రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల వాటా క్షీణించింది. 2017–18 ఆర్థిక సామాజిక సర్వే విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2016–17 తుది అంచనాల ప్రకారం జీవీఏలో వ్యవసాయం (అనుబంధ రంగాలు కాకుండా) వాటా 5.93 శాతంగా ఉంటే అది 2017–18లో 5.38 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు అంటే.. చేపలు, హార్టికల్చర్ వంటి వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే జీవీఏలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాట 32.75 శాతం నుంచి 34.37 శాతానికి పెరగడం గమనార్హం. ఇదే సమయంలో సేవల రంగం వాటా 44.38 శాతం నుంచి 43.55 శాతానికి, పరిశ్రమల వాట 22.87 శాతం నుంచి 22.09 శాతానికి తగ్గినట్లు సర్వే పేర్కొంది. 2016–17లో రూ. 6,34,742 కోట్లుగా ఉన్న జీవీఏ 2017–18లో 15.9 శాతం పెరిగి రూ.7,35,709 కోట్లకు చేరుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇదే సమయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీవీఏకి పన్నుల ఆదాయం కలిపి దానిలోంచి సబ్సిడీలు తీయగా వచ్చే విలువ) రూ.6,95,491 కోట్ల నుంచి రూ.8,03,873 కోట్లకు చేరనుంది.
Comments
Please login to add a commentAdd a comment