
సన్నిధానం: కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆదివారం ఆందోళనలు నిర్వహించినప్పటికీ శబరిమల ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ట్రావెన్‌కోర్ దేవస్థాన మండలి తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మాట్లాడుతూ భక్తుల యాత్రకు అనవసర అడ్డంకులు కల్పించొద్దనీ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. కాగా, రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు అమలు కు మరికొంత సమయం కావాలని కోరుతూ సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పద్మకుమార్ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment