న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా ముగియడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హర్షం వ్యక్తం చేశారు. అక్కడ ప్రశాంత వాతావరణంలో మోదీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందన్నారు.
ఇది తమ ప్రభుత్వం సాధించిన అతి పెద్ద విజయమన్నారు. పీటీఐకి ఇచ్చిన తాజా ఇంటర్యూలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విషయంలో తమ ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలను వెల్లడించారు. కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారని చెప్పారు.
‘ఈ ఎన్నికల్లో అక్కడ అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇది చాలా పెద్ద పరిణామం. కాశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు ముగియడం మోదీ సర్కార్‌కు దక్కిన అతిపెద్ద విజయం. ఎన్నికలు ముగిసిన వెంటనే కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తాం’అని షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment