Sattenapalle
-
సత్తెనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా గజ్జల సుధీర్ భార్గవరెడ్డి
సాక్షి,గుంటూరు : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా.గజ్జల సుధీర్ భార్గవరెడ్డిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా డా.గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ..సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానన్నారు. -
అర్ధరాత్రి టీడీపీ విధ్వంసం..
-
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
-
సత్తెనపల్లెలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర దృశ్యాలు
-
దుమ్ములేపుతున్న అంబటి ఎన్నికల ప్రచారం
-
సత్తెనపల్లె వీధుల్లో బుల్లెట్ బండిపై మంత్రి అంబటి చక్కర్లు
సత్తెనపల్లె: మంత్రి అంబటి రాంబాబు ఏం చేసినా వెరైటీగానే ఉంటుంది. ప్రతీరోజూ వాకింగ్ చేస్తూ సత్తెనపల్లె ప్రజలను పలకరించే అంబటి రాంబాబు స్టైల్ మార్చారు. ఈరోజు బుల్లెట్ బండిపై సత్తెనపల్లెంతా తిరిగి పట్టణ ప్రజలను పలకరించారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబుతో పాటు ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. -
ఛీ.. నీ బతుకు చెడ..! జనసేన పుట్టింది లోకేష్ కోసమా..!!
సాక్షి, గుంటూరు: లోకేశ్ యువగళం పెద్ద అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు. ముగింపు సభ అంతకంటే ఫ్లాప్ అని మండిపడ్డారు. యువగళం ఎవరికోసం చేశారని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన క్యాడర్‌ను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ ఎప్పుడూ చంద్రబాబుతో కలిసే ఉన్నారని అన్నారు. బాబు అయిదేళ్లు అడ్డగోలుగా పరిపాలన చేసినప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. గతంలో చంద్రబాబు, లోకేశ్‌లను పవన్ ఎన్నోసార్లు తిట్టారని, తిట్టిన నోటితోనే పవన్ మళ్లీ చంద్రబాబుతో కలిసారని గుర్తుచేశారు. పవన్ ప్యాకేజీ మాట్లాడుకునే యువగళం సభకు వచ్చారని, ముందు రానని, తర్వాత ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. లోకేష్‌ను బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ పెట్టారా అని మండిపడ్డారు. అమలు సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నారని అన్నారు. ఏపీ శ్రీలంక అయిపోతుందని భయపెట్టి సిగ్గులేకుండా ఇప్పుడు చంద్రబాబు ఉచితాలు ప్రకటిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబు ఏమన్నారంటే.. తుస్సుమన్న టీడీపీ-జనసేన బహిరంగ సభ? తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా నిన్న విజయనగరం జిల్లా పోలిపల్లిలో బహిరంగ సభ పెట్టారు. బస్సులు, ట్రైన్లలో రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించే కార్యక్రమం చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి అద్భుతమైన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని.. లోకేశ్ యువగళం యాత్ర ముగింపు సందర్భంగా ఈ సభను నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు ఆరు లక్షల మందికి పైగా జనం హాజరవుతారంటూ ముందుగానే ప్రచారం చేసుకున్నారు. తీరా.. అక్కడకొచ్చిన జనాన్ని చూస్తే వీళ్ల బహిరంగ సభ కార్యక్రమం కాస్త తుస్సుమంది. ఆరు లక్షల మంది జనాలు వస్తారని మీరు ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారో నిజాయితీగా సమాధానం చెబుతారా..? వచ్చిన వాళ్లు ఎంతసేపు ఉన్నారు..? ఎవరి ఉపన్యాసాలు విన్నారు..? మధ్యలోనే వాళ్లంతా ఎందుకు వెళ్లిపోయారు..? వీటిపై తెలుగుదేశం, జనసేన పార్టీలు విశ్లేషించుకుంటే మంచిదని మనవి చేసుకుంటున్నాను. మోగలేని యుద్ధభేరి అది? యువగళం యాత్రలో 3,132 కిలోమీటర్లు నడిచిన నారా లోకేశ్ ఏం తెలుసుకున్నాడు, ఏం సాధించాడు..?. రాష్ట్రంలోని ఏ సమస్యల్ని ఆయన అర్ధం చేసుకున్నా డు..? తెలుసుకున్న సమస్యలకు ఆయన పరిష్కార మార్గాలు ఏం చెప్పాడు..? అంటే, ఏమీలేవు. అదేమంటే, ఇది యువగళం.. నవశకం అన్నారు.. లోకేశ్ కీలక పాత్రధారి అన్నారు. ఆయనేమో ఇది యువగళం ముగింపు సభనే కాదు.. యుద్ధం ఆరంభమైందని.. ఎన్నికల యుద్ధభేరీ మోగిస్తున్నామని అరిచాడు. అయితే, అక్కడేమీ భేరీ మోగలేదు. వారు కొత్తగా కలిసేదేముంది..? తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఒకే వేదికపై ఉండి నిర్వహించిన బహిరంగ సభ అని చెప్పుకున్నారు. అసలు, వారిద్దరూ ఎప్పుడు విడిపోయారు..? అని నేను ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎప్పుడూ విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏవిధంగా పోటీచేస్తే బాగుంటుందో.. ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకు సపోర్టు చేశారు. 2019లో విడిపోయి పోటీచేస్తే చంద్రబాబుకు ఉపయోగం కలుగుతుందని అనుకుని విడిపోయి మరీ పోటీచేశారు. ఇవాళేమో, ఓట్లు చీలకుండా ఉండేందుకు కలిసి పోటీచేస్తారంట.. జగన్మోహన్రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజాసమస్యల గురించి మీరు బహిరంగ సభలో మాట్లాడారా..? అని అడుగుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేనొక సంగతిని గుర్తు చేస్తున్నాను. 2019 ఎన్నికల తర్వాత.. జగన్మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేం ఆరోజు నుంచి ఈరోజు వరకు ఏం చెబుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసే వస్తారని చెబుతున్నాం. వారిద్దరూ కలిసే ఎన్నికల్లో పోటీచేస్తారని పదేపదే చెబుతున్నాం. కొత్తగా చెప్పిన అంశం కాదిది. ఇదేదో నిన్నటి బహిరంగ సభలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయం కూడా కాదని చెబుతున్నాను. ఇవాళే మేము పోలిపల్లిలో కలిశాం. మా కలయికతో రేపు ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని చెబుతూ వారి కేడర్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదని గుర్తుచేస్తున్నాను. చంద్రబాబు దౌర్భాగ్య పాలనకు పవన్‌కళ్యాణ్ బాధ్యుడే? చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఈరోజు కొత్తగా కలవడమేంటి..? గతంలో 2014 ఎన్నికల్లో ఇద్దరూ కలిసే పోటీచేశారు. చంద్రబాబు మీరు కలిసిన తర్వాతనే అధికారంలోకొచ్చాడు. చంద్రబాబుతోనే జనసేన పవన్‌కళ్యాణ్ అంటకాగాడు. చంద్రబాబు చేతనే పరిపాలన చేయించాడు. మరి, ఐదేళ్లు ఇద్దరూ కలిసి అధికారం వెలగబెట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయగలిగారు..? అని ప్రశ్నిస్తున్నాను. ప్రజల మదిలో గుర్తుండిపోయే ఒక్క మంచి పనిని మేము చేశామని చెప్పే దమ్ముందా..? అని వారిద్దర్నీ అడుగుతున్నాను. ఐదేళ్లపాటు మీ ఇద్దరి ఉమ్మడి అధికారంలో అడ్డగోలుగా పరిపాలించారన్నది వాస్తవం. జనసేన మద్ధతుతో అధికారంలోకొచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అత్యంత దౌర్భాగ్యమైన పరిపాలన చేసింది. మరి, దీనికి పవన్‌కళ్యాణ్ బాధ్యుడు కాడా..? అని నేనడుగుతున్నాను. ఇప్పుడు లోకేష్ అద్భుతంగా కనిపించాడా.? సరే, అప్పట్లో పవన్‌కళ్యాణ్ సపోర్టు చేస్తేనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. ఐదేళ్ల పరిపాలన చివరిలో పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వం గురించి అనరాని మాటలతో తిట్టకూడని తిట్లతో దూషించాడు. చంద్రబాబును ఆయన కొడుకు లోకేశ్‌ను కూడా నేరుగా పేరు పెట్టి మరీ పవన్‌కళ్యాణ్ నోటికొచ్చినట్లు తిట్టాడు. లోకేశ్‌ను ఉద్దేశించి ‘నా తల్లిని దూషించావు నువ్వు. నీ సంగతి తేలుస్తాను. మరిచిపోను’ అని అన్నావు. మరి, ఇప్పుడు నువ్వు ఆ సంగతి మరిచిపోయావేమో.. ఇంకోమాట గుర్తుందా..పవన్‌కళ్యాణ్..? పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి గెలవని లోకేశ్ పంచాయతీ రాజ్ మంత్రయ్యాడు ఏంటి మాకు ఈ ఖర్మ..? అని అన్నావు. మరి, నిన్నటి బహిరంగసభలో లోకేశ్ నీకు అంత అద్భుతంగా, అందంగా కనిపించాడా..పవన్..? అని నిలదీస్తున్నాను. పవన్ కల్యాణ్ అజ్ఞానం కనిపించింది? లోకేశ్ చేసిన యాత్ర జగన్‌గారి పాదయాత్రలా కాదని, ముద్దుల పెట్టే యాత్ర కాదని అంటావా పవన్‌కళ్యాణ్. అసలు, జగన్ గారి పాదయాత్ర గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతావు..? జగన్‌గారు పాదయాత్రలో తనకు మద్దతుగా ఎదురొచ్చిన వృద్ధులను అప్యాయంగా పలకరించి తన గుండెలకత్తుకుని గౌరవంగా తల మీద ముద్దు పెడితే.. దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుకు తెచ్చుకోండి. ఆ పాదయాత్రకు లోకేశ్ పాదయాత్రకు పోలికేమైనా ఉంటుందా..?. లోకేష్ యాత్రను గొప్ప పాదయాత్రగా పోల్చే ప్రయత్నం చేశారంటే పవన్‌కళ్యాణ్ ఎంత అజ్ఞానంలో ఉన్నాడో అందరికీ తెలిసిపోయింది. టీడీపీతో పొత్తుకు బీజేపీ ఆశీస్సులున్నాయనడానికి సిగ్గు అనిపించలేదా..? జనసేన ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉందని పవన్‌కళ్యాణ్ గుర్తుచేస్తూ.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నామని.. మా ఇద్దరి పొత్తుకు బీజేపీ ఆశీస్సులుండాలని చెప్పాడు. దీన్నిబట్టి ఇతని పొలిటికల్ లాజిక్కేంటో ఎవరికీ అర్ధంకావట్లేదు. ఇదేం అన్యాయమయ్యా..? ఇదేనా మీ నైతికతా..పవన్‌కళ్యాణ్ ..? అని ప్రతీ ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీతో పొత్తులో ఉండి తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఇవాళేమో, నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాను.. మీరు ఆశీర్వదించమని కోరుతున్నాడు. ఒకరితో పొత్తులో ఉండి మరొకరితో రహస్యంగా సంసారం చేయడం రాజకీయంగా కాకున్నా నిత్య జీవితంలో నీకెటూ అలవాటే కదా పవన్..? అదే పద్ధతిలో బీజేపీతో బంధం పెట్టుకుని తెలుగుదేశం పార్టీతో ఉన్న విడిపోని బంధాన్ని ఆశీర్వదించమని కోరుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పవన్‌కళ్యాణ్ అని అందరికీ తెలియజేస్తున్నాను. జనసేన పుట్టింది లోకేశ్ బలోపేతానికా? ఎప్పుడైతే చంద్రబాబునాయుడును అరెస్టు చేశారో.. వెంటనే లోకేశ్‌బాబును నాయకుడ్ని చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం.. అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నాడు. ఛీ.. మీ బతుకు చెడా.. మీ జనసేన పార్టీ పుట్టింది లోకేశ్‌బాబును బలోపేతం చేయడానికా..? అని నేనడుగుతున్నాను. మీరు పార్టీ పెట్టింది మీరు రాజకీయంగా బలోపేతం కావడానికా..? తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికా..? మీది రాజకీయ పార్టీయేనా..? నిజంగా మీది రాజకీయ పార్టీనే అయితే, మరో రాజకీయ పార్టీలో అసమర్ధుడిగా తిరస్కరించబడిన లోకేశ్‌ను బలోపేతం చేస్తామంటే.. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కూడా మౌనంగా కూర్చొన్నాడంటే... ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నిస్తున్నాను. దీనికి పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. మీ ప్యాకేజీ డ్రామా అందరికీ తెలుసు లోకేశ్‌ను రాజకీయంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో సభకు మొదట్లో మేం రాకూడదనుకున్నాం. ఆ తర్వాత మరలా రావాలని నిర్ణయించుకని వచ్చామని పవన్ కల్యాణ్ చెప్పారు. అంటే, మీరెందుకు రాకూడదని అనుకున్నారో.. మరలా ఎందుకు, ఎలా వచ్చారో.. అనేది ప్రజలకు తెలియదని మీరనుకున్నారా..? మీ ప్యాకేజీ డ్రామాలు ఎవరికీ తెలియదనుకుంటున్నారా..? చంద్రబాబు ఇంటికొచ్చి ప్యాకేజీ మొత్తం మాట్లాడుకున్న తర్వాతనే కదా.. లోకేశ్ ముగింపు సభకు పవన్‌కళ్యాణ్ బయల్దేరి వెళ్లింది..? ఇలా ఒక దౌర్భాగ్యపు రాజకీయాలు చేసే పరిస్థితికి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు తెరదీశారు. సొంతిల్లు లేని సన్నాసులకు ప్రజాదరణ కరువు ఇక, లోకేశ్ మాటలు చూస్తే.. అతనికి బుద్ధి, జ్ఞానం రెండూ లేవనే విషయం అందరికీ అర్థమవుతుంది. యుద్ధం ప్రారంభమైందంటాడు. తాడేపల్లి ప్యాలెస్ తలుపులు పగులకొడతానంటాడు. నిజంగా, లోకేశ్ అంత గొప్పవాడా..? అంత ప్రజాబలం ఉందా ..? అని ఆయన్ను అడుగుతున్నాను. ఎవరైనా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని పిలుద్దామంటే, ఈ రాష్ట్రంలో అసలు మీకు తలుపులే లేవు. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని సన్నాసులు మీరని చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లకు నేను మనవి చేస్తున్నాను. ఈ రాష్ట్రవాసులు కాని మీకు ఇక్కడ ప్రజాదరణ ఎలా ఉంటుందని నేను ప్రశ్నిస్తున్నాను. జగన్ ప్రజాదరణ చూసి భయపడే గుంపుకట్టారు రాష్ట్రప్రజలకు ఒక విషయాన్ని నేను గుర్తుచేస్తున్నాను. నిన్నటి బహిరంగ సభలో వేదికపై చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణతో పాటు పవన్‌కళ్యాణ్ పక్క పక్కనే కూర్చొన్నారు. ఈ నలుగురు కలిసి ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చారంటే, మా నాయకులు జగన్మోహన్రెడ్డి గారిని చూసి ఎంతగా భయపడుతున్నారో అర్ధం చేసుకోవాలని ప్రజలకు గుర్తుచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ దినదిన ప్రవర్ధనమానంలా పెరుగుతన్న రాజకీయ నాయకుడే తప్ప ఏకొంచెం కూడా ప్రజల విశ్వాసాన్ని కోల్పోనటు వంటి వ్యక్తి జగన్ గారు అని నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. ఎన్ని సర్వేలు చూసుకున్నా.. 50-60 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు జగన్మోహన్రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, 175కు 175 స్థానాలూ గెలుచుకుంటాం. ఈ సత్యాన్ని విపక్షాలు గ్రహించాయి కనుకే అందరూ ఏకమై గుంపుగా రావాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఏకమై ఎంత గింజుకున్నా జగన్మోహన్రెడ్డిని ఏమీ చేయలేరని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. -
వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా?
వాడుకుని వదిలేయడంతో చంద్రబాబును మించినవాళ్లు లేరు అనేది దేశవ్యాప్తంగా తెలిసిందే. తనకు అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తేసి తరువాత మొహం చాటేయడంతో ఆయన్ను మించినవాళ్లు లేరని ఎప్పటికప్పుడు స్పష్టమవుతూనే ఉంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అంటే వాస్తవానికి చంద్రబాబు అపారమైన ప్రేమ చూపిస్తారు. చూపిస్తారో నటిస్తారో తెలియదుకానీ.. టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన కొన్నాళ్ళకు కోడెల శివప్రసాద్ తన పిల్లలు చేసిన అరాచకాలకు బాధ్యత వహించాల్సి వచ్చింది. వాస్తవానికి ఆయన్ను ఇనుమేట్ల గ్రామంలో పోలింగ్ రోజున ప్రజలు తరిమి కొట్టడం, ఇన్ని దెబ్బలు కాసినా ఆయన ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. బాబు శవ రాజకీయం.. ఆఖరుకు ప్రభుత్వ ఆఫీస్ కుర్చీలు సైతం ఆయన కుమారుడు శివరామ్ ఎత్తుకురావడమే కాకుండా సత్తెనపల్లిలో వీధి వ్యాపారుల నుంచి సైతం మామూళ్లు వసూళ్లు చేసిన అరాచకాలు.. తరువాత ఆయన కేసులు ఎదుర్కొని అవమానాలు పాలై చివరకు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆయన చనిపోయాక అది ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపణలు చేసి ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ఒకరోజు.. మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒకరోజు.. నరసరావుపేటలో ఒక రోజు ఇలా మూడు రోజులు ఆయన శవంతో రాజకీయం చేశారు చంద్రబాబు. ఆ తరువాత శివరామ్‌ను ఓదార్చి నీ పొలిటికల్ కెరీర్ నేను చూసుకుంటాను అంటూ రెండు.. రెండంటే రెండే.. కన్నీటి బొట్లు కుడికన్ను నుంచి కార్చి వెళ్లిపోయారు. ఇక అక్కడ మళ్ళీ తమ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడం, శివరామ్ గానీ పోటీ చేస్తే ఇనుమెట్ల సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని భయం. ఇవన్నీ కలగలిసి ఆ తరువాత శివరామ్‌కు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా దూరం పెట్టారు. అంటే కోడెలను వాడుకున్నారు.. ఆయన చనిపోయాక ఆయన కుటుంబానికి కెరీర్ క్లోజ్ చేసేశారు. అదన్నమాట బాబుగారి వాడకం. శివమెత్తుతోన్న శివరామ్.. శని పట్టుకున్నా వదులుతుందేమో కానీ చంద్రబాబు పట్టుకుంటే మాత్రం వదలడు అనే నానుడి ఒకటి తెలుగు తమ్ముళ్లు తరచుగా చెప్పుకుంటారు. బతికి ఉండగా కోడెల శివప్రసాద్‌ను అనగదొక్కి మంత్రి పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవి కట్టబెట్టి మూలన కూర్చోబెట్టిన చంద్రబాబు. ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నారు చంద్రబాబు. తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు వస్తుందని, సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని ఆశిస్తూ ఉన్న శివరామ్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పడేసి.. అదే స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను ప్రొజెక్ట్ చేయడంతో శివరామ్ శివాలెత్తి పోతున్నారు. ‘ముప్పై ఐదేళ్ల తన తండ్రి సేవలు గుర్తుకు రాలేదా.. మా కుటుంబానికి న్యాయం చేస్తాం అని గతంలో ఇచ్చిన హామీ మర్చిపోయారా’ అని నేరుగా చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నాడు శివరామ్. వాస్తవానికి కోడెల గత ముప్పై ఐదేళ్ల రాజకీయం ఒకెత్తు కాగా 2014-2019 మధ్య చేసిన రాజకీయం ఇంకో ఎత్తు అని చెప్పాలి. ఇనేళ్లు తాను నిర్మించిన పొలిటికల్ కెరీర్ సౌధాన్ని జస్ట్ ఐదేళ్లలో కొడుకు శివరామ్ కూల్చేశాడు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని జిల్లావ్యాప్తంగా దోపిడీలు..సెటిల్మెంట్లు, దందాలు చేశారు. ఆఖరుకు చిన్న వ్యాపారుల నుంచి కూడా వసూళ్లు.. బిజినెస్ అవకాశం ఇస్తానంటూ ఎందరి దగ్గరో వసూళ్లు.. అడిగితే బెదిరింపులు.. ఇవన్నీ కలగలిసి ఏకంగా కోడెల శివ ప్రసాద్‌ను పోలింగ్ రోజున ఇనుమేట్ల గ్రామంలో ప్రజలు వెంటాడి కొట్టిన పరిస్తితి ఎదురైంది. ఇక తెలుగుదేశం పరిస్థితి చూసి సత్తెనపల్లిలో ఓటర్లు నవ్వుకుంటున్నారు. ప్రజల ప్రశ్నలు ఇవే.. - సత్తెనపల్లి ఎవరి ఆస్తి? - మేమే పాలిస్తామని ఎవరైనా ఎలా చెప్పుకుంటారు? - ఈ పవర్ చంద్రబాబు చేతికి ఎవరిచ్చారు? - సత్తెనపల్లికి ఎవరు రుణపడి ఉన్నారు? - ఇన్నాళ్లు కోడెల చేసిందేంటీ? - స్పీకర్‌గా ఉంటూ ఫర్నీచర్ ఎత్తుకురావడమేంటీ? - కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లికి ఏంచేశారు? - అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి? - పదవుల కోసం పార్టీలు మారిన వారిని ఎందుకు ఎంచుకోవాలి? - రాజకీయ అవసరాల కోసం సత్తెనపల్లిని తాకట్టు పెడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో అగ్గిరాజేసిన కేశినేని నాని.. తగ్గేదేలే అంటూ పచ్చ బ్యాచ్‌కు కౌంటర్! -
సీనియర్‌కు షాకిచ్చిన టీడీపీ లీడర్లు.. చంద్రబాబుకు వార్నింగ్!
ఆయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీయే. ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకునే మరో నేత పంచన ఈ మధ్యే చేరారు. పచ్చ గూటిలో చేరగానే ఆ సీటు నాదే అంటూ ఖర్చీఫ్ వేసేశారు. అయితే అప్పటికే అక్కడున్న వాళ్ళు అధినేతకే వార్నింగ్ ఇచ్చారు. ఏమైందో ఏమో.. చంద్రబాబు ఆ నియోజకవర్గానికి వచ్చినపుడు కొత్తగా వచ్చిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అక్కడ కనిపించలేదు. ఆ సంగతేంటో చూద్దాం.. ఒకప్పుడు ఆయన ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్ని శాసించారు. మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని నిర్ధారించుకుని కాషాయ తీర్థం తీసుకున్నారు. అక్కడా ఇమడలేక ఈ మధ్యనే తెలుగుదేశం గూటికి చేరారు కన్నా లక్ష్మీనారాయణ. టీడీపీలో చేరిన వెంటనే జిల్లా రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలనే ప్రయత్నాల్లో భాగంగా పార్టీ నేతలందరికీ పార్టీ ఇచ్చారు. గుంటూరు సిటీలో వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. అయితే ఆయన సొంత నియోజకవర్గం అయిన సత్తెనపల్లిపైనే కన్నా ఫోకస్ పెట్టారు. తరచు సత్తెనపల్లి వెళ్ళడం, అక్కడి నేతలతో సమావేశం కావడాన్ని అప్పటికే అక్కడ కుమ్ములాడుకుంటున్న నియోజకవర్గ నేతలు గమనించి అలర్ట్ అయ్యారు. కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయారు. కోడెల కుమారుడు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరింది. తాజాగా మూడో కృష్ణుడు రావడంతో పాత నేతలిద్దరూ అలర్ట్ అయ్యారు. కన్నా సత్తెనపల్లి నుంచే పోటీ చేయబోతున్నారని, చంద్రబాబు తన పర్యటనలో ఈ విషయం స్పష్టం చేస్తారని ఆయన అనుచరులు నియోజకవర్గంలో హడావుడి చేయడం ఆరంభించారు. దీంతో కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు మూడో కృష్ణుడికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. సత్తెనపల్లి సభలో కన్నా అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ఆయన అనుచరులు డప్పు కొట్టినా అక్కడ మాత్రం పూర్తి రివర్స్‌లో జరిగింది. సత్తెనపల్లికి ముందు చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించినపుడు కన్నా లక్ష్మీనారాయణ అధినేత పక్కనే ఉన్నారు. కాని సత్తెనపల్లి రోడ్‌షోలో కాని.. సభలో కాని కన్నా కనిపించలేదు. ఆ పరిసరాల్లో ఎక్కడా ఆయన జాడే లేదు. సత్తెనపల్లి సభలో చంద్రబాబుకు ఇరువైపులా కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు దర్శనమిచ్చారు. కన్నాకు సీటు ప్రకటిస్తారనని అందరూ భావిస్తే ఆయనకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకపోవడం, సభలో ప్రచార రథం కింద నిలబడి ఉండటం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. సత్తెనపల్లి రోడ్‌షో, సభలో చంద్రబాబు పక్కన కన్నా లేకపోవడానికి కోడెల శివరాం, వైవీ ఆంజనేయులే కారణమని వారిద్దరి వర్గీయులు చెబుతున్నారు. నాలుగేళ్లనుంచి పార్టీని మోస్తున్న తమను పక్కకు నెట్టి.. కొత్తగా వచ్చిన కన్నాకు సీటు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని చంద్రబాబుకే నేరుగా చెప్పినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తమ వల్లనే చంద్రబాబు పక్కన కన్నాకు చోటు దొరకలేదని చెప్పుకుంటున్నారు. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి టిక్కెట్ దక్కించుకుంటామే గాని.. కన్నాకు మాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని ఇప్పుడు వైరి వర్గాలు రెండూ ఘంటాపథంగా చెబుతున్నాయి. అయితే కన్నా వర్గీయులు మాత్రం కోడెల, వైవీ వర్గీయుల ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. చంద్రబాబు సత్తెనపల్లి పర్యటన మొత్తం కన్నా డైరెక్షన్లోనే జరిగిందంటున్నారు. మంచి రోజులు కాకపోవడంతో కన్నా సత్తెనపల్లిలో చంద్రబాబు వాహనం ఎక్కలేదని చెబుతున్నారు. త్వరలో పార్టీ అధినేతే కన్నా పేరు ప్రకటిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సత్తెనపల్లికి చంద్రబాబు వచ్చినపుడు అనుకున్నదొకటైతే.. జరిగింది మరొకటి. ఇక ముందు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ -
చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ ఫ్లాప్ : అంబటి
-
‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’
సాక్షి, పల్నాడు: టీడీపీ అధినేత చంద్రబాబుకి మంత్రి అంబటి రాంబాబు పొలిటికల్ పంచ్ ఇచ్చారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్ ప్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ సీరియస్ అయ్యారు. కాగా, మంత్రి అంబటి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైంది. చంద్రబాబు ఒక ముసలి సైకో. అధికారం లేకుండా ఉండలేని సైకో చంద్రబాబు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలే. చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. రెక్కల కష్టంలో పార్టీని నిలబెట్టిన జగన్ అనర్హులా?. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రమే అర్హులా? అన్ని ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా?. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబే కారణం. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే.. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు. బాబు.. ఎక్కడ పుట్టారు.. ఎక్కడ పెరిగారు?. సత్తెనపల్లి వచ్చి నాపై విమర్శలా?. చంద్రాబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైంది. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగింది’ అని అన్నారు. ఇది కూడా చదవండి: తండ్రీకొడుకులకు సెల్ఫీల పిచ్చి -
భోగి వేడుకల్లో.. మంత్రి అంబటి హుషారు స్టెప్పులు
సాక్షి, గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. తెల్లవారక ముందు నుంచే భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో సంబరాలు ప్రారంభించుకున్నారు ప్రజలు. ఇక.. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. తన ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు చేశారాయన. ఆపై గిరిజనులతో కలిసి స్టెప్పులు వేసి ఆటపాటల్లో పాల్గొన్నారాయన. వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి.. అక్కడున్న వాళ్లను హుషారెత్తించారు మంత్రి అంబటి. -
నేటి నుంచి వారం పాటు పెన్షన్ వారోత్సవాలు
-
ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ.. కొత్తగా మూడో కృష్ణుడి ఎంట్రీ
ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యేనే లేని చోట ఇదేం తలనొప్పిరా బాబూ అని కొందరు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. అక్కడ ఇప్పుడు కొత్తగా మూడో కృష్ణుడు రంగంలోకి దిగాడు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ? ఏ జిల్లాలో ఉంది? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌లకు పెద్ద తలనొప్పిగా మారింది. సత్తెనపల్లి పేరు వింటేనే తెలుగుదేశం అధినేతకు బీపీ పెరిగిపోతోంది. కోడెల శివప్రసాదరావు చనిపోవడంతో సత్తెనపల్లిలో ఇన్‌ఛార్జి పదవి ఖాళీ అయ్యింది. అప్పటినుంచి కోడెల కొడుకు శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు నువ్వా? నేనా? అంటూ ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు. ఇన్‌ఛార్జి పదవి కావాలంటూ ఇద్దరూ అధినేత దగ్గర తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఇద్దరు నేతలు వేర్వేరుగా చేస్తున్నారు. ఈ రెండు ముక్కలాటపై నారా బాబులిద్దరూ ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దాలని అచ్చెన్నాయుడిని రంగంలోకి దించారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చెయ్యవద్దని, పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహించాలని స్వయంగా అచ్చన్నాయుడు ప్రకటించారు. అయినా ఇద్దరు నేతల తీరు మారలేదు. పార్టీ ఆఫీసులోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఒకరి తర్వాత మరొకరు వస్తూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ గ్రూపు రాజకీయాలు కంట్రోల్ చేయడం కోసమంటూ.. అధిష్టానం ఒక ఇన్‌ఛార్జిని కూడా ఏర్పాటు చేసింది. రెండు గ్రూపుల దెబ్బకు ఇన్‌ఛార్జి దండం పెట్టాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు. చంద్రబాబు, లోకేష్ ఎన్ని చెప్పినా... ఏం చెప్పినా... ఎన్నిసార్లు చెప్పినా వారి మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇద్దరు నాయకులు. ఇప్పుడు సత్తెనపల్లిలో మరో ఛోటా నాయకుడు వచ్చి చేరాడు. పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు, నాలుగు జెండాలతో తెగ హడావుడి చేస్తున్నాడు తెలుగుయువత నేత అబ్బూరు మల్లి. దీంతో తెలుగుదేశం కార్యకర్తలకు మైండ్ బ్లాక్ అవుతోంది. ఏ నేత వద్దకు వెళితే ఏమవుతుందోనని కొంతమంది ఇంట్లోనే కూర్చుంటే.. మరికొంతమంది మాత్రం సత్తెనపల్లిలో పార్టీ పరిస్థితి చిరిగిన విస్తరాకులా మారినా అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ఉదాసీనత వల్లే పార్టీ రోజురోజుకూ పతమనవుతుందని నిప్పులు చెరుగుతున్నారు. కోడెల శివరాం, వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య వార్ నడుస్తుంటే అబ్బూరు మల్లి కేవలం ఆటలో అరటిపండు మాత్రమే అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో మీడియా హడావుడితో ఎదిగిన నాయకులు చాలామంది ఉన్నారని, మల్లిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. -
పడిన ప్రతిసారి అంతే వేగంగా నిలబడ్డాడు.. ప్రతిఫలంగా నేడు..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అంబటి రాంబాబు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పడిన ప్రతీసారి అంతకంటే వేగంగా లేచి నిలబడడం అంబటి నైజం. అనర్గళంగా మాట్లాడడం అంబటికి ఉన్న వరం. ఎంతటి కఠిన విషయమైనా సరే, విడమరిచి చెప్పడం ఆయన ప్రత్యేకత. విపక్షంపై ఎదురుదాడి చేయాలంటే అంబటి తర్వాతే ఎవరైనా. వ్యక్తిగతంగా అంబటిని లక్ష్యంగా చేసుకుని ఎన్ని దాడులు వచ్చినా.. కఠినంగా వాటిని తట్టుకుని నిలబడ్డారు అంబటి. తనకు అప్పగించిన ఏ బాధ్యతనయినా నూటికి నూరు శాతం నెరవేర్చడంలో పరిపాటి అంటారు అంబటి గురించి తెలిసిన వాళ్లు. పార్టీ అధికార ప్రతినిధిగా కూడా అంబటి బలమైన గళం వినిపించారు. గుంటూరు జిల్లా, రేపల్లెలో ఏవీ ఎస్ఆర్ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు అంబటి రాంబాబు జన్మించారు. ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుంచి 1986లో లా డిగ్రీ పూర్తి చేశారు. చదవండి: (AP New Cabinet: ఆ అంశాలే కాకాణికి కలిసొచ్చాయి..) రాజకీయ జీవితం 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా చేశారు. 1989లో రేపల్లె నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో సత్తెనపల్లినుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా.. టీడీపీ అభ్యర్థి, అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై 20,876 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎన్నికల సమయానికి సత్తెనపల్లి వీఐపీ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో సతైనపల్లి పట్టణంతో పాటు, సత్తెనపల్లి రూరల్ మండలం, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, మండలాలు సత్తెనపల్లిలో ఉన్నాయి. కోడెలపై విజయం తర్వాత విపక్షం అంబటిని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో టార్గెట్ చేసినా.. వాటికి ఎదురొడ్డి అసత్య ప్రచారాన్ని తిప్పగొడుతూ నిలబడ్డారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) -
సత్తెనపల్లిలో తల్లీకూతుళ్ల హత్య
సత్తెనపల్లి: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను అతి దారుణంగా నరికి చంపిన ఉదంతం గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నాగార్జున నగర్లో శనివారం రాత్రి కలకలం రేపింది. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లి పట్టణంలోని నాగార్జుననగర్‌కు చెందిన కోనూరు శివప్రసాద్ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. అనారోగ్యంతో కొంతకాలం కిందట ఆయన మృతిచెందారు. శివప్రసాద్‌కు భార్య పద్మావతి (55), కుమార్తె లక్ష్మీ ప్రత్యూష (30), కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీఓ సీసీగా పనిచేస్తున్నాడు. లక్ష్మీ ప్రత్యూష గర్భిణి కావడంతో తల్లి వద్ద ఉంటోంది. శివప్రసాద్ మరణానంతరం ఆయన సోదరుడు మధుసూదనరావు కుటుంబంతో విభేదాలు తలెత్తాయి. బెల్లంకొండ మండలం నందిరాజుపాలెంలో సుమారు ఆరు ఎకరాల పొలం శివప్రసాద్ పేరుతో ఉంది. అందులో తమకు వాటా ఉందని మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ గుంటూరులో ఉంటున్న శ్రీనివాసరావు శనివారం సత్తెనపల్లి వచ్చి పిన్ని పద్మావతి, సోదరి లక్ష్మీ ప్రత్యూషను అతికిరాతకంగా నరికి చంపాడు. సంఘటనా స్థలాన్ని సత్తెనపల్లి టౌన్, రూరల్ సీఐలు యూ. శోభన్‌బాబు, బి. నరసింహారావు, ఎస్ఐ రఘుపతి పరిశీలించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలిసింది. -
కోడెల శివరామ్‌పై టీడీపీ నేత ఫిర్యాదు
సాక్షి, సత్తెనపల్లి: శాసన సభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్ తన వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువైన లిక్కర్ తీసుకుని డబ్బులివ్వడం లేదని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీసులకు ఆదివారం టీడీపీ నేత నర్రా రమేష్ ఫిర్యాదు చేశాడు. రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన నర్రా రమేష్ టీడీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ వ్యాపారం చేశారు. గత సార్వత్రిక ఎన్నికలకు తన తండ్రి శివప్రసాదరావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో మద్యం పంపిణీ చేసేందుకు రూ.1.30 కోట్ల లిక్కర్‌ను తీసుకుని నగదు చెల్లించలేదని, డబ్బులు అడిగితే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 నుంచి 2019 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారుల నుంచి అనధికారికంగా నగదు వసూలు చేశాడని ఆరోపించారు. -
కరోనా సోకిందని ఇంట్లో పెట్టి తాళం
సత్తెనపల్లి: కరోనా సోకిందని ఓ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగింది. ఓ కుటుంబానికి కరోనా సోకడంతో ఇంటి యజమాని వారిని ఇంట్లో పెట్టి తాళం వేసింది. బాధితులు ఫోన్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితులను విడిపించి ఇంటి యజమానిని హెచ్చరించారు. -
గౌస్ మరణంపై ఏపీ పోలీస్ ట్వీట్
సాక్షి, గుంటూరు : జిల్లాలోని సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగం ట్విటర్ వేదికగా స్పందించింది. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్ఐ రమేశ్ ఆపి సాధరాణ విధుల్లో భాగంగా తనిఖీ చేసారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్ పడిపోవడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందారు. దీనిపై మంగళవారం ట్విటర్ ఏపీ పోలీసులు వివరణ ఇచ్చారు. (సత్తెనపల్లిలో యువకుడి మృతి) ‘గుంటూరు రూరల్ జిల్లాలో జరిగిన దురదృష్టకర సంఘటనలో షేక్ మహ్మద్ గౌస్ మరణించారు. ఈ సంఘటనలో పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. చెక్ పోస్ట్ వద్ద మృతుడిని ఆపిన సత్తెనపల్లి టౌన్ ఎస్ఐ డి.రమేష్ సస్పెండ్ చేశాం. మరణించిన వ్యక్తి బాల్యం నుండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపదుతున్నారు. ఆపరేషన్ చేసి స్టెంట్లు అమర్చారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పంచనామాలో గుర్తించారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. డీజీపీ డిపార్ట్మెంటల్ విచారణకు కూడా ఆదేశించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అన్ని విధానాలు పాటిస్తున్నాము’ అని ట్విటర్లో వివరించారు. -
సత్తెనపల్లిలో యువకుడి మృతి
సాక్షి, సత్తెనపల్లి, గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం ఆందోళనకు దారి తీసింది. వివరాలు.. పట్టణంలోని టింబర్ డిపో నిర్వాహకుడు షేక్ మహ్మద్ గౌస్(35) సోమవారం ఉదయం మందులు కొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళుతుండగా నరసరావుపేటరోడ్డులో చెక్ పోస్టు వద్ద ఎస్ఐ రమేశ్ ఆపి మందలించారు. అప్పటికే పోలీసులు కొడతారనే భయంతో ఉన్న, హృద్రోగి కూడా అయిన గౌస్ పడిపోవడంతో తండ్రి షేక్ మహ్మద్ ఆదం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందాడు. పోలీసుల దాడితోనే గౌస్ మరణించాడని ఆస్పత్రి ముందు, మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువులు ఆందోళన చేశారు. సీఐ పైనా దాడి చేశారు. ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోక్యం చేసుకుని గౌస్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని జిల్లా రూరల్ ఎస్పీని కోరడంతో ఆందోళన సద్దుమణిగింది. తర్వాత ఏఎస్పీ మాట్లాడుతూ ఆర్డీఓతో విచారణ చేయిస్తామని, పోలీసుల తప్పుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసులు కొడతారనే భయంతోనే గౌస్ చనిపోయాడని అతని తండ్రి చెప్పారు. గౌస్‌కు పదేళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేసి స్టంట్ కూడా వేశారు. ఎస్ఐను సస్పెండ్ చేశాం: ఐజీ ప్రభాకరరావు ఈ ఘటనపై ఎస్ఐను సస్పెండ్ చేశామని గుంటూరు రేంజ్ ఐజీ జె.ప్రభాకర్‌రావు తెలిపారు. రూరల్ ఎస్పీ సీహెచ్ విజయారావుతో కలిసి మాట్లాడుతూ గౌస్‌కు గుండె సంబంధిత సమస్య ఉందని, చికిత్స కూడా తీసుకుంటున్నాడని తెలిపారు. డీజీపీ ఆదేశాలతో అసహజ మరణం కింద కేసు నమోదు చేసి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహిస్తామని చెప్పారు. పోలీసులు దాడి లాఠీచార్జి చేసినట్లు రుజువైతే కారణమైన ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
సత్తెనపల్లిలో టీడీపీకి షాక్!
సాక్షి, గుంటూరు: జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు ఆర్యవైశ్య సంఘం నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బచ్చు మనోహర్, పెరుమాళ్ళ శివన్నారాయణ, జెమిలి రాధా, దేవతి సుబ్బారావు సహా పలువురు నేతలు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ముప్పాళ్ళ, నకరికల్లు మండలాల నేతలు సైతం టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకర్రావు వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా... అభివృద్ధి వికేంద్రీకరణకు అడ్డుపడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో చిన్న కాకాని వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై రాళ్లతో దాడి చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన పలువురు నేతలు పార్టీ మారడంతో టీడీపీ వర్గాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
మరోసారి బట్టబయలైన కోడెల పన్నాగం
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. శాసనసభలోని వస్తువులను గంపగుత్తగా సొంతానికి వాడుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన విద్యార్థుల కంప్యూటర్లనూ వదల్లేదని తాజాగా వెల్లడైంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో కంప్యూటర్ల చోరీతో ఈ డ్రామా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కంప్యూటర్లను ఇంట్లో పెట్టుకుని సొంతానికి వాడుకున్నట్టు తేలింది. అసలు కథ ఇదీ... కోడెల ఇంట్లో చోరికి గురైనట్టుగా చెబుతున్న కంప్యూటర్లు ప్రభుత్వానివి. విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన వీటిని సత్తెనపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి గతంలో తన ఇంటికి తెప్పించుకున్నారు కోడెల. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి కంప్యూటర్లు మాయమైన విషయాన్ని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసుల విచారణ వేగవంతం కావడంతో చోరీ నాటకానికి కోడెల తెర తీశారు. ఈ రోజు ఉదయం స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది కోడెల నివాసం నుంచి కంప్యూటర్లను తీసుకెళ్లారు. అనంతరం స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎమ్మెల్యే అంబటి రాంబాబు దగ్గరికి వెళ్లి అప్పుడు పోయిన కంప్యూటర్లు దొరికాయని చెప్పారు. ‘నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీరెందుకు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తును రికవరీ చేయాల్సింది పోలీసులు కదా’ అని అంబటి ప్రశ్నించగా సదరు అధికారి జవాబు చెప్పలేకపోయారు. దీంతో ఇదంతా కోడెల శివప్రసాదరావు ఆడించిన నాటకమని అర్ధమైంది. అసెంబ్లీ ఫర్నీచర్‌నే కాదు విద్యార్థుల కంప్యూటర్లను సొంతానికి వాడుకున్న కోడెలపై స్థానికులు మండిపడుతున్నారు. (చదవండి: ‘కే’ మాయ) -
కోడెల కక్కుర్తి కేసు; మరో ట్విస్ట్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల శివప్రసాదరావు నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. కరెంటు పనిచేయాలంటూ రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని చెప్పారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నట్టు కోడెల శివప్రసాదరావు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చోరీ జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసంలోని ఫర్నీచర్‌ను పరిశీలించేందుకు నేడు అసెంబ్లీ అధికారులు రాబోతున్న సమయంలో దొంగతనం జరగడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కంప్యూటర్లల్లో నిక్షిప్తమైన కీలక సమాచారాన్ని మాయం చేసేందుకే వీటిని ఎత్తుకెళ్లి ఉంటారన్న ఊహాగానాలు రేగుతున్నాయి. దుండగులు పడేసిన కంప్యూటర్ మానిటర్‌ను సెక్యురిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే సమాచారం నిక్షిప్తమైవుండే సీపీలను దుండగులు ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగినట్టుగా ఉందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ నుంచి విలువైన వస్తువులను సత్తెనపల్లిలోని తన ఇంటికి తెచ్చి పెట్టుకున్నట్టు కోడెల ఇప్పటికే ఒప్పుకున్నారు. ఆ వస్తువులన్నీ తిరిగి ఇచ్చేందుకు సిద్ధమని, లేకుంటే ఆ ఫర్నీచర్ ధర ఎంతో చెప్తే డబ్బు చెల్లిస్తానంటూ వితండ వాదనకు దిగారు. కోడెల కక్కుర్తిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేపట్టారు. (చదవండి: ‘కే’ మాయ) -
నరరూప రాక్షసుడు శివరాం
నరసరావుపేట టౌన్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కే ట్యాక్స్ పేరుతో కోడెల కుటుంబం ఐదేళ్లపాటు విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దందాలు, అక్రమ వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నాడు అణచివేతకు గురైన గొంతుకలు నేడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. తమ పొట్టలు కొట్టి కట్టిన అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చివేసి, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కే ట్యాక్స్ బాధితులు గత వారం రోజులుగా నరసరావుపేట, సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లకు బారులు తీరుతున్నారు. కోడెల కుటుంబంపై ఫిర్యాదుల పరంపర మంగళవారం కూడా కొనసాగింది. అమాయకుల నుంచి వసూళ్లు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కోడెల శివప్రసాదరావు, కోడెల శివరాం, విజయలక్ష్మి సాగించిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయించారు. విలువైన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి రూ.కోట్లు దండుకున్నారు. ల్యాండ్ కన్వర్షన్, అపార్ట్మెంట్ల అనుమతుల వ్యవహారంలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. కే ట్యాక్స్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేశారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కోడెల కుటుంబ సభ్యులు తమ రక్తం పీల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలం కబ్జా చేస్తామని బెదిరింపులు సత్తెనపల్లి పట్టణానికి చెందిన జెల్ది విజయప్రసాద్ మాచవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు నరసరావుపేట మండలం కేసానుపల్లి వద్ద వారసత్వంగా భూమి వచ్చింది. ఆ పొలంపై కోడెల కుమార్తె విజయలక్ష్మి కన్ను పడింది. ఆక్రమించేందుకు తన అనుచరులు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కళ్యాణం రాంబాబును అక్కడికి పంపించారు. విజయలక్ష్మితో మాట్లాడుకొని, కే ట్యాక్స్ చెల్లిస్తే కబ్జాకు గురికాకుండా ఉంటుందని వారు చెప్పటంతో ఆమె వద్దకు విజయప్రసాద్ వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగాలంటే తనకు రూ.15 లక్షలు కట్టాలని, లేకుంటే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు పొలం కూడా ఆక్రమిస్తానని విజయలక్ష్మి బెదిరించడంతో విజయప్రసాద్ ఒప్పుకొని మొదట రూ.10 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.5 లక్షల కోసం విజయలక్ష్మి, రాంబాబు, శ్రీనివాసరావు బెదిరించారని, కులం పేరుతో దూషించారని పోలీసులకు బాధితుడు విజయప్రసాద్ ఫిర్యాదు చేశాడు. స్థిరాస్తి వ్యాపారి నుంచి రూ.10 లక్షలు వసూలు నరసరావుపేట మండలం గుంటగార్లపాడులో పదేళ్ల క్రితం కొనుగోలు చేసిన 2.50 ఎకరాల్లో స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు ప్లాట్లుగా మార్చా. విషయం తెలుసుకున్న కోడెల కుమార్తె విజయలక్ష్మి తన పీఏ శ్రీనివాసరావు ద్వారా కబురు చేశారు. ఎవరిని అడిగి ప్లాట్లు వేశావని ప్రశ్నించారు. అన్ని అనుమతులు తీసుకున్నానని చెప్పినప్పటికీ వినకుండా నన్ను బెదిరించారు. రూ.10 లక్షలు బలవంతంగా వసూలు చేశారు. దీనిపై డీఎస్పీకి ఫిర్యాదు చేశా. – తాళ్ల వెంకట కోటిరెడ్డి, నరసరావుపేట ఉద్యోగం ఇప్పిస్తానని రూ.7 లక్షలు కాజేశారు మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం ఇప్పిస్తానని విజయలక్ష్మి రూ.5 లక్షలు తీసుకుంది. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడంతో కోడెల ఇంటిలో ఉండే కొల్లి ఆంజనేయులును సంప్రదించగా, ఆయన మరో రూ.2 లక్షలు తీసుకున్నాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో వారిన అడగ్గా విజయలక్ష్మి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశా – ఆలా శేఖర్, నరసరావుపేట నరరూప రాక్షసుడు శివరాం కోడెల శివరాం మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని విరించి రిసార్ట్స్ అధినేత నెల్లూరి వంశీకృష్ణ ఆరోపించారు. తన వద్ద రూ.2.30 కోట్ల కే ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపిస్తూ ఆయన మంగళవారం నరసరావుపేట డీఎస్పీ రామవర్మకు ఫిర్యాదు చేశారు. కోటప్పకొండ వద్ద 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి, వెంచర్ వేసేందుకు 2014లో మొదటి విడత 50 ఎకరాలకు ల్యాండ్ కన్వర్షన్‌కు అర్జీ పెట్టానన్నారు. కోడెల శివరాం తనను పిలిచి, ఎకరాకు రూ.2 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వనందుకు ఏడాది పాటు అనుమతులు రాకుండా అడ్డుపడ్డాడని ఆరోపించారు. ఈ విషయంలో అధికారులు కూడా సహాయం చేయకపోవడంతో మరో గత్యంతరం లేక ఎకరాకు రూ.1.50 లక్షల చొప్పున కోడెల శివరాంకు చెల్లించానన్నారు. రెండో విడతలో 65 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్‌కు సంబంధించి ఎకరాకు రూ.2 లక్షల చొప్పున కే ట్యాక్స్ చెల్లించానని తెలిపారు. దీంతో పాటు నరసరావుపేటలో ఏ కార్యక్రమం చేపట్టినా తనకు ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో రూ.35 లక్షల వరకు చెల్లించానన్నారు. కలిసి వ్యాపారం చేద్దామని తనను కోరగా మౌనం వహించడంతో బెదిరింపులకు పాల్పడి. తనతో రూ.కోటి వరకు పెట్టుబడి పెట్టించి, తన వాటాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా శివరాం మోసం చేశాడని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో నరసరావుపేట, సత్తెనపల్లిలో స్థిరాస్తి వ్యాపారులు, బిల్డర్లు కే ట్యాక్స్ చెల్లించలేక వ్యాపారాలు మానుకున్నారని గుర్తుచేశారు. మద్యం దుకాణాల కేటాయింపులో కే ట్యాక్స్ చెల్లించలేక టీడీపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. కోడెల శివరాం వేధింపులు భరించలేక మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని వెల్లడించారు. కే ట్యాక్స్‌పై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ కేసుల్లో ఇరికించేవాడన్నారు. అధికారులంతా అతడి చెప్పుచేతల్లోనే ఉండటంతో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో సమయం కోసం ఎదురు చూశామన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. కోడెల కుటుంబ అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపి, బాధితులందరికీ న్యాయం చేయాలని నెల్లూరి వంశీకృష్ణ కోరారు. -
కత్తి మహేష్ ఎన్నికల ప్రచారం
ముప్పాళ్ళ(సత్తెనపల్లి): టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు.