శబరిమల: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం మంగళవారం తెరుచుకోనుంది. విషు పండగ నేపథ్యంలో ఆలయాన్ని పది రోజుల పాటు తెరిచి ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాన అర్చకుడు ఏవీ ఉన్నికృష్ణన్ నంబూద్రి సమక్షంలో ఆలయాన్ని తెరుస్తారు. బుధవారం ఉదయం అష్టద్రవ్య గణపతి హోమం నిర్వహించి, అనంతరం భక్తులకు అయ్యప్ప దర్శనం కల్పిస్తారు.
ఈ నెల 15వ తేదీన ఆలయంలో విషుక్కాని దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు. రానున్న పది రోజులు ఆలయంలో సహస్ర కళషాభిషేకం, కళాభాభిషేకం, పుష్పాభిషేకం, పడిపూజ, అష్టాభిషేకం, ఉదయస్తమన పూజలను నిర్వహించనున్నారు. అదే విధంగా 15వ తేదీన ఉదయం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయ్యప్ప దర్శనం ఉంటుందని అర్చకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment