amithsha
-
'రష్మిక'కు రక్షణ కల్పించాలంటూ అమిత్ షాకు 'కుల' పెద్దల లేఖ
పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్న కన్నడ బ్యూటీ 'రష్మిక మందన్న'కు రక్షణ కల్పించాలని ఆమె కులానికి (కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. ఈమేరకు వారు కేంద్రానికి లేఖ కూడా రాశారు. రీసెంట్గా 'ఛావా' సినిమా సక్సెస్ మీట్లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట భగ్గుమన్నాయి. బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'నేను హైదరాబాద్ నుంచి వచ్చాను.. నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.' అని చెప్పడంతో కర్ణాటకలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సొంతూరును మరిచిపోయి ఇలా మాట్లాడటం ఏంటి అంటూ ఆమెపై కన్నడ అభిమానులు ఫైర్ అయ్యారు.రష్మికకు రక్షణగా 'కుల' పెద్దలుసౌత్ ఇండియాతో పాటు బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తున్న రష్మికకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్లకు 'కొడవ నేషనల్ కౌన్సిల్' (సీఎన్సీ) లేఖ రాసింది. రష్మిక చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకలోని ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గానికి చెందిన వారు ఆమెపై బెదిరింపులకు దిగారని (సీఎన్సీ) పేర్కొంది. దీంతో నటికి భద్రత కల్పించాలని 'కొడవ' బోర్డు కోరింది. తమ తెగకు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో భారతీయ చిత్ర పరిశ్రమలో అఖండ విజయాన్ని సాధించిందని బోర్డు చైర్మన్ ఎన్.యు. నాచప్ప లేఖలో పేర్కొన్నారు. దేశంలోనే గొప్ప నటులుగా గుర్తింపు ఉన్న అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకుందని గుర్తుచేశారు. ఆమెకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టే తన అభిప్రాయాన్ని పంచుకుందన్నారు. కానీ, ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగిందని ఆయన అన్నారు. తాను వెనుకబడిని వర్గానికి చెందిన మహిళ కాబట్టే టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న కూడా ఫిర్యాదు చేసిందని నాచప్ప తెలిపారు. కర్ణాటకలో కొడవ వర్గం ప్రజలు ఓబీసీ కిందకు వస్తారు. రష్మిక మందన్న సామాజిక వర్గం 'కొడవ' అని తెలిసిందే.ఎమ్మెల్యే బెదిరింపులురష్మికపై కర్ణాటకలోని మండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే 'రవి గనిగ' ఫైర్ అయ్యారు. బాలీవుడ్లో ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుబడతూ ఆయన ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. జీవితాన్ని ఇచ్చిన ఇండస్ట్రీని ఆమె తక్కువ చేసిందని తెలిపారు. ఈ విషయం రష్మిక తెలుసుకోవాలని కోరారు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు కూడా ఆమె అంగీకరించలేదని ఆయన ఆరోపించారు. రష్మిక మందన్నకు సరైన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే రవి పిలుపునిచ్చారు. ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనని వారిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాంటి వారి నట్లు, బోల్టులు ఎలా సరిచేయాలో తమకు తెలుసని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కొడవ సామాజిక వర్గం వారు రష్మిక మందన్నకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు రక్షణ కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కొడవ వర్గం లీడర్ ఒక లేఖ రాశారు. -
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
అమిత్ షా రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం/కవాడిగూడ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, వరంగల్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జిల్లా కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు అక్కడ కలెక్టర్‌ను కలిసి అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటూ వినతిపత్రాలు ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: భట్టి భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఆ రాజ్యాంగాన్నే ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయాలని భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మంలో ర్యాలీ అనంతరం భట్టి మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అందుకు అనుగుణంగా పాలన అందించకుంటే ఏ ప్రభుత్వా న్ని అయినా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తించదన్నారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతోందంటే అందుకు రాజ్యాంగం, దాన్ని అందించిన అంబేడ్కరే కారణమని పేర్కొన్నారు. అలాంటి అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా రాజీనామా కోరడం అందరి నైతిక హక్కు అని భట్టి చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బీజేపీ ముసుగు తొలగిపోయింది: టీపీసీసీ చీఫ్బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్‌షా వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ ముసుగు తొలగిపోయిందన్నారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరునికి అమిత్ షా మాటలు బాధ కలిగించాయన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి అంబేడ్కర్‌పై ఎంత ద్వేషం ఉందో బయటపడిందని ఏఐసీసీ నేత కొప్పుల రాజు అన్నారు. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీగణేష్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్‌కు.. అమిత్ షా కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో మోదీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందన్నారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. పీటీఐకి ఇచ్చిన తాజా ఇంటర్యూలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో అక్కడ అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది చాలా పెద్ద పరిణామం. కాశ్మీర్లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం మోదీ సర్కార్‌కు దక్కిన అతిపెద్ద విజయం. ఎన్నికలు ముగిసిన వెంటనే కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాం’అని షా పేర్కొన్నారు. -
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
-
అమిత్‌షా ఏయే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారో తెలుసా..
గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఇటీవల ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించారు. అయితే అందులో మంత్రి పెట్టుబడుల వివరాలను పేర్కొన్నారు. స్టాక్మార్కెట్లోని చాలా కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేసినట్లు తెలిసింది. అఫిడవిట్‌లోని వివరాల ప్రకారం అమిత్ షా మెుత్తం పెట్టుబడుల విలువ రూ.17.46 కోట్లుగా ఉంది. ఆయాన భార్య సోనాల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ రూ.20 కోట్లని తెలిసింది. అమిత్‌షాతోపాటు ఆయన భార్య సోనాల్‌షా ప్రధానం పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.అమిత్‌షా పెట్టుబడుల్లో కొన్ని..హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1.4 కోట్లుఎంఆర్ఎఫ్ రూ.1.3 కోట్లుకోల్గేట్-పామోలివ్ (ఇండియా) రూ.1.1 కోట్లుప్రాక్టర్ & గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్ రూ.0.96 కోట్లు ఏబీబీ ఇండియా రూ.0.7 కోట్లుసోనాల్షా పెట్టుబడుల్లో కొన్ని..కెనరా బ్యాంక్‌లో అమిత్ షా దాదాపు రూ.7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తున్నారు. ఆయన భార్య సోనాల్ షా రూ.3 కోట్ల విలువైన షేర్లు కలిగి ఉన్నారు.కరూర్వైశ్యా బ్యాంక్‌లో రూ.1.9 కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి.గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ కంపెనీలో రూ.1.8 కోట్ల పెట్టుబడి పెట్టారు.లక్ష్మి మిషన్ వర్క్స్‌లో రూ.1.8 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి.భారతీఎయిర్‌టెల్ కంపెనీలో రూ.1.3 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.ఇదీ చదవండి: ప్రయాణికులు అభ్యర్థించకపోయినా డబ్బు రీఫండ్!అమిత్ షా పోర్ట్‌ఫోలియోలో ఐటీసీ, వీఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, నెరోలాక్ పెయింట్స్ వంటి కంపెనీలున్నాయి. హోం మంత్రి బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లోని స్టాక్‌లకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. -
తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర
-
చరిత్ర తెలియక ఊరకే తిరగరాస్తున్నారు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లులపై చర్చ సందర్భంగా మాజీ ప్రధాని నెహ్రూపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపణలు గుప్పించడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ జమ్మూకశ్మీర్‌లోకి పూర్తిగా భారత బలగాలు వెళ్లేలోపే కాల్పుల విరమణకు నెహ్రూ ఆదేశాలిచ్చారు. అనవసరంగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల కారణంగానే కశ్మీర్ సమస్య అపరిష్కృతంగా తయారై అక్కడి ప్రజలు కష్టాలపాలయ్యారు’’ అని సోమవారం రాజ్యసభలో ఆరోపణలుచేయడం తెల్సిందే. దీనిపై మంగళవారం రాహుల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఘాటుగా స్పందించారు. ‘‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తన జీవితం మొత్తాన్నీ ధారపోశారు. స్వాత్రంత్య్ర పోరాటంలో చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇంకా ఇలాంటి చరిత్ర అంతా అమిత్ షాకు తెలీదనుకుంటా. అందుకే పదేపదే చరిత్రను తిరగరాస్తున్నారు. ఇదంతా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే. కుల గణన వంటి సమస్యల సంగతేంటి? అసలు ప్రజాధనం ఎవరి చేతుల్లోకి వెళ్తోంది?. ఈ అంశాలను బీజేపీ అస్సలు చర్చకు స్వీకరించదు. భయంతో పారిపోతోంది. బీసీలను పట్టించుకోవట్లేదు’ అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓబీసీల ప్రాధాన్యం పెరగాలి గిరిజన వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా, ఓబీసీ నేతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందికదా ? అన్న మీడియా ప్రశ్నకు రాహుల్ బదులిచ్చారు. ‘‘మేం కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిని చేశాం. వాళ్లు కూడా మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను సీఎంగానే చేశారు. బీసీలకు ఒకే ఒక్క కీలక పదవి ఇస్తే సరిపోదు. ఇక్కడ పదవి ముఖ్యం కాదు. మరింత మంది ఓబీసీలకు ప్రాధాన్యత దక్కాలి. వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మోదీ సర్కార్ ప్రధానాంశాలను పక్కనబెట్టి ప్రజల దృష్టికి మరల్చుతోంది’’ అని రాహుల్ ఆరోపించారు. -
యుద్ధాన్ని ఎందుకు విరమించారు?
ఈ నెల 6న పార్లమెంట్లో ఆమోదం పొందిన రెండు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలోకేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘జమ్మూ–కశ్మీర్ శాసనసభలో పీఓకేకు 24 స్థానాలూ, కశ్మీరీ నిర్వాసితులకు 2, పీఓకే నిర్వాసి తులకు ఒకటి కేటాయించాం. తొలి ప్రధాని నెహ్రూ తప్పులు కశ్మీర్ ఉగ్ర–వేర్పాటువాదా లకూ, పీఓకే పుట్టుకకూ కారణం. మన సైన్యం పాక్ సేనను తరుముతూ 3 రోజుల్లో కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోనుండగా యుద్ధం విరమించారు. అనవసరంగా, హడావిడిగా కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస)కి చేర్చారు. 70 ఏళ్ళుగా హక్కులు పోయి అన్యాయానికి గురైన కశ్మీరీలకు న్యాయం చేకూర్చడమే ఈ బిల్లుల ఉద్దేశం’ అన్నారు. దీంతో అనుపమ్ ఖేర్ లాంటి వలస కశ్మీరీ పండితులు, వైదికవాదులు కశ్మీరీ ప్రజాప్రతినిధులు కాగలరు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా ప్రయోజనమూ నెరవేరగలదు. అమిత్ షా మాట్లాడిన మాటల్లో ఒక్కటీ నిజం కాదు. నిజానికి నెహ్రూ వల్లనే కశ్మీర్ఇండియాలో కలిసింది. దాన్ని ఇండియాలో కలి పేందుకు షేక్ అబ్దుల్లాను ఒప్పించారు. నెహ్రూ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం హోం మంత్రి పటేల్ విన్నపానికి 566 సంస్థానాల్లో 563 ఇండియాలో కలిశాయి. జమ్ము–కశ్మీర్, హైదరాబాద్, జునాగఢ్ మిగిలాయి. పాక్ సరిహద్దు జమ్మూ– కశ్మీర్, సముద్ర సరిహద్దులోని జునాగఢ్‌లను పాక్‌కు ఇచ్చి, దేశం మధ్యలోనున్న హైదరాబాద్‌ను ఇండియాలో కలపాలని పటేల్ ప్రతిపా దించారు. తన చిరకాల వాంఛకు విరుద్ధమైన ఈ ప్రతిపాదనను నెహ్రూ ఆమోదించలేదు. కశ్మీర్ యుద్ధ విరమణ సమయంలో మన సైన్యం పూంఛ్, రాజౌరీ ప్రాంతాలను రక్షిస్తూ ఉంది. విరమణ ప్రకటించకుంటే ఈ ప్రాంతాలు పాక్ అధీనమయ్యేవి.పఠాన్ లష్కర్ల గిరిజన చొరబాటు పేరుతో పాక్ సైన్యానికి భారత సేనకు మధ్య యుద్ధం జరిగింది. పాక్ ముందుగానే పాత రోడ్లను బాగు చేసి, కొత్త రోడ్లను నిర్మించి సైన్యాల తరలింపు నకు ఏర్పాట్లు చేసుకోవడం వల్ల వేలాది సైని కులు కశ్మీర్లోకి ప్రవేశించారు. భారతీయ సైన్యం చేరడానికి సరైన రవాణా మార్గం లేక తక్కువ సైనికులే చేరారు. నానాటికీ పెరిగిన పాక్ సైన్యం మొత్తం కశ్మీర్‌ను ఆక్రమించే పరిస్థితి దాపురించింది. ఈలోపు ఇండియాను ప్రతివాదిని చేస్తూ పాక్ ఐరాసకు పోవచ్చు. 1947 డిసెంబర్ 8న నెహ్రూ చాకచక్యంగా ఈ అవకాశాన్ని కాల్పుల విరమణ ప్రకటించి అడ్డుకున్నారు. ఆ తర్వాత ఐరాసకు కశ్మీర్ సమ స్యను తీసుకెళ్లారు. నెహ్రూ అనుమానించినట్లే అమెరికా పక్షపాతి అయిన ఐరాస భారత్‌కు న్యాయం చేయలేదు. – సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కాంగ్రెస్ హై కమాండ్‌కు ఏటీంఎంలా రాజస్థాన్ : అమిత్ షా
జైపూర్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌ను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఏటీఎమ్‌లా వాడుకున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్డు గీకి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సీఎం అశోక్‌గెహ్లాట్ ఆయన పార్టీ ఢిల్లీ పెద్దలకు రాజస్థాన్‌ను ఏటీఎంలాగా వాడుకునే సదుపాయాన్ని కల్పించారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్మీర్‌లోని విజయనగర్‌లో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. అవినీతిలో రాజస్థాన్ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని అమిత్ షా విమర్శించారు. మహిళల పట్ల నేరాల్లో,సైబర్ నేరాల్లో రాజస్థాన్ టాప్‌లో ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో గెహ్లాట్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని అమిత్ షా ఫైర్ అయ్యారు. కన్హయ్యలాల్‌ను పట్టపగలు చంపితే ప్రభుత్వ పెద్దలు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. రాజస్థాన్‌ను గెహ్లాట్ అల్లర్ల రాష్ట్రంగా మార్చారన్నారు. ఇదీచదవండి.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం -
మేమొస్తే బీసీ సీఎం: అమిత్ షా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సూర్యాపేట: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనికేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. బీఆర్ఎస్ను గద్దె దించి, బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారని మండిపడ్డారు. ఒకవేళ ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈసారైనా దళితుడిని సీఎం చేస్తావా చెప్పాలని కేసీఆర్‌కు సవాల్ చేశారు. కేసీఆర్‌కు తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేయడం లక్ష్యమైతే.. కాంగ్రెస్ లక్ష్యం రాహుల్ గాందీని ప్రధానిని చేయడమని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ బీసీ, దళిత వ్యతిరేక పార్టీలేనని విమర్శించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనగర్జన సభలో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తుంటే ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ దేశంలో, రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతోంది. సీఎం కేసీఆర్ దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి హామీ ఎక్కడికి పోయింది? దళితుల ప్రత్యేక అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.50వేల కోట్లతో పెడతానన్న ప్రత్యేక బడ్జెట్ హామీ ఏమైంది? బీసీల సంక్షేమం కోసం రూ.10వేల కోట్లతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని చెప్పిన కేసీఆర్ ఏం చేశారు? రాష్ట్రానికి అండగా కేంద్ర సర్కారు ప్రధాని మోదీ దేశంలో మొదటిసారిగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే గాక అన్ని అధికారాలూ ఇచ్చారు. గిరిజనుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దానికి సమ్మక్క, సారక్క యూనివర్సిటీగా పేరు పెట్టింది. పసుపు బోర్డు కోసం ఎన్నో ఏళ్ల నుంచి పసుపు రైతులు ఉద్యమాలు చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదు. రైతుల కష్టాలను గుర్తించిన బీజేపీ పసుపుబోర్డు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజలు కృష్ణా జలాల హక్కుల కోసం పోరాటం చేస్తుంటే.. వారి హక్కులను సమకూర్చేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అండగా నిలిచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. లక్షల కోట్లు కేటాయించాం.. తెలంగాణలో 40లక్షల మంది రైతులకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను కిసాన్ సమ్మాన్ నిధి కింద అందజేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల తాగునీటికి నిధులను విడుదల చేస్తున్నాం. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఇంటిలో మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. గత నాలుగేళ్లుగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రాష్ట్రంలోని 1.90 లక్షల కుటుంబాలకు ఉచిత బియ్యాన్ని అందిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలను కేటాయించాం. తెలంగాణ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. అందుకోసం రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దింపి, బీజేపీ అభ్యర్థులను గెలిపించి అధికారంలో తీసుకురావాలి. రామ మందిరం సాకారమవుతోంది 550 ఏళ్ల పోరాటం, ఆరాటం తర్వాత బీజేపీ సారథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోదీ సారథ్యంలో ఈ కల సాకారం కాబోతోంది. జనవరి 22న ప్రధాని మోదీ రాముడు జన్మించిన అయోధ్య రామ మందిరంలో తొలిపూజ చేయనున్నారు. ఈ బృహత్తర కార్యానికి సూర్యాపేట జిల్లా ప్రజలంతా రావాలి..’’ అని అమిత్‌షా పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా పరిధిలో బీజేపీ తరఫున సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్రావు, తుంగతుర్తిలో కడియం రామచంద్రయ్య, భువనగిరిలో గూడూరు నారాయణరెడ్డి, నాగార్జునసాగర్‌లో నివేదితారెడ్డిలను గెలిపించాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అవినీతిని నిర్మూలిస్తాం: కిషన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అవినీతి వ్యతిరేక పోరాటం కోసం ప్రజలంతా బీజేపీకి మద్దతివ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత సూర్యాపేట ప్రజలకు ఉందని, అవినీతి బీఆర్ఎస్పై పోరాటంలోనూ ముందుండాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగిన రోడ్లు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో 2,500 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారులను ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తే విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిని ఆరులేన్లుగా మార్చడంతోపాటు ఇండ్రస్టియల్ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉచిత వైద్యం, విద్య, పంటల బీమా పథకం వంటివి అమలు చేస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి సీఎం కార్యాలయం వరకు అవినీతి సమూలంగా నిర్మూలిస్తామన్నారు. ============== 27ఎస్పిటి175, 178, 179 : సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో మాట్లాడుతున్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 27ఎస్పిటి181 : సూర్యాపేటలో నిర్వహించిన జనగర్జన సభలో బీజేపీ అభ్యర్థులతో కలిసి అభివాదం చేస్తున్న అమిత్‌షా 27ఎస్పిటి188, 190, 191 : సూర్యాపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగర్జన సభకు హాజరైన పార్టీ శ్రేణులు, ప్రజలు –––––––––––––––––––––––––––––––– ఫొటోలు 1.40 రేపటి డేట్ ఫోల్డర్లో వేశాం -
లోకేష్-అమిత్‌షా భేటీపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ ఇటీవల అమిత్‌షాను కలిసిన సంగతి తెలిసిందే. అయితే నారా లోకేష్ కేంద్రమంత్రిని కలవడంలో తన పాత్ర ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అమిత్‌షాను పదేపదే అపాయింట్మెంట్ అడిగింది లోకేషేనని తెలిపారు. ఢిల్లీలో ఉన్న పది రోజుల్లో లోకేష్ పలుమార్లు అమిత్‌షా అపాయింట్మెంట్ కోసం విజ్ఞప్తి చేశారని చెప్పారు. తొలుత హోంమంత్రి బిజీ షెడ్యూల్ కారణంగా లోకేష్‌ను కలవలేదన్నారు. తెలుగురాష్ట్రాల్లో ఉన్న ఏకైక కేంద్రమంత్రిగా తాను ఆ సమావేశానికి హాజరయ్యానని వివరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే తనను అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లారని లోకేష్ గతంలో చెప్పడంతో ఆయన ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా చాలామందిని కలుస్తారని, ప్రత్యర్థులు అపాయింట్మెంట్ అడిగినా ఇస్తారని స్పష్టం చేశారు కిషన్‌రెడ్డి. -
గెలుపు గుర్రాలకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాకు ఆమోద ముద్ర పడింది. గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర నాయకత్వం సిద్ధంచేసిన ఈ జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) పరిశీలించి, చర్చించిన అనంతరం గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. బీసీలు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ.. మొత్తంగా 55 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ విడివిడిగా సమావేశాలు నిర్వహించింది. సీఈసీ సభ్యులు.. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, భూపేంద్రయాదవ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తోపాటు.. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్ఢి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటల రాజేందర్, రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణకు సంబంధించి పార్టీ రాష్ట్ర నాయకత్వం సమరి్పంచిన జాబితాను ప్రధాని మోదీ ప్రత్యేకంగా పరిశీలించారని పార్టీ వర్గాలు తెలిపాయి. గెలిచే స్థానాలు.. గెలవగలిగే నేతలతో.. ఇంతకుముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల సమయంలో అభ్యర్థుల జాబితా ప్రకటన కోసం అనుసరించిన వి«ధానాన్నే తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటనలోనూ అనుసరించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ఎంపీలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులను బరిలో దింపాలని ఇప్పటికే నిర్ణయించింది. దీనికితోడు పార్టీ బలంగా ఉండి ఒకరే ఆశావహులున్న చోట్ల అభ్యర్థుల ప్రకటనకు సీఈసీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 60–70 మందితో తొలి జాబితాను పార్టీ కేంద్ర కార్యాలయం ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒకే స్థానం సాధించగా.. ఈసారి గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకునే దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తోందని అంటున్నాయి. -
బాబు స్క్రిప్ట్.. అమిత్ షా స్పీచ్.. మంత్రి పంచులు..
-
100 సీట్లు గెలుస్తాం..!
-
ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందంటూ షిండే తీర్మానం
మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య సరిహద్దు వివాదం రోజు రోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం మరాఠీ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు కూడా. వాస్తవానికి మహారాష్ట్రతో ఉన్న సరిహద్దు వివాదంపై కర్ణాటక శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కొద్దిరోజుల తర్వాత షిండే ఈ తీర్మాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పైగా బీజేపీ పాలిత రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోందేగానీ తగ్గడం లేదు. ఐతే మహారాష్ట్ర తీర్మానం ప్రకారం.. బెల్గాం, కార్వార్, బీదర్, నిపాని, భాల్కీలోని ప్రతి అంగుళం సహా 865 మరాఠీ మాట్లాడే గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల్లో ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతోందని చెబుతోంది. కానీ కర్ణాటక ఈ వాదనను తోసిపుచ్చటమే గాక తీవ్రంగా ఖండించింది. కర్ణాటక నేల, నీరు, భాష, కన్నడిగుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని కరాఖండీగా చెప్పింది. ఇది కర్ణాటక ప్రజల భావాలకు సంబంధించినదని, ఈ విషయంలో తాము ఐక్యంగా కట్టుబడి ఉన్నాం అని తేల్చి చెప్పింది. అంతేగాదు రాష్ట్రప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామంటూ కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శాసనసభలో ఇటీవలే తీర్మానం కూడా చేశారు. గతంలో బొమ్మై హోం మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, 1956లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో సరిహద్దును పునర్నిర్మించాలని డిమాండ్ చేయడంతోనే ఈ సరిహద్దు వివాదం రాజుకుంది. అంతేగాక బెలగావి, కార్వార్, నిప్పావితో సహా కర్ణాటకకు ఇచ్చిన 865 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇరువర్గాల రాజకీయ నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా, ఉథవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ డిసెంబర్ 21న చైనా సరిహద్దు వివాదాన్ని తెర మీదకు తీసుకువస్తూ..చైనా ప్రవేశించినట్లు కర్ణాటకలో అడుగుపెడతాం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారం కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంపై దాడి చేస్తూ..కర్ణాటకపై బలమైన వైఖరి అవలంభించ లేదంటూ ఆరోపణలు చేస్తోంది. (చదవండి: భారత్ జలాల్లోకి పాక్ ఫిషింగ్ బోట్..అప్రమత్తమైన అధికారులు) -
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : కేంద్రమంత్రి అమిత్ షా
-
పొలిటికల్ కారిడార్ : ఏపీ హోంమంత్రికి అమిత్ షా అభినందనలు
-
జమ్మూ కశ్మీర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
-
ఏపీ విభజన చట్టం అమలుపై ముగిసిన హోంశాఖ భేటీ
-
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్‌పై 300కి పైగా సహకార సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్కెట్‌ప్లేస్ (ఆన్లైన్ క్రయ, విక్రయ వేదిక/ఈ కామర్స్) ‘జెమ్’ పోర్టల్‌లో 300 వరకు కోఆపరేటివ్ సొసైటీలు (సహకార సంఘాలు) నమోదైనట్టు కేంద్ర హోంశాఖ, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. జెమ్ పోర్టల్‌లో సంస్థల నమోదు ప్రక్రియను మంత్రి వర్చువల్‌గా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. అమూల్, ఇఫ్కో, క్రిబ్కో, నాఫెడ్, సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంకు తదితర సంస్థలు కొనుగోలుదారులుగా జెమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నాయని చెబుతూ.. విక్రేతలుగానూ నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు. కోఆపరేటివ్ సొసైటీలు సైతం జెమ్ ద్వారా తమకు కావాల్సిన వస్తు, సేవలను కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జూన్‌లో అనుమతించింది. అంతకుముందు ఈ అవకాశం లేదు. తొలిదశలో రూ.100 కోట్ల టర్నోవర్/డిపాజిట్లు ఉన్న సొసైటీలను అనుమతించారు. దీంతో 589 సంస్థలకు అర్హత ఉందని గుర్తించగా, 300కు పైన ఇప్పటివరకు నమోదు చేసుకున్నాయి. మంత్రి ప్రారంభంతో.. మొదటి రోజే సుమారు రూ.25 కోట్ల విలువైన ఆర్డర్లు నమోదైనట్టు అంచనా. దేశవ్యాప్తంగా 8.5 లక్షల సహకార సంఘాలు ఉంటే, వీటి పరిధిలో 29 కోట్ల మంది భాగస్వాములుగా ఉన్నారు. జెమ్‌పై కోఆపరేటివ్‌ల నమోదు అర్హతలను మరింత సరళీకరించనున్నట్టు మంత్రి అమిత్‌షా తెలిపారు. కాగా, సహకార సంఘాల్లో సంస్కరణలు అవసరమని మంత్రి అమిత్‌షా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. -
బిట్ కాయిన్ కుంభకోణం: ఇద్దరు మంత్రులపై నిఘా కన్ను
సాక్షి, బనశంకరి(కర్ణాటక): రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న బిట్‌కాయిన్ కుంభకోణంలో సొంత పార్టీ నేతలే విపక్షాలకు సమాచారం చేరవేస్తున్నారని బీజేపీ పెద్దల్లో అనుమానం ఏర్పడింది. దీంతో ఇద్దరు మంత్రుల కదలికలపై కేంద్ర బీజేపీ నేతలు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించాల్సిన కొందరు మంత్రులే ప్రతిపక్షాలతో కుమ్మక్కైనట్లు బీజేపీ సందేహిస్తోంది. హైకమాండ్‌కు సీఎం మొర బిట్‌కాయిన్‌పై ఆ ఇద్దరే ప్రతిపక్ష నేతలకు లీక్‌లు ఇస్తున్నారని సీఎం బసవరాజబొమ్మై పార్టీ అధినేత జేపీ.నడ్డా, హోం మంత్రి అమిత్‌షా కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిని తీవ్రంగా పరిగణించిన హై కమాండ్ ఇద్దరు మంత్రుల కదలికలపై నిఘాపెట్టడానికి రహస్య బృందాన్ని బెంగళూరుకు పంపించినట్లు తెలిసింది. బిట్‌కాయిన్ స్కాంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే సమాచారాన్ని విపక్షాలకు లీక్ చేస్తున్నారని గుసగుసలున్నాయి. ఇటీవల హానగల్ ఉప ఎన్నిక సమయంలో విపక్షనేత సిద్దరామయ్య ఈ కేసును ట్విట్టర్ ద్వారా లేవనెత్తాక పెను దుమారం మొదలైంది. సీఎం బొమ్మై ఢిల్లీ పర్యటనలో మంత్రుల నిర్వాకంపై హైకమాండ్ ముందు వాపోయారు. తనకు మంత్రుల మద్దతు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి గుట్టు విప్పుతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై ఆధారాలు సమర్పిం చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈనెల 17న రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ కలిసి వచ్చి ప్రభుత్వ అవినీతి గుట్టు విప్పుతామని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, అధికార ప్రతినిధులు బోరెడ్డి అయోధ్యరెడ్డి, సుధీర్‌రెడ్డి, మత్స్యకార కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి కేసీఆర్ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని బీజేపీ అధ్యక్షుడు సంజయ్ చెబుతుంటే, రాష్ట్ర ప్రభు త్వంలోని పెద్దల అవినీతి వ్యవహారాలపై ఆధా రాలు దొరకలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ ఫిర్యాదులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తమకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మైనింగ్ తదితర రంగాలకు సంబంధించి తెలంగాణలో జరిగిన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. అన్ని ఆధారాలు అమిత్‌షాకు అందజేస్తామని పేర్కొన్నారు. తాగుబోతు రాష్ట్రంగా మారుస్తున్నారు రాష్ట్రం వ్యసనపరులకు స్వర్గధామంగా మారిందని, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా యని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెట్టి తెలంగాణను తాగు బోతు రాష్ట్రంగా మారుస్తున్నారని విమర్శించారు. గంజాయి మత్తులో తెలంగాణ యువత తూగుతోం దన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పాశవిక సంఘట నలకు ఈ వ్యసనాలే కారణమవుతున్నాయని పేర్కొన్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్యకు కూడా ఈ వ్యసనమే కారణమయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన నిందితుడిని గంటల్లోనే పట్టుకున్నారని పోలీసులను అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్, తర్వాత తన ట్వీట్‌ను సవరించుకుని నిందితుడు దొరకలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంత సీరియస్ ఘటనలు జరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని రేవంత్ అన్నారు. ఈ ఘటనపై వెంటనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
ఐపీఎస్‌ల సంఖ్య పెంచండి: అమిత్‌షాతో సీఎం కేసీఆర్
-
లక్ష్మణ్‌కు అమిత్‌షా శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కె. లక్ష్మణ్‌కు హోంమంత్రి అమిత్‌షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగాల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదొక్కిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 90వేల మంది బీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ బీసీల కోసం అనే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారికి అవి అందకుండా చేస్తోందని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, దీనికోసం ఓబీసీ మోర్చా కృషి చేయనున్నట్టు స్పష్టం చేశారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కనీసం ప్రగతి భవన్ కూడా దాటని సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినట్టు తెలిపారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ ఎదిగినట్టు తెలిపారు. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించింది.. బీజేపీ తెలంగాణపై దృష్టి సారించిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ నుంచి ఇద్దరికి పార్టీలో కీలక పదవులు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని, వారిని గద్దె దించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. -
గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు విదేశీ నిధులను అనుమతించడంపై హోం మంత్రి అమిత్‌షా స్పందిచారు. విదేశీ సహకార (రెగ్యులేషన్) చట్టం, 2010పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్‌షా అన్నారు. ఇది సిక్కు సమాజ అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి తెలియజేస్తుంది’ అని తెలిపారు. ‘శ్రీ హర్మందిర్ సాహిబ్ వద్ద విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం, 2010పై ఒక మార్గదర్శకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది మన సిక్కు సోదరీమణుల అత్యుత్తమ సేవా స్ఫూర్తిని మరోసారి ప్రదర్శిస్తుంది’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. ‘శ్రీ దర్బార్ సాహిబ్ ఆశీర్వాదం మనకు బలాన్ని ఇస్తుంది. దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా సంగత్ సేవ చేయలేకపోయింది. శ్రీ హర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్సీఆర్ఏను అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంగత్, శ్రీ దర్బార్ సాహిబ్ల సేవ బంధాన్ని మరింత పటిష్టం చేసిన క్షణం’ అని అమిత్‌షా తన క్యాప్షన్‌లో జోడించారు. ਸੇਵਕ ਕਉ ਸੇਵਾ ਬਨਿ ਆਈ ॥ PM @narendramodi ji is blessed that Wahe Guru ji has taken Seva from him. The decision on FCRA at the Sri Harmandir Sahib is a pathbreaking one which will once again showcase the outstanding spirit of service of our Sikh sisters and brothers. — Amit Shah (@AmitShah) September 10, 2020 పంజాబ్‌లోని సచ్‌ఖండ్ శ్రీ హర్మాందిర్ సాహిబ్-దర్బార్ సాహిబ్‌కు 2010లో విదేశీ సహకారం (నియంత్రణ) చట్టం కింద ఐదేళ్ల వరకు చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్‌ను మంజూరు చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇది సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి విదేశీ నిధులును సేకరించడానికి వీలు కల్పిస్తుంది. కొంత మంది వ్యక్తులు లేదా సంఘాలు విదేశీ సహకారం పొందటానికి, విదేశీ నిధుల వినియోగాన్ని నియంత్రించడానికి విదేశీ సహకార చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. విదేశీ నిధులను పక్కదోవ పట్టించడానికి చెక్ పెట్టేందుకు 2010లో ఎఫ్సీఆర్ఏ చట్టాన్ని పార్లమెంట్ అమలు చేసింది. చదవండి: కరోనా: సర్వేలో షాకింగ్ నిజాలు -
‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’
పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా బిహార్ జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆయనకు సమాధానం ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ రిప్లైని పప్పు యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ లేఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సరిపోతుంది. మేం దీనిని ఆ శాఖకు పంపిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. దీనిపై పప్పు యాదవ్ స్పందిస్తూ, అమిత్‌షా మీరు అనుకుంటే ఈ కేసులో ఒక్క నిమిషంలో సీబీఐ విచారణ మొదలవుతుంది. దయచేసి దీనిని పక్కన పెట్టొద్దు అని పేర్కొన్నారు. చదవండి: ఎందుకీ ఆత్మహత్యలు ఇక పప్పు యాదవ్‌తో పాటు నటుడు శేఖర్ సుమన్ కూడా సుశాంత్ ఆత్మహత్య విషయంలో పోరాటం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వెనక్కు తగ్గతున్నట్లు ఆయన ప్రకటించారు. వాళ్ల అభిప్రాయాలకు మనందరం గౌరవమివ్వాలి అని ఆయన కోరారు. చదవండి: ‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’ ఇక సుశాంత్ చిన్నతనంలో గడిపిన పాట్నాలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న ఇంటిని మెమొరియల్‌గా మార్చనున్నట్లు అతని కుటుంబం తెలిపింది. ఇందులో ఆయన అభిమానుల కోసం సుశాంత్ దగ్గర ఉన్న బుక్స్, ఆయన వాడిన టెలిస్కోప్ ఇంకా ఇతర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఆయన సోషల్‌మీడియా అకౌంట్లను కూడా కొనసాగిస్తామని ఆయన కుటుంబం తెలిపింది. జూన్ 14 వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’ -
‘ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర’
జైపూర్: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమ శాసనసభ్యులకు 15 కోట్లరూపాయలు ఆశచూపి, వారిని డబ్బుతో కొనేయాలని చూస్తోందని ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. అయితే తమ ప్రభుత్వం స్థిరంగా ఉండడం మాత్రమే కాదనీ, తమ ప్రభుత్వం ఐదేళ్ళ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా తన ప్రభుత్వాన్ని సహించలేకపోతున్నారనీ, అందుకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని గహ్లోత్ ఆరోపించారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకే బీజేపీ నాయకులు గేమ్ ఆడుతున్నారన్నారు. అడ్వాన్స్‌గా రూ.10 కోట్లను, ప్రభుత్వాన్ని కూల్చాక మరో రూ.15 కోట్లు ఇస్తామని చెప్పి తమ శాసనసభ్యులను కొనేయత్నం చేశారని గహ్లోత్ అన్నారు. బీజేపీ నాయకులు రాజకీయాలను ‘మేకల మండీ’లా భావిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు గులాబ్ చంద్ కటారియా, రాజేంద్ర రాథోడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియాలు కేంద్ర నాయకత్వ ఎజెండాను అమలు చేస్తున్నారంటూ గహ్లోత్ ఆరోపించారు. -
దీదీ బెంగాల్లో అవినీతికి గెట్లు ఎత్తేశారు
-
సీఏఏ విమర్శకులపై అమిత్ షా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే షహీన్‌బాగ్ వంటి వేలాది ఘటనలను నివారించవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజధాని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) విమర్శిస్తున్న ప్రత్యర్ధులను లక్ష్యంగా చేస్తూ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా నిప్పులు చెరిగారు. షహీన్‌బాగ్‌లో జరిగిన ఘటనలను అంతే ఆగ్రహంతో ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో బటన్ నొక్కడం ద్వారా ప్రతిఘటించవచ్చని సోమవారం ఢిల్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ పేర్కొన్నారు. బీజేపీకి మీరు వేసే ఓటు ద్వారా దేశాన్ని, ఢిల్లీని సురక్షితంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో వందలాది మంది గత 30 రోజులుగా చేపట్టిన నిరసనలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా షహీన్‌బాగ్ ఘటనను అమిత్ షా ఆక్షేపించడాన్ని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా సాగే ఆందోళనలను తోసిపుచ్చడం అంటే మహాత్మాగాంధీ ప్రవచించిన అహింసా వాదాన్ని తోసిపుచ్చడమేనని వ్యాఖ్యానించారు. చదవండి : శత్రు ఆస్తుల అమ్మకానికి మంత్రుల బృందం -
‘పౌర ప్రకంపనల వెనుక విపక్షాలు’
పట్నా : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న విపక్షాలపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు దేశంలో హింసను ప్రేరేపిస్తున్న క్రమంలో వారి ఆగడాలను అడ్డుకునేందుకు బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజలకు పౌరచట్టంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు చేపట్టవలసి వచ్చిందని చెప్పారు. ముస్లిం సోదరులు సీఏఏను పూర్తిగా చదవాలని చెప్పేందుకే తాను ఇక్కడకు వచ్చానని బిహార్‌లోని వైశాలిలో గురువారం జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అమిత్ షా పేర్కొన్నారు. పౌరచట్టంపై ప్రజలను తప్పుదారి పట్టించవద్దని రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్‌లను ఆయన కోరారు. మమతా దీదీ, కేజ్రీవాల్ కూడా ఈ చట్టంపై దుష్ర్పచారం మానుకోవాలని అమిత్ షా హితవు పలికారు. సీఏఏ పట్ల బిహార్ ప్రజలు సానుకూలంగా ప్రతిస్పందించారని చెప్పారు. చదవండి : బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా! -
‘మోదీ, షా’ విజన్ ఎంతో గొప్పది : రతన్ టాటా
న్యూఢిల్లీ : ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం, టాటా గ్రూపు గౌరవ ఛైర్మన్ రతన్ టాటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా గొప్ప విజన్ కలిగిన నాయకులంటూ కొనియాడారు. బుధవారం గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్(ఐఐఎస్) పారిశ్రామికవేత్త రతన్ టాటా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోదీ, అమిత్ షా దూరదృష్టి గల నాయకులని ప్రశంసించారు. దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి మోదీ, షా ఎన్నో దూరదృష్టి గల నిర్ణయాలను తీసుకున్నారన్నారు. విజన్ కలిగిన నాయకులకు మద్దతిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మోదీ, షా నాయకత్వంలో అన్ని శాఖలు అద్భుతంగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనడం విశేషం. సింగపూర్ ఐటీఈఎస్ నమూనాలో ప్రారంభమయ్యే ఈ సంస్థలు నేషనల్ స్కిల్ డెవలప్మంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీఎస్) నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో పనిచేస్తాయి. గాంధీనగర్‌లో ప్రారంభమయ్యే సంస్థలో రక్షణ, ఏరోస్పేస్, చమురు తదితర అంశాలలో శిక్షణ ఇస్తారు. మానవ వనరులను సమృద్దిగా ఉపయోగించడమే ఈ సంస్థలు లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. టాటా గ్రూప్ ఐఐఎస్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు ఐఐఎస్‌ను ప్రారంభించింది. కాన్పూర్, మొంబైలలో ఐఐఎస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
దేశ భద్రత కోసం మొత్తం సరిహద్దు రీమ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను రీ మ్యాప్ చేయడానికి కేంద్ర హోం శాఖ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, ఆయా సరిహద్దులలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ యాక్షన్ దళాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా అక్టోబరులో పారా మిలిటరీ దళాల డీజీ, ఐబీ చీఫ్, రా, సీబీఐ అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారని తెలుస్తోంది. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు వెంబడి బైక్ మీద లేదా అవసరమైతే కాలినడకన వెళ్లి బలమైన కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐబీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే చర్యకు ప్రభుత్వం ఉపక్రమించింది. మరోవైపు పంజాబ్‌లోకి పాక్ పెద్దెత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని స్థానికంగా రెచ్చగొడుతోంది. అంతేకాక, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీహాదీ ఉగ్రవాదం, భయంకర ఆర్థిక ఇబ్బందుల దృష్యా సరిహద్దుల్లోనూ, దేశంలోనూ తీవ్ర అలజడి సృష్టించే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, రా, ఎన్ఏఐ, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, పంజాబ్ పోలీసులతో స్పెషల్ కౌంటర్ గ్రూపును ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎస్పీజీ కమాండో యూనిట్‌ను నెలకొల్పాలని అమిత్‌షా భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని నరోవర్ జిల్లాలో సరిహద్దు వెంబడి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల క్యాంపును గుర్తించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా దీనికి కారణం అయ్యింది. ఉగ్రదాడులను ఎస్పీజీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటాయి. -
ఎన్నార్సీపై పునరాలోచన అవసరం
కొన్నేళ్లుగా అస్సాం పౌరులను హడలెత్తిస్తున్న జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ) ‘జాతీయం’ కాబోతోంది. ఈ దేశ పౌరులెవరో, కానివారెవరో ఆరా తీయడానికి త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ దాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో చేసిన ప్రకటన సారాంశం. ఆయన అలా ప్రకటించిన కొద్దిసేపటికే అస్సాం ఆర్థికమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలో రూపొందిన ఎన్ఆర్సీ తమకు సమ్మతం కాదని ప్రకటించారు. దాన్ని రద్దు చేసి జాతీయ స్థాయిలో చేపట్టాలనుకుంటున్న ప్రక్రియలో తమనూ చేర్చాలని కోరారు. దీన్నిబట్టే ఎన్ఆర్సీ అక్కడ ఎలాంటి పోకడలకు పోయిందో బోధపడుతుంది. స్థూలంగా చూస్తే ఇరుగు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడుంటున్నవారిని ఏరి పారేయడానికి ఇదొక అద్భుత మైన ప్రక్రియ అనిపిస్తుంది. కానీ లోతులకుపోయి గమనిస్తే ఇందులోని లోపాలు అర్థమవుతాయి. దేశవ్యాప్తంగా అమలు చేయబోయే ఎన్ఆర్సీ ప్రక్రియ రూపురేఖలెలా ఉంటాయో ఇంకా ప్రకటిం చవలసే ఉన్నా, అస్సాంలో అదెంత సొగసుగా జరిగిందో తెలుసుకుంటే దాంతో వచ్చిన సమస్య లేమిటో తెలుస్తాయి. ఆ రాష్ట్రంలోని 3 కోట్ల 30 లక్షలమందికిపైగా పౌరుల పుట్టుపూర్వోత్తరాలను వడబోసి అందులో 40.07 లక్షలమంది ఇక్కడి పౌరులు కారని నిరుడు జూలైలో విడుదల చేసిన తుది ముసాయిదా తేల్చిచెప్పింది. దీనిపై తీవ్ర కల్లోలం చెలరేగిన తర్వాత ఇది తుది ముసాయిదా తప్ప తుది జాబితా కాదని, ఇందులో చోటు దక్కనివారు మళ్లీ తగిన పత్రాలతో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. వాటన్నిటి ఆధారంగా మరోసారి వడబోత చేసి మొన్న ఆగస్టులో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 3 కోట్ల 11 లక్షల 21 వేలమందికి ఎన్ఆర్సీలో స్థానం దక్కింది. మిగిలిన 19 లక్షల 6వేల 657మంది ఇక్కడి పౌరులు కాదని నిర్ధారించారు. ఈ ప్రక్రియ జనాభా గణన కాదు. ఇంటింటికీ వచ్చి పౌరుల వివరాలడిగి, అవసరమైన పత్రాలు చూపమని ఎవరూ అడగరు. ఎవరికి వారు తాము ఈ దేశ పౌరులమని నిరూపించు కోవాలి. అందుకు అవసరమైన పత్రాలేమిటో తెలుసుకుని వాటిని ఎన్ఆర్సీ సేవా కేంద్రాలకు తీసు కుపోవాలి. అధికారుల అనుమాన దృక్కుల నుంచి తప్పించుకోవాల్సిన బాధ్యత పౌరులదే. ఇది అచ్చంగా అస్సాంలో అమలు చేసిన విధానం. అస్సాంలో 1971 మార్చి 24ను కటాఫ్ తేదీగా లెక్కేసి, ఆ తేదీనాటికి నివాసం ఉన్నట్టు చూపే పత్రాలను సమర్పించమని పౌరుల్ని కోరారు. అలా చూపలేనివారిని ఈ దేశ పౌరులుగా ప్రకటించడం సాధ్యం కాదని ప్రకటించారు. జాబితాకెక్కని పౌరుల వివరాలు చూస్తే ఏ వర్గాలు ఇందువల్ల చిక్కుల్లో పడ్డాయో తెలుస్తుంది. నిరుపేదలు, నిరక్షరాస్యులు, మహిళలు వీరిలో అధికంగా ఉన్నారు. ఇంకా లోతులకు పోయి చూస్తే బిచ్చగాళ్లు, ఇల్లూ వాకిలీ లేనివారు ఎక్కువ. చిత్రమేమంటే ఒకే కుటుంబంలో భార్య ఎన్ఆర్సీలో ఉంటే... భర్తకు అందులో చోటు దక్కలేదు. అన్నదమ్ముల్లో కొందరు జాబితాలోకెక్కితే మరికొందరికి ఆ అదృష్టం దక్కలేదు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా ఉదంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరు గల్లంతు కావడంతో అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించగా, జాబితాలో చోటు సంపాదించుకున్న కుటుంబసభ్యులు లబోదిబోమంటూ గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్ దొరికింది. ఇప్పుడు జాబితాలో చోటుదక్కని వారంతా వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో ఉన్నారు. వీరి విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఖరారు చేయాల్సి ఉంది. ‘కాలు తొక్కిన్నాడే కాపురం తీరెలా ఉందో తెల్సింద’న్నట్టు 2010లో ఈ ప్రక్రియకు సంబం ధించిన పైలెట్ ప్రాజెక్టును అస్సాంలోని బార్పేట, కామ్రూప్ జిల్లాల్లోని రెండు తహసీళ్లలో అమలు చేసినప్పుడే ఇదెలాంటి విద్వేషాలు రగులుస్తుందో అధికారులకు అర్ధమైంది. అప్పట్లో ఆగ్ర హావేశాలతో రగిలిపోయిన గుంపు బార్పేట డెప్యూటీ కమిషనర్ కార్యాలయంపై దాడిచేసి హింసకు పాల్పడినప్పుడు పోలీసు కాల్పుల్లో నలుగురు మరణించారు. ఆ తర్వాత ఆ ప్రక్రియను అటకెక్కించారు. బహుశా 2013లో సుప్రీంకోర్టు ఒత్తిడి చేయకపోయి ఉంటే అదింకా ఆ స్థితిలోనే ఉండేది. కానీ అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేసి తీరాల్సిందేనంటూ సుప్రీంకోర్టు పట్టుబట్టడంతో దానికి కదలిక వచ్చింది. 2015 జూలైలో ధర్మాసనం మార్గదర్శకాలు విడుదల చేశాక ఈ ప్రక్రియ రాష్ట్రమంతటా మొదలైంది. మొదటినుంచీ దీనిపై పట్టుదలగా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఎన్ఆర్సీని ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన మౌలిక పత్రమని ప్రశంసించి ఉండొచ్చు... కానీ అస్సాంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకే ఆ జాబితా మింగు డుపడటం లేదు. ఉండకూడని వాళ్లంతా ఆ జాబితాకెక్కగా, అర్హులైనవారెందరో దానికి వెలుపల ఉండిపోయారని హిమంత బిశ్వశర్మ ఆక్రోశిస్తున్నారు. ఈ జాబితాను అస్సాం సర్కారే తయారు చేసిందని దేశమంతా అనుకుంటుండగా, ఎన్ఆర్సీ రాష్ట్ర సమన్వయకర్తగా పనిచేసి రిటైరైన ప్రతీక్ హలేజా ప్రభుత్వానికి ఏ దశలోనూ, ఏమీ చెప్పలేదని ఆయన ఆరోపిస్తున్నారు. బిశ్వశర్మ కోరు కున్నట్టు ప్రభుత్వ ప్రమేయం ఉంటే ఆ జాబితా ఎవరిని ఒడ్డుకు చేర్చేదో... ఎవరిని వీధులపాలు చేసేదో! అనుభవం గడించాకైనా తత్వం బోధపడాలి. అస్సాంలో జరిగిన గందరగోళ పర్వం గమ నించాకైనా, జాబితాలో చోటు సంపాదించలేనివారి బాధామయ గాధలు చూశాకైనా దేశవ్యాప్తంగా దీని అమలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో పాలకులు గ్రహించాలి. సాక్షాత్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక చిన్న రాష్ట్రంలో సాగిన ప్రక్రియే ఇంత లోపభూయిష్టంగా ఉంటే... దేశమంతా ఎన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తుతాయో ఊహించుకోవాల్సిందే. ఈ బృహత్తర కార్యక్రమం విష యంలో ఎన్డీఏ పాలకులు ఆచి తూచి అడుగేస్తారని ఆశిద్దాం. -
తెలంగాణలో నీళ్లకన్నా బార్లే ఎక్కువ: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురి పాలవుతోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ కె.లక్ష్మణ్ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ‘తెలంగాణ సమస్యలను పరిష్కరించలేని నువ్వు రాయలసీమను రతనాలసీమగా మారుస్తాననడం విడ్డూరంగా ఉంద’ని కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. బార్లు తెరిచి, బీర్లు తాగండి తన్నుకు చావండన్న ధోరణిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెల్లో నీళ్లు దొరకడం లేదు కానీ పల్లెల్లో బీర్లు దొరుకుతున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కేసీఆర్ మాత్రం ట్రెజరీలో డబ్బులను దాస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీని, ఆయుష్మాన్ భారత్‌ను సరిగ్గా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని విమర్శించారు. అవినీతి, అప్పుల్లో తెలంగాణ నెంబర్‌వన్ అని కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులమవుతామా అని అన్నారు. అమిత్ షాని అభినవ సర్దార్ పటేల్‌గా అభివర్ణిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. అందరం కలిసికట్టుగా తెలంగాణను కాపాడుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ తండ్రీకొడుకుల పార్టీ, కాంగ్రెస్ తల్లీ కోడుకుల పార్టీ అని ఇరు పార్టీలను లక్ష్మణ్ తూర్పారబట్టారు. -
ఆర్టికల్ 370 : అమిత్ షా వర్సెస్ అధీర్ రంజన్
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం మంగళవారం లోక్‌సభలోనూ పెను ప్రకంపనలు రేపింది. ఆర్టికల్ 370ను ద్వైపాక్షిక అంశంగా ఎందుకు పరిగణించడం లేదంటూ హోంమంత్రి అమిత్ షాను కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించడంతో సభలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేయాలంటూ అమిత్ షా నిలదీయడంతో అధీర్ రంజన్ తీరుతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఆర్టికల్ 370 అంతర్గత వ్యవహారమని ప్రభుత్వం చెబుతోందని, కశ్మీర్ పరిణామాలను 1948 నుంచి ఐక్యరాజ్యసమితి పర్యవేక్షిస్తున్న క్రమంలో, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్లపై సంతకాలు చేసిన నేపథ్యంలో అది అంతర్గత వ్యవహారం ఎలా అవుతుందని అధీర్ ప్రశ్నించారు. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని చెబుతూ అమెరికా జోక్యం చేసుకోరాదని గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జమ్ము కశ్మీర్ ఇప్పటికీ అంతర్గత అంశమనే మీరు చెబుతారా అన్నది తమ పార్టీ తెలుసుకోవాలనుకుంటోందని అన్నారు. నిబంధనలకు పాతరేస్తూ జమ్మూ కశ్మీర్‌ను రాత్రికి రాత్రి కేంద్ర పాలిత ప్రాంతం చేశారని దుయ్యబట్టారు. కాగా, జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో భాగమేనని అమిత్ షా బదులిచ్చారు. కశ్మీర్‌లోయలో ఐరాస జోక్యాన్ని కాంగ్రెస్ ఆశిస్తోందా అని నిలదీశారు. కశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో అధికరణ 370, అధికరణ 35ఏ రద్దు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ, నిఘా వర్గాల సమాచారం మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం అందుకు తమ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల అనుమతి లేకుండా ర్యాలీలు తీసేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధికరణ 370 రద్దు ప్రకటనకు ముందే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల ను కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రకటన అనంతరం కేంద్ర హోం శాఖ వర్గాలు అధికారికంగా తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కాన్ఫరెన్స్.. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో తగిన సూచనలు చేశారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సైబర్, టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, టీఎస్ఎస్పీ పోలీసులతోనూ డీజీపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఉద్రిక్తతలు తొలగి సాధారణ వాతావరణం వచ్చేంత వరకు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సున్నితప్రాంతాలు అధికంగా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. -
యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలపాల (నిరోధక) సవరణ బిల్లు (యూఏపీఏ)కు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 147 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 42 మంది ఎంపీలు ఓటు చేశారు. వ్యక్తులనూ ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించే ఈ బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తున్న సందర్భాల్లో వ్యక్తులు మరో కొత్త సంస్థలను ఉనికిలోకి తెస్తున్నారని ఆయన అన్నారు. పెద్దలో సభలో బిల్లు ఆమోదానికి ముందు బిల్లుపై వాడివేడి చర్చ సాగింది. ఉగ్రవాదానికి మతం లేదని, కాలానుగుణంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చర్చను ప్రారంభిస్తూ అమిత్ షా అన్నారు. గతంలో ఈ తరహా కేసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించారని, యూఏపీఏ బిల్లును ఓ మతాన్ని టార్గెట్ చేస్తుందనే దుష్ర్పచారం సాగిందని చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశిస్తూ ఎమర్జెన్సీ సమయంలో మీడియాను నిషేధించి, విపక్ష నేతలందరినీ జైలు పాలు చేసిన మీకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నామని మమ్మల్ని ఆరోపించే అర్హత లేదని మండిపడ్డారు. యూఏపీఏ బిల్లు రెండు విభిన్న అంశాలతో కూడిఉందని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్పుకొచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదం రెండు భిన్న అంశాలను ఒకే బిల్లులో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వ్యక్తులను శిక్షించే అధికారం ప్రస్తుత చట్టంలో ఉండగా సవరణ బిల్లు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉగ్రవాదులో కూడిన ఉగ్ర సంస్ధలను నిషేధిస్తే తిరిగి వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ఎందుకని నిలదీశారు. వివాదాస్పద అంశాలతో కూడిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చిదంబరం కోరారు. -
యూపీ అభివృద్ది సారథి యోగి : అమిత్ షా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ అద్భత పాలన అందిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. లక్నోలోని ఓ వేడుకకు సీఎం యోగితో కలిసి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో గోరఖ్‌పూర్ పీఠాదిపథిగా యోగి.. అందరి మన్ననలు పొందాడని అమిత్ షా గుర్తుచేశారు. రాజకీయంగా, సామాజికంగా ఉత్తరప్రదేశ్ భారతదేశానికి చాలా కీలక రాష్ట్రమని అభిప్రాయపడ్డారు. యోగి పాలన వల్ల యూపీకి రికార్డు స్థాయిలో రూ. 65,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. యోగి రాజకీయాల్లో ఉంటూ సన్యాసి జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. కనీసం మున్సిపాలిటీని కూడా పాలించిన అనుభవం లేని వ్యక్తి.. యూపీ వంటి పెద్ద రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడనే సందేహం చాలామందికి ఉండేదన్నారు. కానీ వాటన్నింటికీ తన అద్భుతమైన పనితనంతో యోగి సమాధానం చెప్పాడని పేర్కొన్నారు. యోగికి అనుభవం లేకున్నా క్రమశిక్షణ, నిబద్దత, కష్టపడేతత్వం ఉన్నాయని.. అందుకే ఆయన ఆ పదవికి సమర్ధుడని బీజేపీ అధిష్టానంతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ భావించారని తెలిపారు. -
బీజేపీలో జోష్
సాక్షి, శంషాబాద్: బీజేపీ అధినేత అమిత్ షా పర్యటనతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. శనివారం శంషాబాద్ పట్టణంలో బీజేపీ నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు. సాయంత్రం 4.25 గంటలకు అమిత్‌షా శంషాబాద్‌లోని కెఎల్‌సీసీ కన్వెన్షన్‌కు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యువత చూపంతా బీజేపీ వైపే ఉందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయనడానికి బీజేపీకి చెందిన నలుగు ఎంపీల విజయమే నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఆయన చెస్తానని చెప్పిన ఒక్క పని కూడా పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్సీ రాచందర్‌రావు మాట్లాడుతూ.. ఉద్యోగాలు, ఉపాది పేరిట ఉద్యమాలు చేయించిన టీఆర్ఎస్ పార్టీ.. ఆ దిశగా మాట నిలపుకోలేదన్నారు. ఉద్యోగాల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం యువతను దగా చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రధాని నరేంద్రమోదీ సుపరిపాలనను ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో బీజేపీ దేశంలోనే పటిష్టమైన పార్టీగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్‌ను అందిందని, అందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి ధన్యవాదాలన్నారు. ఈ బడ్జెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులు, పేద ప్రజల పక్షపాతిగా నిరూపించుకుందన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె చెప్పారు. బీజేపీలో చేరిన టీడీపీ నేత టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు అమిత్‌షా కాషాయం కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. శంషాబాద్ మండలానికి చెందిన బుక్క వేణుగోపాల్ గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున రాజేంద్రనగర్ టికెట్ ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. వేణుగోపాల్ చేరికతో శంషాబాద్‌తో పాటు జిల్లా పార్టీలో బీజేపీకి బలం చేకూరిందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రేమ్‌రాజ్, జిల్లా కార్యదర్శి చింతల నందకిశోర్, రాష్ట్ర నాయకులు రాజ్‌భూపాల్‌గౌడ్, కొండ శేఖర్‌గౌడ్, మండల అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, కె.ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మమత తీరుపై సిగ్గు పడుతున్నా..
సాక్షి, కోల్‌కతా : జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ కూతురు షబ్బా హకీమ్ ఘాటైన విమర్శలు చేసింది. తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘ పనికి తగిన భద్రత కల్పించాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న వారి ఆందోళన’ సరైనదేనని, ఒక టీఎంసీ కార్యకర్తగా మా నాయకురాలి ప్రవర్తన పట్ల సిగ్గుపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. జూనియర్ వైద్యుడిపై దాడికి నిరసనగా నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డాక్టర్లను వెంటనే విధుల్లో చేరాలని మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్లకు, ప్రభుత్వానికి మధ్య చోటుచేసుకున్న ఘర్షణతో కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆరోగ్య, ప్రజా సంక్షేమ శాఖను నిర్వర్తించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. జాతీయ ఎన్నికల సందర్భంగా ఆసుపత్రుల్లో ఉన్న భద్రతను మమతా బెనర్జీ తొలగించిందని, దీన్ని వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆమె పేర్కొన్నారు .బీజేపీ, సీపీఎంతో లోపాయికార ఒప్పందం చేసుకొని హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని షబానా ఆరోపించారు. దీనంతటికి పరోక్షంగా బీజేపీ చీఫ్ అమిత్ షా సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
అప్పటివరకూ అమిత్ షానే..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ చీఫ్ అమిత్ షా కొలువుతీరిన వెంటనే నూతన కమలదళాధిపతి ఎవరనే ఉత్కంఠ కాషాయ పార్టీలో నెలకొంది. అమిత్ షా స్ధానంలో పలువురి పేర్లు వినిపించినా ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఊసు లేదని పార్టీ అగ్రనాయత్వం స్పష్టం చేసిందని చెబుతున్నారు. రానున్న కొద్దినెలల్లో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వచ్చే ఏడాది ఆరంభం వరకూ అమిత్ షానే అధ్యక్ష హోదాలో కొనసాగుతారని బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరిగే హర్యానా, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చిన తర్వాతే సారథ్య బాధ్యతలను వేరొకరికి అప్పగిస్తారని చెబుతున్నారు. మరోవైపు అమిత్ షా సైతం పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో గురువారం పార్టీ జాతీయ కార్యవర్గ భేటీకి అమిత్ షా పిలుపు ఇచ్చారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, బీజేపీ రాష్ట్ర శాఖల అధ్యక్షులు హాజరయాయరు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీలో సంస్ధాగత ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం ద్వారా పార్టీ నాయకత్వ మార్పు దిశగా కసరత్తును చేపడతారు. -
షా అధికార నివాసానికి ఘన చరిత్ర
న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు త్వరలో కేటాయించనున్న కొత్త నివాసానికి ఘన చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలకుల హయాంలో పార్లమెంట్ భవన వాస్తుశిల్పి సర్ హెర్బర్ట్ బేకర్ విశాలమైన ఈ భవనంలోనే ఉన్నారని చరిత్ర చెబుతోంది. స్వతంత్ర భారతంలో ఇద్దరు సొలిసిటర్ జనరళ్లు, మాజీ ప్రధానులు వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ కూడా ఇందులో నివసించారని చరిత్రకారిణి, రచయిత స్వప్నా లిడ్లే తెలిపారు. బ్రిటిష్ పాలకుల హయాంలో రాజధాని ఢిల్లీ ప్రధాన వాస్తుశిల్పి సర్ ఎడ్విన్ లండ్సీర్ ల్యుటెన్ అయినప్పటికీ, ప్రభుత్వ సెక్రటేరియట్ ఉండే నార్త్, సౌత్ బ్లాకులతో పాటు పలు కీలక భవనాల రూపకల్పన చేసిన సర్ బేకర్.. ప్రస్తుతం 6ఏ నంబర్‌తో ఉన్న ఈ భవనంలోనే నివసించారు. అంతకుముందు ఈ భవనాన్ని హేస్టింగ్స్ రోడ్‌లోని 8వ నంబర్ భవనంగా పరిగణించేవారు. స్వాతంత్య్రానంతరం ఇది కృష్ణమీనన్ మార్గ్‌లోని 8వ నంబర్ బంగ్లాగా మారిపోయింది. ఇందులో ఉన్న చివరి ప్రముఖుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. ఆయన దాదాపు 14 ఏళ్లపాటు ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో వాజ్‌పేయి మరణించడంతో డిసెంబర్లో కుటుంబసభ్యులు ఈ ఇంటిని ఖాళీ చేశారు. బ్రిటిష్ చక్రవర్తి 5వ జార్జి కాలంలో 1911లో దేశ రాజధాని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మారిన విషయం తెలిసిందే. లండన్‌లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ వద్ద కూడా ఈ భవనం ఫొటో భద్రంగా ఉందని స్వప్నా లిడ్లే అన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా ప్రస్తుతం అక్బర్ రోడ్డులోని 11వ నంబర్ బంగ్లాలో ఉంటున్నారు. త్వరలోనే ఆయనకు కృష్ణమీనన్ మార్గ్‌లోని 6ఏ భవనాన్ని ప్రభుత్వం కేటాయించే అవకాశాలున్నాయి. -
అందుకే ప్రాణాలతో బయటపడ్డా..
సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతాలో మంగళవారం జరిగిన తన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ పధకం ప్రకారం హింసకు పాల్పడిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. హింసతో తమను అణగదొక్కలేరని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న దీదీకి బెంగాలీలు ఓటమి రుచిచూపుతారని ఆయన హెచ్చరించారు. రోడ్‌షో సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలను గుర్తుచేసుకున్న అమిత్ షా తాను అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డానని, సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడ లేకుంటే తాను తప్పించుకోవడం కష్టమయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. తన రోడ్‌షోపై తృణమూల్ కాంగ్రెస్ బాహాటంగా అక్కసు వెళ్లగక్కిందని, ప్రధాని మోదీ పోస్టర్లు, తన పోస్టర్లను తృణమూల్ కార్యకర్తలు చించివేశారని, అయినా బీజేపీ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. రోడ్‌షోకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని అన్నారు. రోడ్‌షో సందర్భంగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం, అమిత్ షాపై తృణమూల్ శ్రేణుల రాళ్ల దాడి, సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం కూల్చివేత ఘటనలు కలకలం రేపాయి. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థచే దర్యాప్తు జరిపించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసాకాండకు తృణమూల్ కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ హింసకు ప్రేరేపిస్తోందన్న అమిత్ షా తన ఆరోపణలకు మద్దతుగా కొన్ని ఫోటోలను ప్రదర్శించారు. -
అద్వానీ స్ధానంలో అమిత్ షా..
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగుతుందో ఊహించలేం. వయసు మీద పడిందనో, ఆరోగ్యం సహకరించడం లేదనో కాకలుతీరిన నేతలను కరివేపాకులా తీసివేస్తున్న కమలనాధుల తీరుకు ఆ పార్టీ వెల్లడించిన తొలి జాబితా అద్దం పడుతోంది. బీజేపీ దిగ్గజ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పక్కనపెట్టింది. అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్ నుంచి బీజేపీ చీఫ్ అమిత్ షాను బరిలో నిలిపింది. బీజేపీ గురువారం వెల్లడించిన పార్టీ అభ్యర్ధుల తొలిజాబితాలో అద్వానీ స్ధానంలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీచేయనున్నట్టు వెల్లడించింది. అద్వానీని దూరం పెట్టడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపుతుందని భావిస్తున్నారు. ఇక 1991లో అద్వానీ గాంధీనగర్ లోక్‌సభ స్ధానానికి నామినేషన్ దాఖలు చేస్తున్న సమయంలో ఆయనకు నరేంద్ర మోదీ సహకరిస్తుండగా, వారివెనుక అమిత్ షా నిల్చున్న ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరోవైపు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అద్వానీ స్ధానంలో అమిత్ షాకు చోటు కల్పించడంతో సోషల్ మీడియాలోనూ ఇదే టాపిక్ ట్రెండ్ అవుతోంది. -
నేడు అమిత్ షా రాక..
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ సమాయాత్తమవుతోంది. అందులో భాగంగా నిర్వహించే నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ క్లస్టర్ స్థాయి సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నేడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గ శక్తికేంద్రాలు, బూత్ ఇన్చార్జులు, ఆయా జిల్లాల పదాధికారులతో సమావేశం బుధవారం నగరశివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. మొదట ఫిబ్రవరి 13న ఈ సమావేశం నిర్వహించాలని భావించినా, అనివార్య కారణాల వల్ల వాయిదాపడిన విషయం తెలిసిందే. నేటి సమావేశానికి హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరనున్న అమిత్ షా మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు. ఇందుకోసం నగరంలోని దుబ్బలోగల గిరిరాజ్ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సమావేశ ప్రాంగణానికి చేరుకుంటారు. సుమారు 4వేల మంది నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్లస్టర్ స్థాయి సమావేశానికి బీజేపీ అగ్రనేతలు డాక్టర్ లక్ష్మణ్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి అరవింద్ లింబావళి, బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, నాయకులు కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరుకానున్నారు. సమావేశం ఏర్పాట్లను మంగళవారం జిల్లాకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పర్యవేక్షించారు. అమిత్ షా ప్రసంగించే వేదిక, హాల్‌తో పాటు గదులను పరిశీలించారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి వచ్చే జాతీయ, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, శక్తికేంద్రాల ఇన్చార్జులు, బూత్ అధ్యక్షులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా చూడాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. ఆయనవెంట రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, టక్కర్ హన్మంత్‌రెడ్డి, పల్లె గంగారెడ్డి, ధర్మపురి అర్వింద్, బస్వా లక్ష్మీనర్సయ్య, లలోక భూపతిరెడ్డి, సదానంద్‌రెడ్డి, న్యాలం రాజు, మల్లేష్ యాదవ్, తదితరులు ఉన్నారు. భారీ పోలీసు బందోబస్తు నిజామాబాద్‌అర్బన్: అమిత్‌షా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన గిరిరాజ్ కళాశాల గ్రౌండ్‌ను సీఆర్పీఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. కళాశాల మైదానం నుంచి భూమారెడ్డి కన్వెన్షన్ వరకు రోడ్డు మార్గం ద్వారా బందోబస్తు నిర్వహించనున్నారు. సీపీ కార్తికేయ సమావేశం జరిగే ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించారు. సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఏఆర్ పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నాయి. -
సమరానికి సన్నద్ధం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక సమరానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతోంది. పోలింగ్ నిర్వహణలో ఎంతో కీలకమైన బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల బాధ్యులను ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై నిస్తేజంలో ఉన్న ఆ పార్టీ శ్రేణులను పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం చేసే దిశగా చర్యలు చేపట్టింది. పక్షం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలుండటంతో ప్రత్యేక దృ ష్టి సారించింది. ఇందులో భాగంగా క్లస్టర్ స్థాయి సమావేశాన్ని బుధవారం నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్న ఈ సమావేశానికి ఐదు పార్లమెంట్ స్థానాల పరిధిలోని బూత్ కమిటీ బాధ్యులు, శక్తి కేంద్రాల ఇన్చార్జులు పాల్గొంటారు. నిజామాబాద్‌తో పాటు, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలోని శ్రేణులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు వేల మందిని సమావేశానికి తరలించేందుకు నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. నిజామాబాద్ స్థానంపై గురి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ నాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఏ ఒక్క అభ్యర్థికి కూడా డిపాజిట్లు దక్కలేదు. ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహంతో ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎలాగైనా పట్టు సాధించాలనే తపనతో బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. పార్టీకి పట్టున్న నిజామాబాద్ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికలుండే అవకాశాలుండటంతో గెలు పే లక్ష్యంగా వ్యూహాన్ని రచిస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్‌లో ఎంతో కీలకమైన బూత్ కమిటీ బాధ్యులు, శక్తి కేంద్రాల ఇన్చార్జులతో సమావేశం అవడం ద్వారా గెలుపు దిశగా పయనించవచ్చనే ఉద్దేశంతో ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. సన్నాహక సమావేశాలు.. క్లస్టర్ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తుగా నిజామాబాద్‌లో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను నిర్వహించింది. నిజా మాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల సన్నాహక సమావేశం ఆదివారం జరగగా, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల సమావేశం సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో జరిగింది. నేడు నిజామాబాద్‌కు లక్ష్మణ్ రాక అమిత్‌షా పర్యటనకు సంబంధించిన ఏ ర్పాట్లను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షులు లక్ష్మణ్ నేడు నిజామాబాద్‌కు రా నున్నారు. ఆయనతో పాటు పలువురు రా ష్ట్ర నాయకులు వస్తున్నారు. -
‘మెరుపు దాడులకు రాజకీయ మరక’
సాక్షి, న్యూఢిల్లీ : ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌పై భారత వైమానిక దాడులను బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మాజీ కేంద్ర మంత్రి మనీష్ తివారీ ఆరోపించారు. మెరుపు దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మన యుద్ధవిమానాలు నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించాయని, అయితే ఎంతమంది దాడుల్లో మరణించారని ఇప్పుడే వెల్లడించడం తొందరపాటు అవుతుందని వాయుసేన పేర్కొంది. వాయుసేన వివరణను ప్రస్తావిస్తూ అమిత్ షా ప్రకటనను మనీష్ తివారీ తప్పుపట్టారు. అమిత్ షా వ్యాఖ్యలు మెరుపుదాడులను రాజకీయం చేయడం కాదా అని ఆయన నిలదీశారు. వాయుసేన ప్రకటనకు భిన్నంగా 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని చెప్పడం రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టడమేనని అన్నారు. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్రవాదుల మరణంపై ఎలాంటి ఆధారాలు లేవని విదేశీ మీడియా కథనాలు ప్రచురించిందని మరో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా పీఓకేలో భారత్ చేపట్టిన వైమానిక దాడుల్లో 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని పాలక బీజేపీ శ్రేణులే ప్రచారంలో పెట్టాయని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. బాధ్యతకలిగిన పౌరుడిగా, ప్రభుత్వం వెల్లడించే సమాచారాన్ని తాను విశ్వసిస్తానని,అయితే ప్రపంచాన్ని మనం నమ్మించాలంటే విపక్షాలను నిందించడం మానేసి ఆ దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలుకుతూ చిదంబరం ట్వీట్ చేశారు. -
నిర్ణయం పాక్ చేతుల్లోనే...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చిందనీ, ఇక మనతో సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. దేశ వర్తమాన పరిస్థితులపై ప్రముఖులతో చర్చలు నిర్వహించేందుకు ఇండియా టుడే మీడియా గ్రూపు నిర్వహిస్తున్న ఇండియా టుడే కాంక్లేవ్–2019 శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు సదస్సును ప్రారంభిస్తూ ఇండియా టుడే ఎడిటర్ ఇన్ ఛీఫ్ అరుణ్ పురీ స్వాగతోపాన్యాసం ఇచ్చారు. ‘రానున్న ఎన్నికలు అనేక మౌలిక ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవి. సంకీర్ణ ప్రభుత్వాల కంటే సంపూర్ణ మెజారిటీ గల ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందా? దేశం ఒక గట్టి ఆధిపత్యం ఉండే నాయకుడిని కోరుకుంటోందా? లేక కేవలం మంచి టీమ్‌ను కోరుకుంటోందా? పుల్వామా దాడి ఘటన ఎన్నికలపై ఏమేర ప్రభావం చూపుతుంది.. వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇక కాంక్లేవ్‌లో తొలి వక్త బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ‘ఎన్నికల డైరీలు: విజయాలు, ఓటములు, ప్రజాస్వామిక రణక్షేత్ర సారాంశం’ అనే అంశంపై ప్రసంగించారు. ‘మోదీ నాయకత్వంలో దేశం పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చింది. సంబంధాలు ఎలా ఉండాలన్నది ఇప్పుడు ఇస్లామాబాద్ నిర్ణయించుకోవాలి’ అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ఖాన్ పుల్వామా దాడిని ఖండించకపోవడంపై ఆయన మండిపడ్డారు. సాంస్కృతిక వైరాలపై కాంగ్రెస్ నేత శశిథరూర్, బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే ప్రసంగించారు. మహిళా శక్తిపై క్రీడాకారులు మేరీకోమ్, మిథాలీ రాజ్ ఉపన్యాసాలు ఇచ్చారు. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తి అనే అంశంపై ప్రసంగించారు. శనివారం మోదీతోపాటు పలువురు వక్తలు ప్రసంగించనున్నారు. ప్రధాని రేసులో లేను: గడ్కరీ ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ‘బీజేపీ రాజకీయ విజయాలకు రోడ్‌మ్యాప్’ అన్న అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త అడిగిన ప్రశ్నకు గడ్కరీ స్పందిస్తూ ‘మేమంతా మోదీ వెనక ఉన్నాం. ఆయన విజన్ విజయవంతం చేయడంలో నేనొక కార్యకర్తను. ఇక ప్రధాన మంత్రి పదవి రేసులో నేనున్నానన్న ప్రశ్న ఎక్కడ తలెత్తుతుంది?’ అని ప్రశ్నించారు. ‘మోదీ ప్రధానమంత్రి. తదుపరి ప్రధాన మంత్రి కూడా ఆయనే. నేను ప్రధాన మంత్రి రేసులో లేను. అలాంటి కల నేను కనలేదు’ అని వ్యాఖ్యానించారు. పైలట్ పాక్ చెరలో ఉంటే.. ఎన్నికల భేటీలా? ‘కాంగ్రెస్ సన్నాహాలు, ఆత్మపరిశీలన’ అన్న అంశాలపై కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగించారు. ‘పాక్ ప్రతీకార దాడుల్ని వీరోచితంగా అడ్డుకొని పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్– 16 యుద్ధ విమానాన్ని నేలకూల్చిన మన పైలట్ ఆ క్రమంలో తన విమానం శత్రు భూభాగంలో నేలకూలడంతో పాక్‌కు బందీగా చిక్కాడు. ఈ పరిస్థితుల్లో దేశం మొత్తం తీవ్ర ఉద్విగ్న స్థితిలో ఉంటే మన ప్రధాని మాత్రం బూత్ కమిటీ సభ్యులతో రాజకీయ సమావేశం నిర్వహించడం నన్ను విస్మయానికి గురిచేసింది. పైలట్ పాక్‌లో చిక్కుకుంటే మోదీ ఎన్నికల భేటీలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం?’ అని సింధియా ప్రశ్నించారు. రాజస్తాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మాట్లాడుతూ ‘ఒకవైపు పాక్ దాడులకు తెగబడుతుంటే ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ముందుండి దేశానికి దిశా నిర్దేశం చేయాలి. ఆ సమయంలో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడి ఉండాల్సింది. అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపై ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యేది’ అని అన్నారు. -
ఇన్చార్జ్.. అవుటాఫ్ చార్జ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిరాశలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపే చర్యలు ఊపందుకోవడం లేదు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా రాష్ట్ర పార్టీలో కొత్త స్ఫూర్తిని రగిలించాల్సిన ముఖ్యనేతలు, నాయకులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రం నుంచి ఆశించిన మేర పార్టీకి రాజకీయంగా ప్రోత్సాహం అందకపోవడంతో రాష్ట్ర బీజేపీ బలోపేతంపై జాతీయ పార్టీ నేతలు పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఉన్నా, ఎన్నికల ఇన్చార్జిలను జాతీయ పార్టీ గతంలోనే నియమించినా పార్టీ బలోపేతం కావడం లేదని, విస్తరించడం లేదన్న వాదనలు పార్టీ వర్గాలే వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో బలం పుంజుకునేందుకు మంచి అవకాశంగా అందివచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పార్టీ నేతలు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలొచ్చాయి. పక్కా కార్యాచరణ చేపట్టడంలో ఇన్చార్జిలు విఫలమయ్యారంటూ కొందరు నాయకులు అంతర్గత సమావేశాల్లో వాపోయినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలకల్లా పార్టీ పరిస్థితిలో మార్పు వస్తుందని, జాతీయస్థాయిలో మాదిరిగానే ఇక్కడా మోదీ మంత్రం పనిచేస్తుందని ఆశిస్తున్నా, అది నెరవేరుతుందో లేదోఅన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. వ్యవహారాల ఇన్చార్జిదీ అదే దారి.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న కృష్ణదాస్ పరిస్థితి కూడా అంతేనన్న విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా చుట్టపుచూపుగా అప్పుడప్పుడు వచ్చి పోతారు తప్ప పార్టీ పరిస్థితిపై గట్టిగా రివ్యూ చేసింది, నేతలకు దిశానిర్దేశం చేసింది ఒక్కసారి కూడా లేదన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ నేతలను ఉత్సాహపరిచి కార్యక్రమాలను ముందుండి నడిపించిన సందర్భమే లేదని పలువురు నేతలు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు నియమించిన ఇన్చార్జిలు మాత్రం ఎక్కువ సమయం ఇచ్చి పనిచేస్తున్నారని, తెలంగాణలోనే పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జీగా కేంద్రమంత్రి, సీనియర్ నేత జేపీ నడ్డాను జాతీయ పార్టీ రాష్ట్రానికి పంపించింది. అయితే ఆయన వచ్చినా ఆశించిన స్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇన్చార్జిలు ఎవరు వచ్చినా.. రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు, ప్రణాళిక ప్రకారం నడిపించేందుకు ఎవరు ఇన్‌చార్జీగా వచ్చినా ఏమీ చేయలేక పోతున్నారని, ఎవరిని నియమించినా రాష్ట్రానికి టైం ఇవ్వడం లేదన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. తాజాగా లోక్ సభ ఎన్నికల ఇన్చార్జిగా వచ్చిన అరవింద్ లింబావలి కూడా రాష్ట్రంలో పర్యటించడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జీలను బీజేపీ గత డిసెంబర్లోనే నియమించింది. అందులో భాగంగా తెలంగాణ ఇన్చార్జిగా కర్ణాటకకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అరవింద్ లింబావలిని గత డిసెంబర్ 26న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నియమించారు. ఆయనను నియమించి రెండు నెలలు కావస్తున్నా ఒక్కసారి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చారే తప్ప ఇంతవరకు ఎలాంటి సమీక్షలు నిర్వహించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి ముందుకు నడిపిస్తారని భావించారు. అయితే ఆయన ఇన్చార్జి అయ్యాక నెల రోజులకు గానీ రాష్ట్రానికి రాలేదని పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. ఈనెల 3వ తేదీన పదాధికారులు, కోర్ కమిటీ సమావేశంలో మాత్రం పాల్గొని వెళ్లిపోయారని, మళ్లీ ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కొంతమంది నేతలే పేర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు క్లస్టర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశాలు జరిగాయి. ఆ రెండింటికి కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, స్మృతి ఇరానీ వచ్చారు తప్ప లింబావలి మాత్రం రాలేదన్న విమర్శలు ఉన్నాయి. చివరకు ఈనెల 9వ తేదీన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించినా దానికి హాజరు కాలేదు. దీంతో ఆయన రాష్ట్రానికి ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. -
పొత్తు ఫైనల్ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ
సాక్షి, ముంబై : మూడేండ్ల పాటు కలహాల కాపురం సాగించిన బీజేపీ-శివసేన మరోసారి భాయ్-భాయ్ అన్నాయి. మహారాష్ట్రలో చెరిసగం సీట్లకు పోటీచేసేందుకు అంగీకరించాయి. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్‌షా చేపట్టిన మంత్రాంగం ఫలించింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఇరు పార్టీల పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాని మోదీని, బీజేపీని దుమ్మెత్తిపోయడం శివసేనకు రివాజుగా మారింది. మిత్రపక్షమే ఇలాంటి విమర్శలు చేయడమా? అని అందరూ నోళ్లు నొక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా, ఓ దశలో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందేమో.. కమలానికి పక్కలో బల్లెంగా మారుతుందేమో అని అనుమానాలు కలిగాయి. కానీ మేమంతా నిజానికి ఒకటేనని, ఒకేగూటి పక్షులమని రెండు పార్టీలు తమ పొత్తు ఖరారు చేసుకున్నాయి.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. అలాగే బీజేపీ 25 స్ధానాల్లో బరిలో నిలవనుండగా, సేన 23 స్థానాల్లో పోటీ చేయనుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మారిన సమీకరణలు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో చెరి సగం సీట్లు పంచుకుని రెండు పార్టీలు పొత్తును ఖరారు చేసుకున్నాయి. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ– శివసేనల మధ్య పొత్తు సోమవారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలుండగా అందులో శివసేన 23 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 50:50 ఫార్ములాకు ఇరు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర దింపినట్లు అయింది. పొత్తుపై స్పష్టత రావడంతో బీజేపీ, శివసేన నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు. శివసేన ఖాతాలోకి పాల్ఘర్! గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, పాల్ఘర్ లోక్‌సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ చింతామణ్ వంగా మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ గత సంవత్సరం మేలో ఉప ఎన్నిక జరిగింది. చింతామణ్ వంగా చనిపోయిన తరువాత బీజేపీ నాయకులు తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శ్రీనివాస్ వంగా శివసేనలో చేరారు. సానుభూతి ఓట్లతో కచ్చితంగా శ్రీనివాస్ గెలుస్తాడని భావించిన శివసేన బీజేపీని ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలని సూచించింది. కానీ, ఆ స్థానం బీజేపీదేనని తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ పట్టుబట్టింది. చివరకు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్ ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిత్ గెలిచారు. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ నాయకులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో శివసేన ఈ స్థానంలో మళ్లీ శ్రీనివాస్‌ను బరిలోకి దింపుతుందా లేక మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, పాల్ఘర్ లోక్‌సభ నియోజక వర్గం శివసేన వాటాలోకి వెళ్లడంతో రాజేంద్ర గావిత్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో గావిత్ తప్పుకుంటారా లేక తిరుగుబాటు చేసి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మొదటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని ఉద్ధవ్‌పై ఒత్తిడి చేశారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు కలిసే పోటీ చేస్తామని అనేక సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చారు. అమిత్ షా- ఉద్ధవ్ థాకరే భేటీతో పొత్తులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం రూపొందించిన ఫార్మూల ప్రకారం లోకసభ ఎన్నికల్లో బీజేపీ–25, శివసేన–23, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–144, శివసేన–144 స్థానాల చొప్పున పోటీ చేస్తారు. ఇంతకుముందు శివసేనతో పొత్తు కుదరకపోవడానికి బీజేపీ మిత్రపక్షాలే ప్రధాన కారణమని తెలిసింది. సీట్లు సర్దుబాటు చేసే సమయంలో మిత్రపక్షాలు రాష్ట్రీయ సమాజ్ పార్టీ, ఆర్పీఐ (రాందాస్ ఆఠావలే వర్గం), శివ్ సంగ్రామ్ పార్టీలకు కనీసం 20 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ, ఈ మిత్రపక్షాలు బీజేపీకి చెందినవి కావడంతో వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదని శివసేన స్పష్టం చేసింది. బీజేపీ తమ వాటాలోకి వచ్చిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని శివసేన పేర్కొంది. చివరకు శివసేన డిమాండ్‌కు బీజేపీ తలొగ్గినట్లు సమాచారం. తాజాగా ఇరు పార్టీలు సగం సీట్లు సర్ధుబాటు చేసుకోవడంతో మిత్ర పక్షాలకు ఎవరి వాటాలో వారే కేటాయించుకోవల్సి ఉంటుందని తెలిసింది. -
‘అక్రమ వలసదారులే వారి ఓట్ బ్యాంక్’
లక్నో : ఎస్పీ, బీస్పీలు అక్రమ వలసదారులను ఓటు బ్యాంక్‌లా పరిగణిస్తాయని, తమ పార్టీ చొరబాట్లను జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా చూస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. యూపీలోని మహరాజ్‌గంజ్‌లో శుక్రవారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎస్పీ-బీఎస్పీ కూటమిపై నిప్పులు చెరిగారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి తమ పార్టీ కట్టుబడిఉందన్నారు. విపక్షాలు రామమందిర అంశంపై తమ వైఖరిని వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు.రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో యూపీలో గతంలో సాధించిన స్ధానాలను నిలబెట్టుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కాగా తూర్పు యూపీలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీని ప్రధాన కార్యదర్శిగా బరిలో నిలపడంతో యూపీ ఎన్నికల రాజకీయం వేడెక్కిన సంగతి తెలిసిందే. -
అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తాం : లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా మార్గదర్శకంలో పని చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వెయ్యి మందితో 9న అసెంబ్లీ ఇంఛార్జ్‌లు, కన్వీనర్లతో రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహిస్తామన్నారు. ఈ నెల 10న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఐటీ అధిపతులు, నిపుణులతో హోటల్ ట్రీడెంట్‌లో సమావేశం కానున్నట్టు తెలిపారు. 13న మహబూబ్ నగర్లో జరిగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, చేవెళ్ల పార్లమెంట్ క్లస్టర్ సమావేశానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరవుతారని చెప్పారు. 14న కరీంనగర్లో జరిగే భారత్ కీ మాన్ కీ బాత్ మోదీకీ సాత్ కార్యక్రమంలో రాంమాధవ్ పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో అమిత్ షా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో 43ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. మేరా పరివార్ భాజపా పరివార్ పేరుతో ఫిబ్రవరి 12నుంచి మార్చి 2వరకు బూత్ స్థాయిలో కార్యకర్తల ఇళ్లపై బీజేపీ జెండా ఎగుర వేస్తామన్నారు. కమలజ్యోతి కార్యక్రమంలో భాగంగా మోదీ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందినవారి ఇళ్లలో జ్యోతి వెలిగిస్తామని చెప్పారు. మార్చి 2న మోదీ సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ విజయ్ సంకల్ప పేరుతో 119అసెంబ్లీ నియోజకవర్గల్లో బైకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. -
దీదీకి అమిత్ షా వార్నింగ్..
అలీగఢ్ : బీజేపీ నేతలను, కార్యకర్తలను రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన చర్యలతో తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని బీజేపీ చీఫ్ అమిత్ షా బుధవారం హెచ్చరించారు. బెంగాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక ఆమె బీజేపీ నేతలను అడ్డుకుంటున్నారని అలీగఢ్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో 42 లోక్‌సభ స్ధానాలకుగాను 23 స్దానాల్లో కమలం విరబూసేవరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించబోరని ఆమెకు తెలియదని స్పష్టం చేశారు. ‘బెంగాల్లో నిన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అనుమతించకుండా అడ్డంకులు సృష్టించారు..నా హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు అనుమతించలేదు..శివరాజ్ సింగ్ చౌహాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంద’ని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని సభకు చిన్న మైదానం కేటాయించి, దానికి అనుమతులు సైతం అర్ధరాత్రి ఇచ్చారని మమతా సర్కార్‌పై ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ సత్తా చాటనుందనే ఆక్రోశంతోనే దీదీ ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీస్ అధికారికి వత్తాసు పలుకుతూ కోల్‌కతాలో మమతా బెనర్జీ ధర్నా చేయడం పట్ల అమిత్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
నేడు ఏపీలో అమిత్‌షా పర్యటన
-
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నినాదం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : పనిచేసే వారి నుంచే ఫలితం ఆశిస్తారనే నినాదంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల బరిలో దిగనుంది. ఐదేళ్ల పదవీ కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఇదే నినాదంతో జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ఆ పార్టీ యోచిస్తోంది. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనలో దేశవ్యాప్తంగా దాదాపు పది కోట్ల మంది ప్రజల సలహాలను స్వీకరించేలా నెలరోజుల పాటు భారత్ కీ మన్‌కీ బాత్..మోదీ కే సాథ్ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టింది. ప్రజల భాగస్వామ్యంతో సంకల్ప్ పత్రాన్ని (ఎన్నికల ప్రణాళిక) వెల్లడించేందుకు సంసిద్ధమైంది. నూతన నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార నినాదం సబ్కా సాథ్..సబ్కా వికాస్ నినాదాన్ని ఆ పార్టీ పక్కనపెట్టినట్లయింది. కాగా, ప్రజల భాగస్వామ్యంతో మేనిఫెస్టో రూపకల్పన ప్రజాస్వామ్యానికి మరింత మేలు చేకూరుస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 4000 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 300కు పైగా వాహనాల్లో బాక్సులు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయం సేకరించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోకు ఈ స్ధాయిలో ఇంతకు ముందెన్నడూ ఏ రాజకీయ పార్టీ కసరత్తు చేయలేదని పార్టీ మేనిఫెస్టో కమిటీ చీఫ్, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక
షిమ్లా: వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)పై నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ‘ఓన్లీ రాహుల్ ఓన్లీ ప్రియాంక ’అని వ్యంగ్యంగా అర్థం చెప్పగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ‘దేశం ప్రస్తుతం ఓడొమోస్ (ఓవర్ డోస్ ఆఫ్ ఓన్లీ మోదీ ఓన్లీ షా)తో ఇక్కట్లు పడుతోంది’అని అన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ)కి కాంగ్రెస్ అర్థం మార్చేసిందని, ఓఆర్ఓపీ అంటే వారి దృష్టిలో ’ఓన్లీ రాహుల్, ఓన్లీ ప్రియాంక’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యంగ్యంగా అన్నారు. 70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా సైనికులను పట్టించుకోలేదని, మోదీ ప్రభుత్వం వచ్చాకనే మాజీ సైనికులకు నిజాయితీగా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ అమలు చేసిందని ఆయన తెలిపారు. ‘ దశాబ్దాలుగా అధికారంలో ఉండి మీరప్పుడు పేదరికం గురించి ఎందుకు పట్టించుకోలేదు. బీజేపీ తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, పథకాల ద్వారానే దేశంలో పేదరికం తగ్గుతోంది’అని షా వ్యాఖ్యానించారు. రాహుల్ జోకరేగా: ప్రియాంక గాంధీని ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరిస్తున్నారని, మరి ఇన్నిరోజులు జోకర్‌గా రాహుల్ వ్యవహరించారా అని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సరోజ్ పాండే అన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ కు ప్రియాంకా గాంధీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై కాంగ్రెస్ నేత ఆజాద్ ప్రియాంకను కాంగ్రెస్ ట్రంప్ కార్డుగా వ్యవహరించిన విషయం విదితమే. -
అమిత్ షా ర్యాలీపై ఆగని రగడ
మాల్ధా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా ర్యాలీపై నెలకొన్న వివాదం కొనసాగుతూనే ఉంది. మాల్దా ఎయిర్పోర్ట్ హెలిప్యాడ్‌లో అమిత్ షా విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ తృణమూల్ సర్కార్‌పై విరుచుకుపడింది. షా విమానం ల్యాండయ్యేందుకు ఇక్కడి గోల్డెన్ పార్క్ హోటల్‌తో పాటు మాల్ధా జిల్లాలో బీఎస్ఎఫ్ ఉపయోగించే హెలిప్యాడ్‌లో అనుమతించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. హెలిప్యాడ్ సమస్య పరిష్కారం కావడంతో అధికారులు సైతం ఊపిరిపీల్చుకుంటే తాజాగా ర్యాలీ నేపథ్యంలో తృణమూల్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం కొత్త తలనొప్పిగా మారింది. తమ పార్టీ చీఫ్ రాకను పురస్కరించుకుని తాము ఏర్పాటు చేసిన కటౌట్లు, హోర్డింగ్‌లు, పోస్టర్లను పలు చోట్ల తృణమూల్ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని బీజేపీ బెంగాల్ రాష్ట్ర శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీకి హాజరయ్యేందుకు వాహనాల్లో వస్తున్న పార్టీ కార్యకర్తలను తృణమూల్ కార్యకర్తలు అడ్డుకుని దాడులు చేస్తున్నారని అన్నారు. తృణమూల్ ఆగడాలను ప్రతిఘటిస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీకి హాజరవుతున్నారని ఘోష్ చెప్పారు. -
లోక్‌సభ ఎన్నికలకల్లా పరిస్థితులు మారతాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడిపోయి, నిరాశ నిస్పృహలకు గురైన కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం నిమగ్నమైంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు లోక్‌సభ ఎన్నికల కల్లా మారతాయని కార్యకర్తల్లో మనోధైర్యం కల్పిస్తున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నాయకత్వం అప్రమత్తమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కచ్చితంగా మంచి ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని, నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే దేశవ్యాప్తంగా బీజేపీని గెలిపిస్తాయనే విశ్వాసాన్ని కలిగించేందుకు ముఖ్యనాయకులు సిద్ధమవుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో కంగుతిన్న కార్యకర్తలు నైరాశ్యం నుంచి బయటపడటానికి కొంత సమయం పట్టవచ్చని బీజేపీ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. బీజేపీ చేస్తోందని చెప్పాలి... ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గభేటీలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్‌షా కేడర్‌లో కొత్త ధైర్యాన్ని, విశ్వాసాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. తెలంగాణకు ప్రత్యేక దిశానిర్దేశం ఏమీ చేయకపోయినా, ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్ చేసిన ఎన్నికల ప్రయోగం విఫలం కావడం గురించి ప్రత్యేకంగా ఉదహరించారు. జాతీయస్థాయిలో వివిధ రాజకీయపక్షాలు, ›ప్రాంతీయపార్టీలను కలుపుకుని పోయేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే విధంగా విఫలప్రయోగంగా మారుతుందనే ధీమాను బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో కల్పించే ప్రయత్నం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల వల్ల తెలంగాణసహా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది లబ్ధి పొందుతున్నా, వాటిని బీజేపీ చేపడుతోందన్న విషయం ప్రజలకు చేరడంలేదని జాతీయ నాయకత్వం అభిప్రాయపడింది. ఉజ్వల స్కీమ్ ద్వారా ఎల్పీజీ సిలిండర్లు, జన్‌ధన్ పథకం ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్లు, ఇతర రూపాల్లో ప్రత్యక్షంగా సొమ్ము వచ్చి చేరడం, జీఎస్టీ అమల్లోకి వచ్చాక మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలగడం వంటి వాటిపై విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్రనాయకత్వాలను నిర్దేశించింది. ప్రధాన టార్గెట్ కాంగ్రెస్సే... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమి ప్రయోగం విఫలమైన తీరుపై పెద్దఎత్తున ప్రచారం చేయాలని రాష్ట్ర నాయకత్వాలను జాతీయపార్టీ ఆదేశించింది. అవినీతి తదితర అంశాలపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించింది. స్థానిక సమస్యలతోపాటు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నందున మూడు రాష్ట్రాల్లో బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసిందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్సే ప్రధాన శత్రువని, ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం తిరోగమనంలోకి ప్రయాణిస్తుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని నిర్దేశించింది. -
బీజేపీలో చేరిన తృణమూల్ ఎంపీ
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌమిత్రా ఖాన్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమైన తరువాత ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం లేదని, పోలీసు రాజ్యం నడుస్తోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ మార్పు తెస్తారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం విష్ణుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సౌమిత్రా ఖాన్ పార్టీని వీడడాన్ని తృణమూల్ తక్కువచేసి చూపే ప్రయత్నం చేసింది. ఆయన్ని ఇది వరకే పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించింది. సౌమిత్రా ఖాన్ చాన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కదన్న సంగతి ఆయనకు కూడా తెలుసని వెల్లడించింది. తాజా పరిణామంపై బీజేపీ స్పందిస్తూ.. బెంగాల్లో తృణమూల్ పతనం ప్రారంభమైందని పేర్కొంది. -
వలసలు ఆపుతాం.. ఉపాధి కల్పిస్తాం
సాక్షి, నారాయణపేట/ నారాయణపేట రూరల్: ఈసా రి ఎన్నికల్లో కమలంపువ్వు గుర్తుకు ఓటేసి అధికారం కట్టబెడితే పాలమూరు జిల్లాలో వలసలు నివారించి, ఉపాధి కల్పిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే సాగు, తాగునీరు లేక వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఎన్నికల ప్ర చారంలో భాగంగా ఆదివారం ఆయన నారాయ ణపేట మినీ స్టేడియం గ్రౌండ్లో కొత్తకాపు రతంగపాండురెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన నారాయణపేట, గ ద్వాల చేనేతను ఎవరూ పట్టించుకోవడం లేదన్నా రు. బీజేపీ ప్రభుత్వంలో హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేసి కీర్తి పెంచుతామని చెప్పారు. కృష్ణా – వికారాబాద్ రైల్వేలైన్ మంజూరై, సర్వే పూర్తిచేసి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వని కారణంగా పెండింగ్‌లోనే ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల కోరికను తీరుస్తూ నారాయణపేటను జిల్లా చేస్తామని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్పా.. ఒక్కటీ పూర్తి చేయలేదని విమర్శించారు. జిల్లా ఆస్పత్రి చేస్తామని చెప్పి కనీసం భూమిపూజ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఆ రిజర్వేషన్లు సాధ్యం కాదు.. మతపరమైన రిజర్వేషన్లు సాధ్యంకావని, అందువల్లే బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అమిత్‌షా అన్నారు. కొందరు దీనికి విరుద్ధంగా హామీ ఇచ్చి మోసంచేయడం సరికాదని అన్నారు. అమరవీరుల కుటుంబాలను విస్మరించి ఎలాంటి ఉపాధి చూపలేదన్నారు. ఎంఐఎంకు తలొగ్గి తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడంలేదని, బీజే పీ ప్రభుత్వం వస్తే ప్రతీ గ్రామంలో అధికారికంగా సెప్టెంబర్ 17న పండుగ చేస్తామన్నారు. దళిత సీ ఎం హామీని విస్మరించిన కేసీఆర్ ఏకకాలంలో పా ర్లమెంట్, అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మోది చరీ ష్మా ముందు గెలవలేమని భావించి తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్ కోసం ముందస్తుకు వెళ్లాడని, ప్రజాధనం దుర్వినియోగం చేయించాడ ని అన్నారు. రాష్ట్రానికి కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్, నాలుగున్నర ఏళ్లలో అవినీతి నక్క లా మరాడని విమర్శించారు. మైనార్టీలకు పెద్దపీ ట వేస్తామన్న కాంగ్రెస్ ఉర్దూ టీచర్ల నియామకం చేపడితే తెలుగు ఉపాధ్యాయుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చర్చి, మసీదులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దేవాలయాలను ఎందుకు విస్మరిస్తుందో చెప్పాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మాట్లాడుతూ కుటుంబ పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్కు చరమగీతం పాడి బీజేపీని గెలిపించుకుందామని అన్నారు . సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, సేడెం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌పాటిల్, యాద్గిర్ జెడ్పీ మాజీ చైర్మన్ శరణ్‌భూపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణయాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ప్రభాకరవర్ధన్, మహేష్‌శెట్టి, ఎంపీపీ మణెమ్మ, జెడ్పీటీసీ లప్ప అరుణాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందునామాజీ, పట్టణ, మండల అధ్యక్షుడు బోయ లక్ష్మణ్, సాయిబన్న, లక్ష్మి, నర్సన్‌గౌడ్, సిద్రామప్ప, నాగిరెడ్డి, గుండప్ప, రామకృష్ణ. అశోక్, బందేష్, శంకరప్ప, రఘువీర్‌యాదవ్ పాల్గొన్నారు. సేవకుడిలా పనిచేస్తా ఆస్తులు కాపాడుకునేందుకు, వ్యాపారాలను అ భివృద్ధి చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యంతో గెలవాలనుకుంటున్న వారికి ఓటుతో బుద్ధిచెప్పాలి. తనను గెలిపిస్తే సేవకుడి లా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన ఓటర్లు ఒ క్కసారి బీజేపీని గెలిపించాలి. పదవుల కోసం పార్టీలు మారే నాయకులను నమ్మవద్దు. 30ఏళ్ల నుంచి ఒకే పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తున్న తనకు చట్టసభలోకి వెళ్లే అవకాశం కల్పించాలి. – రతంగపాండురెడ్డి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి ‘పేట’లో బీజేపీ గెలవడమే నా కల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్న నారాయణపేట నియోజకవర్గ ప్రజలు ఈసారి అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిని పంపిస్తే నా కల తీరుతుంది. బీజేపీ సత్తాచూపి ఒక్కో కార్యకర్త 10ఓట్లు వేయించాలి. జిల్లా కోసం ఎస్‌ఆర్‌రెడ్డి రాజీనామా చేస్తే పట్టించుకోని కేసీఆర్, ఇప్పుడు గెలిపిస్తే జిల్లా ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ గెలిస్తే జిల్లాతో పాటు ‘పేట’ – కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుంది. హిందూసమాజం పట్ల అసభ్యంగా మాట్లాడుతున్న ఓవైసీకి భజరంగ్‌దళ్ కార్యకర్తలు తలుచుకుంటే తగిన బుద్ధిచెప్తారు. – నాగురావు నామాజీ, కొడంగల్ బీజేపీ అభ్యర్థి -
ఎంఐఎం ముందు మోకరిల్లిన టీఆర్ఎస్ : అమిత్ షా
నారాయణపేట : తెలంగాణలో త్రిముఖ పోరు సాగుతోందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎంఐఎం దగ్గర ఆత్మాభిమానం తాకట్టుపెట్టిన టీఆర్ఎస్, పాక్ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న సిద్ధూ ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, మోదీ సారథ్యంలో దేశభక్తులతో కూడిన బీజేపీల మధ్య పోరాటం జరుగుతోందని అభివర్ణించారు. కేసీఆర్ తన కుటుంబసభ్యుల కోసం ముందస్తుకు వెళ్లి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనం ముందు నిలువలేమనే భయంతో ముందస్తుకు కేసీఆర్ మొగ్గుచూపారని విమర్శించారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఆదివారం బీజేపీ ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నారాయణపేట అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. -
భూ స్కాంతో వాద్రా కోట్లు ఆర్జించారు
జైపూర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత బావ రాబర్ట్ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడి, డబ్బు బాగా వెనకేశారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్‌లో ఎన్నికల ర్యాలీల్లో ఆరోపించారు. రాబర్ట్ వాద్రాకు చెందిందిగా భావిస్తున్న బికనీర్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసేందుకు అప్పులిచ్చిన ఒక సంస్థకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలు కల్పించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో నెహ్రూ–గాంధీ కుటుంబం అల్లుడు(వాద్రా) భారీగా కమీషన్లు పుచ్చుకున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ పద్ధతుల్లో ఇచ్చిన రుణాలే ఇప్పుడు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారాయన్నారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘అంగదుని పాదం’ అని అభివర్ణించారు. రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణకు వచ్చే వారం హాజరు కావాల్సిందిగా కోరింది. నవంబర్‌లో జారీ చేసిన మొదటి సమన్లకు వాద్రా స్పందించలేదు. ప్రముఖ స్టీల్ కంపెనీ ఒకటి దేశ సరిహద్దుల్లోని సుమారు వందెకరాల స్థలం కొనుగోలు చేసేందుకు వాద్రా సంస్థలకు రుణం ఇవ్వడంపైనా ప్రశ్నించనుంది. వాద్రాకు చెందిన పలువురు వ్యక్తులపై గతంలో ఈడీ దాడులు కూడా చేపట్టింది. -
నేతలొస్తున్నారు..
సాక్షి, పెద్దపల్లి : ప్రచారపర్వానికి గడువు సమీపించడంతో అన్నిపార్టీల అధినేతలు జిల్లాబాట పట్టారు. ఇప్పటివరకు ఆయా పార్టీలకు సంబంధించిన నేతల సభలు జరగకపోగా, వరుసగా అన్ని పార్టీల నేతలు ఒకేసారిగా ప్రచారం రానుండడంతో రాజకీయం వేడెక్కనుంది. పోలింగ్‌కు పదిరోజుల ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా జోష్ నింపేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, పరిపూర్ణానంద స్వామి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలు ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29, 30న జిల్లాలో పర్యటించనున్నారు. 29న సాయంత్రం 4 గంటలకు గోదావరిఖనిలోని జూనియర్‌కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. 30న మధ్యాహ్నం 3.15 గంటలకు మంథనిలో, సాయంత్రం 4 గంటలకు పెద్దపల్లిలో నిర్వహించే బహిరంగసభల్లో కేసీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈమేరకు మంగళవారం కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారైంది. కాగా వరుసగా రెండు రోజులు జిల్లాలో కేసీఆర్ పర్యటించనుండడంతో పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. రామగుండం, మంథని, పెద్దపల్లి అభ్యర్థులు సోమారపు సత్యనారాయణ, పుట్ట మధు, దాసరి మనోహర్‌రెడ్డి బహిరంగసభల ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రెండు, మూడు నియోజకవర్గాలు కలిపి ఒక నియోజకవర్గంలో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహించారు. కానీ.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం వరుసగా రెండు రోజులపాటు ప్రచార సభలు నిర్వహిస్తుండడం, అందునా జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కేసీఆర్ బహిరంగసభలు నిర్వహిస్తుండడం ప్రాధాన్యతను చెప్పకనే చెబుతోంది. రేవంత్‌రెడ్డి...అమిత్‌షా...పరిపూర్ణానంద... పార్టీ అధినేతలు, స్టార్కంపెయినర్లతో ప్రచార సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్, బీజేపీ లు ఏర్పాట్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార సభ ఈ నెల 30 లేదా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి పార్టీ సన్నహాలు చేస్తోంది. తనతో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన చింతకుంట విజయ రమణారావుకు మద్దతుగా రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. రామగుండం అభ్యర్థి మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు మద్దతుగా గోదావరిఖనిలోనూ పర్యటించనున్నారు. రేవంత్‌రెడ్డి రావడంఖాయమే అయినా... తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు సినీనటి విజయశాంతి, ప్రజాకవి గద్దర్లు మంథని నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. మంథని పట్టణంలో విజయశాంతి, కాటారం మండల కేంద్రంలో గద్దర్ల సభలు ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సన్నహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీలు ఖరారు కావాల్సి ఉంది. ఇక బీజేపీ జాతీయ రథసారథి అమిత్‌షా, స్వామి పరిపూర్ణానందస్వామి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ రథసారథులను రప్పించేందుకు సన్నహాలు చేస్తున్నారు. పెద్దపల్లిలో అమిత్‌షా, పరిపూర్ణానందస్వామిల ప్రచార సభలు ఉండే అవకాశం ఉంది. అయితే తేదీలు ఖరారు కావాల్సి ఉంది. వచ్చేనెల 4న కేంద్ర మంత్రి స్మృతిఇరానీ గోదావరిఖనిలో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆయా పార్టీల అధినేతల పర్యటనలు వరుసగా జరగనుండడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కింది. -
నితీష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని కేంద్ర మంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షం రాష్ర్టీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) చీఫ్ ఉపేంద్ర కుష్వాహ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీజేపీ చీఫ్ అమిత్ షా తక్షణం జోక్యం చేసుకుని పరిష్కరించాలని కుష్వాహ డిమాండ్ చేశారు. బిహార్ సీఎం చేసిన వ్యాఖ్యల అంతరార్ధంపై నిగ్గుతేల్చేందుకు ఎన్డీఏ ప్రధాన భాగస్వామ్య పక్షం అధిపతిగా అమిత్ షా జోక్యం చేసుకుని సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. 2020 తర్వాత సీఎంగా కొనసాగేందుకు నితీష్ కుమార్ సుముఖంగా లేరన్న కుష్వాహ వ్యాఖ్యలపై నితీష్ స్పందించిన తీరును ఆయన తప్పుపడుతున్నారు. చర్చను దిగజార్చే స్ధాయికి తీసుకొచ్చేందుకు అనుమతించమని నితీష్ వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి గెలిపించేందుకు కొన్ని ఎన్డీఏ పక్షాలు ఆసక్తికనబరచడం లేదన్న కుష్వాహ వ్యాఖ్యలతో జేడీ(యూ) చీఫ్‌కు, ఆర్ఎల్ఎస్పీ అధినేతకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని మోదీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు తాను చేయాల్సిందంతా చేస్తున్నానని కుష్వాహ చెప్పుకొచ్చారు. తనపై బీజేపీ అధిష్టానానికి విష ప్రచారానికి పాల్పడుతున్న వారి ఏలుబడిలో బిహార్‌లో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. -
ఆరెస్సెస్ చీఫ్‌తో అమిత్ షా భేటీ
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సంఘ్ పరివార్ నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. మందిర నిర్మాణంపై వీరిరువురూ సంప్రదింపులు జరిపారు. మోహన్ భగవత్‌తో పాటు పలువురు సంఘ్ నేతలతోనూ అమిత్ షా సమాలోచనలు చేపట్టారు. కాగా, సుప్రీం కోర్టులో రామమందిర అంశం పెండింగ్‌లో ఉన్నందున ఆర్డినెన్స్ ద్వారా మందిర నిర్మాణానికి పూనుకోవాలని ఆరెస్సెస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్ధానం మందిర్ వ్యవహారంలో సత్వర నిర్ణయం తీసుకోవాలని, ఈ క్రమంలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం చట్టం తీసుకువచ్చి రామజన్మభూమి స్ధలంలో మందిర నిర్మాణం చేపట్టాలని ఆరెస్సెస్ ప్రతనిధి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గుజరాత్లో సోమనాధ్ ఆలయాన్ని సర్ధార్ వల్లభాయ్ పటేల్ పునర్నిర్మించిన తరహాలో మందిర నిర్మాణానికి భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ పట్టుబడుతోంది. బీజేపీ మిత్రపక్షం శివసేన సైతం ఇదే తరహా డిమాండ్లను ప్రభ్తువం ముందుంచింది. రామ మందిర నిర్మాణం ఆవశ్యకతను ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ఈనెల 25న అయోధ్య యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. -
అయ్యప్ప భక్తులకు అండగా..
తిరువనంతపురం/కన్నూర్: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన అయ్యప్పభక్తులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మద్దతు ప్రకటించారు. అయ్యప్ప భక్తులను అరెస్టు చేస్తూ కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ మాదిరి వాతావరణం సృష్టించిందని ఆరోపించారు. కన్నూర్‌లో శనివారం బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించాక అమిత్ మాట్లాడారు. ఆందోళనకారులను నిర్బంధిస్తూ కేరళ ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం హిందూ సంప్రదాయాలను నాశనం చేయడానికి చూస్తోందన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయస్సు అమ్మాయిలు, మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారన్న కారణంతో ఆర్ఎస్ఎస్, సంఘ్‌పరివార్ కార్యకర్తలతోపాటు 2 వేల మంది భక్తులను అరెస్టు చేయడాన్ని అమిత్ ఖండించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలపై ఆంక్షలున్న అయ్యప్ప దేవాలయం ప్రత్యేకతను కాపాడుకోవాల్సి ఉందని అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో శబరిమల అంశాన్ని పార్టీ ప్రధాన అజెండాగా తీసుకోనుందని స్పష్టం చేశారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన స్వామి సందీపానంద గిరికి చెందిన ఆశ్రమంపై దాడి జరిగింది. కుండమోన్కదవు దగ్గర్లోని సాలగ్రామ ఆశ్రమంలోకి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లు, ఒక స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శనివారం సీఎం విజయన్‌తోపాటు మంత్రులు థామస్ ఇసాక్, సురేంద్రన్ ఆశ్రమాన్ని సందర్శించి స్వామీజీతో మాట్లాడారు. ఈ దాడికి బీజేపీతోపాటు, శబరిమల ఆలయ ప్రధాన పూజారులు, పండాలం రాచ కుటుంబమే కారణమని సందీపానంద ఆరోపించారు. -
బీజేపీ, జేడీయూల పొత్తు కుదిరింది
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో బీజేపీ, జేడీయూలు సమాన సంఖ్యలో అభ్యర్థులను నిలబెడతాయని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీఏలోని మిగతా భాగస్వామ్య పక్షాలు రామ్ విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), ఉపేంద్ర కుష్వాహకు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ)లకు కూడా తగు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. పాశ్వాన్, కుష్వాహ ఎన్డీఏలో కొనసాగుతారని స్పష్టం చేశారు. బీజేపీ, జేడీయూలకు 16 చొప్పున సీట్లు, ఎల్జేపీ 6, ఆర్ఎల్ఎస్పీకి 2 సీట్లు దక్కే అవకాశాలున్నట్లు ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. -
గోవా సీఎం ఆయనే..
న్యూఢిల్లీ : గోవా సీఎంగా మనోహర్ పారికర్ స్ధానంలో మరొకరిని నియమిస్తారని సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా తోసిపుచ్చారు. గోవా సీఎంగా పారికర్ కొనసాగుతారని, త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని స్పష్టం చేశారు. గోవా బీజేపీ కోర్ గ్రూప్ సభ్యులతో సంప్రదింపులు జరిపిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు షా పేర్కొన్నారు. కాగా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గోవాలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని, రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ కోరుతుండగా, అసెంబ్లీలో తమకు మెజారిటీ సంఖ్యా బలం ఉందని బీజేపీ స్పష్టం చేసింది. గోవా సీఎం పారికర్ ప్రస్తుతం ఎయిమ్స్‌లో ప్రాంకియాస్ చికిత్స పొందుతున్నారు. -
అనిశ్చితిలో గోవా సర్కార్
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ అస్వస్ధతతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్రమంలో బీజేపీ సర్కార్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో బీజేపీ అప్రమత్తమైంది. సీఎం పారికర్ కోలుకునే వరకూ భాగస్వామ్య పక్షానికి చెందిన మంత్రి సుధీన్ ధవాలికర్‌ను డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టాలన్న ప్రతిపాదనను మిత్రపక్షాలు తిరస్కరించడంతో అమిత్ షా గోవా ఫార్వార్డ్‌కు చెందిన మంత్రి విజయ్ సర్ధేశాయ్‌తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు, ముగ్గురు ఇండిపెండెంట్లు ఫ్రంట్‌గా ఏర్పడటంతో తదుపరి సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని ఈ ఫ్రంట్ నిర్ధేశిస్తుందని భావిస్తున్నారు. 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ గేమ్‌లో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. -
బీజేపీకి తిరుగులేదు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. బీజేపీకి ఎదురు లేదని, ‘అజేయ భారత్.. సుదృఢ బీజేపీ’ తమ నినాదమని స్పష్టం చేశారు. ‘విపక్షానికి ఒక నాయకుడు లేడు.. ఒక సిద్ధాంతం లేదు.. వాళ్ల విధానాలు అస్పష్టం. ఆలోచనలు అవినీతి మయం’ అంటూ విపక్ష కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కూటమిగా ఏర్పడాలనుకున్న విపక్ష పార్టీల్లోనే ఐక్యత లేదని, ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించే పరిస్థితి లేదని విమర్శించారు. ‘విజయంపై విశ్వాసంతో మన ప్రయాణం ప్రారంభించాం. 125 కోట్ల భారతీయుల నమ్మకం మనపై ఉంది’ అని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పార్టీ శ్రేణులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. అందుకే రోజుకో అబద్ధం ‘కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం లేదు. ఓ నాయకుడు లేడు. అవినీతి ఆలోచనలు, అస్పష్ట విధానాలతో ఉన్న కాంగ్రెస్‌లో సమన్వయం అంతకన్నా లేదు’ అని ప్రధాని అన్నారు. ‘2019 ఎన్నికల్లో విపక్షాల నుంచి మనకు ఎలాంటి ఎదురూ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు దారుణంగా విఫలమయ్యారు. ఇపుడు విపక్షంగానూ విఫలమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వస్తున్న ఆదరణ, సబ్కా సాథ్, సబ్కా వికాస్ నినాదంతో జరుగుతున్న పనులు బీజేపీకి మరోసారి ఘన విజయాన్ని కట్టబెడతాయి’ అని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విపక్షాలు, ఆ పార్టీల సిద్ధాంతాలు, విధానాలు ఎప్పుడూ బీజేపీకి సవాల్ విసరలేవని.. అందుకే రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. ‘అభివృద్ధిపై చర్చకు వస్తే.. ఆ కుటుంబం 48 ఏళ్ల పాలనలో ఏం చేసింది? 48 నెలల పాలనలో బీజేపీ ఏంచేసిందనే విషయం తేలిపోతుంది. బీజేపీ కార్యకర్తలారా.. వాస్తవాలను ప్రజల ముందుంచుతూ విపక్షాల కుట్రలను తిప్పికొట్టండి’ అని మోదీ పిలుపునిచ్చారు. బ్యాంకులు, గనుల జాతీయీకరణ చేశామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. సంస్కరణల పేరుతో దోపిడీకి పాల్పడిన తీరును ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ చేపట్టిన పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను మోదీ ప్రస్తావించారు. విపక్షాలవి పగటి కలలు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే.. పగటి కలలుకంటున్న విపక్షాల మధ్య వచ్చే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయని బీజేపీ పేర్కొంది. మోదీ నేతృత్వానికి దేశంలో 70% మంది ఆమోదం తెలిపారని.. 2022 కల్లా నవభారత నిర్మాణం తథ్యమని అభిప్రాయపడింది. ‘పేదరిక నిర్మూలన, ఇళ్లు లేనివారే ఉండకూడదనే సంకల్పంతోపాటు కుల, మత, అవినీతి, ఉగ్రవాద రహిత దేశంతోపాటు సుస్థిర భారత్ నిర్మాణానికి ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారు’ అని రాజకీయ తీర్మానంలో పేర్కొంది. అంతర్గత భద్రతపై చేసిన తీర్మానంలో బీజేపీ పాలన కారణంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చాలాచోట్ల సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తేసిన విషయాన్ని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొల్పడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని.. పార్టీ ప్రయోజనాలకన్నా జాతి ప్రయోజనాలే ముఖ్యమని ఈ రాష్ట్రంపై చేసిన మరో తీర్మానంలో పేర్కొన్నారు. జీఎస్టీతో ఆదాయం పెరిగిందని, ప్రజల ఇబ్బందులు కూడా రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆర్థిక తీర్మానంలో పేర్కొన్నారు. భారత్ ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయాన్ని ప్రస్తావించారు. కార్యకర్తలే బలం: షా 2019 ఎన్నికల్లో ఘన విజయం తథ్యమని పార్టీ చీఫ్ అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. మరో 50 ఏళ్లపాటు దేశంలో బీజేపీ పాలనే కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలే తమకు అఖండ విజయాన్ని కట్టబెడతాయన్నారు. 9 కోట్ల మంది కార్యకర్తలే బీజేపీ బలమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నాటి సమావేశం వివరాలను మోదీ, అమిత్ షాల ప్రసంగం విశేషాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. బీజేపీ విజయానికి కార్యకర్తలు కష్టించి పనిచేయాలని.. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని షా పేర్కొన్నట్లు ప్రసాద్ తెలిపారు. 2014 నుంచి 300కు పైగా నియోజకవర్గాల్లో మోదీ పర్యటించారని.. మిగిలిన వాటినీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకంటే ముందే పూర్తిచేస్తారని షా వెల్లడించారు. దేశాన్ని అక్రమ చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. -
ఆయన సేవలు మరువలేం..
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మృతి పట్ల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో ఆరు దశాబ్ధాల పాటు కరుణానిధి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన మృతితో భారత్ దిగ్గజ నేతను కోల్పోయిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ప్రియతమ నేతను కోల్పోయిన లక్షలాది అభిమానులకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని రాహుల్ ట్వీట్ చేశారు. అమిత్ షా సంతాపం.. రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి మృతిపై బీజేపీ చీఫ్ అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి చేసిన సేవలను ఎవరూ మరువలేరని కొనియాడారు. సినిమా రచయితగా మొదలైన ఆయన ప్రస్ధానం తమిళనాడుకు ఐదు సార్లు సీఎంగా సేవలందించే వరకూ సాగిందన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ఈ విషాదాన్ని అధిగమించే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్టు అమిత్ షా ట్వీట్ చేశారు. -
ఓబీసీ బిల్లుపై కాంగ్రెస్ వైఖరేంటి..?
సాక్షి, న్యూఢిల్లీ : ఓబీసీ బిల్లుపై తమ పార్టీ వైఖరి వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) వ్యవహారంలో విపక్షం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఓబీసీ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది ప్రస్తుతం రాజ్యసభ ముందున్న విషయం తెలిసిందే. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ తరహాలో జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే దిశగా ఈ సవరణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లుపై తన వైఖరి వెల్లడిస్తే బీసీల ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధి ఏపాటిదో వెల్లడవుతుందని అమిత్ షా డిమాండ్ చేశారు. ఎన్ఆర్సీ అంశంపై అమిత్ షా స్పందిస్తూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తిప్పిపంపేందుకు తాము కట్టుబడిఉన్నామని స్పష్టం చేశారు. చొరబాటుదారులు దేశంలోనే ఉండాలని విపక్షాలు కోరుకుంటున్నాయా అని ప్రశ్నించారు. -
లడ్డూలతో సెలబ్రేట్ చేసుకున్నారు..
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం జరిగిన తొలి పార్టీ నేతల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీని సహచర సభ్యులు అభినందనలతో ముంచెత్తారు. బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రధానికి లడ్డూలు తినిపించగా, ఇతర నేతలు పూల దండలతో సత్కరించారు. ప్రతిపక్షాలు చేపట్టిన అవిశ్వాసం పసలేనిదని, వారు ఎలాంటి సన్నద్ధం లేకుండా అవిశ్వాసంతో సభ ముందుకొచ్చారని పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ ప్రధాని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వేదికపై ప్రధాని మోదీతో పాటు పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, అనంత్ కుమార్, నితిన్ గడ్కరీ, సీనియర్ నేత ఎల్కే అద్వానీ వంటి అగ్రనేతలు ఆశీనులయ్యారు. గత సమావేశాలకు భిన్నంగా ఎన్నికల వేళ ఐక్యతను చాటేలా దిగ్గజ నేతలంతా వేదికపై ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.మరోవైపు ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే యత్నాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల లేఖ రాసిన యూపీకి చెందిన దళిత ఎంపీ అశోక్ దోహ్రే ప్రధాని మోదీకి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించబోగా ఆయన వారించారు. -
2019లో అధికారమే లక్ష్యం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధికారంలోకి రావడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన ఫార్ములాలనే తెలంగాణలోనూ అమలుచేస్తామని భార తీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్‌లో మూడు సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. అమిత్ షా పర్యటన అనంతరం రాష్ట్రంలో పార్టీ పనితీరు, విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. 2019లో అధికారమే లక్ష్యంగా అమిత్ షా నగరానికి వస్తున్నారని లక్ష్మణ్ వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. రాష్ట్ర కోర్ కమిటీ, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారని తెలిపారు. బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారని వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటికే జన చైతన్య యాత్రలో మొదటి విడతను పూర్తిచేశామన్నారు. గతంలో ఉన్న కాంగ్రెస్, ప్రస్తుతమున్న టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలు, హామీలు అమలు చేయకుండా చేసిన మోసాలను ఎండగడుతున్నామన్నారు. 2019 ఎన్నికలకు మిషన్ 60కి పైగా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ తీరు బట్టబయలైందన్నారు. బీజేపీకి అభ్యర్థులు ఉన్నారో, లేదో తాము చేపట్టిన జన చైతన్య యాత్రను చూస్తే తెలుస్తుందన్నారు. యాత్రకు ప్రజలు అశేషంగా వచ్చారని, టీఆర్ఎస్ను విమర్శిస్తుంటే జేజేలు పలికారని చెప్పారు. -
చీకటి రోజులను చీల్చిచెండాడారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ విధించి 43 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ సూత్రాలపై కాంగ్రెస్ నేరుగా జరిపిన దాడిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీని అభివర్ణించారు. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, సుప్రీం కోర్టును మౌన ప్రేక్షకుడిలా చేసిందని, పార్లమెంట్‌ను నిర్వీర్యం చేసి, మీడియా గొంతు నులిమిందని బీజేపీ చీఫ్ అమిత్ షా విరుచుకుపడ్డారు. భారత ప్రజాస్వామ్యంలో అది చీకటి రోజని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన వేధింపుల గురించి నేటి తరానికి తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో వీటిని పొందుపరచాలని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. మరోవైపు ఎమర్జెన్సీ చీకటి రోజులను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గుర్తుచేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీని హిట్లర్‌తో పోల్చారు. -
ముగ్గురి చేతుల్లో దేశం బానిస
న్యూఢిల్లీ: బీజేపీ–ఆర్ఎస్ఎస్కు చెందిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ చేతుల్లో దేశం బానిసగా మారిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయని చెప్పారు. అతి త్వరలోనే దేశం శక్తిసామర్థ్యాలు ఏమిటో మోదీ, అమిత్, భాగవత్ గ్రహించేలా చేస్తామన్నారు. ఢిల్లీలో తల్కాతోరా మైదానంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ ఏర్పాటు చేసిన ఓబీసీల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. వెనుకబడిన వర్గాల ప్రజల శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్ గుర్తించిందని, వారికి అవకాశాలివ్వడం ద్వారా రాజకీయంగా వారు ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటోందని చెప్పారు. ఓబీసీలను శక్తివంతులుగా మారు స్తామన్నారు. తాము వారిని బస్సులో మాట్లాడకుండా కూర్చో బెట్టబోమని, వారికే తాళాలు ఇచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. దేశంలో నైపుణ్యాలకు కొదవలేదని, వెనుకబడిన వర్గాల వారిలో నైపుణ్యాలు ఇంకా ఎక్కువ ఉంటాయని, అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే వెనుకబడిపోయారన్నారు. బీజేపీ 15–20 మంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేలా విధానాలను అనుసరిస్తోందని, ప్రధాని మోదీని మార్కెట్ చేసేందుకు వారు కోట్లు కుమ్మరిస్తున్నందుకు ప్రతిఫలంగా వారికి సహకరిస్తోందన్నారు. మోదీ విధానాలపై విమర్శలకు మరింత పదును పెట్టిన రాహుల్‌గాంధీ అమెరికా పారిశ్రామికవేత్తలకు కొత్త పేర్లు పెట్టారు. కోకా–కోలా వ్యవస్థాపకుడిని షికంజి విక్రేతగా, మెక్ డొనాల్డ్స్‌ను దాబావాలాగా, ఫోర్డ్, మెర్సిడెస్, హోండా వ్యవస్థాపకులను మెకానిక్స్‌గా పేర్కొన్నారు. -
రాహుల్ బాబా ఆ లెక్కలు మీకెందుకు..
సాక్షి, రాయపూర్ : మోదీ నాలుగేళ్ల పాలనపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా టార్గెట్ చేశారు. తమ ప్రభుత్వ నాలుగేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో రాహల్ విమర్శలను షా తోసిపుచ్చారు. త్వరలో ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం భారీ ర్యాలీతో ఆయన ప్రారంభించారు. ‘రాహుల్ బాబా.. నాలుగేళ్ల మోదీ సర్కార్ లెక్కల గురించి మీరు ప్రశ్నిస్తున్నారు..మీకు మేం సమాధానాలు ఇవ్వం..ఖర్చు పెట్టిన ప్రతిపైసాకూ లెక్కలను ప్రజలకు వివరిస్తా’ మని అమిత్ షా అన్నారు. ప్రజలను ఓట్లు కోరేందుకు కలిసే క్రమంలో అన్నింటినీ వారి ముందుంచుతామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో దేశం 55 ఏళ్లుగా అభివృద్దిలో వెనుకబడిందని ఆరోపించారు. మీ కుటుంబం నాలుగు తరాల పాటు 55 సంవత్సరాలు దేశాన్ని పాలించినా అభివృద్దికి నోచుకోలేదని రాహుల్‌ను ఉద్దేశించి షా ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, 90 అసెంబ్లీ స్దానాలున్న అసెంబ్లీలో తాము 65 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేవారు. రమణ్ సింగ్ నేతృత్వంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. -
ఉద్ధవ్‌తో అమిత్ షా భేటీ
ముంబై: బీజేపీ, శివసేన మధ్య వైరుధ్యాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బుధవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ముంబైలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో జరిగిన ఈ భేటీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే బీజేపీ ప్రారంభించిన ‘మద్దతు కోసం కలుసుకోవడం’ (సంపర్క్ సే సమర్థన్) కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన పార్టీ అధ్యక్షుడితో ఈ భేటీ జరిగింది. అమిత్ షా పర్యటన రోజే బీజేపీపై సామ్నా సంపాదకీయంలో శివసేన విమర్శల దాడి చేసింది. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఎన్డీయే పక్షాలను బీజేపీ చీఫ్ కలవాలనుకోవడంలో ఆంతర్యమేంటని అందులో ప్రశ్నించింది. ‘ఇటీ వలి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. అందుకే మళ్లీ మిత్రపక్షాలను కలవాలని యత్నిస్తోంద’ని పేర్కొంది. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ముంబై పర్యటనలో సీఎం ఫడ్నవిస్‌తో కలిసి.. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్‌లను జుహూలోని మాధురి నివాసంలో కలిశారు. ఫడ్నవిస్ వద్దు... ఉద్ధవ్: ‘మాతోశ్రీ’కి అమిత్ షా, ఫడ్నవిస్ వచ్చిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మాతోశ్రీ’లో షా, ఉద్ధవ్ చర్చలకు సిద్ధమవుతుండగా.. ఫడ్నవిస్‌ను ఈ భేటీకి దూరంగా ఉండాలని ఉద్ధవ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రెండో అంతస్తులో ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడుతుండగా.. ఫడ్నవిస్ ఒక్కరే మొదటి అంతస్తులో కూర్చున్నారు. అయితే, బుధవారం ఉదయమే అమిత్ షాకు ఉద్ధవ్ సందేశాన్ని పంపించారని.. షా ఒక్కరినే తను కలుస్తానని అందులో పేర్కొన్నారని శివ సేన వర్గాలు వెల్లడించాయి. మొన్నటి మార్చి లో సచివాలయంలో రెండుగంటలపాటు వేచిచూసినా ఫడ్నవిస్ కలవకపోవడం, ఇటీవలి పాల్ఘర్ ప్రచారంలో ఉద్ధవ్, ఫడ్నవిస్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
బాబా రాందేవ్‌తో అమిత్ షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ చీఫ్ అమిత్ షా సోమవారం యోగా గురు బాబా రాందేవ్‌తో భేటీ అయ్యారు. మోదీ సర్కార్ నాలుగేళ్ల పాలనలో సాధించిన విజయాలను ఈ సందర్భంగా రాందేవ్‌కు వివరించారు. పార్టీని విస్తృతంగా ప్రజలకు చేరువ చేసే క్రమంలో భాగంగా యోగా గురుతో అమిత్ షా సమావేశమయ్యారు. సంపర్క్ ఫర్ సమర్థన్ కార్యక్రమంలో భాగంగా తాను రాందేవ్‌ను కలిశానని, మోదీ సర్కార్ సాధించిన విజయాలను వివరించానని భేటీ అనంతరం షా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించేందుకు పార్టీకి చెందిన 4000 మంది కార్యకర్తలు వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన లక్ష మందిని కలుస్తారని మే 26న ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బీజేపీ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ఇప్పటివరకూ 50 మందితో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 29న మాజీ ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్, సుభాష్ కశ్యప్‌లను కలిశారు. అనంతరం క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో సమావేశమయ్యారు. పేదలు మెరుగైన జీవనం సాగించేలా, ప్రజల జీవన ప్రమణాలు పెంచేలా నాలుగేళ్ల హయాంలో తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయా నేతలకు వివరిస్తామని అమిత్ షా చెప్పుకొచ్చారు. -
బెంగాల్లో మరో హత్య!
పురూలియా / న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో మరో వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. పురూలియా జిల్లా బలరామ్‌పూర్‌కు చెందిన దులాల్ కుమార్(35) మృతదేహం శనివారం దేవా గ్రామ సమీపంలోని ఓ విద్యుత్ హైటెన్షన్ టవర్‌కు వేలాడుతూ కన్పించింది. దీంతో దోషుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బలరామ్‌పూర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కాగా, తమ పార్టీ కార్యకర్త అయినందునే దులాల్ కుమార్‌ను హత్యచేశారని బీజేపీ నేతలు విమర్శించారు. నాలుగు రోజుల్లో ఇద్దరు కార్యకర్తలు మృతి చెందడంపై విచారం వ్యక్తంచేసిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. బెంగాల్లో శాంతిభద్రతల పరిరక్షణలో మమత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. మరోవైపు ఈ రెండు హత్యలపై సీఐడీ విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. పురూలియా సూపరింటెండెంట్(ఎస్పీ) జోయ్ బిశ్వాస్‌పై బదిలీ వేటువేసింది. -
మోదీ, అమిత్ డైరెక్షన్లోనే కేసీఆర్ నాటకం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ నాటకానికి తెరలేపారని పీసీసీ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తన అస మర్థ, అవినీతి, నియంత పాలనతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను భ్రాంతికి గురి చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం దాసోజు పలువురు జాతీయ స్థాయి నేతలకు లేఖలు రాశారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లకు వేర్వేరుగా లేఖలు పంపారు. బీజేపీ వ్యతిరేక వర్గాలను వంచించి, విభజించి తద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలిగించడం ద్వారా మోదీని తిరిగి గద్దెనెక్కించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకముందే బీజేపీ అభ్యర్థులకు కేసీఆర్ మద్దతు తెలిపారని, నోట్లరద్దును స్వాగతించారని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది చర్చకు రాకుండా పార్లమెంట్‌ను అడ్డుకున్నారని వివరించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతితో కేసీఆర్ అణచివేత పాలన సాగిస్తున్నారని, అటువంటి కేసీఆర్ మాటలను విశ్వసించి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. -
బీజేపీ–జేడీఎస్ కుమ్మక్కు!
సాక్షి, బళ్లారి/ బెంగళూరు: రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ, జేడీ(ఎస్) కుమ్మక్కయ్యాయని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ఢిల్లీ విమానాశ్రయంలో ప్రత్యేకంగా కలుసుకుని మంతనాలు జరిపారని తెలిపారు. ఆ ఫొటోలు తన వద్ద ఉన్నాయని అవసరమైతే వాటిని బయటపెడతానని హెచ్చరించారు. ఆదివారం బెళగావిలో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వారిద్దరూ ఒకే విమానంలో వెళ్లారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కుమ్మక్కై ప్రచారం చేస్తున్నాయి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి’ అని అన్నారు. హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్‌మేకర్ అవుతుందని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీటిని బీజేపీ, జేడీఎస్ కొట్టిపారేశాయి. సిద్దరామయ్య పిచ్చోడు: యడ్యూరప్ప సిద్దరామయ్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం అభ్యర్థి యడ్యూరప్ప తీవ్ర విమర్శలు చేశారు. ‘వాడొక పిచ్చోడంటూ’ మండిపడ్డారు . చాముండేశ్వరిలో గెలవడం అసాధ్యమని తెలిసిపోవడంతోనే సిద్దరామయ్య బాదామిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. కింగ్ మేకర్ కాదు కింగ్‌నే: కుమారస్వామి కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే కింగ్ మేకర్‌ను కాకుండా కింగ్‌నే అవుతానని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమార స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీ రాజకీయ ఉనికికి ఈ ఎన్నికలు కీలకమైనవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాదని, ఈసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడనుందని అందులో జేడీఎస్ పార్టీ కింగ్ మేకర్ పాత్రను పోషించనున్నట్లు ఇటీవల సర్వేల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 113 సీట్లను లక్ష్యంగా చేసుకున్నామని అందుకు తగ్గట్లుగానే కీలకమైన వ్యూహాలతో అభ్యర్థులను నిలబెట్టామన్నారు. -
డెక్కుతున్న ‘విగ్రహ’ రాజకీయం
కోల్‌కతా/లక్నో/చెన్నై: దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం త్రిపురలో లెనిన్ విగ్ర హం ధ్వంసం.. తర్వాత తమిళనాడులో పెరియార్ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేసిన ఘటనలపై చర్చ జరుగుతుండగానే.. యూపీ లోని మీరట్ జిల్లాలో అంబేడ్కర్, కోల్‌కతాలో శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ విగ్రహాల ధ్వంసం ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రంగా ఖండించారు. బాధ్యులు ఏ పార్టీ వారైనా కఠినంగా వ్యవహరించాలన్నారు. శ్యామాప్రసాద్.. అంబేడ్కర్ త్రిపురలో లెనిన్ విగ్రహ ధ్వంసానికి ప్రతీకారంగా కోల్‌కతాలో వామపక్ష పార్టీ కార్యకర్తలు కొందరు భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఏడుగురు యువకులు విగ్రహానికి నల్లరంగు పులిమారు. అనంతరం విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న స్థానికులు ఈ విషయాన్ని గమనించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అరెస్టు చేసిన ఏడుగురిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ‘ఈ ఘటనకు పాల్పడిన వారంతా ‘రాడికల్’ పేరుతో పనిచేసే వామపక్ష భావజాల సంస్థకు చెందినవారు. దీన్ని చాలా తీవ్రమైన ఘటనగా పరిగణిస్తున్నాం’ అని కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలపై కోల్‌కతాలో బీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖుర్ద్ గ్రామంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు భారత రత్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏ పార్టీవారైనా శిక్షించండి: మోదీ దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహధ్వంసం ఘటనలపై ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడిన మోదీ.. విధ్వంసానికి పాల్పడినవారు ఏ పార్టీవారైనా కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, విగ్రహ ధ్వంసాన్ని సీరియస్‌గా తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా లెనిన్, పెరియార్ విగ్రహాల ధ్వంసాన్ని దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. ‘విగ్రహాలను పడగొట్టడం దురదృష్టకరం. మా పార్టీ వీటికి ఎప్పుడూ మద్దతు పలకదు. తమిళనాడు, త్రిపురల్లో పార్టీ నేతలతో మాట్లాడాను. ఈ విగ్రహాల ధ్వంసంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నట్లు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించాను’ అని షా స్పష్టం చేశారు. పెరియార్ విగ్రహ ధ్వంసాన్ని ప్రేరేపించినట్లుగా భావిస్తున్న తమిళనాడు బీజేపీ నేత, బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా ఫేస్బుక్ కామెంట్లపై అమిత్ షా స్పందిస్తూ.. ‘రాజాపై ఎలాంటి చర్యలు ఉండవు’ అని వెల్లడించారు. పెరియార్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి కార్యకర్త ముత్తురామన్‌ను పార్టీనుంచి బీజేపీ తొలగించింది. తమిళనాట నిరసనలు రాజా క్షమాపణలు చెప్పినా తమిళనాడు రాజకీయ పార్టీలు, పెరియార్ అభిమాన సంఘా లు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్ష డీఎంకే, పలు తమిళ సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొన్నాయి. చెన్నై, కడలూర్, సేలం తదితర ప్రాంతాల్లో రాజా విగ్రహాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయంపై బుధవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. కావేరీ వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే విగ్రహ రాజకీయాలను తెరపైకి తెచ్చి ఉంటారని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. జంధ్యాలు తెంచేశారు చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిని డీవీకే (ద్రవిడార్ విదుత్తలై కళగం) కార్యకర్తలు అటకాయించారు. వీరిని బెదిరించి.. మెడలో వేసుకున జంధ్యాలను బలవంతంగా తెంచేశారు. అనంతరం పెరియార్ అనుకూల నినాదాలు చేస్తూ ద్విచక్రవాహనాలపై వెళ్లిపోయారు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయనప్పటికీ.. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు డీవీకే కార్యకర్తలు రాయపేట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
అమిత్‌షా ఓ అజ్ఞాని: సీఎం సిద్ధ రామయ్య
సాక్షి, బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలివి లేదని, ఆయన ఒక అజ్ఞాని అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. సిద్ధ రామయ్య అంటే అవినీతి.. అవినీతి అంటే సిద్ధ రామయ్య అని మైసూరులో అమిత్‌షా గురువారం చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం తన ట్విటర్లో విరుచుకుపడ్డారు. దోషి అయిన అమిత్‌షా మరో దోషి అయిన యడ్యూరప్పను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై, తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను అమిత్‌షా నిరూపించగలరా అని సవాల్ విసిరారు. కేవలం అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోవాలని ఆయన చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రజలు అమిత్‌షా అబద్ధాలను నమ్మరన్నారు. -
‘మిషన్ 2019’పై గురిపెట్టిన అమిత్ షా
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 సాధారణ ఎన్నికలపై బీజేపీ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీల క్షేత్రస్థాయి పనితీరుపై నివేదికలు తెప్పించుకుని సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ద్వారా 60కిపైగా సిట్టింగ్ ఎంపీల పనితీరు దారుణంగా ఉందని నిర్ణయించారని పార్టీ వర్గాలంటున్నాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కకపోవచ్చని తెలుస్తోంది. ఈ నివేదికల్లో నియోజకవర్గంలో పనితీరు, ప్రజాభిమానం, వ్యతిరేకత, ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ 60మందికి పైగా ఉన్న జాబితాలో సీనియర్ ఎంపీలతోపాటు పలువురు కేంద్ర మంత్రులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి. ప్రదర్శన సరిగా లేని కారణంగా వచ్చే ఎన్నికల బరిలోనుంచి తప్పించే ఎంపీల జాబితాపై వార్తలు రావటంతో.. పలువురు ఎంపీలు అమిత్ షా వద్ద క్యూలు కడుతున్నారు. నియోజకవర్గంలో, బయటా తమ సమస్యలను షాతో ఏకరువు పెడుతున్నారు. ఇలాంటి వారందరికీ అమిత్ ప్రత్యేక సూచనలు ఇస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో పనితీరును మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి, ఏం చేయకూడదనే అంశాలను బోధిస్తున్నట్లు తెలిసింది. మూడున్నరేళ్లుగా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎంపీలకు కొన్ని బాధ్యతలు కట్టబెట్టారు. ఇందులో చాలా మంది ఎంపీలు విఫలమయ్యారు. శీతాకాల సమావేశాల సందర్భంగా పలువురు ఎంపీలు ప్రధాని, అమిత్ షాలను కలిసి నియోజకవర్గాల్లో చేపట్టే పనులకు నిధులు కావాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు పెంచిన సమయంలో చాలా మంది ఎంపీలు ఈ బిల్లును ఆమోదించేందుకు విముఖత వ్యక్తం చేశారని.. ముందుగా తమ వేతనాలు పెంచాలని అడిగారని తెలిసింది. -
గట్టిపోటీ కానేకాదు: అమిత్ షా
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చేపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీని ఇచ్చిందని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. బీజేపీ కన్నా కాంగ్రెస్ 8% వెనుకబడి ఉందనీ, అది గట్టి పోటీ కానేకాదన్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా, తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే ఎన్నికల ఫలితాలన్నారు. ప్రధాని మోదీకి ఉన్న జనాకర్షణ, కేంద్రంలో, రాష్ట్రంలో తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపించాయని చెప్పారు. కాంగ్రెస్ విభజనవాద రాజకీయాల వల్లే తమ పార్టీకి సీట్లు తగ్గాయన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ తమదే విజయమని ధీమా వ్యక్తంచేశారు. హిందువని చెప్పినా ఫలితం లేదా? సోమ్‌నాథ్ మందిర్‌కు వెళ్లినప్పుడు రాహుల్... తాము హిందూవేతరులమని తెలిపే విజిటర్ల పుస్తకంలో సంతకం పెట్టడాన్ని బీజేపీ ఎన్నికల్లో వాడుకోవాలని చూసింది. ఈ క్రమంలో బీజేపీ వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా కాషాయపక్షం వలలో పడి అనవసర చర్చకు ఆస్కారం కల్పించారు. రాహుల్ హిందువు మాత్రమే కాదు, ఆయన ‘జనేవూధారీ’ (జంధ్యం ధరించిన) బ్రాహ్మణుడని అందరూ భావించేలా సూర్జేవాలా వివరణ ఇవ్వడమేగాక గతంలో రాహుల్ తన కోటుపై జంధ్యం వేసుకున్నప్పటి ఫోటో ట్విటర్లో పెట్టి కాంగ్రెస్ కూడా కులాన్ని ఎన్నికల్లో ఇంత బాహాటంగా వాడుకుంటోందనే విమర్శలకు అవకాశం కల్పించారు. ట్యాంపరింగ్‌తోనే గెలుపు: హార్దిక్ గుజరాత్లో బీజేపీ ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్)లను ట్యాంపర్ చేసి, ధనబలాన్ని ఉపయోగించి గెలిచిందని పాస్ (పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి) నేత హార్దిక్ పటేల్ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండుంటే కాంగ్రెసే గెలిచేదని ఆయన అన్నారు. ‘గుజరాత్లో పోలింగ్ సమయంలో వైఫై నెట్‌వర్క్‌లను గుర్తించిన సందర్భాలున్నాయి. అలాగే ఈ రోజు ఓట్ల లెక్కింపు మొదలవ్వడానికి ముందే కూడా కొన్ని ఈవీఎంలకు సీళ్లు లేవు’ అని హార్దిక్ ఆరోపించారు. పటీదార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న వరచ్చ రోడ్, కమ్రేజ్ తదితర నియోజకవర్గాల్లోనూ బీజేపీ గెలవడాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీది నైతిక ఓటమి ‘గుజరాత్లో బీజేపీది నైతిక ఓటమి. 2019లో ఆ పార్టీ ఓటమికి ఇదే ఆరంభం. సమతూకంతో తీర్పు ఇచ్చిన గుజరాత్ ప్రజలకు అభినందనలు. ఇది బీజేపీకి తాత్కాలిక, పరువు నిలుపుకునే గెలుపు మాత్రమే. సామాన్యులపై దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారు’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం సంబరాలెందుకు: సీపీఎం ‘గుజరాత్లో బీజేపీ గెలుపు ఆ పార్టీ సంబరాలు చేసుకోవాల్సినంతగా ఏమీ లేదు. 150 సీట్లు గెలవడం తమ లక్ష్యమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారంలో ప్రకటించినా కనీసం వంద సీట్లు కూడా గెలవలేకపోయారు.’ తగ్గుతున్న బీజేపీ ఓట్‌బ్యాంక్ గుజరాత్లో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి అత్యధికంగా 60శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 49.1శాతానికి పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును 33 శాతం నుంచి 41.4 శాతానికి పెంచుకుంది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల ఓటు బ్యాంక్ తేడా 10.4% కాగా 2012 ఎన్నికల్లో 9 శాతానికి.. తాజాగా ఈ తేడా 7.7 శాతానికి తగ్గిపోయింది. ఐదుగురు మంత్రులు చిత్తు! అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో ఐదుగురు మంత్రులు కాంగ్రెస్ అభ్యర్థుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. గధడ్లో దళిత మంత్రి ఆత్మారామ్ పర్మర్ కాంగ్రెస్ నేత ప్రవీణ్భాయ్ మరు చేతిలో, జమ్జోధ్పూర్లో మంత్రి చిమన్‌భాయ్ సపరియా చిరాగ్‌భాయ్ కలారియా(కాంగ్రెస్) చేతిలో ఓటమి చవిచూశారు. వీరితో పాటు శంకర్ చౌధరీ, కేశాజీ చౌహాన్, శబ్ద్శరణ్ తడ్వీలు తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోయారు. మెజారిటీ కన్నా ‘నోటా’కే ఎక్కువ న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్లో బీజేపీ అభ్యర్థి బాబూభాయ్ బోఖారియా 1,855 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. అదే నియోజకవర్గంలో నోటా గుర్తుకు 3,433 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 5.5 లక్షల మంది ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించి ‘నోటా’ (పైవారెవరూ కాదు)కు ఓటేశారు. ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో ఇది 1.8 శాతానికి సమానం. హిమాచల్‌ప్రదేశ్‌లో 33 వేల మంది (0.9 శాతం) ఓటర్లు నోటా మీట నొక్కారు. గుజరాత్లో పార్టీల పరంగా నోటాకు పడిన ఓట్ల సంఖ్య బీజేపీ, కాంగ్రెస్‌ల తరువాత మూడో స్థానంలో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థి మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200కు పైగా, సీఎం విజయ్ రూపానీ పో టీచేసిన రాజ్‌కోట్ (పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి. -
అవినీతిలో అన్ని రికార్డులు బద్దలు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఘాటుగా విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడటంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రికార్డులను అధిగమించిందని ధ్వజమెత్తారు. గురువారం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ గ్రౌండ్స్‌లో ‘నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్ర’ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వం అత్యధికంగా అవినీతికి పాల్పడినట్లు ఓ సర్వేలో వెల్లడైందని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన పరివర్తన యాత్ర సిద్ధ రామయ్యను గద్దె దించేందుకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ యాత్రలో కీలకపాత్ర పోషించిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి అవుతారన్నారు. రాష్ట్రానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు ప్రజలకు చేరడం లేదన్నారు. మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నవంబర్ 10న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండటాన్ని ఆయన తప్పు బట్టారు. ఇదంతా ఓటు బ్యాంకు కోసమేనని విమర్శించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం కన్నడ రాజ్యోత్సవ్ను నిర్వహించడం కంటే టిప్పు జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం ఎక్కువగా ఆసక్తి చూపుతోందని అన్నారు. రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవ కర్ణాటక నిర్మాణ పరివర్తన యాత్రను 75 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా నిర్వహించే సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ పాల్గొననున్నారు. -
బాబును కేసు నుంచి బయటకు లాగేందుకే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఓటుకు కోట్లు కేసు నుంచి సీఎం చంద్రబాబును బయట పడేసేందుకే కేంద్రమంత్రులు సుజనా, వెంకయ్యనాయుడు మంగళవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్ షాను కలిసి రహస్యపు మంతనాలు జరిపారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. భయం నీడన బిక్కుబిక్కుమంటోన్న బాబు ఆదేశాల మేరకే వీరిద్దరూ అమిత్ షాతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వెళ్లారని భూమన ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి టీడీపీ ఎత్తుగడలపై ధ్వజమెత్తారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ‘వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చాయో, అదేవిధంగా చంద్రబాబు పుణ్యమాని ఇప్పుడు ‘ఓటుకు కోట్లు’ మాట జనం నోళ్లల్లో నానుతోందన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిన సీఎం చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందన్నారు. మంగళవారం కేంద్రంలో ఉన్న మంత్రులు సుజనా చౌదరి, వెంకయ్యనాయుడులు బీజేపీ నేత అమిత్ షా కాళ్లావేళ్లా పడి బాబును కేసు నుంచి బయటకు లాగే ప్రయత్నం చేశారన్నారు. అయితే చర్చలు ముగిశాక బయటకు వచ్చి మాత్రం ప్రత్యేక హోదా గురించి మాట్లాడామని చెప్పారన్నారు. హోదా అన్నది అధికారిక అంశం కాగా, అమిత్ షాతో చర్చలేంటని భూమన ప్రశ్నించారు. అంతటితో ఆగని నేతలు బుధవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారనీ, బాబు అనైతిక రాజకీయాల కారణంగా గవర్నర్ మర్యాదను కూడా రోడ్డున వేస్తున్నారని విమర్శించారు. అసలు రాజ్‌భవన్‌లో వీరిద్దరూ గవర్నర్‌తో ఏం చర్చించారో అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై మొదటి నుంచీ మాట్లాడుతున్న కేంద్రమంత్రి మరొకరుండగా, సుజనా చౌదరి ఎవరని ప్రశ్నించారు. సుజనా గానీ, ఆయన మంత్రి పదవిగానీ కేంద్రంలో మేకగడ్డం కింద వేలాడే ‘అజాగళ స్తనాల’వంటివని ఎద్దేవా చేశారు. ‘ఓటుకునోటు కేసులో బాబును హరిహరాదులు కూడా రక్షించలేరని మొదట్లో బీరాలు పలికిన కేసీఆర్ నోరు మూగబోయిందేమని ప్రశ్నించారు. తొలి విడతగా రూ.500 కోట్ల ముడుపులు పుచ్చుకున్నందుకా? అన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందన్నారు. వైఎస్ఆర్ హయాంలో 22 అభియోగాలు తనపై మోపితే కడిగిన ముత్యంలా బయట పడ్డానంటోన్న చంద్రబాబుకు ఏ కోర్టు కడిగిన ముత్యమని తీర్పు చెప్పిందో తెలపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోనిది కాదని ఓ టీడీపీ నేత మంగళవారం మీడియా సమావేశంలో ఉటంకించడాన్ని ప్రస్తావించిన భూమన.. టీడీపీ నేతలు తమకోసం ప్రత్యేక న్యాయ, పోలీస్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారా అని ప్రశ్నించారు. ‘వీరప్పన్ కూడా ఇరవయ్యేళ్లు దొర మాదిరి తిరిగాడు, ఆపైన పోలీసులకు దొరికాడు. బిన్‌లాడెన్ రెండున్నర దశాబ్దాల పాటు ప్రపంచాన్ని గడగడలాడించాడు. చివరకు పోలీసులకు దొరకక తప్పలేదు. దుర్మార్గులకు అవకాశాలు లభించినా, అంతిమ విజయం మాత్రమే ధర్మానిదే. బాబు ఇప్పటివరకూ దొరకకపోయి ఉండొచ్చు. సమయం వచ్చినపుడు మాత్రం దొరక్కపోడు’ అని భూమన అన్నారు. తనకు కావాల్సిన ప్రసార మాధ్యమాల్లో ఈ అంశం కేసే కాదంటూ రాయించుకున్నంత మాత్రాన విషయం చక్కబడిపోదన్నారు. ఇప్పటివరకూ ‘ఆ గొంతు’ తనది కాదని చంద్రబాబు ప్రకటించలేదని భూమన పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వైఎస్సార్సీపీ నేతల ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో లాలూచీ పడ్డ సీఎంలు ఇద్దరూ అసలు విషయాన్ని ఒప్పుకోకపోతే ప్రజలందరి హృదయాల్లో తోడు దొంగలుగా మిగిలిపోతారని భూమన పేర్కొన్నారు. -
'టెంపరేచర్ పెరగగానే ఆయనకు ఫారిన్ టూర్'
గోరఖ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర విమర్శలు చేశాడు. దేశంలో వేడిపెరగగానే రాహుల్ దేశం విడిచిపెట్టి వెళ్లిపోతాడని అన్నారు. 'దేశంలో ఉష్ణోగ్రతలు పెరగగానే రాహుల్ బాబా విదేశాలకు వెళ్లిపోతాడు. అలాంటాయని బీజేపీ పరిపాలన రికార్డును అడుగుతాడు' అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ లోని బస్తీలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్పీని, బీఎస్పీని మట్టికరిపించి 2017 ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. రెండు పార్టీలను చెత్తబుట్టలో వేయాలని, ఆ పార్టీల వల్ల ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ధికే నోచుకోలేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎస్పీ, బీఎస్పీ నే కారణం అన్నారు. నేరస్తులు, మాఫియానే ఎస్పీ ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తున్నాయని చెప్పారు. -
'ఇలాంటి రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన స్నాతకపూర్వ(బీఏ)విద్యతోపాటు, స్నాతకోత్తర విద్య(పీజీ)ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హత గురించి అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని వెల్లడించారు. 'ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి' అని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో మోదీ బీఏ పూర్తి చేశారన్నది అవాస్తవం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. -
ఉప ప్రణాళిక అమలుకు చట్టం
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రతినిధి బృందం బృందంలో కె.రామచంద్రమూర్తి, మల్లేపల్లి, కాకి మాధవరావు సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక పద్దు కింద కేటాయిస్తున్న నిధులు సక్రమంగా ఖర్చయ్యేలా చూసేందుకు కేంద్రం తగిన చట్టాన్ని రూపొందించేలా చూడాలని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(సీడీఎస్) ప్రతినిధి బృందం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లను వేర్వేరుగా కలసి విన్నవించింది. సీడీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, సలహాదారులు ప్రముఖ పాత్రికేయులు, ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కొండుభట్ల రామచంద్రమూర్తి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, కేంద్ర మాజీ కార్యదర్శి పి.ఎస్.కృష్ణన్లతో కూడిన బృందం అమిత్‌షా, రాంమాధవ్‌లకు ఈ మేరకు ఒక వినతిపత్రం సమర్పించింది. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయని, వాటిని ఆచరణలో పెట్టేలా చట్టం చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మేరకు చట్టం చేశాయని, కేంద్రం కూడా ఇదే తరహా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవలి బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం కేటాయించాల్సిన నిధుల్లో దాదాపు 60 శాతం కోత పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అమిత్‌షా బదులిస్తూ పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42 శాతం వాటా ఇస్తున్నామని, ఈ నిధుల్లో కూడా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన 25 శాతం మేర నిధులను పక్కాగా ఖర్చు చేయాలని రాష్ట్రాలకు త్వరలోనే కేంద్రం తగిన సూచనలు జారీ చేస్తుందని వివరించారు. ప్రధానంగా ప్రాథమిక, ఉన్నత విద్యకు, ఉపాధికి ఖర్చు చేస్తే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధికి నోచుకుంటారని ఈ బృందం వివరించింది. ఇది సాకారం కావాలంటే ఉప ప్రణాళిక నిధులు కచ్చితంగా ఖర్చయ్యేలా, నిధుల మళ్లింపు లేకుండా చేసేలా ఒక చట్టం తేవాలని కోరింది. తమ అభ్యర్థనపై వారు సానుకూలంగా స్పందించారని ప్రతినిధి బృందం మీడియాకు వివరించింది.