తిరువనంతపురం: మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప దేవాలయం తెరచుకుంది. ఈ సందర్భంగా అయిదు రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఈ పూజలకు భక్తులను సైతం అనుమతించనున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం దేవాలయం తెరచుకోగా, శనివారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు.
కాగా కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం మొదటిసారి శనివారం ఉదయం నుంచి అయ్యప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు.. కోవిడ్ టీకా రెండు డోస్‌లు వేసుకున్నవారు, ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. దర్శనానికి వచ్చే 48 నుంచి 72 గంటల ముందు చేయించుకున్న పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. ఐదు రోజుల పాటు ఆలయంలోకి భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. ఈనెల 21వ తేదీ వరకూ అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులను అనుమతిని ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment