మనీశ్వరీ, రజిత (పాత చిత్రాలు)
సాక్షి, నందిపేట్/నిజామాబాద్: జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి మైనర్ బాలిక కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు.. గురువారం మనీశ్వరీ అనే బాలికను స్కూల్ నుంచి ఓ మహిళ అపహరించిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించామని అన్నారు.
బాలిక తండ్రికి నిందితురాలికి మధ్య డబ్బు విషయంలో తగాదా ఉందని పేర్కొన్నారు. రజితకి బాలిక తండ్రి 3 లక్షల రూపాయలు బాకీ పడ్డాడనీ, ఈ నేపథ్యంలోనే ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం మనీశ్వరీ తండ్రికి ఫోన్ చేసిన రజిత బాకీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేసిందనీ, తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని పోలీసులు వెల్లడించారు. కూతురు అపహరణకు గురికావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment