
నీట మునిగిన బాధితుడితో కానిస్టేబుల్ అనిల్
యాలాల(తాండూరు): ప్రమాదవశాత్తు ఆలయ కోనేటిలో మునుగుతున్న ఓ వ్యక్తిని కానిస్టేబుల్ రక్షించిన ఘటన సోమవారం జరిగింది. మండలంలో జుంటుపల్లి సీతారామస్వామి ఆలయ ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. తాండూరులోని సాయిపూర్‌కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు జుంటుపల్లి సీతారామ కల్యాణ ఉత్సవాలకు హాజరయ్యాడు.
ఇందులో భాగంగా కోనేటిలో స్నానమాచరించేందుకు వెళ్లిన శ్రీకాంత్ ప్రమాదవశాత్తు గుండంలో పడి మునిగిపోయాడు. అక్కడే కాపాలాగా ఉన్న తాండూరు పీఎస్‌కు చెందిన అనిల్ అనే కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై శ్రీకాంత్‌ను గుండంలోంచి బయటికి లాగాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే బాధితుడిని రక్షించిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.