concerns
-
అప్పటి పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తాం
సాక్షి, హైదరాబాద్: మాజీ సర్పంచ్‌లు ఆందోళన చెందొద్దని..పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అప్పుడు జరిగిన పనులపై విచారణ జరిపి బిల్లులు చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లతో బలవంతంగా పనులు చేయించలేదని, బిల్లులు ఆపలేదన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదని, అయినా బిల్లుల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ‘మీ బిల్లుల ను ఆపిన మాజీ మంత్రులకు మీరు వంత పాడటం తగదు. వారి రాజకీయ కుట్రలకు మాజీ సర్పంచ్ లు బలి కావొద్దు’అని కోరారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇంకా రాలేదని, అలాంటప్పుడు వాటి ని దారి మళ్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మాజీ సర్పంచ్‌లను బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నదని సోమ వారం ఒక ప్రకటనలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకుల ట్రాప్‌లో పడొద్దని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్ల ఆత్మహత్యలు, పెండింగ్ బిల్లులపై పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా కథనాలను ఆమె మీడి యాకు విడుదల చేశారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకపోగా, వారితో బలవంతంగా పనులు చేయించింది. ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించకుండా వారి ఆత్మహత్యలకు కారణమైంది’ అని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు మాజీ సర్పంచ్‌లపై ప్రేమ ఉన్నట్టుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆర్థిక మంత్రిగా హరీశ్ ఉన్నప్పుడే తమ బిల్లులు పెండింగ్‌లో పెట్టారని మాజీ సర్పంచ్‌లకు స్పష్టంగా తెలుసని, తాము వచ్చాక రూ. 580 కోట్లు చెల్లించామన్నారు. కేసీఆర్, హరీశ్‌ల ఇళ్ల ఎదుట ధర్నా చేయండి ‘డ్రామాలు చేయడం.. ఆత్మహత్యలకు పురికొల్పడం హరీశ్‌రావుకు అలవాటు. నాడు సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమై...నేడు తిరిగి వారిని రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసమే హరీశ్, బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌లను వాడుకుంటోంది. గతంలో సర్పంచ్ల ఆత్మహత్యలకు కేసీఆర్, హరీశ్‌రావు కారణం కాదా ? బిల్లులు పెండింగ్‌లో పెట్టిన వారి ఇళ్ల ముందు మాజీ సర్పంచులు ధర్నా చేయాలి’ అని సీతక్క అన్నారు. -
సద్దుమణగని ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్లోని 8వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్కుమార్జైన్కు లేఖ రాశారు. సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. సివిల్ డ్రెస్‌తో ధర్నా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్‌ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్‌తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. -
కదం తొక్కిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/సీతమ్మధార : రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెకర్లను కలిసి ఈ మేరకు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి 2 వరకు వలంటీర్లు శాంతియుత నిరసనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఫ్ పిలుపునిచ్చింది. వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండివలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వరం్యలో వలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వలంటీర్ల ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటసుబ్బయ్య, భవానీప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, అజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె.రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, కె.కుమారమంగళం, జి.అప్పలరాజు తదితరులున్నారు. -
రాష్ట్రంలో ‘నీట్’ మంటలు
సాక్షి, హైదరాబాద్/హిమాయత్‌నగర్/పంజగుట్ట: నీట్ పరీక్ష లీకేజీపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు తెలంగాణకూ పాకాయి. నీట్ పరీక్ష రద్దు చేసి, మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లో వివిధ విద్యార్థి సంఘాల నేతృత్వంలో స్టూడెంట్ మార్చ్ జరిగింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్ యూ, విద్యార్థి జనసమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యా ర్థి విభాగం, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్, వి ద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యా లీ జరిగింది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన నీట్ పరీక్ష అవకతవకలు, పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్.మూర్తి అధ్యక్షతన సభ జరిగింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నా గరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ తదితరులు మాట్లాడారు.అవకతవకలకు పాల్పడిన, పేపర్ అమ్ముకున్న ఎన్టీఏ చైర్మన్, డైరెక్టర్ల పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏను రద్దు చేసి తిరిగి ఆయా రాష్ట్రాలు పరీక్ష నిర్వహించుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న మంత్రులు దీనిపై స్పందించడం లేదని, పరీక్ష పే చర్చ అనే మోదీ పరీక్షలు లీకేజీలపై నోరుమెదపడం లేదని, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి రెండుచోట్ల అవకతవకలు జరిగాయని ఒప్పకున్న తర్వాత కూడా మౌనం పాటించడం వెనుక ఎవరి ప్రయోజనాల కోసం అని ప్రశ్నించారు. మళ్లీ పరీక్షపై విద్యార్థుల్లో భయం భయం అన్నీ సక్రమంగా జరిగి ఉంటే ఇప్పటికే రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చేవి. విద్యార్థులు తమకు ఎక్కడ సీటు వస్తుందోనన్న అంచనా కూడా వచ్చేది. కానీ నీట్ పేపర్ లీక్ కావడంతో.. విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అంటున్నారు. మళ్లీ చదివి రాస్తే ఇవే ర్యాంకులు వస్తాయన్న గ్యారంటీ ఉండబోవన్నారు. అంతేగాక కాలేజీ యాజమాన్యాలు కూడా మళ్లీ పరీక్ష అంటే విద్యార్థులకు తీవ్రమైన మానసిక వేదనే ఉంటుందన్నారు. ఉద్రిక్తంగా మారిన చలో రాజ్‌భవన్ నీట్ పరీక్ష రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు ఎక్కిన నాయకులను పోలీసులు అడ్డుకొని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్వీ నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ ఎక్కడా లేనివిధంగా ఒక ప్రవేశ పరీక్షలో 67 మంది అభ్యర్థులు 720కి 720 మార్కులు సాధించడం గిన్నిస్ రికార్డు సాధించినట్లే అని ఎద్దేవా చేశారు. -
టీడీపీలో ఆరని మంటలు
సాక్షి నెట్వర్క్: టీడీపీలో టికెట్ల లొల్లి చల్లారేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడినవారు ఒక్కొక్కరిగా రోడ్డెక్కుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకోసం కష్టపడి పనిచేసిన వారిని కాదని డబ్బు మూటలతో వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదే జరిగితే ఇండిపెండెంట్‌గానైనా బరిలోకి దిగుతామని పార్టీకి హెచ్చరికలు పంపుతున్నారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించాలని బీజేపీ జిల్లా నాయకులు కోరుతున్నారు.సంవత్సరాల తరబడి ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న గారపాటిని కాదని స్థానికేతరుడైన పుట్టాను ఖరారు చేయడం అన్యాయమని ఆ పార్టీ నేతలు ఏలూరు జిల్లా భీమడోలులో వాపోయారు. మరోవైపు ఇదే పార్లమెంట్ నుంచి టీడీపీ టికెట్ ఆశించిన గొర్రుముచ్చు గోపాల్ యాదవ్ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. సింగపూర్‌లో ఉన్నతస్థితిలో ఉన్న తనను ఏలూరు టికెట్ ఆశ చూపి ఇక్కడికి తీసుకొచ్చారని నిలదీశారు. తనతో కోట్లు ఖర్చు చేయించారని, చివరికి మొండిచేయి చూపారని వీడియో విడుదల చేశారు.ఆదివారం కామవరపుకోటలో ఏర్పాటు చేయబోయే ఆత్మీయ సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీచేశారు. శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి మంటలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సీటు రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తలతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థి మామిడి గోవిందరావుపై దుమ్మెత్తిపోశారు. అవసరమైతనే ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టం చేశారు. మరోవైపు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న సానా సతీష్ కు చుక్కెదురైంది. జనసేన నుంచి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌కు ఈ సీటు ఖరారు చేయడంతో టిక్కెట్టు ఆశించిన సతీష్ వర్గీయులు మండిపడుతున్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు కేటాయించాలని ఆయన వర్గీయులు నిరసనలు కొనసాగిస్తున్నారు. పైలా ప్రసాదరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంపై మాడుగుల మండలం కె.జె.పురంలో తెలుగు మహిళ నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి నాగమణి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ గవిరెడ్డి అనుచరులు దేవరాపల్లిలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ప్రతిసారీ మోసం: దేవినేని స్మిత టీడీపీ తమను ప్రతిసారీ మోసం చేస్తోందని ఆ పార్టీ పెనమలూరు నియోజకవర్గ నాయకురాలు దేవినేని స్మిత ఆరోపించారు. పెనమలూరు టికెట్ తమకెందుకు ఇవ్వలేదని, తమ కుటుంబానికి ఎందుకు అన్యాయం చేస్తున్నారని అధిష్టానాన్ని ఆమె నిలదీశారు. ఆడవాళ్లమైనా నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ కోసం పనిచేస్తే లాబీయింగ్ చేసుకున్న బోడె ప్రసాద్‌కు టికెట్ ఇచ్చారన్నారు. ముందు బోడెకు ఇవ్వబోమని ప్రకటించిన చంద్రబాబు తర్వాత ఎందుకు మొత్తబడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ ప్రలోభాలకు తలొగ్గారో ఆయన చెప్పాలని నిలదీశారు. తమకు టికెట్ కేటాయిస్తేనే తన తండ్రి ఆత్మ శాంతిస్తుందన్నారు. త్వరలోనే కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నమ్ముకున్న ప్రజలను, నమ్మి పదవి కట్టబెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి, పార్టీ మారి టీడీపీ నుంచి మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న వసంత వెంకట కృష్ణప్రసాద్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ నాయకులు పులిపాక ప్రకాష్ తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానన్నారు. తాను వసంతను ఓడించడానికే పని చేస్తానని స్పష్టం చేశారు. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్‌మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!
Deeply Disturbed Zara Patel Reacts: నటి రష్మిక మందన్న వైరల్ డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన ఒరిజినల్ వీడియో బ్రిటిష్-ఇండియన్ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్‌దే. ఈ నేపథ్యంలో తన ఫేస్‌తో రష్మిక ముఖంతో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన డీప్ ఫేక్ వీడియో వివాదంపై జారా పటేల్ స్పందించారు. ఈ సంఘటన తనను చాలా ఆవేదనకు గురిచేసిందన్నారు. ఈ సంఘటనతో ఇంటర్నెట్లో మహిళలు, అమ్మాయిల భద్రతపై మరింత ఆందోళన కలుగుతోందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రముఖ నటి ముఖాన్ని ఉపయోగించి ఎవరో డీప్‌ఫేక్ వీడియోను రూపొందించినట్లు తన దృష్టికి వచ్చిందనీ, ఈ వీడియోతో తనకు ఎలాంటి ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ ఫేక్ వీడియో చూసి చాలా ఆందోళన చెందాను అంటూ జారా పటేల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా రష్మికకు తను సానుభూతిని ప్రకటించారు. ఇకపై సోషల్ మీడియాలో యువతులు, మహిళలు ఏదైనా పోస్ట్ చేయాలంటేనే భయపడాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇంటర్నెట్లో వస్తున్న ప్రతీదీ నిజం కాదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అంటూ ఆమె నెటిజన్లుకు సూచించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్) కాగా సంచలనం రేపిన టాలీవుడ్ నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరో భయంకర కోణంపై ఆందోళన రాజేసింది. సోషల్ మీడియాలో బిగ్‌బీ, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. (రష్మిక డీప్ ఫేక్ వీడియో: కేంద్ర మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ) హీరోయిన్లు, సెలబ్రిటీ మహిళలతోపాటు, సాధారణ మహిళలు, టీనేజ్ అమ్మాయిల ఉనికికి ముప్పుగా మారుతోందంటూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. (రష్మిక డీప్ ఫేక్ వీడియో : ఎమ్మెల్సీ కవిత రియాక్షన్) -
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్ నానాయాగీ
అవినీతి ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుండి స్పందన లేకపోయినా.. అర కొరగా టీడీపీ కార్యకర్తలు.. బాబు కుటుంబ సభ్యులు తాము పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎల్లో బ్యాచ్ నిరసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును న్యాయవ్యవస్థ జైలుకు పంపింది. మరి బాబు కుటుంబం, టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? అని నిపుణులు నిలదీస్తున్నారు. 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగిన స్కిల్ స్కాంలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఏనాడూ కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా స్టేలు తెచ్చుకుని తనపై అసలు విచారణలే జరక్కుండా చేసుకుంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. అయితే స్కిల్ స్కాంలో మాత్రం ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీన్ని చంద్రబాబు నాయుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవినీతిపై ఎన్నో కేసులు ఉన్నా ఏ ఒక్క కేసులోనూ అరెస్ట్ కాకుండా తప్పించుకున్న తాను.. ఇపుడు జైలుకెళ్లాల్సి రావడం ఏంటి? అని ఆయన కుత కుతలాడిపోతున్నారు. చంద్రబాబు ఇలా జైలుకెళ్లి అలా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తారని బాబు బంధువులు, టీడీపీ నేతలు అనుకున్నారు. అసలు అరెస్టే కారని అంతకు ముందు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పేయడంతో జైలుకెళ్లిన తర్వాత టీడీపీ నేతల్లో కొద్ది పాటి కంగారు మొదలైంది. న్యాయ విచారణలో చంద్రబాబు దోషిగా తేలితే తాను నిప్పు నిప్పు అని ఇంతకాలం అంటూ వస్తోన్న నినాదానికి కాలం చెల్లినట్లే అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాబు అరెస్ట్ పైనా.. ఆయన్ను జైలుకు పంపడంపైనా నానా యాగీ చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు స్కిల్ స్కాం కేసులోనూ తనపై విచారణ జరపకుండా కేసునే క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. మరో వైపు ముందస్తు బెయిల్‌కూ పిటిషన్లు వేసుకున్నారు. బెయిల్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకోవడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ మరింతగా మసకబారుతుందని భయపడ్డ టీడీపీ నాయకత్వం బాబు అరెస్ట్‌కు నిరసనగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తే ప్రజల నుంచి స్పందన రాలేదు. అక్కడక్కడా పార్టీ శ్రేణులో కార్యక్రమం చేశామంటే చేశాం అన్నట్లు మమ అనిపించేశారు. అయితే ఈ నిరసనలు ఎవరిపైనా? అని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అండ్ కో నినాదాలు చేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడి కేసులో మొత్తం దర్యాప్తు చేసి అక్కడ అవినీతి జరిగిందని కనిపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఆ తర్వాత దోపిడీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో చంద్రబాబును జైలుకు పింపింది ఏసీబీ న్యాయస్థానం. ఇపుడు చంద్రబాబు తరపున ఆందోళనలు చేస్తోన్న వారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? లేక ఆయన్ను జైలుకు పంపిన ఏసీబీ కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా? అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలకు అనుమానాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీని ఏమీ అనలేకపోతున్నారు. ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారిన టీడీపీ నేతలు ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వెనుక ఉన్నది కేంద్రంలోని బీజేపీయే అని చంద్రబాబుకు మద్దతు తెలిపిన సమాజ్ వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అయిటే టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పేరు చెబితేనే భయపడిపోతోంది. ఎవ్వరినీ ఏమీ అనలేక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తోందని పాలక పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటే న్యాయ స్థానాలు బెయిల్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు మేథావులు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్ల కానీ.. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనల పేరిట అక్కడక్కడా హడావిళ్లు చేయడం వల్లకానీ చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే అవకాశాలు లేనే లేవంటున్నారు న్యాయ రంగ నిపుణులు. బాబు విడుదల కోసం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాలే చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకీ ఈ విషయం తెలుసు. కాకపోతే ఏమీ తెలీనట్లు ఆయన డ్రామాలు చేయిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
ప్రతీ రెండు రోజులకు ఇదే పరిస్థితి: ఎస్బీఐ వినియోగదారుల ఫిర్యాదులు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) దేశవ్యాప్తంగా యూపీఐ సేవల అంతరాయం ఖాతాదారుల్లో అసహనానికి దారి తీసింది. ఎస్బీఐ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ కావడం, లేదంటే ఇన్ సఫీషియంట్ బ్యాలెన్స్ అన్న మెసేజ్ రావడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బందులతో కస్టమర్లు గందరగోళంలో పడి పోయారు. గత రెండు, మూడు రోజులుగా ఈ ఇబ్బందులు ఎదురు కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సోమవారం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రతీ రెండు రోజులు ఇదే పరిస్థితి అంటూ కొంతమంది యూజర్లు ట్విటర్లో వ్యాఖ్యానించడం గమనార్హం. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్ లావాదేవీలు చాలాసార్లు ఫెయిల్ కావడంతో కస్టమర్లలో ఆందోళన తలెత్తింది. ఈ సమస్య గత రెండు రోజుల నుండి జరుగుతోంది, ఎవరు పట్టించుకోవడంలేదు. ఖాతాదారుల ఇబ్బందులను బ్యాంకు వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారా? అసలు ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒకరు ప్రశ్నించారు. టెక్నికల్ అప్డేట్ కోసం మూడురోజులా అంటూ మరొక యూజర్ ఎస్బీఐపై ధ్వజమెత్తారు. అయితే తమ కస్టమర్ల యూనిఫైడ్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవల్లో ఇబ్బందులు రావచ్చని బ్యాంకు ముందుగానే ఎక్స్ ద్వారా ఒక ప్రకటన జారీ చేసింది. టెక్నాలజీని అప్డేట్ చేస్తున్నట్టు ఈ నెల 14న వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ అందిస్తామని ట్వీట్ చేసింది. అయితే,ఇప్పటివరకు కొత్త అప్డేట్ ఏమీలేదు.. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి అన్న అసహనం వినియోగదారుల్లో నెలకొంది. pic.twitter.com/yi5DVQjkYi — State Bank of India (@TheOfficialSBI) October 14, 2023 @TheOfficialSBI the UPI server of SBI is not working from today morning.. gpay, phonepe even yonosbi UPI isn't working. Could you please tell when these problems are solved? pic.twitter.com/hZmhtRm5mr — Gokul Kannan (@gokulanyms) October 14, 2023 Dear @RBI please investigate and give heavy penalty to @TheOfficialSBI for keeping UPI system down for days. @sbi_care Last few days its down. #sbi #upi #phonepe #paytm @nsitharamanoffc pic.twitter.com/grPrF0xgqV — Sudipta (@ghosh1s) October 15, 2023 -
మెగా డీఎస్సీని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఇందుకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేలకే నోటిఫికేషన్‌ను విడుదల చేయడం సరికాదన్నారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట బీఈడీ, టీఆర్టీ అభ్యర్థులు భారీగా ఆందోళనకు దిగారు. కొన్నేళ్లుగా ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేయడానికి మాత్రం ఎందుకు ఆలోచిస్తుందని ప్రశ్నించారు. భారీగా తరలివచ్చిన అభ్యర్థులు... మెగా డీఎస్సీని ప్రకటించాలని కోరుతూ.. బీఈడీ, డీఈడీ అభ్యర్థులు పెద్ద ఎత్తున విద్యా శాఖ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అసెంబ్లీ నుంచి కొంతమంది, అబిడ్స్ నుంచి కొంతమంది అభ్యర్థులు ఏకకాలంలో దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నా రు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో వాగ్వాదం, తోపు లాట జరగడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ గుజ్జకృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ పాల్గొన్నారు. -
టీచర్ పోస్టుల లెక్కలు వేరయా!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ ఖాళీలపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. నిరుద్యోగుల ఆందోళనలు, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నుంచి అసంతృప్తి ఎక్కువవుతోంది. దీంతో విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. టీచర్ల నియామక ప్రకటన రాజకీయంగా కలిసి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంటే, అసంతృప్తి, విమర్శలకు దారి తీస్తుందని ప్రభుత్వ వర్గాలు కంగారు పడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి తాజాగా నివేదిక కోరారు. నియామక పోస్టులు పెంచడం సాధ్యమా? వాస్తవ ఖాళీలను వెల్లడించడం వీలవు తుందా? టీచర్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తర్వాత భర్తీ చేస్తామనే భరోసా ఇవ్వగలమా? అని ఆమె అధికారులను అడిగినట్టు తెలిసింది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేసినట్లు సమాచారం. పొంతన లేని లెక్క పాఠశాల విద్యలో 22 వేల ఖాళీలు ఉండే వీలుందని ఏడాది క్రితం విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు 1,974, ప్రైమరీ హెచ్ఎం పోస్టులు 2,043, స్కూల్ అసిస్టెంట్లు 7,200, పీడీలు 25, ఎస్జీటీలు 6,775, లాంగ్వేజ్ పండిట్లు 688, పీఈటీలు 172, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు 1,733 ఖాళీలున్నాయని తేల్చింది. దీంతోపాటు ఎంఈవోలు 467, బాలికల పాఠశాలల హెచ్ఎంలు 15, డైట్ లెక్చర్లు 271, డిప్యూటీ విద్యాశాఖ అధికారులు 58, డీఈవోలు 12 మందిని నియమించాలని సర్కార్‌కు నివేదించారు. ఇందులో 13 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ ఇప్పుడు 5,089 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు వెల్లడించింది. దీంతో నిరుద్యోగులు ప్రతీ రోజూ పాఠశాల విద్య డైరెక్టరేట్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా 22 వేల ఖాళీలుంటే, 5 వేల పోస్టుల భర్తీ ఏంటని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం టీచర్లకు పదోన్నతులు ఇస్తే కొన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతోంది. ఈ ప్రక్రియ ముందుకెళ్లే పరిస్థితి కన్పించడం లేదు. నిరుద్యోగులను మోసం చేయడమే టీచర్ పోస్టులు 22 వేల వరకూ ఖాళీగా ఉంటే, 5,089 పోస్టులే భర్తీ చేస్తామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమే. దీనిపై ఆందోళనకు దిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమంత్రే 13,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడా పోస్టులు ఎక్కడికి పోయాయి? 22 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం. – కోటా రమేష్ (డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు) ఇదేం రేషనలైజేషన్ విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లను కేటాయించే హేతుబద్దిణ అశాస్త్రీయమైంది. ఒక్కో పాఠశాలలో ఎంత మంది విద్యార్థులున్నా, అన్ని తరగతుల బోధన జరగాలి. అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండాలి. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడం, అతి తక్కువ పోస్టుల భర్తీకి పూనుకోవడం ఎంతమాత్రం సరికాదు. – చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) హేతుబద్దిణే ముంచిందా? ♦టీచర్ నియామక ప్రకటన వెలువడేందుకు ముందు విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖాధికారులతో సమావేశం నిర్వ హించారు. రేషనలైజేషన్ ప్రకారం చూస్తే ఎన్ని ఖాళీలుంటాయని ఆరా తీశారు. టీచర్ పోస్టులు భారీగా కుదించుకుపోవడానికి డీఈవోల హేతుబద్దిణ నివేదికే కారణ మని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతీ 30 మందికి ఒక టీచర్ చొప్పున అధికారులు లెక్క గట్టారు. దీన్ని కొలమానంగా తీసుకోవడం అశాస్త్రీయమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. రాష్ట్రంలో మూడోవంతు బడుల్లో విద్యార్థుల సంఖ్య 30లోపే ఉంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు 26,337 ఉన్నాయి. ఇందులో 8,782 (33.35 శాతం) చోట్ల 1–30 మంది విద్యార్థులున్నారు. ఈ తరహా హేతుబద్ధీకరణను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 30 మంది కన్నా తక్కువ ఉన్నా, అన్ని తరగతులకు టీచర్లు కావాలని, కానీ హేతుబద్దిణ పేరుతో ఒకే టీచర్‌ను ఇవ్వడం వల్ల అన్ని తరగతులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దీనివల్లే అసలైన ఖాళీలు బయటకు రాకుండా పోయాయని వాపోతున్నాయి. -
ఆర్టీసీ కార్మికుల ‘చలో రాజ్‌భవన్’
సాక్షి, హైదరాబాద్/ పంజగుట్ట: ఆర్టీసీ కార్మికులు కదంతొక్కారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా శనివారం ఉదయం భారీ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపైన ఆమోదం తెలపాలని, గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది ‘చలో రాజ్‌భవన్’పేరిట భారీ ర్యాలీ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతృత్వంలో చేపట్టిన ఈ భారీ ప్రదర్శనకు నగరంలోని అన్ని డిపోలకు చెందిన కార్మికులు తరలివచ్చారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఫలితంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు కార్మికుల భారీ ప్రదర్శనతో ఖైరతాబాద్ చౌరస్తా, రాజ్‌భవన్ తదితర మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ కార్మికులు రోడ్డుపైనే బైఠాయించడంతో ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వచ్చే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. దాంతో నాలుగు వైపులా విపరీతంగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు గంటలతరబడి రోడ్లపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాజ్‌భవన్ వైపు వెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు దాటుకొని ఆందోళనకారులు ముందుకు వెళ్లారు. గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘గవర్నర్ డౌన్ డౌన్’అంటూ నినదించారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రదర్శనగా వెళ్లిన కార్మికులంతా రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లోకి వెళ్లి గవర్నర్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నిరసనను విరమించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత «థామస్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ తనకు ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారని పేర్కొన్నారు. బిల్లులో కొన్ని సందేహాలు నివృత్తి కాగానే బిల్లుకు ఆమోదం తెలుపుతామన్నారని వివరించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కమలాకర్, ఉపాధ్యక్షులు జీపీఆర్ రెడ్డి, కోశాధికారి రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.ఆర్.రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మలా రెడ్డి, బీఆర్టీయూ అధ్యక్షులు రాంబాబు యాదవ్, ప్రధాన కార్యదర్శి పి.నారాయణ నిరసనకు నాయకత్వం వహించారు. కాగా, గవర్నర్‌తో సమావేశం అయిపోయాక అక్కడకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు రాజ్‌భవన్‌లోనికి అనుమతించకుండా వారిని తీసుకొని ఖైరతాబాద్‌లో వదిలేశారు. -
ఫెడ్ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది. బుధవారం (జూలై 26)న ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మేర పెంచి అందర్నీ ఆశ్చర్య పర్చింది. దీంతో ఫెడ్ రేటు 5.50 శాతం వద్ద అత్యధిక స్థాయిని నమోదు చేసింది. ఫెడ్ తాజా వడ్డీ రేట్లు 22 ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠాలకు చేరింది. అంతేకాదు ద్రవ్యోల్బణంపై యుద్ధం సాగుతుందని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చైర్ జెరోమ్ పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికా ఆర్థికవ్యవస్థ మాంద్యంలోకి జారిపోతోందనే అందోళన మరింత ముదిరింది. (శాంసంగ్ కొత్త మడత ఫోన్లు వచ్చేశాయ్..అదిరిపోయే ఆఫర్‌తో...) భారతీయ ఐటీ నిపుణులను ఫెడ్ మరింత ఇబ్బంది పెట్టబోతోందా? ఫెడ్ రేట్ల పెంపు ప్రపంచవ్యాప్తంగా అలజడి రేపింది. ఈ పెంపు చాలా విభాగాలకు ప్రతికూలంగా ఉంటుందని, ఆర్థిక వృద్ధి తగ్గుతుందని నిపుణుల అంచనా. వరుస వడ్డీ రేట్ల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బ తీస్తుంది. మాంద్యంలోకి నెట్టవచ్చు. కనుక యుఎస్ ఆర్థిక మందగమనంతో అనేక భారతీయ ఐటీ సంస్థలకు దెబ్బేనని భావిస్తున్నారు. మింట్ నివేదిక ప్రకారం, అమెరికా, యూరప్‌లో స్థూల ఆర్థిక ప్రతికూలతల కారణంగా ఐటీ దిగ్గజాల ఫలితాలు బాగా దెబ్బ తిన్నాయి. 'బిగ్ ఫోర్' టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీల రెవెన్యూ గైడెన్స్‌లో భారీ కోత విధించుకోవడం గమనార్హం. యుఎస్ మాంద్యం సుదీర్ఘ దశలోకి జారిపోతే, అది అసంభవంగా కనిపిస్తోంటే, ఇండియన్ ఐటీ కంపెనీలకు కష్టాలు మరింత తీవ్రమవుతాయని అని నిపుణులు భావిస్తున్నారు (బ్లాక్‌రాక్ బ్యాక్ టూ ఇండియా: అంబానీ మరో సంచలనం) మరోవైపు ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఫెడ్ ఇకపై రేటు పెంపునకే మొగ్గు చూపుతున్న కారణంగా భారతీయ ఐటీ రంగ సంస్థలు మరింత నష్టపోతాయా? అంటే చాలా పరిమిత ప్రభావాన్ని చూపుతుందని మరికొంతమంది నిపుణులు భావిస్తున్నారు ఈక్వినామిక్స్ రీసెర్చ్ ప్రైవేట్‌లో ఫౌండర్ & రీసెర్చ్ హెడ్ జి. చొక్కలింగం, యూఎస్ ఫెడ్ రేట్ల పెంపు ముందే, భారతీయ దిగ్గజ ఐటీ కంపెనీలు తమ ఎగుమతి ఆదాయాలను డాలర్ రూపంలో పూర్ సింగిల్ డిజిట్లో పెంచుకోవడం గమనించదగ్గ విషయమని పేర్కొన్నారు. భారతదేశం ఐటి ఎగుమతుల, హైబేస్ హై గ్రోత్‌కు కొనసాగించడం అనేది నిర్మాణాత్మక సమస్య అన్నారు. ఐటీ ఎగుమతులు రేట్ల పెంపుదలకు ముందు సంవత్సరాలతో పోలిస్తే 0-0.25 శాతం శ్రేణి నుండి దాదాపు 5 శాతానికి పెరిగే కాలంలో పెద్దగా తగ్గలేదు. కాబట్టి తదుపరి పెంపుదల ఏదైనా ఐటీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేదన్నారు. అయితే ఫెడ్ రేటు పెంపు రూపాయి మారకపు రేటును ప్రభావితం చేస్తుందని అదే పరిశ్రమ మార్జిన్లను కొనసాగించడానికి సహాయపడుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో నిర్మాణాత్మకంగా పెద్ద విజయం సాధిస్తే, సమీప భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు మారే అవకాశం ఉంది. రెండేళ్లుగా డాలర్ పరంగా పేలవమైన అంటే 4-5 శాతం వృద్ధి ఉంటుంద నేది అంచనా. ఏదైనా మరింత గణనీయమైన రేటు పెంపుదల రూపాయి మారకపు రేటును మరింత బలహీన పరుస్తుందని చొక్కలింగం అన్నారు. అమెరికా వడ్డీ రేట్లు ప్రస్తుతం రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ద్రవ్యోల్బణ కారణంగా, అక్కడి వ్యాపారాలు అనివార్యంగా తమ ఐటీ పెట్టుబడుల్లో కోత విధిస్తాయి, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తా. ఇది భారతీయ ఐటీ సంస్థల ఆర్థిక ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చన్నారు ఏంజెల్ వన్ హెడ్ అడ్వైజరీ అమర్ దేవ్ సింగ్, అయితే, దేశాలు,పరిశ్రమల అంతటా తమ ఆదాయ వనరులను వైవిధ్యపరిచిన ఐటీ బిజినెస్ ప్రస్తుత మార్కెట్ ప్రమాదాలను తట్టుకునే స్థితిలోనే ఉందన్నారు. -
నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
I warned you guys in 1984 and you didn't listen: కెనడియన్ చలనచిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేగవంతమైన విస్తరణ ప్రమాదాల గురించి 1984లోను తాను హెచ్చరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'ది టెర్మినేటర్' మూవీలో దీనికి సంబంధించి ఒక హెచ్చరికగా పనిచేసి ఉండవలసిందన్నారు.న్యూస్ హౌస్కిచ్చిన ఇంటర్వ్యూలో విపరీతమైన ఏఐ వాడకం విపత్తు పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు) కొంతమంది పరిశ్రమ నాయకులు భయపడుతున్నట్టుగా మానవాళి అంతరించిపోవడానికి కారణమయ్యే కృత్రిమ మేధస్సు గురించి అడిగినప్పుడు, కచ్చితంగా తనకు కూడా ఆందోళన ఉందన్నారు. వాస్తవానికి దీనిపై 1984లోనే హెచ్చరించాను కానీ మీరే వినలేదని పేర్కొన్నారు. తన సెన్సేషనల్ మూవీ 'ది టెర్మినేటర్' గురించి ప్రస్తావించిన కామెరూన్ ఇది స్కైనెట్ అని పిలువబడే తెలివైన సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్నెటిక్ హంతకుడు చుట్టూ తిరుగుతుంది కదా అని గుర్తు చేశారు. దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. అణు ఆయుధ పోటీకి సమానమైన పోటీ ఇదని భావించారు. మనం మిన్నకుంటే ఇతరులు దూసుకొస్తారనే పోటీ మధ్య ఇది మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధభూమిలో ఏఐ గురించి ప్రస్తావించిన కామెరూన్ కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి, మానవులు జోక్యం చేసుకోలేరు, శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ అనే చాన్స్ ఉండదు. ఈనేపథ్యంలో డీ-ఎస్కలేషన్‌పై దృష్టి పెట్టడం అవసరం, కానీ ఏఐ సిస్టమ్‌లు అటువంటి సూత్రాలకు కట్టుబడి ఉంటాయనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏఐకి సంబంధించి కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని , ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లు ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాయి.మనకు తెలియ కుండానే, అన్ని మీడియా , సమాచారంపై పూర్తిగా పట్టు దక్కించుకోనుందని పేర్కొన్నారు. అలాగే ఓపెన్ఏఐ, గూగుల్, డీప్‌మైండ్, టెక్ దిగ్గజాలతోపాటు, ఈ రంగంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు , వ్యవస్థాపకులతో పాటు, AIతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి, అణు యుద్ధ ప్రమాదాలను పరిష్కరించడంతో సమానంగా ఈ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని కామెరూన్ నొక్కి వక్కాణించారు. -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది?
ఒడిశాలోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడమే కారణమని కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. దీనిపై గతంలో కాగ్ విడుదల చేసిన రైల్వే ఆడిట్ రిపోర్ట్ తెరపైకి రావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. రైల్వే ఆడిట్ రిపోర్టును గత ఏడాది సెప్టెంబర్‌లోనే పార్లమెంట్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విడుదల చేసింది. రైల్వే ట్రాక్‌లలో ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి లోటుపాట్లను సవరించే అంశంపై విస్తుపోయే అంశాలను కాగ్ నివేదికలో పేర్కొంది. విస్తుపోయే నిజాలు.. 2017-21 మధ్య మొత్తం 1,127 రైలు ప్రమాదాల్లో 289 ప్రమాదాలు ట్రాక్‌ల పునరుద్ధరణకు సంబంధించినవేనని కాగ్ నివేదిక పేర్కొంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, ప్రమాద ప్రదేశాల తనిఖీలు 30- 100 శాతం తగ్గాయి. 2017 నుంచి 2021 మార్చి వరకు 422 రైలు ప్రమాదాలు ఇంజనీరింగ్ సమస్యల కారణంగా జరిగాయి. అందులో 275 ప్రమాద ఘటనలు ఆపరేటింగ్ విభాగంలో లోపాల కారణంగా జరిగాయి. ట్రాక్‌లపై పాయింట్లను తప్పుగా గుర్తించారు. ప్రధానంగా 171 ప్రమాద కేసులు నిర్వహణ లోపాల కారణంగా జరిగాయి. 156 కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టినట్లు విస్తుపోయే విషయాలను కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా వేగంగా రైలు నడపడం కూడా ప్రమాద ఘటనలకు ప్రధాన కారణం అని నివేదిక వెల్లడించింది. నిధుల తగ్గింపు.. 63 శాతం ప్రమాద ఘటనల్లో నిర్ణీత గడువులోగా విచారణ చేపట్టలేదు. అంతేకాకుండా 49 శాతం కేసుల్లో ఆ నివేదికలను ఆమోదించడంలోనే ఆలస్యం జరిగింది. 2017-18 నుంచి ఐదేళ్లలో దాదాపు రూ. ఒక లక్ష కోట్ల కార్పస్ ఫండ్‌ను అందుకున్న రైల్వే శాఖ.. వ్యయం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిదులు సరైన మోతాదుల్లో కేటాయించలేదు.. అంతేకాకుండా కేటాయించిన దానిలో పూర్తిగా ఖర్చు చేయలేదని నివేదిక వెల్లడించింది. రైల్వే ట్రాక్‌ల నిర్వహణను సకాలంలో చేయాలని కాగ్ తెలిపింది. మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలని కోరింది. ఇలా అయితేనే రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలమని నివేదికలో స్పష్టం చేసింది. మరోవైపు బాలాసోర్‌లోని బహనగ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 288కు చేరింది. దాదాపు 900 మంది గాయపడ్డారు. ఇదీ చదవండి:లూప్ లైన్లో ఐరన్ ఓర్‌తో ఉన్న గూడ్స్‌ను కోరమండల్ ఢీకొట్టింది: రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా -
చుక్కలు చూపిస్తున్న ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు.. పాలసీదారులను పట్టించుకోవడం లేదా
న్యూఢిల్లీ: జీవిత బీమా పాలసీలపై ప్రీమియం పెరగడం వినియోగదారులకు ఆందోళనకు గురి చేస్తున్నట్టు హన్సా రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. ప్రీమియం అందుబాటు ధరలో ఉండడం కీలకమని పాలసీదారులు భావిస్తున్నారు. జీవిత బీమా పాలసీల కొనుగోలు నిర్ణయాలు, ప్రవర్తనపరమైన పక్షపాతం, ఆర్థిక అవరోధాలు, ప్రీమియం ధరల అందుబాటు, కొనుగోలుపై దాని ప్రభావం తదితర అంశాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా 3,300 జీవిత బీమా పాలసీదారులు ఇందులో పాల్గొని అభిప్రాయాలు వెల్లడించారు. పాలసీదారులుగా వారి అభిప్రాయాలను సర్వేలో ప్రశ్నల రూపంలో తెలుసుకున్నారు. బీమా కంపెనీని సంప్రదించినప్పుడు స్పందన సరిగ్గా లేకపోవడం వాటిని వీడడానికి ప్రధాన కారణమని 22 శాతం మంది పాలసీదారులు చెపన్పారు. తాము పాలసీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాంక్ ఆర్ఎం లేదా ఏజెంట్ తమను కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా కలవాలని ప్రతీ 10 మందిలో 8 మంది పాలసీదారులు కోరుకుంటున్నారు. డిజిటల్ వేదికల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్నారు. కొనుగోలుకు ముందు వెబ్సైట్లను సందర్శించం చేస్తున్నారు. బ్రాండ్‌కు ఉన్న పేరు, డిజిటల్ సేవలు, కస్టమర్ సేవలు కూడా ఆన్లైన్లో పాలసీలు కొనుగోలు చేసే వారు పరిగణనలోకి తీసుకునే కీలక అంశాలని ఈ సర్వే నివేదిక వెల్లడించింది. -
మార్కెట్లో ధాన్యం రాశులు.. జాడలేని కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరికోతలు ఊపందుకుంటున్నా సరిపడా కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. పలు జిల్లాల్లో వరికోతలు మొదలై నెల రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు 1,150 కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, కరీంనగర్ వంటి పలుజిల్లాల్లోనే ఈ సెంటర్లను ప్రారంభించారు. ఖమ్మం, పెద్దపల్లి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలంటూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ధాన్యాన్ని సెంటర్లకు తీసుకువస్తున్నా.. కొనుగోళ్లు లేక రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇక అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం ఆరబెడుతూ.. ధాన్యంలో తేమ 17 శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేసే పరిస్థితి ఉండటంతో రైతులు కొన్నేళ్లుగా.. వరి కోతలు కాగానే ధాన్యాన్ని ట్రాక్టర్లలో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబెడుతున్నారు. అయితే అధికారులు గత యాసంగి నుంచి కోసిన పంటను సొంత కల్లాల్లో ఆరబెట్టుకుని, ఆ తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచిస్తున్నారు. సొంత భూముల్లో కల్లాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో.. కొందరు రైతులు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. చాలా మంది పొలాల్లో తాత్కాలిక కల్లాలను ఏర్పాటు చేసుకొని ధాన్యం ఆరబెడుతున్నారు. ఇలా ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చినా.. కొనుగోళ్ల కోసం రోజుల తరబడి వేచిచూసే పరిస్థితి మాత్రం మారలేదు. ఈ యాసంగిలోనైనా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 7,029 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు లక్ష్యం రాష్ట్రంలో ఈ యాసంగిలో 1.20 కోట్ల టన్నులకుపైగా వరి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సొంత అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు పోగా కోటి టన్నుల వరకు కొనుగోలు కేంద్రాలకు రావచ్చని అంచనా. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,028 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కొన్ని జిల్లాల్లో ఇంకా కోతలు మొదలవకపోవడం, కోతలు జరుగుతున్న నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొందరు రైతులు మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తుండటంతో.. ఇప్పటికిప్పుడే కొనుగోలు కేంద్రాల అవసరం లేదని భావిస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ, మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచుతామని అంటున్నారు. సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం ఇది. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం ఏకంగా 868 మంది రైతులు 45,253 బస్తాల ధాన్యాన్ని మార్కెట్ తీసుకొచ్చారు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు క్వింటాల్ ధాన్యానికి రూ.1,400 నుంచి రూ.1,500 వరకే ధర చెల్లిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. – సూర్యాపేట సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాశులు ఇవి. శుక్రవారం ఒక్కరోజే 29,300 బస్తాల ధాన్యం వచ్చింది. కొనుగోళ్ల కోసం వేచి చూస్తున్నామని రైతులు చెప్తున్నారు. – తిరుమలగిరి (తుంగతుర్తి) ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం కరీంనగర్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మంత్రి శుక్రవారం తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, 90 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను అందుబాటులో ఉంచామన్నారు. -
ఆడబిడ్డల గోడు పట్టదా?
హుస్నాబాద్: ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం పెద్ద వివాదంగా మారింది. ప్రభుత్వం ఇచ్ఛిన హామీలు నెరవేర్చాలంటూ సుమారు 100 మంది వివాహితలు 70 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రాజెక్టు ని ర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్ఛినప్పుడు తమకు పెళ్లిళ్లు కాలేదని, ఇప్పుడు తమకు పెళ్లి అయ్యిందనే కారణంతో అనర్హుల్ని చేయడం స మంజసం కాదంటూ వారు వాపోతున్నారు. ప్రభు త్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నా రు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రూ.6 లక్షలు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ ప్రారంభించినప్పుడు.. దీనివల్ల ముంపునకు గురవుతున్న గుడాటిపల్లి పంచాయతీ పరిధిలోని పల్లె, గిరిజన తండాల వారికి ఇతరత్రా హామీలతో పాటు కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వివాహంకాని యువతులు ఉంటే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.6 లక్షలనగదు పాటు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామ ని ప్రభుత్వం హామీ ఇచ్ఛింది. ఈ మేరకు 2010 నుంచి 2015 వరకు కటాఫ్‌గా తీసుకుని 141 మంది అర్హుల్ని గుర్తించారు. అనుకున్న సమయంలో ప్రాజెక్టును ప్రారంభించి వీరికి ఇచ్ఛిన హామీ మేర కు నగదు, ఇల్లు ఇచ్చేస్తే ఎలాంటి వివాదం త లెత్తేది కాదు. కానీ ప్రాజెక్టును ఆలస్యంగా ప్రారంభించడం, పనులు కొనసాగుతుండటం, హామీ అమలు చేయకపోవడంతో కటాఫ్ పెంచుతూ పోయారు. ఈ విధంగా 2015 నుంచి 2021 వరకు మరో 338 మందిని, 2022 డిసెంబర్ వరకు మరో 60 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతుల పెళ్లికావడం, వీరికి ప్యాకేజీ వర్తించదని అధికారులు చెప్పడంతో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. జాబితా నుంచి తొలగింపు మధ్యలో రెండేళ్లు ప్రాజెక్టు నిలిచిపోగా, గతేడాది డిసెంబర్ 9న మళ్లీ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమయ్యాక యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెక్కులు అందజేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 539 మంది అర్హుల్లో 2015 నుంచి 2022 మధ్యకాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారనే కారణంతో సుమారు వంద మంది మహిళల పేర్లను ఆర్అండ్ఆర్ ప్యాకేజీ జాబితా నుంచి అధికారులు తొలగించారు. దీంతో వారు లబోదిబోమన్నారు. పట్టించుకోని ప్రజా ప్రతినిధులు అధికారుల తీరును నిరసిస్తూ డిసెంబర్ 14 నుంచి అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు గుడాటిపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు కొనసాగిస్తున్నారు. సుమారు 70 రోజులుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల వారు హుస్నాబాద్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యేని కలిసి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 24న హుస్నాబాద్ పర్యటనకు వచ్ఛిన మంత్రి హరీశ్‌రావుకు మొర పెట్టుకుందామని ప్రయత్నించారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాదు పట్టణ పొలిమేరలకు తరిమేశారు. దీనిపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లకు వెళ్లకుండా రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను పట్టించుకోవాలని డిమాండ్ నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదేం న్యాయం? మా త్యాగానికి ఎంత ఇచ్ఛిన తక్కువే. పెళ్లి కాని యువతులకు ప్యాకేజీ ఇస్తామంటూ మమ్మల్ని గుర్తించారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పుడు మాకు పెళ్లి కాలేదు. ప్రాజెక్టు పనులు ప్రారంభమై దాదాపు 16 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి అయిందనే సాకుతో ప్యాకేజీ వర్తించదని అనడం ఏం న్యాయం? – చుంచు రాణి, నిర్వాసితురాలు వయసు పెరుగుతుంది కానీ తగ్గుతుందా? గౌరవెల్లి ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేస్తే ఈ సమ స్య ఉండేది కాదు. వయస్సు పెరుగుతుందే కానీ తగ్గుతుందా? ప్రభుత్వం తప్పు చేసి మాకు అన్యాయం చేస్తే ఎలా? మా బాధలను కనీసం మంత్రికి కూడా చెప్పుకోనివ్వరా? ప్యాకేజీ ఇస్తే మాదారి మేము వెతుక్కుంటాం. – భూక్య శిరీష, నిర్వాసితురాలు -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కేవలం వేలం వెర్రేనా? సర్వేలో ఏం చెప్పారంటే?
ముంబై: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారు ప్రధానంగా భద్రత, పనితీరుకే ప్రాధాన్య మిస్తున్నారు. ఈ వాహనాలు తరచూ అగ్నిప్రమాదాలకుగురవుతుండటంతో..ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనే విషయంలోవెనక్కి తగ్గుతున్నారు. ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎలక్ట్రిక్ స్కూటరు భద్రత, పనితీరుపై తమకు అంతగా నమ్మకం లేదనే వారి సంఖ్య ఈ ఏడాది ఆగస్టులో 32 శాతానికి పెరిగింది. గతేడాది ఆగస్టులో ఇది కేవలం 2 శాతంగా నమోదైంది. 292 జిల్లాల్లోని 11,000 మంది పైచిలుకు వినియోగదారుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈ సర్వే నివేదిక రూపొందించారు. ఇందులో 47 శాతం మంది పెద్ద నగరాలు, 33 శాతం మంది ద్వితీయ శ్రేణి పట్టణాలకు చెందినవారు కాగా.. 20 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు డజన్లకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) అగ్నిప్రమాదాలకు గురైన ఉదంతాలు నమోదయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా లోపాలున్న వాహనాల బ్యాచ్‌లను వెంటనే ఉపసంహరించాలని లేదా భారీ జరిమానా విధించాల్సి వస్తుందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 21న హెచ్చరించింది. దీంతో 7,000 పైగా వాహనాలను కంపెనీలు వెనక్కి రప్పించాయి. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారులు పాటించాల్సిన మార్గదర్శకాలను రూపొందించాలంటూ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నిపుణులతో కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా తన సిఫార్సులను సమర్పించాల్సి ఉంది. మరిన్ని వివరాలు.. ♦ విద్యుత్‌యేతర వాహనాలు, కిక్కిరిసిన ప్రజా రవాణా వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈ-స్కూటర్లపై చాలా మంది ఆసక్తిగానే ఉన్నారు. కాకపోతే పనితీరు, భద్రతపైనే ఆందోళన పెరుగుతోంది. ♦ తమకు గానీ తమ కుటుంబ సభ్యులకు గానీ వచ్చే 6 నెలల్లో ఈ-స్కూటర్‌ను కొనే ఆలోచన లేకపోవడానికి.. ప్రధానంగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణమని 5 శాతం మంది తెలిపారు. వాటిని కొనేంత నిధులు తమ దగ్గర లేవని 7 శాతం మంది చెప్పారు. తమ దగ్గర ఇప్పటికే చాలా వాహనాలు ఉన్నాయని, మరో టూ-వీలర్ కొనే యోచనేదీ లేదని 9 శాతం మంది పేర్కొన్నారు. ♦ ఈవీలనేవి వేలం వెర్రిలాంటివని, ఈ ధోరణి త్వరలోనే తగ్గిపోతుందని 2 శాతం మంది పేర్కొన్నారు. (వడ్డీల భారం, చేతులెత్తేసిన మరో స్టార్టప్) ♦కేవలం ఒక్క శాతం కుటుంబాలు మాత్రమే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసే యోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం అటు పరిశ్రమపై ఉందని నివేదిక పేర్కొంది. ♦ ఈ-స్కూటర్లు, బ్యాటరీల భద్రతా ప్రమాణాలను రూపొందిస్తున్నప్పటికీ .. అనేక వర్గాల ప్రమేయం ఉన్నందున, ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టేస్తోంది. (ఇన్ఫోసిస్ వేరియబుల్ పే కోత) ∙ -
AP: భద్రతా వలయంలో రైల్వేస్టేషన్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాటిచెట్టపాలెం(విశాఖ ఉత్తర)/కొత్తవలస రూరల్/ఆముదాలవలస: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాలు శనివారం పెద్దఎత్తున మోహరించాయి. రైల్వేస్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలను, రైలు పట్టాలను ఆక్టోపస్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైల్వేస్టేషన్‌కు చేరుకునే మార్గాలను మూసివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు రైల్వేస్టేషన్‌లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం పలు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే వర్గాలు అనుమతించాయి. చదవండి: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి దీంతో హౌరా–యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్, గోదావరి తదితర రైళ్లు విశాఖ నుంచి బయల్దేరాయి. చెన్నై మెయిల్, హౌరా మెయిల్, బొకారో, వాస్కోడగామా, టాటా–యశ్వంత్‌పూర్, గుంటూరు–రాయగడ, తిరుచ్చి–హౌరా తదితర రైళ్లు మాత్రం విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాయి. అంతకుముందు విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన పలు రైళ్లను అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలిపివేశారు. గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడికి యత్నించిన ఆర్మీ అభ్యర్థులను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం అలాగే హౌరా వైపు నుంచి విశాఖ రావాల్సిన మరికొన్ని రైళ్లను పెందుర్తి, కొత్తవలస స్టేషన్లలో నిలిపివేశారు. మరోవైపు 19వ తేదీన షాలిమార్‌లో బయల్దేరాల్సిన షాలిమార్–హైదరాబాద్(18045), గుంటూరు–విశాఖ(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్, రాయగడ–విశాఖ(18527) ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేసేందుకు ప్రయతి్నంచగా.. డీఎస్పీ వాసుదేవరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు ‘గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులోని నెహ్రూనగర్ రైలు పట్టాల మీదుగా 20 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులు నడుచుకుంటూ రావడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే గుంటూరు రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న ఫోన్లో ‘జస్టిస్ టూ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఆందోళనలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో మరో 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆగిన ఊపిరి.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల సమయానికి వైద్యమందక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. ఒడిశాలోని కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన జోగేష్ బెహరా(70)కు గుండె సంబంధిత సమస్యలున్నాయి. విశాఖలో వైద్యం చేయించుకునేందుకు కోర్బా–విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరాడు. మరికొన్ని నిమిషాల్లో విశాఖ చేరుకుంటాడనగా.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల రైలును శనివారం ఉదయం 10.45 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. ఆ తర్వాత కొంతసేపటికి జోగేష్ అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన్ని వెంటనే కొత్తవలస ఎస్ఐ హేమంత్ తన వాహనంలోనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
వెన్నులో వైరస్ల వణుకు.. ఒకటి పోతే మరొకటి!
వానాకాలం రాకుండానే రకరకాల వైరస్ల భయం పట్టుకుంది. కేరళలో వెస్ట్‌నైల్, టమోటా వైరస్, మధ్యప్రదేశ్‌లో చికెన్‌పాక్స్ కేసులు దడపుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మంకీ పాక్స్ అనుమానిత కేసు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. మరోవైపు కరోనా వైరస్ మరోసారి విజృంభించి ఫోర్త్ వేవ్ ఉధృతమవుతుందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కరోనా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఫోర్త్ వేవ్ తప్పదేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. రోజువారి పాజిటివిటీ రేటు ఒక్క శాతానికి పైగా నమోదైంది. గత 24 గంటల్లో 4,270 కేసులు నమోదయ్యాయి. క్రియా కేసుల సంఖ్య 24 వేలు దాటేసింది. ప్రముఖులు చాలా మంది కరోనా బరిన పడతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాం క గాంధీకి కరోనా సోకగా, తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ –19 నిబంధనల్ని పాటిస్తూ ఆయన క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మరోవైపు మహారాష్ట్ర మాస్కులు ధరించాలని కోరుతుండగా కేంద్రం అందరూ బూస్టర్ డోసులు తీసుకోవాలని, టీకా సాయంతోనే దేశం కరోనా నుంచి గట్టెక్కుతోందని అంటోంది. వెస్ట్ నైల్ రకరకాల వైరస్‌లకు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్ నైల్ వైరస్ బారిన పడి త్రిశూర్‌కు చెందిన 47 ఏళ్ల వయసున్న వ్యక్తి మరణించడంతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది. వైస్ట్ నైల్ వైరస్ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయం. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది. 150 మందిలో ఒకరికి ఈ వైరస్ అత్యంత తీవ్రమైన వ్యాధిగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి తీవ్రమైతే జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు, దవడల దగ్గర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పక్షవాతం కూడా వచ్చిన వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. వైరస్ సోకిన 3 నుంచి 14 రోజుల్లో ఈ వ్యాధి బయటపడుతుంది. కేరళలో టమాటా వైరస్, నిఫా వైరస్ కేసులు కూడా వెలుగులోకి వచ్చి ఆందోళనని పెంచుతున్నాయి. మంకీపాక్స్ ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్ వైరస్ కలకలం రేగింది. ఘజియాబాద్‌కు చెందిన అయిదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ సోకిందన్న అనుమానంతో ఆమె శాంపిల్స్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. పట్నా నుంచి ఘజియాబాద్‌కు వచ్చిన ఆ అమ్మాయి శరీరం మీద దద్దుర్లు చూసి వైద్యులకు మంకీ పాక్స్ సోకిందేమోనన్న అనుమానం వచ్చింది. అందుకే శాంపిల్స్‌ను పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపి ఆ అమ్మాయిని క్వారంటైన్లో ఉంచినట్టుగా ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ బిపి త్యాగి వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వెయ్యికి పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. స్మాల్‌పాక్స్, చికెన్ పాక్స్ మాదిరిగానే మంకీ పాక్స్ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. స్మాల్ పాక్స్‌కు ఇచ్చే టీకాలు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెప్పారు. చికెన్‌పాక్స్ మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని చికెన్‌పాక్స్ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఛత్తర్పూర్, చింద్వారా, దాటియా, నీమచ్, భోపాల్, ధార్, ఖండ్వా జిల్లాల్లో 31 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరి నుంచి మరొకరికి అత్యత వేగంగా అంటుకునే లక్షణం కలిగిన వ్యాధి కావడంతో చిన్నారులు, గర్భిణులు, టీనేజర్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని మధ్యప్రదేశ్ సర్కార్ అన్ని జిల్లా కేంద్రాలను అప్రమత్తం చేసింది. కరోనా హాట్‌స్పాట్‌గా కరణ్ బర్త్‌డే ? బాలీవుడ్ నటులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మే 25న తన 50వ పుట్టిన రోజు వేడుకల్ని యశ్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో ఘనంగా చేశారు. ఈ పార్టీకి షారూక్‌ఖాన్ దగ్గర్నుంచి జాన్వికపూర్ వరకు ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కోవిడ్–19 బారిన పడ్డారన్న వార్తలు బీ టౌన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆదివారం బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైందని వెల్లడించారు. హీరోయిన్లు కత్రినా కైఫ్, అదితి రాయ్‌లు కూడా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. పార్టీకి హాజరైన వారిలో చాలా మంది తమకు కరోనా సోకినట్టు బహిరంగంగా వెల్లడిం చలేదని, కరణ్ జోహార్ బర్త్ డే పార్టీ కోవిడ్ –19 సూపర్ స్ప్రెడర్గా మారిందని బాలీవుడ్ హంగా మా ఒక కథనాన్ని రాసుకొచ్చింది. అయితే కరణ్ జోహార్ టీమ్ ఈ విషయాన్ని ఖండిస్తోంది. ముం బైలో కేసులు పెరుగుతూ ఉండడంతో వారందరికీ కరోనా సోకి ఉండవచ్చునని వాదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లంకలో కల్లోలం
కొలంబో: అల్లకల్లోలంగా మారిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పలు చర్యలను ప్రకటించారు. కేంద్ర కేబినెట్లో చేరాల్సిందిగా ప్రతిపక్షాలను ఆయన సోమవారం ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని ప్రతిపక్షాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలను ప్రభుత్వంలో చేరమని గొటబయ ఆహ్వానించడం ఒక డ్రామా అని ప్రతిపక్ష నేత సమగి జన బలవేగయ విమర్శించారు. సజిత్ ప్రేమదాస, మనో గణేసన్ తదితర విపక్ష నేతలు సైతం ఈ అఖిల పక్ష ప్రభుత్వ యోచనను తిరస్కరించారు. గొటబయ తమ్ముడు, లంక ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్సేను ఆర్థిక మంత్రి పదవి నుంచి అధ్యక్షుడు స్వయంగా తొలగించారు. బసిల్ స్థానంలో ప్రస్తుత న్యాయమంత్రి ఆలి సబ్రేను నియమించారు. బెయిల్ అవుట్ ప్యాకేజీపై చర్చించేందుకు బసిల్ సోమవారం అమెరికా వెళ్లి ఐఎంఎఫ్‌తో చర్చలు జరపాల్సిఉంది. భారత రిలీఫ్ ప్యాకేజీపై కూడా బసిలే చర్చలు జరిపారు. అయితే బసిల్ చర్యలపై లంక అధికార పక్షం ఎస్ఎల్పీపీ కూటమిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో అధ్యక్షుడు బసిల్‌ను తొలగించినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్లోని మొత్తం 26మంది మంత్రులు తమ రాజీనామాలను సమర్పించారు. అనంతరం కొత్తగా కొందరు మంత్రులు పదవీ స్వీకారం చేశారు. కేంద్ర బ్యాంకు గవర్నర్ రాజీనామా లంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సోమవారం రాజీనామా చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో కబ్రాల్ ఈ పదవిని స్వీకరించారు. గతంలో ఆయన కేంద్ర సహాయ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2006–15 కాలంలో ఆయన కేంద్రబ్యాంకు గవర్నర్‌గా వ్యవహరించారు. రెండోదఫా గవర్నర్ పదవి స్వీకరించాక ఆయన విదేశీ రుణాలపై ఆధారపడడాన్ని తగ్గించే యత్నాలు చేశారు. సంక్షోభం ముదురుతున్నా బెయిలవుట్‌ను వ్యతిరేకించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరింది. మితిమీరి కరెన్సీ ముదణ్రకు కబ్రాల్ అనుమతివ్వడమే ఇందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. కబ్రాల్ వ్యతిరేకతను పట్టించుకోకుండాప్రభుత్వం ఇటీవల ఐఎంఎఫ్‌ను సాయం ఆర్థించింది. లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగం ప్రధాని మహింద రాజపక్సే ఇంటిని చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరకొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జి, బాష్పవాయు ప్రయోగానికి దిగారు. కర్ఫ్యూ ఆదేశాలను లెక్కచేయకుండా దాదాపు 2వేల మందికి పైగా ఆందోళనకారులు తంగాలె లోని మహింద ఇంటిని చుట్టుముట్టారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని వీరు డిమాండ్ చేశారు. వీరిపై పోలీసులు బలపయ్రోగానికి దిగారు. నిజానికి ఈ ప్రాంతంలో రాజపక్సే కుటుంబానికి చాలా పట్టు ఉంది. అయితే సంక్షోభం ముదిరిపోయి జీవితాలు అస్థవ్యస్థమవుతుండడంతో సాధారణ ప్రజల్లో మహిందపై వ్యతిరేకత ప్రబలిందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో రాజపక్సే కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గొటబయ రాజీనామా కోరుతూ ప్రజలు వీధుల్లో ఆందోళనకు దిగుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గొటబయ ప్రకటించారు. -
బీహార్‌లో ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ ఆందోళనలు
గయ: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్ యార్డ్ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్ కుమార్ తెలిపారు. బీహార్ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి(నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి)లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్ 2 నుండి లెవల్ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టిపిసి, లెవల్ 1 పరీక్షలను నిలిపివేత హింసాత్మక నిరసనల నేపథ్యంలో రైల్వే తన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలు (ఎన్టిపిసి), లెవల్ 1 పరీక్షలను నిలిపివేసింది. వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (ఆర్ఆర్బి) కింద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు, ఫెయిల్ అయిన వారి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదిక అందజేయనుంది. అభ్యర్థులు తమ సమస్యలు మరియు సూచనలను సంబంధిత వెబ్సైట్లో కమిటీకి తెలియజేయవచ్చని రైల్వే తెలిపింది. అభ్యంతరాలను తెలపడానికి మూడు వారాల సమయం ఇచ్చింది. ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం కమిటీ మార్చి 4లోపు రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేస్తుంది. నిరసనల సమయంలో విధ్వంసానికి, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన వారిని రైల్వేలో ఎన్నటికీ రిక్రూట్ చేయకుండా నిషేధిస్తామని హెచ్చరిస్తూ రైల్వే ఒక సాధారణ నోటీసును జారీ చేసింది. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వద్దు్ద అభ్యర్థులెవ్వరూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయవద్దని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రిక్రూట్మెంట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేంద్రం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. అభ్యర్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, తమ ఫిర్యాదులను అధికారికంగా ఉన్నత కమిటీకి అందించాలని సూచించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించినవారిపై చర్యలుంటాయని తెలిపారు. అణచివేత ధోరణి సరికాదు అభ్యర్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణి సరికాదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ’సత్యాగ్రహ’ మార్గంలో చాలా శక్తి ఉందని, ఆందోళనలు శాంతియుత మార్గంలో చేయాలని ఉద్యోగార్థులకు ఆమె విజ్ఞప్తి చేశారు. -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: కరోనా దేశంలో శరవేగంగా దూసుకొస్తోంది. కరోనా థర్డ్ వేవ్ దేశంలోకి వచ్చేసినట్టేనని వైద్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లోనే లక్ష 17 వేల కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్‌ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల కొత్తగా ఆమోదించినన యాంటీ-కోవిడ్-19 డ్రగ్ మోల్నుపిరావిర్‌లో "ప్రధానమైన సేఫ్టీ సమస్యలు" ఉన్నాయని భారతదేశపు ఉన్నత ఆరోగ్య పరిశోధన సంస్థ తెలిపింది. మరోవైపు ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ లైట్ తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమైన వేరియంటే అని ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారనంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్తలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్‌పై కీలక ప్రకటన చేశారు. మోల్నుపిరవిర్ ద్వారా టెరాటోజెనిసిటీ, మ్యూటా జెనిసిటీ, కండరాలు , ఎముకలు దెబ్బతినడం వంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ మందు తీసుకున్న స్త్రీ పురుషులు, మూడు నెలల పాటు గర్భ నిరోధం పాటించక తప్పదని, లేదంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు రావచ్చన్నారు.అందుకే దీన్ని నేషనల్ టాస్క్ ఫోర్స్ ట్రీట్మెంట్ జాబితాలో చేర్చలేదన్నారు. అలాగే డబ్ల్యుహెచ్వో గానీ, యూకేలో గానీ దీన్ని చికిత్సలో భాగంగా చేయలేదన్నారు. దీనిమై మరింత చర్చిస్తున్నామని భార్గవ వెల్లడించారు. #bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe — BharatBiotech (@BharatBiotech) January 5, 2022 ఆరోగ్యమంత్రిత్వ శాఖ సవరించిన టీకా మార్గదర్శకాల ప్రకారం, 15-18 సంవత్సరాల వయస్సు వారికి "కోవాక్సిన్" మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కోవిడ్ టీకా తీసుకున్న వచ్చే జ్వరం, నొప్పుల నివారణకు టీనేజర్లకు పారాసెటమాల్ మాత్రలు అసలు వాడవద్దని కోవాక్సిన్ తయారీదారు భారత్ బయోటెక్ అధికారికంగా ప్రకటించింది. కోవాక్సిన్‌తో టీకా తీసుకున్నాక పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదని చెప్పింది. తేలికపాటి ఇబ్బందులు వచ్చినా, రెండు మూడు రోజులకు అవే తగ్గిపోతాయని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో 30,000 మందిలో దాదాపు 10-20 శాతం మందికి మాత్రమే సమస్యలొచ్చాయని, చాలా వరకు తేలికపాటివి,1-2రోజులలో తగ్గిపోతాయని మందులు అవసరం లేదని తెలిపింది. వైద్యుడి సలహా మేరకే మందులువాడాలని కూడా పేర్కొంది.అలాగే వ్యాక్సిన్ తరువాత జ్వరం, చలి, తలనొప్పి లేదా అలసటను లాంటి సమస్యలు రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందనడానికి సూచిక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న వారికి అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసిన యాంటీవైరల్ డ్రగ్ మోల్నుపిరావిర్. ఇది త్వరలోనే అన్ని మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానుందని డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు ఫార్మా కంపెనీలకు అనుమతినిచ్చిందంటూ వార్త లొచ్చాయి. దేశంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంది. కరోనా సెకండ్‌వేవ్ కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. వైరస్ వ్యాప్తిని అడ్డు కునేందుకు భౌతిక దూరం, ఫేస్ మాస్క్, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం అనే మూడు మంత్రాలను కచ్చితంగా పాటించాలి. అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలను, క్లోజ్డ్. వెంటిలేషన్ తక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచింది. అలాగే దగ్గినపుడు, తుమ్మినపుడు చేతులను అడ్డుపెట్టుకోవడం, ఇంట్లో అందరం ఉన్నపుడు, కిటికీలు తెరిచి ఉంచుకోవడం, మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. -
ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
-
క్రిప్టో ప్రపంచంలోనూ స్టార్టప్స్ హవా
న్యూఢిల్లీ: క్రిప్టోలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు అంటూ ఒకవైపు ఆర్బీఐ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. నియంత్రణలపరమైన అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. మరోవైపు క్రిప్టో మార్కెట్ దేశంలో శరవేగంగా విస్తరిస్తోంది. 2021లోనే ఇప్పటి వరకు 100 స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఏర్పాటయ్యాయంటే ఈ మార్కెట్ ధోరణులు ఎలా ఉందీ అర్థం చేసుకోవచ్చు. దేశంలో క్రిప్టో స్టార్టప్‌ల సంఖ్య 400కు చేరుకుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. క్రిప్టోలకు సంబంధించి పలు రకాల సేవలను ఈ స్టార్టప్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి క్రిప్టో స్టార్టప్‌లు 380 వరకు ఉండగా.. నాన్ ఫంగిబుల్ టోకెన్ (ఎన్ఎఫ్టీ) ఆధారిత స్టార్టప్‌లు మరో 12 వరకు ఉన్నాయని సమాచారం. ‘‘కొత్త కాయిన్ల ఏర్పాటుపై ఎన్నో స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. కొన్ని స్టార్టప్‌లు క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్ల కమ్యూనిటీలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటి కార్యకలాపాలు ఈ ఏడాది మరింత బలోపేతమయ్యాయి. ఈ ఏడాది ఇప్పటికే సుమారు 100 వరకు స్టార్టప్‌లు కొత్తగా ఏర్పాటు కాగా, 2020లోనూ 50–60 స్టార్టప్‌లు మొగ్గతొడిగాయి’’ అని క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ‘యూనోకాయిన్’ సహ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్ తెలిపారు. కోర్టు ఆదేశాల తర్వాత మరింత వృద్ధి క్రిప్టోకరెన్సీలకు సంబంధించి చెల్లింపులను అంగీకరించరాదంటూ గతేడాది బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో క్రిప్టో లావాదేవీలు దేశీయంగా నిలిచిపోయాయి. కానీ, ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేయడం క్రిప్టో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందేందుకు సాయపడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దీంతో 2020 పూర్తి సంవత్సరంతో పోలిస్తే.. 2021 మొదటి ఆరు నెలల్లోనే క్రిప్టో స్టార్టప్‌ల నిధుల సమీకరణ 73 శాతం పెరిగింది. బెంగళూరుకు చెందిన క్రిప్టో ఎక్సేంజ్ కాయిన్‌స్విచ్ కుబేర్, ముంబైకు చెందిన కాయిన్‌డీసీఎక్స్ ఇప్పటికే ‘యూనికార్న్’ స్థాయి విలువల(బిలియన్ డాలర్లు)కు చేరాయి. సగటు ఇన్వెస్టర్ క్రిప్టోల్లో చేసే పెట్టుబడులు ఏడాది క్రితం రూ.6,000–8,000 మధ్య ఉంటే, అది రూ.10,000కు పెరిగింది. రక్షణ కావాలి కానీ, నిషేధం కాదు.. ‘‘విధాన నిర్ణేతలు క్రిప్టోల విషయంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు తగిన నియంత్రణలు ప్రవేశపెట్టే ముందు.. క్రిప్టో ఎకోసిస్టమ్ వృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలి’’ అన్నది పరిశ్రమ వర్గాల డిమాండ్‌గా ఉంది. ఫిన్‌టెక్ సంస్థ వాల్రస్ వ్యవస్థాపకుడు అయిన భగబాన్ బెహెరా సైతం ఈ విభాగంలో వృద్ధిని చూసి క్రిప్టో మార్కెట్లోకి ప్రవేశించడం గమనార్హం. సోషల్ క్రిప్టో ఎక్సేంజ్ డెఫీని ఏర్పాటు చేయాలని బెహెరాతోపాటు ఇతర వ్యవస్థాపకులు నిర్ణయించుకున్నారు. క్రిప్టోలకు సంబంధించి ఇన్వెస్టర్లు తమ ప్రొఫైల్‌ను ఈ సోషల్ ఎక్సేంజ్ ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవడంతోపాటు, తమ పోర్ట్‌ఫోలియో వివరాలు, తమ ఆలోచనలను పంచుకునే వేదికగా దీన్ని మలచాలన్నది వ్యవస్థాపకుల ఆలోచనగా ఉంది. ‘‘భారత్‌లో క్రిప్టోల ఎన్ఎఫ్టీ విభాగం ఆరంభంలోనే ఉంది. సులభమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి, అంతిమంగా క్రిప్టో మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో క్రెడిట్‌కార్డ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సిప్ ప్లాన్‌ను ప్రారంభించాలన్నది ఆలోచన’’ అని బెహెరా తెలిపారు. వృద్ధి అవకాశాలు.. ఎన్ఎఫ్టీల మార్కెట్ మన దేశంలో క్రమంగా బలపడుతోంది. ఎక్సేంజ్‌ల తరఫున అన్ని రకాల ఎన్ఎఫ్టీ స్టార్టప్‌లు.. క్రిప్టో ఎక్సేంజ్‌లు, ఏపీఐలు, టూల్స్, మౌలిక సదుపాయాల వృద్ధికి సంబం ధించి ఇప్పటికే దేశంలో ఏర్పాటయ్యాయి. ‘‘వినోదం, క్రీడలు, యుటిలిటీ ఆధారిత ఎన్ఎఫ్టీల పట్ల ప్రజల్లో మంచి ఉత్సాహం ఉంది. మార్కెట్లో ఎన్ఎఫ్టీలకు సంబంధించి ఫోమో (కోల్పోతామనే ధోరణి) వాతావరణం కూడా నెలకొని ఉంది. ఇది మరికొంత కాలం పాటు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఎన్ఎఫ్టికల్లీ వ్యవస్థాపకుడు, సీఈవో తోషేంద్ర శర్మ తెలిపారు. తొందరపడొద్దు.. ప్రశాంతంగా ఉండండి: క్రిప్టో పరిశ్రమ న్యూఢిల్లీ: క్రిప్టో ఆస్తుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం సూక్ష్మంగా వ్యవహరించాలని పరిశ్రమ కోరింది. ఇన్వెస్టర్లు తొందరపాటుతో ఓ ముగింపు నిర్ణయానికి రావద్దని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. పార్లమెంట్ సమావేశాల్లో క్రిప్టోలకు సంబంధించి ‘క్రిప్టో కరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు 2021’ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అన్ని రకాల క్రిప్టోకరెన్సీలను ఈ బిల్లు నిషేధించనున్నట్టు సమాచారం వెలుగు చూడడంతో ఇన్వెస్టర్లు ఆందోళనతో అమ్మకాలకు మొగ్గు చూపించారు. ఫలితంగా కొన్ని క్రిప్టోలు బుధవారం నష్టపోయాయి. ఈ క్రమంలో క్రిప్టో ఎక్సేంజ్‌లు, పరిశ్రమకు చెందిన ఇతరులు స్పందించారు. ‘‘దేశంలో క్రిప్టోల వృద్ధి అవకాశాలపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టిన క్రిప్టో ఇన్వెస్టర్లు, క్రిప్టో స్టార్టప్‌ల ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు ఉంటుందని భావిస్తున్నాం. నూతన బ్లాక్‌చైన్ ప్రాజెక్టుల అభివృద్ధికి వీలుగా బిల్లు సౌకర్యవంతంగా ఉండాలి. కొత్త క్రిప్టో కరెన్సీ ఏదైనా కానీ, భారత ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అవ్వడానికి ముందు నిర్ధేశిత ప్రామాణిక విధానం అంటూ ఒకటి ఉండాలి. పన్నుల అంశంపైనా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం’’ అని బైయూకాయిన్ సీఈవో శివమ్ తక్రాల్ పేర్కొన్నారు. అందరితో సంప్రదిస్తున్నాం.. ‘‘ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణే ప్రధానంగా భాగస్వాములు అందరితోనూ సంప్రదింపులు చేస్తున్నాం. కస్టమర్లకు రక్షణ ఉండాలి. ఆర్థిక స్థిరత్వం బలోపేతం కావాలి. క్రిప్టో టెక్నాలజీ విప్లవం నుంచి భారత్ ప్రయోజనం పొందాలన్న దానిపై విస్తృతమైన అంగీకారం వచ్చింది’’ అని కాయిన్‌స్విచ్ కుబేర్ సీఈవో ఆశిష్ సింఘాల్ తెలిపారు. ఇన్వెస్టర్లు ప్రశాతంగా ఉండాలని సూచిం చారు. ‘‘తగినంత విశ్లేషణ, ఆలోచనతో కూడిన నియంత్రణ విధానం ఈ టెక్నాలజీని విస్తృతంగా మోదించడానికి దారితీస్తుంది’’ అని కాయిన్‌డీసీఎక్స్ అధికార ప్రతినిధి అభిప్రాయపడ్డారు. క్రిప్టోలకు చట్టబద్ధత వద్దు 54 శాతం మంది అభిప్రాయమిదే న్యూఢిల్లీ: దేశంలో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం లేదని 54 శాతం మంది అభిప్రాయంతో ఉన్నారు. వీటిని విదేశాల్లో ఉన్న డిజిటల్ ఆస్తులుగా పరిగణిస్తే చాలని చెప్పారు. డిజిటల్ కమ్యూనిటీ ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. దేశవ్యాప్తంగా 342 జిల్లాల పరిధిలోని 56,000 మంది అభిప్రాయాలను ఈ సర్వే కింద లోకల్ సర్కిల్స్ సేకరించింది. క్రిప్టో కరెన్సీలను చట్టపరంగా అనుమతించాలని 26 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. 87 శాతం మంది భారతీయ కుటుంబాలు క్రిప్టోల్లో ట్రేడింగ్ లేదా పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. క్రిప్టోల ప్రకటనల్లో రిస్క్‌ల గురించి స్పష్టంగా పేర్కొనడం లేదని 9,942 మంది చెప్పారు. క్రిప్టోల్లో మిగిలేవి కొన్నే: రాజన్ న్యూఢిల్లీ: క్రిప్టోల్లో చివరికి కొన్నే మిగిలి ఉంటాయని, మిగతవాన్నీ కనుమరుగైపోతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ అభిప్రాయపడ్డారు. ‘‘చెల్లింపుల కోసం 6,000కుపైగా క్రిప్టో కరెన్సీలు మనకు నిజంగా అవసరమా? ఒకటి లేదా రెండు లేదంటే కొన్ని మాత్రమే చెల్లింపులకు వీలుగా మిగిలి ఉంటాయి. అది కూడా టెక్నాల జీ అత్యంత ఉపయోగకరంగా ఉంటే. కనుక భవిష్యత్తులో చాలా వరకు క్రిప్టోలు అధిక వ్యాల్యూమ్‌తో కొనసాగడం కష్టమే’’ అని ఒక టీవీ చానల్‌కు రాజన్ చెప్పారు. నియంత్రణలో లేని చిట్‌ఫండ్స్ మాదిరే క్రిప్టోలతోనూ నష్టపోయే సమస్య ఎదురవుతుందన్నారు. -
దేశంలో క్రిప్టో చట్టబద్ధత ఖాయం!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్‌దాస్ నుంచి తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నప్పటికీ, క్రిప్టో కరెన్సీకి చట్ట బద్ధత కల్పించడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్లు మరోసారి స్పష్టం అయ్యింది. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి, లాభాలపై పన్నులు విధించడంపై కేంద్రం దృష్టి సారించినట్లు స్వయంగా రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారని భావిస్తున్న 2022–23 బడ్జెట్లోనే ఈ మేరకు ప్రతిపాదనలు ఉంటాయని ఆయన సూచించారు. క్రిప్టో కరెన్సీని కొందరు అసెట్‌గా భావిస్తున్నారని అన్నారు. తద్వారా వచ్చే ఆదాయంపై ఇప్పటికే కొంత మంది క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లిస్తున్నారని తరుణ్ బజాజ్ తెలిపారు. ఇతర కొన్ని సేవల తరహాలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కూడా క్రిప్టోకి వర్తిస్తుందని చట్టం ‘చాలా స్పష్టంగా‘ చెబుతోందని వివరించారు. ‘‘క్రిప్టోపై పన్ను అంశాలపై మేము దృష్టి సారిస్తాము. ఇప్పటికే ప్రజలు దానిపై పన్నులు చెల్లిస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కొనుగోళ్ల పరిమాణం నిజంగానే చాలా పెరిగింది. ఈ అంశంపై పన్నులకు సంబంధించి కొన్ని చట్టపరమైన మార్పులు తీసుకురాగలమా లేదా అని చూద్దాం. అయితే ఇది బడ్జెట్ నాటికి సిద్ధం అవుతుంది. మనం ఇప్పటికే బడ్జెట్‌కు దగ్గరగా ఉన్నాము. బడ్జెట్లో ప్రతిపాదనలను ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలించాలి’’ అని బజాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిప్టో ట్రేడింగ్ విషయంలో టీసీఎస్ (మూలం వద్ద పన్ను వసూలు) విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. వేగంగా పరిణామాలు... క్రిప్టో కరెన్సీపై దేశంలో నియంత్రణకానీ, నిషేధంకానీ లేవు. ఈ వర్చువల్ కరెన్సీల వల్ల ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర విఘాతమని ఆర్బీఐ గవర్నర్ నుంచి ప్రకటనల నేపథ్యంలో మీడియాలో దీనికి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రకటనలు వెలువడుతున్నాయి. సినీ స్టార్ నుంచి క్రీడాకారుల వరకూ క్రిప్టోకు సానుకూలంగా ప్రచారం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడిపై భారీ రాబడులు వస్తాయంటూ తప్పుదారి పట్టించే ప్రకటనలు వస్తున్నాయన్న ఆందోళనల మధ్య స్వయంగా ప్రధానమంత్రి మోదీ ఈ అంశంపై సమావేశం నిర్వహించడం గమనార్హం. మరోవైపు క్రిప్టోపై నిషేధం తగదని, దీనిపై నియంత్రణ మాత్రమే ఉండాలని బీజేపీ నాయకుడు జయంత్ సిన్హా నేతృత్వంలోని జరిగిన తాజా పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశంలో కూడా అభిప్రాయాలు వ్యక్తమవడం గమనార్హం. ఆయా అంశాల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 29వ తేదీ నుంచీ ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే కేంద్రం బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వర్చువల్ కరెన్సీలకు సంబంధించి సేవలను అందించకుండా బ్యాంకులుసహా తన నియంత్రిత సంస్థలను అన్నింటిపైనా నిషేధం విధిస్తూ, 2018 ఏప్రిల్ 6వ తేదీన ఆర్బీఐ జారీ చేసిన ఒక సర్క్యులర్‌ను 2021 మార్చి 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి ఇక్కడ గమనించాల్సిన మరో అంశం. -
మళ్లీ కదం తొక్కిన రైతన్న
చండీగఢ్: ధాన్యం సేకరణలో జాప్యాన్ని నిరసిస్తూ పంజాబ్, హరియాణాల్లో శనివారం రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్త రూపం దాల్చాయి. హరియాణా సీఎం ఖట్టర్ నివాసంతోపాటు రెండు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను రైతులు దిగ్బంధించారు. ఈ సందర్భంగా పోలీసులతో తలపడ్డారు. బారికేడ్లను సైతం రైతులు లెక్కచేయకపోవడంతో పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. సాధారణంగా పంజాబ్, హరియాణాల్లో అక్టోబర్ ఒకటో తేదీన ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయి. కానీ, ఇటీవలి భారీ వర్షాల కారణంగా దిగుబడుల్లో తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వం అక్టోబర్ 11వ తేదీకి కొనుగోళ్లను వాయిదా వేయడం అన్నదాత ఆగ్రహానికి కారణమైంది. కర్నాల్‌లో సీఎం ఖట్టర్ నివాసాన్ని ముట్టడించిన రైతులు, షాహాబాద్, పంచ్‌కులలోని బీజేపీ నేతలు, హరియాణా మంత్రి సందీప్ సింగ్ నివాసం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను రైతులు ట్రాక్టర్లతో ఢీకొట్టి పగులగొట్టారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ధాన్యం నింపిన ట్రాక్టర్ ట్రాలీలను అడ్డుగా పెట్టారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనన్లను ప్రయోగించారు. నేటి నుంచి కొనుగోళ్లు çపంజాబ్, హరియాణాలో ధాన్యం కొనుగోళ్లు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ధాన్యం దిగుబడులతో రైతులు ఇప్పటికే మండీల వద్ద వేచి చూస్తున్నారని వారికి ఇబ్బందులు తొలగించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. కేంద్రం సానుకూలంగా స్పందించినందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేశాయి. -
పార్లమెంట్లో ప్రతిపక్షాల రగడ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు. తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ సభలో.. పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్ సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం 14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎల్జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. -
పార్లమెంట్ ప్రతిష్టంభనతో రూ.133 కోట్లు వృథా
న్యూఢిల్లీ: వర్షాకాల సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచి విపక్షాల నిరసనతో సభలు సాగని పరిస్థితి ఏర్పడింది. పెగసస్, రైతు చట్టాలపై తొలుత చర్చించాలని విపక్షాలు, అవి తప్ప మిగిలిన అంశాలపై చర్చకు రెడీ అంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చున్నాయి. దీంతో ఇప్పటివరకు సుమారు 107 గంటలు జరగాల్సిన సమావేశాలు కేవలం 18 గంటలకే పరిమితమయ్యాయి. అంటే మొత్తం సభా సమయంలో 83 శాతం వృధాగా పోయింది. ఈ వృథా ఖరీదు రూ. 133 కోట్లని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జూలై 19న ఆరంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఇప్పటివరకు రాజ్యసభలో కేవలం 21 శాతం సభా సమయమే ఆందోళనలు లేకుండా సాగగా, లోక్‌సభలో కేవలం 13 శాతం సభా సమయం మాత్రమే జరిగింది. గంటల లెక్కన చూస్తే లోక్‌సభ 54 గంటలకు గాను 7 గంటల పాటు, రాజ్యసభ 53 గంటలకుగాను 11 గంటల పాటు జరిగాయి. సభ సాగిన కొద్ది సమయంలో మూజువాణి ఓటుతో కొన్ని బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయసభల్లో నిరసన కారణంగా జరిగిన వృ«థా వల్ల ప్రజాధనం దాదాపు 133 కోట్లు నిరుపయోగంగా పోయినట్లయింది. సభా ప్రతిష్ఠంభనకు మీరంటే మీరే కారణమని ప్రభుత్వం, ప్రతిపక్షాలు విమర్శించుకుంటూ మొత్తం మీద ప్రజాధనాన్ని వృథా చేశాయని రాజకీయ నిపుణులు వాపోతున్నారు. ఎందుకీ నిరసన?: పెగసస్ అనే స్పైవేర్‌తో ప్రభుత్వం పలువురి ఫోన్లను హ్యాక్ చేసిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి సమాధానమిస్తూ పెగసస్ విషయం అసలు పట్టించుకోవాల్సిన అంశమే కాదని, హ్యాకింగ్ ఏమీ జరగలేదని విపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు కొన్ని విపక్షాలు రైతు చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సభను అడ్డుకుంటున్నాయి. ఇప్పటికే వీటిపై చర్చించామని, కావాలంటే సభలో సమయానుకూలతను బట్టి చర్చిస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ విపక్షాలు తగ్గకుండా వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటున్నాయి. కేవలం కొందరికి నివాళులు అర్పించడం, ఒలింపిక్ విజేతకు శుభాకాంక్షలు తెలపడం వంటి కార్యకలాపాలు మినహా కీలకమైన కార్యకలాపాలేవీ ముందుకు సాగలేదు. విపక్షాల ధోరణిపై ఇటీవలే ప్రధాని విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. విపక్షాలు ఇంతే దీటుగా బదులిచ్చాయి. పెగసస్ అంశం అమెరికాలో బయటపడ్డ వాటర్‌గేట్ కుంభకోణంలాంటిదని దుయ్యబడుతున్నాయి. ఇలా ఇరుపక్షాలు మొండిపట్టు పట్టడంతో సభలు సాగకుండా వాయిదాలు పడుతున్నాయి. -
పార్లమెంట్లో రైతు గర్జన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం పార్లమెంట్లో ప్రతిబింబించింది. రైతుల డిమాండ్లను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. తొలుత పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. తర్వాత ఉభయ సభలు సమావేశమయ్యాక వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలను స్తంభింపజేశారు. రైతులు డిమాండ్లు నెరవేర్చాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని నినదించారు. రైతుల ఉద్యమం, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై లోక్‌సభలో కాంగ్రెస్ తదితర విపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మిథున్‌రెడ్డి పోలవరం అంశంపై సావధాన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్యసభలో విపక్షాలు రైతు ఆందోళన, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశాలపై చర్చకు నోటీసులిచ్చారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆయా నోటీసులను తిరస్కరించారు. వాయిదాల పర్వం.. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యక్రమాలు కొద్దిసేపు కొనసాగినా తర్వాత పదేపదే సభ వాయిదాపడింది. తొలుత 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తర్వాత నాలుగు గంటలకు వాయిదాపడింది. నాలుగింటికి సభ మొదలైనా నిరసనలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు. అటు రాజ్యసభలో ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్దిసేపటికే 2 గంటలకు వాయిదాపడింది. తర్వాత మొదలైనా గందరగోళం నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్, శశి థరూర్, మనీష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రక్షణ రంగ ఉపకరణాలు, ఉత్పత్తుల్ని తయారుచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది సమ్మెలను నిరోధించడానికి ఉద్దేశించిన ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశీయజల్లాల్లో సరకు రవాణాకు ఉద్దేశించిన ఇన్‌ల్యాండ్ వెసెల్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంక్షల నడుమ ‘కిసాన్ సంసద్’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సుమారు ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్న రైతన్నలు ఎట్టకేలకు పార్లమెంట్‌కు కూతవేటు దూరానికి చేరుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని తీవ్రతరం చేసే దిశలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏర్పాటుచేసిన కిసాన్ సంసద్(రైతు పార్లమెంట్) కార్యక్రమం గురువారం పోలీసు ఆంక్షల నడుమ ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొన్నారు. కిసాన్ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వ్యవహరించగా డిప్యూటీ స్పీకర్‌గా మన్జీత్ సింగ్ ఉన్నారు. తమ నిరసనల వాడి తగ్గలేదనీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలో తమకు కూడా తెలుసుననే విషయం ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావించని అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కిసాన్ పార్లమెంట్ వేదిక వద్దే ఉంటామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజాబ్, హరియాణా, యూపీలకు చెందిన రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
బెంగాల్ అసెంబ్లీలో గందరగోళం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం గవర్నర్ జగ్దీప్ ధన్కర్ బీజేపీ సభ్యుల నిరసనల మధ్య తన ప్రసంగాన్ని మధ్యలోనే ముగించారు. కొత్తగాఎన్నికైనఅసెంబ్లీలో గవర్నర్ ధన్కర్ ప్రసంగం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైంది. ప్రసంగంలో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల ప్రస్తావన లేదంటూ ప్రధాన ప్రతిపక్ష బీజేపీ సభ్యులు పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పోడియం వద్దకు చేరుకుని, నినాదాలకు దిగారు. ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరటంతో ఆయన 2.04 గంటలకు ప్రసంగాన్ని ఆపేసి, బయటకు వెళ్లిపో యారు. అనంతరం ప్రతిపక్ష నేత సువేందు అధికా రి మీడియాతో మాట్లాడుతూ..మరో మార్గం లేకనే ఆందోళనకు తాము దిగాల్సి వచ్చిందంటూ గవర్నర్ ప్రసంగ పాఠం ఉన్న ప్రతులను చూపారు. ‘కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళలపై ఎలాం టి హింస, అత్యాచారం, దాడి జరగలేదంటూ అధికార టీఎంసీ చెప్పుకుంటోంది. నిజాలను దాచిపెడుతోంది. అందుకే, నిరసన తెలిపాం’అని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలోసువేందు అధికారితో భేటీ అయిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను తొలగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం ప్రధానిమోదీకి లేఖ రాసింది. -
పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి
-
ఉభయ సభలకు పెట్రో సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రో ధరల సెగలు పార్లమెంట్ ఉభయ సభలను తాకాయి. మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమవగా.. పెట్రో ధరలపై కాంగ్రెస్ సభ్యుల ఆందోళనల కారణంగా కార్యక్రమాలకు అంతరాయం కలిగి ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ఉదయం 9 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవగానే కాంగ్రెస్ సభ్యులు పెట్రోల్, డీజిల్ తదితర పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై చర్చించాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ఖర్గే ఇచ్చిన నోటీస్‌ను చైర్మన్ ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు తరచుగా పెరుగుతున్నాయని ఈ అంశంపై చర్చించాలని ఖర్గే 267వ నిబంధన కింద నోటీసు ఇచ్చినట్టు ౖచైర్మన్ ప్రస్తావించారు. అయితే అప్రొప్రియేషన్ బిల్లుపై చర్చ జరిగిన సందర్భంలో దీనిపై చర్చించవచ్చని చెబుతూ చైర్మన్ ఈ నోటీసును తిరస్కరించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ ‘ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రభుత్వం ధరల పెరుగుదలపై ఏ సమాధానం ఇస్తుందోనని ఎదురుచూస్తున్నాం. దీనిపై చర్చించాలి’అని కోరారు. నిరసనలతో సభ నాలుగుసార్లు వాయిదాపడింది. చివరకు.. తిరిగి సభ ప్రారంభమయ్యాక సభాపతి స్థానంలో ఉన్న వందనా చవాన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష కాంగ్రెస్ సభ్యులు పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని నినాదాలు చేశారు. విపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో సభను రాత్రి 7 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. 7 గంటలకు తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగింది. నినాదాలు హోరెత్తడంతో మంగళవారానికి వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు నిర్వహిస్తుండగా.. సభ్యుల కోరిక మేరకు సమావేశాలను పూర్వ రీతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని రాజ్యసభ ౖచైర్మన్ వెంకయ్య, లోక్‌సభ సభాపతి బిర్లా నిర్ణయించారు. పార్లమెంటు సమావేశాల కుదింపు? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికల కంటే ముందే సమావేశాలను ముగించాలని తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యుల విన్నపం మేరకు ఏప్రిల్ 8 వరకు కొనసాగాల్సిన సమావేశాలను ఈనెల 25వ తేదీ నాటికే కుదించనున్నట్టు తెలుస్తోంది. -
కన్నడనాట రిజర్వేషన్ల యుద్ధం
బనశంకరి: రిజర్వేషన్లను పెంచాలని వాల్మీకులు, ఎస్టీల్లో చేర్చాలని కురుబలు, తమనూ బీసీలుగా గుర్తించాలని అగ్రవర్ణ వీరశైవ, లింగాయత్‌ల ఆందోళనలు కర్ణాటకలో ఊపందుకున్నాయి. నెలరోజుల నుంచి ఎవరికి వారు ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ యెడియూరప్ప సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆఖరికి మంత్రులు సైతం తమ వర్గాల సమావేశాల్లో పాల్గొంటూ గళమెత్తడంతో సీఎం యెడియూరప్పకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గుణపాఠం తప్పదన్న పంచమసాలిలు .. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఆదివారం లింగాయత పంచమసాలి వర్గీయులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ వర్గీయులు అధికంగా ఉండే కలబురిగి, విజయపుర, బాగల్‌కోటే, యాదగిరి, బీదర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, హావేరి, ధారవాడ, బెళగావిల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బీసీల్లో 3బీ గా ఉన్న తమను తక్షణం 2ఏ కు మార్చి రిజర్వేషన్ వసతులను పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. లేదంటే రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూడల సంగమ పంచమసాలి పీఠాధిపతి శ్రీ బసవజయ మృత్యుంజయ స్వామీజీ మాట్లాడుతూ ఒకవేళ రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తమ వర్గం స్వామీజీల నేతృత్వంలో నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. వ్యవసాయమే జీవనాధారమైన తమకు రిజర్వేషన్ ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. సమావేశంలో మంత్రులు మురుగేశ్ నిరాణి, సీసీపాటిల్, అన్ని పార్టీల నుంచి 20 మందికిపైగా ఎమ్మెల్యేలు, స్వామీజీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు ? వరుస ఆందోళనల నేపథ్యంలో సీఎం యెడియూరప్ప అన్ని వర్గాలను బుజ్జగించేలా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రిమండలిలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేయవద్దని మంత్రులకు స్పష్టంచేశారు. -
పద్మవిభూషణ్ వాపస్
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలపై 8 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్ రైతులే ప్రముఖంగా ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రైతుల ఒత్తిడి కారణంగా శిరోమణి అకాలీదళ్ బీజేపీతో పొత్తును తెంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రైతులు అకాలీదళ్ వైపు ఏమాత్రం మొగ్గు చూపలేదు. కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న రైతుల్లో విశ్వసనీయతను కాపాడేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్ గురువారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రైతు ఆందోళనలకు మద్దతుగా పద్మవిభూషణ్ గౌరవాన్ని వెనక్కి ఇస్తున్నట్లు ఈరాజకీయ కురు వృద్ధుడు ప్రకటించారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు రాష్ట్రపతికి లేఖ రాశారు. రైతుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేందుకే ప్రకాశ్ సింగ్ తన అవార్డును తిరిగి ఇచ్చినట్లు ఆయన కుమారుడు, అకాలీ దళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. కాగా, శిరోమణి అకాలీ దళ్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేసిన రాజ్యసభ సభ్యుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సా సైతం రైతులకు మద్దతుగా 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డును తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ విశ్వసనీయతను కాపాడేందుకు... మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అడ్వాణీ తరువాత, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగి ఉన్న ఏకైక నేత ప్రకాశ్ సింగ్ బాదల్. ఆయన పంజాబ్‌కు ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. పడిపోతున్న పార్టీ విశ్వసనీయతను నిలబెట్టడంతోపాటు, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఇప్పటికీ బాదల్‌పైనే ఉంది. అందుకే 73 ఏళ్ల రాజకీయ జీవితంలో 11 పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన బాదల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వ్యవసాయ బిల్లులపై నిరసనలు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతన్నలు భగ్గుమన్నారు. తమకు నష్టదాయకమైన ఈ బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. ప్రధానంగా పంజాబ్, హరియాణా రాష్ట్రాలు శుక్రవారం అన్నదాతల ఆందోళనలతో అట్టుడికిపోయాయి. దేశవ్యాప్త బంద్‌లో భాగంగా రైతులు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చారు. రహదారులను దిగ్బంధించారు. వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకూ తాము పోరాటం ఆపే ప్రసక్తే లేదని నినదించారు. రైతుల నిరసనలతో పంజాబ్, హరియాణాలో జనం రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. గురువారం ప్రారంభమైన రైలు రోకో రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. రైతులు రైలు పట్టాలపై బైఠాయించారు. వ్యవసాయ బిల్లులపై రైతుల ఉద్యమానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రకటించారు. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బంద్‌కు మద్దతునిచ్చాయి. ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ రాష్ట్రంలో పలుచోట్ల రోడ్ల దిగ్బంధం చేపట్టింది. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారుస్తారా? అని నిలదీసింది. కనీస మద్దతు ధరను రైతుల నుంచి దూరం చేయడం ఏమిటని ప్రశ్నించింది. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించింది. -
అధ్వాన్నం: దేశాధినేతలకు డబ్ల్యూహెచ్ఓ అక్షింతలు
జెనీవా : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభింస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి చాలా తీవ్రతరం అవుతోందని, సమీప భవిష్యత్తులో తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం కనిపించడం లేదని హెచ్చరించింది. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసన్ తాజాగా సూచించారు. యూరోప్, ఆసియా దేశాలు మహమ్మారి కట్టడిలో కొంత విజయం సాధించినప్పటికీ చాలా వరకు ప్రపంచ దేశాలు వైరస్‌ను ఎదుర్కొనే అంశంలో తప్పుడు విధానాలు అవలంబిస్తున్నాయని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. పటిష్టమైన చర్యలను అమలు చేయని కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. జెనీవాలో సోమవారం (నిన్న) మీడియాతో మాట్లాడిన ఆయన నిర్దిష్టంగా నాయకుల పేర్లను ప్రస్తావించకుండానే దేశాధినేతలపై విమర్శలు చేశారు. మహమ్మారి నియంత్రణలో దేశాధినేతల మిశ్రమ సందేశాలతో అంత్యత కీలకమైన విశ్వాసం ప్రజల్లో సన్నగిల్లుతోందని టెడ్రోస్ ఆరోపించారు. వైరస్ విస్తరణను అడ్డుకునేందుకు ప్రజల్లో అవగాహనతోపాటు ఆయా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సమగ్ర చర్యలు తీసుకోకపోతే, పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత దారుణంగా దిగజారి పోనుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక దూరం, హ్యాండ్‌వాష్, మాస్క్‌లను ధరించడం లాంటి అంశాలపై ప్రజలు, ప్రభుత్వాలు దృష్టిపెట్టాలన్నారు. లేదంటే మరింత అధ్వాన్నపరిస్థితులకు దారి తీస్తుందని టెడ్రోస్ హెచ్చరించారు. అంతేకాదు జాగ్రత్తలు పాటించకపోతే ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కాగా అమెరికాలో రికార్డు స్థాయిలో ఒక రోజులో 63,998 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు అమెరికాలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 34,77,993కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,38,234కి చేరింది. భారతదేశంలో ఒక రోజులో రికార్డు స్థాయిలో 27,151 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 540 మందికి పైగా ఈ వ్యాధితో మరణించారు. దీంతో మొత్తం కేసులు 9 లక్షలు దాటాయి. అటు ఒక రోజులో 276 కంటే ఎక్కువ మరణాలతో మెక్సికో ఇటలీని అధిగమించింది. రోజు రోజుకు కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంతో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది. -
హ్యాండ్సప్.. డోంట్ షూట్!
హ్యూస్టన్: జార్జ్ ఫ్లాయిడ్‌కు సంఘీభావంగా హ్యూస్టన్‌లో జరిగిన ర్యాలీలో సుమారు అరవై వేల మంది పాల్గొన్నారు. పోలీసుల దాష్టీకానికి బలైన ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించేందుకు ఉద్దేశించిన ఈ ర్యాలీలో ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగర మేయర్ సిల్వస్టర్ టర్నర్, ఎంపీ షీలా జాక్సన్, లిజ్జీ ఫ్లెచర్, సిల్వియా గార్సియా అల్ గ్రీన్‌లతోపాటు కొంతమంది ర్యాప్ గాయకులు ర్యాలీలో పాల్గొని తమ నివాళులు అర్పించారు. ‘హ్యాండ్స్ అప్.. డోంట్ షూట్’, ‘నో జస్టిస్, నో పీస్’అని నినదిస్తూ ర్యాలీ హ్యూస్టన్ నగరం గుండా సాగింది. డిస్కవరీ గ్రీన్ పార్క్ నుంచి సిటీహాల్ వరకూ ఉన్న మైలు దూరం ఈ ర్యాలీ నడిచింది. అయితే సూర్యాస్తమయం తరువాత ఈ ర్యాలీ కాస్తా ఆందోళనలకు దారితీసిందని, ఖాళీ నీటిబాటిళ్లతో విసరడంతో పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ర్యాలీ ప్రారంభానికి ముందు అందరూ మోకాళ్లపై నిలబడి కాసేపు ప్రార్థనలు చేయగా హ్యూస్టన్ పోలీస్ అధికారులు ఇదే తరహాలో వ్యవహరించడం విశేషం. పోలీస్ అధికారి ఆర్ట్ ఎసివిడో ఆందోళనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. జార్జ్ ఫ్లాయిడ్ భార్య రాక్సీ వాషింగ్టన్ మాట్లాడుతూ ఆరేళ్ల తన కుమార్తె గియానా మంచి తండ్రిని కోల్పోయిందన్న విషయాన్ని ప్రపంచం గుర్తించాలని వాపోయింది. వీధుల్లో ప్రశాంతత.. వారం రోజులపాటు అల్లర్లు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో అట్టుడికిన అమెరికన్ నగర వీధుల్లో ఎట్టకేలకు కొంత ప్రశాంతత నెలకొంది. మంగళవారం ప్రదర్శనలు జరిగినా చాలావరకూ అవి శాంతియుతంగా సాగాయి. ఆందోళనలకు సంబంధించి బుధవారంనాటికి మొత్తం 9,000 మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. పౌరహక్కుల విచారణ.. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంబంధించి మినసోటా రాష్ట్రం మినియాపోలిస్ పలీస్ విభాగంపై పౌర హక్కుల విచారణ చేపట్టింది. మినసోటా మానవహక్కుల విభాగం కమిషనర్ రెబెకా లూసిరో, గవర్నర్ టిమ్ వాల్ట్జ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ఈ విచారణ ద్వారా పోలీసుల వివక్షాపూరిత చర్యలను గుర్తించి తాత్కాలికంగానైనా పరిష్కార చర్యలను అమల్లోకి తేవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. అందరికీ న్యాయం అందించాలన్న అమెరికా సిద్ధాంతం ఎక్కడ? ఎందుకు విఫలమైందో పరిశీలించాల్సిన సమయం వచ్చిందని, జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతం ఇందుకు కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘లారా (బుష్ భార్య)తోపాటు నేను ఫ్లాయిడ్ ఉదంతంపై ఎంతో బాధపడ్డాం. అన్యాయమైన వ్యవహారాలు దేశం ఊపిరి తీసేస్తున్నాయి. అయినాసరే.. ఇప్పటివరకూ మాట్లాడకూడదనే నిర్ణయించాం. ఎందుకంటే ఇది లెక్చర్ ఇచ్చే సమయం కాదు. వినాల్సిన సమయం’అని బుష్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా తన వైఫల్యాలను పరిశీలించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు. శాంతియుతంగా ఉండాలి: మెలానియా ఫ్లాయిడ్ మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలవారు, పౌరులందరూ సురక్షితంగా ఉండాలంటే శాంతి ఒక్కటే మార్గమని ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని మెలానియా ట్వీట్ చేశారు. ఒక రోజు ముందు మెలానియా ఇంకో ట్వీట్ చేస్తూ.. ఫ్లాయిడ్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ మతం ముసుగులో తనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా అమెరికా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో ట్రంప్ మతవిశ్వాసాలు కలిగిన వ్యక్తి ఏమీ కాదని, ప్రస్తుతం పదేపదే చర్చిలకు వెళ్లడం, బైబిల్ పట్టుకుని పోజులు ఇవ్వడం మత విశ్వాసాలు ఉన్న వారిని తమవైపు ఆకర్షించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా మీడియా విమర్శిస్తోంది. -
అమెరికా అంతటా ఆగ్రహ జ్వాలలు
-
భగ్గుమంటోన్న అగ్రరాజ్యం
-
అమెరికాను కమ్మేసిన ఆందోళనలు
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోంది. దేశాద్యంతం హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేశారు. నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆఖరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం తాత్కాలికంగా ఓ రహస్య స్థావరంలో తలదాచుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమైపోతుంది. మినసోటాలో మొదలైన ఆందోళన పర్వం దావానలంలా లాస్ ఏంజిలెస్, షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీలకూ విస్తరించింది. ఈ స్థాయి ఆందోళనలు 1968లో మార్టిన్ లూథర్‌కింగ్ హత్య తరువాత మాత్రమే జరిగాయని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. పలు దేశాల్లో ఆందోళనకారులకు మద్దతు న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ సిటీలో వేలాదిగా ఆందోళనకారులు నిరసనప్రదర్శన చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో ఆదివారం పలువురు ఆందోళనకారులు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించగా, బ్రెజిల్, కెనడా, చైనాలో ప్రదర్శనలు జరిగాయి. ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జరగనున్నాయి. మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నగర మేయన్ సిల్వర్‌స్టర్ టర్నల్ శనివారమే అంత్యక్రియల ప్రణాళికను ప్రకటించగా.. ఎప్పుడు?అన్నది స్పష్టం చేయలేదు. నార్త్ కారొలీనాలో జన్మించిన ఫ్లాయిడ్ హ్యూస్టన్‌లో పెరిగి పెద్దయ్యారు. 2014 నుంచి ఫ్లాయిడ్ మినియాపోలీస్‌లో ఉంటున్నా అతడి ఇద్దరు కూతుళ్లు హ్యూస్టన్‌లో ఉంటున్నారు. ఫ్లాయిడ్ మరణానికి కారణమైన డెరెక్ ఛావిన్ను ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించగా శుక్రవారం హత్య ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేశారు. ఫ్లాయిడ్ మృతదేహానికి తాము ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తామని ఆ గౌరవం తమకు కలిగించాలని హ్యూస్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యాధికారి ఆర్ట్ అసీవిడో ఆదివారం జరిగిన ఒక ర్యాలీలో బహిరంగంగా అభ్యర్థించారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఫ్లాయిడ్ మృతదేహాన్ని మినియాపోలీస్ నుంచి హ్యూస్టన్‌కు తరలించనున్నారు. యాపిల్ స్టోర్ లూటీ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని యాపిల్ స్టోర్‌ను దుండగులు దోచుకు న్నారు. అద్దాలు పగులగొట్టి, అక్కడున్నదంతా ఎత్తుకుపోయారు. ఏడు నిమిషాల వ్యవధిలోనే స్టోర్‌లో ఉన్న వస్తువులను దుండగులు మాయం చేశారు. ఆఖరి నిమిషంలో ఒకే ఒక్క పోలీసు అక్కడికి చేరుకున్నారు. గ్యాడ్జెట్ల నుంచి డిస్ప్లే స్టాండ్లదాకా అన్నిటినీ ఊడ్చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైట్‌హౌస్ వద్ద కాల్పులు వైట్‌హౌస్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఆందోళనకారులు భవనం కిటికీలను బద్దలు కొట్టడంతోపాటు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలోనే అధ్యక్షుడు ట్రంప్ అతడి భార్య మెలానియా, కుమారుడు బారన్లను కొద్ది సమయం పాటు రహస్య బంకర్లో ఉంచినట్లు సీఎన్ఎన్ ఒక కథనం ప్రసారం చేసింది. వైట్‌హౌస్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువుతోపాటు స్టన్ గ్రెనైడ్లు వాడారని వార్తలు వచ్చాయి. పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఆదివారం మొత్తం బహిరంగ ప్రకటనలు చేయకపోగా, ఎవరికీ కనిపించలేదు. దేశంలో అశాంతికి మీడియా సంస్థలే కారణమని ట్రంప్ ట్వీట్లు చేశారు. చేతుల్లో రైఫిల్స్ పట్టుకున్న పోలీసులు దూసుకొచ్చి.. కారు ఆపమన్నారు. కారులో ఉన్న నల్లజాతీయులను కిందకు దించి రోడ్డుపై పడుకోబెట్టి రైఫిల్ ఎక్కుబెట్టారు. ఇదేదో సినిమాలో సీన్ కాదు.. అమెరికాలోని ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఆదివారం మినియాపొలిస్ పోలీసులు నల్లజాతీయులను ఇదిగో ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు నిర్బంధించారు. వైట్‌హౌస్ వద్ద నిరసనకారులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్న పోలీసులు -
కర్ఫ్యూను ధిక్కరించి..
మినియాపొలిస్: జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీస్ కస్టడీలో మృతి చెందడంతో భగ్గుమన్న నిరసనలు మినియాపొలిస్ నుంచి అమెరికాలోని ఇతర నగరాలకు వ్యాపించాయి. కోవిడ్ నేపథ్యంలో అమలవుతున్న నిషేధాజ్ఞలను ఆందోళనకారులు ధిక్కరించారు. మినియాపొలిస్‌లో వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగాయి. మినియాపొలిస్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌ను నిరసనకారులు చుట్టుముట్టి పోలీసులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక రెస్టారెంట్, బ్యాంకు, మరో కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. భద్రతా కారణాల రీత్యా అగ్ని మాపక సిబ్బంది అక్కడికి రాకపోవడంతో గంటలపాటు మంటలు కొనసాగాయి. డెట్రాయిట్లో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, అట్లాంటాలో ఆందోళనకారులు పోలీసుకార్లకు నిప్పంటించారు. న్యూయార్క్, హూస్టన్, వాషింగ్టన్ నగరాల్లో భారీగా ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దొంగ నోట్ల చెలామణీకి యత్నించాడన్న ఆరోపణలపై ఫ్లాయిడ్‌ను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బేడీలు వేసిన తర్వాత ఫ్లాయిడ్‌ను కింద పడేసి, డెరెక్ చౌవిన్ అనే అధికారి అతడి మెడపై 9 నిమిషాల పాటు మోకాలితో తొక్కిపెట్టి ఉంచడంతో అతడు ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో, చౌవిన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిపై నేరం రుజువైతే 12 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశముంది. అట్లాంటాలో నినాదాలిస్తున్న ఆందోళనకారులు -
లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఫిబ్రవరి మొదట్లో ఆరంభమైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా అనేక వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల ఆదాయం భారీగా క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులు రానున్ననెలల్లో కూడా కొనసాగితే 30 శాతం మోడ్రన్ దుకాణాలు మూతపడతాయని, లక్షలమంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అసోసియేషన్ అందించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి, వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్ తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా రూ .4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులున్నారు. అయితే గత ఒకటిన్నర నెలల్లో వ్యాపారం 15 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించబడిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదని తెలిపింది. ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలను నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపింది. మొత్తంమీద, దుస్తులు, ఆభరణాలు, బూట్లు (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఐటి, టెలిఫోన్లు) రిటైల్‌పై గణనీయమైన ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే, 30 శాతం రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తుందని, దీనివల్ల 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్, కెనడా, అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. అలాగే తమ కంపెనీల్లో చాలా మంది చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని, లాక్ డౌన్ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతో పాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఎండీ కవి మిశ్రా చెప్పారు. -
రూపాయి 65 పైసలు పతనం
సాక్షి,ముంబై: ప్రపంచ వృద్ధి ఆందోళనల నేపథ్యంలో అటు డాలరు, ఇటు రూపాయి భారీగా నష్టపోతున్నాయి. కోవిడ్-19 భయాలకు తోడు, దేశీయంగా ప్రైవేటు బ్యాంకు యస్ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ అనూహ్య వడ్డీరేటు కోత నిర్ణయం కరెన్సీ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు కరోనావైరస్ వ్యాప్తి వృద్ధిని తాకవచ్చన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల డాలర్ సూచీ స్పాట్ మార్కెట్లలో 0.25 శాతం క్షీణించింది. దీంతో రూపాయి డాలరుమారకంలో శుక్రవారం ఏకంగా 65 పైసలు క్షీణించింది. 73.99 ట్రేడింగ్‌ను ఆరంభించి 74.06 కనిష్టానికి చేరింది. గురువారం డాలర్‌తో పోలిస్తే 73.33 వద్ద 6 పైసల లాభాలతో రూపాయి ముగిసింది. మూలధన మార్కెట్ల నుండి ఫారెక్స్ ప్రవాహం కొనసాగుతుండటం భారతీయ కరెన్సీని తాకిందని వ్యాపారులు తెలిపారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లుభారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లకుపై పతనం కాగా, నిఫ్టీ 400 పాయింట్లు నష్టపోయింది. ఆల్ టైం గరిష్టానికి బంగారం ధర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐ) గురువారం నికర ప్రాతిపదికన రూ .2,476.75 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించినట్లు మార్కెట్ డేటా ద్వారా తెలుస్తోంది. చమురు ధరలు 1.06 శాతం తగ్గాయి. దీంతో బంగారం ధరలు వరుసగా లాభపడుతూ శుక్రవారం ఆల్‌టైం గరిష్టానికి చేరాయి. బంగారు ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముకు రూ. 200 పెరిగి 44,640 వద్ద కొత్త గరిష్టానికి తాకింది. చదవండి : బ్లాక్ ఫ్రైడే; సెన్సెక్స్1500 పాయింట్లు క్రాష్ -
జామియా విద్యార్థులపై కాల్పులు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనల్లో గురువారం కలకలం చెలరేగింది. ఆగంతకుడు ఒకరు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ ఘటనకు నిరసనగా వందలాది మంది ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాల్పులకు తెగబడిన తరువాత ఆ వ్యక్తి సంఘటన స్థలం నుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్తూ చేతిలోని తుపాకీని గాల్లో ఊపుతూ ‘తీసుకోండి స్వాతంత్య్రం’అని వ్యాఖ్యానించడం గమనార్హం. అప్పటివరకూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన అక్కడి పోలీసులు ఒక్కసారిగా మేలుకొని కొంతమంది ఆందోళనకారుల సాయంతో కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోగలిగారు. ఈ మొత్తం వ్యవహారంతో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లటి జాకెట్ తొడుక్కున్న ఆ వ్యక్తి తనను తాను ‘రాం భక్త్ గోపాల్’గా చెప్పుకున్నాడు. గోపాల్ కాల్పులకు పాల్పడేందుకు కొద్దిసేపటికి ముందే ఫేస్బుక్ లైవ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘షహీన్‌బాగ్ ఖేల్ ఖతమ్’అంటూ అతడు ఒక పోస్ట్ పెట్టాడు. తన అంతిమయాత్రలో తన శరీరాన్ని కాషాయ వస్త్రంతో చుట్టాలని, జైశ్రీరామ్ నినాదాలు చేయాలని అతడు మరో పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల తాలూకూ స్క్రీన్షాట్లు వైరల్కావడంతో అతడి ఫేస్బుక్ ప్రొఫైల్‌ను తొలగించారు. ‘పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తున్నాం. అకస్మాత్తుగా ఓ వ్యక్తి తుపాకీతో మా ముందుకొచ్చాడు. కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ షాబాద్ ఫారూఖ్ చేతికి తగిలింది’అని ఆమా ఆసిఫ్ అనే విద్యార్థిని తెలిపింది. షాబాద్‌ను ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ట్రామా సెంటర్‌కు తరలించారని వివరించింది. పలువురు ఇతర విద్యార్థులు ఘటన తీరును అనంతర పరిస్థితులను వివరించారు. జామియా మిలియా విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్ వద్దకు ర్యాలీగా వెళ్తుండగా.. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల ర్యాలీకి అనుమతి లేదని డీసీపీ చిన్మయ్ బిశ్వాల్ తెలిపారు. ‘నిరసన శాంతియుతంగా జరుపుకోవాలని పదేపదే చెబుతున్న తరుణంలో ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’అని బిశ్వాల్ తెలిపారు. కఠినంగా వ్యవహరించండి జామియా మిలియా వర్సిటీ వద్ద నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను కేంద్రం సహించబోదని, దోషులను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ప్రవీర్ రంజన్ దర్యాప్తు చేస్తారని, కేసు పురోగతిని స్వయంగా సమీక్షించనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. జామియా మిలియా వర్సిటీ వద్ద బుధవారం జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. రాంభక్త్ గోపాల్ అని చెప్పుకునే ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
గాయపడిన పోలీస్ ప్రాణం కాపాడిన ముస్లిం
ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ముస్లిం మత గురువు మానవత్వం ప్రదర్శించాడు. కోపంతో రాళ్లు విసురుతున్న నిరసనకారుల నుంచి గాయపడిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను కాపాడాడు. ఉత్తరప్రదేశ్‌లో ఫిరోజాబాద్ జిల్లాలోని ఓ మసీదులో గత వారం ప్రార్థనలు ముగించుకుని వస్తున్న 52 ఏళ్ల హాజీ ఖాదిర్‌కు కానిస్టేబుల్ అజయ్ కుమార్ గాయాలతో కనిపించాడు. నిరసనకారులు అజయ్‌పై దాడికి ప్రయత్నించగా ముందు తనను చంపి కానిస్టేబుల్‌పై దాడి చేయమని ఆందోళనకారులకు అడ్డు నిలిచాడు. అజయ్‌ను దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసులు అజయ్‌ను ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఖాదిర్ ప్రదర్శించిన తెగువ, మానవత్వాలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ/కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్ సీఎం మమత అన్నారు. అది నాయకత్వ లక్షణం కాదు ‘సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిరసన కారుల్లో ఎక్కువమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ప్రజలను హింసకు ప్రేరేపించడం నాయకత్వ లక్షణం కాదు’అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాయకుడంటే సరైన దిశలో నడిపించేవాడు. మంచి సూచనలిస్తూ మన సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ముందు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు. చాలా క్లిష్టమైన వ్యవహారం.’అని తెలిపారు. అయితే, రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్ రావత్ తలదూర్చడం కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘ఆయన చెప్పింది నిజమే. అయితే, ప్రధాని పదవిపై ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికాధికారులకు మాత్రమే ఉంటుంది. ఆయనకు ఇలాగే మాట్లాడే అవకాశం ఇస్తే సైనిక తిరుగుబాటుకు కూడా దారిచూపినట్లవుతుంది’ అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్విట్టర్లో పేర్కొన్నారు. జనరల్ రావత్ తన పరిధి తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘జనరల్ రావత్‌తో ఏకీభవిస్తున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపాతానికి పాల్పడిన వారు కూడా నాయకులు కాదుకదా?’అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా జనరల్ రావత్ వ్యాఖ్యలను ఖండించింది. ఈ పరిణామంపై ఆర్మీ స్పందించింది. ఆర్మీచీఫ్ వ్యాఖ్యలు కేవలం సీఏఏ ఆందోళనలనుద్దేశించి చేసినవి కావని పేర్కొంది. ఆయన ఏ రాజకీయ పార్టీని కానీ, వ్యక్తిని కానీ ప్రస్తావించలేదు. విద్యార్థులను గురించి మాత్రమే జనరల్ రావత్ మాట్లాడారు. కశ్మీర్ లోయకు చెందిన యువతను వారు నేతలుగా భావించిన వారే తప్పుదోవపట్టించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 31వ తేదీతో రావత్ పదవీ కాలం ముగియనుంది. ఆందోళనలు ఆపేదిలేదు: మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఉపసంహరించుకోనంత కాలం ఆందోళనలను కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.సీఏఏకి వ్యతిరేకంగా గురువారం సెంట్రల్ కోల్‌కతాలో ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ‘మీరు దేనికీ భయపడకండి. మీకు అండగా నేనుంటా. నిప్పుతో ఆటలు వద్దని బీజేపీని హెచ్చరిస్తున్నా’అని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై పోరాడుతున్న జామియా మిల్లియా, ఐఐటీ కాన్పూర్ తదితర వర్సిటీల విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు తిండి, బట్ట, నీడ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను కనిపెట్టే పని మాత్రం చేపట్టిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి సీఏఏపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అయోమయం సృష్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ‘పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక్క ప్రతిపక్ష నేత కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఢిల్లీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)తో, 2010నాటి ఎన్పీఆర్కు పోలికే లేదన్నారు. ఎన్నార్సీతో సంబంధం లేకుండా, 2010 నాటి ఎన్పీఆర్ చేపట్టాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ దురుద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గురువారం మైసూరులో జరిగిన భారీ ప్రదర్శన -
‘ఎన్పీఆర్’కు కేబినెట్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై ఒకవైపు తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలోనే.. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్– ఎన్పీఆర్)ను తాజాగా సవరించేందుకు(అప్డేట్) రూ. 3,941.35 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2020 ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య జరిగే ‘జనగణన – 2021’ తొలి దశతో పాటు ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలోని ‘సాధారణ నివాసుల’ వివరాలను ఈ ఎన్పీఆర్లో నమోదు చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరునెలలు ఒక ప్రాంతంలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని ‘సాధారణ నివాసి’గా పరిగణిస్తారు. మొదట 2010లో జాతీయ జనాభా పట్టికను రూపొందించగా, 2015లో ఇంటింటి సర్వే ద్వారా దీన్ని అప్డేట్ చేశారు. 2021 జనాభా గణనకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో.. జనాభా పట్టికను సవరించేందుకు తాజాగా నిర్ణయం జరిగింది. అస్సాం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఎన్నార్సీతో సంబంధం లేదు ఎన్పీఆర్ను 2010లోనే రూపొందించారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. యూపీఏ హయాంలో పౌరసత్వ చట్టం–1955 లోని నిబంధనల కింద 2010లోనే ఎన్పీఆర్ ప్రక్రియ ప్రారంభమైందని, 2015లో ఒకసారి అప్డేట్ అయిందని వివరించారు. అప్పుడు ఆధార్‌తో అనుసంధానం చేశారన్నారు. తాజాగా, ఆ జాబితాను అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక) ప్రక్రియ చేపడ్తారన్న ఆందోళనలను ఆయన తోసిపుచ్చారు. ఎన్పీఆర్కు ఎన్సార్సీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయాలను మరో మంత్రి పియూష్ గోయల్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ‘ఎన్పీఆర్ ప్రక్రియలో ఎలాంటి ధ్రువీకరణలు సమర్పించాల్సిన అవసరం లేదు. అలాగే బయోమెట్రిక్ ముద్రలు కూడా అవసరం లేదు. ఇదొక స్వీయ ధ్రువీకరణ వంటిదే. కేంద్ర సంక్షేమ పథకాలను అవసరమైన వారందరికీ చేర్చే లక్ష్యంతో ఈ ఎన్పీఆర్ ప్రక్రియ ఉంటుంది. గతంలో మాదిరిగా పెద్ద దరఖాస్తు నింపాల్సిన పనేమీ లేదు. మొబైల్ యాప్ ద్వారా సులువుగా నింపే వెసులుబాటు ఉంటుంది’ అని వెల్లడించారు. అయితే, జనగణన కమిషనర్ అధికారిక వెబ్సైట్లో మాత్రం ఎన్పీఆర్ కోసం బయోమెట్రిక్ వివరాలను కూడా సేకరిస్తామని ఉండటం గమనార్హం. గతంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు ఎన్పీఆర్ డేటాను సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు ఉపయోగించుకున్నాయని జవదేకర్ గుర్తు చేశారు. ఎన్పీఆర్ డేటాను ఆయుష్మాన్భారత్, ప్రధానమంత్రి ఆవాస్‌యోజన, ఉజ్వల, సౌభాగ్య తదితర కేంద్ర పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. పశ్చిమబెంగాల్, కేరళసహా కొన్ని బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు ఎన్పీఆర్ కార్యక్రమంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయగా.. ‘ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని రాష్ట్రాలు నోటిఫికేషన్లను విడుదల చేశాయి. దీనికి సంబంధించి అధికారులకు శిక్షణనివ్వడం కూడా ప్రారంభించాయి’ అని జవదేకర్ సమాధానమిచ్చారు. ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్: కాంగ్రెస్ ఎన్నార్సీకి ఎన్పీఆర్తో లింక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ చర్య రాజ్యాంగంలోని లౌకికభావనకు భంగకరమని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదంటూ హోం మంత్రి అమిత్‌షా చేస్తున్న ప్రకటన..ఎన్నార్సీపై పార్లమెంట్లో చర్చించలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య కంటే పెద్ద అబద్ధమని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ విమర్శించారు. ఎన్నార్సీకి మొదటి మెట్టు ఎన్పీఆర్ అంటూ హోం శాఖ తన వార్షిక నివేదికలో తెలిపిందన్నారు. 2021లో జనగణనతోపాటుగా ఎన్పీఆర్ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘జనగణన’కు ఆమోదం దేశ జనాభాను లెక్కించేందుకు ఉద్దేశించిన జనగణన– 2021 కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 8,754.23 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించింది. ఇది దేశంలో జరిగే 16వ జనగణన. స్వాతంత్య్రం వచ్చాక జరుగుతున్న 8వ జనగణన. ఈ జనగణన దేశమంతటా చేస్తారు. జనగణన రెండు విడతలుగా జరుగనుంది. తొలి దశలో 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు కుటుంబాల గణన, 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు మొత్తం జనాభా గణన ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా డేటా సేకరిస్తుండడంతో జనగణన వివరాలను ప్రకటించే అవకాశముంది. -
రిలయన్స్‌కు డీల్ అనిశ్చితి సెగ
సాక్షి,ముంబై : ఇంధన దిగ్గజ సంస్థలు సౌదీ అరామ్కో, రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మధ్య జరిగిన మెగా డీల్‌కు బ్రేక్ పడనుందన్న వార్తలతో ఆర్ఐఎల్ స్టాక్మార్కెట్లో డీలా పడింది. 15 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌పై అనిశ్చితి నెలకొనడంతో సోమవారం నాటి ట్రేడింగ్ లో ఆర్ఐఎల్ షేరు 3 శాతానికి పైగా నష్టపోయింది. పన్నా ముక్తా తపతి చమురు గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభాలలో 350 కోట్ల డాలర్ల(రూ. 24500 కోట్లు)ను మధ్యవర్తిత్వ బకాయిలను చెల్లించాల్సింది ఉందనీ, ఈ బకాయిలను చెల్లించకముందే చమురు, కెమికల్స్ బిజినెస్‌లో 20 శాతం వాటాను సౌదీ అరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించినట్లు ప్రభుత్వం వివరించింది. ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అయితే తాము బకాయిలు చెల్లించవలసిన అవసరంలేదంటూ ఆర్ఐఎల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు రిలయన్స్ కౌంటర్లో అమ్మకాలకు ఎగబడ్డారు. రిలయన్స్తోపాటు పెట్రో నెట్ ఎనర్జీ, గోవా కార్బన్ లాంటి ఎనర్జీ షేర్లు కూడా నష్టపోవడం గమనార్హం. -
కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడిన పర్సు!
ఫిరోజాబాద్: కొన్ని నాణేలు, నాలుగు ఏటీఎం కార్డులు, ఒక శివుడి ఫొటో ఉన్న పర్సు ఓ కానిస్టేబుల్ ప్రాణాన్ని కాపాడింది. అదెలా అనుకుంటున్నారా? పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో జరుగుతున్న ఆందోళనల్లో కానిస్టేబుల్ విజేందర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. ‘ఆందోళనకారులెవరో కాల్పులు జరిపారు. దీంతో దూసుకొచ్చి న బుల్లెట్ నా జాకెట్ నుంచి చొచ్చుకుపోయి నా జేబులో ఉన్న పర్సులో చిక్కుకుపోయింది. పర్సులో కొన్ని నాణేలు, ఏటీఎం కార్డులు, శివుని ఫొటో ఉన్నాయి. నిజంగా నాకిది పునర్జన్మగా భావిస్తున్నాను’అని విజేందర్ చెప్పారు. -
అది ముస్లిం సంస్థల పనే
న్యూఢిల్లీ/లక్నో/మంగళూరు/జైపూర్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో బయటివారి ప్రమేయం ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ అల్లర్లలో పాలుపంచుకున్న ఇస్లామిక్ సంస్థలకు చెందిన ఆరుగురు పశ్చిమబెంగాల్ కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. ‘పౌర’ చట్టాన్ని నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనల్లో 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రాజధాని లక్నోతోపాటు గొడవలు ఎక్కువగా చోటుచేసుకున్న మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్, బిజ్నోర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం ప్రశాంతత నెలకొంది. కాగా, అల్లర్ల బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలను లక్నో విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. బిజ్నోర్ జిల్లాలో అల్లర్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పరామర్శించారు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ‘పౌర’ చట్టానికి అనుకూలంగా జరిగిన ర్యాలీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. అల్లర్ల కారకులను అరెస్ట్ చేశాం రాష్ట్రంలో అల్లర్లకు కారకులైన వారిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆదివారం డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ మీడియాకు తెలిపారు. హింసాత్మక ఘటనల వెనుక పశ్చిమబెంగాల్‌కు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) కార్యకర్తల హస్తం ఉందన్నారు. వీరు అక్రమ ఆయుధాలను వాడారని తెలిపారు. బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు చెందిన ఆరుగురు పీఎఫ్ఐకు చెందిన వారిని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు. జైపూర్‌లో భారీ ర్యాలీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆధ్వర్యంలో జైపూర్‌లో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో 3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఆదివారం ఈశాన్య రాష్ట్రాలతోపాటు ఢిల్లీ, బిహార్, రాజస్తాన్, తమిళనాడు ల్లోనూ ఆందోళనలు ప్రశాంతంగా కొన సాగాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొందరు ఆదివారం దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలిపారు. తమ ప్రాంత స్థానిక ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటాన్ని మరుగున పరిచేలా, ‘పౌర’ ఆందోళన లకు మతం రంగు పులిమారని వారు ఆరోపించారు. ‘మా అజెండాను వేరొకరు హైజాక్ చేయనివ్వం. మా ప్రజల తరపున మాట్లాడేందుకే ఇక్కడికి వచ్చాం’అని త్రిపుర రాచ కుటుంబ వారసుడు ప్రద్యోత్ దేవ్ వర్మన్ పేర్కొన్నారు. నాగపూర్‌లో అనుకూల ర్యాలీ నాగపూర్: పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ చట్టానికి అనుకూలంగా ఆదివారం నాగపూర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూల సంస్థ చేపట్టిన ర్యాలీలో గడ్కరీ ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లింలకు ఎటువంటి అన్యాయం తలపెట్టదన్నారు. పొరుగు దేశాల నుంచి వచ్చిన వారిని వెనక్కి పంపబోదన్నారు. ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం ముస్లింలు గ్రహించాలన్నారు. -
రేపు రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో ఈ నెల 23న (సోమవారం) ఢిల్లీలోని గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద సత్యాగ్రహం కార్యక్రమం చేపట్టనున్నారు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకూ ఈ ధర్నా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఆదివారమే ఈ ధర్నా చేపట్టాలని ముందుగా భావించినప్పటికీ అనుమతులు పొందే క్రమంలో ఆలస్యం వల్ల సోమవారం నిర్వహించనున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. -
అట్టుడుకుతున్న యూపీ
న్యూఢిల్లీ/లక్నో/పుణే: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల్లో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. నిరసనకారుల దాడిలో 263 మంది పోలీసులు గాయాలపాలు కాగా, వీరిలో 57 మంది బుల్లెట్ గాయాలయ్యాయని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం, దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుకు వ్యతిరేకంగా బిహార్‌లో ఆర్జేడీ పిలుపు మేరకు శనివారం బంద్ జరిగింది. ఆందోళనలకు కేంద్ర బిందువుగా ఉన్న అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో శనివారం పరిస్థితులు సద్దుమణిగాయి. పౌరసత్వ సవరణ చట్టంపై సాగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మూడు కోట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తామని బీజేపీ తెలిపింది. పోలీస్ ఠాణాకు నిప్పు శుక్రవారం జరిగిన ఆందోళనల్లో ఆరుగురు మృతి చెందడంపై నిరసనకారులు శనివారం రాంపూర్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. అయినప్పటికీ, 12– 18 ఏళ్ల వయస్సున్న బాలురు సహా 500 మంది ఆందోళనకారులు రాంపూర్ ఈద్గా సమీపంలో గుమికూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఆందోళనకారులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో డజను మంది పోలీసులు కూడా గాయపడ్డారని చెప్పారు. ఈ ఘర్షణలకు స్థానికేతరులే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో నిరసనలు కొనసాగాయి. కాన్పూర్‌లో ఆందోళనకారులు యతీమ్‌ఖానా పోలీస్‌స్టేషన్‌కు నిప్పుపెట్టారు. వాళ్లే కాల్చుకున్నారు: డీజీపీ ఓపీ సింగ్ రాష్ట్రంలో ఎక్కడా పోలీసులు కాల్పులు జరపలేదని, ఆందోళనకారులే అక్రమంగా తెచ్చుకున్న ఆయుధాలతో కాల్చుకున్నారని యూపీ డీజీపీ ఓపీ సింగ్ వ్యాఖ్యానించారు. ‘నిరసనకారులు మహిళలు, చిన్నారులను అడ్డుపెట్టుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల అక్రమంగా ఆయుధాలతో కాల్పులకు దిగుతున్నారు. దీంతో పోలీసులు అంతిమ ప్రయత్నంగా టియర్‌గ్యాస్, లాఠీచార్జీలను వాడాల్సి వస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోల వారూ నిరసనలకు దిగుతున్నారు. అల్లర్ల వెనుక బంగ్లాదేశీయుల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపైనా దర్యాప్తు జరుపుతాం’ అని ఆయన తెలిపారు. లక్నోలో ఇప్పటి వరకు 218 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు లక్నోలో ఆందోళనల్లో సంభవించిన నష్టం వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులకు నోటీసులు జారీ చేసి నష్టాన్ని రాబడతామన్నారు. లక్నోలో ఈ నెల 23 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ నేరాలకు పాల్పడిన 705 మందిని అరెస్టు చేశామని, 4,500 మందిని నిర్బంధంలోకి తీసుకున్నామని ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు 102 మందిని అరెస్టు చేశామన్నారు. రాష్ట్రంలో నిరసనకారుల దాడిలో క్షతగాత్రులైన 263 మంది పోలీసు సిబ్బందిలో 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని ఐజీ ప్రవీణ్ వెల్లడించారు. ఆందోళనలు జరిగిన ప్రాంతాల నుంచి 405 ఖాళీ బుల్లెట్ కేసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫిరోజాబాద్ జిల్లాలో శనివారం జరిగిన వివిధ ఆందోళనల్లో ముగ్గురు మృతి చెందారని ఎస్పీ సచీంద్ర తెలిపారు. మహారాష్ట్ర కూడా వ్యతిరేకించాలి: పవార్ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ కేంద్రాన్ని కోరారు. ఈ చట్టంపై ఇప్పటికే వ్యతిరేకత ప్రకటించిన 8 రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర కూడా చేరాలని ఆయన సూచించారు. ఈ చట్టాన్ని అమలు చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం రద్దు చేసే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవగాహన కల్పిస్తాం: బీజేపీ చట్ట సవరణపై వ్యక్తమవుతోన్న తీవ్రమైన వ్యతిరేకతకు చెక్‌పెట్టాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. దీనిలో భాగంగా వచ్చే పది రోజుల్లో దాదాపు మూడు కోట్ల కుటుంబాలను కలిసి పౌరసత్వ సవరణ చట్టంపై అవగాహన కల్పిస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ తెలిపారు. ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడతామని, దేశవ్యాప్తంగా 250 మీడియా సమావేశాలు పెడతామని అన్నారు. ఈ చట్టం వల్ల లబ్ధిపొందిన కుటుంబాల వారిని కూడా ఈ ప్రచారంలో భాగస్వాములుగా చేస్తామన్నారు. భీం ఆర్మీ చీఫ్ అరెస్ట్ ఢిల్లీలోని దార్యాగంజ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధం ఉందనే ఆరోపణలతో భీం ఆర్మీ ఛీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేసి ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో ఆజాద్‌ను 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆజాద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దార్యాగంజ్ ఘటనకు సంబంధించి మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుభాష్ మార్గ్‌లో పార్కు చేసి ఉన్న ఓ ప్రైవేటు కారుకి ఆందోళన కారులు నిప్పు పెట్టారనీ, అల్లర్లకు పాల్పడ్డారనీ పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనలతో సంబంధమున్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టానికి 1,100 మంది విద్యావేత్తల మద్దతు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్నవేళ దేశ విదేశీ విశ్వవిద్యాలయాలకు చెందిన పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు సవరణ చట్టానికి అనుకూలంగా స్పందించారు. పౌరసత్వ చట్టాన్ని స్వాగతిస్తూ 1,100 మంది తమ సంతకాలతో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంతకాలు చేసిన వారిలో షిల్లాంగ్ ఐఐఎం చైర్మన్ శిశిర్ బజోరియా, నలందా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సునైనా సింగ్, జేఎన్‌యూ ప్రొఫెసర్ ఐనుల్ హసన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్, కన్ఫ్లిక్ట్ స్టడీస్ పరిశోధనా సంస్థలో సీనియర్ అధ్యాపకుడు అభిజిత్ అయ్యర్ మిత్ర, పాత్రికేయుడు కంచన్ గుప్తా, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా తదితరులు ఉన్నారు. అనవసరంగా భయాందో ళనలు చెందాల్సిన పనిలేదని, పుకార్ల భ్రమల్లో పడకూడదని ఈ లేఖ ద్వారా మేధావులు సమాజంలోని అన్నివర్గాల ప్రజలను కోరారు. శాంతియుతంగా ఆలోచించాలని సూచించారు. భారతదేశ నాగరికతను కాపాడేందుకు, మైనారిటీల హక్కుల రక్షణకోసం పార్లమెంటు ప్రయత్నిస్తోందంటూ ఈ లేఖలో కొనియాడారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శనివారం పట్నాలో ఆందోళన చేస్తున్న నిరసనకారులు -
పౌరసత్వంపై ఆందోళన వద్దు!
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో చట్టంలో పొందుపర్చిన పౌరసత్వం నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. జూలై 1, 1987న లేదా ఆ లోపు భారత్‌లో జన్మించిన వారు సహజంగానే భారతీయ పౌరులవుతారని తెలిపింది. అలాగే, ఆ తేదీ(జూలై 1, 1987)లోపు వారి తల్లిదండ్రులు భారత్‌లో జన్మించినట్లైనా కానీ ఆ పిల్లలు చట్టప్రకారం భారతీయ పౌరులేనన్నారు. సీఏఏపై, ఎన్నార్సీపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అస్సాం విషయంలో ఈ కటాఫ్ 1971వ సంవత్సరంగా ఉంటుందన్నారు. ï పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం, జూలై 1, 1950 – డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌లో జన్మించిన వారు పౌరసత్వానికి అర్హులు. అలాగే, పిల్లలు జన్మించిన సమయంలో తల్లిదండుల్లో ఏ ఒకరైనా భారతీయ పౌరుడైతే.. ఆ పిల్లలు కూడా ఇక్కడి పౌరులవుతారు. డిసెంబర్ 10, 1992– డిసెంబర్ 3, 2004 మధ్య భారత్‌కు వెలుపల జన్మించిన వారి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉంటే.. ఆ పిల్లలను కూడా ఇక్కడివారిగా పరిగణిస్తారు. -
దేశవ్యాప్తంగా పౌరసత్వ సెగ
-
ఆందోళనలు.. అరెస్ట్‌లు
న్యూఢిల్లీ: ‘పౌర’ ఆగ్రహం తీవ్రమవుతోంది. ఆందోళనలపై ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. పలు పట్టణాలు, విశ్వవిద్యాలయాల్లో వామపక్ష పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు భారీగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. యూపీ, బిహార్‌ల్లో ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఆందోళన ల్లో పాల్గొన్న లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరి, డీ రాజా, నీలోత్పల్ బసు, బృందా కారత్, స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర యాదవ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా ఆందోళనకారులను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట సహా పలు ప్రాంతాల్లో అధికారులు 144 సెక్షన్ విధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ను, మొబైల్ సేవలను నిలిపేశారు. సీఏఏ వ్యతిరేక నిరసనల కేంద్రంగా నిలిచిన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో శాంతియుత నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. కేరళ, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోవైపు, పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)తో పాటు జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)ని దేశవ్యాప్తంగా అమలు చేయడం తథ్యమని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఢిల్లీలో.. 144 సెక్షన్ విధించినప్పటికీ నిరసనకారులు వెనక్కుతగ్గలేదు. వేలాదిగా ఎర్రకోట, జంతర్‌మంతర్, మండిహౌజ్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలిపారు. 1975 నాటి ఎమర్జెన్సీ కన్నా పరిస్థితి దారుణంగా ఉందని మండిహౌజ్ వద్ద ఆందోళనల్లో పాల్గొని అరెస్టైన సీపీఎం నేత ఏచూరి అన్నారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా కొన్ని గంటల పాటు కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నెట్ సహా అన్ని మొబైల్ సేవలను నిలిపేశారు. ‘నిర్భయ’ ఆందోళనలు, అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమ సమయంలోనూ పోలీసులు ఇంతటి చర్య తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో రణరంగమైంది. నగరవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. ఒక పోలీస్ ఔట్‌పోస్ట్ వెలుపల వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సంబల్ ప్రాంతంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సును తగలపెట్టారు. బిహార్‌లో.. వామపక్ష విద్యార్థులు రోడ్లను, రైల్వే ట్రాక్‌లను నిర్బంధించి నిరసన తెలిపారు. పట్నాలో మాజీ ఎంపీ పప్పు యాదవ్ నేతృత్వంలోని జన అధికార పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్లపై టైర్లను తగలబెట్టి వాహనాలను అడ్డుకున్నారు. జహానాబాద్‌లో సీపీఐఎంఎల్ కార్యకర్తలు రోడ్ రోకో నిర్వహించారు. మహారాష్ట్రలో.. ముంబైలోని క్రాంతి మైదాన్‌లో కాంగ్రెస్, ఎన్సీపీ, పలు ఇతర పార్టీలు ‘హమ్ భారత్ కే లోగ్’ పేరుతో ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో వేలాదిగా పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే మైదానం నుంచి 1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా’ నినాదం ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 94 ఏళ్ల జీజీ పారిఖ్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలోనూ పాల్గొని చరిత్ర సృష్టించారు. పశ్చిమబెంగాల్లో.. కోల్‌కతాలో వరుసగా నాలుగోరోజు ముఖ్యమంత్రి మమత బెనర్జీ సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో స్వయంగా పాల్గొన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై దేశవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని మోదీ సర్కారును సవాలు చేశారు. ఈ రెఫరండంలో ఓడిపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ఇద్దరి మృతి మంగళూరులో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయారు. మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, పోలీసులపై దాడికి ఆందోళనకారులు ప్రయత్నించారని, వారిని అడ్డుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని పోలీస్ అధికారులు తెలిపారు. బెంగళూరు, హుబ్బలి, కలబుర్గి, హాసన్, మైసూర్, బళ్లారిల్లో విపక్షాలు, ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బెంగళూరులో ఆందోళనల్లో పాల్గొన్న రామచంద్ర గుహను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనలకు కూడా అనుమతించకపోవడం అప్రజాస్వామికమని గుహ విమర్శించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద అప్రమత్తంగా ఉన్న ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సభ్యులు గుహ అరెస్ట్ దృశ్యం -
రాజ్యాంగ బద్ధతపై విచారిస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు కారణమైన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) రాజ్యాంగ బద్ధతపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఆ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులను ఎదుర్కొని డిసెంబర్ 31, 2004లోపు భారత్‌కు వలస వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్, జైన్, పార్శీ, బౌద్ధ మతస్తులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లు ఇటీవలే పార్లమెంట్ ఆమోదం పొంది, రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదని, మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. అనంతరం, చట్టం రాజ్యాంగబద్ధతపై విచారణ జరుపుతామని పేర్కొంది. వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది. సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించాలని విచారణ సందర్భంగా న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ చేసిన సూచనను ధర్మాసనం సమర్థించింది. ‘చట్టం లక్ష్యాలను, నియమనిబంధనలను, చట్టంలోని కీలకాంశాలను ప్రజలకు వివరించండి. అందుకు దృశ్య, శ్రవణ మాధ్యమాలను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించండి’ అని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను ఆదేశించింది. అందుకు వేణుగోపాల్ అంగీకరించారు. చట్టం అమలును అడ్డుకోవాలని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనాన్ని కోరారు. అస్సాం ఆందోళనల్లో ఐదుగురు విద్యార్థులు చనిపోయారన్నారు. అయితే, నోటిఫై చేసిన తరువాత చట్టంపై స్టే విధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత తీర్పులను ప్రస్తావిస్తూ అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, కపిల్ సిబల్‌లు చట్టం అమలుపై విధివిధానాలు రూపొందలేదని, అమలుపై ఆందోళన అవసరం లేదన్నారు. దాంతో చట్టం అమలుపై స్టే విధించడానికి కోర్టు నిరాకరించింది. ‘పౌర’ ఆందోళనలు చరిత్రలో నిలుస్తాయి: కన్హయ్య పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆందోళనల్లో జేఎన్‌యూ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ పాల్గొన్నారు. యూనివర్సిటీ 7 వ నెంబర్ గేట్ వద్ద విద్యార్థులు, ఇతర నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగించారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిపే నిరసనలు ముస్లింలను రక్షించడానికి కాదని, మొత్తం దేశాన్ని రక్షించేందుకని వ్యాఖ్యానించారు. పౌరసత్వ చట్టం కన్నా జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ) మరింత ప్రమాదకరమైందని స్పష్టం చేశారు. ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాటిగా చరిత్రలో నిలిచిపోతాయి’ అన్నారు. ‘ఎన్నార్సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మనమంతా నోట్ల రద్దు సమయంలో నిల్చున్నట్లు భారీ లైన్లలో నిల్చుని మన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’ అన్నారు. పశ్చిమబెంగాల్లోని దినాజ్‌పూర్ జిల్లాలో సీఏఏ నిరసన ప్రదర్శనపై దుండగులు నాటు బాంబులు విసరడంతో ఐదుగురు గాయపడ్డారు. మద్రాస్ వర్సిటీకి కమల్ హాసన్: మద్రాస్ వర్సిటీలో దర్నా చేస్తున్న విద్యార్థులకు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ సంఘీ భావం తెలిపారు. క్యాంపస్ లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో, వెలుపలి నుంచే విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. జామియా కేసు చీఫ్ జస్టిస్‌కు బదిలీ జామియా మిలియాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా రక్షణ కల్పించాలని ఇద్దరు విద్యార్థినులు పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జామియా వర్సిటీ విద్యార్థినులు లడీదా ఫర్జానా, ఆయేషా రీనా పెట్టుకున్న పిటిషన్ వేశారు. అయితే, సీఏఏ వ్యతిరేక హింసాత్మక ఘటనలకు సంబంధించిన కేసులను హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులే విచారించాలన్న సుప్రీం ఆదేశాలను కేంద్రం తరఫు న్యాయవాది జస్టిస్ విభూ దృష్టికి తెచ్చారు. దాంతో విచారణను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ జస్టిస్ విభూ నిర్ణయం తీసుకున్నారు. ‘పౌరసత్వం’పై నిరసనలు చేపట్టకూడదంటూ కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరులలో పోలీసులు ఆంక్షలు విధించారు. బెంగళూరులో గురువారం ఉదయం 6 నుంచి 21 అర్థరాత్రి వరకు అమల్లో ఉంటాయి. దేశాన్ని మంటల్లోకి తోస్తున్నారు కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ కోల్‌కతా: ‘దేశంలోని మంటలను ఆర్పాల్సింది పోయి.. దేశాన్ని మంటల్లోకి నెడుతున్నారు. ఇది మీ ఉద్యోగం కాదు’అని హోం మంత్రి అమిత్‌షాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్..’అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు కానీ.. దేశంలోని ప్రతి ఒక్కరిని వినాశనాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. దేశం మంటల్లో కాలిపోకుండా చూడాలని అమిత్‌షాను కోరారు.దేశాన్ని మంటల్లోకి తోసేయడం మీ ఉద్యోగం కాదు.. కానీ మంటలు ఆర్పేయండి చాలు’అని ఎద్దేవా చేశారు. కోల్‌కతాలో కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. -
రణరంగంగా జామియా వర్సిటీ
న్యూఢిల్లీ/గువాహటి/ఈటానగర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే, గత రెండు రోజులతో పోలిస్తే.. అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌లో, మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ల్లో శుక్రవారం కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. అస్సాంలో నిరసనలకు కేంద్రమైన గువాహటిలో శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. లాఠీచార్జ్.. టియర్ గ్యాస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌కు ర్యాలీగా వెళ్లాలనుకున్న జామియా మిలియా వర్సిటీ విద్యార్థులను పోలీసులు వర్సిటీ గేటు వద్దే అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల పైకి విద్యార్థులు రాళ్లు రువ్వడంతో, ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారని, రాళ్లు కూడా మొదట పోలీసులే రువ్వారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థులే బారికేడ్లను ధ్వంసం చేసి తమపైకి దూసుకువచ్చారని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యారు. దాదాపు 50 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ ప్రాంత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్(ఆప్) ఘటనాస్థలికి వెళ్లి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. రైల్వే స్టేషన్‌కు నిప్పు పశ్చిమబెంగాల్లోని ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న బెల్డాంగ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌ను శుక్రవారం ఆందోళనకారులు తగలబెట్టారు. వేలాదిగా అక్కడికి వచ్చిన నిరసనకారులు రైల్వే కార్యాలయానికి, ఆర్పీఎఫ్ అవుట్‌పోస్ట్‌కు, ట్రాక్స్‌కు నిప్పంటించారు. అక్కడ రైల్వే పోలీసులపై తిరగబడ్డారు. బెల్డాంగ పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. రఘునాథ్గంజ్ పోలీస్ స్టేషన్‌లోని వాహనాలకు నిప్పంటించారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండే ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభా ఎక్కువ. అలాగే, ముస్లిం జనాభా అధికంగా ఉన్న గ్రామీణ హౌరా, బిర్భుమ్, బుర్ద్వాన్ల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అరుణాచల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి, వీ«ధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. ఈటానగర్‌లోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ జరిపారు. 30 కి.మీల దూరం సాగిన ఈ ర్యాలీలో పాల్గొని, గవర్నర్ బీడీ మిశ్రాకు వినతిపత్రం ఇచ్చారు. గువాహటిలో ఏఏఎస్‌యూ ర్యాలీ అస్సాంలోని గువాహటిలో తాత్కాలికంగా కర్ఫ్యూను తొలగించారన్న సమాచారంతో నిత్యావసర సరుకుల కోసం ప్రజలు వేలాదిగా దుకాణాల ముందు బారులు తీరారు. నగరంలోని దాదాపు అన్ని చోట్ల భద్రతా బలగాలు మోహరించాయి. పలు చోట్ల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. నగరంలో శుక్రవారం ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు. కానీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నగరంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించింది. అమిత్ షా పర్యటన రద్దు మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ఆది, సోమవారాల్లో హోంమంత్రి అమిత్ షా జరపనున్న పర్యటన రద్దయింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. జపాన్ ప్రధాని పర్యటన రద్దు జపాన్ ప్రధాని షింజో ఆబే భారత పర్యటన రద్దయింది. పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనల కారణంగా గువాహటిలో ప్రధాని మోదీతో ఈనెల 15 నుంచి జరగాల్సిన భేటీ రద్దయినట్లు తెలిపింది. అల్ప సంఖ్యాకుల హక్కులకు రక్షించండి వాషింగ్టన్: పౌరసత్వ చట్ట సవరణ..తదనంతర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అల్పసంఖ్యాక మతాల వారి హక్కులకు రక్షణ కల్పించాలని భారత్‌ను కోరింది. పౌరసత్వ చట్టంపై సుప్రీంలో పిటిషన్లు పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఆసు), పీస్ పార్టీ, కొన్ని ఎన్జీవోలు, న్యాయవాది ఎంఎల్ శర్మ, కొందరు న్యాయ విద్యార్థులు కూడా శుక్రవారం పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్ట సవరణలపై తక్షణం విచారణ చేపట్టాలని మహువా మొయిత్రా తరఫు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. అయితే, ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు ఈ చట్టం ద్వారా భంగం కలుగుతోందని జైరాం రమేశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. -
ఆందోళన వద్దు సోదరా..
ధన్‌బాద్: పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) పార్లమెంటు ఆమోదించడాన్ని నిరసిస్తూ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు అంతకంతకూ ఉధృతంగా మారడంతో ప్రధాన మంత్రి మోదీ వారిని శాంతింప జేసే ప్రయత్నాలు చేశారు. కొత్త చట్టంపై ఎలాంటి ఆందోళన వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ధన్‌బాద్ ఎన్నికల ర్యాలీలో గురువారం ప్రసంగించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈశాన్య రాష్ట్ర ప్రజలకున్న ప్రత్యేక గుర్తింపుని, సంస్కృతిని, భాషని కాపాడతా మని హామీ ఇచ్చారు. క్యాబ్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈశాన్య ప్రాంతంలో అస్సాం సహా ప్రతీ రాష్ట్రంలో ఆదివాసీ సమాజ సంస్కృతీ సంప్రదాయాల్ని, వారి జీవన విధానాన్ని పరిరక్షిస్తామన్నారు. అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కిందకు వచ్చే ఆదివాసీ ప్రాంతాలను కొత్త చట్టం నుంచి మినహాయించినట్టు మోదీ చెప్పారు. అంతకు ముందు ప్రధాని ఇంగ్లీషు, అస్సామీ భాషల్లో వరస ట్వీట్లు చేస్తూ స్థానిక హక్కులు కాపాడే నిబంధన 6 స్ఫూర్తికి భంగం కలిగించబోమన్నారు. -
అట్టుడుకుతున్న అస్సాం
న్యూఢిల్లీ/గువాహటి: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఇంటర్నెట్ సేవలపై మరో 48 గంటలపాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్పై నిషేధం ఉండగా ట్విట్టర్లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గువాహటి యుద్ధరంగం రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. నగరంలో ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు అంటున్నారు. అయితే, ముగ్గురు మృతి చెందారని ఆందోళన కారులు అంటున్నారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్ చీఫ్ భాస్కర్ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించలేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆసు(ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్) పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజర య్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా దిబ్రూగఢ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పోలీసు సర్కిల్ అధికారి కార్యాలయానికి కూడా నిప్పు పెట్టారు. కామ్రూప్ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. జోర్హాత్ జిల్లాలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. 39వ నంబర్ జాతీయరహదారిపై బైఠాయించిన వారిని చెదరగొట్టేందుకు గోలా ఘాట్ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రంగియాలో కూడా పోలీసు కాల్పులు జరిగాయి. విమాన సర్వీసుల రద్దు అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై మరో 48 గంటలపాటు నిషేధం పొడిగించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం గువాహటి పోలీస్ అదనపు కమిషనర్ దీపక్ కుమార్‌ను తొలగించి మున్నాప్రసాద్ గుప్తాను నియమించింది. అదేవిధంగా, అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) ముకేశ్ అగర్వాల్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో జీపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది. త్రిపుర,అస్సాంలకు రైళ్లు బంద్ ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడమో లేక కుదించడమో చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారని తెలిపింది. 12 కంపెనీల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను తరలిస్తున్నట్లు వెల్లడించింది. -
జేఎన్‌యూ విద్యార్థులపై లాఠీచార్జ్
న్యూఢిల్లీ: హాస్టల్ ఫీజుల పెంపుపై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫీజుల పెంపుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న జేఎన్‌యూ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను భికాజీ కామాప్లేస్ మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు బారికేడ్లను దూకేందుకు యత్నించడంతో లాఠీలతో విరుచుకుపడ్డారు. పోలీసుల దాడిలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు విద్యార్థులు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు, విద్యార్థులపై పోలీసులు దాడులు చేస్తున్నారని, క్యాంపస్‌లోకి తిరిగి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు ఐషే ఘోష్ చెప్పారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు తమ ఆందోళనలు ఆపబోమన్నారు. -
ఇరాక్ సైన్యం కాల్పుల్లో 27 మంది మృతి
సిరియా: ఇరాక్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. నజాఫ్ నగరంలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయానికి నిరసనకారులు బుధవారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామ అనంతరం నజాఫ్‌తోపాటు మిగతా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బలగాలను భారీగా మోహరించింది. దీంతో నజాఫ్‌లో రెండు కీలక వంతెనలపై బైఠాయించిన ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేసేందుకు బలగాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోగా 165 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో రక్షితప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరపగా నలుగురు చనిపోగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
తొలిరోజే ఆందోళనలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు. వారితో పాటు ఎన్సీ సభ్యులు తమ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ఇంట్లోనే నిర్బంధించడంపై నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభ్యులకు అవకాశమిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ సహా విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు. తక్షణమే ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి, సభకు హజరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోకివిపక్ష సభ్యులను అనుమతించకుండా.. ఈయూ పార్లమెంటేరియన్లను అనుమతించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ఖండించారు. పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై పోలీసులు దాడిచేసి, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె కుమార్తె చెప్పారని డీఎంకే సభ్యుడు బాలు ప్రస్తావించారు. గత సమావేశాలు అద్భుతం పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయన్న విశ్వాసం తనకుందన్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం. దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. గత సమావేశాలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు. -
జేఎన్‌యూలో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఫీజుల పెంపును నిరసిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ విద్యార్థులు నిరసనబాట పట్టారు. జేఎన్‌యూ నుంచి విద్యార్థుల నిరసనర్యాలీ మొదలైంది. దగ్గర్లోని ఏఐసీటీఈ ఆడిటోరియంకు సమీపానికి రాగానే పోలీసులు వారిని నిలువరించారు. ఆడిటోరియంలో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య మాట్లాడుతున్నపుడు బయట విద్యార్థుల ఆందోళన కొనసాగింది. పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్నాతకోత్సవం తర్వాత వెంకయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆడిటోరియం ప్రాంతాన్ని విద్యార్థులు చుట్టుముట్టడంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పోఖ్రియాల్ దాదాపు ఆరు గంటలపాటు ఆడిటోరియంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల అభ్యంతరాలు, డిమాండ్లన్నింటినీ పరిశీలిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. -
నవంబరులో పెళ్లి : రూ.1000తో ఎలా?
సాక్షి, ముబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీంఎంసీ) సంక్షోభంపై ఖాతాదారుల సొమ్ము భద్రంగా ఉందని బ్యాంకు ఎండీ జాయ్ థామస్ హామీ ఇచ్చినప్పటికీ వినియోగదారుల ఆందోళన కొనసాగుతోంది. బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆరునెలల ఆంక్షలు ఖాతాదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. వసూలు కాని మొండి బకాయిలను (ఎన్పీఏలు) తక్కువగా చూపించడంతోపాటు పీఎంసీలో ఎన్నో నిబంధనల ఉల్లంఘనను ఆర్బీఐ గుర్తించి ఒక్కో కస్టమర్ కేవలం రూ.1,000 మాత్రమే (సేవింగ్స్/కరెంటు/డిపాజిట్ ఖాతా) అంటూ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయా ఖాతాలనుంచి వెయ్యి రూపాయలకు మించి నగదు పొందలేరన్న ఆర్బీఐ నిబంధన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముంబైలోని పీఎంసీ బ్యాంకు కార్యాలయం ముందు కస్టమర్లు గురువారం ఆందోళనకు దిగారు. గత 20 ఏళ్లుగా ఈ బ్యాంకులో ఖాతానుకొనసాగిస్తున్నానని గురు చరణ్‌సింగ్ తల్వార్ అనే ఖాతాదారుడు వాపోయాడు. బిడ్డ పెళ్లి కోసమని డబ్బులు కూడబెట్టాను. నవంబరులో పెళ్లి నిశ్చయించుకున్నాం. ఇపుడీ వెయ్యి రూపాయలతో ఎలా మేనేజ్ చేయలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ. నెలకు రూ. 5 వేలు సంపాదించుకునే మహిళ, ఏం జరుగుతోందో అర్థంకాక కన్నీరు మున్నీరయ్యారు. Heart breaking.. She earns 5000 per month.. One lakh might be her life long savings.. pic.twitter.com/pOkfmlkZD7 — Renjith Thomas (@TowardsLiberti) September 25, 2019 మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన హెచ్‌డీఐఎల్, పీఎంసీ బ్యాంకు మేనేజ్మెంట్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు సంజయ్‌నిరుపమ్, మరో బీజేపీ నేత డిమాండ్ చేశారు. అలాగే నగదు ఉపసంహరణ పరిమితిని పెంచాలని ఆర్బీఐకి విజ్ఞప్తి చేశారు. వెయ్యి లక్షరూపాయలకు లిమిట్‌ను పెంచాల్సిందిగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను కోరినట్టు బీజేపీ నేత తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ పీఎంసీ కుంభకోణంతో బీజేపీనుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే సర్దార్ తారా సింగ్ కుమారుడు, బ్యాంకు కో డైరెక్టర్లలో ఒకరైన రజనీత్ సింగ్‌కు సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటిని ఆయన కొట్టి పారేశాడు. గత 13ఏళ్లనుంచి మూడవసారి డైరెక్టర్‌గా కొనసాగుతున్నానని, బ్యాంకునకు సంబంధించిన రోజువారీ కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం ఉండవని వివరణ ఇచ్చారు. విత్ డ్రా పరిమితిని పెంచాల్సిందిగా ఆర్బీఐని కోరినట్టు తెలిపారు. చదవండి : పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ కొరడా! చదవండి : ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్ -
సూడాన్‌లో 101 మంది మృతి
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. -
గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్తాన్‌లో గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన మూడో రోజైన ఆదివారం హింసాత్మకంగా మారింది. రాజస్తాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందం గుజ్జర్లతో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో ధోల్పూర్ జిల్లాలో ఆందోళనకారులు ఆగ్రా–మొరేనా రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో 8–10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు 3 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లు వ్యాపించకుండా ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఆందోళనకారులు వేర్వేరు నగరాల్లో జాతీయ రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను నిలిపివేసేందుకు గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షణ్ సమితి చీఫ్ కిరోరీ సింగ్ బైంస్లా నిరాకరించారు. రైకా–రెబారీ, గడియా లుహార్, బంజారా, గదరియా, గుజ్జర్ సామాజికవర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు రైలు పట్టాలపై ధర్నాకు దిగడంతో రాజస్తాన్‌లో 20 సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఈ ప్రాంతంలో మరో 250 రైళ్లను దారి మళ్లించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనలోకి సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు రాజధాని విజయవాడలో కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తరలివచ్చారు. విజయవాడ నుంచి అమరావతికి మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయ అధికారులు వెళ్లే ప్రధాన మార్గమైన ప్రకాశం బ్యారేజ్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. ఊహించని రీతిలో ఉద్యోగులు ప్రకాశం బ్యారేజ్‌పైకి చేరుకోవడంతో ప్రభుత్వానికి, పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. మూడు గంటలపాటు బ్యారేజీపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులకు నానా అవస్థలు పడ్డారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వారికి నాలుగు గంటల సమయం పట్టింది. గంటపాటు భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ఉద్యోగులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించి అరెస్టుచేశారు. సీపీఎస్‌ను రద్దు చేసేవరకు పోరాడతామంటూ ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,86,000 మంది ఉద్యోగస్తులు సీపీఎస్‌వల్ల రోడ్డున పడే ప్రమాదముందని.. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 653, 654, 655 జీఓలను వెంటనే రద్దుచేసి, పాత పెన్షన్ పద్ధతిని అమలుచేయాలని అరెస్టయిన నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్‌పై మెరుపు ధర్నా అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్ మీటింగ్, టీటీడీ శ్రీవారి ఆలయం భూకర్షణ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు గురువారం ఉండటం, ఒక్కసారిగా బ్యారేజ్‌పై ఉద్యోగులు ఆందోళనతో అమరావతికి బయల్దేరడంతో పోలీసులు కంగారు పడ్డారు. ‘చలో అసెంబ్లీ’కి అనుమతిలేదంటూ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్–30తో పాటు 144 సెక్షన్లు అమలులో ఉన్నాయంటూ హెచ్చరించారు. అయినా, ఫలితం లేకపోవడంతో ఉద్యోగులను అరెస్టుచేసి వేర్వేరు పోలీస్స్టేషన్లకు తరలించారు. అయినా, అరెస్టులను ఛేదించుకుంటూ వందలాది మంది ఉద్యోగులు ప్రకాశం బ్యారేజ్‌పైకి చేరుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు బ్యారేజ్ పైనే నినాదాలు చేస్తూ బైఠాయించారు. గంటపాటు ఎంత ప్రయత్నించినా వినకుండా అక్కడే కూర్చోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో నిత్యం సీఎం ప్రయాణించే బస్సు కూడా నిలిచిపోయింది. ఆందోళనకారులు బస్సును ధ్వంసం చేస్తారేమోనన్న అనుమానంతో పోలీసులు దానిచుట్టూ వలయంలా ఏర్పడ్డారు. అలాగే, ధర్నా కారణంగా రాజధాని వైపు వెళ్లాల్సిన వందలాది వాహనాలు కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వం చర్చలకు పిలిస్తేనే ఇక్కడి నుంచి కదులుతామంటూ అక్కడే భీష్మించుకు కూర్చోవడంతో పోలీసులు వారిని ఈడ్చుకుంటూ పోలీసు వాహనాల్లో ఎక్కించి అరెస్టుచేశారు. అరెస్టయిన వారిని గవర్నర్‌పేట, భవానీపురం, విజయవాడ వన్‌టౌన్, కృష్ణలంక, తాడేపల్లి తదితర పోలీస్స్టేషన్లకు తరలించారు. శాంతియుతంగా ర్యాలీగా వెళుతున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి, తమ హక్కులను కాలరాస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతల సంఘీభావం ఇదిలా ఉంటే.. ఉద్యోగులను అరెస్టు చేయటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ నాయకులు మల్లాది విష్ణు, పి గౌతంరెడ్డిలు విజయవాడ గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అరెస్టయిన ఉద్యోగులను కలిసి వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. సీపీఎస్ ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారిపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అన్నారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. -
కేరళ సంస్కృతికి అవమానం
త్రిస్సూర్/కొచ్చి: కేరళ సంస్కృతిని ఆ రాష్ట్రంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలా అవమానించిందో శబరిమల అంశం ద్వారా స్పష్టమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు వెళ్లవచ్చునంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆదేశించడం, ఈ అంశం కేరళలో తీవ్ర ఆందోళనలు, హింసకు దారితీయడం తెలిసిందే. అనంతరం పోలీసు భద్రత నడుమ ఇద్దరు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం కూడా పెనుదుమారం రేపింది. కేరళలోని త్రిస్సూర్‌లో జరిగిన యువ మోర్చా సభలో మోదీ మాట్లాడుతూ ‘శబరిమల అంశం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేరళ సంస్కృతిని సీపీఎం నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంతలా అవమానపరిచిందో దేశ ప్రజలు చూశారు. కేరళ సంస్కృతిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? దురదృష్టవశాత్తూ కేరళ సాంస్కృతిక విలువలపై దాడి జరుగుతోంది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వమే ఆ పని చేస్తోంది’ అని ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష పార్టీల వారు తనను ఎంత దూషిం చినా ఫరవాలేదనీ, కానీ వారు రైతులను తప్పుదోవ పట్టించకూడదని మోదీ పేర్కొన్నారు. యువతకు లభిస్తున్న అవకాశాలకు విపక్షాలు అవరోధాలను సృష్టించకూడదని కోరారు. కొచ్చిలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన చమురు శుద్ధి కర్మాగారం విస్తరణ కోసం నిర్మించిన కాంప్లెక్స్‌ను మోదీ జాతికి అంకితమిచ్చారు. ఈ కర్మాగారంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు, ఎట్టుమనూర్‌లో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)కు చెందిన ఎల్పీజీ సిలిండర్లను నింపే ప్లాంటులో కొత్త నిల్వ సదుపాయాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని వంటగదులను పొగరహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందనీ, తాము అధికారంలోకి వచ్చే నాటికి 55 శాతం కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను 90 శాతానికి చేర్చామని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఓ పెద్ద జోక్ అని మోదీ విమర్శించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ను గూఢచర్యం కేసులో ఇరికించింది నాడు కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వమేనని మోదీ ఆరోపించారు. తమ పార్టీ నాయకుల రాజకీయ ప్రయోజనాల కోసమే వారు అలా చేశారన్నారు. తమ ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్‌ను ఇచ్చిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. విపక్షం అంటే అవినీతి గృహమని మోదీ అన్నారు. తనను తాను కాపలాదారుడిగా మరోసారి చెప్పుకున్న ఆయన, తాను అధికారంలో ఉన్నంతవరకూ అవినీతిని అనుమతించనని తెలిపారు. ఎట్టుమనూర్‌లో శంకుస్థాపన కార్యక్రమానికి గవర్నర్ పి.సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు. సంపూర్ణ ఆరోగ్యానికే ఆయుష్మాన్ భారత్.. సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై సమీపంలోని థోప్పూర్లో రూ. 1,264 కోట్లతో నిర్మించ తలపెట్టిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్–ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)కు మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. 750 పడకలతో నిర్మిస్తున్న ఈ వైద్యశాలలో 100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల కూడా ఉండనుంది. మదురైలో మోదీ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, ఆరోగ్య సమస్యలకు సంపూర్ణంగా పరిష్కారం చూపేందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఏడు ఎయిమ్స్ వైద్యశాలలు పనిచేస్తుండగా ఇవన్నీ ఉత్తర భారతంలోనే ఉన్నాయి. మరో 14 ఎయిమ్స్‌ను ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్మిస్తోంది. మదురైలో నిర్మిస్తున్న ఎయిమ్స్‌తో తమిళనాడు ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ఆరోగ్య పథకాల గురించి ఆయన వివరించారు. వెనుకబడిన రామనాథపురం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పళనిస్వామి మోదీని కోరారు. కాగా, కావేరీ నదీ జలాలు సహా అనేక అంశాల్లో మోదీ తమిళనాడు ప్రయోజనాలకు భంగం కలిగేలా వ్యవహరించి, రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అధినేత గైకో నేతృత్వంలోని ఎయిమ్స్ శంకుస్థాపన స్థలం వద్ద ఆందోళనకు దిగాయి. నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రక్షణ హబ్‌గా మారుస్తాం.. తమిళనాడును రక్షణ ఉత్పత్తుల, విమాన రంగ హబ్‌గా మార్చడమే కేంద్రం లక్ష్యమని మోదీ అన్నారు. పరిశ్రమల పరంగా దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎయిమ్స్ శంకుస్థాపన అనంతరం మదురైలోనే బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. తమిళనాడుకు మంజూరైన రక్షణ పరిశ్రమల కారిడార్ వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. తూత్తుకుడి నౌకాశ్రయం దక్షిణ భారతంలో మరింత పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడగలదని మోదీ అన్నారు. కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు ఏ ప్రమాదమూ లేదనీ, వారంతా నిశ్చింతగా ఉండాలని మోదీ వివరించారు. అవినీతిని అంతం చేయడం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందనీ, ఆర్థిక నేరగాళ్లను చట్టం ముందుకు నిలబెట్టి తీరుతామని పేర్కొన్నారు. ప్రధాని కానుకల వేలం ప్రారంభం న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి కానుకలుగా వచ్చిన వస్తువుల వేలం ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మాడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ) మ్యూజియంలో ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు రూ.1,000 ప్రారంభ ధర కలిగిన ఛత్రపతి శివాజీ విగ్రహం రూ.22 వేలకు అమ్ముడుపోయింది. ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గంగా నది శుద్ధి ప్రాజెక్టు ‘నమామీ గంగా’కు వెచ్చించనున్నారు. వేలంలో అందుబాటులో ఉంచిన వస్తువుల వివరాలు, వాటి ప్రారంభ ధరల్ని జ్టి్టp://pఝఝ్ఛఝ్ఛn్టౌట.జౌఠి.జీn అనే వెబ్సైట్లో సందర్శకులు చూడొచ్చు. ఈ వస్తువుల ప్రారంభ ధరల్ని రూ.100 నుంచి రూ.30 వేల మధ్య నిర్ధారించినట్లు సాంస్కృతిక శాఖ ప్రకటించింది. తొలిరోజు వచ్చిన ఆదాయం ఎంత? ఏ వస్తువుకు అధిక ధర లభించిందో తెలియరాలేదు. సోమవారం నాటికి అమ్ముడుపోని వస్తువుల్ని 29, 30, 31 తేదీల్లో ఆన్లైన్లో వేలం వేస్తారు. దేశవిదేశాల్లో మోదీ కానుకలుగా స్వీకరించిన శాలువాలు, టోపీలు, చిత్రపటాలు, జాకెట్లు, జ్ఞాపికలను వేలానికి ఉంచారు. మాజీ ఎంపీ నరసింహన్ సమర్పించిన 2.22 కిలోల వెండి ప్లేట్‌కు అత్యధికంగా రూ.30 వేల ప్రారంభ ధర నిర్ణయించారు. ఓటు హక్కు వినియోగించుకోండి! న్యూఢిల్లీ: ఓటు హక్కు పవిత్రమైందనీ, ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ హక్కును వినియోగించుకోలేని వారు ఆ తర్వాత బాధపడతారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాసాంతపు మనస్సులో మాట(మన్‌కీ బాత్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన ఆకాశవాణిలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ మహాయజ్ఞంలో తన విధిని ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. గత నాలుగేళ్లలో అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన భారత్ త్వరలోనే చంద్రునిపై తన ఉనికిని చాటబోతోందని ప్రధాని తెలిపారు. నేతాజీకి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో జన్మించిన వారు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారన్న ప్రధాని.. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని యువతకు విజ్ఞప్తి చేశారు. ‘ఎవరైనా ఏదైనా కారణంతో ఓటు వేయలేకపోతే, అది చాలా బాధాకరమైన విషయం’ అని ఆయన అన్నారు. ‘దేశంలో ఏదైనా జరగరానిది జరిగినప్పుడు అయ్యో, అప్పుడే ఓటు వేయలేకపోయామే.. ఓటు వేయని ఫలితంగానే ఇలాంటి చెడు ఘటన జరిగింది కదా.. అంటూ బాధపడతారు’అని ప్రధాని వ్యాఖ్యానించారు. నేతాజీ పత్రాలను వెల్లడించాం స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను సాహసికుడైన సైనికుడు, అద్భు తమైన నాయకుడుగా అభివర్ణించిన ప్రధాని .. బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. ఆయనకు సంబంధించిన వస్తువులతో ఎర్రకోట వద్ద ‘క్రాంతి మందిర్’ మ్యూజియంను ప్రారంభించామన్నారు. త్వరలోనే చంద్రునిపైకి.. చంద్రయాన్–2 కార్యక్రమం ద్వారా త్వరలోనే భారతీయులు చంద్రునిపై అడుగుపెట్టనున్నారని ప్రధాని మోదీ తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు జరిగిన అంతరిక్ష ప్రయోగాలతో సమాన సంఖ్యలో గత నాలుగేళ్లలో చేపట్టిన అంతరిక్ష కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ప్రధాని తెలిపారు. -
స్తంభించిన ప్రజా రవాణా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కార్మిక సంఘాలు ప్రకటించిన రెండ్రోజుల భారత్ బంద్ బుధవారంతో ముగిసింది. బంద్ సందర్భంగా కేరళ, పశ్చిమబెంగాల్లో ఆందోళనకారులు పలుచోట్ల రైళ్లను అడ్డుకోగా, బ్యాంకింగ్, బీమా కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. చాలా చోట్ల రవాణా, విద్యుత్ సరఫరా, మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. బెంగాల్ లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సుపై రాళ్లవర్షం కురిపించారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై దాడిచేశారు. తిరువనంతపురం–హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, వేనాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆందోళనకారులు తిరువనంతపురంలో అడ్డుకున్నారు. బంద్ నేపథ్యంలో కేరళలో వాణిజ్య సముదాయాలు, షాపులు రెండో రోజూ మూతపడ్డాయి. తమిళనాట కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు రైళ్లను అడ్డుకోగా, తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు స్తంభించాయి. అయితే సామా న్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆగిపోయిన 20 వేల కోట్ల లావాదేవీలు గోవాలో ప్రైవేటు బస్సులు, ట్యాక్సీల యాజమాన్యాలు బంద్‌లో పాల్గొనడంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ముంబైలో అక్కడి రోడ్డు రవాణా సంస్థ ‘బెస్ట్’ జీతాల పెంపు సహా పలు డిమాండ్లతో నిరవధిక బంద్‌కు దిగడంతో లక్షలాది మంది ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాశారు. అలాగే బెంగళూరులో రద్దీగా ఉండే మేజిస్టిక్ బస్టాండ్‌లోనూ వామపక్ష ట్రేడ్ యూనియన్లు బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నాయి. ఈ బంద్ లో ఆల్ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసో సియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) పాలొ ్గనడంతో రూ.20,000 కోట్ల విలువైన చెక్కుల లావాదేవీలు నిలిచిపోయాయి. అయితే ప్రభు త్వ రంగ ఎస్బీఐతో పాటు ప్రైవేటు బ్యాంకుల కార్యకలాపాలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
‘మోదీని అడుగుపెట్టనివ్వం’
గువహటి: పౌరసత్వ (సవరణ) బిల్లును లోక్‌సభ ఆమోదించడంపై అస్సాంలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులు రోడ్లపైకి వచ్చి తమ నిరసన తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న అస్సాం గణపరిషత్ (ఏజీపీ)కి చెందిన మంత్రులు బుధవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వం నుంచి ఏజీపీ రెండ్రోజుల క్రితమే బయటకు రావడం తెలిసిందే. బుధవారం పలుచోట్ల ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి సోనోవాల్ తదితరుల దిష్టిబొమ్మలను కాల్చారు. సచివాలయాన్ని ముట్టడించారు. మోదీ, ఇతర కేంద్ర మంత్రులను అస్సాంలో అడుగుపెట్టనివ్వబోమనీ, అలాగే ముఖ్యమంత్రి, ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్రంలో ఎక్కడా సభలు, ర్యాలీలు నిర్వహించకుండా అడ్డుకుంటామని కృషక్ ముక్తి సంగ్రామ సమితి అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ప్రకటించారు. 70 సంస్థలు సచివాలయం వద్ద ఆందోళనలు చేశాయి. -
శబరిమలలో కొత్త చరిత్ర
శబరిమల/తిరువనంతపురం: కొత్త ఏడాది వేళ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ రుతుస్రావ వయసులో ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అన్ని వయసుల మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రుతుస్రావ దశ (10–50 ఏళ్ల మధ్య)లో ఉన్న మహిళలు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్నట్లయింది. లింగ సమానత్వం కోరుతూ కేరళ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న వార్త తెలియగానే కేరళలోని పలు ప్రాం తాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. అడ్డంకులు లేవు.. నిరసనలు లేవు పటిష్ట పోలీసు భద్రత నడుమ నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి కనకదుర్గ, బిందు బుధవారం వేకువజామున 3.38 నిమిషాలకు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారు. పంబా నుంచి ఆలయం వైపు మెట్లు ఎక్కుతుండగా, లోపల పూజలు చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి నిరసనలు కాలేదని, అంతా సవ్యంగానే సాగిందని వారు తెలిపారు. అక్కడ భక్తులు మాత్రమే ఉన్నారని, వారు తమని అడ్డుకోలేదని వెల్లడించారు. దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు. కేరళలోని మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో వారిద్దరి ఇళ్ల వద్ద పోలీసు బలగాల్ని మోహరించారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయ మెట్లు ఎక్కుతున్న దృశ్యాల్ని స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో ఈ సంగతి రాష్ట్రమంతా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి పి. విజయన్ స్పందిస్తూ ‘కొన్ని అడ్డంకుల వల్ల ఇంతకుముందు మహిళలు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. కానీ ఈ రోజు అలాంటి సమస్యలు లేకపోవడం వల్లే వారు గుడిలోకి వెళ్లగలిగారు. మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టారన్నది నిజం’ అని వ్యాఖ్యానించారు. విజయన్ మొండివైఖరి వల్లే: కాంగ్రెస్ అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సీఎం విజయన్‌పై మండిపడ్డాయి. ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది సీఎం విజయన్ మొండివైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాల అన్నారు. విజయన్ ఆదేశాల మేరకు నడుచుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించారన్నారు. సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేయడం వందశాతం సరైనదేనన్నారు. ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని తెలిపారు. కేరళ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని, సీఎం, కమ్యూనిస్టు నాయకులు, వారి భావి తరాలకు అయ్యప్ప ఆగ్రహం తప్పదని రాష్ట్ర బీజేపీ చీఫ్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై హెచ్చరించారు. విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ‘నామజపం’ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న శబరిమల కర్మ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఏడాదిలో మహిళలకు ఇది గొప్ప ప్రారంభమని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అన్నారు. అట్టుడుకుతున్న కేరళ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాల్ని ప్రయోగించారు. అతి కష్టం మీద ఆందోళనలను అణచివేసిన పోలీసులు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పాతనంతిట్టా, తిరువనంతపురం, కొల్లాంలలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలు చేతబూని వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు. కొచ్చిలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు లాగేస్తున్న పోలీసులు -
ఫ్రాన్స్‌లో ఆందోళనలు హింసాత్మకం
పారిస్: ఫ్రాన్స్‌లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా రెండువారాల నుంచి జరుగుతున్న ఆందోళనలు శని, ఆదివారాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి బెంజమిన్ గ్రైవాక్స్ వెల్లడించారు. జీ–20 సమావేశాల కోసం అర్జెంటీనా వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకుని ప్రధాని, హోం మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హింస చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు తగ్గించాలని కోరుతూ నిరసనకారులు నవంబర్ 17 నుంచి రాజధాని పారిస్‌తోపాటు పలుచోట్ల ‘యెల్లో వెస్ట్’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన యువకులు ఇనుప రా డ్లు, గొడ్డళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రయోగించే బాష్పవాయువు నుంచి రక్షించుకునేందుకు కొందరు ఆందోళనకారులు గ్యాస్ మాస్క్‌లను, ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం చర్చలకు రావాలి: ప్రభుత్వం ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా చర్చలకు రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. ‘హింసను నేను ఎన్నటికీ అనుమతించను. అధికార భవనాలపై దాడులు చేయడం, వాణిజ్య సముదాయాలను కొల్లగొట్టడం, రోడ్లపై వెళ్తున్న వారిని, విలేకరులను బెదిరించడం వంటి చర్యలకు ఏ కారణమూ సమర్థనీయం కాదు’ అని మేక్రాన్ చెప్పారు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి ఓ నాయకుడు, నేతృత్వం వహించే పార్టీ/సంస్థ అంటూ ఏదీ లేదు. దీంతో ఎవరితో చర్చలు జరపాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. పన్నులు పెంచి, డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణహిత ఇంధనాలవైపునకు ప్రజలను మళ్లించేందుకేననీ, ఈ విషయం వారికి సరిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయామని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూలుడిగా పేరున్న మేక్రాన్ ఇప్పటివరకు పన్నులను తగ్గించేందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే మేక్రాన్ అధికారంలోకి వచ్చాక కంపెనీలపై పన్నులను తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇవి అవసరమని ఆయన వాదన. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వమే కారణమని పలువురు నిరసనకారులు ఆరోపిస్తున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మేక్రాన్ -
ప్రశాంతంగా శబరిమల.. తక్కువగా రద్దీ
సన్నిధానం: కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆదివారం ఆందోళనలు నిర్వహించినప్పటికీ శబరిమల ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మాట్లాడుతూ భక్తుల యాత్రకు అనవసర అడ్డంకులు కల్పించొద్దనీ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. కాగా, రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు అమలు కు మరికొంత సమయం కావాలని కోరుతూ సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పద్మకుమార్ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. -
అసమ్మతి జ్వాల
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు అంతకంతకూ పెరుగుతున్నాయి. టికెట్లపై ప్రకటన వెలువడక ముందే సీట్ల కేటాయింపుల్లో తమకు భంగపాటు తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు గాంధీభవన్ వేదికగా అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్ ఇవ్వాల్సిందేనంటూ ఆందోళన చేపట్టారు. కూటమి పేరు చెప్పి మిత్రపక్షాలకు తమ స్థానాలను కట్టబెడితే ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శుక్రవారం నుంచే గాంధీభవన్‌లో నిరసనలు, నినాదాలహోరు మొదలవ్వగా అది శనివారం మరింత పెరిగింది. నకిరేకల్, ఉప్పల్, నాంపల్లి, ఖానాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలకు చెందిన ఆశావహులు, వారి అనుచరుల ఆందోళనలు, ధర్నాలతో గాంధీభవన్ అట్టుడికింది. కాగా, ఉప్పల్‌కు చెందిన ఇద్దరు కార్యకర్తలు శరీరాలపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నిం చడం కలకలం రేపింది. నినాదాలు... నిరసనలు.. పొత్తుల్లో భాగంగా మల్కాజ్గిరి స్థానాన్ని టీజేఎస్‌కు కట్టబెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న నందికంటి శ్రీధర్ అనుచరులు శుక్రవారం నుంచే గాంధీభవన్‌లో ఆందోళనకు దిగారు. శనివారం సైతం మరోమారు నల్లరిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. టీజేఎస్‌కు టికెట్ కట్టబెడితే చిత్తుగా ఓడిస్తామని ప్రకటించారు. ఉప్పల్ స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, నకిరేకల్ స్థానాన్ని ప్రసన్నరాజ్, నాంపల్లి సీటును మనోహర్‌బాబుకు కేటాయించాలని వారివారి అనుచరులు, కార్యకర్తలు గాంధీభవన్ ముందు ధర్నా చేశారు. తమ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. లక్ష్మారెడ్డికి మద్దతుగా ఇద్దరు యువకులు శరీరాలపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై పెట్రోల్ పడటంతో గందరగోళం నెలకొంది. మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించడంతో నేతలు క్షమాపణలు చెప్పి వారిని శాం తింపజేశారు. ఈ సందర్భంగానే కొందరు నేతలు గాంధీభవన్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, గాంధీభవన్ గేట్లకు తాళాలు వేయడంతో గేటు ముందే నిరసనలు కొనసాగించారు. నకిరేకల్ స్థానం కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారని, వారి హామీ మేరకు నియోజకవర్గంలో పనిచేస్తుంటే, ఇప్పుడు ఇతరులకు కట్టబెట్టడం ఏమిటని ప్రసన్నరాజ్ అనుచరులు ప్రశ్నించారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేస్తున్న మనోహర్‌బాబును కాదని, పార్టీలో కొత్తగా చేరిన పారాచూట్ నేతలకు టికెట్ ఇవ్వడంపై నాంపల్లి నేతలు కూడా ఆందోళనకు దిగారు. ఖానాపూర్ టికెట్‌ను హరినాయక్‌కే ఇవ్వాలంటూ, ఆ నియోజకవర్గ నేతలు శుక్రవారం, శనివారాల్లో ఆందోళన నిర్వహించారు. ఒకవేళ రమేశ్ రాథోడ్‌కు టికెట్ కేటాయిస్తే చిత్తుగా ఓడిస్తామని నేతలు హెచ్చరించారు. గాంధీభవన్‌కు రాని ముఖ్యనేతలు.. గాంధీభవన్‌లో నిరసన సెగలు పెరగడంతో పార్టీ సీనియర్లెవ్వరూ అటువైపు రావడం లేదు. శనివారం ఒకరిద్దరు నేతలే వచ్చారు. అభ్యర్థుల ప్రకటనకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రకటన తర్వాత ఇంకెలా ఉంటుందోనని సీనియర్ నేతలు ఆందోళన పడుతున్నారు. మున్ముందు మరిన్ని నిరసనలు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో గాంధీభవన్‌లో పోలీసు భద్రతను పెంచారు. 100 మందితో భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే ఐడీ కార్డు లేకుండా గాంధీభవన్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. గాంధీభవన్ రెండు గేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ప్రకటనకు ముందే కాంగ్రెస్‌లో లొల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే లొల్లి మొదలైంది. ఆశావహులు, పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోతున్న నేతలు గాంధీ భవన్ ఎదుట క్యూ కట్టి నిరసనలు తెలుపుతున్నారు. ఆదివారం శేరిలింగంపల్లి, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన నేతలు వందలాది మంది కార్యకర్తలతో వచ్చి గాంధీ భవన్ వద్ద ధర్నాలు చేయగా శేరిలింగంపల్లికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకులు, కార్యకర్త లు కూడా ఆ స్థానాన్ని బీసీలకు ఇవ్వాలంటూ గాంధీ భవన్ ఎదుట ధర్నా చేయడం, స్థానికులకే అవకాశమివ్వాలంటూ మిర్యాలగూడలో కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డిని గిరిజన నేతలు నిలదీయడం చూస్తుంటే కాంగ్రెస్ జాబితా ప్రకటన తర్వాత ఏం జరుగుతుం దోననే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఇస్తున్నట్లు సమాచారం రావడంతో మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ పెద్ద ఎత్తున అనుచరగణంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గాంధీ భవన్‌కు చేరుకున్నారు. శేరిలింగంపల్లిని టీడీపీకి ఇవ్వొద్దని నినాదాలు చేస్తూ వందలాది మంది కార్యకర్తలు గాంధీ భవన్ మెట్లపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ, ఎంతో కష్టపడి నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేసుకున్నామని, ఇప్పుడు టీడీపీకి ఇవ్వాలనుకోవడం తమను మనస్తాపానికి గురిచేస్తోందన్నారు. టీడీపీకి ఆ సీటు ఇస్తే కలసికట్టుగా ఓడిస్తామన్నారు. ఇదే సమయం లో గచ్చిబౌలి డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.రంగస్వామి గాంధీ విగ్రహంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ పెట్రోల్ పోసుకోవడంతో కార్యకర్తలు వెంటనే ఆయన్ను కిందకు దింపి ఒంటిపై నీళ్లు పోశారు. ఆ తర్వాత బాలరాజు అనే కార్యకర్త కత్తితో తన చేతిని కోసుకుని నిరసన తెలిపాడు. శేరిలింగంపల్లి కార్యకర్తలు సాయంత్రం వరకు దర్నా చేశారు. సాయంత్రం 5:30 సమయంలో ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ ఆందో ళనకారుల వద్దకు చేరుకుని పొత్తుల సీట్ల పంపకాల విషయం ఇంకా ఖరారు కాలేదని, కోర్ కమిటీ సమావేశం తర్వాతే ఏ స్థానం ఎవరికి ఇస్తారో తేలుతుందని, ఎవరూ ఆవేశపడొద్దని నచ్చజెప్పారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్సే పోటీ చేస్తుందని, తాను రాహుల్‌తో మాట్లాడతానని భిక్షపతి యాదవ్, ఆయ న అనుచరులకు చెప్పారు. యాష్కీపై తనకు గౌరవం ఉందన్న భిక్షపతి.. తన ఆందోళన విరమించారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు చేతి ధర్మయ్య, ఈర్ల కొమురయ్యల ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు వచ్చి ఆ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని ఆందోళన చేశా రు. 25 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానాన్నీ బీసీలకు ఇవ్వలేదని, ఈసారి పెద్దపల్లి సీటును బీసీలకే ఇవ్వాలని నినదించారు. జానాకూ తప్పని ‘సెగ’ మిర్యాలగూడ నియోజకవర్గం విషయంలో టీపీసీసీ కీలక నేత జానారెడ్డికి కూడా నిరసన సెగ తగిలింది. టికెట్ గిరిజనులకే కేటాయించాలం టూ శనివారం మిర్యాలగూడకు వెళ్లిన ఆయన్ను స్థానిక నేతలు నిలదీశారు. తన చేతిలో ఏమీ లేద ని, అధిష్టానం టికెట్లు ఖరారు చేస్తుందని చెప్పినా కార్యకర్తలు వినకుండా నిరసన తెలపడంతో అసహనానికి గురైన జానా సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మొత్తంమీద టికెట్ల ప్రకట నకు ముందే ఆందోళనలు ప్రారంభం కావడం పార్టీ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. -
మహిళలందర్నీ అనుమతించాలి: రాహుల్
ఇండోర్/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ కాంగ్రెస్ విభాగం వైఖరికి భిన్నంగా ఉన్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళలందరూ ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కేరళలో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. ఇండోర్‌లో రాహుల్ మాట్లాడుతూ ‘శబరిమల ఆలయ ప్రవేశం సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ విషయంలో నా అభిప్రాయాలు పార్టీ వైఖరికి భిన్నమైనవి. శబరిమల వివాదంలో నా దృష్టిలో స్త్రీ, పురుషులంతా ఒక్కటే. మహిళలందరికీ ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందే. కేరళీయుల అభిప్రాయాలకు అనుగుణంగా స్థానిక యూనిట్ వ్యవహరిస్తుంది’ అని అన్నారు. మరోవైపు, శబరిమల ఆందోళనకారుల అరెస్టుకు నిరసనగా బీజేపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. తిరువనంతపురంలో డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్యకర్తలు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు.