![Ambati Rambabu Sensational Comments On Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/27/Ambati%20Rambabu_01.jpg.webp?itok=f6DBtK2U)
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు పొలిటికల్ పంచ్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ ప్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్ అయ్యారు.
కాగా, మంత్రి అంబటి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే. చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్ అనర్హులా?. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే అర్హులా? అన్ని ప్రశ్నించారు.
40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా?. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే.. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. బాబు.. ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు?. సత్తెనపల్లి వచ్చి నాపై విమర్శలా?. చంద్రాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైంది. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగింది’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులకు సెల్ఫీల పిచ్చి
Comments
Please login to add a commentAdd a comment