Financial Issues
-
షేర్ మార్కెట్లో కోటి రూపాయలు లాస్.. కానిస్టేబుల్ బలవన్మరణం
అంబర్‌పేట: ఆర్థిక ఇబ్బందు ల కారణంగా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూర్యాపేట జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (42) మదన్నపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ అంబర్‌పేట, దుర్గానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అత ను గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసు కుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటే శ్వర్లుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టాక్స్ బడిలో ‘టీనేజీ’ పాఠాలు!
పిల్లలు విద్యలో రాణిస్తుంటే తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. వారి భవిష్యత్ బంగారమేనని మురిసిపోతుంటారు. తమ వారసులకు నాణ్యమైన విద్య, ఉపాధి మార్గం చూపడంతోనే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోయినట్టు కాదు. సంపాదనను సంపదగా మార్చే విద్య కూడా వారికి చెప్పాలి. ఆర్ధిక అంశాలపై సమగ్రమైన అవగాహన వారిని స్థితిమంతులను చేస్తుంది. ఆర్ధిక సమస్యల్లో చిక్కుకోకుండా కాపాడుతుంది. ప్రతి ముగ్గురు అమెరికన్ ఈక్విటీ ఇన్వెస్టర్లలో ఒకరు 18 ఏళ్లకే ఈక్విటీల్లోకి అడుగు పెడుతున్నారు. మన దగ్గర 25 ఏళ్ల తర్వాతే ఎక్కువ మందికి ఈక్విటీల గురించి తెలుస్తోంది. స్టాక్స్ గొప్ప కాంపౌండింగ్ మెషిన్. ఎంత ముందుగా పెట్టుబడి మొదలు పెడితే, అన్ని రెట్లు అధిక ప్రతిఫలాన్ని ఇస్తుంది. గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని కమ్యూనిటీల్లో యుక్త వయసులోనే పిల్లలకు తల్లిదండ్రులు స్టాక్స్ పాఠాలు చెప్పడం మొదలు పెడతారు. పెట్టుబడుల వారసత్వాన్ని సైతం వారు ఎంతో కీలకంగా చూస్తారు. ఈ తరహా విధానం అందరికీ అనుసరణీయమేనన్నది నిపుణుల అభిప్రాయం. చిన్న నాటి నుంచే ఈక్విటీ పెట్టుబడుల పరిచయంతో భవిష్యత్తులో దాన్ని సంక్లిష్టంగా కాకుండా క్రమబద్ధంగా, సంపద సృష్టికి సులభమైన మార్గంగా చూడడం అలవడుతుందనేది ఈక్విరస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే అభిప్రాయం. ‘‘ఆరంభానికి 16 ఏళ్ల వయసు అనువైనది. వాస్తవిక ఆర్ధిక విషయాలను వారు అప్పుడే అర్థం చేసుకోవడం మొదలవుతుంది. 17 ఏళ్ల వయసుకు రిస్క్, రాబడి, దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి తదితర అంశాలను అర్థం చేసుకోగలరు’’ అని అభిజిత్ భవే చెప్పారు. ‘‘టీనేజ్‌లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ద్వారా పెట్టుబడుల గురించి వింటుంటారు. ఆ దశలోనే వారిలోని ఆసక్తిని గుర్తించి నేరి్పంచడం మొదలు పెట్టాలి. 15–16 ఏళ్లపుడు ఆరంభిస్తే.. 17–19 ఏళ్లు వచ్చే సరికి ఈక్విటీలను అర్థం చేసుకోగలరు. వీరిలో కొందరు కెరీర్‌గానూ మలుచుకునే అవకాశం ఉంటుంది’’ అని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా సూచించారు. ‘‘వారంతట వారే నేర్చుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. మెరుగైన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు లేదా స్టాక్స్‌ను గుర్తించే అవకాశం కలి్పంచాలి. అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నిర్ణయాలను నిందించకుండా, మంచి చెడుల పరంగా తీర్పు ఇవ్వకుండా తమ పెట్టుబడులు, తప్పిదాలు, విజయాల గురించి పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. తమను తాము ఆవిష్కరించుకునే అవకావం ఇవ్వాలి’’ అని సెంటర్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ లెరి్నంగ్ చైర్పర్సన్ ఉమా శశికాంత్ అన్నారు. ఇలా స్వేచ్ఛా వాతావరణం ఉంటే పిల్లలు సంతోషంగా పంచుకుంటారు. అప్పుడు వారి నిర్ణయాల్లోని లోపాలను ఎలా సరిచేసుకోవాలో వివరించి చెప్పొచ్చు. టీనేజ్ నుంచే వెన్నుతట్టి ప్రోత్సహించడం వల్ల సంపాదన మొదలయ్యే నాటికి వారు మెరికలుగా మారతారు. ‘‘ఈక్విటీల్లో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి)కు సమయం కావాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ముందుగా ఈక్విటీ పెట్టుబడులను పరిచయడం చేయడం వల్ల, మార్కెట్లను మెరుగ్గా అర్థం చేసుకోగలిగి భవిష్యత్తులో అద్భుతమైన సంపదను సృష్టించుకోగలరు’’ అని రూపీ విత్ రుషబ్ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు రుషబ్ దేశాయ్ పేర్కొన్నారు.ప్రాథమిక అంశాలు.. ఆర్ధిక అంశాలు, పెట్టుబడులు, వివిధ సాధనాల గురించి స్కూల్ పాఠాల్లో ఉండదు. కనుక వీటి గురించి చెప్పే బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలి. పదో తరగతి లేదా ఇంటర్లోకి వచి్చన వెంటనే ప్రాథమిక అంశాల గురించి అర్థమయ్యేలా వివరించి, కొన్ని కోర్సులను వారికి పరిచయం చేయాలి. దీంతో ఈక్విటీల గురించి మరింత లోతుగా నేర్చుకుంటారు. అయితే, మెజారిటీ తల్లిదండ్రులకు క్యాపిటల్ మార్కెట్లపై అవగాహన లేకపోవడం సమస్యగా పేర్కొన్నారు ఫిన్‌సేఫ్ ఇండియా వ్యవస్థాపకురాలు మృణ్ అగర్వాల్. అయినా సంకోచించకుండా, తమ పిల్లలను ఫైనాన్షియల్ ప్లానర్లు/ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ తల్లిదండ్రులు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే, కంపెనీలు, వాటి ఈక్విటీ, ఆదాయం, లాభాలు, యాజమాన్యం, రుణభారం, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్, వాటి పెట్టుబడుల విధానం, రిస్క్, రాబడులు, బేర్, బుల్ మార్కెట్లు, ఆటుపోట్లు (వోలటాలిటీ), పెట్టుబడుల్లో వైవిధ్యం, కాంపౌండింగ్, లక్ష్యాలను నిర్ణయించుకోవడం, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయడం తదితర అంశాల గురించి చెప్పాలి. ముందుగా పెట్టుబడులు ఆరంభించడం వల్ల రాబడిపై రాబడి (కాంపౌండింగ్) తోడయ్యి వచ్చే అద్భుత రాబడుల సూత్రాన్ని వివరించాలి. అధిక రాబడులు ఎప్పుడూ కూడా అధిక రిస్‌్కతో ఉంటాయన్న వాస్తవాన్ని తెలియజేయాలి. ఈ రిస్క్‌ను అధిగమించే వ్యూహాలపై అవగాహన కలి్పంచాలి.పరిశోధన, అధ్యయనం 17–19 ఏళ్ల వయసులో ప్రాథమిక అంశాలను దాటి లోతైన విశ్లేషణ, అధ్యయనాన్ని టీనేజర్లు ఆరంభించేలా చూడాలి. మార్కెట్లు, కంపెనీలను విశ్లేíÙంచే సామర్థ్యాలు కచ్చితంగా తెలియాలి. అప్పటికే ఎన్నో ఏళ్ల పాటు పెట్టుబడులు పెట్టిన అనుభవం, మార్కెట్లపై సమగ్రమైన అవగాహన ఉంటే తల్లిదండ్రులే వీటి గురించి వివరంగా చెప్పొచ్చు. లేదంటే ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోర్సుల్లో వారిని చేర్పించాలి. ఎన్ఎస్ఈ, బీఎస్ఈతోపాటు మరికొన్ని సంస్థలు ఈక్విటీలు, పెట్టుబడులకు సంబంధించి పలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. నిపుణులు రాసిన చక్కని పుస్తకాలు కూడా ఉన్నాయి. పరిశ్రమకు చెందిన నిపుణులు వర్క్‌షాప్‌లు, వెబినార్లను నిర్వహిస్తుంటారు. వర్చువల్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వార్తా పత్రికలు సమాచార వేదికలుగా ఉపయోగపడతాయి. తొలుత ఆరంభ స్థాయి, తదనంతరం అడ్వాన్స్డ్ కోర్సుల్లో చేర్పించొచ్చు. ఆర్థిక అంశాలు, ఆర్ధిక వ్యవస్థల గురించి అవగాహన తప్పనిసరి. కంపెనీ ఆర్ధిక మూలాలు, కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలు, వాటి ద్వారా ఆదాయం పొందుతున్న తీరు, కీలక రంగాలు, వాటి పనితీరు, అంతర్జాతీయ ధోరణులు మార్కెట్లపై ఎలా ప్రభావం చూపిస్తాయన్నది తెలియాలి. ఫండమెంటల్, టెక్నికల్ కోర్సులను నేరి్పంచాలి. ‘‘కంపెనీ బ్యాలన్స్ షీటును అర్థం చేసుకుని, విశ్లేషించే సామర్థ్యాలు అలవడితే, కంపెనీ నిధులను ఎలా వినియోగిస్తుందో తెలుసుకోగలిగితే అప్పుడు వారు తగిన కంపెనీని ఎంపిక చేసుకోగలరు. అప్పుడు అది పెట్టుబడి అవుతుందే కానీ, గ్యాంబ్లింగ్ కాబోదు. ఏమి చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అన్న స్పష్టత ఉండాలి’’ అని దినేష్ రోహిరా సూచించారు. రిస్క్‌లు/మోసాలు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి రిస్‌్కలు, మోసాల గురించి వివరంగా చెప్పాలి. తప్పుడు సలహాలతో ఏర్పడే నష్టం, వేరొకరి సూచనను గుడ్డిగా అనుసరించడం వల్ల వచ్చే రిస్‌్కల గురించి, భావోద్వేగాల నియంత్రణ ప్రాధాన్యాన్ని అర్థమయ్యేలా వివరించాలి. వేగంగా డబ్బులు సంపాదించేయాలన్న ధోరణి అస్సలు పనికిరాదు. ఒకవేళ మీ పిల్లల్లో ఈ ధోరణిని గుర్తిస్తే వెంటనే దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. నేటి యువతరం ఎక్కువ మంది ఇదే ధోరణితో స్టాక్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని గమనించొచ్చు. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడుల విధానానికి బదులు ట్రేడింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. డెరివేటివ్స్ లావాదేవీల్లో లాభం వచి్చనా, నష్టం వచి్చనా రూ.వేలు, రూ.లక్షల్లో ఉంటుంది. డెరివేటివ్స్ స్పెక్యులేటివ్ ఆధారితం. ఇందులో రిస్‌్కల పట్ల పిల్లల్లో అవగాహన తప్పనిసరి. కష్టార్జితాన్ని కాపాడుకుంటూ, మెరుగైన రాబడులు సంపాదించడమే కర్తవ్యంగా ఉండాలి. కానీ, స్వల్పకాలంలోనే సంపద కూడబెట్టడం అసాధ్యం అన్నది పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్ తదితర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే స్టాక్ రికమండేషన్ల ఉచ్చులో పడకుండా, టిప్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. ‘‘అన్ని మార్గాల ద్వారా వస్తున్న సమాచారంతో ఈక్విటీ మార్కెట్లో డబ్బులు సంపాదించడం తేలికన్న భావన యువతలో సహజంగా ఏర్పడుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అతిపెద్ద రిస్క్’’ అని మృణ్ అగర్వాల్ తెలిపారు. ఇతరులను గుడ్డిగా అనుసరిస్తే పెట్టుబడిని కూడా కోల్పోయే ప్రమాదం గురించి అర్థం కావాలి. నిజానికి సరైన రీతిలో వినియోగించుకుంటే సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల నుంచి ఎంతో కీలక సమాచారాన్ని పొందొచ్చు. సమాచార వడబోత గురించి టీనేజర్లకు తెలిస్తే తప్పటడుగులు వేయకుండా మెరుగైన రక్షణ ఏర్పడినట్టే. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్‌లో ఉండే అధిక రిస్్కపై అవగాహన కలి్పంచాలి. స్టాక్స్‌లో స్వల్పకాలిక అస్థిరతల ప్రభావంతో నియంత్రణ కోల్పోకుండా చూడాలి. పెట్టుబడులు–పర్యవేక్షణ టీనేజర్లలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌పై ఏ మేరకు అవగాహన, విజ్ఞానం వచ్చిందో కొంత పెట్టుబడి వారికి సమకూర్చి పరీక్షించొచ్చు. పిల్లలు అప్పటి వరకు దాచుకున్న పాకెట్ మనీ ఉంటే, దాన్ని కూడా పెట్టుబడిగా పెట్టేలా ప్రోత్సహించాలి. లేదంటే తల్లిదండ్రులే ఆరంభ పెట్టుబడి కింద రూ.10,000 సమకూర్చాలి. లావాదేవీలకు వీలుగా డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు వారి పేరిట తెరిపించాలి. 18 ఏళ్లు నిండగానే ఈ పనిచేయాలి. 18 ఏళ్లలోపే పిల్లలు వీటి గురించి మెరుగ్గా తెలుసుకున్నారని భావిస్తే, అప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు తమ పేరిట ఖాతా తెరిచి, పిల్లలకు అందుబాటులో ఉంచాలి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టేలా చూడాలి. కొంత కాలానికి ఈ రెండింటి పనితీరును వారు పోల్చుకోగలరు. స్టాక్స్‌లో ఆటుపోట్లు ఎక్కువ. వీటిని ఫండ్స్ ఎలా అధిగమిస్తున్నాయన్నది తెలుసుకునే ఆసక్తి ఏర్పడుతుంది. ప్రతి 15 రోజులకు, నెల రోజులకు ఒకసారి పిల్లల పోర్ట్‌ఫోలియోను సమీక్షించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. తప్పులను చూపించి నిందించడం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదు.వర్చువల్ ట్రేడింగ్ వేదికలు నియోస్టాక్స్: వర్చువల్ ట్రేడింగ్‌కు సులభంగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకుని, సెక్యూరిటీలను ఎంపిక చేసుకుని ట్రేడింగ్ ప్రారంభించొచ్చు. స్టాక్ ట్రెయినర్ : మన దేశంతోపాటు ! అమెరికా సహా 15కు పైగా దేశాల స్టాక్స్ డేటాను ఈ ఆండ్రాయిడ్ యాప్ ఆఫర్ చేస్తోంది. వాటిలో వర్చువల్‌గా ట్రేడ్ చేసుకోవచ్చు. పనితీరును విశ్లేషించుకోవచ్చు. నేర్చుకునేందుకు వేదికలు.. ఎన్ఎస్ఈ అకాడమీ సర్టిఫికేషన్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ (ఎన్సీఎఫ్ఎం): నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) నిర్వహిస్తున్న అకాడమీ ఇది. ఆన్లైన్ ద్వారా ఎన్నో రకాల కోర్సులను అందిస్తోంది. బిగినర్, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ ఇలా వివిధ దశల్లో వీటిని పొందొచ్చు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని, ఫీజు చెల్లించిన తర్వాత మెటీరియల్ పొందొచ్చు. సన్నద్ధమైన తర్వాత పరీక్షలు రాయవచ్చు. ఎన్ఎస్ఈ అకాడమీ డాట్ కామ్ పోర్టల్‌ను సంప్రదించాలి. బీఎస్ఈ ఇనిస్టిట్యూట్ బీఎస్ఈ సబ్సిడరీ ఇది. మూడేళ్ల గ్రాడ్యుయేట్, ఏడాది, రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను సైతం ఆఫర్ చేస్తోంది. ప్లస్2 తర్వాత వీటిలో చేరొచ్చు. రోజులు, వారాల నిడివితో స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, డెరివేటివ్‌లపై స్వల్పకాలిక ప్రోగ్రామ్‌లు, కోర్సులను సైతం అందిస్తోంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్ఐఎస్ఎం): సెక్యూరిటీలపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో సెబీ అందిస్తోంది. ఉడెమీ : ఇదొక ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫామ్. ఉచిత కోర్సులు కూడా ఇక్కడ లభిస్తాయి. రూ.449 నుంచి చెల్లింపుల కోర్సులు కూడా ఉన్నాయి.నేర్చుకోండి.. నేర్చుకోండి.. నేర్చుకోండి.. సరిగ్గా జీవించడమంటే అన్ని వేళలా నేర్చుకోవడమే.– చార్లీ ముంగర్, విఖ్యాత ఇన్వెస్టర్ – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
నిధులు.. నియామకాలు!
రాష్ట్రంలోని 11 ప్రభుత్వ వర్సిటీల్లో రెండింటికి ఇప్పటికీ జాతీయ మదింపు, గుర్తింపు కౌన్సిల్ (న్యాక్) ఉత్తమ గ్రేడ్ రాలేదు. కేవలం రెండింటికే ‘ఎ’ ప్లస్ దక్కింది. జేఎన్టీయూహెచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘ఎ’ గ్రేడ్ స్థాయికి రాలేకపోతోంది.సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యకు ఊపిరిపోసే విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగిన సిఫారసులు చేస్తూ నివేదికలు ఇవ్వాలని కొత్త వైస్ చాన్స్లర్లను ఆదేశించింది. అవసరమైతే కన్సల్టెన్సీల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది. అయితే సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి, గాడి తప్పిన పాలన..వర్సిటీల్లో ప్రధాన సమస్యలని వీసీలు పైకి చెబుతున్నా, తగిన మొత్తంలో నిధులు ఇవ్వడంతో పాటు, పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తేనే వర్సిటీల్లో బోధనతో పాటు అన్ని అంశాల్లోనూ నాణ్యత మెరుగవుతుందనే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలోని ఏ వర్సిటీకీ న్యాక్ అత్యుత్తమ గ్రేడ్ ఎ ప్లస్ ప్లస్ లేకపోవడాన్ని విద్యారంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. అయితే నిధులు, బోధనా సిబ్బంది కొరత చెప్పడానికి వీసీలు సాహసించడం లేదని అంటున్నారు. ఆర్థిక అంశాలే కీలకం రాష్ట్రంలోని వర్సిటీలను అధ్యాపకుల కొరత వేధిస్తోంది. ఒక్కో వర్సిటీలో ఇప్పటికీ 74 శాతం వరకు ఖాళీలున్నాయి. 2,825 అధ్యాపక పోస్టులు మంజూరైతే, ఉన్న రెగ్యులర్ సిబ్బంది కేవలం 873 మంది మాత్రమే. మిగతా వాళ్ళంతా తాత్కాలిక ఉద్యోగులే. దీంతో బోధనలో జవాబుదారీతనం లోపిస్తోందని, ఫలితంగా విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయనే విమర్శలున్నాయి. ఇతర అంశాలను పక్కనబెడితే నిధుల కొరతే ప్రధాన సమస్య అని వీసీలు భావిçÜ్తున్నారు. పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డును గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ నియామకాలు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే వీసీల నియామకం చేపట్టింది. వీరి నివేదికల అనంతరం సమస్యల పరిష్కారం దిశగా ఏ మేరకు నిధులు సమకూరుస్తుందో వేచిచూడాల్సిందే. మసక బారుతున్న ఓయూ వైభవం వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీకి న్యాక్ ఎ ప్లస్ గుర్తింపు ఉంది. కానీ ప్రస్తుతం ఓయూ వైభవం మసక బారుతోందనే అభిప్రాయం ఉంది. పరిశోధనలు తగ్గాయి. బోధన సిబ్బంది కొరతతో కేంద్ర ప్రభుత్వ శాఖలు పరిశోధన ప్రాజెక్టులు తగ్గించాయి. 2020–21లో రూ.52.45 కోట్ల ప్రాజెక్టులొస్తే, 2022–23 నాటికి ఇది రూ.24.75 కోట్లకు తగ్గింది. రెండేళ్ళలోనే 53 శాతం పడిపోయింది. ప్రభుత్వం 1,267 అధ్యాపక పోస్టులు మంజూరు చేసినా 340 మందే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులతో కాలం వెళ్ళదీయాల్సిన పరిస్థితి ఉంది. జేఎన్టీయూహెచ్కు జవసత్వాలెలా?సాంకేతిక విద్యకు కీలకమైన ఈ విశ్వవిద్యాలయం జాతీయ ర్యాంకుల్లో స్థానం దక్కించుకోవడంలో విఫలమవుతోంది. ఇక్కడ 410 అధ్యాపకులుండాలి. కానీ 169 మందే ఉన్నారు. దీంతో కీలకమైన ఇంజనీరింగ్ బోధనలో ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలను ఇంజనీరింగ్‌లో విలీనం చేశారు. కానీ సిబ్బంది కొరత వల్ల ప్రమాణాలు పెరగడం లేదు. కొత్త ఏఐ కోర్సులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవడానికి ఏటా రూ.200 కోట్ల మేర నిధులు అవసరమని వర్సిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు లేని ఆర్జీయూకేటీ బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో విద్యార్థులకు ఇంటర్న్íÙప్ లేదు. ల్యాప్‌టాప్‌లు, ఆధునిక వసతులు అందుబాటులో లేవు. 90 మంది బోధన, 100 మంది బోధనేతర సిబ్బంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మెస్ నిర్వహణ అక్రమాలకు కేంద్ర బిందువుగా మారడంతో విద్యార్థులు పలుమార్లు ఆందోళనలకు దిగారు. 2008 నుంచి 2024 ఏప్రిల్ మధ్య ఇక్కడ 21 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ‘పాలమూరు’వెనుకంజ.. ఈ వర్సిటీకి ఏటా కేటాయించేది రూ.10 కోట్లు. ఇచ్చేది రూ.7 కోట్ల లోపే. కొల్లాపూర్, వనపర్తి పీజీ కేంద్రాల్లో వేతనాలు, ఇతర ఖర్చులకే నెలకు రూ.1.28 కోట్లు అవుతుంది. ఏడు విభాగాలకు 84 పోస్టులు మంజూరైతే 17 పోస్టుల్లోనే అధ్యాపకులున్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే ప్రొఫెసర్లు కాగా నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన 11 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు రెగ్యులర్ అధ్యాకులు లేరు. 94 మంది తాత్కాలిక అధ్యాపకులతో బోధన కొనసాగుతోంది. అనుమతి వచ్చినా లా కాలేజీ భవన నిర్మాణం పూర్తవ్వలేదు. నలుగురు ఉండాల్సిన బాలికల హాస్టల్లో 8 మంది ఉండాల్సిన పరిస్థితి. ‘తెలంగాణ’కు రూపాయి విదల్చడం లేదు! ఈ వర్సిటీలో 152 ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనా, ఉన్నది కేవలం 61 మంది మాత్రమే. 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుండగా అకడమిక్ కన్సల్టెంట్లు, పార్ట్ టైం అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. ఈ వర్సిటీకి పదేళ్ళుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇతరత్రా నిధులతో నెట్టుకొస్తున్నారు. 18 ఏళ్ళలో ఒక్కసారి మాత్రమే ఇక్కడ స్నాతకోత్సవం జరిగింది. కాకతీయలో వేతనాలకే దిక్కులేదుకాకతీయ వర్సిటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు ఏడాదికి రూ.150 కోట్లు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ కింద రూ.97 కోట్లు మాత్రమే వస్తోంది. దీంతో అంతర్గత సమీకరణల ద్వారా రూ.53 కోట్లు సమకూర్చుకుంటున్నారు. 405 రెగ్యులర్ అధ్యాపకులకు గాను 83 మందే ఉన్నారు. 190 మందిని కాంట్రాక్టు, 201 మందిని తాత్కాలిక పద్ధతిలో తీసుకున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వెయ్యి మంది వరకూ అధ్యాపకులు ఉండాలని వర్సిటీ వర్గాలంటున్నాయి. నిధుల్లేకుండా మార్పు ఎలా సాధ్యం? జ్ఞానాన్ని సృష్టించి, పంచే యూనివర్సిటీల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. వీటికి వివిధ రూపాల్లో నిధులు సమకూరుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 12 శాతం నిధులిచ్చేవారు. అదిప్పుడు సగానికి పడిపోయింది. యూజీసీ కూడా 60 శాతం నిధులు తగ్గించింది. నిధులే లేనప్పుడు మార్పు ఎలా సాధ్యం? ఢిల్లీలో ఓ సాధారణ కాలేజీకి వెళ్ళా. 250 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. మన దగ్గర ఆ స్థాయిలో అధ్యాపకులు ఉండటం లేదు. పాలమూరు లాంటి వర్సిటీకి రూ.8 కోట్లు ఇవ్వడమే కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరిశోధన ఎలా చేయగలరు? వాస్తవ పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వర్సిటీల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి కార్యాచరణలో కన్పించాలి. వర్సిటీలకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తేనే మార్పు సాధ్యం. – ప్రొఫెసర్ హరగోపాల్ (విద్యారంగ నిపుణులు)అధ్యయనం మొదలైంది సీఎం ఆదేశాల మేరకు ఉన్నత విద్యలో మార్పుల దిశగా అధ్యయనం చేస్తున్నాం. త్వరలో నిపుణులతో భేటీ ఏర్పాటు చేస్తాం. ఎలాంటి మార్పులు రావాలి? గ్లోబల్ పోటీని తట్టుకునే బోధన ప్రణాళికలేంటి? అనేది అధ్యయనం చేయబోతున్నాం. – ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)త్వరలో అందరితో సమావేశం నివేదిక దిశగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్వోడీలను పిలుస్తాం. మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఇతర అంశాలపై చర్చిస్తాం. నెల రోజుల్లో నివేదిక సమరి్పస్తాం. – ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, వీసీ ఓయూ -
ఆదాయం తగ్గింది.. మార్చి దాకా అడగొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. వచ్చే మార్చి 31 వరకు ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడులు చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని.. దీనికి సంబంధించి మంత్రులతో కమిటీ వేస్తున్నామని తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)ఆందోళన బాట పడతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులతో సీఎం రేవంత్ గురువారం సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి జేఏసీ నుంచి హాజరైన 36 మందికి మాట్లాడే అవకాశం కల్పించారు. వారు చెప్పిన అంశాలు, సమస్యలను విన్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం రేవంత్ 15 నిమిషాల పాటు మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. డీఏలపై ఆలోచన చేస్తాం.. ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలని సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. కనీసం మూడు డీఏలను వెంటనే ఇవ్వాలని.. 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏలపై ప్రకటన చేయాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని, ఏమాత్రం వీలైనా ఎంతో కొంత న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లులు, నగదు రహిత ఆరోగ్య కార్డుల జారీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నామని తెలిపారు. డీఏల విషయంలో ప్రభుత్వానికి ఒకట్రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. 317 జీవో సమస్యలను పరిష్కరిస్తాం.. స్థానిక జిల్లాలకు ఉద్యోగుల బదిలీ కోసం తీసుకొచ్చిన 317 జీవోతో ఏర్పడ్డ సమస్యలను పరిష్కారిస్తామని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు. ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదికను శుక్రవారం ఉద్యోగ ప్రతినిధుల ముందే తెరుస్తామని చెప్పారు. అందులోని అంశాలను పరిశీలించి, తగిన సలహాలు ఇస్తే.. సమస్యలన్నీ పరిష్కారం అయ్యే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. భట్టి నేతృత్వంలో మంత్రుల కమిటీ.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో.. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులతో కమిటీ వేస్తున్నట్టు సీఎం రేవంత్ వెల్లడించారు. దీపావళి పండుగ తర్వాత ఈ కమిటీ సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపుతుందని.. ఈ క్రమంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, అదనపు కార్యదర్శి జనరల్ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కో–చైర్మన్ చావా రవితోపాటు పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎంకు సమస్యలు వివరించాం ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రతినిధులంతా సీఎంతో నేరుగా మాట్లాడారు. అన్ని సమస్యలను ఆయన ముందు పెట్టారు. తొలి సమావేశం సుహృద్భావ వాతావరణంలోనే జరిగింది. సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాం. – మారం జగదీశ్వర్, జేఏసీ అధ్యక్షుడు కనీసం రెండు డీఏలైనా ఇవ్వాలి తక్షణమే రెండు డీఏలైనా ఇస్తే ఉద్యోగులకు ప్రభుత్వంపై నమ్మకం కుదురుతుంది. ప్రతీ దానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వంతో కలసి ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగులు అన్నివేళలా కృషి చేస్తారు. – చావా రవి, జేఏసీ కో–చైర్మన్ కొంత సానుకూలం సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వం మార్చి 31 వరకూ సమయం కావాలని కోరింది. ఇది న్యాయమైన కోరికే. అయితే, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విషయంలో కనీసం రెండు ఇవ్వడానికి కేబినేట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ అదనపు సెక్రటరీ జనరల్ సీపీఎస్ వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వంపై నయాపైసా భారం పడని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలి. సీపీఎస్‌తో రెండు దశాబ్దాలుగా సామాజిక భద్రత లోపిస్తోంది. భవిష్యత్తులోనూ ఇది అధిక భారంగా మారుతుంది. కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు రాజస్థాన్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు ఈ విధానాన్ని రద్దు చేశాయి. రాష్ట్రంలోనూ సీపీఎస్‌ను రద్దు చేస్తే ఎల్బీ స్టేడియంలో రెండు లక్షల కుటుంబాలతో ధన్యవాదాలు తెలుపుతాం. – సీఎంకు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ వినతి పరిస్థితి బాగోలేదు.. సహకరించండి!ఉద్యోగుల డిమాండ్లన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించేందుకు తమకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ తెలిపారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉందని.. కొన్నాళ్లుగా వివిధ శాఖల ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆర్థిక అంశాల్లో తమపై ఒత్తిడి తేవొద్దని కోరారు. ఆర్థిక అవసరాలు లేని బది లీలు, పాలనాపరమైన అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఉద్యోగులు సహకరించాలని కోరారు. -
ముగ్గురి ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్..
రాజేంద్రనగర్ (హైదరాబాద్): ఆన్లైన్ బెట్టింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవలే ఈ మరణాలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్ (38) ఇందిర (36) దంపతులు. వీరికి శ్రేయాన్స్ (4) ఒక్కడే కొడుకు. పాల వ్యాపారం చేసే ఆనంద్ మూడేళ్ల క్రితం నుంచి బండ్లగూడజాగీర్ సన్‌సిటీ ఏరియాలోని యమున అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నాడు. ఆనంద్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ బెట్టింగ్‌ల కారణంగా దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి, ఆర్థికంగా చితికిపోయాడు. దీంతో దంపతుల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. 15 రోజుల క్రితం ఇరు కుటుంబాలకు చెందిన వారితోపాటు స్నేహితులు వచ్చి ఆన్లైన్లో గేమ్స్ ఆడొద్దని, బుద్ధిగా ఉండి కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పారు. అయినా ఆనంద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. మూడురోజుల క్రితం మరోసారి ఆనంద్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడినట్టు సమాచారం. ఇదే విషయమై సోమవారం ఉదయం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరిగిన సమయంలో ఇందిర తన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఆనంద్ కూడా తన స్నేహితులతోపాటు బంధువులకు ఫోన్ చేసి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం అందించాడు. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలతోపాటు బంధుమిత్రులు ఫోన్లు చేసినా, ఇద్దరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో వారంతా కంగారుపడి అపార్ట్మెంట్ వచ్చి చూడగా, మృతదేహాలు కనిపించాయి. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్యను చంపి.. ఆపై ఆత్మహత్య ! ఘటనాస్థలిని పరిశీలించాక...దంపతులు మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, ఆ క్రమంలోనే పెనుగులాటలో భార్య చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత కొడుకుకు క్రిమిసంహారక మందు తాగించి, ఆనంద్ కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. తండ్రీకొడుకు నోటి నుంచి నురగలు వస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే ఇందిర నోటి నుంచి ఎలాంటి నురుగులు రాలేదు. పోస్టుమార్టం నివేదిక తర్వాత అసలు విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచే దంపతులు గొడవ పడుతున్నట్టు వాచ్మెన్ పోలీసులు తెలిపాడు. -
కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని
కౌడిపల్లి (నర్సాపూర్): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. నవీన్ భార్య.. కుమారుడు లోకేష్ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది. కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్‌లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఉదయం నవీన్ తన కొడుకు లోకేష్‌తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది. -
‘బ్లాక్ అండ్ వైట్’ నిజాలు!
సందిగ్ధతకు తావు లేకుండా విషయం తేటతెల్లమయ్యే స్థితివుంటే, తప్పొప్పులు స్పష్టంగా అర్థమవు తుంటే... అలాంటి పరిస్థితిని వ్యక్తీకరించటానికి ఆంగ్లంలో ‘బ్లాక్ అండ్ వైట్’ అనే నుడికారాన్ని ఉపయోగిస్తారు. గురువారం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం (వైట్ పేపర్) విడుదల చేయగా, దీనికి పోటీగా కాంగ్రెస్ నల్లపత్రం (బ్లాక్ పేపర్) ప్రకటించింది. ఇది ఎన్నికల రుతువు గనుక అధికారంలోకొచ్చి పదేళ్లవుతున్న సందర్భంలో ఆర్థిక రంగంలో తమ ఘనతను చాటుతూ ఎన్డీయే సర్కారు శ్వేతపత్రాన్ని తీసుకొచ్చింది. ఈ పదేళ్లూ ‘కర్తవ్య కాలమ’ని ఆ పత్రం అభివర్ణించింది. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ విధానాల పర్యవసానంగా ఆర్థికరంగంలో ఎంతటి అరాచకత్వం, ఎలాంటి విచ్చలవిడితనం చోటుచేసుకున్నాయో వివరించింది. 2004లో యూపీఏ అధికారంలోకి రావడానికి ముందున్న ఎన్డీయే సర్కారు దృఢమైన, ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను అందించివెళ్తే యూపీఏ దాన్ని కాస్తా ధ్వంసం చేసిందన్నది శ్వేతపత్రం ఆరోపణ. కాంగ్రెస్ విడుదల చేసిన బ్లాక్ పేపర్ ఎన్డీయే ప్రభుత్వ పదేళ్ల వైఫల్యాలను ఏకరువు పెట్టింది. ఈ కాలాన్ని ‘అన్యాయ కాలం’గా అభివర్ణించించింది. అందులో ఆర్థిక రంగంతోపాటు ఇతరేతర అంశాలను కూడా ప్రస్తావించింది. రెండూ ఒకేరోజు విడుదల కావటంవల్ల వాస్తవ స్థితి ఏమిటో ‘బ్లాక్ అండ్ వైట్’లో తేటతెల్లమవుతుందని ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు యూపీఏ ఉనికిలో లేదు. దాని స్థానంలో ‘ఇండియా’ పేరుతో కొత్త కూటమి రంగంలోకొచ్చింది. గతంలో యూపీఏకు నేతృత్వం వహించినట్టే ఇప్పుడు ‘ఇండియా’కు తానే అన్నీ అయి కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. అయినా శ్వేతపత్రానికి కూటమి తరఫున కాక ఆ పార్టీయే సమాధానం ఇవ్వాల్సివచ్చింది. ఉన్న స్థితిగతులను గణాంక సహితంగా చెప్పటానికి విడుదల చేసే పత్రాన్ని శ్వేతపత్రం(వైట్ పేపర్) అంటున్నారు. ఎన్డీయే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన దానికి పోటీగా బ్లాక్ పేపర్ పేరిట కాంగ్రెస్ ఎందుకు విడుదల చేయాలనుకుందో తెలియదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నింద తొలగించుకోవటానికీ, బీజేపీ ‘నమ్మకద్రోహాన్ని’ చాటడానికీ 1993 మొదట్లో అప్పటి పీవీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. దాన్ని పూర్వపక్షం చేస్తూ, జరిగిన తప్పిదాలకు కేంద్రానిదే బాధ్యతని వివరిస్తూ బీజేపీ సైతం శ్వేతపత్రాన్నే ప్రకటించింది. ఒకటి మాత్రం వాస్తవం... పత్రాలకు ఏ పేర్లున్నా వాటిల్లో వుండేవి గణాంకాలే. సామాన్యుల బతు కులు చూస్తే తప్ప వాస్తవ స్థితిగతులేమిటో అర్థంకావు. వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గురించి శ్వేతపత్రం ఘనంగానే చెప్పింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఎన్డీయేది అదే మాట. తమ అయిదేళ్ల పాలన పరమాద్భుతంగా ఉన్నదంటూ ‘భారత్ వెలిగిపోతోంది’ అనే నినాదంతో నాటి ఎన్డీయే 2004 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లింది. కానీ ప్రజలు తిరస్కరించారు. తాజా శ్వేతపత్రం మాత్రం నాటి ఎన్డీయే సర్కారు సుదృఢమైన ఆర్థిక వ్యవ స్థను అప్పగించిందని చెబుతోంది. దాని మాటెలావున్నా యూపీఏ తొలి అయిదేళ్ల పాలన ఒడిదుడు కులు లేకుండానే గడిచిందని చెప్పాలి. రెండోసారి నెగ్గాక అతి విశ్వాసమో, ఎదురులేదన్న దురహంకారమో యూపీఏను దెబ్బతీశాయి. పార్టీలోనూ, వెలుపలా ప్రత్యర్థులను అణచివేసేందుకు అప్రజా స్వామిక విధానాలు అమలయ్యాయి.శ్వేతపత్రం ప్రస్తావించిన బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం తదితర 15 స్కాములలో అధికభాగం రెండో దశ పాలనలోనివే. పీవీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1991 నాటి ఆర్థిక సంస్కరణలు తన ఘనతేనని చెప్పుకుని కూడా వాజ్‌పేయి సర్కారు అందించిన అవకాశాలను వినియోగించుకోలేని చేతగాని స్థితిలో యూపీఏ పడిందన్నది శ్వేతపత్రం ప్రధాన ఆరోపణ. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా చేతివృత్తులు దెబ్బ తిని, వ్యవసాయం గిట్టు బాటు కాక, కొత్తగా ఏర్పడిన ఉపాధి అవకాశాలను అందుకోలేక భిన్న వర్గాలు పడిన యాతనలు అన్నీ ఇన్నీ కాదు. ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’ గీతం ఈ దీనస్థితికి అద్దం పట్టింది. సంస్కరణలు మాన వీయ దృక్పథంతో వుండాలన్న ఆలోచన ఆ తర్వాత వచ్చిందే. అనుత్పాదక ప్రయోజనాలకు వ్యయం చేయటంతో 2003–04లో 31 శాతంగా వున్న పెట్టుబడి వ్యయం 2013–14 నాటికి 16 శాతానికి దిగజారిందని శ్వేతపత్రం అంటోంది. అయితే 2008–09లో ప్రకటించిన రూ. 52,000 కోట్ల రుణమాఫీని ఈ జాబితాలో చేర్చటం సరికాదు. సాగురంగానికి జవసత్వాలివ్వటానికీ, గ్రామీణ ఆర్థికవ్యవస్థ పుంజుకోవటానికీ ఆ చర్య దోహదపడింది. సగటు ద్రవ్యోల్బణ శాతం 8నుంచి 5కు తీసుకురావటం, తలసరి జీడీపీలో వృద్ధి, పెట్టుబడి వ్యయం పెరుగుదల, పరోక్ష పన్ను రేటులో తగ్గుదల వంటివి తమ విజయాలుగా శ్వేతపత్రం తెలిపింది. అయితే నల్లధనాన్ని వెలికి తీయటానికంటూ అమలు చేసిన పెద్దనోట్ల రద్దు ప్రస్తావన ఇందులో లేదు. యూపీఏ కాలంనాటి అవ్యవస్థనూ, దాని చేతగానితనాన్నీ గణాంక సహితంగా చెప్పకపోవటంవల్ల అప్పటి పరిస్థితులపై కాంగ్రెస్ స్వోత్కర్షలకు పోతోందని ఏనాటినుంచో బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి వుంది. తాజా శ్వేతపత్రం ఆ లోటైతే తీర్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈఅంశాలు బీజేపీకి ఆయుధాలవుతాయి. అటు కాంగ్రెస్ అప్పట్లో తాము సాధించిందేమిటో చెబుతుంది. భావోద్వేగాలతో ముడిపడిన అంశాలు కాక, జనం మౌలిక సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలు కావటం ఎప్పుడూ మంచిదే. -
అప్పు చెల్లించలేదని.. ఏసీపీ కుమారుడి హత్యచేసిన స్నేహితులు
న్యూఢిల్లీ: పోలీస్ ఉన్నతాధికారి కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో స్నేహితులే అతన్ని కుట్ర పన్ని అంతమొందించారు. పెళ్లికి తీసుకెళ్లి... తిరిగిరాని లోకాలకు పంపించారు. ఢిల్లీ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ యశ్పాల్ సింగ్‌కు 24 ఏళ్ల కుమారుడు లక్ష్య చౌహాన్ ఉన్నాడు.ఇతడు తీస్ హజారీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. సోమవారం తన స్నేహిలు వికాస్ భరద్వాజ్, అభిషేక్‌లతో కలిసి హర్యానాలోని సోనేపట్‌లో జరిగిన వివాహ వేడుకకు ముగ్గురు హారయ్యారు.. ఆ తర్వాత లక్ష్య చౌహాన్ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తండ్రి ఎసీపీ అధికారి యశ్పాల్ సింగ్ తన కుమారుడు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్యతో కలిసి కారులో వెళ్లిన స్నేహితుడు అభిషేక్నును అదుపులోకి తీసుకొచిన విచారించగా అసలు విషయం చెప్పాడు. వికాస్ భరద్వాజ్, లక్షయ్, తాను ముగ్గురం కలిసి కారులో సోనెపట్‌కు వెళ్లామని, వివాహం అనంతరం అదేరోజు రాత్రి ఇంటికి బయలుదేరామని చెప్పాడు. చదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న కూలీలతో వెళ్తున్న ఆటో.. ముగ్గురు దుర్మరణం మార్గంమధ్యలో పానిపట్ దగ్గర మునక్ కాలువ వద్ద మూత్రవిసర్జన కోసం కారు ఆగినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భరద్వాజ్, తాను కలిసి చౌహాన్‌ను కాలువలోకి తోసినట్లు పోలీసులకు చెప్పాడు. అనంతరం అదే కారులో వికాస్ తనని ఢిల్లీ సమీపంలోని నెరెలా వద్ద విడిచిపెట్టాడని తెలిపాడు. దీంతో కాలువలో గాలించి చౌహాన్ మృతదేహాన్ని వెలికితీశారు. పరారీలో ఉన్న భరద్వాజ్ కోసం పోలీసులు వెతుకున్నారు. నిందితుడు వికాస్ భరద్వాస్ కూడా తీస్ హజారీ కోర్టులోనే క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. వికాస్ గతంలో లక్షయ్కు కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఇవ్వమంటే లక్షయ్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో కక్ష పెంచుకున్న వికాస్ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. మరో స్నేహితుడు అభిషేక్‌ను ఇందుకు ఉపయోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఐపీసీ 302, 201 కింద సెక్షన్లు నమోదు చేశారు. -
Anakapalle: జ్యూయలరీ వ్యాపారి కుటుంబం ఆత్మహత్య
పనులు పూర్తి చేసుకొని నాన్న ఇంటికొస్తే పిల్లలకు ఆనందం. భర్త కోసం ఎదురుచూసే గృహిణి మనసుకు నిశ్చింత. ఆయన వస్తూ వస్తూ తినడానికేమైనా తెస్తే పిల్లలు ఎగబడి తింటారు. ఈరోజూ అలాగే చేశారు. ఆయన బిర్యానీ తెస్తే అందరూ చక్కగా తిన్నారు. ముద్ద నోట్లో పెట్టే సరికి వారికి తెలీదు.. క్షణాల్లో ప్రాణం తీసే సైనెడ్ అందులో ఉందని. తెలుసుకునే లోగానే విగత జీవులయ్యారు.. తొమ్మిదేళ్ల పాపాయిని ఒంటరిగా ఒదిలేసి. తింటుండగా వాంతి కావడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. సాక్షి, అనకాపల్లి: పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక జ్యూయలరీ వ్యాపారి కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బిర్యానీలో ౖసైనెడ్ కలిపి భార్య, ముగ్గురు పిల్లలతో తినిపించి బలవన్మరణానికి యత్నించాడు. ఈ హృదయవిదారక ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జ్యూయలరీ వ్యాపారి కొడవలి శివరామకృష్ణ తన కుటుంబంతో ఏడాది క్రితం అనకాపల్లికి వచ్చారు. అనకాపల్లి టౌన్లో పెరుగుబజారు సమీపంలో జ్యూయిలరీ షాపును ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో స్వస్థలాన్ని వీడిన రామకృష్ణ స్థానిక ఉడ్ పేటలో ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో భార్య మాధవి దేవి (40), కుమార్తెలు వైష్ణవి (15), జాహ్నవి (12), కుసుమప్రియ తో కలిసి నివాసముంటున్నారు. తన పిల్లలను స్థానిక సిటీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నారు. పిల్లలు తొమ్మిది, ఏడు, మూడు తరగతులు చదువుతున్నారు. అనకాపల్లికి వచ్చిన ప్రారంభంలో రామకృష్ణ ఓ బంగారం షాపులో ఉద్యోగం చేసేవాడు. ఆ తరువాత సొంతంగా జ్యూయలరీ షాపు పెట్టుకున్నాడు. ఏడాదిన్నర నుంచి అనకాపల్లి టౌన్లోనే ఉన్నా వ్యాపారరీత్యాగానీ, పని నిమిత్తంగానీ ఎవరితోనూ వివాదం పెట్టుకున్న సందర్భాలు లేవు. అయితే ఆ కుటుంబం చుట్టుపక్కల వారితో కలివిడిగా ఉండేవారు కాదని, ముభావంగా అంటీముట్టనట్టు ఒంటరిగా ఉండేవారని స్థానికులు తెలిపారు. భార్యాపిల్లలకు తెలీకుండా! రామకృష్ణ గురువారం రాత్రి 9 గంటలకు దుకాణం నుంచి ఇంటికి వచ్చాడు. ౖసైనెడ్ కలిపిన బిర్యానీ తీసుకొచ్చాడు. ఆ విషయం భార్యాపిల్లలకు తెలీదు. కుటుంబమంతా బిర్యానీ తిన్నారు. అంతలో చిన్న కూతురు కుసుమ వాంతి చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మిగతావారంతా నేలకొరిగారు. ఈ విషయం గమనించిన కుసుమ పక్కింటికి వెళ్లి అమ్మ, నాన్న నిద్రపోయి లేవలేదు అని ఏడుస్తూ చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాంతులు చేసుకున్న చిన్నారిని హుటాహుటిన స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం కేజీహెచ్‌కు తరలించారు. మూడేళ్లుగా దూరం రామకృష్ణ అప్పులు చేసి ఎవరికీ తెలియకుండా అనకాపల్లి టౌన్లో నివసిస్తున్నట్టు అనకాపల్లి చేరుకున్న అతని సోదరుడు వెంకటేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం తెలుస్తోంది. సుమారుగా మూడేళ్లుగా కుటుంబ సభ్యులతో సఖ్యత లేదని తెలుస్తోంది. మృతదేహాలను చూసేందుకు ఒక సోదరుడు మినహా కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. ఆధారాలు లేవు ఘటన స్థలంలో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి ఆధారాలూ లభించలేదని డీఎస్పీ వి.సుబ్బరాజు చెప్పారు. క్లూస్‌టీమ్ ఇంటిలో అన్ని గదులనూ క్షణంగా పరిశీలించిందని పేర్కొన్నారు. బిర్యానీ ప్యాకెట్లతో భోజనం చేస్తూ అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా, కుసుమప్రియ అపాయం నుంచి తప్పించుకుందని, ప్రస్తుతం కేజీహెచ్‌లో కోలుకుంటోందన్నారు. శివరామకృష్ణ అన్నయ్య వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాడి మోహనరావు చెప్పారు. -
పిల్లలు ఏం పాపం చేశారు.. దేవుడా ఎంత పని చేశావు..?
సాక్షి, సిద్దిపేట/ సిద్దిపేట కమాన్: ఆర్థిక సమస్యలు, ఆన్లైన్ రమ్మి గేమ్ ఓ కుటుంబానికి శాపంగా మారింది. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర పీఎస్ఓ (గన్‌మెన్)గా విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక తన భార్య, ఇద్దరు పిల్లలను గన్ తో కాల్చి.. తానూ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామానికి చెందిన ఆకుల నరేశ్(35), చైతన్య(30) దంపతులకు కుమారుడు రేవంత్(7), కూతురు హితాశ్రీ(5) ఉన్నారు. సిద్దిపేట పట్టణంలోని సహస్ర స్కూల్లో చైతన్య టీచర్‌గా వి«ధులు నిర్వహిస్తుండగా.. అదే పాఠశాలలో కుమారుడు రేవంత్ 2వ తరగతి, కుమార్తె హితాశ్రీ ఒకటో తరగతి చదువుతున్నారు. అప్పుల ఊబిలోకి.. రమ్మి గేమ్, ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో నరేశ్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో మూడు నెలల క్రితం గ్రామంలోని ఎకరం వ్యవసాయ భూమిని విక్రయించగా వచి్చన రూ 24.80 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. అయినా అప్పుల కొండ కరగలేదు. మరికొంత భూమిని విక్రయిద్దామని ఉమ్మడి కుటుంబ సభ్యులతో చర్చించినా వారు సుముఖత చూపలేదని తెలిసింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన నరేశ్.. అప్పు తీర్చే మార్గం కానరాక ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉలిక్కి పడ్డ రామునిపట్ల సిద్దిపేటలో నివాసం ఉంటున్న నరేశ్ కుటుంబం ఇరవై రోజుల క్రితం రామునిపట్ల గ్రామంలోని తన సొంత ఇంటికి మకాం మార్చింది. నరేశ్ ఇక్కడి నుంచే ప్రతిరోజు డ్యూటీకి వెళ్లి వస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం డ్యూటీకి వెళ్లి నరేశ్ రిపోర్ట్ చేశాడు. కలెక్టర్ సెలవులో ఉండటంతో తిరిగి ఇంటికి వచ్చే ముందు భార్య చైతన్యకు ఫోన్ చేసి స్కూల్ బస్సులో వెళ్లకండి.. తానే స్కూల్‌కు డ్రాప్ చేస్తానని చెప్పాడు. దీంతో స్కూల్ బస్సు ఎక్కాల్సిన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉండిపోయారు. పిల్లలు స్కూల్ యూనిఫాం, కాళ్లకు సాక్స్‌లు ధరించి, లంచ్ బాక్స్‌లు, బ్యాగ్‌లు సర్దుకుని స్కూల్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంటికి చేరుకున్న నరేశ్.. ఇంట్లోకి వెళ్లి తన దగ్గర ఉన్న 9ఎంఎం సరీ్వస్ పిస్టల్‌తో మొదట భార్య చైతన్యను, తర్వాత ఇద్దరు పిల్లలను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం అదే గన్‌తో తన కణతిపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి సీపీ శ్వేత సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చామని మీడియాకు తెలిపారు. క్షణికావేశంలో ఒక కుటుంబం బలికావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. పిల్లలు ఏం పాపం చేశారు..? ఈ ఘటనతో రామునిపట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నరేశ్ కుటుంబం మొత్తం రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు కన్నీరమున్నీరయ్యారు. అభం, శుభం తెలియని చిన్నారులు మృతిచెందడంతో ఊరంతా దుఃఖసాగరంలో మునిగితేలింది. చిన్నారుల మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరు అయ్మో పాపం.. పిల్లలు ఏం పాపం చేశారు.. దేవుడా ఎంత పని చేశావు..? అని రోదించారు. కన్న పిల్లలు అని చూడకుండా తండ్రి కర్కశంగా కాల్చి చంపడాన్ని తీవ్రంగా కలచివేసింది. ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు ఒకే గోతిలో ఇద్దరు పిల్లల ఖననం సిద్దిపేటఅర్బన్: ఏఆర్ కానిస్టేబుల్ నరేశ్ కుటుంబం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి స్వగ్రామం రామునిపట్లలో ముగిశాయి. వ్యవసాయ బావి వద్ద కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాభర్తలు నరేశ్, చైతన్య మృతదేహాలను ఒకే చితిపై దహనం చేశారు. వీరి చితికి నరేశ్ తండ్రి నిప్పంటించారు. ఇద్దరు పిల్లల మృతదేహాలను ఒకే గోతిలో పెట్టి తాత అంత్యక్రియలు నిర్వహించారు. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి తాను తలకొరివి పెట్టాల్సి వచ్చింది నరేశ్ తండ్రి బోరున విలపించాడు. భార్యాభర్తల చితికి పక్కనే గోతిలో పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. టీచర్ల కంటతడి సిద్దిపేట కమాన్: సిద్దిపేట పట్టణం ఆదర్శకాలనీలోని సహస్ర స్కూల్లో చదువుతున్న రేవంత్, హితాశ్రీలు క్లాస్‌లో ఎంతో చురుగ్గా ఉండేవారని, చదువుల్లో ఫస్ట్ వచ్చే వారని ఉపాధ్యాయులు చెప్పారు. ఎంతో అల్లరి చేస్తూ, ముద్దు ముద్దు మాటలతో సందడి చేసేవారని, కానీ నేడు ఇలాంటి పరిస్థితిలో చూస్తామని కలలలో కూడా అనుకోలేదని వారు కంటతడి పెట్టుకున్నారు. చైతన్య కూడా ఎంతో కలుపుగోలుగా ఉండేదని, స్నేహభావంతో మెలిగేవారని తమతో గడిపిన జ్ఞాపకాలను తోటి టీచర్లు గుర్తు చేసుకున్నారు. చైతన్య మృతి కలిచివేసింది ప్రతి రోజు స్కూల్‌కు రాగానే తోటి టీచర్లను తప్పకుండా పలకరిస్తూ లోపలికి వెళ్లేది. ఎంతో కలుపుగోలు తనం, స్నేహభావం ఎక్కువగా ఉండేది. చైతన్య మృతి చెందిన విషయాన్ని నమ్మలేకపోతున్నాం. మమ్మల్ని ఎంతో కలిచివేసింది. శుక్రవారం ఉదయం పాఠశాలకు చైతన్య రాకపోవడంతో తనకు ఉదయం 9గంటలకు ఫోన్ చేయగా.. లిఫ్ట్ చేయలేదు. సుమారు 11:30గంటల సమయంలో ఈ విషయం తెలియడంతో బాధపడ్డాం. – కవిత, తోటి టీచర్ హితాశ్రీ ఎంతో యాక్టివ్ ఘటనలో మృతిచెందిన హితాశ్రీ క్లాస్‌తో ఎంతో యాక్టివ్‌గా ఉండేది. ఎల్కేజీ చదువుతున్న సమయంలో ఇంటెలిజెంట్‌గా ఉండటంతో యూకేజీ కాకుండా నేరుగా ఫస్ట్ క్లాస్‌లోకి ప్రమోట్ చేయడం జరిగింది. పెద్దయ్యాక డాక్టర్ అవుతానని చెప్పేదని.. కానీ, ఇలా అర్థంతరంగా తన జీవితం ముగుస్తుందని అనుకోలేదని చెప్పుకుంటూ సుమలత అనే టీచర్ కన్నీటి పర్యంతమైంది. – సుమలత, టీచర్ అప్పు తీర్చకపోతే చావే మార్గం అంటూ చెప్పేవాడు అప్పులు తీర్చకపోతే తనకు చావు తప్ప వేరే మార్గం లేదని నరేశ్ చెప్పేవాడు. ఈ నెల 10వ తేదీన అప్పులు చెల్లిస్తానని గడువు పెట్టాడు. ఏదో విధంగా ఐదు రోజులు నెట్టుకొచ్చాడు. నిన్న రాత్రి 9 గంటలకు (ఘటనకు ముందు రోజు) సైతం నరేశ్ తనను కలిశాడు. కానీ ఇంత పని చేస్తాడని అనుకోలేదు. నరేశ్‌ను కుటుంబ సభ్యులు పట్టించుకునే వారు కాదు. రూ.10 నుంచి రూ.20లక్షలు సాయం చేస్తే బతికే వాడు. – రాజు, మృతుడి స్నేహితుడు -
కూతురు ముందే పిస్టల్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ‘గోలీ కొట్టుకుంటా’.. అంటూ రెండుమూడు రోజులుగా సన్ని హితుల వద్ద చెపుతున్న రాచకొండ ఏఆర్ ఎస్సై మహ్మద్ ఫజల్ అలీ (59) పిస్టల్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న అలీ, తన చిన్న కుమార్తెతో కలసి ఆదివారం ఉదయం డ్యూటీలో చేరడానికి వచ్చి, ఆమె సమక్షంలోనే ఉసురు తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఆర్థిక కారణాల నేపథ్యంలో అలీ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన ఫజల్ అలీ రాచకొండ కమిషనరేట్‌లో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేసినా.. భర్తలతో విడాకులు తీసుకున్న వీళ్లు ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ఓ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న కుమార్తె వివాహం చేయాలని భావించిన అలీ.. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.10 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయనకు కేవలం రెండేళ్లు మాత్రమే సర్విసు ఉండటంతో బ్యాంకు అధికారులు రుణ దరఖాస్తును తిరస్కరించారు. రెండు వారాల క్రితం బ్యాంకు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఫజల్ అలీ, రుణం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. నోట్ బుక్‌లో రాసుకుని.. ఈ క్రమంలో రెండుమూడు రోజులుగా తన సన్నిహితులు, సహోద్యోగుల వద్ద ఆర్థిక ఇబ్బందులు, రుణం సమస్య గురించి చెప్పుకుంటున్న ఫజల్ అలీ నిరాశతో ‘గోలీ కొట్టుకుంటా’అంటూ వాపోయారు. ఓ నోట్ బుక్‌లోనూ తన ఆర్థిక పరిస్థితుల విషయం రాసి ఆ పేజీని తన వెంట ఉంచుకున్నారు. ఆదివారం ఉదయం చిన్న కుమార్తె ఫాతిమాను తీసుకొని శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి వద్దకు డ్యూటీ కోసం వచ్చారు. ముందుగా ఆ సమీపంలో ఒక హోటల్ వద్ద కూతురిని దించి మంత్రి ఇంటికి వెళ్లారు. డ్యూటీ ఎక్కిన తర్వాత తన సర్వీస్ పిస్టల్ (9 ఎంఎం క్యాలిబర్) తీసుకొని కుమార్తె ఉన్న చోటుకి వచ్చారు. వీడియో తీయా ల్సిందిగా కుమార్తెకు చెప్పి తన సెల్‌ఫోన్ ఇచ్చారు. కొన్ని మాటలు నవ్వుతూ చెప్పిన అలీ, ఆపై ఫోన్ తీసుకుని, ఆమెను వెళ్లమని చెప్పారు. కుమార్తె వెనక్కు తిరిగిన వెంటనే ఫోన్ జేబులో పెట్టుకుని పిస్టల్‌తో తలపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చుకున్నారు. కుడి చెవిపై నుంచి దూసుకుపోయిన తూటా ఎడమ వైపు నుంచి బయటకు వచ్చేసింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అలీ కుటుంబీకులకు అప్పగించారు. కాగా, ఫజల్ అలీ తండ్రి ఇబ్రహీం అలీ కూడా గతంలో హైదరాబాద్‌లో ఏఆర్ ఎస్ఐగా పనిచేశారు. ఆయన కూడా ఇలాగే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంతో 1986లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ ఫజల్ మృతి పట్ల మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫజల్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ఎంత కష్టం వచ్చిందమ్మా!
పెనుబల్లి/గచ్చిబౌలి/మల్లాపూర్/ఎడపల్లి (బోధన్)/ఖలీల్‌వాడి (నిజామాబాద్ అర్బన్): భర్తల వేధింపులు.. ఆర్థిక ఇబ్బందులు.. కారణం ఏదైతేనేం.. క్షణికావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మహిళలు ఆత్మహత్యకు యత్నించారు. వారిలో ఇద్దరు తల్లులు, ఓ కుమార్తె కన్నుమూయగా పిల్లలతో కలసి చెరువులో దూకిన మరో ఇద్దరు తల్లులను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఓ బాలుడి ఆచూకీ గల్లంతైంది. మరో ఘటనలో అనారోగ్యం కారణంగా కుమార్తెతో కలసి భార్య, భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో... ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తల్లీకూతురు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మణికొండలోని ఆంధ్రా బ్యాంకు సమీపంలో నివసించే బుడ్డోలు సదానందానికి భువనగిరి జిల్లా కాటేపల్లికి చెందిన అలివేలుతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి కూతురు లాస్య (14), కుమారుడు మణికంఠ (11) ఉన్నారు. సదానందం ఖాళీగా ఉంటుండగా కోవిడ్ లాక్‌డౌన్‌కు ముందు వచ్చే ఇంటి అద్దెలు కాస్తా బందువులతో ఏర్పడిన వివాదాలతో నిలిచిపోయాయి. దీంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. డబ్బులేక పిల్లలను చదువు కూడా మాన్పి0చారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలివేలు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సమస్యల నుంచి బయటపడేయాల్సిందిగా దేవుడిని ప్రార్థించి రావాలంటూ భర్తను యాదగిరిగుట్టకు పంపింది. అనంతరం అర్ధరాత్రి వేళ ఓ బెడ్రూంలో తొలుత కుమార్తెకు ఉరేసి, ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక వంటింట్లో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున లేచిన కుమారుడు తల్లి, అక్కను విగతజీవులుగా చూసి వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు. చేతిపై గోరింటాకు..! ఆత్మహత్మకు ముందు అలివేలు, లాస్య గోరింటాకు పెట్టుకున్నారు. లాస్య చేతిపై గోరింటాకు కోన్‌తో ‘డూ సమ్‌థింగ్ దట్ మేక్ యూ హ్యాపీ’అని రాసుకుంది. అదేవిదంగా తల్లీ, కూతురు ఇద్దరూ ‘ది గేమ్ ఈజ్ స్టార్టెడ్’అని గోరింటాకుతో రాసిన వ్యాఖ్యలు ఉండటంతో పోలీసులు ఇవి ఎందుకు రాసుకున్నారో...? అనే అంశంపై కూడా విచారణ చేస్తున్నారు. కాగా, అలివేలు, లాస్య ఆత్మహత్య చేసుకున్న ఇంట్లో మరో ఉరితాడు వేలాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కుమారుడికి కూడా ఉరివేయాలని తల్లి భావించి ఉంటుందని పోలీసులు బావిస్తున్నారు.కానీ కుమారుడు బెడ్రూమ్లో నిద్ర పోతుండడంతో ఈ ప్రయత్నాన్ని విరమించుకొని ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అలివేలు ఆత్మహత్యకు ముందు తన సెల్‌ఫోన్, బట్టలను ఇంట్లోనే తగలబెట్టింది. తల్లీకుమార్తెల మానసిక స్థితి సరిగ్గా లేదని.. కరోనా కాలం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారని రాయదుర్గం ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. లైవ్‌లో ఆత్మహత్య... భర్త వేధింపులు తట్టుకోలేక.. ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారానికి చెందిన సనా (29) రాజస్తాన్‌కు చెందిన హేమంత్ పటియాల (డిజె మ్యూజిక్ అపరేటర్) 5 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్ల వరకు వారి వైవాహిక జీవితం బాగానే కొనసాగింది. బాబు పుట్టాక వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. సనాను భర్త హేమంత్‌తోపాటు వారి అత్తమామలు వేధించసాగారు. దీంతో గతంలో పలుమార్లు పోలీసులకు హేమంత్పై సనా ఫిర్యాదు చేశారు. సైప్రస్ దేశానికి వెళ్లిన హేమంత్ గత 5 నెలలుగా సనాను ఫోన్లో వేధిస్తూనే ఉన్నాడు. దీంతో మంగళవారం నాచారంలోని ఇంట్లో సనా ఫేస్బుక్ లైవ్ పెట్టి ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్మ చేసుకుంది. సనాకు 3 ఏళ్ల బాబు ఉన్నాడు. పిల్లలతో సహా చెరువులో దూకిన అక్కాచెల్లెళ్లు ముగ్గురు పిల్లలతో సహా అక్కాచెల్లెళ్లు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా అందులో బాలుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అశోక్ సాగర్ (జానకంపేట చెరువు) వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన లక్షి్మ, మోహన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. మోహన్‌కు కొత్త కలెక్టరేట్ సమీపంలో 2 వేల గజాల స్థలం ఉంది. ఆ స్థలంలో కొంత భాగాన్ని పెద్ద కూతురుకు అమ్మి రెండో కూతురు అక్షయ, మూడో కూతురు నిఖితలకు వివాహం చేశాడు. అక్షయ వివాహం హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌తో, నిఖిత వివాహం మెదక్‌కు చెందిన మహేశ్‌తో జరిగింది. వివాహ సమయంలో చెరో 200 గజాల స్థలాన్ని వారికి కానుకగా ఇచ్చారు. కొంతకాలంగా హేమంత్, మహే‹Ùలు ఇంటి స్థలం అమ్మి డబ్బులు తీసుకురావాలని భార్యలను వేధిస్తున్నారు. అయితే ఈ ప్లాట్లకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని తెలిసింది. అక్షయ, నిఖితలపై వేధింపులు ఎక్కువ కావడంతో వారిద్దరూ మూడు రోజుల క్రితం పిల్లలతో కలసి పుట్టింటికి వచ్చారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని గురువారం ఉదయం నిఖిత తన పిల్లలైన భవశ్రీ, శ్రీమాన్, అక్షయ తన కుమారుడైన చిన్నా (3) అలియాస్ భువనేశ్వర్‌ను తీసుకొని ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్ వద్దకు చేరుకున్నారు. ముందుగా పిల్లలను నీటిలోకి తోసి తర్వాత నిఖిత, అక్షయ కూడా దూకారు. ఆ సమయంలో రోడ్డుపై అటుగా వెళ్తున్న షేక్ హైదర్ అనే వ్యక్తి చెరువులోకి దూకి నిఖిత, అక్షయలతోపాటు భవశ్రీ, శ్రీమాన్లను రక్షించాడు. మూడేళ్ల చిన్నా ఆచూకీ లభించలేదు. కేన్సర్ నుంచి భార్య కోలుకోదేమోనని.. భార్యకు కేన్సర్ ఉందని నిర్ధారణ కావడంతో భర్త తల్లడిల్లాడు. భార్యకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని.. తామిద్దరం లేకపోతే కూతురు భవిష్యత్తు ఏమిటనే భయంతో కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40)కు భార్య సుహాసిని (35), కుమార్తె అమృత (16)తోపాటు కుమారుడు కార్తీక్ ఉన్నారు. కార్తీక్‌కు బీటెక్ సెకండియర్ పూర్తికాగానే బెంగళూరులోని హెచ్‌సీఎల్‌లో ట్రెయినీగా ఉద్యోగం రాగా అమృత ఇంటర్ పూర్తిచేసి ఇంజనీరింగ్ చదివేందుకు సిద్ధమవుతోంది. నెలన్నర క్రితం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సుహాసినికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు గర్భసంచిలోని కణతిని తొలగించారు. ఈ క్రమంలో శాంపిల్స్ హైదరాబాద్‌కు పంపగా అది కేన్సర్‌గా తేలింది. దీంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స కోసం వెళ్తామని కుమారుడు, బంధువులకు చెప్పారు. దీంతో కుమారుడు బెంగళూరు నుంచి గురువారం ఉదయం ఇంటికి రాగా, గుంటూరులో ఉంటున్న వెంకటకృష్ణారావు తమ్ముడు కూడా కొత్తకారాయిగూడెం వచ్చాడు. అనంతరం గురువారం సాయంత్రం వెంకటకృష్ణారావు, సుహాసిని దంపతులు కుమార్తె అమృతతో కలసి ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెబుతూ తిరువూరు బయలుదేరారు. కానీ మధ్యలోనే మూడు ప్లాస్టిక్ స్టూళ్లు, నైలాన్ తాడు, కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కొని స్వగ్రామంలో పొలం పక్కనే ఉన్న మామిడి తోటకు రాత్రి చేరుకున్నారు. ఆ సమయంలో వారిని గమనించిన గ్రామ స్తులు ఆరా తీయగా గేదెలను వెతకడానికి వెళ్తున్నట్లు చెప్పారు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి ఆత్మహత్య చేసుకున్నారు. -
దివాళా అంచున అమెరికా ఆర్ధిక వ్యవస్థ
-
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: కట్టుదిట్టమైన భద్రత ఉండే ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఆవరణలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. లాయర్ దుస్తుల్లో వచ్చిన కామేశ్వర్ సింగ్ అనే వ్యక్తి ఓ మహిళపై కాల్పులు జరిపి పరారయ్యాడు. దాంతో అంతా పరుగులు తీశారు. మహిళకు ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఆర్థిక విభేదాలే ఘటనకు కారణమని భావిస్తున్నామన్నారు. మాజీ లాయర్ అయిన నిందితుడు హరియాణా పోలీసులకు పట్టుబడ్డాడు. గత ఏడాది అతడిని ఢిల్లీ బార్ అసోసియేషన్ బహిష్కరించింది. ఆయన ఎం.రాధ(సుమారు 40 ఏళ్లు) అనే మహిళకు రూ.25 లక్షలు అప్పుగా ఇచ్చాడు. తిరిగివ్వకపోవడంతో చీటింగ్ కేసు పెట్టాడు. విచారణకు శుక్రవారం ఇద్దరూ కోర్టుకు వచ్చారు. 10.30 సమయంలో తగవుపడ్డారు. కామేశ్వర్ తన వెంట తెచ్చుకున్న తుపాకీతో రాధపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. రాధకు రెండు బుల్లెట్లు, పక్కనే ఉన్న లాయర్‌కు ఒక బుల్లెట్ తగిలాయి. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఢిల్లీలో సామాన్యులకు భద్రతే లేకుండా పోతుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. -
మార్చి 31 డెడ్‌లైన్: చేయాల్సిన కీలకమైన పనులు ఏంటో తెలుసా?
సాక్షి, ముంబై: అనేక కీలకమైన ఆర్థిక పనులకు మార్చి 31 తుది గడువు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31 చివరి రోజు లోపు ఈ పనులను పూర్తి చేయడంలో విఫలమైతే మన జేబుకు చిల్లు పడక తప్పదు. ఎలాంటి ఆర్థిక జరిమానాలు లేదా ఖాతాల డీయాక్టివేషన్ లాంటి ప్రమాదం లేకుండా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా పాన్ ఆధార్ లింకింగ్, పన్ను ప్రణాళిక లాంటికొన్ని ముఖ్యమైన పనులను ఒకసారి చూద్దాం. 2023, మార్చి 31 లోపు పూర్తి చేయాల్సిన పైనాన్షియల్ టాస్క్స్ ► పాన్ -ఆధార్ కార్డ్ లింక్: మార్చి 31 లోపు పాన్ ఆధార్ కార్డ్‌లను లింకింగ్ పూర్తి చేయాలి. లేదంటే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డ్ చెల్లదు. దీంతో ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఫైల్ చేయలేరు. ► అలాగే రూ. 1,000 ఫైన్. అంతేకాదు తప్పుడు లేదా చెల్లని పాన్‌ను కోట్ చేస్తే రూ. 10,000 జరిమానా . ► అప్డేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్: 2019-2020, AY 2020-21కి సంబంధించిన అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్‌ను 31 మార్చి 2023 లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసాక ఫైల్ చేయలేరు. ► ముందస్తు పన్ను చెల్లింపు: రూ. 10,000 కంటే పన్ను చెల్లించాల్సి ఉన్న చెల్లింపుదారుడు ముందస్తు పన్ను చెల్లించాలి. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు. అయితే, మూలధన లాభాలు వంటి అదనపు ఆదాయం ఉన్నా, ఉద్యోగాన్ని మార్చుకున్నా మీరు ముందస్తు పన్నును లెక్కించి చెల్లించాల్సి ఉంటుంది. ► 2022-2023కి సంబంధించిన మొత్తం ముందస్తు పన్నును మార్చి 15లోపు ఇంకా చెల్లించనట్లయితే, మార్చి 31, 2023లోపు చెల్లించే అవకాశం ఉంది. మార్చి తర్వాత, నెక్ట్స్ ఐటీఆర్ వరకు బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాలి. ► ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లయితే, అత్యధిక పరిమితి రూ. 1.5 లక్షలతో పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ► పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టండి: పీపీఎఫ్ సుకన్య సమృద్ధి యోజన, ఫిక్స్డ్ డిపాజిట్ ,ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ వంటి పన్ను ఆదా పథకాలలో పెట్టుబడుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచచ్చు ► ఫారమ్ 12బీ: ఉద్యోగం మారినట్టయితే వారు ఫారమ్ 12B పూరించడాన్ని మర్చిపోవద్దు. ► మ్యూచువల్ ఫండ్ నామినేషన్: సెబీ సర్క్యులర్ ప్రకారం, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వారు మార్చి 31 లోపు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయకపోతే ఖాతా బంద్ అవుతుంది. ► మార్కెట్ రెగ్యులేటరీ ప్రకారం మార్చి 31లోపు NSE NMF ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ నంబర్ , ఇమెయిల్ ఐడీని ధృవీకరించుకోవడం అవసరం. ► క్యాపిటల్ గెయిన్: ఇంతకుముందు ఈక్విటీలపై దీర్ఘకాలిక పన్ను రహితంగా ఉండేది. ఈక్విటీ ఫండ్‌పై దీర్ఘకాలిక మూలధన లాభం 1 లక్ష కంటే ఎక్కువ మొత్తంలో ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా పన్ను రేటు 10 శాతం. సో..పెట్టుబడులను రీడీమ్ చేయాలనుకుంటే పన్ను రహిత పరిమితి రూ. 1 లక్ష ప్రయోజనాన్ని పొందాలనుకుంటే మార్చి 31లోపు రిడీమ్ చేసుకోవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 శాతం ► ప్రధానమంత్రి వయ వందన యోజన: సీనియర్ సిటిజన్లు, రిటైర్ మెంట్ ఫండ్ కోసం ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి పలు ఆప్షన్స్ ఉన్నాయి ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు మార్చి 31, 2023 లోపు దీన్ని ప్రారంభిస్తే మంచింది. ► ఈ పాలసీలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల పథకంలో, పెట్టుబడిదారులు 7.4 శాతం చొప్పున పెన్షన్ పొందుతారు. ఈ పథకం కింద 10 సంవత్సరాల నిర్ణీత కాలానికి. రూ.9,250 నెలవారీ పెన్షన్ , రూ. 1.62 లక్షల కనీస పెట్టుబడిపై, నెలవారీ పెన్షన్ రూ. 1,000 వరకు వస్తుంది. -
కన్నీళ్లు తెప్పించే ఘటన.. నీవు లేక నేను లేను..
అమలాపురం టౌన్: భార్య మృతిని తట్టుకోలేని భర్త కొద్దిసేపటికే బలవన్మరణానికి పాల్పడ్డాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలోని కొంకాపల్లిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటన కలకలం రేపింది. పట్టణ ఇన్చార్జి సీఐ వీరబాబు, స్థానికుల కథనం ప్రకారం.. కొంకాపల్లిలో భార్యాభర్తలు బోనం తులసీలక్ష్మి(45), శ్రీరామ విజయకుమార్(47) ఇంట్లోనే కొద్ది నిమిషాల తేడాలో మృతి చెందారు. ఓఎన్జీసీ సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న విజయకుమార్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. భార్య తులసీలక్ష్మికి మూడు నెలల కిందట మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగి, అనారోగ్యంతో అవస్థలు పడుతోంది. శనివారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నిద్రపోయారు. తెల్లవారుజామున తులసీలక్ష్మి బెడ్ రూమ్‌లో మంచంపై విగతజీవిగా ఉంది. ఆమె మరణాన్ని భర్త విజయకుమార్ తట్టుకోలేకపోయాడు. అప్పటికే ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతున్న అతనికి భార్య మృతి మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై తన ఇంటి రెండో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి కుమారుడు కృష్ణ విజయవాడలో ఇంటర్ చదువుతున్నాడు. తల్లిదండ్రుల మరణవార్త తెలియడంతో అతడు విజయవాడ నుంచి హుటాహుటిన వచ్చి.. అమ్మానాన్నల మృతదేహాలపై పడి ఏడ్వడం అందరినీ కలచివేసింది. తులసీలక్ష్మి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ వీరబాబు తెలిపారు. -
మాంద్యం ముప్పు ఎవరికి?
నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త! ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే! ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు). ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు. పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది? అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్‌గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో! రంగనాయకమ్మ, ప్రముఖ రచయిత్రి -
అద్దె ఇంట్లో ఉండేవాళ్లం, రెంట్ కట్టలేక 2 నెలలకో ఇల్లు మారేవాళ్లం: రష్మిక
అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి రష్మిక మందన్నా. కోట్లలో పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ బ్యూటీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుని ఇటీవల బాలీవుడ్‌కు పరిచయమైంది. అక్కడ నటించిన గుడ్ బై చిత్రం నటిగా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టినా ఆశించిన విజయాన్ని మాత్రం సాధించలేదు. ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న మరో రెండు చిత్రాలపైనే ఈ భామ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే తెలుగులో నటించనున్న పుష్ప-2 మినహా మరో చిత్రం లేదు. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! ఇక కోలీవుడ్ లోనూ విజయ్‌తో జతకడుతున్న వారీసు చిత్రం ఈమెకు చాలా కీలకం. ఇక్కడ ఈ చిత్రం విజయం రషి్మకకు చాలా అవసరం. కారణం కోలీవుడ్‌లో కార్తీకి జంటగా పరిచయం అయిన సుల్తాన్ చిత్రం ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే ఆర్థికంగా ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. తండ్రి కూడా వ్యాపార రంగంలో సంపాదిస్తున్నారు. ఆ మధ్య ఆయన ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు కూడా జరిగాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే రష్మిక మందన్నా జీవితంలో పేదరికం అనే మరో కోణం కూడా ఉందట. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు మాతృభాష (కన్నడం)లో కిరిక్ పార్టీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన రష్మిక బాల్యం భారంగానే సాగిందట. ఆదిలో కుటుంబ జీవితం కష్టంగా ఉండేదట. ఈ విషయాన్ని రష్మికే స్వయంగా చెప్పింది. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె తన బాల్యం రోజులను గుర్తు చేసుకుంది. తన చిన్నతనంలో కుటుంబం చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొందని, నాన్న ఆదాయం లేక చాలా కష్టాలు అనుభవించినట్లు చెప్పింది. ఇంటి అద్దె చెల్లించలేక రెండు నెలలకొకసారి ఇల్లు మారాల్సిన దుస్థితి ఉండేదని తెలిపింది. నాన్న తనకు ఒక బొమ్మను కూడా కొనివ్వలేకపోయారని తన బాల్య పేదరికాన్ని గుర్తు చేసుకుంది. -
Financial Crises: పేకమేడలు... ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
ఆర్థిక సంక్షోభం తాలూకు విశ్వరూపాన్ని శ్రీలంకలో కళ్లారా చూస్తున్నాం. కనీసం మరో డజనుకు పైగా దేశాలు ఈ తరహా ఆర్థిక సంక్షోభం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ప్రభుత్వాల అస్తవ్యస్త విధానాలు... ఇలా ఇందుకు కారణాలు అనేకం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి... అర్జెంటీనా అధ్యక్షుని నిర్వాకం పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. జూన్‌తో పోలిస్తే జులైలో ధరలు 6 శాతం పెరిగాయి. అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీలంక మాదిరిగానే ప్రజలు భారీగా రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్‌కు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. కరెన్సీ పెసో నల్ల బజారులో ఏకంగా 50 శాతం తక్కువ విలువకు ట్రెండవుతోంది. విదేశీ మారక నిల్వలు అడుగంటిపోతున్నాయి. బాండ్లు డాలర్‌కి 20 సెంట్లు మాత్రమే పలుకుతున్నాయి. కాకుంటే విదేశీ అప్పులను 2024 వరకు తీర్చాల్సిన అవసరం లేకపోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఊరట. ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ సామర్థ్యం మీదే ప్రజలు ఆశతో ఉన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధిపై ఒత్తిడి తెచ్చయినా దేశాన్ని రుణభారం నుంచి ఆమె గట్టెక్కిస్తారన్న అంచనాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసిన గాయం రష్యా దండయాత్రతో ఆర్థికంగా చితికిపోయింది. 20 వేల కోట్ల డాలర్ల పై చిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఈ సెప్టెంబర్‌లోనే 120 కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంది. అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా అండగా నిలుస్తూండటంతో అది పెద్ద కష్టం కాకపోవచ్చు. యుద్ధం ఇంకా కొనసాగేలా ఉండటంతో మరో రెండేళ్ల పాటు అప్పులు తీర్చకుండా వెసులుబాటు కల్పించాలని కోరే అవకాశముంది. ఉక్రెయిన్ కరెన్సీ హ్రిన్వియా విలువ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ నిత్య సంక్షోభం మన దాయాది దేశం కూడా చాలా ఏళ్లుగా అప్పుల కుప్పగా మారిపోయింది. విదేశీ మారక నిల్వలు కేవలం 980 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ సొమ్ముతో ఐదు వారాలకు సరిపడా దిగుమతులు మాత్రమే సాధ్యం. గత వారమే అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఆర్థిక ఒప్పందం కుదుర్చుకున్నా చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవడంతో గంప లాభం చిల్లి తీసిన చందంగా మారింది. కరెన్సీ విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశ ఆదాయంలో ఏకంగా 40% తీసుకున్న వడ్డీలకే పోతోంది. విదేశీ నిల్వల్ని పెంచుకోవడానికి మరో 300 కోట్ల డాలర్లు అప్పు కోసం సిద్ధమైంది. ఇలా అప్పులపై అప్పులతో త్వరలో మరో లంకలా మారిపోతుందన్న అభిప్రాయముంది. ఈజిప్టు అన్నీ సమస్యలే ఈ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం ఆర్థికంగా కుంగదీసింది. గోధుమలు, నూనెలకు ఉక్రెయిన్‌పై ఆధారపడటంతో ధరలు విపరీతంగా పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి–రుణాల నిష్పత్తి 95 శాతానికి చేరింది! విదేశీ కంపెనీలెన్నో దేశం వీడుతున్నాయి. 1,100 కోట్ల డాలర్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లినట్టు అంచనాలున్నాయి. ఐదేళ్లలో 10 వేల కోట్ల డాలర్ల రుణ చెల్లింపులు చేయాల్సి రావడం కలవరపెడుతోంది. కరెన్సీ విలువను 15 శాతం తగ్గించినా లాభంలేకపోవడంతో ఐఎంఎఫ్‌ను శరణు వేడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెడుతోంది! దివాలా బాటన మరెన్నో దేశాలు ఈక్వడర్, బెలారస్, ఇథియోపియా, ఘనా, కెన్యా, ట్యునీషియా, నైజీరియా... ఇలా మరెన్నో దేశాలు ఆర్థిక సంక్షోభం ముంగిట్లో ఉన్నాయి. ఈక్వడర్ రెండేళ్లుగా రుణాలు చెల్లించే పరిస్థితిలో లేదు. ఘనా అప్పులకు వడ్డీలే కట్టలేకపోతోంది. నైజీరియా ఆదాయంలో 30 శాతం వడ్డీలకే పోతోంది. ట్యునీషియాది ప్రభుత్వోద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి! -
చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో
Rajkummar Rao Says He Bought A Jacket From Chor Bazaar: సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. అలా బాలీవుడ్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో రాజ్ కుమార్ రావు ఒకరు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజ్ కుమార్ కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'హిట్: ది ఫస్ట్ కేస్'. జులై 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి విజయంతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాలకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు రాజ్ కుమార్ రావు. 'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో మా కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేది. కానీ, అదిరిపోయే డ్రెస్‌తో పార్టీకి వెళ్లాలని ఉండేది. అంతేకాకుండా ఆ పార్టీలో నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను డ్యాన్స్ కూడా చేయాలి. అందుకే అప్పుడు నేను దిల్లీలోని చోర్ బజార్‌కు వెళ్లి రూ. 100 పెట్టి జాకెట్ కొనుక్కున్నా. అలాగే రూ. 15తో మెడలో చైన్ కొని పార్టీకి వెసుకుని వెళ్లా' అని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు ఈ హీరో. చదవండి: అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. మరణాన్ని ముందే ఊహించిన నటుడు !.. చివరి పోస్ట్ వైరల్ అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ -
మగవారిని గమనించండి.. దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు
ఇంట్లోని వారు ఎలా ఉన్నారో గమనించాల్సిన బాధ్యత మగవాడిదని సమాజం అంటుంది. కాని ఇంటి మగవాడు ఎలా ఉన్నాడో ఎవరు గమనించాలి? ఇటీవల పురుషులలో పెరుగుతున్న ఆత్మహత్యలు వారి ఒత్తిళ్లను పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020’ ప్రకారం దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 70 శాతం పురుషులవైతే 30 శాతం స్త్రీలవి. కోవిడ్ కాలపు అనారోగ్యం.. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగ బాధలు మగవారిని ఈ వైపుకు నెడుతున్నాయి. వారి గురించి కుటుంబం, సమాజం ఆలోచించాలి. మన దేశంలో రోజుకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో తెలుసా? రోజుకు దాదాపు 419. 2020లో మొత్తం ఎన్ని ఆత్మహత్యలు జరిగాయో తెలుసా? 1,53,052. వీటిలో పురుషుల సంఖ్య 1,08,532 (70 శాతం). స్త్రీలు 44, 498 (30 శాతం). అంటే స్త్రీల కంటే రెట్టింపు సంఖ్యలో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీలు సున్నిత స్వభావులు, భావోద్వేగాలకు తొందరగా లోనవుతారు అనుకుంటాము. కాని పురుషులే ఇప్పుడు సున్నితంగా ఉన్నారు. జీవితాన్ని ఎదుర్కొనలేకపోతున్నారని ఈ సర్వే మనకు తెలియచేస్తోంది. స్త్రీలైనా పురుషులైనా ప్రాణం అత్యంత విలువైనది. అయితే స్త్రీలు తమ ఆందోళనను ఏదో ఒక విధంగా బయటపెట్టి నలుగురికి తెలిసేలా చేస్తారు. కాని పురుషుడు తన లోలోపల అదిమి పెట్టుకుంటాడు. తీరా నష్టం జరిగిపోయాకే అతడి మనసులో ఎంత వత్తిడి ఉన్నదో మనకు తెలుస్తుంది. దీనిని బట్టి ఇంట్లోని భర్తను, తండ్రిని, సోదరులను గమనించుకోవాల్సిన బాధ్యత మిగిలిన కుటుంబ సభ్యులపై ఉందని తెలుస్తోంది. కోవిడ్ అనంతరం 2020 ప్రారంభంలోనే కోవిడ్ మహమ్మారి రావడం, ఫలితంగా నిరుద్యోగం, ఆర్థిక అభద్రత, మానసిక ఆందోళన... ఇవన్నీ పురుషుల ఆత్మహత్యలకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే దీని వెనుక సంఘం పెట్టిన ఇమేజ్ కూడా కారణమే. పురుషుడంటే సమర్థుడిగా ఉండాలి, ఎలాగైనా కుటుంబాన్ని పోషించాలి, తెగింపుతో ఉండాలి ఇలాంటి స్టీరియోటైప్ ఆలోచనలను ఇచ్చింది సంఘం. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దంది. కాని పురుషుడు ఒత్తిడిలో ఉంటే ఏం చేయాలి? కష్టం చెప్పుకుంటే చేతగానివాడనుకుంటే ఎలా? ఆత్మహత్య చేసుకోవడమేనా దారి? కొందరు పురుషులు అదే చేస్తున్నారు. పనిచేసే చోట అవమానాలు 2020లో పురుషులలో జరిగిన ఆత్మహత్యలను పరిశీలిస్తే పని ప్రదేశంలో అవమానాలు కూడా ఒక కారణం అని తెలుస్తోంది. ఆ సంవత్సరం పనిచేసేచోట అవమానాల వల్ల దేశంలో మొత్తం 1847 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో పురుషులు 1602 (87 శాతం). స్త్రీలు 234 (12 శాతం). అంటే రోజుకు సగటున ఐదు ఆత్మహత్యలు దేశంలో పని ప్రదేశంలో వేధింపుల వల్ల జరుగుతున్నాయి. వీటిలో మూడు నుంచి నాలుగు పురుషులవి. బాస్‌లు అవమానించడం, జీతాల పెంపులో తేడా, ప్రమోషన్లలో తరతమ భేదాలు ఇవన్నీ మగవాళ్లను కుంగదీసి ఆత్మహత్యల వైపు నెడుతున్నాయి. స్త్రీలకు లైంగిక వేధింపులు ప్రధాన కారణం అవుతున్నాయి. అలాగే పని దొరకడం లేదన్న బాధతో కూడా పురుషులు ఎక్కువ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భరోసా ఇవ్వాలి తండ్రి, భర్త, సోదరులతో మాట్లాడండి. వారి ఉద్యోగం, వ్యాపారం, వృత్తి... వీటిలో ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోండి. ఆరోగ్యం గురించి ఆరా తీయండి. సమస్య ఉంటే బలవంతంగానైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. ఆర్థిక సమస్యలు తెలుసుకోండి. అప్పులేమైనా ఉన్నాయా కూపీ లాగండి. పరిస్థితి ఎలా ఉన్నా వారి వల్ల ఏదైనా తప్పు జరిగి ఉన్నా నిందించకండి. నిలదీయకండి. సపోర్ట్ చేస్తామని చెప్పండి. ఒత్తిడి ఉంటే విశ్రాంతి తీసుకోమని చెప్పండి. ఉద్యోగం మారాలనుకుంటే మారమని, లేదంటే మానేసి కొంతకాలం బ్రేక్ తీసుకోమని, మరేం పర్వాలేదని దిలాసా ఇవ్వండి. మిత్రులతో, క్లోజ్‌ఫ్రెండ్స్‌తో మాట్లాడించండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం ప్రాణాంతకం. -
జీరో కోవిడ్ వ్యూహం తెచ్చిన తంటా...
Covid Mass Testing Mantra: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉన్న చైనా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే జీరో కోవిడ్ పాలసీని అనుసరించాల్సిందే అంటూ ప్రజలపై కఠినతర ఆంక్షలు విధించి నిర్బంధించింది. ఓ పక్క చైనా జీరో కోవిడ్ పాలసీ అట్టర్ ప్లాప్ అయ్యి కేసులు పెరిగిపోతున్నా చైనా అధికారులు మాత్రం జీరో కోవిడ్ వ్యూహం అంటూ పట్టుకుని వేళాడారు. ప్రపంచ దేశాలన్ని విమర్శిస్తున్న తన మాటే శాసనం అంటూ మూర్ఖంగా వ్యవహారించింది చైనా. ఈ జీరో కోవిడ్ పాలసీ పేరుతో చైనా ప్రజలందరికి పెద్ద ఎత్తున మాస్ కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. దీంతో ఇప్పుడూ చైనాలో పెద్ద కొండలా వైద్య వ్యర్థాలు పేరుకుపోయాయి. ప్రస్తుతం చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై, షెన్జెన్, టియాంజిన్‌లో ఇప్పుడు టెస్టింగ్ కియోస్క్‌ల వంటి వైద్య వ్యర్థాల నిలయంగా మారాయి. అదీగాక ఈ వ్యర్థాలను తొలగించాలంటే చైనా ప్రభుత్వం పై సుమారు పది బిలయన్ల డాలర్ల పైనే పెనుభారం పడుతుందని అధికారులు చెబుతున్నారు అసలే వరుస లాక్‌డౌన్‌తో దారుణమైన స్థితిలో ఉన్న చైనా ఆర్థిక పరిస్థితికి ఇదొక పెద్ద సవాలు అని అంటున్నారు. పైగా ఈ వైద్యవ్యర్థాలు తొలగించలేని విధంగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నాయని షాంఘైలోని న్యూయార్క్ పర్యావరణ నిపుణుడు యిఫీ లీ అన్నారు. అదీగాక చైనా 2060 నాటికల్లా కార్బన్ న్యూట్రల్‌గా మార్చాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా వాయు, జల కాలుష్యాన్ని సైతం అరికట్టే చర్యలు చేపట్టింది కూడా. కానీ ఇపుడూ ఈ కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వైద్యవ్యర్థాలను చూస్తుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యం అంటున్నారు చైనా అధికారులు. -
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్‌క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా..?'
సాక్షి, అనంతపురం: ‘అమ్మా ! నేను అందరిలా మళ్లీ బడికెళ్లగలనా? బాగా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటానమ్మా! ఎలాగైనా ఈ జబ్బు నయం చేయించు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంటున్న కుమార్తెను చూసిన తల్లిదండ్రుల వేదనకు అంతు లేకుండా పోతోంది. మళ్లీ ఆమెను మునుపటిలా చేయాలనే తపన వారికీ ఉంది. అయితే పేదరికం కారణంగా శస్త్రచికిత్స చేయించలేని స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. కాలికి పుండులా వ్యాపించి భరించ లేని నొప్పితో విలవిల్లాడుతున్న తమ కుమార్తెకు శస్త్ర చికిత్స చేయించే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషాలకు బ్రేక్ పడిందిలా! బుక్కరాయసముద్రం మండలం విరుపాక్షేశ్వర నగర్‌కు చెందిన పేరూరు పురుషోత్తం.. నగరంలోని ఓ ఫ్యాక్టరీలో దినకూలీగా పనిచేస్తున్నాడు. భర్తకు తోడుగా భార్య పుష్పావతి సైతం చిన్నాచితక పనులతో సంసారాన్ని గుట్టుగా నెట్టుకొస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి సంకీర్తన.. డిగ్రీ చదువుతోంది. చిన్నమ్మాయి సుప్రజ.. నగరంలోని పాతూరు కస్తూరిబా బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆనందంగా సాగిపోతున్న సుప్రజ జీవితాన్ని అంతుచిక్కని వ్యాధి కకావికలం చేసింది. గత ఏడాది చివర కాలుపై కురుపులాంటిది కనిపిస్తే వైద్యం చేయించారు. భరించరాని నొప్పితో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయిస్తే ‘బోన్ కాన్సర్ ’ అని తేలింది. అనంతపురం సర్వజనాస్పత్రితో పాటు, కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేయించారు. నయం కాలేదు. తిరుపతిలోని స్విమ్స్‌లో వైద్యం చేయించారు. ఫలితం దక్కలేదు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేయాలని... ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో రూ.8 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వైద్యులు సూచించారు. ఎక్కడ పది రూపాయలు తక్కువవుతుందని తెలిసినా గంపెడాశతో పరుగులు పెట్టిన ఆ కుటుంబానికి ప్రస్తుతం దిక్కు తోచలేదు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో బడికెళ్లి చదువుకోవాలనే తపన ఆ చిన్నారిలో మరింత ఎక్కువైంది. ఇలాంటి తరుణంలో తమ బిడ్డకు ప్రాణదానం చేసే ఆపన్న హస్తం కోసం నిరుపేద తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. దాతలు సంప్రదించాల్సిన చిరునామా పేరు : పేరూరు పురుషోత్తం ఫోన్ నంబర్ : 63035 59280 బ్యాంక్ ఖాతా నంబర్ : 1100 2614 0452 (కెనరాబ్యాంక్, సుభాష్‌రోడ్డు, అనంతపురం శాఖ) ఐఎఫ్ఎస్సీ కోడ్ : సీఎన్ఆర్బీ0000659 -
భార్యాభర్తల మధ్య వివాదం.... చిన్నారుల ఉసురు తీసిన ఆర్థిక ఇబ్బందులు
ఆర్థిక సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలతో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. క్షణికావేశంలో తల్లి తీసుకున్న నిర్ణయంతో అర్ధంతరంగా లోకం విడిచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. సాక్షి, రోలుగుంట: మండలంలోని జె.నాయుడుపాలెం గ్రామానికి చెందిన గడదాసు నాగరాజుకు ఆరేళ్ల క్రితం వడ్డిప గ్రామానికి చెందిన సాయితో వివాహం జరిగింది. వీరికి కుమార్తె భాను(4), కుమారుడు పృథ్వీరాజ్(2) ఉన్నారు. నాగరాజు ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బేరాలు తగ్గడంతో వీరికి ఏడాది కాలంగా ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో ఆదివారం రాత్రి వీరిద్దరి మధ్య తలెత్తిన గొడవ.. ఘర్షణకు దారితీయడంతో సాయి మనస్తాపం చెందింది. వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి యాదవుల వీధిలోని బావిలో తోసేసి.. తాను కూడా దూకేసింది. చివరి క్షణంలో ఆమె బావిలోని మెట్టును పట్టుకుని వేలాడుతూ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని ఆమెను, పిల్లలను బయటకు తీశారు. కానీ అప్పటికే ఇద్దరు చిన్నారులూ మృతి చెందారు. సాయి ప్రాణాలతో బయటపడింది. ఈ సమాచారం తెలుసుకున్న ఎస్ఐ నాగకార్తీక్ ఘటనాస్థలికి చేరుకొని.. తల్లి సాయితో పాటు స్థానికులను విచారించారు. తన భార్య తోసేయడం వల్లే పిల్లలు చనిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ తల్లిని బాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులే తనను ఈ ఘటనకు ప్రేరేపించాయని ఆమె పోలీసుల ఎదుట గొల్లుమంది. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మీలో ‘ఫైర్’ ఉందా..?
వృద్ధాప్యం పలకరించే వరకు (60 ఏళ్లు) సంపాదన కోసం పరుగులు పెట్టడం పాత తరం నమూనా.. 45–50 ఏళ్లకే ఆర్థిక స్వాతంత్య్రం సాధించడం.. 50–55 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకోవడం.. నేటి తరం కోరుకుంటున్న విధానం. సాధ్యమైనంత త్వరగా సంపాదించాలి. భారీగా కూడబెట్టాలి. ముసలితనానికి ముందే ఉద్యోగం లేదా వృత్తి జీవితానికి స్వస్తి చెప్పి మిగిలిన జీవితాన్ని మనసుకు నచ్చినట్టు పూర్తి సంతోషంగా రైడ్ చేయాలి. ఇలా అనుకునే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పుట్టుకొచ్చిందే ఫైర్ (ఎఫ్ఐఆర్ఈ). ఆ ఫైర్ మీలో ఉందా..? అందుకోసం ఏం చేయాలో చర్చించేదే ఈ కథనం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ (ఎఫ్ఐ)/రిటైర్ ఎర్లీ (ఆర్ఈ). ఫైర్ అంటే ఇదే. కావాల్సినంత ఆర్థిక స్వేచ్ఛ సాధించడం/ముందుగా రిటైర్ కావడం అన్నదే సంక్షిప్తంగా ఫైర్. జీవితాంతం కూర్చుని తినేందుకు సరిపడా, అన్ని అవసరాలను తీర్చేంత సంపదను వీలైనంత ముందుగా సమకూర్చుకోవడం ఇందులోని అంతరార్థం. ఒక ఉదాహరణ చూద్దాం. 30 ఏళ్ల వ్యక్తికి ప్రస్తుతం నెలవారీగా ఖర్చులు రూ.75,000గా ఉన్నాయని అనుకుందాం. అంటే ఏడాదికి జీవన ఖర్చు రూ.9 లక్షలు. అతని వద్ద రూ.18 లక్షల నిధి కూడా ఉంది. ఇక్కడి నుంచి ప్రతీ నెలా రూ.80,000 చొప్పున 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు నెలవారీ సిప్‌ను ఏటా 8 శాతం పెంచుతూ వెళ్లాడు. పెట్టుబడులు 12 శాతం రాబడి రేటు ప్రకారం వృద్ధి చెందాయని, ద్రవ్యోల్బణం 7 శాతంగా ఉందనుకుంటే.. అప్పుడు 45 ఏళ్ల వయసు వచ్చేసరికి రూ.7.2 కోట్లు సమకూరతాయి. ఆ సమయంలో అతని వార్షిక వ్యయాలు రూ.22.8 లక్షలకు చేరతాయి. అదే సమయంలో తన ఖర్చులకు 32 రెట్లు నిధి సమకూరి ఉంటుంది. దీన్ని కదపకుండా మెరుగైన రాబడినిచ్చే సాధనంలో మరో 5–10 ఏళ్లు కొనసాగించినా నిండు నూరేళ్లపాటు నిశ్చితంగా జీవించొచ్చు. ఫైర్‌లో పలు రకాలున్నాయి. ఇందులో ఏదో ఒక ఫైర్ ఉన్నా ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించొచ్చు. నార్మల్ ఫైర్ ఇప్పటి మాదిరే జీవితాంతం రాజీ లేకుండా జీవించడం. భవిష్యత్తులోనూ విహార యాత్రలు, ఖర్చులు, రెస్టారెంట్ భోజనాలు, వినోదం, వైద్యం అన్నింటి అవసరాలను తీర్చుకునేందుకు కావాల్సినంత సమకూర్చుకోవడం. 45 ఏళ్ల వ్యక్తి అప్పటి తన వార్షిక జీవన వ్యయానికి 35 రెట్ల సంపదను సమకూర్చుకుని ఉంటే ‘నార్మల్ ఫైర్’ సాధించినట్టు అర్థం చేసుకోవాలి. లీన్ ఫైర్ లీన్ ఫైర్ అంటే మీ ఖర్చులు, జీవన విధానంలో కొంత రాజీ పడడం. నార్మల్ ఫైర్‌తో పోలిస్తే కొంత సర్దుకుపోవడం. ఈ విధానంలో తక్కువ వ్యయాలతో జీవించేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో నార్మల్ ఫైర్‌ను సాధించడం సాధ్యం కాకపోవచ్చు. అటువంటప్పుడు ప్రస్తుత వ్యయాల్లో 75 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇది కూడా ఫైర్ కిందకే వస్తుంది. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయానికి 25–28 రెట్ల మేర సంపద కూడబెడితే లీన్ ఫైర్ సాధించినట్టుగా అర్థం చేసుకోవాలి. ఫ్యాట్ ఫైర్ లీన్ఫైర్కు విరుద్ధమైనదే ఫ్యాట్ఫైర్. రాజీకి చోటు లేకుండా రాజులా జీవించడం. అనుకున్నంత స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ జీవించడం. ఎందులోనూ రాజీపడక్కర్లేదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవక్కర్లేదు. ఈ తరహా ఫైర్ కోసం ఎక్కువ మొత్తమే కావాలి. 45 ఏళ్ల వ్యక్తి తన వార్షిక వ్యయాలకు 45–50 రెట్ల మేర నిధిని సమకూర్చుకోగలిగితే అతను ఫ్యాట్ఫైర్ సాధించినట్టే. ఇలా సమకూర్చుకున్నప్పుడు మిగిలిన జీవితాంతం 125–140 శాతం అధికంగా ఖర్చు చేస్తూ సాగిపోవచ్చు. కోస్ట్ ఫైర్ మిగిలిన జీవితానికి సరిపడా ముందుగా సమకూర్చుకోవడమే కోస్ట్ ఫైర్. దీంతో భవిష్యత్తులో ఎటువంటి అదనపు పెట్టుబడులు అవసరం లేకుండానే ఆ మొత్తం వృద్ధి మరింత వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యక్తి ప్రతీ నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నట్టయితే.. 50 ఏళ్లకు ఫైర్ సాధించడం కోసం అతను రూ.6 కోట్ల నిధిని సమకూర్చుకోవాలి. అటువంటి సందర్భంలో లక్ష్య సాధనకు ప్రతీ నెలా తన ఆదాయం నుంచి 60 శాతాన్ని (రూ.1.2 లక్షలను) పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఇలా చేస్తే మొదటి పదేళ్లలోనే 40 ఏళ్ల వయసు వచ్చేనాటికి రూ.2.5 కోట్లు సమకూరుతుంది. దీంతో రూ.6 కోట్ల లక్ష్యాన్ని తర్వాతి 10 ఏళ్లలో చేరుకునేందుకు అతను అక్కడి నుంచి రూపాయి కూడా అదనంగా ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. అప్పటి వరకు సమకూరిన రూ.2.5 కోట్ల నిధి ఏటా 10 శాతం రాబడినిచ్చే సాధనంలో ఉంచినా తదుపరి పదేళ్ల కాలంలో రూ.6 కోట్లు అవుతుంది. ముందే ఆర్థిక స్వాతంత్య్రాన్ని చేరుకుంటారు. దాంతో ఒత్తిడితో కూడిన పనిని విడిచిపెట్టి.. వేతనం తక్కువైనా నచ్చిన పనికి మారిపోవచ్చు. మీ ఫైర్ ఏది? తాము ఏ ఫైర్‌ను చేరుకుంటామన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. మీ సంపాదన, ఖర్చులు, జీవన స్థితిగతులు వీటన్నింటి పాత్ర ఉంటుంది. వీటన్నింటి మధ్య మీకున్న సౌకర్యం ఏపాటిది? ఆలోచించుకోవాలి. లీన్ఫైర్లో రాజీపడాల్సి ఉంటుంది. కొన్ని అంచనాలు, పరిస్థితులు మారినా అనుకున్నది నెరవేరకపోవచ్చు. అన్నింటిలోకి నార్మల్ ఫైర్ ఆచరణీయం. కనీసం లీన్ఫైర్తో ఆరంభించి.. కొన్నేళ్ల తర్వాత అయినా నార్మల్ ఫైర్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. మెరుగైన సంపాదన ఉండి, ఎక్కువ భాగాన్ని వెనకేసుకునే అవకాశం ఉన్నవారికి ఫ్యాట్ ఫైర్ ఆచరణీయం. ఫైర్ సాధిస్తే పని మానవచ్చా? అది మీ ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. కావాలనుకుంటే ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తికి అంతటితో విరా మం చెప్పేసుకోవచ్చు. ఒకవేళ చేస్తున్న పని బోర్‌గా అనిపించకపోతే.. ఒత్తిళ్లతో కూడుకున్నది కాకపోతే కొనసాగడమే మంచిది. దీనివల్ల అదనపు నిధి సమకూరుతుంది. అప్పుడు మీ జీవితానికి మరింత జోష్‌ను తెచ్చుకున్నట్టుగానే భావించాలి. ఇందంతా మీ ఇష్టా అయిష్టాలపై, మానసిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. ఫైర్ ఎందుకు అవసరం? 60 ఏళ్ల వరకు ఉద్యోగంలో కొనసాగడం అంటే కష్టమైన పనే. ప్రైవేటు రంగంలో 58 ఏళ్లకే తప్పుకోవాలి. పైగా ఉద్యోగ భద్రత పాళ్లు తక్కువ. ఆరోగ్యం అందరికీ సహకరించకపోవచ్చు. వృద్ధాప్యంలోనూ సంపాదించుకునే శక్తి ఉంటుందన్న భరోసా పని చేయకపోవచ్చు. ముందుగానే ఫైర్‌ను సాధిస్తే మీపై ఒత్తిడి తగ్గిపోతుంది. మీకు నచ్చినట్టు, మీదైన దారిలో సాగిపోయే స్వేచ్ఛ లభిస్తుంది. ఎవరో ట్యూన్‌కు మీరు డ్యాన్స్ కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అభద్రతా భావం నుంచి బయటకు వస్తారు. మీ డిమాండ్లపై పట్టుబట్టే ధైర్యం లభిస్తుంది. ఫైర్ అంత ఈజీనా..? కాదనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మనదేశంలో చాలా మంది 60 దాటిపోయిన తర్వాత కూడా సంపాదన కోసం శ్రమకోరుస్తూనే కనిపిస్తుంటారు. పైగా రిటైర్మెంట్ ప్రణాళిక విషయంలో చాలా మందిలో శ్రద్ధ కనిపించదు. దీంతో 60 వచ్చినా మిగిలిన జీవితానికి చాలినంత నిధి కనిపించదు. ఆర్థిక ప్రణాళికల్లేకుండా సాగిపోవడం వల్ల అసలు తత్వం అప్పుడు కానీ బోధపడదు. ఒకవేళ ముందుగా ఫైర్ సాధించినప్పటికీ అది మంచి రాబడుల వల్ల కాదు.. సంపాదనలో అధిక మొత్తాన్ని పొదుపు చేస్తూ రావడం వల్లే. అందుకే ఫైర్ ఉంటే కాదు.. దాన్ని సాధించే పక్కా ఆచరణ, ప్రణాళికలు కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి కీలకం.. ► వ్యయాలను అదుపులో పెట్టుకోవాలి. సంపాదనలో సాధ్యమైనంత తక్కువ వ్యయాలకే పరిమితం కావాలి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ అన్నది సంపద. ఆ సంపదకు సంపాదన, వ్యయ నియంత్రణ కీలకం. ► నెల సంపాదన రూ.2లక్షలు. చేస్తున్న వ్యయం రూ.25వేలు. అప్పుడు వ్యయాలకు ఎనిమిదిరెట్లు అధికంగా సంపాదిస్తున్నట్టు. ఇటువంటి వారు చాలా వేగంగా ఫైర్ సాధిస్తారు. ► కొందరికి వ్యయ నియంత్రణ సాధ్యపడదు. పైగా పోనుపోను జీవనశైలిని మరింత మెరుగు పరుచుకుంటూ జీవించేస్తారు. ఇటువంటి వారు ఫైర్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ► మంచి ఆదాయానికి బాటలు వేసుకోవాలి. ► ఆదాయం నుంచి కనీసం 60 శాతాన్ని అయినా ఆదా చేసుకుని ద్రవ్యోల్బణాన్ని మించి అధిక రా బడులను ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ► రాబడులు అంచనాలను అందుకోకపోతే, ద్రవ్యోల్బణం అనుకున్నదానికంటే ఎక్కువే ఉంటే ఫైర్ కష్టంగా మారుతుంది. ► దుబారాకు దూరంగా ఉండి, సాధారణ జీవితం గడపాలి. అలా అని ఆనందం, కోర్కెల విషయంలో రాజీపడొద్దు. ► ఫైర్ సాధించిన తర్వాత.. వాటిపై క్రమం తప్పకుండా రాబడులు వచ్చేలా (క్యాష్ ఫ్లో) ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ఉండాలి. పెట్టుబడులు ఇరుక్కుపోయే వాటిల్లో ఉంచొద్దు. ► ఎవరికివారు తమకు అనుకూలమైన ఫైర్ దిశగా అడుగులు వేసేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. ఈ విషయంలో స్పష్టత కోసం ఆర్థిక సలహాదారుల సేవలు తీసుకోవడం సూచనీయం. -
కమర్షియల్ పైలట్‌గా ఎంపికైన కరీంనగర్ విద్యార్థిని.. రూ.4 లక్షల కోసం..
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): పేదింటిలో పుట్టినా తన చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది.. డిగ్రీ పైనలియర్ చదువుతూనే పైలట్ కావాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేసింది.. కాంపిటీటివ్ పరీక్ష రాసి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. కానీ ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది కేశవాపూర్‌కు చెందిన పాతకాల స్పందన. వివరాల్లోకి వెళ్తే.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ గ్రామానికి చెందిన పాతకాల సదయ్య–రమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు స్పందన వరంగల్‌లోని సోషల్ వెల్ఫేర్ డీగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతూ ఎలాగైనా పైలట్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్ష రాసింది. అందులో సత్తా చాటి, కమర్షియల్ పైలట్‌గా ఎంపికైంది. శిక్షణ కోసం బేగంపేటలోని తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో చేరింది. కానీ పూర్తి శిక్షణ కోసం రూ.4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిసి, కూలి పని చేసుకునే తన తల్లిదండ్రులకు అంత మొత్తం చెల్లించలేరని ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి, ఆర్థికసాయం చేస్తే పైలటవుతానని వేడుకుంటోంది. -
మెతుకుసీమలో రక్తపు మరకలు.. 12 నెలల్లో 18 హత్యలు
సాక్షి, మెదక్: పచ్చటి పంట పొలాలతో కళకళలాడే మెతుకుసీమలో రక్తపు మరకలు అలజడి సృష్టిస్తున్నాయి. మానవత్వాన్ని మరిచి పైశాచికత్వంతో హత్యలకు తెగబడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, భూ వివాదాలే ఘటనలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. న్యాయస్థానాలు చట్టాలను కఠినతరం చేస్తూ దోషులను శిక్షిస్తున్నప్పటికీ మార్పు అనివార్యమవుతుంది. జిల్లాలో 12 నెలల్లో జరిగిన 18 హత్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుస హత్యలపై సాక్షి ప్రత్యేక కథనం.. ►జిల్లావ్యాప్తంగా 21 మండలాలు 469 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 21 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఇందులో ఎస్పీ, ఏఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఒక్క ఏఆర్ డీఎస్పీ, 57 మంది సీఐ, ఎస్ఐలు, సుమారు 800 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ►మూడేళ్లుగా పోలీస్ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 64 హత్య కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 2019లో 19, 2020లో 27, 2021 ఇప్ప టి వరకు 18 హత్య కేసులు నమోదయ్యాయి. ►ఈ హత్య కేసుల్లో ఎక్కువగా ఆర్థికలావాదేవీలు, అక్రమ సంబంధాలు, భూవివాదాలు, ప్రేమ వివాదాలే కారణాలుగా నిలిచాయి. ►రూ.200 మొదలుకొని రూ. 2కోట్ల వరకు జరిగిన లావాదేవీల్లో హత్యలకు దారితీశాయి. ►భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలు, కులాంతర వివాహాలు వంటి పలు కారణాలు హత్యలకు ఆజ్యం పోస్తున్నాయి. ►నేరాలకు పాల్పడే వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు సినీ ఫక్కీని తలపించాయి. పథకం ప్రకారమే నేరాలకు తెగబడుతూ హత్య ఒక చోట చేసి శవాన్ని మరొకచోట పడేయటం, మృతదేహాన్ని గుర్తు పట్టలేనంతగా ఛిద్రం చేయడం వంటివి ఇటీవల జరిగిన ఘటనల్లో ఎక్కువగా వెలుగుచూశాయి. ►నిందితులు ఎంతో పకడ్బందీగా నేరాలకు పాల్ప డుతున్నప్పటికీ అధునాతన సాంకేతికత ఆధా రంగా పోలీసులు నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు: ►2019 అక్టోబర్ 26న ఓ గుర్తు తెలియని మహిళను హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం సమీపంలో పడేశారు. ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. ►ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన హవేళిఘనపూర్ మండలం బూరుగుపల్లి గేట్ వద్ద కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన గడ్డి హనుమంతును కేవలం రూ.30 వేల అప్పు వివాదంలో అతడి సన్నిహితుడు బండ రాయితో కొట్టి అతికిరాతంగా హతమార్చాడు. ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని రిమాండ్ చేశారు. ►ఈ ఏడాది ఆగస్టు 9 అర్ధరాత్రి వెల్దుర్తి మండలం మంగళపర్తి–యశ్వంతరావుపేట సమీపంలో మెదక్ పట్టణానికి చెందిన «బీజేపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్(కటికె శ్రీను) ను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చి, కారుతో సహా నిప్పంటించి దహనం చేశారు. జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ►అదే రోజు మెదక్ మండలం మంబోజిపల్లి వద్ద గ్రామానికి చెందిన బోల సిద్ధయ్యను కేవలం రూ. 200 కోసం ఎలాంటి పరిచయం లేని హవేళిఘనపూర్ మండలం ఫరీద్‌పూర్‌కు చెందిన ఓ తాగుబోతు పదునైన బండ రాయితో కొట్టి చంపేశాడు. మృతుడి వద్ద నుంచి రూ. 1200లతో పాటు సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ►ఆగస్టు 27వ తేదీన కొల్చారం మండలం మెదక్–నర్సాపూర్ ప్రధాన రహదారిలో లోతు వాగు వద్ద 30 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా చంపేసి గుర్తు పట్టేందుకు వీలు లేకుండా కాలి్చవేశారు. ►అక్టోబర్ 21న కామారెడ్డి జిల్లా బిక్కనూర్ గ్రామానికి చెందిన మల్లయ్య మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడనే కారణంతో కుటుంబీకులే హత్య చేశారు. మెదక్–రామాయంపేట ప్రధాన రహదారిలో శమ్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలోని నీటి కుంటలో పడేశారు. పోలీసుల విచారణలో మృతుడి భార్య ఎల్లవ్వ, కూతురు రాణి, అల్లుడు రాజమల్లు ముగ్గురు కలిసే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోలేరు నేరం చేసే ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు, వివాహేత సంబంధాలు, కుటుంబ తగాదాలే హత్యలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. కక్ష్యపూరిత నిర్ణయాలతో విచక్షణను కోల్పోయి పథకం ప్రకారం హత్యలు చేస్తున్నారు. ప్రతీ కేసును సవాల్‌గా తీసుకొని దర్యాప్తు ప్రారంభించిన 24 గంటల్లోనే పురోగతి సాధిస్తున్నాం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నాం. – చందనాదీప్తి, ఎస్పీ, మెదక్ -
ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్ రాసి..
సాక్షి,జవహర్‌నగర్( హైదరాబాద్): ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌లో హనుమండ్ల రామకృష్ణ (38) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. రామకృష్ణ 18 సంవత్సరాల క్రితం రాజ్యలక్ష్మిని ప్రేమవివాహం చేసుకుని సాఫీగా జీవనం సాగిస్తున్నాడు. ఓ కంపెనీలో డెవలివరీ బాయ్‌గా పనిచేసే రామకృష్ణకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. రామకృష్ణ తండ్రి మరణించడంతో అతని అంత్యక్రియలకు కొంత మంది వద్ద అప్పులు తీసుకున్నాడు. అంతేకాకుండా కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. దీంతో రామకృష్ణ అత్తగారింటికి వచ్చి రూ.5లక్షల అప్పు అయిందని వాటిని తీర్చడం కష్టంగా ఉందని లెటర్ రాసి పెట్టి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం వెతికినీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమను అంగీకరించలేదు.. కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే.. -
పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి ..మూడు రోజుల పసికందుని..
ముంబై: పేదరికంతో అల్లాడిపోతున్న ఓ తల్లి తన పసికందును రూ 1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మహిళకి సహకరించిన మరో నలుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... షిర్డీ పట్టణానికి చెందిన 32 ఏళ్ల మహిళ పేదరికంతో బతుకు భారంగా జీవనాన్ని కొనసాగిస్తోంది.ఈ క్రమంలో ఆమె సెప్టెంబరులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదని బాధపడుతూ చివరికి ఆ పాపని అమ్మలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అహ్మద్‌నగర్, థానేలో ఒకరు పొరుగున ఉన్న ముంబైలోని ములుండ్‌కు చెందిన ముగ్గురు మహిళలు పాప విక్రయానికి ఆ మహిళకు సహకరించారు. ఆ వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తిచేయకుండానే వారు రూ 1.78 లక్షలకు శిశువను విక్రయించారు. ఈ విషయమై సమాచారం అందడంతో వ్యక్తి ఇంటిపై దాడులు చేపట్టగా శిశువు కనిపించాడు. దీంతో నేరానికి పాల్పడిన పసిబిడ్డ తల్లి సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చదవండి: భార్య కేసు పెట్టడంతో భర్త ఆత్మహత్య -
టిఫిన్ చేయడానికి వెళ్లి..
సాక్షి,హైదరాబాద్: టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చెంగిచర్ల ఎం ఎల్ ఆర్ కాలనీలో నివసించే ముద్ధం శ్రీనయ్య గౌడ్ ( 51) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గత కొన్ని రోజులుగా బాధ పడుతున్నాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్తున్నానీ ఇంట్లో చెప్పి ఎంతకీ రాకపోవడంతో కుమారుడు సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో ఘటనలో.. వృద్ధుడి అదృశ్యం జగద్గిరిగుట్ట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీ సమీపంలోని విజయనగర్ కాలనీకి చెందిన వీరయ్య(66) ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు దేవాలయానికి వెళ్లొస్తానని చెప్పి అతడి మొబైల్ ఫోన్‌ను ఇంటి వద్దే మరిచి వెళ్లాడు. అయితే సాయంత్రమైనా వీరయ్య ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియ రాలేదు. ఈ మేరకు మంగళవారం వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ‘నేను వెళ్లిపోతున్నా..తమ్ముడిని బాగా చూసుకోండి’ -
ఆర్థిక లావాదేవీల వల్లే లైన్‌మన్ బంగార్రాజు హత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి లైన్‌మన్ మొల్లి బంగార్రాజు (45) హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని డీసీపీ–1 గౌతమి సాలి చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఆమె వెల్లడించారు. డీసీపీ–1 తెలిపిన మేరకు.. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని బంగార్రాజు మధ్యవర్తిగా రూ.30 లక్షల వరకు వసూలు చేసి కోరాడ గోవిందరావుకు ఇచ్చాడు. రెండేళ్లవుతున్నా ఉద్యోగాలు రాకపోయేసరికి నిరుద్యోగులు నిలదీస్తుండటంతో బంగార్రాజు.. గోవిందరావుపై ఒత్తిడి తెచ్చాడు. బంగార్రాజు అడ్డు తొలగించుకుంటే బాధితులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన గోవిందరావు ఈ హత్య చేశాడు. శవాన్ని మాయం చేసేందుకు ఇద్దరికి రూ.లక్ష వరకు సుపారీ ఇచ్చాడు. ఈ ముగ్గుర్నీ పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగింది ఇలా.. భీమునిపట్నం మండలం నమ్మివానిపేటకు చెందిన బంగార్రాజు అక్టోబర్ 31వ తేదీన ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. తరువాత అతడు ఇంటికి రాకపోవడంతో ఈనెల 3వ తేదీన అతడి భార్య నందిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగార్రాజుతో ఎక్కువగా ఆర్థిక లావాదేవీలున్న కోరాడ గోవిందరావు, కోరాడ లక్ష్మణరావు, పైడిరాజు, వెంకటేశ్‌లపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నార్త్ ఏసీపీ శ్రీనివాసరావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అక్టోబర్ 31న కోరాడ గోవిందరావు ఒక్కరే హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. అక్టోబర్ 31న బంగార్రాజుకు గోవిందరావు ఫోన్‌చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిర్మాణంలో ఉన్న కోరాడ లక్ష్మణరావు గెస్ట్‌హౌస్‌కు వెంటనే రమ్మని చెప్పాడు. కూలీలంతా భోజనాలకు వెళ్లిన ఆ సమయంలో గోవిందరావు కరెంటు సరఫరా ఆపేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశాడు. డబ్బుల కోసం వచ్చిన బంగార్రాజును ఇనుపరాడ్‌తో తలపై, వీపుపై కొట్టి చంపేశాడు. మృతదేహాన్ని దాచిపెట్టి బయటకు వెళ్లిన గోవిందరావు ఆది అనే వ్యక్తి మొబైల్ నుంచి ఫోన్ చేయడంతో పైడిరాజు, సంతోష్ వచ్చారు. మృతదేహాన్ని కనిపించకుండా చేస్తే రూ.లక్ష ఇస్తానని వారితో గోవిందరావు బేరం కుదుర్చుకుని అడ్వాన్స్‌గా రూ.7 వేలు ఇచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో వారు మృతదేహాన్ని పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీ ఏనుగులపాలెంలోని పొలంలోకి తీసుకెళ్లి రేకు కప్పి ఉంచారు. ఒకటో తేదీన బోని వాటర్ వర్క్స్ వద్ద బంగార్రాజు మోటార్ బైక్ లాక్ చేసి దాచారు. పొలం వెళ్లిన రైతులు దుర్వాసన రావడంతో పరిశీలించి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బంగార్రాజు మధ్యవర్తిగా వసూలు చేసిన రూ.30 లక్షలను గోవిందరావు వాడుకున్నట్లు డీసీపీ–1 తెలిపారు. కొందరి అప్పులు తీర్చినట్లు తేలిందని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీలు సీహెచ్ శ్రీనివాసరావు, పెంటారావు, శ్రావణ్‌కుమార్, మూర్తి, శిరీష, సీఐలు పాల్గొన్నారు. -
ఆటో ‘మొబైల్’కు బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలకు ఊపిర్లూదే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది. టెలికం రంగంలో భారీ సంస్కరణలకు తెర తీస్తూ టెల్కోలకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించింది. ఆపరేటర్లు చెల్లించాల్సిన బకాయిలపై నాలుగేళ్ల దాకా మారటోరియం విధించడం, ఏజీఆర్ (సవరించిన స్థూల ఆదాయం) నిర్వచనాన్ని సవరించడం, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు తొలగించడం, టెలికం రంగంలో ఆటోమేటిక్ విధానం ద్వారా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించడం తదితర చర్యలు ఇందులో ఉన్నాయి. కేంద్ర కేబినెట్ బుధవారం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసింది. వ్యవస్థాగతంగా తొమ్మిది సంస్కరణలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. టెల్కోల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడేందుకు ఈ ప్యాకేజీ తోడ్పడగలదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఉపాధి, పోటీకి ఊతం: టెలికం మంత్రి వైష్ణవ్ ‘‘టెలికం పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, కస్టమర్లకు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచేందుకు, కొత్త సంస్థలు వచ్చేలా దారి ఏర్పర్చేందుకు తొమ్మిది వ్యవస్థాగతమైన సంస్కరణలను కేబినెట్ ఆమోదించింది’’ అని కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. 5జీ స్పెక్ట్రం వేలం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీలో..: సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) నిర్వచన పరిధి నుంచి టెలికంయేతర ఆదాయాలను మినహాయించారు. ఇది .. ఇక నుంచి అమలవుతుంది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట శాతాన్ని టెలికం కంపెనీలు.. కేంద్రానికి చట్టబద్ధమైన సుంకాల రూపంలో కట్టాల్సి ఉంటుంది. టెలికంయేతర ఆదాయాలను కూడా ఏజీఆర్‌లో కలపడం వల్ల వొడాఫోన్ ఐడియా వంటి టెల్కోలు కట్టాల్సిన బాకీలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీంతో అవి దివాలా తీసే పరిస్థితికి చేరుకున్నాయి. తాజాగా టెలికంయేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయించడంతో టెల్కోలకు ఊరట లభిస్తుంది. మరోవైపు, ప్రభుత్వానికి టెల్కోలు గత బాకీలను చెల్లించేందుకు నాలుగేళ్ల దాకా మారటోరియం (వార్షిక చెల్లింపులను వాయిదా వేసుకునే వీలు) ఇవ్వడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, ఈ వ్యవధిలో స్వల్పంగా వడ్డీ కట్టాల్సి ఉంటుంది. టెలికంలో ఆటోమేటిక్ మార్గంలో 100%ఎఫ్‌డీఐలకు అనుమతినిచ్చారు. ఇప్పటిదాకా ఇది 49%గానే ఉంది. దానికన్నా మించితే ప్రభుత్వ అనుమతి ద్వారా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటోంది. ► స్పెక్ట్రం యూజర్ చార్జీలను (ఎస్‌యూసీ) క్రమబదీ్ధకరించారు. ఎస్‌యూసీ బాకీలపై నెలవారీ చక్ర వడ్డీ విధానం స్థానంలో వార్షిక చక్రవడ్డీ విధానాన్ని ప్రకటించారు. అలాగే వడ్డీ రేటును కూడా తగ్గించారు. ఇకపై టెల్కోలు పదేళ్ల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయొచ్చు, అలాగే ఇతర సంస్థలతో పంచుకోవచ్చు. సెల్ఫ్ అప్రూవల్ ప్రాతిపదికన టవర్ల ఏర్పాటు ప్రక్రియను సరళతరం చేశారు. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థలు కేంద్రానికి రూ. 92,000 కోట్లు లైసెన్సు ఫీజు, రూ. 41,000 కోట్లు స్పెక్ట్రం యూసేజీ చార్జీలు బాకీ పడ్డాయి. ► ఇతర సుంకాలను, లైసెన్సు ఫీజుకు సంబంధించి చూపాల్సిన బ్యాంక్ గ్యారంటీలను తగ్గించారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల (ఎస్‌యూసీ) చెల్లింపులో జాప్యానికి గాను విధించే పెనాలీ్టలను తొలగించారు. వడ్డీ రేట్లను క్రమబదీ్ధకరించారు. భవిష్యత్తులో నిర్వహించే వేలానికి బ్యాంక్ గ్యారంటీ అవసరం ఉండదు. ► స్పెక్ట్రం కాలపరిమితిని 20 ఏళ్ల నుంచి 30 ఏళ్లకు పొడిగించారు. 10 సంవత్సరాల తర్వాత స్పెక్ట్రంను సరెండర్ చేయవచ్చు. భవిష్యత్తులో నిర్వహించే వేలంలో కొనుగోలు చేసే స్పెక్ట్రంపై ఎస్‌యూసీ ఉండదు. ► ప్రక్రియపరమైన సంస్కరణలు చూస్తే..స్పెక్ట్రం వేలం నిర్వహణకు నిర్దిష్ట క్యాలెండర్ రూపకల్పన, వైర్లెస్ పరికరాల కోసం క్లిష్టతరమైన లైసెన్సు ప్రక్రియ తొలగింపు, యాప్ ఆధారిత సెల్ఫ్–కేవైసీ, పేపర్ రూపంలో ఉండే కస్టమర్ అక్విజిషన్ ఫారమ్‌ల (సీఏఎఫ్) స్థానంలో డేటాను డిజిటల్‌గా భద్రపర్చడం వంటివి ఉన్నాయి. అలాగే ఈ–కేవైసీ రేటును రూ.1కి సవరించారు. ఉభయతారకంగా సంస్కరణలు.. ఈ సంస్కరణలు.. టెలికం రంగానికి, వినియోగదారులకు ఉభయతారకంగా ఉంటాయి. పరిశ్రమ అభివృద్ధికి, ఉద్యోగావకాశాలకు తోడ్పడతాయి. వాహనాలు, డ్రోన్ పరిశ్రమకు ప్రకటించిన పీఎల్ఐ స్కీముతో తయారీకి ఊతం లభిస్తుంది. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి డిజిటల్ లక్ష్య సాకారానికి దోహదం.. ఎకానమీకి తోడ్పాటు అందించడంతో పాటు డిజిటల్ ఇండియా లక్ష్యాల సాకారానికి తోడ్పడేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు, చర్యలను స్వాగతిస్తున్నాను. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్ చేసేందుకు తోడ్పాటు.. పరిశ్రమ నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు, డిజిటల్ ఇండియా ఆకాంక్షల సాధనకు కేంద్రం ప్రకటించిన సంస్కరణలు తోడ్పడతాయి. టెల్కోలు నిలదొక్కుకునేందుకు ఇవి దోహదపడగలవు. ప్రధాని పిలుపు మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఎయిర్టెల్ సిద్ధం. – సునీల్ మిట్టల్, చైర్మన్, భారతి ఎయిర్టెల్ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఎదిగేలా చూసేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ సంస్కరణలు నిదర్శనం. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించడాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఎగుమతులకు జోష్... సవరించిన పీఎల్ఐ పథకం ఎగుమతులకు భారీ అవకాశాలను కలి్పంచనుంది. దేశీ ఆటో పరిశ్రమ ప్రపంచవ్యాప్త సప్లై చైన్‌తో మమేకమయ్యేందుకు దోహదపడుతుంది. మన కంపెనీల అవకాశాలకు తోడ్పడుతుంది. –విపిన్ సొం«దీ, ఎండీ, సీఈఓ, అశోక్ లేలాండ్ పరిశ్రమకు దన్ను.. తాజాగా సవరించిన పీఎల్ఐ పథకం ఆటో పరిశ్రమకు అవసరమైన జోష్‌నివ్వనుంది. ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలకు దారి చూపనుంది. –వేణు శ్రీనివాసన్, చైర్మన్, టీవీఎస్ మోటార్ ఇవి అత్యధిక నిధులు.. ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకాలలోకెల్లా తాజాగా కేటాయించిన నిధులు అత్యధికం. ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు, విడిభాగాలకు ప్రోత్సాహకాల ద్వారా దేశీ ఆటో పరిశ్రమకు మద్దతివ్వడం.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. –కెనిచి అయుకవా, ప్రెసిడెంట్, సియామ్ -
భార్య గర్భవతి.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్ తెలిపిన వివరాలు.. నారాయణపేట్ జిల్లా మద్దూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు మంగలి కృష్ణ (25) మూడు సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి అంగడిపేట్‌లో నివాసముంటున్నాడు. సెలూన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ఇతనికి రెండు సంవత్సరాల క్రితం పల్లవి అనే ఆమెతో వివాహమైంది. గత కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కృష్ణ పలువురి వద్ద అప్పులు చేశాడు. గర్భవతిగా ఉన్న భార్యను పది రోజుల క్రితం పుట్టింటికి పంపాడు. అప్పులతో సతమవుతున్న కృష్ణ బుధవారం రాత్రి 7 గంటల సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్క గదిలో ఉంటున్న అతని తండ్రి, తమ్ముడు గురువారం వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘అక్షత మూర్తి.. క్వీన్ ఎలిజబెత్ కన్నా రిచ్’
లండన్: ఇటీవల బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ (39) ఆర్థిక వ్యవహారల పారదర్శకతపై పలు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. గార్డియన్ ప్రకారం రిషి సునక్ భార్య, అతడి కుటుంబ సభ్యులు పలు కంపెనీల్లో మల్టీమిలియన్ పౌండ్ల విలువజేసే షేర్‌హోల్డింగ్స్, డైరెక్టర్‌షిప్స్ కలిగి ఉన్నారని.. కానీ వాటి గురించి ఆయన అధికారికంగా ప్రకటించలేదని సమాచారం. ఇక గార్డియన్ ప్రచురించిన మరో ప్రత్యేక కథనం ప్రకారం రిషి సునక్ భార్య అక్షత మూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఆ కంపెనీలో అక్షత పేరు మీద 430 మిలియన్ పౌండ్లు విలువ చేసే షేర్లు ఉన్నాయి. దీని ప్రకారం చూసుకుంటే.. ఆమె బ్రిటన్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళగా నిలుస్తారు. ఆమె క్వీన్ ఎలిజబెత్ కన్నా ధనవంతురాలిగా ఉండనున్నట్లు గార్డియన్ తెలిపింది. ( నాకలాంటి కోరికేదీ లేదు : రిషి సునక్ ) ఇక బ్రిటన్ మంత్రివర్గ నియమావళి ప్రకారం సునక్ తనకు సంబంధించిన ఆర్థిక విషయాలను ప్రజలకు వెల్లడించడం అతడి బాధ్యత. మినిస్టీరియల్ రిజిస్టర్ ప్రకారం మంత్రులు తమ కుటుంబం ఆధీనంలో ఉన్న ఆస్తుల గురించి అంటే తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, అత్యమామల పేర్ల మీద ఉన్న ఆస్తుల గురించి వెల్లడించడం తప్పనిసరి. అయితే సునక్ మాత్రం అతడి భార్య మినహా ఇతర కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులను వెల్లడించలేదు. అంతేకాక తాను ఓ చిన్న యూకే ఆధారిత వెంచరల్ క్యాపిటల్ కంపెనీకి యాజమానిగా మాత్రమే ప్రకటించుకున్నారు. దాంతో ప్రస్తుతం రిషి సునక్ ఆర్థిక వ్యవహారాల గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. -
హిందూజా బ్రదర్స్ మధ్య చిచ్చుపెట్టిన లేఖ
లండన్: ‘హిందూజా బ్రదర్స్’ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మనల్ని వందల సంవత్సరాల పాటు పాలించిన బ్రిటీష్ వారి గడ్డపై అత్యంత ధనవంతులుగా నిలిచిన భారతీయులు. 'ఐకమత్యమే మహాబలం' అనే నానుడి అపరకుబేరులైన హిందుజా సోదరులకు సరిగ్గా సరిపోతుంది. అయితే ప్రస్తుతం వీరి మధ్య కూడా ఆస్తి వివాదాలు నడుస్తున్నట్లు సమాచారం. లండన్ కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుతో ఈ సోదరుల మధ్య ఉన్న వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు సోదరులు సంతకం చేసిన ఓ లేఖ వారి మధ్య వివాదాన్ని రాజేసింది. అంతేకాక 11.2 బిలయన్ డాలర్ల కుటుంబ సంపద ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతుంది. ఆ వివరాలు.. 2014 నాటిదిగా చెప్తున్న ఈ లేఖలో ఒక సోదరుడి వద్ద ఉన్న ఆస్తులు అందరికీ చెందినవని.. ప్రతి మనిషి ఇతరులను వారి కార్యనిర్వాహకులుగా నియమిస్తారని పేర్కొంటుంది. అయితే ప్రస్తుతం ఆ కుటుంబ పెద్ద అయిన శ్రీచంద్ హిందూజా(84) అతని కుమార్తె వినో ఈ లేఖను పనికిరానిదిగా ప్రకటించాలనుకుంటున్నారు. ఈ లేఖను ఆధారంగా చేసుకుని గోపిచంద్, ప్రకాష్, అశోక్ ముగ్గురు సోదరులు హిందూజా బ్యాంక్‌ను నియంత్రణలోకి తీసుకోవడానికి ప్రయత్నించారని విను ఆరోపిస్తున్నారు. శ్రీచంద్ పేరు మీద ఉన్న ఏకైక ఆస్తి ఈ హిందూజా బ్యాంక్ మాత్రమే. ఈ క్రమంలో శ్రీచంద్, అతడి కుమార్తె విను ఈ లేఖకు చట్టపరమైన విలువ ఉండకూడదని.. దానిని వీలునామాగా ఉపయోగించరాదంటూ తీర్పు చెప్పాల్సిందిగా న్యాయమూర్తిని కోరుకుంటున్నారు. అంతేకాక 2016లోనే శ్రీచంద్ ఈ లేఖ తన ఆలోచనలకు విరుద్ధంగా ఉందని తెలపడమే కాక కుటుంబ ఆస్తులను వేరుచేయాలని పట్టుబట్టారని ఆయన కుమార్తె విను తెలిపారు. అయితే శ్రీచంద్ తరపు న్యాయవాది దీనిపై స్పందించడానికి ఇష్టపడలేదు. అయితే మిగతా ముగ్గురు సోదరులు మాత్రం ఈ కేసు తమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదన్నారు. కానీ ఈ విచారణ తమ వ్యవస్థాపకుడి ఆశయాలకు.. కుటుంబ విలువలకు విరుద్ధంగా ఉందన్నారు. ‘ప్రతిదీ అందరికీ చెందినది.. ఏదీ ఎవరికీ చెందదు’ అనే సూత్రం మీదనే తమ కుటుంబం దశాబ్దాలుగా నడుస్తుందని వారు తెలిపారు. కుటుంబ విలువలను సమర్థించే వాదనకు తాము మద్దతిస్తామని అని ముగ్గురు సోదరులు ఒక ఇమెయిల్ ద్వారా తెలిపారు. ఒకవేళ ఈ దావా గనక విజయవంతమైతే.. బ్యాంక్‌లోని మొత్తం వాటాతో సహా శ్రీచంద్ పేరులోని అన్ని ఆస్తులు అతని కుమార్తె వినుకి.. ఆమె వారసులకు చెందుతాయని ముగ్గురు సోదరులు తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో హిందూజా కుటుంబం ఒకటి. వారి సంపదలో ఎక్కువ భాగం హిందూజా గ్రూప్ నుండి వచ్చింది. దీనికి ఒక శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. ఈ రోజు వీరికి దాదాపు 40 దేశాలలో ఫైనాన్స్, మీడియా, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు ఉన్నాయి. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ సూచిక హిందూజా కుటుంబ సంపదను 11.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. -
లాక్డౌన్ నేర్పించిన ఆర్థిక సూత్రం
బీవైనగర్‌కు చెందిన వడ్డేపల్లి రూప బీడీ కార్మికురాలు. గతంలోనే భర్త చనిపోయాడు. మురని, లహరి కూతుళ్లు. వీరిద్దరూ ఇంటరీ్మడియట్ చదువుతున్నారు. రోజూ కనీసం వెయ్యి బీడీలు తయారు చేస్తే.. నెలకు రూ.5వేల వరకు ఆదాయం వచ్చేది. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రూప ఉపాధి కోల్పోయింది. రాష్ట్రప్రభుత్వం అందించిన రేషన్ బియ్యం, రూ.1,500, నగదు, కేంద్రప్రభుత్వం ద్వారా అందిన రూ.500 సాయంతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. దాతలు ఇస్తున్న కూరగాయలు, నిత్యాసవరాలతో సరిపెట్టుకుంటోంది. ప్రభుత్వం నుంచి అందిన ఆర్థికసాయం ద్వారా మహిళా సంఘంలో తీసుకున్న రుణం తాలూకు వాయిదా చెల్లిస్తోంది. (ఫుడ్ డెలివరీ బాయ్స్ వాహనాల సీజ్ ) సిరిసిల్లలోని ఓ షాపింగ్ మాల్లో పనిచేసే రాజు నెలవేతనం రూ.8వేలు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలే. తన వేతనంలోంచే ఇంటి కిరాయి చెల్లించాడు. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాడు. కానీ, లాక్‌డౌన్‌తో పనిబందైంది. ఈనెల వేతనం రాలేదు. వారానికోసారి నాన్‌వెజ్‌తో కూడిన భోజనం చేసే అతడి కుటుంబం.. ఈసారి పూర్తిగా కూరగాయలకే పరిమితమైంది. వాయిదా పద్ధతిన కొనుగోలు చేసిన మొబైల్‌ఫోన్ వాయిదా చెల్లించాడు. అవసరమైన ఔషధాలకు కొంత వెచ్చిస్తున్నాడు. తమ కుటుంబసభ్యులకు ఆకలిబాధ తెలియకుండ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేద, మధ్య తరగతివారు ఆచితూచి ఖర్చు చేస్తున్నారనే దానికి వీరి కుటుంబాల పొదుపు చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. పిల్లలకే పాలు నా నెల జీతం రూ.12వేలు. భార్య ఫర్హానాజ్, పిల్లలు నైలా(3), మునజాహ్(1). ఈనెలకు సంబంధించిన జీతమింకా రాలే. అందుకే ఒక్కసారి కూడా నాన్‌వెజ్ భోజనం లేదు. పిల్లల కోసమే పాలు కొంటున్నం. మేం రోజూ తాగే ఛాయ్ కూడా దాదాపు బంద్‌జేసినం. – ఎండీ యూనస్, ప్రైవేటు ఉద్యోగి పొదుపు చేయక తప్పడం లేదు నాకు తక్కువ జీతం. అయినా గతంలో కుటుంబంతో కలిసి పార్కు, సినిమాలకు వెళ్లేవాళ్లం. అంతోఇంతో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు ఖర్చు తగ్గించుకున్నం. ఇంట్లోనే ఉంటున్నం. కిస్తులు కడుతున్నం – కోమటి వెంకటస్వామి,కాంట్రాక్టు ఉద్యోగి..అవసరాల గురించి తెలిసింది అవసరాల గురించి తెలిసింది. కరోనా లాక్‌డౌన్‌తో అవసరాలు, అనవసరాల గురించి తెలిసింది. సాంచాలు నడిపితే నెలకు రూ.8వేలు వస్తయి. పదిహేను రోజుల కింద బతుకమ్మ చీరలు నేయడం షురూ జేసినం. నెలకు రూ.15 వేలు వస్తయనుకుంటే ఉన్న పనిపోయింది. నా భార్య రంజిత, పిల్లలు సంధ్య, అఖిల్. అందరం ఇంట్లోనే ఉంటున్నం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ చూస్తున్నం. సర్కారు ఇచ్చిన బియ్యం, రూ.1,500తోనే కాలం వెళ్లదీస్తున్నం. (తండ్రైన ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ జీవీ ) – బింగి సంపత్, నేతకార్మికుడు -
ఆర్థిక అభద్రతలో పట్టణ భారతం..
న్యూఢిల్లీ: గడిచిన ఏడాది కాలంగా బీమాపై అవగాహన పెరిగినప్పటికీ .. పట్టణ ప్రాంతాల ప్రజల్లో ఆర్థిక అభద్రత భావం తగ్గలేదు. రోజువారీ వైద్యం ఖర్చులు, జీవన విధానాన్ని కొనసాగించేందుకు అయ్యే వ్యయాలపై యువత మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. బీమా సంస్థ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్యకాలంలో 25 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7,014 మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు. వీటిలో 6 మెట్రో నగరాలు, 9 ప్రథమ శ్రేణి నగరాలు, 10 ద్వితీయ శ్రేణి నగరాలు ఉన్నాయి. 25–55 ఏళ్ల మధ్య, సగటున రూ. 2 లక్షల పైగా కుటుంబ వార్షికాదాయం గలవారు, ఆర్థిక సాధనాలపై ఇతరులను ప్రభావితం చేయగలవారి అభిప్రాయాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య 700 బేసిస్ పాయింట్లు పెరిగి 28 శాతానికి చేరింది. టర్మ్ పాలసీల గురించి అవగాహన 1,000 బేసిస్ పాయింట్లు ఎగిసి 57 శాతానికి పెరిగింది. అత్యధికంగా బీమా భద్రతపై అవగాహన ఉన్న వారు, జీవిత బీమా పాలసీదారులతో దక్షిణాది అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో 47 పాయింట్లతో ఢిల్లీ, 46 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో ఉన్నాయి. మరోవైపు, అనేక అంశాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆర్థిక అభద్రతా భావం ఎక్కువగా ఉంది. ద్వితీయ శ్రేణి నగరాల్లో బీమా భద్రతకన్నా ఎక్కువగా పొదుపునకే ప్రాధాన్యమిస్తున్నారు. టర్మ్ పాలసీల కన్నా ఎండోమెంట్ పాలసీల వైపే మొగ్గు చూపుతున్నారు. -
‘నా భార్యకు మళ్లీ పెళ్లి చేయండి’
బంజారాహిల్స్ : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూబ్లీహిల్స్ శాఖ డిప్యూటీ మేనేజర్ చిత్తలూరి శ్రవణ్ కుమార్(29) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని మాదాపూర్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం శ్రవణ్ స్పృహలో లేడని తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రవణ్‌కు ఏడాది క్రితం సూర్యాపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. వీరు జూబ్లీహిల్స్ రోడ్ నెం–10లోని గాయత్రిహిల్స్‌లో అద్దెకుంటున్నారు. ఇటీవలనే భార్య స్వగ్రామానికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సూసైడ్ లెటర్ కూడా రాశాడని పోలీసులు తెలిపారు. తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని అందుకే చనిపోతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని రాశాడు. తనకు ఓ వ్యక్తి డబ్బులు బాకీ ఉన్నాడని, ఆ డబ్బులతోనే తన అంత్యక్రియులు నిర్వహించాలని 11 రోజుల దశదినకర్మ చేసి డబ్బులు వృథా చేయవద్దని రాశాడు. తన భార్య చాలామంచిదని ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలని కూడా లెటర్లో రాయడం జరిగింది. ఈ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గూగుల్‌లో సీఐ నెంబర్ కనుక్కొని వీడియోలు పంపి
సాక్షి, గుత్తి రూరల్: ‘అన్న నన్ను క్షమించండి.. ఏమి చేయాలో నాకు అర్థమవడం లేదు. మిమ్మల్ని మోసం చేయాలని కాదు.. నేను బతుకుతానో లేదో తెలియదు.. నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.. నన్ను క్షమించండి’ అంటూ నోటి నుంచి నురగలు కక్కుకుంటూ వీడియో తీసి శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి రక్షించారు. కర్నూలు పాత బస్టాండు ప్రాంతానికి చెందిన జంగం కన్నప్ప కుమారుడు జంగం విశాల్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. కర్నూలు నుంచి అనంతపురానికి ద్విచక్రవాహనంలో వెళ్తూ గుత్తి మండలం కొత్తపేట వద్ద ఆగాడు. తన వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సోదరుడు నందకు వాట్సాప్‌లో పంపాడు. వీడియో చూసిన నంద వెంటనే గూగుల్ ద్వారా గుత్తి సీఐ రాజశేఖర్‌రెడ్డి సెల్‌ఫోన్ నంబర్ కనుక్కొని వీడియోలు పంపి సమాచారం అందించాడు. వెంటనే సీఐ తన సిబ్బందితో కలసి కొత్తపేట శివారులో 44వ నంబర్ జాతీయ రహదారికి రెండు వైపులా గాలింపు చర్యలు చేపట్టారు. కొత్తపేట గ్రామానికి సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న విశాల్‌ను గుర్తించి వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపారు. విశాల్ ప్రాణాపాయం నుంచి బయట పడినట్లు సీఐ తెలిపారు. సకాలంలో నిండు ప్రాణాన్ని కాపాడి పోలీసులపై గౌరవాన్ని పెంచిన సీఐ రాజశేఖర్‌రెడ్డిని పట్టణ ప్రజలు అభినందించారు. -
ఇద్దరు కూతుళ్లకు ఉరేసి తండ్రి ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఆర్థిక బ్బందుల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ కథనం ప్రకారం.. లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్(40) చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. నమ్ముకున్న వృత్తిలో ఆదాయం సరిగా లేకపోవడంతో ఆ పనిని వదిలి కుటుంబాన్ని పోషించేందుకు దుబ్బాకలో చిన్నగా గ్యాస్ స్టవ్‌ల రిపేరు దుకాణం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం రాజేందర్ భార్య విజయలక్ష్మి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఆస్పత్రిపాలవడంతో చికిత్సకోసం దాదాపు నాలుగు లక్షలు అప్పులు చేశాడు. వ్యాధి తీవ్రమై ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఇద్దరు కూతుళ్లు.. భవానీ (9), లక్ష్మి(6)లను ఎలా పోషించాలో అర్థం కాక తీవ్రమనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి రాజేందర్ తన కూతుళ్లు భవానీ, లక్ష్మి నిద్రపోతున్న సమయంలో వారిని ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసి, తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం రాజేందర్ తల్లి యాదమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా దూలానికి తండ్రీ కూతుళ్లు వేలాడుతూ కన్పించారు. ఆమె పెద్దగా కేకలు పెడుతూ రోదిస్తూ బయటకు రావడంతో చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని దుబ్బాక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుభాష్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సీఐ వెంకట్రామయ్య కూడా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. మృతుడు రాజేందర్ తాము ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నామంటూ రాసి ఉంచిన లెటర్ ఇంట్లో లభ్యమయిందని ఎస్ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. -
సత్యం బాటలో ఐఎల్ఎఫ్ఎస్!
ముంబై/న్యూఢిల్లీ: దశాబ్దం కిందటి సత్యం కంప్యూటర్స్ ఉదంతం తరహాలోనే తాజాగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ప్రస్తుత బోర్డును రద్దు చేసింది. ప్రముఖ బ్యాంకరు ఉదయ్ కొటక్ సారథ్యంలో ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డును నియమించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం దేశీ మార్కెట్లలో ప్రకంపలను సృష్టిస్తున్న నేపథ్యంలో స్వయంగా రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, దాని అనుబంధ సంస్థల యాజమాన్య అధికారాలు తమకు అప్పగించాలని, బోర్డును మార్చాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో (ఎన్సీఎల్టీ) కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) సోమవారం పిటిషన్ వేసింది. ఇందుకు అనుమతులిస్తూ ఎన్సీఎల్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 31కి వాయిదా వేసింది. కేంద్రం లేవనెత్తిన అంశాలపై అక్టోబర్ 15లోగా వివరణనివ్వాలంటూ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు నోటీసులు ఇచ్చింది. ‘ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత.. కంపెనీల చట్టంలోని సెక్షన్ 241 (2), 242లను ప్రయోగించడానికి, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కార్యకలాపాలు.. ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్నాయని ప్రకటించడానికి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నాం‘ అని ఎన్సీఎల్టీ బెంచ్ పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారం.. ఏదైనా కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న పక్షంలో ఆ సంస్థ వ్యవహారాలను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం ఎన్సీఎల్టీని ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ కూడా తగు ఆదేశాలివ్వవచ్చు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం తర్వాత కేంద్రం స్వయంగా ఒక కంపెనీ బోర్డును తన నియంత్రణలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. కుంభకోణం దరిమిలా 2009లో సత్యం బోర్డును అప్పటి ప్రభుత్వం రద్దు చేయడం, ఆ తర్వాత కంపెనీ.. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చేతికి చేరడం తెలిసిందే. ఎకానమీకి ముప్పు.. కంపెనీ ఆర్థిక స్థిరత్వంపైన, క్యాపిటల్ మార్కెట్లపైన ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత బోర్డును, యాజమాన్యాన్ని కొనసాగించడం వల్ల కంపెనీతో పాటు, సంస్థలో సభ్యులకూ ఇబ్బందేనని, ప్రజా ప్రయోజనాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని ఎన్సీఎల్టీ ముందు ఎంసీఏ తమ వాదనలు వినిపించింది. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా ఉపయోగించుకోవడంలో విఫలం కావడం వల్లే దాదాపు రూ. 1.15 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నప్పటికీ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రస్తుతం రూ. 91,000 కోట్ల మేర రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉందని ఆక్షేపించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కంపెనీ గానీ దివాలా తీస్తే అనేక మ్యూచువల్ ఫండ్స్ పతనమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వంటి భారీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) మూతబడితే... ఆర్థిక మార్కెట్లలో నిధుల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ఈ వ్యవహారం మొత్తం దేశ ఎకానమీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నందున పరిస్థితి చక్కదిద్దేందుకు తాము జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కేంద్రం పేర్కొంది. గతంలో సత్యం కంప్యూటర్స్ ఉదంతంలోనూ కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసిన సంగతిని నివేదించింది. ఇప్పటికే కంపెనీ వ్యవహారాలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ మరిన్ని రుణాలు డిఫాల్ట్ కాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. విశ్వాస పునరుద్ధరణ ముఖ్యం .. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కు తగినన్ని నిధుల లభ్యత ఉండేలా చూసేందుకు, మరిన్ని డిఫాల్టుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తయ్యేలా చూస్తామని పేర్కొంది. క్యాపిటల్, ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం కోసం ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌పై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కీలకమని తెలిపింది. సంస్థను గట్టెక్కించేందుకు అసెట్స్ విక్రయం, కొన్ని రుణాల పునర్వ్యవస్థీకరణ, ఇన్వెస్టర్లు.. ఆర్థిక సంస్థలు కొత్తగా మరిన్ని నిధులు సమకూర్చడం తదితర చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరిన్ని దివాలా ఉదంతాలను నివారించడానికి ఇవి అత్యవసరమని పేర్కొంది. ఆరుగురు సభ్యులతో కొత్త బోర్డు ఏర్పాటు ఆరుగురు సభ్యుల కొత్త బోర్డుకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ నియమితులయ్యారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ జీఎన్ బాజ్‌పాయ్, ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ జీసీ చతుర్వేది, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినీత్ నయ్యర్, ఐఏఎస్ అధికారిణి మాలినీ శంకర్, సీనియర్ ఆడిటర్ నందకిశోర్‌లు ఇందులో సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 8న ఈ బోర్డు తొలిసారిగా సమావేశం కానుంది. అక్టోబర్ 31 నాటికల్లా తమ పరిశీలనలు, మార్గదర్శ ప్రణాళికపై నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: జైట్లీ జాతి విధ్వంసానికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్.. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేస్తోందని జైట్లీ దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ లాంటి విపరీత ఆలోచనా విధానాలున్నవారే ఐఎల్ఎఫ్ఎస్లో ఆర్థిక సంస్థల పెట్టుబడులను కుంభకోణంగా వర్ణిస్తారని ఎద్దేవా చేశారు. ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టిన ఐఎల్ ఎఫ్ఎస్కు తోడ్పాటునివ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన కేవీ థామస్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల నుంచి కాసిన్ని వివరాలు తెలుసుకోవాలంటూ రాహుల్ గాంధీకి హితవు పలికారు. తన ఫేవరెట్ కంపెనీ ఐఎల్ఎఫ్ఎస్ దివాలా తియ్యకుండా చూసేందుకు, మోసగాళ్లను కాపాడేందుకు ఎల్ఐసీ డబ్బును ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై జైట్లీ ఈ మేరకు స్పందించారు. ‘50.5% వాటాలతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 30.5% వాటాతో యూటీఐ.. 1987లో ఐఎల్ఎఫ్ఎస్ ఏర్పాటు కుంభకోణమా? 2005లో ఎల్ఐసీ 15%, 2006లో మరో 11.10% వాటాలు కొనడం కూడా కుంభకోణమేనా? 2010లో ఎల్ఐసీ మరో 19.34 లక్షల షేర్లు కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడులన్నీ కుంభకోణమే అంటారా‘ అని జైట్లీ ప్రశ్నించారు. -
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ నిధుల ప్రణాళికకు ఇన్వెస్టర్ల ఆమోదం
ముంబై: ఆర్థిక సంక్షోభంతో కుదేలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కి కాస్త ఊరట లభించే దిశగా దాదాపు రూ. 15,000 కోట్ల దాకా నిధుల సమీకరణ ప్రతిపాదనకు సంస్థలో ఇన్వెస్టర్లు ఆమోదముద్ర వేశారు. నాన్ కన్వర్టబుల్ డెట్ ఇష్యూ ద్వారా ఈ నిధులను సంస్థ సమీకరించనుంది. అలాగే రుణ సమీకరణ పరిమితిని రూ. 35,000 కోట్ల దాకా (40 శాతం మేర) పెంచుకునేందుకు, రైట్స్ ఇష్యూకి వీలుగా షేర్ క్యాపిటల్‌ను పెంచుకునేందుకు కూడా వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు సంస్థ వెల్లడించింది. మరోవైపు, పునర్వ్యవస్థీకరణను రూపొందించేందుకు అల్వారెజ్ అండ్ మార్సల్ సంస్థను ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ నియమించుకుంది. దాదాపు రూ. 91,000 కోట్ల రుణ భారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంస్థలు.. రీపేమెంట్లో డిఫాల్ట్ అవుతుండటం.. స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, జపాన్‌కి చెందిన ఒరిక్స్ కార్పొరేషన్ మొదలైన వాటికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటాలు ఉన్నాయి. -
ఐఎల్ఎఫ్ఎస్ షేర్హోల్డర్లతో ఆర్బీఐ సమావేశం రద్దు
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్) షేర్హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ‘శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలను ఆర్బీఐ తెలుసుకోవాలనుకుంటోంది’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని వివరించాయి. సెప్టెంబర్ 29న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. కంపెనీలో ఎల్ఐసీకి అత్యధికంగా 25.34%, జపాన్ ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.54% వాటాలు ఉన్నాయి. అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ వద్ద మిగతా వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉన్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ తీవ్ర లిక్విడిటీ సంక్షోభం కారణంగా ఆగస్టు 27 నుంచి పలు రుణాలు, వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అవుతోంది. కంపెనీ తక్షణ అవసరాల కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. -
మోసాలు, ఎగవేతలకు చెక్
న్యూఢిల్లీ: మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సూచించారు. 8 శాతం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగం వృద్ధి చెందడం వల్ల బ్యాంకుల సామర్థ్యం కూడా బలపడుతుందని మంగళవారం ఢిల్లీలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల వార్షిక సమీక్షలో చెప్పారాయన. పీఎస్‌యూ బ్యాంకుల చీఫ్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ... ‘‘ఆర్థిక రంగ జీవనాడి అయిన బ్యాంకులు... ఎదిగే ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలకు తీర్చే విధంగా వాటి సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. అదే సమయంలో రుణాల విషయంలో తమ వైపు నుంచి లోపాలకు అవకాశం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలు చోటు చేసుకుంటే కఠిన చర్య తీసుకోవడం ద్వారా బ్యాంకులపై ఉన్న విశ్వాసానికి న్యాయం చేకూర్చాలి. పరిశుద్ధమైన, వివేకంతో కూడిన రుణాలు జారీ చేసే సంస్థల్లా బ్యాంకులు పనిచేయాలి’’ అని సూచించారు. ఇటీవలే ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ బరోడా, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఖరారు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించగా, ఇదే సమయంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. మొండి బకాయిల(ఎన్పీఏల) రికవరీకి ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు తమ చర్యల్ని ముమ్మరం చేశాయి. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల కాలంలో (జూన్ క్వార్టర్) రూ.36,551 కోట్లను వసూలు చేశాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోలిస్తే 49% అధికంగా వసూలు చేసుకున్నాయి. దీనిపై జైట్లీ మాట్లాడుతూ... ప్రభుత్వరంగ బ్యాంకుల పరిస్థితి మరింత సానుకూలంగా ఉందన్నారు. ఎన్పీఏల పరిష్కారం, వసూళ్లు, వీటికి నిధుల కేటాయింపులు, రుణ వృద్ధి అంశాల్లో సానుకూల ఫలితాలను చూపిస్తున్నాయని చెప్పారు. అందరికీ ఆర్థిక సేవల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రాధాన్యాన్ని జైట్లీ గుర్తు చేశారు. అదే సమయంలో నాన్ రిటైల్ బ్యాంకింగ్ సేవల విషయంలో ఇతర రుణదాతల నుంచి మద్దతు సరిపడా లేదని పేర్కొన్నారు. స్థిరంగా 8 శాతం వృద్ధి ‘‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్(ఐబీసీ), జీఎస్టీ, డీమోనిటైజేషన్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఆర్థిక రంగాన్ని వ్యవస్థీకృతం చేశాం. దీనివల్ల ఆర్థిక సామర్థ్యం, సవాళ్లను మరింతగా అంచనా వేయటం సాధ్యమైంది. సమ్మిళిత వృద్ధి, కొనుగోలు సామర్థ్యం వంటివి భారత ఆర్థిక వృద్ధిని నడిపించనున్నాయి’’ అని జైట్లీ వివరించారు. భారత్ 8% స్థిరమైన వృద్ధి రేటు సాధించేందుకు ఇవి తోడ్పడతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి రేటు 8.2%గా అంచనా వేసింది. ఐబీసీ యంత్రాంగం నుంచి వస్తున్న సానుకూల ఫలితాలను ప్రస్తావించిన జైట్లీ... డీఆర్టీ ద్వారా వసూళ్లను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘ఐఎల్ఎఫ్ఎస్’... చూస్తూనే ఉన్నాం: జైట్లీ ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు చెల్లింపుల్లో విఫలం కావడం వల్ల ఫైనాన్షియల్ మార్కెట్లో లిక్విడిటీ సమస్య తలెత్తుతుందన్న ఆందోళనలు నెలకొనడంతో... ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. వివిధ రంగాలకు అవసరమైన మేర నిధులను అందుబాటులో ఉంచే విషయమై బ్యాంకులు విశ్వాసాన్ని వ్యక్తం చేశాయని ప్రభుత్వరంగ బ్యాంకుల సమీక్ష అనంతరం జైట్లీ చెప్పారు. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ విషయంలో ఎల్ఐసీ చైర్మన్ చెప్పిన దానికి అదనంగా నేను చెప్పేదేమీ లేదు’’ అని జైట్లీ స్పష్టం చేశారు. ఓ వాటాదారుగా ఐఎల్ఎఫ్ఎస్ను మునిగిపోకుండా చూస్తామని ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ పేర్కొన్న విషయం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ సీఆర్ఆర్ తగ్గించాలి న్యూఢిల్లీ: వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్.. ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో పాటు నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) కూడా తగ్గించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘లిక్విడిటీ నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఓఎంఓ (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్) వంటి సాధనాలుంటాయి. అలాగే, సీఆర్ఆర్ను తగ్గించడం ద్వారా కూడా మార్కెట్లో తక్షణం తగినంత లిక్విడిటీ ఉండేలా చూడొచ్చు‘ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం నిధులను కట్టడి చేయడం కాకుండా ద్రవ్య లభ్యత మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాంకులు తమ డిపాజిట్లలో కచ్చితంగా కొంత మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంచాలి. సీఆర్ఆర్గా వ్యవహరించే ఈ నిష్పత్తి ప్రస్తుతం 4 శాతంగా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి దీన్ని మార్చలేదు. -
1378.92 కోట్లకు టైమ్ మ్యాగజైన్ అమ్మకం
-
పరిశ్రమలు రయ్.. ధరల డౌన్
న్యూఢిల్లీ: జూలై, ఆగస్టులో సానుకూలమైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదయ్యాయి. జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదయ్యింది. ఇక ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 3.69 శాతంగా నమోదయ్యింది. 11 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఆర్బీఐ రెపో రేటును పెంచకపోవచ్చన్న అంచనాలున్నాయి. అక్టోబర్ 5న పాలసీ సమీక్ష జరగనుంది కూడా. గతేడాది జూలైలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం ఒక శాతమే. అయితే నెలవారీగా చూస్తే ఐఐపీ వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గింది. మెరిసిన తయారీ, క్యాపిటల్ గూడ్స్... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు జూలైలో భారీగా 7 శాతంగా నమోదైంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 22 సానుకూల ఫలితాలను అందించాయి. కాగా గత ఏడాది ఇదే నెలలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాత క్షీణత నమోదయింది. కన్సూమర్ డ్యూరబుల్స్: వృద్ధి రేటు భారీగా 14.4 శాతంగా నమోదయింది. గత ఏడాది జూలైలో –2.4 శాతం క్షీణత నమోదయింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు, భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సూచిక అయిన ఈ రంగం 3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2017 జూలైలో ఈ విభాగం –1.1 శాతం క్షీణత కనిపించింది. విద్యుత్: జూలైలో స్వల్పంగా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. నాలుగు నెలల్లో..: ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 1.7% నుంచి 5.4 శాతానికి పెరిగింది. తయారీ రంగం వృద్ధి ఈ నెలల్లో 1.2 శాతం నుంచి 5.6 శాతానికి పెరిగింది. వాణిజ్యలోటు భయాలు.. గస్టులో 17.4 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: దేశంపై వాణిజ్యలోటు భయాలు తీవ్రమయ్యాయి. ఆగస్టులో ఏకంగా 17.4 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు నమోదయ్యింది. ఎగుమతులు–దిగుమతులు మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. 2018 ఆగస్టులో ఎగుమతులు 19.21 శాతం వృద్ధిని (2017 ఆగస్టుతో పోల్చితే) నమోదు చేసుకున్నాయి. విలువ రూపంలో ఈ ఎగుమతుల పరిమాణం 27.84 బిలియన్ డాలర్లు. అయితే దిగుమతులు కూడా భారీగా 25.41 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 45.24 బిలియన్ డాలర్లుగా నమోదైంది. వెరసి వాణిజ్యలోటు 17.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దేశంలో దిగుమతుల బిల్లు భారం భారీగా పెరగడానికి అంతర్జాతీయ చమురు ధరల తీవ్రత కారణం. వాణిజ్యలోటు తీవ్రత కూడా డాలర్ మారకంలో రూపాయి విలువ 70 దిగువకు పడిపోవడానికి ప్రధాన కారణం. 7% తగ్గిన కూరగాయల ధరలు.. రిటైల్ ద్రవ్యోల్బణం 3.69%గా నమోదైంది. కూరగాయల ధరలు 7% తగ్గాయి. 6 విభాగాల్లో ఒకటైన ఆహారం పానీయాల విభాగంలో కూరగాయలతో పాటు పప్పులు (–7.76%), చక్కెర, తీపి ఉత్పత్తుల(–5.45%) తగ్గాయి. గుడ్ల ధరలు 6.96% పెరిగాయి. మాంసం, చేపలు (3.21%), పాలు, పాల ఉత్పత్తులు (2.66%), చమురు, ఫ్యాట్స్ (3.47%), పండ్లు (3.57%), ఆల్కహాలేతర పానీయాలు (1.86%) ధరలు స్వల్పంగా పెరిగాయి. -
నాకే ఎందుకిలా..!
మూడు నెలల కింద ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకాడు. లేక్‌పోలీసులు గమనించి అతన్ని కాపాడారు. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనను ఆదుకొనేందుకు ఎవరూ లేరని గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా డిప్రెషన్‌పై ప్రత్యేక కథనం.. నెల రోజుల కింద 18 ఏళ్ల వయసు కూడా లేని ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఉండగానే తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థకు కాల్ చేసి తాను చనిపోబోతున్నానని చెప్పాడు. ప్రేమ విషయంలో మోసపోయిన తనకు ఆత్మహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందాడు. చివరకు స్వచ్ఛంద సంస్థ కౌన్సెలింగ్ సాయంతో ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. వైమీ సిండ్రోమ్ అనే కుంగుబాటుతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఎందరున్నా డిప్రెషన్‌తో కుంగిపోతున్నారు. ప్రపంచంలో ఎవరికీ లేని బాధలు, కష్టాలు తమకే ఉన్నాయని, తామే ఎందుకిలాంటి దుర్భరమైన స్థితిలో బతకాల్సి వస్తోందనే డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు ఏటికేటికీ పెరుగుతున్నారు. ఏటా వారి సంఖ్య 250 నుంచి 300 వరకు నమోదవుతున్నట్లు ఆత్మహత్యల నివారణ సంస్థ రోష్ని అధ్యయనంలో వెల్లడైంది. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు యువత 50 శాతం వరకు ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఆ తర్వాత మహిళలు, వయోధికులు, తదితర కేటగిరీలకు చెందిన వారున్నారు. అన్ని వర్గాల్లోనూ ఎక్కువ శాతం డిప్రెషన్ కారణంగా ఒంటరితనానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారానికి సుమారు ఐదుగురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. సగటున నెలకు 30 మందికి పైగా బాధితులు తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో గత్యంతరం కనిపించడం లేదంటూ ఫోన్ ద్వారా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. బంధాలు తెగిపోతున్నాయి.. కుటుంబాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికీ ఎవరూ ఏమీ కాని ఓ చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకరి ప్రపంచంలోకి మరొకరు తొంగి చూడట్లేదు. ఎవరికి వారు ఒంటరిగానే బతికేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ తరహా జీవన శైలి బాగా వేళ్లూనుకుపోతోంది. ఒకరి సమస్యలను ఒకరికి చెప్పుకొని పరిష్కరించుకొనే స్నేహపూరితమైన వాతావరణం లోపిస్తోంది. ఇంటా బయటా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న వారు చివరకు డిప్రెషన్‌తో ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ర్యాంకులు వంటి అంశాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారు ‘వైమీ సిండ్రోమ్’తో బాధపడుతున్నారు. చివరకు చావును పరిష్కారంగా భావిస్తున్నారు. కుటుంబ హింస, అనారోగ్యం.. మోసపోయిన వారు, కుటుంబ హింస ఎదుర్కొంటున్న మహిళలు కూడా తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతున్నారు. అనారోగ్యంతో బాధపడే వృద్ధులు పరిష్కారంగా చావును వెతుక్కుంటున్నారు. చివరకు ఖరీదైన మొబైల్ ఫోన్ లేదనే కారణంతో డిప్రెషన్‌కు గురై ‘వైమీ సిండ్రోమ్’బారిన పడుతున్నట్లు అంచనా. నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం.. కుంగుబాటు మనిషిలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తుంది. నిద్రలేమి.. విపరీతమైన కోపం, తీవ్రమైన బాధ, అకారణమైన దుఃఖం, ఎవరికీ భారం కావొద్దనే భావన వెంటాడుతాయి. తరచుగా జీవితంపై విరక్తి ప్రకటిస్తారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కుటుంబసభ్యులు, స్నేహితులు గుర్తించి భరోసా ఇవ్వాలి. డిప్రెషన్ బాధితుల బాధను ఓపిగ్గా వినాలి. గ్రేటర్లో ఇలా.. ► రోష్ని స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 250 మంది డిప్రెషన్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ► ఏటా 350 నుంచి 400 వరకు ఈ తరహా కేసులు నమోదువుతున్నాయి. ► తాము ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు ప్రతి నెలా 30 మందికి పైగా ‘రోష్ని’ని సంప్రదిస్తున్నారు. గతేడాది ఆత్మహత్యల్లో 20 ఏళ్లలోపు వారు: 62 21 నుంచి 30 ఏళ్ల వయసు వారు: 140 31 నుంచి 40 ఏళ్ల వయసు వారు: 91 41 నుంచి 60 ఏళ్ల వయసు వారు: 38 60 ఏళ్లు దాటినవారు: 31 మీ కోసం మేమున్నాం జీవితంలో సమస్యలు రావడం సహజం. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రపంచంలో ఎవ్వరికీ లేని బాధలు తమకు మాత్రమే ఉన్నాయనుకోవడం సరికాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవాళ్లు నేరుగా సికింద్రాబాద్, సింధ్ కాలనీలోని రోష్ని సంస్థను సంప్రదించొచ్చు. లేదా 040–6620 2000, 040–6620 2001 నంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందొచ్చు. మీ కోసం మేమున్నామనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు రోష్ని పని చేస్తుంది. - మాలతీరాజి, డైరెక్టర్, రోష్ని ఓదార్పు ఎంతో ముఖ్యం సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపవుతుంది. బాధను పంచుకుంటే సగమవుతుంది. బాధలో ఉన్నవారు చెప్పేది ఓపిగ్గా వింటే చాలు వారికి ఎంతో ఊరట లభిస్తుంది. భరోసాను, మానసిక ధైర్యాన్ని అందజేస్తే డిప్రెషన్ నుంచి బయటపడతారు. - ఆనంద దివాకర్, రోష్ని ప్రతినిధి – సాక్షి, హైదరాబాద్ -
మీ కుటుంబాలకు పెద్దకొడుకునవుతా
రొద్దం: పెనుకొండ మండలం సత్తారుపల్లి వద్ద ఆగస్టు 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు పెద్దకొడుకులా అండగా ఉంటానని ఎవ్వరూ అధైర్యపడవద్దని పెనుకొండ నియోజకవర్గ సమన్వయకర్త మాలగుండ్ల శంకరనారాయణ భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన రొద్దం మండలం ఎల్.తిమ్మాపురం, లక్సాపల్లి గ్రామాలకు చెందిన తొమ్మిదిమంది కుటుంబాలను శంకరనారాయణ, ఆయన తమ్ముళ్లు మల్లికార్జున, రవీంద్రలు శనివారం పరామర్శించారు. మృతులు రవీంద్రారెడ్డి భార్య భారతమ్మ, భీమయ్య భార్య భీమక్క, బెజవాడ గోపాల్‌రెడ్డి భార్య లక్ష్మమ్మ,, కురుబ నారాయణయప్ప భార్య నాగరత్నమ్మ, కురుబ వెంకటప్ప భార్య అశ్వర్థమ్మ, కురుబ రామాంజినప్ప భార్య రామాంజినమ్మ, కురుబ వెంకటస్వామి భార్య దేవమ్మ, వడ్డి ఆంజనేయులు భార్య అలివేలమ్మ, దాసరి అంజి భార్య కళావతి తదితర కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. రోడ్డు ప్రమాదం కలచివేస్తోంది డ్రైవర్ తప్పిదం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందడం తనను కలచివేస్తోందని శంకరనారాయణ పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన రోజే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకునే విషయమై చర్చించామన్నారు. బాధిత కుటుంబాల్లోని పిల్లల చదువులు, క్షతగాత్రుల వైద్య ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. వ్యక్తిగతంగాను, పార్టీపరంగాను ఆదుకునేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు. ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి వస్తే వెంటనే స్పందించి తీరుస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రొద్దం మండల కన్వీనర్ బి.నారాయణరెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కలిపి శ్రీనివాసులు, రాజారెడ్డి, లక్ష్మినారాయణరెడ్డి, రాజ్‌గోపాల్‌రెడ్డి, పెనుకొండ, గోరంట్ల మండలాల కన్వీనర్లు ఫక్రోద్ధీన్, శ్రీకాంత్‌రెడ్డి, తయాబ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, నాగలూరు బాబు, సుధాకర్‌రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, న్యాయవాది భాస్కర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కొడల రాయుడు, ప్రసాద్ పాల్గొన్నారు. -
బలహీనంగానే పసిడి..
ముంబై: వర్ధమాన దేశాల కరెన్సీలు కుప్పకూలి.. డాలర్ ర్యాలీ చేయడంతో పసిడి రేట్లు గత వారంలో అంతర్జాతీయంగా క్షీణించాయి. అమెరికాలోని కమోడిటీ ఎక్సే్చంజ్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 35.90 డాలర్ల మేర క్షీణించి 1,183.10 డాలర్లకు పడిపోయింది. ఒక దశలో 1,167.10 డాలర్లకు కూడా పతనమైనప్పటికీ.. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు తగ్గొచ్చన్న ఆశావహ అంచనాలతో కాస్త కోలుకుంది. టర్కీ లీరా పతన సంక్షోభం కొంత తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తున్నా .. పసిడిలో అమ్మకాల వెల్లువకు అడ్డుకట్ట పడేట్లు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పాస్టర్ ఆండ్రూ బ్రూన్సన్ను అప్పగించకపోతే టర్కీపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించిన పక్షంలో సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని, ఫలితంగా పసిడిపై కొత్తగా అమ్మకాల ఒత్తిడి మరింత పెరగవచ్చని వారు తెలిపారు. వాణిజ్య యుద్ధాల మీద అమెరికా, చైనా చర్చలు జరపొచ్చన్న ఆశావహ అంచనాలతో బంగారం రేటు కాస్త స్థిరంగా ఉన్నా.. ఈ చర్చల ఫలితాలపైనే ధరల కదలిక ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ చర్చల్లో ఎలాంటి పురోగతి గానీ లేకపోతే.. ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోను కావొచ్చని.. ఫలితంగా బంగారంలో అమ్మకాలు మరింతగా పెరగొచ్చని పరిశ్రమవర్గాల విశ్లేషణ. అలాగే, అమెరికాలో అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకర్ల సదస్సులో తీసుకునే నిర్ణయాలు కూడా బంగారాన్ని ప్రభావితం చేస్తాయన్నది వారి అభిప్రాయం. దేశీయంగా డౌన్.. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన ట్రెండ్స్‌కి తగ్గట్లు దేశీయంగా కూడా బంగారం ధరలు క్షీణించాయి. స్పాట్ మార్కెట్లో స్థానిక జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి సైతం డిమాండ్ పెద్దగా లేకపోవడం కూడా పసిడి రేటు తగ్గడానికి కారణమైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో గత వారాంతానికి మేలిమి బంగారం ((99.9% స్వచ్ఛత) పది గ్రాముల రేటు రూ.450 మేర తగ్గి రూ. 30,250 దగ్గర ముగిసింది. అలాగే ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) కూడా అంతే క్షీణతతో రూ. 30,100 వద్ద క్లోజయ్యింది. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం
ముంబై: ప్రపంచవ్యాప్త వాణిజ్య రక్షణాత్మక చర్యలపై నెలకొన్న భయాలు, టర్కీ ఆర్థిక సంక్షోభం, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ నిధుల ప్రవాహం వంటి స్థూల అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. వాణిజ్య యుద్ధ పరంగా సానుకూల వాతావరణానికి అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య చర్చలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈవారం / మార్కెట్‌కు పాజిటివ్‌గానే ఉండవచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. టర్కీ లీరా ఏమాత్రం బలపడినా రూపాయి విలువకు స్వల్పకాలానికి కొంత బలం చేకూరుతుందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అంచనావేశారు. ముడిచమురు ధరల కదలికలు, రూపాయి విలువ అంశాలతో పాటు విదేశీ నిధుల ప్రవాహం కీలకంగా మారనుందని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ వెల్లడించారు. బుధవారం (ఆగస్టు 22న) బక్రీద్ సందర్భంగా మార్కెట్లకు సెలవు కాగా, ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. వడ్డీ రేట్లపై ఫెడ్ వ్యాఖ్య..! అమెరికా పాలసీ రేట్లపై ఈవారంలో ఫెడ్ చైర్మన్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. ఒకవేళ వడ్డీరేట్ల పెంపు ప్రకటన వెలువడితే మార్కెట్‌కు ఇది ప్రతికూల అంశంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంపు దిశగా వ్యాఖ్యలు వెలువడితే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండేందుకు అవకాశం ఉందన్నారు. ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.7,577 కోట్లు ఆగస్టు 1–17 మధ్యకాలంలో ఎఫ్‌పీఐలు రూ.7,577 కోట్లను నికరంగా పెట్టుబడి పెట్టినట్లు ప్రొవిజినల్ డేటా ద్వారా వెల్లడయింది. రూ.2,409 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.5,168 కోట్లను డెట్ మార్కెట్లో పెట్టుబడిపెట్టినట్లు తెలుస్తోంది. 11,495 వద్ద నిరోధం ‘నిఫ్టీకి అత్యంత కీలక నిరోధం 11,,495 పాయింట్ల వద్ద ఉంది. దిగువస్థాయిలో 11,340 వద్ద మద్దతు ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. 9 కంపెనీల ట్రేడింగ్ నిలిపివేత గీతాంజలి జెమ్స్, ఆమ్టెక్ ఆటో, ఈసున్ రేరోల్ అండ్ పనోరమిక్ యూనివర్సల్ షేర్లలో ట్రేడింగ్‌ను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబరు 4 నుంచి బీఎస్ఈ, 5 నుంచి ఎన్ఎస్ఈలు సస్పెండ్ చేయనున్నట్లు తెలిపాయి. తంబ్బి మోడరన్ స్పిన్నింగ్ మిల్స్, ఇండో పసిఫిక్ ప్రాజెక్ట్స్, హర్యానా ఫైనాన్షియల్, నోబుల్ పాలిమర్స్, సమృద్ధి రియల్టీ షేర్లలో ట్రేడింగ్‌ను నిలివేస్తున్నట్లు బీఎస్ఈ పేర్కొంది. డిసెంబరు 2017, మార్చి 2018 కాలానికి సంబంధించి ఈ సంస్థలు ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్స్ పాటించలేదని బీఎస్ఈ తెలిపింది. ఎల్ఓడీఆర్ నిబంధనలను ఈ సంస్థలు పాటిస్తే మళ్లీ ట్రేడింగ్ కొనసాగే అవకాశం ఉందని ఎక్సే్ఛంజీలు తెలిపాయి. -
ప్రపంచ మార్కెట్ల పతనం
టర్కీ కరెన్సీ లిరా కోలుకుంటున్నప్పటికీ, అమెరికా వస్తువులపై టర్కీ సుంకాల పెంపు, ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు 1% వరకూ నష్టపోగా, యూరప్ మార్కెట్లు 1.6–2% రేంజ్లో క్షీణించాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు నష్టపోగా, అమెరికా సూచీలు 1.5–2% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు, పుత్తడి ధరలు నేల చూపులు చూస్తుండగా, డాలర్ దుసుకుపోతోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన మార్కెట్‌కు సెలవు కావడంతో భారీ నష్టాలు తప్పాయని నిపుణులంటున్నారు. అయితే నేడు(గురువారం) భారీ గ్యాప్‌డౌన్‌తో మన స్టాక్ మార్కెట్ ఆరంభమవుతుందని వారు అంచనా వేస్తున్నారు. టర్కీ ‘ప్రతి’ సుంకాలు... టర్కీ కరెన్సీ లిరా పతనం ఒకింత తగ్గినప్పటికీ, టర్కీ ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో సమసిపోయే అవకాశాల్లేవని నిపుణులంటున్నారు. దీంతో మార్కెట్ సెంటిమెంట్‌పై టర్కీ ప్రభావం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిగా తాము కూడా అమెరికా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను బహిష్కరిస్తున్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. అంతేగాకుండా అమెరికా నుంచి దిగుమతయ్యే ఆల్కహాల్, కార్లు, పొగాకు ఉత్పత్తులపై సుంకాలను రెట్టింపు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు అమెరికా సుంకాలు, సబ్సిడీ విధానాలను సవాల్ చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు చైనా ఫిర్యాదు చేసింది. ఇవన్నీ ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ వార్త రాసే సమయానికి(బుధవారం రాత్రి 10 గంటలకు)నాస్డాక్ సూచీ 116 పాయింట్లు, డోజోన్స్ 245 పాయింట్లు మేర పతనమయ్యాయి. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 65 పాయింట్లు క్షీణించి 11,369 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. 13 నెలల గరిష్టానికి డాలర్.. అమెరికా డాలర్ 13 నెలల గరిష్ట స్థాయిలో, 96.82 వద్ద ట్రేడవుతోంది. డాలర్ బలపడుతుండటంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. అంచనాలకు భిన్నంగా అమెరికాలో చమురు నిల్వలు భారీగా ఉన్నాయని గణాంకాలు వెల్లడికావడంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 1.8% క్షీణించి 70.66 వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్ 2.1% పతనమై 64.85 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్ బలపడటంతో పుత్తడి, వెండి లోహాల ధరలు పతనమవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 18 నెలల కనిష్ట స్థాయి.. 1,184 డాలర్లకు పడిపోయింది. -
టర్కీలో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం
-
నష్టాల్లోకి లాక్కెళ్లిన టర్కీ లీరా
టర్కీ కరెన్సీ, రూపాయి పతనంతో స్టాక్‌సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయాయి. భారత బ్యాంకింగ్ రంగం భవిష్యత్ చిత్రం ఏమంత ఆశావహంగా లేదని ఫిచ్ రేటింగ్స్ పేర్కొనడం ప్రతికూల ప్రభావం చూపించింది. దీనితో బ్యాంక్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 37,645 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 74 పాయింట్లు పతనమై 11,356 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. ఇంట్రాడేలో 310 పాయింట్లు పడిన సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో 310 పాయింట్ల నష్టంతో 37,559 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ తర్వాత వేల్యూ బయింగ్, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. ఐఐపీ బాగున్నా.... టర్కీ–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. జూన్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బాగా ఉన్నప్పటికీ, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, రూపాయి పతనం... ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు పురికొల్పాయని పేర్కొన్నారు. అయితే కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగ్గా ఉండటం, చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉండటం, దేశీయంగా స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడటం...ఇవన్నీ మార్కెట్ పతనాన్ని అడ్డుకోగలవని ఆయన అంచనా వేస్తున్నారు. టర్కీ కరెన్సీ లీరా పతనంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి. ఆల్‌టైమ్ హైకి ఇన్ఫోసిస్... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినప్పటికీ, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,411కు చేరింది. చిరవకు 1.7 శాతం లాభంతో రూ. 1,409 వద్ద ముగిసింది. రూపాయి పతనం ఈ షేర్‌కు కలసివచ్చింది. ఈ షేర్‌తో పాటు మరికొన్ని షేర్లు కూడా ఆల్‌టైమ్ హైలను తాకాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బాటా ఇండియా, 3ఎమ్ ఇండియా, బెర్జర్ పెయింట్స్, ఇండియాబుల్స్ వెంచర్స్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, ఫైజర్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ♦ ఈ క్యూ1లో రూ.4,876 కోట్ల నికర నష్టాలు ప్రకటించడంతో ఎస్బీఐ షేర్ 3.1 శాతం నష్టపోయి రూ. 295 వద్ద ముగిసింది. ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంక్ షేర్లూ నష్టపోయాయి. ♦ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గెయిల్ షేర్ 3.5 శాతం లాభపడి రూ.376 వద్దకు చేరింది. ♦ అంతర్జాతీయ అమ్మకాలు 5% తగ్గడంతో టాటా మోటార్స్, టాటా మోటార్స్(డీవీఆర్) షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఇంట్రాడేలో 3 శాతం వరకూ నష్టపోయిన ఈ షేర్లు చివరకు 0.6–2.6 శాతం నష్టాలతో ముగిశాయి. గత మూడు నెలల కాలంలో ఈ షేర్లు చెరో పాతిక శాతం వరకూ పతనమయ్యాయి. లాభాల్లో ఐటీ షేర్లు రూపాయి పతనంతో ఐటీ, టెక్నాలజీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ కంపెనీల ఆదాయం అధికంగా ఇతర దేశాల నుంచి(డాలర్ల రూపంలో) వస్తోంది. డాలర్ బలపడితే ఆ మేరకు ఐటీ కంపెనీల ఆదాయాలూ పెరుగుతాయి. టెక్ మహీంద్రా, మైండ్ ట్రీ, విప్రో, కేపీఐటీ టెక్నాలజీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా ఎలెక్సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు 3 శాతం వరకూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన బంగారం ధరలు న్యూయార్క్: టర్కీ ఆర్థిక సంక్షోభం బంగారం మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో న్యూయార్క్ కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ సంబంధించిన కాంట్రాక్టు సోమవారం రాత్రి 11.30 గంటలకు 1.5 శాతం తగ్గి 1,200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా, టర్కీ మధ్య ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గత శుక్రవారం టర్కీ స్టీల్, అల్యూమినియంపై అమెరికా టారిఫ్‌లను రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. -
జెట్ ఎయిర్వేస్ పరిణామాలపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్పై కేంద్రం దృష్టి సారించింది. కంపెనీ పరిణామాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే చెప్పారు. అయితే, కంపెనీ ఆర్థిక ఆడిటింగ్‌ను నిర్వహించే యోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశారు. తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడాన్ని కూడా జెట్ ఎయిర్వేస్ వాయిదా వేసిన నేపథ్యంలో చౌబే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక సమస్యలు.. ఉద్యోగుల తగ్గింపు తదితర అంశాల గురించి జెట్ ఎయిర్వేస్ తమను సంప్రదించటం వంటివేమీ చేయలేదని చౌబే చెప్పారు. ఈ నెల 2 నుంచి ఇప్పటిదాకా జెట్ ఎయిర్వేస్ షేరు సుమారు 12% పైగా క్షీణించింది. శుక్రవారం ఇంట్రాడేలో 52 వారాల కనిష్ట స్థాయి రూ.258ని కూడా తాకింది. -
ఎంత ధైర్యం.. ఈ పిల్లకి!
అమ్మాయంటే ఇదే చదవాలి.. ఈ ఉద్యోగమే చేయాలి.. ఇలాగే ఉండాలి అన్న మూస ధోరణులు, సంప్రదాయాలు బద్ధలు కొట్టి సమాజంలో తనదైన ప్రత్యేకతను చాటింది మేహ్‌విష్ మెహ్రాజ్ జర్గర్. హోటళ్లు, కేఫ్‌ల వంటి బాధ్యతల నిర్వహణ పురుషులకే చేతనవుతుందన్న భావనను పక్కకునెట్టి జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో కేఫ్‌ను ప్రారంభించిన తొలి కశ్మీరీ యువతిగా మేహ్‌విష్ ఘనతను సాధించింది. మేహ్విష్కు ఏడేళ్ల వయసులోనే ఆమె తండ్రి కేన్సర్‌తో చనిపోగా, నలుగురు సభ్యుల కుటుంబ భారమంతా ఆమె తల్లిపై పడింది. ఆర్థిక సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఆ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయినా ఆ మాతృమూర్తి తన ముగ్గురు పిల్లలను బాగా చదివించింది. అమ్మ కష్టం, జీవితంలో తనకు ఎదురైన ఘటనలు మేహ్విష్ను మరింత రాటుదేలేలా చేశాయి. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని డీకొనేందుకు సంసిద్ధంగా ఉండాలనేపాఠాలను అవి ఆమెకు నేర్పాయి. తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా తల్లి అందించిన స్ఫూర్తితో ధృఢచిత్తంతో ముందుకే సాగింది మేహ్‌విష్. అమ్మాయేంటి! కేఫ్ ఏంటి?! జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న సంక్షుభిత పరిస్థితులు, కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్యనే న్యాయశాస్త్రంలో పట్టాను సాధించింది మేహ్‌విష్. ఆ తర్వాత తన ఆసక్తిని మార్చుకుని వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. అమ్మాయిలు ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అనే విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదు. స్థిరపడిపోయిన ఏదైనా పద్ధతి, విధానాన్ని ఎవరైనా మహిళ మార్చివేస్తే విమర్శలు రావడం సహజమేనని, వారి మాటలు తన కార్యాచరణపై ఎలాంటి ప్రభావం చూపవని నిరూపించింది. మహిళలకు సరిపడిన పనులే చేయాలంటూ ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో ఆమెపై ‘ట్రోల్స్’తో దాడి మొదలైనా వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. ‘‘ఓ మహిళ సొంతంగా ఏదైనా చేస్తే సహించలేని కొందరు విమర్శిస్తుంటారు. అలాంటి వాటిని నేను ఏమాత్రం పట్టించుకోను’’ అంటూ ఆమె తన ఆత్మస్థైర్యాన్ని చాటుతోంది. ‘నేను ఎంచుకున్న రంగంలోనే భిన్నంగా ఏమైనా చేయాలని అనుకున్నాను. నా కుటుంబసభ్యులే ఈ విషయంలో మొదట్లో సంశయించినా ఆ తర్వాత పూర్తి మద్దతునిచ్చారు’’ అంటోంది. కేఫ్ అంటే కేఫ్ కాదు మహిళలు అనగానే బ్యూటీ పార్లరో, బోటికో, వ్యానిటీ షోరూంల నిర్వహణకు పరిమితమనే జనసాధారణ అభిప్రాయాన్ని కాదని కేఫ్‌ను మొదలుపెట్టింది మేహ్‌విష్. శ్రీనగర్‌లోని మునావరాబాద్ ప్రాంతంలో ఇద్దరు మిత్రులతో కలిసి ‘నేను మరియు మీరు’ ( M్ఛ N ్ఖ) అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించింది. దీనిని తన అభిరుచులకు తగినట్టుగా తీర్చిదిద్దింది. కశ్మీర్‌తో సంస్కృతిని ప్రతిబింబించే చీనార్ చెట్లు, ఇతర చిహ్నాలతో ఇంటీరియర్స్ ఉండేలా శ్రద్ధ వహించి దానిని ట్రెండీ కేఫ్‌గా రూపొందించింది. యువత కోరుకున్న భిన్నరుచుల ఆహారాలు ఇక్కడ దొరుకుతుండడంతో ఆమె ప్రయత్నం హిట్టయింది. అయితే అల్లర్లతో ఎప్పుడూ అట్టుడుకుతుండే కశ్మీర్లో ఇలా ఒకమ్మాయి కేఫ్ నడపటం ఎంతవరకు క్షేమం అని మేహ్‌విష్ గురించి తెలిసినవాళ్లు తెలియనివాళ్లు కూడా ఆందోళన చెందుతున్నారు. రెండో బ్రాంచీకీ రెడీ! కేఫ్‌కు యువతీయువకులతో పాటు వివిధ వర్గాల నుంచి ఆదరణ పెరగడంతో శ్రీనగర్‌లోనే రెండో బ్రాంచీ ఓపెన్ చేసేందుకు ఇరవై అయిదేళ్ల మేహ్‌విష్ సిద్ధమైపోయింది! ‘స్వప్నాలు సాకారం చేసుకునేందుకు అంకితభావంతో శ్రమిస్తే ఎవరు మిమ్మల్ని ఆపలేరు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే సొంతంగా మనుగడ సాధించేందుకు ఇక్కడి అమ్మాయిలకు శక్తిసామర్థ్యాలున్నాయి. వ్యాపారాల నిర్వహణ అనేది కేవలం అబ్బాయిలకే పరిమితం కాదు, అమ్మాయిలు కూడా సమర్థంగా నిర్వహించగలరు’’ అంటూ మేహ్‌విష్ తన ఈడు వారిలో చైతన్యం రగిలిస్తున్నారు. ఆమె తీసుకుంటున్న చొరవ, కొత్తదనం కోసం ఉవ్విళ్లూరుతున్న తీరు కశ్మీర్లో మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. వ్యాపారరంగంలో అవకాశాలు పరిమితంగానే ఉన్నా అక్కడి చదువుకున్న అమ్మాయిలు అడ్డంకులను ఛేదించి ప్రస్తుతం ఆర్ట్ సెలూన్లు, బోటిక్‌లు, టెక్ స్టార్టప్‌లు మొదలుపెట్టడం మరో విశేషం. – కె. రాహుల్ -
నోటికి ప్లాస్టర్లు వేసి.. దుప్పట్లలో చుట్టి..
-
కృష్ణా జిల్లాలో కొత్త రకం పైశాచికత్వం
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలో కొత్తరకం పైశాచికత్వం వెలుగుచూసింది. ఆర్థిక లావాదేవీల కారణంగా దంపతులను కిడ్నాప్ చేసి రాత్రంతా కారులోనే తిప్పుడూ దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సత్యనారాయణపురానికి చెందిన చంద్రశేఖర్, రమాదేవిలు దంపతులు. అయితే కొందరు గుర్తుతెలియని దుండగులు వీరిని గురువారం రాత్రి ఇంటి నుంచి కారులో తీసుకెళ్లారు. రాత్రంతా కారులోనూ తిప్పుడు వేధింపులకు గురిచేస్తూ దాడులకు పాల్పడ్డారు. 5 లక్షల రూపాయలు తీసుకున్న అనంతరం శుక్రవారం ఉదయం తిరిగి వారి ఇంటి వద్దే వదిలివెళ్లారు. తమపై కక్షగట్టి ఇలా దాడులకు పాల్పడుతున్నారని బాధిత భార్యాభర్తలు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరుతు వేధింపుల గురించి తమ ఫిర్యాదు చేశారు. రమాదేవికి, చంద్రశేఖర్ స్పల్పగాయాలయ్యాయి. డబ్బులు తీసుకుని వదిలేశారు రాత్రి తొమ్మిదన్నర గంటల సమయంలో 8 మంది ఇంటికి వచ్చి దాడి చేశారని, ఆపై అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 3 గంటల ప్రాంతంలో కారులో ఎక్కించుకుని వెళ్లారు. మైలవరం తీసుకెళ్లి తమపై దాడిచేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలు రమాదేవి తెలిపారు. చివరికి 5 లక్షల నగదు ఇస్తే తమను వదిలిపెట్టారని, తమ పిల్లలను చంపేస్తామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోటికి ప్లాస్టర్లు వేసి.. దుప్పట్లలో చుట్టి.. నాలుగున్నరేళ్లుగా ఇక్కడ ఉంటున్నాం. కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చి దాడి చేసి సెల్ఫోన్లు లాక్కున్నారు. నోటికి ప్లాస్టర్లు వేసి దుప్పట్లలో చుట్టి కారులో మైలవరం తీసుకెళ్లారు. రత్నకుమారి అనే మహిళ ఇంట్లో బంధించి వేధింపులకు గురిచేశారని, పిల్లల్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. రత్నకుమారికి, నా భార్యకు ఆర్థిక లావాదేవిల్లో కొన్ని విభేదాలున్నాయి. దీంతో మా కుటుంబాన్ని కొంతకాలం నుంచి వేధిస్తున్నారు. ఈ వేధింపుల విషయమై ఇదివరకే రెండు పర్యాయాలు రత్నకుమారిపై ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందంటూ బాధితుడు చంద్రశేఖర్ వివరించాడు. -
బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్
-
కలకలం : బాకీ చెల్లించలేదని బాలిక కిడ్నాప్..!
సాక్షి, నందిపేట్/నిజామాబాద్: జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి మైనర్ బాలిక కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. గురువారం మనీశ్వరీ అనే బాలికను స్కూల్ నుంచి ఓ మహిళ అపహరించిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామని అన్నారు. బాలిక తండ్రికి నిందితురాలికి మధ్య డబ్బు విషయంలో తగాదా ఉందని పేర్కొన్నారు. రజితకి బాలిక తండ్రి 3 లక్షల రూపాయలు బాకీ పడ్డాడనీ, ఈ నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం మనీశ్వరీ తండ్రికి ఫోన్ చేసిన రజిత బాకీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేసిందనీ, తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని పోలీసులు వెల్లడించారు. కూతురు అపహరణకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
రానున్న ఏడాది ఆర్థికంగా పురోగతి ఉండదు!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఓ వైపు ప్రభుత్వం చెబుతుంటే... మరోవైపు రానున్న ఏడాది కాలంలో తమ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భావించడం లేదంటూ నగరాల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. జూన్ నెలకు సంబంధించి ఆర్బీఐ నిర్వహించిన వినియోగదారుల విశ్వాస సూచీలో ఈ విషయాలు తెలిశాయి. తమ ఆదాయం, ఉపాధి అవకాశాలు, సాధారణ ఆర్థిక పరిస్థితులు తదుపరి 12 నెలల కాలంలో పురోగతి చెందుతాయని అనుకోవడం లేదంటూ సర్వేలో పాల్గొన్న వారిలో సగానికి పైగా చెప్పడం గమనార్హం. కేవలం 48.2 శాతం మందే ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. నాలు గు నెలల కాలంలో ఇంత తక్కువ ఆశాభావం వ్యక్తం కావడం ఇదే. కాకపోతే మే నెలతో పోలిస్తే జూన్‌లో మొత్తం మీద వినియోగదారుల విశ్వాసం కాస్తంత ఇనుమడించింది. ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 27.7 శాతం మంది అయితే ఆర్థిక పరిస్థితులు మరింత క్షీణిస్తాయని అభిప్రాయం తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో సర్వే కోసం అభిప్రాయాలు తీసుకున్నారు. ►49.8 శాతం మంది రానున్న సంవత్సర కాలంలో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ►49.1 శాతం మంది ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ►25.3 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ ఆదాయం పెరిగిందన్నారు. ►33.5శాతం మంది ఉపాధి అవకాశాలు గత ఏడాదిలో మెరుగుపడ్డాయనగా, 40 శాతం మంది క్షీణించినట్టు చెప్పారు. ►34.6 శాతం మంది గత ఏడాదిలో సాధారణ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినట్టు తెలుపగా, దారుణంగా మారినట్టు 42 శాతం చెప్పారు. -
అనారోగ్యం, అప్పుల సమస్యలతో..
చేవెళ్ల రంగారెడ్డి : అనారోగ్యంతోపాటు, వ్యవసాయంపై చేసిన అప్పలు బాధిస్తుండటంతో ఓ రైతు మనస్థాపం చెంది చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన చేవెళ్ల మండలంలోని చనువెళ్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలంలోని చనువెల్లి గ్రామానికి చెందిన మంగలి బిక్షపతి (38) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడు గత కొంతకాలంగా కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. పలు ఆసుపత్రుల్లో చూపించినా నయం కాలేదు. ఈ గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కడుపులో విపరీతమైన నొప్పి వస్తుండటంతో భరించలేక రెండు మూడుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఉండటంతో ప్రమాదం జరగకుండా చూసుకున్నామని భార్య అనిత తెలిపారు. మళ్లీ ఈ సమస్య రావటంతో గురువారం రోజు మధ్యాహ్నం ఇంటి వద్దకు వచ్చి ఇంట్లోనే కాసేపు పడుకున్నాడు. అయినా బాధ ఎక్కువ కావటంతో భరించలేకపోయాడు. దీనికి తోడు పంటల కోసం చేసిన అప్పులు కూడా ఉండటంతో ఏం చేయాలో తెలియక రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద ఉన్న భార్యాపిల్లలతో మాట్లాడి మళ్లీ వస్తానని చెప్పి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికినా ఎక్కడా కనిపించ లేదు. అర్ధరాత్రి సమయంలో పొలాల వద్ద ఉన్నాడేమోనని వెళ్లి చూస్తే వేప చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శుక్రవారం ఉదయం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తిని కోల్పోవటంతో కుటుంసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య అనిత, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య అనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలా చేస్తే మీ పొదుపు పండినట్టే
ఎంత సంపాదించినా పొదుపు తెలియకపోతే నెల చివరికొచ్చేసరికి రూపాయి కనిపించదు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు, మదుపు చేశామన్నదే వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో కీలకం. ఖర్చులను నియంత్రించుకుని, తగినంత ఇన్వెస్ట్ చేయడం ద్వారానే అన్ని ఆర్థిక పరమైన లక్ష్యాలను చేరడం సాధ్యపడుతుంది. అందుకు ఏం చేయాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేస్తున్న కథనం ఇది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారానే ఆర్థిక భద్రత సమకూరుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయినా, మనలో చాలా మంది అవసరమైనంత పొదుపు చేయరు. కొందరికి అవసరమైనంత మిగులు ఉండదు. కొందరు పొదుపు వాయిదా వేస్తుంటారు. భవిష్యత్తు సంగతి తర్వాత, ముందు ఈ రోజు గడిస్తే చాలనుకుంటారు. పనుల్లో ఆలస్యం జరగకూడదన్న సంకల్పంతో తమ గడియారాన్ని 10–15 నిమిషాలు అధికంగా సెట్ చేసే వారున్నారు. దాంతో నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయగలమని, సమయ పాలన పాటించొచ్చని భావిస్తారు. గడియారం 10 నిమిషాలు వేగంగా నడుస్తుందని వారికి తెలుసు. కాకపోతే క్రమశిక్షణ కోసం వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ తరహా విధానాలు పొదుపు, మదుపులకు కూడా అవసరం. ఇక్కడున్నవి అటువంటివే. ఎంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ఇవి సాయంగా ఉంటాయి. వేతన పెంపు ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనానికి అనుగుణంగా ఖర్చులు, వ్యయాల్లోనూ పెరుగుదల ఉంటుంది. అయితే, ఎంతో కొంత మిగులు ఉంటుంది. దాన్ని సైతం ఖర్చు చేసేయకుండా పెట్టుబడులకు మళ్లించాలి. వేతనం పెరిగిన నెల నుంచే ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. మీరు ఖర్చు చేసేందుకు చాన్స్ తీసుకునే అవకాశం లేకుండా ముందే పెట్టుబడులకు వెళతాయి. పెరిగే వేతనానికి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవాలి. వార్షికంగా వచ్చే బోనస్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోనస్‌ను లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు ఖాతాలు బ్యాంకు ఖాతాలు అధిక సంఖ్యలో ఉన్నా గందరగోళంగా ఉంటుంది. పొదుపు, పెట్టుబడులకు ఓ బ్యాంకు ఖాతాను ప్రత్యేకించడం మంచిది. అయితే, పెట్టుబడుల ఖాతాకు డెబిట్ కార్డును తీసుకోవద్దు. ఇక్కడ ఓ ఉదాహరణ చూస్తే రఘురామ్ తన ఆదాయాన్ని నెలవారీ తప్పనిసరి ఖర్చులు (రుణ వాయిదా తదితర), కిరాణ, ఇంటి వ్యయాల కోసం, పొదుపు, మదుపుల కోసం అంటూ మూడు భాగాలు చేయడం అలవాటు. దీంతో ఒక నెలలో ఖర్చులు ఎన్ని ఎదురైనా గానీ, అతడి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఆగడం లేదు. ఈ తరహా స్ట్రాటజీలను అనుసరించేవారు ఎందరో ఉన్నారు. ఇలా చేయడం సరికాదు అభినవ్ మిశ్రా ఏటా పన్ను ఆదా కోసం తన పెట్టుబడుల వివరాలను కంపెనీకి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే అలవాటు లేదు. దాంతో కంపెనీ అతడి వార్షికాదాయం ప్రకారం టీడీఎస్‌ను నెలవారీ అమలు చేస్తోంది. నిజానికి మిశ్రా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటి అద్దె కూడా భారీగానే చెల్లిస్తున్నాడు. అయితే, ఈ వివరాలను డిసెంబర్ నెలలోనే కంపెనీకి సమర్పిస్తున్నాడు. దీంతో కంపెనీ తర్వాతి మూడు నెలలు (జనవరి–మార్చి) టీడీఎస్ అమలు చేయడం లేదు. దాంతో మిశ్రా చేతికి ఏటా చివరి మూడు నెలలు పూర్తి వేతనం అందుతోంది. కానీ, ఈ విధమైన విధానం సరికాదంటున్నారు నిపుణులు. అంచనాలు తప్పితే మరింత పన్ను చెల్లించాల్సి వస్తుంది. మరో కోణంలో టీడీఎస్ వెనక్కి వచ్చేందుకు నెలల సమయం పడుతుంది. పైగా టీడీఎస్ రిఫండ్ అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. మరోవైపు జనవరి నుంచి మార్చి వరకు పూర్తి వేతనం వస్తుంది. ఈ అధికంగా వచ్చే నిధుల్ని అర్థవంతంగా ఇన్వెస్ట్ చేసినప్పుడే ప్రయోజనం నెరవేరుతుంది. లేక ఆ మొత్తం ఖర్చులకు వెళ్లిపోతే నష్టపోయినట్టే. లగ్జరీకి పోతున్నారా...? ప్రతీ ఒక్కరికీ లైఫ్‌స్టయిల్ కోరికలు ఉండడం సహజంగా మారింది. హాలిడేటూర్కు వెళ్లాలని, బయట డిన్నర్ చేయాలని, స్టయిల్‌గా ఉండే డ్రెస్ తీసుకోవాలి, మంచి ఫీచర్లతో కూడిన సెల్‌ఫోన్ చేతిలో ఉండాలని ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటుంటాయి. అయితే, వీటిని త్యాగం చేయాలని చెప్పడంలేదు. కానీ, వీటిని కొనుగోలు చేసేవారు అదేసమయంలో అంతే మొత్తం నగదును పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. రెండు ఖర్చులకు తగ్గ స్థాయిలో ఆదా చేయగలగడం. ఈఎంఐ మంచిదే! పొదుపు చేయలేకపోతున్నవారు పర్సనల్ లోన్ తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. రెండు, మూడేళ్ల పాటు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో వేతనం నుంచి రుణం చెల్లించడం చేస్తారు. దీనివల్ల పొదుపు అలవడినట్టే. అయితే, రుణం తీరిన తర్వాత కూడా ఈఎంఐ ఎంత అయితే చెల్లించారో అంతే మొత్తాన్ని పెట్టుబడులకు ఆటోమేటిగ్గా వెళ్లేలా సెట్ చేసుకోవాలి. దీనివల్ల పొదుపు అలవడుతుంది. అప్పటి వరకు ఈఎంఐగా చెల్లించి ఉంటారు కనుక ఆ తర్వాత అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం భారంగా అనిపించదు. పర్సనల్ లోన్ కింద తీసుకున్న మొత్తాన్ని అధిక రాబడులను ఇచ్చే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. సాయం తీసుకోండి... మీకు అత్యంత సన్నిహితులను మీ పొదుపు, మదుపులను పరిశీలించేందుకు అనుమతించొచ్చు. ఆర్థిక విషయాలపై పట్టు సాధించలేని పరిస్థితుల్లో వారి సాయం పొందడంలో తప్పులేదు. వారు మీ ఖర్చులు, పొదుపులపు పరిశీలించి ట్రాక్‌లోనే ఉన్నదీ, లేనిదీ చూస్తారు. ట్రాక్ తప్పితే అప్రమత్తం చేస్తారు. ఇక మీకు సన్నిహితులైన వారితో కలసి ఆర్థిక విషయాల్లో, ప్రణాళిక, పెట్టుబడుల్లో పోటీ వాతావరణం ఉండేలా చూసుకోవడం కూడా తెలివైన యోచనే. ఖర్చుకు ముందు ఒక్క నిమిషం ప్రతీ ఖర్చు కూడా మీ బడ్జెట్‌కు చిల్లు పెట్టేదే. అందుకే కొనుగోలుకు ముందు కాస్తంత సమయం ఇవ్వడం (తాత్కాలికంగా ఆగడం) ద్వారా అది నిజంగా అవసరమా, లేక కోరికా అన్నది తేల్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. నిజంగా అవసరమే అయితే కొనుగోలుకు ముందుకు వెళ్లొచ్చు. లాక్ చేయడం దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కోరుకున్నప్పుడు వెనక్కి తీసుకోలేం. ఇది ఒకింత ఇబ్బందే. అయితే, దీనిలో ప్రయోజనమూ ఉంది. ఇలా అయినా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు. పీపీఎఫ్ 15 ఏళ్ల కాల వ్యవధితో కూడినది. అయితే, ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు వీలు కల్పిస్తుంది. ఎన్పీఎస్ రిటైర్మెంట్కు ముందు విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అయితే, ఈ మధ్య కొన్ని ప్రత్యేక అవసరాల్లో విత్‌డ్రాకు వీలు కల్పిస్తామని ఎన్పీఎస్ ప్రకటించింది. బీమా పాలసీలు అయితే 15–30 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే ల్యాప్స్ అయిపోతుందని, సరెండర్ చేస్తే తక్కువగా రావడం వల్ల నష్టపోవాల్సి ఉంటుందన్న భయంతో కచ్చితంగా పాలసీని నిర్ణీత కాలం వరకు కొనసాగిస్తారు. భవిష్యత్తుపై స్పష్టత 20–30 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి రిటైర్మెంట్ పెద్ద ప్రాముఖ్యం అనిపించకపోవచ్చు. అలా అని రిటైర్మెంట్కు ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆలస్యం చేయడం సరికాదు. ఎందుకంటే చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయో జనంతో దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుంది. అందుకని మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతలు, మీ ఆదాయం, అవసరాలకు అనుగుణంగా తగిన ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. ప్రతీ లక్ష్యానికి ఎంత వ్యవధి ఉంది, ఎంత మొత్తం సమకూరాలి, అందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ సాధనంలో అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే నిపుణుల సాయం తీసుకునేందుకు వెనుకాడరాదు. -
రైతును మింగిన అప్పు
కోహీర్(జహీరాబాద్): అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సజ్జాపూర్‌లో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన రైతు విజేందర్ తన తండ్రి రామన్న పేరు మీద ఉన్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాక రూ. రూ. 4 లక్షల మేర అప్పులు చేశాడు. గత రెండు నెలల క్రితం గ్రామంలో ఉన్న 200 గజాల ఇంటి స్థలాన్ని రూ. లక్షకు అమ్మి కొంత మేర అప్పులు తీర్చాడు. మిగతా అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భార్య పుష్పవతితో కలిసి పొలానికి వెళ్లాడు. అనంతరం నైలాన్‌తాడును కొంత మేర కత్తిరించుకొని ఇంటి వైపు బయలుదేరాడు. అనుమానం వచ్చిన భార్య పని చేస్తున్న కూలి ఒకరికి తన భర్త విజేందర్‌ను అనుసరించమని చెప్పి పంపించింది. తాను కూడా ఇంటికి వచ్చింది. ఆ లోపే విజేందర్ ఇంటికి వచ్చి దూలానికి ఉరివేసుకున్నాడు. ఇరుగుపొరుగు సహాయంతో తాడు విప్పి కిందికి దింపి చూడగా అప్పటికే విజేందర్ చనిపోయాడు. మృతిడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
దివ్యాంగుడికి హీరో ఆర్థిక సాయం
పెరంబూరు: నటుడు ఉదయనిధి స్టాలిన్ ఓ దివ్యాంగుడికి ఆర్ధిక సాయం అందించారు. తంజై టౌన్, కరంబై ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు అరుళ్ సహాయరాజ్. అదే ప్రాంతంలో చిల్లర దుకాణం నడుపుతున్నాడు. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో నటుడు ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరుతూ ఆయన అభిమాన సంఘం ద్వారా లేక రాశారు. సోమవారం తంజైలో జరిగిన ఒక వివాహవేడుకలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. అనంతరం ఆ ప్రాంతంలోని అరుణ్ సహాయరాజ్ ఇంటికి వెళ్లి రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. అరుళ్ సహాయరాజ్ ఆనందంతో కంట తడిపెట్టాడు. ‘తాను ఉదయనిధి స్టాలిన్‌ను సాయం కోరాను గానీ, ఆయన ఇలా స్వయంగా ఇంటికి వచ్చి సాయం చేస్తారని ఊహించలేదు’అన్నాడు. -
ఆత్మహత్యాకేంద్రంగా అమెరికా!
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో ఆత్మహత్యలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. 2007 నుంచి 2016 వరకు ప్రతియేటా ఆత్మహత్యలకు పాల్పడుతోన్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అమెరికాలోని మరణాలకు తొలి పది ప్రధాన కారణాల్లో ఆత్మహత్య ఒకటి. అక్కడ ప్రతియేటా 44,965 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రతి 12.3 నిముషాలకూ ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి ఐదుగురిలో ఒకరు మహిళ. 2016లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా 19.72. అంతకు ముందు 85 ఏళ్ళలో ప్రతియేటా అత్యధికంగా 18.98 శాతం అమెరికన్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యచేసుకున్న వాళ్ళు అప్పటికి పదుల సార్లు అందుకు ప్రయత్నించిన వారే. ప్రతిరోజూ సగటున 123 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 45 నుంచి 54 ఏళ్ళమధ్య వయస్కులైన వారే ఎక్కువ. అమెరికా యువతలో ఆత్మహత్యలు తక్కువ. 2016లో జరిగిన ఆత్మహత్యల్లో 51 శాతం తుపాకులతో కాల్చుకొని మరణించినవే. మహిళలకన్నా పురుషులు 3.53 రెట్లు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పశ్చిమ యూరప్‌తో పోల్చుకుంటే అమెరికాలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది చాలా తక్కువనే స్పష్టమౌతోంది. ఉదాహరణకు అమెరికా జిడిపిలో కేవలం 18.8 శాతం మాత్రమే సంక్షేమ రంగానికి కేటాయిస్తున్నారు. మిగిలిన చాలా దేశాల్లో ఆయా దేశాల ఆర్థికాభివృద్ధిలో కనీసం 25 శాతం ఆ దేశ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయిస్తున్నారు. అమెరికాలో పేద, ధనిక అంతరాలు సైతం అక్కడ ఆత్మహత్యలు పెరగడానికి కారణమౌతోంది. సోషల్ స్ట్రెయిన్ థియరీననుసరించి ఎక్కడైతే ధనిక పేదల మధ్య తారతమ్యాలు అధికంగా ఉంటాయో అక్కడ అట్టడుగు వర్గాలు అవస్థలు పడతారు. అందులోనుంచే వ్యసనాలకు బానిసలౌతారు. నేరప్రవృత్తి పెరుగుతుంది, మానసిక కుంగుబాటు మొదలవుతుంది. మొత్తంగా ఆర్థిక ఆసమానతలూ, సంక్షేమ పథకాలను విస్మరించడం అనే రెండు కీలకమైన విషయాలు సమాజంలో అంతరాలను పెంపొందించడమేకాకుండా అదే ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణంగా తయారైనట్టు అక్కడి పరిశోధకులు భావిస్తున్నారు. -
స్టాక్స్ వ్యూ
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుత ధర: రూ.1,197 టార్గెట్ ధర: రూ.1,600 ఎందుకంటే: భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇది. కంపెనీ నిర్వహణ ఆస్తులు రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా 25 శాతానికి పైగా చక్రగతిన రుణ వృద్ధి సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ అనుసరిస్తున్న రిస్క్ మేనేజ్మెంట్ విధానాలు, డిజిటైజేషన్‌ను వినియోగించుకుంటున్న తీరు, ఉత్పాదకత మెరుగుదల తదితర అంశాల కారణంగా ఈ లక్ష్యాలను కంపెనీ సాధించగలదని విశ్వసిస్తున్నాం. అందుబాటు ధరల గృహరంగానికి డిమాండ్ బాగా పెరుగుతుండటంతో నిర్వహణ ఆస్తులు 2022–23 ఆర్థిక సంవత్సరం కల్లా రూ.4 లక్షల కోట్లకు పెరుగుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు సమస్యలతో సతమతం అవుతుండటంతో ఆస్తులు తనఖాగా ఇచ్చే రుణాల(ఎల్ఏపీ)కు డిమాండ్ బాగా ఉండగలదని కంపెనీ భావిస్తోంది. రెరా అమలు కారణంగా కన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కూడా జోరందుకోగలుగుతుందని అంచనా. విదేశీ వాణిజ్య రుణ(ఈసీబీ) నిబంధనలను ఆర్బీఐ సరళీకరించడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశమే. ఇప్పటివరకూ టాప్ 20 నగరాలపైనే దృష్టి పెట్టిన ఈ కంపెనీ చిన్న నగరాలు, పట్టణాల్లో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ సిటీ హోమ్ లోన్లు, ఈ–హోమ్ లోన్లకు ప్రాధాన్యత ఇస్తోంది. రాబడి నిష్పత్తులు ఉత్తమమైన స్థాయిలోనే ఉన్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 30 శాతానికి పైగా, రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 2.8 శాతనానికి పైగా ఉన్నాయి. గృహ రుణాలకు డిమాండ్ పెరుగుతుండటం, కంపెనీ ట్రాక్ రికార్డ్ బలంగా ఉండటం... సానుకూలాంశాలు. రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం ఏర్పడితే, అది ఈ కంపెనీపై తీవ్రమైన ప్రభావమే చూపించవచ్చు. డిఫాల్ట్‌లు పెరగడం, రిస్క్ వెయిటేజ్ పెంచడం, రీ ఫైనాన్స్ విషయంలో వడ్డీరేట్లపై పరిమితి వంటి అంశాలపై నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినతరం చేయడం.. ఇవి ప్రతికూలాంశాలు. మారుతీ సుజుకీ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.8,890 టార్గెట్ ధర: రూ.10,525 ఎందుకంటే: అంచనాలను మించిన అమ్మకాలు సాధించినా ఈ ఏడాది ఈ షేర్ పెద్దగా పెరగలేదు. ఇంధన ధరలు అధికంగా పెరగడం, జపాన్ కరెన్సీ యెన్ బలపడటం, మాతృకంపెనీ సుజుకీ. టయోటాతో భాగస్వామ్యం విషయంలో పురోగతి పెద్దగా లేకపోవడం తదితర అంశాలు దీనికి కొన్ని కారణాలు. అయితే గతంలో ఇంధన ధరలు పెరిగినా, వాహన విక్రయాలు తగ్గిన దాఖలాలు లేవు. ఇంధన ధరలు పెరిగినా డిమాండ్‌పై పెద్దగా ప్రభావం లేదని డీలర్లంటున్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను ఈ కంపెనీ అధిక సంఖ్యలో అందిస్తోంది. సీఎన్జీతో నడిచే ఆరు మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఈ వాహనాలకు డిస్కౌంట్లు ఇవ్వనవసరం లేదు. పైగా ధరల నిర్ణయంలో కంపెనీకి స్వేచ్ఛ ఉంటుంది. కమోడిటీల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. అయితే వ్యయ నియంత్రణ పద్ధతులతో పాటు వాహనాల ధరలను పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించగలమని కంపెనీ ధీమాగా ఉంది. టొయోటాతో మారుతీ సుజుకీ మాతృకంపెనీ సుజుకీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫలితంగా టయోటా ఎలక్ట్రానిక్ వాహన టెక్నాలజీ మారుతీకి అందనున్నది. వివిధ రకాల వాహనాలను అందుబాటులోకి తేవడం, డిస్కౌంట్లు తగ్గించడం, మాతృకంపెనీ సుజుకీకి చెల్లించాల్సిన రాయల్టీ తగ్గనుండటం, గుజరాత్ ప్లాంట్ పునర్వ్యవస్థీకరణ తదితర అంశాల కారణంగా కంపెనీ నిర్వహణ లాభ మార్జిన్ 2 శాతం పెరిగి 14 శాతానికి చేరగలదని అంచనా. అమ్మకాలు అంతకంతకూ పెరుగుతుండటం, మార్జిన్లు అధికంగా ఉండటం, మార్జిన్లు అధికంగా ఉండే ప్రీమియమ్ మోడళ్లను పెంచుతుండటం, జపాన్ కరెన్సీ యెన్ ప్రభావం తగ్గే అవకాశాలు, మార్కెట్ వాటా పెరుగుతుండటం, ...ఇవన్నీ సానుకూలాంశాలు. ఏడాది కాలంలో ఈ షేర్ రూ.10,525కు చేరుతుందని అంచనా వేస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
ఆర్థిక ఇబ్బందులకు జర్నలిస్టు కుటుంబం బలి
సాక్షి, సిద్దిపేట: ఆర్థిక ఇబ్బందులకు ఓ జర్నలిస్టు కుటుంబం బలైంది. ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న సావిలి హన్మంతరావు (35) అనే వ్యక్తి భార్యకూతుళ్లను చంపి బలవన్మరణానికి పాల్ప డ్డాడు. తాను చనిపోతే కుటుంబం అనాథగా మారుతుందన్న ఉద్దేశంతో భార్య, ఇద్దరు కూతుళ్లను కూడా కడతేర్చాడు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భరత్‌నగర్‌లో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన హన్మంతరావు, హారిక(29) దంపతులు సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి దీక్షశ్రీ (6), షైన్‌శ్రీ (4) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హన్మంతరావు ప్రస్తుతం కొండపాక మండలంలో ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తుండడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే పలు ప్రైవేట్ కంపెనీల ఏజెంటుగా, గజ్వేల్‌లో ఇఫ్కో కిసాన్ సిమ్‌కార్డుల డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. అయితే వ్యాపారాల్లో నష్టం రావడంతోపాటు ఓ మహిళ, మరో వ్యక్తి బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే కుటుంబ సభ్యులు అనాథలవుతారని ఆలోచించి గురువారం ఉదయం భార్య మెడకు తాడు చుట్టి గట్టిగా లాగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో భార్య చనిపోయిందని భావించి కూతుళ్లను గొంతునులిమి చంపేశాడు. అనంతరం హైదరాబాద్‌లో ఉన్న చిన్నమ్మకు ఫోన్ చేసి చనిపోతున్నట్లు చెప్పాడు. ఈ సమాచారం అందుకున్న అతని అన్న పురుషోత్తం భరత్‌నగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా హన్మంతరావు ఉరివేసుకుని కనిపించాడు. పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కొన ఊపిరితో ఉన్న భార్యను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏసీపీ రామేశ్వర్, సీఐ నందీశ్వర్‌లు పరిస్థితిని సమీక్షించారు. సూసైడ్ నోట్ లభ్యం కరీంనగర్లో పనిచేస్తున్న ఓ మహిళ, తన షాపులో పని చేస్తున్న వ్యక్తి తమ మృతికి కారణమని మృతుడు హన్మంతరావు సూసైడ్ నోట్ రాసి ఉంచినట్టు తెలుస్తోంది. తన షాపుపై కన్నేసిన ఆ మహిళ తరచూ తనను బ్లాక్ మెయిల్ చేసేదని, షాపు వదిలేయాలంటూ బెదిరించేదని పేర్కొన్నాడు. అలాగే చిట్టీలు వేయగా వచ్చిన రూ.7 లక్షలకు పైగా డబ్బును వారు వాడుకున్నారని, వాటిని అడిగితే కేసులు పెడతామని భయపెట్టారని అందులో రాసినట్టు సమాచారం. అలాగే అప్పులు ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని దుర్భాషలాడారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా, తదుపరి దర్యాప్తు అనంతరం సూసైడ్ నోట్లో పేర్కొన్న వ్యక్తుల పేర్లు వెల్లడయ్యే అవకాశముందని సమాచారం. -
కలిసే ‘పోయారు’
కోనరావుపేట(వేములవాడ) : ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కూతురు, కుమారుని వివాహం, బార్య అనారోగ్యంతో అప్పులు పెరిగిపోయాయి. దీనికితోడు వ్యాపారం నడవకపోవడంతో ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో ఆ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడడుగువేసి ఒక్కటై.. చావులోనూ కలిసే‘పోయారు’ పోలీసుల వివరాల ప్రకారం... కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన యెల్లెంకి శ్రీనివాస్(45) గ్రామంలోనే పత్తి, కిరాణా వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి భార్య పద్మ(40), కుమారుడు కార్తీక్, కూతురు సృజన ఉన్నారు. మూడేళ్ల క్రితం కూతురు, కుమారుడి వివాహాలు చేశాడు. దీంతో పెద్ద ఎత్తున అప్పులయ్యాయి. దీనికితోడు భార్య పద్మ అనారోగ్యానికి గురయ్యింది. ఆస్పత్రుల్లో చికిత్స, ఆపరేషన్లకు రూ.లక్షల్లో ఖర్చు అయ్యింది. అన్ని అప్పులు కలిసి రూ. కోటి 20లక్షలకు చేరుకున్నాయి. ఇల్లు అమ్మినా.. అప్పుల బాధలకు తాళలేక సిరిసిల్లలో ఉన్న ఇంటికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. అయినా ఇంకా అప్పులు రూ. 50 లక్షల వరకు ఉన్నాయి. గత రెండు, మూడేళ్లుగా వ్యాపారం సాగడంలేదు. అప్పులెలా తీర్చాలన్న బెంగతో గత కొన్ని రోజులుగా మథనపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మంగళవారం వేకువజామున క్రిమిసంహారకమందు సేవించి దంపతులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. సింగిల్‌విండో చైర్మన్ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్ రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. కోనరావుపేట ఏఎస్సై ప్రమీల వివరాలు సేకరించారు. -
యువకుడి ఆత్మహత్య.. కలకలం
సాక్షి, మేడ్చల్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కీసర మండలం దమ్మాయిగూడలో ఫైనాన్సియర్ ఒత్తిడితో మంగళవారం ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలివి.. మహమ్మద్ హనీఫ్ దమ్మాయిగూడలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. అతను నాగారం నుంచి దమ్మాయిగూడకు వచ్చి వెళ్లేవాడు. ఆ సమయంలో షాహిదా అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. మమహ్మద్ హనీఫ్‌కు కొంత డబ్బు అవసరమైంది. షాహిదాను కలిసి తెలిసిన వారి వద్ద రూ. 1,40,000 అప్పుగా ఇప్పింమని అడిగాడు. కాప్రా మండలం, సాయినగర్‌కు చెందిన శ్రీకాంత్ గౌడ్ అనే ఫైనాన్స్ వ్యాపారి వద్ద షాహిదా అప్పు ఇప్పించింది. కానీ మహమ్మద్ తీసుకున్న అప్పు కట్టలేదు. దీంతో శ్రీకాంత్ గౌడ్ షాహిదాను నువ్వు కట్టాల్సిందే అని హెచ్చరించాడు. అనంతరం మహమ్మద్, షాహిదాల మధ్య మంగళవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. అతను ఆవేశంగా ట్యూషన్ చెప్పే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని గొళ్ళెం పెట్టుకున్నాడు. కోపం వచ్చినప్పుడు తరచూ ఇలానే చేసేవాడని షాహిదా పట్టించుకోలేదు. అతను ఎంతసేపటికి బయటకు రాలేదు. అనుమానం వచ్చి షాహిదా కిటికిలో నుంచి చూసింది. అతను ఫ్యాన్‌కు ఉరి వేసుకుని నిర్జీవంగా కనిపించాడు. వెంటనే ఆమె 100 నంబర్‌కి ఫోన్ చేసి జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటన స్థలం చేరుకుని పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతని మరణ వార్త విని కుటుంబ సభ్యలు షాక్‌కు గురయ్యారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కొడుకు చావుకు శ్రీకాంత్ గౌడ్, షాహిదాలే కారణమని కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. -
‘ఐసీఐసీఐ‘ సన్నిహిత సంస్థలపై నిఘా!
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు నుంచి పలు కంపెనీలకు రుణాల జారీ వెనుక బ్యాంకు చీఫ్ చందాకొచర్‌కు ఆర్థిక ప్రయోజనాలు చేకూరాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. ఈ వివాదంలో బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలను కలిగిన పలు కంపెనీలకు సంబంధించి పరిశీలన మొదలు పెట్టినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ వివాదంలో పేర్లు బయటకు వచ్చిన కంపెనీలకు సంబంధించి మోసపూరిత, ప్రిఫరెన్షియల్ లేదా విలువ తక్కువ చేసి చూపించిన లావాదేవీల ఆరోపణలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహారాలను కార్పొరేట్ వ్యవహారాల శాఖ చూడడం లేదని, ఇది పూర్తిగా ఆర్బీఐ పరిధిలోని అంశమని ఆ అధికారి స్పష్టం చేశారు. ఆయా కంపెనీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వెనుక ‘నీకది, నాకిది’ రూపంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. వీడియోకాన్ గ్రూపు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్‌కు చెందిన నూపవర్ రెన్యువబుల్స్ కంపెనీలోకి నిధుల్ని మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంక్ చీఫ్ చందాకొచర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు గత నెలలోనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. -
నియంతృత్వ పోకడలకు ఓటమి తప్పదు
మొత్తం మీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు తమ చదువులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతున్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖరిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన వ్యాఖ్యల వల్ల దళిత, బహుజన, మైనార్టీ వ్యతిరేకిగా ముద్రపడింది. జూన్ రెండు నుంచి ప్రారంభమయ్యే నవనిర్మాణ దీక్షలకు ఆంధ్రప్రదేశ్ విధ్వంసక దీక్షలని పేరు పెడితే బాగుండేది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యవసాయ, పారి శ్రామిక, సేవా రంగాలను ఇతర దేశాలకు తాకట్టు పెడుతూ వచ్చారు. పది లక్షల మంది యువకులకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌తో ప్రకటన చేయించారు. రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు, కొత్త ఉద్యోగాలు కల్పించినట్టు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో భూములు, మౌలిక వనరులను విదేశీ పెట్టుబడి దారులకు అమ్ముతున్నారు. ముఖ్యమంత్రికి ఓడ రేవుల నిర్మాణం మీద దృష్టి లేదు. విపరీతంగా అడవులు నరకడం, ఇసుక తవ్వ కాల వల్ల కోస్తా ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత లోపిం చింది. తెలుగుదేశం మహాసభల్లో దళితులకు సబ్‌ప్లాన్ నిధుల పరిరక్షణపై తీర్మానం చేయలేదు. దళిత భూముల్ని నీరు, చెట్టు పేరుతో ఆక్రమించి భూస్వాముల అధీనంలోకి వెళ్లేలా చేస్తు న్నారు. నాలుగేళ్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో తెలుగు దేశం భాగస్వామిగా కొనసాగింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ప్యాకేజీ చాలని గతంలో ప్రకటించిన సీఎం ఇప్పుడు తన అనుయా యులతో మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను హిట్లర్, ముసో లిని అంటూ తిట్టిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములను చంద్ర బాబు సర్కారు సేకరించింది. వీటన్నిటినీ విదేశీ, స్వదేశీ పెట్టుబడి దారులకు పారిశ్రామిక ప్రోత్సాహం పేరిట కేవలం రూ.100 కోట్లకే ఇస్తున్నారు. రాష్ట్రానికి 90 శాతం కేంద్రం గ్రాంటుగా ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేది రు.25,000 కోట్లు మాత్రమే. ఇందులో రు.13,000 కోట్లు ఇప్పటికే ఇచ్చినట్టు కేంద్రం చెబుతోంది. విదేశీ బ్యాంకుల నుంచే ఎక్కువ రుణాలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాష్ట్రంలో చిన్న పిల్లల మీద అత్యాచారాలు పెరగ డానికి విపరీతంగా పెరుగుతున్న మద్యం దుకాణాలే కారణం. గుంటూరు జిల్లాలోని అనేక పట్టణాల్లో తెలుగుదేశం నాయకులు మద్యం దుకాణాలు నడుపుతున్నారు. రాష్ట్రంలో తాగుడువల్ల మర ణించిన వారి సంఖ్య పెరుగుతోంది. వారి పిల్లలు అనాథలవుతు న్నారు. అత్యాచారానికి గురయ్యే పిల్లల్లో కూడా తండ్రిలేని పిల్లలే ఎక్కువ. తెలుగుదేశం స్థాపకుడు, చంద్రబాబు మామ ఎన్టీ రామా రావు ప్రజల కోరిక మేరకు 1995లో మద్యపాన నిషేధం ప్రవేశపె ట్టారు. ఎన్టీఆర్ తర్వాత సీఎం పదవి చేపట్టిన బాబు నెమ్మదిగా నిషేధం సడలించి తర్వాత పూర్తిగా ఎత్తి వేశారు. బిహార్‌లో రెండేళ్ల క్రితం మద్య నిషేధం ప్రకటించాక ఉత్పాదకత, ప్రజల ఆదా యాలు పెరిగాయి. ఫలితంగా పెట్టుబడిదారులు పరిశ్రమలు పెట్టడానికి బిహార్ పరిగెత్తుతున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీకి అత్యవసరం. తెలుగుదేశం పాలనలో నదులు, చెరు వులు మురికి కూపాలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో దళితుల కష్టాలు పెరిగిపోతున్నాయి. వారిలో 80 శాతం వ్యవసాయ కూలీలే.. వ్యవసాయంలో యంత్రాల విని యోగం పెరగడంతో కూలి దినాలు తగ్గిపోతున్నాయి. దళితులు వలస బాట పట్టాల్సి వస్తోంది. ఈ వలసల వల్ల వృద్ధులు, చదువుకునే పిల్లలకు ఆసరా లేకుండా పోయింది. దళితులకు ఇతర ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. దళితులకు ప్రధాన ఉపాధి వనరు భూమి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎకరం భూమి కూడా దళితులకు ఇవ్వలేదు. భూమి దళి తుల ఆత్మగౌరవానికి హామీ ఇస్తుంది. గ్రామం పునాదులు గట్టి పడాలంటే దళితులకు భూమి ఇవ్వాలని బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. భారతదేశం మొదటి ప్రణాళికలోనే దళితులకు భూమి కొనుగోలు పథకాన్ని ప్రవేశపెట్టారు అంబేడ్కర్. వ్యవసాయ ఆధా రిత పరిశ్రమల వృద్ధి, నదులు, సముద్రాలను ఉత్పత్తికేంద్రాలుగా మార్చడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బాబు పాల నలో గనుల తవ్వకాల వల్ల ఈ మూడు పనులు ఆగిపోయాయి. రాష్ట్రంలో భవన నిర్మాణం, ఉపాధి పనుల్లో, ముఖ్యంగా సామా జిక, సాంస్కృతిక, ఆర్థిక కార్యకలాపాల్లో దళితులే కీలక పాత్ర పోషిస్తున్నారు. దళితుల జీవన వ్యవస్థల్ని బలహీన పరచడం వల్ల రాష్ట్రం ముందుకు సాగదని పాలకులు గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగాన్ని బాగా దెబ్బతీస్తూ, ప్రైవేటు రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దానివల్ల దళి తులు, బహుజనులు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు దూరమౌ తున్నారు. 2018–19లో దళితులకు రూ.11,228 కోట్లు ఉప ప్రణా ళిక కింద, రూ.4,278 కోట్లు బడ్జెట్ కింద చూపారు. అదే విధంగా ఆదివాసీలకు (గిరిజనులకు) రూ.27,566 కోట్లు బడ్జెట్ ఉప ప్రణాళిక కింద కేటాయించారు. దళితులు, ఆదివాసీలకు కేటా యించిన నిధుల్లో కనీసం 70 శాతం ఖర్చు చేసినా కొంత సమాజిక మార్పు జరిగేది. మొత్తంమీద తెలుగుదేశం పాలనలో దళితులు, బహుజనులు, మైనార్టీలు, రైతులు–ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు తమ చదు వులకు ఉద్యోగం రాదనే నిరాశతో వ్యసనాలకు బానిసలౌతు న్నారు. బాబు తమ సమస్యలు పరిష్కరించలేరనీ, ఆయన వైఖ రిలో మార్పు తీసుకురాలేమని అన్ని వర్గాల ప్రజలు భావిస్తు న్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాబు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వాన్ని ఓడించడమే తెలుగు ప్రజలకు ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఉపాధి కల్పనలో, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం కావడం, పెట్రోలు, డీజిల్ ధరలు అదుపుచేయలేకపో వడం వంటి కారణాల వల్ల కేంద్రంలో పాలకపక్షమైన బీజేపీ, దాని మిత్రపక్షాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయం పాలయ్యాయి. అనేక రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, పేదలు పాలకపక్షాలకు వ్యతిరేకంగా ఏక మౌతున్నారు. అదే మార్గంలో ఏపీలో కూడా ప్రజలు పాలక పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడే రాజకీయ సమీకరణలకు మద్దతు పలకాలి. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టించుకోకుండా ధనికులకే దోచిపెట్టే పార్టీలను ఓడించడానికి సామాజిక సమీకరణలు తోడ్ప డతాయి. సామాజిక విప్లవకారులు బి.ఆర్. అంబేడ్కర్, మహాత్మా ఫూలే ఆలోచనలు ప్రతిపక్షాల వాక్కుల్లో, ఆచరణలో ప్రతిబింబిం చాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పోకడలకు తావు లేదు. అప్రజాస్వామిక విధానాలతో పేద, బలహీన వర్గాల క్షేమం పట్టించుకోని నేతలను ఎన్నికల్లో ఓడించిన చరిత్ర మనది. - డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ‘ 98497 41695 -
జననేత ఆదేశాలతో..
దేవీపట్నం (రంపచోడవరం): గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ మృతుల కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించేందుకు బయలుదేరిన ఆ పార్టీ నేతలు మన్యంలో నెలకొన్న భద్రతా కారణాల రీత్యా మార్గం మధ్య నుంచే వెనుదిరిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సాయాన్ని అందించేందుకు ఎమ్మెల్సీ పిల్లి సుభాస్ చంద్రబోస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్, పార్టీ నాయకుడు కర్రి పాపారాయుడు సోమవారం బయలుదేరి మండలంలోని ఇందుకూరుపేట వరకూ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టులు సోమవారం ఏవోబీ బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మన్యంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఏజెన్సీలోని మూరుమూల ప్రాంతాలకు ప్రముఖులు వెళ్లేందుకు పోలీసులు అనుమతించ లేదు. లాంచీ మృతులు 19 మంది కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం చేసేందుకు అనుమతించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నాయకులు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీని ఫోన్లో కోరారు. నాయకుల భద్రతా దృష్ట్యా అందుకు సమ్మతించలేదు. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు వైఎస్సార్ సీపీ నేతలు లాంచీ ప్రమాద బాధిత గ్రామాలైన కచ్చులూరు, గొందూరు, తాళ్లూరు, కొండమొదలు వెళ్లకుండానే వెనుతిరిగారు. అంతకు ముందు వైఎస్సారీసీపీ మండల నాయకులు, ఎంపీపీ పండా జయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు మట్టా రాణి, పార్టీ నాయకులు కుంజం చెల్లన్నదొర, గారపాటి మురళీకృష్ణ, కందుల బాబ్జీ, తుర్రం జగదీష్, కలుం స్వామిదొర, శిరశం పెద్దబ్బాయిదొర, కోమలి కిషోర్ తదితరులు దేవీపట్నం పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని ఎగువ గ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దేవీపట్నం ఎస్సై వెంకరత్నం మన్యంలో నెలకొన్న పరిస్థితులను వైఎస్సార్ సీపీ నాయకులకు వివరించారు. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆయా గ్రామాలకు వెళ్లి, బాధితులను పరామర్శించి ఆర్థిక సాయాన్ని అందజేస్తామని అనంత ఉదయభాస్కర్ తెలిపారు. -
ఆపరేషన్‌కు ఆర్థిక సాయం అందించిన వైఎస్ జగన్
-
మెకానిక్‌ల బతుకులు దుర్భరం
బీబీపేట : ప్రస్తుతం కాలంలో బైకు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పెరుగుతున్న అవసరాల రీత్యా ఒక్కో ఇంట్లో రెండేసి, మూడేసి బైక్‌లు ఉంటున్నాయి. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన యజమాని సర్వీసింగ్, రిపేర్ చేయించక తప్పదు. కానీ బైక్ మెకానిక్‌లు పొద్దంతా కష్టపడి పని చేసినా, ఏళ్లు గడిచినా వారి జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. నానాటికి పెరిగిపోతున్న వాహనాల విడిభాగాల ధరలతో మెకానిక్‌లకు ఆదాయం తగ్గిపోతోంది. మరమ్మతులు చేస్తే వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. దీంతో మెకానిక్‌లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడు కొత్త వాహనాలపై మోజు పెంచుకోవడంతో తమ వృత్తి తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగానే చార్జీలు.. బైక్ సర్వీసింగ్‌కు మెకానిక్‌లు నామమాత్రంగానే చార్జీలు వసూలు చేస్తుంటారు. బైక్ సర్వీసింగ్ కు రూ. 350లు, వాటర్ సర్వీసింగ్ కు రూ. 50లు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయిల్ ధరలు పెరగడం, విడి భాగాల ధరలు పెరగడం వల్ల మిగులుబాటు ఉండడం లేదని మెకానిక్‌లు వాపోతున్నారు. అలాగే నిత్యం ఆయిల్ గ్రీజులను ముట్టుకోవడం, వాహనాలను స్టార్ట్ చేసేటప్పుడు వచ్చే పొగను పీల్చడం వల్ల తరుచూ అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. పెరిగిన అద్దెలు ప్రస్తుతం మెకానిక్ దుకాణం ఏర్పాటు చేయాలంటే పట్టణాలు, మండల కేంద్రాల్లో అయితే రూ. 50వేల అడ్వాన్సుతో పాటు నెలకు కనీసం రూ. 2వేల నుంచి 5వేల వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు కరెంట్ బిల్లు మరో రూ. వెయ్యి వస్తుంది. మొత్తంగా వచ్చే ఆదాయంలో సగం వరకు ఖర్చులకే సరిపోతుందని మెకానిక్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు ఆరోగ్య పథకాలు, బీమా వర్తింప జేయాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణకు కష్టంగా ఉంది మెకానిక్ పనిచేస్తే వచ్చే ఆదాయం కుటుంబపోషణకు కూడా సరిపోవడం లేదు. అద్దెలు పెరిగాయి. బైకు విడిభాగాలు, పనిముట్ల ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదు. మా జీవితానికి ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వం ఆర్థికసహాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలి. –గుర్రాల నవీన్, బైక్ మెకానిక్, బీబీపేట -
ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల స్వాధీనం
న్యూఢిల్లీ: దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌కు కేంద్రం ఓకేచెప్పింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మార్చి 12నే లోక్‌సభలో ప్రవేశపెట్టినా ప్రతిష్టంభన వల్ల గట్టెక్కలేదు. వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వ్యాపారుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాజా ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది. ప్రధాని నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర పడింది. రాష్ట్రపతి సంతకం చేశాక అమల్లోకి వస్తుంది. విచారణ కోసం భారత్‌కు తిరిగి రావడానికి నిరాకరించే, అరెస్ట్ వారెంట్ జారీ అయిన, రూ.100 కోట్లకు పైగా రుణాలు చెల్లించని ఆర్థిక నేరగాళ్లకు ఈ ఆర్డినెన్స్ నిబంధనలు వర్తిస్తాయి. దోషిగా తేలకున్నా జప్తే.. ఆర్డినెన్స్ ప్రకారం నిందితుడు దోషి అని తేలక ముందే అతని ఆస్తులు అమ్మి రుణదాతలకు చెల్లించొచ్చు. ఆ నేరగాళ్లను మనీ ల్యాండరింగ్ వ్యతిరేక చట్టం కింద విచారిస్తారు. సదరు నిందితుడిని పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించాలని కోరుతూ విచారణ సంస్థ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యేక కోర్టులో దరఖాస్తు చేయాలి. నిందితుడు ఎక్కడున్నదీ, నేరానికి పాల్పడి అతను కూడబెట్టిన ఆస్తులు, స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తులు, బినామీ ఆస్తులు, విదేశాల్లోని ఆస్తులు తదితర వివరాలను ఆ దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా తమ ముందు హాజరు కావాలని కోర్టు నిందితుడికి నోటీసులు పంపుతుంది. స్పెషల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేయొచ్చు. స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ఈ–పరిపాలనకు తీసుకోవాల్సిన చర్యల కోసం సరికొత్తగా తీర్చిదిద్దిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్(ఆర్జీఎస్ఏ)కే కేబినెట్ పచ్చజెండా ఊపింది. పంచాయతీ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీని అమల్లో కేంద్రం, రాష్ట్రాల వాటా 60:40 కాగా ఈశాన్య రాష్ట్రాలకైతే అది 90:10గా నిర్ధారించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రమే 100 శాతం భరిస్తుంది. పథకానికి అయ్యే వ్యయం 7255.50 కోట్లు. -
సామూహిక ఆత్మహత్య పేరుతో హత్య
తిరుపతి క్రైం: ఆర్థిక సమస్యల పేరుతో భార్య, కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చి హత్య చేశాడు ఓ కసాయి వ్యక్తి. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపో యాడు. అలిపిరి సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని హస్తినాపురానికి చెందిన ఎం.శ్రీనివాసులు(36), ఎం.సునీత(33) దంపతులకు లక్ష్మీసాయి(8) అనే కుమార్తె ఉంది. శ్రీనివాసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్యభర్తలు బిడ్డతో కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 12న తిరుపతిలోని టీటీడీ వసతి గృహమైన శ్రీనివాసంలో రూం అద్దెకు తీసుకుని జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించారు. 15న తిరుమల బైపాస్ రోడ్డులోని హోటల్ విహాస్ ఇన్‌లో రూంను అద్దెకు తీసుకున్నారు. 18న రాత్రి శ్రీనివాసులు నిద్రమాత్రలు తీసుకొచ్చి, ముందుగా భార్య, కూతురుచే మింగించాడు. నిద్రమాత్రల ప్రభావంతో భార్య, కుమార్తె మృతిచెందగా, ఒక రోజంతా అలాగే ఉన్న శ్రీనివాసులు శుక్రవారం అలిపిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
జైట్లీకి ఎందుకంత ప్రాధాన్యం!
సాక్షి, న్యూఢిల్లీ : మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న జైట్లీకి ఎయిమ్స్‌లోని వైద్యులు సోమవారం డయాలసిస్ నిర్వహించారు. త్వరలో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆస్పత్రిలో చేరిన జైట్లీకి డయాలసిస్ అనంతరం డాక్టర్లు ఇంటికి పంపించారు. ఇన్ఫెక్షన్ పెరగవచ్చన్న కారణంతో ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎవ్వరినీ అనుమతించడంలేదు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ తన శాఖకు సంబంధించిన పనులను మాత్రం ఇంటి వద్ద నుంచే నిర్వర్తిస్తున్నారు. అరుణ్ జైట్లీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. మోదీకి ఆత్మీయుడిగా కొనసాగుతూ...ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆయన సలహాలను ఇస్తున్నారు. ప్రభుత్వంలో కీలక పాత్ర మోదీ ప్రభుత్వంలో జైట్లీ కీలకపాత్ర పోషిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన ఆర్థిక, రక్షణ శాఖలను మొదటగా జైట్లీకి అప్పజెప్పారంటే ఆయనపై మోదీకి ఎంత నమ్మకమో ఊహించుకోవచ్చు.మధ్యలో గోవా ముఖ్యమంత్రి ఉన్న మనోహర్ పారికర్ రక్షణ శాఖలు చేపట్టినా, కొద్దిరోజులకే తిరిగి గోవా ముఖ్యమంత్రిగా వెళ్లారు. దీంతో ఆ శాఖను నిర్మలా సీతారామన్ చేపట్టే వరకు జైట్లీయే ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఆర్థికమంత్రిగా ఉంటూ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు తీసుకొచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాల్లో జైట్లీ పాత్ర ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా జైట్లీ ప్రతిపక్ష నాయకుడిగా అప్పటి యూపీఏ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. బీజేపీ తరపున రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంపై జైట్లీ పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీకి ఆత్మీయుడు జైట్లీ ప్రతిసారి మోదీకి బాసటగా నిలిచారు. ఆయన మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి కావడంలో, గుజరాత్ అల్లర్ల సమయంలో జైట్లీ ప్రధానపాత్ర వహించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలోనూ కీలకపాత్ర పోషించారు. గొప్ప ఎన్నికల వ్యూహకర్త బీజేపీ ఎన్నికల వ్యూహకర్తలో జైట్లీ ముఖ్యుడు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాకముందు జైట్లీయే ఎన్నికల వ్యూహాలను రచించేవారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఉంటూ దాదాపు 12 రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేశారు. న్యాయవాదిగా అరుణ్ జైట్లీ న్యాయవాదిగా బీజేపీకి చేసిన కృషి మరువలేనిది. చాలా సందర్భాలలో బీజేపీ నాయకుల తరఫున వివిధ కోర్టుల్లో వాదించారు. గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి బాసటగా నిలుస్తూ కోర్టులో వాదనలు వినిపించారు. అమిత్ షా తరఫున కూడా చాలా కేసుల్లో ఆయన వాదించారు. -
ఎల్అండ్టీలో ఆర్థిక అవకతవకలు..!
న్యూఢిల్లీ: ఇన్ఫ్రా దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ)లో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ రాజ్యసభ ఎంపీ కెహ్కషాన్ పర్వీన్ ఆరోపించారు. ఈ మేరకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో)కి ఫిర్యాదు చేశారు. రహదారి ప్రాజెక్టుల నిర్మాణం కోసం గ్రూప్ తీసుకున్న రూ. 8,000 కోట్ల పైగా రుణాలు .. మొండిబాకీలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎల్అండ్టీ హలోల్ షామ్లాజీ టోల్‌వే (ఎల్అండ్టీ హలోల్), ఎల్అండ్టీ చెన్నై తడ ప్రాజెక్టుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఎస్ఎఫ్ఐవో ముంబై ప్రాంతీయ కార్యాలయానికి చెసిన ఫిర్యాదులో పర్వీన్ ఆరోపించారు. ఇది విచారణార్హమైనదిగా పేర్కొంటూ సదరు ఫిర్యాదు గురించి ప్రధాన కార్యాలయానికి ముంబై కార్యాలయం తెలియజేసింది. మరోవైపు, ఎల్అండ్టీ ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవిగా తోసిపుచ్చింది. విచారణ గురించి తమకేమీ సమాచారం రాలేదని పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్‌లో తాము అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఎల్అండ్టీ వివరించింది.