sabarimala temple
-
శబరిమలై యాత్రలో పెద్దిరెడ్డి
-
శబరిమలకు పోటెత్తిన భక్తులు
-
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఈ నియమాలు తప్పనిసరి!
తిరువనంతపురం: మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరచుకుంది. ఈ సందర్భంగా అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ పూజలకు భక్తులను సైతం అనుమతించనున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం దేవాలయం తెరచుకోగా, శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. కాగా కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం మొదటిసారి శనివారం ఉదయం నుంచి అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.. కోవిడ్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. ఈనెల 21వ తేదీ వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిని ఇస్తున్నారు. -
ఉద్దండులకు సాధ్యపడలేదు.. కానీ ఆయన సాధించారు
సంపూర్ణ అక్షరాస్యత.. వర్తమాన అంశాలపై పూర్తి అవగాహన కేరళ ప్రజల సొంతం.. రాజకీయాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తుంటారు. అందుకే గత 40 ఏళ్లుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఎందరో రాజకీయ చతురులు.. మరెందరో ఉద్దండులకు కూడా అది సాధ్యపడలేదు. నంబూద్రీపాద్, ఏకే గోపాలన్, కృష్ణ పిళ్లై వంటి శక్తిమంతమైన కమ్యూనిస్టు నేతలే అక్కడి ప్రజల నాడి పట్టలేకపోయారు. దీన్ని బట్టే కేరళ ప్రజల రాజకీయ చైతన్యం ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 1980 నుంచి ఏ ఒక్కరిని కూడా కేరళ ప్రజలు వరుసగా రెండోసారి సీఎం కుర్చీపై కూర్చోబెట్టలేదు. అలాంటిది 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. రెండోసారి అధికారంలోకి రానున్నారు కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి, కెప్టెన్, కామ్రేడ్ పినరయి విజయన్. గతంలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఏ రాజకీయ నేతకూ సాధ్యంకాని ఈ అరుదైన రికార్డు.. విజయన్ను ఎలా వరించింది..? అఖండ విజయ సాధనకు తోడ్పడిన అంశాలేంటి..? గత ఐదేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిరిగి ఎలా విజయ పతాకా ఎగరేయగలిగారు..? సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ రెండోసారి అధికారంలోకి రావడానికి పినరయి విజయన్ నాయకత్వ లక్షణాలు ఎంతో ఉపయోగపడ్డాయని అనడంలో సందేహం లేదు. ఎన్నికలకు ముందే విజయన్ రచించిన వ్యూహాలు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నిలదొక్కుకోకుండా చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో విభేదాలు పినరయికి బాగా కలిసొచ్చాయి. కష్టకాలంలో ముందుండి.. సమస్య వచ్చినప్పుడే అసలైన లీడర్ ఎవరో తెలుస్తుంది అంటారు. గత ఐదేళ్లుగా కేరళలో ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్న ఉపద్రవాలను చాకచక్యంగా, విజయవంతంగా ఎదురొడ్డి నిలిచారు పినరయి విజయన్. సమస్యలు, ఇబ్బందులు ఉన్న చోట తాను ఉన్నానంటూ ధైర్యం ఇచ్చారు. 2017లో ఓఖి సైక్లోన్, 2018లో నిపా వైరస్, 2018, 2019లో వరదలు, 2020లో కరోనా మహమ్మారి.. ఇలా అన్ని విపత్తులనూ విజయన్ సమర్థం గా ఎదుర్కొన్నారు. సైక్లోన్ సమయాల్లో ప్రజలను రక్షించడమే కాకుండా, వారికి కావాల్సిన ఆహారాన్ని, వరదలకు సంబంధించిన కిట్లను ప్రజలంద రికీ ప్రభుత్వం చేరవేసింది. మీడియా ముందుకు వచ్చి పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితులను వివరిస్తూ ప్రజలకు నిబ్బరం కల్పించారు. విపత్తు నిర్వహణలో దిట్ట.. గతేడాది దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలు పడ్డ ఇబ్బందులు వర్ణణాతీతం.. కానీ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర సంక్షేమ పథకాలు, సేవలతో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందించింది. అడ్వాన్స్‌గా పెన్షన్ ఇవ్వడం, ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేసింది. వలస కార్మికులను తమ రాష్ట్ర అతిథులుగా చూసుకుంటామని భరోసా కల్పించింది. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యంత కష్ట కాలంలో ప్రజల బాగోగులు చూసుకోవడం ద్వారా ప్రజల మనసులను దోచుకున్నారు విజయన్. రేషన్ సరుకుల పంపిణీ లాక్డౌన్ తర్వాత కూడా ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. హామీలన్నీ నెరవేర్చే దిశగా.. గత ఎన్నికల్లో తాను చేసిన 600 హామీల్లో.. ఏకంగా 570 హామీలను నెరవేర్చిన ఘనత విజయన్‌కే దక్కింది. ఎన్నో పథకాలను ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎంతో దూరదృష్టితో రూపొందించారు. ‘లైఫ్ మిషన్’ద్వారా ఇళ్లు లేని, భూమి లేని నిరుపేదలకు దాదాపు 2 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చారు. ‘అర్ధ్రమ్ మిషన్’పథకం ద్వారా రాష్ట్ర ఆరోగ్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ప్రతి పేదవాడికి ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలోనే సరైన వైద్యం అందేలా చేశారు. ‘ఎడ్యుకేషన్ మిషన్’ద్వారా వెయ్యి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలల్లో హైటెక్ క్లాస్‌రూమ్స్, హైటెక్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసి, దేశంలోనే తొలి డిజిటల్ రాష్ట్రంగా పేరుగాంచేలా చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఎన్నో సూచీల్లో మొదటి స్థానంలో కేరళ నిలిచేలా ఎంతో కృషి చేశారు పినరయి విజయన్. అయితే విజయన్ ప్రస్థానం నల్లేరు మీద నడకేమీ కాదు. ఆయనా ఎన్నో ఒడిదొడుకులను చవిచూశారు. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొన్నారు. అంతెందుకు సొంత పార్టీలోనే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీపీఐఎం సీనియర్ నేత అచ్యుతానందన్‌కు, పినరయి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోల్డ్ స్మగ్లిం గ్ కేసులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఒకానొక సందర్భంలో పినరయిని మీడియా విలన్‌గా చిత్రీకరించింది. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా, పవర్ హౌస్లా నిలబడ్డారు రియల్ కామ్రేడ్. కేరళలో మత రాజకీయాలకు స్థానం లేదని ప్రజలు నిరూపించారు. ఎల్డీఎఫ్ విజయాన్ని ప్రజలకు అంకితం ఇస్తున్నా. ప్రభుత్వ ఇమేజీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బురద చల్లేందుకు పలు మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారు. రాష్ట్రంలో లౌకికవాదం కొనసాగాలంటే లెఫ్ట్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనం నమ్మారు. ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ నేతలు లేనిపోని ప్రచారాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, వేరే రాష్ట్రాల సీఎంలు కేరళకు వచ్చి బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు చాలా తాపత్రయపడ్డారు. వేరే రాష్ట్రాల్లో బీజేపీ మత రాజకీయాలు చెల్లినట్లు కేరళలో చెల్లదని మరోసారి రుజువైంది’. – పినరయి విజయన్, కేరళ సీఎం -
శబరిమల ఆలయంలోకి భక్తులకు అనుమతి
తిరువనంతపురం : దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల పూజ కోసం భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల దేశంలోని అన్ని ఆలయాలు మూతపడిన సంగతి తెలిసిందే. ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కటి మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగష్టులోనే పూజల నిమిత్తం శబరిమల తెరుచుకున్నప్పటికీ భక్తులకు దర్శనాలకు అనుమతించలేదు. తాజాగా శనివారం నుంచి ఆగస్టు 21 న నెలవారీ పూజ కార్యక్రమాలు సాయంత్రం పూర్తయ్యే వరకు భక్తులను అనుమతించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయాన్ని దర్శించుకునే వారికి కేరళ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. చదవండి: శబరిమల ఆలయంలో వాటికి అనుమతి లేదు ఇందులో భాగంగా ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తులకు మాత్రమే శబరిమలలో దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్తున్న నేపథ్యంలో వీటి గురించి భక్తులకు తెలియజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కేరళ ప్రభుత్వం లేఖ రాసింది.దీంతో మార్గదర్శకాలపై విస్తృత ప్రచారం చేసేందుకు దేవదాయ శాఖ నడుం బిగించింది. అలాగే కేరళలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అయ్యప్ప కొంద మీద అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టారు. చదవండి: శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ మార్గదర్శకాలిలా.. ► కేరళ పోలీస్ శాఖ నిర్వహిస్తున్న వర్చువల్ క్యూలైన్ వెబ్సైట్లో ముందుగా భక్తులు నమోదు చేసుకోవాలి. వీరికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ విధానంలో దర్శనం కల్పిస్తారు. ► ప్రతి రోజు 250 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ► దర్శన సమయానికి 48 గంటల ముందుగా భక్తులు తమకు కరోనా లేదని తెలిపే నెగిటివ్ సర్టిఫికెట్‌ను చూపాలి. ఇందుకోసం దర్శనానికి అనుమతించే ప్రదేశాల్లో నిర్ణీత ధరకు యాంటీజెన్ టెస్టులను చేస్తారు. ► 10 ఏళ్ల లోపు పిల్లలను, 60–65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనాలకు అనుమతించరు. రేషన్‌కార్డు వంటి గుర్తింపు కార్డులను భక్తులు తమ వెంట తెచ్చుకోవాలి. శబరిమల ఆలయంలో నెయ్యాభిషేకానికి, భక్తులు పంపా నదిలో స్నానం చేయడానికి అనుమతుల్లేవు. ప్రత్యామ్నాయంగా పంబా వంద షవర్లు ఏర్పాటు చేశారు. సన్నిధానం, పంప, గణపతి ఆలయాల్లో రాత్రిళ్లు ఉండటానికి అంగీకరించరు. ► భక్తులు ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే శబరిమలకు చేరుకోవాలి. -
శబరిమల ఆలయం: వాటికి అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహ్తా గురువారం లేఖ రాశారు. శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని లేఖలో ఆయన వెల్లడించారు. వర్చువల్ క్యూపోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. https://sabarimalaonline.org లో భక్తులు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలుత రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామన్నారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా వైరస్ నిర్థారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు. చదవండి : హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు -
శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని, భక్తులు అనుమతి లేదని దేవాలయ అధికారులు తెలిపారు. నెలవారీ పూజ కార్యక్రమాలు ఆగస్టు 21 సాయంత్రం పూర్తైన తర్వాత ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా సబరిమల మినహా దక్షిణ కేరళలోని సుమారు వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచి ఉంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయింది. శబరిమల ఆలయాన్ని తెరిస్తే పొరుగు రాష్ట్రాల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్టు29 నుంచి సెప్టెంబర్2 వరకు ఓనం పూజల కోసం ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని టీడీబీ తెలిపింది. ఇటీవల సబరిమల వార్షిక పండుగ తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్న విషయం తెలిసిందే. -
శబరిమలలో భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా జూన్ 14న తెరవనున్న శబరిమల ఆలయాన్ని పూజా కార్యక్రమాల అనంతరం తిరిగి మూసివేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 19 నుంచి 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలను సైతం వాయిదా వేస్తున్నట్టు మంత్రి సురేంద్రన్ వెల్లడించారు. 14 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ఇటీవల ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు అధికారులు, ఆలయ పూజారులు, కేరళ ప్రభుత్వం సమావేశం అయి ఆలయం తెరవాలన్న ఆలోచనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో భక్తులకు ఆలయ ప్రవేశం లేదు. -
కరోనా అలర్ట్: భక్తులెవరూ మా గుడికి రావొద్దు!
తిరువనంతపురం: కరోనా భయాల నేపథ్యంలో కేరళలోని ప్రసిద్ధ శబరిమల దేవస్థానం బోర్డు భక్తులకు ఓ విజ్ఞప్తి చేసింది. నెలవారి పూజా కార్యక్రమాల సందర్భంగా మార్చి నెల ముగిసే వరకు భక్తులు ఆలయానికి రావొద్దని కోరింది. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ బోర్డు ప్రెసిడెంట్ ఎన్.వాసు చెప్పారు. షెడ్యూల్ ప్రకారం అయ్యప్ప స్వామికి పూజా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. అయితే, ఎవరైనా తెలియక స్వామివారి దర్శనార్థం వస్తే.. వారిని ఆపే ప్రయత్నం చేయమని వాసు స్పష్టం చేశారు. (చదవండి: కరోనాపై విజయ్ దేవరకొండ అవగాహన కార్యక్రమం) కాగా, రాష్ట్రంలో 12 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి ఆఖరు వరకు పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ప్రభుత్వ వేడుకలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మతపరమైన ఉత్సవాలు చేయొద్దని, పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకోవాలని కోరారు. ఇదిలాఉండగా..కరోనా ప్రభావం అధికంగా ఉన్న పతనంతిట్ట జిల్లాలో శబరిమల ఆలయం ఉండటం గమనార్హం. 12 కేసుల్లో 7 కేసులు ఈ జిల్లాలో నమోదైనవే. (కరోనా ప్రకంపనలు: ఒక్క రోజులో 54 మరణాలు ) -
‘ధర్మ’ సందేహాలపై నిర్ణయం తీసుకుంటాం!
న్యూఢిల్లీ: ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి న్యాయపరమైన ప్రశ్నలు సిద్ధం చేస్తామని, తొమ్మిది మంది సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ ప్రశ్నలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల వారిని అనుమతిస్తూ తీర్పు నేపథ్యంలో వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షకు సంబంధించి కొన్ని పిటిషన్లు దాఖలు కాగా.. దానిపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తెల్సిందే. ఈ అంశంపై చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. అయితే ఈ విస్తృత ధర్మాసనం ఏఏ అంశాలపై వాదనలు వినాలన్న అంశంపై కక్షిదారుల లాయర్లు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఆ ధర్మ సందేహాలను తామే సిద్ధం చేస్తామని ప్రకటించింది. శబరిమలపై తీసుకున్న నిర్ణయంపై సమీక్ష ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల ఆరవ తేదీ మహిళా వివక్షకు సంబంధించి సిద్ధం చేసే ప్రశ్నలతోపాటు, కాలావధికి సంబంధించిన సమాచారాన్ని కక్షిదారులందరికీ అందజేస్తామని చెప్పింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ఆధారంగా తాము మత స్వేచ్ఛ, మసీదులు, దర్గాల్లోకి మహిళల ప్రవేశం, పార్శీ మహిళలను పెళ్లి చేసుకున్న ఇతర మతస్తులకు పార్శీ ప్రార్థన స్థలాల్లో ప్రవేశంపై నిషేధం వంటి అంశాలపై ఒక న్యాయపరమైన విధానాన్ని అభివృద్ధి చేయనున్నామని బెంచ్ తెలిపింది. పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్యవయస్కులకూ శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ 2018 సెప్టెంబర్ 28న 4:1 మెజార్టీ తీర్పు ఇవ్వడం తెల్సిందే. -
ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్ష
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంతోపాటు వేర్వేరు మతాల్లో, ప్రార్థన స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయించేందుకు ఈ నెల 17న సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా దేశ అత్యున్నత న్యాయస్థానం నలుగురు సీనియర్ న్యాయవాదులను సోమవారం ఆదేశించింది. ఇదే సమయంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేది లేదని స్పష్టం చేసింది. ‘‘శబరిమల కేసులో తీర్పును సమీక్షించబోవడం లేదు. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తావించిన అంశాలను పరిగణిస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం తెలిపింది. మతపరమైన వ్యవహారాల్లో న్యాయస్థాన జోక్యం ఎంతవరకూ ఉండాలన్న దానిపై ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొన్ని అంశాలను లేవనెత్తిందని, వాటిపై మాత్రమే తాము విచారణ చేపడతామని తెలిపింది. ప్రార్థన స్థలాల్లో మహిళలు, బాలికల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమలకు మాత్రమే పరిమితం కాలేదని గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాకుండా... ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే హక్కు కల్పించే ఆర్టికల్ 25, 26, రాజ్యాంగ నైతికత అన్న అంశం, మత వ్యవహారాల్లో న్యాయస్థానాలు ఎంత మేరకు జోక్యం చేసుకోవచ్చు? వంటి ఏడు అంశాలను ఐదుగురు సభ్యుల ధర్మాసనం లేవనెత్తింది. అయితే ధర్మాసనం ఈ అంశాలపై సీనియర్ న్యాయవాదులు నలుగురు సమావేశమై చర్చించాలని ఆదేశించడం గమనార్హం. పరిశీలనకు ఇవి..: మసీదుల్లో మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా తెగల్లో మహిళల జననాంగాల విచ్చిత్తి, పార్శీ మహిళను పెళ్లాడిన పార్శీయేతర పురుషులకు వారి ప్రార్థన స్థలంలో ప్రవేశంపై నిషేధం వంటి పలు అంశాలపై దాఖలైన పిటిషన్లను వేరుగా విచారించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీలతో కూడిన నలుగురు సీనియర్ న్యాయవాదులు సమావేశమై ఏయే అంశాలపై తాము విచారణ జరపాలో సూచించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరు ఏ అంశంపై వాదిస్తారన్నది నిర్ణయించుకోవాలంటూ.. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
13 నుంచి శబరిమల కేసులో విచారణ
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13 నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. శబరిమల అంశంతో పాటు ముస్లిం, పార్శీ మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ.. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. మసీదులు, దర్గాల్లోకి ముస్లిం మహిళలను అనుమతించకపోవడం.. పార్శీ మహిళలు పార్శీయేతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వారిని అగ్యారీ అనే పవిత్ర స్థలంలోకి ప్రవేశించనీయకుండా నిషేధాజ్ఞలు విధించడం వంటి ఆంక్షలు దేశంలో ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ధర్మాసనం విచారణ జరపనుంది. -
శబరిమల: కేరళ ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణ విషయమై ప్రత్యేక చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి పూర్తి విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయ నిర్వహణలో తమ హక్కులు పరిరక్షించాలంటూ పండలం రాజ కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేరళలోని ఆలయ పాలకమండలి చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపథ్యంలో వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ అయిన క్రమంలో... ఆలయ సలహా మండలిలో మహిళలకు పదవులు కేటాయించే విషయంలో నిర్ణయమెలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మత ఆచార వ్యవహారాల గురించిన వివాదం విచారణలో ఉండగానే.. మహిళా ప్యానెల్(మహిళా కోటా ప్రకారం మూడింట ఒక వంతు పదవులు) ఎలా ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు బదులుగా... ఆలయ పాలనలో మహిళలకు అవకాశం కల్పించే విషయంలో తాము ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో గతంలో తాము రూపొందించిన చట్ట ముసాయిదాను కోర్టుకు సమర్పించింది. అయితే ఈ ముసాయిదాను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం... ఇది సరిపోదని.. శబరిమల ఆలయ నిర్వహణ- పాలనకై ప్రత్యేక చట్టం రూపొందించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఇక కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పును నిరసిస్తూ హిందుత్వ సంఘాలు, సంఘ్‌పరివార్ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం గురువారం సమీక్షించింది. ఇందులో భాగంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులున్న విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించిన విషయం తెలిసిందే. Standing counsel for Kerala, to ANI: SC has asked Kerala govt to bring, if possible, a separate new law for #SabarimalaTemple matter, while hearing a petition originally filed by Pandalam Royal Family to protect their rights. SC has adjourned the matter for 3rd week of Jan 2020. pic.twitter.com/U8IqQRER8n — ANI (@ANI) November 20, 2019 -
నువ్వు ఇక్కడే ఉండు.. మీరు వెళ్లొచ్చు!
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన బాలికను పంబ బేస్ క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు దర్శనానికి అనుమతినిచ్చి.. బాలికను వెనక్కి వెళ్లాల్సిందిగా సూచించారు. శబరిమల ఆలయంలోకి రుతుక్రమ వయసు గల మహిళలను అనుమతించే విషయమై గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్లను గురువారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వివాదాన్ని ఏడుగురు సభ్యులు గల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం అయ్యప్ప ఆలయ తలుపులు తెరచుకోగా.. దైవ దర్శనానికి వచ్చే మహిళలకు నిరాశే ఎదురైంది. కాగా శబరిమల వివాదాన్ని సుప్రీంకోర్టు ఎటూ తేల్చని నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించే మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించలేమని కేరళ మత్రి ఏకే బాలన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ కొంతమంది మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తుండగా మార్గమధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబ బేస్ క్యాంపు నుంచి పుదుచ్చేరికి చెందిన బాలిక కుటుంబ సభ్యులతో అయ్యప్పను దర్శించుకునేందుకు పయనం కాగా మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆధార్ కార్డు వివరాల ప్రకారం ఆమె వయస్సు 12 సంవత్సరాలు కాబట్టి.. ఆలయంలోకి అనుమతించలేమని తేల్చిచెప్పారు. దీంతో పాప తండ్రి తమ కూతురు ఆలయంలోకి ప్రవేశించేందుకు అర్హురాలే అని పోలీసులకు చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. ఈ క్రమంలో బాలికను అక్కడే ఉండాల్సిందిగా ఆదేశించిన పోలీసులు.. కుటుంబాన్ని అనుమతించడంతో వారు కొండపైకి వెళ్లారు. బాలికను తాము బస చేసిన గదికి పంపించారు. -
శబరిమలలో భక్తుల రద్దీ
శబరిమల: మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి తెరచి, నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్ ఎం హర్షన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వార్షిక మండల పూజల నిమిత్తం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు. 2018 తీర్పుపై స్టే ఉన్నట్లే! మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అమల్లో ఉన్నట్లే భావించాలని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ ఆదివారం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కానీ ఇక్కడో సమస్య ఉంది. 2018లో ఇచ్చిన తీర్పుపై తాజాగా ఈ నవంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్టే ఇచ్చారా? లేదా? అన్నది కీలక ప్రశ్న. స్టే ఇస్తున్నట్లు తీర్పులో ప్రకటించలేదు. కానీ వాస్తవానికి స్టే ఇచ్చినట్లే భావించాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచారం కోసం ఆలయానికి రావాలనుకునే మహిళలను ప్రోత్సహించబోమని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
శబరిమలలో కొనసాగుతున్న రద్దీ
శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశనలుమూలల నుంచి తరలివచ్చిన స్వామలు మణికంఠుని దర్శించుకుంటున్నారు. స్వామియే శరణం అయ్యప్ప శరణుఘోషతో శబరిమల హోరెత్తుతోంది. మండల పూజల కోసం నిన్న శబరిమల దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి. డిసెంబర్ 27 వరకు అయప్పస్వామికి నిత్యపూజలు జరుగుతాయి. నాలుగు రోజుల విరామం తర్వాత మళ్లీ జ్యోతి దర్శనం వరకూ స్వామి ఆలయం తెరిచి ఉంటుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేరళప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 10 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేసింది. శబరిమల సంప్రదాయాలను అతిక్రమించే ఎలాంటి చర్యలను సహించబోమని కేరళ దేవాదాయ శాఖ ముందే స్పష్టం చేసింది. -
నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు అనుమతిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..శబరిమల సహా మహిళలకు సంబంధించిన ఇతర మతాల్లోని అన్ని వివాదాస్పద అంశాలను విచారించేందుకు విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2018 నాటి∙తీర్పుపై స్టే ఇవ్వలేదు. శబరిమలలోని కీలక ప్రాంతాల్లో 10 వేల మంది పోలీసులను మోహరించనున్నారు. అయితే, నిషేధాజ్ఞలు విధించబోమని పత్తనతిట్ట కలెక్టర్ మీడియాకు తెలిపారు. మా ఆదేశాలను పాటించాల్సిందే! శబరి’ తీర్పుపై జస్టిస్ నారిమన్ న్యూఢిల్లీ: శబరిమలలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించడానికి సంబంధించి గురువారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై.. తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ తీర్పును వ్యతిరేకిస్తూ తాను, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులోని ‘అత్యంత ముఖ్యమైన’ ఆదేశాలను ప్రభుత్వం క్షుణ్ణంగా చదవడమే కాకుండా, కచ్చితంగా అమలు చేయాలని జస్టిస్ నారిమన్ స్పష్టం చేశారు. జస్టిస్ నారిమన్ శుక్రవారం మరో కేసు విచారణ సందర్భంగా మా ఆదేశాల ఉల్లంఘనను సహించబోం. తప్పనిసరిగా అమలు చేయాల్సిందే’ అని జస్టిస్ నారిమన్ తెలిపారు. -
శబరిమల కేసు: కేరళ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
తిరువనంతపురం : శబరిమల కేసును సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన క్రమంలో.. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం అయ్యప్ప ఆలయం తలుపులు తెరచుకోనున్న తరుణంలో కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించే మహిళలు కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తారని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ‘యాక్టివిజం ప్రదర్శించడానికి కార్యకర్తలు శబరిమలను ఎంచుకుంటామంటే కుదరదు. కొంతమంది పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. కేవలం ప్రచార యావతోనే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వం ఎంతమాత్రం ప్రోత్సహించదు’ అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ఆలయంలోకి ప్రవేశించాలనుకుంటే సుప్రీంకోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. అదే విధంగా శబరిమల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని తెలిపారు.(చదవండి : శబరిమలపై విస్తృత ధర్మాసనం) కాగా కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో హిందుత్వ సంఘాలు, సంఘ్‌పరివార్ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం గురువారం సమీక్షించింది. ఇందులో భాగంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులున్న విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదు. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
మళ్లీ మొదటికి!
-
విస్తృత ధర్మాసనానికి ‘శబరిమల’
శబరిమల అంశం మతపరమైన ఆచారాలు, విశ్వాసాలకు సంబం ధించి అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడం అంటే, సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థం. మతపరమైన ప్రార్థన స్థలాల్లోకి మహిళలను నిరాకరించే విషయం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదు. అది ఇతర మతాల అంశాలకూ వర్తిస్తుంది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశం అంశాన్ని.. సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఈ ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును పునఃపరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన సుప్రీంకోర్టు.. ఈ అంశాన్ని విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించింది. శబరిమల వంటి అంశం హిందూ మతానికి మాత్రమే పరిమితం కాదన్న కోర్టు.. ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో కొనసాగుతున్న వివక్షనూ పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు, అమ్మాయిల ప్రవేశం అంశాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి అప్పగించింది. దశాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పునిచ్చింది. ఈ తీర్పుని పునః పరిశీలించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సమీక్షించిన కోర్టు ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ సందర్భంగా శబరిమలలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తే అది ఒక్క హిందూ మహిళలకే పరిమితంకాదని, ముస్లిం, పార్శీ మహిళలపై ఆయా మతాల్లో జరుగుతున్న వివక్షనూ పరిశీలిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. ముస్లిం మహిళలను మసీదు, దర్గాలోకి అనుమతించకపోవడం, పార్శీ మహిళలు.. పార్శీయేతర పురుషులను పెళ్లాడటంపై నిషేధం, బొహ్రా వర్గాల్లో జరుగుతున్న జనన అవయవాల కత్తిరింపుల్లాంటి అంశాలను విస్తృతధర్మాసనం చర్చిస్తుందని కోర్టు పేర్కొంది. సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు ఈ అంశాలపై న్యాయవిధానాలను రూపొందించాల్సిన సమయం ఇదేనని తన తొమ్మిదిపేజీల తీర్పుని వెలువరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గత తీర్పుపై స్టే ఇవ్వాలన్న అంశంపై స్పందిస్తూ విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని బదిలీ చేయడం అంటే సమస్య ఇంకా పరిష్కారం కాలేదని అర్థమని సీజేఐ రంజన్ గొగోయ్ వ్యాఖ్యానించారు. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్వీల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం శబరిమల వివాదాన్ని పునఃపరిశీలించే అంశాన్ని 3:2 మెజార్టీ తీర్పుతో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పు అమలుకాకుండా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అంశాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్ ఆమోదించినా, అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరడాన్ని జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు విభేదించారు. సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ తీర్పు అనంతరం దాఖలైన 65 పిటిషన్లు, 56 రివ్యూ పిటిషన్లు, కొత్తగా దాఖలైన నాలుగు రిట్ పిటిషన్లు, ఐదు అప్పీళ్ళను డిస్మిస్ చేయడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. శబరిమల ఒక్కటే కాదు.. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తన తరఫున, జస్టిస్ ఎఎం. ఖన్వీల్కర్, ఇందు మల్హోత్రాల తరఫున తీర్పుని చదివి వినిపిస్తూ ఈ అంశం మతపరమైన ఆచారాలూ, విశ్వాసాలకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తిందన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం శబరిమలలాంటి మతపరమైన ప్రార్థనా స్థలాలపై ఒకే రకమైన విధానాలను రూపొందించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ‘మతపరమైన ప్రార్థనాస్థలాల్లోనికి మహిళలను నిరాకరించే విషయం కేవలం శబరిమల ఆలయానికి మాత్రమే పరిమితం కాదనీ. ఇది ఇతర మతాల అంశాలకు వర్తిస్తుంది’ అని కోర్టు వ్యాఖ్యానించింది. 2018 సెప్టెంబర్ తీర్పు ఏం చెప్పింది? శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ధర్మాసనం 4ః1 సభ్యుల ఆమోదంతో తీర్పునిచ్చింది. రుతుక్రమం వయస్సులో ఉండే మహిళలు, అమ్మాయి లను శబరిమల ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలోని సమానత్వ భావనకు భిన్నమైనదని వ్యాఖ్యానించింది. ఈ యేడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శబరిమల తీర్పుని రిజర్వ్‌లో ఉంచడం తెల్సిందే. తీర్పుకి వ్యతిరేకంగా నాడు వెల్లువెత్తిన నిరసనలు కేరళలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ సుప్రీంతీర్పు(2018)కి వ్యతిరేకంగా నాడు హిందూత్వవాదులు, సంఘ్‌పరివార్ లాంటి సంస్థలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. 10 నుంచి 50 ఏళ్ళలోపు వయస్సు మహిళలు అనేక మంది శబరిమల ఆలయప్రవేశానికి ప్రయత్నించారు. కొందరు సఫలమయ్యారు. మరికొందరు వెనుతిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల కోసం ఈనెల 17న దేవాలయాన్ని తెరవనున్నారు. దేవాలయం తెరుచుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఈ తీర్పు రావడంతో ఆలయంలోకి ప్రవేశంపై సందిగ్ధత నెలకొంది. -
శబరిమలపై విస్తృత ధర్మాసనం
చట్టం ప్రధానమా, విశ్వాసం ప్రధానమా అనే అంశంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పులో అందరూ ఆశించినట్టు స్పష్టత లభించలేదు. శబరిమలలో మహిళ ప్రవేశంపై ఉన్న విధినిషేధాలనూ, వాటితోపాటు ఇతర మతాల్లోని వివక్షను కూడా పరిశీలించి తేల్చడానికి ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనమే సరైందని 3–2 మెజారిటీతో ధర్మాసనం అభిప్రాయపడింది. కనుక ఈ వివాదం దీర్ఘకాలం కొనసాగక తప్ప దు. ఆ ఆలయంలో 10–50 సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్ల ప్రవేశంపై అమలవుతున్న ఆంక్షలు చెల్లబోవని, అవి రాజ్యాంగ విరుద్ధమని నిరుడు సెప్టెంబర్‌లో ఇచ్చిన మెజారిటీ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు దానిపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు గనుక ఆలయ ప్రవేశం కోసం సహజంగానే మహిళలు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ నెల 17న శబరిమల ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకోబోతున్నాయి. నిరుడంతా జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచు కుని శాంతిభద్రతల పరిరక్షణపై కేరళ ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. నిరుడు తీర్పు వెలువ రించిన ధర్మాసనంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూ ర్తులు జస్టిస్ రోహింటన్ నారిమన్, జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్‌లున్నారు. వీరిలో మిగిలిన నలుగురూ ఆం క్షలు చెల్లబోవని తీర్పునివ్వగా, జస్టిస్ ఇందూ మల్హోత్రా మెజారిటీ సభ్యులతో విభేదించి అసమ్మతి తీర్పు వెలువరించారు. ఏది అవసరమైన మతా చారమో, ఏది కాదో నిర్ణయించుకోవాల్సింది మత మే తప్ప న్యాయస్థానం కాదని ఆమె అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లనే సుప్రీంకోర్టు విచారించి తాజా తీర్పుని చ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏ ఎం ఖాన్విల్కర్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు శబరిమల వివాదంతోపాటు ఇతర మతా ల్లోని వివక్షను కూడా విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలని అభిప్రాయపడగా...జస్టిస్ ఆర్ ఎఫ్ నారిమన్, జస్టిస్ డీ వై చంద్రచూడ్‌లు కేవలం శబరిమల వివాదాన్ని మాత్రమే విస్తృత ధర్మా సనా నికి నివేదించాలని భావించారు. దేశంలో బహురూపాల్లో అమలవుతున్న లింగ వివక్షపై మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు పోరాడుతుంటాయి. అయితే వివిధ మతాల్లో స్త్రీల పట్ల ఆచారాలు, సంప్రదాయాల పేరిట అమలవుతున్న ఆంక్షల గురించి ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు. మతం వెలుపలి వ్యక్తు లను పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం, మసీదుల్లోకి మహిళలను అనుమతించకపోవడం వగైరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారున్నట్టే...మహారాష్ట్రలోని శని సింగణాపూర్‌లోనూ, శబరిమలలోనూ మహిళలకు ప్రవేశం లేకపోవడం తదితరాలపై కూడా కొందరు ఉద్యమించారు. శనిశింగణాపూర్ వివాదం పరిష్కారమైంది. ఆ ఉద్యమ ధాటికి దశాబ్దాల నాటి వివక్షను అక్కడి ఆలయ నిర్వాహకులు రద్దుచేశారు. ఒక మతానికి తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలేమిటో, తప్పనిసరికానివేమిటో తేల్చి...వివాదం తలెత్తిన అంశం ఏ జాబితాలోనికొస్తుందో నిర్ధారించడం, దాని ఆధారంగా ఆ ఆచా రాన్ని అంగీ కరించడమో లేదా తోసిపుచ్చడమో విస్తృత ధర్మాసనం తేల్చవలసి ఉంది. 1954లో తన ముందుకొచ్చిన శిరూర్‌మuŠ‡ కేసులో సుప్రీంకోర్టు ఈ గీటురాయిని రూపొందించింది. దాని ఆధారంగానే అంటరానితనం, దళితులకు ఆలయ ప్రవేశ నిరాకరణ వంటివి హిందూ మతంలో తప్పనిసరి ఆచారాలు కాదని...ఆ మతానికి చెందిన శాస్త్రాలేవీ వాటిని సమర్థించడంలేదని సుప్రీం కోర్టు నిర్ధారించి అవి పాటించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని 1994లో రాజ్యాంగ ధర్మాసనం తేల్చింది. ముస్లింలు ఎక్కడైనా నమాజ్ జరుపుకుంటారు గనుక దీన్ని తప్పనిసరి ఆచారంగా పరిగణించలేమని తేల్చింది. అయితే ఈ గీటురాయితో రాజ్యాంగ నిపుణుల్లో చాలామంది ఏకీ భవించరు. తన ముందుకొచ్చే అంశం రాజ్యాంగపరంగా సమ్మతమా కాదా అన్నది చూడాలి తప్ప...మతపరమైన లోతుపాతుల్లోకి పోవడం సమంజసం కాదని వారంటారు. ‘తప్పనిసరి ఆచారాల’ గీటురాయిని బట్టి చూస్తే శబరిమలలో మహిళల ప్రవేశం నిరాకరణకు న్యాయపరమైన మద్దతు ఎంతవరకూ మద్దతు లభిస్తుందో చూడాలి. ఎందుకంటే దేశంలో 20 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిల్లో కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి విధినిషేధాలు అమలవు తున్నాయి. మతాచారమే అయినపక్షంలో అది అన్నిచోట్లా సమంగా అమలయ్యేది. అయితే శబ రిమలలో మహిళలను సైతం అనుమతించాల్సిందేనని ఉద్యమించినవారు అయ్యప్పస్వామి భక్తులే తప్ప హేతువాదులు కాదు. ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదాన్ని పరిష్క రించడానికి ఎంత వ్యవధి తీసుకుంటుందో చెప్పలేం. ఎందుకంటే అది ఏడు అంశాలను తేల్చవలసి ఉంది. పైగా అవన్నీ మూడు మతాలకు చెందిన వివాదాస్పద అంశాలు. మత స్వేచ్ఛకు వీలు కల్పి స్తున్న రాజ్యాంగంలోని 25వ అధికరణ చెబుతున్న సహేతుకమైన పరిమితులేమిటో అది ప్రధానంగా నిర్ధారించవలసి ఉంది. అయితే జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లిచ్చిన మైనారిటీ తీర్పులోని అంశాలు కీలకమైనవి. రివ్యూ పిటిషన్లను విచారించే ధర్మాసనం కేవలం అందులోని అంశాలను మాత్రమే విస్తృత ధర్మాసనానికి అప్పగించాలి తప్ప, ఆ పిటిషన్లలో ప్రస్తావనకు రాని ఇతర అంశాల జోలికి పోరాదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఇస్లాం, పార్సీ మతాల్లోని వివక్ష ఈ ధర్మాసనం పరిశీలనలో లేనప్పుడు దాన్ని అప్పగించే అధికారం ఉండబోదని చెప్పారు. మొత్తానికి ఎంతో ఉత్కం ఠను, ఉద్రిక్తతలను రేకెత్తించగల శబరిమల వివాదం పరిష్కారానికి దీర్ఘకాలమే పడుతుంది. వివాదం కట్టుదాటకుండా, శాంతిభద్రతలకు ముప్పు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదీ, ప్రజా నీకానిది కూడా. -
శబరిమల కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ
-
శబరిమల కేసు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. తీర్పును వెలువరిస్తున్న సమయంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మతమంటే ఏంటి? మత విశ్వాసాలు ఏమున్నాయి? అనే అంశంపై చర్చ జరపాలని పిటిషనర్లు మమ్మల్ని కోరారు. నిజానికి ప్రతీ ఒక్కరికీ మత స్వేచ్ఛ ఉంది. ప్రార్థన చేసుకునే హక్కుకు లింగభేదం లేదు. అయితే ఈ కేసు కేవలం ఒక్క శబరిమల ఆలయానికే పరిమితం కాదు. మసీదులో ముస్లిం మహిళలు, బోరాలో పార్శీ మహిళల ప్రవేశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ కేసులో దాఖలైన 65 పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు హిందూ సంఘాలు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్లను సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎటూ తేల్చని ఐదుగురు జడ్జీల బెంచ్ దీనిని ఏడుగురు జడ్జీలున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని జస్టిస్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యతిరేకించగా.. మెజారిటీ జడ్జీల నిర్ణయం మేరకు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.(చదవండి : ‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’) మరోవైపు.. సున్నిత అంశమైన ఈ కేసులో తీర్పు వెలువడుతుండటంతో శబరిమలలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 16 శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో అక్కడ ఏకంగా 10 వేల మందితో భద్రత ఏర్పాటు చేశారు. కాగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 2న శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించిన విషయం తెలిసిందే. -
‘ఆ తీర్పును పక్కనపెట్టాలి’
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారణకు చేపట్టింది. సీజేఐ రంజన్ గొగొయ్ నేతృత్వంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం ఎదుట వివిధ పక్షాలకు చెందిన న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కనపెట్టాలని నాయర్ సర్వీస్ సొసైటీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కే పరాశరన్ విజ్ఞప్తి చేశారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా రుతుక్రమం కలిగిన స్త్రీలను ఆలయంలోకి అనుమతించడం లేదని, ఇది అంటరానితనం కిందకు రాదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు రివ్యూ పిటిషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని కేరళ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా కోర్టుకు నివేదించారు. రివ్యూ పిటిషన్ల రూపంలో కేసును తిరిగి చేపట్టలేరని పేర్కొన్నారు. మతానికి సంబంధించిన కార్యకలాపాల్లో సమాన హక్కును నిరాకరించే పద్ధతి ఏదైనా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కు విరుద్ధమని, సుప్రీం ఉత్తర్వులను గౌరవించాలని, సమీక్షించాలని కోరరాదని తాము నిర్ణయం తీసుకున్నామని ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు న్యాయవాది రాకేష్ ద్వివేది సుప్రీం బెంచ్‌కు నివేదించారు. ఇది విస్తృత ప్రజాబాహుళ్యానికి సంబంధించిన అలంశం కాదని, ఓ వర్గం అంతర్గత వ్యవహారమని, వారి విశ్వాసానికి సంబంధించినదని సీనియర్ న్యాయవాది శేఖర్ నపాడే కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మతపరమైన పద్ధతులను ఎవరూ నిర్ధేశించలేరని, ఆ వర్గానికి చెందిన సభ్యులే దాన్ని నిర్ణయిస్తారని, సుప్రీం తీర్పు అనంతరం కేరళలో నెలకొన్న సామాజిక అశాంతిని మనమంతా టీవీల్లో చూశామని చెప్పారు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. -
క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తాం
-
ఆమెను ఇంటి నుంచి గెంటేశారు!
తిరువనంతపురం : అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన తొలి మహిళగా చరిత్రకెక్కిన కనకదుర్గ కష్టాల్లో చిక్కుకుంది. ఇటీవల ఆమె అత్త కనదుర్గను చితకబాదగా.. ఇప్పుడు ఏకంగా ఇంట్లో నుంచే గెంటేశారు. ఆమెను ఇంట్లోకి రానివ్వడానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. చేసిన పాపానికి ప్రాయశ్చితం చేసుకొని.. లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెబితేనే ఇంట్లోకి రానిస్తామని తెగేసి చెబుతున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా తమ కుటుంబం పరువును కనకదుర్గ గంగలో కలిపిందని.. సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఇంట్లోకి రావడానికి వీల్లేకుండా.. ఇంటికి తాళం వేసి ఆమె భర్త బంధువుల దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ వ్యవహారంలో పోలీసులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రస్తుతం కనకదుర్గ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హోంలో తలదాచుకుంటోంది. జనవరి 2న బిందు (40) అనే మరో మహిళతో కలిసి కనకదుర్గ (39) శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో అయ్యప్ప సన్నిధానం చేరుకున్న నిషిద్ధ వయసున్న తొలి మహిళల్లో ఒకరిగా ఆమె నిలిచింది. వాస్తవానికి అంతకు ముందే డిసెంబర్ 24 ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా.. భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో వెనక్కి తగ్గారు. దీంతో పోలీసులు రక్షణ మధ్య వారిని ఇళ్లకు పంపించేశారు. మళ్లీ జనవరి 2న ఆలయంలోకి వెళ్లారు. మరోవైపు తిరువనంతపురంలో మీటింగ్ ఉందని అబద్దం చెప్పి శబరిమలకు వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మలప్పురం జిల్లా అరిక్కోడెకు చెందిన కనకదుర్గ దళిత్ యాక్టివిస్ట్. తన స్నేహితురాలు కనకదుర్గను ఇంట్లోకి రానీయకపోవడానికి కొందరి ఒత్తిడే కారణమని, న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని బిందు తెలిపింది. ఇక బిందు కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కొంది. ఆమెకే కాకుండా తన కూతురుకు కూడా ఈ వేధింపులు ఎదురయ్యాయి. ‘నువ్వు మీ అమ్మలా కావద్దు’’అంటున్నారట. మా అమ్మాయి క్లాస్‌లోని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయితో మాట్లాడొద్దని, డిస్టెన్స్ మెయిన్టైన్ చేయమని వాళ్ల పిల్లలకు చెప్తున్నారట. ఈ అవమానంతో మా అమ్మాయి ఇప్పుడు స్కూల్‌కి వెళ్లడానికే ఇష్టపడట్లేదు’’ అని బిందు మీడియాతో ఆవేదన వ్యక్తం చేసింది. -
శబరిమల వివాదం : ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇప్పటివరకూ 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళలు 51 మంది ఆలయంలో ప్రవేశించారని కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్లో పేర్కొంది. ఆలయ సంప్రదాయం ప్రకారం రుతుక్రమంలో ఉన్న పది నుంచి 50 సంవత్సరాల లోపు బాలికలు, మహిళలను ఆలయంలోకి అనుమతించని సంగతి తెలిసిందే. అయితే శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. పది నుంచి 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశం సంప్రదాయాలకు విరుద్ధమని హిందూ సంఘాలు సుప్రీం తీర్పుపై భగ్గుమన్నాయి. మహిళలను ఆలయంలోకి రాకుండా ఎక్కడికక్కడ ఆందోళనకారులు అడ్డుకోవడంతో పలుమార్లు ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఈనెల 2న ఇద్దరు మహిళలు కనకదుర్గ, బిందులు ఆందోళనకారుల నిరసనలను నిలువరిస్తూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
అయ్యప్ప ఆలయంలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి
సాక్షి, తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించిన మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. బిందుతో కలిసి ఆయలంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళను సొంతింటి వాళ్లే చిత్రహింసలు పెట్టారు. అయ్యప్ప దర్శనం అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన కనకదుర్గ నేడు సొంతింటి చేరుకున్నారు.మొదటిసారిగి ఇంటికి వచ్చిన కనకదుర్గపై అత్తింటివారు దాడికి దిగారు.(శబరిమలలో కొత్త చరిత్ర) ఆలయంలోకి ఎందుకు వెళ్లావంటూ కనకదుర్గ అత్త కర్రతో ఆమెను చితకబాదారు. సంస్కృతి, సంప్రదాయాలను మరచి ఎంత చెప్తున్నా వినకుండా అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లి ఆచారాలను మంటగలిపిందంటూ ఆమెపై చేయిచేసుకున్నారు. దీంతో కనకదుర్గ తలకు బలంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కనకదుర్గ ఇంటికి చేరుకున్నారు. తీవ్రగాయాలపాలైన కనకదుర్గను ఆస్పత్రికి తరలించారు. దాడికి దిగిన కనకదుర్గ అత్తపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇది చదవండి : ఆ ఇద్దరూ శబరిమలకు ఎలా వెళ్లారు? -
‘అక్కడ అమలవుతుంది కానీ.. కేరళలో కాదా’
న్యూఢిల్లీ : శబరిమల ఆలయం విషయంలో కేంద్రం, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. శని సింగ్నాపూర్ విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేరళలో శబరిమల అంశాన్ని వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని.. ఆయన కంటే కూడా దావూద్ ఇబ్రహీం నయమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కలిసి అరాచకం, అల్లర్లు సృష్టిస్తున్నాయని.. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తాం కాంగ్రెస్‌ది రీటైల్ అవినీతి అయితే, బీజేపీది హోల్‌సేల్ అవినీతి అని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. జాతీయ స్థాయిలో అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా, తెలంగాణలో మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతం అని పేర్కొన్నారు. -
రణరంగంగా కేరళ
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశం కేరళను రణరంగంగా మార్చింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన హిందూ సంస్థల కార్యకర్తలు రోడ్లకు అడ్డంగా కాలిపోతున్న టైర్లు, గ్రానైట్ పలకలు ఉంచి నిరసనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శబరిమల కర్మ సమితి ఇచ్చిన 12 గంటల హర్తాళ్ పిలుపు మేరకు వందలాది మంది హిందూ అనుకూల సంస్థల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టించారు. అధికార సీపీఎం కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులకు కూడా నిరసనల సెగ తాకింది. ఆందోళనకారుల దాడిలో పలువురు పాత్రికేయులు గాయాలపాలయ్యారు. పోలీసులు, సీపీఎం కార్యకర్తలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల వ్యవధిలో 266 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 334 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్ పి. సదాశివం ముఖ్యమంత్రి విజయన్ను ఆదేశించారు. తాజా హింసకు బీజేపీ, ఆరెస్సెస్‌లే కారణమని విజయన్ ఆరోపించారు. మరోవైపు, శబరిమల ఆలయాన్ని ఇద్దరు మహిళలు దర్శించుకున్న తరువాత గర్భగుడిని శుద్ధిచేయడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బీజేపీ కార్యకర్తలకు కత్తిపోట్లు.. త్రిసూర్‌లో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ) కార్యకర్తలతో జరిగిన ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కత్తిపోట్లకు గురయ్యారు. కోజికోడ్, కన్నూర్, మలప్పురం, పాలక్కడ్, తిరువనంతపురం తదితర పట్టణాల్లోనూ బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యకర్తల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. పాలక్కడ్‌లో సీపీఎం కార్యాలయంపై దాడికి పాల్పడిన నిరసనకారులు, దాని ముందు నిలిపిన వాహనాల్ని ధ్వంసం చేశారు. కన్నూర్ జిల్లాలోని తాలసెరిలో సీపీఎం నిర్వహణలో ఉన్న బీడీ తయారీ కేంద్రంపై నాటుబాంబు విసిరారు. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న 10 మందిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. మీడియాపై దాడికి నిరసనగా తిరువనంతపురంలో పాత్రికేయులు ఆందోళనకు దిగారు. బీజేపీ, శబరిమల కర్మ సమితి కార్యక్రమాలను బహిష్కరించాలని కేరళ మీడియా వర్కింగ్ యూనియన్ నిర్ణయించింది. హర్తాళ్ వల్ల దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాలు మూతపడటంతో జనజీవనం స్తంభించింది. గురువారం కాంగ్రెస్ ‘బ్లాక్ డే’గా పాటించింది. పాతనంతిట్టా జిల్లాలోని పాండలమ్లో సీపీఎం కార్యకర్తలు తమ కార్యాలయ భవనం పైనుంచి రాళ్లు రువ్వడంతో తీవ్రంగా గాయపడిన 55 ఏళ్ల ఉన్నితాన్ చనిపోయారు. బుధవారం సాయంత్రం శబరిమల కర్మ సమితి చేపట్టిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ దాడిలో పాల్గొన్న 9 మందిని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నితాన్ గుండెపోటుతో మరణించాడని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. చెన్నైలో కేరళ సీఎం దిష్టిబొమ్మ దహనం సాక్షి, చెన్నై: శబరిమల ఆందోళనలు చెన్నైకీ విస్తరించాయి. పల్లవరంలో బీజేపీ కార్యకర్తలు కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించని కేరళ ప్రభుత్వం ఇద్దరు మహిళల్ని మాత్రం బందోబస్తుతో పంపిందని తమిళనాడు బీజేపీ చీఫ్ సౌందరరాజన్ విమర్శించారు. హింస వెనక బీజేపీ, ఆరెస్సెస్: విజయన్ హర్తాళ్ మద్దతుదారులు హింసకు పాల్పడటం వెనక పక్కా ప్రణాళిక ఉందని సీఎం విజయన్ పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ హింసను ప్రేరేపించాయని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. శబరిమలకు వెళ్లిన ఇద్దరిని ప్రభుత్వం తీసుకెళ్లలేదని, వారు సాధారణ భక్తులలాగే ఆలయ సందర్శనకు వెళ్లారని చెప్పారు. వారిని హెలికాప్టర్లో తరలించారన్న వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హర్తాళ్ చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పును శంకించడమేనని పేర్కొన్నారు. మహిళల దర్శనం తరువాత ఆలయాన్ని శుద్ధిచేసిన పూజారుల తీరును కూడా విజయన్ తప్పుబట్టారు. ఢిల్లీలో కేరళ సీఎం విజయన్ దిష్టిబొమ్మను దగ్ధంచేస్తున్న అయ్యప్ప ధర్మ సంరక్షక సమితి సభ్యులు -
శబరిమల ఎఫెక్ట్..! చెన్నైలోని కేరళ హోటల్‌పై దాడి
సాక్షి, చెన్నై : చెన్నైలోని కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఓ హోటల్‌పై దాడి జరిగింది. థౌజండ్ నైట్లోని గ్రీమ్స్ రోడ్డులో గల హోటల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి 10.40 ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో హోటల్ అద్దాలు, సెక్యురిటీ చెక్‌పోస్టు ధ్వంసమయ్యాయి. కాగా, శమరిమల ఆలయంలోకి బుధవారం ఇద్దరు మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హిందుత్వవాదుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేసథ్యంలోనే కేరళ ప్రభుత్వ హోటల్‌పై దాడి జరిగి ఉండొచ్చని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. (మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత) సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నామని, నిందితులని పట్టుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలోని కేరళ ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా 100 మంది పోలీసులను నియమించామని చెప్పారు. ఇదిలాఉండగా.. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం నేపథ్యంలో కేరళ వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని వయసుల స్త్రీలకు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి విదితమే. -
మహిళల ఆలయ ప్రవేశంపై భగ్గుమన్న కేరళ
-
మహిళల ఆలయ ప్రవేశం.. కేరళలో తీవ్ర ఉద్రిక్తత
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆలయ నిబంధనలు, ఆచారాలు మంటకలిశాయని, కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వమే దీనికి కారణమంటూ ఆందోళనలు పెల్లుబిగిస్తున్నాయి. కేరళ బంద్‌కు పిలుపునిచ్చిన యూడిఎఫ్ పక్షాలకు బీజేపీ, అన్ని వర్గాల అయ్యప్ప సంఘాలు మద్దతు పలికాయి. బంద్ ప్రభావంతో కేరళ స్తంభించింది. (శబరిమలలో కొత్త చరిత్ర) ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టిస్తున్నారు. కోయంబత్తూరు- పాలక్కాడు, నాగర్ కోయిల్- ట్రివేండ్రం సరిహద్దులు మూసివేయటంతో ఇరువైపుల రవాణా బంద్ స్తంభించింది. ఇరువైపుల బారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. కేరళ వైపు వెళ్లే బస్సులను కోయంబత్తూరు, నాగర్ కోయిల్ లొనే నిలిపివేయటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేరళలో బంద్ ప్రబావం తీవ్రంగా ఉండటంతో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయోనన్న ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
శబరిమలలో కొత్త చరిత్ర
శబరిమల/తిరువనంతపురం: కొత్త ఏడాది వేళ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. శతాబ్దాల సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ రుతుస్రావ వయసులో ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు(42) బుధవారం వేకువ జామున పోలీసు రక్షణతో అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అన్ని వయసుల మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రుతుస్రావ దశ (10–50 ఏళ్ల మధ్య)లో ఉన్న మహిళలు అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. దీంతో అత్యున్నత న్యాయస్థానం తీర్పు మూడు నెలల తరువాత అమలుకు నోచుకున్నట్లయింది. లింగ సమానత్వం కోరుతూ కేరళ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు రాష్ట్రం ఒక చివర నుంచి మరో చివర వరకు మానవహారం ఏర్పాటుచేసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మహిళల ప్రవేశం తరువాత ఆలయ ప్రధాన పూజారి భక్తులందరినీ బయటికి పంపించి, తలుపులు మూసి సుమారు గంట సేపు గర్భగుడిలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాతే ఆలయ తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించారన్న వార్త తెలియగానే కేరళలోని పలు ప్రాం తాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి. అడ్డంకులు లేవు.. నిరసనలు లేవు పటిష్ట పోలీసు భద్రత నడుమ నల్లటి దుస్తులు, ముఖాలకు ముసుగులు ధరించి కనకదుర్గ, బిందు బుధవారం వేకువజామున 3.38 నిమిషాలకు అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టారు. పంబా నుంచి ఆలయం వైపు మెట్లు ఎక్కుతుండగా, లోపల పూజలు చేస్తున్న సమయంలో తమకు ఎలాంటి నిరసనలు కాలేదని, అంతా సవ్యంగానే సాగిందని వారు తెలిపారు. అక్కడ భక్తులు మాత్రమే ఉన్నారని, వారు తమని అడ్డుకోలేదని వెల్లడించారు. దర్శనం ముగిసిన తరువాత పోలీసులు ఆ ఇద్దరిని గుర్తు తెలియని చోటుకు తరలించారు. కేరళలోని మలప్పురంకు చెందిన కనకదుర్గ పౌర సరఫరా శాఖలో ఉద్యోగి కాగా, కోజికోడ్‌కు చెందిన బిందు కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో వారిద్దరి ఇళ్ల వద్ద పోలీసు బలగాల్ని మోహరించారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప ఆలయ మెట్లు ఎక్కుతున్న దృశ్యాల్ని స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేయడంతో ఈ సంగతి రాష్ట్రమంతా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి పి. విజయన్ స్పందిస్తూ ‘కొన్ని అడ్డంకుల వల్ల ఇంతకుముందు మహిళలు ఆలయంలోకి ప్రవేశించలేకపోయారు. కానీ ఈ రోజు అలాంటి సమస్యలు లేకపోవడం వల్లే వారు గుడిలోకి వెళ్లగలిగారు. మహిళలు శబరిమల ఆలయంలో అడుగుపెట్టారన్నది నిజం’ అని వ్యాఖ్యానించారు. విజయన్ మొండివైఖరి వల్లే: కాంగ్రెస్ అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ సీఎం విజయన్‌పై మండిపడ్డాయి. ఆలయంలోకి మహిళలు అడుగుపెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఇది సీఎం విజయన్ మొండివైఖరిని సూచిస్తోందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితాల అన్నారు. విజయన్ ఆదేశాల మేరకు నడుచుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించారన్నారు. సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేయడం వందశాతం సరైనదేనన్నారు. ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతుందని తెలిపారు. కేరళ ప్రభుత్వం భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందని, సీఎం, కమ్యూనిస్టు నాయకులు, వారి భావి తరాలకు అయ్యప్ప ఆగ్రహం తప్పదని రాష్ట్ర బీజేపీ చీఫ్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై హెచ్చరించారు. విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ‘నామజపం’ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న శబరిమల కర్మ సమితి డిమాండ్ చేసింది. కొత్త ఏడాదిలో మహిళలకు ఇది గొప్ప ప్రారంభమని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ అన్నారు. అట్టుడుకుతున్న కేరళ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేరళలో ఉద్రిక్తత రాజేసింది. ఆందోళన బాట పట్టిన బీజేపీ, హిందూ సంస్థల కార్యకర్తలు వీరంగం సృష్టించారు. తిరువనంతపురంలో సచివాలయం బయట బీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. అధికార సీపీఎం, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపించింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు జలఫిరంగులు, బాష్పవాయువు గోళాల్ని ప్రయోగించారు. అతి కష్టం మీద ఆందోళనలను అణచివేసిన పోలీసులు ఇద్దరు మహిళల్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీపీఎం కార్యాలయాలపై దాడులు జరిగాయి. మలప్పురంలో బీజేపీ కార్యకర్తలు సీఎం విజయన్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొచ్చి, పాతనంతిట్టా, తిరువనంతపురం, కొల్లాంలలో భక్తులు అయ్యప్ప చిత్రపటాలు చేతబూని వీధుల వెంట ర్యాలీలు నిర్వహించారు. కొచ్చిలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పక్కకు లాగేస్తున్న పోలీసులు -
శబరిమల పూజారులపై చర్యలుంటాయా!
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి 50 ఏళ్ల లోపు వయస్సున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడం వల్ల అపచారం జరిగిందంటూ బుధవారం కొన్ని గంటల పాటు ఆలయం తలుపులు మూసివేసిన పూజారులు శుద్ధి కార్యక్రమం అనంతరం తలుపులు తెరచి భక్తులను అనుమతించారు. అన్ని వయస్కుల మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం అంటరానితనమే కాదు, అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుంది. ఈ కారణంగా ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే. ఈ ఉల్లంఘనకు 1955లో తీసుకొచ్చిన ‘అంటరానితనం నిషేధ చట్టం’ కింద నేరస్థులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఓ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరంలోకి అదే మతానికి చెందిన కొంత మందిని అనుమతించడం, మరికొంత మందిని అనుమతించక పోవడం అంటరానితనమే అవుతుందంటున్న రాజ్యాంగంలోని 17వ అధికరణను స్ఫూర్తిగా తీసుకొనే ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన సుప్రీం కోర్టు బెంచీ గత సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని అన్ని రకాల అంటరానితనాలను నిషేధించినట్లు రాజ్యాంగంలోని 17వ షెడ్యూల్ స్పష్టం చేసింది. ఎలాంటి సామాజిక కారణాల వల్ల కూడా ఎవరి పట్ల వివక్షత చూపినా అది అంటరానితనమే అవుతుందని కూడా చెప్పింది. అందుకనే ఇది స్వచ్ఛం, అది అపవిత్రం అంటూ మహిళల పట్ట వివక్షత చూపడం కూడా అంటరానితనమే అవుతుందని జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులో స్పష్టం చేశారు. ఇద్దరు మహిళ అయ్యప్పను సందర్శించుకోవడం వాస్తవమేనంటూ ధ్రువీకరించిన కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. అపచారమంటూ శుద్ధి చర్యలు తీసుకున్న పూజారులపై కేసు పెట్టగలరా? అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు శుద్ధి పూజల పేరిట శబరిమల ఆలయాన్ని మూసివేసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. -
స్త్రీలోక సంచారం
డిసెంబర్ 3 మిథాలీరాజ్ పుట్టినరోజు. అయితే ఈ సంతోషకరమైన రోజు కూడా ఆమెను బాధించే పరిణామమే సంభవించింది. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లోని కీలకమైన మ్యాచ్‌లలో మిథాలీని ఆడకుండా చేసి, ఆమెను అడుగడుగునా, అనేక విధాలుగా అవమానపరిచినట్లు రమేశ్ పొవార్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తిరిగి అతడినే తమ కోచ్‌గా కొనసాగించాలని అభ్యర్థిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బి.సి.సి.ఐ.కి ఈ–మెయిల్ పంపించారు! ఆమె అభ్యర్థనను బలపరుస్తూ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో ఈ–మెయిల్ పంపారు. కోచ్‌గా రమేశ్ రెండేళ్ల ఒప్పంద కాలపరిమితి నవంబర్ 30తో ముగిసింది. కొత్త కోచ్ కోసం బి.సి.సి.ఐ. దరఖాస్తులు కోరుతూ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ దశలో ఈ అమ్మాయిలిద్దరూ మళ్లీ రమేశ్‌నే కోచ్‌గా తీసుకోవాలని కోరడం వెనుక రమేశ్ ప్రమేయం, ఒత్తిడి ఉన్నాయన్న అనుమానాలుతలెత్తుతున్నాయి. పదీయాభై ఏళ్ల మధ్య వయసులోని మహిళలకు శబరిమల ఆలయ దర్శంనంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పు అనంతరం కేరళలో తలెత్తిన ఆధ్యాత్మిక, రాజకీయ సంక్షోభం మకర సంక్రాంతి వరకో, లేక మధ్యంతర ఎన్నికల్ని పీకమీదికి తెచ్చుకునే వరకో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి! ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మత సంస్థలు ఏకతాటిపైకి వస్తుండగా, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వచ్చే జనవరి 1న.. మానవహారంలా ఓ మహిళాహారాన్ని నిర్మించి, దానికి ఉద్యమరూపం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కసరగోడ్ జిల్లా కేంద్రం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు 600 కి.మీ. దూరం సాగే ఈ మానవహారంలోకి పార్టీలకు, మత సంస్థలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళలకున్న భాగస్వామ్యాన్ని విస్మరించి ముందుకు సాగలేమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును శిరసావహించే బాధ్యతను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వానికి ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మద్దతును ప్రజల నుంచి కూడగట్టుకునే ప్రయత్నంలో భాగమే విజయన్ నిర్మిస్తున్న ఈ మహిళాహారం. -
స్త్రీలోక సంచారం
శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసి గత అక్టోబర్‌లో వార్తల్లోకి వచ్చిన రెహానా ఫాతిమా అనే 32 ఏళ్ల కేరళ మోడల్, సామాజిక కార్యకర్త, బి.ఎస్.ఎన్.ఎల్. కంపెనీలో టెక్నీషియన్‌గా ఉద్యోగం చేస్తున్న రెహానా ఫాతిమాపై తాజాగా కేసు నమోదైంది. అయ్యప్ప భక్తురాలి వస్త్ర, వేషధారణల్లో నల్లరంగు చొక్కా ధరించి, మెడలోను, చేతికి రుద్రాక్ష మాలలు వేసుకుని, నుదుటిపై విభూది దిద్దుకుని అయ్యప్పస్వామిలా కూర్చొని, తొడభాగం కలిపించేలా తీయించుకున్న ఫొటోను ఆమె తన ఫేస్బుక్లో పెట్టడంపై వచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇదే విషయమై బి.ఎస్.ఎన్.ఎల్. కూడా ఆమెను ఉద్యోగంలోంచి తొలగించింది. దీనిపై ఫాతిమా భర్త స్పందిస్తూ, ‘‘దిగంబర సన్యాసులు పూజలు అందుకునే ఈ దేశంలో.. ఒక మహిళ తన తొడభాగం కనిపించేలా ఫొటో తీయించుకోవడం ఏ విధంగా మతవ్యతిరేక చర్య అవుతుంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. శబరిమల ఆలయంలోకి 10–50 వయసులో ఉన్న మహిళల్ని కూడా అనుమతిస్తూ సుప్రీంకోర్టు గత సెప్టెంబర్‌లో తీర్పును ఇచ్చాక అక్టోబర్‌లో తొలిసారి ఆలయం తలుపులు తెరుచుకున్నప్పుడు దర్శనం కోసం ప్రయత్నించిన తొలి మహిళగా ఫాతిమా గుర్తింపు పొదారు. శబరిమలకు బయల్దేరడానికి ముందు తీయించుకున్న ఫొటోనే ఆమె ఇప్పుడు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ‘ఆకాశంలో సగం’ స్త్రీ. ఆ ఆకాశంలో యుద్ధనౌకల విమానాల్ని చక్కర్లు కొట్టించే స్త్రీ.. శుభాంగి స్వరూప్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన డెబ్బై ఏళ్లకు భారత నౌకాదళంలోకి పైలెట్‌గా అడుగుపెట్టిన తొలి మహిళ శుభాంగి. సరిగ్గా ఏడాది క్రితం ఆమె నేవీ పైలెట్‌గా చార్జి తీసుకున్నారు. మహిళా లోకాన్ని రీచార్జ్ చేశారు. శుభాంగి.. బరేలీ (ఉత్తరప్రదేశ్) అమ్మాయి. కేరళలోని కన్నూర్ దగ్గరి ఎళిమల ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ లో తొలి మహిళా బ్యాచ్‌లో ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. నేవీ పైలెట్ పోస్ట్‌కు ఎంపికైన తొలి మహిళగా గుర్తింపు పొందింది. ఇవాళ ఇండియన్ నేవీ డే. మన నౌకాదళానికి, నౌకాదళ విమాన తొలి మహిళా పైలట్ శభాంగికి మనస్పూర్తిగా శుభాభినందనలు తెలియజేయవలసిన సందర్భం. నాగాలాండ్‌లో ఏటా జరిగే ‘హార్న్‌బిల్ ఫెస్టివల్’ డిసెంబర్ 1న ప్రారంభమైంది. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. ఈ సందర్భంగా మహిళా టూరిస్టులు, స్థానిక మహిళల కోసం భారత ప్రభుత్వం ‘112 ఇండియా’ అనే మొబైల్ యాప్‌ని ఆవిష్కరించింది. ఆ యాప్‌ని స్మార్ట్‌ఫోన్‌లో డౌన్లోడ్ చేసుకుని ఉంటే, ప్రమాదంలో ఉన్నప్పుడు అందులోని ‘షౌట్’ అనే ఫీచర్ ద్వారా.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కనెక్ట్ అయి తక్షణం పోలీసులు, వలంటీర్ల నుంచి బాధిత మహిళకు ఆపత్కాల సహాయ సహకారాలు లభిస్తాయి. దేశంలో హిమాచల్ ప్రదేశ్ తర్వాత మహిళల భద్రత, రక్షణల కోసం ఇలా సింగిల్ నెంబర్ ఎమర్జెన్సీ మొబైల్ అప్లికేషన్ సదుపాయం ఉన్న రెండో రాష్ట్రం నాగాలాండే కాగా, ఈశాన్యంలో ఇదే మొదటి రాష్ట్రం. -
200 ఏళ్ల క్రితమే నిషేధం
తిరువనంతపురం: రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా 200ఏళ్ల క్రితమే నిషేధం ఉందనీ, అంతకుముందు ఇంకెన్నాళ్ల నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారో కచ్చితంగా తెలీదని పూర్వకాలం నాటి ఓ నివేదికలో తేలింది. శబరిమల ఆలయంపై 1820లో మద్రాస్ పదాతిదళానికి చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు సర్వే చేసి ‘ట్రావెన్కోర్, కొచ్చి రాష్ట్రాల చరిత్రపై సర్వే’ అనే నివేదికను రూపొందించారు. బెంజమిన్ స్వాయిన్ వార్డ్, పీటర్ ఐర్ కాన్నర్ 1820 నుంచి ఐదేళ్లపాటు శబరిమల విశేషాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. 1893 నుంచి 1901 మధ్య కాలంలో నాటి మద్రాస్ ప్రభుత్వం 2భాగాలుగా ఈ సర్వేను ముద్రించింది. కాగా, సంప్రదాయవాదులు శతాబ్దాల సంప్రదాయాన్ని మార్చకూడదన్న తమ వాదనను మరింత బలంగా వినిపించేందుకు బ్రిటిష్ కాలం నాటి ఈ నివేదిక తోడ్పడనుంది. సుప్రీంకోర్టులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం 4:1 ఆధిక్యంతో ఈ తీర్పు చెప్పింది. మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించేందుకే మొగ్గు చూపని జస్టిస్ ఇందూ మల్హోత్రా కూడా తన తీర్పులో వార్డ్, కాన్నర్ల సర్వే గురించి ప్రస్తావించారు. ‘బాలికలు, వృద్ధురాళ్లు ఆలయంలోకి వెళ్లొచ్చు. కానీ యుక్తవయసులో ఉన్నవారు, లైంగిక చర్యలో పాల్గొనే వయసులో ఉన్న మహిళలకు ఆలయ ప్రవేశం నిషిద్ధం’ అని ఆ నివేదికలో బ్రిటిష్ అధికారులు పేర్కొన్నారు. శబరిమల ఆలయాన్ని ‘చౌరీముల్లా’ అనే పేరుతో ప్రస్తావించిన వీరు.. 1820ల్లోనే ఏడాదికి 15 వేల మంది వరకు భక్తులు శబరిమలకు వచ్చే వారని నివేదికలో రాశారు. మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం పూర్వకాలంలో అలిఖిత నియమమనీ, ఆ తర్వాత 1991లో కేరళ హైకోర్టు ఆ నియమానికి చట్టబద్ధత కల్పించిందని చరిత్రకారుడు శశిభూషణ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి కారు అడ్డగింత శబరిమలకు వచ్చిన కేంద్ర ఆర్థిక, నౌకాయాన శాఖల సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాధాకృష్ణన్ వాహనాన్నే పోలీసులు అడ్డుకున్నారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ పోలీసులు ఖండించారు. తాము ఆపిన కారు మంత్రి వాహన శ్రేణితో కలిసి కాకుండా వాళ్లు వెళ్లిపోయాక ఏడు నిమిషాలకు వచ్చిందనీ, ఆ కారులో నిరసనకారులు ఉన్నారనే అనుమానంతోనే ఆపామని పోలీసులు చెప్పారు. -
అర్ధరాత్రి శబరిమలలో ఉద్రిక్తత!
సన్నిధానం : శబరిమలలో ఆదివారం అర్థరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సుమారు 80 మంది బీజేపీ, ఆర్ఎస్సెస్ కార్యకర్తలు అనూహ్యంగా ఆందోళన చేపట్టారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిరసనకారులు తిరువనంతపురంలోని సీఎం పినరయి విజయన్ నివాసాన్ని కూడా ముట్టడించారు. ఆందోళనకారుల అరెస్ట్‌లకు నిరసనగా.. ఆలయ పరిసరాల్లో మోహరించిన పోలీస్ బలగాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో బీజేపీ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ, ఆర్ఎస్సెస్ కార్యకర్తలు అర్థరాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైటాయించి రాత్రి సమయాల్లో ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అర్థరాత్రి ఆలయ పరిసరాల్లో భక్తులు ఉండరాదనే ఆంక్షలు విధించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, పోలీసులు భక్తులకు వ్యతిరేకం కాదని, వారి క్షేమం కోసం పనిచేస్తారని పోలీస్ అధికారి ప్రతీష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో గత రెండు నెలలుగా ఈ ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక భారీ పోలీసు బందోబస్తు మధ్య గత శుక్రవారం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. సుప్రీం తీర్పుకు మద్దతునిస్తూ కేరళ ప్రభుత్వం సుమారు 15వేల మంది పోలీసులతో ఆలయ పరిసరాల్లో భారీబందోబస్తు ఏర్పాటు చేసింది. -
ప్రశాంతంగా శబరిమల.. తక్కువగా రద్దీ
సన్నిధానం: కేరళ వ్యాప్తంగా బీజేపీ ఆదివారం ఆందోళనలు నిర్వహించినప్పటికీ శబరిమల ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలి అధ్యక్షుడు పద్మకుమార్ మాట్లాడుతూ భక్తుల యాత్రకు అనవసర అడ్డంకులు కల్పించొద్దనీ, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. కాగా, రుతుక్రమం వచ్చే వయసులో ఉన్న మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న తీర్పు అమలు కు మరికొంత సమయం కావాలని కోరుతూ సోమవారమే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని పద్మకుమార్ చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేంద్రన్ అరెస్టుకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. -
ఉద్రిక్తతల నడుమ తెరుచుకున్న శబరిమల ఆలయం
కోచి/శబరిమల/పంబ: భారీ పోలీసు బందోబస్తు, అయ్యప్ప భక్తుల శరణు ఘోష మధ్య శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ రాకతో కోచిలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రి వరకు కొనసాగాయి. పోలీసుల సూచనతో ఆమె తిరిగి పుణె వెళ్లిపోయారు. ఆలయంలోకి రుతుస్రావం వయసు మహిళలనూ అనుమతించాలన్న ఉత్తర్వుల అమలుకు సుప్రీంకోర్టును సమయం కోరనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డు(టీడీబీ) తెలిపింది. భారీగా భక్తుల రాక శుక్రవారం సాయంత్రం శబరిమల ఆలయ తలుపులను ప్రధాన పూజారి కందరారు రాజీ వరు తెరిచారు. పూజారులు ఎంఎల్ వాసుదేవన్ నంబూద్రి, ఎంఎన్ నారాయణన్ నంబూద్రి అయ్యప్ప, మలిక్కపురమ్ పూజల బాధ్యతలను స్వీకరించారు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా ఇరుముడులతో తరలివచ్చిన వందలాది భక్తుల శరణు ఘోషతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. దర్శనం క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. నేటి నుంచి డిసెంబర్ 27 వరకు అంటే మండల పూజలు జరిగే 41 రోజుల పాటు భక్తుల దర్శనం కోసం ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. జనవరి 14వ తేదీన జరిగే మకరవిలక్కు పూజల కోసం తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20వ తేదీ వరకు ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. సుప్రీం తలుపుతడతాం: టీడీబీ నేటి నుంచి మండల పూజలు ప్రారంభం కానున్న దృష్ట్యా టీడీబీ అధ్యక్షుడు ఎ.పద్మకుమార్ శుక్రవారం బోర్డు సభ్యులు, న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రుతుస్రావ వయసు మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళనలు సాగుతుండటంపై వారు చర్చించారు. టీడీబీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉత్తర్వుల అమలుకు మరికొంత సమయం కావాలంటూ శని లేదా సోమవారాల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఆలయం, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు శాఖ భారీ బందోబస్తు చేపట్టింది. గురువారం అర్ధరాత్రి నుంచి 144వ సెక్షన్ నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. 20 మంది సభ్యుల కమాండో బృందం, 234 మందితో కూడిన బాంబ్ స్క్వాడ్, 800పైగా మహిళా పోలీసులతోపాటు మొత్తం 15వేల మందిని వివిధ ప్రాంతాల్లో బందోబస్తుకు వినియోగిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత సన్నిధానంలో ఉండేందుకు భక్తులను అనుమతించడం లేదు. కనీస వసతుల కొరత ఆలయ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆరోపిస్తున్నారు. టాయిలెట్లు, విశ్రాంతి గదులు దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని మహిళా భక్తులు తెలిపారు. కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేదని మరికొందరు చెప్పారు. టీడీబీతోపాటు రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమయిందని ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల ఆరోపించారు. వెళ్తున్నా.. మళ్లీ వస్తా! సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ రాకపై కోచిలో బీజేపీ కార్యకర్తలు, భక్తులు తదితరుల నిరసనలతో ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. తృప్తి దేశాయ్, మరో ఆరుగురు మహిళలతో కలిసి శుక్రవారం వేకువజామున 4.40 గంటల సమయంలో పుణె నుంచి విమానంలో కోచికి చేరుకున్నారు. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు వారిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. ‘శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు చెప్పడంతో వెనుదిరిగి వెళ్తున్నా. కానీ, త్వరలోనే వస్తాం. ఆలయంలో పూజలు చేస్తా’ అని తృప్తి అన్నారు. ఆమెను విమానాశ్రయంలోనే అడ్డుకున్న సుమారు 200 మంది ఆందోళనకారులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులో అభివాదం చేస్తున్న తృప్తి -
17న శబరిమలకు తృప్తి దేశాయ్
తిరువనంతపురం/ న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ నెల 17న తాను కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో స్వామిని దర్శించుకుంటానని సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు మహిళలతో కలసి తాను ఆలయానికి వెళ్తున్నట్లు తెలిపారు. దర్శనసమయంలో తనకు రక్షణ కల్పించాలని ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌లను కోరింది. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టనివ్వ బోమని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్ స్పష్టం చేశారు. గాంధేయ మార్గంలో వారిని అడ్డుకుంటామని హెచ్చరించారు. మరోౖ వెపు, తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం మరోసారి నిరాకరించింది. శబరిమల తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లపై జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపడతామని తెలిపింది. -
ఆ తీర్పే సుప్రీం..
కొచ్చి : శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కొచ్చికి చెందిన గోవింద్ మధుసూధన్ బెయిల్ అప్పీల్‌ను తోసిపుచ్చుతూ శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిరసనలు తెలపడం సుప్రీం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది. శబరిమల వద్ద సమ్మెలు చేపట్టడం సమ్మతం కాదని అక్కడ మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే క్రమంలో అరెస్ట్ అయిన నిరసనకారుల్లో ఒకరైన కొచ్చి నివాసి మధుసూధన్ బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ హైకోర్టు వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో మధుసూధన్ అరెస్ట్ అయ్యారు. పోలీసులు 3500 మంది నిరసనకారులను అరెస్ట్ చేయగా, వీరిలో 540 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 100 మంది వరకూ ఇంకా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించే లక్ష్యంతో బీజేపీ గురువారం రథయాత్రను ప్రారంభించింది. ఇక ఈ వివాదాన్ని రాజకీయం చేసేందుకు బీజేపీ, వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ విపక్ష కాంగ్రెస్ సైతం కాసర్గాడ్, అలప్పుజ, తిరువనంతపురంల నుంచి యాత్రలను ప్రారంభిస్తోంది. -
శబరిమల వివాదం : సంప్రదాయాలు పాటించాల్సిందే..
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సర్వోన్నత న్యాయస్ధానం తీర్పుపై నెలకొన్న వివాదంపై తలోరకంగా స్పందిస్తున్నారు. పది నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల కోసం సుప్రీం తీర్పుకు అనుగుణంగా అక్టోబర్ 17 నుంచి శబరిమల ఆలయ ద్వారాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నవంబర్ 5న సాయంత్రం ఐదు గంటలకు నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం ముస్తాబైంది. కాగా ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. హిందూ సంస్ధలు ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు మనం పాదరక్షలను బయటే వదిలేస్తామని, గురుద్వారాలోకి వెళ్లే సమయంలో తలపాగా ధరిస్తామని, ముస్లింలు సైతం హజ్ యాత్రకు వెళ్లే క్రమంలో నిర్ధేశిత పద్ధతులను అనుసరిస్తారని, భారత సంస్కృతి నిర్ధేశించిన సంప్రదాయాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు ఆలయంలోకి రాకూడదనే నియమం ఉంటే దాన్ని గౌరవించాలని స్పష్టం చేశారు. దీన్ని ఓ వివాదంగా చూడరాదని, సంప్రదాయాన్ని విధిగా ఆచరించాలని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులను తాము గౌరవిస్తామని, అయితే ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీనిపై రివ్యూ పిటిషన్‌ను న్యాయస్ధానం అనుమతిస్తుందన్న విశ్వాసం తమకుందన్నారు. -
మహిళలందర్నీ అనుమతించాలి: రాహుల్
ఇండోర్/తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలు కేరళ కాంగ్రెస్ విభాగం వైఖరికి భిన్నంగా ఉన్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళలందరూ ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కేరళలో ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు నిర్ణయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. ఇండోర్‌లో రాహుల్ మాట్లాడుతూ ‘శబరిమల ఆలయ ప్రవేశం సెంటిమెంట్‌తో కూడుకున్నది. ఈ విషయంలో నా అభిప్రాయాలు పార్టీ వైఖరికి భిన్నమైనవి. శబరిమల వివాదంలో నా దృష్టిలో స్త్రీ, పురుషులంతా ఒక్కటే. మహిళలందరికీ ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతివ్వాల్సిందే. కేరళీయుల అభిప్రాయాలకు అనుగుణంగా స్థానిక యూనిట్ వ్యవహరిస్తుంది’ అని అన్నారు. మరోవైపు, శబరిమల ఆందోళనకారుల అరెస్టుకు నిరసనగా బీజేపీ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. తిరువనంతపురంలో డీజీపీ ఆఫీస్ వద్ద బీజేపీ కార్యకర్తలు మంగళవారం నిరాహార దీక్ష చేపట్టారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు. -
‘దానికోసం ఇంత చేయాలా’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి హిందూ మహిళలే కాదు.. అన్ని మతాల స్త్రీలు వెళ్లొచ్చునని కేరళ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రమంత్రి కేజే అల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ మసీదులు, చర్చిలకు వెళ్లని మహిళలు శబరిమలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 10 సెకండ్లపాటు టీవీలో కనిపించడానికి, కెమెరాలకు పోజుల్విడానికి పవిత్రమైన అయ్యప్ప గుడిమెట్లు ఎక్కడానికి పూనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతను కాలరాయాలా? ‘ఎన్నడూ మసీదువైపు కన్నెత్తి చూడని ఒక ముస్లిం యువతి శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లి తీరతానని అంటోంది. చర్చ్ అంటే ఏంటో తెలియని మరో క్రిస్టియన్ అమ్మాయి శబరిమల యాత్ర చేస్తానంటోంది. ఎంత విడ్డూరం. పాపులర్ అయిపోవడానికీ, కెమెరాల్లో కనిపించడానికి ఇంత చేయాలా? దానికోసం ఆలయ పవిత్రతను కాలరాయాలా’అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 19న శబరిమల యాత్ర చేపట్టిన రేహానా ఫాతిమాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5 కిలోమీటర్లు యాత్ర చేసి అయ్యప్ప ఆలయ ప్రాంతానికి చేరుకున్న అనంతరం తీవ్ర ఉద్రికత్తలు తలెత్తడంతో ఫాతిమాను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. కాగా, అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఇప్పటి వరకు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో భద్రతాబలగాలు వారిని వెనక్కి పంపించివేశాయి. బెదిరింపులు రావడంతో మరి కొందరు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. (చదవండి : శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా!) -
శబరిమలకు వెళ్లనున్న అమిత్ షా!
తిరువనంతపురం: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో శబరిమల ఆలయాన్ని సందర్శించనున్నారు. నవంబర్ 17 నుంచి శబరిమలలో వార్షిక యాత్ర ప్రారంభమవనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించనున్నారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులకు తమ పార్టీ మద్దతు తెలుపుతుందని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ‘శబరిమల ఆలయాన్ని సందర్శించాలని అమిత్ షా అన్నారు. అయితే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేరళ బీజేపీ విభాగ సీనియర్ నేత ఒకరు చెప్పారు. శబరిమల నిరసనకారులపై సీఎం పినరయి విజయన్ కఠినంగా వ్యవహరించడంపై గత వారం అమిత్ షా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. నిరసనకారులపై దాడులు ఆపకపోతే బీజేపీ కార్యకర్తలు రంగంలోకి దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కాగా, పోలీసులు ఇప్పటి వరకు 3,500 మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అక్టోబర్ 17 నుంచి 22 మధ్య నెలవారీ పూజలు నిర్వహించిన సమయంలో డజను మంది మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. -
శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
13న ‘శబరిమల’ పిటిషన్ల విచారణ
న్యూఢిల్లీ/తిరువనంతపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను నవంబర్ 13న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుల్ని ఇదివరకే జారీచేసినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం మంగళవారం వెల్లడించింది. రివ్యూ పిటిషన్లను అత్యవసరంగా విచారించాలని జాతీయ అయ్యప్ప భక్తుల అసోసియేషన్ తరఫు లాయర్ మాథ్యూస్ జె.నెదుంపరా విజ్ఞప్తి చేయడంతో బెంచ్ పైవిధంగా స్పందించింది. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ 19 పిటిషన్లు దాఖలయ్యాయి. 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలూ అయ్యప్ప ఆలయంలోకి వెళ్లొచ్చని అత్యున్నత న్యాయస్థానం గత నెలలో చారిత్రక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అపవిత్రం చేయొద్దు: స్మృతి ఇరానీ శబరిమల సంప్రదాయాలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మద్దతు పలికారు. ప్రార్థించే హక్కు పేరిట ఆలయాన్ని అపవిత్రం చేయొ ద్దన్నారు. ‘కనీస విచక్షణతో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. రుతుస్రావ రక్తంతో తడిసి న న్యాప్కిన్లతో స్నేహితుల ఇంటికి వెళ్తామా? వెళ్లం కదా.. మరి దేవుడి నిలయమైన ఆలయంలోకి అలా అడుగుపెట్టొచ్చా? మనకు ప్రార్థించే హక్కు ఉంటుంది. కానీ ఆలయాన్ని అపవిత్రంచేసే హక్కు లేదు. ఈ తేడాను గుర్తించి సంప్రదాయాల్ని గౌరవించాలి’ అని అన్నారు. -
మహిళలను అడ్డుకుంటుంది ఆరెస్సెస్: కేరళ సీఎం
తిరువనంతపురం: శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటుంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యకర్తలేనని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించే విధంగా తాము అన్ని ఏర్పాట్లు చేశామని విజయన్ స్పష్టం చేశారు. కానీ ఆరెస్సెస్ కార్యకర్తలు మహిళలను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఆ ప్రాంతాన్ని యుద్ద ప్రాంతంగా మలిచి భయబ్రాంతులకు గురిచేశారన్నారు. మాస పూజల కోసం గత బుధవారం ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడ ఆందోళనలు చెలరేగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆలయాన్ని మూసివేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ భక్తులను అడ్డుకోలేదన్నారు. ఆందోళనకారులు మాత్రమే వాహనాలను ఆపారని, మహిళా భక్తులను, మీడియా వ్యక్తులపై దాడులు చేశారన్నారు. శాంతిభద్రతల అంశంలో ఎటువంటి తప్పిదం జరగలేదన్నారు. ఆలయంలోకి ప్రవేశించిన మహిళలను అయ్యప్పను దర్శించుకోకుండా అడ్డుకున్న ఆలయ ప్రధాన పూజారి చర్యను సీఎం తప్పుబట్టారు. శబరిమలలో శాంతి నెలకొల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక సుప్రీం తీర్పు నేపథ్యంలో సుమారు 12 మంది మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఇద్దరైతే గర్భగుడికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఆగిపోయారు. -
శబరిమల వ్యవహారంపై చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు
తమిళనాడు, పెరంబూరు: శబరిమల ఆలయ ప్రవేశంపై నటుడు చారుహాసన్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. దేశంలో రగులుతున్న అంశాల్లో కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సమస్య ఒకటి. అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు వివాదంగా మారింది. అయ్యప్ప ఆలయ ప్రవేశానికి స్త్రీలకు అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మహిళలు పలువురు అయ్యప్ప సన్నిధికి వెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. అయితే అక్కడి భక్తులు మహిళలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నటు డు కమలహాసన్ తానెప్పుడూ అయ్యప్ప ఆలయాన్ని దర్శించలేదని, కాబట్టి తెలియని విషయం గురించి ఎలా స్పందించనని తెలివిగా తప్పించుకున్నారు. అయితే ఆయన సోదరుడు చారుహాసన్ మాత్రం మహిళలకు అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. మహిళలు అయ్యప్ప కొండకు వెళ్లడం అనేది పురుషుల మరుగుదొడ్డిని మహిళలు ఉపయోగించుకోవడం లాంటిదని చారుహాసన్ పేర్కొన్నారు. -
శబరిమలను చూశా.. మళ్లీ వస్తానని మొక్కుకున్నా
సాక్షి, హైదరాబాద్ : ‘ఎలాౖగైనా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనే బయలుదేరా. దారి పొడవునా దాడులెదురైనా.. స్వామి వారిని చూసి దర్శించుకుని రావాల్సిందేననుకున్నా. కానీ శబరిమల దేవాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలో వంద మంది చిన్నపిల్లల మానవ కవచాన్ని చూసి చలించిపోయా. నేను దేవాలయంలోకి వెళ్లాలంటే ఈ పిల్లల్ని దాటుకుంటూ వెళ్లాలి. నేను వెళ్లే దారిలో స్వయంసేవకులు, శివసైనికుల రాళ్ల దాడులు.. నేను మొండిగా అలాగే ముందుకు వెళ్తే పిల్లలకు దెబ్బలు తగిలి శబరిలో రక్తపాతం జరిగే అవకాశం ఉందనిపించింది. అందుకే నేను కేవలం పిల్లల మొహాలు చూసి వెనక్కి వచ్చా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పవిత్ర శబరి పరిసరాలను తాకే వచ్చా. ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. ఆ పరిసరాల్లోకి వెళ్లిన తొలి మహిళగా.. ఆ దేవాలయంలోకి వెళ్లేందుకు మళ్లీ కచ్చితంగా ప్రయత్నిస్తా. ఆ ప్రయత్నంలో ఓటమి పాలుచేయొద్దని అయ్యప్పను వేడుకున్నా’అని హైదరాబాద్‌కు చెందిన మోజో టీవీ ప్రజెంటర్ జక్కుల కవిత చెప్పారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన కవిత పంబా నుంచి సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. తొలి రోజు నుంచే ప్రయత్నం... శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాల్సిందేనంటూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునివ్వటం, నెలవారీ పూజల కోసం దేవాలయాన్ని బుధవారం తెరుస్తారన్న సమాచారంతో కవిత మరో ఇద్దరితో కలసి ఈ నెల 16న హైదరాబాద్ నుంచి శబరిమల బయలుదేరి వెళ్లారు. బుధవారమే కుటుంబ సభ్యులతో కలసి పంబాకు వెళ్లిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాధవి (45)ని ఆందోళనకారులు తిప్పి పంపగా కవిత మాత్రం తాను నిర్ణయించుకున్న విధంగానే బుధవారం ఉదయం నీళక్కల్ చేరుకుని అక్కడి నుంచి కారులో పంబా బయల్దేరారు. అప్పటికే జర్నలిస్టుల వాహనాలపై ఆందోళనకారులు దాడులు చేస్తూ వెనక్కి పంపేస్తుండటంతో పోలీసులు సైతం కవిత బృందం ముందుకు వెళ్లటం శ్రేయస్కరం కాదని చెప్పారు. అయినా పంబా వైపు కవిత వాహనం వెళ్లడంతో అక్కడి ఆందోళనకారులు దాడి చేసి కారును ధ్వంసం చేసి వెనక్కి పంపారు. గురువారం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిన ఆమె పోలీసుల భద్రత కోరారు. అయితే నీళక్కల్ పోలీసులు 17 కి.మీ.లు వరకు తోడుగా వచ్చి అడవి మధ్యలో దించేసి తమ పరిధి ఇంతవరకేనన్నారు. అక్కడి నుంచి వేరే జిల్లా పోలీసులు రక్షణ కల్పిస్తారని వారు కవితకు చెప్పినా పోలీసులెవరూ రాకపోవడంతో దారిలో కనిపించిన మరో మీడియా వాహనం ఎక్కి సాయంత్రానికి కవిత బృందం పంబాకు చేరుకుంది. వచ్చే ఏడాది కచ్చితంగా దర్శించుకుంటా... ‘‘పంబా నుంచి ముందుకు కదులుతూ ప్రధాన ఆలయానికి చివరి ఐదు కిలోమీటర్ల దూరానికి వచ్చాం. కానీ అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా పోలీసు వలయం తప్పనిసరి. వేలాది మంది ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడులకు సిద్ధం గా ఉన్నారు. ఆ సమయంలో మరో ఆంగ్ల పత్రికకు చెందిన సుహాసిని అనే మహిళా జర్నలిస్టుతో కలసి నేను పోలీసు రక్షణ కోరగా రాత్రి వెళ్లడం శ్రేయస్కరం కాదు.. రేపు ఉదయం వెళ్లండి రక్షణ కల్పిస్తామన్నారు. అప్పటికి చీకటి పడింది. ఉండటానికి అక్కడ గదులేవీ లేవు. కనీసం కూర్చునే వీలు లేదు. ప్రాణా లు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ అడవిలోనే చెట్ల కింద రాత్రంతా జాగారం చేశాం. అప్ప టికే ఏమీ తినక 24 గంటలు గడిచిపోయింది. అయి నా మర్నాటి ఉదయం కోసం వేచి చూశా. కానీ ఉద యం 9 గంటలవుతున్నా పోలీసులు రక్షణ కల్పించలేదు. నేను, మరో మహిళా జర్నలిస్టు కలసి ఆందో ళనకు సిద్ధమవడంతో అప్పుడు పోలీసులే రక్షణగా ఉండి హెల్మెట్లు, జాకెట్లు వేసి మాతో కలసి ముందు కు కదిలారు. అప్పటికే మాపై రాళ్ల వర్షం మొదలైంది. ఓ పెద్దరాయి వచ్చినా తలను రాసుకుంటూ వెళ్ల డంతో నా చెవికి దెబ్బ తగిలింది. రాళ్ల ఉధృతికి భయపడ్డ సుహాసిని ఒక్క కిలోమీటర్ వరకు వచ్చి వెనుతిరిగింది. నేను మాత్రం అలాగే ముందుకు వెళ్లా. గణ పతి ఆలయం దాటి కిందకు దిగిన అనంతరం ఎదురుగా శబరిమల ప్రధాన ఆలయ పరిసరాలన్నీ ఆం దోళనకారులతో నిండి ఉన్నాయి. గో బ్యాక్.. గో బ్యాక్ నినాదాలతో మార్మోగుతున్నాయ్. అయినా నేను అడుగులు ఆపలేదు. ఆలయం ఎదురుగా వం ద మంది చిన్నపిల్లలు. వారి వెనకాల వందల మంది ఆందోళనకారులు. అడుగు ముందుకు వేస్తే దాడులు తథ్యం.. దానివల్ల పిల్లలకు ఇబ్బంది. దీనికితోడు నేను అడుగు ముందుకేస్తే ఆలయం మూసేస్తామని ప్రధాన పూజారుల హెచ్చరికలు. ముఖ్యంగా పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వెనక్కి వచ్చా. విజయం నాదే. మళ్లీ ఏడాది కచ్చితంగా అయ్యప్పను దర్శించుకుని తీరుతా’’అని కవిత చెప్పారు. ఎవరీ కవిత..? నల్లగొండ పట్టణం గొల్లగూడకు చెందిన కవిత ఎంటెక్ వరకు చదువుకున్నారు. న్యూస్ ప్రజెంటర్‌గా తొలుత నల్లగొండలోని స్థానిక చానెల్లో పనిచేసిన ఆమె ఆ తర్వాత వివిధ చానళ్లలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె మోజో టీవీ ప్రజెంటర్‌గా పనిచేస్తున్నారు. -
ఉద్రిక్తంగానే శబరిమల
శబరిమల : పోలీసుల గట్టి భద్రత నడుమ శుక్రవారం శబరిమలపైకి చేరుకున్న ఇద్దరు మహిళలు తీవ్ర నిరసనల కారణంగా గుడిలోకి వెళ్లకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అయ్యప్ప భక్తుల నిరసనతోపాటు స్త్రీలు ఆలయంలోకి వస్తే తాను తలుపులు మూసేసి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు కూడా స్పష్టం చేయడంతో ప్రభుత్వం, పోలీసులు వెనక్కుతగ్గారు. బలప్రయోగంతో భక్తులను పక్కకు తప్పించి వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మహిళలను వెనక్కు పంపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇద్దరు స్త్రీలలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన విలేకరి కవిత జక్కల్ కాగా, మరొకరు కేరళకు చెందిన సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా అని పోలీసులు తెలిపారు. స్వామి దర్శనం కాకుండా కొండ దిగబోమని మొదట పట్టుబట్టిన వీరిద్దరు.. పరిస్థితిని పోలీసులు వివరించడంతో భద్రత మధ్యనే కిందకు వచ్చారు. పోలీసుల భద్రతతో వారిద్దరూ దర్శనంక్యూ కాంప్లెక్స్ వరకు రాగలిగారు. ఆలయంలోని పవిత్ర మైన 18 మెట్లపై పిల్లలు, వృద్ధులు సహా అయ్యప్ప స్వామి భక్తులు బైఠాయించి ‘స్వామియే శరణమయ్యప్ప’ అని జపిస్తూ అడ్డుకోవడంతో కవిత, ఫాతిమాలు వెనుదిరగక తప్పలేదు. రుతుస్రావం అయ్యే వయసుల్లోని మహిళలు శబరిమలకు వెళ్లకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ గత నెల 28న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి నుంచి కేరళ వ్యాప్తంగా తీవ్రంగా ఆందోళనలు జరుగుతుండటం తెలిసిందే. ఏపీకి చెందిన మాధవి, ఢిల్లీకి చెందిన విలేకరి సుహాసిని రాజ్ కూడా గత రెండ్రోజుల్లో కొండ ఎక్కేందుకు విఫలయత్నం చేశారు. బలనిరూపణకు స్థానం కాదిది: మంత్రి శబరిమలకు చేరుకున్న ఇద్దరు మహిళల్లో ఒక సామాజిక కార్యకర్త ఉండటం పట్ల కేరళ దేవస్థాన శాఖ మంత్రి సురేంద్రన్ పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు తీర్పు భక్తులకు రక్షణ కల్పించాలని చెబుతోంది కానీ తమ బలం నిరూపించుకునేందుకు వచ్చే సామాజిక కార్యకర్తలకు కాదు. కొండకు తీసుకెళ్లేముందు ఆమె వివరాలు, ఉద్దేశాలను పోలీసులు తనిఖీ చేసి ఉండాల్సింది. సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు తమ బలం చూపించేందుకు పవిత్ర శబరిమల స్థానం కాదు’ అని అన్నారు. కాగా, ఈ అంశంపై కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల మాట్లాడుతూ ‘పోలీసులు నిజమైన భక్తులకు భద్రత కల్పిస్తున్నారా లేక ఉద్యమకారులకా? సుప్రీంకోర్టు తీర్పు ఇదేనా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకే ప్రభుత్వం సామాజిక కార్యకర్తలను కొండపైకి తీసుకెళ్లిందని ఆయన ఆరోపించారు. అటు బీజేపీ కేరళ అధ్యక్షుడు శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలనుకుంటోందనీ, ఓ మహిళకు పోలీసులు తమ యూనిఫాం, హెల్మెట్ కూడా ఇచ్చి భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా కొండపైకి తీసుకెళ్లడానికి కారణం ఇదేనని విమర్శించారు. ఒప్పుకున్నాకే కిందకు తీసుకొచ్చాం: ఐజీ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) శ్రీజిత్ నేతృత్వంలోని పోలీసుల బృందం మహిళలను భద్రతతో శబరిమలపైకి తీసుకెళ్లింది. అక్కడ ఐజీ మాట్లాడుతూ ‘వీరు ఆలయంలోకి వస్తే గుడి తలుపులు మూసేసి వెళ్లిపోతానని ప్రధాన అర్చకులు నాతో చెప్పారు. భక్తులపై బలప్రయోగం చేయొద్దని ప్రభుత్వం నుంచి కూడా సూచనలు అందాయి. ఈ విషయాలను ఇద్దరికీ వివరించడంతో కిందకు వెళ్లేందుకు వారు ఒప్పుకున్నారు. భద్రతతోనే మళ్లీ వారిని కిందకు తీసుకొచ్చాం’ అని చెప్పారు. -
శబరిమలలో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్ధితులు
-
యుద్ధక్షేత్రంగా శబరిమల
నిలక్కళ్/పత్తనంతిట్ట/పంబ: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో గత కొన్నిరోజులుగా ఉధృతమైన నిరసనలు జరుగుతుండగానే శబరిమల ఆలయం ఐదు రోజుల మాస పూజల కోసం బుధవారం తెరచుకుంది. కొండ దిగువ ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో నిషేధిత వయస్సుల్లోని మహిళలెవ్వరూ పవిత్ర ఆలయ పరిసరాల్లోకి చేరుకోలేకపోయారు. 10 ఏళ్లలోపు, 50 ఏళ్ల పైబడిన వయసున్న బాలికలు, వృద్ధురాళ్లు అతి తక్కువ సంఖ్యలోనే అయ్యప్ప స్వామి గుడికి వెళ్లారు. రుతుస్రావం అయ్యే వయస్సుల్లో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం ఉండగా, ఆ నిషేధాన్ని గత నెల 28న ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. కాగా, బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన పూజారులు ఉన్నిక్రిష్ణన్ నంబూద్రి, కందారు రాజీవారులు గర్భగుడిని తెరిచి దీపం వెలిగించారు. సంప్రదాయం ప్రకారం తొలిరోజు ఆలయంలో పూజ నిర్వహించకుండా రాత్రి 10.30 గంటలకు తలుపులు మూసేస్తారు. ఉద్రిక్తంగానే కొండ పరిసరాలు శబరిమల కొండ పరిసరాల్లో బుధవారం మహిళలు సహా అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో కొండకు వెళ్లే దారులకు చేరుకుని, నిషేధిత వయస్సు అమ్మాయిలు, స్త్రీలను ఆలయానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. వాహనాలు, బస్సులను తనిఖీ చేసి వారిని దించేశారు. విధులపై శబరిమలకు వెళ్తున్న పలు వార్తా చానళ్ల మహిళా పాత్రికేయులనూ నిరసనకారులు బెదిరించి, వారి వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు స్త్రీలను అడ్డుకునే వారిని నిరోధించేందుకు కేరళ ప్రభుత్వం ఆలయానికి వెళ్లే దారుల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. నిరసనలకు నేతృత్వం వహిస్తున్న అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిలక్కళ్, పంబల్లో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనల్లో పలువురికి గాయాలయ్యాయి. రిపోర్టర్లు, ఫొటో జర్నలిస్టులు కలిపి 10 మంది మీడియా వ్యక్తులకు గాయాలయ్యాయనీ, వారి పరికరాలు ధ్వంసమయ్యాయని మంత్రి జయరంజన్ చెప్పారు. పంబ, నిలక్కళ్లలో 144 సెక్షన్‌ను విధిస్తున్నట్లు పాతనంతిట్ట జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ మద్దతు.. ఆందోళనకారులకు కేరళలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తోపాటు బీజేపీ తమ మద్దతు ప్రకటించింది. పోలీసుల లాఠీ చార్జీకి నిరసనగా శబరిమల యాక్షన్ కౌన్సిల్ ఇచ్చిన 12 గంటల బంద్ పిలుపునకు బీజేపీ, ఇతర ఎన్డీయే పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ ఎంపీ మురళీధరన్ మాట్లాడుతూ ప్రభుత్వం తన మొండిపట్టును వదిలి ప్రజల మనోభావాలను గౌరవించాలని కోరారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ ఈ అంశాన్ని హిందూ పునరుజ్జీవనం, హిందూ ఛాందసవాదాలకు మధ్య జరుగుతున్న పోరాటంగా చూడాలన్నారు. ప్రజలు చట్టం పక్షాన నిలిచి, చట్టం ముందు అందరూ సమానులన్న నియమాన్ని పాటించాలని కోరారు. కాగా, ఆలయానికి వస్తున్న మహిళలకు సరైన భద్రత కల్పించాల్సిదిగా జాతీయ మహిళా కమిషన్ కేరళ పోలీసులను కోరింది. పోలీసుల రక్షణలో వెనుదిరిగిన ఏపీ మహిళ శబరిమలకు వెళ్లేందుకు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాధవి (45) అనే మహిళ ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఆమె తన కుటుంబంతో కలసి స్వామి అయ్యప్ప మార్గం గుండా కొండ ఎక్కేందుకు యత్నించారు. మధ్యలో అయ్యప్ప భక్తులు ఆమెను అడ్డుకుని వెనక్కు వెళ్లిపొమ్మన్నారు. అయినప్పటికీ పోలీసుల రక్షణ మధ్య మరికొంత దూరం కొండ ఎక్కిన అనంతరం ఆమె పంబకు తిరిగొచ్చారు. పంబకు చేరుకునే వరకు పోలీసులు ఆమెకు రక్షణగా ఉన్నారు. మాధవి ఆలయానికి వెళ్లి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గుడిలోపలికెళ్లిన తొలి మహిళగా ఆమె నిలిచేవారు. -
తీర్పును ఇలా అడ్డుకుంటారా?
ఈ నెల 18 నుంచి శబరిమల ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరవనున్నారు. అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేసి, తక్షణమే పునర్విచారణ జరపాలని దాఖలు చేసిన పిటీషన్లను వరుస క్రమంలోనే పరిశీలనకు తీసుకుంటాం తప్ప అత్యవసరమైనవిగా పరిగణించబోమని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పును అడ్డుకుంటామని, మహిళలను ససేమిరా ఆలయంలోకి అనుమతించమని మితవాద, మతవాద శక్తులు చేస్తున్న ప్రకటనలు, చర్యలు మన రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తున్నాయి. మహిళలు ఎవరైనా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని రెండు ముక్కలుగా నరికి ఒకదానిని ఢిల్లీకి, మరొకదానిని సీఎం విజయన్‌కు పంపుతామని కేరళ బీజేపీ నేత, సినీనటుడు కొల్లం తులసీ బెది రించాడు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఇడియట్స్ అని నిందించాడు. ఎవరైనా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే ఏడుగురు సభ్యులున్న తమ బృందం ఆత్మాహుతి చేసుకుం టుందని కేరళ శివసేన ప్రకటించింది. శబరిమల వైపు ప్రయాణించే ప్రతి వాహనాన్ని అడ్డుకుని వయసులో ఉన్న మహిళలను కిందికి దింపేసే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనంతటికీ కారణం.. శబరిమల తీర్పు ఆ విధంగా వస్తుందని మతశక్తులు వూహించలేకపోవడమే. అలాగే పునర్విచారణకు తక్షణమే స్వీకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు చెబుతుందని కూడా వూహించకపోవటంతో ఆ శక్తులు హతాశులై మనోభావాల పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి పూనుకున్నాయి, దానిలో భాగంగా మహిళలను ముందుకు తెస్తున్నాయి. ఇటీవల అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు మితవాద శక్తులు మహిళలను రంగంలోకి దించే ధోరణి పెరిగింది. భారతదేశంలోనూ, మేము నమ్మినదాని కోసం ప్రాణాలిస్తాం, మాదారికి అడ్డు వచ్చిన వారిని అంతమొందించటానికి కూడా వెనుకాడబోమని మతఛాందసవాద శక్తులు ప్రకటించడమే కాకుండా ఆచరించడం కూడా తెలిసిందే. శబరిమలలో కూడా ప్రస్తుత వివాదంపై మహిళలనే ముందుపీటిన పెట్టి సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే వ్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టే దీనిపై తగు చర్యలు తీసుకోవడం అవశ్యం. -ఎం. కోటేశ్వరరావు, హైదరాబాద్ -
శబరిమల వద్ద తీవ్ర ఉద్రిక్తత
నీలక్కల్ : శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు వెళుతున్న వారిని ఆందోళనకారులు మార్గ మధ్యంలో అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. సన్నిదానం వరకు వెళ్లేందుకు తెలుగు భక్తురాలు ప్రయత్నించగా.. ఆందోళన కారులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఆమె మధ్యలోనే వెనుదిరిగారు. అంతటితో ఆగని ఆందోళనకారులు నీలక్క క్యాంప్ వద్ద ఆగిన మీడియా వాహనాలపై దాడి చేశారు. ఈ దాడి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం (నేటి) సాయంత్రం నుంచి ఐదు రోజులపాటు తెరుచుకోనుంది. అన్ని వయసుల స్త్రీలను ఆలయంలోకి అనుమతించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ఇదే ప్రథమం. తీర్పుకు వ్యతిరేకంగా కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్వామియే శరణమయ్యప్ప అంటూ భజన చేస్తూ మహిళలు సహా అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లేందుకు ప్రధాన ద్వారమైన నిలక్కళ్ వద్దకు చేరి నిషేధిత వయస్సుల్లోని స్త్రీలను కొండ ఎక్కనివ్వకుండా అడ్డుకుంటున్నారు. పంబా బేస్ క్యాంప్ సమీపం నుంచే నిరసనకారులు 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి రాకుండా అడ్డగిస్తున్నారు. -
‘శబరిమల’ తీర్పుపై నిరసనల జోరు
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలనూ అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై కేరళలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పత్తనంమిట్ట జిల్లా పండాలం నుంచి గత వారం బీజేపీ నేతలు ప్రారంభించిన పాదయాత్ర 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సోమవారం తిరువనంతపురం చేరింది. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించగా.. బీజేపీ కార్యకర్తలు, భక్తులతోపాటు ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు అయ్యప్పస్వామి చిత్రాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని, కీర్తనలు ఆలపిస్తూ సెక్రటేరియట్ వద్దకు చేరుకున్నారు. ర్యాలీకి ముందు వరుసలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్ రావు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లైతోపాటు ఇటీవల ఆ పార్టీలో చేరిన నటుడు సురేష్ గోపీ, భారతీయ ధర్మ జన సేన అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లి ఉన్నారు. ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై 24 గంటల్లోగా స్పందించకుంటే నిరసనలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివిధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం కేరళ ప్రభుత్వానికి విషమ పరీక్షగా మారింది. మరోవైపు, శబరిమల ఆలయ ట్రావెన్కోర్ దేవస్వోమ్ బోర్డ్ మంగళవారం సమావేశం కానుంది. వార్షిక మండలమ్–మకరవిలక్కు యాత్ర ఏర్పాట్లతోపాటు సుప్రీంకోర్టు తీర్పుపైనా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. -
శబరిమల తీర్పు : ఆలయ కమిటీ భేటీ
తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం కోర్టు తీర్పు అనంతర పరిస్థితులు, వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న శబరిమల యాత్ర సీజన్ తదితర అంశాలపై చర్చించేందుకు ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు (టీడీబీ) సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఆయా అంశాలపై వివిధ వర్గాలతో చర్చలు జరిపేందుకు ఆలయ కమిటీ పండలం రాయల్ ఫ్యామిలీతో పాటు శబరిమల ఆలయ పూజారులు, పూజారుల సంఘ ప్రతినిధులు, హిందూ సంస్థల ప్రతినిధులను మంగళవారం జరిగే సమావేశానికి ఆహ్వానించింది. త్రివేండ్రంలోని దేవస్ధానం బోర్డు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ పేర్కొన్నారు. అన్ని వయసుల స్ర్తీలను ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తూ పలు హిందూ సంఘాలు, అయ్యప్ప భక్తుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ఈ సమావేశంలో అన్ని వర్గాలకు చెందిన ప్రతినిధులను బోర్డు ఆహ్వానించింది. మరోవైపు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయకుండా తీర్పును అమలు చేయాలని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతవారం పండలంలో బీజేపీ చేపట్టిన లాంగ్‌మార్చ్ ఆదివారం తిరువనంతపురం చేరుకుంది. సర్వోన్నత న్యాయస్ధాన ఉత్తర్వులను లెఫ్ట్ ప్రభుత్వం అమలుచేస్తే ఈనెల 18న కేరళలో హర్తాళ్ చేపట్టాలని అంతరాష్ర్టీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపు ఇచ్చారు. -
కొనసాగుతున్న శబరిమల నిరసనలు
తిరువనంతపురం/ముంబై: అన్ని వయస్సుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అయ్యప్ప భక్తులు కోచిలో భారీ ర్యాలీ తీశారు. మహారాష్ట్రలోనూ నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే.. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నట్లు మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ ప్రకటించారు. మహిళల ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమా, కాదా అన్న విషయాన్ని కాంగ్రెస్, బీజేపీలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కోచిలోని శివాలయం నుంచి భారీ సంఖ్యలో ర్యాలీగా బయలుదేరిన భక్తులు..అయ్యప్ప స్వామి ఫొటోల ప్లకార్డులను పట్టుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. వీరిలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. ముంబై, థానే, నవీ ముంబైలకు చెందిన అయ్యప్ప భక్తులు ఆజాద్ మైదాన్‌లో నిరసన ర్యాలీ తెలిపారు. శబరిమల ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతృత్వంలో ప్రారంభమైన ‘లాంగ్‌మార్చ్’ శనివారం కొల్లామ్ జిల్లాలోకి ప్రవేశించింది. ‘తృప్తి సవాల్ విసరడానికే శబరిమల వస్తున్నారు తప్ప భక్తురాలిగా కాదు. ఉద్రిక్తతలను సృష్టించ వద్దని ఆమెను కోరుతున్నా’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై అన్నారు. -
‘శబరిమల’ నిరసన హింసాత్మకం
తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. కేరళ దేవాదాయ మంత్రి కదంకపల్లి సురేంద్రన్ అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) గురువారం చేసిన యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. తొలుత ఆందోళనకారులు సురేంద్రన్ ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లను బద్ధలుకొట్టడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తొలుత జల ఫిరంగులు, బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. బీజేపీ, కాంగ్రెస్‌ల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజలకు తన వైఖరి తెలియజేయాలని సీపీఎంనేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకు పూర్వమే ఆరెస్సెస్ కోరింది.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని కోరుతూ 12 ఏళ్ల క్రితమే ఆరెస్సెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి సురేంద్రన్ అన్నారు. బీజేపీ తలపెట్టిన 5 రోజుల ‘లాంగ్‌మార్చ్’ను..అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చేపట్టిన రథయాత్రతో పోల్చారు. ‘లాంగ్‌మార్చ్‌ను చూస్తుంటే నాకు రథయాత్ర గుర్తుకొస్తోంది. అన్ని వయసున్న మహిళలకు శబరిమల ఆలయ ప్రవేశం కల్పించాలని ఆరెస్సెస్ 12 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నారు’ అని అన్నారు. మసీదుల్లోకి అనుమతించాలి.. శబరిమల తీర్పు స్ఫూర్తితో అన్ని మసీదుల్లోకి కూడా మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేరళకు చెందిన ముస్లిం మహిళా హక్కుల సంఘం నిసా యోచిస్తోంది. మహిళలను కేవలం ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించాలనే కాకుండా వారిని ఇమామ్‌లుగా కూడా నియమించాలని ఉద్యమించనుంది. -
మరింత ఉధృతమైన “సేవ్ శబరిమల” ఉద్యమం
-
శబరిమలపై అత్యవసర విచారణకు నో
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జడ్జీలు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ అయిన జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షులు శైలజా విజయన్ తరఫు లాయరు మాథ్యూస్ నెడుంపరా వాదనలు వినిపించారు. అయితే, సాధారణ పిటిషన్ల మాదిరిగా దీన్ని కూడా పరిగణిస్తామని దసరా సెలవుల తర్వాతే విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. -
‘శబరిమల’పై తక్షణ విచారణకు సుప్రీం నో
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్ర్తీలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం ఇటీవల వెల్లడించిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిర్థిష్ట సమయంలోనే రివ్యూ పిటిషన్లు విచారణకు వస్తాయని స్పష్టం చేసింది. శబరిమల తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను ఇప్పటికిప్పుడు విచారించలేమని తేల్చిచెప్పింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీం తీర్పును పలు మహిళా సంఘాలు స్వాగతించగా, హిందూ సంస్ధలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగా కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయబోమని, తీర్పును అమలు చేసేందుకు చర్యలు చేపడతామని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసేలా కొన్ని శక్తులు వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. -
కేరళ వ్యాప్తంగా కదం తొక్కిన మహిళాలోకం
-
తీర్పులు కాదు..సంప్రదాయాలే ముఖ్యం!
చెన్నై: శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా సంప్రదాయాలను ఉల్లంఘించలేమని హిందూ మహిళా భక్త సంఘాలు అంటున్నాయి. 50 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచిచూస్తామని, తర్వాతే ఆలయాన్ని దర్శిస్తామని సంఘాలు తేల్చాయి. చెన్నైలోని గంగాదీశ్వర ఆలయంలో శనివారం భారత్ హిందూ మున్నాని ఆధ్వర్యంలో ‘లైట్‌ల్యాంప్’ ప్రార్థనా సమావేశం జరిగింది. రుతుక్రమం ముగిసేదాకా(50 ఏళ్లు) శబరిమల ఆలయాన్ని సందర్శించమని ఈ సందర్భంగా మహిళా భక్తులు ప్రతినబూనారు. ‘కోర్టు తీర్పులు ఎలా వచ్చినా పురాతన సంప్రదాయాలను గౌరవిస్తాం. సంప్రదాయాలపై నమ్మకాన్ని చాటిచెప్పడానికే లైట్‌ల్యాంప్ ప్రార్థన నిర్వహించాం. విశ్వాసాల మేరకే శబరిమలను సందర్శించాలని మహిళా భక్తులు ప్రతినబూనారు’ అని హిందూ మక్కల్ కచ్చి చీఫ్ అర్జున్ సంపత్ చెప్పారు. -
‘శబరిమల’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ బుధవారం ముగిసింది. దీంతో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచింది. త్వరలోనే తీర్పును ప్రకటిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల లాయర్లు రాతపూర్వక వాదనలను సేకరించి వారంలోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. చివరి రోజు విచారణలో కేరళ ప్రభుత్వం తరఫు లాయర్ జయ్‌దీప్ గుప్తా వాదనలు వినిపించారు. శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యనున్న మహిళలు రాకుండా నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నారు. -
రాజ్యాంగానికి లోబడే మత విశ్వాసాలు
న్యూఢిల్లీ: ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం నిషేధించటం సహా మతాచారాలు, సంప్రదాయాలన్నీ రాజ్యాం గానికి లోబడే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని నిరాకరించటంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది. మహిళలపై నిషేధం మతాచారాల్లో కీలకమైందని ఆలయ నిర్వాహకులు నిరూపించుకోవాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ‘రాజ్యాంగానికి లోబడే ప్రతి అంశమూ ఉంటుంది. ఇందులోని మతస్వేచ్ఛ హక్కుకు సంబంధించిన 25, 26 ఆర్టికల్స్ ప్రకారం ప్రజారోగ్యం, సమాజ శాంతి, నైతిక సూత్రాలకు లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది. ఇక్కడ నైతికత అంటే రాజ్యాంగపరమైన నైతికతగా గుర్తించాలని తెలిపింది. పురుషాధిక్యాన్ని కొనసాగించేందుకే మహిళలకు ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారంది. అంతకుముందు శబరిమల ఆలయం ‘ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్’ తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి వాదనలు వినిపించారు. ‘వందల ఏళ్లుగా ప్రజల విశ్వాసాల ప్రకారమే ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధం స్వచ్ఛందంగా అమలవుతోంది. ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా పరిశీలించుకోవచ్చు’ అని అన్నారు. ‘దేశ వ్యాప్తంగా ఉన్న దర్గాలు, మసీదుల్లోకి కూడా మహిళలకు ప్రవేశం లేదు. కొన్ని ఆలయాల్లోకి పురుషులు ప్రవేశించేందుకు వీలులేదు. ఇటువంటి సంప్రదాయాలను, నమ్మకాలను పరీక్షించాలనుకోవటం కొత్త సమస్యలను తెచ్చి పెట్టినట్లవుతుంది’ అని అన్నారు. ‘ఏది అవసరమైన సంప్రదాయమో సుప్రీంకోర్టు నిర్ణయించగలదా? హిందూ మతంలోని ముఖ్యమైన అంశాన్ని న్యాయస్థానం ఒక పిల్ ద్వారా పరిష్కరించలేదు. ప్రతి మతంలోనూ పురుషాధిక్యమే నడుస్తోంది. ఇతర మతాల్లో మహిళలను పురుషులతో సమానంగా పరిగణించడం లేదు’ అని పేర్కొన్నారు. -
పురుషులనూ అనుమతించని ఆలయాలున్నాయి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని శబరిమల సంప్రదాయాన్ని సమర్ధిస్తూ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మంగళవారం సుప్రీం కోర్టుకు నివేదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించడంపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలో పురుషులు పూజలు నిర్వహిస్తే మహిళలనూ అందుకు అనుమతించాలని, మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పురుషులకు వర్తించినదే మహిళలకూ వర్తిస్తుందని సుప్రీం తేల్చిచెప్పింది. మహిళలు ప్రార్ధన చేసుకోవడానికి ఏ చట్టం అనుమతి అవసరం లేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని పలు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. -
మహిళలు కూడా దేవుడి సృష్టే
-
‘శబరిమల’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఆలయంలోకి పది నుంచి 50 సంవత్సరాల మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించిన అంశంపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్ధానం ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాతిపదికన మహిళలకు ప్రవేశాన్ని మీరు (ఆలయ అధికారులు) నిరాకరిస్తారు..? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..ప్రజల కోసం ఆలయాన్ని తెరిచారంటే ఎవరైనా అందులోకి వెళ్లవచ్చ’ని పేర్కొన్నారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. శబరిమల ఆలయంలో మహిళలను ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అని కేరళ మంత్రి కే సురేంద్రన్ పేర్కొన్నారు. తమ వైఖరిని స్పష్టం చేస్తూ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఇక సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు వెలువరించినా దాన్ని అంగీకరిస్తామన్నారు. గత ఏడాది అక్టోబర్ 13న ఈ పిటిషన్‌పై విచారణను సర్వోన్నత న్యాయస్ధానం రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. -
తెరుచుకోనున్న శబరిమల ఆలయం
శబరిమల: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం మంగళవారం తెరుచుకోనుంది. విషు పండగ నేపథ్యంలో ఆలయాన్ని పది రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాన అర్చకుడు ఏవీ ఉన్నికృష్ణన్ నంబూద్రి సమక్షంలో ఆలయాన్ని తెరుస్తారు. బుధవారం ఉదయం అష్టద్రవ్య గణపతి హోమం నిర్వహించి, అనంతరం భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు. ఈ నెల 15వ తేదీన ఆలయంలో విషుక్కాని దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు. రానున్న పది రోజులు ఆలయంలో సహస్ర కళషాభిషేకం, కళాభాభిషేకం, పుష్పాభిషేకం, పడిపూజ, అష్టాభిషేకం, ఉదయస్తమన పూజలను నిర్వహించనున్నారు. అదే విధంగా 15వ తేదీన ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయ్యప్ప దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు. -
శబరిమలలో అపశృతి
శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శబరిమలలోని నీలిమలైలో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో ఓ ఏనుగు పరుగులు తీసింది. దీంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దీంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులతో పాటు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఊరేగింపులో ఏనుగు పరుగులు తీయడంతో పైనున్న అయ్యప్పస్వామి విగ్రహం కింద పడిపోయింది. దీంతో అపచారంగా భావించిన ఆలయ పూజారులు పరిహార పూజలు నిర్వహించారు. -
టీడీబీ : ‘హరివరాసనం’లో చిన్నమార్పులు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి జోలపాటగా ప్రఖ్యాతిగాంచిన ‘హరివరాసనం’ అనే అష్టకంలో కొన్ని తప్పులను సరిదిద్దినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. మళయాళంలో అష్టకంగా పిలుచుకునే ఈ హరివరసానంలో శ్లోకాల్లో సంస్కృత పదాలు కొన్ని రూపాంతరం చెందడం, అసలుకే లేకపోవడం జరిగిందని.. టీడీబీ పేర్కొంది. వీటిని సరిదిద్ది మళ్లీ కొత్తగా రికార్డ్ చేసిన హరివరాసనం శ్లోకాలనే ఈ ఏడాది స్వామి వారికి జోలపాటగా వినిపిస్తామని బోర్డు తెలిపింది. దేశంలో పలువురు గాయకులు హరివరాసనం శ్లోకాలను ఆలపించినా.. కేజే ఏసుదాస్.. హరివరాసనంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన టీడీపీ అధ్యక్షుడు పద్మకుమార్ తెలిపారు. ప్రస్తుతం శ్లోకాల్లో అరివిమర్ధనం నిత్యనర్తనం అనే పాదంలో.. అరి విమర్ధనం అంటూ విడిగా ఉచ్ఛరించాలని ఆయన తెలిపారు. అరి అంటే శత్రువని, మర్ధనం అంటే నాశనం చేయడమనే అర్థం వస్తుందని చెప్పారు. ఏసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన రాగానే వీటిని సరిదిద్ది హరివరసానం శ్లోకాలను మళ్లీ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. -
శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలా? వద్దా?
-
శబరి ఆలయంలో యువతి!
తిరువనంతపురం: మహిళలకు ప్రవేశం లేని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఒక యువతి ఉండగా తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవాదాయ అధికారులకు ఆ ఫొటో నిష్పాక్షితను నిర్ధారించాలని ఆదేశించారు. మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై కొల్లాంకు చెందిన వ్యాపారవేత్త ఒకరు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధం. -
న్యూ ఇయర్ ఎఫెక్ట్: ప్రసాదంపై రూ.20 అదనం!
తిరువనంతపురం: నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ వారాంతం కావడంతో కుటుంబసమేతంగా భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే కేరళలో మాత్రం ఆలయ అధికారులు న్యూ ఇయర్ ఎఫెక్ట్ ను బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. ప్రసాదం ధరను ఏకంగా రూ.20 పెంచేసి భక్తులకు విక్రయిస్తున్నారు. నేటి ఉదయం నుంచి శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పంబ, శరన్, గుత్తి, అయ్యప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో అయ్యప్ప ప్రసాదానికి ఉన్న డిమాండ్ తో పాటు కొత్త సంవత్సరం తొలి రోజు ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల ఆలయాలలో అయ్యప్ప ప్రసాదానికి అదనంగా మరో ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చేసేదేం లేక ఆలయ అధికారులు పెంచిన నగదు చెల్లించి ప్రసాదాన్ని కొనుగోలు చేయడం ఆలయాలకు వస్తున్న భక్తుల వంతైంది. ఇదేం విడ్డూరమని కొందరు భక్తులు అనుకుంటున్నారు. -
'ఆమెను ఆలయంలోకి వెళ్లనీయం'
కొచ్చి: శబరిమల ఆలయంలోకి మహిళ హక్కుల కార్యకర్తలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. తృప్తి దేశాయ్ ను అడ్డుకుంటామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. 'శబరిమల ఆలయం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి ఆచారాలు, మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందే. మహిళలకు ఆలయ ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు సంప్రదాయ ఆచారాలు కొనసాగుతాయ'ని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్.. వెయ్యి మంది మహిళలతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
శబరిమల ఆలయం పేరు మారింది!
-
శబరిమల ఆలయం పేరు మారింది!
దేశ విదేశాల నుంచి ప్రతియేటా లక్షలాది సంఖ్యలో భక్తులు సందర్శించుకునే అయ్యప్ప ఆలయం పేరు మారింది. ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అని ఉన్న ఈ పేరును.. శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం అని మారుస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులు సోమవారం ప్రకటించారు. ఆలయం పేరు మార్పుపై పాలక మండలి అయిన ట్రావన్‌కోర్ దేవస్వోం బోర్డు ఉత్తర్వులు కూడా వెలువరించింది. అధికారిక రికార్డులలో ఈ ఆలయం పేరు ఇన్నాళ్లూ శబరిమల శ్రీ ధర్మ శస్త ఆలయం అనే ఉండేది. అక్టోబర్ 5వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో ఆలయం పేరు మార్చాలన్న నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. దేవస్వోం బోర్డు పరిధిలో చాలా ధర్మశస్త ఆలయాలు ఉన్నాయని, కానీ అయ్యప్పస్వామికి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం శబరిమల మాత్రమేనని, అందుకే ఈ ఆలయాన్ని ఆయన పేరుమీద పెట్టాలని నిర్ణయించామని బోర్డు అధికారులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక లాంటి దక్షిణాది రాష్ట్రాల నుంచి, ఇంకా దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు. సంక్రాంతి సమయంలో జరిగే జ్యోతి దర్శనానికి అయితే భక్తులు వెల్లువెత్తుతారు.