
అంబర్‌పేట: ఆర్థిక ఇబ్బందు ల కారణంగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (42) మదన్నపేట పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ అంబర్‌పేట, దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నాడు.
గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత ను గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటే శ్వర్లుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment