ఉమెన్ పవర్
మహిళల శ్రమశక్తికి సాక్ష్యాలు, తూనికరాళ్లు అక్కర్లేదు. స్త్రీ శ్రమశక్తి అనేది నిత్యం కళ్ల ముందు కనిపించేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రమ అంటేనే స్త్రీ. అయినా సరే, ఎప్పటికప్పుడు మహిళలు తమను తాము నిరూపించుకోవాల్సి వస్తోంది. మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల కష్టం గురించి చేసిన వ్యాఖ్యలుప్రా«ధాన్యతను సంతరించుకున్నాయి. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘గుర్తింపు పొందడానికి మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. స్కూల్, కాలేజీ, బోర్డ్, ఆర్మీ, మీడియా... ఇలా ఎక్కడైనా సరే గుర్తింపు రావాలంటే పురుషుల కంటే మూడురెట్లు తమను తాము నిరూపించుకోవాలి. ఇది అన్ని చోట్లా ఉంది’ అంటున్నారు నిర్మలమ్మ.
‘లైఫ్ ఈజ్ అన్ ఫెయిర్’ అంటూనే అంతర్గత శక్తి ని పెంపొందించుకోవడం గురించి నొక్కి చెబుతున్నారు. అన్యాయాలు జీవితంలో ఒక భాగమని, వాటిని అధిగమించడానికి అంతర్గత బలాన్ని పెంపొందించుకోవడం కీలకం అంటున్నారు నిర్మలా సీతారామన్.
‘కంపెనీ బోర్డులలో మహిళల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కంపెనీ బోర్డుల్లో ఉండడానికి తాము అర్హులమని ఇప్పటికీ నిరూపించుకోవాలా!’ అని ప్రశ్నిస్తున్న సీతారామన్– ‘మహిళలు తమను తాము నిరూపించుకున్నారు. తమదైన గుర్తింపు పొందారు’ అంటూ చరిత్రను గుర్తు తెచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment