
ఊరేగింపులో ఏనుగు పరుగులు తీయడంతో పైనున్న అయ్యప్పస్వామి విగ్రహం కింద పడిపోయింది.
శబరిమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో శుక్రవారం అపశ్రుతి చోటు చేసుకుంది. అయ్యప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు శబరిమలలోని నీలిమలైలో ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఊరేగింపు కొనసాగుతున్న సమయంలో ఓ ఏనుగు పరుగులు తీసింది.
దీంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురై పరుగులు తీశారు. దీంతో తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులతో పాటు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఊరేగింపులో ఏనుగు పరుగులు తీయడంతో పైనున్న అయ్యప్పస్వామి విగ్రహం కింద పడిపోయింది. దీంతో అపచారంగా భావించిన ఆలయ పూజారులు పరిహార పూజలు నిర్వహించారు.