army chif
-
చైనాతో ఎప్పటికైనా ముప్పే!
న్యూఢిల్లీ: ఇన్నాళ్లుగా పాకిస్తాన్ సరిహద్దుపై పెడుతున్న దృష్టిని ఇకపై చైనా సరిహద్దుపైకి మరల్చాల్సిన అవసరం ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. పొరుగుదేశాలను మంచి చేసుకుని భారత్‌కు ఇబ్బందులు సృష్టించేందుకు చైనా పన్నుతున్న కుయుక్తులను తిప్పికొట్టాల్సి ఉందన్నారు. పొరుగుదేశాలతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా దూకుడుగా భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్మీడే సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘చాలా కాలంగా భారత ప్రభుత్వం పశ్చిమ సరిహద్దులపై దృష్టిపెడుతూ వస్తోంది. ఇప్పుడు ఉత్తరాన ఉన్న చైనా సరిహద్దుపైనా దృష్టి సారించాలి. ఉత్తర ప్రాంతంలో మౌలికవసతుల కల్పన వేగం పెంచాలి. మిలటరీ పరంగా చైనానుంచి ఏనాటికైనా ముప్పు ఉంటుంది. దీనికి దీటైన సమధానమిస్తాం’ అని అన్నారు. ఆ దేశాలకు హృదయపూర్వక మద్దతు ‘నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతూ చైనాతో అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టాలి. ఈ దేశాలు భారత్‌నుంచి దూరంగా వెళ్లేందుకు మనం అనుమతించకూడదు’ అని అన్నారు. డోక్లాంలో చైనా బలగాల మోహరింపు ఉత్తర డోక్లాంలో చైనా సైన్యాన్ని మోహరిస్తోందని ఆయన తెలిపారు. శీతాకాలం తర్వాత చైనా మిగిలిన సరిహద్దు కేంద్రాల్లోనూ బలగాలను మోహరించే అవకాశం ఉందని.. దీనికి అనుగుణంగానే భారత బలగాలు వ్యవహరిస్తాయన్నారు. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు డ్రాగన్ దే శం ప్రయత్నిస్తే సమర్థవంతంగా తిప్పికొట్టే శక్తి భారత ఆర్మీకి ఉందని పునరుద్ఘాటించారు. మదర్సాలు, మసీదులపై నియంత్రణ కశ్మీర్లో ప్రభుత్వ పాఠశాలలు, సోషల్ మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ యువత ఉగ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భారీమార్పులు తీసుకురావటంతోపాటు.. మసీదులు, మదర్సాలపై స్వల్ప నియంత్రణ అవసరమన్నారు. మరికొన్ని వివరాలు.. ► ఉగ్రవాద పోరులో అమరులైన వారి పిల్లల కోసం రెండు పాఠశాలల ఏర్పాటు. 3,4 ఏళ్లలో అమల్లోకి తెస్తాం. ► త్వరలోనే భారత, చైనా అధికారుల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)లు మాట్లాడుకునేందుకు హాట్‌లైన్ ఏర్పాటు. ► ప్రభుత్వం అనుమతిస్తే.. పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులున్నాయంటూ చేస్తున్న బుకాయింపునకు సరైన సమాధానమిస్తాం. -
ఇరాన్లో సమసిన సంక్షోభం: ఆర్మీ చీఫ్
టెహ్రాన్: ఇరాన్లో కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత సంక్షోభం సమసిపోయిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ అలీ జఫారీ ప్రకటించారు. ప్రభుత్వానికి మద్దతుగా బుధవారం నిర్వహించిన ర్యాలీల్లో వేలాది మంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఆందోళనకారులను అదుపుచేయడానికి సైన్యం పరిమితంగానే జోక్యం చేసుకుందని జఫారీ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికి శిక్షణ పొంది సంక్షోభానికి కారణమైన దేశద్రోహుల్లో చాలా మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక సమస్యల కారణంగా డిసెంబర్ 28న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ప్రారంభమైన తరువాత టెలిగ్రామ్, ఇన్‌స్ట్రాగామ్ లాంటి సేవలను నిలిపివేశారు. ఈ ఆందోళనల్లో 21 మంది చనిపోయారు. -
రేపు వెంకన్న బ్రహ్మోత్సవ అంకుర్పారణ
– ఎల్లుండి ధ్వజారోహణం, శ్రీవారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పణ సాక్షి,తిరుమల: దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంకురార్పణ వైదిక కార్యక్రమంతో ఆరంభం కానున్నాయి. తిరుమలేశుని సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరుపున విష్వక్సేనుడు పర్యవేక్షించే కార్యక్రమమే ఈ అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాయిద్యాలతో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించటం ఆలయ సంప్రదాయం. ఆలయంలో అంకుర్పాణ వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ధ్వజారోహణం ఎల్లుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతారు. ఆ తర్వాతే బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆమేరకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేక ఆకర్షణగా మత్సావతారం సైకత శిల్పం శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడి కల్యాణవేదికలోని ఫల, పుష్ప ప్రదర్శన శాలలో మశ్చ్యవతార సైకత శిల్పం రూపుదిద్దుకుంటోంది. సుమారు ఏడు టన్నుల ఇసుకతో మైసూరుకు చెందిన సైకత శిల్ప నిపుణులు ఎంఎల్ గౌరి (25), నీలాంబిక (23)తో కలసి సైకత శిల్పాన్ని రూపొందించే ప్రక్రియ ప్రార ంభించారు. శనివారం నాటికి పూర్తి స్థాయిలో ఆకృతితో ఈ సైకత శిల్పం భక్తులకు కనువిందు చేయనుంది.