Life
-
నిత్యం ఫాలో కావాల్సిన జీవిత సత్యాలు : చెప్పైనా,మనిషైనా బాధిస్తోంటే..!
జీవితం సాఫీగా సాగాలంటే కొన్ని ఖచ్చితమైన సూత్రాలను పాటించాలి. వివేకానందుడు చెప్పినట్టు సుఖదు:ఖాలు నాణేనికి రెండు పార్శాలు లాంటివి. కాబట్టి సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే నడవదు. విశ్వంలో ప్రతి అంశం తార్కిక ఆలోచనలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచనలతో ప్రపంచాన్ని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి. నిశితంగా పరిశీలించి అర్థం చేసుకొని, జీవితానికి అన్వయం చేసుకొని సాగిపోవాలి. ఉదాహరణకు అమృత బిందువుల్లాంటి ఈ విషయాలను గమనించండి! కోపంలో సమాధానం చెప్పకు సంతోషంలో వాగ్దానం చేయకు. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అయినవారి ఎదుట అబద్ధం చెప్పకు.అనుభవం ఎదిగిన అభిప్రాయాన్ని బట్టి రాదు. తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది.‘తప్పు చేయడానికి ఎవరూ భయపడరు. కానీ చేసిన తప్పు బయట పడకుండా ఉండడం కోసం భయపడతారు.జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి. ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు.‘ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది. కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం గురించి తెలుసుకునే తెలివి ఉండదు.వేదం చదివితే ధర్మం తెలుస్తుంది. వైద్యం చదివితే రోగం ఏమిటో తెలుస్తుంది.గణితం చదివితే లెక్క తెలుస్తుంది. లోకం చదివితే ఎలా బతకాలో తెలుస్తుంది.కాలికున్న చెప్పులైనా మనతో ఉన్న మనుషులైనా నొప్పిని, బాధను కలిగిస్తున్నారంటే, సరిపోయేవి కావని అర్థం. ఇదీ చదవండి: మానవ కళ్యాణార్థం మార్గళీ వ్రతం! -
కన్ను తేటగా ఉంటే... దేహమంతయు వెలుగు
అనేకమంది యువతీ యువకుల కన్నులు పాపంతో నిండి వున్నాయి. ఈ విషయంలో యేసుప్రభువు తన కొండమీద ప్రసంగంలో ఒక స్త్రీని మోహపు చూపు చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడని, సాధారణంగా కామం కంటిచూపుతోనే మొదలవుతుందన్నారు. శోధన అంతర్గతంగా బయలుదేరుతుంది. తర్వాత కార్యరూపం దాలుస్తుంది. కనుక కంటిని ఎంతో పవిత్రంగా కాపాడు కోవాలి. దేహానికి, ఆత్మకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే దేహమంతయూ వెలుగు మయమై వుండును. నీ కన్ను చెడితే నీ దేహమంతా చీకటిమయమవునని వాక్యం బోధిస్తున్నది (లూకా 11:33–34).ఒకరోజు యేసుప్రభువువారు గతిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని–నన్నువెంబడించుమని అతనికి చెప్పాడు.. ఫిలిప్పు నతనయేలును కనుగొని–ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొంటిమి. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానియేలు–నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగ్గా –వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాడు. యేసు నతానియేలు తన వద్దకు రావడం చూసి యితడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కటము లేదు. నన్ను నీవు ఎలాగైనా ఎరుగుదువని నతానియేలు యేసును అడగ్గా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే, నీవు అంజూరపు చెట్టుకింద ఉన్నప్పుడే నిన్ను చూశానని అతనితో చెప్పాడు. నతానియేలు –బోధకుడా! నీవు దేవుని కుమారుడవు. ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసుక్రీస్తు అంజూరపు చెట్టుకింద కూర్చున్నావని చెప్పినందుకు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యక్రమాలు చూస్తావని అతనితో చె΄్పాడు. ఆయన (యేసు ప్రభువువారు) – మీరు ఆకాశం తెరువబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపైగా ఎక్కుటయు, దిగుటయు చూస్తారని మీతో నిశ్చయంగా చెబుతున్నానని అన్నాడు (యోహాను 1:43–51). కనుక మనకు ఇంత సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి వున్నందున మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కుల్లో పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్తయైన యేసుప్రభువు వైపు చూసి పందెంలో ఓపికతో పరుగెత్తవలెను. మీరు ΄ాపంతో ΄ోరాడటానికి రక్తం కారునంతగా ఎదిరింపలేరు. ఇంకో సంగతి నా కుమారులారా! ప్రభువు వేయు శిక్షను తృణీకరించవద్దు. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించును.. అని కుమారులతో మాట్లాడినట్లు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు.మనం శరీర సంబంధీకులైన తలిదండ్రులతో భయభక్తులతో ఉన్నాడు కానీ, ఆత్మలకు తండ్రియైన దేవునికి మరింత ఎక్కువగా లోబడి బతుకవలెనని, అట్టి భయభక్తులు దేవునియందు కలిగి ఉండి, మంచిగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది (హెబ్రీ 12:1 –10). కనుక ఆ విధంగా ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొందురు గాక.– కోట బిపిన్ చంద్రపాల్ -
లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!
టబు వయసు 53. ఈమధ్యే, నవంబర్ 4న ఆమెకు అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు, బంధు మిత్రులనుంచి.. ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..‘ అనే వివాహ ఆంక్షలూ అందాయి. టబుకు ఏటా ఉండేవే ఈ పుష్పగుచ్ఛాలు. ‘‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’’ అంటే.. ‘పెళ్లి గురించి ఆలోచించు, వయసేం మించి΄ోలేదు..’ అని చెప్పటం. పెళ్లి మాట అటుంచితే, ‘ఎప్పుడూ వర్కేనా? కాస్త లైఫ్ గురించి కూడా ఆలోచించు..’ అనే మాట టబును అమితంగా ఆశ్చర్యపరుస్తుందట. ‘ఒక వ్యక్తికి వర్కే లైఫ్ ఎందుకు కాకూడదు? లైఫ్‌ని పక్కన పెట్టి ఒక వ్యక్తి వర్క్‌ను మాత్రమే ఎందుకు కోరుకోకూడదు? అని ‘ది నాడ్ ’ అనే డిజిటల్ మ్యాగజీన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించారు టబు. ‘వర్క్, లైఫ్ నాకు వేర్వేరు కావు. అందుకే నాకు ‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్’ అనే మాట అర్థం కాదు. జీవితంలో ప్రతిదీ, ప్రతి సమస్యా, ప్రతి పోరాటం, ప్రతి యుద్ధం.. వ్యక్తిగత ప్రాధాన్యాలను బట్టే ఉంటుంది. నాకు వర్క్ తప్ప వేరే జీవితం గురించి తెలియదు. పోల్చి చూసుకోటానికి నాకు వేరే జీవితం కూడా లేదు. నా జీవితంలో వేరే ఎవరైనా ఉంటే ఇంతకన్నా బాగుండేదా లేక, ఇప్పుడున్న జీవితమే మెరుగ్గా ఉండేదా అనేది కూడా నాకు తెలీదు. ఎప్పటికీ తెలియదు. నేనిప్పుడు నా జీవితంతో చాలా సంతోషంగా ఉన్నాను. నేను 20 ఏళ్ల వయసులో లేను కనుక సంతోషానికి నా నిర్వచనం 50లలో ఉన్నట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. అయితే సంతోషం కన్నా కూడా సంతృప్తి ముఖ్యం అనుకుంటాను నేను. అంతకన్నా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి’ అన్నారు టబు. ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన టబు తాజా రొమాంటిక్ థ్రిల్లర్.. ఔరోన్ మే కహా దమ్ థా. ఆ ధైర్యం ఇతరులకు ఎక్కడిది?’ అని ఆ టైటిల్‌కి అర్థం. (చదవండి: ‘పెళ్లాం చెబితే వినాలి'.. ఇది ఫైర్‌లాంటి పుష్పగాడి మాట మాత్రమే కాదు..) -
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
తాత్వికత: ఎంతో చిన్నది జీవితం
ఓ గురువు అటవీ ప్రాంతంలోని మారుమూల ఉన్న చిన్నచిన్న గ్రామాలకు వెళ్ళి సత్సంగం చేయాలని బయలుదేరాడు. ఆయనతోపాటు శిష్యబృందం కూడా బయలుదేరింది. కొండలు, గుట్టలు, సెలయేర్లు దాటి వెళ్తూ ఉన్నారు. దారిలో ఓ శిష్యుడు, గురువుని ‘ఎప్పుడూ ఆనందంగా ఉండాలంటే ఎలా?’’ అని అడిగాడు. ‘‘మానవ శరీరం దేవుడిచ్చిన ఒకే ఒక అవకాశం. మరలా రమ్మంటే రాదు. అందుకని దాని విలువ తెలుసుకుని క్షణం క్షణం ఆనందంగా జీవించాలి!’’ అన్నాడు.‘‘అదెలా?’’ అని అడిగాడు శిష్యుడు.ఇంతలో దూరంగా కొందరు మహిళలు పొయ్యిపైన నీళ్ళు కాగిస్తూ కనిపించారు గురువుకి. శిష్యుడిని అక్కడే కొద్దిసేపు ఆగమని చె΄్పాడు. ఆ కట్టెలు కాలే వాసన పీల్చి కాలుతున్నదేదో చెప్పమన్నాడు.వాసన పీల్చిన శిష్యుడు ఆశ్చర్యపోయాడు. ‘తను గమనించింది వాస్తవమా కాదా’ అని ఒకటికి రెండుసార్లు సరి చూసుకున్నాడు. తను చూస్తున్నది ముమ్మాటికీ నిజమేనని అర్థమయ్యింది.‘‘అక్కడ కాలుతున్నది చందనం కట్టెలు. అయ్యో, ఎందుకలా చేస్తున్నారు. ఎంతో విలువైన చందనం కొయ్యలను వంటచెరుకుగా వాడటమేమిటి?’’ అని మనసులో అనుకున్నాడు.‘భర్తలకు తెలియకుండా వారు పొరపాటుగా అలా చేస్తున్నారేమోనని’ అనుమానమేసింది. జాగ్రత్తగా గమనించిన అతడికి మరింత ఆశ్చర్యం కలిగింది. అది ఏమిటంటే ఆ మహిళలకు కొద్ది దూరంలోనే వారి భర్తలు చందనం కొయ్యలను కత్తితో నరికి పొయ్యిలో పెట్టడానికి అనువుగా కట్టెలు చీల్చుతున్నారు.అదే విషయాన్ని శిష్యుడు బాధగా ‘బంగారంలాంటి చందనాన్ని మంటపాలు చేయడం’ గురించి గురువుకు చెప్పాడు. దానికి గురువు నవ్వి ‘‘చందనం కొయ్యల విలువ, వాటి ప్రత్యేకత వారికి తెలియదు. అందుకే వాటిని పొయ్యిలోపెట్టి తగులబెట్టేస్తున్నారు. వారి కళ్ళకు అవి మామూలు కట్టెల్లాగే అగుపిస్తున్నాయి. నీకు వాటి విలువ తెలుసు కాబట్టే ఆశ్చర్యపోతున్నావు. వారు చేస్తున్నది తప్పని చెబుతున్నావు. వారికి వాటి విలువ తెలిసేంత వరకు వారు చేస్తున్నది సరైనదేనని అనుకుంటారు. మనిషి కూడా అంతే. జీవితం విలువ తెలుసుకోక లేనిపోని పట్టింపులు, అహం, అసూయాద్వేషాలు, కోపం, ప్రతీకారం, ప్రపంచాన్ని మార్చాలనే ప్రయత్నం... ఇలాంటి వాటితో ఎంతోకాలం వృథా చేస్తున్నాడు. జీవితం విలువైనదన్న ఎరుక ఉంటే చాలు, ఆనందం మన వెంటే ఉంటుంది’’ అని వివరించాడు.జీవితం చాలా చిన్నదనీ, ప్రతిక్షణం ప్రకృతి ప్రసాదమని, అది తెలుసుకోక΄ోతే అసలైన ఆనందాన్ని కోల్పోతామని గ్రహించిన శిష్యబృందం ముందుకు నడిచింది. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి!
అతిథిని పూజించేవాడు ఒక్క గృహస్థు మాత్రమే. అలా గౌరవించడంలో ఎంత లీనమయి ఉంటారంటే అసలు భగవంతుడే స్వయంగా వచ్చినా ఏమరుపాటు పొందుతారు. సీతారాముల విగ్రహాలను అలంకరించడానికి తులసీదాసు గంధం తీస్తుంటాడు. రామలక్ష్మణులు స్వయంగా అతిథులుగా వస్తారు. వచ్చి ఆ గంధం తమకు పూయమంటారు. ఇది సీతారాములకే మీకు కాదు వెళ్ళండంటాడు. వారు వెళ్ళబోతుంటే.. హనుమ చిలకరూపంలో వచ్చి అసలు విషయం చెబుతాడు. రాజకుమారుల రూపంలో ఉన్న వారిని అప్పుడు చందనాదులతో సేవించి దర్శనం పొందుతాడు తులసీదాసు.ఇక్కడ నీకున్నదేదో ఇక్కడ శరీరం వదిలిపెట్టేయడంతోనే సరి. కానీ ఈ శరీరంతో ఉండగా నలుగురికి పనికివచ్చే మంచి పని చేసినప్పుడు అది మాత్రమే పుణ్యంగా నీ వెంట వస్తుంది. మనం ఈ శరీరాన్నిగానీ, ద్రవ్యాన్నిగానీ, శక్తినిగానీ దేనిని వాడకుండా దాచుకోవడం సాధ్యమయ్యేది కాదు. అది కాలంతో వెళ్ళి΄ోవలసిందే. మెరుపు ఎలా వచ్చిపోతుంటుందో అలా భోగాలు వచ్చి పోతుంటాయి తప్ప వాటి వలన ఏ ఫలితమూ ఉండదంటారు శంకరాచార్యుల వారు. సూర్యోదయాలు, చంద్రోదయాలు వస్తుంటాయి, పోతుంటాయి.. ఆయుర్దాయం కరిగిపోతుంటుంది. ఆయువు ఉన్న కాలంలో ఎవరు తమ జీవితాన్ని పండించుకుంటారో వారు గట్టెక్కుతారు. ఆ అదృష్టం అతిథిపూజ చేసిన గృహస్థుకు సులభంగా దక్కుతుంది. అతిథి కూడా ఏ అవసరం వచ్చినా గృహస్థుదగ్గరకే ΄ోతాడు తప్ప ఇతర ఆశ్రమాలవారిని ఆశ్రయించడు. మన దేశ ద్రవ్యం మన దేశంలోనే చెల్లుబాటవుతుంది కదా. ఇతర దేశాలకు ΄ోవాలంటే విదేశీమారక ద్రవ్యం అవసరం. అలాగే ఇక్కడ చేసిన మంచిపని .. మారక ద్రవ్యంలాగా శరీరం విడిచిపెట్టినా పుణ్యం రూపంలో నీ వెంట వస్తుంది.గృహస్థాశ్రమంలో మరో విశేషం ఉంది. దంపతుల మనసు ఏకీకృతమయితే పరమ సంతోషంగా, పరమ ప్రశాంతంగా జీవితం హాయిగా గడుస్తుంది. సాధారణంగా ఇద్దరున్నప్పుడు ఒకరు మరొకరితో ముఖాముఖి మాట్లాడితే తప్ప ఒకరి భావాలు మరొకరికి అర్థం కావు. కానీ దాంపత్యంలో అది పండిందని గుర్తు ఏమిటంటే – ఆయన ఆమెతో, ఆమె ఆయనతో నోరు విప్పి మాట్లాడనక్కరలేదు. అలా చూపులు చాలు భావ ప్రసరణకు,. ఆ స్థాయికి చేరుకోవడం అంటే రెండు మనసులు ఒకటి కావడం.సీతమ్య ఏ పని చేసినా దీనివలన మా ఆయన కీర్తినిలబడుతుంది గదా అని ఆలోచిస్తుందట. రాముడు ఏ పని చేసినా దీనివల్ల సీత సంతోషిస్తుంది గదా! అని ఆలోచిస్తుంటాడట. కొంతకాలం గడిచాక ఒకరికి ఏ అవసరం వచ్చినా మరొకరు అడగాల్సిన పనిలేకుండానే దానిని నెరవేరుస్తారు. పట్టాభిషేక ఘట్టం. అందరికీ అన్నీ ఇచ్చేసారు. చిట్టచివర సీతమ్మ తన మెడలోంచి హారం తీసి పట్టుకున్నది. నీ ప్రశాంతతకు, మన దాంపత్యానికి, మన కలయికకు కారుకులయిన వారికి దానిని అనుగ్రహించు అన్నాడు రాముడు. వెంటనే సీతమ్మ దానిని హనుమకు ఇచ్చేసింది. రాముడు ఫలానా అని పేరు చెప్పక΄ోయినా ఆమె గ్రహించేసింది. దాంపత్యం పండినప్పుడు ఆయన మనసు ఆవిడ దగ్గర, ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంటాయి. కారణం – రెండంటూ ఉంటే కదూ.. ఉన్నది ఒకటే అయిపోతుంది. - చాగంటి కోటేశ్వరరావు -
మహాప్రాణులకు మళ్లీ జీవం!
డైనోసార్లు, మామత్‌లు వంటి ప్రాణులను ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనూ, టీవీ సిరీస్‌లలోను మాత్రమే చూశాం. ఇలాంటి ప్రాణుల్లో కొన్ని త్వరలోనే మన కళ్ల ముందు సజీవంగా కనిపించనున్నాయి. సహస్రాబ్దాల కిందట అంతరించిపోయిన ప్రాణులు మొదలుకొని, మన కళ్ల ముందే కనుమరుగైపోయిన చాలా ప్రాణులు తిరిగి ప్రాణం పోసుకోనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానానికి ఇప్పటి శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలపై ఒక విహంగ వీక్షణమే ఈ కథనం.పన్యాల జగన్నాథదాసుఈ భూమ్మీద తొలి జీవకణం ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలీదు. భూమ్మీద మనుషులు పుట్టక ముందే ఎన్నో జీవజాతులు ప్రాణం పోసుకున్నాయి. వాటిలో కొన్ని జీవజాతులు ఆదిమానవుల కాలంలోనే అంతరించిపోయాయి. మన కాలంలోనూ మరికొన్ని జీవజాతులు అంతరించిపోయాయి. ఇంకొన్ని జీవజాతులు ప్రమాదం అంచుల్లో అంతరించిపోయే దశకు చేరువగా ఉన్నాయి. ఒకప్పుడు భూమ్మీద సంచరించిన డైనోసార్లు, మామత్‌లు వంటి వాటి గురించి పుస్తకాల ద్వారా, సైన్స్‌ఫిక్షన్ సినిమాల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతున్నామే తప్ప వాటిని ఈ భూమ్మీద సజీవంగా చూసిన మనుషులెవరూ ఇప్పుడు లేరు. శతాబ్దాల కిందటే అంతరించిన కొన్ని జీవజాతులు సమీప భవితవ్యంలోనే తిరిగి మన కళ్ల ముందు కనిపించనున్నాయి. అంతరించిపోయిన ప్రాణుల పునరుజ్జీవానికి శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ప్రయోగాల్లో కొన్ని ఒక కొలిక్కి వచ్చాయి. మరో నాలుగేళ్లలోనే మామత్‌కు మళ్లీ ప్రాణం పోయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే రీతిలో మరిన్ని జీవులకూ పునర్జీవం కల్పించనున్నట్లు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవులకు తిరిగి ప్రాణం పోసే ప్రక్రియను ‘జైవ పునరుత్థానం’గా (బయో రిసరెక్షన్) అభివర్ణిస్తున్నారు.మరో నాలుగేళ్లలోనే మామత్ పునరుత్థానంఎప్పుడో మంచుయుగంలో అంతరించిపోయిన ప్రాణి మామత్. ఏనుగులాంటి భారీ జంతువు ఇది. దీనికి ఏనుగులాగానే తొండం, దంతాలతో పాటు ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉండేవి. భూమ్మీద మంచు యుగం 26 లక్షల ఏళ్ల కిందటి నుంచి 11 వేల ఏళ్ల కిందటి వరకు కొనసాగింది. ఆ కాలంలోనే మామత్ భూమ్మీద సంచరించేది. మంచుయుగం ముగిసిన తర్వాత మామత్ జనాభా క్రమంగా క్షీణించింది. నాలుగు వేల ఏళ్ల కిందట ఇది పూర్తిగా అంతరించిపోయింది. సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయిన మామత్‌కు పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మామత్ 2028 నాటికల్లా పునరుత్థానం చెందుతుందని, అప్పటికల్లా దీనికి మళ్లీ ప్రాణం పోయనున్నామని అమెరికన్ స్టార్టప్ కంపెనీ ‘కలోసల్ బయోసైన్సెస్’కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ప్రకటించారు.‘కలోసల్ బయోసైన్సెస్’ అమెరికాలోని తొలి డీ–ఎక్స్‌టింక్షన్ కంపెనీ. మామత్ పునరుత్థానం కోసం దీనికి చెందిన అత్యంత కీలకమైన జన్యువులను సేకరించామని ఈ కంపెనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రాణుల పునరుత్థానం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి ‘పేపాల్’ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్, సెలబ్రిటీ మోటివేషనల్ స్పీకర్ టోనీ రాబిన్స్ వంటి ప్రముఖులే కాకుండా, అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ కూడా భారీ స్థాయిలో నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికన్ వార్తా సంస్థ ‘ది ఇంటర్సెప్ట్’ వెల్లడించింది. ‘తొలి మామత్‌కు 2028 ద్వితీయార్ధం నాటికల్లా ప్రాణం పోయాలని లక్ష్యం నిర్ణయించుకున్నాం. ప్రస్తుతం అదే పనిలో పురోగతిలో కొనసాగుతున్నాం.అంతరించిపోయిన జీవుల్లో మొదటిగా పునరుత్థానం పొందే ప్రాణి మామత్ మాత్రమే కాగలదు. దీని గర్భధారణ వ్యవధి ఇరవైరెండు నెలలు. మామత్ జన్యువుల్లో 99.5 శాతం జన్యువులు ఆసియన్ ఏనుగుల్లో ఉన్నాయి. జన్యు సవరణ, మూలకణాల అనుసంధానం ప్రక్రియల ద్వారా ఆడ ఆసియన్ ఏనుగు అండానికి ఫలదీకరణ జరిపి మామత్‌కు పునరుత్థానం కల్పించనున్నాం’ అని కలోసల్ బయోసైన్సెస్ సీఈవో బెన్ లామ్ తెలిపారు.‘జురాసిక్ పార్క్’ మాదిరిగా కాదు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలోని సైన్స్ ఫిక్షన్ సినిమా ‘జురాసిక్ పార్క్’ చాలామంది చూసే ఉంటారు. ఇదే పేరుతో మైకేల్ క్రైటన్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒక పారిశ్రామికవేత్త క్లోనింగ్ ద్వారా పునర్జీవం కల్పించిన డైనోసార్లతో ఒక థీమ్ పార్కు ఏర్పాటు చేస్తాడు. డైనోసార్ల బాగోగులను చూసుకునే ఒక వ్యక్తిని వెలాసిరేప్టర్ జాతికి చెందిన డైనోసార్ చంపేస్తుంది. ఇందులో క్లోనింగ్ కోసం అంతరించిన డైనోసార్ల డీఎన్ఏ ఉపయోగించినట్లుగా ఉంది. కలోసల్ బయోసైన్సెస్ జరుపుతున్న ప్రయోగాల్లో మాత్రం డీఎన్ఏను నేరుగా ఉపయోగించడం లేదు. ‘ జురాసిక్ పార్క్‌లో మాదిరిగా మేము మామత్ డీఎన్ఏను తీసుకుని, దాంతో ఆసియన్ ఏనుగు జన్యువుల రంధ్రాలను పూడ్చే పని చేయడం లేదు. సవరించిన మామత్ జన్యువులను, మూలకణాలను ఆరోగ్యకరమైన ఆడ ఆసియన్ ఏనుగు అండంలోకి ప్రవేశపెట్టి ఫలదీకరణ జరపనున్నాం’ అని బెన్ లామ్ వివరించారు.దశాబ్ద కాలంగా సంఘటిత కృషి అంతరించిపోయిన ప్రాణుల పునరుత్థానికి దాదాపు దశాబ్ద కాలంగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సంఘటితంగా కృషి చేస్తున్నారు. ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్‌కు (ఐయూసీఎన్) చెందిన స్పీసీస్ సర్వైవల్ కమిషన్ 2014లో డీ ఎక్స్‌టింక్షన్ టాస్క్‌ఫోర్స్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ దేశాలకు చెందిన తొమ్మిదివేల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లోని శాస్త్రవేత్తలు అంతరించిపోయిన ప్రాణుల్లో వేటికి పునరుత్థానం కల్పిస్తే, పర్యావరణానికి ఎక్కువగా మేలు కలుగుతుందో గుర్తించడంతో పాటు ప్రాణుల పునరుత్థాన ప్రయోగాల కోసం ఎంపిక చేసుకున్న ప్రక్రియల సాధ్యాసాధ్యాలపై తమ విశ్లేషణలను అందిస్తారు. మామత్తో పాటు మరికొన్ని అంతరించిపోయిన ప్రాణులకు కూడా తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అంతరించిన ప్రాణులకు చెందిన జన్యుపదార్థాలను సేకరించి, వివిధ దశల్లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.క్వాగాఇది జీబ్రా జాతికి చెందిన జంతువు. జీబ్రాలా క్వాగాకు ఒంటి నిండా చారలు ఉండవు. తల నుంచి ఛాతీ భాగం వరకు చారలు ఉంటాయి. ఇది లేత గోధుమ రంగులో ఉంటుంది. తల నుంచి ముదురు రంగులో ఉండే ఛారలు ఛాతీ భాగం వద్దకు వచ్చే సరికి మసకబారుతాయి. క్వాగాలు ఒకప్పుడు దక్షిణాఫ్రికాలో విరివిగా కనిపించేవి. చిట్టచివరి క్వాగా 1878లో మరణించినట్లుగా రికార్డులు ఉన్నాయి. అంతరించిపోయిన క్వాగాకు తిరిగి ప్రాణం పోసేందుకు 1987లో ‘క్వాగా ప్రాజెక్టు’ ప్రారంభమైంది. జీబ్రా జాతుల్లోని బర్షెల్స్ జీబ్రాలో క్వాగా జన్యువులు అధిక శాతం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. బర్షెల్స్ జీబ్రా ద్వారా క్వాగా పునరుత్థానానికి వారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఎలిఫంట్ బర్డ్ఎగరలేని భారీ పక్షుల్లో ఎలిఫంట్ బర్డ్ ఒకటి. మడగాస్కర్‌లో ఈ పక్షులు విరివిగా ఉండేవి. స్థానికులు ఇష్టానుసారం వీటిని వేటాడి తినేయడంతో దాదాపు వెయ్యేళ్ల కిందటే ఇవి అంతరించిపోయాయి. మడగాస్కర్‌లో పరిశోధనలు సాగిస్తున్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలకు ఎలిఫంట్ బర్డ్ గుడ్ల శిలాజాలు దొరికాయి. వాటి నుంచి వారు ఎలిఫంట్ బర్డ్ జన్యు పదార్థాలను సేకరించగలిగారు. ఎలిఫంట్ బర్డ్ పక్షుల్లో ఎనిమిది జాతులు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. డోడో మాదిరిగానే ఎలిఫంట్ బర్డ్‌కు కూడా తిరిగి ప్రాణం పోసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.స్టెల్లర్స్ సీ కౌఇది తిమింగలంలాంటి భారీ జలచరం. ఒకప్పుడు అలాస్కా, రష్యాల మధ్య బేరింగ్ సముద్రంలో కమాండర్ దీవుల చుట్టూ కనిపించేది. పర్యావరణ మార్పులు, విచ్చలవిడిగా సాగిన వేట ఫలితంగా స్టెల్లర్స్ సీ కౌ జాతి పద్దెనిమిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చివరిసారిగా ఇది 1768లో కనిపించినట్లుగా రికార్డులు ఉన్నాయి. జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త జార్జ్ విల్హెల్మ్ స్టెల్లర్ 1741లో ఈ జలచరం గురించి తన రచనల్లో విపులంగా వర్ణించాడు. అందువల్ల దీనికి అతడి పేరు మీదుగా ‘స్టెల్లర్స్ సీ కౌ’ అనే పేరు వచ్చింది. బేరింగ్ దీవి తీరంలో స్టెల్లర్స్ సీ కౌ పూర్తి అస్థిపంజరం 1987లో శాస్త్రవేత్తలకు దొరికింది. దీని ఆధారంగా జన్యు పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు స్టెల్లర్స్ సీ కౌకు పునరుత్థానం కల్పించడం సాధ్యమేనని, ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నామని చెబుతున్నారు.ఐరిష్ ఎల్క్జింక జాతుల్లో అతిపెద్ద జంతువు ఇది. సహస్రాబ్దాల కిందట భూమ్మీద సంచరించేది. ఐర్లండ్ నుంచి సైబీరియాలోని బైకాల్ సరస్సు వరకు గల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉండేది. పర్యావరణ కారణాల వల్ల, మనుగడకు సంబంధించిన పరిమితుల వల్ల ఐరిష్ ఎల్క్ జాతి ఏడువేల ఏళ్ల కిందటే అంతరించింది. ప్రస్తుతం భూమ్మీద మనుగడ సాగిస్తున్న జింక జాతుల్లో ఐరిష్ ఎల్క్ జన్యువుల్లో ఎక్కువ శాతం జన్యువులు ఉన్న జాతి ఫ్యాలో డీర్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు. పంతొమ్మిదో శతాబ్ది నుంచి సాగిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలకు ఐర్లండ్‌లో ఐరిష్ ఎల్క్ అస్థిపంజరాలు విరివిగా దొరికాయి. వీటి ఆధారంగా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఫ్యాలో డీర్ ద్వారా ఐరిష్ ఎల్క్కు పునర్జీవం కల్పించవచ్చనే అంచనాతో ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ఆరోక్స్ఇది గోజాతికి చెందిన పురాతన జంతువు. ఇవి మిగిలిన జాతుల ఎద్దులు, ఆవుల కంటే భారీగా ఉంటాయి. నాలుగేళ్ల కిందటి వరకు ఆసియా, యూరోప్, ఉత్తరాఫ్రికా ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండేవి. ఆ తర్వాత పదిహేడో శతాబ్దం ప్రారంభం నాటికి ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఆరోక్స్ జాతికి తిరిగి ప్రాణం పోయడానికి శాస్త్రవేత్తలు 2009 నుంచి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికీ మనుగడలో ఉన్న పురాతన గోజాతుల్లో ఆరోక్స్ డీఎన్ఏ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆరోక్స్ డీఎన్ఏ ఎక్కువ శాతం ఉన్న గోజాతులను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటి ద్వారా ఆరోక్స్ జాతికి పునరుత్థానం కల్పించడానికి ప్రయోగాలు చేస్తున్నారు.టాస్మానియన్ టైగర్పెద్దపులి మాదిరిగానే దీని ఒంటి మీద చారలు ఉంటాయి గాని, ఇది తోడేలు జాతికి చెందిన జంతువు. ఒకప్పుడు టాస్మానియా ప్రాంతంలో విరివిగా సంచరించిన ఈ జంతువుకు ఒంటి మీద చారల కారణంగా ‘టాస్మానియన్ టైగర్’ అనే పేరు వచ్చింది. కొందరు దీనిని ‘టాస్మానియన్ వూల్ఫ్’ అని కూడా అంటారు. ఈ జంతువు దాదాపు శతాబ్దం కిందట అంతరించిపోయింది. దాదాపు 110 ఏళ్ల కిందట చనిపోయిన టాస్మానియన్ టైగర్ అస్థిపంజరం నుంచి శాస్త్రవేత్తలు దీని ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏను ఇథనాల్‌లో భద్రపరచారు. దీని ద్వారా టాస్మానియన్ టైగర్‌కు తిరిగి ప్రాణం పోయడానికి కలోసల్ బయోసైన్సెస్ కంపెనీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన ‘థైలాసైన్ ఇంటిగ్రేటెడ్ జెనెటిక్ రిస్టరేషన్ రీసెర్చ్ లాబ్ శాస్త్రవేత్తల సహకారంతో ప్రయోగాలు సాగిస్తోంది.వూలీ రైనోసరస్ఇది ఖడ్గమృగం జాతికి చెందిన భారీ జంతువు. ఖడ్గమృగం శరీరం నున్నగా ఉంటే, దీనికి మాత్రం ఒంటి నిండా దట్టంగా రోమాలు ఉంటాయి. ఈ జంతువు సహస్రాబ్దాల కిందటే అంతరించిపోయింది. పర్యావరణ మార్పుల ఫలితంగా దాదాపు 8,700 ఏళ్ల కింద వూలీ రైనోసరస్ అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తల అంచనా. మామత్‌కు ఏనుగు ద్వారా పునర్జీవం కల్పించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగానే, వూలీ రైనోసరస్కు ఖడ్గమృగం ద్వారా పునర్జీవం కల్పించేందుకు శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు.ది గ్రేట్ ఆక్ఇది చూడటానికి పెంగ్విన్‌లా కనిపించే ఎగరలేని పక్షి. వేటగాళ్ల తాకిడి వల్ల ది గ్రేట్ ఆక్ పక్షిజాతి పంతొమ్మిదో శతాబ్దిలో అంతరించిపోయింది. చిట్టచివరి ది గ్రేట్ ఆక్ పక్షిని 1844 జూలైలో వేటగాళ్లు చేజిక్కించుకుని, చంపి తినేసినట్లు రికార్డులు ఉన్నాయి. స్పెయిన్ ఉత్తర తీరం నుంచి కెనడా వరకు అట్లాంటిక్ తీర ప్రాంతమంతటా ఈ పక్షులు ఒకప్పుడు విరివిగా ఉండేవి. ధ్రువపు ఎలుగుబంట్లు ఈ పక్షులను తినేవి. వాటి కంటే ఎక్కువగా మనుషులు వేటాడి తినేవారు. ది గ్రేట్ ఆక్ పునరుత్థానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. టెక్సస్‌లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ యానిమల్ హెల్త్ లేబొరేటరీ వంటి సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు కొనసాగిస్తున్నారు.శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలించినట్లయితే, అంతరించిపోయిన జీవరాశుల్లో కనీసం కొన్ని అయినా తిరిగి ప్రాణం పోసుకోగలవు. వాటి వల్ల భూమ్మీద జీవవైవిధ్యం మాత్రమే కాకుండా, ప్రకృతి సమతుల్యత కూడా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన జీవుల పునరుత్థానం కోసం సూక్షా్మతి సూక్ష్మస్థాయిలో సాగిస్తున్న జన్యు ప్రయోగాలు, మూలకణాల ప్రయోగాల వల్ల మానవాళిని పట్టి పీడించే ఎన్నో వ్యాధులకు చికిత్స మార్గాలను కూడా కనుగొనే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. -
జీవన్ భద్రాణి పశ్యంతు
మన పూర్వులు పిల్లలకి జీవితం మీద ఆశని కలిగించి ఎటువంటి అఘాయిత్యాలకి పాల్పడకుండా సానుకూల దృక్పథం పెం΄÷ందే విధంగా మనసులని మలచేవారు. అందుకే ఒకప్పుడు ఆత్మహత్యల వంటివి అంతగా కనపడేవి కావు. ఎక్కడో ఒకటి జరిగితే అదేదో వింత అన్నట్టు అందరూ కంగారు పడేవారు. ఇప్పుడు అవి అతి సామాన్యమై ΄ోయాయి. అది చాలా మామూలు విషయంగా పరిగణించి పెద్దగా పట్టించుకోవటం కూడా లేదు. ప్రతిస్పందించే సున్నితత్వాన్ని కూడా కోల్పోయాం. ‘‘బ్రతికి యుండిన సుఖములు బడయ వచ్చు’’ అన్నది భారతీయుల విశ్వాసం. ఇటువంటి భావాలని అతి సామాన్యమైన మాటలలో అందరి మనస్సులలో నాటుకునేట్టు చేశారు. బ్రతుకుని అంతం చేసుకోవాలనే ఆలోచనే రాకుండా వాతావరణాన్ని ఉంచేవారు. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని చావో రేవో అన్నంత తీవ్రంగా తీసుకునే వారు కాదు. ‘‘కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా?’’ అని తేలిక చేసేవారు, మనం అందరం మనుషులం అని గుర్తు చేస్తూ. ఈనాడు జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది చిన్నతనంలో కడుపునిండా తిండి కూడా లేనివారు అని వారి జీవితచరిత్రలు చూస్తే అర్థమవుతుంది. ‘‘బతికుంటే బలుసాకు తినవచ్చు’’ అని చెప్పి సాంత్వన కలిగించే వారు. పైగా, ఆ రోజుల్లో అనుకున్నది సాధించక ΄ోవటం, పరాజయాల పాలు కావటం జరిగి, తాత్కాలికంగా నిరాశ కలిగినా వెంటనే తేరుకుని రెట్టించిన ఉత్సాహంతో లేదా కసితో అనుకున్న దానిని సాధించటానికి ప్రయత్నం చేసేవారు. తాము విఫలం కావటానికి కారణం ఏమిటి? అని విశ్లేషించుకునేవారు. ఇది కార్యసాధకుల లక్షణం. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు, పూల పానుపూ కాదు. ఈ ఆలోచనా విధానం నేటి యువతరంలోను, మధ్యవయస్కులలోనూ మృగ్యం అయింది. తక్షణం అనుకున్న ఫలితం రావాలి, తన ప్రయత్నంతో సంబంధం లేకుండా. అపజయాన్ని, ఓటమిని అసలు ఎదుర్కో లేరు. కొంచెం కూడా ఆగలేరు. నిర్ధారణ చేసుకునే ఓపిక కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో ΄÷రపాటు పడే అవకాశం కూడా ఉంది. మనం చూస్తూనే ఉంటాం. మొదటి వంద స్థానాల్లో ఉండవలసిన అభ్యర్థి ఉత్తీర్ణుడు కాలేదని ప్రకటన రాగానే తట్టుకో లేక ఆత్మహత్య చేసుకున్న మరునాడు ఆ ప్రకటన తప్పు అని సరి చేసుకోటం తెలుసు కదా! మనసుని ఆ మాత్రం అదుపులో ఉంచలేక ΄ోవటం వల్ల వచ్చిన ప్రమాదం అది. ప్రాణాలు అర్పించి సాధించారు, బలిదానం చేశారు అంటూ ΄÷గిడితే వారికి ఒరిగేది ఏముంది? మిగిలిన వారు అనుభవించ వచ్చు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తాయి. సమయం పట్టవచ్చు. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఏమంటే, ప్రాణత్యాగం చేయదల్చుకున్న వారిని ఒక్క క్షణం ఆపగలిగితే చాలు నట. క్షణికావేశం చల్లారుతుంది అంటారు. ఆ పనిని ఎవరు చేయగలరు? అసలు ఎవరికైనా తెలియాలి కదా! అందుకే ఎవరికి వారే తమను తాము సముదాయించుకుని, పరిస్థితులతో ΄ోరాడి గెలవాలి. కలిగిన మేలు అనుభవించటానికి బ్రతికి ఉండాలి కదా!ఈ బతుకుని అంతం చేసుకోవాలనే భావన ఎవరికీ రాదా? సీతమ్మకి, హనుమకి, రామచంద్రమూర్తికి, దుర్యోధనుడి వంటి వారికే వచ్చింది. కాని విచక్షణ వారిని ఆపని చేయకుండా కాపాడింది. సీతమ్మ కనపడలేదని హనుమ ఏ విధంగా శరీరం వదలాలి అని ఆలోచిస్తూ సీతారామలక్ష్మణులకి, సుగ్రీవాదులకి నమస్కారం చేయగానే అశోకవనం కనపడింది. దైవాన్ని, పెద్దలని స్మరిస్తే మార్గం కనపడుతుంది. సీత కూడా జుట్టుతో చెట్టు కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నంలో ఉండగా త్రిజట మాటలు, హనుమ దర్శనం కలిగాయి. తొందర పడితే? రాముడు కూడా సీత లేకుండా ఉండలేనని అనుకుని, అరణ్యవాసం చేయలేదనే చెడ్డపేరు వస్తుందని ఆగాడు. ఆవేశ పడకుండా కొద్దిగా ఆలోచిస్తే మంచి జరిగి తీరుతుంది. – డా. ఎన్. అనంతలక్ష్మి -
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్ పట్నాయక్ బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.జీవన్‌దాన్ ప్రతినిధులు నరేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ తొలగించారు. వాటిని జీవన్‌దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్ చానెల్ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్‌దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
మార్పు మనుగడ కోసమే...
జీవితంలో ఎదురయ్యే వివిధ పరిస్థితులకు మనం ఏ విధంగా స్పందిస్తాం... వాటిని ఏ కోణంలో చూస్తామనే విషయం మీదే మన అభివృద్ధి, ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.. మనసు బాగోలేనపుడు చాలా విషయాలను మనం సమస్యలుగా చూస్తాం.. ప్రశాంతంగా ఉన్నపుడు అవే పరిస్థితులను సవాళ్లుగా భావిస్తాం. అందువల్ల మన అభివృద్ధి ఏదైనా అది మనం ఆయా సమస్యలను స్వీకరించే స్థితి మీదే ఆధార పడి ఉంటుంది..మనిషి జీవితం పూల పాన్పు కాదు.. అదేవిధంగా ముళ్ళ కిరీటం కూడా కాదు.. ఈప్రాథమిక సూత్రాన్ని అవలోకనం చేసుకుని మన జీవితంలో వచ్చే ప్రతి మార్పును ఆహ్వానించినపుడే మన జన్మకు సార్ధకత లభిస్తుంది.. బతుకూ పండుతుంది. మన జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలకు వెరుస్తూ, మార్పును ఆహ్వానించకపోతే అది మనలో ఆత్మన్యూనతను పెంచుతుంది. ఒక పనిలో విఫలమైనపుడు దానిలో ఎందుకు విఫలమయ్యామా... అని బుర్ర బద్దలు కొట్టుకుని మనసు పాడు చేసుకునే కన్నా, ఏం జరిగినా అది మన మంచికోసమేనని ఆత్మను సంతృప్తి చేసుకుంటే మనసు కుదుట పడుతుంది. ఆనందం సొంతమవుతుంది. జీవితంలో ఎదురయ్యే మార్పును ఎప్పటికప్పుడు ఆహ్వానించి, దానిని మన జీవితానికి సోపానాలుగా మార్చుకోవాలి తప్ప, ఆత్మన్యూనతతో కుంగి పోకూడదు.కనుక మార్పు అన్నది ఈ సృష్టిలో నిరంతరం జరిగే ఒకానొక సహజమైన ప్రక్రియ... పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ మనలో శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా సంఘపరంగా, ఆత్మపరంగా ఇంకా అనేకానేక కోణాలలో, అనేకానేక స్థితులలో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి... అనివార్యం గా ఇలా మనలో జరిగే ప్రతి ఒక్క మార్పునూ మనం అంగీకరించాలి.కురుక్షేత్ర సంగ్రామంలో తాను అస్త్ర సన్యాసం చేస్తానని అర్జునుడు చింతించినపుడు, శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు. మార్పును ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, ఇది çసృష్టి ధర్మమని, మార్పును అంగీకరించినపుడే భవిష్యత్ నిర్దేశం కలుగుతుందని బోధించాడు. అలా శ్రీ కృష్ణభగవానుడి స్ఫూర్తితో అర్జునుడు యుద్ధం చేసి ధర్మ సంరక్షణలో తన వంతు పాత్ర పోషించాడు.ప్రతి ఒక్కరూ మార్పును అంగీకరించాలి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వేగంగా దూసుకువెళ్లాలి. ఉన్నతంగా ఎదగాలనే వారు.. మనతో మనం పోటీ పడాలని మానసిక నిపుణులు సైతం సూచిస్తున్నారు. మార్పును అంగీకరించకపోతే, మన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా వుంటుంది. కనుక మొదట్నుంచీ తల్లిదండ్రులు మార్పుకు అనుగుణంగా జీవితాలను మలచుకోవాలనే దృక్పథాన్ని పిల్లలకు అలవాటు చేయాలి. వర్తమాన ప్రపంచానికి, పరిస్థితులకనుగుణంగా వారికి వారు నైపుణ్యాలు పెంచుకునే విధంగా ్రపోత్సహించాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే హక్కును కూడా ఇవ్వాలి అలాగే, వారి వ్యక్తిత్వాలు, ్రపాధాన్యతలు, పరిమితులను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. కుటుంబాలు, పాఠశాలలు పిల్లల సామర్థ్యం, ఉత్సుకత, సృజనాత్మకత, అలవాట్లను పిల్లల భావి జీవితానికనుగుణంగా తీర్చిదిద్దినపుడు జీవితంలో వస్తున్న మార్పులను అంగీకరించే సామర్థ్యాన్ని ΄÷ంది, పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారన్న వాస్తవాన్ని గుర్తించి మసలుకోవాలి. దాసరి దుర్గాప్రసాద్ -
ఏది అత్యుత్తమ మార్గం?
మార్గాలన్నీ సమాన ప్రాముఖ్యం కలిగినవే. ఎందుకంటే జీవాత్మను పరమాత్మునిలో చేర్చడమే ఈ అన్ని మార్గాల లక్ష్యం. మంచితనం విషయంలో ఉత్తమం, మధ్యమం, అథమం అనేవి సాపేక్ష పదాలు మాత్రమే. ఏ వ్యక్తికి ఏ మార్గం సులభంగా, మనస్సుకు నచ్చినట్లు ఉంటుందో అదే అతనికి ఉత్తమ మార్గం.వివిధ నదులు అనేక దిక్కుల నుంచి వేగంగా ప్రవహిస్తూ చివరగా సముద్రంలో కలిసిపోతాయి. అలాగే భక్తి, జ్ఞాన మార్గాల్లో పయనించే వాళ్లందరూ చివరిగా చేసే ప్రయత్నం ఒక్కటే. జీవుడు ఏ మూలం నుండి వచ్చాడో, ఆ మూలం లోనికి జీవుణ్ణి చేర్చడమే భక్తి, జ్ఞాన మార్గాల లక్ష్యం. కారణం గుర్తించు నీవు, నీ అంతరాత్మతో పొందిక కలిగి ఉన్నట్లయితే బాహ్య ప్రపంచం నీతో పొందికను కలిగి ఉంటుంది. బాహ్య ప్రపంచంలో నీకు విరోధం కనిపించినట్లయితే అది నీ లోపల గల కల్లోలాలను బహిర్గతపరుస్తుంది. అందువల్ల బయట కల్లోలాలు సృష్టించబడతాయి.ప్రకృతి మాత రచించిన గొప్ప ప్రణాళికలో ప్రతి వస్తువునకూ సముచితమైన విలువ, ఉపయోగాలు ఉన్నాయి. దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. వేదాంతాన్ని అనుసరించి చూస్తే... ప్రకృతి ఎక్కడా కల్లోలాలను కలిగించదని అర్థమవుతుంది. కేవలం మానవుని మనస్సు మాత్రమే ఇటువంటి కల్లోలాలను సృష్టిస్తుంది. కల్లోలాలను గురించి ఎంత సులభంగా మాట్లాడతావో, నీవు వాటికి అంత ప్రాముఖ్యం ఇచ్చిన వాడవు అవుతావు.ప్రతి విషయానికీ ఏదో ఒక పరిణామం కారణం అనే విషయాన్ని గ్రహించి, ఏ కారణం వల్ల అది సంభవించిందో... అటువంటి మూల కారణాలను నీవు గుర్తించు. కారణం లేకుండగానే ఏదీ సంభవించదు అని గుర్తెరగాలి. నీవు జీవితంలో ఉన్నత ఆÔè యా లకు లోబడి నడచుకున్నప్పుడు నీకు విశ్రాంతి లభిస్తుంది. అదే సమ యంలో నీవు ప్రశాంతంగా ఉండగలవు. కాబట్టి దృష్టిని ప్రక్కకు మళ్ళించకుండా, నీ జీవితాన్ని భక్తి, విశ్వాసాలతో భగవదర్పణ చేసి గడుపు. సదా భగవన్నామాన్ని స్మరించు.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని యాజమాన్యం.. కంపెనీపై తీవ్ర విమర్శలు
పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధంఅయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్సంస్థ తీరు దారుణంఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీకాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్‌లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రంగంలోకి కేంద్రంఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. -
12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే!..!
మంచిగా నిద్రపోకపోతే ఉదయం వేళ చురుకుగా పనిచేయడం సాధ్యం కాదు. ఏదో విధమైన చికాకు, కోపం ఎక్కువగా ఉంటాయి. అదీగాక వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తికి సగటున ఆరు నుంచి 8 గంటలు నిద్ర అవసరమని సిఫార్సు చేస్తుంటారు. అలాంటిది ఓ జపాన్ వ్యక్తి కేవలం 30 నిమిషాల నిద్రపోతున్నాడట. అయినా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా చురుగ్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇలా అరంగంట నిద్రతోనే తన పనిసామర్థ్యం మరింత మెరుగుపడిందని చెబుతుండటం విశేషం. వివరాల్లోకెళ్తే..జపాన్‌లో హ్యూగో ప్రిఫెక్చర్‌కు చెందిన డైసుకే హోరీ గత 12 ఏళ్లుగా అరగంటే నిద్రపోతున్నాడట. దీనివల్ల తన పని సామర్థ్యం మెరుగుపడిందని చెబుతున్నాడు. ఇలా 30 నిమిషాలే నిద్రపోయేలా తన శరీరానికి, మెదడుకు శిక్షణ ఇచ్చానని, అందుల్ల తాను అలిసిపోనని చెప్పాడు. తాను 12 ఏళ్ల క్రితం నుంచి ఇలా నిద్రను తగ్గించుకోవడం ప్రారంభించానని అలా ప్రస్తుతం తన నిద్రను రోజుకు 30 నుంచి 45 నిమిషాలకు తగ్గించుకోగలిగానని వెల్లడించాడు. తాను భోజనానికి ఒక గంట ముందు క్రీడలు లేదా కాఫీ తాగడం వంటివి చేసి నిద్ర వస్తుందనే భావన రాదని అంటున్నాడు. అలాగే తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వాళ్లు సుదీర్ఘ నిద్రకంటే నాణ్యమైన నిద్రతోనే ఎక్కువ ప్రయోజనం పొందగలరని చెబుతున్నాడు. ఇలాంటి టెక్నీక్తోనే సదా అప్రమత్తంగా ఉండే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువసేపు నిద్రపోయినా అధిక సార్థ్యాన్ని కలిగి ఉంటారని చెప్పాడు. జపాన్‌లోని యోమియూరి టీవీ ఛానల్ డైసుకే ఎలా జీవిస్తున్నాడో చూపించే ఒక రియాలిటీ షో చేసింది. ఈ షో పేరు “విల్ యు గో విత్ మీ?”.వారు మూడు రోజుల పాటు డైసుకేని గమనించారు. అయితే ఒక ఎపిసోడ్లో డైసుకే కేవలం 26 నిమిషాలు మాత్రమే నిద్రపోయాడు.ఆ తర్వాత చాలా ఉత్సాహంగా లేచి, బ్రేక్‌ఫాస్ట్ చేసి పనికి వెళ్లడం, జిమ్ చేయడం వంటివి చేశాడు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించకపోయినా అదే రియల్‌గా జరిగింది. అంతేగాదు 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసీయేషన్ని స్థాపించాడు. అక్కడ రెండు వేలకు పైగా విద్యార్థులకు తనలాగే తక్కువసేపు నిద్రపోవడం ఎలాగో నేర్పించాడు.అయితే ఈ అల్ట్రా షార్ట్ స్లీపర్స్‌కు ఎందుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావడం లేదనేది శాస్త్రవేత్తలకు అర్థకాని చిక్కుప్రశ్నలా ఉంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఇది ఎలానో నేర్చుకోవాలనుకుంటున్నామని, మరికొందరూ అందరికీ సరిపోదని, దీని వల్ల పలు సమస్యలు వస్తాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!) -
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
పాక్‌లో ప్రాణాంతక వైరస్.. భారత్‌కూ ముప్పు?
పాకిస్తాన్‌ను ఇప్పుడు మరోవైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన సీసీహెచ్ఎఫ్(క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్) కేసు పాక్‌లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ బారినపడిన 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి భారతీయులనూ భయపెడుతోంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపిన వివరాల ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం చాలాకష్టం. చికిత్స కూడా అంతసులభమేమీ కాదు. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ సోకిన వారిలోని 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్ (పేలు తరహాలోని పరాన్న జీవి) కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. సీసీహెచ్ఎఫ్ వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షలాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. మనుషులకు ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ల నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతుల రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.సీసీహెచ్ఎఫ్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఇంకా ఎటువంటి చికిత్స గానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్లో ఉంచి, వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. సీసీహెచ్ఎఫ్ సోకినవారిలో 50 శాతం మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండటం, వ్యాధి వ్యాప్తి చెందిన ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. -
భార్యకు సర్ఫ్రైజ్ ఇవ్వబోయి పేలిపోయాడు..కట్‌చేస్తే అతడు..!
హనీమూన్‌ను గుర్తుండిపోయేలా చేద్దాం అనుకుని భార్యకు ఓ పీడకలను అందించాడు. ఇలాంటి సర్ఫ్రైజ్ ఏ భర్తి ఇంతవరకు ఇచ్చి ఉండడేమో..!. కానీ ఇలాంటి భయానక పరిస్థితి ఏ భార్యకు ఎదురుకాకూడదు. ఈ ఆ ఘటన నుంచి ఆ భార్య ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు కూడా. అసలేం జరిగిందంటే..కెనడాకు చెందిన నూతన వధూవరులు లెవీ స్టాన్ఫోర్డ్, భార్య అమీ హనీమూన్‌కు వెళ్లారు. అతను తన కుటుంబంలోని ఆరుగురు సభ్యులతో కలిసి మంచి మంచి ప్రదేశాలను చూడటానికి వెళ్లాడు. 23 ఏళ్ల లెవీ తన హనీమూన్ గుర్తుండిపోయేలా చేయడానికి, భార్య అమీని ఆకట్టుకోవడానికి చక్కటి ప్లాన్ వేశాడు. ఐతే లెవీ చిన్నతనంలో గ్రామంలో పెరగడంతో అతడికి పేలుడు పదార్థాలు జీవితంలో ఓ భాగం కూడా. అందువల్ల ఒక పరికరాన్ని సిద్ధం చేశాడు. ఇది సరస్సులో పేలి ఒక అందమైన నీటి ఫౌంటైన్‌ని సృష్టిస్తుంది. అదే చేద్దాం అనుకున్నాడు లెవీ. అంతేగాదు ఆ పేలుడు శబ్దాన్ని రికార్డు చేయమని తన సోదరుడకి కూడా చెప్పాడు. అతను పరికరాన్ని నీటిలోకి విసిరేద్దాం అనుకుంటుండగా..ఇంకా 60 సెకన్లు ఉందనంగా దురదృష్టవశాత్తు..చేతిలోనే అది పేలిపోయింది. లెవీ ఆ భయానక ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయాడు. రక్తంలో తడిసిపోయి బట్టలన్నీ ఊడిపోయాయి. చచ్చిపోతున్నంత బాధను అనుభవించాడు. శరీరమంతా గాయలమయం అయిపోయింది. కోలుకోవడానికి సంవత్సరం పట్టింది. ఆ తర్వాత మునుపటిలా ఆర్బరిస్ట్గా పనిచేయలేకపోయాడు. అయితే అతడి ప్రియురాలు, అమీ మాత్రం అతడిని వదిలి వెళ్లిపోలేదు. ఈ చేదు ఘటన తర్వాత వాళ్ల మధ్య ప్రేమ రెట్టింపు అయ్యింది. ఈ ఘటనలో లెవీ ఎడమ చేయి కోల్పోవడమే గాక చాలా భాగాలకు తొడ చర్మాన్ని కత్తిరించి అతికించడం జరిగింది. చెప్పాలంటే శరీరం అంతా గాయాలతో చిందరవందరగా ఉంది. అయినా అతడి భార్య లెవీ వెన్నంటే ఉండి కంటికి రెప్పలా కాచుకుంది. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో చూపించింది అమీ. అయితే ఈ చేదు ఘటన తర్వాత ఇరువురు వాదులాడుకోలేదని, భగవంతడు ప్రసాదించిన రెండో జీవితాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేశామని ఆత్మవిశ్వాసంగా చెప్పాడు లెవీ. ఇప్పుడు ఆ జంటకు నలుగురు పిల్లలు కూడా. ప్రస్తుతం అతడు ఈ ఘటనతో మోటివేషనల్ స్పీకర్, కమెడియన్, ఎంటర్టైనర్గా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక్కోసారి మరుపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని చేసే పనులు మర్చిపోలేని పీడకలలా విధి మార్చేసినా..తట్టుకుని నిలబడి తమ బాంధవ్యాన్ని స్ట్రాంగ్‌గా చేసుకుంది ఈ జంట. పైగా పరిపూర్ణమైన వ్యక్తులుగా నిలిచి ఎందరిగో స్ఫూర్తినిచ్చారు. ప్రతికూలతలను సానుకూలంగా మార్చుకుని జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవడం అంటే ఏంటో తెలియజెప్పింది ఈ జంట. (చదవండి: సారా అలీఖాన్ వెయిట్ లాస్ జర్నీ..96 కిలోల నుంచి..!) -
ధర్మయోధుడు: ‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి.. పైగా..
అది కురుదేశం. దాని రాజధాని నగరం స్థూలకోష్ఠికం. ఆ నగరంలో ధనవంతుడైన పండితుని కుమారుడు రాష్ట్రపాలుడు. రాష్ట్రపాలునికి యుక్తవయస్సు దాటింది. అతనికి గృహజీవితం పట్ల అంతగా ఇష్టం ఉండేది కాదు. సన్యసించాలని, జ్ఞానం పొందాలని అనుకునేవాడు. ఒకరోజు బుద్ధుడు తన బౌద్ధసంఘంతో కలసి నగరానికి వచ్చాడు. తన మిత్రునితో కలిసి వెళ్ళి, బుద్ధుని ధర్మోపదేశం విన్నాడు రాష్ట్రపాలుడు. తానూ బౌద్ధ భిక్షువుగా మారాలి అనుకున్నాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళి నమస్కరించి, విషయం చెప్పాడు.‘‘రాష్ట్రపాలా! నీవు కుర్రవాడివి. నీ తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే నీకు భిక్షు దీక్ష ఇస్తాను’’ అన్నాడు బుద్ధుడు. రాష్ట్రపాలుడు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని అడిగాడు. వారు–‘‘నాయనా! మాకు నీవు ఒక్కడివే కుమారుడవి. పైగా మా కోట్లాది ధనానికీ నీవే వారసుడివి. నిన్ను వదిలి మేం బతకలేం. కాబట్టి భిక్షువుగా మారడానికి అనుమతించలేం’’ అని తేల్చి చెప్పారు. రాష్ట్రపాలుడు రెండుమూడు రోజులు వారిని ప్రాధేయపడ్డాడు. చివరికి తన గదిలోకి చేరి, నిరాహార వ్రతం పూనాడు. వారం గడిచింది. రాష్ట్రపాలుడు నీరసించి పడిపోయాడు. తల్లిదండ్రులు భయపడ్డారు. భోరున విలపించారు. అప్పుడు రాష్ట్రపాలుని మిత్రున్ని పిలిపించారు. అతను చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ మిత్రుడు– తల్లిదండ్రులతో..‘‘మీరు అంగీకరించడమే మంచిది. కనీసం ఎక్కడో ఒకచోట బతికి ఉంటాడు. అయినా కొందరు కొంతకాలమే భిక్షు జీవనం సాగించి, ఇక సాగించలేక తిరిగి ఇంటిదారి పడుతున్నారు. మన వాడూ అదే చేయవచ్చు ’’ అని చెప్పడంతో ఏదో ఒక మూల ఆశతో తల్లిదండ్రులు అనుమతించారు.మహా ఐశ్వర్యాన్ని వదిలి రాష్ట్రపాలుడు భిక్షువుగా మారాడు. కొన్నాళ్ళు గడిచాయి. కొడుకు తిరిగిరాలేదు. దానితో బుద్ధుని పట్ల, భిక్షువుల పట్ల చాలా కోపాన్ని పెంచుకున్నాడు రాష్ట్రపాలుడి తండ్రి. ఒకరోజు కాషాయ బట్టలు కట్టుకుని, బోడిగుండుతో, భిక్షాపాత్ర పట్టుకుని ఒక భిక్షువు వారింటికి వచ్చాడు. పెరట్లో ఉన్న తండ్రికి వళ్ళు మండిపోయింది. ‘‘భిక్షా లేదు, గంజీ లేదు. పో..పో’’ అంటూ తిట్టాడు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భిక్షువు చిరునవ్వుతో అక్కడి నుండి కదిలాడు. అంతలో ఇంటిలోని దాసి పాచిన గంజి పారబోయడానికి బయటకు తెచ్చింది. భిక్షువు ఆగి... ‘‘అమ్మా! ఆ గంజి అయినా భిక్షగా వేయండి’’ అన్నాడు.ఆమె ఆ పాచిన గంజిని భిక్షాపాత్రలో పోస్తూ ఆ భిక్షువుకేసి తేరిపార చూసింది.ఆమె ఒళ్ళు జలదరించింది. నేల కంపించింది. నేలమీద పడి నమస్కరించింది. లేచి పరుగు పరుగున ఇంట్లోకి పోయింది.‘‘అయ్యా! ఆ వచ్చిన భిక్షువు మరెవరో కాదు. మన అబ్బాయి గారే’’ అంది. ఆ మాట విని తల్లిదండ్రులు శోకిస్తూ వీధుల్లోకి వచ్చిపడ్డారు. అక్కడ భిక్షువు కనిపించలేదు. వెతుకుతూ వెళ్లారు. ఆ వీధి చివరనున్న తోటలో కూర్చొని ఆ పాచిన భిక్షను పరమాన్నంగా స్వీకరిస్తున్నాడు రాష్ట్రపాలుడు. ‘‘నాయనా! మేము గమనించలేదు. రా! మన ఇంటికి రా! మంచి భోజనం వడ్డిస్తాం’’ అన్నారు. ‘‘గృహస్తులారా! ఈ రోజుకి నా భోజనం ముగిసింది’’ అన్నాడు. మరునాడు రమ్మన్నారు. అంగీకరించాడు. వెళ్ళాడు. ఉన్నతమైన ఆసనంపై బంగారు గిన్నెల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ముందు ఉంచారు. కొన్ని పళ్ళాల నిండా రత్నరాశులు, వజ్రవైడూర్యాలు నింపి ఆ గదిలో ఉంచారు.‘‘నాయనా! మనకి ఏం తక్కువ! ఈ పళ్ళాల్లో కాదు, గదుల నిండా ఇలాంటి ధనరాశి ఉంది. ఇవన్నీ నీకే... రా! ఆ భిక్ష జీవనం వదులు’’ అన్నారు.‘‘మీరు ఆ ధనరాశుల్ని బండ్లకెత్తించి గంగానదిలో కుమ్మరించండి. లేదా... దానం చేయండి. నాకు జ్ఞాన సంపద కావాలి. ధర్మ సంపద కావాలి. శీలసంపద కావాలి. అది తరగని సంపద. అది తథాగతుని దగ్గర తరగనంత ఉంది. మీరూ ఆ ధర్మ మార్గాన్నే నడవండి. మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి’’ అని లేచి వెళ్లిపోయాడు రాష్ట్రపాలుడు. – డా. బొర్రా గోవర్ధన్ -
నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతి
ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌కు సంబంధించి వెలువడిన తాజా నివేదిక మరింత దడ పుట్టిస్తోంది. 2023లో ఎయిడ్స్‌కు కారణమయ్యే హెచ్ఐవి వైరస్‌ను ప్రపంచంలోని సుమారు నాలుగు కోట్ల మందిలో గుర్తించారు. వీరిలో 90 లక్షల మంది వ్యాధి నివారణకు ఎలాంటి చికిత్స పొందలేకపోయారు. ఫలితంగా ప్రతి నిమిషానికో ఎయిడ్స్ బాధితుడు మృతిచెందాడని వెల్లడయ్యింది.ఐక్యరాజ్యసమితి తన తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ప్రపంచంలో ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేసే దిశగా పురోగతి సాధిస్తున్న తరుణంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరంగా పరిణమించింది. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణమని ఆ నివేదిక తెలిపింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, తూర్పు యూరప్, మధ్య ఆసియా, లాటిన్ అమెరికాలలో ఎయిడ్స్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతేడాది ఎయిడ్స్ కారణంగా ఆరు లక్షల మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు2023లో దాదాపు 6,30,000 మంది ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో మృతిచెందారు. యూఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ 2030 నాటికి ఎయిడ్స్‌ను అంతం చేస్తామని ప్రపంచ నాయకులు ప్రతిజ్ఞ చేశారని, అయితే 2023లో కొత్తగా13 లక్షలకు పైగా ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని అన్నారు. -
మల్టీవిటమిన్లు మరణ ప్రమాదాన్ని తగ్గించగలవా?
ఇటీవల కాలంలో మల్టీవిటమిన్లు వాడకం ఎక్కువయ్యింది. కొందరూ వీటి వల్ల ఎలాంటి దీర్ఘకాలికి వ్యాధుల బారిన పడమని మరణాల ప్రమాదం తగ్గుతుందన్న నమ్మకంతో తీసుకుంటుంటారు. అయితే ఇలా తీసుకోవడం వల్ల మరణా ప్రమాదం తగ్గుతుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజు వీటిని వినియోగించే వారికే మరింత ప్రమాదం ఉందంటూ పలు ఆసక్తికర షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..డైలీ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించేలా సహాయపడదని అధ్యయనంలో తేలింది. ఇలా వాడటం వల్ల మరణ ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతోంది. ఈవిధంగా డైలీ మల్టీవిటమిన్లు వినియోగించేవారిలో రాబోయే దశాబ్దాలలో వారి మరణ ప్రమాదాన్ని తగ్గించాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు దాదాపు నాలుగు లక్షల మంది పెద్దల డేటాను విశ్లేషించారు. ఆ పరిశోధనలో మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకున్న వారికే మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించారు. ఇలా సప్లిమెంట్లను తీసుకునే వ్యక్తుల్లో మరణాల ప్రమాదం 4% పెరుగుతుందని అధ్యనం వెల్లడించింది. నిజానికి ఇప్పటి వరకు మల్టీవిటమిన్లు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, హాని గురించి తగిన ఆధారాలు లేవు. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలికి వ్యాధి సంబంధిత మరణాలకు మల్టీవిటమిన్ల వినియోగంకు ఎంత వరకు లింక్ అప్ అయ్యి ఉంటుందనే దిశగా అధ్యయనాలు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ క్రమంలో డాక్టర్ ఎరిక్కా లాఫ్ట్ఫీల్డ్, అతడి సహచరులు యూఎస్ ప్రజలకు సంబంధించి మూడు ప్రదాన ఆరోగ్య అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ పరిశోధనలో దాదాపు 3 లక్షలకు పైగా ప్రజల ఆరోగ్య వంతమైన డేటాను రికార్డు చేశారు. ఈ అధ్యయనంలో పాల్గొనే వారి సగటు వయసు 60 ఏళ్లు మాత్రమే. కానీ ప్రజలు అనారోగ్యం వచ్చినప్పుడూ వాటి వినియోగం ఎక్కువగా ఉందని, ఇలా వినియోగించడం వల్ల మంచిది కాదని పరిశోధన చెబుతోంది. అయితే నిర్థిష్ట సమయంలో ఇవి మంచి ఫలితాలు కూడా ఇస్తాయని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చారు. నావికులు విటమిన్ సీ సప్లిమెంట్స్ ద్వారా రక్షించబడ్డారు. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సీ, ఈ, జింక్ వంటి వాటితో వయసు సంబంధిత మచ్చల క్షీణత నెమ్మదిస్తుందని చెప్పారు. ఇక్కడ మల్లీవిటమిన్లు మనిషిని ఎక్కువ కాలం బతికేలా చేయలేవని, మరణాల ప్రమాదం రాకుండా చేయలేదని వెల్లడించారు. దాని బదులు ఆ విటమిన్లన్నీ పుష్కలంగా లభించేలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్‌ను పరిమితం చేస్తూ..సూక్ష్మపోషకాలు, మాక్రోన్యూట్రియెంట్లు, ఫైబర్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని అన్నారు. కేవలం విటమిన్లు, మినరల్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉండదని, అవి మరణా ప్రమాదాన్ని తగ్గించవని అన్నారు. వాటన్నింటిని ఆహారం నుంచి పొందేలా కష్టపడితే వ్యాధుల బారినపడరని, ఎక్కువకాలం జీవించగలుగుతారని అన్నారు పరిశోధకులు. (చదవండి: నీతా అంబానీ కొనుగోలు చేసిన లక్క బుటీ బనారసీ చీరలు! ప్రత్యేకత ఏంటంటే.) -
వాతావరణానికనుగుణంగా.. ఉపయోగపడే కొత్త పరికరాలు ఇవే..!
ఈ ఫొటోలోని ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ పొద్దుపొద్దున్నే చాలా వెరైటీలను అందిస్తుంది. స్మార్ట్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ మేకర్లో పోచ్డ్ ఎగ్స్, గుంత పొంగనాలు, కుడుములు, పాన్ కేక్స్, గ్రిల్ ఐటమ్స్ వంటివి చాలానే రెడీ చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైస్‌తో పాటు రెండుమూడు రకాల పాన్ ప్లేట్స్ లభిస్తుంటాయి.అవసరాన్ని బట్టి వాటిని మార్చుకుంటూ ఎన్నో వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఒకవైపు గుంతలు, మరోవైపు పాన్ ప్లేట్ లేదా మొత్తం బాల్స్ పాన్, లేదంటే మొత్తం కట్లెట్స్ పాన్.. ఇలా అటాచ్డ్ గ్రిల్ ప్లేట్స్ మెషి¯Œ తో పాటు లభించడంతో దీనిపై వంట సులభమవుతుంది. ఫైర్‌ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ షెల్ హీట్ ఇన్సులేషన్‌తో తయారైన ఈ మేకర్‌ను సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అయితే అటాచ్డ్ పాన్ లేదా గ్రిల్ ప్లేట్స్‌ను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.వైఫై ఎనేబుల్డ్ కాఫీ మేకర్..ఈ స్టైలిష్ కాఫీ మేకర్‌తో వివిధ రకాల కాఫీ ప్లేవర్స్ని ఎంజాయ్ చేయవచ్చు. బ్లాక్ కాఫీ, క్యాపుచినో, లాటె, ఎస్ప్రెస్సో, రిస్ట్రెట్టో వంటి చాలా ప్లేవర్స్ ఇందులో రెడీ చేసుకోవచ్చు. అవర్స్, మినిట్స్, పవర్, టెంపరేచర్, మగ్, కప్స్ వంటి ఆప్షన్స్‌తో డివైస్ ముందు వైపు కింద డిస్ ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీన్ని వైఫై సాయంతో స్మార్ట్ ఫో¯Œ కి కనెక్ట్ చేసుకుని కూడా సులభంగా వినియోగించుకోవచ్చు.6 అడ్జస్టబుల్ గ్రైండ్ సెట్టింగులతో రూపొందిన ఈ మేకర్ని యూజ్ చేసుకోవడం చాలా ఈజీ. సర్వ్ చేసుకోవడం తేలిక. అలాగే ఈ డివైస్‌కి ఎడమవైపు వాటర్ ట్యాంక్ ఉంటుంది. దానిలో నీళ్లు నింపుకుని, కుడివైపు పైభాగంలో మూత తీసి.. కాఫీ గింజలు లేదా కాఫీ పౌడర్ వేసుకుని పవర్ బటన్ నొక్కితే చాలు. టేస్టీ కాఫీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకేసారి నాలుగు నుంచి పది కప్పుల వరకూ కాఫీని రెడీ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.హాట్– కోల్డ్ బ్లెండర్..గ్రెయిన్, పేస్ట్, టీ, జ్యూస్, క్లీన్ అనే ఐదు ఆప్షన్స్‌తో రూపొందిన ఈ హాట్– కోల్డ్ బ్లెండర్ వినియోగదారులకు సౌకర్యవంతమైన మిక్సీలా పని చేస్తుంది. దీనిలో నూక, పిండి తయారు చేసుకోవడంతో పాటు జ్యూసులు, మిల్క్ షేక్స్ వంటివి వేగంగా రెడీ చేసుకోవచ్చు. సుమారు 25 నిమిషాల వ్యవధిలో ఫిల్టర్‌తో పని లేకుండా ఒకేసారి 2 కప్పులు సోయా పాలను సిద్ధం చేసుకోవచ్చు.దీనిలో పదునైన మిక్సింగ్ నైవ్స్ బ్లేడ్స్లా ఉంటాయి. ఈ జ్యూసర్లో 12 అవర్స్ ప్రీసెట్ ఆప్ష¯Œ తో పాటు వన్ అవర్ కీప్ వార్మర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది ఒకరికి లేదా ఇద్దరికి అనువైనది. దీనిలో ఆటోమేటిక్ క్లీనింగ్ ఆప్షన్ ఉండటంతో. దీని వాడకం చాలా తేలికగా ఉంటుంది. పైగా ఇది తక్కువ శబ్దంతో పని చేస్తుంది. -
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
ఏదైనా అత్యంత భయానక ప్రకృతి విపత్తు వస్తేనో, ఏదైనా పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొంటేనో.. భూమ్మీది జీవరాశిలో చాలా వరకు నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. కానీ ఓ ఐదు రకాల జీవులు మాత్రం బతికి ఉండగలుగుతాయట. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కఠిన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవేమిటో తెలుసుకుందామా.. టాప్‌లో టార్డిగ్రేడ్లు.. జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగే అతి చిన్న జీవులు టార్డిగ్రేడ్లు. నీటిలో జీవిస్తుండటం, ఎలుగుబంటిని పోలి ఉండటంతో వీటిని వాటర్ బేర్లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను, మైనస్ 70 డిగ్రీల వరకు తీవ్ర చలిని ఇవి తట్టుకోగలవు. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలకు వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయమొచ్చినా బతికే జీవుల్లో టార్డిగ్రేడ్లు టాప్‌లో ఉన్నాయి. బొద్దింకలూ బతికేస్తాయి.. మనను నానా చికాకు పెట్టే బొద్దింకలను అంత ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎన్నో విపత్కర పరిస్థితులను తట్టుకునే శక్తి వాటి సొంతం. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు.. భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనోసార్లు అంతమైపోయినా బతకగలిగాయి. మట్టిలో, రాళ్లలో, మరెక్కడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దాన్ని తిని బతికేయడం, చాలా వరకు విషపదార్థాలను, రేడియేషన్‌ను కూడా తట్టుకోగలగడం వీటి స్పెషాలిటీ. అందుకే ఎంత తీవ్ర విపత్తు వచ్చినా బొద్దింకలు బతికే అవకాశాలు ఎక్కువట. రాబందులను తక్కువగా చూడొద్దు భూమ్మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జంతువులకు లాభమూ జరుగుతుంది. అలాంటివాటిలో రాబందులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే.. గాల్లో అంతెత్తున, చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల మరణించే జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. కుళ్లిన మాంసంలో పెరిగే బ్యాక్టీరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగల యాసిడ్లు రాబందుల జీర్ణాశయంలో ఉత్పత్తి అవుతాయి. షార్క్‌లకు విపత్తులంటే లెక్కే లేదు.. భూమ్మీది పురాతన జీవుల్లో షార్క్ చేపల జాతి కూడా ఒకటి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. భూమ్మీద చెట్లు ఏర్పడకముందే సముద్రాల్లో షార్క్‌ల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయి. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతులు అంతరించినా షార్క్‌లు మాత్రం బతికేస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతున, ఎలాంటి వెలుగు ప్రసరించని చోట, తీవ్ర పీడనాన్ని తట్టుకుని బతకగలగడం షార్క్‌ల స్పెషాలిటీ. ఇప్పుడు మరో విపత్తు వచ్చినా అవి తట్టుకుని బతికేయగలవు మరి. ఎంపరర్ పెంగ్విన్లకూచాన్స్ ఎక్కువే..అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని జీవిస్తున్న జంతువులు ఎంపరర్ పెంగ్విన్లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్నివారాల పాటు ఆహారం లేకున్నా బతికేయగలవు. పైగా అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు ఏర్పడే అవకాశాలూ తక్కువని, నిక్షేపంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. -
దృష్టిని బట్టి.. సృష్టి!
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?
సాధారణంగా జలుబు మహా అయితే వారం రోజులు ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత అంతా నార్మల్‌గా ఉంటుంది. మన పెద్దలు ఈ జలుబు గురించి తమాషాగా.. అంటే మందులు వేసుకుంటే వారం రోజుల్ల తగ్గుతుంది లేదంటే నెల రోజులు పడుతుందని అంటుంటారు. నిజానికి జులుబు సాధారణమైన వ్యాధే గానీ వస్తే మాత్రం ఊపిరాడక దాంతో పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఇదంతా చెబుతున్నానంటే ఇలానే సాధారణ జలుబుగా తేలిగ్గా తీసుకుని ఓ వ్యక్తి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. బాబోయ్ జలబు ఇంత సివియర్‌గా ఉంటుందా? అనిపించేలా అతడు చాలా అనారోగ్య సమస్యలనే ఫేస్ చేశాడు. ఇది ఎక్కడ జరిగిందంటే..ఈ దిగ్బ్రాంతికర ఘటన కెనడాలోని అంటారియోలో చోటు చేసుకుంది. ఎంతో ఫిట్ణెస్గా ఉండే 33 ఏళ్ల పవర్‌లిఫ్టర్ జారెడ్ మేనార్ట్కి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. గతేడాది జారెడ్, అతని భార్య, ముగ్గురు కుమార్తెలు జలుబు బారినపడ్డారు. అయితే భార్య, పిల్లలు కొద్దిరోజుల్లోనే కోలుకగా, జారెడ్ పరిస్థితి మాత్రం సివియర్ అయ్యిపోయి రోజురోజుకి పరిస్థితి దిగజారిపోవడం మొదలయ్యింది. ఇదేంటి పరిస్థితి ఇలా ఉందేంటని అతడిని ఆస్పత్రికి తరలించగా..అసలు విషయం బయటపడింది. ఇది సాధారణ జలుబు కాదని, రోగనిరోధక వ్యవస్థపై దాడిచేసే ప్రాణాంతకమైన హెమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్(హెచ్ఎల్హెచ్)తో బాధపడుతున్నాట్లు వెల్లడించారు. ఇలాంటి వ్యాధికి సంబంధించిన కేసులు 2006 నుంచి 2019 వరకు ఏకంగా 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు. ఈ కేసుల్లో మరణాల రేటు దాదాపు 40% ఉంటుందని అంచనా వేశారు. ఇది వైరస్ లేదా బ్యాక్టరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందని తెలిపారు. దీన్ని సాధారణంగా మోనో లేదా ముద్దు వ్యాధి(కిస్సింగ్ డిసీజ్) అని పిలుస్తారు. సాధారణ మోనో(సాధారణ జలుబు) అయితే కొద్ది వారాల్లోనే తగ్గిపోతుందని, మోనో హెచ్ఎల్హెచ్ కలియితో వచ్చే జలుబు మాదిరి వ్యాధి మాత్రం అవయవ వైఫల్యానికి దారితీస్తుందని అన్నారు. ఇక్కడ జారెడ్ మాత్రం చాలా రోజులు వెంటిలేటర్‌పై ఉన్నాడు. డయలాసిస్ కూడా చేయాల్సి వచ్చింది. అస్సలు అతను బతికే అవకాశాలపై కూడా వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక చివరిగా కీమోథెరపీ వంటి శక్తిమంతమైన చికిత్సలను అందించారు. ఈ చికిత్స క్రమంలో ఏకంగా 19 కేజీల బరువు తగ్గిపోయాడు జారెడ్. చెప్పాలంటే ఏదో మిరాకిల్ జరిగినట్టుగా అనూహ్యంగా కోలుకున్నాడు జారెడ్. అయితే కూర్చొవడం, నిలబడటం, నడవడం, ఊపిరి పీల్చుకోవడం, మాట్లాడటం, తదితరాలన్నింటిని కష్టబడి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ కీమోథెరపీ కారణంగా పాదాల్లో నరాలు దెబ్బతిన్నాయి, వాసనను కూడా కోల్పోయాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే మాములు వ్యక్తిలా అవ్వడానికి చాలా సమయమే తీసుకుంది. పాపం జారెడ్ తాను ఈ జలుబుని తేలిగ్గా తీసుకోవడంతోనే ఇంతటి పరిస్థితికి దారితీసిందని బాధగా చెప్పుకొచ్చాడు. తన వెయిట్ లిఫ్టింగ్ కసరత్తులతో ఇది వరికిటి మాదిరిగా బలాన్ని పుంజుకున్నానని అన్నాడు. అస్సలు తన కుమార్తెలను ఎత్తుకోగలనా అని బాధపడిపోయాను, కానీ మళ్లీ ఇదివరకిటి మాదిరిగా కండలు తిరిగిన దేహంతో యథాస్థితికి వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు జారెడ్.(చదవండి: కేన్స్‌లో హైలెట్‌గా నటి పుచ్చకాయ హ్యాండ్‌బ్యాగ్..వెనుక ఇంత కథా..!) -
సానుకూల దృక్పథం
అంతా మన మంచికే అనే మంత్రిగారి కథ అందరికీ తెలిసినదే. ‘‘అంతా మన మంచికే’’ అనే మంత్రిగారు రాజుగారి చిటికెనవేలు తెగితే కూడా అదే మాట అని చెరసాల ΄ాలు అయ్యారు. వేటకి వెళ్ళిన రాజుని ఆటవిక జాతివారు తమ దేవతకు బలి ఇవ్వబోయారు. చిటికెనవేలు లేక΄ోవటంతో అంగవైకల్యం ఉన్న వ్యక్తి బలికి పనికి రాడు అని వదిలి పెట్టారు. రాజు తిరిగి వచ్చి మంత్రిని విడుదల చేసి, ‘‘నాకు మీ రన్నట్టు మంచే జరిగింది, మీకు ఏం మంచి జరిగింది?’’ అని అడిగాడు. అందుకు మంత్రి ‘‘అది కూడా నా మంచికే జరిగింది. చెరసాలలో లేక΄ోతే తప్పకుండా మీతో వేటకి వచ్చే వాడిని. అంగవైకల్యం ఉన్న మిమ్మల్ని వదిలేసి అప్పుడు ఏ అవయవ లోపమూ లేని నన్ను బలి ఇచ్చేవారు’’ అని చె΄్పాడు. ఇది అతి మామూలు కథ. కానీ, దేనినైనా సానుకూల దృక్పథంతో ఎట్లా చూడాలి, దాని వల్ల ప్రయోజనం ఏమిటి? అన్న విషయాలు అర్థం అవుతాయి. కొన్ని ఆ క్షణాన ఇబ్బంది కలిగించేవిగా, అయిష్టంగా అనిపించ వచ్చు. కానీ, మనకి ఏది మంచో మనకన్నా ప్రకృతికే బాగా తెలుసు. ఆ ప్రకృతినే విశ్వం అని, దైవం అని, ఎనర్జీ అని రక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఎటువంటి పళ్ళు, కూరలు ఆరోగ్యానికి మంచివో వాటినే ఇస్తుంది ప్రకృతి. వర్షాకాలంలో మామిడిపళ్ళు తినాలి అనిపించినా దొరకవు. ఎందుకో తెలుసా? ఆ వాతావరణానికి మామిడిపండు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. దొరికితే మామిడిపండు తినకుండా ఉండలేం. మన మంచికోసం దొరక కుండా చేసింది ప్రకృతి. ఈ దృక్పథం అలవాటయిన వారికి జీవితం కష్టాలమయంగా కనిపించదు. దేనినైనా తేలికగా తీసుకొని ముందుకి సాగటం ఉంటుంది. అట్లా అయితే వారి జీవితాల్లో కష్టాలు ఉండవా? ఉంటాయి, కానీ కన్నీళ్ళు ఉండవు. కష్టపడకుండా ఏదీ లభించదు. అది భౌతికమైనది. దాన్ని ఏదోవిధంగా దాటవచ్చు. మనస్సుకి ఎక్కించుకుంటే వేదన మిగులుతుంది.ఆ కాస్త ఇబ్బందిని అయినా ఎందుకు భరించాలి? అనే సందేహం వస్తుంది. కానీ మనం ఆ పరిస్థితిని మార్చలేము కదా! అప్పుడు కూడా అంతా మన మంచికే అనుకుంటే అద్భుతం జరుగుతుంది. దీని వల్ల మంచే జరుగుతుంది అనే సానుకూల భావన వల్ల మన మనసు సానుకూల భావతరంగాలను ప్రసరింప చేస్తుంది. భావతరంగాలు పరిసరాలని, పరిస్థితులని, వ్యక్తులని కూడా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ముందుగా వాతావరణం, తరువాత మనస్సు ప్రశాంత మవుతాయి. పరిస్థితులు చక్కబడతాయి. దానికి కారణం నెమ్మదించిన మనస్సు. ఆధ్యాత్మిక గ్రంథాలు మాత్రమే కాదు, ఎఖార్ట్ వంటి ఆధునిక మనస్తత్వశాస్త్రవేత్తలు కూడా ఆలోచనని అనుసరించే పరిస్థితులు ఉంటాయి అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. వేలికి దెబ్బ తగిలింది అని బాధపడటం కన్న చెయ్యి, కాలూ బాగున్నందుకు సంతోషించటం నేర్చుకోవాలి. సరైన చెప్పులు లేవని ఏడుస్తున్న కొడుకుకి కాళ్ళు లేని వాడిని చూపించాడుట తండ్రి. అప్పుడు లోటు ఉన్నా బాధ పడటం ఉండదు. సంతోషమే ఉంటుంది. సంతోషంగా ఉంటే ‘హాపీ హార్మోనులు’ విడుదల అవుతాయి. సంతోషం, ఆనందం బాహ్యమైన వస్తువులు, పరిస్థితుల పైన కాక దృక్పథం మీద ఆధార పడి ఉంటాయి. పురుటి నొప్పులు పడనిదే శిశువు లోకంలో అడుగు పెట్టటం కుదరదు. బిడ్డ చిరునవ్వు చూడగానే నొప్పుల సంగతి మరపుకి వస్తుంది. సాన పెట్టనిదే వజ్రం మెరవదు. నమలనిదే పదార్థం రుచి తెలియదు. గంధపుచెక్కని అరగదీయనిదే మంచిగంధం రాదు. చివరికి కుంకుడుకాయ రసం కావాలి అన్నా గట్టిగా పిసకాలి. ఇతర పళ్ల రసం గురించి చెప్ప నక్కర లేదు. గట్టిగా పిండనిదే రసం రాదు. ఈ కష్టం మెఱుగుదల కోసమే అని అర్థం చేసుకుంటే సమస్య లేదు. దానిని కూడా వ్యాయామం మొదలైనవి చేసినప్పుడు ΄÷ందే సుఖం లాగా ఆనందించవచ్చు. – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆనందమే జీవిత మకరందం!
ఉద్యోగరీత్యా హైదరాబాద్ సిటీ వదిలి నాలుగేళ్లు పనిచేసాకనే నాకు మళ్ళీ రాజధాని నగరంలో ఒక పోస్ట్ లభించింది. భాగ్యనగర నివాస భాగ్యం, సొంత ఇంట్లో ఉండే అవకాశం రెండూ ఒకేసారి కలిసి వచ్చిన ఆ రోజు మేం పొందింది మహదానందం. నేను అప్పుచేసి మరీ కొన్న మొట్టమొదటి టీవీ ( EC ) మా ఇంటికి చేరిన రోజు ( 1984 మార్చ్ 17 ) వాళ్లకు కలిగింది బ్రహ్మానందం. ఎందుకంటే ఆ రోజుల్లో దూరదర్శన్‌లో వచ్చిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి కామెడీ షో ‘ఆనందో బ్రహ్మ’ మా పిల్లలను ఆనందపరవశులను చేసేది. ఆనందం ( Happiness ) ఒక భావోద్వేగం. నచ్చిన ఆహార విహారాలు, ఆటా పాటలు, ప్రేమ స్నేహాలు, సిరి సంపదలు, మంచి వాతావరణం, ప్రకృతి సౌందర్యం వంటివి మనిషికి ఎంతో సంతోషాన్ని కలిగించడం సహజం.అయితే ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని, అక్కడి మనుషుల జీవన ప్రమాణాలు, వారికున్న స్వేచ్చా స్వాతంత్య్రాలు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, లంచగొండితనం ఆధారంగా 2012 నుంచి ప్రతి ఏటా ‘అంతర్జాతీయ హ్యాపీనెస్ డే ( మార్చి 20 ) ’ సందర్బంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రచురిస్తున్న ప్రపంచ సంస్థ ఐక్యరాజ్య సమితి. వీరి 2024 సంవత్సరం రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 143 దేశాల్లో ముందున్న అత్యంత సంతోషకరమైన 10 దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్ , ఐస్లాండ్ , స్వీడెన్, ఇజ్రాయెల్, నెదర్లాండ్, నార్వే , లక్సంబెర్గ్ , స్విడ్జెర్లాండ్ , ఆస్ట్రేలియాలు కాగా చివర్లో బిక్కుబిక్కు మంటున్నవి లెబనాన్, అఫ్గనిస్థాన్ లు.ఇందులో విశేషం ఏమిటంటే సంతోషకరమైన దేశాల్లో భారత్ ర్యాంక్ 126 . ఆధ్యాత్మిక చింతనతో మనం ఎంతో ఆత్మానందాన్ని పొందుతున్నా మనుకుంటూ ఇలా కిందికి జారిపోవడమే మింగుడుపడని విషయం. మనకన్నా ఆనందడోలికల్లో తెలుతున్నవి లిబ్యా , ఇరాక్ , పాలస్తినా, నైగర్ వంటి దేశాలు ,అంతేకాదు పాకిస్థాన్ కూడా . నిరంతర యుద్ధ జ్వాలలతో రగిలిపోతున్న రష్యా , ఉక్రైన్ లు కూడా మనపైనే ఉన్నాయి. ఆసియా వరకే చూస్తే సింగపూర్, తైవాన్, జపాన్ , సౌత్ కొరియా, ఫిలిప్పీన్స్ ప్రజలు ఆనందంలో ముందున్నారట. మనదేశంలో మిజోరాం రాష్ట్రవాసులు ఎక్కువ ఆనందంగా ఉన్నారట. ఈ విషయంలో కేరళను క్యూట్ స్టేట్ అన్నారు. సిటీల్లో కాన్పూర్, జైపూర్, చెన్నై, మంగళూర్, మైసూర్ల తర్వాతనే మన హైదరాబాద్ స్థానం. భారత్‌లో యువతరం హ్యాపీగానే ఉన్నారట, బోలెడంత నిరుద్యోగం ఉన్నా కూడా ( బహుశా అంతర్జాలంలో తేలిపోతూ కావచ్చు ). వృద్ధతరం కూడా పర్వాలేదు అంటున్నారు, వీరిలో జీవనసాఫల్య సాధనలో మాత్రం మహిళామణులే ఓ అడుగు ముందున్నారట, సంతోషం. మధ్య వయస్కులు మాత్రం ( సంసార సాగరాన్ని ఈదలేకనేమో ) కాస్త విచారంలో ఉంటున్నారట. మరో విశేషం ఏమిటంటే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో హ్యాపీనెస్ అంతంతే అంటున్నారు. ఆనందకరమైన మొదటి 20 దేశాల్లో వీరు లేకుండా 23 వ స్థానానికి పడిపోవడం. అందుకు ముఖ్యమైన కారణాల్లో ఆ దేశ యువతలోని అసంతృప్తి, అక్కడున్న ఒంటరితనం అంటున్నారు. ఫలితంగా వారు ఎన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారట. అందుకే యుక్తవయసు రాగానే పెళ్లిళ్లు చేసేసుకుంటే గొడవే లేదు, ఇంటిపోరుతో బోలెడంత టైమ్ పాస్ కదా అంటున్నారు పెద్దలు !వేముల ప్రభాకర్(చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..)