బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో అంతకుముందు టీడీపీ నేతలు శాసన మండలిలో మరోసారి హడావుడి చేశారు. దీంతో అక్కడ ప్రతిష్టంభన నెలకొంది. బిల్లుల ఆమోదంపై మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రుల మధ్య వాగ్వాదం నడిచింది. తొలుత ద్రవ్య వినిమయ బిల్లు పూర్తి చేద్దామని మండలి డిప్యూటీ చైర్మన్ చెప్పగా.. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. సీఆర్డీయే రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను ముందుగా చేపట్టాలని మంత్రి కోరారు. దీంతో ద్రవ్యవినిమయ బిల్లు రాజ్యాంగ ఆబ్లిగేషన్ అని యనమల రామకృష్ణుడు అడ్డుతగిలారు. అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని చెప్పారు. యనమల వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సంప్రదాయం అని బుగ్గన స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని నిలదీశారు. దీంతో డిప్యూటీ చైర్మన్ 15 నిమిషాలు మండలిని వాయిదా వేశారు. (చదవండి: ఎన్ఆర్సీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం) -
ప్రతి సీటు శానిటైజ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో శాసనసభ, శాసనమండలిలో అడుగడుగునా శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా శాసనసభ ప్రాంగణం, లాబీల్లో రద్దీని బాగా తగ్గించాలని నిర్ణయించారు. కోవిడ్ నేపథ్యంలో అసెంబ్లీ, మండలిలో ప్రతి సీటును శానిటైజేషన్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ తెలిపారు. సభ్యులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతరులు ఎవరినీ అనుమతించరాదని నిర్ణయించినట్లు చెప్పారు. భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. శాసన మండలి ఛైర్మన్ ఎం.ఏ.షరీఫ్, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌లు కొరుముట్ల శ్రీనివాసులు, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉభయ సభల నిర్వహణ, భద్రత, సభ్యుల ఆరోగ్యం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజ్ చేస్తున్న సిబ్బంది తక్కువ రోజులే మేలు: బుగ్గన ప్రస్తుత పరిస్థితుల్లో శాసనసభా సమావేశాలను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే శ్రేయస్కరమని భావిస్తున్నట్లు శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. శాసనసభ వద్ద ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమావేశాలను రెండు రోజులకు కుదించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్నామని ఇలా జరగడం ఇదే తొలిసారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్... ► శాసనసభా సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని మీడియా, పత్రికా ప్రతినిధులు తిలకించేందుకు వీలుగా సచివాలయంలోని మీడియా సెల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► అన్ని చానెళ్లకు లైవ్ ఫీడ్ కూడా ఇవ్వనున్నారు. పత్రికా విలేకరుల గ్యాలరీలోకి 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. మీడియా పాయింట్ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిషేధించారు. ► మంత్రులు, క్యాబినెట్ హోదా ఉన్న వారికి ఇద్ద రు సహాయక సిబ్బందిని అనుమతిస్తున్నారు. ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సహాయకులు, గన్మెన్లకు బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► బడ్జెట్, పద్దుల వివరాలను పంపిణీ చేసే ఆర్థిక శాఖ సిబ్బంది కూడా త్వరగా పని ముగించుకుని వెళ్లి పోయే విధంగా ఏర్పాట్లు చేసి రద్దీని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు లెజిస్లేచర్ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లోనూ పోలీస్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. అసెంబ్లీ బందోబస్తు ఏర్పాట్లపై డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ సోమవారం సమీక్షించారు. పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ► బందోబస్తు కోసం.. గుంటూరుతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిగోదావరి జిల్లాల నుంచి మొత్తం 3,080 మంది పోలీసులు, 105 మంది మార్షల్స్ అసెంబ్లీ ప్రాంతానికి చేరుకున్నారు. గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ ఎస్పీల పర్యవేక్షణలో 17 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 78 మంది ఎస్సైలు, పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ► అసెంబ్లీ ఆవరణలోను, అసెంబ్లీకి వెళ్లే మార్గంలోను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అనుమతి ఉన్న వాహనాలకే దారి ఇవ్వనున్నారు. ► అసెంబ్లీ ప్రాంతంలోను, సమీప ప్రాంతాల్లోను సెక్షన్ 144 అమలులోకి తెచ్చారు. -
పెట్రోల్, డీజిల్‌పై ముందుంది మరింత బాదుడు
న్యూఢిల్లీ: కష్టకాలంలో కాసులు రాబట్టుకునే మార్గాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.8 వరకు ఎక్సైజ్ సుంకం పెంచుకునేందుకు వీలుగా సోమవారం చట్ట సవరణ చేసింది. ఆర్థిక బిల్లు, 2020లో ఈ మేరకు సవరణను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ సవరణకు, ఆర్థిక బిల్లు 2020కు లోక్‌సభ ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం తెలియజేసింది. దీంతో ప్రత్యేక పరిస్థితుల్లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం లీటర్‌కు రూ.18 వరకు, డీజిల్‌పై రూ.12 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం కింద పెంచుకోవడానికి వీలుంటుంది. సవరణ ముందు వరకు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.10, డీజిల్‌పై రూ.4 వరకే ఎక్సైజ్ సుంకం విధించేందుకు కేంద్ర సర్కారుకు చట్ట పరంగా అవకాశం ఉండేది. కాగా, అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు చేరడంతో.. ఆదాయ పెంపు చర్యల్లో భాగంగా డీజిల్, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచుతూ ఈ నెల 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనివల్ల సర్కారుకు రూ.39,000 కోట్ల అదనపు ఆదాయం వార్షికంగా సమకూరనుంది. ఈ పెంపుతో చట్ట పరంగా ఎక్సైజ్ సుంకం గరిష్ట స్థాయిలకు చేరింది. అందుకే చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పార్లమెంట్ నిరవధిక వాయిదా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు మరో 11 రోజులు మిగిలి ఉండగానే పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడింది. సభ్యులంతా సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని లోక్‌సభాపతి ఓం బిర్లా సూచించారు. కొంతమంది ఎంపీలు క్వారంటైన్లోకి వెళ్లిపోవడంతోపాటు కరోనా విస్తరిస్తున్నందున తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీలు పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండటంతో పార్లమెంట్ నిరవధిక వాయిదాకు నిర్ణయించారు. రాజ్యసభలో కేంద్ర పాలిత ప్రాంతాల బడ్జెట్‌పై చర్చ అనంతరం త్వరలో పదవీ విరమణ చేయనున్న 57 మంది సభ్యులకు చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ► రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ బిల్లులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ► స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పార్లమెంట్ ఘన నివాళులర్పించింది. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన భద్రతా సిబ్బందికి కూడా నివాళులర్పించింది. ► జనతా కర్ఫ్యూ పాటించిన మార్చి 22వ తేదీ దేశానికి సూపర్ సండే అని రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభివర్ణించారు. -
ముగిసిన తెలంగాణ అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగంతో ఈ నెల 6న ప్రారంభమైన రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం ముగిశాయి. తొలుత ఈ నెల 20 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయించారు. అయితే ఈ నెల 14న సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ‘కరోనా’పై పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను కుదించారు. దీంతో నిర్ణీత గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. 8 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020–21ను సభ్యులు ఆమోదించారు. ఏడో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలు తెలుపుతూ చర్చ జరగ్గా, ఎనిమిదో తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో ప్రవేశపెట్టారు. హోలీ సందర్భంగా 9, 10 తేదీల్లో విరామం అనంతరం 11న ప్రారంభమైన అసెంబ్లీలో రెండు రోజుల పాటు బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగింది. ఈ నెల 13న ప్రభుత్వ శాఖల వారీగా పద్దులపై చర్చ మొదలై 19 వరకు కొనసాగాల్సి ఉండగా, మూడు రోజుల్లోనే 40 పద్దులపై చర్చించి సభ ఆమోదించింది. శాసనసభ సమావేశాల చివరి రోజు సోమవారం ద్రవ్య వినిమయ, వినియోగ బిల్లులను ఆమోదించిన తర్వాత అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఎనిమిది రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు తీర్మానాలు, ఆరు బిల్లులపై చర్చ జరిగింది. సమావేశాల చివరి రోజు సోమవారం అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించారు. దీం తో పాటు పదేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పొడగింపునకు సంబంధించి పార్లమెంటు ఆమోదించిన ‘126వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019’కు మద్దతుగా తీర్మానం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం ఆరు బిల్లుల ను ప్రవేశ పెట్టగా, ద్రవ్య వినిమయ బిల్లు, ద్రవ్య వినియోగ బిల్లులతో పా టు మరో నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. లోకాయు క్త సవరణ బిల్లు–2020, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లు 2020, లాభదాయక సంస్థల సవరణ బిల్లు, ఎస్‌హెచ్‌జీ వాటా రద్దు బిల్లు 2020 ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు పల్లె ప్రగతి, కరోనా అంశం పై స్వల్పకాలిక చర్చ జరిగింది. మొత్తంగా ఎనిమిది రోజుల పాటు వివిధ అంశాలపై జరిగిన చర్చలో 63 శాతం మంది సభ్యులు ప్రసంగించారు. పార్టీల వారీగా సభ్యులు మాట్లాడిన సమయం టీఆర్ఎస్: 11 గంటల 6 నిమిషాలు, ఎంఐఎం: 5 గంటల 14 నిమిషాలు, కాంగ్రెస్: 7 గంటల 02 నిమిషాలు, టీడీపీ: 27 నిమిషాలు, బీజేపీ: 57 నిమిషాలు, ఇతరులు: 10 నిమిషాలు, ప్రశ్నోత్తరాలు, పద్దులపై మంత్రుల సమాధానం–17 గంటల 47 నిమిషాలు -
సీఏఏతో విద్వేషపు గోడలు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశాన్ని విభజిస్తోందని, బలహీనం చేస్తోందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చేలా, రాజ్యాంగ వ్యతిరేకంగా సీఏఏను కేంద్రం తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ సీఏఏ కేవలం ముస్లింలకే కాకుండా అణగారిన వర్గాలు, పేదలు, మహిళలందరికీ వ్యతిరేకంగా ఉందన్నారు. సీఏఏపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ఎవరికీ భయపడబోమన్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చే నెల ఒకటి నుంచి మొదలుకానున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళ తరహాలో ఎన్పీఆర్ను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఇంకా ఏమన్నారంటే... దేశం కోసం తల నరుక్కుంటా... పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరులను విదేశీయులుగా, విదేశీయులను దేశ పౌరులుగా మారుస్తోంది. సీఏఏ ముస్లిం వ్యతిరేకమని, ముస్లింలు ఈ చట్టానికి వ్యతిరేకమని చూడాల్సిన అవసరం లేదు. ఈ చట్టం పేదలకు వ్యతిరేకం. పెద్దగా చదువు రాని భారతీయులకు వ్యతిరేకం. దేశ మహిళలకు వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఈ చట్టం పేద హిందూ సోదరులకు వ్యతిరేకం. నేను ముస్లిం కావడంపట్ల, భారతీయుడిని కావడంపట్ల గర్వపడుతున్నా. అయితే నన్ను కేవలం ముస్లింగానే చూస్తున్నారు. అలా కాకుండా నన్ను భారతీయ ముస్లింగా చూడాలి. కానీ కొందరు దేశద్రోహి అని, పాకిస్తాన్ వెళ్లాలని అంటున్నారు. నేను ఈ దేశవాసిని. దేశం కోసం అవసరమైతే ప్రాణం అర్పిస్తా... తల నరుక్కుంటా. దేశం కోసం హిందూ, ముస్లిం, సిక్కులంతా ప్రాణాలు అర్పించారు. ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఏ మతాన్నీ ఆచరించని వారిది కూడా. అయితే ప్రస్తుత చట్టం దేశాన్ని విభజిస్తోంది. దేశాన్ని ఏకం చేసే చట్టాలు కావాలి... దేశాన్ని ఏకం చేసే చట్టాలు, ఆలోచనలు మనకు కావాలి తప్ప విద్వేషాలు కాదు. విరిగిన హృదయాలు, దూరమైన ఇద్దరు సోదరులను దగ్గరికి తెచ్చేలా చట్టాలు ఉండాలి తప్ప దూరం పెంచేవిగా కాదు. సీఏఏ వంటి చట్టాలతో ప్రజల మధ్య దూరం పెరిగింది. మనం ఈ దేశంలో సోదరభావంతో కలసిమెలసి బతికామని వేల ఏళ్ల మన చరిత్ర చెబుతోంది. కానీ ఇలాంటి చట్టంతో దేశాన్ని విభజించడంతోపాటు బలహీనపరుస్తున్నారు. దేశంలో విద్వేషపు గోడలు నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను చూసి గర్విస్తున్నా... దేశంలో విద్వేషాలు పెరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి చేసిన ప్రసంగం యావత్ దేశానికి వెళ్తున్న ఆశాకిరణంలా ఉంది. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులను సమ దృష్టితో చూసే వ్యక్తులు ఉన్నారని కేసీఆర్ నిరూపించారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్దామనే సీఎం మాకు ఉన్నారని నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన 8వ రాష్ట్రం తెలంగాణ అయినా వాటిపై సమగ్ర వివరాలతో తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అందరినీ సమ దృష్టితో చూస్తుందనే టీఆర్ఎస్కు మజ్లిస్ దగ్గరగా ఉంది. అందుకే మున్ముందూ టీఆర్ఎస్ చేయి వదలం. టీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలకు చేదోడుగా ఉంటాం. తీర్మానం చేసినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఎన్నార్సీ అక్రమం... 2019 వరకు దేశ పౌరుడిగా ఉన్న నా ఓటు తీసుకొని ప్రధాని కుర్చీలో కూర్చొన్న వ్యక్తి.. దేశ ప్రజల పౌరసత్వంపై వేలెత్తి చూపుతున్నారు. ఎన్నార్సీ అమలు చేస్తే నాకు పౌరసత్వం ఉంటుందో లేదో అనుమానమే. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి సభలో ఉంటానో లేదో కూడా తెలియదు. ఈ చట్టం ఎలా ఉందంటే అక్రమ కొడుకు పుట్టిన ఏడాది తర్వాత తండ్రి పుట్టినట్టు ఉంది. ఎన్నార్సీ ప్రక్రియ పూర్తిగా అక్రమం. దీనికి చట్టబద్ధత లేదు. దేశ ప్రజల గోప్యతకు ఇది భంగం కలిగించేలా ఉన్నందునే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సందేహాత్మక పౌరులు ఎక్కడికెళ్లాలి? ఎవరినైనా సందేహాత్మక పౌరులుగా ప్రకటించే అధికారాన్ని ఎన్నార్సీ కల్పిస్తోందని, ఇది అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అస్సాంలో తండ్రికి పౌరసత్వం లభిస్తే తల్లికి లభించలేదు. తల్లిదండ్రులకు దొరికితే పిల్లలకు దొరకలేదు. భార్యకు దొరికితే భర్తకు దొరకలేదు. కుటుంబంలోని ప్రతి వ్యక్తిపైనా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంచడం సరికాదు. ఒకవేళ గత రికార్డులతో పోలిక కుదరకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌తో పోల్చి సందేహాత్మక పౌరుడిగా ప్రకటిస్తారు. దీనిపై విదేశీయులు.. విదేశీయుల ట్రిబ్యునల్‌కు వెళ్తారు. మరి సందేహాత్మక పౌరులు ఎక్కడికి వెళ్తారు? వారిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాలి. ఒక్కో డిటెన్షన్ కేంద్రంలో 3 వేలకు మించి ఉండరాదు. ఒక్కో డిటెన్షన్ కేంద్రానికి రూ. 45 కోట్లు కావాలి. ఒకవేళ 10 కోట్ల మంది సందేహాత్మక పౌరులుంటే 33 వేల డిటెన్షన్ కేంద్రాలు కావాలి. దీనికితోడు ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి పౌరసత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే బాధితుడు తన జాతీయత నిరుపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ మెయిలింగ్‌కు దారితీస్తుంది. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రశ్నలు... ఎన్పీఆర్లో అడుగుతున్న వివరాలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. చాలా దుఃఖంగా, బాధతో, సిగ్గుతో చెబుతున్నా. మహిళలు ఒకవేళ వారి వయసు చెప్పలేని స్థితిలో ఉంటే అధికారులు వారిని చూసి వయసును బేరీజు వేయాలని, పెళ్లైన తర్వాత శోభనం (కంజ్యూమేషన్ ఆఫ్ మ్యారేజీ) నాటికి మహిళలకు ఉండే వయసును బేరీజు వేయాలని ఎన్పీఆర్ మ్యాన్యువల్‌లో నిబంధనలు పెట్టడం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే. మన అమ్మ, అక్క, చెల్లెళ్ల ఆత్మగౌరవంతో కేంద్రం ఆటలాడుతోంది. చదవండి: దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ -
సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వాటిల్లనివ్వబోమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తెచ్చేవరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రైతును రాజును చేసే వరకు ఖర్చుకు వెనుకాడకుండా పని చేస్తామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సజల సుజల సస్యశ్యామల తెలంగాణను సాకారం చేసే వరకు నిబద్ధతతో పనిచేస్తామని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... గోదావరి నుంచి 950 టీఎంసీలు బాజాప్తాగా తెస్తాం... తెలంగాణకు గోదావరిలో కేటాయించిన 950 టీఎంసీల నీటిని బాజాప్తాగా తీసుకొస్తాం. ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరచుకుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలంత అనుభవం మాకు లేకున్నా ఎగువ, దిగువ రాష్ట్రాలను ఒప్పించి ప్రాజెక్టులను కడుతున్నాం. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సంబంధించి అగ్రిమెంట్ ఉన్నట్లు చూపిస్తే రాజీనామా చేస్తా. కాంగ్రెస్ దాన్ని నిరూపిస్తుందా? వాళ్లు అసమర్థతను అంగీకరించరు. ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ఇప్పుడు సభను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా 530 టీఎంసీల నీటిని గోదావరి నుంచి ఢంకా భజాయించి తెస్తాం. దేవాదుల నుంచి 75 టీఎంసీలు, సీతమ్మసాగర్ ద్వారా 175 టీఎంసీల నీటిని తీసుకొస్తాం. మిషన్ కాకతీయ చాలా వరకు పూర్తయింది. రెండేళ్లలో 1,200 చెక్ డ్యామ్‌లను పూర్తిచేస్తాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్ర జీఎస్డీపీని పెంచుతాం. కాంగ్రెస్ పంథా మార్చుకోవాలి... కాంగ్రెస్ నేతలు పంథా మార్చుకోకపోతే వారికే మంచిది కాదు. మంచిని మంచి అనే సంస్కారం నేర్చుకోవాలి. సమైక్యాంధ్రుల శాపాలు, పనికిరారని చెప్పిన వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోంది. అవన్నీ ‘కాగ్’ లెక్కలే. కేంద్ర మంత్రులు రాష్ట్ర పథకాలను పొగిడారు. రైతు బంధును ఐరాస అభినందించింది. అయినా ప్రభుత్వ మంచిని కాంగ్రెస్ ఒప్పుకోవట్లేదు. సమైక్య పాలనలో రూ. 200 పెన్షన్... సమైక్య రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్ ముష్టి రూ. 200 ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పెన్షన్‌ను రూ. వెయ్యి చేశాం. వారి కడుపు నిండాలని, మంచిగా బతకాలని దాన్ని రూ. 2,016కు పెంచాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ రూ. 4 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడది రూ. 9.69 లక్షల కోట్లకు చేరుకుంది. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశా రు. రూ. 30 కోట్ల అప్పుల్లో ఉన్న దాన్ని మేం రూ. 25 కోట్ల లాభాల్లోకి తెచ్చాం. పాల రైతులకు రూ. 4 ప్రోత్సాహం ఇస్తున్నాం. కామారెడ్డిలో ప్రాసెసింగ్ యూనిట్ పెట్టబోతున్నాం. మైనింగ్ పాలసీ మారుస్తాం.. ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ద్వారా పదేళ్లలో రూ. 50 కోట్లు వస్తే తెలంగాణ వచ్చాక రూ. 2 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు రూ. 5–6 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో పెట్టిన మైనింగ్ పాలసీ బాలేదు. దాన్ని మారుస్తాం. త్వరలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతున్నాం. ఆరేళ్లలో పైసా పెంచలేదు. ఈసారి రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయం సాధిస్తాం. మైన్స్, ఇసుక, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా మరో రూ. 20 వేల కోట్లు సాధిస్తాం. అవసరమైతే మద్యం ధరల పెంపు కాంగ్రెస్ ఎప్పుడైనా మద్యనిషేధం అమలు చేసిందా? కాంగ్రెస్ హయాంలో బెల్టు షాపులే లేనట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో వీధివీధికీ సారా తయారీ ఉండేది. మద్యపానాన్ని తగ్గించేందుకే రేట్లు పెంచాం. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంచుతాం. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం కాబట్టి విద్యుత్ చార్జీలూ పెంచక తప్పదు. ప్రజలను మోసం చేయం. నిజాలు చెబుతాం. నిరుద్యోగులను మోసగించొద్దు.. తెలంగాణ ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పా. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పలేదు. మేం చెప్పినట్లు ఉద్యోగాలు ఇస్తున్నాం. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి? నిరుద్యోగ యువతను మోసం చేయడం విపక్షాలు మానుకోవాలి. వాస్తవాలు చెబితే ప్రజలు గౌరవిస్తారు. డ్రామాలు ఆడుతూ వారిని జులాయిలుగా తయారు చేయొద్దు. 50 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానని నేను చెప్పలేదు. అది సాధ్యమా? దేశాన్ని తెలంగాణ సైతం సాకనుంది.. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 1,12,854 కోట్లే వచ్చాయి. ఇంకా రూ. 1,62,070 కోట్లను కేంద్రమే వాడుకుంటోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారు. భవిష్యత్తులో దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉండబోతోంది. కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా? కేంద్రం మనకు భిక్ష వేస్తుందా? నేడు అత్యధికంగా అప్పులున్న దేశం అమెరికా. వాళ్లేం తెలివి తక్కువ వాళ్లా? తెచ్చిన అప్పు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. తెచ్చిన అప్పుల్లో సాగునీటి ప్రాజెక్టులపై రూ. లక్ష కోట్లు పెట్టాం. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగం అప్పులు తీరిపోతాయి. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకుపైగా సన్న బియ్యం పంట పండబోతోంది. కేంద్రం తరహాలో కనీస వేతనాలు... చేనేత కార్మికులకు నూలు, రంగులను 50% సబ్సిడీపై ఇప్పిస్తున్నాం. కాలిపోయిన ఇళ్లకు పరిహారం ఇస్తాం. కార్మికులకు కనీస వేతనాలను కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రంలో అంత చేస్తాం. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాదు. వారికి కాంగ్రెస్ మద్దతు సరికాదు. వారి విష యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఇది ప్రగతి కాదా..? సాగునీటి ప్రాజెక్టుల్లో ఏం అపోహలున్నాయి. పంట పండుతుందా లేదా? అన్న ఆందోళనకర పరిస్థితి నుంచి భరోసాతో దర్జాగా పంటలు వేసుకునేలా రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. 124 రోజులు కాకతీయ కాలువ సజీవంగా పారుతోంది. అది కాంగ్రెస్ నాయకులకు కనిపించట్లేదా? గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా? యాసంగిలో 38 లక్షల ఎకరాలకుపైగా వరి నాట్లు వేశారు. తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నాం. సీడ్స్ అభివృద్ధి చేయాలని వ్యవసాయ యూనివర్సిటీకి చెప్పాం. వ్యవసాయ రంగంలో రాష్ట్రం 34 శాతం వృద్ధి సాధించింది. ఇది ప్రగతి కాదా?’అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. చదవండి: దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది మరొకరికి కరోనా -
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను సవరించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) ప్రతిపాదనల అమలుపై సోమవారం అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్పీఆర్, ఎన్నార్సీ లాంటి చర్యల నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. సోమవారం సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ పక్షాన సీఎం కేసీఆర్ సభలో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై మాట్లాడారు. ఆ తర్వాత ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడి తీర్మానానికి మద్దతు తెలపగా, బీజేపీ మాత్రం వ్యతిరేకించింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీర్మాన ప్రతులను చించేసి స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తుండగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీర్మానాన్ని సభ ముందు ఆమోదానికి ఉంచారు. మెజార్టీ సభ్యులు మద్దతు తెలపడంతో సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ తీర్మానాన్ని మండలి సైతం ఆమోదించింది. నిప్పులు చెరిగిన కేసీఆర్.. తీర్మానంపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సీఏఏతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోం దని మండిపడ్డారు. లౌకిక, ప్రజా స్వామిక, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కేంద్రం మంటగలుపుతోం దని నిప్పులు చెరిగారు. సీఏఏ కేవలం హిందూ, ముస్లింల సమస్య కాదని.. యావత్ దేశ సమస్య అని, నిమ్న వర్గాలు, సంచార జాతులు, మహిళలు, పేదలు, వలసదారులు ఈ చట్టంతో భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఓసారి విఫలమైన ఈ ప్రయోగాన్ని మళ్లీ అమలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. సీఏఏ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని, దీనిపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా పునఃసమీక్ష చేయాలని విన్నవించారు. టీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్లో సీఏఏను వ్యతిరేకించిందని, దానికే కట్టుబడి అసెంబ్లీలోనూ వ్యతిరేకంగా తీర్మానిస్తున్నామని ప్రకటించారు. సీఏఏతో దేశం విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోందని, ప్రజాస్వామిక, లౌకికవాదులంతా దీన్ని నిరసిస్తున్నారని చెప్పారు. వసుధైక కుటుంబవాదానికి వ్యతిరేకం.. తెలంగాణ తన సొంత నిర్మాణం చేసుకుంటూనే, దేశ నిర్మాణంలో భాగస్వామి అవుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ సామాజిక భద్రతలో రాష్ట్ర భద్రత కూడా ఇమిడి ఉన్నందున సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. వసుధైక కుటుంబంగా కలలు కంటున్న తరుణంలో, సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తున్న ఈ సమయంలో సీఏఏను తెరపైకి తేవడం సమంజసం కాదన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారు. కొందరు ఎంపీలు, కేంద్ర మంత్రులు దుర్మార్గంగా మాట్లాడారు. గోలీమారో సాలోంకు.. అంటూ బాధ్యత మరిచి వ్యహరించారు. దేశానికి ఇది వాంఛనీయం కాదు. దేశం ఇలాందిటి అంగీకరించదు. ఈ రాక్షాసానందం దేశానికి మంచిది కాదు. అంతర్జాతీయంగా మన ఖ్యాతి దెబ్బతింటుంది. దేశానికి వేరే ఇతర సమస్యలేవీ లేనట్లు, ఇదొక్కటే సమస్య అన్నట్లు కల్లోలం లేపొద్దు’అని పేర్కొన్నారు. బర్త్ సర్టిఫికేట్ లేని వారి సంగతేంటి? ‘సీఎంగా నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు. చింతమడక ఇంట్లో పుట్టిన. జన్మపత్రికే ఉంది. బర్త్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తేవాలి. దేశంలో నాలాగే కోట్లాది మంది సామాన్యులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పరిస్థితేంటి? ఇది ఏ ఒక్కరి సమస్యో కాదు. 130 కోట్ల ప్రజలకు సంబంధించిన సమస్య’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునేలా ఓటరు కార్డు ఇచ్చారు. సీఏఏకు ఓటింగ్ కార్డు పనికి రాదు. ఓటరు కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, రేషన్‌కార్డు పనిచేయదంటున్నారు. దేశ ప్రధానిని ఎన్నుకునే ఓటర్ కార్డు కూడా సీఏఏకు పనిచేయదంటే ఎలా? దేశంలోకి చొరబాటుదారుల్ని అనుమతించాలని ఎవరూ చెప్పట్లేదు. మెక్సికో నుంచి వలసలు రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గోడ కడతామన్నారు. మయన్మార్ నుంచి చొరబాట్లు రాకుండా భారత్‌లో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతామంటే మేమూ మద్దతిస్తాం’అని తెలిపారు. వ్యతిరేకిస్తే దేశద్రోహులేనా.. ‘ముస్లింలను మినహాయించి కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది. సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు అవుతారా? అసెంబ్లీ సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానిస్తే అసెంబ్లీలోని సభ్యులంతా దేశద్రోహులేనా. మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎల్కే అడ్వాణీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారు. 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారు. 12 లక్షల మందికి మాత్రమే కార్డులు ఇవ్వగలిగారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైందని యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు తేల్చాయి. అలాంటి విఫల ప్రయోగం మళ్లీ అవసరామా? ఇతర దేశాల నుంచి వచ్చిన కాందిశీకుల పరిస్థితేంటి? ఇతర ప్రాంతాల్లో వలసవచ్చి ఉంటున్న వారి పరిస్థితేంటి? విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా’అని సీఎం తీవ్రస్వరంతో ప్రశ్నించారు. ద్వంద్వ వైఖరి ఎందుకు.. ‘పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ఎన్నార్సీ చేస్తామని ఉంది. ఎన్నార్సీ చేయం.. ఎన్పీఆర్ మాత్రమే చేస్తామని కేంద్ర హోంమంత్రి అంటున్నారు. నివేదిక ఒకటుంటే, చెప్పేది ఇంకోటుంది. దేన్ని నమ్మాలి. అందుకే అగ్గి పుట్టింది. కేంద్రానికి ద్వంద్వ వైఖరి అక్కర్లేదు. దేశంలో 50–60 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? చేయదలుచుకుంటే నేరుగా చేయాలి.. ద్వంద్వ వైఖరి ఎందుకు? పౌరసత్వం ఇవ్వాలనుకుంటే రాద్ధాంతం అవసరం లేదు. నేరుగా ఇంకో విధానంలో అందరికీ ఆమోదయోగ్యంగా ఇవ్వండి. కొత్త ప్రతిపాదనతో ముందుకు వస్తే మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. ఎంఐఎంతో కలసి పనిచేస్తున్నంత మాత్రాన అన్ని అంశాల్లో ఏకాభిప్రాయం ఉండదు. కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయన్నారు. కశ్మీర్ విషయంలో 370 అధికరణ విషయంలో మొట్టమొదట మద్దతిచ్చింది మేమే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి’అని సీఎం కేసీఆర్ వివరించారు. కాగా, ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చలో కూడా సీఎం కేసీఆర్ ఎన్పీఆర్ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్పీఆర్పై స్టే తీసుకురావాలని అక్బరుద్దీన్ అడిగిన అంశంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఒకే భావజాలం ఉన్న ఇతర రాష్ట్రాలను సమీకరించి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఎన్పీఆర్పై స్టే తెచ్చే విషయంలో కేరళ ప్రభుత్వంతో కూడా మాట్లాడతామని పేర్కొన్నారు. తక్షణమే అమలు నిలిపేయాలి: సీఎల్పీ నేత భట్టి ఎన్పీఆర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కేంద్రం కుట్రపూరితంగా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తే సరిపోదని, ఆ చట్టం అమలు కాకుండా నిరోధించినప్పుడే తీర్మానానికి సార్థకత ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం సీఏఏ, ఎన్పీఆర్ వ్యతిరేక తీర్మాన చర్చలో భట్టి మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ దేశ పౌరుడో కాదో నిరూపించుకోవాల్సి రావడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. బర్త్ సర్టిఫికెట్లు, మీ తల్లిదండ్రులు ఎక్కడివారనే సమాచారాలపై ధ్రువపత్రాలు ఇవ్వకపోతే.. శరణార్థి శిబిరాలకు పంపుతామనే కేంద్ర నిర్ణయం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన లాంటి వారెందరో ఎన్పీఆర్ నియామవళికి అనుగుణంగా ఈ దేశ పౌరులమో కాదో నిరూపించుకోవడం కష్టమన్నారు. ఈ దేశ పౌరులకు ఆందోళనకరంగా మారిన సీఏఏ, ఎన్పీఆర్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, మోదీ ప్రభుత్వం ఈ సమస్యను ఒక మత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. పౌరుల భద్రత, క్షేమం కోసం చట్టాలు చేయాల్సిన కేంద్రం కొన్ని వర్గాలను అణచివేసేలా చట్టాలను తీసుకురావడం దారుణమన్నారు. రాజ్యాంగానికి భిన్నంగా చట్టాలను తీసుకొస్తే ఒప్పుకునే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. కేరళ తరహాలో వాటి అమలు ప్రక్రియ నిలిపేస్తూ జీవో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్టు భట్టి చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్యం సిగ్గుచేటు: సుమన్ మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే హక్కు ఎవరికీ లేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. అందరూ సమానమనే రాజ్యంగ సూత్రాన్ని కేంద్రం విస్మరించడం దురదృష్టకరమన్నారు. ఎన్పీఆర్, సీఏఏ చట్టాలతో కేంద్రం విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ గళం విప్పిన ప్రగతిశీల, మేధోవర్గాలపై దాడులు చేస్తోందని, ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. వసుధైక కుటుంబంలా జీవనం సాగిస్తున్న దేశ ప్రజల్లో పౌరసత్వ చట్టం కల్లోలం రేపిందన్నారు. కేసీఆర్‌లాంటి నాయకుడితోనే అన్నివర్గాల ప్రజలు సురక్షితంగా ఉంటారని సుమన్ అన్నారు. తెలంగాణ విడిచి వెళ్లిపోతా: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఏఏ, ఎన్పీఆర్ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిసిన మరుక్షణమే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, తెలంగాణ విడిచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. ఒక వర్గం మెప్పు కోసం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. సీఏఏ విషయంలో కేసీఆర్ సర్కారు తెలంగాణ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎవరికి అన్యాయం జరుగుతోందో చెప్పుకుండా.. ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పాక్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో అల్పాసంఖ్యాకులు అణచివేతకు గురవుతున్నారని, అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిన శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తున్నామే తప్ప.. ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. గతంలోనూ ఎన్నార్సీ, ఎన్పీఆర్ సర్వేలు జరిగాయని కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పుడు ఏదో జరిగిపోతున్నట్లు రాద్ధాంతం చేయడం గర్హనీయమన్నారు. తెలంగాణ ప్రజలకు ధోకా చేయొద్దనే వ్యాఖ్యలపై అధికారపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రకాశ్‌రెడ్డి మధ్యలో స్పీకర్‌ను కోరారు. మరోసారి రాజాసింగ్ మాట్లాడుతుండగా.. స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో తీర్మాన ప్రతులను చించి తన నిరసన తెలిపారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళన కొనసాగించారు. చదవండి: పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం ఎన్పీఆర్పై అనుమానాలొద్దు: అమిత్ షా మైనార్టీల రక్షణ ముసుగులో దాడులు -
4 రోజులు ముందుగానే...
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు సోమవారం ముగియనున్నాయి. కోవిడ్‌పై ప్రభుత్వ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 20 వరకు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందుగానే ముగుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల కుదింపునకు సం బంధించి ఆదివారం సాయంత్రం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చాంబర్లో శాసనసభ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, హరీశ్‌రావు, ఎంఐఎం, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. కోవిడ్‌పై ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కుదించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనసభ, మండలి రెండూ సోమవారం ఉదయం 11 గంటలకు వేర్వేరుగా సమావేశమవుతాయి. చివరి రోజు సమావేశంలో అత్యంత కీలకమైన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బిల్లును ప్రవేశపెడతారు. దీనిపై చర్చించిన తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర బిల్లులతో పాటు, సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తరువాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తారు. అనంతరం మండలి కూడా సీఏఏ వ్యతిరేక తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత వాయిదా పడనుంది. పద్దులపై చర్చ... అసెంబ్లీ సమావేశ తేదీల కుదిం పు నేపథ్యంలో ఆదివారం బడ్జె ట్ పద్దులపై చర్చ జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబం ధించిన 25 పద్దులపై పలు పార్టీ లకు చెందిన 23 మంది సభ్యులు ప్రసంగించారు. ఆదివారం ఉదయం 11గంటలకు పద్దులపై మొదలైన చర్చ రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రుల సమాధానాలు చెప్పారు. -
కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట?
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వానికి కోవిడ్‌తో తాత్కాలిక ఊరట లభించనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ నెల 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలు కానుండగా ఎమ్మెల్యేల వేరు కుంపటితో ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. కోవిడ్ భయంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తత ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పలు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన కీలకమైన బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించింది. శనివారం మధ్యప్రదేశ్ ఆర్థిక మంత్రి తరుణ్ భానోత్ మీడియాతో మాట్లాడారు. ‘వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపైనా నిపుణులతో చర్చిస్తున్నాం’ అని తెలిపారు. అసెంబ్లీ వాయిదాపడితే విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అవసరం కూడా ప్రస్తుతానికి కమల్‌నాథ్ ప్రభుత్వానికి తప్పనుంది. విశ్వాసపరీక్ష జరపాలి: బీజేపీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం గవర్నర్ టాండన్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ..‘కాంగ్రెస్‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ప్రభుత్వం మైనారిటీలో పడింది. బడ్జెట్ సమావేశాలకు ముందుగా ఆదివారమే బలపరీక్ష చేపట్టాలి’ అని గవర్నర్‌ను కోరామన్నారు. కాగా, శుక్రవారం సాయంత్రం విమానాశ్రయం నుంచి వెళ్తున్న బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా ఎదుట నల్ల జెండాలు ప్రదర్శించిన 35 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
పన్నుల్లో వాటా మా హక్కు.. బిచ్చం కాదు
-
ఆర్థిక మాంద్యమంటూనే అన్ని కోట్ల ప్రతిపాదనలెలా...?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సమతుల్యత లోపించిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. ఆర్థిక మాంద్యం ఉందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తక్కువగా ఉంటాయని పేర్కొంటూనే రూ.1.83 లక్షల కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. రూ.30 వేల కోట్లకు పైగా ఉన్న ద్రవ్యలోటును ఎలా పూడుస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ప్రజలపై ఆస్తిపన్ను, ఇతర చార్జీల భారం మోపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోందని అన్నారు. ఇద్దరూ కలిసి వెళ్లండి.. కాళేశ్వరం ద్వారా భూపాల జిల్లాకు నీళ్లివ్వాలని శ్రీధర్‌బాబు కోరడంతో గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. తన నియోజకవర్గానికి నీళ్లిచ్చే అంశమై ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి సానుకూలంగా ఉన్నారని, కాళేశ్వరంతో రాష్ట్ర ముఖచిత్రమే మారనుందని అన్నారు. అందుకే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావాలని కాంగ్రెస్ నేతలను తాను కోరానన్నారు. దీనిపై శ్రీధర్‌బాబు మట్లాడే ప్రయత్నం చేయగా, స్పీకర్ మైక్ ఇవ్వలేదు. అయినా శ్రీధర్‌బాబు నిల్చుని ఉండటంతో ‘మీరూ, గండ్ర వెంకటరమణ ఇద్దరూ కలిసి కాళేశ్వరం వెళ్లిరండి. ప్రాజెక్టు చూసిరండి’అనడంతో అంతా నవ్వుకున్నారు. కేంద్ర సాయం అందకపోతే చలో ఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కరెంట్, రైల్వేలు, 11 సాగునీటి ప్రాజెక్టులు, పింఛన్లు, గృహ నిర్మాణాలకు కేంద్రం నిధులిస్తోందన్నారు. కేంద్రంనుంచి ఒకవేళ రాష్ట్రానికి అందాల్సిన సాయం అందకపోతే అంతా కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేద్దామని పేర్కొన్నారు. -
వారంలో మూడుగంటలే!
న్యూఢిల్లీ: బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదలైన మొదటి వారంలో రాజ్యసభ మూడు గంటలు మాత్రమే సవ్యంగా సాగింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతోనే సమయమంతా గడిచిపోయింది. షెడ్యూల్ ప్రకారం సభ 28.30 గంటలపాటు జరగాల్సి ఉండగా 26 గంటలపాటు అంతరాయం కలిగిందని, కేవలం 2.42 గంటలపాటు మాత్రమే కార్యకలాపాలు సాగాయని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. సమావేశాలు 9.50 శాతమే ఫలప్రదమ య్యాయని పేర్కొన్నాయి. దీంతోపాటు, ఫిబ్రవరి 12, మార్చి 1వ తేదీల మధ్య జరిగిన స్టాండింగ్ కమిటీల సమావేశాలకు సగం మంది ఎంపీలు మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. -
అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు తీసుకున్న చర్యల వివరాలను ఈ నెల 4లోగా సమర్పించాలని, 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పెండింగ్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్రపతి ఉత్తర్వులు, అసెంబ్లీ సమావేశాలపై ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుపై కొన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను పరిశీలకులకు పంపామన్నారు. -
రాజ్యసభలో విజయసాయిరెడ్డి పాత్ర ప్రశంసనీయం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్రను నిర్వహించారని రాజ్యసభ సెక్రటేరియట్ వెల్లడించింది. ప్రజా సమస్యల ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా వినియోగించుకున్నారని బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. రాజ్యసభలో మొత్తం 323 సందర్భాల్లో వివిధ రూపాల్లో 155 మంది తమ గళాన్ని వినిపిస్తే అందులో 83 మంది రెండు కంటే ఎక్కువ సార్లు చర్చల్లోనూ, ప్రత్యేక సూచనలు ఇచ్చే విషయంలోనూ పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి 9 సందర్భాల్లో తన గళాన్ని వినిపించారు. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు 4 అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ దృష్టికి అనేక సమస్యలు తీసుకురావడంతో పాటుగా నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. -
విజయసాయి రెడ్డి పనితీరుకు ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి పనితీరును రాజ్యసభ ప్రశంసించింది. బడ్జెట్ సమావేశాల్లో ప్రశంసనీయమైన రీతిలో క్రియాశీల పాత్ర నిర్వహించారని రాజ్యసభ సెక్రెటేరియట్ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రజా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో తనకు గల అవకాశాలను రాజ్యసభలోని ఇతర సభ్యుల కన్నా చాలా చక్కగా విజయసాయిరెడ్డి వినియోగించుకున్నారు. (‘రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల పెన్షన్‌ను సవరించాలి’) విజయసాయి రెడ్డి తొమ్మిది సార్లు అవకాశాన్ని వినియోగించుకుని చర్చల్లో అత్యుత్తమ భాగస్వామ్యాన్ని కనబరిచినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది. జీరో అవర్ ప్రస్తావన, ప్రత్యేక ప్రస్తావన, ఒక మౌఖిక ప్రశ్న, మౌఖిక ప్రశ్నలకు నాలుగు అనుబంధ ప్రశ్నలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, సాధారణ బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడారు. ఇవి కాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైనా, సాధారణ బడ్జెట్‌పైనా చర్చలో కూడా సాయిరెడ్డి పాల్గొని ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకు రావడంతో పాటుగా పలు నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. కాగా రాజ్యసభ సమావేశాల్లో 155 మంది సభ్యులు జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావనలు, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ, బడ్జెట్‌పై చర్చ, బిల్లులపై మాట్లాడారు. (‘ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చారిత్రక తప్పిదం’) -
2020 బడ్జెట్ కేంద్రానికి పెద్ద సవాలే
-
సీఏఏను గట్టిగా సమర్థించండి
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పార్లమెంట్లో విపక్షాలను సమర్థంగా ఎదుర్కోవాలని ఎన్డీయే పక్ష సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం తప్పేం చేయలేదని, చట్టాన్ని సమర్థిస్తూ గట్టిగా వాదనను విన్పించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీయే పక్షాలు శుక్రవారం సమావేశమయ్యాయి. సమావేశంలో మోదీ పేర్కొన్న అంశాలను పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ మిత్రపక్ష నేత ఒకరు వెల్లడించారు. ‘సీఏఏ ముస్లింలపై వివక్ష చూపుతుందన్న ప్రతిపక్షాల వాదనను గట్టిగా తిప్పికొట్టండి. ముస్లింలతో పాటు పౌరులంతా మనకు సమానమేనని స్పష్టం చేయండి’ అని ప్రధాని చెప్పారన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సంబంధించిన ప్రశ్నావళి నుంచి కొన్ని ప్రశ్నలను తొలగించాలని సమావేశంలో మిత్రపక్షం జేడీయూ ప్రభుత్వాన్ని కోరింది. ఎన్పీఆర్ నుంచి తల్లిదండ్రుల వివరాలను కోరే ప్రశ్నలను తొలగించాలని కోరామని, దానికి హోంమంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారని జేడీయూ ఎంపీ లలన్ సింగ్ వెల్లడించారు. శిరోమణి అకాలీదళ్ కూడా తమ సూచనను సమర్ధించిందన్నారు. తల్లిదండ్రుల వివరాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వడం ఐచ్ఛికమేనని ఇప్పటికే కేంద్రమంత్రి జవదేకర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలు ఫలవంతమవుతాయని, సభ్యులు నాణ్యత కలిగిన చర్చను జరుపుతారని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ శుక్రవారం అన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇరు సభలూ ఆర్థిక సమస్యల గురించి, ప్రపంచ ఆర్థిక మందగమన నేపథ్యంలో భారత్ ఎలా ముందుకు సాగాలో వంటి వాటిపై విస్తృతంగా చర్చించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ దశాబ్దానికి గట్టి పునాదులు ఈ బడ్జెట్‌తోనే ప్రారంభమవ్వాలని చెప్పారు. ఈ సెషన్లో ఆర్థిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు చెప్పారు. దళితులు, మధ్యతరగతివారు, అణచివేతకు గురైన వారు, మహిళల సాధికారత కోసం ఈ దశాబ్దంలో కూడా తాము కష్టపడతామని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ఫిబ్రవరి 11 వరకూ, రెండో దశ సమావేశాలు మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకూ జరగనున్న సంగతి తెలిసిందే. విపక్షాల చర్య అప్రజాస్వామికం: జీవీఎల్ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేసిన విపక్షాల చర్య అప్రజాస్వామికమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు, 2022 నాటికి కొత్త భారత నిర్మాణానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రపతి వివరించారు. దీనిపై సభ్యులంతా హర్షద్వానాలతో స్వాగతించగా, కొందరు ప్రతిపక్ష నాయకులు నలుగురు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయాలని ప్రయత్నం చేశారు. ఇది అప్రజాస్వామికం. వారంతా క్షమాపణలు చెప్పాలి’ అంటూ డిమాండ్ చేశారు. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
కేంద్రం వైఖరి మారాలి
-
మాటకు మాట: భట్టి వర్సెస్ కేసీఆర్
-
అందరికీ ఆరోగ్య‘సిరి’
సాక్షి, అమరావతి: పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. అంతేగాక ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంతివైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే. దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది. 108, 104 బలోపేతం వైఎస్సార్ హయాంలో అద్భుతంగా నడిచిన 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల సేవలు ఆయన మరణానంతరం నిర్వీర్యం కావడం తెలిసిందే. ఇప్పుడు వీటికి కూడా పునర్వైభవం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. మండలానికొక వాహనాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలకు 323.14 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 80 శాతం పైనే. ఇందులో 108 వాహనాలకు రూ.143.38 కోట్లు, 104 వాహనాలకు రూ.179.76 కోట్ల నిధులు వెచ్చించనుంది. క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర సర్కారు వారికోసం ఈ బడ్జెట్లో రూ.455 కోట్లను కేటాయించింది. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.పది వేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచడం తెలిసిందే. గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ప్రధానమైన వాటికి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో) ఆరోగ్యశ్రీ - 1,740 108 - 123.09 104 - 141.47 ఆశావర్కర్లకు - 455 ఉద్యోగుల వైద్యానికి - 200 రేడియాలజీ సర్వీసులు - 25 మందుల కొనుగోళ్లకు - 126 -
ఏపీకి ‘నవరత్నాల’ హారం
అయిదుకోట్లమంది తనపై పెట్టుకున్న ఆశలనూ... తన మాటపైనా, వైఎస్సార్ కాంగ్రెస్ వెలు వరించిన మేనిఫెస్టోపైనా సంపూర్ణ విశ్వాసం ఉంచి అఖండ మెజారిటీ అందించిన ప్రజానీకం నమ్మకాన్ని వమ్ము చేయలేదు. సుదీర్ఘ ‘ప్రజా సంకల్ప యాత్ర’ పొడవునా భిన్న వర్గాల ప్రజల కష్టాలనూ, కన్నీళ్లనూ స్వయంగా చూసి... వారి ఆవేదనలను ఆకళింపు చేసుకుని, వారికిచ్చిన భరోసాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మరించలేదు. సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ, రైతు సంక్షేమానికి కట్టుబడుతూ, సకల వర్గాల అవసరాలనూ స్పృశిస్తూ రూ. 2,27,975 కోట్ల వ్యయంతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా రెవెన్యూ ఆదాయం రూ. 1,78,697 కోట్లు వస్తుందని, రెవెన్యూ వ్యయం రూ. 1,80,475.93 కోట్లు ఉండగలదని ఆయన అంచనా వేశారు. మే 30న ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విధంగానే మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాల్లోని ప్రతి అంశానికీ ఈ వార్షికబడ్జెట్ ప్రాధాన్యమిచ్చింది. రూ. 28,866 కోట్లతో రూపొందించిన వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ను రాష్ట్ర మున్సిపల్, పట్టణా భివృద్ధి మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ముందు ఉంచారు. పదాడంబరం వెనకా, సాంకేతిక పదాల మాటునా దాక్కోవాలన్న ప్రయత్నం ఈ రెండు బడ్జెట్లలోనూ లేదు. ఏ ఏ అంశానికి ఎంతెంత మొత్తం కేటాయిస్తున్నారో స్పష్టంగా చెప్పారు. గోప్యతకు ఎక్కడా తావీయలేదు. ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన విలువైన మాటను ఉటంకించారు.‘‘ఈ దేశ నిర్మాణంలో తనకు కూడా ఒక పాత్ర ఉన్నదని ఈ దేశంలోని ప్రతి పేద వ్యక్తి అర్ధం చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తి నివసించగలిగేలా ఉండాలి’’ అని ఆయన చేసిన ఉద్బోధను గుర్తుచేశారు. ఈ వార్షిక బడ్జెట్ ఆ ఉద్బోధను మార్గదర్శకంగా తీసుకున్నదని ఇందులోని ప్రతి పుటా చాటిచెబుతుంది. ఒకపక్క రైతాంగ సంక్షేమాన్ని, మరోపక్క సామాజిక సంక్షేమాన్ని కొనసాగిస్తూనే రాష్ట్రాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. విద్య, వైద్యం, మౌలిక రంగాలకు ఇతోధిక కేటాయింపులు చేశారు. రైతుల సంక్షేమానికి రూ. 21,161. 54కోట్లు కేటాయించడంతోపాటు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 12,500 చొప్పున ఇచ్చే పెట్టుబడి సాయం కోసం రూ. 8,750 కోట్లు వెచ్చించదల్చుకున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ పంటల బీమా–వైఎస్ఆర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రూ. 1,163 కోట్లు కేటాయించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యవసరం. ఎందుకంటే అయిదేళ్ల చంద్రబాబు పాలన పర్యవసానంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తీవ్రమైన కరువు ఒకవైపు, వరస తుఫాన్లు మరోవైపు రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తే గత ప్రభుత్వం ఏ మాత్రం ఆదుకోలేదు. సరిగదా వారికి అందాల్సిన పెట్టుబడి రాయితీ, వడ్డీ మాఫీలకు కూడా ఎగనామం పెట్టింది. ఇన్నిటి పర్యవసానంగా అష్టకష్టాలూ పడుతున్న రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం నడుంకట్టింది. కనుకనే ఈ బడ్జెట్లో రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ. 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ప్రతిపాదించారు. కౌలు రైతుల సంక్షేమానికి అవసరమైన చట్టబద్ధ చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇంకా రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ వగైరాలకు ప్రత్యేక కేటా యింపులు చేశారు. గోదాములు నిర్మించడానికి, రైతులు విషాదకర పరిస్థితుల్లో మరణించిన సందర్భాల్లో తగిన పరిహారం చెల్లించి ఆదుకోవడానికి నిధులు కేటాయించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ. 13,139 కోట్లు కేటాయించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలేమిటో, వాటిని నివారించేందుకు అనుసరించాల్సిన వ్యూహమేమిటో ఖరారు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అత్యంత కీలకమైనది. రూ. 6,455 కోట్ల కేటాయింపుతో చేసిన ఈ ప్రతిపాదన వల్ల పిల్లలను పాఠశాలలకు పంపే 43లక్షలమంది తల్లులకు రూ. 15,000 చొప్పున అందుతుంది. నవరత్నాల్లో ‘అమ్మ ఒడి’ని 1 నుంచి పదో తరగతి వరకూ చదివే పిల్లలకు వర్తింపజేస్తామని చెప్పగా, దాన్ని ఇంటర్మీడియెట్‌కు కూడా విస్తరించి చెప్పినవి మాత్రమే కాదు...చెప్పనివి కూడా చేస్తానని జగన్ చాటారు. అలాగే ఉన్నత చదువులు చదువుకునేవారి కోసం ‘జగనన్న విద్యా దీవెన పథకం’ ఏర్పాటుచేసి ఇందుకోసం రూ. 4,962.30 కోట్లు కేటాయించారు. మొత్తంగా విద్యారంగానికి 11,399.23 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వం విద్యకిచ్చే ప్రాధాన్యతను తెలుపుతుంది. విద్యారంగానికి వెచ్చించే డబ్బు వృధాగా పోదు. అట్టడుగు వర్గాలవారు బాగా చదువుకుని, ఉన్నత విద్యావంతులుగా ఎదిగితే వారి కుటుం బాలు మాత్రమేకాదు... మొత్తం సమాజమే ఉన్నత స్థితికి చేరుతుంది. కనుకనే ఈ కేటాయింపులు ఎంతో ముందుచూపుతో రూపొందించినవి. ఆరోగ్యానికి కూడా ఈ బడ్జెట్ ప్రాముఖ్యతనిచ్చింది. అందుకోసం రూ. 11,399 కోట్లు కేటాయించింది. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి ప్రతి పాదనలు రూపొందించింది. ‘మీరు చూచిన నిరుపేద, అత్యంత బలహీన వ్యక్తి ముఖాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు చేపట్టబోయే చర్య అతనికి ఏ విధంగానైనా ఉపయోగపడుతుందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి...’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాటను బుగ్గన తన ప్రసంగంలో ప్రస్తా వించారు. ఈ బడ్జెట్ ఆద్యంతమూ ఆ మాటనే ప్రతిఫలించింది. పాలకులు మెదడుతో కాదు... హృదయంతో సమస్యను ఆకళింపు చేసుకుంటే ఎంతటి మెరుగైన ప్రతిపాదనలు ముందుకొస్తాయో చెప్పడానికి ఈ బడ్జెట్ ఉదాహరణ. -
రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 అమలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భద్రతను పెంచారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 అమలు చేయనున్నట్లు ఏపీ డీజీపీ కార్యాలయం అధికారులు గురువారం వెల్లడించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా పోలీస్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అసెంబ్లీ పరిసరాలు, సీఎం నివాస ప్రాంతాల వద్ద ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతితో విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. -
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు
-
ఎకానమీపై ఆర్థిక సర్వే సూచనలు
-
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
గవర్నర్‌తో సీఎం కేసీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 10మందికి మంత్రులుగా ఛాన్స్ దక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యేలోపే కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేబినెట్లో ఎవరెవరు ఉండాలనే విషయంలో అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులతోపాటు కొత్త వారిని కలిపి మంత్రివర్గ కూర్పు ఉండనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా పదవుల కేటాయింపు కీలకం కానుంది. మరోవైపు సోమవారం తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్
-
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం
-
తుడిచిపెట్టుకుపోయిన మలిదశ
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలి దశ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఉభయ సభలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. సమావేశాల చివరి రోజూ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. మొదటి రోజు నుంచి ఏపీకి ప్రత్యేక హోదా, బ్యాంకింగ్ కుంభకోణాలు, కావేరీ బోర్డు ఏర్పాటు, తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంపు తదితర అంశాలపై విపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగించాయి. రెండో దశలో ఉభయ సభలు 22 సార్లు సమావేశం కాగా ఒక్కరోజు కూడా కార్యకలాపాలు సాగలేదు. బడ్జెట్ సమావేశాల రెండు దశల్లోను లోక్‌సభ 29 సార్లు, రాజ్యసభ 30 సార్లు సమావేశం కాగా.. ఉభయ సభల్లోను కలిపి 250 గంటల పనిదినాలు వృథా అయ్యాయి. సభలో కొన్ని పార్టీల ఆందోళనల నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం నోటీసుల్ని కూడా లోక్‌సభ చర్చకు చేపట్టలేదు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 9 వరకూ తొలి దశ సమావేశాలు సాగాయి. లోక్‌సభలో 127 గంటలు వృథా లోక్‌సభ నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ మహాజన్ మాట్లాడుతూ.. ‘బడ్జెట్ సమావేశాల రెండు విడతల్లోను సభ 29 సార్లు సమావేశమైంది. మొత్తం 34 గంటల 5 నిమిషాలు పనిచేయగా.. అంతరాయాలు, వాయిదాల వల్ల మొత్తం 127 గంటల 45 నిమిషాలు వృథా అయ్యాయి. మొత్తం 580 ప్రశ్నల్ని సభ్యులు లోక్‌సభ ముందుంచగా.. కేవలం 17 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానమిచ్చారు’ అని చెప్పారు. గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు 2017లు లోక్‌సభ ఆమోదం పొందిన వాటిలో ఉన్నాయి. ‘ఈ రోజు చివరిరోజు.. సభ సజావుగా సాగేందుకు మీరు సిద్ధంగా లేకపోతే నిరవధికంగా వాయిదా వేస్తా. చర్చ జరిగేందుకు దయచేసి సహకరించండి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే అన్నాడీఎంకే సభ్యులు పోడియం వద్ద నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 121 గంటల వృథా రాజ్యసభలోను అదే పరిస్థితి కొనసాగింది. ప్రతిపక్షాల నిరసనల నేపథ్యంలో సభను చైర్మన్ వెంకయ్య నిరవధికంగా వాయిదా వేశారు. బడ్జెట్ సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 30 సార్లు సమావేశం కాగా 44 గంటలపాటు సభా కార్యకలాపాలు కొనసాగాయని, 121 గంటల సమయం వృథా అయ్యిందని వెంకయ్య నాయుడు వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలు వృథా కావడానికి కాంగ్రెస్ కారణమని ఆరోపిస్తూ.. పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద కేంద్ర మంత్రులు ఆందోళన నిర్వహించారు. -
మా వేతనాలు వదులుకోబోం: శివసేన
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ మలివిడత సమావేశాలు కొనసాగని కారణంగా.. 23 రోజుల వేతనాన్ని వదులుకుంటున్నామన్న బీజేపీ నిర్ణయంపై ఎన్డీయే పక్షాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ వేతనాలు వదులుకోబోవటం లేదని శివసేన స్పష్టం చేసింది. వేతనాల విషయంలో తమను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడింది. పార్లమెంటు నిరసనలతో వాయిదా పడేందుకు ప్రభుత్వం తీరే కారణమని శివసేన విమర్శించింది. అటు ఆర్ఎల్ఎస్పీ చీఫ్, కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ కూడా వేతనాల విషయం తమకు తెలియదన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా బీజేపీ నాయకత్వం నిర్ణయంపై విభేదించారు. కాగా, మొత్తం 400 మంది ఎన్డీయే ఎంపీ (ఉభయసభలు)ల 23 రోజుల వేతనం రూ.3.66 కోట్లను వదులుకోనున్నట్లు గురువారం కేంద్ర మంత్రి అనంత్ కుమార్ వెల్లడించారు. -
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ
-
కేంద్రంపై వెంకయ్య నాయుడు అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు చొరవ చూపటం లేదంటూ ఆయన అసంతృప్తి వెల్లగక్కారు. శుక్రవారం ఆయన సభలో మాట్లాడుతూ... ‘15 రోజులుగా సభలో ఒకే తరహా పరిస్థితి. ప్రారంభం.. వాయిదా. రాజ్యసభ చైర్మన్‌గా నా వంతు ప్రయత్నం నేను చేశా. కానీ, అవేవీ ఫలించలేదు. ఇది పెద్దల సభ. ప్రజల నుంచి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. గతంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు అధికార పక్షం చొరవ తీసుకుని ప్రతిపక్షాలతో చర్చించి సభ సజావుగా సాగేందుకు తొడ్పడ్డాయి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎందుకు కనిపించటం లేదంటూ? ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సభలో చర్చించాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయని.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జోక్యం చేసుకుని విపక్షాలతో చర్చించి సోమవారం కల్లా పరిస్థితిని ఓ కొలిక్కి తెస్తారని భావిస్తున్నట్లు ఆయన సభలో తెలిపారు. అప్పటికీ సభలో అదే తీరు కొనసాగితే మాత్రం ఇక ఎంపీలకే విజ్ఞతను వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో హెడ్సెట్ విసిరిన కోమటిరెడ్డి
-
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర సంఘటన
-
ఎన్నో దెబ్బలు తిన్నా.. ఇది ఓ లెక్కా..
సాక్షి, అమరావతి : మార్చి 29న ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హిందూపూర్ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి అమరావతి వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ రామకృష్ణ సినీ స్టూడియోలో తొలిషెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. నందమూరి తారక రామారావు వాస్తవ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇదని, ఎన్నికల సందర్భంగా తీసే సినిమా కాదన్నారు. సినిమా షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది చాలా పేర్లు సూచించారని, కానీ ఎన్టీఆర్‌ను మించిన పేరు లేదని భావించి ఆపేరునే ఖరారు చేశామని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్‌కు అభిమానులున్నారని, ప్రతిఒక్కరు అభినందించిన వారేనని అన్నారు. ఇటీవలే శష్త్ర చికిత్స చేసుకున్న బాలకృష్ణ, కట్టుతోనే అసెంబ్లీకి వచ్చారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జీవితంలో తగిలిన ఎన్నో దెబ్బలతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేమీ కాదని బాలయ్య వారికి సమాధానం ఇచ్చారు. మార్చి31 నుంచి ఏప్రిల్ 1 వరకూ లేపాక్షి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హంద్రీనీవా సుజల స్రవంతికి జలహారతి నిర్వహించి ఉత్సవాలను ప్రారంభిస్తామని తెలిపారు. -
నేటి నుంచే మలిదశ పోరు
-
నేటి నుంచే మలిదశ పోరు
న్యూఢిల్లీ: పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు నెల రోజుల విరామం అనంతరం జరగబోతున్న ఈ సమావేశాల్లో.. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం సహా ఇతర బ్యాంకు కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. బ్యాంకు కుంభకోణాలపై 267 నిబంధన కింద చర్చించాలని ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌కు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు. బ్యాంకు కుంభకోణాలపై ప్రధాని సమాధానం కోసం పట్టుబడతామని ఆయన తెలిపారు. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ‘ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు’ను తీసుకొస్తున్నామని పేర్కొంటూ ప్రతిపక్షాల ప్రశ్నలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అధికారాలు సంక్రమిస్తాయి. ఈ బిల్లుకు గురువారమే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాల్ని ప్రతిపక్షాలు ఇంతవరకూ ఖరారు చేయకపోయినా.. ఒకట్రెండు రోజుల్లో సమావేశం కావచ్చని తెలుస్తోంది. బ్యాంకు కుంభకోణాలతో పాటు దళితులు, మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, రైతుల సమస్యలు, దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం తదితర అంశాలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ అరెస్టు నేపథ్యంలో.. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపును పార్లమెంటులో నిలదీస్తామని ఆనంద్ శర్మ తెలిపారు. సమావేశాలపై సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. పీఎన్బీ కుంభకోణం ఎలా చోటుచేసుకుందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. ఇతర ప్రతిపక్షాలతో కలిసి ప్రభుత్వ తీరును ఉభయ సభల్లో ఎండగడతామని తృణమూల్ నేత డెరెక్ ఒబ్రియెన్ తెలిపారు. పలు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల మలిదశలో సాధారణంగా వివిధ శాఖలకు అవసరమైన నిధుల కేటాయింపుపై చర్చలు కొనసాగుతాయి. అలాగే ఆమోదం కోసం ఉభయ సభల్లో ప్రభుత్వం కొన్ని బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపు(సవరణ)బిల్లు 2017, ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు, డెంటిస్ట్స్ (సవరణ) బిల్లును మంగళవారం ప్రవేశపెడతారు. మోటారు వాహనాల(సవరణ) బిల్లు 2017, ద స్టేట్ బ్యాంక్స్(రద్దు, సవరణ) బిల్లు 2017ను సమావేశాల మొదటి రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లోనే ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందేందుకు ప్రతిపక్షాలతో సంప్రదింపుల్ని కేంద్రం ముమ్మరం చేయనుంది. -
బడ్జెట్ సమావేశాల్ని బహిష్కరించిన వైఎస్సార్సీపీ
-
మార్చి 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
-
‘కేసీఆర్ కావాలనే ఇలా చేస్తున్నారు’
హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అధికారం చేప్పట్టిన వెంటనే నిర్ణయం తీసుకోకుండా సింగరేణి ఎన్నికలు వచ్చే వరకు జాప్యం చేశారని ఆరోపించారు. 2014 లోనే వారసత్వ ఉద్యోగాలు అమలు చేస్తే ఇలాంటి సమస్య వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ రెండేళ్లు జాప్యం చేయడం వల్లే ఈ సమస్య తెరపైకి వచ్చిందని చెప్పారు. అన్‌ఫిట్ అయిన కార్మికుల కుటుంబానికి ఉద్యోగం ఇస్తానంటే ఎవరు అడ్డుకోరన్నారు. వ్యూహాత్మకంగానే సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్నారు. రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్ ఇలా చేశారని.. అందులో భాగంగానే హైకోర్టులో సమాధానం ఇవ్వడం లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. సుప్రీంకోర్టులో నైనా కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కేసీఆర్ కు ఆయన సూచించారు. లేదంటే సింగరేణి కార్మికులకు సీఎం క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
బడ్జెట్ అంతా బూటకం
-
ఆచరణాత్మక కాదు కవితాత్మక బడ్జెట్
-
'ప్రజలకు విశ్వాసం కలిగేలా..'
హైదరాబాద్ : బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రతులతో తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయల్దేరే ముందు సోమవారం ఉదయం ఈటల విలేకరులతో ముచ్చటించారు. అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణను తెచ్చుకున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉండాలనే సంకల్పంతో.. ఏ వర్గాలు అయితే అభివృద్ధి చెందలేదో.. ఆ వర్గాల అభివృద్ధే ఎజెండాగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. కుల వృత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలగలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. -
బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
-
బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: రేపు (సోమవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర బడ్డెట్ పై చర్చించేందుకు తెలంగాణ కేబినెట్ ఆదివారం రాత్రి భేటీ అయింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం గవర్నర్ నరసింహన్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. సభలో శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. నేడు అసెంబ్లీకి సెలవుదిన కావడంతో సోమవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేబినెట్ భేటీలో చర్చించారు. 15, 16 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ జరగనుంది. -
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ..
తాత్కాలిక భవన సముదాయంలో ప్రారంభం కానున్న సమావేశాలు సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి సుమారు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా తాత్కాలిక అసెంబ్లీలో శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పక్కనే నిర్మించిన తాత్కాలిక శాసనసభా ప్రాంగణంలో సోమవారం తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వం విస్మరించిన హామీలనే అస్త్రాలుగా మలుచుకుని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శాసనసభా సమావేశాల్లో నిలదీయనుంది. రాష్ట్రానికి సంజీవని అయిన ప్రత్యేక హోదాను ప్యాకేజీల కోసం, ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని పక్కన పడేసిన అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నించనుంది. రైతు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇలా అంశాల వారీగా ప్రజాసమస్యలను లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. ప్రతిపక్షంపై ఎదురుదాడికి పాలకపక్షం సమాయత్తమైంది. 13న సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాక, 28 వరకు అసెంబ్లీ కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. కొత్త రాష్ట్రం.. కొత్త అసెంబ్లీ..: 61 ఏళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంతం మారుతోంది. 1956 నవంబరు 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి హైదరాబాద్‌లోని ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే ప్రాంగణంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సమావేశాలు జరిగాయి. ఆఖరి సారిగా గత ఏడాది సెప్టెంబరు 8,9,10 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు అక్కడే కొనసాగాయి. ఈ ఏడాది అమరావతిలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. -
ఆసక్తికరంగా మారిన ఆర్థిక సర్వే.. ఏం చెప్తారో?
బడ్జెట్ గడియలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు అంటే నేటి మధ్యాహ్నం (మంగళవారం) ఆర్థిక సర్వే పార్లమెంట్ ముందుకు వస్తోంది. గడిచిన 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని ఈ సర్వేలో సమీక్షించనున్నారు. పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చూపించిన ప్రదర్శనను కూడా ఈ సర్వేలో వివరించనున్నారు. అంతేకాక భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వయిజరీ అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు కలిసి రూపొందించారు. నేడు ప్రవేశపెట్టబోతున్న ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యాంశాలు జీడీపీ అంచనాలు : పెద్ద నోట్ల రద్దు అనంతరం 2017-18 గణాంకాలు, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఎంతో కీలకంగా మారాయి. ఐఎంఎఫ్ ఇప్పటికే 2016-17 భారత వృద్ధి రేటును 6.6 శాతానికి కోత పెట్టింది. ఈ సంస్థ ముందస్తు అంచనాలు 7.6 శాతంగా ఉండేవి. కరెన్సీ బ్యాన్ వినియోగాన్ని తాత్కాలికంగా షాకింగ్లోకి నెట్టేసిందని ఐఎంఎఫ్ వెల్లడించింది. అదేవిధంగా 2017-18 ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును 7.6 శాతం నుంచి 7.2 శాతానికి కుదించేసింది. దీంతో జీడీపీ అంచనాలపై ఆర్థిక సర్వేలో చేయబోయే వ్యాఖ్యనాలపై ఎక్కువగా ఫోకస్ నెలకొంది. పెద్ద నోట్ల రద్దు : డీమానిటైజేషన్పై సుబ్రహ్మణ్యం, ఆయన టీమ్ సభ్యులు ఏం చెప్తారోనని విశ్లేషకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీ అంటే రూ.15.44 లక్షల కోట్ల కరెన్సీ ప్రభుత్వ తీసుకున్న రద్దు నిర్ణయంతో నిరూపయోగంగా మారిన సంగతి తెలిసిందే. వినియోగ వ్యయంపై ఇది భారీగా ప్రభావం చూపింది. వినియోగవ్యయం జీడీపీలో కనీసం 60 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. ఒక్కసారిగా వినియోగ వ్యయం పడిపోవడంతో జీడీపీ వృద్ధి అంచనాలు పడిపోతున్నాయి. యూనివర్సల్ బేసిక్ ఇన్ కమ్ : సామాజిక భద్రత పేరిట ఈసారి ఆర్థిక సర్వేలో ప్రత్యేక ఫీచర్‌గా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఉంటుందని సుబ్రహ్మణ్యం ముందస్తుగానే తన రిపోర్టులో పేర్కొన్నారు. పేదరికం ఆధారంగా డబ్బులు ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం 20 కోట్ల మంది తేలినట్టు సమాచారం. అంతర్జాతీయ అంశాలు : మన ఆర్థికవ్యవస్థపైనే కాక, గ్లోబల్ ఎకానమీపై కూడా చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ పలు వ్యాఖ్యలు చేయనున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, రక్షణాత్మక ఆర్థిక విధానాలపై ప్రపంచంలో చాలా దేశాలు దృష్టిసారించడం వంటి వాటిని సుబ్రహ్మణ్యం ప్రస్తావించనున్నారు. బ్లాక్ మనీ : గత ఏడాది ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో సుబ్రహ్మణ్యం అధిక పన్ను వేయాల్సినవసరం ఉందని నొక్కి చెప్పారు. భారత జీడీపీకి మొత్తంగా పన్నుల ద్వారా వచ్చే కేవలం 5.4 శాతమేనని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పన్నులపై ఎలాంటి ప్రకటన చేయనున్నారోనని ఆసక్తి నెలకొంది. బ్లాక్‌మనీని రూపుమాపడానికి ప్రభుత్వం ఎలా వ్యవహరించనుందో ఆయన ఈ సర్వేలో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. -
వాయిదాలతో కాలక్షేపం!
అనుకున్నట్టే పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు వాయిదాలతో మొదల య్యాయి. చివరి వరకూ అవి ఈ మాదిరిగానే కొనసాగి ముగిసేలా ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించడాన్ని నిలదీస్తామని సమావేశాలకు చాలాముందే కాంగ్రెస్ చెప్పింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేతృత్వంలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఆ పార్టీతోపాటు విపక్షాలన్నీ ఉత్తరాఖండ్‌పై చర్చకు పట్టు బట్టాయి. అటు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది గనుక వీలుపడదని స్పష్టం చేసింది. కనుక సమావేశాలు సజావుగా సాగడానికి సహకరిస్తామని అందరూ హామీ ఇచ్చినట్టు భేటీ అనంతరం స్పీకర్ చెప్పినా ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఈ సంగతి అధికార పక్షానికి కూడా తెలియకపోలేదు. దేశంలో కరువు పరిస్థితి, పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడికి సంబంధించి పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని ఆహ్వానించడంలాంటి అంశాలు ఇప్పటికే ఉండగా అదనంగా అరుణాచల్, ఉత్తరాఖండ్ సంక్షోభాలు వీటికొచ్చి చేరడంవల్ల సమావేశాలు సక్రమంగా సాగబోవని ప్రభుత్వ పెద్దలు ముందే గ్రహించారు. అందుకే పార్లమెంటులో కొత్తగా ఐఐఎం బిల్లు మాత్రమే ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతేకాదు యూపీఏ హయాంలో ఇష్రాత్జహాన్ ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి అఫిడవిట్లలో సవరణలు, అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంవంటి అంశాలను లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని వ్యూహం పన్నింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను వివిధ మంత్రిత్వ శాఖలకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ కమిటీలు అధ్యయనం చేసి ఆయా శాఖల నుంచి వచ్చిన పద్దుల్ని పరిశీలించి, చర్చించి అవసరమైన ఆమోదం ఇచ్చేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేశారు. ఈసారి ఫిబ్రవరి 23న మొదలైన బడ్జెట్ సమావేశాలు మార్చి 16 వరకూ కొనసాగాయి. 40 రోజుల వ్యవధి తర్వాత సోమవారం రెండో దశ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. ఇవి వచ్చే నెల 13 వరకూ కొనసాగవలసి ఉంది. మన రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటు ఉభయ సభలనూ కేవలం రెండు చట్టసభలుగానే చూడలేదు. దేశంలో జరగాల్సిన సామాజిక, ఆర్ధిక మార్పులకు వాటిని సాధనాలుగా భావించారు. దేశాన్ని పట్టిపీడించే సమస్యలపై అవి కూలంకషంగా చర్చించి సామరస్యపూర్వకమైన పరిష్కారాలకు తోడ్పడతాయని విశ్వసించారు. ఎన్నికయ్యే ప్రతినిధులు విశాల ప్రజానీకం ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని వారు కోరుకున్నారు. కానీ జరుగుతున్నదంతా అందుకు భిన్నం. బాధ్యతాయుతమైన చర్చలకు బదులు చట్టసభలు బలాబలాల్ని తేల్చుకునే వేదికలవుతున్నాయి. సభలో మెజారిటీ ఉన్నది గనుక ఏమైనా చేయొచ్చునన్న ధోరణి పాలకపక్షంలో ప్రబలుతున్నది. ఇప్పుడు అరుణాచల్, ఉత్తరాఖండ్‌లలో రాష్ట్రపతి పాలన విధింపు వ్యవ హారాన్నే చూస్తే ఆ చర్యలు మహాపరాధమన్నట్టు భూమ్యాకాశాలను ఏకం చేస్తున్న కాంగ్రెస్...తన ఏలుబడిలో అలాంటి పాపాలకు అనేకానేకసార్లు ఒడిగట్టింది. న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా మారింది లేదు. కేరళలో 1951లో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నాటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. అది మొదలు ఇంతవరకూ మొత్తంగా 111సార్లు దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. అందులో సింహభాగం కాంగ్రెస్ హయాంలో జరిగినవే. ఇప్పుడు రాష్ట్రపతి పాలన విధింపును వ్యతిరేకించే ముందు ఇలాంటి నేరాలు గతంలో తాము కూడా చేశామని అంగీ కరించి, క్షమాపణలు కోరడం ఆ పార్టీ కనీస బాధ్యత. అంతేకాదు... భవిష్యత్తులో ఆ నేరం ఎన్నడూ చేయబోమని కూడా హామీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలా చెప్పడానికి కాంగ్రెస్ సంసిద్ధంగా ఉన్నట్టు కనబడదు. అటు విపక్షంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వాల బర్తరఫ్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్టు కనబడిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకొచ్చి అలాంటి పని చేయడానికి వెరవలేదు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల్లో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం తలెత్తడం పర్యవసానంగా రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదని బీజేపీ వాదిస్తున్నది. అందులో నిజం ఉందనుకున్నా ఆ ప్రభుత్వాలు మైనారిటీలో పడ్డాయో లేదో తేలాల్సింది రాజ్భవన్లలో కాదు... అక్కడి చట్టసభల్లో! అలా తేలాక తీసుకోవాల్సిన చర్యను ముందే తీసుకోవడం రాజ్యాంగపరంగా, నైతికంగా మాత్రమే కాదు...రాజకీయంగా కూడా తప్పిదమని పాలకులు గుర్తించలేకపోయారు. దేశంలో పది రాష్ట్రాలు కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క జనం చెప్పనలవికాని కష్టాలు పడుతున్నారు. ఉన్నచోట ఉపాధి లభించక లక్షలాదిమంది జనం వలస బాట పడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు దిక్కుతోచక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి ఉపశమన చర్యలు తీసుకోవడం తక్షణావసరం. అందుకు తోడ్పడవలసిన పార్లమెంటు సమావేశాలు కాస్తా కీచులాటల్లో చిక్కుకోవడం బాధాకరం. ఇవి సక్రమంగా సాగకపోతే గత ఏడాదిన్నరలో వరసగా మూడు సమావేశాలు వాయిదాల్లో గడిచినట్టవుతుంది. ఇది ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీయడమే కాదు...ప్రపంచ దేశాల్లో మన ప్రజాస్వామ్య వ్యవస్థను నగుబాటు పాలుచేస్తుంది. సరుకులు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతోసహా ఎన్నో కీలక బిల్లులు అనిశ్చితిలో పడిపోయిన ఇలాంటి తరుణంలో ఇరుపక్షాలూ ప్రతిష్టకు పోకుండా ఒక అవగాహనకొచ్చి సమావేశాలు సజావుగా సాగడానికి కృషి చేయాలి. అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి. -
'కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించలేదు'
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కేసులో కోర్టు ధిక్కరణ నోటీసులు స్వీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ నిరాకరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రోజా తరఫు న్యాయవాది తెలిపారు. అయితే నోటీసులు స్వీకరించవద్దంటూ తమకు ఆదేశాలు ఉన్నాయని అసెంబ్లీ కార్యదర్శి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. రోజాను అసెంబ్లీకి అనుమతించాలంటూ ఈ నెల 17న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని లాయర్ గుర్తుచేశారు. నేరుగా మెయిల్ ద్వారా శాసనసభ కార్యదర్శికి కోర్టు ఈ వివరాలు పంపినట్లు వెల్లడించారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని అమలు చేసిఉంటే రోజా సభకు హాజరయ్యేవారని, అయితే అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కనీసం ధిక్కరణ పిటిషన్ కు సంబంధించిన నోటీసులు కూడా స్వీకరించలేదని రోజా తరఫు న్యాయవాది వివరించారు. -
'మాటిమాటికి అబద్ధాలాడుతున్నారు'
హైదరాబాద్: మాటిమాటికి అబద్ధాలాడితే అది ప్రివిలేజ్ కిందకు వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో మాట్లాడుతూ.. కరువు మండలాల గుర్తింపులో రాష్ట్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లాలో రామ్ ప్రాజెక్టు ఉందని, ఆ కారణం చేత కరువు మండలం జాబితాలో ప్రకటించలేదని చెప్పారు. కానీ రామ్ ప్రాజెక్టులో చుక్క నీరు కూడా లేదని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా పట్టించుకోలేదని, కరువు మండలాల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
విపక్ష సభ్యుల ఆందోళనతో రెండోసారి సభ వాయిదా
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం మరోసారి వాయిదా పడింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు అసెంబ్లీని 10 నిమిషాలు వాయిదా వేశారు. అంతకుముందు ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు. -
విపక్ష సభ్యుల ఆందోళనతో ఏపీ అసెంబ్లీ వాయిదా
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించకపోవడంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలంటూ మండిపడ్డారు. ఒకవైపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతూనే ఉన్నా... నల్లదుస్తులు ధరించిన ఎమ్మెల్యేలు నినాదాలు కొనసాగించడంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను వాయిదా వేశారు. అంతకుముందు అధికార పక్ష సభ్యులే ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. అధికారపక్ష సభ్యులతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఏకపక్షంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేశారు. అయినా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో పెద్ద ఎత్తున 'వుయ్ వాంట్ జస్టిస్' అంటూ నినదిస్తూనే ఉన్నారు. -
'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా చర్యల్లేవు
హైదరాబాద్ : తాము ఇప్పటివరకు దాదాపు 20 సార్లు ప్రివిలేజెస్ కమిటీకి ఫిర్యాదుచేసినా ఒక్కసారి కూడా విచారణకు ఆదేశించలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల దుస్తులతోనే శనివారం అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. బుచ్చయ్య చౌదరి ఎంత అసభ్యంగా మాట్లాడుతూ మహిళలను కించపరిచారో చూశామని, ఆయనపై ఫిర్యాదుచేసినా చర్యలు లేవని అన్నారు. బోండా ఉమా అయితే 'మిమ్మల్ని పాతేస్తాం' అన్నా ఆ మాటలను కనీసం రికార్డు నుంచి తొలగించలేదని, చర్యలు తీసుకోలేదని చెప్పారు. రావెల కిశోర్ బాబు విచిత్రమైన భాష మాట్లాడారని, దానిపైనా ఫిర్యాదు చేశామని అన్నారు. ఇక మరోమంత్రి ఉమామహేశ్వరరావు 'మిమ్మల్ని తగలబెట్టేస్తాం, అంతుచూస్తాం' అన్నా చర్యలు లేవని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. 'ఏకంగా సభా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అంతుతేలుస్తా, పిచ్చాస్పత్రిలో చేరుస్తా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సైకోలు, పందులు అంటూ అన్ పార్లమెంటరీ మాటలు ఉపయోగించారు. ఇలా చేస్తే ఎవరికి వాళ్లమీద గౌరవం పెరుగుతుంది' అని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అన్ని ఆధారాలతో మేం ఫిర్యాదుచేస్తే ఏ ఒక్కదానిపైనా విచారణ కూడా జరపడం లేదు. ఎంత స్వార్థంతో వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. స్వయానా స్పీకర్ కోడెల శివప్రసాదరావు కూడా రోజా సస్పెన్షన్ విషయంలో సభ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది అంటారు. ప్రతిపక్షం పూర్తిగా వ్యతిరేకించినా అది ఏకగ్రీవం ఎలా అవుతుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. -
'ఈ రోజైనా సభలోకి రానిస్తారా?'
హైదరాబాద్: ఏపీ శాసనసభలోకి అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం తనను అడ్డుకుంటుందుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. తమ పార్టీకి న్యాయవాదుల మీద, చట్టాల మీద చాలా నమ్మకం ఉందని పేర్కొన్నారు. మా హక్కుల పరిరక్షణకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు. కోర్టు నుంచి వచ్చి సెక్రటరీకి లేఖ ఇచ్చారు. అయినా ఏం జరిగిందో చూశారు, టీడీపీ తనను అసెంబ్లీలోకి రాకుండా చేసిందని చెప్పారు. తాను ఎందుకు సభలోకి రాకూడదో రాతపూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంటకుపైగా శుక్రవారం ఎండలో ఉండి సమాధానం కోసం వేచిచూసినా లాభం లేకపోయిందన్నారు. దీంతో వెంటనే గవర్నర్ నరసింహన్ ని కలవడానికి వెళ్లాల్సి వచ్చింది. తనను ఈరోజైనా సభలోకి రానిస్తారో లేదో, ఎందుకు అనుమతించరో చెప్పాలని ఆ పార్టీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. రోజాను అనుమతించక పోవడంపై నిరసన తెలుపుతూ ఆ పార్టీ సభ్యులు నల్ల దుస్తులతో సభకు వచ్చారు. -
నల్ల దుస్తులతో అసెంబ్లీ చేరుకున్న ఎమ్మెల్యేలు
హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపీ శాసనసభలోకి అనుమతించక పోవడంపై నిరసన తెలపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. నిరసనలో భాగంగా శనివారం నల్ల దుస్తులతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఆర్కే రోజాను సభలోకి అనుమతించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టనున్నారు. న్యాయస్థానాలను గౌరవించనందుకు నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. నేడు బడ్జెట్ లోని పలు డిమాండ్లపై చర్చ జరగనుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శుక్రవారం ఏపీ శాసనసభలోకి అనుమించక పోవడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద వైఎస్ఆర్ సీపీ తమ ఆందోళనను తీవ్రతరం చేయనుంది. -
అసెంబ్లీ వాకిట మార్షల్స్ ‘లా’!
ఎమ్మెల్యే రోజా శాసనసభలోకి వెళ్లకుండా అడ్డగింత సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాసనసభలోనికి వెళ్లనివ్వకుండా, స్పీకర్ ఆదేశాలు లేవంటూ మార్షల్స్ అడ్డుకున్నారు. తాను హైకోర్టు ఆదేశాలతో వచ్చానని, ఆ ఉత్తర్వులను గురువారం నాడే శాసనసభ ఇన్చార్జి కార్యదర్శికి అందజేశానని రోజా పలుమార్లు స్పష్టం చేసినా ఫలితం లేకుండా పోయింది. భారీయెత్తున మోహరించిన పోలీసులు, మార్షల్స్ ఆమెను లోపలికి అనుమతించేందుకు ససేమిరా అన్నారు. ఇందుకు నిరసనగా విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలుత అసెంబ్లీ ప్రాంగణంలో, ఆ తర్వాత గాంధీ విగ్రహం ఎదుట ఫుట్‌పాత్‌పై పార్టీ ఎమ్మెల్యేలతో కలసి బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, వారికి వత్తాసుగా నిలుస్తున్న స్పీకర్ తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు నినాదాలతో హోరెత్తించారు. విపక్షం మండుటెండలో రెండున్నర గంటలసేపు నిరీక్షించినా.. స్పీకర్ నుంచి కానీ, అధికారపక్షం వైపు నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చను స్పీకర్ కొనసాగించారు. ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయడంపై హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులివ్వడం, శుక్రవారం తాను సభకు హాజరవుతానని రోజా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే అడ్డగింత పర్వానికి తెరలేచింది. ఉదయం 8:40 నిమిషాలకు రోజా తన న్యాయవాదులతో కలసి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. వారిని లోపలకు వెళ్లనివ్వకుండా మెయిన్ గేటువద్దనే పోలీసులు అడ్డుకున్నారు. రోజాను లోపలకు తీసుకువెళ్లేం దుకు అప్పటికే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, విశ్వాసరాయి కళావతి, గిడ్డి ఈశ్వరి, వంతెల రాజేశ్వరి, పాముల పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కె.నారాయణస్వామి, గొట్టిపాటి రవికుమార్ తదితరులు అక్కడికి వచ్చి ఉన్నారు. వాగ్వాదం చోటుచేసుకోవడం,మీడియా ప్రతినిధులు కెమెరాలతో అక్కడకు వచ్చి ప్రత్యక్ష ప్రసారాలు చేస్తుండడం.. అదంతా ప్రజల్లోకి వెళ్తుండడంతో అసెంబ్లీ భద్రతా సిబ్బంది న్యాయవాదులను మాత్రం అనుమతించబోమన్నారు. పోలీసులు రోజాను లోపలకు అనుమతించారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలు..! ఎమ్మెల్యేలతో పాటు రోజా అసెంబ్లీ గేటు-2 నుంచి లోపలకు వెళ్లారు. వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లే దారిలోనే మూడు వరుసల బారికేడ్లను భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. అక్కడ పోలీసులు, మార్షల్స్ భారీగా మోహరించారు. తొలి బారికేడ్ వద్దనే చీఫ్ మార్షల్ గణేష్‌బాబు.. రోజాతో పాటు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. లోపలకెళ్లేందుకు అనుమతి లేదనడంతో రోజా, చెవిరెడ్డి , కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నారాయణస్వామి, మహిళా ఎమ్మెల్యేలు ఆయన్ను నిలదీశారు. తాను కోర్టు ఆదేశాలతో వచ్చానని,ఉత్తర్వులను నిన్ననే స్పీకర్ కార్యాలయానికి అందించినందున లోపలకు అనుమతించాలని రోజా కోరారు.అనుమతించరాదని స్పీకర్ ఆదేశించినందున తాము ఏమీ చేయలేమని చీఫ్ మార్షల్ చెప్పారు. స్పీకర్ ఆదేశాలను చూపాలని ఎమ్మెల్యేలు నిలదీయడంతో చీఫ్ మార్షల్ తెల్లముఖం వేశారు. స్పీకర్ మౌఖిక ఆదేశాలిచ్చారన్నారు. ఆ సమయంలో అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి వచ్చి సభ లోపలకు అనుమతించవద్దని స్పీకర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. తనను వైఎస్సార్సీఎల్పీ కార్యాలయం వరకైనా అనుమతించాలని, స్పీకర్ అనుమతి లేకుండా శాసనసభ సమావేశ మందిరంలోకి వెళ్లబోనని రోజా అడిగారు. దీనికీ మార్షల్స్ అంగీకరించలేదు. కోర్టు తీర్పును అమలు చేయబోమని, అసెంబ్లీ లోపలకు అనుమతించబోమని స్పీకర్ నుంచి లిఖితపూర్వక పత్రం ఇస్తే తాము వెనక్కి వెళ్లిపోతామని, ఆ విషయాన్ని కోర్టుకే నివేదించుకుంటామని రోజా తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో నిషేధాజ్ఞలకు సంబంధించి విడుదల చేసే బులెటిన్ కాపీని చీఫ్ మార్షల్ చూపిస్తూ స్పీకర్ ఆదేశాలున్నాయని చెప్పబోయారు. ఆ కాపీని కాకాణి తీసుకొని చదివారు. ప్రాంగణంలో ధర్నాలు, ర్యాలీలు చేయరాదనే బులెటిన్‌లో ఉందని, ఎమ్మెల్యేలను అడ్డుకోమని ఎక్కడ ఉందని ఆయన నిలదీశారు. అయినప్పటికీ లిఖితపూర్వక పత్రాలు తాము ఇవ్వలేమని, లోపలకూ అనుమతించబోమని అసెంబ్లీ అధికారులు చెప్పడమే కాక మరింతమంది మార్షల్స్‌ను ఎమ్మెల్యేల చుట్టూ మోహరింపచేశారు. వ్యవస్థలను గౌరవిస్తా: రోజా శాసనసభా వ్యవహారాలు, న్యాయస్థాన వ్యవహారాలంటే తనకు ఎంతో గౌరవమని ఎమ్మెల్యే రోజా అన్నారు. చట్టసభలో తనకు అన్యాయం జరిగిన తర్వాత న్యాయవ్యవస్థను గౌరవిస్తూ కోర్టుకు వెళ్లానని, అక్కడ న్యాయం జరిగిందని చెప్పారు. అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు ఉత్తర్వులను గురువారమే అందజేశానన్నారు. సభలో ఉన్నవాళ్లంతా చదువుకున్నవాళ్లేనని, ఆర్డర్ చదివితే మంత్రి యనమల రామకృష్ణుడికి, స్పీకర్‌కి అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా ఏమీ చేయరని భావిస్తున్నానని, ఏం జరుగుతుందో చూడాలని రోజా వ్యాఖ్యానించారు. రోజా తరఫున వాదనలు వినిపిం చిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అసిస్టెంట్ రోజా వెంట అసెంబ్లీకి వచ్చారు. ప్రభుత్వం భేషజాలకు పోకూడదు: శ్రీకాంత్‌రెడ్డి రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఎవరూ భేషజాలకు పోకూడదని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థలు మనకు రెండు కళ్లులాంటివని అన్నారు. శాసనసభను, న్యాయ వ్యవస్థను తాము గౌరవిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. రోజా న్యాయవాదిని అడ్డుకున్న పోలీసులు అంతకుముందు తమను అనుమతించకపోవడంతో రోజా కారు నుంచి దిగిపోయిన ఆమె తరఫు న్యాయవాది అసెంబ్లీ ప్రాంగణం బయటే ఉండిపోయారు. 8.55 గంటలకు అక్కడికి చేరుకున్న జగన్ ఆమెను తన వాహనంలో ఎక్కించుకుని లోనికి తీసుకువెళ్లాలని భావించగా మార్షల్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో విపక్ష నేత తీవ్ర స్వరంతో.. ‘ప్రతిపక్ష నేతగా నేను నాతో పాటు ఒకరిని సభా ప్రాంగణంలోకి తీసుకెళ్లవచ్చు. ఆ విషయం మీకు తెలియదా?’ అని ప్రశ్నించారు. అయినా వారు అనుమతించక పోవడంతో ఆమెకు తన గుర్తింపు కార్డును ఇస్తానన్నారు. అందుకూ వారు అంగీకరించకపోవడంతో లోపలికి వెళ్లాక తన కార్యాలయం ప్రతినిధిగా ఆమెకు ‘అనుమతి పాస్’ను పంపుతానని చెప్పారు. అయినా పోలీసులు జగన్ వాహనాలను అడ్డగించి ఆమెను లోనికి అనుమతించలేదు. చివరకు జగన్ తన కార్యాలయ సిబ్బందికి చెప్పి ఆమెకు పాస్ ఏర్పాటు చేశారు. ఇద్దరు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు, మార్షల్స్, మహిళా మార్షల్స్ రోజాతో పాటు ఇతర ఎమ్మెల్యేలను లోపలకు వెళ్లనివ్వకుండా అడ్డుపడ్డారు. వైఎస్ జగన్ బైఠాయింపు ఇంతలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తమ ఎమ్మెల్యేలు బయటే ఉండిపోవడంతో ఆయన కారు దిగారు. కోర్టు ఉత్తర్వులున్నా అసెంబీ ్లలోపలకు వెళ్లకుండా రోజాను ఎందు కు అడ్డుకుంటున్నారని చీఫ్ మార్షల్‌ను, డిప్యూటీ సెక్రటరీని ప్రశ్నించారు.ఇది మంచిపద్ధతి కాదని, ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా వ్యవహరించడం తగదన్నారు. కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోవడమేమిటని నిలదీశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తమ సభ్యురాలిని శాసనసభ లోపలకు వెళ్లనివ్వాలని, అలా వెళ్లనివ్వకపోవడానికి స్పీక ర్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలుంటే చూపాలని చీఫ్‌మార్షల్‌ను డిమాండ్ చేశారు. ఎంతసేపైనా వారినుంచి స్పందన లేకపోవడంతో స్పీకర్ మౌఖికంగా ఆదేశించి ఉన్నట్లయితే అదే విషయాన్ని మీడియా ముందు చెప్పాలని, కనీసం వీడియో ద్వారానైనా చెప్పాలని అడిగారు. లోపలకు అనుమతించలేమని మార్షల్స్ స్పష్టం చేయడంతో విపక్ష నేత ఎమ్మెల్యేలతో సహా అక్కడే బైఠాయించారు. ‘హైకోర్టు తీర్పును గౌరవించని స్పీకర్... సిగ్గు సిగ్గు..., ప్రభుత్వ నిరంకుశవైఖరి... నశిం చాలి, సస్పెన్షన్‌పై స్టే పొందిన రోజాను అసెంబ్లీ లోనికి అనుమతించాలి..’ అంటూ ఎమ్మెల్యేలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభమైన బైఠాయింపు గంటన్నరకు పైగా కొనసాగింది. ఈలోగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ రెండుసార్లు, చీఫ్ మార్షల్ రెండుసార్లు అసెంబ్లీ లోపలకు వెళ్లి పరిస్థితిని పెద్దలకు వివరించి వచ్చారు.విపక్షమంతా గంటలకొద్దీ మండుటెండలోనే ఉన్నా.. స్పీకర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన లేకపోవడంతో.. ‘అసెంబ్లీ లోపలకు వెళ్లనిస్తారా లేదా చెప్పండి... లేదంటే బయటకు వెళ్లిపోతాం’ అని జగన్ ప్రశ్నించారు. అనుమతించబోమని చీఫ్ మార్షల్ అనడంతో జగన్ ఎమ్మెల్యేలతో కలసి ప్రధాన రోడ్డులోకి వచ్చి గాంధీ విగ్రహం ఎదురుగా ఫుట్‌పాత్‌పై బైఠాయించారు. అనంతరం గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. -
హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ నిర్ణయం
ఏపీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సభలో పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వులపై సోమవారం సభ ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటుందని యనమల తెలిపారు. సభ తీసుకున్న నిర్ణయంపై మళ్లీ సభే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ నిర్ణయించడం హర్షణీయమని చెప్పారు. సభ ఆమోదం తెలిపిన తర్వాతే ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేశామన్నారు. మాకు ఎవరి మీదా కోపం లేదు, ఎవరినీ ఇబ్బంది పెట్టాలనీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను దిక్కరించాలనే ఆలోచన తమకు లేదన్నారు. అసెంబ్లీలో విపక్షం లేకపోవడం బాధాకరమని మంత్రి యనమల చెప్పుకొచ్చారు. -
నీళ్లు నమిలిన ఏపీ మంత్రి
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి రావెల్ కిషోర్ బాబు నీళ్లు నమిలారు. శాసనసభకు సర్వాధికారాలు ఉన్నాయని పేర్కొంటున్న నేపథ్యంలో ఎందుకు హైకోర్టులో అప్పీలుకు వెళ్లారని మీడియా ప్రతినిధులు మంత్రి రావెలను ప్రశ్నించారు. దానికి సమాధానం చెప్పకుండానే మంత్రి ఈ విషయంపై దాటవేశారు. దళిత కోణంలోనే మాట్లాడాలంటూ మరో ఎమ్మెల్యే యామినీ బాలకు రావెల సూచించారు. మీడియా ప్రతినిధుల సమక్షంలోనే దళిత కోణం వినిపించాలని రావెల పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై మీడియా అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన బదులివ్వలేక నీళ్లు నమిలారు. రోజాను అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వలేదన్న ప్రశ్నకు కూడా మంత్రి రావెల కిషోర్ బాబు నుంచి సరైన జవాబు రాలేదు. -
'పోయే కాలం వచ్చింది'
హైదరాబాద్: 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీలోకి అనుమతించక పోవడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చింది కనుక వారిని ఎవరూ కాపాడలేరంటూ తీవ్రంగా విమర్శించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని భూదందాలో లక్షలకోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ అసెంబ్లీ సభా నియమనిబంధనలు ఉల్లంఘించడంతో పాటు ఇందుకు పరాకాష్టగా హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పట్ల ఈ ప్రభుత్వ తీరును అందరూ నిరసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్కే రోజాకు అంశంలో జరిగింది, ఒక్క వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి జరిగిన అన్యాయం కాదిది.. న్యాయవ్యవస్థ ఆదేశాలను శాసన వ్యవస్థ బేఖాతరు చేస్తే ఇలాగే ఉంటుందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం అంటూ తేడా లేకుండా ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి ఉండాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి అన్నారు. -
గవర్నర్ వద్దకు వెళ్లిన జగన్, ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసేందుకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దాదాపు గంటకు పైగా బైఠాయించిన తర్వాత.. ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఫిర్యాదులు అందజేయడానికి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను సభలోకి రానివ్వకుండా మార్షల్స్ అడ్డుకోవడం, తదితర విషయాలను గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. -
'ఏపీ ప్రభుత్వం బేషజాలకు పోవద్దు'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై ఎవరూ బేషజాలకు పోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, శాసనవ్యవస్థ మనకు రెండు కళ్లలాంటివని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను దిక్కరించకుండా హుందాతనాన్ని పాటించాల్సిన బాధ్యత మన అందరీపై ఉందని అధికార పక్షానికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేషజాలకు పోకుండా గురువారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
రూల్ 344 కింద వైఎస్ఆర్ సీపీ నోటీసులు
అసెంబ్లీ నిబందన 344 కింద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ కార్యదర్శికి నోటీసులు అందజేసింది. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల ప్రైవేటీకరణ, ఆరోగ్య పనితీరు, బలహీన వర్గాలకు పక్కా గృహాలు అంశాలపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరగాలంటూ తమ నోటీసులలో వైఎస్ఆర్ సీపీ పేర్కొంది. ఈ అంశాలతో పాటు కేంద్ర గృహ పథకాలు, పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రాష్ట్ర భూకేటాయింపులపై చర్చ జరగాలని 344 కింద మూడు నోటీసులను వైఎస్ఆర్ సీపీ నేతలు అందజేశారు. -
అందరి దృష్టి నల్లగొండ మీదే
రౌడీ రాజకీయాల నుంచి విసునూరు వారసుల వరకు హాట్ హాట్ చర్చ రాజగోపాల్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యే వీరేశం అంతకు ముందే నల్లగొండలో మాటల తూటాలు పేల్చుకున్న ఆయా నేతలు కాంగ్రెస్ లోనూ పదవుల పందేరంపై చర్చ జానా, ఉత్తమ్ లను తప్పిస్తారని, కోమటిరెడ్డికి బాధ్యతలిస్తారని ప్రచారం బడ్జెట్ సమావేశాల్లో రాజకీయమంతా జిల్లా చుట్టూనే సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీలగిరి రాజకీయం రక్తి కడుతోంది. వారం రోజులుగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు అసెంబ్లీకి చేరింది. రాష్ట్ర శాసనసభా బడ్జెట్ సమావేశాలను వేదికగా చేసుకుని జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాటల తూటాలు పేల్చుకుంటుండడం, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై చర్చ మరోసారి ప్రారంభం కావడంతో ఇప్పుడు హైదరాబాద్‌లో అందరి దృష్టి మన జిల్లా మీదే ఉంది. ముఖ్యంగా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి సోదరులు అటు శాసనసభలోనూ, ఇటు శాసనమండలిలోనూ మాట్లాడుతుండడం, అందుకు ప్రతిగా జగదీశ్‌రెడ్డి కౌంటర్లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా జరుగుతున్న చర్చలో రౌడీ రాజకీయాలు, విసునూరు రామచంద్రారెడ్డి వారసులంటూ ఆవేశపూరిత వ్యాఖ్యానాలు, ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలుసుననే ఎత్తిపొడుపు మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరపై మరోసారి ఢిల్లీ స్థాయిలో చర్చలు ప్రారంభం కావడం, ఈ పందేరంలో మన జిల్లాకు చెందిన ఉత్తమ్, జానా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఇప్పుడు రాష్ట్రంలో జిల్లా రాజకీయాలే హాట్‌టాపిక్‌గా మారాయి. రౌడీలు... విసునూరు వారసులు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయి. జగదీశ్‌రెడ్డి మంత్రిగా ఉంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నల్లగొండ జిల్లాలో ఉండే 15 ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శాంతిభద్రతల అంశంపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. నల్లగొండలో రౌడీ రాజకీయాలు జరుగుతున్నాయని ఆయన అనడం సీన్‌ను మరింత హాటెక్కించింది. అయితే, అందుకు ప్రతిగా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. డబ్బుతో రాజకీయాల్లో ఏదైనా చేయవచ్చని అనుకునే రీతిలో కోమటిరెడ్డి సోదరులు వ్యవహరిస్తున్నారని, జిల్లాలో విసునూరు రామచంద్రారెడ్డి వారసులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించింది. ఆ పార్టీ పక్షాన జిల్లాకు చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్‌జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ కోమటిరెడ్డి సోదరులను దుయ్యబట్టారు. ఎవరి చరిత్ర ఏంటో జిల్లా ప్రజలకు తెలుసునని, అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో వారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కోమటిరెడ్డి శిబిరం ఎలా స్పందిస్తుందో, చర్చ ఎటువైపుకు దారితీస్తుందో వేచిచూడాల్సిందే. అయితే, అసెంబ్లీలో ప్రతిపక్షాలు డీలాపడిపోయి బడ్జెట్ సమావేశాలు స్తబ్దుగా జరుగుతాయని అందరూ భావించిన తరుణంలో జిల్లాను కేంద్రంగా చేసుకుని రాజకీయాలు వేడెక్కుతుండడం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. డిండి రెండేళ్లలో.. కాగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు విముక్తి కల్పించే డిండి ఎత్తిపోతల పథకంపై స్పష్టత వచ్చింది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తామని సాగునీటి మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నల్లగొండ ఫ్లోరైడ్ విముక్తికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన ఆయన కూడా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాజెక్టు విషయంలో తాత్సారం జరిగిందని, డీపీఆర్ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోకుండా నాన్చిందని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం డిండి ఎత్తిపోతలపై పట్టుదలగా ఉన్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. పదవులు పోయేనా..? టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల ఆరోపణల మాట అటుంచితే... ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరంపై జరుగుతున్న చర్చ అటు ఆ పార్టీలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పుడిప్పుడే జరిగేదా.. అనే మీమాంస ఉన్నా అటు సీఎల్పీ నేతను, ఇటు పీసీసీ అధ్యక్షుడిని ఆయా పదవుల నుంచి తప్పిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభమైన ఈ చర్చలో కూడా జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల పేర్లే వినిపిస్తున్నాయి. తన సోదరుడిని ఎమ్మెల్సీగా గెలిపించుకుని ఊపు మీదున్న వెంకటరెడ్డి అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాను తెలంగాణ వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్‌ను గెలిపిస్తానని చేసిన వ్యాఖ్యల ఆంతర్యంపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానాలకు పదవీగండం ఉందని, ఇద్దరికీ ఏఐసీసీలో స్థానం కల్పిస్తారని కూడా పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే, పీసీసీ అధ్యక్ష పదవికి ఇప్పట్లో ఉన్న ప్రమాదం ఏమీ లేదని, అయితే, సీఎల్పీ నేతను మాత్రం మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఇతర జిల్లాలకు చెందిన జీవన్‌రెడ్డి, అరుణ లాంటి నాయకుల పేర్లు వినిపిస్తున్నా, పీసీసీ అధ్యక్ష పదవికి జరుగుతున్న చర్చలో మాత్రం ఉత్తమ్‌ను తప్పిస్తే ఆ పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఇస్తారని ప్రచారం జరుగుతుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాలు కూడా జిల్లా నేతలను కేంద్రంగా చేసుకుని హాట్‌హాట్‌గా మారుతున్నాయి. నల్లగొండ డీఎస్పీ కార్యాలయం నుంచి మొదలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ప్రశాంతంగా ఉన్న రాజకీయం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. ఇటీవల మాజీ మంత్రి, సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి హల్చల్ చేయడం, ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు దానిని ఖండించడం, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇవ్వడం, మళ్లీ టీఆర్ఎస్ నాయకులు దానిని ఖండించడం, ఆ తర్వాత నకిరేకల్ నియోజకవర్గంలో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం వరకు ఈ ఆరోపణల పరంపర వెళ్లడం తెలిసిందే. ఈ క్రమంలోనే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిలు ఓ పక్షాన, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలైన కోమటిరెడ్డి సోదరులు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అండ్‌కో మరో పక్షాన మాటల దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గత వారం, పది రోజులుగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం జిల్లాస్థాయిలోనే హాట్ హాట్ గా మారింది. కానీ, ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడంతో జిల్లా రాజకీయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ అయింది. -
స్పీకర్ భోజన దౌత్యం
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగేందుకు అధికార విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఫిబ్రవరి 26 (శుక్రవారం) అన్ని పార్టీల నాయకులను విందుకు ఆహ్వానించారు. ఇందులో మహాజన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్వా ప్రాంత వంటకాలను వడ్డించనున్నట్లు పార్లమెంటు వర్గాలు తెలిపాయి. సోమవారం రాహుల్, టీఎంసీ పక్షనేత సుదీప్ బంద్యోపాధ్యాయతో భేటీ సందర్భంగా లోక్‌సభలో తమ గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని అలాగైతేనే రాజ్యసభలో ప్రభుత్వానికి సహకరిస్తామనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేదుకు ఈ భోజన దౌత్యానికి స్పీకర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. -
'పేద ప్రజలకు పెద్ద పీట వేయాలి'
హైదరాబాద్: బడ్జెట్ తో పేద ప్రజలకు పెద్ద పీట వేయాలని నిజామాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఆమెక్కిడ సోమవారం మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతామని ఆమె స్పష్టం చేశారు. కేంద్రానికి సమాంతర దూరంలో ఉంటామన్నారు. ప్రజా సమస్యలపై కచ్చితంగా నిలదీస్తామన్నాను. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మేలు జరుగుతుందని తాము భావిస్తున్నామన్నారు. రైల్వే బడ్జెట్లో కూడా తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అన్నారు. మరో వైపు కేంద్రంలో చేరే అంశంపై కవిత ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. -
'ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలి'
ఢిల్లీ: గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో శనివారం రాజ్యసభకు చెందిన అఖిలపక్ష నేతలతో హమీద్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారిని ఉపరాష్ట్రపతి కోరినట్టు సమాచారం. -
బడ్జెట్ భేటీపై ‘జేఎన్‌యూ’ నీడ!
జేఎన్‌యూ వివాదంపై అఖిలపక్ష భేటీలో విపక్షం ప్రశ్నల వర్షం ♦ కన్హయ్య అరెస్ట్ అన్యాయమన్న కాంగ్రెస్, వామపక్షాలు ♦ వర్సిటీల వివాదాలు పార్లమెంటులో ప్రతిధ్వనిస్తాయన్న లెఫ్ట్ ♦ ఆ నినాదాలు అభ్యంతరకరమైనవి.. సభలో చర్చకు సిద్ధం: సర్కారు ♦ తాను దేశం మొత్తానికీ ప్రధానినని, ఒక్క పార్టీకి కాదని మోదీ వ్యాఖ్య ♦ సమావేశాలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదం.. మరో వారంలో మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిధ్వనిస్తుందన్న విషయం స్పష్టమైంది. బడ్జెట్ సమావేశాల్లో సహకారం కోరుతూ ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు జేఎన్‌యూ వివాదంపై ప్రశ్నలు లేవనెత్తాయి. వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్యకుమార్‌ను దేశద్రోహం అభియోగాలపై అరెస్ట్ చేయటం అన్యాయమని కాంగ్రెస్, వామపక్షాలు తప్పుపట్టాయి. అయితే.. వర్సిటీలో విద్యార్థులు చేసిన నినాదాలు తీవ్ర అభ్యంతరకరమైనవని ప్రభుత్వం పేర్కొంది. జేఎన్‌యూ వివాదంపై పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చర్చించటానికి సిద్ధమంది. ఈ నెల 23వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో మోదీ ఈ అఖిలపక్ష భేటీ నిర్వహించారు. తాను మొత్తం భారతదేశానికీ ప్రధానమంత్రినని, కేవలం ఒక్క పార్టీకి కాదని పేర్కొంటూ.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగటానికి సహకరించాలని విపక్షాలను కోరారు. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో వరుసగా ప్రతిష్టంభనలు ఏర్పడుతున్న నేపథ్యంలో.. బడ్జెట్ భేటీల విషయంలో మోదీ ముందుగానే చొరవ తీసుకుంటూ ఈ భేటీని ఏర్పాటు చేశారు. ‘‘ప్రతిపక్షం లేవనెత్తిన అంశాలకు స్పందిస్తాం..పరిష్కరిస్తాం. ఇక్కడ కనిపించిన సుహృద్భావ వాతావరణం పార్లమెంటులోనూ ప్రతిఫలిస్తుందని ఆశిస్తున్నా’’ అని ఆకాంక్షించారు. పార్లమెంటులో బిల్లులను వాటి గుణగణాల ఆధారంగా ఆమోదించాలన్నది తమ పార్టీ వైఖరి అంటూ కాంగ్రెస్ పార్టీ బంతిని సర్కారు కోర్టులోకే నెట్టివేసింది. భేటీ రెండు గంటలకు పైగా సాగింది. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ భేటీలు సజావుగా సాగాలన్న అంశంపై స్థూల ఏకాభిప్రాయం వచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక వాతావరణం కలుషితం జేఎన్‌యూ వివాదంలో ‘దేశ వ్యతిరేకుల’కు ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతిస్తోందంటూ అధికార బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టిన నేపథ్యంలో.. దేశ సమైక్యత, రాజ్యాంగంపై దాడి చేస్తూ నినాదాలు చేసిన విద్యార్థులతో తమ పార్టీకి ఏ సంబంధమూ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీఆజాద్ ఈ భేటీలో పేర్కొన్నారు. అయితే.. కన్హయ్య దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణకు ఎలాంటి సాక్ష్యమూ లేదని తప్పుపట్టారు. కన్హయ్య.. రాజ్యాంగానికి గానీ, దేశానికి గానీ వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలో వాతావరణం కలుషితంగా మారిపోయిందని.. అందుకు బాధ్యులైన వారిపై ఆ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో దళిత స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య అంశం గురించీ కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. బీజేపీ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ ప్రోద్బలంతోనే అతడిని ఒత్తిడికి గురిచేశారన్నారు. తమ పార్టీ నాయకత్వాన్ని దేశ వ్యతిరేకులని విమర్శిస్తూ అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతూ.. అటువంటి వారిని ప్రభుత్వం నియంత్రించాలనిసూచించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించటానికి కారణమైన ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయాల గురించీ కాంగ్రెస్ లేవనెత్తింది. సంయమనం పాటించాలి: వెంకయ్య జేఎన్‌యూ వర్సిటీ వివాదంపై ప్రభుత్వ వైఖరిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భేటీలో వివరించారు. వర్సిటీ కార్యక్రమంలో చేసిన నినాదాలు, అతికించిన పోస్టర్లు తీవ్ర అభ్యంతరకరమైనవన్నారు. ‘దేశ వ్యతిరేకం’ వంటి పదాల వినియోగంపై ప్రతిపక్ష నేతల ఆందోళనను గుర్తిస్తున్నామంటూనే.. ప్రధానిని ఉద్దేశించి చేసిన ‘హిట్లర్’ విమర్శలను వెంకయ్య ప్రస్తావించారు. పార్టీలన్నీ సంయమనం పాటించాలన్నారు. పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ నెల 22న లాంఛనంగా జరిగే అఖిలపక్ష భేటీలో.. సమావేశాల అంశాలతో పాటు, ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి చర్చిస్తామని వెంకయ్య తెలిపారు. ఆలయంలో గంట మోగుతుంది: వామపక్షాలు దేశంలోని వర్సిటీల్లో జరుగుతున్న పరిణామాల గురించి, అరుణాచల్‌లో రాష్ట్రపతి పాలన గురించి అఖిలపక్ష భేటీలో వామపక్షాలు లేవనెత్తాయి. వీటిపై ప్రధాని జోక్యం చేసుకోవాలన్నాయి. ‘సీపీఎం కార్యాలయంపై దాడి చేశారు. ఏచూరికి బెదిరింపులు వచ్చాయి. సీపీఐ నేత డి.రాజాకు బెదిరింపులు వస్తున్నాయి’ అని సీపీఎం నేత మొహమ్మద్ సలీం ఆ తర్వాత మీడియాతో అన్నారు.. ‘‘బయట ఇంత గందరగోళం జరుగుతున్నపుడు ప్రజాస్వామ్య ఆలయం (పార్లమెంటు)లో గంట మోగుతుంది’ అని పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని తృణమూల్కాంగ్రెస్ కోరింది. పార్లమెంటు సజావుగా సాగాలని, చర్చ జరగాలని జేడీయూ చీఫ్ శరద్‌యాదవ్ సూచించారు. -
నేడు విపక్షాలతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన, పఠాన్‌కోట్‌లో ఉగ్ర దాడి, జేఎన్‌యూ వివాదం వంటి అంశాలు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కుదిపేయనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం విపక్ష నేతలతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరనున్నారు. గత సమావేశాల్లో వివిధ అంశాలపై తమను పరిగణనలోకి తీసుకోలేదని విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ప్రధానిపై విరుచుకుపడిన నేపథ్యంలో మోదీ తొలిసారిగా ఈ భేటీ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. అయితే ఇది అఖిలపక్ష సమావేశం కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకుంటున్న లేదా ఆమోదించాలనుకుంటున్న బిల్లుల గురించి ఈ భేటీలో చర్చ ఉండదని తెలిపాయి. -
మార్చి 1 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 1 నుంచి నిర్వహించనున్నారు. మార్చి 5న సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు బుధవారం ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. మార్చి 8న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహించే అవకాశముందని యనమల చెప్పారు. -
అవాస్తవిక బడ్జెట్
హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లు లోపభూయిష్టమంటూ శాసనమండలిలోనూ విపక్షాలు ధ్వజమెత్తాయి. శుక్రవారం మండలిలో ద్రవ్యవినిమయ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. పలు శాఖలకు రూ.1.06 లక్షల కోట్లు కేటాయింపులు చేసినా కేవలం రూ.65 వేల కోట్లే ఖర్చు చేయడంపై నిలదీశాయి. ఆరుగంటల చర్చ అనంతరం, బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు మండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి, ప్రాధాన్యత కలిగిన గ్రామీణాభివృద్ధి, విద్యుత్, హౌసింగ్, విద్యా రంగాలకు తక్కువ కేటాయింపులు చేయడమేమిటని ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ ప్రశ్నించారు. రూపాయి ఖర్చులేని ఉమ్మడి సర్వీస్ రూల్స్, ఎయిడెడ్ సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు.. తదితర అంశాలను సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన సర్కార్.. బడ్జెట్లో ఆ మేరకు కేటాయింపులు ఎందుకు చేయలేదని టీడీపీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రశ్నించారు. మూడు లక్షల మంది పేద దళితులకు మూడెకరాలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కేవలం 570 మందికి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. మరో ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్, మిషన్‌కాకతీయ మినహా మిగిలిన పథకాలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయలేదన్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లకు పండుగలా మారే ప్రమాదముందని హెచ్చరించారు. వాటర్‌గ్రిడ్‌కు నీళ్లెక్కడ్నుంచి వస్తాయో చెప్పకుండా లక్షల కిలోమీటర్ల పైప్‌లైన్ వేయడంపైనా సర్కారు ఆసక్తిని కనబరుస్తోందన్నారు. కేటాయింపుల మేరకు ఖర్చు చేయలేదు గతేడాది ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకొనే ఏ రాష్ట్రమైనా బడ్జెట్‌ను రూపొందిస్తుం దని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఉజ్జాయింపు అంచనాలతో గత బడ్జెట్‌ను రూపొందించామని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బడ్జెట్ కేటాయింపుల మేరకు ఖర్చు చేయలేదన్న విషయాన్ని అంగీకరిస్తున్నామని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు కేంద్రం నుంచి రూ.31 వేల కోట్లు వస్తాయనుకుంటే.. వచ్చినవి కేవలం రూ.14 వేల కోట్లేనని చెప్పారు. కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రూ.25 వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలనే విషయం పరిశీలిస్తామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ బకాయిలపై సంఘాలతో చర్చిస్తాం ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్ల అమలును ప్రస్తావిస్తూ బకాయిలను బాండ్ల రూపంలో చెల్లించాలా లేదా వారి జీపీఎఫ్ ఖాతాలో కలపాలా అన్న విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈటెల చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. 'పార్లమెంటరీ సెక్రటరీల' బిల్లు ఆమోదం ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, విమర్శల నేపథ్యంలో తెలంగాణ పార్లమెంటరీ కార్యదర్శుల (నియామకం, జీతాలు, ఇతర నిబంధనలు) బిల్లును రాష్ట్ర శాసనమండలి ఆమోదిం చింది. శుక్రవారం ఈ బిల్లును ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. గుజరాత్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా దీనిని అమలుచేశారని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా తొలుత పార్లమెంటరీసెక్రటరీగా పనిచేశారని ఆయన గుర్తుచేశారు. ఈ నియామకాలు రాజకీయ ఉపాధి కోసమే తప్ప మరొకటి కాదని కౌన్సిల్లో విపక్షనేత డి.శ్రీనివాస్ ధ్వజమెత్తారు. లాభదాయక విధుల నిర్వహణను ఎమ్మెల్యేలు ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి ప్రశ్నించారు. ఈ సెక్రటరీల విధులు, బాధ్యతల గురించి సీఎం నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారని మంత్రి హరీశ్ చె ప్పారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు ఎ.నర్సారెడ్డి, పొట్ల నాగేశ్వరరావు, ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, కె. దిలీప్‌కుమార్, పూలరవీందర్, గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా బోర్డు సమావేశం వాయిదా
సాక్షి, హైదరాబాద్: సోమవారం జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సమావేశాలను వాయిదా వేయాలన్న తెలంగాణ వినతికి స్పందించి బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఈ నెలాఖరున భేటీ జరిగే అవకాశాలున్నాయి. -
రక్తి కడుతున్న అసెంబ్లీ సమావేశాలు!
-
వైఎస్ జగన్ అధ్యక్షతన ఎమ్మెల్యేల సమావేశం!
-
ఆర్డినెన్స్.. బైపాస్ కానే కాదు!
-
7 నుంచి బడ్జెట్ సమావేశాలు
11న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి ఈటెల మార్చి 27 వరకు సమావేశాలు స్పీకర్, మండలి చైర్మన్ల తో సీఎం సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి 27వ తేదీ దాకా జరగనున్నాయి. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ సమావేశాల తేదీల గురించి గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. మార్చి 7 తేదీ ఉదయం 11 గంటలకు గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. తొలుత అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ శనివారం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో సమావేశమై తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. 8, 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ 2015-2016 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను 11వ తేదీన సభలో ప్రవేశపెడతారు. 13, 14, 16 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. ప్రభుత్వ సమాధానం 17వ తేదీన ఉంటుంది. మొత్తంగా 12, 15, 21, 22 తేదీలను అసెంబ్లీకి సెలవులుగా నిర్ణయించారు. తర్వాత 23 నుంచి 27వ తేదీ వరకు వరుసగా సమావేశాలు జరుగుతాయి. కాగా, 27వ తేదీన ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఈనెల 27 రూల్స్ కమిటీ సమావేశం అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు అయినా, సభ జరిగే సమయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉదయం 9 గంటల నుంచి కానీ, 9.30 నుంచి కానీ సమావేశాలు మొదలు పెట్టాలన్న చర్చ జరిగింది. అయితే దీనిపై ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఈనెల 27వ తేదీన జరిగే అసెంబ్లీ రూల్స్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుని చెబితే, ఆ ప్రకారమే నిర్వహిద్దామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఆదివారం వచ్చిందని, ఆ రోజు సెలవు ఇస్తే బావుంటుందన్న ప్రతిపాదనను సీఎం తిరస్కరించారు. బడ్జెట్ సమావేశాలు ముఖ్యమని, ఆదివారాలు, పండుగలు అని చూసుకోవాల్సిన అవసరం లేదని, సమావేశం జరగాల్సిందేనని ఆయన అన్నట్టు తెలిసింది. ఇక, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7వ తేదీ నుంచే ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వెళ్లారని, అయితే వారి తేదీలతో సంబంధం లేదని.. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఏడు నుంచే మొదలు పెడదామని ఆయన స్పష్టంచేసినట్లు సమాచారం. స్పీకర్‌తో భేటీ తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి బడ్జెట్ సమావేశాల తేదీలను వివరించి, 7వ తేదీన ప్రసంగించడానికి రావాల్సిందిగా ఆహ్వానించడం.., గవర్నర్ దానికి అంగీకారం తెలపడం వెంట వెంటనే జరిగిపోయాయి. సీటింగ్ ఏర్పాట్లు భేష్ అసెంబ్లీ సమావేశ మందిరంలో సీటింగ్ ఏర్పాట్ల పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇరుగ్గా ఉన్న సీట్లను తొలగించి 170 మంది సభ్యులకు సరిపడేలా అధికారులు మరమ్మతులు చేపట్టారు. సీటింగ్ ఏర్పాట్లు బాగా ఉన్నాయని అధికారులను అభినందించిన సీఎం, నాలుగు ద్వారాల నుంచి సమావేశ మందిరంలోకి గ్రీన్ కార్పెట్లు వేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇతర విప్‌లు, ఎంపీ బి.వినోద్‌కుమార్, అసెంబ్లీ కార్యదర్శి రాజ సదారాం పాల్గొన్నారు. -
బడ్జెట్ సమావేశాల తర్వాత నోటిఫికేషన్లు: ఈటెల
వరంగల్, వీణవంక/కమలాపూర్: శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వరంగల్‌లోని లాల్బహుద్దూర్ కళాశాలలో శుక్రవారం జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల కోసం ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలలల్లో పని చేసే పార్ట్‌టైం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. దొడ్డు బియ్యం తినేవాళ్లందరికీ ఆహార భద్రత కార్డులు ఇస్తామని మంత్రి రాజేందర్ అన్నారు. -
తక్షణం పీఆర్సీ ప్రకటించాలి
సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖామాత్యులు యనమల వాగ్దానం చేశారు. ఒకటి జూలై 2013న ఇవ్వాల్సిన పీఆర్సీ ఇప్పటికీ ఇవ్వకుండా జాగు చేస్తూ ఉండటంతో అంబరాన్నంటిన ధరలతో సామాన్య ఉద్యో గులు, పెన్షనర్లు ఇక్కట్ల పాలవుతున్నారు. మంత్రిగారు ఆ మాటే మరిచారు. ఉద్యోగ సంఘాల నాయకులు, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు గదా మారాడని ఉద్యోగ, పెన్షనర్ల కుటుంబాలతో నమ్మబలికి బాబును అధికారంలోకి తీసుకు వచ్చారు. ఇప్పుడు మేలు మరచి ఉద్యోగులను పురుగులా చూస్తు న్నారు. చరిత్ర పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంది. మళ్లీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాలకు ముందంటూ ఆర్థిక మంత్రి మరో ఉచిత వాగ్దానం చేశారు. మరోసారి పీఆర్సీని వాయిదా వేసినా ఆశ్చర్యం లేదని ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పెట్టడం, చట్టాలు చేయడం వరకే నాయకుల పాత్ర ఉంటుంది. తర్వాత వాటిని అమలుచేయాల్సింది, ప్రభు త్వానికి మంచి పేరు తేవలసింది వీరేనని ప్రభుత్వం గ్రహించాలి. ఇప్పటికే చాలా లేటైంది. ఇక వాయిదాలు ఆపి తక్షణం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణ యం తీసుకోవాలి. వేతన జీవులను ఉసూరు పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణం పీఆర్సీ ప్రకటించాలి. - ఎన్.రఘునాథరావు కొత్తపల్లి -
బడ్జెట్ సమావేశాలు సాగాయిలా..!
-
రైతన్నను మరచిన అసెంబ్లీ
* బడ్జెట్ సమావేశాల్లో దృష్టి సారించని పార్టీలు * అన్నదాతల సమస్యలను ప్రస్తావించని వైనం * ప్రభుత్వాన్ని నిలదీయలేకపోయిన విపక్షాలు * ఇతర అంశాల్లో అధికార పార్టీని ఇరుకునపెట్టే యత్నం * ప్రతిపక్షాలను సమర్థంగా అడ్డుకున్న అధికారపక్షం సాక్షి, హైదరాబాద్: వర్షాభావం, కరువు పరిస్థితులతో రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారిన తరుణంలో, కరెంటు లేక పంటలు నష్టపోయి అన్నదాతలు కుదేలైన నేపథ్యంలో మూడు వారాల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశమే ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. భూ ఆక్రమణలు, మెట్రో భూముల బదలాయింపు, నూతన పారిశ్రామిక విధానంపైనే గంటల తరబడి చర్చ జరిగింది. భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికే అధికారపక్షం ప్రాధాన్యతనిచ్చింది. మరోవైపు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విపక్షాలు విఫలమయ్యాయన్న విమర్శను మూటగట్టుకున్నాయి. సభలో అన్ని అంశాలపైనా ప్రధానంగా ముగ్గురు మంత్రులే ఎక్కువగా జోక్యం చేసుకుని మాట్లాడటం కూడా చర్చనీయాంశమైంది. బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ఈ అంశాన్నే ప్రస్తావించడమే కాక ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఇక డీఎల్ఎఫ్ భూములకు సంబంధించి ముఖ్యమంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు కానీ, ఆ అంశాన్ని తెరపైకి తెచ్చిన తెలుగుదేశం సభ్యుడు రేవంత్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎంపీ కవిత విషయంలో సభకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రేవంత్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ సభ్యులు ఆయన్ని పూర్తిగా కట్టడి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాజకీయవర్గాలను విస్మయానికి గురి చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ సమావేశాల్లో ఒక దశ-దిశ లేకుండా వ్యవహరించి అభాసుపాలైందని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. తాజాగా ద్రవ్యవినిమయ బిల్లుపై ఆ పార్టీ వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు విప్ జారీ చేసింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు పరిణామాలను పక్కనబెట్టి, అదే బిల్లుకు ప్రతిపక్ష నేత జానారెడ్డి ఓటింగ్ కోరకుండానే మద్దతు ప్రకటించడం ఆ పార్టీ సభ్యులనే విస్మయపరిచింది. ప్రధాన ప్రతిపక్షంగా పజా సమస్యలపై మిగిలిన విపక్షాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ ఏ దశలోనూ ఆ ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారపక్షం సక్సెస్ చీటికి మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడుతూ వార్తల్లో నిలుస్తున్న పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నిలువరించేందుకు టీఆర్ఎస్ వేసిన ఎత్తుగడతో ప్రధాన ప్రతిపక్షం ఆత్మరక్షణలో పడింది. అసైన్డ్ భూముల ఆక్రమణకు సంబంధించి అధికారపక్షం నేరుగా పొన్నాలనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడింది. దీనిపై సభాసంఘం వేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చి కాంగ్రెస్ మద్దతుతోనే దాన్ని ఆమోదించుకుంది. సీఎంను ఇరకాటంలో పడేసేందుకు డీఎల్ఎఫ్ భూముల వివాదాన్ని తెరమీదికి తెచ్చిన టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ కట్టడి చేసింది. ఎంపీ కవితపై వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలచుకొని ఆయనకు మాట్లాడే అవకాశమే రాకుండా అడ్డుకుంది. డీఎల్ఎఫ్ భూముల బదలాయింపు అంశం చర్చకు వచ్చేలా అధికార పార్టీ సభ్యులే సావధాన తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని అధికారపక్షం మాట్లాడనివ్వకపోవడంతో సీఎల్పీ కార్యదర్శి మల్లు భట్టివిక్రమార్క తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై ఆయన నేరుగా విమర్శల దాడికి దిగడం ఆ పార్టీకి కొంతలో కొంత ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన అనేక ఉదాహరణలు చెప్పుకొచ్చారు. ఇక టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ సభలో ఏనాడూ ఆ పార్టీకి మద్దతుగా ముందుకు రాలేదు. వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై మజ్లిస్ ఇచ్చిన సావధాన తీర్మానాన్ని కూడా అధికారపక్షం తనకు అనుకూలంగా మలుచుకుని సభాసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇక రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఏ పార్టీ ప్రయత్నించలేదు. ‘మొక్కుబడిగా వాయిదా తీర్మానాలు ఇచ్చామే తప్ప, రైతుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో మేం విఫలమయ్యాం. దానికి అనేక కారణాలు తోడయ్యాయి’ అని కాంగ్రెస్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. -
సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు విద్యుత్ సెగలు తాకనున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో రోజైన శుక్రవారం ప్రధానంగా విద్యుత్ సంక్షోభంపైనే చర్చ జరుగనుంది. ఈ సమావేశాల్లో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ మధ్య విద్యుత్ పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ప్రశ్నోత్తరాల్లో సమాధానాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వనున్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నూతన పారిశ్రామిక విధానం, కల్యాణలక్ష్మీ, భూ పంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్లపై ప్రశ్నోత్తరాలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. విద్యుత్ సమస్యపై చర్చ జరుగనున్న నేపథ్యంలో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్ష నేత జానారెడ్డి ప్రారంభించనున్నట్టు సమాచారం. -
జిల్లాల్లో పరిస్థితి ఏంటి?
24న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ పరంగా భారీ కసరత్తు చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ ఇప్పటిదాకా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించలేదు. బడ్జెట్ ముందు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. నవంబరు మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఈనెల 24న పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అలాగే జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ కావాలని నిర్ణయించారు. అదేరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం ఉన్నందున.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే జిల్లాల వారీ సమీక్షల్లో తన దృష్టికి వచ్చిన అంశాలు, ఎమ్మెల్యేలు చేసిన ముఖ్య సూచనలపై చర్చించి బడ్జెట్లో వాటిని పొందుపరిచే విధంగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీపావళి మరుసటి రోజున ఉదయం ముందుగా పార్టీ శాసనభాపక్షం భేటీ కాబోతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, జిల్లాలపై వాటి ప్రభావం, విద్యుత్ సంక్షోభం, వర్షాభావ పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు, వాటిని తిప్పికొడుతున్న తీరు... ఇలా అన్ని అంశాలపై అందులో చర్చించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత విడివిడిగా ఒక్కో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అరగంట నుంచి గంట సమయాన్ని ఒక్కో జిల్లాకు కేటాయించనున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు, రైతులు, వ్యవసాయ పరిస్థితి, నిధుల అవసరం, పథకాల తీరుతెన్నులు, వాటిలో మార్పుచేర్పులు, కావాల్సిన నిధులు తదితర అంశాలకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి సమాచారాన్ని స్వీకరించనున్నారు. -
5 నుంచి అసెంబ్లీ
7న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈటెల పది నెలలకు సుమారు రూ. 80 వేల కోట్ల బడ్జెట్ కనీసం రెండు వారాలపాటు సాగనున్న సమావేశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 5 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 7న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి అసెంబ్లీ సమావేశాలు జూన్ 9న మొదలై ఐదు రోజులపాటు జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల నిర్వహణ విషయం మాత్రం పలు కారణాలతో రెండు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 27 నుంచే ఈ సమావేశాలు ఉంటాయన్న ప్రచారం కూడా జరిగింది. అయితే బడ్జెట్‌పై కసరత్తు సోమవారం వరకూ కొనసాగడంతో అసెంబ్లీ భేటీని అనివార్యంగా నవంబర్ తొలి వారానికి వాయిదా వేయాల్సి వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా బడ్జెట్ కే టాయింపులపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు. కీలక రంగాలకు తగినన్ని నిధులు ఉండాలని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాధాన్యత లభించని పలు శాఖలకూ ఈ బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. తాజాగా సీఎం నిర్ణయం మేరకు వచ్చే నెల 5 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు.. కనీసం రెండు వారాలపాటు కొనసాగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు కనీసం 18 పని దినాలు ఉండాలన్నది సంప్రదాయం. అయితే దీనిని తగ్గించడం లేదా పొడిగించడం ప్రభుత్వ ఇష్టమని ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ఈసారి పది నెలల కాలానికి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటికే ఆరు నెలల అవసరాల కోసం కన్సాలిడేటెడ్ నిధుల నుంచి వ్యయం చేయడానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల వినియోగాానికి ఉన్న గడువు డిసెంబర్ 2 వరకే ఉంది. ఇది దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలోగా అసెంబ్లీని సమావేశపరిచి బడ్జెట్‌ను ఆమోదించుకోవడం తప్పనిసరిగా మారింది. కాగా, పది నెలల కాలానికి దాదాపు రూ. 80 వేల కోట్లకు పైగా బడ్జెట్ పరిమాణం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ప్రణాళిక వ్యయం కూడా రూ. 25 వేల కోట్లకుపైగా ఉంటుందని, ప్రణాళికేతర వ్యయం రూ. 50 వేల కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా వాటర్‌గ్రిడ్, వైద్య, ఆరోగ్యం, చెరువుల పునరుద్ధరణ, సాగునీటిపారుదల, సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రంగాలకు నిధులు భారీగా ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. -
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాయిదా?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో సమావేశాలు వాయిదా పడొచ్చని సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ పదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాలు అక్టోబర్ నెలకు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖల వారీగా 14 టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆరుగురు సలహాదారుల నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. ఈ విషయాలన్నింటిపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. బడ్జెట్ సమావేశాల విషయంతో పాటు టాస్క్‌ఫోర్స్ కమిటీల విషయాన్ని కూడా ఈ సమావేశంలో గవర్నర్ వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. -
18 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు
* రేపటి నుంచి వచ్చే నెల 12 వరకు.. * 20న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల * 22న వ్యవసాయ బడ్జెట్ రూ. లక్ష కోట్లతో సాధారణ బడ్జెట్ * కౌన్సిల్లో రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు 18 రోజులపాటు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమయ్యే సమావేశాలు సెప్టెంబర్ 12న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ముగుస్తాయి. 18వ తేదీ ఉదయం 8 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ సమావేశమవుతుంది. 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థారుు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. వ్యవసాయ, సాగునీటి రంగాలు, అనుబంధ రంగాలకు చెందిన కేటాయింపులన్నింటినీ ఒక చోటకు తీసుకొస్తూ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పేరుతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. లక్ష కోట్ల రూపాయలతో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రూ. 20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు ప్రణాళిక వ్యయంగా, రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 85 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను రూ.15 వేల కోట్లతో ప్రవేశపెడతారు. పురపాలక మంత్రి డాక్టర్ పి. నారాయణ 20న వార్షిక బడ్జెట్‌ను, 22న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఇంకా పూర్తికాని మరమ్మతులు శాసన సభ ఆవరణలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన సమావేశ మందిరంలో ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. గత సమావేశాల సందర్భంగా సీట్లు సౌకర్యంగా లేవని సభ్యులు ఫిర్యాదు చేయటంతో మరమ్మతులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో సమావేశాలు ప్రారంభమవుతున్నారుు. అరుునా మరమ్మతులు సాగుతూనే ఉన్నారుు. శాసనసభలో ఇన్నర్ లాబీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌లకు ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు కె. సత్యనారాయణ, ఎస్. రాజాసదారం వినియోగిస్తున్న కార్యాలయాలను కేటాయించినప్పటికీ, వారింకా వాటిని ఖాళీ చేయలేదు. సర్కారు హామీలపైనే విపక్షం పట్టు ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావొస్తుండటంతో, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభలో గట్టిగా పట్టుబట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు వంటి తక్షణం కార్యరూపంలోకి తేవలసిన అంశాలతో పాటు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీయాలను ఆ పార్టీ భావిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమవుతోంది. -
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దం
-
‘చాంబర్ల’పై స్పీకర్ల ఏకాభిప్రాయం
* ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు * సమస్యలు తలెత్తితే మళ్లీ సమావేశం * ఆగస్టు 18 నుంచి 13 వరకు ఏపీ బడ్జెట్ సమావేశాలు * ఆగస్టు రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ భేటీలు * సమన్వయంతో ముందుకెళ్తాం: కోడెల, మధుసూదనాచారి సమన్వయంతో ముందుకెళ్తాం: ప్రస్తుతం ఏర్పడిన సమస్యలపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చాం. స్పీకర్లు, చైర్మన్లు, ఇలా ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు పూర్తిచేస్తాం. అంతిమంగా రెండు రాష్ట్రాల చట్టసభలు బాగా పనిచేసే వాతావరణం ఉండాలని భావించాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చట్టసభల మధ్య ఎలాంటి వివాదాలు లేవు. పవిత్రమైన సభల్లో ప్రజాసమస్యల పైనే చర్చలు జరగాలి. సమస్యలపై ఇప్పటికే మూడుసార్లు చర్చించాం. ఒకరిపై ఒకరం ఏనాడూ ఏమాటా అనుకోలేదు. రాష్ట్రాలుగా విడివడినా ఇరు ప్రాంతాల వారమంతా ఒక్కటే. - మధుసూదనాచారి, తెలంగాణ స్పీకర్ ఏకాభిప్రాయానికి వచ్చాం అసెంబ్లీ, మండలి ప్రాంగణాల్లో వసతుల ఏర్పాటు, సమావేశాల సమయంలో ఇబ్బం దులు లేకుండా తీసుకోవలసిన చర్యలపై ఏకాభిప్రాయానికి వచ్చాం. పరస్పర సహకారంతో రెండు ప్రాంతాల బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేలా చూస్తాం. సమస్యలున్నా వాటిపై ఎప్పటికప్పుడు చర్చిం చుకొని పరిష్కరిస్తాం. బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండో వారంలో ఉండవచ్చు. బడ్జెట్ సమావేశాలైనందున కొన్ని రోజులు రెండు అసెంబ్లీలు, మండళ్ల సమావేశా లు ఒకేసారి జరగాల్సి రావచ్చని అపుడు సమస్యలు రాకుండా తీసుకోవలసిన చర్యలపైనా ఓ అవగాహనకు వచ్చాం. - కోడెల శివప్రసాద్, ఏపీ స్పీకర్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చట్టసభలమధ్య నెలకొన్న చాంబర్ల కేటాయింపు వివాదం ఓ కొలిక్కి వచ్చింది. మంగళవారం ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు సమావేశమై ఈ వివాదం పరిష్కారంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. అసెంబ్లీ ఒకటో నంబర్ కమిటీ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, తెలంగాణ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఏపీ మండలి చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఇరు రాష్ట్రాల శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రులు యనమల రామకృష్ణుడు, టి.హరీష్‌రావు, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు రాజసదారాం, కె.సత్యనారాయణ (ఇన్చార్జి)లు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్లు, మండలి చైర్మన్లు, డిప్యూటీ స్పీకర్లు, వైస్చైర్మన్లు, ప్రతిపక్షనేతలు, మంత్రులు, చీఫ్ విప్‌లు, విప్ లు ఇలా ప్రాధాన్యతా క్రమంలో ముందు చాం బర్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత ఇతరనేతలకు, సభ్యులకు అసెంబ్లీలో వసతితో పాటు క్వార్టర్ల కేటాయింపు అంశంపై చర్చించారు. ఇరురాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకేసారి జరగకుండా వేర్వేరు తేదీల్లో నిర్వహించడం, ఒకే సారి జరిగే రోజుల్లో తలెత్తే సమస్యలపైనా అవగాహనకు వచ్చారు. అవసరమైతే మరోసారి భేటీ... అసెంబ్లీ, మండలి ఆవరణల్లో ఉన్న భవనాలు, వాటిలో అందుబాటులోఉన్న గదులు, ప్రస్తుతం చాంబర్లు కేటాయింపు కావలసిన వివిధ హోదాల్లోని నేతలు, తదితర అంశాలతో నివేదికలను అసెంబ్లీల కార్యదర్శులు సమావేశం ముందుం చారు. కార్యదర్శులు పోటాపోటీగా ఇచ్చిన సర్క్యులర్లనూ స్పీకర్లు సమీక్షించారు. ముందు గా ప్రాధాన్యత ప్రకారం కేటాయింపులు చేయాలని, చివర్లో ఎక్కడైనా సమస్యలు ఏర్పడితే మరోసారి సమావేశమై పరిష్కరించుకోవాలని అభిప్రాయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌కు కేటాయించిన చాంబర్‌నే తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు ఇచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ చాంబర్ ఏపీ అసెంబ్లీ సమావేశమందిరాన్ని అనుకొని ఉన్నందున బుద్ధప్రసాద్‌కు కొనసాగించాలన్న అభిప్రాయానికి వచ్చా రు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డికి వేరే చాంబర్‌ను కేటాయించనున్నారు. తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు ఇంకా చాంబర్ కేటాయించనందున ముందుగా ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు చేసుకుంటూ రావాలన్న అభిప్రాయానికి వచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఏపీ అసెంబ్లీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిలకు ఇటీవల కేటాయించిన గదులు, వాటిపై ఏర్పడిన వివాదం అంశంపైనా చర్చించారు. శాసనసభ సచివాలయంలో ఓమూలనున్న చిన్నగదిని వైఎస్సార్ కాంగ్రెస్‌కు కేటాయించడంపై విమర్శలు రావడంతో దాన్ని మార్పు చేయాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ (ఇన్చార్జి) వినియోగిస్తున్న చాంబర్‌ను ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి కేటాయించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి ఆ రాష్ట్ర స్పీకర్ చాంబర్ పక్కనే ఉన్న (ప్రతిపక్షనేతగా చంద్రబాబు వినియోగించిన) చాంబర్‌ను కేటాయించాలని భావిస్తున్నారు. ఇంకా ఇతరులకు చాంబర్ల కేటాయింపుపై ఒకటిరెండురోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో కొన్ని రోజుల పాటు ఒకేసారి రెండు అసెంబ్లీల భేటీల సమయంలో ఇరుప్రాంతాల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడేం దుకు వేర్వేరు ప్రాంతాల్లో మీడియా పాయింట్ల ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వేర్వేరు తేదీల్లో బడ్జెట్ సమావేశాలు రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపైనా సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 18 నుంచి సెప్టెంబర్ 13వరకు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని ఆర్థికమంత్రి యనమల వివరించారు. రెండు సమావేశాలు ఒకేసారి జరగకుం డా ఉండేలా ఆ తరువాత తేదీల్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తే బాగుంటుంద న్న అభిప్రాయం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ రెండోవారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశంపై ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. -
16 లేదా 18 నుంచి బడ్జెట్ సమావేశాలు: చంద్రబాబు
హైదరాబాద్: ఆగస్టు 16 లేదా 18 తేది నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 19 తేదిన ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వచ్చిన తర్వాత అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బడ్జెట్ సమావేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్విప్లతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. -
కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవాలు: యనమల
హైదరాబాద్: ఈ సంవత్సరపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని కర్నూలు జిల్లాలో నిర్వహిస్తామని ఆర్ధికశాఖ, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సౌకర్యాలు, వసతుల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని యనమల ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ నెలలో ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. రైతు రుణాలు తప్పకుండా మాఫీ చేస్తాం అని మంత్రి యనమల స్పష్టం చేశారు. రైతు రుణమాఫీపై రైతులు ఆందోళన పడవద్దని యనమల అన్నారు. -
నేటితో పార్లమెంటు సమావేశాల ముగింపు
పార్లమెంటు సమావేశాలు గురువారంతోనే ముగుస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టం లాంటి కీలక బిల్లులు ఇంకా ఆమోదం పొందాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని తాము తలపెట్టినా, విపక్షాలు మాత్రం పొడిగింపునకు అంగీకరించలేదని ఆయన చెప్పారు. దీంతో ఇక.. ఇప్పటివరకు ఆమోదం పొందని బిల్లులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది.