saved
-
విమానంలో తీసుకొచ్చి... ఛత్తీస్‌గఢ్ బాలుడి ప్రాణాలు కాపాడి..
సాక్షి, హైదరాబాద్: అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రంగా జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు తలెత్తి, చివరకు తన సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి ఓ బాలుడు చేరాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ ప్రాంతానికి చెందిన ఈ 12 ఏళ్ల బాలుడిని తొలుత స్థానికంగానే ఒక ఆస్పత్రిలో చేర్చి, పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రికి చెందిన వైద్యులు చార్టర్డ్ విమానంలో రాయ్‌పూర్ వెళ్లి, అక్కడినుంచి బాబును ఇక్కడకు తీసుకొచ్చి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కొండాపూర్‌కి చెందిన పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే తెలిపారు. “ఆ బాబుకు తీవ్రమైన జ్వరం, ఫిట్స్, మెదడులో ప్రెషర్ తగ్గిపోవడం లాంటి సమస్యలు వచ్చాయి. దాంతో అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం మమ్మల్ని సంప్రదించారు. మేం రాయ్‌పూర్ వెళ్లేలోపు అతడికి ఫిట్స్ పెరగడం, బీపీ తగ్గిపోవడం, బాగా మత్తుగా ఉండిపోయి, ఊపిరి కూడా అందని పరిస్థితి వచ్చింది.ఇక్కడినుంచి వెళ్లగానే ముందుగా ఆ బాబుకు వెంటిలేటర్ పెట్టి, పరిస్థితిని కొంత మెరుగుపరిచాం. మెదడులో ప్రెషర్, ఫిట్స్ సమస్యలు తగ్గించేందుకు మందులు వాడాం. తర్వాత అక్కడినుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చాం. ఇలా విమానంలో తీసుకురావడానికి మా పీడియాట్రిక్ ఐసీయూ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ సాయపడ్డారు. ఆ బాలుడు ఇక్కడ 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. మధ్యలో బ్రెయిన్ ప్రెషర్ పెరిగింది, ఫిట్స్ వచ్చాయి, అన్నింటినీ తగిన మందులతో నయం చేశాం. అతడికి వచ్చిన రికెట్షియల్ ఇన్ఫెక్షన్ అనేది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. దీనివల్ల అతడికి మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. అతడికి తర్వాత కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చినా వాటినీ మందులతో నయం చేశాం. ఇక్కడ చేరిన నాలుగోరోజే వెంటిలేటర్ తీసేశాం. తొమ్మిదో రోజుకు పూర్తిగా నయం కావడంతో డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ పరాగ్ డెకాటే చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లయినా ఉండవచ్చని, వారికి చికిత్స చేయగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ (పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్) తెలిపారు. ఇక్కడ ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు అక్కడ ఉండకపోవచ్చని చెప్పారు. డాక్టర్ ప్రభ్‌జోత్, డాక్టర్ జయంత్ కృష్ణ (పీడియాట్రిక్ న్యూరాలజిస్టులు), డాక్టర్ పాండు (పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టు), డాక్టర్ మౌనిక (పీడియాట్రిక్ నెఫ్రాలజిస్టు), డాక్టర్ ప్రతీక్ వై పాటిల్ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్)లతో కూడిన బృందం ఆ బాలుడికి పూర్తి చికిత్స చేసింది. “ఎయిర్ అంబులెన్స్ అనేది కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకం. తొలిసారి ఎక్మో పెట్టి ఒక పాపను విమానంలో ఇక్కడకు తీసుకొచ్చి నయం చేశాం. ఇలా విమానంలో తీసుకొచ్చినవాటిలో ఇది రెండో కేసు. ఇటీవలే మేము నాగ్‌పూర్ నుంచి ఎక్మో పెట్టి, 9 గంటల రోడ్డు ప్రయాణంలో హైదరాబాద్ తీసుకొచ్చాము. ఇది ఎక్మో పెట్టి తీసుకొచ్చినవాటిలో ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రయాణం. ఒక రకంగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన యూనిట్‌ను రోడ్డుమీదే సృష్టించడం అవుతుంది. ఇలాంటి అత్యంత సంక్టిష్టమైన కేసులకు కూడా సమర్థవంతంగా చికిత్స చేసిన చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది” అని డాక్టర్ పరాగ్ డెకాటే వివరించారు. -
సజీవంగా పూడ్చేశారు.. వీధి కుక్కలే కాపాడాయి
ఉత్తరప్రదేశ్: ఒక యువకుడి ప్రాణాలను వీధి శునకాలు కాపాడిన విచిత్ర ఘటన ఆగ్రాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 24 ఏళ్ల రూప్ కిశోర్‌పై జూలై 18న అర్టోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాశ్ అనే నలుగురు యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.రూప్ కిశోర్ మృతి చెందాడని భావించిన నిందితులు ఒక ప్రాంతంలో పాతిపెట్టి వెళ్లిపోయారు. అక్కడకు వచ్చిన కొన్ని వీధి కుక్కలు అక్కడ మట్టి తవ్వాయి.. ఆ యువకుడి శరీరాన్ని కొరకడంతో స్పృహ వచ్చింది. దీంతో అతడు స్థానికుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరించడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.రూప్ కిశోర్ తల్లి స్పందిస్తూ.. తన కుమారుడిని నలుగురు బలవంతంగా తీసుకెళ్లి దాడి చేశారన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులు కోసం గాలిస్తున్నారు. -
‘ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు’
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దాడి నుంచి ఆ జగన్నాథుడే కాపాడాడని కోల్‌కతా ఇస్కాన్ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్ దాస్ వ్యాఖ్యానించారు. దీనికి రుజువుగా ఆయన 1976 నాటి రథయాత్రను ప్రస్తావించారు. ప్రమాదం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకోవడం దైవికమని ఆయన అభివర్ణించారు.దీనిగురించి రాధారమణ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఇలా రాశారు..‘సరిగ్గా 48 ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి సహాయం అందించారు. ప్రపంచమంతా జగన్నాథ రథయాత్ర ఉత్సవాలను జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో ట్రంప్‌పై దాడి జరగడం ఊహించనిది. ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు. 1976, జూలైలో డొనాల్డ్ ట్రంప్.. జగన్నాథ రథాల నిర్మాణానికి తన రైలు యార్డ్‌ను ఉచితంగా అందించి, రథయాత్రను నిర్వహించేందుకు సహకరించారు.రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ సహకారంతో 1976లో యునైటెడ్ స్టేట్స్‌లోని ఎన్వైసీ వీధుల్లో జగన్నాథుని మొదటి రథయాత్ర జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) న్యూయార్క్ నగరంలో రథయాత్రను నిర్వహించాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. నాడు రథాలను తయారు చేసేందుకు పెద్ద ఖాళీ స్థలం అవసరమైంది. ఈ నేపధ్యంలో నాడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇస్కాన్ సంస్థ సంప్రదించగా, ఆయన తన ఫిష్డ్ అవెన్యూను రథాల తయారీ కోసం ఉపయోగించుకునేందుకు అనుమతించారు. ఈ విధంగా ట్రంప్ అమెరికాలో జగన్నాథ రథయాత్ర సాగేందుకు సహకారం అందించారని’ రాధారమణ్ దాస్ పేర్కొన్నారు. Yes, for sure it's a divine intervention.Exactly 48 years ago, Donald Trump saved the Jagannath Rathayatra festival. Today, as the world celebrates the Jagannath Rathayatra festival again, Trump was attacked, and Jagannath returned the favor by saving him.In July 1976, Donald… https://t.co/RuTX3tHQnj— Radharamn Das राधारमण दास (@RadharamnDas) July 14, 2024 -
‘ఉగ్రదాడి సమయంలో సీట్ల కింద దాక్కున్నాం’
జమ్మూలోని రియాసి జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులతో నిండిన బస్సుపై శివఖోడిలో జరిగిన ఈ దాడి నుంచి వారణాసికి చెందిన అతుల్ మిశ్రా, అతని భార్య నేహా మిశ్రాలు తెలివిగా తప్పించుకున్నారు.అతుల్ మిశ్రా దంపతులు ఈ దాడి దృశ్యాలను కేవలం 10 అడుగుల దూరం నుంచి ప్రాణాలను ఉగ్గబట్టుకుని చూశారు. ఉగ్రవాదుల బుల్లెట్ల వర్షం నుంచి తప్పించుకునేందుకు బస్సు సీటు కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నామని వీరు ఇతర కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఈ ఘటనలో వీరిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.వారణాసిలోని కాలభైరవ ప్రాంతానికి చెందిన అతుల్ మిశ్రా అతని భార్య నేహా మిశ్రాలు మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు జమ్మూ వెళ్లారు. ఈ ప్రమాదం అనంతరం వీరిద్దరూ వీడియో కాల్ చేసి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.ఈ దురాగతానికి పాల్పడిన పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అతుల్ తండ్రి రాజేష్ మిశ్రా ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కాగా అతుల్, నేహా దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా జూన్ ఏడున వారణాసి నుండి జమ్మూకు బయలుదేరి వెళ్లారు. వైష్ణో దేవి దర్శనం అనంతరం శివఖోడి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని, ఇతర ప్రయాణికులతో పాటు బస్సులో తిరిగి వస్తుండగా ఈ ఉగ్ర దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు కాలువలో పడింది. -
యూదుడైన ఐన్‌స్టీన్.. హిట్లర్ బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ప్రస్తుతానికి ఎవరి దగ్గరా సమాధానం లేదు. ఈ ఉగ్రవాద సంస్థను తుడిచిపెట్టితీరుతామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఈ నేపధ్యంలో జరుగుతున్న పోరులో ఇప్పటికే వేలాది మంది మరణించారు. నిజానికి ఇజ్రాయెల్ ఒక చిన్న దేశం. ఇక్కడ యూదులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. అంటే ఇది యూదుల దేశం. ఈ యుద్ధం నేపధ్యంలో యూదులకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత మేధావిగా గుర్తింపు పొందిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ యూదు అనే విషయం చాలామందికి తెలియదు. హిట్లర్ పాలనకాలంలో ఐన్‌స్టీన్ తన ప్రాణాలను కాపాడుకునేందుకు జర్మనీ నుంచి పారిపోవాల్సి వచ్చింది. పూర్వం రోజుల్లో యూరప్‌లో యూదులు జనాభా అత్యధికంగా ఉండేది. జర్మనీలో లక్షలాది మంది యూదులు ఉండేవారు. వారిలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ఒకరు. అడాల్ఫ్ హిట్లర్ ఎన్నికైన తరువాత జర్మనీలో జాతీయవాద భావన తీవ్రతరం అయ్యింది. ఈ నేపధ్యంలో ఐరోపాయేతర ప్రజలపై నిరసనలు మొదలయ్యాయి. జర్మనీలో యూదులపై ద్వేషం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. దీనికి ప్రధానకారణం క్రైస్తవులకు, యూదులకు మధ్య వీపరీతమైన ఘర్షణలు జరిగాయి. యూరప్ లో ఉన్న క్రైస్తవులు బలంగా నమ్మేదేంటంటే.. క్రీస్తును శిలువ వేయడంలో యూదుల పాత్ర ఉందని నమ్మేవారట. దాంతో పాటు యూదులు వ్యాపారంలో బలంగా ఉండడం, ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండడంతో.. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి యూరోపియన్లు ఎక్కువగా యూదులను ద్వేషించేవారట. చరిత్రలో రకరకాల కారణాలు పేర్కొన్నప్పటికీ.. యూదులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారన్నదానికి మతపరమైన బేధమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జర్మనీలో హిట్లర్ మారణహోమం సృష్టించడంతో చాలా మంది యూదులు తమ ప్రాణాలను అరచేతపట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్లో కూడా ఇదే భయం నెలకొంది. తాను జర్మనీలో ఉంటే ముప్పు తప్పదని భావించి, అమెరికా వెళ్లి, అక్కడ ఆశ్రయం పొందారు. అయితే అప్పటికే ఐన్స్టీన్పేరు విజ్ఞాన ప్రపంచంలో మారుమోగితోంది. ఇతనే కాకుండా జర్మనీకి చెందిన ఎందరో మేథావులు, శాస్త్రవేత్తలు కూడా అమెరికాలో తలదాచుకున్నారు. 1941 నుంచి 1945 వరకు జరిగిన మారణహోమంలో హిట్లర్ దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాని, వీరిలో ఎక్కువ మంది యూదులని చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం యూదుల జనాభా ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. అలాగే యూదులు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్లలో కూడా ఉంటున్నారు. ఇజ్రాయెల్ ప్రస్తుత జనాభా 93 లక్షల 60 వేలు. అంటే మన హైదరాబాద్ కంటే తక్కువ జనాభా ఉంది. ఇందులో యూదుల సంఖ్య 72 లక్షల 48వేల మంది. ఇతరులు వేర్వేరు మతాలకు సంబంధించిన వారు ఇజ్రాయెల్ లో స్థిరపడి ఉన్నారు. 2020 జనగణన ప్రకారం అమెరికాలో దాదాపు 80 లక్షల మంది యూదులున్నారు. పైగా అమెరికాలో అత్యున్నత వర్గంలో ఒకరిగా యూదులు ఉన్నారు. రాజకీయాలు, వర్తక, వాణిజ్యంలలో అత్యంత ప్రభావశీలురుగా యూదులున్నారు. ఇది కూడా చదవండి: భారత్ చర్యతో వారి జీవితాలు దుర్భరం: ట్రూడో -
గాంధీ హత్యకు బ్రిటీష్ అధికారి కుట్ర? ఒక వంటవాడు ఎలా భగ్నం చేశాడు?
అది 1917.. బీహార్‌లోని బెట్టియా జిల్లా గౌనాహాలోని పర్సౌని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మహాత్మా గాంధీ ప్రాణాలను కాపాడాడు. ఈ విషయం చరిత్ర తెలిసిన చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మహాత్ముని ప్రాణాలను కాపాడిన ఆ దేశభక్తుని పేరు బత్తక్ మియా. ఆయన బ్రిటీష్ వారి కుట్రను భగ్నం చేసి, జాతిపిత ప్రాణాలను కాపాడారు. నేడు ఆ దేశభక్తుని మూడవతరం వారు కటికపేదరికంలో జీవించవలసి వస్తున్నది. వారి కుటుంబం మరో రాష్ట్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకునే దీనపరిస్థితి నెలకొంది. కాగా గాంధీజీ ప్రాణాలను కాపాడినందుకు గాను అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్.. బత్తక్ మియా పేరిట అందించిన రివార్డు కూడా వీరి కుటుంబానికి పూర్తిస్థాయిలో అందలేదు. 1917లో మోతీహరిలో ఉంటున్న బ్రిటిష్ ఇండిగో ఫ్యాక్టరీ మేనేజర్ ఇర్విన్.. మహాత్మా గాంధీ హత్యకు కుట్ర పన్నాడు. గాంధీజీని భోజనానికి ఆహ్వానించి, ఆయనకు అందించే పాలలో విషం కలపాలని ఇర్విన్ ప్లాన్ చేశాడు. ఆ సమయంలో బత్తక్ మియా.. ఇర్విన్ దగ్గర వంటవానిగా పనిచేసేవాడు. బత్తక్ మియా మనుమడు కలాం అన్సారీ తెలిపిన వివరాల ప్రకారం అతను తన తాతను చూడలేకపోయినప్పటికీ, అతని తండ్రి జాన్ అన్సారీ తెలిపిన వివరాలను గుర్తుచేసుకున్నాడు. గాంధీజీ 1917లో చంపారన్‌కు వచ్చినప్పుడు, ఒక బ్రిటిష్ అధికారి.. గాంధీజీకి పాలలో విషం ఇవ్వాలని బత్తక్ మియాను ఆదేశించాడు. అయితే ఆ అధికారి బెదిరింపులకు బత్తక్ మియా లొంగలేదు. అయినా ఆ అధికారి పట్టువీడక బత్తక్ మియాను విషం కలిపిన పాలతో గాంధీ వద్దకు పంపించాడు. బత్తక్ మియా.. మహాత్మాగాంధీకి పాలు ఇస్తూ.. అందులో విషం ఉందని చెప్పడంతో గాంధీజీ వాటిని తాగకుండా పారేశారు. ఆ తర్వాత ఒక పిల్లి ఆ పాలు తాగి చనిపోయింది.ఈ సంఘటనకు నాటి స్వాతంత్ర్య సమరయోధుడు రాజేంద్ర ప్రసాద్‌తో పాటు మరికొందరు సాక్షులగా నిలిచారు. ఈ సంఘటన తర్వాత బత్తక్ మియాను ఆ బ్రిటీష్ అధికారి జైలుకు పంపించాడు. దీనితోపాలు అతనికి చెందిన 5 గేదెలతో పాటు పలు భూములను వేలం వేసి విక్రయించాడు. దీంతో బత్తక్ మియా ఇంటి ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. 1950లో డాక్టర్ రాజేంద్రప్రసాద్ మోతీహరి వచ్చినప్పుడు బత్తక్ మియాకు 24 ఎకరాల భూమి అందిస్తామని ప్రకటించారు. అయితే ఇలా అతనికి కేటాయించిన భూమిని తదనంతర కాలంలో అటవీశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బత్తక్ మియా వారసులు అత్యంత దీనస్థినతిలో బతుకువెళ్లదీస్తున్నారు. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో!
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని అంటారు. ఇది నిజమని అప్పుడప్పుడు నిరూపితమవుతుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో దీనిని నిరూపిస్తోంది. ఈ వీడియోలో ఒక పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి రైలు పట్టాలపై పడిపోవడం, సరిగ్గా అదే సమయానికి రైలు వస్తుండటం.. ఇంతలోనే ఒక వ్యక్తి ఆ పిల్లాడిని కాపాడటం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముందుగా రైల్వే స్టేషన్ వద్ద ఒక పిల్లాడు తన తల్లి చేయి పట్టుకుని నడుస్తుండటాన్ని గమనించవచ్చు. కొంచెం ముందుకు వెళ్లాక ఆ పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి పట్టాలపై పడిపోతాడు. దీనిని గమనించిన ఆ పిల్లాడి తల్లి గాభరా పడిపోతూ ఉంటుంది. పిల్లవాడిని పైకి లాగేందుకు తన చేయి అందించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆ మార్గంలో రైలు వస్తుండటంతో ఆమె భయపడిపోతుంది. ఇంతలో మరోవైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ పిల్లాడిని ప్లాట్‌ఫారంపైకి ఎక్కిస్తాడు. తాను కూడా వేగంగా ప్లాట్‌ఫారంపైకి ఎక్కిపోతాడు. ఇదంతా రెండుమూడు సెకెన్లలో జరిగిపోతుంది. ఇంతలో రైలు అత్యంత వేగంగా ఆ పట్టాల మీదుగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో @Suhan Raza పేరుతో షేర్ అయ్యింది. క్యాప్షన్‌లో ఈ రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లాడిని కాపాడినందుకు అతనికి హ్యాట్సాఫ్ అని రాశారు. ఇది కూడా చదవండి: అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి.. Salute to this railway staff employee who did not care for his life and saved the life of a blind child who fell on the railway track. 🙏👌#railway #earthquake #TrainAccident #ElvishArmy𓃵 #patlama #ISRO #SaveIndianMuslims pic.twitter.com/7ZoAzHup4V — Suhan Raza (@SuhanRaza4) August 8, 2023 -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
Pritam Bull:కోటి రూపాయల ఎద్దును కాపాడారోచ్!
నోయిడా: యమునా ఉధృతితో వరద నీరు నోయిడాను ముంచెత్తింది. ఈ నీటిలో మనుషులే కాదు.. మూగ జీవాలు అరిగోస పడుతున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్) సైతం రంగంలోకి దిగి వాటినీ రక్షిస్తున్నాయి. నోయిడా తీరం వెంట ఎనిమిది గ్రామాలకు చెందిన ఐదు వేల మందిని పునరావాస శిబిరాలకు తరలించింది ఎన్డీఆర్ఎఫ్. అలాగే.. గురువారం నుంచి ఇప్పటిదాకా పశువులు, కుక్కలు, కుందేళ్లు, గినియా పందులు.. ఇలా 6వేల దాకా మూగజీవాల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారట. ఈ రెస్క్యూలో దేశంలోకెల్లా నెంబర్ వన్ ఎద్దును సైతం కాపాడరంట. ఈ విషయాన్ని స్వయంగా 8వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించింది. ప్రీతమ్ అనే గిర్ జాతి ఎద్దును నోయిడా కమలా నగర్లో వరద నుంచి రక్షించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. దీని ధర కోటి రూపాయలకు పైగా పలుకుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీని వయసు ఏడేళ్లు?!. నడిచే బంగారంగా గిర్ పశువులకు దేశంలోనే ఓ పేరుంది. పాలకే కాదు.. ఎద్దులకూ మాంచి గిరాకీ. ఇక ప్రీతమ్ వంశ వృక్షంలో ముందుతరాల పశువులకూ అడ్డగోలు రేటు దక్కింది. దేశంలో ఇలాంటి కాస్ట్లీ పశువులు ఉన్నా.. ప్రీతమ్ మాత్రం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. 2019లో తొలిసారి ది నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. సంకరణంతో పాటు దీని వీర్యాన్ని కూడా ప్రత్యేకంగా అమ్ముతుంటారు. అయితే ఇది కూడా కాస్ట్లీ వ్యవహారమే!. భారత్‌లో బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు ధర.. గరిష్టంగా 98లక్షల రూపాయలుగా ఉండడం గమనార్హం. అంటే ప్రీతమ్గాడి వెల అంతకన్నా ఎక్కువేనన్న మాట!!. #आपदासेवासदैवसर्वत्र Team @8NdrfGhaziabad has rescued 3 cattles including India's No.1 Bull "PRITAM" costing 1 Cr. from Noida. NDRF teams are working hard to save lives in flood affected areas.#animalrescue @ndmaindia @NDRFHQ @noida_authority @HMOIndia @PIBHomeAffairs pic.twitter.com/MdMRikYFVz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 #आपदासेवासदैवसर्वत्र#animalrescue Team @8NdrfGhaziabad conducting flood rescue and evacuation.This is our country's philosophy:-No one should be left behind in times of need.NdRF rescue people as well as animals at Noida@noida_authority@HMOIndia@NDRFHQ@ndmaindia@ANI pic.twitter.com/e7j8sTEixz — 8th BN NDRF (@8NdrfGhaziabad) July 15, 2023 -
AP: విషం తాగిన మహిళను రక్షించిన వలంటీర్
పెనుకొండ(శ్రీసత్యసాయి జిల్లా): విషం తాగిన మహిళను వార్డు వలంటీర్ దిశ పోలీసుల సాయంతో రక్షించిన ఉదంతం శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుకొండకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల క్రితం నరేష్‌తో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఘర్షణ జరిగింది. దీంతో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో ఆ ఇంటికి వెళ్లిన వార్డు వలంటీర్ అశ్విని వెంటనే అప్రమత్తమై దిశ ఎస్‌వోఎస్‌కు కాల్ చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకున్న దిశ టీం బాధితురాలిని వలంటీర్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం వివాహితకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. చదవండి: శభాష్ వలంటీర్.. వెన్నుచూపలేదు.. వెనక్కి తగ్గలేదు.. -
కృష్ణవేణి దొరికింది.. చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, మేడ్చల్ జిల్లా: ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన రాజేశ్వరీ, భరత్ దంపతుల కుమార్తె కృష్ణవేణి (4) కిడ్నాప్ కథ సుఖాంతమైంది. బుధవారం రాత్రి చాక్లెట్ కోసం దుకాణానికి వెళ్లిన చిన్నారి ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లితండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. స్థానిక యువకులు అదే ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్లో పనిచేస్తున్న మతి స్థిమితం లేని వ్యక్తి సురేష్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు సురేష్, చిన్నారి కృష్ణవేణి ఫొటోలను అన్ని పీఎస్‌లు, చైల్డ్వెల్ఫేర్ సంస్థలు, రైల్వే పోలీసులకు పంపారు. మల్కాజ్గిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్‌రెడ్డి, స్థానిక సీఐ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా సురేష్ కృష్ణవేణిని తీసుకెళుతున్నట్లు గుర్తించారు. ఘట్కేసర్ నుంచి గూడ్స్ రైలులో ఖాజీపేట్ వెళ్లిన సురేష్ ఏమి చేయాలో తెలియక మరో రైలెక్కి తిరిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే సమాచారం అందుకున్న రైల్వే రక్షణ పోలీసులు, చైల్డ్ గైడెన్స్ సెంటర్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తమ రక్షణలోకి తీసుకున్నారు. ఘట్కేసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చిన్నారి ఫొటోను తల్లితండ్రులకు పంపించి సరిచూసుకున్నారు. దీంతో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్స్ అశోక్ సికింద్రాబాద్ వెళ్లి చిన్నారిని తీసుకు వచ్చారు. అనంతరం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్వయంగా చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు. ఘాట్ కేసర్ కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. కిడ్నాపర్ నుంచి చిన్నారిని పోలీసులు రక్షించారు. సీపీ ఫుటేజ్ ఆధారంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడు సురేష్, చిన్నారిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బుధవారం రాత్రి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మేడ్చల్‌లోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ చిన్నారి కనిపించికుండా పోయింది. బాలిక కృష్ణవేణి రాత్రి షాప్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఎంత వెతికినా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలిక కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించి, కిడ్నాపర్ నుంచి పాపను కాపాడారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. సినిమాను తలపించే ట్విస్టులు.. పోలీసులే షాకయ్యారు! -
1996లో ఒకరోజు.. ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన పిల్లాడిని గోరిల్లా ఏం చేసిందంటే..
గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది? 1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్లోని బ్రూక్‌ఫీల్డ్ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి బాలుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్ స్టేటస్ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. In 1996, Binti Jua, an 8-year-old female Western lowland gorilla, tended to a 3-year-old boy who had fallen into her enclosure at the Brookfield Zoo in Illinois. On August 16, 1996, Binti Jua, who was eight years old at the time, witnessed a three-year-old boy climbing the wall… pic.twitter.com/OMFGmdRE4I — Historic Vids (@historyinmemes) June 22, 2023 في عام 1996، اهتمت بينتي خوا، وهي أنثى غوريلا الأراضي المنخفضة الغربية البالغة من العمر 8 سنوات، بصبي يبلغ من العمر 3 سنوات سقط في حظيرتها في حديقة حيوان بروكفيلد في إلينوي. في 16 أغسطس 1996، شهد بينتي خوا، الذي كان يبلغ من العمر ثماني سنوات في ذلك الوقت، صبيا يبلغ من العمر ثلاث… pic.twitter.com/dJnC16AFUn — ﮼الأعرابي القديم . (@radialonazi) June 22, 2023 -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మహత్యాయత్నం.. భర్తతో గొడవపడి..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. గత రాత్రి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. అది గమనించిన సీఐఎస్ఎఫ్ బలగాలు.. ఆ యువతిని రక్షించారు. శుక్రవారం రాత్రి డిపార్చర్ విభాగం వద్ద పైనుంచి దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్పోర్ట్ అధికారులకు అప్పగించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్)కి చెందిన శ్వేతగా గుర్తించారు. భర్త విష్ణు వర్ధన్ రెడ్డి, భార్య శ్వేతతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. హైదారాబాద్ లో కంపెనీ పెట్టాలని ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే భార్యభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: అనారోగ్యాన్ని తట్టుకోలేకపోయాడు! చివరకు ఆ కానిస్టేబుల్.. -
ఎమ్మెల్యే సాహసం.. సముద్రంలోకి దూకి ముగ్గురిని రక్షించాడు
పరిస్థితిని అంచనా వేయకుండా సముద్రంలోకి దిగిన నలుగురు యువకులను అలలు ముంచెత్తాయి. ఆ ధాటికి మునిగిపోతూ కేకలు వేశారు వాళ్లు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఒకరు సాహసం ప్రదర్శించారు. సముద్రానికి ఎదురీదిన ఆయన.. ఆ తర్వాత ఓ బోటు సాయంతో ముగ్గురిని స్వయంగా రక్షించి ఒడ్డుకు చేర్చారు. గుజరాత్ అమ్రేలి జిల్లాలో పట్వా గ్రామ సమీపంలోని సముద్ర తీరానికి బుధవారం మధ్యాహ్నం నలుగురు యువకులు ఈతలకు వెళ్లారు. అయితే వాతావరణంలోని మార్పులతో అలలు పోటెత్తాయి. దీంతో వాళ్లు మునిగిపోసాగారు. ఈలోపు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అయితే ఆ సమయంలో అక్కడ కొందరు గుమిగూడగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్యే హీరా సోలంకి మాత్రం ఆలస్యం చేయలేదు. అలలతో పోటెత్తిన సముద్రానికి ఎదురీదారాయన. ఈలోపు కొందరు యువకులు ఆయనకు సాయానికి రాగా.. బోట్ సాయంతో సముద్రంలోకి వెళ్లారు. స్వయంగా నీళ్లలో దూకి ముగ్గురు యువకులను రక్షించారు. మరో యువకుడు అలల ధాటికి కొట్టుకునిపోగా.. సాయంత్రానికి మృతదేహం దొరికింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజుల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు హీరా సోలంకి. ఆలస్యం చేయకుండా సాహసం ప్రదర్శించి ముగ్గురి ప్రాణాలు నిలబెట్టిన ఎమ్మెల్యేపై రియల్ హీరో అంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదీ చదవండి: కన్నకూతురిని పాతికసార్లు పొడిచాడు! -
ఎముక బయటకు వచ్చేలా పెంపుడు కుక్క దాడి..అదే అతనికి వరమైంది
ఓ పెంపుడు కుక్క యజమాని నిద్రిస్తుండగా దాడి చేసింది. అది అతని కాలి బొటనవేలు ఎముక బయటకు వచ్చేలా కొరికేసింది. విచిత్రంగా అది అతని వరంలా మరి అతన్ని ప్రాణాలను రక్షించుకోగలిగేలా చేసింది. ఈ అనూహ్య ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన డేవిడ్ లిండ్సే ఒక రోజు సోఫాలో మత్తుగా నిద్రపోతుండగా. అతడి పెంపు కుక్క ఏడు నెలల బుల్డాగ్ అతడి కాలి బొటన వేలుని కొరికేస్తుటుంది. ఐతే ఇదంత గమనించని యజమాని సడెన్‌గా లేచి చూసేటప్పటికీ..కాలి దగ్గర ఏం చేస్తుందా? అంటూ చూసి షాక్ అవుతాడు. ఆ కుక్క ఎందుకిలా చేసిందో అర్థం గాక లిండ్స్ అతడి భార్య అయోమయానికి గురవుతారు. విచిత్రమేమిటంటే ఎముక బయటకు వచ్చేలా గాయం చేసిన అతడికి నొప్పి తెలియలేదు. దీంతో అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లి జాయిన్ అవ్వగా అసలు విషయం తెలిసి కంగుతింటాడు. తనకు డయాబెటీస్ వచ్చిందని, శరీరంలో రెండు దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని పేర్కొన్నారు వైద్యులు. అందువల్లే కుక్క గాయం చేస్తున్నా..తనకు స్పర్శ తెలియలేదని, వెల్లడించారు వైద్యులు. ఆ కుక్క అలా దాడి చేయడం వల్లే కదా డాక్టర్లు ఈ విషాయన్ని వెల్లడించగలిగారని లిండ్సే భావించాడు. అది గాయం చేయడం తనకు మంచిదే అయ్యిందని, అందువల్ల ఆ కుక్కను బయటకు పంపిచే ఆలోచన కూడా తనకు లేదని లిండ్సే చెప్పడం గమనార్హం. ఈ మేరకు అతను సుమారు తొమ్మిది రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనతరం డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉన్నందున్న లిండ్సే బొటనవేలుని తీసేశారు. ఐతే లిండ్సే మాత్రం ఆ బొటనవేలుని తన పెండపు కుక్క కోసం ఇంటికి తీసుకువెళ్లినట్లు చెబుతుండటం విశేషం. (చదవండి: 'దీన్ని అలా చూడకూడదు..': భారత్ పర్యటనపై పాక్ మంత్రి వ్యాఖ్యలు) -
ఆ తల్లి స్పాట్లో స్పందించింది లేదంటే!..ఆ చిన్నారి పరిస్థితి..
పిల్లలు రెప్పపాటులో ఏం చేసుకుంటారో లేదా ఏం చేస్తారో చెప్పలేం. తెలిసి తెలియక చేసే పనులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులు బాధ అంత ఇంతకాదు. నిరంతరం వారేం చేస్తున్నారో అని ఒక కంట కనిపెడుతున్నా..ఏదో ఒక ఉపద్రవం కొనతెచ్చుకుంటూనే ఉంటారు. ఓ వయసు వచ్చేదాక అలాంటి చిన్నారులతో కాస్త ఇబ్బంది, టెన్షన్ తప్పవనే చెప్పాలి. అచ్చం అలానే ఇక్కడొక చిన్నారి కూడా తన తల్లి అలా ఫోన్లో మాట్లాడుతుండగా..స్పీడ్‌గా మెట్ల వద్దకు వెళ్లిపోయాడు. అంతే అక్కడ నుంచి ఒక్కసారిగా తూలిపోయాడు. దీంతో ఆ తల్లి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబాలున కిందకు వంగి పిల్లాడిని పట్టుకునే యత్నం చేసింది. అదే సమయానికి చుట్టుపక్కల వాళ్లు కూడా స్పందించి ఆ తల్లికి సాయం అందించారు. ఆ తల్లి మాత్రం ఎంతో చాకచక్యంగా తన బిడ్డను కాపాడుకుంది. తల్లి హృదయం ఎంతకైనా తెగించేలా లేదా ఎంతటి సాహసానికైనా దిగేలా చేస్తుంది కదా. ఐతే అక్కడే ఉన్న మరో వ్యక్తి మాత్రం ఆ పిల్లాడిని పట్టుకోవాలని కిందకు వెళ్లడం విచిత్రంగా అనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. దీంతో నెటిజన్లు ఆ తల్లి ధైర్యానికి మెచ్చకోగా, మరికొందరూ ఆ పిల్లాడిని పట్టుకోవడానికి కిందకు వెళ్తున్న వ్యక్తిని చూసి కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. Watch the incredible reflexes of a mom when she saves a kid from falling down the stairs😨 pic.twitter.com/7T2KmFNrpm — OddIy Terrifying (@OTerrifying) April 9, 2023 (చదవండి: సివిల్ సర్వీస్ అధికారులపై బీజేపీ నేత ‘బందిపోటు’ కామెంట్లు.. ‘ఇంతకుముందు గౌరవం ఉండేది.. కానీ, ఇప్పుడు లేదు’) -
‘లాగి’ ఒక్కటిచ్చాడు.. లేదంటే చచ్చేవాడే! షాకింగ్ వీడియో
సాక్షి,ముంబై: అనాలోచితంగానో, హడావిడిలోనో అనుకోని ప్రమాదంలో పడిపోతూ ఉంటారు చాలామంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అయితే రైల్వే పట్టాలు, రైల్వే క్రాసింగ్‌ల ప్లాట్ఫారంల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్క్ష్య ధోరణి చాలా వరకు కొనసాగుతూనే ఉంది అనడానికి ఉదాహరణ. పట్టాలను దాటుతూ తాత్సారం చేస్తున్న ఒక వ్యక్తికి హెల్ప్ చేసి, సురక్షితంగా పైకి లాగాడు అక్కడున్న ఓ రైల్వే కానిస్టేబుల్. దీంతో లిప్త పాటులో అతనికి ప్రాణా పాయం తప్పింది. ఈ ఉద్వేగంలోనే బాధితుడిని లాగి ఒక్కటిచ్చాడు సదరు పోలీసు.. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి ట్విటర్ తెగ షేర్ అవుతోంది. Sometimes you deserve help and a Slap at the same time ! pic.twitter.com/0L3NE3PTc1 — Vijay Gopal (@VijayGopal_) January 14, 2023 -
వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో..
అకస్మాతుగా సంభవించిన భారీ వరదలో చిక్కుకున్న ఇద్దరు బాలురను ప్రాణాలకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. ఇద్దరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అక్కడున్న వారంతా అతడ్ని చూసి ఆ పిల్లల తండ్రి అయి ఉంటాడని అనుకున్నారు. కానీ ఓ సాధరణ వ్యక్తి అని తెలిశాక అభినందించారు. పిల్లల్ని కాపాడిన వ్యక్తిని ఫొటోగ్రాఫర్ అలీ బిన్ నాసర్ అల్ వార్దిగా గుర్తించారు. ఒమన్‌లో ఈ ఏడాది మొదట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫిజెన్ అనే మహిళ దీన్ని షేర్ చేయగా.. దాదాపు నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వ్యక్తి సాహసాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఇతను రియల్ హీరో అంటూ కొనియాడారు. He is a hero! 💞pic.twitter.com/wKcUKVQpmH — Figen (@TheFigen_) December 21, 2022 చదవండి: గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట..! -
ఇద్దరికిద్దరు.. సాహసవీరులు..
-
జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఉదయం ఆసీస్-భారత్ మ్యాచ్ టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న మహిళకు వెంటనే సీపీఆర్ చేసి ఆ ప్రాణాన్ని నిలబెట్టింది. టిక్కెట్ల కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో అందులో 45 ఏళ్ల మహిళ పూర్తిగా స్పృహ తప్పి పడిపోయారు. చదవండి: హెచ్‌సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్ దీంతో బేగంపేట మహిళా పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన తక్షణమే స్పందించి ఆ మహిళను బయటకులాగారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయి ఊపిరి అందని పరిస్థితిలో ఉండటంతో ఆ కానిస్టేబుల్ సీపీఆర్ చేశారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్ నవీన సాక్షితో మాట్లాడుతూ, సాటి మహిళను కాపాడాలని ఆలోచించానని తెలిపారు. -
రైలు ఎక్కబోయి కింద పడిపోయిన మహిళ
-
క్షణాల్లో కదిలిన సీఆర్పీఎఫ్ సిబ్బంది, షాకింగ్ వీడియో
సాక్షి,లక్నో: రెప్పపాటులో మృత్యుముఖం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద అప్రమత్తంగా ఉండాలని, , కదులుతున్న రైళ్లను ఎక్కొద్దు, దిగవద్దు అంటూ పదే పదే ర్వైల్వే శాఖ హెచ్చరిస్తున్నా, చాలామంది ప్రమాదం అంచున నిలబడుతున్నారు. కానీ రక్షణ సిబ్బంది మెరుపు వేగంతో కదిలి వారిని కాపాడుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నఇలాంటి షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి, కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెప్పపాటు నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ఇలాంటి వీడియోలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయినా పట్టించుకోకుండా చాలామంది అదే నిర్లక్క్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. తాజా ఘటన వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో గోమతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. అంతలోనే ఒక వృద్ధుడు రైల్లోంచి దిగుతూ పట్టు తప్పి జారి పోయాడు. దీన్ని గమనించిన ఆర్పీఎఫ్ అధికారి శరవేగంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడారు.వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అక్కడి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో లిప్తపాటులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. गाज़ियाबाद रेलवे स्टेशन पर एक बुजुर्ग यात्री को मौत के मुँह से बचाया @RPF_INDIA के कॉन्स्टेबल त्रिलोक शर्मा और कांस्टेबल श्याम सिंह को रेलवे पुलिस ने इस काम के लिए सराहा है pic.twitter.com/FwCsjvrQzC — Mukesh singh sengar मुकेश सिंह सेंगर (@mukeshmukeshs) July 6, 2021 -
తిరుపతి: ఒళ్లు గగుర్పొడిచే ఘటన
-
Tirupati: కానిస్టేబుల్ సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే ఘటన
సాక్షి, తిరుపతి: రైలు దిగేటపుడు ఎక్కేటపుడు జాగ్రత్తగా ఉండాలని ఎంత చెబుతున్నా కొందరు పట్టించుకోరు అంతే. అదే నిర్లక్ష్య ధోరణి. కన్ను మూసి తెరిచే లోపు ప్రాణాలు పోతున్నా.. క్షణంపాటు వేచి ఉండేందుకు ఇష్టపడరు. కానీ ఇలాంటి అజాగ్రత్త చర్యల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ అక్కడి సిబ్బంది ప్రాణదాతలుగా నిలుస్తున్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తిరుపతి రేల్వే స్టేషన్లో బుధవారం ఉదయం చేసుకుంది. ఈ విషయం తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడవక మానదు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. రైలు ప్లాట్‌ఫాంపై ఆగుతుండగానే కదులుతున్న రైలు నుంచి ఒక మహిళ హడావిడిగా దిగేందేకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపు తప్పింది. ఈ విషయాన్ని గమనించిన కానిస్టేబుల్ సతీష్ మెరుపు వేగంగా కదిలి ఆమెను వెనుకకు లాగారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. లేదంటే రైలుకు, ప్లాట్‌పాంకు మధ్య ఉన్న గ్యాప్ ద్వారా ఆ మహిళ రైలు పట్టాలపైకి జారి పోయి ఉండేది. మొత్తానికి మహిళ సురక్షితంగా ఉండటంతో రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సో.. బీకేర్ ఫుల్.. నిదానమే ప్రధానం. -
పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో
సాక్షి, ముంబై: ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో తెలియదు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంల వద్ద ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసి పోవడం ఖాయం. అయితే శరవేంగా అక్కడున్న రైల్వే ఉద్యోగి స్పందించడంతో రెప్పపాటు కాలంలో ఒక చిన్నారి మృత్యుముఖం నుంచి బయటపడిన వైనం పలువురి ప్రశంసంలందుకుంటోంది. సంఘటన వివరాల్లోకి వెళ్లితే ముంబై వాంఘాని రైల్వే స్టేషన్ 2 వ ప్లాట్‌ఫాం వద్ద నడుచుకుంటూ వెడుతుండగా బ్యాలెన్స్ కోల్పోయిన ఓ చిన్నారి అకస్మాత్తుగా రైల్వే పట్టాలపై పడిపోయింది. మరోవైపు అటునుంచి రైలు వేగంగా దూసుకొస్తోంది. దీంతో చిన్నారితో పాటు ఉన్న వ్యక్తి ఏం చేయాలో అర్థం కాక పెద్దగా కేకలు వేస్తున్నారు. పట్టాలపై పడిపోయిన చిన్నారిని గమనించిన రైల్వే ఉద్యోగి మయూర్ షెల్ఖే వేగంగా కదలిలారు. రైలుకు ఎదురెళ్లి మరీ చిన్నారిని పట్టాలమీది నుంచి తప్పించి, అంతే వేగంగా తను కూడా తప్పుకున్నారు. ఇదంతా కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగింది. దీంతో క్షణాల్లో ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డుయ్యాయి. ఈ వీడియోను దక్షిణ మధ్య రైల్వే షేర్ చేసింది. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు రైల్వే మాన్ మయూర్ షెల్కే సాహసంపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ చిన్నారిని ప్రాణాలను కాపాడటం గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. Very proud of Mayur Shelke, Railwayman from the Vangani Railway Station in Mumbai who has done an exceptionally courageous act, risked his own life & saved a child's life. pic.twitter.com/0lsHkt4v7M — Piyush Goyal (@PiyushGoyal) April 19, 2021 -
పట్టాలపై చిన్నారి..సకాలంలో స్పందించిన రైల్వే ఉద్యోగి
-
క్షణాల్లో బతికిపోయాడు...
సాక్షి, ముంబై: ప్రమాదమనీ, ప్రాణాంతకమనీ తెలిసినా ఏదో ఒక కారణంతో కొంతమంది కదిలే రైలునుంచి ప్లాట్‌ఫాం మీదికి దూకడం లాంటి చర్యల్ని మానుకోరు. ఇలాంటి దుందుడుకు చర్యతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించి ఉండకపోతే క్షణాల్లో ఆయన ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. వాయువేగంగా కదలిన గార్డు పట్టు తప్పి పట్టాలపై పడిపోబోతున్న సదరు వ్యక్తిని కాపాడారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. దిలీప్ భికాన్ మాండే (52) తన కుమారుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ వెళ్తున్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి యూపీకి చెందిన కామ్యాని ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సి ఉంది. అయితే పొరపాటున వీరిద్దరూ బిహార్‌కు చెందిన పవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేసారు.ఈ విషయాన్ని గ్రహించే సమయానికి, రైలు ప్లాట్‌ఫాం నుండి బయలుదేరుతోంది. దీంతో వారు సామానుతో పాటు కదిలే రైలు నుండి ప్లాట్‌ఫాంపై దూకేందుకు ప్రయత్నించారు. కుమారుడు బాగానే దూకేశాడు కానీ తండ్రి సైడ్ బార్ పట్టుకుని ఉండటంతో నియంత్రణ కోల్పోయాడు. దీన్ని గమనించిన సెక్యూరిటీ గార్డు క్షణం ఆలస్యం చేయకుండా మాండే ను ట్రాక్‌పైకి జారిపోకుండా కాపాడారు. దీంతో మాండే స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాడు. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది సోమనాథ్ మహాజన్, సబ్ ఇన్స్పెక్టర్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిప్) అధికారి కె సాహు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తన ప్రాణాలను కాపాడినందుకు సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
మరో మహిళను కాపాడిన ‘దిశ యాప్’
సాక్షి, కైకలూరు: మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ ఎస్ఓఎస్ యాప్’ సత్ఫలితాలను ఇస్తోంది. కృష్ణా జిల్లాలో ‘దిశ యాప్’ ద్వారా ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఓ మహిళను కాపాడారు. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు మహిళలు సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే.. తాజాగా మరో ఘటనలో మహిళకు మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నం చేసిన ఆటోడ్రైవర్ బారి నుంచి ఆ మహిళ సేఫ్‌గా బయటపడింది. (దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..) ఆటోలో ప్రయాణిస్తున్న కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామానికి చెందిన మహిళకు ఆటోడ్రైవర్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వబోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన సదరు మహిళ ‘దిశ యాప్’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే 8 నిమిషాల్లో చేరుకున్న పోలీసులు ఆ మహిళను కాపాడారు. పరారీ అయిన ఆటోడ్రైవర్‌ను రెండు గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా రక్షణ కోసం యాప్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ మహిళ కృతజ్ఞతలు తెలిపింది. వెంటనే స్పందించిన సిబ్బందిని ఎస్పీ రవీంద్రబాబు అభినందించారు. -
గుండంలో పడిన భక్తుడిని కాపాడిన కానిస్టేబుల్
యాలాల(తాండూరు): ప్రమాదవశాత్తు ఆలయ కోనేటిలో మునుగుతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ రక్షించిన ఘటన సోమవారం జరిగింది. మండలంలో జుంటుపల్లి సీతారామస్వామి ఆలయ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూరులోని సాయిపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు జుంటుపల్లి సీతారామ కల్యాణ ఉత్సవాలకు హాజరయ్యాడు. ఇందులో భాగంగా కోనేటిలో స్నానమాచరించేందుకు వెళ్లిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు గుండంలో పడి మునిగిపోయాడు. అక్కడే కాపాలాగా ఉన్న తాండూరు పీఎస్‌కు చెందిన అనిల్ అనే కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై శ్రీకాంత్‌ను గుండంలోంచి బయటికి లాగాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుడిని రక్షించిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు. -
గాడ్సేను అడ్డుకున్న భిలారే కన్నుమూత
పుణే: జాతిపిత మహాత్మాగాంధీని రక్షించిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంఎల్ఏ భికు దాజీ భిలారే (98) కన్ను మూశారు. గాంధీని నాధూరాం గాడ్సే నుంచి కాపాడిన బిలారే బుధవారం మహారాష్ట్రలో చనిపోయినట్టుగా కాంగ్రెస్ వర్గాలు ప్రకటించాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీతో సహా ప్రముఖ కాంగ్రెస్ నాయకులు భిలారే మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ హత్యకు హత్యకు ముందు నాలుగు సంవత్సరాల ముందు 1944లో ఒక సమావేశంలో నాథూరామ్ గాడ్సే మరో ఇద్దరు సహచరులతో కలిసి గాంధీని కత్తితో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించినపుడు భిలారే వారిని ప్రతిఘటించి మరీ గాంధీని రక్షించినట్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. పలు స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు భిలారే అంత్యక్రియలకు హాజరై ఆయనకు నివాళులర్పించారు. ఎల్లప్పుడూ సామాజిక మరియు ప్రజా సేవలలో నిమగ్నమై ఉండే ఆయన మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధుల హక్కులు ప్రయోజనాల కోసం చాలా క్రియాశీలకంగా పనిచేశారనీ, చివరి శ్వాసవరకు చురుకుగా ఉన్నారని ఆయన సన్నిహిత స్నేహితులు, రాష్ట్ర కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ మహాజన్ చెప్పారు. రాష్ట్ర సేవాదళ నాయకుడిగా ఉన్న బిలారేకి అప్పటికి పాతికేళ్లు అనీ, గాంధీపై జరిగిన 6 హత్యాయత్నాల్లో ఒకదానినుంచి కాపాడారని మహరాజన్ గుర్తు చేసుకున్నారు. కాగా స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్న భిలారే క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. మహాబలేశ్వర నియోజకవర్గం నుంచి శాసనసభంగా ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం 1948, జనవరి 30న గాడ్సే ఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద గాంధీని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
యువతిని రక్షించిన కాజీపేట పోలీసులు
కాజీపేట : గొంతుకోసుకొని ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువతిని కాజీపేట పోలీసులు గుర్తించి సకాలంలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడా రు. స్థానిక సీఐ రమేష్‌కుమార్ కథనం ప్రకారం... మంగళవారం రాత్రి వినాయక చవితి ఉత్సవ నిర్వాహక మండళ్లను తని ఖీ చేస్తున్న పోలీసు బృందం కడిపికొండ క్రాస్ రోడ్డులోని కాలనీల్లో పర్యటించి వ స్తుండగా ఓ యువతి చెట్లపొదల మధ్య పడిపోయి కన్పించింది. మృతదేహమై ఉండొచ్చనే అనుమానంతో దగ్గరకు వెళ్లిన బ్లూకోట్ పోలీ సులు ఆ యువతి ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్సై భీమేష్కు సమాచారమిచ్చారు. ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని తన వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. రెండున్నర గంట లపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు యువతికి ప్రాణాపాయంలేదని ప్రకటించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన స్థలంలో వెదకగా ఆ యువతి రాసిన సూ సైడ్ నోట్ లభించిందని, దానిని పరిశీ లించగా నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెంది న మంజుల(17)గా వెల్లడైంది. మరిపెడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న మంజుల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మంలో చికిత్స పోందుతోంది. తర చూ తలనొప్పి, గొంతు, విని కిడి సమస్యలు వేధిస్తుండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించిన ట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీ సులు వెల్లడించారు. ప్రాణాపాయస్థితిలోఉన్న యువతిని ఆస్పత్రిలో చేర్పించి కాపాడిన ఎస్సై భీమేష్, కాని స్టేబుల్ రామారావును సీఐ అభినందించారు. వారికి రివార్డు ఇప్పించ డానికి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు. -
ప్రాణం కాపాడారు
డాబాగార్డెన్స్ : జోరున వాన కురుస్తోంది. వర్షంలో స్పర్శ లేనంతగా చావు బతుకుల మధ్య ఓ అభాగ్యుడు. అటుగా వెళుతున్న సినీ కళాకారుడు హేమంత్‌కుమార్ ఈ సంఘటన చూసి చలించిపోయారు. దగ్గరికి వెళ్లి చూశాడు. కొన ఊపిరితో ఉన్నట్టు గుర్తించారు. మరో ఇద్దరుముగ్గురు సాయం తీసుకున్నారు. 108కు ఫోన్ చేశారు. వెంటనే హైదరాబాద్(108 కాల్‌సెంటర్) నుంచి నేరుగా ఫోర్త్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. నాల్గోపట్టణ పోలీసులు స్పందించి సంఘటన ప్రాంతానికి రక్షక్ ద్వారా వచ్చారు. వారు కూడా 108 అంబూలెన్స్‌కు ఫోన్ చేశారు. వన్‌టౌన్ పరిసర ప్రాంతాల్లో 108 వాహనం ఉందని చెప్పడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ల సాయంతో చావుబతుకుల మధ్య ఉన్న అభాగ్యుడ్ని కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనంతా దాదాపు గంటన్నర పాటు సాగింది. ప్రస్తుతం ఆ అభాగ్యుడు కేజీహెచ్‌లో కోలుకుంటున్నాడు. -
హరికుమార్‌ను కాపాడిన నవ నటుడు
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు హరికుమార్‌ను నవ నటుడు సుదర్శన్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి కాపాడట. నవ నటుడేమిటి హరికుమార్‌ను కాపాడడం ఏమిటి? అనేగా మీ సందేహం. తూత్తుకుడి, మదురైసంభవం, బోడినాయకనూర్ గణేశన్, తిరుత్తం వంటి విభిన్న కథాచిత్రాల హీరో హరికుమార్ నటించిన తాజా చిత్రం కాదల్అగధి. ఇందులో రెండో హీరోగా నవ నటుడు సుదర్శన్రాజ్ పరిచయం అవుతున్నారు. నటి ఆయిషా నాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో నాయకిగా మమతా రావత్ నటించారు. పాండియరాజన్, దేవదర్శిని, సింగముత్తు, లొల్లుసభ మనోహర్, బ్లాక్‌పాండి, మైసూర్ మంజు, షామి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను షామీ తిరుమలై నిర్వహించారు. చిత్రంలోని ప్రధాన అంశాల గురించి ఆయన తెలుపుతూ ఇందులో హరికుమార్ రెండు కోణాల్లో సాగే వైవిధ్యభరిత పాత్రను పోషించారన్నారు. రెండో హీరోగా నవ నటుడు సుదర్శన్‌ను పరిచయం చేసినట్లు చెప్పారు. ఈయన పాత్రకు చిత్రంలో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఒక దశలో హీరో హరికుమార్‌పై శత్రువులు దాడి చేసి చంపబోతే ఆయన వద్ద పని చేసే సుదర్శన్రాజ్ అడ్డుపడి తన ప్రాణాలను పణంగా పెట్టి ఆయన్ని కాపాడతాడన్నారు. చిత్రం అంతా హరికుమార్‌తో ఉండే సుదర్శన్రాజ్కు ప్రేమ సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు. చిత్రం బాగా వచ్చిందని, ఇది విడుదలైన తరువాత సుదర్శన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయని దర్శకుడు అన్నారు. తొలి చిత్రంతోనే హరికుమార్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని,ఈ కాదల్ అగధి చిత్రంలో నటించడం మంచి అనుభవం అని సుదర్శన్రాజ్ అన్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటున్న ఈ వర్ధమాన నటుడు మరో నూతన చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండడం విశేషం. -
ప్రాణాలు కాపాడే మిల్క్ బ్యాంకులు!
తల్లిపాల్లో ఉండే పోషకాలు శిశువులను ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు తల్లిపాలు అమృతంలా పనిచేస్తాయి. ఫార్ములా పాలు, పిండి పాలల్లో తల్లిపాలల్లో వలె వ్యాధి నిరోధకాలు, ఎంజైములు, హార్మోన్లు ఉండే పరిస్థితి లేదు. అందుకే తల్లి పాలకు మరే పాలు ప్రత్యామ్నాయం కాదు. అందుకే ఇప్పుడు రాజస్థాన్ లో తల్లిపాల బ్యాంకులు ఏర్పాటు చేసి ఎందరో బిడ్డల ప్రాణాలు నిలిపేందుకు కృషి చేస్తున్నారు. ఇండియాలో పుట్టిన ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 40 మందిదాకా ఐదేళ్ళు నిండక ముందే చనిపోతున్నారు. అయితే ముందు జాగ్రత్తలను విస్మరించడమే మరణాలకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యంగా శివువుల మరణాల్లో రాజస్థాన్ రాష్ట్రం అగ్రభాగంలో ఉంది. ఐదేళ్ళు నిండక ముందే చనిపోయే పిల్లలు ఇక్కడ అత్యధికంగా 47 శాతం ఉంటున్నారు.అయితే పౌష్టికాహారం గల తల్లిపాలతో ఇటువంటి మరణాలను నివారించవచ్చు అన్న విషయాన్ని గుర్తించి, రాష్ట్రంలో ఇటీవల మూడు తల్లిపాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. బిడ్డల పౌష్టికాహార లోపానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఓ అనాధాశ్రమంలో ముందుగా దివ్యా మదర్ మిల్క్ బ్యాంకును దేవేంద్ర అగర్వాల్ స్థాపించారు. రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షల రూపాయల నిధులతో 2013 లో ఉదయపూర్ లో పాల బ్యాంకును స్థాపించి అప్పటినుంచీ సేవలు అందించడం ప్రారంభించాడు. దివ్యా మదర్ మిల్క్ బ్యాంక్ (డీఎంఎంబి) స్థాపనతో గత మూడేళ్ళలో సుమారు 1500 మంది శిశువుల ప్రాణాలను రక్షించగలిగారు. అనంతరం తల్లిపాలపై అవగాహనతో అనేకమంది మిల్క్ బ్యాంకులకు పాలను అందించేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జైపూర్ మహాత్మా గాంధీ ఆస్పత్రిలో ఫిబ్రవరిలో ప్రారంభించిన మిల్క్ బ్యాంకుకు 74 మంది వరకూ పాలను డొనేట్ చేయడంతో ఇప్పటికే 25 వేల మిల్లీలీటర్ల పాలను బ్యాంకులో సేకరించారు. అమృత్ పేరిట స్థాపించిన ఈ పాల బ్యాంకు నుంచి స్థాపించిన రెండు నెలల్లో 196 యూనిట్ల పాలను శిశువులకు వినియోగించారు. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇండియా లెక్కల ప్రకారం దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్ బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ముందే ఉన్నప్పటికీ... కొందరు తల్లుల్లో అవగాహన లోపం పిల్లల ప్రాణాల మీదకు తెస్తుంది. తల్లుల్లో పోషకాహార లోపం కూడ పిల్లలకు పాలు లేకుండా చేస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలు... తాగనివారికంటే ఆరు రెట్టు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉందని తల్లిపాల దినోత్సవాల సందర్భంలో యునిసెఫ్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తల్లిపాలు ప్రపంచంలోని 13 శాతం మంది పిల్లల ప్రాణాలను రక్షిస్తున్నట్లు యునిసెఫ్ తెలిపింది. ఇండియాలో మొదటి మిల్క్ బ్యాంక్ 'స్నేహ'ను 1989 లో ముంబైలో అర్మిదా ఫెర్నాండెజ్ స్థాపించారు. తల్లులనుంచి సేకరించిన పాలను ప్రభుత్వాసుపత్రుల్లో నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు అందించేందుకు వినియోగించేవారు. డాక్టర్ ఫెర్నాండెజ్ స్థాపించిన ఆ బ్యాంకు... ఎంతోమంది పిల్లలకు ప్రాణాలు పోస్తూ 2014 లో 25 ఏళ్ళ వేడుకను కూడ జరుపుకొంది. ప్రస్తుతం గేదె, ఆవు పాలను పాశ్చురైజ్ చేస్తున్నట్లుగానే తల్లిపాలను కూడ ఇక్కడ పాశ్చురైజ్ చేసి నిల్వ చేస్తున్నారు. ఈ పాలను ఆర్నెల్లలోపు అవసరమైన పిల్లలకు అందించి వారి ప్రాణాలను కాపాడేందుకు వినియోగిస్తున్నారు. ఈ పద్ధతిలో పాలను నిల్వ చేసేందుకు ఇష్టపడే తల్లులు సదరు బ్యాంకుల్లో ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఉండే బ్యాంకుల్లో సంతకం చేసి పాలను డొనేట్ చేస్తే... ఎంతోమంది శిశువుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పడు ముంబైతోపాటు దేశంలోని చాలా నగరాల్లో ఈ మిల్క్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. మిగిలిన దేశాలతో పోలిస్తే ఇండియాలో ఈ బ్యాంకులు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికైనా మరిన్ని మిల్క్ బ్యాంకులను స్థాపించి శిశుమరణాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉంది. -
అనాధ యువతిని రక్షించిన రైల్వే శాఖ
ఇండియన్ రైల్వే కొన్నాళ్లుగా ప్రయాణీకుల సేవే లక్ష్యంగా పనిచేస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణాలకోసం అన్ని వసతులు కల్పిస్తోంది. వైద్యం నుంచి ఆహారం వరకూ సదుపాయాలను చేకూరుస్తోంది. అంతేకాదు... సామాజిక మాధ్యమాలు, మెయిల్స్ ద్వారా ప్రయాణీకులకు తక్షణ సహాయం అందిస్తోంది. తాజాగా రైల్వే విజిలెన్స్ అధికారులు ... హ్యూమన్ ట్రాఫికర్ల బారిన పడిన ఓ అనాధ యువతిని రక్షించారు. అయితే దేశంలో భారీగా సాగుతున్నమహిళల అక్రమ రవాణాకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ ప్రయాణిస్తున్న 19 ఏళ్ళ రాధా లోహర్... అపాయంలో చిక్కుకుంది. అయితే ఆమె పరిస్థితిపై ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఇతరులకు మాత్రం అనుమానం కలగలేదు. ఆమె కష్టాల్లో ఉందన్న విషయం ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఇక లాభం లేదనుకున్నరాధా... తన వివరాలను ఓ కాగితం పై రాసి తోటి ప్రయాణీకులకు అందించింది. పదోతరగతి చదువుతున్నరాధా లోహర్... తానో అనాధ బాలికనని, తనతో ఉన్న ఇద్దరు పురుషులూ తనను బలవంతంగా ఢిల్లీ తరలిస్తున్నారని పేర్కొంది. తనను ఈ కష్టంనుంచి గట్టెక్కించమని కోరింది. రాధా పరిస్థితిని తెలుసుకున్న తోటి ప్రయాణీకులు వెంటనే ఈ సమాచారాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు ట్వీట్ చేశారు. తక్షణమే స్పందించిన ఢిల్లీ అధికారులు సికింద్రాబాద్ లోని అధికారులకు సమాచారం అందించారు. దక్షిణమధ్య రైల్వే ఛీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్... రాధా ప్రయాణిస్తున్న రైలు... రామగుండం స్టేషన్ కు చేరేసరికి ప్రొటెక్షన్ ఫోర్స్ ను బాధితురాలున్న కోచ్ కు పంపించారు. సమాచారాన్ని ధృవీకరించిన అధికారులు ఆమెను దుండగుల బారినుంచి రక్షించి, ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైల్వే వెబ్ సైట్ లోని ఓ నివేదిక ప్రకారం ప్రశ్చిమ బెంగాల్ లోని అలీపూర్‌ద్వార్ జంక్షన్ నివాసి అయిన రాధా... ఢిల్లీకి చెందిన కె.టి. ఎంటర్ ప్రైజెస్ లో పని చేస్తోంది. అయితే ఆమె ఇంటికి వెళితే తిరిగి తమ కంపెనీలో పనికోసం రాదని గ్రహించిన దుండగులు హైదరాబాద్ వస్తున్న రాధాను బలవంతంగా ఢిల్లీ ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు రైల్వే అధికారుల చొరవకు తోడు ఓ ట్వీట్ రాధాను రక్షించగల్గింది. -
'హైడీ' ఆమె జీవితాన్ని కాపాడింది!
శునకాలు వాసనల ద్వారానే అన్నింటినీ పసికడతాయి. అలాగే పెంపుడు జంతువులైతే యజమాని, వారికి సంబంధించిన వ్యక్తులను గుర్తుపడతాయి. ముఖ్యంగా వాటిలో స్నఫింగ్ డాగ్స్ ఎంతో తెలివితేటలను ప్రదర్శిస్తాయన్నది తెలిసిన విషయమే. అందుకే వాటికి పోలీసులు వాసనను గుర్తించడంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు. అదే జాతి శునకానికి యజమాని ఇచ్చిన ట్రైనింగ్... ఇప్పుడు ఏకంగా అమె జీవితాన్నే రక్షించింది. క్యాన్సర్ బారినుంచీ బయట పడేసింది. యజమానిపై అత్యంత ప్రేమను చూపించే పెంపుడు జంతువుల్లో శునకాలను ముందు వరుసలో చేరుస్తాం. యజమానులూ వాటిని ప్రాణప్రదంగా చూస్తారు. అయితే మిచిగన్ కు చెందిన 53 ఏళ్ళ ఆన్నె విల్స్... తన పెంపుడు జంతువుకు ఇచ్చిన ట్రైనింగ్... ఆమె జీవితాన్ని ఒడ్డున పడేసింది. ఆమెకు సోకిన రోగాన్ని ముందుగానే గుర్తించిన ఎనిమిదిన్నరేళ్ళ.. జర్మన్ షెఫర్డ్ స్నఫింగ్ డాగ్ 'హైడీ'... యజమాని చుట్టూ ఆవేదనతో తిరగడం ప్రారంభించింది. పదే పదే ఆమె ఛాతీపై వాసన చూడటం మొదలు పెట్టింది. దీంతో విషయం అర్థంకాక ఆన్నె విల్స్ ఆందోళన చెందింది. తన పెంపుడు కుక్కకు ఏమైందోనని కంగారు పడింది. హైడీకి ఎనిమిదేళ్ళపాటు... తప్పిపోయినవారిని, పెంపుడు జంతువులను వాసనను బట్టి గుర్తించడంలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇచ్చారు. అయితే హైడీ పదే పదే తన ఛాతీపై వాసన చూడటం మాత్రం ఆ యజమానికి ఎంతో అనుమానం కలిగించింది. దీంతో హైడీని ఓ ప్రముఖ మెటర్నిటీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి దానికేమైందోనని అన్ని పరీక్షలూ చేయించింది. వైద్యులు హైడీ ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి సమస్యా లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే ఎందుకలా చేస్తోంది అన్న అనుమానం మాత్రం ఆన్నె విల్స్ ను వీడలేదు. ఎందుకైనా మంచిదని ఆమె కూడా పరీక్షలు చేయించుకుంది. ''హైడీ నా జీవితాన్ని రక్షించింది. అదే కనుక నా రోగాన్ని గుర్తించకపోయి ఉంటే ఈ పాటికి శవంగా మారేదాన్ని'' అంటూ పదే పదే గుర్తు చేసుకుంటోంది యజమాని ఆన్నె. ఒకవేళ హైడీ కనుక గుర్తించకపోయి ఉంటే.. ఆన్నె విల్స్ కు సోకిన లంగ్ క్యాన్సర్.. శరీరంలోని మిగిలిన అన్నిభాగాలకూ సోకి ఉండేదని, ముందుగానే తెలియడం వల్ల ఈ జబ్బును నయం చేసే అవకాశం ఉందని ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎన్సర్ కోలే చెప్పారు. ఎక్కడైతే పదే పదే హైడీ వాసన చూసిందో అదే స్థానంలో ఆమెకు లంగ్ కాన్యర్ ఉండటం వైద్యులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపై మీరు రెండు పీహెచ్ డీలు చేసిన వైద్యుల సమక్షంలో ఉన్నట్టుగా హైడీని చూసి ఫీలవ్వచ్చు అంటూ సెయింట్ ఆగ్నెస్ ఆస్పత్రి ఆంకాలజీ ఛీఫ్ అనడం విశేషం. నిజంగానే ఓ శునకం వైద్యులకన్నా వేగంగా రోగాన్ని గుర్తించడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు హైడీకి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడంతోపాటు.. దాని ముక్కు ఎంతో గ్రహణ శక్తిని కలిగి ఉండటం నిజంగా ఎంతో గ్రేట్ అని ఏకంగా డాక్టర్లే మెచ్చుకుంటున్నారు. ఆన్నె విల్స్ నిర్వహిస్తున్న డాగ్స్ ఫైండింగ్ డాగ్స్ సేవాకార్యక్రమంలో భాగంగా ఏడేళ్ళలో సుమారు 2 వేల వరకూ తప్పిపోయిన పెంపుడు జంతువులను హైడీ గుర్తించింది. పెంపుడు శునకం.. యజమానిపై విశ్వాసాన్ని చూపడమే కాదు.. ఏకంగా ఆమె జీవితాన్నే రక్షించడంతో ఆన్నే విల్స్ ఎంతో ఆనందంలో తేలిపోతోంది. -
మతాన్ని మించిన మానవత్వం...
-
పుణ్యంకోసంవెళ్లి..ప్రమాదంలో
-
రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేయని హెడ్మాస్టర్లు
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రాజీవ్ విద్యామిషన్ (ఎస్ఎస్ఏ) ఏటా నిధులను సమకూర్చుతోంది. కోట్లాది రూపాయల నిధులను ఆయా గ్రాంట్ల కింద పాఠశాలలకు మంజూరు చేస్తారు. కానీ సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్లు తమ నిజాయితీని నిరూపించుకోవాలనే ఆలోచనతో పిల్లల అభ్యున్నతికి వినియోగించాల్సిన నిధులను వృథా చేశారు. ఇదే విషయాన్ని విజి‘లెన్స్’ నివేదికలు తేల్చిచెబుతున్నాయి. మూడేళ్లుగా రాజీవ్ విద్యామిషన్ మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయకుండా పిల్లలకు అన్యాయం చేశారని ఉన్నతాధికారులు తేల్చారు. అసలు నిధులు ఎందుకు ఖర్చు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ మెమోలు జారీ చేయాలని ఆర్వీఎం రాష్ట్ర పథక సంచాలకులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రూ.వందకోట్లు వెనక్కి ఇదేంటి నిధులు మెక్కేయకుండా బాగానే ఆదా చేశారుగా అని చూసేవారికి అనిపించినా.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగించకుండా వృథా చేయటం ఫలితంగా మూడేళ్లుగా జిల్లాకు వివిధ గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధులు భారీస్థాయిలో ఏకంగా రూ.100 కోట్ల వరకు వెనక్కి మళ్లినట్టు తెలుస్తోంది. 2008-09, 2009-10, 2010-11 విద్యాసంవత్సరాల్లో స్కూల్ గ్రాంట్స్, మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ కాంప్లెక్స్ గ్రాంట్ల రూపంలో భారీగా నిధులు విడుదల చేశారు. ఈ నిధులు ఆయా బ్యాంకు ఖాతాలకు చేరినా మురిగిపోయే వరకు చూడడం మినహా విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. రూ.2కోట్ల నిధులు ఖర్చు చేస్తే విద్యార్థులకు స్కూళ్లలో మంచి జరిగేది. కానీ సొమ్ములు దాచుకుని వారికి ద్రోహం చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నిధులతో పాఠశాలల్లో మరుగుదొడ్లు, పాఠశాల మరమ్మతులు, పరికరాల మరమ్మతులు, బోధనా సామగ్రి ఇలా విద్యార్థులకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నవాటికి ఖర్చు చేయాల్సిన నిధులను వ్యర్థం చేసినట్టు విజిలెన్స్ అధికారులు తనిఖీలో గుర్తించారు. పైగా అప్పటి రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ కూడా సక్రమంగా పర్యవేక్షణ చేయలేదని నివేదికల్లో పేర్కొన్నట్టు చెబుతున్నారు. ఈఏడాది స్కూల్ మెయింటినెన్స్ గ్రాంట్, స్కూల్ గ్రాంట్‌గా రూ.4 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఎలిమెంటరీ పాఠశాలకు ఒక్కోదానికి రెండు గ్రాంట్లు కలిపి రూ.10వేలు, యూపీ స్కూల్‌కు రూ.17వేలు, ఉన్నత పాఠశాలకు రూ.17 వేలు మంజూరు చేశారు. గతంలో అయితే ఒక్కో పాఠశాలకు సుమారు రూ.27 నుంచి రూ.32వేల వరకు నిధులు మంజూరు అయ్యేవి.