గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో అనధికార విద్యుత్ వాడకంపై అధికారులు కొరడా ఝళిపించారు.
సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలంలో అనధికార విద్యుత్ వాడకంపై అధికారులు కొరడా ఝళిపించారు. విద్యుత్ శాఖ అధికారులు నార్నెపాడు, బొల్లవరం గ్రామాల్లోని 1891 గృహ సర్వీసులకు సంబంధించి శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న 9 మందిపై కేసులు నమోదుచేయటంతోపాటు రూ.1.10 లక్షల జరిమానా విధించారు. విద్యుత్ శాఖ అధికారులు జె.శ్రీనివాసరెడ్డి, వి.ఆంజనేయులు, ప్రసాదరావు ఆధ్వర్యంలో సోదాలు సాగాయి.