శివాజీనగర(బెంగళూరు): 2024లో జన గణన పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కర్ణాటకలోని మూడుబిద్రిలో రాణి అబ్బక్క స్మారక తపాలా స్టాంపును శనివారం ఆమె విడుదల చేసి మాట్లాడారు. ప్రధాని మోదీకి దేశ నిర్మాణంలో మహిళల పాత్రపై ఉన్న ఎంతో విశ్వాసం వల్లనే మహిళా బిల్లు వాస్తవ రూపం దాలి్చందని చెప్పారు.
16వ శతాబ్దంలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉళ్ళాల రాణి అబ్బక్క ధైర్యం, ధీరత్వం గొప్పదన్నారు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది గుర్తు తెలియని పోరాటయోధుల సేవలను స్మరించుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రభుత్వం 14,500 మంది స్వాతంత్య్ర సమరవీరుల కథలతో డిజిటల్ భాండాగారాన్ని రూపొందిస్తోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment