న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళశారం ప్రవేశపెట్టారు.రేపు (బుధవారం) లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు కానున్నాయి.
Modi government introduces new Women's Reservation bill in Lok Sabha
— ANI Digital (@ani_digital) September 19, 2023
Read @ANI Story | https://t.co/iJkqOu0fI4#Modigovernment #WomenReservationBill #LokSabha pic.twitter.com/xzdutRpVxK
కాగా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లు కాపీలను తమకు ఎందుకు ఇవ్వలేదని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అయితే డిజిటల్ ఫార్మాట్‌లో అప్‌మలోడ్ చేశామని కేంద్రం బదులిచ్చింది. ఇక ఈమహిళా రిజర్వేషన్ బిల్లుకు ‘నారీశక్తి వందన్’ పేరు పెట్టింది. ఈ బిల్లు కోసం 128 రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. బిల్లు పాసైతే పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు లభించనున్నాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్లు బిల్లు అమల్లో ఉండనుంది.
ఇదిలా ఉండగా లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించనున్నారు సభ్యులు. కాగా బిల్లు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘నారీ శక్తి వందన్ అధినియం' మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. సెప్టెంబర్ 19 చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు.
ముప్పై ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ బిల్లుకు విపక్షాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ప్రధాని కోరారు. కొత్త పార్లమెంట్ భవనంలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని తెలిపారు. తమ ప్రభుత్వం ముఖ్యమైన రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తోందని, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి తమ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
చదవండి: కెనడా విషయంలో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు
Comments
Please login to add a commentAdd a comment