
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని శబరిమల సంప్రదాయాన్ని సమర్ధిస్తూ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మంగళవారం సుప్రీం కోర్టుకు నివేదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించడంపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలో పురుషులు పూజలు నిర్వహిస్తే మహిళలనూ అందుకు అనుమతించాలని, మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
పురుషులకు వర్తించినదే మహిళలకూ వర్తిస్తుందని సుప్రీం తేల్చిచెప్పింది. మహిళలు ప్రార్ధన చేసుకోవడానికి ఏ చట్టం అనుమతి అవసరం లేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని పలు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment