PM Narendra Modi on AP Bifurcation - Sakshi
Sakshi News home page

ఏపీని హడావుడిగా విభజించారు: ప్రధాని మోదీ

Published Tue, Feb 8 2022 1:34 PM | Last Updated on Tue, Feb 8 2022 4:35 PM

PM Narendra Modi On AP Bifurcation - Sakshi

న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ వేదికగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసమే ఏపీని హడావుడిగా విభజించారని మోదీ స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా భాగంగా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ విభజన తీరును తప్పుబట్టారు. ఏపీ, తెలంగాణ వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణమన్నారు. ప్రధాని మోదీ మాట్లాడిన పలు అంశాలు ఇవే...

  • రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావుడిగా విభజించారు.
  • తెలంగాణ ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు.
  • అయితే విభజన కోసం అనుసరించిన పద్ధతి సరిగా లేదు.
  • కలిసి చర్చిస్తే  విభజన ప్రక్రియ సాఫీగా జరిగేది
  • ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్‌ పార్టీనే కారణం.
  • మైక్‌లు కట్‌చేసి పెప్పర్‌ స్ప్రే కొట్టారు.
  • హడావుడిగా చర్చలేకుండానే విభజన బిల్లును ఆమోదిచారు.
  • తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు.
  • కాంగ్రెస్‌ అధికార గర్వం వల్ల సమస్యను జఠిలం చేశారు
  • ఏపీ, తెలంగాణ ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయి
  • విభజన చట్టంపై ఎలాంటి చర్చ జరపలేదు
  • ఏపీ వల్ల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. ఆ రాష్ట్రానికి అన్యాయం చేసింది
  • ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ ఓడిపోయింది
  • తెలంగాణ ఇచ్చినా.. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement