16 లేదా 18 నుంచి బడ్జెట్ సమావేశాలు: చంద్రబాబు
హైదరాబాద్: ఆగస్టు 16 లేదా 18 తేది నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 19 తేదిన ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమెరికా పర్యటనలో ఉన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు వచ్చిన తర్వాత అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.
బడ్జెట్ సమావేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చీఫ్‌విప్‌లతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు.