Abhishek Manu Singhvi
-
రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎమ్మెల్యేలు బలపరచకపోవడంతో పద్మరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవమైంది. -
రాజ్యసభ అభ్యర్థిగా నేడు సింఘ్వి నామినేషన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటా రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో తన నామినేషన్ పత్రాలను రిటరి్నంగ్ అధికారికి అందజేస్తారని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా ఆదివారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎలీ్ప) సమావేశంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సింఘ్విని రేవంత్ పరిచయం చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు డి.శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు. సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సింఘ్వి వాదనలతో రాష్ట్రానికి ప్రయోజనం: సీఎం సీఎల్పీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునరి్వభజన చట్టం అమలులో అనేక రాజ్యాంగ, న్యాయ చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని, ఈ చట్టంలోని అంశాలపై చట్టసభలతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. అపరిష్కృత అంశాలపై వాదించేందుకు వీలుగా న్యాయ కోవిదుడు సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని కోరామని చెప్పారు. తన రాజ్యసభ సభ్యత్వానికి పెద్ద మనసుతో రాజీనామా చేసిన కేకే క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారని ప్రశంసించారు. త్వరలోనే రైతు కృతజ్ఞత సభ త్వరలోనే రైతు కృతజ్ఞత సభ ఉంటుందని సీఎం చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మా ట్లాడారు. ఈనెల 20న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనుకున్నా వీలు కాలేదని చెప్పారు. రైతు కృతజ్ఞత సభ,రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై త్వరలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి తేదీలు వెల్లడిస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సింఘ్వి ఒకరని, ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ హక్కులపై మాట్లాడుతూనే ఉంటా: సింఘ్విసింఘ్వి మాట్లాడుతూ తనను తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఏఐసీసీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. శంషాబాద్‌లో ఘన స్వాగతంసింఘ్వి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. సింఘ్వి అక్కడి నుంచి నేరుగా మాజీ ఎంపీ కె.కేశవరావు నివాసానికి వెళ్లారు. అక్కడ కొద్దిసేపు ఉన్న సింఘ్వి ఆ తర్వాత సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సింఘ్విని కలిసి కర్మన్‌ఘాట్ హనుమాన్ ప్రసాదాన్ని అందజేశారు. తర్వాత సింఘ్వి ప్రజాభవన్‌కు వచ్చారు. సింఘ్వి దంపతులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వాగతం పలికారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన సింఘ్వి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.మహిళా సాధికారతే లక్ష్యం: సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సాధికా రతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ మహిళలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. -
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీ
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.కాగా, తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు. Congress President Mallikarjun Kharge has approved the candidature of Abhishek Manu Singhvi as Congress candidate to contest the ensuing bye-election to Rajya Sabha from Telangana. pic.twitter.com/gj9EpkNENz— ANI (@ANI) August 14, 2024కాగా రాజ్యసభలో 12 స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు మూడో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఇక, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో, వారంతా రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో, ఒడిశాలో బీజేడీ ఎంపీ మమతా మొహంత తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ఆ స్థానాలకూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
ప్రియాంక.. పెయింటింగ్... రూ.2 కోట్లు
ముంబై: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో బలవంతంగా రూ.2 కోట్లకు కొనిపించారన్న వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. వీటిని కాంగ్రెస్ ఆదివారం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు ఆశ్చర్యకరమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మీడియాతో అన్నారు. ‘‘ఆర్థిక కుంభకోణంలో చిక్కిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? అలాంటి వ్యక్తి ఆరోపణలను కూడా కేంద్రం ఉత్సాహంగా ప్రోత్సహిస్తోందంటే కచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోసమే. ఇది రాజకీయ కక్షపూరిత చర్యే’’ అంటూ ధ్వజమెత్తారు. ఆరోపణలకు మద్దతుగా ఇప్పుడు జీవించి లేని అహ్మద్ పటేల్, మురళీ దేవరా పేర్లను తెలివిగా వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈడీకి రాణా చెప్పింది ఇదీ... రూ.5,000 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో రాణాకపూర్ సంచలన ఆరోపణలే చేశారు. ప్రియాంక గాంధీ దగ్గరున్న ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను రూ.2 కోట్లకు కొనాలంటూ కాంగ్రెస్ తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందన్నారు. ‘‘నాకస్సలు ఇష్టం లేకపోయినా అప్పటి కేంద్ర మంత్రి మురళీ దేవరా తదితరుల ఒత్తడి వల్ల కొనక తప్పలేదు. పెయింటింగ్ కొనకుంటే కాంగ్రెస్‌తో సంబంధాలు బాగుండబోవని దేవరా నన్ను పిలిచి మరీ హెచ్చరించారు. నాకు పద్మభూషణ్ అవార్డు కూడా రాదన్నారు. వాళ్ల ఒత్తిడి వల్లే రూ.2 కోట్లకు పెయింటింగ్‌ను కొన్నా. ఆ డబ్బుల్ని కాంగ్రెస్ చీఫ్‌సోనియాగాంధీకి న్యూయార్క్‌లో జరిగిన చికిత్స కోసం వాడినట్టు సోనియా ఆంతరంగికుడు అహ్మద్ పటేల్ తర్వాత నాకు స్వయంగా చెప్పారు’’ అని వెల్లడించారు. ప్రియాంకకు రాణా చెల్లించిన రూ.2 కోట్లు కూడా కుంభకోణం తాలూకు మొత్తమేనని ఈడీ భావిస్తోంది. ఈ కుంభకోణంలో రాణాకపూర్ తదితరులను 2020లో ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదంతంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ‘‘కాంగ్రెస్, గాంధీ కుటుంబం దోపిడి దారులు. వారి హయాంలో చివరికి పద్మ పురస్కారాలను కూడా అమ్ముకున్నారు’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. -
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ అరుదైన రికార్డు, ఎంపీ ప్రశంస
హీరో మాధవన్ కుమారుడు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. తన కృషితో కుటుంబంతో పాటు దేశం పేరును మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాడు వేదాంత్. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ ఓ ట్వీట్ చేశారు. చదవండి: యూట్యూబ్ ఛానళ్లకు మంచు విష్ణు హెచ్చరిక, అలా చేస్తే చర్యలు.. మాధవన్, వేదాంత్‌లు కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేస్తూ ‘గుడ్ జాబ్ వేదాంత్. నువ్వు దేశం గర్వించేలా చేశావు. నిన్ను చూసి గర్వపడుతున్నాం. అలాగే నీ పెంపకం చూసి కూడా’ అంటూ ఈ సందర్భంగ తండ్రి మాధవన్‌పై కూడా ప్రశంసలు కురిపించారు. కాగా బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్లో జరిగిన ఈ పోటీలో వేదాంత్ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే, 4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పథకాలు గెలుచుకున్నాడు. చదవండి: భార్యకు కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన నటుడు ఇదిలా ఉంటే వేదాంత్ సాధించిన ఘనతను ప్రశసింస్తూ పలువురు నెటిజన్లు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘16 ఏళ్ల వేదాంత దేశం కోసం పతకం సాధిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టయ్యాడు. డ్రగ్స్ కేసులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించారు. ఇప్పుడు ఆర్యన్ తరపు న్యాయవాదులు హైకోర్టులో అప్పీల్ చేయబోతున్నారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత మార్చిలో వేదాంత కాంస్య పతకాన్ని సాధించి తన తండ్రి గర్వపడేలా చేశాడు. లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్ ఈవెంట్లో వేదాంత్ పతకం సాధించాడు. మాధవన్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. Good job Vedant. We are proud of you and your upbringing. 🙏 pic.twitter.com/6SNVJI51w1 — Abhishek Singhvi (@DrAMSinghvi) October 24, 2021 -
‘పబ్జీ బ్యాన్.. యువత పరిస్థితి ఏంటీ..?’
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం చైనా యాప్స్ బ్యాన్పై మరోసారి దృష్టి సారించింది. ఈ క్రమంలో చైనాకు చెందిన మరో 47 యాప్స్‌ను కూడా బ్యాన్ చేస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇదిలా ఉండగా త్వరలో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీని కూడా బ్యాన్ చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న విషయం విదితమే. పబ్జీ బ్యాన్పై వినిపిస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ మను సింగ్వీ కేంద్రంపై వ్యంగ్యాస్తాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా స్పందించిన ఆయన.. ‘ప్రముఖ ఆన్లైన్ వీడియో గేమ్ అయిన పబ్జీని నిషేధించాలని కేంద్రలోని మోదీ ప్రభుత్వం కోరుకుంటోంది. కానీ ఒకవేళ యువత ఆడటం మానేస్తే.. వారు దేశంలోని నిరుద్యోగ వంటి వాస్తవాల గురించి ప్రశ్నిస్తారు. ఇది మరింత తీవ్ర సమస్య అవుతోందని కేంద్రం గ్రహించింది’. అని అభిషేక్ మను సింగ్వీ పేర్కొన్నారు. (పబ్జీ పోయినా ఈ గేమ్స్ ఉన్నాయిగా... ) మరోవైపు కరోనా కారణంగా ఏర్పడిన సంకక్షోభంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి పరిస్థితి ఎంటనీ కేంద్రాన్ని ప్రశ్నించారు. కాగా గతంలో బ్యాన్ చేసిన చైనాకు చెందిన 59 యాప్స్‌కు క్లోన్‌గా ఉన్నందున ఈ 47 మాప్స్‌ను బ్యాన్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. వినియోగదారుల గోప్యత, జాతీయ భద్రత నియమాలను ఈ యాప్స్ ఉల్లంఘిస్తున్నయన్న నేపథ్యంలో వీటిని బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం మరో 250కు పైగా యాప్స్ పై నిఘా పెట్టిందని, అయితే ఈ జాబితాలో పబ్జీ కూడా ఉన్నట్లు సమాచారం అందగా దీనిపై ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. (పబ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..) -
నేపాల్ ప్రధానికి మతి భ్రమించింది : అభిషేక్ సింగ్వి
ఢిల్లీ : రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లోనే ఉందని, శ్రీరాముడు నేపాల్ దేశస్తుడంటూ ప్రకటించిన నేపాల్ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎం ఓలి కి మతి భ్రమించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింగ్వి ఫైర్ అయ్యారు. చైనా ప్రధాని ఆదేశాల మేరకే ఓలీ ఇలాంటి నీతిమాలిన ఆరోణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. గతంలోనూ భారత భూభాగంలోని లిపులెఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ ప్రధాని ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పడు రాముడు నేపాలీ దేశస్తుడంటూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. (శ్రీరాముడు నేపాలీ.. అయోధ్య ఇక్కడే ఉంది! ) సోమవారం ఓ మీడియాతో ఓలీ మాట్లాడుతూ.. సాంస్కృతికంగా మేం అణచివేతకు గురయ్యాం. వాస్తవాలు మరుగునపడ్డాయి. మా సీతకు భారతీయ యువరాజు రాముడితో వివాహం అయిందని మేం నమ్ముతున్నాం. అయితే, అప్పటి అయోధ్య భారత్‌లో లేదు. అది నేపాల్‌లోని బిర్గుంజ్ దగ్గర్లో గ్రామం. భారత్‌లో ఇప్పుడున్న అయోధ్య కల్పితం’అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎలాంటి కమ్యూనికేషన్ లేని కాలంలో సీతను వివాహం చేసుకోవడానికి రాముడు జనక్‌పూర్‌కు ఎలా వచ్చాడంటూ ప్రశ్నించారు. ప్రస్తుత భారతదేశంలోని ఆయోధ్య నుంచి రాముడు జనక్‌పూర్‌కు రావడం అసాధ్యమంటూ పేర్కొన్నాడు. అయితే నేపాల్ కొత్త రాజకీయ మ్యాప్‌ను ప్రచురించడంతో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్న సమయంలో ఓలి ఈ విషయం తెరపైకి తేవడం గమనార్హం. తనను పదవీచ్యుతుడిని చేసేందుకు భారత్ ప్రోద్బలంతో ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆయన ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. #Oli #NepalPM seems 2hv lost his mental balance or is puppet &parrot like mouthing lines scripted by desperate #Chinese. 1st he claimed territories never earlier claimed by #Nepal. Now he relocates #Ram #Sita #Ayodhya & #RamRajya a few hundred miles from Ayodhya inside Nepal! — Abhishek Singhvi (@DrAMSinghvi) July 14, 2020 -
5 లక్షలకు చేరువలో..
న్యూఢిల్లీ : దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఒకే రోజు అత్యధికంగా 17,296 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరుకుంది. మొత్తం కేసుల్లో సగానికి పైగా 10 నగరాలు, జిల్లాల నుంచే వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీ, చెన్నై, థానే, ముంబై, పాల్గఢ్, పుణె, హైదరాబాద్, రంగారెడ్డి, అహ్మదాబాద్, ఫరీదాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో 54.47 శాతం జూన్ 19 నుంచి 25 మధ్య నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 407 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 15,301కి చేరుకుంది. రికవరీ రేటు 58 శాతానికి పెరగడం ఊరటనిస్తోందని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. కరోనాకూ రాజధానే కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ విలవిల్లాడుతోంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఢిల్లీలో 3,390 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ముంబైని మించిపోయి 73,780కి చేరుకున్నాయి. ముంబైలో ఏప్రిల్ నెలలో విపరీతంగా కేసులు నమోదైతే , ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. గత కొన్నాళ్లుగా ప్రతీరోజూ వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. కరోనా కేసులు ఢిల్లీలో 12 రోజుల్లోనే రెట్టింపైతే, ముంబైలో 40 రోజులకి, చెన్నైలో 19 రోజులకి డబుల్ అయ్యాయి. జూన్ 24 నాటికి ముంబైలో మరణాల రేటు 5.7%గా ఉంటే ఢిల్లీలో 3.36%, చెన్నైలో 1.46%గా ఉంది. కాంగ్రెస్ నేత అభిషేక్‌కు కరోనా కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మనుసింఘ్వీకి కరోనా సోకింది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టుగా ఆయన సన్నిహితులు శుక్రవారం వెల్లడించారు. ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కోవిడ్ పరీక్షలకు వెళ్లారు. సింఘ్వీ భార్యకు కూడా కోవిడ్–19 సోకింది. గువాహటిలో 14 రోజుల లాక్డౌన్ కోవిడ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతూ ఉండడంతో గువాహటి జిల్లాలోని కామ్రూప్ (మెట్రో)లో జూన్ 28 అర్ధరాత్రి నుంచి 14 రోజుల పాటు లాక్డౌన్ అమల్లోకి రానుందని అస్సాం ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట 12 గంటల పాటు కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. కరోనా ఆస్పత్రిగా మసీదు దేశంపై కరోనా పంజా విసిరిన వేళ ముస్లింలు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీలోని శాంతి నగర్ ప్రాంతంలో మసీదుని కోవిడ్ రోగులకు చికిత్సనందించడానికి వీలుగా మార్చారు. ఆక్సిజన్ సిలండర్లు, ఇతర వైద్య పరికరాలతో 5 పడకలను ఏర్పాటు చేయడమే కాదు, స్వల్ప లక్షణాలున్న వారికి 70 మంది వరకు చికిత్స చేసేలా సదుపాయాలు కల్పించారు. మతంతో ప్రసక్తి లేకుండా ఎవరు వచ్చినా చికిత్స అందిస్తామని మసీదుని నిర్వహిస్తున్న జమాత్–ఏ–ఇస్లామీ హింద్ ప్రతినిధులు స్పష్టం చేశారు. భివాండీ మున్సిపాల్టీలో 1,332 కేసులు నమోదైతే మృతుల రేటు 5.26 శాతంగా ఉంది. -
మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి కరోనా వైరస్ బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు సమాచారం. ఆయన కార్యాలయంలో పనిచేసే వారందరికి కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంతక ముందు సీనియర్ కాంగ్రెస్ నేత సంజయ్ ఝ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ కూడా కరోనా వైరస్ సోకడంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ప్లాస్మా థెరపీ చికిత్స చేశారు. శుక్రవారం ఆయనను మరోసారి పరీక్షించగా కరోనా నెగిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను డిశార్జ్ చేయనున్నారు. (మాజీ ఎంపీ వీహెచ్‌కు కరోనా పాజిటివ్) -
‘బస్సుల్లో తరలిస్తే మూడేళ్లు పడుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : వలస కార్మికుల తరలింపునకు లాక్డౌన్ ముగుస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అనుమతించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రణాళిక లేకుండా లాక్డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా లక్షలాది వలస కార్మికులు చిక్కుకుపోయారని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి స్వస్థలాలకు రైళ్లలో తరలించడం మేలని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి అన్నారు. వివిధ రాష్ట్రాల్లో లక్షలాది మంది వలస కూలీలు చిక్కుకుపోయారని వారిని బస్సుల్లో తరలిస్తే ఈ ప్రక్రియ మూడేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. లాక్డౌన్ విధించిన 40 రోజుల తర్వాత వలస కూలీల తరలింపునకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయడం తుగ్లక్ చర్యని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం ఏం చేసిందని ఆయన నిలదీశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రోజున కేంద్రం ప్రభుత్వం మాత్రం వారి సంక్షేమాన్ని విస్మరించి చేతులు దులుపుకున్నట్టుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే 25 లక్షల మంది బిహారీ వలస కూలీలు చిక్కుకుపోయారని, రాజస్ధాన్‌లో 2.5 లక్షల మంది, కేరళలో 4 లక్షల మంది, పంజాబ్‌లో 4 లక్షల మంది, ఒడిషా 7 లక్షలు, అసోంలో 1.5 లక్షల మంది వలస కూలీలు చిక్కుకుపోయారని వార్తలు వచ్చాయని సింఘ్వీ అన్నారు. వీరి తరలింపు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు విడిచిపెట్టిందని, వాటికి ఎలాంటి నిధులూ విడుదల చేయలేదని విమర్శించారు. చదవండి : కరోనా విపత్తు: భారీ ఉపశమనం -
‘ఇది అప్రకటిత ఎమర్జెన్సీ’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని భగ్గుమంటున్నక్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీయేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో పలుచోట్ల 144 సెక్షన్ విధించడం, 18 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజధానిలో ఎర్రకోట చుట్టూ 144 సెక్షన్ విధించారు, నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు. 18 మెట్రో స్టేషన్లు మూసివేశారు..ఇంటర్నెట్ను నిలిపివేశారు..కర్ణాటకలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..యూపీ, అసోంలో ఇదే తరహా దమనకాండ కొనసాగుతోంద’ని సింఘ్వి అన్నారు. డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్ మాకేన్, సందీప్ దీక్షిత్, యోగేంద్ర యాదవ్,ఉమర్ ఖలీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇది బీజేపీ పాలన కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని దుయ్యబట్టారు. మనుషులను పీక్కుతినేలా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు. బీజేపీపై దీదీ ఫైర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో బీజేపీ శాంతిని భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే శుక్రవారం రోజు అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కార్యకర్తలు ముస్లింలు ధరించే టోపీలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఓ వర్గాన్ని అప్రతిష్టకు గురిచేసేందుకు ఈ టోపీలు ధరించి బీజేపీ కార్యకర్తలు ఆస్తులను ధ్వంసం చేసే ఆలోచన చేస్తున్నారని హెచ్చరించారు. పౌర చట్టాన్ని హిందువులు, ముస్లింల మధ్య పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోందని దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం..మీరు ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. 1980లో పుట్టిన బీజేపీ 1970 నాటి మన పౌరసత్వ పత్రాలను అడుగుతోందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. -
‘పవార్జీ...మీరు చాలా గ్రేట్’
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం తోడ్పాటుతో దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ ఇంకా షాక్‌లోనే ఉంది. ఇది ఫేక్‌న్యూస్‌గా తాను భావించానని, ఏమైనా తమ పార్టీ, ఎన్సీపీ, శివసేనల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగడమే దీనికి కారణమని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి అన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై తమ త్రైపాక్షిక (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) చర్చలు మూడు రోజులకు పైగా జరిగి ఉండాల్సింది కాదని..ఈలోగా ప్రత్యర్ధులు పావులు కదిపారని పవార్జీ మీరు చాలా గొప్పవారు అంటూ సింఘ్వీ ట్వీట్ చేశారు. చర్చలను ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణి అవలంభించారని శరద్ పవార్‌పై సింఘ్వీ సెటైర్లు వేశారు. మరోవైపు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా స్పందిస్తూ ఇది ప్రజా తీర్పును వంచించడమేనని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. రాత్రికి రాత్రి వేగంగా చోటుచేసుకున్న పరిణామాలతో ఎన్సీపీ చీలిక వర్గం మద్దతుతో శనివారం ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా, అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఆర్బీఐని సర్కారు ఎందుకు ఆదేశించదు?
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను బయటపెట్టాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. బ్యాంకుల వార్షిక తనిఖీ నివేదికలను, ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు అప్పులు ఎగ్గొడుతున్నవారి పేర్లను బయటపెట్టాల్సిందిగా ఆర్బీఐని కేంద్రం ఆదేశించాలని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ చెప్పారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా కోరితే ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు 2015లోనే ఆర్బీఐని ఆదేశించింది. ఈ అంశంపై తాజాగా సింఘ్వీ మాట్లాడుతూ ఎవరి పేర్లను దాచాలని ఆర్బీఐ ప్రయత్నిస్తోందనీ, ఎవరి ఆదేశాలతో ఇలా జరుగుతోందని ప్రశ్నించారు. వివరాలు వెల్లడించాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉన్నందున వెంటనే కేంద్రం ఆ పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
సిగ్గుంటే సీవీసీని తొలగించండి: సింఘ్వీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రమైనా సిగ్గు అనేది ఉంటే వెంటనే కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆదివారం డిమాండ్ చేసింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో విచారణ నుంచి తప్పించుకునేందుకు కేంద్ర సీవీసీని కీలుబొమ్మగా వాడుకుంటోందని ఆరోపించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ ‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంలో ప్రభుత్వానికి భాగస్వామిగా ఉన్న సీవీసీని పదవి నుంచి తొలగించాలి. అతను కచ్చితంగా వెళ్లిపోవాలి. ఆయనే రాజీనామా చేస్తారో లేక ప్రభుత్వం సాగనంపుతుందో, ఆయన కచ్చితంగా వెళ్లిపోవాలి. ప్రధానికి లేదా ఆయన ప్రభుత్వానికి కనీసం కొంచెమైనా సిగ్గు మిగిలి ఉంటే, సీవీసీ బర్తరఫ్ అవ్వాలి. ఆయనను తొలగించాలి లేదా సీవీసీయే రాజీనామా చేయాలి’అని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సీవీసీ సిఫారసుల మేరకు సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తొలగించడం తెలిసిందే. రఫేల్‌పై విచారణను తప్పించుకునేందుకే సీవీసీని కేంద్రం కీలుబొమ్మగా మార్చుకుందని సింఘ్వీ అన్నారు. ‘సీబీఐ కేంద్రం పంజరంలోని చిలక అని మనం ఇప్పటివరకు విన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కొత్తగా ‘నిఘా’ బానిసగా ఉంటున్న వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అంబాసిడర్‌గా, అస్థానా తరఫున సంప్రదింపులు చేసే వ్యక్తిలా సీవీసీ వ్యవహరించారు. ప్రభుత్వ కుట్రలను అమలు చేసే ఏజెంట్లా కూడా ఆయన ప్రవర్తించారు. ప్రజాప్రయోజనార్థం తాను నిఘా పెట్టాలన్న విషయాన్ని మరిచి, రాజకీయ నేతల నిఘా కీలుబొమ్మగా ఆయన మారారు’ అని అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. -
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి.
-
‘తెలంగాణలో 38లక్షల నకిలీ ఓట్లు’
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేసి అనంతరం తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఓటర్ల జాబితాలో ఉద్దేశపూర్వక మోసాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు కోరుకుంటున్నారని విమర్శించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ తెలంగాణలో దాదాపు 70 లక్షలకు పైగా ఓట్లపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో 38 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో చాలా అవకతవకలు జరిగాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 లక్షల ఓట్లు తీసేశారు. దీనిపై ఇప్పటికే చాలాసార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. అయినా ఎలాంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల 18 లక్షల ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 17లక్షల ఓట్లు తీసేశారు. ఖమ్మంలోని కొంతభాగం ఏపీలో కలిసింది. ఆ ప్రాంతంలోని ఓట్ల జాబితాపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. మొత్తం ఓటర్ల జాబితాలో 20 శాతం తప్పులున్నాయి. వీటిని సరిచేయకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తార’ని ఆయన ప్రశ్నించారు. -
మీకెందుకు అనవసరంగా ఇబ్బందులు?
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగత ఓటరు కోసం ఉద్దేశించిన నోటాను రాజ్యసభ ఎన్నికల్లోనూ వినియోగించడంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నోటా వినియోగాన్ని ప్రశ్నిస్తూ గుజరాత్ మాజీ కాంగ్రెస్ చీఫ్ శైలేశ్ పర్మార్ వేసిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీకి ఈ ప్రశ్న వేసింది. ‘ఓ రాజ్యాంగబద్ధమైన సంస్థ.. రాజ్యాంగవ్యతిరేక చర్యలో ఎందుకు భాగస్వామి కావాలి? రాజ్యభ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే ఓటేయకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఆ వ్యక్తి ఓటేయకుండా మీరు (ఈసీ) ఎలా ప్రోత్సహిస్తారు. ఓటు వేయాలా వద్ద అనేది సభ్యుడి విచక్షణ. ఎన్నికల సంఘం నోటా ఆప్షన్ ఇవ్వకూడదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగ బ్యాలట్ ఓటింగ్ ద్వారా అవినీతికి జరకుండా క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా చేయవచ్చు. మీరెందుకు అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు’ అని పేర్కొంది. దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా.. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉండాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ‘ఓ పార్టీ మరో పార్టీతో ముందుస్తు అవగాహన ఆధారంగా ఓటు వేస్తుంది. పార్టీ విప్ జారీ చేస్తే ఎమ్మెల్యే కట్టుబడి ఉండాల్సిందే. అలాంటప్పుడు నోటాకు అర్థమేముంద’ ని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు కూడా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. -
పురుషులనూ అనుమతించని ఆలయాలున్నాయి..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలూ ఉన్నాయని శబరిమల సంప్రదాయాన్ని సమర్ధిస్తూ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి మంగళవారం సుప్రీం కోర్టుకు నివేదించారు. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశాన్ని నిరోధించడంపై దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానంలో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలో పురుషులు పూజలు నిర్వహిస్తే మహిళలనూ అందుకు అనుమతించాలని, మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పురుషులకు వర్తించినదే మహిళలకూ వర్తిస్తుందని సుప్రీం తేల్చిచెప్పింది. మహిళలు ప్రార్ధన చేసుకోవడానికి ఏ చట్టం అనుమతి అవసరం లేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని కోర్టు పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని పలు మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. -
ఆలయ నిబంధన అసంబద్ధం: సుప్రీం
న్యూఢిల్లీ: 41 రోజుల పాటు ఐహిక వాంఛలకు దూరంగా ఉండి, అనంతరం శబరిమల ఆలయాన్ని దర్శించాల న్న నిబంధన అసాధ్యమైన, ఆచరణ సాధ్యం కానిదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న నిబంధనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం వాదనలు కొనసాగాయి. ‘కేవలం 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళలకు మినహాయించి.. ఈ దేవాలయంలోకి అన్ని కులాలు, మతాల వారికి ప్రవేశం ఉంది. ఈ ఆలయ సందర్శనకు ముందు 41 రోజుల పాటు పవిత్రంగా, ఐహిక వాంఛలకు దూరంగా ఉండటం మహిళలకు సాధ్యంకాకపోవడమే వారిని అనుమతించకపోవడానికి కారణం’ అని ధర్మాసనానికి దేవస్థానం తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ తెలిపారు. -
శబరిమలలో మహిళల నిరోధం అందుకే..
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల ఆలయంలోకి పురుషుల తరహాలో మహిళలూ వెళ్లి పూజలు చేయవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రావన్‌కోర్ దేవస్ధానం బోర్డు గురువారం స్పందించింది. ఈ ఆలయంలో స్వామి విశిష్టత ఆధారంగానే రుతుక్రమం ఉన్న మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్నామని స్పష్టం చేసింది. దైవం స్వాభావిక విశిష్టత, ఆలయ చరిత్ర కారణంగానే అలాంటి మహిళలను ఆలయంలోపలికి అనుమతించడం లేదని దేవస్ధానం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీం కోర్టుకు నివేదించారు. శబరిమల అయ్యప్ప బ్రహ్మచారి కావడంతోనే ఆలయంలో ఈ పద్ధతి అనుసరిస్తున్నారని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ వాదించారు. ఇతర అయ్యప్ప దేవవాలయాల్లో మహిళలను లోపలికి అనుమతిస్తున్నారని వివరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా కలుగచేసుకుని వారికి (మహిళలు) శబరిమల ఆలయంపైనే విశ్వాసం ఉండవచ్చని, దేశంలో ఎన్నో జగన్నాధ్ ఆలయాలున్నా పూరీ జగన్నాధ ఆలయానికే భక్తులు పోటెత్తుతుండటాన్ని ప్రస్తావించారు. శబరిమల దైవంపై మహిళలకు విశ్వాసం ఉంటే ఆలయ సంప్రదాయాలను, పద్ధతులను వారు గౌరవించాలని సింఘ్వీ వాదించారు. ఈ క్రమంలో మతపరంగా అనుసరించే పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండవచ్చా అని సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. -
అసత్యాలు ప్రచారం చేస్తే.. డిఫమేషన్ వేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాం నేపథ్యంలో బీజీపీ, కాంగ్రెస్ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. యూపీఏ హయాంలోనే జరిగిందనీ ఈ ఉంభకోణం బీజేపీ వాదిస్తుండగా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బీజీపీ వత్తాసు వుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ తాజా వ్యాఖ్యలపై సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి మండిపడ్డారు. ముఖ్యంగా పీఎన్బీ మెగా స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అంతేకాదు నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి,నీరవ్ మోదీతో ఎలాంటి సంబంధాలు లేవనీ, నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర , క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో అయిదేళ్ల క్రితం నీరవ్ మోదీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు చెప్పుకొచ్చారు. కాగా కాంగ్రెస్ అభిషేక్ మను సింఘ్వి భార్యకు నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో షేర్లు ఉన్నాయంటూ నిర్మలా సీతారామన్ శనివారం తీవ్ర ఆరోపణలు చేశారు. -
‘ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు’
న్యూఢిల్లీ: మహిళలపై కేరళ పీసీసీ తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హాసన్ పై కాంగ్రెస్ హైకమాండ్ గుర్రుగా ఉంది. హాసన్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మాను సింగ్వి అన్నారు. హాసన్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీకి ఆపాదించి గందరగోళం సృష్టించొద్దని అన్నారు. మహిళల పట్ల తమ పార్టీకి అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించరాదని ఎంఎం హాసన్ వ్యాఖ్యానించడంతో వివాదం రేగింది. దీంతో హాసన్ పదవికి ముప్పు తప్పదని ప్రచారం జరుగుతోంది. అనారోగ్య కారణాలతో కేరళ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సుధీరన్ తప్పుకోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా హాసన్ వ్యవహరిస్తున్నారు. -
పారికర్ రెండురోజుల ముఖ్యమంత్రే!
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యాబలం తమకు ఉందని, ఈ నేపథ్యంలో పారికర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. మంగళవారం యథాతథంగా పారికర్ ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పింది. గురువారం గోవా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి ఎవరికీ మెజారిటీ ఉందో తేల్చాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించిన ఆ పార్టీ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా పారికర్ మురిపెం రెండురోజులేనని ఆయన తేల్చేశారు. బలపరీక్షలో బీజేపీ విజయం సాధించలేదని, అప్పుడు కమలనాథుల సర్కారు దిగిపోకతప్పదని అన్నారు. సీఎం పారికర్ రెండురోజులే కొనసాగుతారని ఆయన జోస్యం చెప్పారు. -
మోదీది హిట్ వికెట్ మరియు సెల్ఫ్ గోల్
-
గెలుస్తామన్న ఆశ ఏమాత్రం లేదు: సింఘ్వీ
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. గతంలో గెలిచిన స్థానాల్లోని 164 చోట్ల ఇప్పటికి అది వెనకంజలో ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 69 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. మరోవైపు విజయం దిశగా దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి 318 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఎన్డీయే బలం గతం కంటే దాదాపు 178 వరకు పెరిగింది. ఇతరులు కూడా 152 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తున్నారు. యూపీఏ కూటమి మొత్తానికి కలిపి కేవలం 68 స్థానాల్లోనే ఆధిక్యం కనిపిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తదితరులు కాంగ్రెస్ ఓటమిని అంగీకరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఘోర పరాజయం లాగే కనిపిస్తోందని సింఘ్వీ స్వయంగా చెప్పారు. తమకు ఏమాత్రం ఆశ కనిపించడంలేదని ఆయన అన్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సోనియాగాంధీ విలేకరుల సమావేశం నిర్వహించి తమ ఓటమిని స్వయంగా అంగీకరించే అవకాశం కనిపిస్తోంది.