
పారికర్ రెండురోజుల ముఖ్యమంత్రే!
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యాబలం తమకు ఉందని, ఈ నేపథ్యంలో పారికర్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే, ఆ పార్టీ అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. మంగళవారం యథాతథంగా పారికర్ ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పింది. గురువారం గోవా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి ఎవరికీ మెజారిటీ ఉందో తేల్చాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరఫున వాదనలు వినిపించిన ఆ పార్టీ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రిగా పారికర్ మురిపెం రెండురోజులేనని ఆయన తేల్చేశారు. బలపరీక్షలో బీజేపీ విజయం సాధించలేదని, అప్పుడు కమలనాథుల సర్కారు దిగిపోకతప్పదని అన్నారు. సీఎం పారికర్ రెండురోజులే కొనసాగుతారని ఆయన జోస్యం చెప్పారు.