
గోవా సీఎం మనోహర్ పారికర్ (ఫైల్‌పోటో)
న్యూఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని నియమిస్తారని సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారని, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ గ్రూప్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు షా పేర్కొన్నారు.
కాగా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గోవాలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుండగా, అసెంబ్లీలో తమకు మెజారిటీ సంఖ్యా బలం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. గోవా సీఎం పారికర్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో ప్రాంకియాస్ చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment