ఓ పెంపుడు కుక్క యజమాని నిద్రిస్తుండగా దాడి చేసింది. అది అతని కాలి బొటనవేలు ఎముక బయటకు వచ్చేలా కొరికేసింది. విచిత్రంగా అది అతని వరంలా మరి అతన్ని ప్రాణాలను రక్షించుకోగలిగేలా చేసింది. ఈ అనూహ్య ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన డేవిడ్ లిండ్సే ఒక రోజు సోఫాలో మత్తుగా నిద్రపోతుండగా. అతడి పెంపు కుక్క ఏడు నెలల బుల్‌డాగ్ అతడి కాలి బొటన వేలుని కొరికేస్తుటుంది. ఐతే ఇదంత గమనించని యజమాని సడెన్‌గా లేచి చూసేటప్పటికీ..కాలి దగ్గర ఏం చేస్తుందా? అంటూ చూసి షాక్ అవుతాడు.
ఆ కుక్క ఎందుకిలా చేసిందో అర్థం గాక లిండ్స్ అతడి భార్య అయోమయానికి గురవుతారు. విచిత్రమేమిటంటే ఎముక బయటకు వచ్చేలా గాయం చేసిన అతడికి నొప్పి తెలియలేదు. దీంతో అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి కంగుతింటాడు. తనకు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని పేర్కొన్నారు వైద్యులు. అందువల్లే కుక్క గాయం చేస్తున్నా..తనకు స్పర్శ తెలియలేదని, వెల్లడించారు వైద్యులు.
ఆ కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషాయన్ని వెల్లడించగలిగారని లిండ్సే భావించాడు. అది గాయం చేయడం తనకు మంచిదే అయ్యిందని, అందువల్ల ఆ కుక్కను బయటకు పంపిచే ఆలోచన కూడా తనకు లేదని లిండ్సే చెప్పడం గమనార్హం. ఈ మేరకు అతను సుమారు తొమ్మిది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున్న లిండ్సే బొటనవేలుని తీసేశారు. ఐతే లిండ్సే మాత్రం ఆ బొటనవేలుని తన పెండపు కుక్క కోసం ఇంటికి తీసుకువెళ్లినట్లు చెబుతుండటం విశేషం.
(చదవండి: 'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment