
సాక్షి, సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరావుపేటలో అధికార టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అంబటి రాంబాబు, కాసు మహేశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం వీరిద్దరూ మీడియాతో మాట్లాడుతూ... పెదగొట్టిపాడు, జానపాడులో జరిగిన ఘటనలకు బాధ్యులు టీడీపీ నాయకులు, కార్యకర్తలేనని అన్నారు. టీడీపీ వ్యతిరేకంగా, వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటున్నారన్న అక్కసుతో ఎస్సీ, మైనార్టీలపై అధికార పార్టీ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. టీడీపీ జేబు సంస్థగా పోలీసువ్యవస్థ మారిందని దుయ్యబట్టారు. పోలీసుల పక్షపాత వైఖరి వల్లే రాష్ట్రంలో శాంతిభద్రతలు నశిస్తున్నాయని విమర్శించారు. అంత తామేనన్న అధికార మదంతో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
ఇళ్లపైకి వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి...
పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో శనివారం రాత్రి ముస్లింలపై అధికార పార్టీకి చెందిన సుమారు 70 మంది ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. తమ ఇళ్లపైకి వచ్చి అసభ్యకరంగా దూషించారని, రాళ్లు వేసి తలుపులు బద్దలుకొట్టారని బాధితులు తెలిపారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను కూడా కొట్టి గాయపరిచారని చెప్పారు. నిందితులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment