టెహ్రాన్: ఇరాన్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం సమసిపోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ అలీ జఫారీ ప్రకటించారు. ప్రభుత్వానికి మద్దతుగా బుధవారం నిర్వహించిన ర్యాలీల్లో వేలాది మంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఆందోళనకారులను అదుపుచేయడానికి సైన్యం పరిమితంగానే జోక్యం చేసుకుందని జఫారీ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికి శిక్షణ పొంది సంక్షోభానికి కారణమైన దేశద్రోహుల్లో చాలా మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 28న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైన తరువాత టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సేవలను నిలిపివేశారు. ఈ ఆందోళనల్లో 21 మంది చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment