women reservation bill
-
తరాల నిరీక్షణకు తెర
పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్‌సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టీకల్ 370 రద్దు చేయడంతోపాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ సభలోనే ఆమోదం లభించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫామ్ (పనితీరు), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు) కాలంగా సాగాయి. దేశమంతటికీ ఒకే రాజ్యాంగం ఉండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. ఈ ఐదేళ్లలో పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్‌కు పునాదులు వేశామని పేర్కొన్నారు. న్యూఢిల్లీ: పలు కీలకాంశాలపై దశాబ్దాల నిరీక్షణకు 17వ లోక్‌సభ తెర దించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతించారు. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. ‘‘ఈ ఐదేళ్లూ రిఫార్మ్ (సంస్కరణలు), పెర్ఫామ్ (పనితీరు), ట్రాన్స్‌ఫార్మ్ (మార్పు) కాలంగా సాగాయి. దేశమంతటికీ ఒకే రాజ్యాంగముండాలన్న ప్రజల కలను నిజం చేశాం. మరెన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొని అధిగమించాం. దేశానికి సరైన దిశానిర్దేశం చేశాం. ఫలితంగా భారీ మార్పుల దిశగా అమిత వేగంతో భారత్ దూసుకుపోతోంది. ఈ ప్రయాణంలో సభ్యులంతా భాగస్వాములయ్యారు’’ అంటూ కొనియాడారు. పలు కీలక సంస్కరణలతో బలోపేతమైన భారత్‌కు ఈ ఐదేళ్లలో పునాదులు వేశామని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అభినందిస్తూ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శనివారం లోక్‌సభలో స్పీకర్ ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ‘‘17వ లోక్‌సభకు ఇది చివరి పని దినం. గొప్ప మార్పులకు, నిర్ణయాలకు వేదికగా నిలిచిన 17వ సభను దేశం ఎప్పటికీ ఆశీర్వదిస్తూనే ఉంటుంది’’ అని అభిప్రాయపడ్డారు. రామాలయ అంశంపై బీజేపీపై విపక్షాలు పదేపదే విమర్శలు చేస్తూ వచ్చాయంటూ మోదీ మండిపడ్డారు. ‘‘వాస్తవమేమిటంటే ఇలాంటి గొప్ప బాధ్యతలను తలకెత్తుకుని పూర్తి చేసే సామర్థ్యం అందరికీ ఉండదు. చేతులెత్తేసి పారిపోతారు’’ అంటూ చురకలు వేశారు. ‘‘ఆలయ నిర్మాణంపై ఈ రోజు సభలో జరిగిన చర్చలు మన సహానుభూతికి, సున్నితత్వానికి, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అన్న మా ప్రభుత్వ దీక్షకు అద్దం పట్టాయి’’ అన్నారు. దేశ ఘనత పెంచనున్న ఎన్నికలు రానున్న లోక్‌సభ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఘనతను మరింత పెంచుతాయని తనకు పూర్తి నమ్మకముందన్నారు. ‘‘బ్రిటిష్ కాలం నాటి ‘శిక్షాత్మక’ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ చట్టాలను తెచ్చాం. కరోనా సవాలును అధిగమించడంలో ప్రపంచ దేశాలకే భారత్ బాసటగా నిలిచింది. ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని వీలైనంతగా తగ్గించడమే ప్రజాస్వామ్య ప్రభుత్వ సామర్థ్యానికి గీటురాయి. ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ మన మూలమంత్రం’’ అన్నారు. -
జన గణన తరువాత మహిళా బిల్లు అమలు
శివాజీనగర(బెంగళూరు): 2024లో జన గణన పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో రాణి అబ్బక్క స్మారక తపాలా స్టాంపును శనివారం ఆమె విడుదల చేసి మాట్లాడారు. ప్రధాని మోదీకి దేశ నిర్మాణంలో మహిళల పాత్రపై ఉన్న ఎంతో విశ్వాసం వల్లనే మహిళా బిల్లు వాస్తవ రూపం దాలి్చందని చెప్పారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉళ్ళాల రాణి అబ్బక్క ధైర్యం, ధీరత్వం గొప్పదన్నారు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది గుర్తు తెలియని పోరాటయోధుల సేవలను స్మరించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం 14,500 మంది స్వాతంత్య్ర సమరవీరుల కథలతో డిజిటల్ భాండాగారాన్ని రూపొందిస్తోందని చెప్పారు. -
రెండు సీట్లు రాని బీజేపీ బీసీని సీఎంను చేస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికల్లో రెండు సీట్లు కూడా గెలవని బీజేపీ.. ఇప్పుడు బీసీలకు సీఎం పదవి అనడం హాస్యాస్పదమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. ఏదైనా చెప్పేముందు దానిలో వాస్తవికత ఉండాలని అన్నారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తామన డం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఏ పార్టీకీ బీ టీమ్ కాదని తలసాని స్పష్టం చేశారు. తమది ఏ టీమ్ అని, సింగిల్ గానే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తమను గెలిపిస్తుందన్నారు. బీఆర్ఎస్కు తగినన్ని సీట్లు రావనే ప్రశ్నే ఉత్పన్నం కాదని, 78 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పారు. కేంద్రంలోనూ కీలక భూమిక పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు! పోటీ చేసేందుకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి లేరని తలసాని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన 27 మందికి సీట్లివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి వెంటనే సీట్లు ఇస్తోందన్నారు. బల్దియా ఎన్నికల్లో ఎక్కువ మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తేవడం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆడిన డ్రామా అని విమర్శించారు. తాము అమలు చేస్తు న్న పథకాలను దేశమే కాపీ కొడుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలు ఓటువేసే హక్కును ఉపయోగించుకోవాలని, ఓట్లు వేయరనే అపప్రదను చెరిపి వేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం, చంద్రబాబు అరెస్టు, తదితర పరిణామాల ప్రభావం ఇక్కడ ఏమాత్రం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యల్ని బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరిస్తుందంటూ, తమ(ఎమ్మెల్యేల)ఇళ్ల స్థలా లు కూడా ఆగిపోయాయని వ్యాఖ్యానించారు. -
స్పష్టమైన విజన్ లేదు.. మోదీ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల: ప్రియాంక గాంధీ
జైపూర్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఉత్త డొల్ల అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. మోదీ పాలనలో సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడే లేకుండాపోయాడని అన్నారు. కేవలం కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి స్పష్టమైన విజన్ లేదని, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆమె బుధవారం రాజస్తాన్‌లోని ఝన్‌ఝున్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుల గణనపై బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ‘ఖాళీ లిఫాఫా' మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మోదీ ఖాళీ లిఫాఫా (కవరు) అంటూ మోదీని ఎద్దేశా చేశారు. 10 ఏళ్ల తరువాత మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుందంటూ మండిపడ్డారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. . ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ మతాలు, కులాల గురించి మాట్లాడుతోందని ఆక్షేపించారు. అధికారం కాపాడుకోవడానికి ప్రజలను అణచివేసే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి సొంత లాభం కోసం పాకులాడే నాయకులను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లకు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభలో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రెండు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 1.05 కోట్ల కుటుంబాలకు రూ.500కు వంట గ్యాస్ సిలిండర్ అంద జేస్తామని చెప్పారు. అలాగే అర్హులైన మహిళలకు సంవత్సరానికి రూ.10,000 చొప్పున గౌరవ భృతి ఇస్తామని వెల్లడించారు. ఇంటి పెద్ద అయిన మహిళలకు ఈ గౌరవ భృతి అందుతుందని పేర్కొన్నారు. -
ఇండియా కూటమి రాకతో
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారం చేపట్టి పార్లమెంట్ ఆమోదం పొందిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకు రావడం తథ్యం అని ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో చెన్నై వైఎంసీఏ మైదానంలో మహిళా హక్కు మహానాడు శనివారం రాత్రి జరిగింది. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన, డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. ఆమె ప్రసంగిస్తూ, దేశంలో మహిళలు వివిధ రంగాలలో పురోగమిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలనే కాంక్షతో ఆది నుంచి కాంగ్రెస్ పొరాడుతున్నట్లు పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే, ఆ కుటుంబమే చదువుకున్నట్లని వ్యాఖ్యానించారు. మహిళా నాయకత్వం విస్తృతం, మహిళ చేతికి అధికారంలోకి వస్తే దేశం బలోపేతం అవుతుందన్న కాంక్షతో గతంలోనే 33 శాతం రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టామన్నారు. యూపీఏ హయాంలోనే ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందినా, ఏకాభిప్రాయం కుదరక పార్లమెంట్లో చట్టం ఆమోదం పొందలేక పోయినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిందని గుర్తు చేస్తూ, దీనిని ఎప్పుడు అమలు చేస్తారో అన్నది స్పష్టం చేయడం లేదన్నారు. రేపు చేస్తారా..? ఎల్లుండి చేస్తారా..? ఏడాది తర్వాత చేస్తారా..? రెండేళ్ల తర్వాత చేస్తారా...? అని ప్రశి్నస్తూ, ఈ బిల్లు అమలు అన్నది రానున్న ఇండియా కూటమి ద్వారానే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ చట్టం కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేసిందని గుర్తుచేస్తూ, ఇండియా కూటమి రాకతో ఈ చట్టం అమల్లోకి రావడం తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాం«ధీ, జమ్మూకశీ్మర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, బిహార్ ఆహార శాఖ మంత్రి లేషి సింగ్, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి అన్నీ రాజా, తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సుష్మితా దేవ్, ఢిల్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ తదితరులు పాల్గొన్నారు. -
తాత్సారంలో ఆంతర్యమేమిటి?
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నూతన పార్లమెంట్ భవనంలో అట్టహాసంగా తెచ్చిన తొలి బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో చట్టరూపం దాల్చింది. ‘నారీ శక్తి వందన్ యాక్ట్–2023’గా పిలుస్తున్న దీన్ని సెప్టెంబర్ 19న లోక్‌సభ, సెప్టెంబర్ 21న రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీన్ని నియోజక వర్గాల పునర్విభజన తర్వాత, అంటే 2029 ఎన్నికల వరకు గానీ అమలుచేయకపోవడం గమనార్హం. కాబట్టి, ఈ రిజర్వేషన్లను జాప్యం చేయాలన్న ఉద్దేశం ఇందులో కనబడుతోంది. స్త్రీలు పార్లమెంట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారిపోతుంది. వీరు కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలనూ, బీసీలనూ, దళితులనూ నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. నూతన పార్లమెంటు భవనంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ఒక చారిత్రా త్మకమైన విషయంగా చెప్పవచ్చు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన రోజున తొలి బిల్లుగా ప్రవేశపెట్టడం విశేషం. ఈ బిల్లు ప్రకారం రాజ్యసభ, పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటాను అమలు చేస్తారు. 33 శాతంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు వారి రిజర్వేషన్ల కోటా ఆధారంగా కేటాయిస్తారు. 15 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ రిజర్వేషన్లను వెంటనే కాకుండా నియో జకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) తర్వాత అమల్లోకి తేవాలని నిర్ణయించడం గమనార్హం. 2026లో డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. అది పూర్తయ్యి రిజర్వేషన్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టడం ఖాయం. అంటే 2024 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు అమల్లోకి రావు. 2029 లోనే ఈ కోటా అమలయ్యే అవకాశముంది. ఆశ్చర్యకరమైన బిల్లు ఈ రిజర్వేషన్ల బిల్లు చాలాసార్లు సభల ముందుకు వచ్చింది. ప్రతిసారీ ఏకాభిప్రాయం కుదరక ఆమోదం పొందలేదు. దాదాపుగా 27 ఏళ్లుగా అది పెండింగ్‌లోనే ఉండిపోయింది. కనీసం 50 శాతం రాష్ట్రాలు ఈ బిల్లును ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ బిల్లులో చాలా లొసుగులు వున్నాయి. ఆవ్‌ు ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి మహిళా రిజర్వేషన్ బిల్లును 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలను మోసం చేసేందుకు తెచ్చిన బిల్లు అని ఆరోపించారు. నిజానికి ఈ బిల్లులో పితృస్వామిక ఆధిపత్యం ఉంది. దళిత బహుజన వివక్ష ఉంది. ముఖ్యంగా బీసీలను అధికారం లోనికి రాకుండా చేసే కుట్ర దాగి ఉంది. డీలిమిటేషన్ అయిన తర్వాత ఎప్పుడో 2029లో రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అనడంలోనే వీటిని జాప్యం చేయాలనే ఆలోచన వుంది. నిజానికి హిందుత్వవాదులు మనుస్మృతి అనుచరులు. మనుçస్మృతిని క్రీ.పూ. రెండవ శతాబ్దంలో రాసివుంటారని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు. బౌద్ధయుగం అంతరించి హిందూ రాజ్యాలు ఆవిర్భవించే క్రమములో పుష్యమిత్రులు ఈ మనుస్మృని బ్రాహ్మణ రాజ్య నిర్మాణానికి సాధనంగా వాడుకున్నారు. వర్ణవ్యవస్థ పున రుద్ధరణ, స్త్రీ అణచివేత యిందులో ప్రధానమైన అంశాలుగా ముందుకు వచ్చాయి. ‘పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే రక్షంతి స్థావిరే పుత్రాన స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని చెబుతుంది మనుస్మృతి. బాల్యమున తండ్రి స్త్రీలను రక్షించును. యౌవనమున మగడు రక్షించును. ముసలితనమున పుత్రుడు రక్షించును. కావున స్త్రీ స్వతంత్రురాలిగా నుండటానికి వీల్లేదు. (భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షింతురు). దీన్నిబట్టి మనకేమి అర్థమౌతుందంటే హిందూ పురుషుడు స్త్రీకి భయపడ్డాడు. ఈ భావజాలానికి ప్రతీకగా వున్న పార్టీ మహిళా బిల్లు ప్రవేశపెట్టిందంటే, నమ్మశక్యంగా లేదు. రాజకీయాల్లోకి స్త్రీలను అసలు రాకుండా అడ్డుకోవడం జరుగు తూనే ఉంది. ఆయా పార్టీలు స్త్రీలకు సీట్లు ఇవ్వడమే తక్కువ. ఆ రాజకీయ ప్రాతినిధ్యం కూడా అగ్రకులాల స్త్రీలకే లభ్యం అయ్యింది. భారతదేశంలో ఇప్పుడు 5 శాతం కంటే తక్కువ స్త్రీలు పార్లమెంట్లో ఉన్నారు. జెకోస్లేవేకియా, సోవియట్ రష్యాల చట్టసభలలో 27 నుండి 28 శాతం వరకు స్త్రీలకు ప్రాతినిధ్యం ఉంది. పశ్చిమ యూరప్‌లో, యూఎస్ఏలో 3 నుండి 4 శాతం స్త్రీల ప్రాతినిధ్యం మాత్రమే చట్ట సభలలో ఉంది. పార్టీలు 10 నుండి 15 శాతం సీట్లు కేటాయించినట్లు ప్రకటించినా, భారతదేశంలో స్త్రీలకు 7 శాతం కంటే సీట్లు మించలేదు. వారిలోనూ ఎన్నికైన స్త్రీల అభ్యర్థుల సంఖ్య ఇంకా తక్కువగా ఉంటోంది. నామమాత్ర రిజర్వేషన్లు పట్టణీకరణ ప్రభావం స్త్రీల రాజకీయ ప్రవేశానికి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు. స్టేటస్ ఆఫ్ వుమెన్ కమిటీ 1977లో చేసిన సర్వే ప్రకారం, గ్రామీణ స్త్రీలే ఎక్కువ రాజకీయ చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. స్త్రీల రిజర్వేషన్‌కు సంబంధించిన విషయాలే ఇలా ఉంటే, ఇక స్త్రీలు ఓపెన్ కాంపిటిషన్లో సీట్లు గెలవడం కష్టంగా ఉంది. గ్రామ పంచాయితీల్లో పురుషుల ప్రాతి నిధ్యం ఎక్కువ ఉండడం వలన ఎన్నికైన స్త్రీలు కూడా నామమాత్రంగానే తమ ప్రాతినిధ్య విలువను వ్యక్తీకరించగలుగుతున్నారు. మొత్తం రాజకీయ పెత్తనం అగ్రకులాల పురుషులదైనపుడు దళితులకు, స్త్రీలకు ఇస్తున్న రాజకీయ రిజర్వేషన్లు నామమాత్రం అవుతున్నాయి. దళిత స్త్రీలకు దాదాపు రాజకీయాధికారంలో భాగస్వామ్యం లేదు. భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఎన్నికలు కూడా ఒక పెద్ద ఫార్సుగా తయారయ్యాయి. డబ్బు, మత్తు మందులు, హైటెక్ ప్రచారం, గూండాయిజం ఉన్నవాళ్ళకే పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. ఎవరికైనా స్త్రీలకు సీట్లు ఇస్తే పితృస్వామ్యాన్ని పోషించగలిగిన స్త్రీలకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పెక్కు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపా లించారు. ఆమె కాలంలో కాంగ్రెస్ పార్టీలో స్త్రీలకు ఎక్కువ ప్రాతి నిధ్యం కల్పించడం కానీ, ఏ విధమైన స్త్రీల సంస్కరణలు కానీ జరగలేదు. కొందరు స్త్రీలు పురుష పెత్తందారితనాన్ని అనుకరించ డమే స్త్రీవాదం అనుకుంటారు. దళితులు, స్త్రీలు రాజకీయ భాగస్వామ్యాన్ని పొందకపోవడంతో సమంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ డాక్టర్ మణి పి. కమేర్కర్ ఇలా అన్నారు: ‘స్త్రీలను ఒక అల్ప సంఖ్యాక వర్గంగా లెక్కించి, దళితులను నిర్లక్ష్యం చేసినట్లే రాజకీయాల్లో స్త్రీలను కూడా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వం తన ప్రచార సాధనాల ద్వారా స్త్రీలను వస్తువులు, అలంకారాలు, ఫ్యాషన్ల మోజులో పడేలా చేసి, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల వారి చైతన్యాన్ని దిగజార్చడానికి ప్రయత్నాలు చేస్తోంది. పురుష సమాజం చేస్తున్న కుట్రలతో స్త్రీలలో కూడా రాజకీయేతర జీవనం ఎక్కువైంది. భారతదేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీల రాజకీయ చైతన్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది.’ నాయకత్వ స్థానంలోకి వచ్చినప్పుడే... రాజకీయ చైతన్యానికి ముందు భారత ఉపఖండంలో స్త్రీలలో ఇంకా బలంగా, సామాజిక ఆర్థిక, సాంస్కృతిక పోరాటాలు జరగాలి. ఉద్యమాల నుండి వచ్చిన కార్యకర్తలు గ్రామస్థాయిలో రాజకీయ నాయకులుగా ఎదగాలి. సమాజ పునర్నిర్మాణానికి, పితృస్వామ్యానికి భిన్నంగా వారు కృషి చేయాలి. ఇతర దేశాలలో కూడా సమాజ ఉపరి తలానికి సంబంధించిన స్త్రీలే నాయకత్వ స్థానాలలో ఉన్నారు. సమాజ పునాదిని నిర్మించిన దళిత స్త్రీలు రాజకీయ చైతన్యాన్ని, నాయ కత్వాన్ని పొందగలిగినపుడే స్త్రీ స్వామ్యం సాధ్యమౌతుంది. జనాభా నిష్పత్తిని బట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చినప్పుడే భారతదేశంలో నూత్న విప్లవం వస్తుందని అంబేడ్కర్ చెప్పారు. స్త్రీ ఒక ఉజ్వల శక్తి. వీరు పార్లమెట్‌లోకి వెళ్తే సమాజ భవితవ్యమే మారి పోతుంది. కుటుంబాన్ని తీర్చిదిద్దినట్లే సమాజాన్ని తీర్చిదిద్దగలరు. స్త్రీలను, బీసీలను, దళితులను నిర్లక్ష్యం చేసినంతకాలం ఆ పార్లమెంటుకు అర్థంలేదు. శ్రామిక శక్తులు, ఉత్పత్తి శక్తులు, దళిత బహుజన స్త్రీ నారీ మణులు, ఈ పార్లమెంట్‌ను అలంకరించే రోజు రావాలి. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమనేత ‘ 98497 41695 -
లిప్‌స్టిక్ పెట్టుకునే ఆడవాళ్ల హంగామా మొదలు.. ఆర్జేడీ నేత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రత్యేక పార్లమెంట్ సెషన్లలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్దిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్‌స్టిక్‌లు బాబ్ కట్ చేసుకున్న మహిళలంతా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో ముందుకొస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని నేతలు కూడా విభేదించారు. బీహార్‌లోని ముజాఫర్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో సిద్దిఖీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది కాబట్టి ఇకపై లిప్‌స్టిక్‌లు పెట్టుకునే ఆడవాళ్లు బాబ్ కట్ చేసుకునే ఆడవాళ్లు మహిళా రిజర్వేషన్ పేరు చెప్పి హంగామా చేయడం మొదలు పెడతారు చూడండని వ్యాఖ్యానించారు. తర్వాత ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ గ్రామస్తులకు అర్ధమయ్యే విధంగా చెప్పడం కోసం తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మొదటి నుంచి ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతిస్తూనే ఉందన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కూడా ఆర్జేడీ బిల్లుకు మద్దతిచ్చిందని బిల్లులో ఓబీసీలను చేర్చకపోవడంపై మాత్రం తమ పార్టీ తీవ్రస్థాయిలో విభేదించిందని గుర్తుచేశారు. అబ్దుల్ బారీ సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కౌశల్ కిషోర్ స్పందిస్తూ.. దీనినిబట్టి ఆయన ఆలోచనలు ఎంత కింది స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతున్నాయన్నారు. మహిళలు చట్టాలను, రాజ్యాంగాన్ని బాగా అధ్యయనం చేసి ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించేందుకు వస్తున్నారు. ఒక కారుకు చక్రాలు ఉన్నట్టుగానే పార్లమెంటులో కూడా పురుషులు మహిళలు చట్టాలు చేయడంలో భాగస్వాములవుతారని.. ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. సిద్దిఖీ చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ వారు కూడా ఖండించారు. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి మాట్లాడుతూ.. మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదు. ఓబీసీల తోపాటు ఎస్సీ,ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారు కూడా రిజర్వేషన్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో అంశాన్ని ఆర్జేడీ తోపాటు మిగతా పార్టీలు కూడా విభేదించాయి. సమాజ్‌వాది పార్టీ ఎంపీలు శరద్ యాదవ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇక స్వర్గీయ సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అయితే ఇదే అంశంపై మాట్లాడుతూ ఈ బిల్లు వలన సంపన్న కుటుంబాల్లోని ఆడవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప గ్రామస్థాయిలో మహిళలకు ఎటువంటి ప్రయోజనం ఉండదని 2012 లోనే అన్నారు. ఇది కూడా చదవండి: ‘కేసీఆర్ ఇంకా 90 రోజులే ప్రగతి భవన్లో ఉంటారు’ -
బిల్లుకు అయిష్టంగానే విపక్షాల ఆమోదం
భోపాల్/జైపూర్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు మరో గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే మద్దతు ఇచ్చాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నారీశక్తిని అర్థం చేసుకొని, సంకోచిస్తూనే బిల్లుకు ఆమోదం తెలిపాయని అన్నారు. తమ పట్టుదల వల్లే బిల్లు పార్లమెంట్లో నెగ్గిందని వివరించారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో మనకు తెలిసిందేనని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్, దాని మిత్రపక్షాల అహంకార కూట మికి అధికారం అప్పగిస్తే ఈ బిల్లు విషయంలో వెనక్కి మళ్లుతాయంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. బిల్లు పరిస్థితి వెనక్కి వెళ్లిపోతుందని పరోక్షంగా స్పష్టం చేశారు. జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లో సోమవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్’లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీని తుప్పు పట్టిన ఇనుముతో పోల్చారు. బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు అలవాటేనని ఆక్షేపించారు. కాంగ్రెస్‌ను రాజకీయ నాయకులు నడిపించడం లేదని, పార్టీని అర్బన్ నక్సలైట్లకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాలను, నినాదాలను ఈ లీజుదారులే నిర్ణయిస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక గెలిపిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ దివాలా తీసింది కాంగ్రెస్ దేశంలో ప్రతికూలతను వ్యాప్తి చేస్తోందని, దేశం సాధించిన ఘనతలను ఆ పార్టీ ఇష్టపడడం లేదని ప్రధానమంత్రి మోదీ ధ్వజమెత్తారు. దేశాన్ని 20వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను కాంగ్రెస్ వ్యతిరేకించిందని, కానీ, ప్రపంచ దేశాలు ఈ వ్యవస్థను ప్రశంసించాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ మనోబలం కోల్పోయిందని, దివాలా తీసిందని చెప్పారు. అందుకే అర్బన్ నక్సలైట్లకు పార్టీని లీజుకు ఇచ్చారని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజాబలం లేదన్నారు. మహిళలను విభజించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే వారంతా అప్రమత్తంగా ఉండాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పేదలు ఎప్పటికీ పేదలుగా ఉండాలన్నదే కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ను గద్దె దించాలి రాజస్తాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యువత జీవితాల్లో ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలి్పంచలేదని అన్నారు. రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ‘పరివర్తన్ సంకల్ప్ మహాసభ’లో మాట్లాడారు. పరిపాలన పరంగా కాంగ్రెస్ సర్కారుకు సున్నా మార్కులే వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో మాఫియాలు చెలరేగిపోతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. మహిళల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక కాంగ్రెస్ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇచి్చందని చెప్పారు. -
ఈ టైంలో యూరప్ ట్రిప్పు అవసరమా?.. దీదీపై ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్‌సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు. అర్ధం చేసుకోలేరా? కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. విలాసాలకు డబ్బెక్కడిది? ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్‌లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. మామూలు రైలే.. ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్‌కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్‌కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. దృష్టి మళ్లించడానికే.. ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు. #WATCH | Murshidabad, West Bengal: West Bengal Congress President Adhir Ranjan Chowdhury says, "PM Modi's government keeps on making excuses before elections... Be on the Women's Reservation Bill or the One Nation, One Election... To do anything, it is necessary to come to… pic.twitter.com/LSi9Ehi1Ew — ANI (@ANI) September 24, 2023 ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా -
కులగణన అంటే మోదీకి భయమెందుకు?
జైపూర్: దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించాలని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కుల గణనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలని పునద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు కోటా కల్సించాలని అన్నారు. రాహుల్ శనివారం రాజస్తాన్‌లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. మహిళా రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమలు చేయడం సాధ్యమేనని రాహుల్ స్పష్టం చేశారు. జనగణన, నియోజకవర్గాల పునరి్వభజన ముసుగులో ఈ రిజర్వేషన్లను వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఓబీసీల గురించి నిత్యం మాట్లాడే ప్రధానమంత్రి కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియడం లేదని చెప్పారు. దయచేసి ఓబీసీలను మోసం చేయకండి అని కోరారు. కుల గణన గురించి పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రయతి్నస్తే బీజేపీ సభ్యులు తన గొంతుకను అణచివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలను రాహుల్ బబ్బర్ షేర్స్ (సింహాలు)గా అభివరి్ణంచారు. అదానీతో ప్రధాని మోదీ సంబంధాలను రాహుల్ మరోసారి ప్రస్తావించారు. -
ఇక మగాళ్ళ పని అయిపోయినట్లే..
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవ ఆమోదం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నారీశక్తి వందన్ అధినియమ్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన రాజ్యసభ
-
Womens Reservation Bill 2023: ఓబీసీలపై కాంగ్రెస్ సవతి ప్రేమ
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ఓబీసీ కోటా కూడా కలి్పంచాలన్న కాంగ్రెస్ పార్టిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దుమ్మెత్తిపోశారు. వారిపై కాంగ్రెస్ ప్రేమ మాటలకే పరిమితమన్నారు. అధికారంలో ఉండగా ఓబీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేకపోగా కనీసం వారి గురించి ఆలోచించను కూడా లేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ రూపంలో దేశానికి తొలి ఓబీసీ పీఎంను ఇచ్చింది బీజేపీయేనని గుర్తు చేశారు. మహిళా బిల్లుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతివ్వాలని అన్ని పార్టిల ఎంపీలను కోరారు. బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించడం తెలిసిందే. రాహుల్ ది ట్యూటర్ తెలివిడి 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి పాలనలో కేంద్రంలో ఎందరు ఓబీసీ కార్యదర్శులున్నారో చెప్పాలని నడ్డా ప్రశ్నించారు. సరీ్వసుల్లో ఉన్న అధికారులకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లను కేవలం 1992లో సుప్రీంకోర్టు సూచన అనంతరం మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. 90 మంది కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల్లో ఓబీసీలు కేవలం ముగ్గురే ఉన్నారన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపణలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘ట్యూటర్లను పెట్టుకుంటే చాలదు. నాయకుడు కావాలంటే చిత్తశుద్ధితో అందుకోసం ప్రయతి్నంచాలి‘ అంటూ ఎద్దేవా చేశారు. ‘303 మంది బీజేపీ లోక్ సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. ఇది కాంగ్రెస్ మొత్తం సభ్యుల కంటే కూడా చాలా ఎక్కువ! దేశవ్యాప్తంగా మా పార్టికి ఉన్న ఎమ్మెల్యేల్లో 27 శాతం, ఎమ్మెల్సీల్లో ఏకంగా 40 శాతం ఓబీసీలే. మహిళా సాధికారత కోసం మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ మాత్రం కేవలం మైనారిటీల సంతుష్టికరణ, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ట్రిపుల్ తలాక్ వంటి అంశాలను లేవనెత్తుతూ ఉంటుంది‘ అని నడ్డా అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కాదు మహిళా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్‌ను నడ్డా తోసిపుచ్చారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నడచుకుంటుందన్నారు. మహిళా బిల్లు ద్వారా లబ్ధి పొందడం బీజేపీ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో ప్రస్తుతం కేంద్రం అనుసరిస్తున్నదే సరైన, అత్యంత దగ్గర విధానమని చెప్పారు. అంతకుముందు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ మహిళా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానికి సభ ఆమోదం లాంఛనమేమని భావి స్తున్నారు. అనంతరం మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జన గణన గణాంకాల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. వాగ్వాదం రాజ్యసభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, జేపీ నడ్డా మధ్య వా గ్వాదం వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. బిల్లు అమలు కాలావధిపై విపక్షాల విమర్శలను నడ్డా విమర్శించడం ఇందుకు దారితీసింది. ఖర్గే జోక్యం చేసుకుంటూ, బీజేపీకి దమ్ముంటే రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని సవాలు చేశారు. -
మహిళా బిల్లులో ఓబీసీ సబ్ కోటా చేర్చాలి : R. కృష్ణయ్య
-
మహిళా బిల్లు ఆమోదంపై ప్రధాని మోదీ హర్షం ఇదే
-
మహిళా రిజర్వేషన్ బిల్లుకు YSRCP సంపూర్ణ మద్దతు ఇస్తుంది
-
రాజ్యసభ, మండలిలోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ, రాష్ట్రాల శాసన మండలిలో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లుకు విస్పష్టంగా మద్దతు తెలుపుతోందని ఆయన ప్రకటించారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు రాజ్యసభ, రాష్ట్రాల శాసనమండలిలో మహిళల రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని అన్నారు. రాజ్యసభ, మండలిలో సభ్యులు తమ టర్మ్ పూర్తవగానే రిటైర్ అవుతుంటారు. అందువలన రెండేళ్ళకు ఒకసారి ఖాళీలు ఏర్పడుతుంటాయని అన్నారు. కాబట్టి రాజ్యసభ, మండళ్ళలో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 80, 171లను సవరించాలని ఆయన న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మకమైన బిల్లును ఈరోజున సభలో ప్రవేశపెట్టినందున ప్రతి ఏటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మాదిరిగానే చరిత్రలో మహిళల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సెప్టెంబర్ మాసాన్ని చారిత్రక మహిళా మాసంగా జరుపుకునేలా ప్రకటించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో మహిళలకు 50 శాతానికి మించే రిజర్వేషన్... 1992లో రాజ్యాంగంలోని 73, 74 ఆర్టికల్స్‌ను సవరించడం ద్వారా పంచాయతీలు, మునిసిపాలిటీలలో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ కల్పించడం జరిగిందన్నారు విజయసాయిరెడ్డి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చట్టబద్దంగా నిర్దేశించిన 33 శాతానికి మించే పంచాయతీలు, స్థానిక సంస్థలలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా అభ్యున్నతి పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళకు ఏ విధంగా పెద్ద పీట వేసిందో గణాంకాలతో సహా ఆయన వివరించారు. స్థానిక సంస్థల్లో 1,356 ఖాళీలు ఉండగా అందులో 688 స్థానాలను అంటే 51 శాతం స్థానాలను మహిళలతో భర్తీ చేసినట్లు తెలిపారు. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏడింటిని మహిళలకు (54 శాతం) కేటాయించడం జరిగింది. అలాగే 26 జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ పోస్టులు ఉంటే 15 పోస్టులను (58 శాతం) మహిళలే అలంకరించారు. మునిసిపల్ కార్పొరేషన్లలో మొత్తం 36 మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులలో 50 శాతం...అంటే 18 పోస్టుల్లో మహిళల నియామకం జరిగింది. 671 మునిసిపల్ కార్పొరేషన్, వార్డు సభ్యుల పదవుల్లో 53.8 శాతం పదవులు మహిళలకే దక్కాయి. రాష్ట్రంలోని 73 మునిసిపల్ చైర్మన్ పదవుల్లో 45 మంది మహిళలు (62 శాతం) చైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. 2,124 మునిసిపల్ వార్డు సభ్యుల పదవుల్లో 1,061 పదవులకు మహిళలే ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్‌లలో 57 శాతం, ఎంపీటీసీలలో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీలలో 53 శాతం మహిళా సభ్యులే ఉన్నారు. అలాగే వార్డు, విలేజ్ వలంటీర్లలో 53 శాతం, వార్డు, గ్రామ సచివాలయ అధికారుల్లో 51 శాతం మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతి కార్యక్రమంలో మహిళలకు సగభాగం అవకాశం కల్పిస్తూ మహిళా సాధికారికత కోసం సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్నచర్యలు తమ చిత్తశుద్ధికి నిదర్శనమని విజయసాయి రెడ్డి వివరించారు. -
Live: మహిళా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Updates.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. చరిత్రాత్మకమైన ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకు పైగా చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ చేపట్టగా అనుకూలంగా 171 మంది ఓట్లు వేశారు. కాగా ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడమే తరువాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన వెంటనే చట్టంగా మారనుంది. ► డిజిటల్ డివైజ్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ ► మహిళా బిల్లుపై రాజ్యసభలో ప్రారంభమైన ఓటింగ్. ► మహిళా బిల్లుపై రాజ్యసభలో చర్చ నడుస్తోంది. మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. ► మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్య సభలో కేంద్రంలో నిప్పులు చెరిగారు తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రెయన్. బెంగాల్లో ఆర్ధిక, ఆరోగ్య, పరిశ్రమలు, వాణిజ్య, భూ సంబంధిత శాఖలను మహిళలకు కేటాయించారు. మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీయే ఒక్క రాష్ట్రంలోనైనా మహిళా అభ్యర్థిని సీఎంగా చేసిందా? అని ప్రశ్నించారు. ►2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసి మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయలేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఎంపీ కపిల్ సిబల్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై చర్చలో ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లపై రాజ్యసభలో చర్చ జరుగుతోంది. ఈ సాయంత్రం ఓటింగ్ జరగనుంది. ► వైఎస్సార్సీపీ తరఫున చర్చలో పాల్గొన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య ►మహిళా రిజర్వేషన్లు ఓబీసీలకు సబ్ కోటా కేటాయించాలి ►అన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా ఇవ్వాలి ►56 శాతం ఉన్న జనాభా ఉన్న బీసీలకు రాజకీయాలలో 15 శాతం మాత్రమే వాటా ఉంది ►బీసీలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం చేయాలి ►బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ ►ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 సక్సెస్ పై లోక్‌సభలో చర్చ జరిగింది. ►వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ లావు కృష్ణదేవరాయలు చర్చలో పాల్గొన్నారు ►ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రయాన్ లాంచ్ చేశారు ►చంద్రయాన్-3 సక్సెస్ కావడం ఆనందంగా ఉంది ►శాస్త్ర సాంకేతిక రంగాల పరిశోధన కోసం కేటాయిస్తున్న నిధులను ఖర్చు చేయడం లేదు ►నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కోసం నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ విడుదల చేయలేదు ►రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ఉంటుంది. రాజ్యసభ, శాసన మండలిలో కూడా రిజర్వేషన్లు వర్తింపజేయాలి అని అన్నారు. ► నూతన పార్లమెంట్ వద్దకు వెళ్లిన సినీ నటి తమన్నా భాటియా. #WATCH | Actor Tamannaah Bhatia arrives at the Parliament in Delhi. pic.twitter.com/sDHceDI1do — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. బిల్లుకు మేము పూర్తి స్థాయిలో మద్దతిచ్చాం. కానీ, అది తక్షణమే అమలులోకి రావాల్సిన అవసరముంది. ఇది అమలులోకి వచ్చే ముందు నెరవేర్చాల్సిన రెండు షరతులు ముందుగా ఉన్నాయి. ఒకటి జనాభా గణన, డీలిమిటేషన్. ఎందుకంటే జనాభా ప్రకారం సీట్లను కేటాయించడం ప్రారంభిస్తే జనాభా నియంత్రణను అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. అది ఆమోదయోగ్యం కాదు. #WATCH | On the women's Reservation Bill Congress MP Karti P Chidambaram says, "It's a symbolic gesture. We have supported it wholeheartedly but that's not going to come into effect immediately. There are two conditions in precedence which need to be fulfilled before it becomes… pic.twitter.com/X0oTwDu6Sj — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్లో చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా రాజ్యసభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తుందనే నమ్మకం ఉంది. #WATCH | Women's Reservation Bill | In Rajya Sabha, BJP president and MP JP Nadda says, "...We all know that the proceedings in this new Parliament began from Ganesh Utsav and yesterday in Lok Sabha, the Women's Reservation Bill - Nari Shakti Vandan Adhiniyam - was passed without… pic.twitter.com/XtZIcuKMhf — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ వద్ద ఎంపీ పీటీ ఉష మాట్లాడుతూ.. మహిళలకు ఇది నిజంగా అమృత్కాల్. ఇది మాకు ఎంతో గౌరవం. #WATCH | On Women's Reservation Bill, Member of Rajya Sabha PT Usha says, "It's a real 'Amrit Kaal' for women, and we are honoured. pic.twitter.com/fcp31mfvTE — ANI (@ANI) September 21, 2023 ► మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అర్జున్‌రామ్ మేఘ్వాల్. Union Law Minister Arjun Ram Meghwal moves the Women's Reservation Bill in Rajya Sabha. pic.twitter.com/UqukFCjIEc — ANI (@ANI) September 21, 2023 ► బీజేపీ ఎంపీ హేమా మాలిని మాట్లాడుతూ.. ప్రధాని మోదీకి ఒక విజన్ ఉంది. మహిళా బిల్లు విషయంలో మోదీకి ధన్యవాదాలు. బిల్లు విషయంలో అంతకుముందు ఏం జరిగిందన్నది కాదు. ప్రధాని మోదీ బిల్లును తీసుకువచ్చి పాస్ చేశారు. #WATCH | On Women's Reservation Bill, BJP MP Hema Malini says, "The people who question will only question. But PM Narendra Modi has done it. He has done what has never happened before. We all should thank him, and congratulate him. He has a vision..." pic.twitter.com/Fo0tHSXBCT — ANI (@ANI) September 21, 2023 ►పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు భారతీయ మహిళల్లో ఉత్సాహం నింపింది. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవ్వడం చారిత్రక ఘట్టం. బిల్లు పాసయ్యేందుకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు. #WATCH | Women's Reservation Bill | Prime Minister Narendra Modi says, "Yesterday was a golden moment of India's Parliamentary journey. All the members of this House deserve that golden moment...Yesterday's decision and today when we cross the last mile after Rajya Sabha (passing… pic.twitter.com/s6mRNxPB2G — ANI (@ANI) September 21, 2023 ► పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామన్నారు. #WATCH | Women's Reservation Bill | Union Law Minister Arjun Ram Meghwal says, "In Rajya Sabha, it will be brought through Supplementary Business as we were late in Lok Sabha yesterday. Lok Sabha Secretariat knows better about it. But I can tell you that discussion will be held… pic.twitter.com/dQKFL4iBWE — ANI (@ANI) September 21, 2023 ► రాజ్యసభలో మహిళా బిల్లుపై సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు రాజ్యసభలో బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది. లోక్‌సభలో ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసినా రాజ్యసభలో మాత్రం అందరూ మద్దతిస్తారు. కానీ విషయం ఏంటంటే, ప్రతి పక్షానికి ఒక్కో ఆలోచన ఉంటుంది. రాజ్యసభ, శాసనసభల్లో కూడా ఈ బిల్లు అమలు జరగాలని నేను చెప్పాలనుకుంటున్నాను. బిల్లులో పుదుచ్చేరి గురించి ఏమీ చెప్పలేదు, ఢిల్లీ గురించి, పుదుచ్చేరి గురించి కూడా ఉండాలి. బిల్లు ఎప్పుడు అమలులోకి వస్తుందనేది అతి పెద్ద విషయం. 2021లో జనాభా గణన జరగలేదు. దీంతో బిల్లుపై అనుమానాలు ఉన్నాయి. వాస్తవానికి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి లేదు. ఎన్నికల కోసం బిల్లును ప్రవేశపెడుతున్నారు. కానీ, సీపీఐ ఎప్పుడూ రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తోంది. #WATCH | Women's Reservation Bill | CPI MP P Santhosh Kumar says, "The Bill will be unanimously passed in the Rajya Sabha today. It was opposed by two MPs in Lok Sabha but everyone will support it in Rajya Sabha. But the thing is, every party has their own ideas. I would like to… pic.twitter.com/EdVm6EswsZ — ANI (@ANI) September 21, 2023 ► లోక్‌సభలో ప్రతిష్టాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. భారీ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. ► నేడు రాజ్యసభకు మహిళా రిజర్వేషన్ బిల్లు. ► రాజ్యసభలో బిల్లును ప్రవేశపేటనున్న కేంద్ర ప్రభుత్వం. ►మహిళా రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ జరుగనుంది. -
తొమిదేళ్ళు పట్టిందా? అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ సీరియస్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చ సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కపటమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది. 2014 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే మహిళా రిజర్వేషన్ సాధిస్తామని హామీ ఇచ్చారని, అది జరిగిన తొమ్మిదేళ్లకు వారిలో చలనం వచ్చిందని అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు కపటమైనవని తొమ్మిదేళ్ల క్రితం 2014లోనే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తీసుకోస్తామని ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చారని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు అనేక మార్లు ఒత్తిడి తెచ్చిన తర్వాత ఇన్నాళ్లకు ఈ బిల్లుకు లోక్‌సభలో మోక్షం కలిగించారన్నారు. ఇక ఈ బిల్లు విషయంలో కూడా వారు కపట మాటలనే చెబుతున్నారు. ఈ బిల్లు చట్టంగా మారడమనేది జనగణన, డీలిమిటేషన్ వ్యవహారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే వారు 2021 నుంచి జనగణన కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. నాకు తెలిసి 2029 కంటే ముందు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం లేదు. దాని తర్వాత జనగణన 2031లో చేయాల్సి ఉంటుంది. మొత్తంగా వారు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లోనే మహిళలు వారికి గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతకుముందు బిల్లుపై చర్చలు జరుగుతున్నసమయంలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 2024 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని ఎన్నికలు జరిగిన వెంటనే జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెడతామన్నారు. దానికోసం అవసరాన్ని బట్టి చట్టంలో కొన్ని మార్పులు చేస్తామన్నారు. పారదర్శకత కోసమే డీలిమిటేషన్ చేయనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఏయే స్థానాలు మహిళలకు కేటాయించాలనే దానిపై డిలిమిటేషన్ కమిషన్ మాత్రమే నిర్ణయిస్తుందని, దానికి జనాభా లెక్కల సమాచారం మూలాధారమని అన్నారు. అందుకే 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. #WATCH | Delhi: On Union Home Minister Amit Shah's statement in parliament, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, "His (HM Amit Shah) statement is hypocritical because a commitment made to the women of the country 9 and a half years ago in the 2014 manifesto and coming and… pic.twitter.com/LV61OqKV5N — ANI (@ANI) September 20, 2023 ఇది కూడా చదవండి : Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి -
Womens Reservation Bill 2023: మహిళా బిల్లుకు జై
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 368(2) ప్రకారం ఈ బిల్లు ఆమోదం పొందింది. దీనిప్రకారం సభలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది మద్దతు తెలపాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా సభ్యులు బిల్లుకు జై కొట్టారు. పార్లమెంట్ నూతన భవనంలో ఆమోదం పొందిన మొట్టమొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ‘నారీశక్తి వందన్ అధినియమ్’ పేరిట కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ నెల 19న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ‘రాజ్యాంగ(128వ సవరణ) బిల్లు–2023’పై బుధవారం దాదాపు 8 గంటలపాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 60 మంది సభ్యులు మాట్లాడారు. కొందరు బిల్లుకు మద్దతుగా ప్రసంగించారు. మరికొందరు మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళా కోటా గురించి ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్లను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్లు సైతం వినిపించాయి. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 454 మంది సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటేశారు. ఓటింగ్ ప్రక్రియలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. చర్చ అనంతరం అదే రోజు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎగువ సభలోనూ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే. అనంతరం రాష్ట్రపతి సంతకంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చనుంది. జన గణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత 2029 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటింగ్ జరిగిందిలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉండటంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్లిప్‌ల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. ఎరుపు, ఆకుపచ్చ రంగు స్లిప్‌లను సభ్యులకు అందజేశారు. ఓటు ఎలా వేయాలో లోక్‌సభ సెక్రెటరీ జనరల్ వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపితే ఆకుపచ్చ స్లిప్పై ‘ఎస్’ అని రాయాలని, వ్యతిరేకిస్తే ఎరుపు రంగు స్లిప్పై ‘నో’ అని రాయాలని చెప్పారు. ఆ ప్రకారమే ఓటింగ్ జరిగింది. బిల్లుకు మద్దతుగా 454 ఓట్లు, వ్యతిరేకంగా కేవలం 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏఐఎంఐంఎ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఓవైసీతోపాటు మరో ఎంపీ సయ్యద్ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్) ఉన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా వారిద్దరూ ఓటేసినట్లు తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో భారీ మెజార్టీతో ఆమోదం పొందడం చాలా సంతోషంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. నారీశక్తి వందన్ అధినియమ్ ఒక చరిత్రాత్మక చట్టం అవుతుందన్నారు. ఈ చట్టంతో మహిళా సాధికారతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, మన రాజకీయ వ్యవస్థలో మహిళామణుల భాగస్వామ్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని ప్రధానమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు చట్టరూపం దాల్చాకే ఆయన కల నెరవేరుతుంది. నాదో ప్రశ్న. మహిళలు తమ రాజకీయ బాధ్యతలు నెరవేర్చుకునేందుకు గత 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇంకా మనం వాళ్లని రెండేళ్లు, నాలుగేళ్లు, ఆరేళ్లు, ఎనిమిదేళ్లు వేచి ఉండండని చెబుదామా? భారతీయ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం సముచితం కాదు. ఈ బిల్లు వెంటనే అమల్లోకి రావాల్సిందే. కుల గణన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లలో ప్రాతినిధ్యం దక్కాలి. – సోనియా మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణం అమల్లోకి తేవాలన్న విపక్షాల డిమాండ్ సరికాదు. ఒకవేళ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్, అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్ అధినేత) ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభా స్థానాలు మహిళలకు రిజర్వ్ అయితే మా ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ అందుకు మళ్లీ మోదీ సర్కారునే నిందిస్తారు. అందుకే నియోజకవర్గాల పునరి్వభజనను సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని కమిషన్ పూర్తి పారదర్శకంగా చేపడుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చే నూతన ప్రభుత్వం వెంటనే జన గణన, నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంది. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ల కలను సాకారం చేస్తుంది. – అమిత్ షా ఈ బిల్లుతో సవర్ణ మహిళలకే మేలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుతో అగ్ర వర్ణాల మహిళలకే మేలు జరుగుతుంది. పార్లమెంట్లో అతి తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ఓబీసీ, మైనార్టీ మహిళలకు ఈ రిజర్వేషన్లలో ప్రత్యేకంగా కోటా కలి్పంచకపోవడం దారుణం. దేశ జనాభాలో ముస్లిం మహిళలు 7 శాతం ఉన్నారు. లోక్‌సభలో వారి సంఖ్య కేవలం 0.7 శాతమే ఉంది. లోక్‌సభలో సవర్ణ మహిళల సంఖ్య పెంచాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. ఓబీసీ, మైనార్టీ మహిళలు ఈ సభలో ఉండడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఆయా వర్గాల మహిళలను మోదీ సర్కారు దగా చేస్తోంది – అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా పారీ్టలకతీతంగా మహిళా ఎంపీలు బిల్లుకు ఏకగ్రీవంగా జై కొట్టారు. లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలుండగా బుధవారం చర్చలో 27 మంది మహిళా ఎంపీలు మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతుగా మాట్లాడారు. అయితే, బిల్లు ఆలస్యంగా అమలయ్యే అంశాన్ని ప్రధానంగా తప్పుబట్టారు. -
2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు వర్తించవు..
-
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది వీళ్లే!
న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్లో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. బంపర్ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీ శక్తి వందన్ అధినియమ్’కు లోక్‌సభ ఎంపీలు ఆమోద ముద్ర వేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. మూడవ రోజు బుధవారం ఎనిమిది గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది మహిళా రిజర్వేషన్ బిల్లుపై. ఆపై ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందగా.. కొత్త పార్లమెంట్లో పాసైన తొలి బిల్లుగా రికార్డు సృష్టించింది. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా.. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి. ఇద్దరు మజ్లిస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్, మహారాష్ట్ర) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో (108వ రాజ్యాంగ సవరణ) బిల్లు పాస్ అయినప్పటికీ లోక్‌సభలో ఆమోదం పొందలేదు. ఇక ఇప్పుడు లోక్‌సభ ఆమోదంతో రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా బిల్లుకు ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్ తర్వాత 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ కోటా అమలుకానుంది. Lok Sabha passes Women's Reservation Bill granting 33% seats to women in Lok Sabha and state legislative assemblies 454 MPs vote in favour of the bill, 2 MPs vote against it pic.twitter.com/NTJz449MRX — ANI (@ANI) September 20, 2023 కాగా టీ కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌తో ముగ్గురు ఎంపీలు ఓటింగ్‌కు హాజరుకాలేకపోయారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మహిళా బిల్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రేపు (సెప్టెంబర్ 21)న రాజ్యసభ ముందుకు రానుంది. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు తెలుపుతుండటంతో అక్కడ సైతం ఇది ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఈ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందితే.. మూడు దశాబ్దాల ప్రయత్నం చివరకు ఫలించినట్లు అవుతుంది. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు -
2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఓటింగ్ తీర్మానం ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. ఓటింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలకు ఈ బిల్లు వర్తించదు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, డీ లిమిటేషన్ చేపడతాం. ఆ తర్వాతే మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తిస్తుంది అని వ్యాఖ్యానించారాయన. ఇక బిల్లుపై చర్చ సందర్భంగా 60 మంది ఎంపీలు మాట్లాడారని.. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారని మంత్రి అర్జున్ రామ్ తెలిపారు.మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా ఈ అభివృద్ధి యాత్ర అసంపూర్ణమని సుష్మా స్వరాజ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంలో మంత్రి లోక్‌సభలో ప్రస్తావించారు. బిల్లుపై లొల్లి ఇదిలా ఉంటే.. అంతకు ముందు బిల్లుపై హోం మంత్రి అమిత్ షా సైతం ఇదే సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని.. ఎన్నికల తర్వాత జనాభా లెక్కుల, డీ లిమిటేషన్ ప్రక్రియ చేపడతామని తెలిపారు. 2029 ఎన్నికల సమయంలోనే రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేశారాయన. ఆ సమయంలో.. బిల్లు అసంపూర్తిగా ఉందంటూ విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అమిత్ షా మాట్లాడుతుండగానే.. రాహుల్ గాంధీ లేచి వెళ్లిపోగా.. ఓటింగ్ కంటే ముందు కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. #WATCH | "Some people on social media are saying that this bill should not be supported as there is no reservation of OBC, Muslims. If you don’t support this bill, will reservation happen sooner? If you support this bill, then will at least be guarantee..." Union Home Minister… pic.twitter.com/q5CSeWaZI1 — ANI (@ANI) September 20, 2023 ఓబీసీ, ముస్లింల రిజర్వేషన్లు లేనందున ఈ బిల్లుకు మద్దతివ్వకూడదని కొందరు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మీరు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకుంటే, రిజర్వేషన్లు త్వరగా జరుగుతాయా? మీరు ఈ బిల్లుకు మద్దతు ఇస్తే, కనీసం హామీ అయినా ఉంటుంది అని అమిత్ షా విపక్షాలను ఉద్దేశించి పేర్కొన్నారు.అయినప్పటికీ కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
ఇది నాకు ఉద్విగ్నభరిత క్షణం: సోనియా