Goa CM
-
సీబీఐ చేతికి సోనాలి ఫోగట్ మృతి కేసు?
గోవా: హరియాణా బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటం లేదు. మృతికి కొద్ది గంటల ముందు జరిగిన సంఘటనలకు సంబంధించిన పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైతే సోనాలి మృతి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తామని తెలిపారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌తో ఫోగట్ కుటుంబ సభ్యులు కలిసిన తర్వాత ఈ మేరకు వెల్లడించారు సీఎం. ‘హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నాతో మాట్లాడారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆయను కలిసి సీబీఐ దర్యాప్తు జరపాలని కోరిన క్రమంలో.. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగిస్తాం.’ అని తెలిపారు ప్రమోద్ సావంత్. సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హరియాణా ముఖ్యమంత్రి ఖట్టర్‌ను శనివారం కలిశారు. నటి మృతి కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. అనంతరం.. సీబీఐ దర్యాప్తు కోసం గోవా ప్రభుత్వానికి లేఖ రాస్తామని హరియాణా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోకరి అరెస్ట్.. సోనాలి ఫోగట్ మృతి కేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్ట్ చేశారు గోవా పోలీసులు. నిందితులు సోనాలి వెళ్లిన క్లబ్ యజమాని, డ్రగ్ డీలర్ దత్తప్రసాద్ గోయంకర్, ఎడ్విన్ నన్స్‌గా తెలిపారు. తాజాగా ఆదివారం మరో డ్రగ్స్ సరఫరాదారుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదీ చదవండి: సోనాలి ఫోగట్‌ను ఎవరు చంపారో తేల్చాలి.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కావొద్దు -
లాక్డౌన్ పొడిగింపు తప్పదన్న సీఎం
పనాజీ : కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. మే 31తో ముగిసే లాక్‌డౌన్‌ను 15 రోజులు పొడిగించాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఫోన్లో కోరానని చెప్పారు. అయితే లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వాలని సూచించారు. రెస్టారెంట్లను 50 శాతం సీట్లతో భౌతిక దూరం పాటిస్తూ అనుమతించాలని కోరారు. జిమ్‌లను కూడా తెరవాలని పలువురు కోరుతున్నారని గోవా సీఎం చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు పొడిగించడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,000కు చేరింది. చదవండి : హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!? -
అమిత్‌షాతో గోవా సీఎం భేటీ
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలతో గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. గోవా అసెంబ్లీలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ 17 స్థానాలను, కాంగ్రెస్ 15 స్థానాలను గెలుచుకున్నాయి. గోవా ఫార్వర్డ్ పార్టీ సహా పలు స్వతంత్రుల మద్దతుతో కూటమిగా ఏర్పడి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో కూటమి పార్టీల మద్దతు అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకుంది. అభివృద్ధి కోసమే బీజేపీలోకి.. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే బీజేపీలో చేరామని చంద్రకాంత్ కవ్లేకర్ వెల్లడించారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉంటే తమ ప్రాంతాల అభివృద్ధి అసాధ్యమని ఆరోపించారు. -
సీఎం ఔదార్యానికి ఫిదా..
పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.30 గంటలకు గోవాకు బయలుదేరాల్పిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు తీవ్ర జాప్యమైంది. ఆ విమానం తెల్లవారుజామున 3. 30 గంటలకు గమ్యస్ధానం చేరుకుంది. విమానం గోవాకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ విమానంలో గోవా ఫార్వర్డు పార్టీ నాయకుడు కేతన్ భాటికర్ కూడా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గోవా ముఖ్యమంత్రికి కేతన్ భాటికర్ విమాన అలస్యం విషయం గురించి రాత్రి 1.13 గంటలకు ఫోన్లో వివరించారు. సీఎం ప్రమోద్ వెంటనే స్పందించి ప్రయాణీకులకు భోజనాలు సమకూర్చారు. తర్వాత రాత్రి 1.27 గంటలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరో 30 నిమిషాల్లో విమానం బయలుదేరుతుందని సమాచారం అందించారని భాటికర్ తెలిపారు. గోవా సీఎం స్పందించిన తీరు పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. -
పరీక్షలో నెగ్గిన సావంత్
పణజి: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 20 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 15 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 40 మంది కాగా.. ప్రస్తుతం అసెంబ్లీలో 36 మంది ఉన్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించగా, మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో నెగ్గిన అనంతరం సావంత్ మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉండాలి అనే పారికర్ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోవాలని కోరారు. విశ్వాస పరీక్ష కోసం గవర్నర్‌మృదులా సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. 11 మంది బీజేపీ, ముగ్గురు చొప్పున గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. 14 మంది కాంగ్రెస్, ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఓటేశారు. -
నేడు గోవా సర్కార్‌కు ‘పరీక్ష’
పణజీ: గోవాలో ఆదివారం రాత్రి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ అనూహ్యంగా సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు కొత్త ముఖ్యమంత్రిగా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం బుధవారమే అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఇందుకోసం గవర్నర్ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేశారని ఓ అధికారి తెలిపారు. విశ్వాసపరీక్షలో తామే నెగ్గుతామని సీఎం సావంత్ చెప్పారు. గోవా అసెంబ్లీలో మొత్తం స్థానాలు 40 కాగా, ప్రస్తుత సభ్యుల సంఖ్య 36. ఇక కొత్త ప్రభుత్వానికి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. తాజా లెక్కల ప్రకారం బీజేపీకి సొంతంగా 12 మంది, ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు ఈ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. నాటకీయ పరిణామాల నడుమ అంతకుముందు సోమవారం సాయంత్రం నుంచి గోవాలో బీజేపీ, దాని మిత్ర పక్షాల మధ్య చర్చలు, నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. అనేక దఫాల చర్చల అనంతరం ఎట్టకేలకు అర్ధరాత్రి 2 గంటలకు ప్రమోద్ సావంత్ చేత గవర్నర్ మృదులా సిన్హా కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వారినే కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు. గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతుండటం తెలిసిందే. అమిత్ షా, గడ్కరీ చాణక్యం కొత్త సీఎంగా ఎవరు ఉండాలనే దానిపై బీజేపీ, మిత్ర పక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రాలేదు. చివరకు బీజేపీకి సీఎం పదవి, ఎంజీపీ, జీఎఫ్‌పీలకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. జీఎఫ్‌పీకి చెందిన విజయ్‌సర్దేశాయ్, ఎంజీపీ ఎమ్మెల్యే సుదీన్ ధవలికర్‌లకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుంది. దీంతో రాత్రి 11 గంటలకే ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత బీజేపీ ప్రకటించినా ఇంకా చర్చలు జరుగుతున్నాయంటూ మళ్లీ వాయిదా వేశారు. అనంతరం అర్ధరాత్రి 2 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, గోవా బీజేపీ సమన్వయకర్త గడ్కరీలు చక్కబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసిన తరుణంలో అధికారం బీజేపీ చేజారకుండా వీరు పావులు కదిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికలప్పుడు సైతం గోవాలో హంగ్ అసెంబ్లీ రాగా, అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌కు కాదని బీజేపీకి అధికారం దక్కేలా చేయడంలో గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఆయుర్వేద వైద్యుడికి సీఎం పదవి పరీకర్‌కు విశ్వాసపాత్రుడిగా ప్రమోద్ సావంత్ (46)కు మంచి పేరుంది. ఉత్తర గోవాలోని సంఖాలిమ్ నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆరెస్సెస్‌లోనూ పనిచేశారు.. మహారాష్ట్రలోని కోల్హాపూర్ ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించిన ప్రమోద్ కొంతకాలం వైద్యుడిగానూ పనిచేశారు. బీజేపీలో యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పరీకర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండేవాడు. ప్రమోద్‌కు పెద్దగా రాజకీయ అనుభవం లేనప్పటికీ, ఆయనకు ఎవరూ పోటీ లేకపోవడంతో సులభంగానే ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు. -
‘ఆ చెప్పులు ధరించడం ఇబ్బందే’
పణజి : నిరాడంబర సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడంబరాలకు దూరంగా ఉండే పరీకర్ గురించి పలు ఆసక్తికర అంశాలు ప్రచారంలో ఉన్నాయి. పరీకర్ ఇతర మంత్రుల లాగా సూటు బూటు ధరించేవారు కారు. కొల్హాపూర్ చెప్పులు, సాధరణ వస్త్రధారణనే ఇష్టపడేవారు. సీఎం పదవిలో ఉండి కూడా స్కూటర్ మీదనే తిరిగేవారు. రక్షణశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాజ్‌దీప్ సర్దేశాయ్కిచ్చిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పాశ్చత్య వస్త్ర ధారణ నాకు అంతగా నప్పదు. కానీ గత రక్షణశాఖ మంత్రలు కంటే నా వస్త్రధారణ బాగానే ఉంటుంది. ఇకపోతే డిఫెన్స్ మినిస్టర్‌గా ఉంటూ కొల్హాపూర్ చెప్పులు ధరించడమే కాస్తా ఇబ్బందికరంగా ఉంద’ని తెలిపారు. అంతేకాక గోవా సీఎంగా ఉన్నప్పుడు స్కూటర్ మీదనే తిరుగుతుండేవారు పరీకర్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీరు ఎప్పుడూ స్కూటర్ మీదనే తిరుగుతారా’ అని జనాలు నన్ను అడుగుతారు. కానీ ఎల్లకాలం ఇలానే తిరగలేను. ఎందకంటే నా మైండ్‌లో ఎప్పడు పని గురించిన ఆలోచనలే ఉంటాయి. నేను స్కూటర్ నడిపేటప్పుడు నా మైండ్ మరో చోట ఉంటుందనుకొండి.. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. అందుకే స్కూటర్ నడపాలంటే నాకు భయం’ అని తెలిపారు పరీకర్. మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తారని సీఎంఓ ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం పరీకర్ మృత దేహాన్ని ప్రజల సందర్శనార్థం బీజేపీ ప్రధాన కార్యాలయం నుంచి పణజీ కళా అకాడమీకి తరలించారు. -
‘మానవ మేధస్సు ఏ వ్యాధినైనా జయిస్తుంది’
పణజి : నిరాండబరతకు, వృత్తిపట్ల అంకితభావానికి పెట్టింది పేరుగా నిలిచిన బీజేపీ సీనియర్ నేత, గోవా సీఎం మనోహర్ పరీకర్ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ లాంటి మహమ్మారి తన మీద దాడి చేసినప్పుడు కూడా పరీకర్ ఏ మాత్రం కుంగిపోలేదు. పైపెచ్చు చికిత్స తీసుకుంటూనే సీఏంగా రాష్ట్రానికి సేవలందించారు. బలమైన సంకల్పం ఉంటే వ్యాధి మనిషిని ఏమి చేయలేదని నిరూపించారు పరీకర్. మనిషి మేధస్సు ఏ రోగాన్నైనా జయిస్తుందంటూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసిన పరీకర్ అందుకు తానే ఉదాహరణగా నిలిచారు. ఓ వైపు క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే.. మరోవైపు తన విధులను సమర్థవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచారు పరీకర్. (నిరాడంబర సీఎం ఇకలేరు) Human mind can overcome any disease. #WorldCancerDay — Manohar Parrikar (@manoharparrikar) February 4, 2019 2018, ఏప్రిల్‌లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరి 30న గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు పరీకర్. ఈ సందర్భంగా ‘గోవా ముఖ్యమంత్రిగా నా విధులను నిజాయతీగా, నిబద్దతో నిర్వహిస్తానని ఈ రోజు మరో సారి ప్రమాణం చేస్తున్నానం’టూ బడ్జెట్ స్పీచ్ సందర్భంగా పేర్కొన్నారు పరీకర్. -
పారీకర్ ఇకలేరు
-
నిరాడంబర సీఎం ఇకలేరు
పణజి/న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బీజేపీలో అందరివాడుగా గుర్తింపు పొందిన పరీకర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పరీకర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడుజాతీయ సంతాప దినంగా ప్రకటించింది. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పరీకర్ మృతిపై సంతాపం తెలపనుంది. అందరివాడుగా గుర్తింపు.. గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ రాష్ట్రాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆధునికవాదిగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో సామాన్యుడిలా డీ–బ్లాక్‌కు రావడం ఆయనకే చెల్లింది. పరీకర్ సీఎంగా ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని మహారాష్టవాదీ గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు స్వతంత్రులు చెప్పడం పరీకర్ పనీతీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు. 2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సదస్సుకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును పరీకరే ప్రతిపాదించారు. గతేడాది బయటపడ్డ కేన్సర్ 2018, ఏప్రిల్‌లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం పరీకర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పరీకర్, అనారోగ్యం కారణంగా చాలావరకూ తన ప్రైవేటు నివాసానికే పరిమితమయ్యారు. గత రెండ్రోజులుగా పరీకర్ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను ఆయనకు అమర్చి చికిత్స అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘రఫేల్’తో మసకబారిన ప్రతిష్ట.. 2016లో పరీకర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఫ్రాన్స్‌తో రూ.58 వేల కోట్లతో 36 రఫేల్ ఫైటర్జెట్ల కొనుగోలుకు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. దీంతో కాంగ్రెస్ కేంద్రంపై విమర్శల దాడిని పెంచింది. రక్షణశాఖతో పాటు ప్రధాని కార్యాలయం కూడా రఫేల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందనీ, దీన్ని రక్షణశాఖ వ్యతిరేకించిందన్న ఓ నోట్‌ను ఉటంకిస్తూ ‘హిందూ’ పత్రికలో కథనం రావడంతో కలకలం చెలరేగింది. పరీకర్ బెడ్రూమ్లో రఫేల్ ఫైళ్లు ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పరీకర్ స్పందిస్తూ.. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు. నేడు పణజిలో అంత్యక్రియలు: మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు. నిజమైన దేశ భక్తుడు: పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నిబద్ధత, అంకితభావానికి పరీకర్ ప్రతీక అని కోవింద్ కొనియాడారు. పరీకర్ నిజమైన దేశభక్తుడని, గొప్ప పరిపాలకుడని మోదీ పేర్కొన్నారు. అసమాన నాయకుడైన పరీకర్‌ను పార్టీలకు అతీతంగా గౌరవిస్తారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ గోవా ముద్దు బిడ్డల్లో ఒకరైన పరీకర్ తీవ్ర అనారోగ్యం తో ధైర్యంగా పోరాడారని అన్నారు. దేశం ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయిందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం ప్రకటించారు. కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ప్రస్తుతం గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), స్వతంత్రుల సాయంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తాజాగా పరీకర్ మరణం నేపథ్యంలో బీజేపీ కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకుని గవర్నర్‌కు ఆ తీర్మానాన్ని అందజేయాలి. ఇందుకు గవర్నర్ మృదులా సిన్హా అంగీకరిస్తే కొత్త ముఖ్యమంత్రి చేత ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఒప్పుకోకుంటే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. రాత్రి బీజేపీ, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలు అత్యవసరంగా సమావేశమై సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం కేంద్రమంత్రి గడ్కారీ పణజికి చేరుకున్నారు. 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 14 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉండగా, బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంజీపీ, జీఎఫ్‌పీకి చెరో ముగ్గురు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు. తొలి ఐఐటీ సీఎం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్(63) పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై పరీకర్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీకర్ సమర్థత, చురుకుదనం గమనించిన ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు గోవాలో వేళ్లూనుకుంటున్న మహా రాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి చెక్ పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా పరీకర్ ఖ్యాతి గడించారు. బీజేపీకి కంచుకోటగా గోవా..: పరీకర్ రాజకీయ అరంగేట్రం అంత గొప్పగా ఏమీ జరగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసిన పరీకర్ ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. పరీకర్ నాయకత్వంలో బీజేపీ గోవాలో బలీయమైన శక్తిగా ఎదిగింది. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.11కు తగ్గించడం, మహిళలకు ఆదాయాన్ని కల్పించడం సహా పలు సంక్షేమ పథకాలతో పరీకర్ ఇమేజ్ గోవాలో అమాంతం పెరిగిపోయింది. దీంతో 2012 గోవా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఢిల్లీ నుంచి పిలుపు..: 2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ’వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం పరీకర్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు రాగా, బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. వెంటనే రంగంలోకి దిగిన పరీకర్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పరీకర్ భార్య మేధా కేన్సర్‌తో 2000లో కన్నుమూశారు. పరీకర్ దంపతులకు ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. -
గోవా సీఎం పారికర్ కన్నుమూత
-
గోవా సీఎం పారికర్ కన్నుమూత
సాక్షి, పణాజీ : దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నగోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఆయన మరణించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఇవాళ సాయంత్రం పారికర్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, డాక్టర్లు తమ శాయశక్తులా ఆయనకు వైద్యం అందిస్తున్నారని గోవా సీఎంవో ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే పారికర్ మరణవార్త వినాల్సి వచ్చింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ ఢిల్లీలోని ఎయిమ్స్, గోవా, ముంబైలోనూ చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో సుదీర్ఘ చికిత్స తీసుకున్నా అయినా ఫలితం లేకపోయింది. కొంత కాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. అలాంటి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది జనవరి 30న అసెంబ్లీలో పారికర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ మృతి చెందారు. 1955 డిసెంబర్ 13న గోవాలో జన్మించిన పారికర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన 1994లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లో గోవా అసెంబ్లీలో విపక్షనేతగా ఉన్నారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన పారికర్.... ప్రధాని మోదీ కేబినెట్లో రక్షణమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పారికర్ హయాంలోనే ఫ్రాన్స్‌తో రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం జరిగింది. ప్రముఖుల సంతాపం మరోవైపు పారికర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్‌తో పాటు, బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఇక పారికర్ మరణంతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పారికర్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. దేశం ఒక గొప్ప ప్రజా సేవకుడిని కోల్పోయిందని సీఎం అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారికర్ ఆకస్మిక మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశం ప్రజ్ఞాశాలి అయిన ఒక ప్రజా నాయకుడుని కోల్పోయిందని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
గోవా సీఎం పారికర్‌తో రాహుల్ భేటీ
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్‌తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం సమావేశమయ్యారు. వీరి మధ్య ఏయే అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు వెల్లడికాలేదు. పారికర్‌తో తాను కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యానని, ఇది వ్యక్తిగత పర్యటనగా రాహుల్ వెల్లడించారు. నేటి ఉదయం గోవా సీఎం మనోహర్ పారికర్‌ను తాను కలిశానని, ఆయన సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించానని రాహుల్ ట్వీట్ చేశారు. గోవా శాసన సభ ప్రాంగణంలోని సీఎం చాంబర్లో పారికర్‌తో రాహుల్ సమావేశమయ్యారు. పారికర్‌తో ముచ్చటించిన అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాహుల్ అసెంబ్లీలోని విపక్ష లాబీలో సమావేశమయ్యారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు గోవా సీఎం వద్ద ఉన్నాయని కాంగ్రెస్ చీఫ్ ఆరోపించిన మరుసటి రోజే పారికర్‌తో రాహుల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పారికర్‌తో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ ఎలాంటి చర్చలూ జరపలేదని, కేవలం ఆయన ఆరోగ్య పరిస్ధితిని వాకబు చేసేందుకే కలిశారని గోవా విపక్ష నేత చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. పారికర్‌ను రాహుల్ కేవలం మర్యాదపూర్వకంగానే కలిశారని చెప్పుకొచ్చారు. మనోహర్ పారికర్ పాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతూ 2018 ఫిబ్రవరి నుంచి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఎయిమ్స్ నుంచి గోవా సీఎం డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ : పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో గత నెల రోజుల నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. పారికర్ ఆరోగ్య పరిస్థితి ఆదివారం ఉదయం విషమించగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కు తరలించి ఆ తర్వాత ఐసీయూ నుంచి వార్డుకు అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశామని ఎయిమ్స్ అధికారి ఒకరు వెల్లడించారు. ఆదివారం రాత్రికి ఆయన గోవా చేరుకుంటారని పారికర్ సన్నిహితులు తెలిపారు. గత ఏడు నెలలుగా పారికర్ గోవా, ముంబై, న్యూయార్క్, న్యూఢిల్లీలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఎయిమ్స్‌లోనే శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. మరోవైపు దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతున్న పారికర్ సీఎం పదవి నుంచి వైదొలగాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. -
పరీకర్ మంత్రిత్వ శాఖల అప్పగింత?
పణజి: ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పాంక్రియాటిక్ వ్యాధికి చికిత్స పొందుతున్న గోవా సీఎం మనోహర్ పరీకర్ శుక్రవారం మంత్రులు, బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిస్థితులు, పాలనపై మంత్రులతో పరీకర్ చర్చించారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖలను మిగతా మంత్రులకు అప్పగించాలని నిర్ణయించారు. ‘గోవాలో పరిపాలనతో పాటు కీలక శాఖల పనితీరుపై పరీకర్ సమీక్ష నిర్వహించారు. పరీకర్ కోలుకుంటున్నారు. ఆయనే సీఎంగా ఉంటారు. దీపావళి కల్లా డిశ్చార్జ్ అవుతారు. తన వద్ద ఉన్న మంత్రిత్వశాఖల్లో కొన్నింటిని మిగతా మంత్రులకు అప్పగించడంపైనా చర్చించాం’ అని కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. -
సీఎంకు ఓ న్యాయం.. మంత్రులకో న్యాయమా!?
పనజి : కాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించేందుకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ్ మద్కైకర్లను కాబినెట్ నుంచి తొలగించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి స్థానంలో మిలింద్ నాయక్, నీలేశ్ కార్బాల్ గవర్నర్ మృదులా సిన్హా సమక్షంలో సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకో రూల్.. మంత్రులకో రూల్!! గత జూన్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మద్కైకర్.. ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా పలు అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే వీరి గైర్హాజరీతో ఆయా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన పరీకర్ వారిద్దరిని కాబినెట్ నుంచి తొలగించారు. దీంతో సీనియర్లను తప్పించడం కంటే కూడా దాని వెనుక ఉన్న కారణం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న మనోహర్ పరీకర్ ముంబై, అమెరికాల్లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా పరీకర్ అనారోగ్యాన్ని కారణంగా చూపి, రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. అయితే గోవా సీఎంగా పరికర్ కొనసాగుతారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకో న్యాయం, సీఎంకి ఓ న్యాయం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. -
గోవా సీఎం ఆయనే..
న్యూఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని నియమిస్తారని సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారని, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ గ్రూప్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు షా పేర్కొన్నారు. కాగా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గోవాలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుండగా, అసెంబ్లీలో తమకు మెజారిటీ సంఖ్యా బలం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. గోవా సీఎం పారికర్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో ప్రాంకియాస్ చికిత్స పొందుతున్నారు. -
గోవా సీఎం పారికర్ అనారోగ్యంపై బీజేపీలో ఆందోళన
-
మళ్లీ ఆస్పత్రిలో చేరిన పారికర్
న్యూఢిల్లీ: దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా సీఎం మనోహర్ పారికర్ (62) శనివారం మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. దీంతో బీజేపీ నాయకత్వం ఇతర మార్గాల అన్వేషణలో పడింది. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ వారం పాటు అమెరికాలో చికిత్స పొంది ఈనెల మొదటి వారంలోనే ఆయన తిరిగి వచ్చారు. కొన్ని రోజులకే మరోసారి గోవాలోని కండోలిమ్ ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు ఈ ఏడాది ప్రారంభంలో 3 నెలల పాటు పారికర్ అమెరికాలో సుదీర్ఘ చికిత్స పొందిన విషయం తెలిసిందే. తరచూ ఆయన అనారోగ్యానికి గురికావడం, తదనంతర పరిణామాలపై చర్చించేందుకు ఇద్దరు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం సోమవారం గోవా వెళ్లనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం ప్రత్యామ్నాయాల మార్గాల అన్వేషణలో ఉందని సమాచారం. నాయకత్వ మార్పిడికి సంబంధించి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పారికర్‌తో చర్చించినట్లు కూడా తెలుస్తోంది. -
అమెరికా నుంచి జర్నలిస్టులకు సీఎం ఫోన్
పనాజీ: అనారోగ్యం కారణంగా గత నాలుగు నెలలుగా అమెరికాలో చికిత్స పొందుతోన్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ రాష్ట్ర పరిస్థితులపై ఆరాతీశారు. తనకు సన్నిహితంగా ఉన్న జర్నలిస్టులకు ఫోన్ చేసి రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి చర్చించారు. కాగా గత కొద్దికాలంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీకర్ విలేకరులతో మాట్లాడి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థిల గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రానున్నట్లు ముఖ్య మంత్రి పేర్కొన్నారు. సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఓ సీనియర్ జర్నలిస్టు మీడియాతో మాట్లాడుతూ... కొద్దిరోజుల్లో గోవాకు వస్తున్నట్లు పరీకర్ చెప్పారన్నారు. ‘ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నాను. ప్రొటోకాల్ ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నాం. ప్రభుత్వ ఫైళ్లు స్కాన్ చేసి నాకు మెయిల్ చేస్తున్నారు. టెక్నాలజీ యంత్రాల ద్వారా ప్రతీది ఇక్కడే నుంచే తెలుసుకుంటున్నాను. డాక్టర్స్‌ని సంప్రదించి కొద్ది రోజుల్లో రాష్ట్రానికి తిరిగి వస్తా’ అని ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా, గతవారం ముఖ్యమంత్రి ఖాతాలోని డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి మరో ముఖ్యమంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న పరీకర్ మార్చి 7 నుంచి అమెరికాలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర పరిపాలన వ్యవహారాలను ముగ్గురు మంత్రుల బృందం పర్యవేక్షిస్తోంది. -
గోవా సీఎం ఆరోగ్యంపై అసత్య వార్తలు..
పణాజీ, గోవా : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తున్న వాస్కో పట్టణానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ‘అమెరికాలో క్లోమ గ్రంధి సంబంధిత చికిత్స పొందుతున్న పరీకర్ ఆరోగ్యం క్షీణించింది. ఇక ఆయన మనకు లేరు’ అంటూ సదరు వ్యక్తి మంగళవారం తన ఫేస్బుక్లో పోస్టు చేయడం కలకలానికి దారి తీసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఆరోగ్యం మెరుగు పడుతుందనీ, బహుశా ఆయన వచ్చే నెలలో ఇండియాకు రావొచ్చని గోవా బీజేపీ ప్రధాన కార్యదర్శి సదానంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోగానే పరీకర్ ఆరోగ్యంపై పుకార్లు మొదలు కావడం బాధ కల్గించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘పరీకర్ కోలుకుంటున్నారు. ఆయన వచ్చే నెలలో స్వదేశానికి వస్తారు’ అని కర్కోరం ఎమ్మెల్యే నీలేష్ కాబ్రల్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. సీఎం ఆరోగ్య వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు అర్థరహితమని నీలేష్ మండిపడ్డారు. ఆయన ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తోందని వివరణ ఇచ్చారు. కాగా, కడుపు నొప్పితో ఫిబ్రవరి 5న ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన పరీకర్ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లారు. -
వదంతులు నమ్మకండి : పరీకర్
పనాజి : మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా సీఎం మనోహర్ పరీకర్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. వదంతులను నమ్మవద్దని గోవా ప్రజలకు విఙ్ఞప్తి చేశారని స్పీకర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. చికిత్స కోసం అమెరికా వెళ్లిన.. పరికర్ తనతో ఫోన్లో మాట్లాడారని, రెండవ దశ చికిత్స ప్రారంభమైందని చెప్పారని సావంత్ పేర్కొన్నారు. పాలనా అంశాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పరీకర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని కోరారు. ప్రాంకియాటైటిస్‌తో బాధ పడుతున్న పరీకర్ మొదట ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత నెల 17న బడ్జెట్ సమావేశం ఉన్నందున గోవాకు వెళ్లిన పరీకర్ ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ముంబైకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో అధునాతన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు. -
సీఎం ఆరోగ్యంపై వదంతులు.. ఖండన!
సాక్షి, ముంబై : గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఆయనకు చికిత్స అందిస్తున్న ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆస్పత్రి ఖండించింది. పారికర్ ఆరోగ్యం విషయమై మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, రూమర్లు అన్ని అవాస్తవమేనని, ఆయన చక్కగా చికిత్సకు స్పందిస్తున్నారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పారికర్ ఆరోగ్యం గురించి దురుద్దేశంతోనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో వస్తున్న కథనాలు బూటకమని ఆస్పత్రి తీవ్రంగా పేర్కొంది. ‘మాగ్నెటిక్ మహారాష్ట్ర’ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనేందుకు ముంబై వచ్చిన ప్రధాని మోదీ ఆదివారం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పారికర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అనారోగ్యంబారిన పడటంతో ఈ నెల 15న పారికర్ లీలావతి ఆస్పత్రిలో చేరారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని, అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని గోవా సీఎంవో ఇప్పటికే ప్రకటించింది. -
టీచర్స్ డే రోజు గోవా సీఎం ఏమన్నారంటే...
పనాజీః ప్రశ్నించడం బాల్యం నుంచే అలవడాలని గోవా సీఎం మనోహర్ పారికర్ అన్నారు. తమ ప్రశ్నలపై ఉపాధ్యాయులు ఆగ్రహిస్తే తనకు మెయిల్ చేయాలని పిల్లలకు సూచించారు. ‘ బాలలు భయపడాల్సిన పనిలేదు...మీ ప్రశ్నలపై టీచర్లు కోప్పడితే నాకు ఈ మెయిల్ పంపండ’ ని పనాజీలో జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో అన్నారు.నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను చిన్నారులకు అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. పిల్లల్లో ఆలోచన రేకెత్తించేలా మనం వారికి శిక్షణ ఇవ్వాలి...వారి ప్రశ్నలు కొన్ని సార్లు సంక్లిష్టంగా ఉంటాయని తెలుసు..అయినా విజ్ఞానం పొందే సామర్థ్యాన్ని మనం కల్పించాల’ ని అన్నారు. ఈ దిశగా విద్యా వ్యవస్థలోమార్పులు చోటుచేసుకోవాలని పారికర్ ఆకాంక్షించారు. -
'దేశ ప్రజల ముందు మేం నిరూపించుకున్నాం'