
సాక్షి,హైదరాబాద్: టిఫిన్ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చెంగిచర్ల ఎం ఎల్ ఆర్ కాలనీలో నివసించే ముద్ధం శ్రీనయ్య గౌడ్ ( 51) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో గత కొన్ని రోజులుగా బాధ పడుతున్నాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం టిఫిన్ చేయడానికి వెళ్తున్నానీ ఇంట్లో చెప్పి ఎంతకీ రాకపోవడంతో కుమారుడు సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో ఘటనలో..
వృద్ధుడి అదృశ్యం
జగద్గిరిగుట్ట: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరి«ధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీ సమీపంలోని విజయనగర్ కాలనీకి చెందిన వీరయ్య(66) ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు దేవాలయానికి వెళ్లొస్తానని చెప్పి అతడి మొబైల్ ఫోన్‌ను ఇంటి వద్దే మరిచి వెళ్లాడు. అయితే సాయంత్రమైనా వీరయ్య ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేసినా ఆచూకీ తెలియ రాలేదు. ఈ మేరకు మంగళవారం వారు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment